హను-మాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వస్తోన్న చిత్రం మహాకాళి. ఈ చిత్రంలో అక్షయ్ ఖన్నా, శ్రియారెడ్డి, భూమి శెట్టి, ఖుష్బూ, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి కథ అందించడంతో పాటు పర్యవేక్షణ ప్రశాంత్ వర్మ చేయగా పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి జనవరి 8న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమా నుంచి ‘అయిగిరి నందిని అంటూ సాగే భక్తి పాటను విడుదల చేశారు. ఈ పాటకు స్మరణ్ సాయి లిరిక్స్ అందించగా.. అనిలా రాజీవ్, గీతా మాధురి, సాయిచరణ్ ఆలపించారు. కాగా.. మహాకాళి' పేరుతో తీస్తున్న ఈ సినిమాలో భూమిశెట్టి ప్రధాన పాత్ర చేస్తుండగా.. శుక్రాచార్యుడి అనే విలన్ పాత్రని 'ధురంధర్' ఫేమ్ అక్షయ్ ఖన్నా పోషిస్తున్నాడు.


