Suryapet
-
సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమం నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్ధన్, గణపురం నరేష్, యాదగిరి, ఇంద్రారెడ్డి, దేవిక, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే పాల్గొన్నారు. లక్ష్మీనరసింహుడికి పూజలుమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం స్వామి వారికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తి కట్టించారు. అనంతరం విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
నాగమల్లు జీవితం యువతకు ఆదర్శం
నాగారం : ప్రజల కోసం నిరంతరం తన కలం, గళంతో పోరాటాలు నిర్వహించిన సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కమిటీ సభ్యుడు, అరుణోదయ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తడకమళ్ల నాగమల్లు జీవితం యువతకు ఆదర్శమని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం.డేవిడ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం నాగారం మండలం లక్ష్మాపురంలో నిర్వహించిన తడకమళ్ల నాగమల్లు సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డేవిడ్‌కుమార్ మాట్లాడుతూ నాగమల్లు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, న్యూడెమోక్రసీ పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయగిరి, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్, ఐఎఫ్టీయూఐ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అలుగుబెల్లి వెంకటరెడ్డి, పోలేబోయిన కిరణ్‌కుమార్, అరుణోదయ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచనపల్లి సైదులు, ఎర్ర ఉమేష్, గండు నగేష్, సామ నర్సిరెడ్డి, దాసరి శ్రీనివాస్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు పుల్లూరు సింహాద్రి, సర్పంచ్ రవీందర్, మాజీ సర్పంచ్ సుధాకర్, మల్లెపాక వెంకన్న, కళాకారులు అనుదీప్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు. -
రోజూ 15 వేల టన్నులు సేకరించాలి
భానుపురి (సూర్యాపేట) : ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసి, రోజుకు 15 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో ధాన్యం సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ధాన్యం సేకరణ జరగడం లేదని అసంతప్తి వ్యక్తం చేశారు. ప్రారంభంలో రోజుకు 5 వేల నుంచి 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపిన ఆయన.. ఇకపై వేగాన్ని పెంచి రోజుకు 15 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు లారీలు సమయానికి రావడం లేదని, వచ్చిన లారీలను కూడా సెంటర్ ఇన్చార్జిలు కొన్ని నిర్దిష్ట మిల్లులకు మాత్రమే ఎక్కువగా పంపిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మిల్లుల వద్ద లారీలు గంటల తరబడి నిలిచిపోతున్నాయని తెలిపారు. తహసీల్దార్లు ప్రత్యేక బాధ్యత తీసుకొని, మిల్లుల వద్ద లారీలు నిలిచిపోయిన చోట త్వరితగతిన అన్ లోడింగ్ ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు. లారీ మిల్లుకు చేరుకున్న 12 గంటలలోపు అన్ లోడింగ్ పూర్తి చేయాలన్నారు. ఒకవేళ అన్ లోడింగ్ చేయకపోతే ఆ లారీలను ప్రత్యామ్నాయ పాయింట్లకు మళ్లించాలని సూచించారు. ఏ మిల్లుకు ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి, ఎంత అన్ లోడింగ్ జరిగింది అనే రిపోర్టుతో పాటు, కొనుగోలు కేంద్రాలకు ఎన్ని లారీలు వస్తున్నాయనే పూర్తి వివరాలను రోజువారీగా సమర్పించాలన్నారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఎస్ఓ మోహన్‌బాబు, డీసీఓ ప్రవీణ్‌కుమార్, డీఎం సివిల్ సప్లయీస్ శ్రీధర్‌రెడ్డి, డీఎంఓ నాగేశ్వరశర్మ, ఏఎస్ఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండొద్దు
సూర్యాపేట టౌన్ : డెంగీ బారిన పడకుండా ఉండాలంటే దోమల నివారణకు ఇళ్ల పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ)డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట పట్ణంలోని గిరినగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయ న మాట్లాడారు. కూలర్లు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, పూల కుండీలు, నీటి ట్యాంకులు వంటి ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూ సుకోవాలన్నారు. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చంద్రశేఖర్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ కోటి రత్నం, డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ ప్రణీత్, ఎస్వో వీరయ్య, డిప్యూటీ డెమో సంజీవ్‌రెడ్డి పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామికి విశేష పూజలు ఐకేపీ కేంద్రంలో బస్తాలు, టార్పాలిన్లు దగ్ధం అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం బొల్లంపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం అర్థరాత్రి గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి మంటలు రావడంతో స్థానికులు, కేంద్రం నిర్వాహకులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించగా సాధ్యం కాకపోవడంతో సూర్యాపేట నుంచి ఫైర్ ఇంజన్‌ను పిలిపించి మంటలు ఆర్పివేయించారు. అప్పటికే 3,800 ఖాళీ గన్నీ బ్యాగులు, 6 టార్పాలిన్లు కాలిపోయాయి. సమీపంలోనే ఉన్న ఓ రైతు ధాన్యం రాశికి మంటలు అంటుకోగా నీళ్లుపోసి ఆర్పారు. సంఘటన స్థలాన్ని శనివారం సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావ్ సందర్శించారు. గుర్తుతెలియని వ్యక్తులు గన్నీబ్యాగులు, టార్పాలిన్లను దహనం చేశారని కేంద్రం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలిపోయిన సామగ్రి విలువ సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఆయన వెంట అదనపు డీఆర్డీఓ సురేష్, డీపీఎంలు అరుణ్, బెనర్జీ, తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్ఐ సైదులు, ఏపీఎం రాంబాబు, సీసీలు నగేష్, నాగార్జున ఉన్నారు. -
చెర్వుగట్టులో లక్ష పుష్పార్చన
నార్కట్‌పల్లి : చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి అర్చకలు లక్ష పుష్పార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమావాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి వేళ భక్తులకు దర్శనం కల్పించారు. ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్ శర్మ పూజలు సాగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించారు. గట్టుపైన ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు పైకి వాహనాలను అనుమతించలేదు. కార్యక్రమంలో చెర్వుగట్టు దేవాలయ చైర్మన్ వరాల రమేష్, సర్పంచ్ నేతగాని కృష్ణ, ఈఓ మోహన్‌బాబు, ఎస్ఐ విష్ణుమూర్తి, డైరెక్టర్లు ప్రజ్ఞాపురం సత్యనారాయణ, నల్ల అనిత,ఇరుడుల సంపత్‌కుమార్, మర్రి లింగస్వామి, కమ్మలపల్లి మల్లేష్, రేగట్టె శ్రీనివాస్‌రెడ్డి, వీరెల్లి రఘునాథ్, శ్రీను, పాల మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి
సూర్యాపేటటౌన్ : మిల్లుల్లో ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకోవాలని ఎస్పీ నరసింహ మిల్లర్లను ఆదేశించారు. శనివారం సూర్యాపేట రూరల్ పరిధి జనగామ రోడ్డులో ఉన్న వజ్ర రైస్ మిల్లులో ధాన్యం దిగుమతులను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని వాహనాల నుంచి త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని మిల్లు యజమానులకు సూచించారు. రైతుల పక్షాన బాధ్యత తీసుకుని వారికి అండగా నిలవాలని కోరారు. మిల్లు యజమానులు, కార్మికులతో మాట్లాడి ధాన్యం దిగుమతి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలునాయక్, సిబ్బంది ఉన్నారు. -
జిల్లా కేంద్ర జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవల్లో జాప్యం
ఫ ఆల్ట్రా సౌండ్ స్కానింగ్‌కు రెండు రోజులు ఆగాల్సిందే.. ఫ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులు ఫ మూలన పడిన యంత్రాలు.. పర్యవేక్షణ కరువు ఫ వినియోగంలో లేని ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ సూర్యాపేటటౌన్ : కడుపు నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో సంబంధిత డాక్టర్.. రోగికి ఏమైందనే నిర్ధారణ కోసం ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ రాస్తుండగా ఆ స్కానింగ్ తీయించేందుకు రోగులు రెండు మూడు రోజులు ఆగాల్సి వస్తోంది. రూ.కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన యంత్రాలు మూలన పడటం, కిట్లు అందుబాటులో రోగులకు వైద్య సేవలు అందడం లేదు. 2డి ఎకో లాంటి మెషిన్లు, ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్‌ను వినియోగంలోకి తేకుండా మూలకు పడేశారు. జిల్లా ఆసుపత్రి కావడంతో రోజుకు వందలాది మంది రోగులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వస్తుంటారు. కేవలం 30 నుంచి 40 మందికి మాత్రమే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తుండడంతో మిగిలిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిగతా వారికి నెంబర్లు ఇచ్చి రేపు రా.. లేకపోతే ఎల్లుండి రా అని సిబ్బంది చెబుతుండటం గమనార్హం. ప్రైవేట్ ల్యాబ్‌లలో స్కానింగ్ ఖర్చులు భరించలేక ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తే, ఇక్కడ టోకెన్ల పద్ధతి పేరిట రోజుకు కేవలం 30 మందికే పరిమితం చేయడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకే వచ్చి క్యూ లైన్లలో నిల్చున్నా, చివరకు అవుట్ పేషంట్ల సంఖ్య 30 దాటిందని.. రోజు కోటా పూర్తయిందని సిబ్బంది బంద్ చేస్తున్నారు. సమయపాలన పాటించని వైద్యులు వైద్యులు అందుబాటులో ఉండటం లేదని విమర్శలు ఉన్నాయి. వైద్యుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొంత మంది వైద్యులు రాకపోవడంతో నర్సులు, కింద స్థాయి సిబ్బందే రోగులకు మందులు రాస్తున్నారు. శనివారం వైద్యులు సమయానికి రాకపోవడంతో ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్ విభాగాల్లో కింది స్థాయి సిబ్బందే రోగులను చూసి మందులు రాయడం గమనార్హం. అలాగే సిటీ స్కాన్ పరీక్షలను రేడియాలజిస్ట్ పర్యవేక్షణలో చేయాల్సి ఉండగా, కేవలం ల్యాబ్ టెక్నీషియన్లతో తీయిస్తున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ నెల రోజులుగా సెలవులో ఉన్నారు. దీంతో ఆసుపత్రిలో పర్యవేక్షణ కరువైంది. కొంతమంది వైద్యులు ప్రైవేట్ వ్యక్తులతో డ్యూటీలు చేయిస్తున్నట్లు తెలిసింది. రోగులు రాత్రి వేళలో ఆసుపత్రికి వస్తే అడ్మిట్ చేసుకోకుండా బెడ్లు సైతం ఇవ్వడం లేదని రోగులు చెబుతున్నారు. నియామకాల్లో జాప్యం.. ఆసుపత్రిలో కొన్ని అవుట్ సోర్స్ పోస్టులను ప్రభుత్వం గత నెల 18న విడుదల చేసింది. నెల రోజులలో జిల్లా స్థాయీలోనే నియమాలను చేపట్టాలని ఉత్తర్వులో పేర్కొంది. కానీ, సూపరింటెండెంట్ సెలవులో ఉండడంతో నేటికీ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో జిల్లాకి కేటాయించిన రెండు పోస్టులు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ కోసం ఎదురు చూస్తున్న రోగులుమూలకు పడిన ఎక్స్‌రే మిషన్మా తమ్ముడు శ్రీనివాస్ కు కడుపు నొప్పితో పాటు కొంత మానసిక స్థితి బాగుండటం లేదు. శుక్రవారం సాయంత్రం ఆసుపత్రికి తీసుకొచ్చాం. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ అడ్మిట్ చేసుకోలేదు. రాత్రంతా ఆరుబయటే పడుకున్నాం. ఉదయం డాక్టర్ వచ్చాక చూపించి ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ రాయడంతో తీయించేందుకు వచ్చా. ఇక్కడకు వచ్చాక రేపు రా అని సిబ్బంది అంటుండటంతో వారితో గట్టిగా మాట్లాడి స్కానింగ్ తీయించాను. – శ్రీనివాస్, రాఘవపురం -
చిన్నారులు లలిత కళల్లో రాణించాలి
సూర్యాపేట : చిన్నారులు లలిత కళల్లో రాణించాలని జిల్లా బాల్ భవన్ కన్వీనర్, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కె.అశోక్ అన్నారు. ప్రజాపాలన–ప్రజా ప్రణాళికలో భాగంగా సూర్యాపేటలోని జిల్లా బాల్ భవన్ ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీహెచ్ఎస్ (బి)లో విద్యా వారోత్సవాల సందర్భంగా ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ కల్చరల్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీనివాస్ గౌడ్, ఎస్ఓ సూర్యనారాయణ, హరికృష్ణ, పీడీ జెడ్పీహెచ్ఎస్ విఘ్నేశ్వరచారి, అభివృద్ధి కమిటీ సభ్యులు హమీద్ ఖాన్‌తో కలిసి డీఈఓ జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారులు తెలంగాణ సంస్కృతీ సంప్రదాయ నృత్యాలు లంబాడీ, కోలాటం, పేరిణి శివతాండవం ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆర్ట్, క్రాఫ్ట్, కల్చరల్ డ్యాన్స్ పోటీలు నిర్వహించి వారిలో ఉత్తమ నైపుణ్యం చూపిన వారికి అతిథుల చేతుల మీదుగా మెమెంటో, సర్టిఫికెట్లు, గైడ్ టీచర్స్‌కి సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలభవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ, సిబ్బంది దాసరి యల్లయ్య, ఉమారాణి, సత్యనారాయణ సింగ్, అనిల్, సాయి, వీరయ్య, పద్మ పాల్గొన్నారు. -
2028లో బీసీలదే అధికారం
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్రంలో 2028లో బీసీలు అధికారం చేపట్టడం ఖాయమని, తెలంగాణ గడ్డ బీసీలకు అడ్డాగా మారిందని ఈ సునామీని ఎవరూ ఆపలేరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం సూర్యాపేటలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర మల్సూర్‌గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాధికారం లక్ష్యంగా బీసీల్లో రాజకీయ చైతన్యం పెరిగిందని చెప్పారు. పిడికెడు శాతం ఉన్న వారి పాలన ఇంకెన్నాళ్లని ప్రశ్నించారు. బీసీలు బలమైన శక్తిగా ఎదిగారని ఇక అగ్రకులాల ఆటలు సాగవన్నారు. 2034 వరకు రేవంత్‌రెడ్డి సీఎంగా కొనసాగుతా అంటున్నాడని, బీఆర్ఎస్లో కూడా సార్ రావాలి ముఖ్యమంత్రి కావాలని ప్రగల్భాలు పలుకుతున్నారని, పదేళ్ల పరిపాలన సరిపోదా అని ఎద్దేవా చేశారు. జూలై 12న హైదరాబాద్‌లో బీసీల రాజకీయ ప్లీనరీ, ఆగస్టు 7న జాతీయ ఓబీసీ సమావేశం, సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలలు పల్లె నుంచి పట్టణ వరకు బీసీల రాజ్యాధికార రథయాత్ర చేపడతామన్నారు. డిసెంబర్లో 10 లక్షల మందితో రాజకీయ యుద్ధభేరిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బీసీ ఐకాస చైర్మన్ జాజుల లింగంగౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఉప్పల మధు యాదవ్, బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తిగౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లమల్ల నరసింహ, నిద్ర సంపత్‌నాయుడు, బెల్లంకొండ సైదులు, నేరెళ్ల దేవరాజుయాదవ్, మామిడి శ్రీనివాస్‌యాదవ్, పోతురాజు నరసయ్య, సూర్యగౌడ్, రాచకొండ సురేష్‌గౌడ్, బైరు విజయకృష్ణ, తండు అంజయ్య, అబ్బగాని వెంకటయ్య, పిల్లుట్ల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఫ తెలంగాణ గడ్డ బీసీలకు అడ్డాగా మారింది ఫ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ -
మిల్లర్ల దోపిడీ అరికట్టడంలో ప్రభుత్వ విఫలం
కోదాడ రూరల్ : రైతుల నుంచి మిల్లర్ల దోపిడీని అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం కోదాడ మండలంలోని అల్వాలపురంలో మామిడి తోటలను ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మధుసూదన్‌రెడ్డి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించిన ధాన్యానికి మిల్లర్లు కొర్రీలు పెడుతూ క్వింటాకు 5 కేజీల తరుగు తిస్తున్నారని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయకుండా రైతులను నట్టేటా ముంచిందని తెలిపారు. రుణాలు మాఫీ కాని రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం యాసంగి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వకుండా రైతులను మోసం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని, రానున్న వానాకాలం సీజన్‌కు నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి అశోక్‌రెడ్డి, నాయకులు చిట్టిబాబు, వెంకటరామయ్య, కృష్ణయ్య, నారాయణ, రామారావు, వెంకటనర్సయ్య, లక్ష్మణ్, శంకర్ తదితరులు ఉన్నారు. ఫ బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి -
‘సర్’పై అప్రమత్తంగా ఉంటాం
నల్లగొండ : అర్హుల ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, సర్ విషయంలో అప్రమత్తతతో వ్యవహరిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సర్ బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అంశాలపై ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‌గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్ ఆధ్వర్యంలో జరిగిన జూమ్ మీటింగ్‌లో మంత్రి కోమటిరెడ్డి పాల్గొని మాట్లాడారు. నల్లగొండ, భువనగిరి లోక్‌సభల్లో చేపట్టే ఓటర్ల జాబితా సవరణకు పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని అందుకు బూత్ లెవల్ కమిటీ బాధ్యతలు తీసుకోవాలన్నారు. అకారణంగా తొలగింపునకు గురైన ఓటర్లకు తిరిగి అప్పీల్ చేసుకోవడం, దరఖాస్తు చేసుకునేందుకు మూడు నెలల సమయం ఇచ్చేలా ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేలా కాంగ్రెస్ తరఫున తెలియజేయాలన్నారు. నామినేటెడ్, కార్పొరేషన్ పదవుల్లో 20, 30 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న వారికి ఇవ్వాలని కోరారు. మంత్రి కోమటిరెడ్డి ప్రతిపాదనపై సానుకూలత వ్యక్తం చేసిన ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ కోసం కష్టపడే వాళ్లకే పదవులు ఇస్తామని, అర్హులైన వారి పేర్లు మీరే ఇవ్వండి అని సూచించారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ కోసం కష్టపడుతున్న సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారని, మంత్రి ఉత్తమ్, సీనియర్ నేత జానారెడ్డితో కలిసి సమాలోచనలు చేసి జాబితా ఇస్తామని తెలిపారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
మలిదశ ఉద్యమానికి ఊపిరి పోసిన మారోజు వీరన్న
తుంగతుర్తి : మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన విప్లవ వీరుడు మారోజు వీరన్న అని బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.పర్వతాలు, రాష్ట్ర నాయకుడు గాజుల శ్రీనివాస్ అన్నారు. కుల, వర్గ నిర్మూలన పోరాట సిద్ధాంతకర్త, మలిదశ తెలంగాణ ఉద్యమ నిర్మాత మారోజు వీరన్న 27వ వర్ధంతి సభను శనివారం మండలంలోని కొత్తగూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరన్న విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. వీరన్న బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన యోధుడని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత సమాజంలో విద్యా వికాసం జరగాల్సిన చోట దుర్మార్గపు విధానాలు రాజ్యమేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనగణనలో కులగణన చేపట్టాలని అన్ని పార్టీలు ముక్తకంఠంతో కోరుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని అన్నారు. మహిళల అభ్యున్నతి పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో శ్రీహరియాదవ్, బత్తుల వెంకన్న, మారోజు చైతన్య, మారోజు దిశ, నారబోయిన వెంకట్, కుంట్ల ధర్మార్జున్, రాంబాబు, కొండ లింగయ్య, చెట్టుపల్లి కాశీరాం, వెంకటరెడ్డి, సురేందర్, వీరస్వామి, వెంకటరమణ, మట్టపల్లి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
పోస్టాఫీస్‌కు భవనం నిర్మించాలని వినతి
కోదాడ : కోదాడలో పోస్టాఫీస్‌కు సొంత భవనం నిర్మించాలని కోరుతూ పోస్టాఫీస్ భవన సాధన కమిటీ సభ్యులు శుక్రవారం గుంటూరులో కేంద్ర కమ్యూనికేషన్ల సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. 80 వేల జనాభా ఉన్న కోదాడలో పోస్టాఫీస్‌కు సొంత భవనం లేక తీవ్ర ఇబ్బందిగా ఉందన్నారు. పట్టణ కేంద్రంలో పోస్టాఫీస్‌కు కోసం కేటాయించిన స్థలంలో భవన నిర్మాణం చేపట్టాలని వారు కేంద్ర మంత్రిని కోరారు. ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కమిటీ కన్వీనర్ గంధం బంగారు, డాక్టర్ సుబ్బారావు, రావెళ్ల సీతారామయ్య, ముత్తవరపు పాండురంగారావు, వేమూరి సురేష్ ఉన్నారు. ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేస్తే ఉద్యమం మునగాల : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో జీరాంజీ పథకాన్ని తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ములకలపల్లి రాములు హెచ్చరించారు. ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నిర్వహించిన ‘గ్రామీణ బంద్’ నిర్వహించారు. మండలంలోని గణపవరం పరిఽధిలో చేపట్టిన బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జీరాంజీ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం మండల కార్యదర్శి చందా చంద్రయ్య, మాజీ సర్పంచ్ నాగేశ్వరమ్మ, నాయకులు అంజయ్య, వెంకన్న, ఉపాఽధికూలీలు, మేట్లు పాల్గొన్నారు.పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపుసూర్యాపేట : విద్యార్థులు పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా విజ్ఞానాన్ని పెంచుకోవచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో విద్యార్థులకు గ్రంథాలయ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ కార్యదర్శి బి.బాలమ్మ గ్రంథాలయ వినియోగంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సహాయ గ్రంథ పాలకుడు వి.శ్యాంసుందర్‌రెడ్డి, నిర్మల, సృజన, భవాని, సిబ్బంది పాల్గొన్నారు. ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవంయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి, తిరు, మాడ వీధుల్లో సంప్రదాయంగా ఊరేగించారు. మహిళా భక్తులు సేవోత్సవంలో పాల్గొని మంగళ హారతులను నివేదించారు. అనంతరం అర్చకులు అమ్మవారి సేవను అద్దాల మండపంలో అధిష్టించి ఊంజల్ సేవోత్సవాన్ని మంగళ వాయిద్యాల నడుమ, పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా వేద మంత్రాలతో నిర్వహించారు. ఇక ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు నిత్య పూజలను విశేషంగా జరిపించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
ధాన్యం దిగుమతికి ప్రత్యేక ఏర్పాట్లు
ఆత్మకూర్.ఎస్ (సూర్యాపేట) : గోదాములకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, శ్రీరామ గోదామును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా ఉండగా ఇప్పటికే 2.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు చెప్పారు. గోదాముల వద్ద ధాన్యం దిగుమతి కోసం హమాలీల కొరత ఉన్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దిగుమతుల కోసం ప్రతి మండలానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి మిల్లుకు ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరో 10 రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులు కొన్ని కేంద్రాలలో ఇబ్బందులకు గురవుతున్నారని, అలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ అమీన్ సింగ్, ఏఓ దివ్య, సర్పంచ్ ములకలపల్లి కాటయ్య, ఏపీఓ ఈశ్వర్, సీఈఓ లక్ష్మారెడ్డి, సీపీ ముత్తయ్య, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, సోమిరెడ్డి సత్యనారాయణరెడ్డి ఉన్నారు. కొనుగోలు కేంద్రాల తనిఖీనూతనకల్ : మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంటా పూర్తయిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి లారీల కొరత ఉన్నందున అధికారులు సమన్వయంతో పనిచేసి రవాణా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు, ఎస్ఐ నాగరాజు, ఎంపీఓ శశికళ, ఆర్ఐ హసన్, జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, కేంద్రాల నిర్వాహకులు ఉన్నారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ -
దొడ్డి కొమురయ్య జీవితంపై సినిమా
30 మంది కోదాడ వాసులు సహ నిర్మాతలుగా ..కోదాడ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రపై నిర్మిస్తున్న సినిమాకు కోదాడకు చెందిన 30 మంది సహ నిర్మాతలుగా ఉన్నారని చిత్రం నిర్మాణ కమిటీ చైర్మన్ అంకతి అనసూర్య తెలిపారు. సినిమా వాల్ పోస్టర్‌ను శుక్రవారం కోదాడలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద చిత్రం నిర్మాణ కమిటీతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు, కళాకారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ అమరవీరుల చరిత్రను వెలికి తీయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సినిమా దర్శకుడు ఎం.సేనాపతి మాట్లాడుతూ ఒక్కో జిల్లా నుంచి 26 మంది తెలంగాణ కళాకారులను తీసుకొని ఈ సినిమాను పూర్తిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పందిరి నాగిరెడ్డి, రాయపూడి చిన్ని, ఇర్ల శ్రీనివాసరెడ్డి, రాపర్తి రామనర్సయ్య, రావూరి భవాని, తిరపతయ్య, తేరేజమ్మ, ఎస్ఎస్.రావు, కోదాటి గురవయ్య, సుంకర పుల్లారావు, మజహార్, కల్లూరి సుజాత, జగదీష్ పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యాయత్నంపై డీఎస్ఓ విచారణ
ఆత్మకూర్.ఎస్ (సూర్యాపేట) : మండలంలోని బొప్పారం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో తరుగు పేరుతో ధాన్యం కాజేశారని గురువారం రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనపై సాక్షిలో వచ్చిన కథనానికి కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. శుక్రవారం కొనుగోలు కేంద్రాన్ని డీఎస్ఓ శోభన్‌బాబు సందర్శించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో పాటు బాధిత రైతును, అక్కడ ఉన్న రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య పడొద్దన్నారు. కేంద్రాలలో ఉన్న సమస్యలను రైతులు తమ దృష్టికి తీసుకురావాలని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు అందించ నున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీసీఓ శ్రీధర్, తహసీల్దార్ అమీన్ సింగ్, ఏఓ దివ్య, కేంద్ర నిర్వాహకులు ఉన్నారు. -
పోలీసుల తనిఖీలు
సూర్యాపేటటౌన్ : డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిరోధంలో భాగంగా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు శుక్రవారం సూర్యాపేట పట్టణంలో పోలీసులు, యాంటి నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. పీఎస్ఆర్ సెంటర్, ఖమ్మం అండర్ పాస్, బస్టాండ్ ప్రాంతాల్లో టీ దుకాణాలు, పాన్ షాపులలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐలు ఏడుకొండలు, శివ తేజ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణం జాతీయ రహదారిపై ఉన్నందున మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని నిరోధించేందుకు విస్రృతంగా తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అనుమానిత ప్రదేశాల్లో నిత్యం తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలో పటిష్ట భద్రత కల్పించడమే పోలీసుల లక్ష్యమన్నారు. తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో..సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలుఐబ్రోస్(త్రెడింగ్), వ్యాక్సింగ్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫేస్‌ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్‌స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్, శారీ డ్రాపింగ్. రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : 16–05–2026 నుంచి 21–05–2026 వరకు సమయం : ఉదయం 10 గం. నుండి సాయంత్రం 6 గం.వరకు రిజిస్ట్రేషన్ ఫీజు : రూ.2,500/– వర్క్‌షాపు షెడ్యూల్ తేదీలు: 22–05–2026 నుండి 21–06–2026 వరకు శిక్షణ సమయం : ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకుతన్విక బ్యూటీపార్లర్ అండ్ ట్రైనింగ్ సెంటర్, రోడ్ నెం.1బి, వీటి కాలనీ, నల్లగొండ. సంప్రదించవలసిన ఫోన్ : 8341151413, 9666013544రిజిస్ట్రేషన్ మరియు శిక్షణా స్థలం వివరాలుఫ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేయబడతాయి -
మిల్లుల ఎదుటే పడిగాపులు
భానుపురి (సూర్యాపేట) : తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాకుండా నెలల తరబడి ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తుండగా.. మిల్లులకు వెళ్లిన లారీల్లోని ధాన్యం దిగుమతి కావడానికి మూడు, నాలుగు రోజులు పడుతోంది. చివరికి తాలు, తరుగు పేరుతో క్వింటాకు ఐదు, ఆరు కిలోలకు పైగానే కోత విధిస్తూ మిల్లర్లు రైతులను నిండా ముంచుతున్నారు. ఇదంతా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మిల్లర్ల మధ్య సయోధ్యతోనే జరుగుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. మిల్లుల వద్ద పడి గాపులురెండు రోజుల క్రితం వరకు జిల్లాలోని 335 కొనుగోలు కేంద్రాల్లో సగానికి పైగా ధాన్యం రాశులు కాంటాలకు నోచుకోలేదు. కొనుగోళ్లు ప్రారంభమై 50 రోజులు దాటినా.. ఇంకా కొనుగోళ్లు నత్త నడకన సాగడంపై రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో ఆగమేఘాలపై జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని కాంటాలు పూర్తిచేసి మిల్లులకు తరలించారు. అయితే మిల్లుల్లో హమాలీల కొరతతో పాటు మిల్ల ర్లు కొర్రీలు పెట్టడంతో ధాన్యం లారీలు అక్కడే నిలిచిపోయింది. సెంటర్ల నుంచి మిల్లులకు వెళ్లిన లారీలు, ట్రాక్టర్లు తిరిగి రాకపోవడంతో సెంటర్లలో కాంటాలు సైతం నిలిచిపోయాయి. మూడు రోజులుగా మిల్లుల వద్ద లారీలు, ట్రాక్టర్ల యజమానులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి మిల్లుల వద్దకు వెళ్లిన లారీల్లోని ధాన్యం బస్తాలను వెంటనే దిగుమతి చేయించి వాహనాలను సెంటర్లకు తరలించాలని, ఎలాంటి తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 2,42, 547 మెట్రిక్ టన్నులు సేకరణసూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,42,547 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ సేకరించింది. శుక్రవారం ఒక్కరోజే 9,971 ధాన్యాన్ని సేకరించారు. ఇందులో 2,27,917 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు. మరో 14,630 మెట్రిక్ టన్నుల ధాన్యం ఆయా కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకు పోయింది. ప్రధానంగా కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలిన లారీలు, ట్రాక్టర్లు తిరిగి సెంటర్లకు రాకపోవడంతో సెంటర్ల నిర్వాహకులు కాంటాలు నిలిపివేశారు. ధాన్యం దిగుమతికి అడ్డంకులు తాలు, తరుగు పేరుతో కోతలు పెడుతున్న మిల్లర్లు ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే సగానికి పైగా ధాన్యం ఇబ్బందులు పడుతున్న రైతులుసగం బస్తాలు చిరిగినవే.. అర్వపల్లి : కొనుగోలు కేంద్రాలలో రైతులు తీసుకొచ్చిన ధాన్యం నింపేందుకు బస్తాల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్రాలకు ప్రభుత్వం నుంచి సరఫరా అయ్యే గన్నీ బ్యాగులలో సగానికిపైగా చిరిగి, పాడైన బస్తాలు వస్తున్నాయి. ఈ బస్తాలలో ధాన్యం నింపినా వాటికుండే రంద్రాల ద్వారా బయట పడుతున్నాయి. దాంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జాజిరెడ్డిగూడెం మండలం సూర్యానాయక్‌తండా ఐకేపీ కేంద్రానికి 25వేల గన్నీ బ్యాగులు రాగా అందులో 10వేల బ్యాగులు మాత్రమే కొత్తవి ఉండగా మిగతావన్నీ చిరిగి పాడైపోయి ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలకు కొత్త గన్నీ బ్యాగులను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. -
లక్ష్మీనరసింహస్వామికి నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచా మృతాభిషేకం చేపట్టారు. స్వామి అమ్మవార్లలను నూతన పట్టు వస్త్రాలంకరణతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం సంవాదం రక్తి కట్టించారు. కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, అర్చకులు రామాచార్యులు, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
జనగణనలో అందరూ విధిగా పాల్గొనాలి
కోదాడ : జనగణన కార్యక్రమంలో ప్రజలందరూ విధిగా పాల్గొని, వివరాలను అందించాలని సెన్సెస్ జాయింట్ డైరెక్టర్ రఘు అనుమోలు సూచించారు. శుక్రవారం కోదాడలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎన్యూమరేటర్ ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని చెప్పారు. కోదాడ పట్టణాన్ని 141 లిస్టింగ్ బ్లాక్‌లుగా విభజించి 131 మంది ఎన్యూమరేటర్లు, 22 మంది సూపర్వైజర్ల సాయంతో జనగణన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని బ్లాక్నెం 78లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ 95 శాతం చేయించిన జూలకంటి సమత, సూపర్వైజర్ సాదె లక్ష్మీనారాయణను ఆయన అభినందించారు. ఆయన వెంట జిల్లా జనగణన అధికారి ఇస్లావత్ హోబలాల్, పట్టణ అసిస్టెంట్ అధికారి జి.రమేష్, తీగల నరేష్, ఆర్.నర్సింహారెడ్డి, కంటెం వేణుబాబు, పారా వీరయ్య, ఇస్మాయిల్ ఉన్నారు. -
ముందస్తు సమాచారం లేదు
మానాపురం తండా నుంచి రూ.1400 కిరాయి పెట్టి ధాన్యం మార్కెట్‌కు తీసుకొచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక మార్కెట్ బంద్ అని చెబుతున్నారు. మాకు ముందస్తు సమాచారం లేదు. మార్కెట్‌ను త్వరగా ప్రారంభించాలి. – బోడ్యా, రైతు, మానాపురం తండా వ్యవసాయ మార్కెట్ యార్డులో 500 కుటుంబాలు ప్రతిరోజు పని చేస్తున్నాయి. మార్కెట్ యార్డుతోనే జీవనోపాధి పొందుతున్నాం. మార్కెట్ బంద్ కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు స్పందించి ప్రతిరోజు మార్కెట్ యార్డు నడిచేలా చూడాలి. –జీడి దాస్, హమాలీ యూనియన్ అధ్యక్షుడు -
ధాన్యం దిగుమతుల్లో జాప్యం చేయొద్దు
కోదాడరూరల్ : మిల్లర్లు ధాన్యం దిగుమతుల్లో జాప్యం చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరలో పలు రైస్ మిల్లులను ఎస్పీ నరసింహతో కలిసి కలెక్టర్ తనిఖీ చేసి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చి ధాన్యం లారీలను తరుగు పేరుతో కొర్రీలు పెట్టకుండా అన్లోడ్ చేసి తిరిగి పంపించాలని అందునుగుణంగా కూలీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆయన వెంట ఆర్టీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ సంతోష్కిరణ్ఉన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు పాటించాలి భానుపురి (సూర్యాపేట) : ఘన వ్యర్థ్యాల నిర్వహణ నియమాలు పాటించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సాలిడ్ వేస్ట్ డిస్ట్రిక్ట్ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి, ఘన వ్యర్థాల నిర్వహణకు శానిటేషన్ ప్లాన్ ను గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు ప్రతిపాదనలు సిద్ధం చేసి వచ్చే 15 రోజుల్లోగా యాక్షన్ ప్లాన్ సమర్పించాలన్నారు. ప్రతి వ్యర్థ ఉత్పత్తిదారుడు ఘన వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం కలగకుండా నివారించేందుకు, తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ యాదగిరి, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్లు హనుమంత రెడ్డి, రమాదేవి, శ్రీనివాసు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ప్రభుత్వ స్థలం పరాధీనం
కోదాడ మున్సిపాలిటీ పరిఽధిలోని కొమరబండ వై జంక్షన్ వద్ద సర్వేనంబర్ 48/3ఏ/1/, 48/3బీ/1లో ఉన్న 1.08 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించేందుకు యత్నించారు. రెవెన్యూ అధికారులు రూ.80 వేలు ఖర్చు చేసి దాని చుట్టూ యుద్ధప్రాతిపదికన ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేశారు. కానీ రాత్రికి రాత్రే కొందరు బోర్డును తొలగించారు. దాంతో అధికారులు సమీపంలోని గోడ మీద ‘ఇది ప్రభుత్వ భూమి..ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం’ అని రాయించారు. దానిపైన కూడా కొందరు నల్లరంగు పూసి కనబడకుండా చేశారు. అయినా ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే దానిపై కొందరు కోర్టుకు వెళ్లారని చెపుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన కొందరు సమీపంలోని సర్వే నంబర్‌పై తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించి ప్రభుత్వ భూమిని తమదిగా చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోదాడ : కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు పరాధీనమవుతున్నాయి. ఆక్రమణలపై స్థానిక ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. మరి కొందరు అధికారులు కాసులకు కక్కుర్తిపడి దొడ్డిదారిని ఆక్రమణ దారులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేస్తున్నారు. కోదాడ పట్టణ పరిధిలోని తమ్మర రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 39లో అత్యంత విలువైన ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి నుంచే కోదాడ –ఖమ్మం బైపాస్ రోడ్డు వేశారు. ఇక్కడ గతంలో 56 మంది లబ్దిదారులకు 14.13 ఎకరాల భూమిని అసైన్ చేయగా.. మరో 28 ఎకరాల ప్రభుత్వ భూమి మిగిలి ఉంది. ఈ భూమిని గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించగా గతంలో ఇక్కడ పని చేసిన అధికారి వారికి అక్రమంగా పట్టాదారు పాస్‌పుస్తకాన్ని జారీ చేసినట్లు సమాచారం. ఈ విషయంలో గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు గతం సంవత్సరం సర్వే చేశారు. కానీ రాజకీయ ఒత్తిడితో ఆక్రమణ దారులపై చర్యలు తీసుకోలేదు. ఈ విషయమై ఎవరైనా ప్రశ్నిస్తే వారు కోర్టుకు వెళ్లారని చెబుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. చెరువునే మాయం చేసినా... కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరంగాపురం గ్రామానికి దక్షిణం వైపు 30 ఎకరాలలో సాగిచెరువు ఉండేది. 2008లో కోదాడ బైపాస్ రోడ్డు సర్వే చేసిన హైవే అధికారులు తయారు చేసిన మ్యాప్‌లో రోడ్డుకు సమీపంలో చెరువు ఉన్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. పట్టణం విస్తరించి భూముల రేట్లు పెరిగాయి. దాంతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. అధికారులను మచ్చిక చేసుకొని చెరువు కట్టకు గండిపెట్టి దశలవారీగా చెరువును ఆక్రమించారు. కోదాడ మాజీ సర్పంచ్ తమ్మర వెంకటేశ్వరరావు ఇచ్చిన సీలింగ్ ఎక్సెస్ భూములను సైతం కొందరు తమ పేరుతో మార్పిడి చేయించుకొని ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారికి కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు సమాచారం. దీనికి సమీపంలోనే సర్వే నంబర్ 758లో దాదాపు రెండు ఎకరాల భూదాన భూమికూడా ఆక్రమణకు గురవుతుంది. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూముల విషయంలో సమగ్ర విచారణ జరిపి వాటిని కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ఫ కబ్జాలో రూ.కోట్ల విలువైన భూములు ఫ ఫిర్యాదులు చేసినా చర్యలు శూన్యం ఫ అధికారులు సర్వే చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని స్థానికుల వినతిసర్వేనంబర్ రెవెన్యూ విలేజ్ విస్తీర్ణం అసైన్ చేసింది మిగిలింది 39 తమ్మర 42.09 14.13 28.00 635 శ్రీరంగాపురం 31.21 7.00 24.00 758 కోదాడ 1.37 – 1.37 48/3ఏ/1/48/3బి/1 కొమరబండ 1.08 – 1.08 360 బండపాలెం 15.15 – 15.15 -
నిలిచిన క్రయవిక్రయాలు..
తిరుమలగిరి (తుంగతుర్తి) : ఎంకి చావు సుబ్బి పెళ్లికొచ్చినట్లు తయారైంది తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ పరిస్థితి. ప్రభుత్వం మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం.. అంచనాలకు మించి మొక్కజొన్నలు రావడంతో మార్కెట్ యార్డు నిండిపోయింది. దీంతో గత శనివారం నుంచి మా ర్కెట్‌కు తాళం పడింది. ఫలితంగా అటు రైతన్నలు, ఇటు కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంటాలు కాకపోవడంతో.. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ జిల్లాలోనే పేరొందిన రెగ్యులర్ మార్కెట్. ప్రతిరోజు ధాన్యం, ఇతర పంటలు 10 వేల బస్తాలకు పైగానే వస్తుంటాయి. సూర్యాపేట జిల్లా నుంచే కాకుండా యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్ జిల్లాల నుంచి కూడా రైతులు తమ పంటలను మార్కెట్ యార్డుకు తీసుకొస్తుంటారు. అయితే గత నెల 18వ తేదీన వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలో రెండు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు మాత్రమే ప్రారంభించడంతో తిరుమలగిరి కొనుగోలు కేంద్రానికి ఒకేసారి 20 వేల బస్తాలు వచ్చాయి. రైతులు వివిధ ప్రాంతాల నుంచి మొక్కజొన్నలు తీసుకొచ్చి మార్కెట్ యార్డులో ఎక్కడ పడితే అక్కడ పోశారు. దీనికితోడు మొక్కజొన్నలు తేమగా ఉండడంతో రైతులు ఇక్కడే ఆరబెడుతున్నారు. కొనుగోళ్లు ఆలస్యం కావడం, కాంటాలు కాకపోవడం, కాంటాలైన బస్తాలకు లారీలు సరిగ్గా రాక ఎగుమతులు ఆలస్యమవుతున్నాయి. ధాన్యం, మొక్కజొన్నల బస్తాలతో మార్కెట్ నిండిపోవడంతో గత శనివారం నుంచి వ్యవసాయ మార్కెట్‌ను బంద్ చేశారు. ఇబ్బందులు పడుతున్న హమాలీలు.. తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో హమాలీలు, స్వీపర్లు, దడ్వాయిలు మొత్తం 500 కుటుంబాలకుపైగానే వివిధ పనులు చేస్తుంటారు. ప్రతిరోజు మార్కెట్ నడిస్తేనే వీరికి ఉపాధి కలుగుతుంది. మార్కెట్లో క్రయ విక్రయాలు బంద్ కావడంతో తమ కుటుంబాలు వీధిన పడే అవకాశం ఉందని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పాలకవర్గం స్పందించి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రతిరోజు యథావిధిగా నడిచేలా చూడాలని కోరుతున్నారు. తక్కువ ధరకే విక్రయం వ్యవసాయ మార్కెట్ యార్డు బంద్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తమ ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయించి పోతున్నారు. ధాన్యాన్ని ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో కిరాయికి తీసుకుని రావడంతో మరలా ఇంటికి తీసుకు పోలేక తక్కువ ధరకై నా ప్రైవేట్ వ్యక్తులకే విక్రయిస్తున్నారు. ఫ ధాన్యం, మొక్కజొన్న బస్తాలతో నిండిన తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ ఫ స్థలం లేక తాత్కాలికంగా మూసివేసిన అధికారులు ఫ రైతులకు అందని ముందస్తు సమాచారం ఫ ధాన్యం తీసుకొచ్చి ఇబ్బందులు పడుతున్న కర్షకులు ఫ ఉపాధి కోల్పోతున్న హమాలీలు, స్వీపర్లు -
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
మునగాల: వైద్య సిబ్బంది తమ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా పరిపాలన అధికారి డాక్టర్ కోటిరత్నం హెచ్చరించారు. మునగాల పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పోలేపల్లి రవీందర్‌పై ఇటీవల వచ్చిన అభియోగాలపై కలెక్టర్ ఆదేశానుసారం వైద్యశాఖ ఉన్నత అఽధికారుల కమిటీ బుధవారం విచారణ చేపట్టింది. ఈ విచారణ కమిటీలో వైద్యశాఖ జిల్లా పరిపాలన అధికారి డాక్టర్ కోటిరత్నం, కోదాడ డిప్యూటీడీఎంహెచ్ఓ ఎం.మాధవ్‌కుమార్ ఉన్నారు. వీరి ఆస్పత్రికి వెళ్లి వైద్యాధికారి రవీందర్‌తో పాటు, అభియోగాలు మోపిన ఎంఎల్‌హెచ్‌పీ దివ్యను విచారించారు. పరిపాలన అధికారి డాక్టర్ కోటిరత్నం, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.మాధవ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ తోటి ఉద్యోగుల పట్ల అనుచిత ప్రవర్తన, మానసిక వేధింపులకు తావు లేకుండా ,భవిష్యత్‌లో ఇలాంటి ఫిర్యాదులు పునరావృతం కాకుండా నివేదిక అనంతరం సీసీఏ నిబంధనలకు అనుగుణంగా క్రమశిక్షణ చర్యలు చేపడతామన్నారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. -
సాగులో ఆధునిక పద్ధతులు పాటించాలి
చిలుకూరు : సాగులో రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ రజికాంత్, డాక్టర్ శ్రీనివాస్ సూచించారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా బుధవారం చిలుకూరు మండలంలోని బేతవోలులో గల రైతు వేదికలో వానాకాలం సీజన్ సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. రైతులు సేంద్రియ సాగుపై దృష్టి సారించాలని, తద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వట్టికూటి నాగయ్య, ఏఓ శ్రీధర్, ఏఈవోలు చంద్రశేఖర్, శిరీష, వసీమా, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం తరలింపు వేగవంతం చేయాలి
పెన్‌పహాడ్: కొనుగోలు కేంద్రాల్లో తూకం పూర్తయిన ధాన్యం బస్తాలను వెంటనే లారీల్లో రైస్ మిల్లులకు తరలించి దిగుమతి చేసుకునేలా చూడాలని అదనపు కలెక్టర్ భూక్య హరిసింగ్ అన్నారు. బుధవారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామ శివారులోని మహాదేవ్ రైస్ మిల్లును తనిఖీ చేసి మాట్లాడారు. అవసరమైతే హమాలీల సంఖ్య పెంచుకోవాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ రాజశేఖర్‌రెడ్డి, ఆర్ఐ రంజిత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.సూర్యాపేటలో పరీక్ష రాస్తున్న విద్యార్థులుతిరుమలగిరిలో సెంటర్ గేట్ వద్ద నిరీక్షిస్తున్న విద్యార్థులు -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం మొదటి సంవత్సరం పరీక్ష జరగ్గా మొత్తం 723 మంది విద్యార్థులకు గాను 680 మంది హాజరు కాగా 43 మంది గైర్హాజరయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్ష మధ్యాహ్నం జరగ్గా 2,382 మంది విద్యార్థులకు గాను 2225 మంది హాజరు కాగా 157 మంది గైర్హాజరైనట్టు డీఐఈఓ సులోచన రాణి తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్టు చెప్పారు. బక్రీద్‌కు కట్టుదిట్టమైన భద్రత సూర్యాపేటటౌన్ : బక్రీద్ పండుగ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. బక్రీద్‌కు భద్రతా ఏర్పాట్లపై బుధవారం అన్ని జిల్లాల పోలీస్ అధికారులతో హైదరాబాద్ నుంచి డీజీపీ సి.వి. ఆనంద్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా పోలీస్‌కార్యాలయంలో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ పాల్గొన్న అనంతరం అధికారులతో మాట్లాడారు. పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. గోవుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని వివరించారు. అంతర్ జిల్లా సరిహద్దుల్లో 8 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. మసీదులు, ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, శ్రీనివాస్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు, వ్యసాయ మార్కెట్ అధికారులు, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం కోదాడ: ప్రభుత్వ బడులను బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, స్ధానిక ప్రజాప్రతినిధులు దీనికి సహకరించాలని జిల్లా విద్యాధికారి అశోక్ కోరారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం కోదాడలోని సీసీ రెడ్డి విద్యానిలయంలో కోదాడ నియోజకవర్గ స్ధాయి సర్పంచ్‌లు, మున్సిపల్ కౌన్సిలర్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తల్లిదండ్రులు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్ అందిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు తరచూ ప్రభుత్వ పాఠశాలలను సదర్శించి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీఓ రాంబాబు, డీఎల్పీఓ పార్థసారధి, ఎంఈఓలు సలీంషరీఫ్, శ్రీనివాసరావు, నరసింహారెడ్డి, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, గోపాలరావుతో పాటు పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
మద్దతు ధర పెంపును సవరించాలి
సూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు ఏమాత్రం ప్రయోజన కరంగా లేవని, వాటిని సవరించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి. కోటేశ్వరరావు కోరారు. సూర్యాపేట పట్టణంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు పి. లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మద్దతు ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా లేవని అన్నారు. ముఖ్యంగా వరికి 72 రూపాయలు ప్రకటించడం సరైంది కాదన్నారు. వ్యవసాయానికి ఉపయోగించే ఎరువులు, వ్యవసాయ పనిముట్లపై పెద్ద ఎత్తున పెంచుతూ పంటలకు తక్కువ ధరలు ప్రకటించడం అంటే వ్యవసాయ రంగాన్ని మరింత దివాలా తీయించడం తప్ప మరొకటి కాదన్నారు. వరికి 2,441 అంటే 3.93శాతం, పత్తి6.2శాతం, మొక్కజొన్న 06శాతం పెరిగిందని అదే ఎరువులకు 18.50శాతం, వ్యవసాయ పనిముట్లకు 25శాతం రేట్లు పెంచిందన్నారు. ఈ విధంగా పెట్టుబడులకు పెద్ద ఎత్తున పెంచడం, మద్దతు ధరలు అతి తక్కువ పెంచడం సరైనది కాదన్నారు. సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, జిల్లా నాయకులు కాకి మోహన్ రెడ్డి, అహ్మద్ హుస్సేన్, అలుగుబెల్లి వెంకటరెడ్డి , కోట మధుసూదన్ రెడ్డి, మేకల కనకారావు, పి. నాగన్న పాల్గొన్నారు. -
వామ్మో ఉక్కపోత..!
భానుపురి (సూర్యాపేట) : ఈ వేసవి సీజన్లో ఎండల తీవ్రత అధికంగానే ఉంది. ఉక్కపోత కారణంగా జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం జిల్లావ్యాప్తంగా ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉదయం నుంచే ఓ వైపు మబ్బుల ఎండ, మరోవైపు గాలి లేకపోవడంతో ఉక్క పోసింది. కనీసం ఇంట్లో నుంచి అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి. రోహిణి కార్తె మరో 10 రోజులు ఉండగానే ఎండ, ఉక్కపోత, వేడిగాలులు రావడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు ఈ వాతావరణానికి తట్టుకోలేకపోతున్నారు. తీవ్ర వేడి..ఈసారి అకాల వర్షాలు కురవకపోవడంతో తీవ్ర వేడి నెలకొంది. కనీసం మోస్తరు వర్షం కురిసినా ఎండల తీవ్రత కొంతమేర తగ్గేది. గురువారం దాదాపు జిల్లాలోని 23 మండలాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా నూతనకల్ మండలంలో 42.8, పెన్‌పహాడ్ మండలంలో 42.6, నేరేడుచర్లలో 42.5 ఇలా... 11 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తుంగతుర్తి మండలంలో 40.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అల్లాడిన జనం..!గడిచిన రోజుల్లో ఎండ తీవ్రత ఉన్నప్పటికీ గాలి వీయడంతో జనం అంతగా ఇబ్బంది పడలేదు. గురువారం ఉదయం 7గంటల నుంచే జిల్లాలో వాతావరణం భిన్నంగా మారింది. అంతగా ఎండ లేకపోయినప్పటికీ ఏమాత్రం గాలి లేకపోవడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమయం గడుస్తున్న కొద్దీ ఎండ తీవ్రత అధికం కాగా.. ఉక్కపోత అలాగే ఉండిపోయింది. ప్రధానంగా రోడ్ల వెంట వ్యాపారులు, మార్కెట్లలో హమాలీలు, రైతులు, ఉపాధి హామీ కూలీల బాధ వర్ణనాతీతం. దీనికి తోడుగా జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులకు చెట్ల విరిగి విద్యుత్ తీగలపై పడకుండా ఉండేందుకు అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి చెట్ల కొమ్మలను నరికివేస్తున్నారు. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు కరెంటు లేకపోవడంతో ఇళ్లలో జనం ఉండలేని పరిస్థితి నెలకొంది.జిల్లాలో గురువారం నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా..మండలం గరిష్ట ఉష్ణోగ్రత నూతనకల్ 42.8 పెన్‌పహాడ్ 42.6 నేరేడుచర్ల 42.5 మోతె 42.4 చివ్వెంల 42.2 మేళ్లచెరువు 42.2 సూర్యాపేట 42.2 హుజూర్నగర్ 42.2 మునగాల 42.1 గరిడేపల్లి 42.0 మద్దిరాల 42.0 తిరుమలగిరి 41.9 నడిగూడెం 41.8 చిలుకూరు 41.5 మఽఠంపల్లి 41.2 ఆత్మకూర్ (ఎస్) 40.8 అనంతగిరి 40.5 కోదాడ 40.5 నాగారం 40.5 పాలకీడు 40.3 చింతలపాలెం 40.3 జాజిరెడ్డిగూడెం 40.3 తుంగతుర్తి 40.3ఫ జిల్లా అంతటా ఎండ తీవ్రత 40 డిగ్రీలకు పైగానే ఫ అల్లాడుతున్న ప్రజలు -
లక్ష్మీనరసింహుడికి నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం స్వామి వారి నిత్య కల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం స్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి నాగవళ్లీ దళాలతో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు రామాచార్యులు, బదరీనారాయణాచార్యులు, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాల్సి ఉంది
భానుపురి (సూర్యాపేట) : ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన సమావేశంలో (వెబెక్స్) ఆయన మాట్లాడారు. అకాల వర్షాల ముప్పును దృష్టిలో ఉంచుకుని యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు చేపట్టాలన్నారు. జిల్లాలో ఈ సీజన్లో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అంచనా వేయగా, సోమవారం వరకు 2 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని కలెక్టర్ తెలిపారు. మిల్లుల వద్ద అన్ లోడింగ్ ప్రక్రియ నెమ్మదించడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మిల్లుల వద్ద హమాలీల సంఖ్యను రెండింతలు పెంచి, మూడు షిఫ్టుల్లో పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. ధాన్యం దిగుమతి చేసుకోవడంలో నిర్లక్ష్యం వహించే మిల్లర్లపై చట్టపరమైన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ప్రైవేట్, అదనపు గోదాములను అద్దెకు తీసుకుని ధాన్యాన్ని నిల్వ చేయాలని సూచించారు. ధాన్యం తరలింపు కోసం ప్రస్తుతం ఉన్న 670 లారీలు సరిపోవడం లేదని, అదనపు లారీలు, డీసీఎంలను ఏర్పాటు చేసేందుకు పోలీస్, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు 5 కిలోమీటర్ల లోపు దూరం ఉంటే, లారీల కోసం వేచి చూడకుండా ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద గన్నీ బ్యాగులు, హమాలీలు అందుబాటులో ఉండేలా తహసీల్దార్లు, మండల అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి మిల్లు వద్ద అన్ లోడింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక ఇంచార్జ్ అధికారిని నియమించాలని సూ చించారు. ఈ సమావేశంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ హరిసింగ్, జిల్లా పరిషత్ సీఈవో శిరీష, డీఆర్డీడీవో సన్యాసయ, డీఎస్వో మోహన్ బాబు, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీసీవో ప్రవీణ్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ పరిశీలించారు. లారీల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ధాన్యం కొనుగోళ్లను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని కోరారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీకాంత్, ఏఓ గణేష్, ఎంపీడీఓ ఝాన్సీ, సీఈఓ సత్యనారాయణ, ఏఈఓ సత్యం ఉన్నారు. మిల్లుల పరిశీలన.. తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి, తొండ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మంగళవారం పరిశీలించారు. అదేవిధంగా ఏఎస్ఆర్ రైస్ ఇండస్ట్రీ, సోమేశ్వర రైస్ ఇండస్ట్రీ మిల్లులను సందర్శించి, ధాన్యం అన్ లోడింగ్ ప్రక్రియను చూశారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే అన్ లోడ్ చేయాలని సూచించారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఫ మిల్లుల వద్ద అన్ లోడింగ్ నెమ్మదించడంపై ఆగ్రహం నాగారం : ఐకేపీ కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. మంగళవారం నాగారం మండల పరిధిలోని ఈటూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేలా రవాణా సౌకర్యాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దేవేంద్రప్రసాద్, రైస్ మిల్లర్లు, యజమానులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం మొదటి సంవత్సరం, మధ్యాహ్నాం ద్వితీయ సంవత్సరం పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల్లో ఎలాంటి మాస్ కాఫీయింగ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోనున్నట్టు ఇంటర్మీడియట్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సం విద్యార్థులు కలిపి మొత్తం 7142 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఏర్పాట్లు పూర్తి చేశాం.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలను రాయాలి. ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. పరీక్షలు పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాం. పరీక్ష కేంద్రాల సమీపంలోని జీరాక్స్ సెంటర్లను మూసి వేయాలి. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుంది. – సులోచన రాణి, డీఐఈవోఫ 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు ఫ హాజరు కానున్న 7,142 మంది విద్యార్థులు -
పాడి రైతులకు భరోసా
సాక్షి, యాదాద్రి : కొంతకాలంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నల్లగొండ – రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘానికి(నార్ముల్– మదర్ డెయిరీ) ఎట్టకేలకు మోక్షం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో నార్ముల్ – మదర్‌డెయిరీ, ఎన్డీడీబీ మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది. తక్షణ సాయంగా రూ.27కోట్ల చెక్కును ఎన్డీడీబీ అందజేసింది. ఇందులో రూ. 10 కోట్లతో బుధవారం ఆరు నెలల పెండింగ్ పాల బిల్లులు చెల్లించనున్నారు. సీఎం ఆదేశాలతో.. నార్ముల్– మదర్‌డెయిరీ పరిధిలో 50 వేల మంది రైతులు ఉన్నారు. 311 రిజిష్టర్ సొసైటీలు ఉన్నాయి. రోజూ 50 వేల లీటర్ల పాల సేకరణ చేస్తున్నారు. నార్ముల్ రూ.70కోట్ల అప్పుల్లో ఉంది. కష్టాల కడలిలో ఉన్న పాడిరైతులను గట్టెక్కించాలని ఎమ్మెల్యేలు సీఎంను కొంతకాలంగా కోరుతూ వచ్చారు. దీంతో స్పందించిన సీఎం ఎన్డీడీబీతో ఎంఓయూకు చర్యలు చేపట్టాలని పశు సంవర్ధక శాఖ మంత్రి, ఉన్నత స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు.ఈనెల 4న రాష్ట్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మంగళవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్న పశు సంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, నార్ముల్ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, డైరెక్టర్ల సమక్షంలో మదర్‌డెయిరీ, ఎండీఎన్‌డీడీబీ ప్రతి నిధుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇక.. క్రమం తప్పకుండా బిల్లులు ఒప్పందం ప్రకారం నార్ముల్ పాలసేకరణ చేస్తుంది. ఎన్డీడీబీ, ఢిల్లీ మదర్ డెయిరీలు పాల ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ చేస్తాయి. నార్ముల్ –మదర్‌డెయిరీ రోజూ లక్ష లీటర్లకుపైగా పాల సేకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రైతులకు ప్రతి 15 రోజులకోసారి బిల్లులు చెల్లించాలని నిర్ణయించారు. నార్ముల్ కొనుగోలు చేసి ఇచ్చే ప్రతి లీటరు పాలకు ఎన్డీడీబీ రూ.6.50 కమీషన్ చెల్లిస్తుంది. ఈ ఆదాయంతో ఉద్యోగుల జీతాలు చెల్లించడంతో పాటు మెయింటెనెన్స్ చేస్తారు. ముందుగా ఆరు నెలల బిల్లులు పాడి రైతుల బిల్లులు చెల్లించేందుకు రూ. 10 కోట్ల చెక్కు, అప్పు చెల్లించేందుకు రూ. 17 కోట్ల చెక్కుతో కలిపి మొత్తం రూ. 27 కోట్లు నార్ముల్– మదర్ డెయిరీకి ఎన్డీడీబీ అందజేసింది. ముందుగా ఆరు నెలల పెండింగ్ పాల బిల్లులను బుధవారం చెల్లిస్తారు. అలాగే నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద ఉన్న నార్ముల్–మదర్ డెయిరీ భూమి 29.37 ఎకరాలను ఎన్డీడీబీ కొనుగోలు చేసి రూ. 40 కోట్లు చెల్లిస్తుంది. మరో రూ.28 కోట్లు సాఫ్ట్‌లోన్ ఇస్తుంది. నార్ముల్–ఎన్డీడీబీ మధ్య కుదిరిన ఒప్పందం ఫ రూ. 27 కోట్లు విడుదల ఫ నేడు పాడి రైతులకు పెండింగ్ బిల్లుల చెల్లింపులుఎన్డీడీబీతో నార్ముల్– మదర్ డెయిరీతో ఎంఓయూ కుందిరింది. ఒప్పందం కుదిరిన వెంటనే ఎన్డీడీబీ రూ.10 కోట్లు నార్ముల్ ఖాతాలో జమ చేసింది. ఈ డబ్బులను రైతుల పెండింగ్ పాల బిల్లులు చెలిస్తాం. నార్ముల్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాం. – గుడిపాటి మధుసూదన్‌రెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ -
విత్తనాల ఎంపికలో జాగ్రత్త వహించాలి
మోతె : వానకాలం సీజన్లో సాగుకు ముందు రైతులు విత్తనాలను సిద్ధం చేసుకోవాలని, వాటి ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్త చంద్రశేఖర్ సూచించారు. సోమవారం మండలంలోని రావిపహాడ్ గ్రామ రైతువేదికలో రైతుముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రసాయన ఎరువుల పిచికారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. మితిమీరిన ఎరువుల వినియోగంతో భూసారం తగ్గి పంట దిగుబడి తగ్గుతుందన్నారు. నూతన వరి వంగడాలు, సేంద్రియ వ్యవసాయం, పంటమార్పిడిపై ఒక్క రోజు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అరుణ, ఏఈఓ త్రివేణి, ఉద్యానవన అధికారి అనిల్, రైతులు పాల్గొన్నారు. -
అక్రమ రవాణాపై పటిష్ట నిఘా
సూర్యాపేటటౌన్ : పశువుల అక్రమ రవాణా, ఇసుక, వరి ధాన్యం, పీడీఎస్ బియ్యం రవాణా జరగకుండా పోలీసు శాఖ పటిష్ట నిఘా పెట్టామని ఎస్పీ నరసింహ తెలిపారు. చెక్ పోస్టులలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తునట్లు తెలిపారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల వద్ద అంతర్ జిల్లా చెక్ పోస్ట్‌ను ఎస్పీ మంగళవారం పరిశీలించారు. చెక్ పోస్ట్ రికార్డులను పరిశీలించారు. సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తనిఖీ చేయాలని సిబ్బందికి సూచించారు. తనిఖీల సమయంలో చెక్ పోస్ట్ సిబ్బంది స్వీయ రక్షణ పాటించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రాంతాలలో అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామమన్నారు. ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడినట్లైతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ అవసరాల నిమిత్తం సంతలో కొనుగోలు చేసిన పశువుల రవాణా చేస్తే సంత అధికారులు, పశువుల వైద్యుల అనుమతి పత్రాలు వెంట తీసుకువెళ్లాలన్నారు. ఆయన వెంట సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్సై బాలునాయక్, చెక్ పోస్ట్ విధులు నిర్వహణ సిబ్బంది, జాతీయ రహదారుల సిబ్బంది ఉన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
లెక్కా.. పత్రం లేదు!
కోదాడ : ప్రజలు చెల్లించిన పన్నులను వేతనాలుగా తీసుకుంటున్న కోదాడ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. తమ వద్ద పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎందరనే వివరాలు వారికి తెలియకపోవడం గమనార్హం. గత పాలకవర్గాలు, వాటి పెద్దలు ఇష్టారాజ్యంగా కోదాడ మున్సిపాలిటీలో తమ అనుయాయులను ఉద్యోగులుగా పెట్టుకున్నారు. ఇదే అదునుగా తామేమీ తక్కువ కాదన్నట్లు కొందరు అధికారులు కూడా ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కానీ ఇప్పటికీ ఉద్యోగుల వివరాలు తేలకపోవడంతో మూడు రోజుల క్రితం నూతన పాలకవర్గం మొత్తం కార్మికులను మున్సిపల్ కార్యాలయం వద్దకు పిలిచి ఫిజికల్ వెరిఫికేషన్ చేసింది. దీనిలో పనిచేయని 8మంది ఉద్యోగుల పేరుతో ప్రతినెలా రూ.1.20 లక్షలు అదనంగా చెల్లిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ కార్మికుల సంఖ్యలో స్పష్టత రాకపోవడం గమనార్హం. 22 ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న కార్మికులుకోదాడ మున్సిపాలిటీలో గతంలో 21 అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా 183 మంది వరకు కార్మికులు పనిచేసేవారు. గత పాలకవర్గంలో పెద్దలు దిగిపోతూ 22వ ఏజెన్సీ ద్వారా మరో 8 మందిని నియమించారు. దీంతో ప్రస్తుతం ఏజెన్సీల సంఖ్య 22కు చేరింది. ఈ 22వ ఏజెన్సీని ఎవరు.. ఎప్పుడు తీసుకున్నారనే విషయంలో స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఒక్క మున్సిపాలిటీలో ఇన్ని ఏజెన్సీలు ఎందుకు ఉన్నాయో అర్థం కావడం లేదని కౌన్సిలర్లు చెబుతున్నారు. ఇక మున్సిపాలిటీకి అన్నిరకాల వాహనాలు కలిపి 20 వరకు ఉన్నాయి. కానీ, 40 మంది వరకు డ్రైవర్ల పేరుతో పనిచేస్తున్నారని, వీరిని ఎవరు నియమించారు.? ఎక్కడ పనిచేస్తున్నారనే విషయంలో అధికారులకే స్పష్టత లేదని పలువురు కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.అక్కడ నేనే.. ఇక్కడ నేనే! ఇదిలా ఉండగా కొందరు కార్మికుల పేర్లు రెండు ఏజెన్సీల్లో నమోదై ఉండడాన్ని మూడు రోజుల క్రితం ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన నూతన పాలకవర్గం గుర్తించినట్లు సమాచారం. ఇలా 20 మంది వరకు కార్మికుల పేర్లు రెండు ఏజెన్సీల్లో నమోదు చేసి ఒక్కొక్కరికి రెండు వేతనాలు ఇస్తున్నారని వెంటనే వారిని నిలిపివేయాలని కోరినట్లు తెలిసింది. కొందరు విధులకు హాజరు కాకుండానే వేతనాలు తీసుకుంటున్నారు. కార్మికుల రోజువారీ హాజరు కూడా బయోమెట్రిక్ విధానంలో కాకుండా సాధారణ రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారని, దీనివల్లే అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనేది కొందరి వాదన. హాజరు విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని, పనిచేసే వారికే వేతనాలు చెల్లించాలని, ఒకరి పేరుతో ఇద్దరికి వేతనాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు.కోదాడ మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ కార్మికుల విషయంలో గతంలో జరిగిన అవకతవకలపై నూతన పాలకవర్గం దృష్టిసారించాలి. పూర్తి ప్రక్షాళన చేసి పనిచేసే కార్మికులకే వేతనాలు ఇవ్వాలి. ఇప్పటి వరకు దుర్వినియోగమైన డబ్బును తిరిగి రాబట్టాలి. –రాయపూడి చిన్ని, ప్రజాచైతన్య వేదిక కన్వీనర్ -
నీటి ప్రవాహానికి బండరాళ్లు అడు్డ
నాగార్జునసాగర్ : లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నిర్వహణపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. కాల్వలో పేరుకుపోయిన బండరాళ్లు నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వ సామర్థ్యం ప్రకారం ప్రవహించాల్సిన నీటికి, వాస్తవ ప్రవాహానికి పొంతన ఉండటం లేదని చెబుతున్నారు. కాల్వలో 11 లక్షల క్యూసెక్కులు ప్రవహించాల్సి ఉండగా, పూడిక, రాళ్ల వల్ల అది 9 నుంచి 10 లక్షల క్యూసెక్కులకు పడిపోయింది. అయితే, ఎడమ కాల్వ వద్ద ఉన్న గేజీ మీటర్ మాత్రం 13 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని చూపిస్తుండడం గమనార్హం. అధికారుల లెక్కల్లో తప్పులు ఉన్నాయని దీని ద్వారా స్పష్టమవుతోంది. కూలుతున్న దరులు.. పెరిగిన అడ్డంకులు కాల్వకు ఇరువైపులా ఉన్న రాతి దరులు వర్షాలకు నానుతుండటంతో అప్పుడప్పుడు కాల్వలోకి కూలిపోతున్నాయి. పదేళ్ల క్రితం వాటిని తొలగించారు. కానీ కాల్వ దరులను మాత్రం లైనింగ్ చేయలేదు. దరులపై చెట్లు పెరిగి, వాటి వేర్లు బలంగా పాకడంతో రాళ్లు వదులై నీటిలో పడుతున్నాయి. చిన్న రాళ్లు ప్రవాహానికి కొట్టుకుపోయి బొయ్యారం (టన్నెల్) లోకి చేరుతుండగా, పెద్ద బండరాళ్లు మాత్రం కాల్వలోనే ఉండిపోయి నీటి వేగాన్ని తగ్గిస్తున్నాయి. జలాశయం లోపల ఉన్న అప్రోచ్ కెనాల్లో పడిన రాళ్లను ఇప్పటి వరకు తొలగించకపోవడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనం. చేపల వేట కోసం కొందరు ఉపయోగిస్తున్న నాటు బాంబుల వల్ల కూడా ఈ రాతి దరులు బీటలు వారి నీటిలో పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాళ్లు తొలగించేందుకు ఇదే తగిన సమయం ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం తగ్గింది. అప్రోచ్ ఛానల్ మొత్తం బయటపడటంతో, అందులో పేరుకుపోయిన బండరాళ్లను తొలగించడానికి ఇదే సరైన సమయమని రైతులు సూచిస్తున్నారు. తూము ముందు భాగంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తేనే వచ్చే సీజన్ నాటికి నీటి సరఫరా సజావుగా సాగుతుంది.ఫ ఎడమకాల్వ అప్రోచ్ కెనాల్, తూము వద్ద కూలుతున్న దరులు ఫ ఏళ్లు గడుస్తున్నా తొలగించని అధికారులు ఫ లైనింగ్ చేయాలని రైతుల డిమాండ్ మరమ్మతులకు నిధులిస్తేనే.. కాల్వ దరులు పటిష్టంగా ఉండాలంటే ‘షార్ట్‌క్రీటింగ్’ పద్ధతిని చేపట్టాలని రిటైర్డ్ ఇంజనీర్లు సూచిస్తున్నారు. సన్నని ఇనుప జాలీని అమర్చి సిమెంట్‌తో లైనింగ్ చేయడం వల్ల దరులు కూలకుండా ఉంటాయి. ఇలా చేయడం వల్ల దరులపై చెట్లు మొలిచే అవకాశం కూడా ఉండదు. పెద్ద బండలకు డ్రిల్లింగ్ చేసి ఇనుప రాడ్లను అమర్చడం ద్వారా అవి కాల్వలో పడకుండా శాశ్వత పరిష్కారం చూపవచ్చు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, కాల్వ మరమ్మతులకు యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేయాలని ఆయకట్టు రైతాంగం డిమాండ్ చేస్తోంది. -
రాశులు దండిగా!
వాలీబాల్ నేర్చుకుందాం.. వేసవి సెలవుల్లో కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో వాలీబాల్ క్రీడలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.మార్కెట్ చిన్నగా..సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026- 8లోతిరుమలగిరి (తుంగతుర్తి) : ఉమ్మడి జిల్లాలోనే రెండవ అతి పెద్దదైన తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో స్థలం కొరత వేధిస్తోంది. ఈ మార్కెట్‌కు సంవత్సరం పొడవునా ధాన్యం, వేరుశనగ, మొక్కజొన్న, కందులు, పెసళ్లు వస్తుంటాయి. యాసంగి, వానాకాల సీజన్ల సమయంలో భారీగా ధాన్యం వచ్చినప్పుడు స్థలం సరిపోవడం లేదు. ప్రతి సీజన్లో రోజూ పదివేల నుంచి 30 వేల బస్తాల ధాన్యంతో పాటు ఇతర పంట ఉత్పత్తులను రైతులు తీసుకొస్తారు. 20 వేల బస్తాల కంటే ఎక్కువ ధాన్యం వచ్చిన రోజు స్థలం సరిపోక మార్కెట్లోని రెండు గేట్ల ముందు నుంచి లోపలికి వెళ్లే దారిలో సైతం ధాన్యం రాశులు పోస్తున్నారు. దీంతో రైతులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. తొమ్మిదిన్నర ఎకరాల్లో మార్కెట్ తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ 1973 వరకు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు అనుబంధంగా ఉండేది. 1993లో సూర్యాపేట–జనగామ ప్రధాన రహదారి వారాంతపు స్థలం పక్కన ఉన్న తొమ్మిదిన్నర ఎకరాల్లో ఏర్పాటు చేశారు. వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి చెందుతుండడంతో మార్కెట్ కార్యాలయం, రైతు విశ్రాంతి భవనం, ఈనామ్ కార్యాలయం ఏర్పాటు చేశారు. గోదాములతోపాటు వర్షం వస్తే పంట ఉత్పత్తులు తడవకుండా 9 రేకుల షెడ్లు నిర్మించారు. నాలుగు ఎకరాలలో గదులు, గోదాములు, చెట్లు పోను మిగతా ఐదున్నర ఎకరాల్లో ఓపెన్ ప్లాట్ఫారం ఉంది. కొత్తగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మార్కెట్లో కొత్తగా గతనెల 20న మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్క జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లాలో సూర్యాపేట,తిరుమలగిరి మార్కెట్లలోనే కేంద్రం ఏర్పాటు చేశారు. రైతులు తిరుమలగిరికే మొక్కజొన్న పంటను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 90 రాశులు పోశారు. 15 వేల బస్తాల మొక్క జొన్నలను మార్కెట్‌కు తీసుకొచ్చారు. దీనికి తోడు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన 3 వేల బస్తాలు ఎగుమతి కాగా 10 వేల బస్తాలు మార్కెట్లోఉన్నాయి. మొక్క జొన్నల ఎగుమతులు, కాంటాలు కాక ఆలస్యమవుతున్నాయి. ఒక్కో రైతు తీసుకొచ్చిన మొక్క జొన్నల అమ్మకానికి పది రోజులకు పైగా సమయం పడుతోంది. రైతులు రోజూ వచ్చే ధాన్యంతోపాటు ఇతర పంటలు తీసుకొస్తుండడంతో మార్కెట్లో స్థలం సరిపోవడం లేదు. ఎగుమతులు ఆలస్యం అవుతుండడంతో మార్కెట్ ఒకరోజు నడిస్తే రెండు రోజులు సెలవులు ఇవ్వాల్సివస్తోంది.బాధితుల ఇంటి వద్ద నుంచే కేసులు నమోదుసూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే సంఘటనలపై బాధితుల ఇళ్లకు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడి నుంచే కేసు నమోదు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాధితుల ఇంటి వద్ద నుంచే కేసు నమోదు, ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ పటిష్టంగా ముందుకు తీసుకెళ్తూ బాధితులకు ఇంటివద్దే పోలీసు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. సంఘటనలపై సమాచారం అందుకున్న వెంటనే వేగంగా బాధితుల ఇంటికి సంబంధిత పోలీసు అధికారులు చేరుకుని పారదర్శకమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వారం రోజుల్లో బాధితుల ఇంటి వద్దకు వెళ్లి 111 కేసులు నమోదు చేశామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సమస్యలపై డయల్ 100, ఫోన్ ద్వారా సమాచారం అందించి పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండానే కేసులు నమోదు చేసుకోవాలని కోరారు. మెరుగైన విద్య, వైద్యం ప్రభుత్వమే అందించాలిసూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యాలయాల్లో కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించడం ద్వారా సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు విద్య, వైద్యం ఉచితంగా అందించవచ్చని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన డీటీఎఫ్ ఐదవ జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి మాట్లాడుతూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయకుండా ప్రభుత్వం సుప్రీం కోర్టు లో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం సరికాదన్నారు. మొత్తంగా సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. డీఏలు మంజూరు చేయడంలో, పీఆర్సీ అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొచ్చెర్ల వేణు, బీవీ రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.పున్నయ్య, బి.వెంకటేశం, పి.వెంకులు, సత్తయ్య, వెంకటేశ్వర్లు, జె. రమణ, జి.ఆనంద్ భాస్కర్, సీహెచ్.సింహాద్రి, బి. క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ప్రజావాణిభానుపురి (సూర్యాపేట) : ఇక నుంచి ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ స్థాయి ప్రజావాణికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన ఆర్డీఓలను ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో మాత్రమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించామని, అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక పై ప్రతి సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి ఉంటుందని స్పష్టం చేశారు. డివిజన్ సాయి ప్రజావాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి నిర్వహిస్తారని తెలిపారు. డివిజన్ పరిధిలోని డివిజనల్ అధికారులు అందరూఈ ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించారు. డీఎస్పీ కార్యాలయాల్లోకూడా పోలీస్ ప్రజావాణిసూర్యాపేటటౌన్ : ఇక నుంచి ప్రతి సోమవారం డివిజన్ స్థాయిలో డీఎస్పీ కార్యాలయాల్లో కూడా పోలీస్ ప్రజావాణి ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రజలు వారి సమస్యలపై డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించే పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో డీఎస్పీలకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. కోదాడ, సూర్యాపేట డీఎస్పీ కార్యాలయాలలో పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలి పారు. డీఎస్పీ కార్యాలయాల్లో ప్రజా వాణికి అన్ని ఏర్పాట్లు చేయాలని డీఎస్పీలను ఆదేశించారు. ప్రజలు, బాధితులు, ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు.ఫ ఫిల్మ్ ఫెస్టివల్లో ధరించనున్న బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ ఫ కోదాడ మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ కార్మికుల సంఖ్యలో తేడా ఫ 22 ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న కార్మికులు ఫ ఎవరు.. ఎక్కడ పని చేస్తున్నారో అధికారులకే తెలియని పరిస్థితి ఫ మూడు రోజుల క్రితం ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన పాలకవర్గంమార్కెట్కు ప్రతిరోజూ ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులు అధికంగా వస్తాయి. మార్కెట్లో మొక్క జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల స్థలం సరిపోవడం లేదు. ఈ కేంద్రాన్ని మార్కెట్ పక్కనే ఉన్న సంతలో ఏర్పాటు చేయాలి. – వై.ధీన్‌దయాళ్, బీజేపీ నాయకుడు, తిరుమలగిరి తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పనులు చేపట్టడం అనాలోచిత నిర్ణయం. వెంటనే వాటి నిర్మాణాలు తొలగించి ఆ స్థలాన్ని రైతులు పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు అందుబాటులోకి తేవాలి. – కడెం లింగయ్య, రైతు సంఘం నాయకుడు, తిరుమలగిరి తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో స్థలం కొరత ఫ ఏడాది పొడవునా పంట ఉత్పత్తుల రాక ఫ సీజన్లో పోటెత్తుతున్న ధాన్యం ఫ కొత్తగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు ఫ ఇబ్బందులు పడుతున్న రైతులు, వ్యాపారులు మధ్యలోనే ఆగిన ‘ఇంటిగ్రేటెడ్’ నిర్మాణం ఈ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోనే మున్సిపాలిటీకి సంబంధించిన వెజ్, నాన్ వెజ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం 2023 సెప్టెంబర్ 5న ఎకరా స్థలంలో ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పనులు పిల్లర్ల వరకు పూర్తయి మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికే మార్కెట్లో స్థలం సరిపోవడం లేదనుకుంటే ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం వల్ల మరో ఎకరం స్థలం వృథాగా పోతుంది. ఈ స్థలంలో 10 వేల నుంచి 15 వేల బస్తాల ధాన్యం పోయడానికి అవకాశం ఉండేదని రైతులు అంటున్నారు. అధికారులు స్పందించి మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని వేరేచోటకు మార్చి, ఇబ్బందులు లేకుండా మార్కెట్ నడిచేలా చూడాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు. -
కుటుంబ ప్రయోజన పథకం.. ఇక సులభం
భానుపురి (సూర్యాపేట) : పేద ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకొచ్చింది. ఇంటి పెద్ద ఏదైనా కారణంతో మరణిస్తే రూ.2 లక్షల ఆర్థిక ప్రయోజనం కల్పించనుంది. మరణించిన తర్వాత జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఈ సొమ్మును అందించనుంది. గతంలో దరఖాస్తులను తహసీల్దార్లు విచారణ చేసి నివేదికలను కలెక్టర్లకు పంపితే నిధులు మంజూరు చేసేవారు. ఈ క్రమంలో జాప్యం చోటు చేసుకునేది. ప్రస్తుతం లబ్ధి పొందే విధానంలో మార్పులు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పుర, నగరపాలికల్లో కమిషనర్లకు అర్హులను గుర్తించే అధికారాన్ని అప్పగించారు. ఇందుకు నిర్దిష్ట గడువు కూడా విధించడంతో దరఖాస్తులు త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. దరఖాస్తులు ఇలా..ఆహార భద్రత కార్డు, మృతుడి ఆధార్ కార్డు, గ్రామపంచాయతీ నుంచి తీసుకున్న మరణ ధ్రువీకరణ పత్రం, మృతుడి వయస్సు నిర్ధారణ పత్రం, దరఖాస్తుదారుని ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం, దరఖాస్తుదారుని బ్యాంకు ఖాతా పుస్తకాలన్ని జతచేసి మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత పత్రాలను ఎంపీడీఓ కార్యాలయాల్లో అందించాల్సి ఉంది. పది రోజుల్లో పరిశీలన..బాధిత కుటుంబ సభ్యులు అన్ని పత్రాలు జతచేసి ఎంపీడీఓ, పుర, నగరపాలక సంస్థ కార్యాలయాల్లో అందించిన పది రోజుల వ్యవధిలో విచారణ పూర్తిచేసి నివేదికలు సమర్పించాలి. గతంలో రెవెన్యూ శాఖ పరిధిలో ఉండడంతో క్షేత్ర స్థాయి విచారణలో జాప్యం చోటు చేసుకునేది. రెవెన్యూ శాఖలో వివిధ రకాల పనులు ఉండడంతో ఈ దరఖాస్తుల పరిశీలనకు అధికారులకు సమయం లేకుండా పోయేది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం తాజా మార్పులు తీసుకురావడంతో వేగంగా నిధులు మంజూరయ్యే అవకాశాలున్నాయి.ఫ కీలక మార్పులు తెచ్చిన కేంద్రం ఫ తహసీల్దార్ల నుంచి ఎంపీడీఓలకు బాధ్యతలు ఫ ఇంటి పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు రూ.2 లక్షల సాయం18 నుంచి 60 ఏళ్ల లోపు.. కుటుంబాన్ని పోషించే 18 నుంచి 60 ఏళ్ల లోపు వ్యక్తిని కోల్పోయిన వారు గ్రామాల్లో అయితే పంచాయతీ కార్యాలయాలు, పట్టణాల్లో పురపాలికల్లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టి మంజూరుకు సిఫార్సు చేస్తే ఎవరి ప్రమేయం లేకుండా నిధులు నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమఅవుతాయి. 2017, ఏప్రిల్ 13 తర్వాత మరణించిన వారి కుటుంబ సభ్యులు దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. -
‘కేన్స్’లో మెరవనున్న పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు
భూదాన్‌పోచంపల్లి : ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఈ నెల 17 నుంచి 21 వరకు 79వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలో తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ధరించి రెడ్ కార్పెట్ వాక్ చేయనుంది. అదేవిధంగా ప్రీ ఈవెంట్ పార్టిసిపేషన్, ర్యాంప్ అండ్ స్టైలింగ్ చేయనున్నారు. హౌజ్ ఆఫ్ వెండోమ్ ప్యారిస్, కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోకు మన దేశం నుంచి తెలంగాణకు చెందిన రష్మీ ఠాకూర్‌ను ఎంపిక చేశారు. ఫ్యాషన్ షోకు అవసరమైన ఇక్కత్ వస్త్రాలను పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ సీఈఓ తడక రమేశ్ ఆదివారం రష్మీ ఠాకూర్‌కు పంపించారు. తడక రమేశ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వీవర్స్ సర్వీస్ సెంటర్ ద్వారా తమకు ఇక్కత్ వస్త్రాలను అందించేందుకు అవకాశం కల్పించిందని అన్నారు. ఆదివారం రూ.లక్ష విలువైన ఎంపిక చేసిన ఇక్కత్ వస్త్రాలను అందజేశామన్నారు. తనకు ర్యాంప్ వాక్‌లో చేనేత కళాకారుడిగా పాల్గొనే అవకాశం వచ్చిందన్నారు. -
సాగు చేస్తూ.. స్వయంగా విక్రయిస్తూ..
చిలుకూరు : వేసవిలో ఆకుకూరలు, కూరగాయలకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో చిలుకూరు మండలంలోని పలు గిరిజన తండాల్లో వాటిని సాగు చేయడానికి గిరిజన రైతులు ఆసక్తి చూపుతున్నారు. చిలుకూరు మండలంలోని జానకీనగర్, దూదియాతండా, శీత్లాతండా, కొమ్ముబండ తండా, సీతరాంతండా గ్రామాల్లో గిరిజన రైతులు ఎక్కువగా ఆకు కూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. తమకున్న కొద్దిపాటి భూముల్లో బోర్లు, వ్యవసాయ బావుల కింద 5 గుంటలు, 10 గుంటల భూమిలో ఆకు కూరలు సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ గ్రామాల్లో దాదాపుగా 50 మందికి పైగా రైతులు 20 ఎకరాల్లో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తున్నారు. గతంలో దళారులకు అమ్మి మోసపోయిన గిరిజనులుగిరిజన తండా రైతులు తాము పండించిన పంటలను స్వయంగా విక్రయిస్తున్నారు. గతంలో దళారులకు అమ్మి తీవ్రంగా నష్ట్రపోయామని.. దీంతో తామే స్వయంగా అమ్మకుంటున్నామని పలువురు గిరిజన రైతులు అంటున్నారు. గిరిజన తండా రైతులు ఉదయం వేళల్లో మోటార్ బైక్‌లపై వివిధ రకాలు ఆకు కూరలు, కూరగాయలను కట్టుకొని చిలుకూరు మండలంలోని పలు గ్రామాల్లో, హుజూర్నగర్, కోదాడ పట్టణాల్లో విక్రయిస్తున్నారు. మహిళలు గంపలతో ఇంటింటికీ తిరుగుతూ తండాల చుట్టు పక్కల గ్రామాల్లో అమ్ముతుంటారు. ప్రధానంగా గిరిజన రైతులు గోంగూర, బచ్చలకూర, తోటకూర, పాలకూర, పుదీనా, కొత్తిమీర లాంటి ఆకుకూరలు.. వంకాయలు, దొండకాయలు, బెండకాయలు, దోసకాయలు లాంటి కూరగాయలు సాగు చేస్తూ అమ్ముకుంటున్నారు. ఆకు కూరలను ప్రతి పది రోజుల ఒకసారి కోసి కట్టలు కట్టి విక్రయిస్తామని పలువురు గిరిజన రైతులు తెలిపారు.ఫ ఆకుకూరలు, కూరగాయల సాగుపై గిరిజనుల ఆసక్తి ఫ ఎరానికి రూ.10 వేల నుంచి 15 వేల వరకు ఆదాయం ఫ సబ్సిడీపై విత్తనాలు, పురుగు మందులు అందించాలని వినతిఎండాకాలంలో నిత్యం కాపలా.. కూరగాయల సాగుకు ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఆదాయం వస్తోందని రైతులు అంటున్నారు. కాగా ఎండాకాలంలో రైతులు తమ గేదెలను అడవికి వదలడం వల్ల ఆకు కూరలు, కూరగాయల తోటల వద్ద నిత్యం కాపలా ఉండాల్సి వస్తోందని గిరిజన రైతులు చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం సాగుకు కావాల్సిన విత్తనాలను సబ్సిడీపై అందిస్తే ఇంకా మరి కొంత మంది రైతులు సాగుపై ఆసక్తి చూపుతారని పేర్కొంటున్నారు. ఈ వేసవిలో ప్రస్తుతం మా కుటుంబ సభ్యులం బచ్చలకూర, గోంగూర, పాలకూర తదితర ఆకు కూరలు సాగు చేశాం. ప్రతి రోజు సాగులో పని ఉంటుంది. మందులు కొట్టడం, కూరగాయల సాగులో గడ్డి తీయడం లాంటి పనులు చేస్తున్నాం. ప్రతిరోజు ఆకుకూరలను స్వయంగా గ్రామంలో తిరుగుతూ అమ్ముకుంటున్నా, రోజుకు రూ.1000 వరకు వస్తున్నాయి, విత్తనాల రేట్లు కూడా విపరీతంగా ఉన్నాయి. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయాలి.– భూక్యా లక్కి, దూదియాతండా -
రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి
నడిగూడెం : రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఒక మాజీ ఐపీఎస్ భార్య హత్యకు గురైందని, శాంతి భద్రతలు గాడి తప్పాయనడానికి ఈ ఘటన నిదర్శనమన్నారు. కరీంనగర్లో పట్టపగలే జ్యువెలరీ దుకాణంలో దొంగతనం జరిగిందని, ఈ ఘటనలో ఇంతవరకు దుండగులను పట్టుకోలేకపోయారన్నారు. బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలను అదుపు చేయడంలో విఫలమైన సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. కోదాడలో జరిగిన దళిత యువకుడి లాకప్ డెత్, ఈ నెల 6న కోదాడలో భార్యను భర్త చంపడం శాంతి భద్రతల లోపాలకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, మండల సమన్వయకర్త అనంతుల ఆంజనేయులు, భోనగిరి ఉపేందర్, జలీల్, కాసాని ఉపేందర్ పాల్గొన్నారు. స్వేరోస్‌పై యువతకు అవగాహన కల్పించాలి మోతె : స్వేరోస్‌పై విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించాలని స్వేరోస్ వ్యవస్థాపకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన మోతె మండల కేంద్రంలో స్వేరోస్ ముఖ్య కార్యకర్తలతో మాట్లాడారు.అనంతరం స్వేరోస్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ–దీపిక దంపతుల కుమార్తెకు నామకరణం చేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య, స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు చిలకపత్దిని వీరయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొల్లికొండ వీరాస్వామి, నిర్మల, రవికుమార్, మండల అధ్యక్షుడు దున్నపోతులు దుర్గారావు పాల్గొన్నారు. భీమ్ హోం నిర్మిస్తాం చిలుకూరు : ఇటీవల మృతి చెందిన చిలుకూరు గ్రామానికి చెందిన స్వేరోస్ నాయకుడు గురువయ్య కుటుంబానికి స్వేరోస్ ఆధ్వర్యంలో భీమ్ హోం నిర్మించి ఇస్తామని స్వేరోస్ వ్యవస్థాపకుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. చిలుకూరులోని జేజే నగర్లో ఇటీవల మృతి చెందిన స్వేరోస్ నాయకుడు కందుకూరి గురువయ్య కుటుంబాన్ని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం పరామర్శించారు. గురువయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువయ్య పిల్లల బాధ్యతను స్వేరోస్ చూసుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొల్లికొండ వీరస్వామి, కందుకూరి ఉపేందర్, ముదిగొండ చిరంజీవి పాల్గొన్నారు.ఫ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ -
1.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం
భానుపురి (సూర్యాపేట) : ప్రస్తుత యాసంగి సీజన్ 2025–26 కు సంబంధించి 1.85 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించి రైస్ మిల్లులకు పంపించామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్, జిల్లా రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇంకా సుమారు 1.55 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం మిల్లుల వద్దకు వచ్చిన వెంటనే అన్ లోడింగ్ చేయాలని సూచించారు. రైస్ మిల్లర్ల సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి సమస్య రాకుండా చూడాలన్నారు. ధాన్యం మిల్లింగ్ పూర్తి చేసిన తదుపరి సీఎంఆర్ పెండింగ్ లేకుండా ఎఫ్‌సీఐ కి బియ్యం అందజేయాలన్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సివిల్ సప్లయ్ అధికారులు, రైస్ మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఎస్ఓ మోహన్‌బాబు, జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ శ్రీధర్‌రెడ్డి, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా నూతన రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా బి.హరిసింగ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌ను కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరిసింగ్‌కు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్‌కు జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. 11వ తేదీ నుంచి విద్యా వారోత్సవాలుసూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 11 నుంచి ఎంపిక చేయబడిన పాఠశాలల్లో 15 రోజుల సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లుభానుపురి (సూర్యాపేట) : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ బి.హరిసింగ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.. శుక్రవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ చాంబర్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలపై విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు థియరీ పరీక్షలు జరుగుతాయని, మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు, రెండో సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా సీసీ కెమెరాల నిఘా, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఐఈఓ బి.సులోచనరాణి, భానునాయక్, ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలి చిలుకూరు : రైతులు వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమను అనుబంధ రంగంగా ఎంచుకుంటే ఆర్థికంగా బలోపేతం అవుతారని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ బి.శ్రీనివాస్‌రావు అన్నారు. శుక్రవారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చిలుకూరు పశువైద్యశాలలో పశువైద్య శిబిరంతోపాటు మేలు జాతి దూడల ప్రదర్శనను సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేలు జాతి గ్రాసాలను పెంచుకోవాలని, అప్పుడే తక్కువ ఖర్చుతో పాల ఉత్పిత్తి అధికంగా పెంచవచ్చన్నారు. మేలుజాతి దూడలు, మేలు జాతి గడ్డి ప్రదర్శనలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి తిలకించారు. అనంతరం ఈ ఏడాది అత్యధికంగా పాలు పోసిన రైతులు సుజాత, శ్రీనులను ఘనంగా సన్మానించారు. పశువైద్య శిబిరంలో 63 పశువులకు ఉచిత గర్భకోష వ్యాధి చికిత్స చేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య సొసైటీ అధికారి నాగులనాయక్, డీసీఓ ప్రవీణ్, ఏడీఏ డాక్టర్ పెంటయ్య, ఏడీఓ ప్రశాంతికుమారి, మండల పశువైద్యాధికారి వీరారెడ్డి, మండల వ్యవసాయాధికారి శ్రీధర్, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, ఉప సర్పంచ్ బెల్లంకొండ నాగయ్య, ఫ్యాక్స్ చైర్మన్ అలసకాని జనార్దన్, గ్రామ మత్స్యసొసైటీ అధ్యక్షుడు రామకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారు
హుజూర్నగర్ : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రహస్య పొత్తులు పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హుజూర్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రమంత్రి బండి సంజయ్.. తమ ఎమ్మెల్యేలపై దాడి చేయించడం హేయమైన చర్య అన్నారు. కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హింస పాలన నడుస్తోందని, ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని విమర్శించారు. సమస్యలను దాన్ని పక్కదారి పట్టించేందుకే డైవర్షన్‌న్ పాలిటిక్స్ చేస్తూ కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఎవరు ఎన్ని దాడులు చేసినా, కవ్వించినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సభతో కాంగ్రెస్, బీజేపీలకు భయం పట్టుకుందని అన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు వి.నరసింహారెడ్డి, పిల్లుట్ల రఘు, మారిపెద్ది శ్రీనివాస్, జక్కుల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.ఫ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి -
యువత మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దు
మద్దిరాల : యువత మద్యం, డ్రగ్స్, ఇతర మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దని అడిషనల్ ఎస్పీ పాలకూరి నారాయణ, డీఎస్పీ ప్రసన్నకుమార్ అన్నారు. శుక్రవారం మద్దిరాల మండల పరిధిలోని పోలుమల్ల గ్రామంలో పోలుమల్ల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రగ్ ఫ్రీ సొసైటీ, రోడ్డు సేఫ్టీపై యువతకు 2 కే రన్ ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ నారాయణ, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి 2 కే రన్ ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన పోలుమల్ల స్పోర్ట్స్ క్లబ్ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొన్ని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. యువత డ్రగ్స్, మద్యానికి బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. పోలుమల్ల యువత చక్కటి నిర్ణయం తీసుకుని డ్రగ్ ఫ్రీ సొసైటీ, రోడ్డు సేఫ్టీపై 2 కే రన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం గోరెంట్ల తెలుగు ఉపాధ్యాయుడు ప్రభాకర్ వినూత్న వేషధారణలో డ్రగ్స్, మాదకద్రవ్యాల నివారణపై యువతకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఐ ఎం.వీరన్న, సర్పంచ్ రేసు లింగయ్య, ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ జహీర్, వెంకటయ్య, ఎలిపెద్ది రవి, స్పోర్ట్స్శ్రీ క్లబ్ అధ్యక్షుడు జటంగి శ్రవణ్‌కుమార్, రేసు సతీష్, రేసు తరుణ్, మామునూరి ఉపేందర్, రాకేష్, అంజి, ప్రవీణ్‌కుమార్, సాయిరెడ్డి, ఉమేష్, మహేష్, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీ పాలకూరి నారాయణ -
ఎస్బీఐ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి
సూర్యాపేట : ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ పిలుపులో భాగంగా శుక్రవారం సూర్యాపేట రీజియన్ కార్యాలయం వద్ద ఎస్బీఐ యూనియన్ నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన 16 డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు. మూడు దశాబ్దాలుగా నిలిచిపోయిన మెసెంజర్ల నియామకాలు చేపట్టాలని, ఆర్మ్డ్ గార్డుల నియామకం, ఎన్పీ ఉద్యోగులకు పెన్షన్ ఫండ్ మేనేజర్ మార్చుకునే అవకాశం కల్పించాలని కోరారు. 2019 తరువాత నియమితులైన ఉద్యోగులకు ఇంటర్ సర్కిల్ బదిలీలు చేపట్టాలని, ఔట్సోర్సింగ్ నియామకాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సూర్యాపేట రీజినల్ సెక్రటరీ అయితగోని మహేష్, సురేష్, నవీన్, క్రాంతి, కిశోర్, ప్రియాంక, చందు, కిరణ్, నవ్య, పుష్ప, మమత పాల్గొన్నారు. -
సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలు
కోదాడరూరల్ : ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీ చేయాలని చేయాలని ఎస్పీ నరసింహ పోలీస్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. గురువారం కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్ వద్ద గల అంతరాష్ట్ర చెక్ పోస్టును ఆయన తనిఖీ చేశారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం, పీడీఎస్ బియ్యం, మద్యం, ఇసుక వంటివి అక్రమ రవాణా జరగకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అనంతగిరి ఎస్ఐ నవీన్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ అధికారులు ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. నూతనంగా నియామకమైన డిప్యూటీ తహసీల్దార్లకు పోలీసు అంశాలపై శిక్షణలో భాగంగా గురువారం వారు ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ వారికి పలు విషయాలపై సలహాలు, సూచనలు చేశారు. వారం రోజులపాటు పోలీసులతో కలిసి పని చేయడంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. -
సాగులో యాంత్రీకరణతో అధిక దిగుబడులు
ఫ రాష్ట్ర మార్కెంటింగ్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ చివ్వెంల(సూర్యాపేట) : సాగులో యాంత్రీకరణ ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతువేదికలో రైతు వారోత్సవాల్లో భాగంగా వ్యవసాయ, విద్యుత్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సాగు యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యంత్రాల సాయంతో సాగు చేయడం వల్ల పెట్టుబడి తగ్గించడంతో పాటు కూలీల కొరతను అధిగమించవచ్చన్నారు. పురుగుల మందులు స్ప్రే చేసేందుకు డ్రోన్లను వినియోగించాలన్నారు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్తలు అరుణ కుమారి, సునీత పలు విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. విద్యుత్‌శాఖ డీఈ విద్యాసాగర్ మాట్లాడుతూ పీఎం కుసుమ్ కాంపోటెంట్ పథకం, మోడల్ సోలార్ వేజ్ కార్యక్రమంపై వివరించారు. కార్యక్రమంలో డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీసీఓ ప్రవీణ్‌కుమార్, డీఎంఓ నాగేశ్వర్‌శర్మ, ఏడీఏ జ్ఞానేశ్వరి, ట్రాన్స్‌కో ఏడీఈ రాములునాయక్, టౌన్ ఏడీ శ్రీనివాస్‌రావు, ఏఈ మల్లయ్య, చివ్వెంల, ఆత్మకూర్(ఎస్), పెన్‌పహాడ్, సూర్యాపేట ఏఓలు వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్, దివ్య, కృష్ణ సందీప్, సర్పంచ్‌లు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
టైలరింగ్‌లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు
నల్లగొండ : నల్లగొండలోని రాంనగర్లో గల ఎస్బీఐ ఆర్సెటి (స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ)లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గ్రామీణ నిరుద్యోగ మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ సియాజిరాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13వ తేదీలోగా ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు సెల్ : 9701009265 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధనడిగూడెం : ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, అధ్యాపకులు వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించా లని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సులోచనా రాణి సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె తనిఖీ చేశారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై పలు విషయాలపై మట్లాడారు. ఈ నెల 13 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలలో విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యే విధంగా అధ్యాపకులు కృషి చేయాలన్నారు. అనంతరం వచ్చే విద్యా సంవత్సరం అడ్మిషన్లకు సంబంధించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ డి.విజయనాయక్, అధ్యాపకులు డాక్టర్.జానిపాషా, కర్నాటి శ్రీధర్, మహేష్, ఈశ్వర్, ఉపేందర్, శ్రీనివాస్, వీరన్న, నాగరాజు, మదార్ ఉన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలిపెన్పహాడ్ : ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నేషనల్ హెల్త్ మిషన్ జిల్లా ప్రాజెక్ట్ అధికారి ఉమామహేశ్వరి సూచించారు. గురువారం మండల కేంద్రంతో పాటు లింగాల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీదేవితో కలిసి ఆమె సందర్శించారు. ఆయా కేంద్రాలలో అందుతున్న వైద్య సేవలను, రికార్డులను పరిశీలించారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా అందుతున్న నిధుల వినియోగం, వాటి వ్యయ వివరాలు, మందుల నిల్వలకు సంబంధించిన స్టాక్ రికార్డులను తనిఖీ చేశారు. ఆమె వెంట మండల వైద్యాధికారి రాజేష్, ఎంఎల్‌హెచ్‌పీ రవీందర్, నసీమ ఉన్నారు. వృద్ధాశ్రమాలలో వసతులు కల్పించాలిమునగాల : వృద్ధాశ్రమాల్లో తగిన వసతులు కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారి కె.నర్సింహారావు ఆదేశించారు. మండలంలోని ముకుందాపురం శివారులో గల ఇందిర అనాథ, వృద్ధాశ్రమాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఆశ్రమానికి సంబంధించిన రికార్డులను పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వృద్ధా శ్రమాలలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. సదరు వృద్ధాశ్రమంలో వసతులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఆశ్రమ వ్యవస్థాపకురాలు నాగిరెడ్డి విజయమ్మ, ఇన్చార్జి వాచేపల్లి జ్యోతి ఉన్నారు. యాదగిరీశుడికి పూజలుయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఘనంగా ఊరేగించారు. -
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
అర్వపల్లి : ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. అర్వపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం పార్టీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లారీల కొరతతో ధాన్యం ఎగుమతులు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మిల్లర్లు తాలు పేరుతో ధాన్యం తూకాల్లో కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రాలలో సకాలంలో కాంటాలు, ధాన్యం ఎగుమతులు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి, కొలిశెట్టి యాదగిరిరావు, నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు దండ వెంకట్‌రెడ్డి, పులుసు సత్యం, కొప్పుల రజిత, పార్టీ మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్, నాయకులు శిగ వెంకన్న, బొడ్డు సైదులు, అబ్బులు, కొమ్ము విజయ్, సంపతి వెంకన్న, సుజాత, శిగ శ్రీను ఉన్నారు. -
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం
హుజూర్నగర్ : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. గురువారం హుజూర్‌నగర్‌కు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా బీజేపీ విజయపథంలో దూసుకుపోతుందన్నారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో ప్రజలు బీజేపీకి భారీ మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారని తెలిపారు. దాంతో పాటు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు. సభను విజయవంతం చేయడానికి జిల్లా నలుమూలల నుంచి యువత, మహిళలు, రైతులు, మేథావులు, కార్మికులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీలత, పట్టణ అధ్యక్షులు కొండ హరీష్, నాయకులు మల్సూర్, కె కోటిరెడ్డి, చంద్రయ్య, శ్రీనివాస్, విజయ్, నాగరాజు, బల్వంత్ సింగ్, రామారావు, పృథ్వి పాల్గొన్నారు. -
పల్లెల్లో ఉపాధి బాట
భానుపురి (సూర్యాపేట) : గ్రామీణ ప్రాంత కూలీలు ఉపాధి హామీ పనుల బాట పడుతున్నారు. వారం రోజుల క్రితం వరకు ఉపాధి పనులపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఏ గ్రామ పంచాయతీలో చూసినా 50 మందికి మించి పనులకు హాజరు కాలేదు. ప్రస్తుతం వ్యవసాయ పనులు మందగించడంతో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరుగుతోంది. ఉపాధి కూలీల సంఖ్యను పెంచేందుకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ 10 రోజులుగా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పని ప్రదేశంలో నీడ, మంచినీరు వంటి వసతులు కల్పించాలని, ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 100 మంది కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చర్యలు చేపట్టడంతో కూలీల సంఖ్య కూడా పెరుగుతోంది. ఎండల తీవ్రత అధికంగా ఉన్నా.. ఉదయం 6 గంటలకే పనులు మొదలవుతుండడంతో కూలీలు ఆసక్తి చూపుతున్నారు. పనులకు వెళ్లిన వారికి మంచి కూలి పడుతుండడంతో మిగతా వారు సైతం ఇటువైపుగా వస్తున్నారు. జిల్లాలో 1,66,707 జాబ్‌కార్డులు సూర్యాపేట జిల్లాలో మొత్తం 1,66,707 జాబ్ కార్డులు ఉన్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని కూలీలకు సుమారు 20,86,820 పనిదినాలు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యాన్ని నిర్దేశించాయి. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని వీక్షిత్ భారత్ – రోజ్‌గార్, ఆజీవికా మిషన్ (వీబీ–జీ రామ్‌జీ)గా మార్చింది. గతంలో ఈ పథకం కింద కూలీల హాజరు కోసం ఉన్న నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్) యాప్‌ను ఉన్నతీకరించింది. దాంతో కూలీలు ఉదయం పని మొదలు పెట్టే ముందు ఒకసారి, తర్వాత 4 గంటలకు మరోసారి ఫొటోలు దిగాల్సి ఉంటుంది. అప్పుడే కూలీల వేతనం నేరుగా వారి అకౌంట్లలో జమ అవుతుంది. వ్యవసాయ పనులు లేక.. సూర్యాపేట జిల్లాలో 4.80 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. వరికోతలు ముగియడంతో రైతులంతా ధాన్యం అమ్మకం, వరిగడ్డి సేకరణ పనుల్లో నిమగ్నమయ్యారు. భూమిలేని కూలీలు మిరపచేను ఏరేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులన్నీ ముగిశాయి. ధాన్యం అమ్మకాలు చివరి దశకు చేరగా, మిరప చేనులు ఏరడం కూడా అయిపోయింది. దాంతో కూలీలంతా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత నెల 29న జిల్లావ్యాప్తంగా 28,335 మంది కూలీలు పనులకు హాజరు కాగా బుధవారం 43,667 మంది హాజరయ్యారు. వారం రోజుల్లోనే 15,332 మంది కూలీలు పెరిగారు. జిల్లాకు అధికారులు నిర్ధేశించిన లక్ష్యంలో ఇప్పటి వరకు కేవలం 17.56 శాత కూలీలకు మాత్రమే పనులు కల్పించారు. ఇప్పటి వరకు జిల్లాలో 3,66,438 పని దినాలను పూర్తి చేశారు. జాబ్‌కార్డులు : 1,66,707పనిదినాల లక్ష్యం : 20,86,820ఇప్పటి వరకు కల్పించిన పనిదినాలు : 3,66,438 ప్రతి గ్రామపంచాయతీకి సగటున : 84 మందికి ఫ ఉపాధిహామీ పనులకు పెరుగుతున్న హాజరుశాతం ఫ వ్యవసాయ పనులు లేక కూలికి ఫ మండుటెండను సైతం లెక్కచేయకుండా కూలీల రాక ఫ బుధవారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 43,667 మంది హాజరుజిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉపాధిహామీ పనులకు కూలీల హాజరు శాతం పెరుగుతుండడంతో రానున్న రోజుల్లో పనిదినాలు కూడా అధికం కానున్నాయి. మరో నెలరోజుల పాటు పనులను కల్పించేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీకి సగటున రోజుకు 84 మంది కూలీలకు పనులు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో అత్యధికంగా మద్దిరాల మండలంలో గ్రామపంచాయతీకి సగటున 139 మందికి, ఆత్మకూర్ (ఎస్) మండలంలో 127, నూతనకల్‌లో 123 మందికి చొప్పున పనులను కల్పిస్తున్నారు. అత్యల్పంగా పాలకీడు మండలంలోని గ్రామపంచాయతీల్లో కేవలం 38 మందికి మాత్రమే పనులు కల్పిస్తున్నారు. -
శిథిల కార్యాలయంలోనే అధికారి విధులు
అర్వపల్లి : అర్వపల్లి శివారులోని విద్యుత్ ఉపకేంద్రంలో ఉన్న ఏఈ కార్యాలయ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. 40 ఏళ్ల క్రితం సబ్ స్టేషన్ ఏర్పాటు చేసే సమయంలోనే ట్రాన్స్‌కో ఏఈ కార్యాలయం, స్టోర్ రూం, ఆపరేటర్ గదితో పాటు ఇతర గదులను నిర్మించారు. ప్రస్తుతం ఇవి శిథిలమయ్యాయి. భవనంపై చెట్లు పెరుగుతున్నాయి. దాంతో ఏఈతో పాటు సిబ్బంది భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇవి కూలితే సిబ్బంది ప్రాణాలకే ప్రమాదం. ఉన్నతాధికారులు స్పందించి శిథిలమైన భవనం స్థానంలో కొత్తది నిర్మించాలని సిబ్బంది కోరుతున్నారు. -
భార్యను నడిరోడ్డుపై పొడిచి చంపిన భర్త..!
