సాక్షి, తూర్పుగోదావరి: ప్రభుత్వం మెడికల్ కళాశాలు ప్రైవేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి రూరల్ కోటి సంతకాల ప్రతుల తరలింపు ర్యాలీలో పార్టీ కోఆర్డినేటర్లు జక్కంపూడి రాజా, మార్గాన్ని భరత్, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, షర్మిలరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నాలుగున్నర లక్షల సంతకాల సేకరణ జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేదవాడికి వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న చంద్రబాబు వైద్య కళాశాలలకు 5000 కోట్లు మంజూరు చేయలేకపోతున్నారు. ఇది ప్రారంభం మాత్రమే... ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ఉద్యమిస్తాం’’ అని వేణుగోపాలకృష్ణ హెచ్చరించారు.


