సాధారణంగా ఓ సినిమా హిట్ లేదా ఫ్లాప్ కావడానికి చాలా కారణాలు ఉంటాయి. కంటెంట్ సరిగా లేకపోవడం దగ్గర నుంచి రిలీజయ్యే టైం వరకు చాలా ఫ్యాక్టర్స్ కారణమవుతాయి. ఇంతవరకు నిర్మాతలు.. ప్రేక్షకుల్ని నిందించిన సందర్భాలు చాలా అంటే చాలా తక్కువ. కానీ టాలీవుడ్ నిర్మాత ధీరజ్ మొగిలినేని మాత్రం సమస్య ప్రేక్షకుల దగ్గరే ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: సూర్య సూపర్ 'సీన్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?)
ఈయన నిర్మించిన లేటెస్ట్ మూవీ 'సమ్మర్ హాలీడేస్'. నిన్న (నవంబర్ 06) థియేటర్లలో రిలీజైంది. రివ్యూలు చాలావరకు యావరేజ్‌గా వచ్చాయి. చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుచేసిందని పలువురు ఆడియెన్స్ అంటున్నారు గానీ మరిగొప్ప చిత్రమైతే కాదని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా సక్సెస్ మీట్ పెట్టారు. ఇందులోనే నిర్మాత ధీరజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'సమస్య ప్రేక్షకుల దగ్గరే ఉంది. రేపు చూద్దాం, నాలుగు రోజుల తర్వాత చూద్దాంలే అని వాయిదా వేస్తున్నారు. దయచేసి ఇలాంటి మంచి సినిమాలను ఆదరించండి. అప్పుడే ఇలాంటి మూవీస్ మరిన్ని వస్తాయి. తెలుగు ప్రేక్షకులు గొప్పోళ్లు. అన్ని భాషల సినిమాలు చూస్తారు. కానీ బాధకరమైన విషయం ఏంటంటే రోజూ పక్కింట్లో ఏం కూర వండుతున్నారో చూస్తున్నారు. మనం చేసేది ఏంటో చూడటం లేదు. ఓటీటీలో వచ్చినప్పుడు చూస్తున్నారు.. ఏడుస్తున్నారు.. చప్పట్లు కొడుతున్నారు. అది కాదు మాకు కావాల్సింది. మీ పిల్లలు, కుటుంబాలతో కలిసి థియేటర్లలో మా సినిమా చూడండి. సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్స్ వేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. తెలుగులో గొప్ప సినిమాలు ఎందుకు రావడం లేదంటే, తీసినప్పుడు ప్రేక్షకులు చూడటం లేదు కాబట్టి!' అని అన్నారు.
నిర్మాత ధీరజ్ ఆవేదనలో అర్థముంది గానీ ప్రేక్షకుల్ని మాత్రమే నిందించడం సరికాదు. ఎందుకంటే తమిళం, మలయాళం తరహాలో మన దగ్గర కంటెంట్ బేస్ చేసుకుని వచ్చే చిత్రాలు చాలా తక్కువ. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలే ఎక్కువ. వాటిని చూసి చూసి సాధారణ ప్రేక్షకుడికి ఇప్పటికే విసుగొచ్చేస్తోంది. దానికి తోడు వయలెంట్, రా అండ్ రస్టిక్ అని చెప్పి మన హీరోలు చేసే కమర్షియల్ సినిమాలకు, డబ్బింగ్ చిత్రాలకు కూడా టికెట్ రేట్లు ఇష్టమొచ్చినట్లు పెంచేస్తున్నారు. దీంతో తెలుగు మూవీ అంటేనే ఆడియెన్స్‌కి రోజురోజుకి అయిష్టత ఏర్పడుతోంది. ఇలా చేస్తున్నది కూడా కొందరు నిర్మాతలే. తొలుత ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా కంటెంట్ విషయంలో కొత్తదనం వచ్చినప్పుడు ప్రేక్షకులు ఆటోమేటిక్‌గా థియేటర్‌కి వస్తారు. అంతేగానీ నిందించినంత మాత్రాన రారు.
(ఇదీ చదవండి: 'సమ్మర్ హాలిడేస్' మూవీ రివ్యూ)
Audience, you have to come and watch this kind of film in theatres because it deserves. This is for kids and adults too. - Producer #DheerajMogilineni at #SummerHolidays success meet https://t.co/lzV9PVYLuA
— PRO Suresh (SK Media) (@SKMedia_PR) November 7, 2026


