గుమ్మడికాయ కొట్టారు | Suriya New Upcoming Movie Updates | Sakshi
Sakshi News home page

గుమ్మడికాయ కొట్టారు

Dec 16 2025 2:11 AM | Updated on Dec 16 2025 2:11 AM

Suriya New Upcoming Movie Updates

సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సూర్య 46’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా నటించగా, రవీనా టాండన్, రాధికా శరత్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఇటీవల యూరప్‌లో ఓ భారీ షెడ్యూల్‌ జరిపారు.

ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగిన మరో కీలక షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసి, గుమ్మడికాయ కొట్టారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమాకు ‘విశ్వనాథన్‌ అండ్‌ సన్స్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement