కూటమి ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై వైఎస్సార్సీపీ పోరుబాట కొనసాగుతోంది.
ఏపీవ్యాప్తంగా సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లో సంతకాల ప్రతులతో భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. పార్టీ శ్రేణులు.. అన్నివర్గాల ప్రజలు.. విద్యార్థులు ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తర్వాత సంతకాల ప్రతులను తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు.


