కార్ ఇంటీరియర్.. అనగానే వాహన ప్రియులు హుషార్ అవుతారు.నగరంలో దీనికున్న క్రేజ్ అలాంటిది. నగరంలో ఇర్రం మంజిల్ కాలనీలో అధునాతనంగా ఏర్పాటైన ఓ ప్రముఖ కంపెనీ రెండో లగ్జరీ స్టూడియోని సినీ నటుడు అక్కినేని నాగ చైతన్య ఆదివారం సందర్శించారు.
కార్ ఇంటీరియర్ విశేషాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. ఈ స్టూడియోలో అధునాతన సీటింగ్ సిస్టమ్స్, ఆల్కాంటారా ఇంటీరియర్లు, ప్రీమియం లెదర్ అప్‌గ్రేడ్స్, స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్ కస్టమైజేషన్ సేవలు అందిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కార్ బ్రాండ్లు ఉపయోగించే ఆల్కాంటారాకు డి్రస్టిబ్యూటర్‌గా ఉన్నామని, అలాగే రష్యాకు చెందిన మారి్టనోవ్ బ్రదర్స్ సీట్స్‌తో భాగస్వామ్యం ద్వారా యూరోపియన్–గ్రేడ్ లగ్జరీ సీటింగ్ సొల్యూషన్స్‌ను నగర మార్కెట్‌కు పరిచయం చేస్తున్నట్లు నిర్వాహకులు వివరించారు.


