‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ వర్మ(Prasanth Varma) తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి వరుస ప్రాజెక్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి ‘మహాకాళి’(Mahakali Movie ). ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ స్టోరీ , స్క్రీన్ప్లే అందిస్తున్నారు. దర్శకురాలు పూజ కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం నుంచి మరో అప్‌డేట్ రాబోతుంది. అక్టోబర్ 30న ఉదయం 10:08 గంటలకు 'మహాకాళి' నుంచి ఏదో పవర్‌ఫుల్ అప్‌డేట్ రిలీజ్ చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది.
ఈ అనౌన్స్‌మెంట్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇందులో రక్తంతో తడిసిన ఓ చేయి, దానికి నిండుగా బంగారు గాజులు ఉన్నాయి. నల్లటి నేలపై ఒక ఆయుధం పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చూపించారు. ఆ పోస్టర్‌పై అంతం లేని వినాశన జ్వాల మేల్కొంది అనే క్యాప్షన్ ఇచ్చారు.
ఈ పోస్టర్ చూస్తుంటే.. సినిమాలోని కాళిమాతా లుక్లా కనిపిస్తోంది. ఆమెను చాలా పవర్ఫుల్గా చూపించబోతున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. అయితే టైటిల్ రోల్ ఎవరు చేస్తున్నారనేది ఇంతవరకు రివీల్ చేయలేదు. రేపు ఇచ్చే అప్‌డేట్‌లో ఈ విషయం తెలియజేస్తారా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. కాగా, ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా నటించబోతున్నాడు. ఆయన ఫస్ట్లుక్ని కూడా రిలీజ్ చేశారు. ఇండియాలోనే తొలి లేడీ సూపర్ హీరో మూవీగా మహాకాళి రానుంది.
#Mahakali 🔱@RKDStudios #RKDuggal @PujaKolluru #AkshayeKhanna#RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/CALH4jdCqV
— Prasanth Varma (@PrasanthVarma) October 29, 2025


