మేం విడాకులు తీసుకుని 14 ఏళ్లు.. కానీ ఇప్పటికీ | Renu Desai Reacts Her Divorce Journey | Sakshi
Sakshi News home page

Renu Desai: ఆయన లేకపోతే నేను లేనన్నట్లుగా మాట్లాడుతున్నారు

Nov 6 2026 2:44 PM | Updated on Nov 6 2026 2:49 PM

Renu Desai Reacts Her Divorce Journey

రేణు దేశాయ్.. ఈ పేరు చెప్పగానే తెలుగు స్టార్ హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య అని అంతా అంటూ ఉంటారు. ఎందుకంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఆమె అలా మాత్రమే తెలుసు. కానీ విడాకులు తీసుకుని 14 ఏళ్లయినా ఇప్పటికీ అలా పిలవడం నచ్చలేదని ఈమె అంటోంది. తనపై వస్తున్న విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.

(ఇదీ చదవండి: కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి షురూ.. ఫొటోలు వైరల్)

'బద్రి సినిమాతోనే నా లైఫ్ మొదలైందని చాలామంది అనుకుంటారు. అంతకు నా జీవితం ఏం లేదన్నట్లుగా చూస్తున్నారు. మాకు విడాకులై 14 ఏళ్లు దాటిపోయింది. రాముడికి కూడా వనవాసం 14 ఏళ్లే. మరి నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది? 2012లో నేను విడాకులు తీసుకున్న తర్వాత ఓ మరాఠీ సినిమా నిర్మించాను. అది సూపర్ హిట్ అయింది. మరో మూవీకి కథ రాసి, నిర్మించి దర్శకత్వం వహించాను'

'డ్యాన్స్ షోలకు వర్క్ చేశాను. కవితలు రాశాను. ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తున్నాను. నాకు ప్రత్యేక గుర్తింపు లేకపోతే ఇన్ని అవకాశాలు ఎందుకొస్తాయి?' అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. తనపై సాగుతున్న ట్రోలింగ్ గురించి మాట్లాడిన ఈమె.. కుక్కని కాపాడినా నన్ను తిడుతున్నారు. ఆయన లేకపోతే ఆమెకు జీవించే అర్హత లేదన్నట్లుగా మాట్లాడుతారు' అని సదరు హీరో అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన ఆవేదన పంచుకుంది.

(ఇదీ చదవండి: 'రామాయణ'కి రివ్యూ ఇచ్చిన 'వారణాసి' రాముడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement