breaking news
rk roja
-
ఈసారి మహిళలు కొట్టే దెబ్బకి చంద్రబాబుకి దిమ్మతిరగడం ఖాయం.. ఫ్రీ బస్సుపై రోజా రియాక్షన్
-
జూ.ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు.. ఆర్కే రోజా రియాక్షన్
సాక్షి, తిరుపతి: జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వాఖ్యలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమా, రాజకీయాలు మిక్స్ చేయెద్దంటూ ఆమె హితవు పలికారు. అరచేతితో సూర్యుడ్ని ఆపలేరన్నారు. ఎమ్మెల్యేలు టికెట్లు కొన్నా.. అభిమానులు పవన్ సినిమాకు రాలేదంటూ రోజా వ్యాఖ్యానించారు.ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలపై రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్త్రీశక్తి పేరుతో మహిళలను దగా చేశారని ఆమె మండిపడ్డారు. 16 రకాలు బస్సులు ఉన్నాయి.. ఇప్పుడు 5 బస్సులకు మాత్రమే అమలు చేస్తున్నారంటూ రోజా దుయ్యబట్టారు. 14 నెలలు తర్వాత స్తీశక్తి బస్సు ప్రారంభించారు. లోకల్‌గా తిరిగే బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సులకు అమలు చేశారు’’ అంటూ ఆర్కే రోజా నిలదీశారు.‘‘రాష్ట్రం మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ అని చెప్పి.. ఇవాళ ఆంక్షలు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కోతలు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుంది. తిరుమల, అన్నవరం, విజయవాడ, శ్రీశైలం పుణ్య క్షేత్రాలకు ఉచిత దర్శనం లేదు. భగవంతుడు పేరు చెప్పి ఓట్లు దండుకున్నారు. మహిళల్ని మోసం చేశారు. పల్లె వెలుగు బస్సుల్లోనే పంపిస్తామని ఎన్నికలు ముందు మీరు చెప్పారు. మహిళల్ని మోసం చేయడమే పనిగా పెట్టుకున్నారు...కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదు. సూపర్ సిక్స్.. హిట్ కాదు.. సూపర్ ప్లాప్. తిరుపతి నుంచి తిరుమలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు. శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ గుడి, సింహాచలానికి ఉచిత ప్రయాణం లేదు. ఆడబిడ్డ నిధి.. 18 ఏళ్లు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఆడబిడ్డ లేరు కాబట్టి.. చంద్రబాబుకు ఆడవాళ్లను గౌరవించడం తెలీదు. కానీ, పవన్ కళ్యాణ్‌కు ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి ఆయన ప్రశ్నించాలి.జగనన్న ఆడబిడ్డలకు చెప్పింది చెప్పినట్లుగా అమలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసమే.. అబద్ధాలు చెప్పారు. మహిళల్ని మోసం చేసినవాళ్లు ఏ రాష్ట్రంలో బాగుపడింది లేదు. వైఎస్ జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటూ చెప్పి చంద్రబాబు మోసం చేశాడు’’ అంటూ ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జూ. ఎన్టీఆర్ సినిమాను ఆపే దమ్ముందా! టీడీపీకి రోజా కౌంటర్
-
RK రోజా ఇంట్లో రాఖీ పండుగ సెలబ్రేషన్స్
-
RK రోజా వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు
-
ద్రౌపది అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన RK రోజా
-
కిరాక్ RP నీకే చెప్తున్నా.. rk స్వీట్ వార్నింగ్.
-
జగనన్న కానీ సీఎం అయ్యాడో.. టీడీపీకి రోజా మాస్ వార్నింగ్..
-
చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి రోజా
-
సుదర్శన్ నాయుడు కుటుంబానికి ఆర్కే రోజా పరామర్శ
సాక్షి, చిత్తూరు జిల్లా: నగరి రూరల్ మండలం వైఎస్సార్సీపీ మాజీ కన్వీనర్ సుదర్శన్ నాయుడు కుటుంబాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. సుదర్శన్ నాయుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా.. మేలపట్టు గ్రామంలో ఆయన నివాసానికి వెళ్లిన ఆర్కే రోజా.. సుదర్శన్ నాయుడు చిత్రపటానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.సుదర్శన్ నాయుడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదర్శన్ నాయుడు పార్టీకి చేసిన సేవలు ఎనలేనివని.. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలన్నారు. రోజా వెంట మండల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధం విభాగ అధ్యక్షులు ఉన్నారు. -
ఈ వీడియో మీ ఇంట్లో చూపిస్తే.. నీ దవడలు వాయించేస్తారు
-
వీడియో: 2 కోట్ల మందిని ఎంత పబ్లిక్‌గా మోసం చేశారో చూడండి
రెండు కోట్ల మంది మహిళలను..ఎంత పబ్లిగ్గా.. మోసం చేశారో చూడండి. ఎన్నికల ముందు ఓట్ల కోసం..ఇంటింటికి వెళ్లి మహిళలకు మాయ మాటలు చెప్పారు.ఇప్పుడేమో ఇలా నమ్మించి నట్టేట ముంచేశారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు ఆడబిడ్డ నిధి పథకం అమలుపై స్పందిస్తే.. ‘‘ మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సహాయం అందించే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తుంది’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో అక్కడ హాజరైన మహిళలు ఒక్కసారిగా కంగుతిన్నారు.అయితే.. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బులు కావాలి, `ఆడబిడ్డ నిధి` పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలి` అంటూ మాట్లాడడానికి సిగ్గులేదా? అంటూ అచ్చెన్నాయుడిని ప్రశ్నిస్తే రోజా ఓ పోస్ట్ చేశారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా మాట్లాడమని మీ నాయకుడు చంద్రబాబు చెప్పారా? అంటూ పోస్ట్ చేశారు. అదే సమయంలో..బాబు ష్యూరిటీ.. వెన్నుపోటు గ్యారంటీ..!. 2 కోట్ల మంది మహిళలను..ఎంత పబ్లిగ్గా.. మోసం చేశారో చూడండి. ఎన్నికల ముందు ఓట్ల కోసం..ఇంటింటికి వెళ్లి మహిళలకు మాయ మాటలు చెప్పారు.ఇప్పుడేమో ఇలా నమ్మించి నట్టేట ముంచేశారు అంటూ వీడియోలతో పోస్టులు చేశారామె. View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) `సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బులు కావాలి, `ఆడబిడ్డ నిధి` పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలి` అంటూ మాట్లాడడానికి సిగ్గులేదా @katchannaidu? ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా… pic.twitter.com/v9v8fq8C1r— Roja Selvamani (@RojaSelvamaniRK) July 22, 2025 -
మీ తప్పులు ప్రశ్నిస్తే... ఏకిపారేసిన రోజా
-
లిక్కర్ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం చీప్ పాలిటిక్స్ చేస్తుంది
-
‘కూటమి’ అరాచకాలు సహించం: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ టి.రాజయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. పుత్తూరు మున్సిపాలిటీ 20వ వార్డు, వినాయకపురం ఎస్టీ కాలనీలో రాజయ్య ఆటోకు ఇటీవల దుండగులు నిప్పటించారు. ఈ ఘటన వెనుక ఉన్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను రోజా కోరారు. జీవనోపాధి కోసం నడుపుకుంటున్న ఆటోను రాత్రికి రాత్రే దుండగులు నిప్పుపెట్టడం అమానుషమన్నారు.ఇటువంటి అరాచక చర్యలకు పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదు. ఇటువంటి దాడులకు పాల్పడుతున్న వారికి ప్రజలు బుద్ధి చెబుతారు’’ అని ఆర్కే రోజా హెచ్చరించారు. రెడ్‌బుక్ రాజ్యాంగ్యాన్ని కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న పరిస్థితిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులను సహించేది లేదు’’ అంటూ ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్టీ వర్గానికి చెందిన టి.రాజయ్య కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలి’’ అని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. -
మహిళల్ని అసభ్యంగా దూషించటం టీడీపీకి ఆనవాయితీ: వైఎస్ జగన్
సాక్షి,అమరావతి: మహిళలను అసభ్యకర పదజాలంతో దూషించటం టీడీపీకి ఆనవాయితీ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దుయ్యబట్టారు. ‘మాజీమంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. తెలుగుదేశం పార్టీ లో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకు ఓర్చుకోలేక, నా సోదరి, రెండుసార్లు ఎమ్మెల్యేగాను, మంత్రిగాను పనిచేసిన ఆర్కే రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తమను విమర్శించే మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ లో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది ఒక నిదర్శనం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆ పోస్టులో ఆయన ఏమన్నారంటే..మహిళలకు ఏ మాత్రం రక్షణ లేదు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండాపోయింది. వారికి కనీస గౌరవ, మర్యాదలు దక్కడం లేదు. వారికి ఏ విధంగానూ న్యాయం జరగడం లేదు. ఇకనైనా మాజీ మంత్రి ఆర్కే రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాష్‌ను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. అని వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. నోరు మూయించడానికే నిస్సిగ్గుగా వ్యాఖ్యలు ‘వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి, దు్రష్పచారం చేసే ఆయన ఉన్నత పదవి పొందారు. అప్పటినుంచే వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీ కి ఒక బ్రాండ్‌గా మారింది. ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారి నోరు మూయించడానికే నిస్సిగ్గుగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు’ అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది ఆ కోవలోనే ఏడాది కాలంగా అనేకమంది మహిళా నాయకులను వారు దారుణంగా వేధించారు, అవమానించారు. తనపై ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి ఆర్కే రోజా వెళ్లగా, వాస్తవాలు స్పష్టంగా కళ్లెదుటే కనిపిస్తున్నా పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది?, టీడీపీ గూండాలను రక్షించేందుకు వారు ఏ స్థాయిలో తమ బాధ్యత, కర్తవ్యాన్ని మరిచి వ్యవహరిస్తున్నారన్నది చూపుతున్నాయి. నిజానికి ఒక్క రోజా విషయంలోనే కాదు. మాజీ మంత్రి విడదల రజిని, కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికతోపాటు మా పార్టీ కి చెందిన పలువురు నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకర ఘటనలు చోటుచేసుకున్నాయి.. అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
రోజాపై భానుప్రకాష్ వ్యాఖ్యలు అత్యంత హేయం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ వ్యాఖ్యల పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే భానుప్రకాష్‌ని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రోజాకు సంఘీభావం తెలుపుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణిపై టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం. టీడీపీలో దారుణంగా మారిన దుష్ట సంస్కృతికి ఆ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపుతూ గట్టిగా మాట్లాడుతున్నందుకు, వాటిని ప్రశ్నిస్తున్నందుకూ ఓర్చుకోలేక, నా సోదరి రెండుసార్లు ఎమ్మెల్యేగానూ, మంత్రిగానూ పని చేసిన ఆర్కే రోజాను అత్యంత అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తమను విమర్శించే మహిళల గొంతు నొక్కడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీలో ఒక తంతుగా మారిన అత్యంత హేయమైన సంస్కృతికి ఇది ఒక నిదర్శనం. వ్యక్తిత్వ హననం ద్వారానే చంద్రబాబు తన రాజకీయ జీవితం కొనసాగిస్తున్నారు....నిజం చెప్పాలంటే ఒక మహిళపై అత్యంత హేయంగా ఆరోపణలు చేసి, దుష్ప్రచారం చేసే ఆయన ఉన్నత పదవి పొందారు. అప్పటి నుంచే వ్యక్తిగత దాడులు, స్త్రీలను ద్వేషించే తత్వం తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్‌గా మారింది. ధైర్యంగా మాట్లాడే మహిళలను భయపెట్టి వారి నోరు మూయించడానికి నిస్సిగ్గుగా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు, విమర్శించడాన్ని ఆ పార్టీ నాయకులు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆ కోవలోనే గత ఏడాది కాలంగా అనేక మంది మహిళా నాయకురాళ్లను వారు దారుణంగా వేధించారు.. అవమానించారు’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.తనపై ఒక ఎమ్మెల్యే చేసిన అత్యంత హేయమైన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేయడానికి ఆర్కే రోజా వెళ్లగా, వాస్తవాలు స్పష్టంగా కళ్లెదుటే కనిపిస్తున్నా పోలీసులు తిరిగి ఆమెపైనే సందేహాలు వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా మారింది? టీడీపీ గుండాలను రక్షించేందుకు వారు ఏ స్థాయిలో తమ బాధ్యత, కర్తవ్యాన్ని మర్చి వ్యవహరిస్తున్నారన్నది చూపుతున్నాయి.నిజానికి ఒక్క రోజా విషయంలోనే కాదు.. మాజీ మంత్రి విడదల రజని, కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ ఉప్పాల హారికతో పాటు, మా పార్టీకి చెందిన పలువురు నాయకుల కుటుంబ సభ్యుల విషయంలో కూడా చాలా అవమానకర ఘటనలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. వారికి కనీస గౌరవ, మర్యాదలు దక్కడం లేదు. వారికి ఏ విధంగానూ న్యాయం జరగడం లేదు. ఇకనైనా మాజీ మంత్రి ఆర్కే రోజాను దారుణంగా అవమానించిన ఎమ్మెల్యే భానుప్రకాష్‌ను తక్షణమే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.The shocking verbal abuse hurled by TDP MLA Gali Bhanu Prakash against @RojaSelvamaniRK is yet another example of the deeply rotten culture within the TDP. Roja, my sister, a two-time MLA and former minister, was subjected to filthy, degrading, and offensive language simply for…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2025 -
Taneti Vanitha: ఇంటిపేరు గాలి.. అలాగని గాలి మాటలు మాట్లాడితే..
-
పెద్దమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాం.. గాలి భాను ప్రకాష్ ను ఏకిపారేసిన మహిళలు
-
నా ఫ్యామిలీ జోలికొస్తారా.. ఏ ఒక్కరిని వదలను
-
జగన్ 2.0.. ఎలా ఉండబోతుందంటే రోజా మాటల్లో...
-
మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా.. ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్
-
Big Question: నా పిల్లల్ని కూడా.. డిబేట్ లో రోజా కంటతడి
-
ఆ వ్యాఖ్యలు దుర్మార్గం
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకురాలు ఆర్కే రోజాకు సినీతారలు బాసటగా నిలిచారు. అసహ్యకరమైన పదాలతో విమర్శించిన నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ తారలు రాధిక, కుష్బూ, రమ్యకృష్ణ, మీనా, నవనీత్‌కౌర్, కవిత డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ విషయంపై సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికైనా సిద్ధమంటున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ ఇది సహించరానిదిఈ వీడియో చూడగానే ఒక స్నేహితురాలిగా, ఒక మహిళగా చాలా బాధ పడ్డాను. ఓ వైపు దేశం అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నా, ఇంకా మహిళలను కించ పరచడం, అక్రమ రవాణా, గృహ హింస, బహిరంగంగా తిట్టడం రోజూ జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ మాజీ మంత్రి తనయుడు, ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ ఈ విధంగా తిట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరానిది. ఈ సమయంలో కుల, మతాలకు అతీతంగా మగ, ఆడ అని తేడా లేకుండా అందరూ ఒక్కటై రోజాకు అండగా నిలబడాలి. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో తక్షణం కలుగ చేసుకొని కఠిన చర్యలు తీసుకోవాలి. భారతమాతాకు జై అనే దేశంలో ఇంత నీచంగా మాట్లాడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలి. – రమ్యకృష్ణ నీకు పెళ్లాం, సోదరి లేరా?రోజా సినిమా హీరోయిన్గా నటించింది. రాజకీయాల్లోకి వెళ్లి మంత్రిగా పని చేసింది. అలాంటి రోజాపై ఇష్టానుసారం మాట్లాడటానికి ఎంత ధైర్యం కావాలి? నీకు పెళ్లాం, సోదరి లేరా? ఒక లీడర్‌గా ఆడవారి గురించి ఇంత దిగజారి మాట్లాడతారా? రుజువులు ఉంటే చూపించి మాట్లాడాలి కానీ, ఇలా నీచంగా దిగజారి మాట్లాడకూ డదు. మీకు రాజకీయాలు ప్రధానం కావచ్చు.. అయితే మహిళల ఆత్మగౌరవంతో పని లేదా? ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారు సిగ్గుపడేలా చర్యలు తీసుకోవాలి. – నవనీత్ కౌర్పిరికిపంద చర్య ఇదిగౌరవం అంటే ఏమిటి.. ఎదుటి వారితో ఎటువంటి భాష మాట్లాడాలి.. అని నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తో కలిసి పని చేసినప్పుడు నేర్చుకున్నాం. అటువంటి ఆయన స్థాపించిన పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే ఇంత నీచంగా మాట్లాడటం శోచనీయం. రోజా ఏ పార్టీలో ఉన్నా.. ఆమె ఒక మహిళ అన్న విషయం మర్చిపోకూడదు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయాలను ఇంత దిగజారుస్తారనుకోలేదు. మహిళలను రాజకీయాల్లోకి రాకుండా చేసే పిరికిపంద చర్య ఇది. ఆ ఎమ్మెల్యే మాటలను నేను పూర్తిగా ఖండిస్తున్నా. – కవితనీచంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలిరోజాకు మా అందరి మద్దతు ఉంది. ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడిన వారిపై చర్య తీసుకోవాలి.– కుష్బూ రోజాను చూసి అసూయ పడుతున్నాడురోజా గురించి మాట్లాడిన వీడియో చూశాను. చాలా చాలా కోపం తెప్పించింది. ఒక మహిళ పైకి ఎదుగుతోంది అంటే బహిరంగంగా ఇంత నీచంగా మాట్లాడతారా? ఇలాంటి మాటలకు మహిళలు భయపడి లోపల కూర్చుంటారు అనుకుంటున్నారేమో.. కాలం మారింది. మహిళలు మరింత ధృడంగా తయారయ్యారు. ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నాడంటే ఆయన రోజాను చూసి ఎంత అసూయ పడుతున్నాడో తెలుస్తోంది. ఆయన క్యారెక్టర్, ఆలోచనలు ఎంత నీచంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రోజా చాలా ధైర్యం కలిగిన మహిళ. రోజా.. నేను నీకు అండగా ఉంటాను. సుప్రీంకోర్టు తక్షణం కలుగ చేసుకొని రోజాకు న్యాయం జరిగేట్టు చూడాలి. – మీనాఇంత నీచంగా ఎలా మాట్లాడతారు?రోజాపై అంత దారుణంగా మాట్లాడటం బాధ కలిగించింది. రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు దారుణం. రాజకీయాల్లోకి మహిళలు మరింత ముందుకు రావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మహిళల గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడతారు? – రాధిక– సాక్షి, అమరావతి -
భాను ప్రకాష్... వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు: వరుదు కల్యాణి
-
రోజాపై భాను గాలి ప్రకాష్ వ్యాఖ్యలు YSRCP పూర్ణమ్మ ఉగ్రరూపం..
-
భానుప్రకాష్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
-
కాలకేయుల్లా టీడీపీ నేతలు: వరుదు కల్యాణి
సాక్షి, విశాఖపట్నం: కాలకేయుల్లా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్.. ఆర్కే రోజాపై దిగజారుడు వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా మాట్లాడారన్న వరుదు కల్యాణి.. భాను ప్రకాష్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.రోజా మీద దారుణమైన వ్యాఖ్యలు చేస్తే మహిళా కమిషన్ ఏం చేస్తుందంటూ ఆమె ప్రశ్నించారు. మహిళా కమిషన్ సుమోటోగా కేసు స్వీకరించారా?. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే ఇష్టానుసారంగా మాట్లాడతారా?. రోజా మీద చేసిన వ్యాఖ్యలు మీ ఇంట్లో ఆడవారి మీద చేస్తే మీరు ఊరుకుంటారా?. టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారింది’’ అంటూ వరుదు కల్యాణి దుయ్యబట్టారు.గతంలో బండారు సత్యనారాయణమూర్తి, అయ్యన్న వంటి వారు రోజాపై అసభ్యకరంగా మాట్లాడారు. విజయమ్మ, భారతమ్మ గురించి ఐటీడీపీ వాళ్లు దారుణంగా ట్రోల్ చేశారు. మహిళలంటే టీడీపీకి గౌరవం లేదు. ఉప్పాల హారికపై దాడి మరువక ముందే ఆర్కే రోజా మీద అసహ్యంగా మాట్లాడుతున్నారు. మహిళా మీద దాడి జరిగితే తాట తీస్తామని చెప్పిన పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారు?. భాను ప్రకాష్ తాట ఎందుకు పవన్ తీయలేదు’’ అంటూ వరుదు కల్యాణి నిలదీశారు. -
రోజాపై గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలు వరుదు కళ్యాణి స్టాంగ్ కౌంటర్
-
Pushpa Sreevani: రోజా కు క్షమాపణ చెప్పు.. లేదంటే
-
మహిళా కమిషన్‌లో రోజా ఫిర్యాదు.. గాలిపై చర్యలు తీసుకోవాల్సిందే..
సాక్షి, నగరి: చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఆర్కే రోజా జాతీయ, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి రోజా.. కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని రోజా.. కమిషన్‌ను కోరారు. ఇక, అంతకుముందు.. భాను ప్రకాశ్‌ను అరెస్ట్ చేయాలని రోజా నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉండగా.. మహిళలను అవమాన పరచడం, కించ పరచడం అధికార టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. పత్రికలో రాయడానికి వీలు లేనంతగా బూతులు తిడుతూ ఆర్కే రోజా వ్యక్తిత్వ హననానికి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్పడ్డారు. మహిళా లోకం అసహ్యించుకునేలా సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలను ట్రోల్ చేశారు. ఈ వ్యవహారంపై ఆర్కే రోజా గురువారం చిత్తూరు జిల్లా నగరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా తనపై ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి ‘‘రూ.2,000 ఇస్తే ఏ పనైనా చేసేది. మార్కెట్లో ఆ మాట ఉంది. ఆమె నేడు రూ.రెండు వేల కోట్లు సంపాదించింది. ఆమె వ్యాంప్‌కు ఎక్కువ.. హీరోయిన్‌కు తక్కువ. ఈ పిచ్చి దాంతో వాళ్ల పార్టీ నేతకు పిచ్చెక్కిందా.. ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు’’ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడుతారా? అని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడిన నగరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించక పోవడంపై అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.‘నేను రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలిభాను.. నన్ను అసభ్యకరంగా, దుర్భాషలాడుతూ బాధ పెట్టారు. ఇది నాకు మాత్రమే జరిగిన అవమానం కాదు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరిగిన దాడి. ఇలాంటి రాష్ట్రంలోనా మనం నివసిస్తున్నాం? ఇది ప్రమాదకరమైన సంస్కృతి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భాను ప్రకాష్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. మీ ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే ఊరుకుంటారా?మరోవైపు.. టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి స్పందించారు. ఈ సందర్బంగా వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘రోజాపై గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సభ్య సమాజం తలదించుకునేలా భాను ప్రకాష్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన ఇంట్లో మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారా?. రోజాకు వెంటనే భాను ప్రకాష్ క్షమాపణ చెప్పాలి. భాను ప్రకాష్‌ను అరెస్టు చేయాలి. ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తానన్న పవన్ ఏమైపోయారు. మహిళలను అవమాన పరచడం అనేది టీడీపీ డీఎన్ఏనే ఉంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
రోజాపై గాలి భాను ప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
-
భాను ప్రకాష్ కామెంట్స్ పై ఆర్కే రోజా ఫైర్
-
నగరి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై ఆర్కే రోజా ఫిర్యాదు
మహిళలను అవమాన పరచడం, కించ పరచడం అధికార టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. ఇంట్లో మహిళలు ఏమనుకుంటారోనన్న కనీస స్పృహ లేకుండా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ మహిళా నేతలపై నిస్సిగ్గుగా నోరు పారేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను అసభ్యంగా దూషిస్తూ.. ఆమె వాహనంపై టీడీపీ సైకో మూకలు దాడి చేసిన ఘటనపై రాష్ట్రం అట్టుడుకుతుండగా.. మరో వైపు మాజీ మంత్రి ఆర్కే రోజాపై సభ్య సమాజం సిగ్గు పడేలా దుర్భాషలాడుతూ ఐ టీడీపీ, చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ రెచ్చిపోయారు. సాక్షి, అమరావతి/నగరి: పత్రికలో రాయడానికి వీలు లేనంతగా బూతులు తిడుతూ ఆర్కే రోజా వ్యక్తిత్వ హననానికి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్పడ్డారు. మహిళా లోకం అసహ్యించుకునేలా సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలను ట్రోల్ చేశారు. ఈ వ్యవహారంపై ఆర్కే రోజా గురువారం చిత్తూరు జిల్లా నగరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా తనపై ట్రోల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, ఆయన సహచరులు సోషల్ మీడియాలో తన గురించి ‘‘రూ.2,000 ఇస్తే ఏ పనైనా చేసేది. మార్కెట్లో ఆ మాట ఉంది. ఆమె నేడు రూ.రెండు వేల కోట్లు సంపాదించింది. ఆమె వ్యాంప్‌కు ఎక్కువ.. హీరోయిన్‌కు తక్కువ. ఈ పిచ్చి దాంతో వాళ్ల పార్టీ నేతకు పిచ్చెక్కిందా.. ఆయన పిచ్చి ఈమెకెక్కిందా తెలియడం లేదు’’ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎవరైనా ఇంత నీచంగా మాట్లాడుతారా? అని ఆమె ప్రశ్నించారు. వ్యక్తిత్వ హననం చేసేలా మాట్లాడిన నగరి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించక పోవడంపై అనంతరం ఆమె ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తినందుకు టీడీపీ ఎమ్మెల్యే గాలిభాను.. నన్ను అసభ్యకరంగా, దుర్భాషలాడుతూ బాధ పెట్టారు. ఇది నాకు మాత్రమే జరిగిన అవమానం కాదు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించడానికి ధైర్యం చేసే ప్రతి మహిళపై జరిగిన దాడి. ఇలాంటి రాష్ట్రంలోనా మనం నివసిస్తున్నాం? ఇది ప్రమాదకరమైన సంస్కృతి. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. భాను ప్రకాష్‌పై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని ఆమె డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ స్పందించాలిమహిళా లోకం అసహ్యించుకొనేలా.. సభ్య సమాజం తల దించుకునేలా మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ మాట్లాడటం దారుణం అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల పేర్కొన్నారు. ‘సినిమా వాళ్లు అంటే ఎందుకు మీకు ఇంత చులకన? మీరు నెత్తిన ఎక్కించుకున్న పవన్ కళ్యాణ్ సినిమా వ్యక్తి కాదా?’ అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలి అని ఆమె డిమాండ్ చేశారు. నగరి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయన్నారు. కౌన్సిలర్ల అక్రమ అరెస్ట్‌పై నిలదీసిన రోజాపుత్తూరు: తమిళనాడుకు ఏడు టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తూ నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ బ్యాచ్ పట్టుబడగా.. తప్పుడు వాంగ్మూలంతో పోలీసులు ఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను అరెస్టు చేశారు. వివరాలు.. ఇసుకను అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్న ఏడు టిప్పర్లను ఇటీవల నగరి పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన సూత్రధారి అయిన భరత్‌ను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ అనుచరుడైన భరత్ ఇచ్చిన తప్పుడు వాంగ్మూలంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బీడీ భాస్కర్, బిలాల్‌పై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి.. బుధవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వారిని గురువారం ఉదయం 11 గంటలకు పుత్తూరు సబ్ కోర్టులో హాజరుపరిచారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి రోజా పుత్తూరు కోర్టు వద్దకు చేరుకుని ఎస్సై విజయ్ను పలు ప్రశ్నలతో నిలదీశారు. ఇసుకను ఎక్కడ అక్రమంగా తరలిస్తుంటే వీరిని పట్టుకున్నారో సాక్ష్యాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న ప్రజాప్రతినిధులను అర్ధరాత్రి సమయంలో ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశి్నంచారు. అసలు రాజంపేట నుంచి నగరి మీదుగా తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలించడం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు సాధ్యపడే విషయమేనా అని నిలదీశారు. అన్ని ప్రశ్నలకూ సీఐని అడగాలంటూ ఎస్సై నీళ్లునమిలారు. ఇసుక మాఫియాకు ప్రధాన సూత్రధారి అయిన గాలి భానుప్రకాశ్ ప్రధాన అనుచరుడు భరత్ నుంచి తప్పుడు వాంగ్మూలం తీసుకొని.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై అక్రమ కేసులు బనాయించారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని పోలీసులు అమలు చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు. తప్పుడు కేసులకు భయపడే పరిస్థితిలో లేమని.. పార్టీ కేడర్‌కు వైఎస్సార్సీపీ నాయకులతో పాటు వైఎస్ జగన్ అండగా ఉన్నారని చెప్పారు. -
టీడీపీ, జనసేన దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి: రోజా
-
‘గాలిలో గెలిచిన గాలిగాడు.. కౌన్సిలర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ’
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులతో వేధించడంపై పుత్తూరు కోర్టు వద్ద పోలీసులను మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. టీడీపీ, జనసేన కూటమి దిగజారుడు రాజకీయాల చేస్తున్నాయని.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారిపై తప్పుడు కేసులు పెడతున్నారని మండిపడ్డారు.గాలిలో గెలిచిన గాలిగాడు నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. రాజంపేట నుంచి తిరుపతి మీదుగా నగరికు వచ్చి తమిళనాడుకు టిప్పర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఏడాదిగా పోలీసులు, మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారు?’’ అంటూ ఆర్కే రోజా ప్రశ్నించారుసుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా కానీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మెల్యే భాను ప్రకాష్ కౌన్సిలర్‌కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. నగరి నియోజకవర్గం అక్రమ మైనింగ్, గంజాయికి అడ్డగా మారింది. నువ్వు చేసిన అక్రమాలు బయటకు తీస్తా.. నీ అవినీతి బయటకు కక్కిస్తా. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన మోసాలు ప్రజలు తెలుసుకున్నారు. తప్పుడు కేసులు కు భయపడం. మాకు వైఎస్ జగన్ అండగా ఉన్నారు. లక్ష 86 వేల కోట్లు అప్పులు చేసి చెత్త రికార్డు నమోదు చేశారు సీఎం చంద్రబాబు. వీళ్లను నమ్మి తప్పుడు కేసులు పెడుతున్న అధికారులు కచ్చితంగా శిక్ష అనుభవిస్తారు’’ అని ఆర్కే రోజా హెచ్చరించారు. -
శ్రీవారి సన్నిధిలో రోజా, పెద్దిరెడ్డి
-
మూడు కోతుల్లా మూసుకున్న బాబు, లోకేష్, పవన్
సాక్షి, ప్రకాశం: పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు ఏనాడూ లేదని.. ఈ పాలనలోనూ పేదపిల్లల చదువుకు మోకాలడ్డుపెడుతున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, అందుకే మ్యానిఫెస్టో రీకాలింగ్ పేరిట అని చంద్రబాబు మోసాన్ని ఎండగడుతున్నాం అని ఆమె అన్నారు.శుక్రవారం రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. ‘‘నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు చెపుతున్నారు. విజన్ ఉంది.. విస్తరాకుల కట్ట ఉంది అని చెప్పి.. స్కాంలలో విజనరీగా చెలామణి అవుతున్నారు. పేద పిల్లల చదువుకు చంద్రబాబు మోకాలు అడ్డు పెడుతున్నారు. పేదవాడిని మద్యం మత్తులో ఉంచి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ప్రతీది కల్తీనే. చివరకు బడి పిల్లకు కూడా కల్తీ భోజనం పెడుతున్నారు.ఏపీలో మూడు కోతుల్లా బొమ్మల్లా.. కూటమి నాయకులు ముగ్గురు ఉన్నారు. దృతరాష్ట్ర పాలనతో చంద్రబాబు కళ్లు మూసుకున్నారు. విద్యార్దుల జీవితాలు నాశనం అవుతుంటే లోకేష్ చెవులు మూసుకొన్నారు. పవర్ లేని పవన్ కల్యాణ్ ఈ తండ్రీకొడుకుల అరాచకాలను ప్రశ్నించకుండా నోరు మూసుకుని కూర్చున్నారు. పేదలకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకి లేదు. అదే ఉండి ఉంటే.. 2019కి ముందే ఆయన ప్రజల సంక్షేమం గురించి ఆలోచించి ఉండేవారు. విద్యాశాఖమంత్రి అంటే ఎలా ఉండాలో ఆదిమూలపు సురేష్‌ని చూసి నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదో నారా లోకేష్‌ని చూసి తెలుసుకోవాలి. 2019-2024 జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి ఇస్తే.. ఇప్పుడు దానిని సిగ్గులేకుండా తమ ఖాతాలో వేసుకున్నారు. చంద్రబాబు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాల పేర్లు మార్చుకొని చంద్రబాబు పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యే లు ఇంటింటికి తిరిగే దమ్ము ఉందా? అని రోజా ప్రశ్నించారు.పోలీసులు ఉన్నది అధికార పార్టీకి ఊడిగం చెయ్యడం కోసం కాదు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల ప్రాణాల కోసం పని చెయ్యాలి. ఆంక్షలు పెడితే భయపడటానికి ఇక్కడ ఉన్నది లోకేష్ కార్యకర్తలు కాదు... జగన్ అనే సింహం కార్యకర్తలు. ఈవీఎంలతో గెలిచి ఎగిరెగిరి పడితే జనం ఎగరేసి కొడతారు జాగ్రత్త’’ అని కూటమి నేతలను ఉద్దేశించి రోజా అన్నారు. -
నిజంగా నీకు పౌరుషం ఉంటే.. నువ్వు పవర్ స్టార్ అయితే..
-
భూమన కామెంట్స్ పై రోజా షాకింగ్ రియాక్షన్
-
గబ్బర్ సింగ్ డైలాగ్ తో పవన్ ను రఫ్ఫాడించిన రోజా
-
‘అప్పుడు ఊగిపోయారు.. మరి ఇప్పుడేమైంది చంద్రబాబూ?’
తిరుపతి: ఎన్నికలకు ముందు 143 అబద్ధపు హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌లు కలిసి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 06) నగరిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా రోజా మాట్లాడారు.అమరావతిని దోచుకోవడానికి మాత్రమే అధికారాన్ని వినియోగించుకుంటున్నారన్నారు. ఎన్నికలకు ముందు ఊగిపోతూ చంద్రబాబు మాట్లాడారని,, నేడు మహిళల పై అగాయుత్యలు పెరిగిపోతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు రోజా. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రశ్నించేందుకకే ఉన్నానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమయ్యారని రోజా ప్రశ్నించారు.చంద్రబాబు సొంత జిల్లాలో మామిడి రైతులు అవస్థలు పడుతుంటే.. అది ఆయనకు తెలియదా? అని నిలదీశారు రోజా. ఒకవేళ రైతుల సమస్యలు తెలియకుంటే సీఎం పదవికి రాజీనామా చేయడం మంచిదన్నారు. చిత్తూరు జిల్లాలో కిలోమీటర్ల మేర మామిడి రైతు రాత్రి, పగలు అనేది తేడా లేకుండా ఎదురుచూస్తున్నాడని, వారికి మాత్రం పర్మిట్లు ఇవ్వడం లేదని విమర్శించారు. -
RK Roja: వీడియో కాల్ లో పరామర్శలు చేసే నువ్వు.... నీతులు మాట్లాడుతుంటే...
-
పవన్ ది EVM గెలుపే.. రోజా సంచలన వ్యాఖ్యలు
-
పవన్.. దమ్ముంటే వారిద్దర్నీ తొక్కిపెట్టి నార తీయాలి: రోజా
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణాపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ సభలకు జనం రాకుండా చేయాలనేది ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సూపర్ సిక్స్ హామీలను గాలికొదిలేశారు. పాలనను పక్కన పడేసి దాడులు, అరాచకాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ జగన్‌ను ప్రజలు ఓడించలేదు.. ఈవీఎంల గోల్‌మాల్‌తో ఓడించారు. వైఎస్ జగన్ సభలకు జనం రాకుండా చేయాలనేది ప్రభుత్వ కుట్ర. అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలి. ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం వారి మాటల్లో కనిపిస్తుంది. మహిళల అక్రమ రవాణాపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు?. ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా పవన్ కల్యాణ్. మరి ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌ను తొక్కిపెట్టి నార తీయాలి కదా’ అని ప్రశ్నించారు. -
చిన్న పిల్లలకు కూడా రక్షణ లేదు.. మంత్రి అనితకు రోజా కౌంటర్
-
‘జగనన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు’
తిరుపతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. జగనన్న ఎక్కడకు వెళ్లినా సముద్రంలా జనప్రవాహం వస్తోందన్నారు రోజా. అదే సమయంలో ఈవీఎం ప్రభుత్వం అని ఇప్పటికే ప్రజల్లో చర్చ మొదలైందన్నారు. ‘కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలుకు దిగుతున్నారు, కేసులు పెడుతున్నారు. జూన్ 18న జగనన్న కాన్వాయ్ ముందు చనిపోయారు అంటూ ఎస్పీ చెప్పారు, జూన్ 22 తేదీ నాటికి ఎస్పీ చేత అబద్ధం చెప్పించారు. కల్తీ నెయ్యి ఘటనలో ఈవో ముందు నిజాలు మాట్లాడిన తర్వాత మాట్లాడించారు, ఆ తర్వాత వారం రోజుల్లో ఎలా వెంటనే మాట మార్చారు అనేది ప్రజలు గమనించారు. ఏడాది గా జరుగుతున్న ఘటనలపై కూడా కేసులు పెట్టాలి. సింహాచలం గోడ ఘటనలో అద్భుతమైన ఏర్పాట్లు చేశాం అన్నారు హోం మంత్రి, గోడ కూలి భక్తులు చనిపోయిన ఘటనపై హోం మంత్రిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?, గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ లో బైక్ స్టంట్ లు చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు విని ఇద్దరు చనిపోయారు. దీనిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?, ఏడాది పాలనలో మీ ప్రభుత్వంలో మీటింగ్‌లకు ప్రజలు రావడం లేదు. జగనన్న మీటింగ్‌లకు పొలాల్లోంచి పరుగులు పెడుతూ జనం వస్తున్నారు. మీరు విడుదల చేసిన క్లిప్‌లో ముందు, వెనుక వీడియా విడుదల చేయాలి. జగనన్న ప్రజల మనిషి. కోవిడ్ సమయంలో ప్రజల ప్రాణాలు ఎలా కాపాడారో ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు. మానవత్వం లేని వాళ్లు మీరు, మీ కుమారుడు, అబద్ధాలతో ఓట్లు వేయించుకున్నారు’ అని ఆర్కే రోజా మండిపడ్డారు. -
Yuvatha Poru: రోజా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
-
జనం గుండె ‘జగన్.. జగన్.. జగన్’ అంటూ ధ్వనిస్తోంది : రోజా
సాక్షి,గుంటూరు: వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల చేరుకున్నారు. రెంటపాళ్లలో కూటమి నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం, నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన వేళ కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకుల్ని సృష్టించింది. పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంది. భారీ కేడ్లు, చెక్ పోస్టులతో వైఎస్ జగన్ అభిమానుల్ని, వైఎస్సార్సీపీ శ్రేణుల్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ వైఎస్ జగన్‌పై తమకు ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని అభిమానులు, శ్రేణులు నిరూపించారు.తమ అభిమాన నాయకుడు రెంటపాళ్లకు వస్తున్నారనే సమాచారంతో సత్తెనపల్లితో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి వైఎస్సార్సీపీ అభిమానులు,పార్టీ శ్రేణులు రెంటపాళ్లవైపు కదిలారు. జనప్రభంజనంలా తరలివచ్చారు. వెల్లువలా వచ్చిన ప్రజలతో సత్తెనపల్లి నియోజకవర్గం జనసంద్రంలా మారింది. ప్రభుత్వం ఆంక్షలు సైతం వైఎస్ జగన్‌పై ప్రజలు చూపిస్తున్న అభిమానాన్ని అడ్డుకోలేకపోయాయి. ఈ క్రమంలో వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనపై అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఎక్స్ వేదికగా స్పందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలని అనుకున్నారు. అభిమానులను ఆపాలని చూశారు. అడ్డుకట్ట వేయాలని యత్నించారు. షరతులు విధించారు.. ఆంక్షలు పెట్టారు.. బెదిరింపులకు దిగారు.. నోటీసులు ఇచ్చారు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ వైఎస్ జగన్ అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారు. అభిమాన తరంగాలను ఆపలేకపోయారు.“రోడ్లు మూసేశారా? మాకేం!”“పోలీసులు అడ్డుపడుతున్నారా? మాకేం!”మన గుండెల్లో ‘జగన్.. జగన్.. జగన్’ అంటూ ధ్వని మారుతోంది.మన నరాల్లో ప్రవహించే రక్తం, జననేతను ఒక్కసారి చూడాలనే తపనతో ఉప్పొంగుతోంది.అందుకే..పొలాల గట్లే రోడ్లయ్యాయి,పొలాల బాటలే ఎర్ర తివాచీలయ్యాయి,ముళ్ల దారులే హైవేలయ్యాయి.అభిమానులు పోటెత్తారు!“తగ్గేదేలే!” అంటూజగన్ను ఒక్క చూపైనా చూడాలన్న ఆశతోఇలా బయలుదేరారు… వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలని అనుకున్నారు. అభిమానులను ఆపాలని చూశారు. అడ్డుకట్ట వేయాలని యత్నించారు. షరతులు విధించారు.. ఆంక్షలు పెట్టారు.. బెదిరింపులకు దిగారు.. నోటీసులు ఇచ్చారు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ @ysjagan అభిమాన సునామీని మాత్రం అడ్డుకోలేకపోయారు. అభిమాన… pic.twitter.com/StMxCxf2az— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025 -
RK Roja: కొడుకు ముందే తల్లిని కట్టేసి కొడుతుంటే..
-
బాబూ.. ప్రజాదరణ ఉన్న జగనన్నను అడ్డుకుంటారా?: రోజా
సాక్షి, నగరి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. టీడీపీ కార్యర్తలు చనిపోయినప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామర్శించలేదా చంద్రబాబు అని ప్రశ్నించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా..‘కూటమి ప్రభుత్వ వేధింపులు భరించలేక వైఎస్సార్సీపీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ గారు పరామర్శించడానికి వెళ్లడం తప్పా?. చంద్రబాబు గారూ.. మీ పార్టీ కార్యర్తలు చనిపోయినప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామర్శించలేదా?. ఆంక్షలు పెట్టి ప్రజాదరణ కలిగిన నాయకుడిని అడ్డుకోవాలని చూడటం ఏ మాత్రం కరెక్టు కాదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మీ ప్రభుత్వ వేధింపులు భరించలేక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన కుటుంబాన్ని వైయస్ జగన్ గారు పరామర్శించడానికి వెళ్లడం తప్పా @ncbn గారూ? మీ పార్టీ కార్యర్తలు చనిపోయినప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామ…— Roja Selvamani (@RojaSelvamaniRK) June 18, 2025 -
‘ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే రక్షణ?’
తాడేపల్లి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక మహిళన చెట్టుకు కట్టేసిన అమానుష ఘటనపై మాజీ మంత్రి, ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చే రక్షణ ఇదేనా? చంద్రబాబు సర్కారును నిలదీశారు. చివరికి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే మహిళలకు భద్రత లేదని ధ్వజమెత్తారు. ‘రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. ఒక మహిళని చెట్టుకు కట్టేసి కొడితే ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?, ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే రక్షణ?, మహిళలపై అఘాయిత్యాలు చేస్తే అదే చివరి రోజని చంద్రబాబు బడాయి మాటలు చెప్తున్నారు. మరి ఆయన సొంత నియోజకవర్గంలో దారుణం జరిగితే చంద్రబాబు ఏం చేస్తున్నారు?, రాష్ట్రమంతా అరాచకం రాజ్యమేలుతోంది. మహిళ హోంమంత్రిగా ఉండికూడా ఉపయోగం లేదు. కుప్పం బాధిత మహిళను పరామర్శించే సమయం కూడా హోంమంత్రికి లేదా?, వీడియో కాల్ చేసి మాట్లాడటం హోంమంత్రి అహంకారానికి నిదర్శనం’ అని మండిపడ్డారు ఆర్కే రోజా. -
చంద్రబాబుపై RK రోజా పంచులు
-
మీడియా ముందు తొడలు కొట్టడం కాదు.. నారా లోకేష్ కి రోజా ఛాలంజ్
-
నువ్వు లోకేశా లేక జోకేశా.. ప్యాకేజీ స్టార్ నీతులు..
-
నీట్ లో ప్రతిభ చూపిన విద్యార్థిపై రోజా ప్రశంసలు
-
తల్లికి వందనం పథకంపై చంద్రబాబుకు సూటి ప్రశ్నలు
-
తల్లులను మోసగించిన మిమ్మల్ని ఏమనాలి బాబూ?: ఆర్కే రోజా
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కార్ మోసాలను ఎక్స్ వేదికగా మాజీ మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. ‘‘సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేశామని, ఇకపై వాటి గురించి ప్రశ్నిస్తే, నాలుక మందమని అనుకోవాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు ఇటీవల అన్నారు. ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం కింద రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి, అడ్డగోలు షరతులతో కొందరికే పథకాన్ని పరిమితం చేశారు. తల్లులను మోసం చేసిన మిమ్మల్ని ఏమనాలి చంద్రబాబూ’’ అంటూ ఆర్కే రోజా దుయ్యబట్టారు.‘‘ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాల కోసం ఆచరణ సాధ్యం కాని హామీల్ని ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో పథకాన్ని నీరుగార్చుతున్నారు. సూపర్ సిక్స్ పథకాల్ని అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు షరతులతో వాటికి కోత విధిస్తుండడం నిజం కాదా?. తాజాగా తల్లికి వందనం పథకాన్ని ఏకంగా ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్రీయ విద్యాలయం (KV) విద్యార్థుల్ని మొత్తానికి మొత్తం అనర్హులుగా చేయడం నిజం కాదా?’’ అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.‘‘గతంలో జగనన్న హయాంలో కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న విద్యార్థుల ప్రతి తల్లీకి అమ్మ ఒడి లబ్ధి చేకూర్చాం. ఆ వివరాలు ప్రభుత్వం దగ్గర అధికారికంగా ఉన్నాయి. కానీ ఎగ్గొట్టే కుట్రతో యూడైస్ ప్లస్ నుంచి కేవీ సంస్థలను కట్ చేసినట్టు, దాంతో తాము తల్లికి వందనం పథకానికి దూరమవుతున్నామని తల్లులు వాపోతున్నారు...పేరుకు అందరికీ పథకాన్ని అమలు చేస్తున్నామంటూ, మరోవైపు ఎగ్గొట్టారనేందుకు మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలాంటి విన్యాసాలు మున్ముందు కూటమి ప్రభుత్వం ఇంకెన్ని చేస్తుందో అనే ఆందోళన ప్రజల్లో వుంది. అందుకే జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం అని ప్రజలు అనుకుంటున్నారు.’’ అని ఆర్కే రోజా ట్వీట్ చేశారు. -
డ్యాన్స్ మాస్టర్ కోసం వెళ్లిన రోజా, మీనా, రంభ, దేవయాని (ఫోటోలు)
-
కొమ్మినేనిని అరెస్ట్ చేయడం రెడ్ బుక్ పాలనకు పరాకాష్ట: రోజా
-
ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది: రోజా
-
‘మహిళా హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపై దారుణాలు’
చిత్తూరు జిల్లా: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై ఇన్ని అరాచకాలు జరుగుతుంటే హోంమంత్రి అనితకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. అధికారంలో ఉన్నవాళ్లు లా అండ్ ఆర్డర్ కాపాడాలని, మరి అటువంటిది అధికారంలో ఉన్నవాళ్లే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ రోజు(మంగళవారం, జూన్ 10) ఆర్కే రోజా మాట్లాడుతూ.. ‘మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలు పై దారుణాలు జరగడం సిగ్గుచేటు. నగరి నియోజకవర్గం లో మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. అనంతపురం జిల్లా ఇంటర్ విద్యార్ధి కనిపించకపోతే పట్టించుకోలేదు. పరిటాల సునీత నియోజకవర్గంలో 14 మంది టీడీపీ వాళ్లు మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే సాక్షి మీడియా బయటకు తీసుకు వచ్చింది. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ మహిళలు పై దాడులు జరుగుతుంటే పట్టించుకోవడం లేదు. హోం మంత్రి అనిత నా చేతిలో గన్ ఉందా, నాకు పవర్ ఉందా.. అంటూ చేతకాని మాటలు మాట్లాడుతూ ఉంటే రాజీనామా. చేయాలి. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు పై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దారుణం. క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే మొదటగా చంద్రబాబు చెప్పాలి, ఆడబిడ్డ పుట్టుక గురించి తప్పుగా మాట్లాడిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టాలి, లేదంటే కడుపున చేయాలి అని మాట్లాడిన బాలకృష్ణ పై కేసు పెట్టాలి అన్న ఆయనపై కేసు పెట్టాలి’ అని రోజా తెలిపారు. జగన్ అన్న లండన్ వెళ్తే తప్పుడుడు వాఖ్యలు చేసిన నారా లోకేష్ పై ముందు కేసు పెట్టాలి. మూర్తి, రేణుక చౌదరి మాట్లాడిన మాటలు పై ఎందుకు కేసు నమోదు చేయాలేదు. బి.ఆర్.నాయుడు పై ఎందుకు కేసు పెట్టలేదు. కొమ్మినేని శ్రీనివాసరావు పై ఎప్పటి నుంచో కక్ష గట్టి చంద్రబాబు అరెస్ట్ చేయించారు. జూన్ 6 తేదీ ఈ డిస్కషన్ జరిగింది, కొమ్మినేని క్షమాపణ చెప్పారు. లోకేశ్, చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేశారు. ఒక పథకం ప్రకారం యాక్షన్ ప్లాన్ తో సాక్షి పైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పై బురద జల్లారు. ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారం చేయించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడుతోంది’ అని ధ్వజమెత్తారు ఆర్కే రోజా. -
ప్రజల చేతికి చిప్ప తప్పు... బాబు, లోకేష్ పై రోజా సంచలన వ్యాఖ్యలు
-
కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు రోజా
-
కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తా
సాక్షి,నగరి: ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తామని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినం కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో నగరి నిర్వహించిన వెన్నుపోటు దినంలో ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంత వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. ప్రజల్ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసాలపై ఆర్డీఓకి అర్జీ ఇచ్చాం. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి.రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచేయాలి. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్ష పాలన కరువైయింది. విద్యార్థులను,మహిళలను వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఆంద్రప్రదేశ్‌గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఎన్నికల ముందు ఊగిపోయినా పవన్ కళ్యాణ్ నేడు మహిళలపై దారుణాలు జరుగుతున్న మాట రావడం లేదు.పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న చొరవ ప్రజలపై లేదు.పదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నెరవేర్చలేని నారా లోకేష్ పప్పు. రెడ్ బుక్ రాజ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలి.కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం’అని హెచ్చరికలు జారీ చేశారు. -
చెవిలో పూవ్వులతో వెన్నుపోటుదినం RK రోజా మాస్ ర్యాగింగ్
-
కాకాణి గోవర్ధన్‌రెడ్డి అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం
-
ఆ ఘటన తీవ్రంగా కలిచివేసింది: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: కంబాల దిన్నె గ్రామంలో అభం శుభం తెలియని మూడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి.. హత్య చేసిన సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై మానవ మృగాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నా.. ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. బాలికను హత్య చేసిన నీచుడు రహమతుల్లాను కఠినంగా శిక్షించాలి. బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలి’’ అని ఆర్కే రోజా ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.వైయస్ఆర్ జిల్లా, కంబాలదిన్నె గ్రామంలో అభంశుభం తెలియని మూడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి హత్య చేసిన సంఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై మానవ మృగాళ్లు అఘాయిత్యాలకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది.… pic.twitter.com/d7nJHV37Z6— Roja Selvamani (@RojaSelvamaniRK) May 24, 2025 -
చంద్రబాబు పాలనాపై ఆర్కే రోజా కామెంట్స్
-
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ట్రోల్స్ పై రోజా క్లారిటీ
-
విజన్ కాదు, విస్తరాకుల కట్ట.. బాబుపై నిప్పులు చెరిగిన రోజా
-
'చంద్రబాబు నిజ స్వరూపం మరోసారి బట్టబయలు'
సాక్షి, తాడేపల్లి: హామీలు అమలు చేయలేక ప్రజా సమస్యలను డైవర్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లేనిపోని హామీలిచ్చారని.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నేతలు ఎవరూ భయపడరని ఆర్కే రోజా అన్నారు.దమ్ముంటే ఫైబర్ నెట్, స్కిల్ స్కామ్‌పై విచారణ జరిపించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు పెట్టిన మొదటి సంతకం ఎందుకు అమలు కాలేదు?. చంద్రబాబు మొదటి సంతకం చిత్తు కాగితంతో సమానం. గ్రామాల్లోకి టీడీపీ నేతలు వెళ్ళే ధైర్యం ఉందా?. డైవర్షన్ డర్టీ కేసులతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసే వాళ్లు భవిష్యత్‌లో జైలులో ఉంటారు. పోలీసు అధికారులకు హైకోర్టు అనేకసార్లు అక్షింతలు వేసింది. రాష్ట్రాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నాడని గతంలో మోదీనే చెప్పారు’’ అని ఆర్కే రోజా గుర్తు చేశారు.‘‘అమరావతిలో 36 వేల కోట్ల టెండర్లు.. 77 వేల కోట్లకు ఎందుకు పెంచారు?. అమరావతి టెండర్ల అంచనాలు పెంచి దోపిడీకి సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు ఆయన మనుషులు తప్పితే ఎవరూ అభివృద్ధి చెందకూడదా?. అమరావతి రాజధాని టెండర్లపై ప్రధాని మోదీ విచారణ జరిపించాలి. రూపాయి కూడా అవినీతి లేకుండా వైఎస్ జగన్ లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చారు. చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా? తెలంగాణకు ముఖ్యమంత్రా?. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’’ అని రోజా ఎద్దేవా చేశారు...చంద్రబాబు మళ్లీ తన నిజ స్వరూపం చూపిస్తున్నారు. డైవర్షన్ రాజకీయాలతో కాలం గడుపుతున్నారు. రైతుల వెన్నుముక విరిచేశారు. ల్యాండ్, లిక్కర్, మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు డర్టీ డైవర్షన్ పాలిటిక్స్‌కి నిదర్శనం. తప్పు చేయని పీఎస్ఆర్ని అరెస్టు చేయటం దారుణం. కొందరు పోలీసులు తీవ్రమైన తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన వారెవరినీ వదిలిపెట్టేదే లేదు. అలాంటి వారందరినీ జైలుకు పంపుతాం. స్కిల్ కేసులో అక్రమాలు చేసి చంద్రబాబు అరెస్టు అయ్యారు. ఆయన తప్పులను ఈడీ కూడా గుర్తించి కొందరిని అరెస్టు చేసింది. ఆ కేసును చంద్రబాబు ఎందుకు తొక్కి పెట్టారు?. చంద్రబాబుకు దమ్ముంటే తన కేసులపై సీబిఐ విచారణ జరిపించండి..చంద్రబాబు సంతకాలకు విలువ లేదు. నాలుగోసారి సీఎం అయినా మొదటి సంతకానికే దిక్కులేదు. హామీలు అమలు చేయలేని పాలకులు జనంలోకి వెళ్తే జనం వెంటపడి కొడతారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ మీద విష రాజకీయాలు చేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అమరావతిలో గతంలో రూ.36వేల కోట్లతో టెండర్లు వేశారు. ఇప్పుడు అవే పనులకు రూ.76 కోట్లకు ఎలా పెంచారో ప్రధాని గుర్తించాలి. రాజధానిలో ఆయన మనుషులు, ఆయన కులంవారు తప్ప మరెవరూ ఉండకూడదా?. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండకూడదా?. దేశంలోనే అత్యధిక ధనిక సీఎంగా చంద్రబాబు ఎలా అయ్యారో జనానికి తెలుసుకుప్పంలో చంద్రబాబు ఎందుకు ఇల్లు కట్టు కోలేదు?. అమరావతిలో మాత్రమే ఇల్లు కట్టుకోవడం వెనుక కారణం ఏంటో జనానికి చెప్పాలి. వీకెండులో చంద్రబాబు, పవన్ కల్యాణ్ హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు?. చంద్రబాబుది విజన్ కాదు.. విస్తరాకుల కట్ట. ఆయనపై ఉన్న కేసులను విచారిస్తే ఎవరు విజనరీనో, నేరస్తుడో తేలుతుంది. ప్రధాని మోదీ.. చంద్రబాబు అక్రమాలపై విచారణ జరపాలి. అమరావతిలో శంకుస్థాపనకు వచ్చినప్పుడు ప్రధాని.. చంద్రబాబు మీద విచారణకు ఆదేశించాలి. అడ్రెస్ కూడా లేని ఉర్సా కంపెనీకి 60 ఎకరాల భూమిని ఎలా ధారాదత్తం చేశారు?. దావోస్ వెళ్తే ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టటానికి రాలేదు. కానీ ఊరూ పేరు లేని కంపెనీలకు భూములు ఇవ్వటం వెనుక కారణాలేంటి?ఉర్సా భూముల కేటాయింపును వెంటనే ఆపేయాలి. టీటీడీ గోశాలలో 191 ఆవులు చనిపోతే అసలేమీ చనిపోలేదని చంద్రబాబు నిస్సిగ్హుగా మాట్లాడుతున్నారు. గోవుల మృతిపై ఛాలెంజ్‌లు చేసి వెనక్కు వెళ్లారు. తిరుమలలో తాగి మర్డర్లు చేసుకునే పరిస్థితులు తలెత్తాయి. శ్రీకూర్మంలో తాబేళ్లు చనిపోవటం అనర్ధం. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?. తిరుమల, శ్రీకూర్మం ఘటనలపై ఎందుకు నోరు మెదపటం లేదు?. చంద్రబాబు చేస్తున్న తప్పులు బీజేపీకి కనపడటం లేదా?. జగన్ అధికారంలోకి వచ్చాక 43 వేల మద్యం బెల్టుషాపులు తొలగించాం. మద్యం షాపులను బాగా తగ్గించాంమద్యం షాపులు పెంచితే లంచాలు వస్తాయా? తగ్గిస్తే వస్తాయా?. మిథున్‌రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అసలు మద్యం పాలసీకి, మిథున్‌రెడ్డి కి ఏం సంబంధం?. చంద్రబాబు లక్ష కోట్లు రాజధానిలో పెట్టి, కమీషన్లు కొట్టేస్తున్నారు. చంద్రబాబు లిక్కర్ పాలసీ వలనే మహిళలపై ఘోరాలు జరుగుతున్నాయి. రాజకీయాల కోసం భగవంతుడిని వాడుకుంటే కష్టాలు తప్పవని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రహించాలి. పిఠాపురంలో మహిళపై అత్యాచారం జరిగినా పవన్ పట్టించుకోలేదు. దళితులను వెలేసినా పట్టింపులేదు. చంద్రబాబుకు కష్టం, నష్టం వచ్చినప్పుడు మాత్రమే పవన్ బయటకు వస్తారు’’ అంటూ ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
గోశాలకు వెళ్లకుండా భూమనను అడ్డుకున్న పోలీసులు
-
ట్వీట్ పెట్టి పారిపోవడం కాదు.. రోజా వార్నింగ్
-
RK Roja: పవన్ కళ్యాణ్... దమ్ముంటే రండి
-
గోశాలకు వెళ్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారు?: రోజా
-
చంద్రబాబుపై ఆర్కే రోజా ఫైర్
-
గెట్ వెల్ సూన్ చిన్నబాబు.. పవన్ తనయుడికి ప్రమాదంపై రోజా స్పందన
తిరుపతి, సాక్షి: పవన్ కల్యాణ్ తనయుడు సింగపూర్‌లో ప్రమాదానికి గురికావడంపై అటు సినీ, ఇటు రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ క్రమంలో.. ఆ చిన్నారి ప్రమాదానికి గురికావడం తనను కలిచివేసిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అంటున్నారు.ఈరోజు పవన్‌కల్యాణ్‌గారి చిన్నబాబు మార్క్ శంకర్(Mark Shankar) ప్రమాద వార్త నా మనసుని ఎంతో కలచివేసింది.ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ ఆరోగ్యంతో కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అని రోజా ట్వీట్ చేశారు. ఈరోజు @PawanKalyan గారి చిన్నబాబు మార్క్ శంకర్ ప్రమాద వార్త నా మనసును ఎంతో కలచివేసింది. ఆ చిన్నారి త్వరగా కోలుకొని, దీర్ఘాయుష్ మరియు ఆరోగ్యంతో కుటుంబంతో కలసి ఆనందంగా గడపాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.#Getwellsoon— Roja Selvamani (@RojaSelvamaniRK) April 8, 2025ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 9,45గం. ప్రాంతంలో రివర్ వ్యాలీ రోడ్ ఎడ్యుకేషన్ సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బడిలో 80 మంది పిల్లలు ఉన్నారు. అరగంటపాటు శ్రమించి ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మరణించగా.. 15 మంది పిల్లలు, నలుగురు స్టాఫ్ గాయపడ్డారు. ఈ ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. దీంతో ఈ ఘటన అంతలా హైలైట్ అయ్యింది. పవన్-అన్నాలెజినోవాల చిన్న కొడుకే మార్క్ శంకర్ పవనోవిచ్(mark shankar pawanovich). ఈ ప్రమాదంలో ఆ చిన్నారి చేతికి, కాళ్లకు గాయాలయ్యాయని.. పొగ కారణంగా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడ్డాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అతని ఆరోగ్యకరంగానే ఉన్నట్లు సమాచారం. -
షర్మిల.. జగనన్నను ఇబ్బందిపెట్టడమే మీ అసలు గమ్యం: రోజా
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, కాంగ్రెస్ నాయకురాల షర్మిలపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమతో తాముగా చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి బెయిల్ వచ్చేలా చేసి, వారిని నిరంతరం కాపాడుతూ, ఇప్పుడు వారినే హీరోలుగా చూపిస్తున్నారని అన్నారు. ఈ కేసులో నిర్దోషులను బలిచేయాలన్న ఆరాటం ఎందుకు? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా..‘షర్మిళ ప్రెస్మీట్లో మాట్లాడిన విషయాలు చూశాం. ఒకరిపై అసూయ, ద్వేషంతో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసే వారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలి?. వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమతో తాముగా చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి బెయిల్ వచ్చేలా చేసి, వారిని నిరంతరం కాపాడుతూ, ఇప్పుడు వారినే హీరోలుగా చూపిస్తున్నారు. ఒకప్పుడు వేల రూపాయలకూ అప్పులు చేసిన వారు ఇప్పుడు లక్షాధికారులు అయ్యారు – ఇది ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తోంది షర్మిల.వివేకాగారి హత్య జరిగినప్పుడు అధికారంలో చంద్రబాబే ఉన్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించమన్నదీ, విచారణను పక్క రాష్ట్రానికి మార్చమన్నదీ మీరే. ఇప్పుడు అధికారంలో మీ చంద్రబాబే ఉన్నా, ఏడుపు మాత్రం మీదే. నిర్దోషులను బలిచేయాలన్న ఆరాటం ఎందుకు?. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం రూపొందించిన కుట్రలో మీరు ఓ సాధనంగా మారిన మాట వాస్తవం కాదా, షర్మిళగారు? దీని భాగంగానే మీరు నిర్దోషులపై బురదజల్లుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.చంద్రబాబుకు మేలు చేయాలన్న మీ తాపత్రయం, మీ లక్ష్యం, మీ ఉద్దేశం ప్రజలకు పూర్తిగా అర్థమవుతోంది. చివరికి, మీ అన్నగారిని ఇబ్బందిపెట్టడమే మీ అసలు గమ్యం. బాబు కక్ష రాజకీయాల్లో మీరు మరో కోణంగా మారిన విధానం ప్రజలు గమనిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. షర్మిళగారు ప్రెస్మీట్లో మాట్లాడిన విషయాలు చూశాం...ఒకరిపై అసూయ, ద్వేషంతో @ncbn చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసే వారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలి?వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమతో తాముగా చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి…— Roja Selvamani (@RojaSelvamaniRK) April 3, 2025 -
RK Roja: చంద్రబాబు ప్రతి రోజు రాష్ట్ర ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు
-
లోకేష్.. దమ్ముంటే వారితో సెల్ఫీ తీసుకో చూద్దాం?: రోజా సీరియస్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే మాటలకు.. చేసే పనులకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్‌కు ఉందా? అని సవాల్ విసిరారు.మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్ర ప్రజలను చంద్రబాబు ఏప్రిల్ ఫూల్ చేశారు. ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారు. మూడు లక్షల మందికి పెన్షన్లను తొలగించి వారిని ఇబ్బంది పెడుతున్నారు. జనాన్ని ఫూల్స్ చేయటమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వలంటీర్లు, నిరుద్యోగులను ఫూల్స్ చేసి రోడ్డున పడేశారు. అమ్మ ఒడి ఇవ్వకుండా తల్లులు, పిల్లలను ఫూల్స్ చేశారు. ఉచిత బస్సు పేరుతో మహిళలను ఫూల్స్ చేశారు. సూపర్ సిక్స్ ఇవ్వటం కష్టంగా ఉందని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చంద్రబాబుకు సూపర్ సిక్స్ ఇవ్వటం చేతకాకపోతే పదవిలో నుండి దిగిపోవాలిలక్షా 52 వేల కోట్ల అప్పులు చేసి విజనరీగా చెప్పుకుంటున్నారు. చెత్త సీఎంగా చంద్రబాబు చరిత్ర సృష్టించారు. రూ.15లక్షల కోట్ల అప్పులు చేశారంటూ వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేశారు. చివరికి తాను చేసింది తప్పుడు ఆరోపణలని అసెంబ్లీలోనే చంద్రబాబు అంగీకరించారు. హామీలు ఇచ్చి జనాలను ఫూల్స్ చేశారు. రైతులకు భరోసా లేదు, గిట్టుబాటు ధర అసలే లేదు. మీరు అబద్దాలు మాట్లాడి, ఎల్లో మీడియాతో అబద్దాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే గంజాయి పండిస్తున్నారు.ఈవీఎంలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోయారు. కరువుతో జిల్లాలకు జిల్లాలు అల్లాడిపోతున్నాయి. మంత్రి నారా లోకేష్ కామెడీ పాదయాత్ర చేశారు. పెట్రోలు బంకులు, షాపుల దగ్గర సెల్ఫీలు తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ వాటి దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము ఉందా?. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఎక్కడపడితే అక్కడ గంజాయి సాగు జరుగుతోంది. చంద్రబాబు నివాసానికి సమీపంలోనే లిక్కర్ బెల్టుషాపులు ఉన్నాయిరాజమండ్రిలో యువతి ఆత్మహత్యాయత్నం విషయంలో టీడీపీ కుట్రలు చేసింది. దీపక్ అనే నిందితుడు టీడీపీ లీడర్లకు ముఖ్య అనుచరుడు. ఆస్పత్రి కూడా టీడీపీ నేతలదే. అక్కడ సీసీ పుటేజీని ఎవరు మాయం చేశారో ఎందుకు తేల్చలేదు?. యువతి చావు బతుకుల మధ్య ఉంటే ఏజీఎం మీద చర్యలేవీ?. సూసైడ్ లెటర్ దొరికింది కాబట్టి ఏజీఎం అసలు గుట్టు బయటపడింది. బాధిత యువతికి మెడిసిన్ ఎవరు ఎక్కించారు?. ఆ అమ్మాయి జీవితంతో దీపక్ అనేవాడు ఆడుకున్నాడు.త్రిపురాంతకంలో ఎంపీటీసీ సృజనను కిడ్నాప్ చేశారు. మూడు రోజుల పాటు ఆమెను గదిలో బంధించారు. మొన్నటి జడ్పీ, ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్ జగన్‌కు నిజమైన సైనికులుగా నిలబడి మావారు పని చేశారు. రెడ్ బుక్కు భయపడలేదు. పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలలాగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లాగా తయారు అయ్యారు. రూల్స్‌కు విరుద్ధంగా పనిచేస్తే పోలీసులు పర్యావసానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్యాయం చేసిన వారికి పోలీసులు అండగా ఉండొద్దు.రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామంటే ఊరుకోం. పీ-4 కార్యక్రమం వలన చంద్రబాబు కుటుంబమే బాగుపడుతుందే తప్ప ప్రజలు కాదు. తిరుమలలో మద్యం, గంజాయి దొరుకుతుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడకు వెళ్లాడు?. తిరుపతి మెట్లు కడిగి ఎందుకు పాశ్చాత్య పడలేదు?. రాజమండ్రి ఘటనపై ఎందుకు స్పందించటం లేదు?. వెకిలి నవ్వులు నవ్వుతూ పవన్ ఎక్కడ దాక్కున్నారు?. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపి ముస్లిం సమాజాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసం చేశారు. వారిద్దరికీ సరైన సమయంలో ముస్లింలు గుణపాఠం చెబుతారు. వైఎస్సార్సీపీలోని స్ట్రాంగ్ లీడర్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నన్ను అరెస్టు చేసి సంబరాలు చేసుకోవాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు’ అని కామెంట్స్ చేశారు. -
LIVE: ఆర్కే రోజా ప్రెస్ మీట్
-
కూటమి హయాంలో దేవదేవుడికే నిద్ర లేకుండా పోతుంది: రోజా
-
బాబూ.. శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నావ్: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పోతుంది! అని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తిరుమలలో స్వామి వారి దర్శనానికి సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. భగవంతుడికి విశ్రాంతి సమయం కూడా లేకుండా చేస్తున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవదేవుడికి కూడా నిద్ర లేకుండా పోతుంది!. సంప్రదాయం ప్రకారం, భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. అది భగవంతుడి కోసమే కాకుండా, మన కోసమూ. సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు.వైఎస్ జగన్ పాలనలో రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేవి. కానీ, ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ, భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దర్శనాల సంఖ్య 60వేల చుట్టూ పరిమితం చేస్తూ, రోజుకు 7 నుంచి 10 వేల బ్రేక్ దర్శనాలకు టీటీడీ ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత దూరమవుతోంది. సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి, డబ్బు ఉన్నవారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఇదేనా కూటమి సనాతన ధర్మం? పవన్, బీజేపీ. ఇది చంద్రబాబు నమూనా ప్రక్షాళన?. భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు!! అంటూ కామెంట్స్ చేశారు. -
‘తప్పుమీది కాదు.. తప్పు ఈవీఎంలదే’
నగిరి: ఏపీలో కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్సీపీ నేత , మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ‘కూటమి’ పాలనలో ఒక్కొక్క దానికి చరమగీతం పాడేస్తున్నారంటూ మండిపడ్డారు. మెడికల్ కాలేజీలకు మంగళం పాడేసిన కూటమి ప్రభుత్వం, భరోసా కేంద్రాలకు కూడా ఎత్తేస్తుందని, ఇప్పుడు ఇక బడుల వంతు అంటూ రోజా విమర్శించారు.‘మెడికల్ కాలేజీలకు మంగళం పాడేశారు, రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నారు.. ఇప్పుడు బడుల వంతు. అయినా..... ‘విద్య ప్రభుత్వ బాధ్యత కాదు’ అని ముందే మీరు చెప్పారు లెండి... తప్పు మీది కాదు.. తప్పంతా #EVM లదే !, ఐదు కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా..?, గ్రామంలో ఎన్ని బ్రాందీ షాపులైనా... ఎన్ని బెల్ట్ షాపులైనా ఉండవచ్చా...?, బాగుందాయ్యా ... బాగుంది !అని... ఊరంతా గుసగుసలాడుకుంటున్నారని తెలుస్తోంది!!’ అని రోజా ఎద్దేవా చేశారు.మెడికల్ కాలేజీలకు మంగళం పాడేశారు, రైతు భరోసా కేంద్రాలను ఎత్తేస్తున్నారు.. ఇప్పుడు బడుల వంతు !అయినా..... "విద్య ప్రభుత్వ బాధ్యత కాదు" అని ముందే మీరు చెప్పారు లెండి... తప్పు మీది కాదు.. తప్పంతా #EVM లదే !ఐదు కిలోమీటర్ల పరిధిలో గ్రామంలో ఒకే పాఠశాల ఉండాలా..?గ్రామంలో ఎన్ని…— Roja Selvamani (@RojaSelvamaniRK) March 17, 2025 నగిరిలో పరామర్శ కార్యక్రమాల్లో మాజీ మంత్రి రోజాఆర్కే రోజా నగిరి పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీబాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈరోజు(సోమవారం) విజయపురం మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీబాధిత కుటుంబాలను రోజా పరామర్శించారు. ఆయా గ్రామాల్లో అనారోగ్యంతో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న నాయకులకు రోజా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆయా బాధిత కుటుంబాలను రోజా పరామర్శించారు. -
పవన్ కు రోజా కౌంటర్
-
ఇంకా నయం ఇంటి చుట్టు వరకే ఫ్రీ బస్సు అనలేదు రోజా సెటైర్లే సెటైర్లు
-
కూటమి సర్కార్ పాలనలో మహిళలకు రక్షణ లేదు
-
నవ మాసాల్లో కూటమి నవ మోసాలను తెచ్చింది
గుంటూరు, సాక్షి: మహిళ అంటే కూటమి ప్రభుత్వానికి గౌరవమే లేదని.. అందుకే ఈ పాలనలో రక్షణ కరువైందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం(మార్చి 8న) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న రోజా.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్సార్సీపీ హయాంలో మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం. కానీ, కూటమి ప్రభుత్వం ఈ నవ మాసాల్లో నవ మోసాలు తీసుకొచ్చింది’’ అని అన్నారామె.‘‘ఏపీలో మహిళలు.. చంద్రబాబు మోసాలపై ఆగ్రహంతో ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారు. ఏపీలో చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న పంగనామం, చంద్రన్న వెన్నుపోటు మాత్రమే అమలవుతున్నాయి. సూపర్ సిక్స్ పేరుతో మహిళలను మోసం చేసి నట్టేట ముంచారు. మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. రోజుకు 70 మంది మహిళలు, వృద్దుల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. జగన్ హయాంలో దిశా పీఎస్‌లు, యాప్ తెచ్చి రక్షణ కల్పించారు. చంద్రబాబు మళ్లీ యాభై వేలకు పైగా బెల్టుషాపులు పెట్టారు’’ అని ఆర్కే రోజా మండిపడ్డారు.‘‘తల్లికివందనం పేరుతో మహిళలకు పంగనామం పెట్టారు. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం?. నిరుద్యోగ మహిళలు, యువతులను చంద్రబాబు మోసం చేశారు. మహిళలు తిరగబడతారని చంద్రబాబుకు అర్థమయ్యింది. అందుకే శక్తియాప్ పేరుతో యాప్‌ని తెస్తున్నారు. జగన్ తెచ్చిన దిశా యాప్‌ని చంద్రబాబు కాపీ కొట్టారు. మహిళా భద్రత గురించి కేబినెట్లో ఏనాడూ చర్చించలేదు. కానీ గంజాయి, మద్యం వ్యాపారుల ప్రయోజనాల గురించి చర్చించారు. చంద్రబాబు, అనిత సొంత నియోజకవర్గాల్లో గంజాయి విపరీతంగా అమ్ముతున్నారు. 30 వేలమంది మహిళలు అక్రమ రవాణా అయ్యారని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు?. మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం పవన్ కే చెల్లింది..సుగాలి ప్రీతి కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేక పోతున్నారు?. కేంద్రంలో కూడా మీ కూటమి ప్రభుత్వమే ఉన్నప్పుడు ఎందుకు సీబీఐ విచారణ చేయించలేకపోయారు?. కనీసం సుగాలి ప్రీతి తల్లికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు?. జనసేన నేతల చేతిలో మోసపోయిన మహిళలకి ఏం న్యాయం చేశారు?. మహిళా దినోత్సవం జరుపుకునే హక్కు పవన్ కళ్యాణ్‌కి లేదు. మహిళల కన్నీటి శాపనార్థాలకు కూటమి ప్రభుత్వం పతనం అవుతుంది. ఉచిత బస్సు పేరుతో అన్యాయం చేశారు. తగిన సమయంలో మహిళలే చంద్రబాబుకు బుద్ధి చెప్తారు’’ అని రోజా చెప్పారు. -
అక్రమ కేసులు.. కుట్ర రాజకీయాలు.. కూటమి నేతలపై రోజా ఫైర్
సాక్షి, చిత్తూరు జిల్లా: చిత్తూరు సబ్ జైలులో ఉన్న నగరి మండలం దేసురు అగరం టీడీపీ నాయకుల అక్రమ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న వైఎస్సార్సీపీ నేతలను మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తోందన్నారు. ‘‘వైఎస్సార్సీపీ నాయకులకు బెయిల్ వచ్చే లోపే.. మరో కేసు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పక్కన పెట్టి పీటీ వారెంట్, కేసులు అన్ని ఒకే చోట విచారించాలని చెప్తున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు.. కూటమి నేతలు చెప్పినట్లు ప్రవర్తిస్తే కచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు. రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీ అధికారంలో వస్తుంది. 9 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చేతకాని ప్రభుత్వంగా మారిపోయింది’’ అని రోజా దుయ్యబట్టారు.‘‘ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వం అభ్యర్ధిని ఓడించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మద్యం, వీధి వీధిలో బెల్ట్ షాపులు ఎక్కువై పోయాయి. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి సాగు చేస్తుంటే నిద్ర పోతున్నారా అని అడుగుతున్నా. హోం మంత్రి ఇంటికి సమీపంలో గంజాయి సాగు చేస్తున్నారు. రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా మారిపోయింది’’ అని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రెడ్ బుక్ పై పెట్టిన శ్రద్ధ.. మేనిఫెస్టోపై ఎందుకు లేదు: రోజా
-
చంద్రబాబు మీది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం
తిరుపతి జిల్లా: చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రా? టీడీపీకి ముఖ్యమంత్రా? అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. సోమవారం సత్యవేడు సబ్ జైల్లో ఉన్న తడకుపేట దళితులను ఆమె పరామర్శించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతున్నాయని పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడం దారుణం. అక్రమంగా 111 కేసు పెట్టి ,అక్రమంగా ఇరికించారు. ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడలేదా? వాళ్లపై ఇదే దేశద్రోహం సెక్షన్లు కింద కేసు నమోదు చేయగలరా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులకు ఎటువంటి సహాయం చేయొద్దని చంద్రబాబు చెప్పడం హేయమైన చర్య. వైఎస్సార్సీపీ శ్రేణులు కట్టే పన్నులను ప్రభుత్వం తీసుకోవడం లేదా? వైఎస్సార్సీపీకి ఓట్లు వేసిన వాళ్లపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు. చంద్రబాబుకు ఎదురు మాట్లాడినా, ఆయన చేసిన తప్పును ఎత్తి చూపినా సహించలేకపోతున్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. మంచి ప్రభుత్వమని స్టిక్కర్లేసుకోవడం తప్ప, మొన్న పెట్టిన బడ్జెట్‌తో ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వమని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. రెడ్‌బుక్ రాజ్యాంగంపై పెట్టిన శ్రద్ధ,మేనిఫెస్టో పైన ఎందుకు పెట్టడం లేదు? బటన్ నొక్కడానికి వైఎస్ జగన్ అవసరం లేదన్నారు. అదే బటన్‌ను చంద్రబాబు ఎందుకు నొక్కడం లేదు. చంద్రబాబు ఒక్క హామీని అమలు చేయలేదు. వైఎస్ జగన్ చేసిన ఏ ఒక్క హామీని ప్రజలకు చేరవేయడం లేదురెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ వాళ్లపై దాడులు చేయడం, అక్రమ కేసులతో రాష్ట్రాన్ని పాలిస్తామనుకుంటే రేపు అదే రిపీట్ అవుతుంది. వైఎస్ జగన్ వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారు. వైఎస్సార్సీపీకి సహాయం చేయొద్దన్నారంటే ఆయన ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రా? రాష్ట్రానికి ముఖ్యమంత్రా?చంద్రబాబుకు నొప్పి వస్తే పరిగెత్తే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే నోరెందుకు మెదపలేదు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు చూడండి. వైఎస్సార్సీపీ హాయంలో 30 వేల మహిళలు మాయమయ్యారన్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరినైనా తీసుకొచ్చారా? దానికోసం బడ్జెట్లో నిధులు కేటాయించి ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చు కదా?’అని మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. -
పోసాని అరెస్ట్ పై రోజా సంచలన వ్యాఖ్యలు
-
రష్యా అల్లుడివి కదా అందుకేనేమో... రోజా దిమ్మతిరిగే కౌంటర్
-
‘రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా ’
తాడేపల్లి : ఓట్ల శాతం ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలని అనుకుంటే గనుక జర్మనీకి వెళ్లాలంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్ కే రోజా(RK Roja) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా అంటూ రివర్స్ పంచ్ ఇచ్చారు ఆర్ కే రోజా. ఈరోజు(సోమవారం) తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన ఆర్ కే రోజా.. ఎవరికైనా మేలు చేయాలంటే అది వైఎస్ జగన్(YS Jagan) కే సాధ్యమన్నారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదా అడుగుతుంటే, దీనిపై పవన్ కళ్యాణ్ వంకరగా మాట్లాడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే రష్యా అల్లుడికి జర్మనీ గురించి బాగా తెలుసనుకుంటా అంటూ సెటైర్లు వేశారు రోజా. ఒకవేళ పవన్ కు ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఎదురుగా కూర్చొని ప్రశ్నించాలని రోజా సూచించారు. అసలు వైఎస్ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఎందుకంత భయమని ప్రశ్నించారు.‘‘అసెంబ్లీ(AP Assembly Sessions)లో గవర్నర్ తో కూడా చంద్రబాబు అబద్దాలు ఆడించారు సూపర్ సిక్స్ తోపాటు 143 హామీలను చంద్రబాబు ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఇరిగేషన్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. చంద్రబాబు ఈ ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పకుండా 2047 గురించి మాట్లాడుతున్నారు. టీడీపీ జనసేన సిండికేట్ అయి లిక్కర్ మీద రేట్లు పెంచారు.. జలగల్లాగ పీల్చుతున్నారు. విద్యత్ ఛార్జీల రూపంలో రూ.15 వేల కోట్ల భారాన్ని ప్రజలపై వేశారు. కానీ గవర్నర్ తో అసలు ఛార్జీలే పెంచలేదన్నట్టుగా మాట్లాడించారు. తల్లికివందనం కింద రూ.15 వేలు అని చెప్పి మోసం చేశారు. రైతులకు ఇస్తామన్న రూ.20 వేల గురించి మాట్లాడటం లేదు.చంద్రబాబు, కరువు కవల పిల్లలు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్నవాటినే తొలగించారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ ఏమీ లేకుండా పోయాయి. ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీలోనే తేల్చుకుంటాం . ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పిఏసీ పదవిని కూడా ఇవ్వలేదు. అంటే వారు చేసే అవినీతిని బయటకు రానీయకుండా చేసే కుట్ర చేశారు. టీవీ ఛానళ్లను కూడా అసెంబ్లీలోకి ఎందుకు రానివ్వటం లేదు? , కూటమికి భజన చేసే ఛానళ్లకే అనుమతులు ఇస్తారా?, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు గ్రూపు-2 అభ్యర్థులు రోడ్డు మీద చెప్పులతో కొట్టుకున్నారు. ప్రజలతో కలిసే పోరాటం చేసి కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొడతాం. మిర్చి రైతులను జగన్ కలిసేదాకా ప్రభుత్వం స్పందించలేదు. హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. గవర్నర్ మీద జగన్ కి గౌరవం ఉన్నందునే అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సొఙత డబ్బా కొట్టుకుంటున్నారు . అసెంబ్లీలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటం కూటమికే చెల్లింది’ అని రోజా ధ్వజమెత్తారు. -
కూటమి పాలనపై రోజా విమర్శనాస్త్రాలు
-
ర్యాంప్ వ్యాక్ చేసిన స్టార్ నటి కూతురు..గుర్తు పట్టారా ఎవరో..?
-
పోలీసులు చూస్తుండగానే కూటమి గూండాలు దాడులు చేశారు: రోజా
-
డిప్యూటి సీఎం పవనన్ను ఉద్దేశించి రోజా ట్వీట్
-
ఇప్పుడు అదే మాట పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు?: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. ‘‘గతంలో వైఎస్సార్సీపీ ఎంపీలను ఉద్దేశించి పవన్ చెప్పిన మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం.. రెండు కారం ముద్దలు తినండి, మరో రెండు కారం ముద్దలను ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి అని పవన్ అన్నారు. అప్పట్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉంది...అయినా సరే ఎప్పటికప్పుడు వైఎస్సార్సీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటాలు చేశారు. పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, విభజన చట్టంలో గల అంశాలు... మొదలైన వాటిపై డిమాండ్ చేస్తూనే వచ్చారు. అయితే... ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ, జనసేన ఎంపీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఊత కర్రల సాయంతో నడుస్తుంది.. ఇప్పుడు అదే మాటలను ఏపీ ఎంపీలకు పవన్ ఎందుకు చెప్పలేకపోతున్నాడు...?’ అంటూ ఎక్స్ వేదికగా రోజా ప్రశ్నించారు. గతంలో... వైసిపి ఎంపీలను ఉద్దేశించి పవన్ చెప్పిన మాటలను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం..రెండు కారం ముద్దలు తినండి , మరో రెండు కారం ముద్దలను ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి అని @PawanKalyan అన్నారు.అప్పట్లో ... కేంద్రంలో @BJP4India ప్రభుత్వం పూర్తి…— Roja Selvamani (@RojaSelvamaniRK) February 1, 2025 -
ఫీజు పోరు.. పోస్టర్ ఆవిష్కరించిన రోజా..
-
కూటమి ప్రభుత్వంలో విద్యార్ధులకు తీవ్ర ఇబ్బందులు
-
‘హామీలు అమలు చేయలేకపోతే కాలర్ పట్టుకోమన్నావ్ కదా లోకేష్’
సాక్షి, తిరుపతి : సూపర్ సిక్స్ అమలు చేయకపోతే నారా లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలని నారా లోకేష్‌ను మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ఫీజ్ రియింబర్స్‌మెంట్‌తో పాటు అన్ని పథకాలు ఆపేశారు. ఆరోగ్యశ్రీని నిలిపివేశారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారు. ఎన్నికలకు ముందు.. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ.. అధికారంలోకి వచ్చాక.. బాబు ష్యూరిటీ చీటింగ్ గ్యారెంటీ’ అని మండిపడ్డారు. శుక్రవారం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. విద్యార్థులకు చెల్లించాల్సిన 3900 కోట్లు చెల్లించలేదు, విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడెస్తున్నారు చంద్రబాబు,ఆయన ప్రభుత్వం. విద్యా దీవెన 2800 కోట్లు, వసతి దివెన 1100 కోట్లు బకాయిలు చెల్లించలేదు. విద్య తోనే భవిష్యత్తు అభివృద్ధి. పేద విద్యార్థుల విద్యకు దూరం చేస్తున్నారు.దీనిపై మంత్రులు వితండంగా మాట్లాడుతారు.చంద్రబాబు దిగిపోయేనాటి రూ.2800 కోట్లు బకాయిలు వైఎస్ జగన్ చెల్లించుకుంటూ వచ్చారు. పెదవాళ్లంటే చంద్రబాబుకు చిరాకు. వైఎస్సార్ తెచ్చిన ఫీజు రియంబర్సమెంట్కు తూట్లు పొడుస్తున్నారు. ఏడు నెలల్లో చేయూత, అమ్మవడి, నాడు నేడు , ఆరోగ్యశ్రీ,, వాలంటీర్ వ్యవస్థలంటికి మంగళం పాడారు. జగన్‌పై విమర్శలు చెయ్యడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదు. సూపర్ సిక్స్ అమలు చెయ్యకుంటే కాలర్ పట్టుకోమన్నారు నారా లోకేష్. ఏ కాలర్ పట్టుకోవాలి ఇప్పుడు.చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. ఎన్నికలకు ముందు తెలియదా ఇదంతా. బటన్ నొక్కడం పెద్ద విషయమా అన్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు హామీలు అమలు చెయ్యడం లేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు హామీలకు గ్యారంటీ ఇచ్చారు. నేడు పవన్ కళ్యాణ్ ఏమైయ్యారు. ఎందుకు నిలదియడంలేదు. నేను, నా కుమారుడు అధికారంలోకి వచ్చామ్ చాలు అన్నట్లుగా ఉంది చంద్రబాబు ప్రవర్తన. బాబు స్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు.. ఇప్పుడు దేనికి గ్యారంటీ లేదు. కూటమి ఓటు వేస్తే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తామని అన్నారు. ఈ రోజు ఇచ్చిన బాండ్ల కూడా పనికిరావు. రామానాయుడు సైకిల్ మీద ఇంటింటికి తిరిగి నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అన్నారు. నేడు ప్రజలను ఇబ్బందులలో నెట్టారు. చావు కబురు చల్లగా చెప్పినట్లు హామీలు అభివృద్ధి తర్వాతే అంటారు. జగన్ వల్లే హామీలు అమలు చెయ్యలేమని చేతకానీ మాటలు మాట్లాడుతున్నారు. మ్యానిఫెస్టో రూ.14 లక్షల కోట్లు అప్పు అన్నారు. రూ.6.5 లక్షల కోట్లు మాత్రమే అప్పుఅని అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పారు.. అబద్దాలతో అధికారంలోకి వచ్చింది కూటమీ ప్రభుత్వం.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. విద్యార్థుల విద్యాదీవెన, వసతి దీవెన చెల్లించకుంటే వారి తల్లిదండ్రులతో మీ మెడలు వంచుతాము. అభివృద్ధి అంటే వల్గర్ పోస్టులు పెట్టడం కాదు. మీకు చేతకాకపోతే జగన్ దగ్గర కోర్సు తీసుకొండి . పవన్ కళ్యాణ్ మీకే చెప్తున్నా... హామీలు అమలు చెయ్యకపోతే ప్రశ్నించరా? మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే సహించేది లేదు. వడ్డీతో సహా తిరిగి ఇస్తాం..తప్పు చేస్తే ప్రశ్నిస్తాం. ట్రోల్స్ చేస్తే వెనక్కి తగ్గుతామనుకున్నారేమో.. తగ్గేదేలే. పవన్ కూడా విద్యార్థుల బకాయిలు చెల్లించాలని సీఎం చంద్రబాబును ప్రశ్నించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. -
ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి కారణం అదే..!
-
రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్ బుక్ రాజ్యాంగమే కారణం
-
‘ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ‘రెడ్‌బుక్’ రాజ్యాంగమే’
సాక్షి, నగరి: పక్క రాష్ట్రాల్లో వేల కోట్ల పెట్టుబడులు (Investments) వచ్చాయని.. చంద్రబాబు(Chandrababu) ఖాళీ చేతులతో తిరిగి ఏపీకి వచ్చారని మాజీ మంత్రి ఆర్కే రోజా (RK Roja) అన్నారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏపీకి పెట్టుబడులు రాకపోవడానికి రెడ్‌బుక్ రాజ్యాంగమే కారణమన్నారు. చంద్రబాబు దావోస్ టూర్ అట్టర్ ఫ్లాప్. పొరుగు రాష్ట్రాల వారు పెట్టుబడులతో వస్తుంటే.. చంద్రబాబు అండ్ కో కట్టుకథలతో ఏపీకి వస్తోంది’’ అని రోజా దుయ్యబట్టారు.‘‘వైఎస్ జగన్ పాలనలో లా అండ్ ఆర్డర్ ఎంతో చక్కగా మెయింటెయిన్ చేశారు. మూడు పోర్టుల పనులు పరుగులు పెట్టించారు. చంద్రబాబు, లోకేష్ తీరుతో దావోస్‌లో ఒక్క రూపాయి పెట్టుబడి కూడా రాలేదు. స్పెషల్ ఫ్లైట్లు, సూట్లు, బూట్ల పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు. అంత పెద్ద వేదికపై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికల సమయంలోనూ రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు, కట్టుకథలు, పచ్చమీడియాతో ప్రజలను మభ్యపెట్టారు. దావోస్‌లోనూ అదే తరహా మభ్య పెట్టాలని చూశారు. కానీ, చంద్రబాబు మాటలు విని పెట్టుబడిదారులు పారిపోయారు’’ అని రోజా చెప్పారు.‘‘వైఎస్ జగన్‌ను చూసి అదానీ, అంబానీ, జిందాల్ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చారు. చంద్రబాబును, ఆయన పరిపాలన చూసి ఒక్క పారిశ్రామికవేత్త అయినా వచ్చారా?. మీ అరాచక రెడ్‌బుక్ పాలన చూసి పెట్టుబడుదారులు భయపడుతున్నారు. ఏపీ ముఖం పెట్టుకుని ఏపీకి వస్తున్నారు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు. రాష్ట్ర పరువు కాపాడాలని ఆ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా. పవన్‌ను చంద్రబాబు ఎందుకు దావోస్ తీసుకెళ్లలేదు?. పవన్ వస్తే లోకేష్ స్థాయి తగ్గిపోతుందని తీసుకెళ్లలేదా?.’’ అంటూ రోజా ప్రశ్నలు గుప్పించారు.ఇదీ చదవండి: ఏబీ వెంకటేశ్వరరావు.. హోదాకు తగ్గినట్టు మాట్లాడితే బాగుండేది! -
రోజా ఇంట ఘనంగా భోగి పండుగ సంబరాలు
-
పవన్‌కు మానవత్వం లేదు: RK Roja
-
ఇవి చంద్రబాబు చేసిన హత్యలే!.. రోజా సంచలన కామెంట్స్
-
సీఎంకు, డిప్యూటీ సీఎంకు ఇంకా బుద్ధి రాలేదు: ఆర్కే రోజా
చిత్తూరు, సాక్షి: తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా కారకులపై ఇంతదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. నగరిలో శనివారం ఆమె మాట్లాడుతూ.. ‘‘సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒకరు చనిపోతే.. 14 మందిపై అక్కడి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అలాంటిది తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. 60 మంది గాయపడ్డారు. ఘటన జరిగింది మూడు రోజులు గడిచింది. అయినా ఇంకా చర్యలు కనిపించడం లేదు. చంద్రబాబు, టీటీడీ చైర్మన్, ఈవో, ఏఈవో, ఎస్పీ.. కారకులైన అందరిపైనా కేసు నమోదు చేయాలి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీఎం చంద్రబాబును మొదటి ముద్దాయిగా చేర్చాలి. .. తొక్కిసలాట ఘటన(Stampede Incident) వల్ల భక్తులు తిరుమలకు రావడం లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఇంత జరిగినా బుద్ధి రాలేదు. అసలైన నిందితులపై చర్యలు తీసుకోకపోగా.. ఇంకా కాపాడాలనే చూస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తోంది. అయినా టోకెన్ సిస్టమ్ ఎందుకు తీయలేదు? అని ప్రశ్నించారామె. పవన్‌కు సూటి ప్రశ్న‘‘సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కు మానవత్వం లేదని పవన్ కల్యాణ్ అన్నారు. మరి గేమ్ ఛంజర్ ఈవెంట్‌కు వెళ్లి ఇద్దరు చనిపోతే.. బాధిత కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు. అల్లు అర్జున్‌కు ఉన్న మానవత్వం కూడా మీకు లేదా?. లడ్డూ వ్యవహారంలో చేయని తప్పునకు కాషాయం కప్పేసుకుని మాట్లాడారు. మరి తిరుపతిలో ఇంత ఘోరం జరిగితే ఇప్పుడేం మాట్లాడరే?. తప్పు చేసిన వాళ్లు ఫలానా వాళ్లే అని మీరే చెబుతున్నారు. మరి వాళ్ల తాట ఎందుకు తీయడం లేదు’’ అని రోజా ప్రశ్నించారు. -
హిందూవుల మనోభావాలు గాయపడ్డ సీఎం, డీప్యూటీ సీఎంకు బుద్ధిరాలేదు
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా
-
ఈ ఘటనకు టీటీడీ చైర్మన్, ఎస్పీ, ఈవోనే కారణం: రోజా
-
భక్తుల ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు?
సాక్షి,తిరుపతి : కోరి కొల్చినవారికి కొంగు బంగారమై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం చెంత తిరుపతిలో (tirupati stampede) తొక్కిసలాట జరిగింది. కేవలం పాలకుల చేతగానితనం వల్ల ఆరు నిండు ప్రాణాలు బలికావటం, 43 మందికి పైగా గాయపడటం చరిత్ర ఎరుగని విషాదం. అయితే ఇంతటి మహా విషాదానికి కారణమైన అధికారుల్ని ఎందుకు కాపాడుతున్నారంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా (rk roja) కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై గురువారం రాత్రి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేర్వేరుగా స్టేట్మెంట్లు ఇవ్వడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. రోజా తన ట్వీట్లో ఏమన్నారంటే?ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు..?వైకుంఠ ఏకాదశి దర్శన టోకన్లు పొందడం కోసం పరితపించిన భక్తులు..!! కానీ కూటమి ప్రభుత్వం, నిర్లక్ష్యం కారణంగా ఆరు మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనకు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బారాయుడు ప్రధాన కారణం. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో అగ్రహాం రావడంతో సమాజ మెప్పు కోసం అంగీకరించారు.ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు..?వైకుంఠ ఏకాదశి దర్శన టోకన్లు పొందడం కోసం పరితపించిన భక్తులు..!!కానీ @JaiTDP @JanaSenaParty @BJP4Andhra ప్రభుత్వం మరియు @TTDevasthanams నిర్లక్ష్యం కారణంగా 6 మంది తమ ప్రాణాలను కోల్పోయారు.ఈ ఘటన కు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈఓ వెంకయ్య…— Roja Selvamani (@RojaSelvamaniRK) January 10, 2025పవన్ మాటలలోనే విధినిర్వహణలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ శ్యామల రావు, అదనపు ఈఓ వెంకయ్యచౌదరిలు పూర్తిగా విఫలం అయ్యారు అని స్పష్టమయింది. మరి ఈ కీలక స్థానంలో ఉన్న ప్రధాన అధికారులు, పాలకండలి వైఫల్యమే కదా. తొక్కిసలాటకి కారణం ఫలితంగా ఆరుగురు భక్తులు తమ నిండు ప్రాణాలు కోల్పోయారు.అందుకు కారణమైన టీటీడీ ఛైర్మన్, ఈఓ, అదనపు ఈఓలపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అడగరు? అంటే సమాజంలో ఉన్న అభిప్రాయం తాను చెప్పడం ద్వారా ప్రజలు మెప్పు పొందటం, చంద్రబాబుకు ఇష్టమైన అధికారులపై చర్యలు కోరకుండా తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం..!! ఇదేనా మీ సనాతన ధర్మం..? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వచ్చారంటేనే అర్దం అవుతుంది మీ వ్యూహం ఏమిటో!!’ ట్వీట్లో పేర్కొన్నారు.👉చదవండి : తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ తలోమాట -
రోజా ఫైర్...!
-
చేతకాని వాడికి చైర్మన్ పదవా? భగవంతుడు మిమ్మల్ని వదలడు
-
టీటీడీ, విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట : రోజా
-
ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది నిదర్శనం: రోజా
-
తొక్కిసలాట బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి: ఆర్కే రోజా
సాక్షి,తాడేపల్లి: టీటీడీ, విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని.. ప్రభుత్వ బాధ్యతరాహిత్యానికి ఇది నిదర్శమని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం భక్తులకు ఏర్పాట్లు చేయలేదు. తొక్కిసలాట బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇంతమంది భక్తులు చనిపోతే పీఠాధిపతులు ఎటు వెళ్లారు?. సనాతన యోధుడు అని చెప్పుకున్న పవన్ స్పందన ఏది?. నిజమైన సనాతన యోధుడైతే బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు.‘‘చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే. గతంలో కూడా చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది. మృతుల కుటుంబాలకు రూ.2 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. టీటీడీ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. చంద్రబాబు అసమర్థత, వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగింది. చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శనంగా తిరుపతి ఘటన ఉంది. దీనికి ఎవరు బాధ్యులో తేల్చాలి’’ అని రోజా పేర్కొన్నారు.‘‘పోలీసులను చంద్రబాబు సేవలో పెట్టారు. వచ్చిన భక్తులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించలేదు. ఇది ప్రభుత్వం చేసిన హత్యలే. అందరిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. అల్లు అర్జున్‌కు సంబంధం లేకుండా తొక్కిసలాట జరిగితే ఆయనపై కేసు పెట్టారు. మరి తిరుపతి ఘటనలో చంద్రబాబు నుంచి బీఆర్ నాయుడు, ఎస్పీలపై కేసులు పెట్టాలి. 105 సెక్షన్ పెట్టాల్సి ఉండగా.. 194 సెక్షన్ ఎలా పెడతారు?. ఏడుగురు భక్తులు చనిపోతే.. హైందవ శంఖారావం నిర్వాహకులు ఏం చేస్తున్నారు?. ఆ పీఠాధిపతులు బయటకు రావాలి. చంద్రబాబు మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. మోదీ కూడా దీనిపై స్పందించాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక దారుణాలు జరుగుతున్నాయి. సనాతన యోధుడిని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?’’ అంటూ రోజా ప్రశ్నించారు.ఇదీ చదవండి: తప్పు ఎవరి వల్ల జరిగింది?.. తొక్కిసలాటకు కారకులు ఎవరు? -
పవన్.. ఆ తల్లికి సమాధానం చెప్పే దమ్ముందా?: రోజా
సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి అని పవన్‌కు ఆమె హితవు పలికారు. ఈ సందర్బంగా తల్లి రోధిస్తున్న వీడియోను షేర్ చేశారు.అభిమానుల మృతి పట్ల పవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో రోజా ట్విట్టర్ వేదికగా..‘కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా పవన్ కల్యాణ్?. ఆత్మపరిశీలన చేసుకోండి! అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి!! అంటూ మండిపడ్డారు.కన్న బిడ్డను కోల్పోయిన ఈ తల్లి ఆవేదనతో అడుగుతున్న ప్రతి మాటకి సూటిగా సమాధానం చెప్పే ధైర్యం ఉందా @PawanKalyan? ఆత్మపరిశీలన చేసుకోండి! అధికారమదంతో కాకుండా మానవత్వంతో మాట్లాడండి!!#SaveAPYouth pic.twitter.com/PboRQmUQXc— Roja Selvamani (@RojaSelvamaniRK) January 7, 2025ఇక, ఇటీవల నటుడు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ఈవెంట్ రాజమండ్రిలో శనివారం సాయంత్రం జరిగింది. ఆ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠ దుర్మరణం పాలయ్యారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. దీంతో, మృతిచెందిన యువకుల తల్లి, కుటుంబ సభ్యులు ఆవేదనతో కన్నీటిపర్యంతమవుతున్నారు. తమ బిడ్డలను కోల్పోయి రోదిస్తున్నారు.ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా ఏపీ డిప్యటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ఘటన తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని చెబుతూ.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతేకాదు జనసేన తరఫున ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. ఇది మంచి విషయమే. అయితే ఇది ఇక్కడితో ఆగి ఉంటే.. మెగా అభిమానులు సంతృప్తి చెందేవాళ్లు కావొచ్చు.కానీ.. ఈ ఘటనను కూడా రాజకీయం చేయాలని పవన్ అనుకున్నారు. అభిమానులు చనిపోయిన నెపాన్ని.. గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. గత ఐదేళ్లుగా కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని.. గత ప్రభుత్వం ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదని.. రోడ్డు బాగు చేస్తున్న క్రమంలోనే ప్రమాదం జరిగిందని.. మెసేజ్ చేశారు. అంతేకాదు పైగా ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా వెళ్లమని చెప్పామంటూ.. వేగంగా వెళ్లి ప్రమాదానికి గురైన ఆ అభిమానులదే తప్పనేలా కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన తీరుపై అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్నా ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం…— Pawan Kalyan (@PawanKalyan) January 6, 2025 -
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ప మాజీ మంత్రి రోజా ఆగ్రహం
-
రోజా ఇంటి వద్ద టీడీపీ ఉన్మాదం..
-
నగరిలో పచ్చ బ్యాచ్ ఓవరాక్షన్.. రోజా సీరియస్
సాక్షి, చిత్తూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం అండతో పచ్చ బ్యాచ్ రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ ఓవరాక్షన్ చేస్తున్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ దాడులు కూడా చేస్తున్నారు. తాజాగా నగరిలో టీడీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు.వివరాల ప్రకారం.. చిత్తూరులోని నగరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. నగరి పట్టణంలో మాజీ మంత్రి ఆర్కే రోజా నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజా సహా కార్యకర్తలు ఉన్న ఫ్లైక్సీలని చించేసి పైశాచిక ఆనందం పొందారు. ఇక, ఘటనపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లైక్సీలు చించేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘దళితులంటే బాబుకు చులకన’
తిరుపతి,సాక్షి: దళితులంటే చంద్రబాబు (chandrababu)కు చులకన. ఆయన దిగజారుడు రాజకీయాలు చేయడం మానుకోవాలని మాజీ మంత్రి ఆర్కే రోజా (rk roja) హితవు పలికారు. చిత్తూరు జిల్లా నగరి తడుకు పేట దళితులుపై జరిగిన దాడి ఘటనపై శుక్రవారం ఆమె స్పందించారు.ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉంటే దళితులుపై ఎక్కువ దాడులు జరుగతాయనే నానుడిని నిజం చేస్తున్నారు. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న పోలీసులు వైఎస్సార్సీపీ (ysrcp) కార్యకర్తల ఇళ్లను, ద్విచక్ర వాహనాల్ని దహనం చేశారు. చుండూరు, కారంచేడు తరహాలో నగరి నియోజకవర్గంలో తడుకు పేట ఘటన తలపిస్తోంది. బడుగు బలహీన వర్గాల ప్రజలపై దాడులు చేయించడం, వారిపై హత్య యత్నం కేసులు పెడుతున్నారు. గత ఐదేళ్లలో ఈ తరహా ఘటనలు ఎన్నడూ జరగలేదు. ఊరు విడిచి వెళ్ళాలని దళితుల్ని బెదిరిస్తున్నారు. వారిని హతమార్చే ప్రయత్నం చేస్తున్నారు. దళిత మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో దళితులుపై దాడులు జరుగుతున్నాయి. దళితులుకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందిచంద్రబాబుకు సూపర్ సిక్స్ ఇవ్వడం చేత కాదు. ఇచ్చిన మాట నిలబెట్టు కోవడం రాదు. కుల రాజకీయాలు చేస్తూ దళితులుపై దాడి చేస్తున్నారు. పోలీసు అధికారులు ఈ ఘటనలో నిష్పక్ష పాతంగా వ్యవహరించాలి’అని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. 👉చదవండి : ఏపీలో ఇకపై ఆరోగ్యశ్రీ ప్రైవేట్‌పరం -
కేసులు పెడితే పెట్టుకో.. జైల్లో పెడతావా పెట్టుకో.. రోజా మాస్ వార్నింగ్
-
బాబూ.. అప్పులేనా నీ సంపద సృష్టి: రోజా
సాక్షి, తిరుపతి: సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పులపై అప్పులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళ, విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలకే ప్రజలకు నరకం చూపిస్తున్నారని కామెంట్స్ చేశారు.నేడు నగరిలో వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి రోజా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ రెడ్డప్ప, సహా పలువురు పార్టీ నేతలు, కార్తకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నగరి నియోజకవర్గంలో భవిష్యత్తు కార్యచరణపై సమావేశంలో చర్చించారు. అనంతరం, నేతలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..‘మా గురువు కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన నగరి మరింత నూతన ఉత్తేజం కలిగిస్తుంది. కూటమి నేతల తప్పుడు ప్రచారం వల్ల వైఎస్సార్సీపీ ఓడిపోయింది. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపారు. ఆరు నెలలకే నరకం చూపిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ఓడిపోయినందుకు ప్రజలు బాధపడుతున్నారు. వైఎస్ జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు అందాయి.సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పులపై అప్పులు చేస్తున్నారు. ప్రజలు వైఎస్సార్సీపీ కావాలని నేడు బలంగా కోరుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం యువత, మహిళ, విద్యార్థులను మోసం చేసింది. పచ్చ బట్టలేసుకుని ఎన్నికల ముందు ఊదరగొట్టారు. నేడు నరకం చూపిస్తుంది కూటమి ప్రభుత్వం. వైఎస్ జగన్ నాడు-నేడు ద్వారా స్కూల్స్ అద్భుతంగా మార్చారు. కానీ కూటమి ప్రభుత్వం వైన్ షాపులను అభివృద్ధి చేసింది. రాష్ట్రాన్ని మద్యంధ్రప్రదేశ్గా చేసింది. వైఎస్ జగన్‌ను ఓడించాలని ఉద్యోగులు కంకణం కట్టుకున్నారు. నేడు ఎందుకు చంద్రబాబును గెలిపించామా? అంటు బాధపడుతున్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి అందరికి అండగా ఉన్నారు. నియోజకవర్గంలో నేను, జిల్లాలో కరుణాకర్ రెడ్డి, రాష్ట్రంలో వైఎస్ జగన్ మనకు అండగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం భయబ్రాంతులకు భయపడకండి.. రాబోయేది మన ప్రభుత్వమే. ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో.. వారికి వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాం. విద్యుత్ బిల్లుపై రేపు నిరసన ఉంటుంది. జనవరిలో విద్యార్థులకు అండగా పోరాడాలి. పచ్చ చానల్స్ అబద్దాలు చెప్పడం తప్ప ఇంకొకటి ఉండదు. ప్రజల సమస్యలు, మహిళల సమస్యలు అందరికీ తెలియజేయాలన్నారు.భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నాయకత్వం, పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నేడు మొదటి సర్వసభ్య సమావేశం ఇది. రోజా నగరికి రాజా లాంటి వ్యక్తి. రోజా కొమ్మకే కాదు, పువ్వులు కూడా ముళ్లు ఉంటాయి. రాష్ట్రంలో ప్రజాదరణ ఉన్న నాయకురాలు. వైఎస్ జగన్ మనసులో చెల్లిగా స్థిరపడ్డారు రోజా. అత్యధిక మెజారిటీతో రోజాను గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉంది. నగరి అభివృద్ధి చేసిన వ్యక్తి రోజా.. అందుకే గెలిపించాలని కోరుతున్నాను. ప్రపంచంలో వైఎస్ జగన్ వంటి వ్యక్తి మరొకరు ఉండరు. ఆయనో గొప్ప వ్యక్తి. ఎవరో పనికిమాలిన వారి కింద పని చేయడం కంటే.. ఉద్యమాల నుండి పుట్టిన వైఎస్సార్సీపీలో ఉండటమే ఎంతో మేలు. ఏ ఒక్క కార్యకర్తలో చిన్న భయం ఉన్నా తొలగించుకోండి. కూటమి, తెలుగుదేశం పార్టీకి ఇక మనుగడ లేదు. సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి.. నెరవేర్చని మోసపు ప్రభుత్వం ఇది. కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెలికిస్తాం అంటూ కామెంట్స్ చేశారు.ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. కూటమి బెదిరింపులకు బెదిరేది లేదు. వైఎస్ జగన్ కోసం పోరాడే వారికి రాబోయే రోజుల్లో సముచిత స్థానం, ప్రాధాన్యత ఉంటుంది. మనమందరం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఏ ఒక్కరికి కష్టం ఇచ్చినా కరుణాకర్ రెడ్డి, మేము అండగా ఉంటామన్నారు.మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ..‘భూమన కరుణాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమ నాయకుడు. టీటీడీ చైర్మన్‌గా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. వచ్చే ఎన్నికలలో చిత్తూరు ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. ప్రజల అందరు పార్టీకి మద్దతుగా ఉన్నారు. ఈవీఎంల స్కామ్ వల్లే కూటమి ప్రభుత్వం వచ్చింది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ఈవీఎంల స్కామ్ చేశారు. అందుకే వైఎస్సార్సీపీకి ఓటమి ఎదురైంది. నేడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. అప్పుల మీద అప్పులు చేస్తోంది. నగరిలో రోజాను గెలిపించండి. మీకు మేము అండగా ఉంటాం’ అని కామెంట్స్ చేశారు. -
