శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. టైటిల్‌ రివీల్‌ | Sree Vishnu latest Movie Title revealed | Sakshi
Sakshi News home page

Sree Vishnu: శ్రీ విష్ణు లేటేస్ట్ మూవీ.. టైటిల్‌ రివీల్‌

Dec 15 2025 6:41 PM | Updated on Dec 15 2025 6:41 PM

Sree Vishnu latest Movie Title revealed

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  ఈ సినిమాకు యదునాథ్‌ మారుతి రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నయన సారిక హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌లో సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. ఈ సినిమాకు విష్ణు విన్యాసం అనే టైటిల్ ఖరారు చేశారు. మొత్తానికి హీరో పేరుతోనే మూవీ టైటిల్‌ పెట్టడం విశేషం. కాగా.. ఈ చిత్రంలో సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి రాధన్ సంగీతమందిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement