breaking news
YSRCP Koti Santhakala Sekarana
-
కోటి సంతకాల ఉద్యమం.. కోటి మంది గుండె చప్పుడు: విడదల రజిని
సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ప్రజలిచ్చిన మెమోలే ఈ కోటి సంతకాలని.. ప్రజల నిర్ణయాలను గౌరవించకుండా నియంతలా ముందుకెళితే కూటమి ప్రభుత్వం పతనం కావడం ఖాయమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా మూర్ఖంగా వ్యవహరిస్తే ఆ నిర్ణయమే ఈ ప్రభుత్వానికి మరణశాసనంగా మారుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైటీకరణను వ్యతిరేకిస్తూ రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైయస్సార్సీపీ నిర్వహించిన ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, యువత, ఉద్యోగులు, మేథావులు, వివిధ రంగాల నిపుణులు స్వచ్ఛందంగా తరలివచ్చి కోటి సంతకాల సేకరణలో భాగస్వాములయ్యారని విడదల రజని వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సూదికి దూదికి కూడా కరువొచ్చిందని, అంబులెన్సులు మూతబడ్డాయని, ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని ఆమె మండిపడ్డారు. చివరికి మంత్రి సైతం ఈ విషయాన్ని అంగీకరించారని వెల్లడించారు. గత వైయస్సార్సీపీ హయాంలో వైద్యారోగ్య రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, ఇప్పుడు కూటమి పాలనలో నిర్వీర్యం అవుతున్న తీరుని ప్రజలు గ్రహించారు కాబట్టే కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి స్వచ్చందంగా ముందుకొచ్చి మద్ధతు పలుకుతున్నారని విడదల రజని వివరించారు. వైఎస్సార్సీపీ సేకరించిన కోటి సంతకాల ప్రతులను డిజిటలైజ్ చేసి ఆ రికార్డులను డిసెంబర్ 18న మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ గారి నేతృత్వంలో గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుందని మాజీ మంత్రి విడదల రజని వెల్లడించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వైయస్సార్సీపీ అలుపెరుగని పోరాటాలు చేస్తోంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైయస్సార్సీపీని లేకుండా చేయాలన్న కూటమి కుట్రలను అధిగమిస్తూ యువత, ఉద్యోగులు, మహిళలు, కార్మికుల పక్షాన పోరాడుతున్నాం. వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం.. ఏ వర్గానికి ఆపదొచ్చిన వారి పక్షాన నిలబడి వైయస్సార్సీపీ గళమెత్తుతోంది. ఆయా వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నినదిస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణతో వైయస్సార్సీపీ ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాపాడుకునేందుకు వైయస్సార్సీపీ తలపెట్టిన ఉద్యమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు. వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు ఇచ్చిన ఈ పిలుపునకు ప్రజలు భారీగా తరలి వచ్చి సంతకాలతో మద్దతు పలికారు. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోటి మందికి పైగా ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సంతకాలు చేశారు.ఫేక్ సభ్యత్వాలు, ఫేక్ పెట్టుబడులు, ఫేక్ సూపర్ సిక్స్ కాదులోకేష్ చెప్పే టీడీపీ ఫేక్ సభ్యత్వాలు మాదిరిగా కాకుండా, చంద్రబాబు ప్రకటించే ఫేక్ పెట్టుబడుల ఒప్పందాల మాదిరిగా కాకుండా, సూపర్ సిక్స్ ఫేక్ హామీల మాదిరిగా కాకుండా ప్రజలు స్పష్టంగా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా పేపర్లపైన చేసిన సంతకాలు. కిక్ బ్యాగ్స్ కోసం పేద విద్యార్థుల మెడికల్ సీటు కలను పణంగా పెడుతూ, వైద్యాన్ని పేదలకు అందని ద్రాక్షగా మారుస్తూ జరుగుతున్న కుట్రలను గుర్తించిన ప్రజలు ప్రైవేటీకరణ వద్దని నినదిస్తూ ప్రభుత్వానికిచ్చిన మెమోనే ఈ కోటి సంతకాలు. వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేసేలా నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే పెండింగ్ పనులు పూర్తి చేయకుండా ఆ నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేసింది. 108, 104 అంబులెన్స్‌లు కనుమరుగు చేసింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను తీసేసింది. బిల్లులు పెండింగ్ పెట్టి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది. వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తే కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఎకరా వంద రూపాయల చొప్పున మెడికల్ కాలేజీల భూములను అప్పనంగా ప్రైవేటుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతిటితో ఆగకుండా ప్రభుత్వ ఆస్పత్రులను వారికే ఇచ్చేసింది. అందులో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కమీషన్ల కోసం చంద్రబాబు చేస్తున్న ధన యజ్ఞాన్ని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు. దానికి సాక్ష్యమే వైయస్సార్సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణకు వచ్చిన అపూర్వ స్పందన. ప్రైవేటీకరణ నిర్ణయం చాలా గొప్పదన్నట్టు కూటమి నాయకులు చేస్తున్న ప్రచారం ఆపేస్తే మంచిది. ఇప్పటికైనా ప్రజల నిర్ణయాన్ని గౌరవించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వెనక్కి తీసుకోవాలి.గవర్నర్‌కి డిజిటల్ రికార్డులు సమర్పిస్తాంకోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేసిన వైయస్సార్సీపీ శ్రేణులందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతాభినందనలు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 10న రచ్చబండ పేరుతో ప్రతి గ్రామంలో మొదలైన కోటి సంతకాల ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు, యువత, మేథావులు, వివిధ రంగాల నిపుణులు రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేశారు. ప్రతి నియోజకవర్గంలో 50 వేలకు తగ్గకుండా చేయాలనుకుంటే అంతకుమించి అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 12న రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించి మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాం. గడిచిన రెండు నెలలుగా స్టాప్ ప్రైవేటైజేషన్ పేరుతో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలలో చర్చలు జరుపుతూ నష్టాలను వివరిస్తూ వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అవగాహన కల్పించారు. తమకు ఎదురైన అనుభవాలను పార్టీ నాయకులు మీడియాకు వివరించడం కూడా జరిగింది. 26 జిల్లాల్లో ఊహించని స్పందన వచ్చింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలను జిల్లా కేంద్రాలకు తరలించడం జరిగింది. ప్రత్యేక బాక్సుల్లో జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది. ఈ నెల 18న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి నేతృత్వంలో పార్టీ నాయకులు రాష్ట్ర గవర్నర్‌కి సమర్పించడం జరుగుతుంది. ప్రజలే తమ పేరు నియోజకవర్గం, గ్రామం, మొబైల్ నంబర్, సంతకాలను పేపర్లపై పొందుపరిచారు. ఈ మొత్తం సంతకాలను డిజిటలైజ్ చేసి గవర్నర్‌కి అందించడం జరుగుతుంది. కోటి మంది ప్రజల గుండె చప్పుడుగా ఈ కోటి సంతకాలను ప్రభుత్వం పరిగణించి పీపీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రజా నిర్ణయాన్ని కాదని ముందుకెళితే ఈ కోటి సంతకాలు ప్రభుత్వం పతనానికి శాసనంగా మారతాయని వైయస్సార్సీపీ హెచ్చరిస్తుంది. నియంత పాలనకు మూల్యం చెల్లించక తప్పదుప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారని మంత్రి స్వయంగా చెప్పాడంటే వైద్యారోగ్య రంగం నిర్వీర్యం అయిందని ప్రభుత్వమే అంగీకరించినట్టు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో వైద్యారోగ్య రంగాన్ని పథకం ప్రకారమే నిర్వీర్యం చేస్తూ వచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ లక్ష్యంగా దూది సూది కూడా అందుబాటులో లేనివిధంగా ప్రభుత్వ వైద్యశాలలను మార్చేశారు. వైద్యం ప్రభుత్వ బాధ్యత కాదన్నట్టు వ్యవహరిస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం ఈ ప్రభుత్వానికి మరణశాసనంగా మారబోతోంది. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే దించేసే రోజులు త్వరలోనే రాబోతున్నాయని స్పష్టంగా చెబుతున్నా. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఈ ప్రైవేటీకరణ నిర్ణయం మంచిది కాదని వెనక్కి తీసుకున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. హిట్లర్ మాదిరిగా నియంత పాలన సాగిస్తున్న చంద్రబాబుకి హిట్లర్‌కి పట్టిన గతే పడుతుందని విడదల రజని హెచ్చరించారు. -
18న గవర్నర్‌తో వైఎస్ జగన్ భేటీ ఖరారు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి భేటీ ఖరారు అయ్యింది. ఈ నెల 18వ తేదీన ఈ భేటీ జరగనుందని వైఎస్సార్సీపీ పేర్కొంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రజా స్పందనను ఈ భేటీలో గవర్నర్‌కు వైఎస్ జగన్ తెలియజేయనున్నారు.ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం పది ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సిద్ధపడింది. అయితే దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ జరిగింది. ఇందుకు సంబంధించిన నివేదికను వైఎస్ జగన్ స్వయంగా గవర్నర్‌కు సమర్పించి.. ప్రైవేటీకరణను అడ్డుకునేలా విజ్ఞప్తి చేయనున్నారు. గవర్నర్ కార్యాలయం షెడ్యూల్ ప్రకారం.. తొలుత 17వ తేదీన ఈ భేటీ జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఒకరోజు ముందుకు మార్చినట్లు గవర్నర్ కార్యాలయం వైఎస్సార్సీపీకి సమాచారం అందించింది. దీంతో 18వ తేదీన భేటీ జరగనుంది. ఆరోజు సాయంత్రం 4 గం.కు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలుస్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై(వ్యతిరేకత) ప్రజాభిప్రాయాన్ని గవర్నర్‌కి నివేదిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్‌కి చూపిస్తారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి.. ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలించనున్నారు. -
కోటి సంతకాల సేకరణలో పాల్గొంటున్న కూటమి కార్యకర్తలు
-
కోటి సంతకాల సేకరణ.. ఊరూ వాడా ఉద్యమ వేడి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గిరిజన గూడేల నుంచి నియోజకవర్గ కేంద్రాల దాకా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు బాబు ప్రభుత్వ కక్షపూరిత విధానాలను తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో భారీగా పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలు, పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఊరూ వాడా ఉద్యమ వేడి రగిలింది. -
చంద్రబాబు సర్కారు తీరుపై కోట్ల మంది కన్నెర్ర
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వమే దళారీగా మారిపోయి వైద్య సేవలు, వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం.. విలువైన సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతుండటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు, మేధావులు, యువత ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అన్ని సదుపాయాలు, అనుమతులతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సంతలో సరుకులు, పప్పు బెల్లాల మాదిరిగా చంద్రబాబు సర్కారు తెగనమ్మడంపై ప్రజా ఉద్యమం ఎగసిపడుతోంది.రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గిరిజన గూడేల నుంచి నియోజకవర్గ కేంద్రాల దాకా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు బాబు ప్రభుత్వ కక్షపూరిత విధానాలను తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో భారీగా పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలు, పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. నవంబరు 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. ఇది తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు, ప్రభుత్వ వైద్య రంగాన్ని పరిరక్షించుకునేందుకు తలపెట్టిన ప్రజా ఉద్యమంగా పేర్కొంటున్నారు.వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నేతల వెంట స్వచ్ఛందంగా తరలి వచ్చి పెద్ద ఎత్తున సంతకాల సేకరణలో పాల్గొంటున్నారు. అక్టోబరు 10న ప్రారంభమైన కోటి సంతకాల సేకరణ గత రెండు నెలలుగా రచ్చబండ కార్యక్రమం ద్వారా ఉధృతంగా సాగింది. నియోజకవర్గాల వారీగా సేకరించిన సంతకాలను డిసెంబర్ 10వ తేదీకి జిల్లా కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13 నాటికి జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాలను ర్యాలీగా తరలించనున్నారు. అనంతరం 17న కోటి సంతకాలను గవర్నర్‌కు అందించేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.రగిలిన సీమ..ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై రాయలసీమలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. సీమలో సుమారు 32 లక్షల మేర సంతకాలను సేకరించారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, న్యాయవాదులు.. ఇలా అన్ని వర్గాలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అనంతపురం లాంటి ప్రాంతాల్లో తాము టీడీపీకి ఓటు వేసినప్పటికీ.. కోటి సంతకాల సేకరణలో పాల్గొంటామని, ఇది భవిష్యత్ తరాల కోసం చేస్తున్న మంచి కార్యక్రమమని పేర్కొనడం గమనార్హం.ఇక వర్సిటీల్లో కూడా విద్యార్థులు భారీగా సంతకాల సేకరణలో పాలుపంచుకున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో 8 వేల సంతకాలు చేయించారు. పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్లు, డాక్టర్లు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు ఇందులో భాగస్వాములు అయ్యారు. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దీన్ని అడుగడుగునా అడ్డుకునే యత్నం చేశారు. జేసీ వర్గీయులు దాడులకు తెగబడటంతో వైఎస్సార్సీపీ నేతలకు చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ వెరవకుండా సంతకాల కార్యక్రమంలో ప్రజలు భారీగా భాగస్వాములు కావడం బాబు సర్కారు పట్ల వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను చాటి చెబుతోంది.ఉత్తరాంధ్రలో ఉవ్వెత్తున..ఉత్తరాంధ్రలో ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన కేజీహెచ్ మినహా పేదలకు ఇతర వైద్య సంస్థలు అందుబాటులో లేని పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అరిలోవలో విమ్స్, శ్రీకాకుళంలో రిమ్స్ ఏర్పాటు చేశారు. విశాఖలోని అరిలోవ ప్రాంతంలో హాస్పిటల్స్ నెలకొల్పే ప్రైవేటు సంస్థలకు భూమి అందుబాటులో ఉంచుతూ హెల్త్ సిటీని ఏర్పాటు చేశారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ అధికారంలో ఉండగా విజయనగరం, పాడేరులో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. అక్కడ క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి.అనకాపల్లి జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. పార్వతీపురం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయి. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ అందుబాటులోకి రావడం ద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్రలో వైద్య విప్లవం మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయటాన్ని నిరసిస్తూ ఉవ్వెత్తున జనాగ్రహం పెల్లుబుకుతోంది. వెనుకబడిన ఉత్తరాంధ్రకు మెడికల్ విద్యతో పాటు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో 18.30 లక్షల మేర సంతకాల సేకరణను పూర్తి చేశారు. అల్లూరి, పార్వతీపురం లాంటి ఏజెన్సీ జిల్లాల్లోనూ ఊహకు మించి స్పందన వచ్చింది.కోస్తాలో కన్నెర్ర..నెల్లూరు నుంచి గోదావరి వరకు కోస్తా జిల్లాలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కదంతొక్కాయి. సుమారు అరకోటి సంతకాల మేరకు కోస్తా జిల్లాల్లోనే సేకరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులను అప్పగించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించడంతో మన విద్యార్థులకు ఉచితంగా రావాలి్సన వైద్య సీట్లతోపాటు పేదలకు చేరువలో నాణ్యమైన ఉచిత వైద్య సేవలు దూరం కానున్నాయని అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు.కుప్పంలోనూ నిరసనలు..కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పగించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ప్రజలు తరలివచ్చి మరీ సంతకాల సేకరణ కార్యక్రమంలో గత రెండు నెలలుగా పాల్గొనడం గమనార్హం. తిరుపతి జిల్లాలో సుమారు 5 లక్షల మేర సంతకాలు సేకరించగా... చిత్తూరు జిల్లాలో 4.73 లక్షల మంది కోటి సంతకాల కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 108 గ్రామ సచివాలయాలు ఉండగా ఒక్కో సచివాలయం పరిధిలో వెయ్యి మంది చొప్పున సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.జీవో ఏదంటూ టీడీపీ నేతలు నవ్వుల పాలు..!గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలోనే ఐదు కొత్త మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా మొదలయ్యాయి. పులివెందుల, పాడేరు కాలేజీలు ఎన్నికల నాటికే ప్రారంభానికి సిద్ధం కాగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు అప్పగించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించగానే.. అసలు మెడికల్ కాలేజీలు నిర్మాణమే జరగలేదంటూ టీడీపీ నేతలు పచ్చి అబద్ధాలతో దుష్ప్రచారానికి దిగారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక అడుగు ముందుకు వేసి... అసలు మెడికల్ కాలేజీల నిర్మాణానికి జీవో ఎక్కడ ఉంది? అంటూ ప్రశ్నించారు.జీవో ఉంటే తనకు చూపించాలంటూ సవాల్ విసిరారు. దీంతో అక్టోబరు 10వ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల భవనాలను సందర్శించి జీవో కాపీని చూపించారు. దీంతో అయ్యన్నపాత్రుడు మిన్నకుండిపోయారు. మరోవైపు పెనుకొండలో మెడికల్ కాలేజీ ఎక్కడ ఉంది? అంటూ మంత్రి సవిత హడావుడి చేసి ఓ వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఉషశ్రీ పెనుకొండలో దాదాపు నిర్మాణం పూర్తి కావచ్చిన భవంతులను మీడియాకు చూపించి మంత్రి సవిత అబద్ధాలను ఎండగట్టారు. ఇలా నిస్సిగ్గుగా అబద్ధాలాడి టీడీపీ ప్రజా ప్రతినిధులు అబాసుపాలయ్యారు.