శ్రీవారి సన్నిధిలో రోజా
-
జగనన్న కటౌట్ కే వణికిపోతున్నారు.. రోజా మాస్ స్పీచ్
-
నగరిలో ఘనంగా జగన్ పుట్టినరోజు వేడుకలు
-
వైఎస్ జగన్ బర్త్ డే వేడుకల్లో ఆర్కే రోజా
-
YSRCP నేతలే లక్ష్యంగా దాడులు
-
మా కార్యకర్తల జోలికొస్తే... ఆర్కే రోజా వార్నింగ్
-
టీడీపీ నేతల ఆకృత్యాలు మితిమీరిపోతున్నాయి: రోజా
-
ఎయిరిండియా సేవలపై ఆర్కే రోజా అసహనం
సాక్షి, తిరుపతి: ఎయిర్ ఇండియా సేవలపై ఎక్స్‌లో మాజీ మంత్రి ఆర్కే రోజా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘డిసెంబర్ 2న ఖాట్మండు నుంచి నా ఫ్లైట్ A1 2162 రెండు గంటలు ఆలస్యం అయ్యింది. దీనివల్ల చెన్నై AI 2835 ఫ్లైట్ మిస్ అయ్యాను. నాకు కన్ఫర్మ్ అయిన టికెట్ ఎలాంటి కారణం లేకుండా రద్దు చేశారు.’’ అంటూ రోజా ట్వీట్ చేశారు.డిస్ ప్లే డెస్క్ వద్ద ఉన్న దీపిక, నిధి అహంకారంగా ప్రవర్తించారు. కనీస గౌరవం కూడా ఇవ్వలేదు. జవాబుదారీతనం లేదు. ఫ్లైట్ అలస్యానికి కనీసం సంజాయిషీ లేదు. క్షమాపణ కూడా చెప్పలేదు. నాకు న్యాయం జరగాలి. టాటా సంస్థ పరివర్తన అంటే ఇదేనా...?’’ అంటూ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.Deeply disappointed with #AirIndian 's service on 2nd Dec 2024. Privatization was sold as the magic wand for efficiency, but @airindia 's ground staff at Delhi has proven otherwise.On Dec 2nd my Flight AI216 from Kathmandu was delayed by 2hrs, causing me to miss AI2835 to…— Roja Selvamani (@RojaSelvamaniRK) December 3, 2024 -
కాశీలో ‘కేసీఆర్’ హీరో.. రోజాతో సెల్ఫీ (ఫోటోలు)
-
‘ఇంగ్లీష్ అర్థం కాదా?’.. షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్
తిరుపతి, సాక్షి: ఉద్దేశపూర్వకంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు స్ట్రాంగ్ కౌంటర్ పడింది. టీడీపీ అనుకూల మీడియా ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా షర్మిల చేసిన వితండ వాదనను మాజీ మంత్రి ఆర్కే రోజా ఖండించారు.షర్మిల చేస్తున్న రాజకీయాలు, వాదనలు, ఎత్తుగడలు, విమర్శలు.. అన్నింటిని లక్ష్యం ఒక్కటేనని, కానీ, ఎట్టి పరిస్థితుల్లో జరగదని అన్నారామె. అలాగే.. జగన్ రాజకీయ పతనం గురించి ఎవరు ఎంత కోరుకున్నా.. ప్రజలు మాత్రం ఆయనకు అండగా ఉంటారని రోజా చెప్పారు. ఈ క్రమంలో.. సెకి ఒప్పందం గురించి వైఎస్ జగన్ నిర్వహించిన మీడియా సమావేశం తాలుకా సారాంశాన్ని రోజా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.@realyssharmila గారూ.. మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లీష్ అర్థం కాదా? నిన్న మీ అన్న గారు రెండు భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తి వివరాలు ఇచ్చారు. అయినా సరే ఆంధ్రజ్యోతి రాసిన స్టోరీలో పాయింట్లు పట్టుకుని మీరు మళ్లీ ఒక వితండవాదనతో తిరిగి జగన్…— Roja Selvamani (@RojaSelvamaniRK) November 29, 2024సెకితో ఒప్పందం గురించి టీడీపీ అనుకూల మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి చేస్తున్న రాద్ధాంతం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించి మరీ ఆ ఒప్పందం గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అదే సమయంలో తనపై వస్తున్న ఆరోపణలకు ధీటుగా బదులిచ్చారు. అంతేకాదు.. క్షమాపణలు చెప్పని తరుణంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు కూడా. -
తిరుమలలో సందడి చేసిన RK రోజా, వరుదు కళ్యాణి
-
‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఘనంగా రోజా పుట్టిన రోజు వేడుకలు
-
దొంగ కేసులు.. పెయిడ్ ఆర్టిస్టులు.. పోలీసులపై ఆర్కే రోజా ఫైర్
-
‘ఐ-టీడీపీతో లోకేష్ చేయిస్తున్న పనే ఇదంతా’
సాక్షి, తిరుపతి: ఏపీలో తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ-టీడీపీ నీచపు పోస్టులు చేసిందని గుర్తు చేశారు. ఇదే సమయంలో ఏపీని హిట్లర్, గడాఫీ కలిసి పాలిస్తున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్ట్‌లపై వైఎస్సార్సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా కేసులు బనాయిస్తోంది. కూటమి కార్యకర్తలు, మద్దతుదారులు.. మా పార్టీ నాయకుడు వైఎస్ జగన్‌పై, నాయకులపై అసహ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులను ఐ-టీడీపీ ద్వారా వాళ్లే సృష్టించి, అది మాపై నెట్టేస్తున్నారు. అంతటితో ఆగకుండా అమాయకులపై కేసులు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. ఐ-టీడీపీ ద్వారానే చాలా పోస్టులు వచ్చాయి. వాటిపైనే ఫిర్యాదు చేశాం. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వారికి రిసీవ్డ్ కాపీ ఇవ్వాలి. కానీ, ఇవ్వకుండా మాతో దారుణంగా వ్యవహరించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.మాజీ మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో తప్పు చేయని వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు దాడులు చేస్తున్నారు. ఏపీని హిట్లర్, గడాఫీ కలిసి పాలించినట్లు ఉంది. చంద్రబాబు, పవన్ పాలనలో అదృశ్యమైన మహిళల ఆచూకీ కోసం కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?. వైఎస్సార్సీపీ హయాంలో వేల సంఖ్యలో మహిళలు, యువకులు మిస్ అయ్యారని అబద్ధపు ప్రచారం చేశారు. అసెంబ్లీ సాక్షిగా అసలు నిజాలు బయటకు వచ్చాయి. కేవలం 36 మందే అని తేలింది. ఇది హోంమంత్రే బయటకు చెప్పారు.చంద్రబాబు తప్పు చేసి ఎదుటివారిపై రుద్దుతున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు.. మీరెంత?. తప్పు చేయని వారిని వెంటనే విడుదల చేయాలి. రాష్ట్రంలో ఎవరికీ న్యాయం చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌తో నెట్టుకొస్తున్నారు. మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారు. మేము ఫిర్యాదు చేస్తే రిసీవ్డ్ కాపీ ఇవ్వడానికి వందసార్లు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. పోలీసులు.. మీ నెత్తిపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చెసే విధంగా ప్రవర్తించండి’ అంటూ కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ..‘మేం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు గంటల కొద్ది నిలబెట్టి ఫిర్యాదు తీసుకోవడానికి వెనకాడారు. మాకు ఉన్న ప్రోటోకాల్‌ను విస్మరిస్తే కచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ వేస్తామని హెచ్చరిస్తున్నాను. ప్రజా గొంతుకలను నొక్కే ప్రయత్నాన్ని విరమించుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో తగిన మూల్యం తప్పదు.మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. మేము ఐ-టీడీపీపై ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు కేసు తీసుకోవడం లేదు. ఇంతటి దారుణమైన పోస్టులు పెడుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోరా?. అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఐ-టీడీపీ పోస్టులు పెడుతున్నా చర్యలు లేవు. ఏపీలో రాజ్యాంగ హక్కులు కాలరాశారు. పోలీసులు కేసుల పేరుతో వేధిస్తున్నారు. మేం ఎలాంటి బెదిరింపులకు లొంగ. చంద్రబాబు మీ కూటమి పార్టీల పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజు త్వరలో ఉంది అని హెచ్చరించారు. -
పవన్ ఆత్మవిమర్శ చేసుకో.. ఇది అసలు నిజం: ఆర్కే రోజా
సాక్షి, చిత్తూరు జిల్లా: కూటమి సర్కార్ తప్పుడు ప్రచారంపై మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతల దుష్ప్రచారం బట్టబయలైందంటూ ఆమె ట్వీట్ చేశారు. మిస్సింగ్ కేసుల్లో 99.5 శాతానికిపైగా మహిళలను గత ప్రభుత్వంలోనే గుర్తించారని కేంద్ర హోంశాఖ కూడా పార్లమెంట్లో స్పష్టం చేసింది. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. అధికారం కోసం ఎంతటి అబద్ధమైనా చెప్తారా?’’ అంటూ ఆర్కే రోజా నిలదీశారు.అసెంబ్లీ సాక్షిగా ఇన్నాళ్లు @JaiTDP, @JanaSenaParty చేసిన తప్పుడు ప్రచారం బట్టబయలైంది.గత @YSRCParty ప్రభుత్వం లో వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధం.ఐదేళ్ళలో 34 కేసులు మహిళల అక్రమ రవాణాకు సంబంధించి… pic.twitter.com/vTBGvDWsKN— Roja Selvamani (@RojaSelvamaniRK) November 16, 2024 -
బడ్జెట్లో సూపర్ సిక్స్‌ల ఎగవేత.. బాబు చేసింది మోసం కాదా?: ఆర్కే రోజా
సాక్షి, తిరుపతి జిల్లా: ఏపీలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై సీఎం చంద్రబాబును మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చిన చంద్రబాబు. .బడ్జెట్లో వాటిని ఎగ్గొట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను బాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందించారు.. @ncbn గారు.. ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి బడ్జెట్లో ఎగ్గొట్టారు!నువ్వు చేసింది మోసం కాదా?యువతని మోసం చేశారుమహిళలను మోసం చేశారురైతులను మోసం చేశారుఆడబిడ్డ నిధి:18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500ల చొప్పున ఏడాదికి రూ.18వేలు. 2.07 కోట్ల మంది మహిళ…— Roja Selvamani (@RojaSelvamaniRK) November 14, 2024 -
‘సూపర్ సిక్స్.. సూపర్ చీట్స్‌గా మారిపోయింది’
అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం బయటపడిందని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్ సూపర్ చీట్స్‌గా మారిపోయిందంటూ ఎద్దేవా చేశారు రోజా. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రోజా ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు.‘చంద్రబాబు మరోసారి మహిళలను మోసం చేశారు. తొలి బడ్జెట్లోనే చంద్రబాబు మోసం బయటపడింది. 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ. 1500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తాం అని.. బడ్జెట్లో నిధులు ఇవ్వకపోవడం మోసం కాదా..?, ఎన్నికల్లో గెలవగానే ప్రతి నిరుద్యోగ యువతి, యువకులకు నెలకి 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం అని ఒక్క రూపాయి కేటాయించకపోవడం దగా కాదా..?, ఎన్నికల్లో గెలవగానే మహిళలకి ఉచిత బస్ పథకం అమలు చేస్తామన్నారు.. ఇప్పుడు ఆ పథకానికి నిధులే ఇవ్వలేదు..! మోసం కాదా..?, తల్లికి వందనం పథకానికి నిధులు సగానికిపైగా కోత పెట్టడం..దగా కాదా..?ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం అని....ఈ ఏడాది 2 సిలిండర్లను ఎగనామం పెట్టడం..మోసం కాదా..?,50 ఏళ్లకే మహిళలకు పెన్షన్ ఇస్తాం అన్నారు.. ఏది ఈ బడ్జెట్ లో ఆ ప్రస్తావన?, రైతులకు రూ. 20 వేలు ఏడాది పెట్టుబడి సహాయం ఇస్తాం అన్నారు... 10 వేల కోట్లు ఇవ్వాల్సింది 4,500 కోట్లే ఇవ్వడం రైతులను మోసం చేయడం కాదా...?, ఎన్నికల్లో ఓట్లెయించుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం @PawanKalyan ఇంటింటికి మీరిచ్చిన బాబు ష్యురిటీ.. భవిష్యత్‌కి గ్యారంటీ..బాండ్ల ను ఇప్పుడు ఏం చేసుకోవాలి.. ఆ చెల్లని బాండ్లపై ఇప్పుడు ప్రజలు చీటింగ్ కేసులు పెట్టాలా..?, సమాధానం చెప్పాలి!! అంటూ ఆర్కే రోజా ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు మహిళలను మరోసారి మోసం చేశారు...ఎన్నికల్లో చెప్పిన సూపర్ సిక్స్..సూపర్ చీట్స్.. గా మారిపోయింది!తొలి బడ్జెట్ లోనే.. @ncbn మోసం బయటపడింది.19 ఏళ్ల నుండి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తాం అని.. బడ్జెట్లో నిధులు ఇవ్వకపోవడం మోసం కాదా..?ఎన్నికల్లో…— Roja Selvamani (@RojaSelvamaniRK) November 11, 2024 -
రాష్ట్రంలో హిట్లర్, గడాఫీ పాలన
-
పెద్దిరెడ్డి సుధారాణి అక్రమ అరెస్ట్ బాబు, పవన్ పై రోజా ఫైర్
-
రాష్ట్రంలో హిట్లర్, గడాఫీ పాలన
-
ఏపీలో హిట్లర్, గడాఫీల పాలన: ఆర్కే రోజా
తిరుపతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులపై శనివారం ఆమె నగరి నుంచి మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో హిట్లర్, గడాఫీల పాలన సాగుతోంది. వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్నప్పటికీ.. స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది. అత్యాచారాలు, దాడులు జరుగుతుంటే ఆమె ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు.‘‘తప్పుడు కేసులు పెట్టి.. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. పీఎస్‌లకు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారు. సుధారాణి, వెంకట్‌రెడ్డి దంపతులను దారుణంగా కొట్టారు. కోర్టులో కూడా ఇదే విషయాన్ని జడ్జికి ఆ దంపతులు చెప్పారు. అరెస్ట్ చేసిన వాళ్లలో కొందరిని కోర్టులో హాజరుపర్చడం లేదు. వైఎస్ జగన్, వైఎస్సార్సీపీలపై దారుణమైన పోస్టులుపెడుతున్నారు. మరి టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై చర్యలెందుకు తీసుకోవడం లేదు?’’ అని రోజా నిలదీశారు.ఇదీ చదవండి: చంద్రబాబు నియంత పాలన.. అక్రమ కేసులు సహించం: వైఎస్సార్సీపీ -
అనిత.. ఎవరి మెప్పుకోసం ఈ దాపరికాలు?: ఆర్కే రోజా
సాక్షి, నగరి: ఏపీలో హోంమంత్రి వంగలపూడి అనితపై మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. తిరుపతిలో పదోతరగతి బాలికపై జరిగిన లైంగిక దాడి విషయంలో అనిత చేసిన వ్యాఖ్యలపై రోజా ఆవేదన వ్యక్తం చేశారు. మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాలని వారికి కోరారు.మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా.. హోంమంత్రి అనిత, ఎస్పీ ఒక్కసారి మీరు మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి.. ఆ ఆడబిడ్డ తండ్రి తన బిడ్డకి జరిగిన అన్యాయానికి దోషులను ఉరితీయాలని తన బిడ్డకి న్యాయం చేయాలని వేడుకుంటుంటే ఆవేదన మీకు కనిపించలేదా? ఆ తండ్రి బాధ మీకు కనిపించలేదా? ఎవరి మెప్పుకోసం ఈ దాపరికాలు? వాస్తవాలు దాచి కేసును పక్కదారి పట్టిస్తున్నందుకు సిగ్గు పడండి..!! అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గౌరవ హోమ్ మంత్రి @Anitha_TDP గారు మరియు ఎస్పి గారు ఒక్కసారి మీరు మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి... ఆ ఆడబిడ్డ తండ్రి తన బిడ్డకి జరిగిన అన్యాయానికి దోషులను ఉరితీయాలని తన బిడ్డకి న్యాయం చెయ్యాలని వేడుకుంటుంటే ఆవేదన మీకు కనిపించలేదా? ఆ తండ్రి బాధ మీకు… https://t.co/usp79BbeNx pic.twitter.com/pwsB98JSrm— Roja Selvamani (@RojaSelvamaniRK) November 6, 2024ఇది కూడా చదవండి: బాధిత బాలిక తండ్రిపై తీవ్ర ఒత్తిళ్లు! -
నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పై రోజా ఘాటు వ్యాఖ్యలు