తమిళ స్టార్ హీరో ధనుష్, మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ చిత్రం ‘ఓం’. ఈ చిత్రం నవంబర్ 20న విడుదల కాబోతోంది. దీంతో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని చైన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి సాయిపల్లవి హీరో ధనుష్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అభిమానులు రాజకీయ జెండాలు పట్టుకుని ఎక్కువగా కనిపించడంతో సాయిపల్లవి ఆశ్చర్చం వ్యక్తం చేశారు. ధనుష్‌ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నా పూర్తి మద్దతు ఉంటుంది. కానీ తమిళనాడు సీఎం విజయ్ గారిలా మీరు కూడా నటనకు దూరంగా ఉంటారేమోనని భయంగా ఉంది. ధనుష్ గారు ఎప్పటికీ నటుడిగానే మా మధ్య ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అని సాయి పల్లవి తెలిపారు.
ప్రచారానికి చెక్
అయితే రాజకీయ రంగప్రవేశంపై ధనుష్ స్పందించారు. ‘నా వెనుక ఎవరో ఉండి నన్ను నడిపిస్తున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ నన్ను నడిపించేంది ఆ దేవుడు మాత్రమే.. నా వెనుక నిలబడేది నా అభిమానులు మాత్రమే. ప్రస్తుతానికి నా దృష్టి అంతా సినిమాల పైనే ఉంది.’ అని ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రస్తుతానికి చెక్ పెట్టారు.
కాగా ఈ చిత్రంలో సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా.. వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్ జగ్మగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
(ఇదీ చదవండి: రూ.4000 కోట్లు కాదు.. దానిపై చర్చ జరగాలి: సల్మాన్ ఖాన్)


