కన్నడ స్టార్స్ శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 45. ఈ మూవీకి అర్జున్ జన్యా దర్శకత్వం వహించారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 25న క్రిస్‌మస్ కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే 45 మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
'అక్కడ సమాధి చూస్తున్నావ్ కదా.. ఆ సమాధి మధ్య మనిషి పుట్టిన తేదీ.. మరణించిన తేదీ రాసుంటుంది..ఆ మధ్య ఉన్న చిన్న డ్యాషే మనిషి మొత్తం జీవితం' అనే డైలాగ్‌లో ఈ ట్రైలర్‌తో ప్రారంభమైంది. ఈ ట్రైలర్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఫైట్స్, విజువల్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రాజ్ బి శెట్టి కీలక పాత్రలో నటించారు. ఇంకెందుకు ఆలస్యం తెలుగు ట్రైలర్ మీరు కూడా చూసేయండి.


