విశ్వక్-అనుదీప్ సినిమా.. చెప్పిన టైం కంటే ముందే రిలీజ్ | Vishwak Sen Anudeep Funky Movie New Release Date | Sakshi
Sakshi News home page

Funky Movie: 'ఫంకీ'.. ప్రకటించిన తేదీ కంటే ముందే విడుదల

Dec 15 2025 5:30 PM | Updated on Dec 15 2025 6:09 PM

Vishwak Sen Anudeep Funky Movie New Release Date

గత కొన్ని సినిమాలతో వరస ఫ్లాప్స్ ఎదుర్కొన్న విశ్వక్ సేన్.. ఈసారి కామెడీ రూట్‌లోకి వచ్చాడు. 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్‌తో కలిసి 'ఫంకీ' అనే మూవీ చేస్తున్నాడు. ఇదివరకే టీజర్ రిలీజ్ చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. గత నెలలో ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఏప్రిల్ 3న థియేటర్లలో మూవీ విడుదలవుతుందని ప్రకటించారు. ఇప్పుడు హఠాత్తుగా దాన్ని రెండు నెలల ముందుకు తీసుకొచ్చారు.

(ఇదీ చదవండి: 'అవతార్' రెండు పార్ట్స్‌లో ఏం జరిగింది? మూడో భాగం స్టోరీ ఏంటి?)

ముందు చెప్పినట్లు ఏప్రిల్‌లో కాకుండా ఫిబ్రవరి 13న 'ఫంకీ' విడుదలవుతుందని తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు. చూస్తుంటే షూటింగ్‌తో పాటు మిగిలిన పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తున్నట్లు ఉన్నారు. అందుకే విడుదల తేదీని ముందుకు తీసుకొచ్చారా అనిపిస్తుంది. ఈ మూవీతో హిట్ కొట్టడం అటు విశ్వక్ ఇటు అనుదీప్‌కి చాలా కీలకం.

టీజర్ బట్టి చూస్తే ఇదో సినిమా డైరెక్టర్ కథ. దర్శకుడిగా విశ్వక్ కనిపిస్తుండగా.. హీరోయిన్ పాత్రలో నిర్మాత కూతురిగా కాయదు లోహర్ చేస్తోంది. జాతిరత్నాలు స్టైల్లో రెగ్యులర్ ఫన్ ఉండబోతుందనే అనిపిస్తుంది. మరి ఈసారి విశ్వక్ సేన్ ఏం చేస్తాడో చూడాలి?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement