breaking news
Mahakali Movie
-
సంక్రాంతి బరిలో 'మహాకాళి'.. వర్మ ఈసారి ఏం చేస్తాడో?
మూడేళ్ల క్రితం 'హనుమాన్' సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి.. అద్భుతమైన సక్సెస్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం రిషభ్ శెట్టితో 'జై హనుమాన్' తీస్తున్నాడు. ఇది వచ్చే ఏడాది థియేటర్లలోకి రావొచ్చు. అయితే తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇప్పుడు 'మహాకాళి' మూవీ విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. శుక్రాచార్యుడికి సంబంధించిన వీడియోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'ఇరుముడి'కి పట్టం కట్టిన ప్రేక్షకులు.. తొలి వీకెండ్ ఎన్ని కోట్లు వచ్చాయ్?)'మహాకాళి' పేరుతో తీస్తున్న ఈ సినిమాలో భూమిశెట్టి ప్రధాన పాత్ర చేస్తుండగా.. శుక్రాచార్యుడి అనే విలన్ పాత్రని 'ధురంధర్' ఫేమ్ అక్షయ్ ఖన్నా పోషిస్తున్నాడు. శుక్రాచార్యుడి కన్నీరు పేరిట విడుదల చేసిన దాదాపు మూడు నిమిషాల వీడియోతో మూవీ ఎలా ఉండబోతుందో శాంపిల్ చూపించారు. విజువల్ ఎఫెక్ట్స్, డైలాగ్స్ కళ్లు చెదిరిపోయేలా ఉన్నాయి. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఆహార్యం కొత్తగా ఉండగా.. చివరలో మహాకాళిని చూపించడం అదిరిపోయింది.అయితే ఇప్పటివరకు PVCU అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనుకున్నారు. కానీ ఈ టీజర్లో PVCU అంటే 'పురాణ వీర చిత్ర ఉదయం' అని రాసుకొచ్చారు. ఈ చిత్రానికి కథ అందించడంతో పాటు పర్యవేక్షణ ప్రశాంత్ వర్మ చేయగా పూజా కొల్లూరు దర్శకత్వం వహించింది. వచ్చే సంక్రాంతి బరిలో ఈ చిత్రాన్ని దింపారు. జనవరి 8న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.సంక్రాంతి బరిలో ఇప్పటికే చిరంజీవి 'కాకా', వెంకటేశ్-కల్యాణ్ రామ్-అనిల్ రావిపూడి 'జనవరి 12 విడుదల', సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు', శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమాలు ఉన్నాయని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు 'మహాకాళి' కూడా లిస్టులోకి చేరింది. రిలీజ్ టైంకి వీటిలో ఏవి నిలుస్తాయో? ఏవి తప్పుకొంటాయో చూడాలి?(ఇదీ చదవండి: దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్) -
మహాకాళిలో ప్రభాస్..!
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లో భాగంగా తెరకెక్కుతున్న చిత్రం మహాకాళి.. ఇదే సినిమాటిక్‌లో వచ్చిన హనుమాన్ భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఫీమేల్ సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహాకాళిగా కన్నడ నటి భూమి శెట్టి నటింస్తుండగా.. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) శుక్రాచార్యుడిగా నటిస్తున్నారు. అయితే, ప్రభాస్ కూడా ఈ మూవీలో భాగం కానున్నారని ప్రచారం జరుగుతుంది.మహాకాళి చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ.. ఆయన తన పాత్ర చిత్రీకరణను కూడా ఇప్పటికే పూర్తి చేశారని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. దీంతో ఆయన పోషించబోయే పాత్ర ఎలా ఉండనుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నప్పలో కూడా ప్రభాస్ అతిథి పాత్రలో మెప్పించిన విషయం తెలిసిందే.ఇప్పటివరకు మహాకాళి సినిమా 100 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అక్షయ్ ఖన్నా పాత్రకు సంబంధించి కూడా చిత్రీకరణ కూడా పూర్తయిందట. పశ్చిమ బెంగాల్ నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రాన్ని ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందించారు. ఇదే యూనివర్స్ (PVCU)లో భాగంగా ‘అధీర’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎస్జే సూర్య , కల్యాణ్ దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్ హీరో చిత్రాన్ని శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించనున్నారు. -
'ధురంధర్' విలన్ తెలుగు సినిమా.. క్రేజీ అప్డేట్
'ధురంధర్' సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది డిసెంబరులో వచ్చిన తొలి భాగంలో హీరోని డామినేట్ చేసిన విలన్‌గా అక్షయ్ ఖన్నా అదరగొట్టేశాడు. రహమాన్ డకాయిట్ అనే పాత్రలో జీవించేశాడు. పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇతడు నెక్స్ట్ ఓ తెలుగు సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని స్వయంగా ఇతడి పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ వెల్లడించాడు.(ఇదీ చదవండి: మారుతికి అర్థమైంది.. హరీశ్ శంకర్‌కి అర్థం కావట్లేదు!)హిందీలో గతంలోనే హీరోగా పలు సినిమాలు చేసినప్పటికీ అక్షయ్ ఖన్నాకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. తర్వాత చాన్నాళ్ల పాటు సైలెంట్ అయిపోయాడు. మళ్లీ 'ఛావా', 'ధురంధర్' చిత్రాలు ఇతడికి ఓవర్‌నైట్ స్టార్డమ్ తీసుకొచ్చాయి. ఇవి చేస్తున్నప్పుడే తెలుగులో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లోని 'మహాకాళి' మూవీలో శుక్రచార్య పాత్రలో నటించేందుకు ఒప్పుకొన్నాడు. పూజా కొల్లూరు ఈ చిత్రానికి దర్శకురాలు కాగా.. ప్రశాంత్ వర్మ షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలోనే ఈ పాత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఇప్పుడు అక్షయ్ ఖన్నా పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ చెప్పిన ప్రశాంత్ వర్మ.. ప్రతిభకు సౌండ్ అక్కర్లేదు. మీతో పనిచేయడం నాకు దక్కిన గౌరవం. మనం ఏం సృష్టించామో ప్రపంచానికి చూపించాలని నా మనసు ఉవ్విళ్లూరుతోంది అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్, అలానే టాక్ బట్టి తెలుస్తోంది ఏంటంటే అక్షయ్ ఖన్నా షూటింగ్ పూర్తయింది. మరో 40 రోజులు చిత్రీకరణ చేస్తే మిగతా కూడా అయిపోతుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కన్నడ నటి భూమి శెట్టి.. 'మహాకాళి'లో లీడ్ రోల్ చేస్తోంది.(ఇదీ చదవండి: చిరంజీవి చనిపోయారని పోస్ట్.. వ్యక్తిపై కేసు)Happy Birthday #AkshayeKhanna sir, a true actor who proves that real talent doesn't need noise. Effortless screen presence, powerful performances, and unmatched class always stand out 🎭🎬Its an absolute honour working with you. Can’t wait to show the world what we’ve created… pic.twitter.com/xiblaH8voc— Prasanth Varma (@PrasanthVarma) March 28, 2026 -
ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’ అప్డేట్.. ఆ రక్తం ఏంటి?
‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి వరుస ప్రాజెక్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘మహాకాళి’(Mahakali Movie ). ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్టోరీ , స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. దర్శకురాలు పూజ కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ రాబోతుంది. అక్టోబర్ 30న ఉదయం 10:08 గంటలకు 'మహాకాళి' నుంచి ఏదో పవర్ఫుల్ అప్డేట్ రిలీజ్ చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది. ఈ అనౌన్స్‌మెంట్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో రక్తంతో తడిసిన ఓ చేయి, దానికి నిండుగా బంగారు గాజులు ఉన్నాయి. నల్లటి నేలపై ఒక ఆయుధం పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చూపించారు. ఆ పోస్టర్‌పై అంతం లేని వినాశన జ్వాల మేల్కొంది అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టర్ చూస్తుంటే.. సినిమాలోని కాళిమాతా లుక్లా కనిపిస్తోంది. ఆమెను చాలా పవర్‌ఫుల్‌గా చూపించబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అయితే టైటిల్ రోల్ ఎవరు చేస్తున్నారనేది ఇంతవరకు రివీల్ చేయలేదు. రేపు ఇచ్చే అప్డేట్లో ఈ విషయం తెలియజేస్తారా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. కాగా, ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా నటించబోతున్నాడు. ఆయన ఫస్ట్‌లుక్‌ని కూడా రిలీజ్ చేశారు. ఇండియాలోనే తొలి లేడీ సూపర్ హీరో మూవీగా మహాకాళి రానుంది. #Mahakali 🔱@RKDStudios #RKDuggal @PujaKolluru #AkshayeKhanna#RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/CALH4jdCqV— Prasanth Varma (@PrasanthVarma) October 29, 2025


