సాక్షి, తిరుపతి: చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ పాలన తప్ప.. ప్రజా పాలన చేయడం లేదంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సేకరించిన సంతకాల సేకరణ కరపత్రాలను ఇవాళ భారీ ర్యాలీగా విజయవాడ తరలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. ప్రజల నుంచి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై నిరసనలు స్వచ్చందంగా మద్దతు తెలిపారని ఆర్కే రోజా అన్నారు.
వైఎస్ జగన్.. 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు. వైఎస్ జగన్ పేరు చెరిపేయాలని చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుంది. విద్యార్థుల జీవితాలను కూటమి సర్కార్ నాశనం చేస్తుంది. కూటమి పాలనలో వారు చేసిన సర్వేలోనే అందరు మంత్రులకు రెడ్ మార్క్ వచ్చింది. విద్యావ్యవస్థను నారా లోకేష్ నాశనం చేస్తే.. వ్యవసాయాన్ని అచ్చెన్నాయుడు నాశనం చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు విచ్ఛిన్నం చేశారు.