సూర్యాపేట జిల్లా: కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు భర్త. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ ఎదరుగా బుధవారం జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా నేలకొండపలి్లకి చెందిన బత్తుల శిరీష(24), కోదాడ పట్టణ పరిధిలోని బాబునగర్‌కు చెందిన పాయిలి మణిదీప్ ఐదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో మణిదీప్ ఫిర్యాదు చేయడంతో..ఆ కేసు నిమిత్తం శిరీష తన పెద్దమ్మను తీసుకొని బుధవారం పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. రాత్రి కావడంతో పోలీసులు గురువారం ఉదయం రమ్మని చెప్పడంతో శిరీష, ఆమె పెద్దమ్మ కలిసి ఏపీలోని జగ్గయ్యపేటకు వెళ్లేందుకు కోదాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆటోస్టాండ్ వద్దకు చేరుకున్నారు. జగ్గయ్యపేటకు వెళ్లే ఆటోలో ఎక్కి కూర్చున్న శిరీషను ఆమె భర్త కిందకు లాగి కత్తితో పొడిచే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. వారిని నెట్టేసి ఆమె ఛాతీలో నాలుగైదుసార్లు పొడవడంతో తీవ్ర రక్తస్రావమై కిందపడిపోయింది. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి పెద్దమ్మ వెంకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉలిక్కిపడిన కోదాడకోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జన సంచారం ఉండే బస్టాండ్ సెంటర్లో ఈ హత్య జరగడంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. హత్య జరిగిన వార్త వాట్సాప్‌లో ప్రచారం కావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.Cctv record Kodad lo near rk tea stall daggara murder jarigindi https://t.co/JTyAE5Roen pic.twitter.com/jNWyrK3DTt— chintu (@MchintuM) May 7, 2026 -
నిధులు రాకుండా అడ్డుకుంటున్న ఎమ్మెల్యే
మోత్కూరు: దళిత బంధు నిధులు విడుదల కాకుండా ఎమ్మెల్యే మందుల సామేల్ అడ్డుకుంటున్నారని పలువురు లబ్ధిదారులు ఆరోపించారు. ఈవిషయంలో మోతూరులో ఎమ్మెల్యేతో వారు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా విలేకరులో వారు మాట్లాడారు. గత ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని మొదటి విడత విజయవంతంగా అమలు చేసిందని , 2023లో రెండో విడతలో భాగంగా మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన 254 మంది లబ్ధిదారుల అకౌంట్లలో రూ.3 లక్షల చొప్పన జమ చేసిందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు వచ్చి కోడ్ అమల్లోకి రావడంతో రూ.3 లక్షలు జమ చేసిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిందన్నారు. అంతటితో పథకం ఆగిపోయిందని కానీ యూనిట్లు మంజూరైన వారికి గ్రౌండింగ్ పూర్తి చేయాలని 2025లో ఎస్సీ కార్పొరేషన్ ఎం.డీ ఆదేశాలు జారీ చేశారన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమలుకు చర్యలు తీసుకున్నారుకానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అడ్డగూడూరు, మోత్కూరు మండలాలకు చెందిన 254 మంది కుటుంబాల లబ్ధిదారులకు మాత్రం నిధులు విడుదల కాకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఒక దళిత ఎమ్మెల్యే అయి ఉండి దళితుల పొట్ట కొడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని గ్రౌండింగ్ పూర్తి చేసి నిధులు విడుదలయ్యేలా చూడాలని లేకుంటే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత బంధు లబ్ధిదారులు కూరెళ్ల రమేష్, బండి వెంకటేష్, దాసరి నరేష్, బుషిపాక శ్రీకాంత్, ఆనంద్, నాగరాజు, ఆనందం తదితరులు పాల్గొన్నారు. ఫ దళిత బంధు లబ్ధిదారుల ఆరోపణ ఫ ఎమ్మెల్యే సామేల్‌తో వాగ్వాదం -
గుడిబండకు తరలిన రవాణా శాఖ కార్యాలయం
కోదాడరూరల్ : ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో కొనసాగుతున్న కోదాడ రవాణా శాఖ కార్యాలయం ఎట్టకేలకు బుధవారం గుడిబండ శివారులోని సొంత భవనంలోకి మారింది. ప్రభుత్వ గుడిబండ శివారులోని లెప్రసీ వైద్యశాలలో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో అధికారులు కార్యాలయాన్ని అక్కడి తరలించారు. అక్కడ ఉన్న పాత భవనానికి మరమ్మతులు చేసి కార్యకలాపాలు ప్రారంభించారు. ఇక నుంచి వాహనదారులు గుడిబండకు రావాలని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎన్.వాణి, డీటీఓ జయప్రకాశ్రెడి, ఎంవీఐ ఎస్కె.జిలానీ, సిబ్బంది పాల్గొన్నారు. ఆలయ భూముల కౌలుపై బహిరంగ విచారణహుజూర్నగర్ : అమరవరంలోని శ్రీఅమరలింగేశ్వరస్వామి ఆలయ భూముల కౌలు విషయమై బుధవారం ఆలయ ఈఓ గుజ్జుల కొండారెడ్డి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అర్చకులకు చెందిన భూముల కౌలు విషయంలో కొందరు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏసీ ఆదేశాల మేరకు ఉపసర్పంచ్ కర్నాటి వీర నాగిరెడ్డి, ఆలయ అర్చకులు, గ్రామస్తుల సమక్షంలో బహిరంగ విచారణ జరిపినట్లు ఆయన చెప్పారు. విచారణ నివేదికను ఏసీకి సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. అర్చకులు ఎల్.లక్ష్మమ్మ, నగేష్‌శర్మ, పాల్గొన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తేనే గుర్తింపునకిరేకల్ : ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తేనే ప్రజాప్రనిధులకు మంచి గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ మున్సిపల్ పాలవర్గం ఐదేళ్ల పదవీకాలం బుధవారంతో ముగియడంతో మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పాలకవర్గానికి ఏర్పాటు చేసిన వీడ్కోలు, సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించి మాట్లాడారు. రాజకీయ నాయకులకు పదవీ విరమణ అనేది ఉండదని, రాబోయే రోజుల్లోనూ మరిన్ని పదవులు అధిరోహించేలా ప్రజలకు సేవలందించాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజితా శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, కౌన్సిలర్లు కందాల భిక్షంరెడ్డి, రాచకొండ సునీల్, గాజుల సుకన్య, పన్నాల పావని శ్రీనివాస్‌రెడ్డి, యాసారపు లక్ష్మీవెంకన్న, మట్టిపల్లి కవితా వీరు, గర్శకోటి సైదులు, పోతుల సునీత రవీందర్, చౌగోని అఖిల లక్ష్మీనారయణ, చౌగోని రాములమ్మ సైదులు, గడ్డం స్వామి, వంటెపాక సోమలక్ష్మి, బానోతు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
భానుపురి (సూర్యాపేట) : రైతులను నిలువునా ముంచే నకిలీ విత్తనాల విక్రయదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్, పోలీసులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, రైతులు కూడా గుర్తింపు పొందిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. బుధవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో శ్రీప్రజా పాలన – ప్రగతి ప్రణాళికశ్రీలో భాగంగా మార్కెటింగ్, అనుబంధ శాఖలు, ఉద్యాన పట్టు పరిశ్రమ, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సాగు విధానాలు, ప్రభుత్వ పథకాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు. సూర్యాపేటలో నూతనంగా భూ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. భూసార పరీక్షల నివేదిక ఆధారంగా ఏ భూమిలో ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో వ్యవసాయ అధికారులు సూచిస్తారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, ఖర్చు తగ్గింపులో భాగంగా నానో యూరియా వినియోగంపై రైతుల్లో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను, ప్రోత్సాహకాలను అందిస్తోందని తెలిపారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే సూర్యాపేటలో మామిడి మార్కెట్ ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించారు. సూర్యాపేటలో నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను రూ.31లక్షలతో మరమ్మతులు పూర్తి చేసి త్వరలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదిగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర్ శర్మ, జిల్లా సహకార అధికారి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
అనాథ పిల్లలకు వరం.. మిషన్ వాత్సల్య
అనంతగిరి : తల్లిదండ్రులు లేని, వదిలివేయబడిన పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం వరం లాంటిదని బాలల పరిరక్షణ కోదాడ ప్రాజెక్ట్ అధికారి విద్యాసాగర్ అన్నారు. బుధవారం అనంతగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయితీ కార్యాలయంలో బుధవారం బాలల పరిరక్షణ విభాగం, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిషన్ వాత్సల్య పథకం, బాలల చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మిషన్ వాత్సల్య పథకం కింద నెలకు రూ.4వేలతో పాటు రక్షణ, సంరక్షణ అవసరమైన పిల్లలకు బాలల హోమ్స్‌లో ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ రజిని మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చేయడం నేరమని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నకిరికంటి వీరభద్రమ్మ, ఉసర్పంచ్ గవిని రామకృష్ణ యాదవ్, ఏఎస్ఐ లింగారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీవిద్య, అంగన్వాడీ టీచర్లు సుగుణమ్మ, నర్సమ్మ, ఆశా కార్యకర్త, గర్భిణులు, బాలింతలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు. -
10లోపు స్వీయ గణన చేసుకోవాలి
సూర్యాపేట అర్బన్ : జనగణనలో భాగంగా ఆన్లైన్లో స్వీయ గణన చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరుతూ బుధవారం జిల్లా కేంద్రంలో మారథాన్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం చైర్ పర్సన్ మీడియాతో మాట్లాడుతూ స్వీయ గణన ద్వారా ప్రజలు తమ వివరాలను స్వయంగా, ఖచ్చితత్వంతో నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 10వ తేదీ లోపు ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా కుటుంబం వివరాలను నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, ఆర్డీఓ ఆర్. వేణు మాధవరావు, సీపీఓ ఎల్.కిషన్, సెన్సెస్ జిల్లా ఇన్చార్జి ఇస్లావత్ హోబాలాల్, డీఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ సీహెచ్. హనుమంతరెడ్డి, కలెక్టర్ కార్యాలయ, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
ఉద్యోగోన్నతితో బాధ్యతలు పెరుగుతాయి
సూర్యాపేటటౌన్ : ఉద్యోగోన్నతితో బాధ్యతలు పెరుగుతాయని ఎస్పీ నరసింహ అన్నారు. ఆర్ముడ్ రిజర్వ్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వెంకన్న, తిరుపతయ్యలు ఆర్ఎస్ఐలుగా ప్రమోషన్ పొందారు. అదేవిధంగా హెడ్ క్వార్టర్స్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న రామకోటి ఎస్ఐగా, గరిడేపల్లి పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్యకు ఏఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వారికి ప్రమోషన్ ఉత్తర్వులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. ఆరోగ్యం పట్ల, కుటుంబాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నరసింహచారి పాల్గొన్నారు. అకాల వర్షాలతో జాగ్రత్తరానున్న మూడు రోజులు వడగండ్లతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించిందని, ధాన్యం ఆరబోసిన రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. బుధవారం సూర్యాపేట మండలంలోని పిన్నాయిపాలెం గ్రామ శివారులో ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడి జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. పంట తడవకుండా టార్పాలిన్లు, పట్టాలు అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. ఎండ వేడి వల్ల వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. -
ఫ బలహీనంగా సాగర్ ఎడమ కాల్వ కట్ట ఫ పలుచోట్ల దెబ్బతిన్న కాల్వ లైనింగ్, తూములు
నడిగూడెం : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆధునీకరణ పనులు ఈ ఏడాది చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. సాగర్ ఎడమ కాల్వ నడిగూడెం మండల పరిధిలో.. కృష్ణానగర్ డీప్‌కట్ (119 కిలో మీటరు) నుంచి రామాపురం, చాకిరాల, సిరిపురం గ్రామాల మీదుగా కాగితరామచంద్రాపురం వరకు (132 కిలో మీటరు వరకు) ఉంది. ఈ కాల్వ క్రింద ఎల్–33, ఎల్–34, ఎల్–35, ఎల్–36 ఎత్తిపోతల పథకాలతో పాటు, కొమరబండ మేజరు, కొత్తగూడెం మేజరు, పాలారం మేజరు కాల్వలున్నాయి. వీటి కింద నడిగూడెం మండలంతో పాటు, అనంతగిరి, కోదాడ మండలాలకు ఆయకట్టు విస్తరించి ఉంది. అయితే, రామాపురం, చాకిరాల, సిరిపురం, కాగితరామచంద్రాపురం గ్రామాల సమీపాన పలు చోట్ల కాల్వ లైనింగ్ దెబ్బతిన్నది. కొన్ని చోట్ల కాల్వ కట్ట బలహీనంగా మారింది. సిరిపురం డీప్‌కట్ సమీపాన కాల్వ కట్టకు వర్షపు నీటితో లోతైన బుంగలు ఏర్పడ్డాయి. గతంలో 2008 సంవత్సరం నుంచి 2016 సంవత్సరం వరకు సాగర్ ఎడమ కాల్వకు ప్రపంచ బ్యాంకు నిధులతో ఆధునీకరణ పనులు చేపట్టారు. కానీ, అప్పట్లో పలు చోట్ల కాల్వ కట్ట బాగుండంతో ఆ ప్రాంతాలలో పనులు చేపట్టలేదు. దీంతో నేడు ఆ కాల్వ కట్టలు బలహీనమై ప్రమాదకరంగా మారాయి. లైనింగ్ దెబ్బతిన్నది. ఎలాంటి ప్రమాదం జరగకముందే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. రెండేళ్ల క్రితం భారీగా గండ్లు2024 సెప్టెంబరులో భారీ వర్షాలు కురవడంతో పాలేరు రిజర్వాయర్ వెనుక జలాలు సాగర్ కాల్వలోకి రావడంతో రెండు చోట్ల గండ్లు పడి కాల్వ తెగిపోయింది. కాగితరామచంద్రాపురం సమీపాన 132 కిలోమీటరు వద్ద, ఖమ్మం జిల్లా పరిధిలో 133 కిలో మీటరు వంతెన వద్ద గండ్లు పడడంతో నడిగూడెం, అనంతగిరి మండలాలతో పాటు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో వందల ఎకరాలు పంట పొలాలు నీట మునిగాయి. అప్పుడు ప్రభుత్వం అత్యవసరంగా రూ.2.10 కోట్లు నిధులు మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన కట్టకు పడిన గండ్లను తాత్కాలికంగా పూడ్చివేశారు. ప్రభుత్వం స్పందించి సాగర్ కాల్వ లైనింగ్ దెబ్బతిన్న ప్రాంతంలో శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, వర్షా కాలం లోపే పనులు మొదలుపెట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. దెబ్బతింటున్న తూములు నడిగూడెం మండల పరిధిలోని చాకిరాల 123 కిలో మీటరు వద్ద కొత్తగూడెం మేజరు తూము, కాగితరామచంద్రాపురం వద్ద ఉన్న మాధారం తూములకు ఏళ్ళ తరబడి మరమ్మతులు లేకపోవడంతో దెబ్బతింటున్నాయి. తూముల వెంట ఉన్న కట్ట లైనింగ్ దెబ్బతిని కోతకు గురవుతోంది. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడతాం కాగితరామచంద్రాపురం సమీపాన 132 కిలో మీటరు వద్ద శాశ్వత పనులు చేసేందుకు రూ.1.36 కోట్లు అంచానాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడుతాము. మిగతా చోట్ల కాల్వ కట్టల మరమ్మతు అంశం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రామాపురం వద్ద కొమరబండ మేజరు కాల్వ తూముకు రూ.74.75 లక్షలతో శాశ్వతంగా కొత్త తూము నిర్మిస్తున్నాం. రెండు నెలల్లో పనులు పూర్తవుతాయి. – రఘు, నీటి పారుదల శాఖ డీఈఫ గతంలో కాల్వ తెగి వందల ఎకరాల్లో మునిగిన పంట ఫ అప్పట్లో తాత్కాలికంగానే మరమ్మతు ఫ కాల్వ ఆధునీకరణ పనులు చేపట్టాలని రైతుల వినతి ఫ వర్షాకాలం సమీపిస్తున్నా పనుల ఊసే లేదు -
ప్రశాంతంగా నీట్
సూర్యాపేటటౌన్ : నీట్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో మొత్తం ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 887 మంది విద్యార్థులకు 865 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు విద్యార్థులను క్షుణ్ణంగా పరీక్షించి మరీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అధికారులు సైతం ఎప్పటికప్పుడు పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. 865 మంది హాజరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 168 మంది విద్యార్థులకు 164 మంది, తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ దురాజ్‌పల్లిలో 240 మందికి 236, తెలంగాణ మోడల్‌స్కూల్ ఇమాంపేటలో 240 మందికి 233, జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల 144 మంది విద్యార్థులకు 141 మంది, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ కళాశాల ఇమాంపేటలో 95 మంది విద్యార్థులకు గాను 91 మంది హాజరయ్యారు. మొత్తం మీద 97.5శాతం హాజరు నమోదైంది. నీట్ పరీక్ష సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల మేరకు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రత కల్పించామన్నారు. పరీక్ష సామగ్రి, పత్రాల తరలింపులో అధికారులతో సమన్వయం చేసుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట పట్టణ సీఐ వెంకటయ్య, నిర్వాహణ అధికారులు ఉన్నారు. ఫ జిల్లాలో ఐదు సెంటర్లలో నిర్వహణ ఫ 97.5శాతం మంది విద్యార్థులు హాజరు -
సమాజ ఉన్నతికి విద్య కీలకం
గరిడేపల్లి : సమాజ ఉన్నతికి విద్య కీలకమని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. ఆదివారం గరిడేపల్లి మండల పరిధిలోని వెలిదండ గ్రామంలో గ్రామ విద్యాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను పూర్తి సౌకర్యాలతో నిర్వహించినప్పుడే ఉత్తమ సమాజం ఆవిష్కరించబడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య వేగంగా పడిపోతోందని, విద్యార్థులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించటానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల అభివృద్ధి ఎజెండాలో విద్య ముందుగా ఉండాలని పేర్కొన్నారు. తగినన్ని తరగతి గదులు, తగినంత మంది ఉపాధ్యాయులు, గ్రంథాలయం, ల్యాబ్‌లు, ఆట స్థలంతో పాఠశాలలు వికసిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయని విమలక్క, పోటు రంగారావు, అంబటి నాగయ్య, పోటు రామారావు, మేదరమట్ల వెంకటేశ్వరరావు, మేకల నాగేశ్వరరావు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఫ తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి -
లక్ష్మీనరసింహుడికి వసంతసేవ
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవంలో భాగంగా ఆదివారం అర్చకులు వసంతసేవ, చక్రతీర్థం, మహాలక్ష్మీహోమం, మహాపూర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వైఖానస సంప్రదాయంలో ప్రాతఃకాలార్చన, సుప్రభాతసేవ, ద్రవిడ ప్రబంధ సేవాకాలం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం, ప్రత్యేకఅర్చనలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో వసంతసేవ, చక్రతీర్థస్నానానికి స్వామి, అమ్మవార్లను తరలించారు. ప్రహ్లాద స్నానఘట్టం వద్ద అర్చకులు, ధర్మకర్తలు ప్రభోది మంత్ర పుష్పనీరాజనాలతో రాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామికి వసంతసేవ, చక్రతీర్థస్నానం నిర్వహించారు. అర్చకులు, ధర్మకర్తలు, భక్తులు రంగులు చల్లుకుంటూ కేరింతలతో వసంతసేవ సంబరాలు పూర్తి చేశారు. అనంతరం హోమం మహాపూర్ణాహుతి చేపట్టారు. సాయంత్రం దోపోత్సవం, అశ్వవాహనోత్సవం, ధ్వజారోహనం చేపట్టారు. తిరుకల్యాణోత్సాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారికి పుష్పయాగం, ద్వాదశ సేవలు, శృంగార డోలోత్సవం, పవళింపుసేవ నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, సర్పంచ్ రామిశెట్టి విజయశాంతి అప్పారావు, బజ్జూరు వెంకటరమణ, కాంతారావు, ఈఓ జ్యోతి, సహాయ యాజ్ఞికుడు నారాయణం హరికిరణాచార్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
రైతులకు పథకాలు చేరేలా..
ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ఆరు రోజుల పాటు రైతు వారం కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమాలకు రైతులు హాజరై వ్యవసాయ, అనుబంధ శాఖలు, ఇతర శాఖలు అందించే విలువైన సలహాలు సూచనలు తీసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. –శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి భానుపురి (సూర్యాపేట) : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 4 నుంచి 9 వరకు రైతు వారం నిర్వహించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వారికి అవగాహన కల్పించడంతో పాటు అవి రైతులకు చేరేలా చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. గ్రామ, మండల నియోజకవర్గ స్థాయిలో వ్యవసాయశాఖ, దాని అనుబంధ శాఖలు రైతువారం కార్యక్రమంలో భాగస్వాములు కానున్నాయి. వ్యవసాయంలో సాగు, సస్యరక్షణ చర్యలు, సేంద్రియ వ్యవసాయం, ఇతర అంశాలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఆరు రోజులపాటు కార్యక్రమాలు ఇలా.. ఫ సోమవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదికల్లో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి నేల ఆరోగ్య పరిరక్షణ సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం అదే విధంగా పౌర సరపరాల శాఖ వినియోగదారులు కోరుకునే సన్న వరి రకాల సాగుపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. భూసార పరీక్షల నిర్వహణ కోసం మట్టి నమూనాలను సేకరించనున్నారు. ఫ మంగళవారం ఉద్యానవన, మత్స్య శాఖతో పాటు మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో ఉద్యాన సాగు విస్తీర్ణం పెంపుదల ప్రత్యామ్నాయ పంటల సాగుతో పాటు ప్రభుత్వం అందించే సబ్సిడీపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. పంటల దిగుబడులకు అవసరమైన మార్కెటింగ్ సౌకర్యాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ఫ బుధవారం బ్యాంకులు, సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తారు. బ్యాంకుల ద్వారా రైతులకు అందించే దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు సహకార సంఘాల ద్వారా రైతులకు అందించే సేవలు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాల అవగాహన కల్పిస్తారు. ఫ గురువారం నియోజకవర్గ స్థాయిలో విద్యుత్, రెడ్కో శాఖల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తారు. అందులో వ్యవసాయ క్షేత్రాల్లో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, పీఎం కుసుమ్ వ్యవసాయ యాంత్రీకరణ, రుణాలపై ప్రభుత్వ సబ్సిడీ వినియోగం లాభాలపై అధికారులు రైతులకు వివరించనున్నారు. ఫ శుక్రవారం పశు సంవర్థక శాఖ, మత్స్య, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో పాడిపరిశ్రమ, పశు జాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు, వేసవిలో పశు సంరక్షణపై గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో చెరువులో కలుపు మొక్కల నివారణ, వ్యాధుల నివారణ, మత్స్య అధికోత్పత్తిపై వివరించానున్నరు. ఫ శనివారం గ్రామస్థాయిలో రైతులతో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి సమర్థ నీటి విడుదల కోసం గేట్ల నిర్వహణ, ఎత్తిపోతల పథకాల మరమ్మతు, కాల్వలు, చెరువుల్లో కంపచెట్లు, గుర్రపుడెక్క తొలగింపు, సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రతపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ఫ జిల్లాలో నేటి నుంచి రైతులకు అవగాహన సదస్సులు ఫ వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహణ ఫ తొలిరోజు మట్టి నమూనా ఫలితాల కార్డులు అందజేత -
ఆకట్టుకుంటున్న భవిత కేంద్రాలు
అర్వపల్లి : ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం నిర్వహించే భవిత కేంద్రాలకు సొంత భవనాలు సమకూరుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో జాజిరెడ్డిగూడెం, నాగారం, మద్దిరాల, నూతనకల్ మండలాల్లో భవిత కేంద్రాల భవనాలను నిర్మించారు. ఒక్కో భవనానికి రూ.9.50 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. నాగారంలో పనులు పూర్తి చేసి రంగులు కూడా వేశారు. అర్వపల్లిలో రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. నూతనకల్, మద్దిరాల మండలాల్లో పనులు పూర్తికావస్తున్నాయి. ఇప్పటివరకు భవనాలను శిథిలమైన, ఇరుకై న ప్రభుత్వ పాఠశాలల గదులలో నిర్వహిస్తున్నారు. నూతన భవనాలకు రంగురంగుల బొమ్మలతో ఆకర్షణీయంగా మార్చారు. -
అకాల వర్షం.. రైతులు ఆగం
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతులను ఆగమాగం చేసింది. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు పట్టి ఈదురుగాలులు వీచాయి. అక్కడక్కడ వర్షం కురిసింది. దాంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఉరుకులు పరుగులు తీశారు. సూర్యాపేట మార్కెట్ యార్డులో రైతులు పోసిన ధాన్యం కొంత మేరకు తడిసింది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పగలు ఎండ.. సాయంత్రం వర్షం జిల్లాలో మూడు నాలుగు రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఆదివారం కూడా ఉదయం 9 గంటల నుంచే ఎండతీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఈదురుగాలులతో కూడిన జల్లులు పడ్డాయి. రైతుల పరుగులు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆకా శం మేఘావృతమై ఈదురుగాలు వీయడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు పరుగులు తీశారు. ధాన్యం రాశులపై పట్టాలను కప్పుకునేందుకు ప్రయత్నించగా ఈదురు గాలుల ధాటికి కొట్టుకుపోవడంతో ఇబ్బంది పడ్డారు. చివ్వెంల, నాగారం, అర్వపల్లి మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలు, తిరుమలగిరి మార్కెట్లో పోసిన మక్కలు కొద్దిమేర తడిశాయి. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం ధాన్యం అమ్ముకునేందుకు ఆదివారం మధ్యాహ్నం నుంచి రైతులు తీసుకు వచ్చిన ధాన్యం రాశులు కొంత మేరకు తడిశాయి. మార్కెట్ సిబ్బంది అందించిన పట్టాలు ఈదురు గాలులకు లేచి పోయా యి. వర్షం పెద్దగా రాకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఫ పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం ఫ తడిసిన ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం ఫ నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు ఫ విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం -
సూర్యక్షేత్రంలో పూజలు
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం మహాసౌరహోమాన్ని నిర్వహించారు. క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, రామకోటి స్థూపాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్ధన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు. ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తులుచిలుకూరు : మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల జిల్లా కన్వీనర్ డాక్టర్ బాసిరెడ్డి లక్ష్మమ్మ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలోని 9 గురుకుల జూనియర్ కళాశాలలు ఉండగా.. ఇందులో 5 బాలుర, 4 బాలికల కళాశాలలు ఉన్నట్లు తెలిపారు. ఆయా కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 12 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి ఉత్తీర్ణీత సాధించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఐఎన్టీయూసీ జిల్లా జనరల్ సెక్రటరీగా వెంకన్నసూర్యాపేట : ఐఎన్టీయూసీ జిల్లా జనరల్ సెక్రటరీగా బూర్గుల వెంకన్నను నియమించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సంఘం భవన్లో ఆదివారం నిర్వహించిన ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆలకుంట్ల బాలృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బంటు చొక్కయ్యగౌడ్ వెంకన్నకు నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జాబ్‌మేళా విజయవంతం నల్లగొండ : నల్లగొండలో నిర్వహించిన మెగా జాబ్‌మేళా విజయవంతం అయ్యిందని జిల్లా యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి అధికారి అక్బర్ అలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలకు ఈ నెల 2న 125 కంపెనీలు, 2000 మంది నిరుద్యోగులు హాజరు కాగా, 3న 23 కంపెనీలు, 150 మంది నిరుద్యోగులు హాజరైనట్లు తెలిపారు. ఈ జాబ్‌మేళా ద్వారా అనేక మందికి ఉద్యోగాలు లభిచాయని తెలిపారు. ధ్యానంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అర్వపల్లి : ధ్యానంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూర్యాపేట హార్ట్‌ఫుల్ నెస్ సంస్థ ఇన్చార్జి ఎం. వెంకటరంగారావు అన్నారు. అర్వపల్లిలోని ధ్యాన శిక్షణ కేంద్రంలో ఆదివారం శ్రీరామచంద్రమిషన్, హార్ట్ఫుల్నెస్ సంస్థల ఆధ్వర్యంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ధాన్యంతో మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఈ కేంద్రంలో ప్రతి ఆదివారం ధ్యాన శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. చుట్టు పక్కల మండలాల ప్రజలు ఈ ధ్యాన శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యసకులు వనం రమేష్, మేకల సత్యనారాయణ, రాగి అనిల్, మనుబోతుల వీరయ్య, కేశబోయిన వీరయ్య, ఉమారాణి పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం
అర్వపల్లి: ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విమర్శించారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెంలో బుధవారం ఎఫ్‌పీఓ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన యాప్‌ల ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కొనుగోలు కేంద్రాలలో సమస్యలు తాండవిస్తున్నాయని తెలిపారు. తాలు, బెరుకుల సాకుతో మిల్లర్లు, నిర్వాహకులు రైతులను దొచుకుంటున్నారని ఆరోపించారు. లారీల కొరతతో కేంద్రాలలో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోతోందన్నారు. ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. సీఎం వెంటనే జోక్యం చేసుకొని ధాన్యం కొనుగోళ్లలో సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, కొలిశెట్టి యాదగిరిరావు, మల్లు లక్ష్మి, ముల్కలపల్లి రాములు, నెమ్మాది వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి వజ్జె శ్రీనివాస్, పులుసు సత్యం, కోట రమేష్, స్కైలాబ్‌బాబు, దేవరకొండ యాదగిరి, వజ్జ వినయ్,బూర్గుల ప్రభాకర్ ఉన్నారు.ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
తాగు నీటి సమస్యను పరిష్కరించాలని ఆందోళన
సూర్యాపేట అర్బన్ : సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు భాగ్యనగర్ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ కాలనీవాసులు బుధవారం ఖాళీ బిందెలతో సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన కాలనీలోని నీటి సమస్యను తీర్చడం లేదని వాపోయారు. నెల రోజులుగా కనీస అవసరాలకు కూడా నీరు అందడం లేదని, గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి నీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. భాగ్యనగర్పై మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
జూన్ 5 నుంచి 12 వరకు పది సప్లిమెంటరీ పరీక్షలు
సూర్యాపేటటౌన్ : జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పది సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సప్లిమెంటరీ పరీక్ష కోసం మే 14వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని, రూ.50 అపరాధ రుసుంతో పరీక్షకు రెండు రోజుల ముందు వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని సూచించారు. విద్యార్థులు మార్కుల రీకౌంటింగ్ కోసం రూ.500 రుసుం చెల్లించాలని కోరారు. రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించి రీవెరిఫికేషన్‌తో పాటు ఆన్సర్ బుక్ పొందవచ్చన్నారు. వివరాలకు పాఠశాల హెచ్ఎంను సంప్రదించాలని సూచించారు. తిరు కల్యాణోత్సవాలు ప్రారంభంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో మేనెల 4వ తేదీ జరగనున్న శ్రీరాజ్య లక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణోత్సవాలను బుధవారం రాత్రి ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్ ,అర్చకులు ప్రత్యేక పూజలతో వైభవంగా ప్రారంభించారు. ఈనెల 30 అర్ధరాత్రి నుంచి శ్రీస్వామి వారి ఎదుర్కోళ్లతో కల్యాణోత్సవం ప్రారంభమై తెల్లవారు జామున ముగుస్తుందని అర్చకులు తెలిపారు. ఈసందర్భంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, మృత్యంగ్రహణం, అంకురారోపణం, ధ్వజారోహణం, నవకుంభారోపణము, అగ్ని ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాలను సహాయ యాజ్ఞీకులు హరికిరణాచార్యులు, అర్చకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు తూమాటి శ్రీనివాసా చార్యులు, రామాచార్యులు, కృష్ణమాచార్యులు , పద్మనాభాచార్యులు బదరీనా రాయణా చార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, బ్రహ్మచార్యులు ,ఫణిభూషణ మంగాచార్యులు, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. మట్టి నమూనా ఆధారంగా ఎరువుల వినియోగంకోదాడరూరల్ : రైతులు వ్యవసాయ భూముల్లో మట్టి నమూనా పరీక్షలు చేయించి, వాటి ఆధారంగా ఎరువులను వాడాలని కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఎ.కిరణ్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని చిమిర్యాల రైతు వేదికలో కేవీకే, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఎరువుల యాజమాన్యంపై రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూరియా వాడకాన్ని తగ్గించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, పంట మార్పిడితో తెగుళ్లను నివారించవచ్చని తెలిపారు. పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో భూసారాన్ని పెంచుకోవచ్చని చెప్పారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య, పప్పు దినుసులు, ఉద్యానవన పంటలను సాగు చేసి ఆర్థికంగా బలపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఏఓ పాలెం రజిని, సర్పంచ్ కొత్త గురవయ్య, ఏఈఓ మహేష్, రైతులు పాల్గొన్నారు. -
ముగిసిన ఎడ్ల పందేలు
మఠంపల్లి : మండల కేంద్రంలోని మేరీమాత పుణ్యక్షేత్రం వార్షికోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన రెండు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలు మంగళవారం అర్ధరాత్రి ముగిశాయి. శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్‌రెడ్డి బుధవారం విజేతలను ప్రకటించారు. సీనియర్స్ కేటగిరీలో ఏపీలోని బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన గిత్తలు ప్రథమ బహుమతి గెలుపొందాయి. అదేవిధంగా రెండో బహుమతిని కృష్ణా జిల్లా ఎడ్లపాడు గిత్తలు, మూడో బహుమతిని గుంటూరు జిల్లా కాకుమాను గిత్తలు, నాలుగో బహుమతిని సూర్యాపేట జిల్లా మఠంపల్లికి చెందిన గాదె సుందరమ్మ గిత్తలు గెలుపొందాయి. విజేతలకు స్థానిక సర్పంచ్ వీరలక్ష్మిపాపయ్య, ఉప సర్పంచ్ కొత్తపల్లి శౌరీ, పాలకవర్గ సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్రవంతీకిషోర్రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ లూర్థుమారెడ్డి, శుభోదయ యువజన సంఘం సభ్యులు, చర్చి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మేడేను జయప్రదం చేయాలిసూర్యాపేట అర్బన్ : మే ఒకటిన మేడే సందర్భంగా జిల్లాలోని అన్ని గ్రామాలలో ఎర్ర జెండాలు ఎగురవేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు గొడ్డలి నరసయ్య పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని లెనిన్‌నగర్‌లో మేడే పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాజేసందుకు లేబర్ కోడ్లను తీసుకు వచ్చిందన్నారు. నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు కార్మిక లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గులాం, జిల్లా కోశాధికారి ఐతరాజు వెంకన్న, నాయకులు భీమనపల్లి సురేష్, ప్రవీణ్, పాల్వాయి అనసూర్య, రేణుక, ఖాసీం, వెంకన్న పాల్గొన్నారు. -
ఎరువు.. బరువు
తిరుమలగిరి( తుంగతుర్తి) : యాసంగి సీజన్ ముగింపు దశకు వస్తోంది. వానాకాలం సాగుకు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎరువుల కంపెనీలు మాత్రం అదును చూసి ఎరువుల ధరలను పెంచాయి. ఈ మేరకు డీలర్లకు ఆయా కంపెనీల ప్రతినిధులు సమాచారం ఇచ్చారు. దీంతో జిల్లాలోని రైతులపై ఆర్థిక భారం పడనుంది. ఎరువుల రకాలను బట్టి రూ. 75 నుంచి రూ. 350 వరకు ధరలు పెరగడం గమనార్హం. పశ్చిమాసియా దేశాలలో జరుగుతున్న యుద్ధ ప్రభావంతో ఎరువుల తయారీకి వాడే ముడిసరకుల ధరలు పెరిగాయి. సరకును రవాణ చేసే నౌకలకు బీమా సంస్థలు విధించే ప్రీమియం ఇతర పనులు ఎక్కువ కావడంతో ఎరువుల ధరలు పెంచామని కంపెనీ సంస్థలు చెబుతున్నాయి. రూ.300లకు విక్రయం యాసంగిలో రైతులకు సకాలంలో యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎరువులు అధికంగా వాడుతున్నారని యాప్‌ను తీసుకురావడంతో ఇబ్బందులు తొలగలేదు. బస్తా డీఏపీ వాస్తవ ధర రూ. 1,350 ఉంటే గిట్టుబాటు కావడం లేదని గతేడాది డీలర్లు విక్రయించేందుకు ఆసక్తి చూపలేదు. బస్తా యూరియా నిర్ణీత ధర రూ. 265లుండగా ఇప్పటికీ రూ. 300లకు విక్రయిస్తారు. 2.17లక్షల టన్నుల ఎరువుల వాడకం గ్రామాలలో పశు సంపద తగ్గిపోవడం సేంద్రియ ఎరువులు లేవు. దీంతో రైతులు తమ పంటలకు పోషకాలను అందించేందుకు రసాయన ఎరువులను వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో వానాకాలం సాధారణ సాగు 6.19 లక్షల ఎకరాల విస్తీర్ణం ఉంది. సుమారు 3.27 లక్షల వరకు రైతులు ఉన్నారు. జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, కంది, పెసర, జొన్న, వేరుశనగ వంటి పంటలను సాగుచేస్తున్నారు. రెండు సీజన్లకు గాను 2.17 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఉపయోగించనున్నారు. దీని ప్రకారం జిల్లా రైతుల పై సుమారు కోట్లలో భారం పడనుంది. ఎరువుల రకం పాత ధర కొత్త ధర (50 కిలోలు) (రూ.లో) (రూ .లో) 20–20–013 1500 1800 16–20–013 1400 1750 14–35–14 2150 2350 15–15–15–09 1650 1950 10–23–26 1950 2025 సింగిల్ సూపర్ పాస్పేట్ 615 775 పొటాష్ 1850 1975 16–16–16 1675 2050 24–24–0 2000 2300 ఫ వానాకాలం సాగు వేళ పెరిగిన ఎరువుల ధరలు ఫ బెంబేలెత్తుతున్న రైతులు ఫ జిల్లా కర్షకులపై రూ.కోట్లలో భారం -
టెన్త్‌లో బాలికలదే హవా
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలలో సూర్యాపేట జిల్లాలో 98.60 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలలో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. అత్యధిక పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి ఈ కేటగిరిలో జిల్లా రాష్ట్రంలోనే 7వ స్థానంలో నిలిచింది. గతేడాది 14వ స్థానంలో ఉండగా ఈ సారి ఉత్తీర్ణతశాతం పెరిగింది. ఇమాంపేట జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన నరిగే తేజశ్రీ అత్యధికంగా 583 మార్కులు సాధించింది. ఈసారి ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధించాయి. 12,178 మంది పాస్ జిల్లాలో మొత్తం 12,351 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా 12,178 మంది పాసై 98.60శాతం ఉత్తీర్ణత సాధించడంతో సూర్యాపేట రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. 173 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. ఇందులో 6376 మంది బాలురు పరీక్ష రాయగా 6272 మంది పాసై 98.37శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 5975 మంది పరీక్ష రాయగా 5906 మంది పాసై 98.85 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో వందశాతం ఉత్తీర్ణత జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించి సత్తాచాటాయి. జిల్లాలో 112 ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 14 కేజీబీవీలు, మూడు మోడల్ స్కూల్స్, 17 రెసిడెన్షియల్స్ పాఠశాలలు సైతం 100శాతం ఉత్తీర్ణత సాధించి సత్తాచాటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చాయి. అక్కల సాయిచరణ్ (581), జెడ్పీహెచ్ఎస్ తిరుమలగిరినరిగె తేజశ్రీ(583) జెడ్పీహెచ్ఎస్, ఇమాంపేట పావని(580) మోడల్ స్కూల్, ఇమాంపేటసహారిక(575) మైనార్టీ గురుకుల పాఠశాల హుజూర్నగర్గతేడాది పదో తరగతిలో 11,508 మంది విద్యార్థులు పాసై 96.81శాతం ఉత్తీర్ణత సాధించగా సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 12,178 మంది విద్యార్థులు పాసై 98.60 శాతం ఉత్తీర్ణత సాధించడంతో 7వ స్థానానికి ఎగబాకింది. విద్యార్థులు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించడంపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఫ సూర్యాపేట జిల్లాలో 98.60 శాతం ఉత్తీర్ణత ఫ సత్తాచాటిన ప్రభుత్వ విద్యాలయాలు ఫ గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత ఫ రాష్ట్రంలో జిల్లాకు 7వ స్థానం -
డ్రగ్స్‌తో యువత జీవితం మసి
సూర్యాపేటటౌన్ : డ్రగ్స్ తో యువత జీవితం మసి అవుతుందని దానిని మానేస్తే జీవితం ఖుషీ అవుతుందని, డ్రగ్స్ మన సమాజాన్ని, మన పిల్లలను పట్టి పీడిస్తోందని ఎస్పీ నరసింహ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాలల భద్రత, మహిళా భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, స్థానిక పౌరులతో కలిసి సూర్యాపేట పట్టణ పోలీసులు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ నర్సింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో డ్రగ్స్ అనేది అత్యంత ప్రమాదకర స్థాయిలో పాతుకుపోయిందని, దీనిని కూకటివేళ్లతో తీసివేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉందన్నారు. మహిళల భద్రత, బాలల భద్రతకు పోలీస్ శాఖ పటిష్టంగా కృషి చేస్తోందన్నారు. దీనికోసం షీ టీం సిబ్బంది, భరోసా టీం సిబ్బంది, మానవ అక్రమ రవాణా నిరోధక బృందాలు, శాంతిభద్రతల పోలీసులతో కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. మహిళలపై , బాలలపై వేధింపులు జరిగినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు, 112 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదులు చేస్తే పోలీసులు మీ ఇంటి వద్దకు, మీరు ఉంటున్న ప్రదేశానికి వచ్చి ఫిర్యాదులు స్వీకరించి అక్కడే కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్కాపీ అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, మానవ అక్రమ రవాణా నిరోధక టీం ఇన్స్పెక్టర్ శివకుమార్, పట్టణ ఎస్ఐలు ఐలయ్య, సాయిరాం, ఏడుకొండలు, వెంకన్న, షీ టీం ఎస్ఐ నీలిమ, విద్యార్థులు, ఆశా కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఫ ఆకర్షణకులోను కావొద్దు ఫ ఎస్పీ నరసింహ సూచన -
అన్నింటికీ ఆయనే పెద్ద
కోదాడ : పాలక వర్గాలు మారినా కోదాడ మున్సిపాలిటీలో ఓ మాజీ కౌన్సిలర్ భర్త హవా మాత్రం తగ్గడం లేదు. రాజకీయ నాయకుడిగా, కాంట్రాక్టర్‌గా ఉన్న ఆయన మున్సిపాలిటీలో అధికారులు, పాలకులకు దగ్గరి వ్యక్తిగా వ్యవహరిస్తూ అన్ని రకాల పనులను చక్కబెడుతున్నాడు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఉంటూ తాజాగా మున్సిపాలిటీలో తాను చెప్పిందే వినాలంటూ హుకుం జారీ చేయడం తాజా మున్సిపల్ కౌన్సిలర్లకు మింగుడుపడడం లేదని సమాచారం. కోదాడ మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి పాలకవర్గాలతో సన్నిహితంగా ఉంటున్న సదరు నాయకుడికి మున్సిపాలిటీలో పాలన, కాంట్రాక్టులు, అధికారుల పనితీరు, లోటుపాట్లపై పూర్తి అవగాహన ఉండడంతో నూతన పాలకవర్గ పెద్దలు కూడా ఆయనకే అన్ని పనులు అప్పగిస్తుండడంతో ఆయన చెప్పిందే వేదంగా నడుస్తున్నదని పలువురు కౌన్సిలర్లు పేర్కొంటున్నారు. అనుభవమే పెట్టుబడి.. కోదాడ మున్సిపాలిటీ తొలి పాలకవర్గం 2014లో ఏర్పడింది. అప్పటి పాలకవర్గ ముఖ్యులు ఆయన బంధువులు కావడంతో సదరు కాంట్రాక్టర్ అధికార, అనధికార కార్యక్రమాలను చక్కబెట్టేవాడు. 2019లో రెండవసారి పాలకవర్గంలో తన సతీమణి కౌన్సిలర్ కావడంతో పాటు అప్పటి ఎమ్మెల్యేకు ముఖ్యఅనుచరుడిగా ఉంటూ మున్సిపాలిటీలోనూ హవా చెలాయించాడు. నాడు మున్సిపాలిటీలో కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులను ఆయనే చేసేవాడని పలువురు కాంట్రాక్టర్లు అంటున్నారు. ప్రస్తుతం కూడా అధికార పార్టీలోకి మారి పాలకవర్గ పెద్దల చెంతకు చేరి మరోసారి చక్రం తిప్పుతుండడంతో పలువురు కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. కౌన్సిల్ తీర్మానాలు లేకుండానే... మున్సిపాలిటీలో ఏమైనా పనులు చేయాలన్నా కౌన్సిల్ తీర్మానం తప్పనిసరి. కౌన్సిల్ సమావేశం నిర్వహించి, తీర్మానం చేసి, టెండర్లు పిలవడానికి ఎక్కువ సమయం పడుతుందనే సాకుతో సదరు కాంట్రాక్టర్ కోదాడ మున్సిపాలిటీలో లక్షల రూపాయల పనులను తానే సొంతంగా చేయడం ప్రస్తుతం పట్టణంలో చర్చనీయాంశమైంది. ఇటీవల కోదాడలోని ఉత్తమ్ పద్మావతినగర్‌లో కోదాడ అర్బన్ పార్కు పునరుద్ధరణ పనులను మున్సిపల్ చైర్పర్సన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన చేయిస్తున్నారు. అయితే తీర్మానం చేసేందుకు సమయం పడుతుందనే సాకుతో సదరు మాజీ కౌన్సిలర్ భర్త సొంత ఖర్చుతో లక్షల రూపాయల పనులు చేయడం విమర్శలకు తావిస్తోంది. దీనికి అధికారులు అడ్డు చెబితే బదిలీ చేయిస్తానని బెదిరిస్తున్నట్లు విమర్శలున్నాయి. కోదాడ మున్సిపాలిటీలో మాజీ కౌన్సిలర్ భర్త వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఫ కౌన్సిల్ తీర్మానం లేకుండానే పనులు ఫ అధికారులకు బెదిరింపులు -
ప్రజలకు సరిపడా తాగునీటి సరఫరా
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలోని ప్రతి నివాస ప్రాంతంలో ప్రజల అవసరాలకు సరిపడా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులకు సూచించారు. ప్రస్తుత వేసవిలో ఎక్కడ కూడా దాహార్తి సమస్య తలెత్తకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, ఎంపీఓలు ఇతర అధికారులతో కలెక్టర్ మంచినీటి సరఫరా స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా నీటి సరఫరా పరిస్థితి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సిన మరమ్మతులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. వేసవి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. రానున్న రెండు మూడు నెలలు ఎంతో కీలకమైనందున నీటి సరఫరా విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి కొరత ఏర్పడకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. మరమ్మతులు చేపట్టే విషయాన్ని ప్రజలకు సైతం ముందుగానే తెలియజేస్తే వారు తగిన విధంగా సన్నద్ధం అవుతారని సూచించారు. బోరు బావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని, చేతి పంపులకు ఫ్లషింగ్ చేయించాలని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పట్టణాలలో తాగునీటి సరఫరాపై సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును పక్కాగా పర్యవేక్షణ జరపాలని, తాను కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, ఎక్కడైనా నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచినీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు. మారుమూల నివాస ప్రాంతాలకు సైతం రక్షిత మంచి నీటిని అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ శిరీష, మిషన్ భగీరథ ఈఈ అరుణాకర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాసరావు, డీపీఓ యాదగిరి, అడిషనల్ డీఆర్డీఓ ఆయా మండలాల ఎంపీడీఓలు, ఎఈఈ, ఎంపిఓ, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలి
పెన్‌పహాడ్ : డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి కె. నరసింహారావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో మిషన్ వాత్సల్య పథకం కింద జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, జీవిత లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. చిన్న వయసులో గర్భధారణ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, చదువులో అంతరాయం వంటి అంశాలను వివరించారు. సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్మన్ రమణారావు, బాలల పరిరక్షణ విభాగం అధికారి రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ చంద్రశేఖర్, సీడబ్ల్యూసీ మెంబర్ ధనమ్మ, ఎంఈఓ రవి, ఎస్ఓ ఆసియా జబీనా పాల్గొన్నారు.ఫ జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు -
2న నల్లగొండలో జాబ్ మేళా
సూర్యాపేటటౌన్ : ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో వచ్చేనెల 2న నల్లగొండ పట్టణంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జాబ్‌మేళా పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఇంటర్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్హత కలిగిన ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన యువతకు మార్కెటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, ఐటీ బిజినెస్ సర్వీసెస్, కస్టమర్ సర్వీస్, హాస్పిటాలిటీ, డిజిటల్ మీడియా, లాజిస్టిక్స్ తదితర రంగాలలో ఉపాధి కల్పించేందుకు ఈ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో 50కి పైగా కంపెనీల వారు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. జాబ్ మేళాలో పాల్గొనే వారు https://satg.telangana. gov.in/prajapalana/ వెబ్ సైట్ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. సూర్యాపేట జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు జిల్లా యువజన, క్రీడల అధికారి సెల్ : 9100949979 నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. -
కీటక జనిత వ్యాధులపై నిఘా ఉంచాలి
తుంగతుర్తి : కీటక జనిత వ్యాధులపై వైద్య సిబ్బంది నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా ప్రోగ్రామ్ అధికారి జి. ప్రసిద్ధి సూచించారు. మంగళవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తుంగతుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం, రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామాలు, పట్టణాల్లో దోమల నివారణకు ఏసీఎం పిచికారీ చేయాలని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కుష్టు, టీబీ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట ఏఎంఓ మోతీలాల్, వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి, వైద్య సిబ్బంది ఉన్నారు. మట్టపల్లిలో పరమపదోత్సవం మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తిరుకల్యాణోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో మంగళవారం పరమపదోత్సవ పూజలను అర్చకులు నిర్వహించారు. ఈ సందర్భంగా విష్వక్సేనాది మహర్షులకు, సకలదేవతలకు, ఆళ్వారాలకు అర్చనలతో పాటు మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశి ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీనారాయణా చార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు, అనంతాచార్యులు, నరసింహా చార్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జనగణన వివరాలు పక్కాగా సేకరించాలితిరుమలగిరి(తుంగతుర్తి) : జన గణన 2027 వివరాలు పకడ్బందీగా సేకరించాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావు అన్నారు. మంగళవారం అనంతారం మోడల్ స్కూల్లో జన గణన శిక్షణ తరగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న స్వీయ గణనపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరిప్రసాద్, ఎంపీఎస్ఓ కిషన్, ఫీల్డ్ ట్రైనర్లు అశోక్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ నరేందర్, ఆర్ఐ సుజిత్‌రెడ్డి పాల్గొన్నారు. హక్కుల సాధనకు ఉద్యమించాలిహుజూర్నగర్ : హక్కుల సాధనకు కార్మిక సంఘాలు ఏకమై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌లోని సీపీఐ కార్యాలయంలో ఇందిరాల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్లుగా విభజించి చట్టం చేసిందని తెలిపారు. కార్మిక సంఘాలు ఏకమై మేడే స్ఫూర్తితో కార్మిక చట్టాలను కాపాడుకోవాలని అన్నారు. మేడే ఉత్సవాలను వాడవాడన ఘనంగా నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యల్లావుల రాములు, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెట్టి ప్రసాద్, నాయకులు దగ్గుబాటి సత్యానందం, బెల్లంకొండ రామ్మూర్తి, రామిశెట్టి సుబ్బారావు, పంకజ్, రమేష్, శివ, జక్కుల రమణ పాల్గొన్నారు. -
చెడు అలవాట్లతో భవిష్యత్ నాశనం : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : యువత చెడు అలవాట్లతో తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని, బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని ఎస్పీ నరసింహ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో నిర్వహిస్తున్న బాలల భద్రత, డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని నారాయణ జూనియర్ కళాశాలలో పట్టణ పోలీసు, షీ టీం, మానవ అక్రమ రవాణా నిరోధక బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీసు శాఖ ప్రజల భద్రత, రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు అనుక్షణం కృషి చేస్తుందన్నారు. యువత చెడు అలవాట్లకు, మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దని, స్పల్ప ఆనందం కోసం వెళితే భవిష్యత్‌లో సమస్యలు వస్తాయని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా మంచిని నేర్చుకోవాలని, చెడు సావాసాలు, స్నేహాలకు గురికావద్దన్నారు. బాలికలను వేధింపులకు గురి చేస్తే పోక్సో చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు, షీ టీం బృందం పాల్గొన్నారు. -
సెలవుల్లోనూ..సంపూర్ణ పోషణ
చిలుకూరు : వచ్చేనెల ఒకటో తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు మంజురు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు సెలవులుగా ప్రకటించింది. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజు అందించే పౌష్టికాహారాన్ని ముందస్తుగానే పంపిణీ చేయనున్నారు. గతంలో అంగన్వాడీ టీచర్, ఆయా ఒకరి తర్వాత మరొకరు 15 రోజులు సెలవులు తీసుకొని మిగతా రోజుల్లో పిల్లల ఇంటికి వెళ్లి పౌష్టికాహారం ఇచ్చే వారు. కానీ ఈ సారి మాత్రం మందస్తుగానే సరుకులు పంపిణీ చేసి అంగన్వాడీ కేంద్రాన్ని పూర్తిగా మూసి వేయనున్నారు. వేసవి నుంచి ఉపశమనం అంగన్వాడీ కేంద్రాలకు మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు వచ్చి పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం వేసవి తీవ్రత అధికంగా ఉండడంతో అద్దె భవనాల్లో, ఉక్కపోత మధ్య పిల్లలు, సిబ్బంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దాంతో ప్రభుత్వం నెలరోజుల పాటు కేంద్రాలకు సెలవులు ప్రకటించింది. అందించే సరుకులివే.. కందిపప్పు: చిన్నారులకు రోజుకు 15 గ్రాముల చొప్పున 25 రోజులకు 375 గ్రాములు, గర్భిణులు, బాలింతలకు రోజుకు 30 గ్రాముల చొప్పున మొత్తం 750 గ్రాములు ఇవ్వనున్నారు. బియ్యం : చిన్నారులకు రోజుకు 75 గ్రాముల చొప్పున 25 రోజులకు కేజీ 875 గ్రాములు, గర్భిణులు, బాలింతలకు రోజుకు 150 గ్రాముల చొప్పున 3.750 కేజీలు నూనె: చిన్నారులకు రోజుకు 5 గ్రాముల చొప్పున 25 రోజులకు 125 గ్రాములు, గర్భిణులు, బాలింతలకు రోజుకు 16 గ్రాముల చొప్పున మొత్తం 400 గ్రాములు. పాలు: చిన్నారులకు రోజుకు 250 ఎమ్ఎల్ చొప్పు న 25 రోజులకు 5 లీటర్లు పంపిణీ చేయనున్నారు. క్రోడిగుడ్లు: చిన్నారులకు, గర్బిణులు, బాలింతలకు రోజుకు ఒకటి చొప్పున 25 పంపిణీ చేయనున్నారు.సూర్యాపేట జిల్లాలో మొత్తం 1209 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 5,600 మంది గర్భిణిలు, 4,100 మంది బాలింతలు, 47,683 మంది చిన్నారులున్నారు. ఇందులో 0–3 వయసు ఉన్న వారు 29,388 మంది, 3–5 వయస్సు ఉన్న వారు 19,717 మంది ఉన్నారు. మే నెలలో 31 రోజులు ఉండగా ఆదివారాలు, ప్రభుత్వ సెలవులు పోను 25 రోజులకు గానూ పౌష్టికాహారం పంపిణీ చేయనున్నారు. ఫ మే1 నుంచి అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఫ చిన్నారుల ఇంటికే పౌష్టికాహారం ఫ 25 రోజుల సరుకులు అడ్వాన్స్‌గా అందజేత -
గుడిబండ.. మట్టి దందా
కోదాడ : కోదాడ సమీపంలోని గుడిబండ కేంద్రంగా మట్టిదందా జోరుగా సాగుతోంది. ప్రభుత్వ భూములు, గుట్టలను గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో తవ్వుతూ మట్టిని టిప్పర్ల ద్వారా తరలిస్తూ ప్రధాన రహదారి పక్కనే డంపు చేస్తున్నారు. ఆ తర్వాత ట్రాక్టర్ల ద్వారా వెంచర్లకు తరలిస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వ హయంలో మట్టి దందాలో చక్రం తిప్పిన వారే తాజాగా పార్టీ మారి ఇదే దందాను కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నా, పచ్చటి గుట్టలను మింగేస్తున్నా రెవెన్యూ అధికారులుగాని, పోలీసులుగాని, మైనింగ్‌శాఖ అధికారులుగాని పట్టించుకోకపోవడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములే లక్ష్యంగా.. కోదాడ మండలంలోని గుడిబండ, కాపుగల్లు, రెడ్లకుంట, కూచిపూడి, తొగర్రాయి గ్రామాల సమీపంలో గుట్టలు, ఏనెలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వానికి చెందినవి కావడం, వ్యవసాయయోగ్యంగా లేక పోవడంతో కొందరు అక్రమార్కులు వీటిపై కన్నేశారు. భారీ ప్రోక్లెయిన్స్తో గుట్టలను పెకిలించి మట్టిని తీస్తున్నారు. పెద్ద ట్రిప్పర్లలో మట్టిని నింపి రాత్రి సమయాల్లో నేరుగా కోదాడలోని వెంచర్లలోకి తరలిస్తున్నారు. మరి కొందరు మట్టిని కోదాడ– మేళ్లచెరువు రోడ్డు పక్కనే డంపు చేసి ఉదయం వేళల్లో ట్రాక్టర్ల ద్వారా కోదాడ పట్టణంలో ఇల్లు కట్టుకునే వారికి, వెంచర్ల నిర్వాహకులకు అమ్ముతూ లక్షల్లో ఆర్జిస్తున్నారు. హోల్‌సేల్‌గా కొని.. రిటైల్‌గా అమ్మకం... ప్రస్తుతం కోదాడ పట్టణంలో ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. దాంతో మట్టికి డిమాండ్ ఏర్పడింది. దీనిని అక్రమార్కులు తమకు అనకూలంగా మార్చుకుంటున్నారు. రాత్రి సమయంలో ప్రభుత్వ భూముల నుంచి మట్టిని భారీ టిప్పర్ల సాయంతో మైదాన ప్రాంతానికి తరలించి డంప్ చేస్తున్నారు. ఉదయం వేళల్లో మట్టిని ట్రాక్టర్ల ద్వారా రిటైల్‌గా అమ్ముతున్నారు. ఒక ట్రిప్పర్ మట్టిని నాలుగైదు వేలకు కొనుగోలు చేసి.. దానిని రిటైల్‌గా రూ.10 వేలకు అమ్ముకుంటున్నారు. కోదాడకు చెందిన ఇద్దరు, కాపుగల్లుకు చెందిన ఒకరు, గుడిబండకు చెందిన ఒకరు ఈ దందాలో కీలకపాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో.. కోదాడ నియోజకవర్గ పరిధిలోని పైలెట్ గ్రామాలలో మినహా మిగతా చోట్ల ఎక్కడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరగడం లేదు. కానీ మట్టిదందా చేస్తున్నవారు మాత్రం తాము ఇందిరమ్మ ఇళ్ల పేరుతో యథేచ్ఛగా తరలిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాళ్లు ఇందిరమ్మ ఇళ్లకు మట్టి తీసుకెళుతున్నారని చెబుతూ కనీసం విచారణ కూడా చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు ఈ విషయమై దృష్టిసారించి మట్టి దందాను అరికట్టి ప్రభుత్వ భూములను, గుట్టలను కాపాడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లోంచి మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనాలను సీజ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. కోదాడ మండల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో మట్టి దందా సాగుతున్న విషయం మా దృష్టికి రాలేదు. మట్టి తవ్వకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. – సీహెచ్. సూర్యనారాయణ, ఆర్డీఓ కోదాడ ఫ గుట్టల్లో గుట్టుగా మట్టి తవ్వకంఫ రోడ్డుపక్కనే డంపుచేసి.. హోల్‌సేల్‌గా అమ్మకం ఫ నిత్యం లక్షల్లో వ్యాపారం ఫ పట్టించుకోని రెవెన్యూ అధికారులు -
జాతీయస్థాయి పోటీలకు కోదాడ యువకులు
కోదాడ : జాతీయస్థాయి గోల్షూట్బాల్ పోటీలకు కోదాడకు చెందిన కుడుముల చరణ్, మండలంలోని మంగళితండాకు చెందిన ఇబ్రహీం ఎంపికై నట్లు పీఈటీలు రాజ్‌కుమార్, మట్టయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25 నుంచి 27 వరకు మోత్కూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో వారు పాల్గొని ప్రతిభ కనబర్చడంతో జాతీయస్థాయికి ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. మే 28 నుంచి 30 వరకు ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలలో వీరు తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొనున్నట్లు తెలిపారు. ఆర్టీఎం నియామకానికి దరఖాస్తులు నల్లగొండ : నల్లగొండలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో రీజనల్ ట్రైనింగ్ మేనేజర్ (ఆర్టీఎం) తాత్కాలిక ప్రాతిపదికన నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29, 30 తేదీల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. -
డీజిల్ కోసం బారులు
అర్వపల్లి, మునగాల, ఆత్మకూర్(ఎస్) : జిల్లాలో పెట్రోల్ కష్టాలు తీరడం లేదు. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూర్యాపేట జిల్లాలోని బంక్‌లలో పెట్రోల్, డీజిల్ స్టాక్ అయిపోవడంతో అవి మూతపడ్డాయి. స్టాక్ ఉన్న బంక్‌లలో వాహనాలు బారులుదీరాయి. మండుటెండలో గంటల కొద్దీ లైన్లో నిల్చొని మరీ పెట్రోల్, డీజిల్ పోయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అర్వపల్లి మండలంలో రెండు రోజులుగా డీజిల్ కొరత తీవ్రమైంది. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతుండటంతో వాహనాలకు డీజిల్ వాడకం పెరిగింది. దీనికి తోడు తుంగగూడెం ఇసుక రీచ్ నుంచి ప్రతిరోజు 400 ట్రాక్టర్ల ఇసుక రవాణా జరుగుతోంది. ఆయా వాహనాలకు ప్రతిరోజు వేల లీటర్ల డీజిల్ అవసరం. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ఆయా వాహనాలు బంక్‌ల వద్ద బారులు దీరుతున్నాయి. అర్వపల్లితో పాటు తిమ్మాపురంలోని బంక్‌లలో డీజిల్ కోసం క్యూలైన్లలో క్యాన్లు, డ్రమ్‌లు పెట్టారు. మునగాల మండలంలోని జాతీయ రహదారిపై గల బరాఖత్‌గూడెం, మునగాల, ముకుందాపురం, ఆకుపాముల, తాడువాయి గ్రామాల శివారులో ఉన్న ఏడు పెట్రోల్ బంక్‌లలో స్టాక్ వచ్చిన నాలుగైదు గంటలలోనే ఖాళీ అవుతోంది. క్యూలో ఉన్నవారికి సైతం పెట్రోల్, డీజిల్ దొరికే పరిస్థితి లేదు. మంగళవారం ఏడు బంక్‌లలోనూ నో స్టాక్ బోర్డులు పెట్టారు. పెట్రోల్ కోసం సూర్యాపేటకు ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంతో పాటు నెమ్మికల్, ఏపూరు పెట్రోల్ బంకులు స్టాక్ లేక మూత పడ్డాయి. దాంతో రెతులు సూర్యాపేటకు వచ్చి డీజిల్‌ను ఆటోల్లో తీసుకెళుతున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్‌కు డీజిల్ రావడంతో వాహనదారులు బారులు దీరారుఫ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఫ బంకుల్లో నోస్టాక్ బోర్డులు ఫ ఇబ్బందులు పడుతున్న వాహనదారులు -
ధాన్యం దందాపై అధికారుల ఆరా
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధరకు అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్లో కొనుగోళ్లు, అమ్మకాలపై విచారణ చేసి రికార్డులను పరిశీలించారు. రాత్రి ఏ సమయంలో ట్రాక్టర్లు, డీసీఎంలు బయటకు వెళ్లాయనే విషయాన్ని నిర్ధారించేందుకు సీసీ పుటేజీలను పరిశీలించారు. శనివారం రాత్రి ధాన్యం లోడుతో వెళ్లిన డీసీఎం ఎటువైపు వెళ్లిందనే విషయమై వివరాలు సేకరించారు. అనంతరం జలాల్పురం, గొట్టిపర్తి, వెంపటి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి వివరాలు సేకరించారు. గొట్టిపర్తి కేంద్రంలో రైతులతో మాట్లాడారు. గత యాసంగి సీజన్ నుంచి ఈ దందా సాగుతోందని రైతులు అధికారికి వివరించారు. ఈ విషయమై సేకరించిన వివరాలతో పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్ఓ మోహన్‌బాబు, సివిల్ సప్లై డీఎం శ్రీధర్‌రెడ్డి, డీసీఓ ప్రవీణ్‌కుమార్, ఆర్డీఓ వేణుమాధవరావు, తహసీల్దార్ హరిప్రసాద్, మార్కెట్ కార్యదర్శి సురేష్, డీటీసీఎస్ రాజశేఖర్, ఆర్ఐలు శ్రీకాంత్‌రెడ్డి, సుజిత్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. అక్రమార్కులపై పోలీసులకు ఫిర్యాదు భానుపురి (సూర్యాపేట) : తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో రైతుల నుంచి కొనుగోలు చేసి గొట్టిపర్తి ఐకేపీ కేంద్రంలో రైతుల పేరిట విక్రయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జిల్లా అధికారులతో కూడిన విచారణ బృందం మార్కెట్‌ను సందర్శించి విచారించారు. మార్కెట్లో రైతుల నుంచి కొనుగోలు చేసి ఐకేపీకి తరలిస్తున్నట్లు విచారణలో తేల్చారు. ఇందులో కమిషన్ ఏజెంట్ సోమా ఆంజనేయులు, డ్రైవర్ మణికుమార్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. అక్రమాలలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉన్నదో తేల్చేందుకు తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశారు. ఫ తిరుమలగిరి మార్కెట్లో తనిఖీలు -
మాతా శిశు మరణాలను తగ్గించాలి
సూర్యాపేట టౌన్ : మాతా శిశు మరణాలను తగ్గించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఆశా నోడల్ అధికారులు, ఆశాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణుల నమోదు, ఏఎన్సీ చెకప్‌లు, సురక్షిత ప్రసవం, బాలింతల సంరక్షణ, శిశు టీకాలు, పోషకాహారం, బాలల వృద్ది పర్యవేక్షణ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించబడుతోందన్నారు. అర్హులైన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ 100శాతంతోపాటు డ్రాప్ ఔట్, లెప్ట్ ఔట్, మిస్డ్ ఔట్ లేకుండా 0–5 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీశైలం, డిప్యూటీ డెమో వి.సంజీవ్‌రెడ్డి, డీపలో ఉమామహేశ్వరి, ఉపేందర్, శంకర్, ఆశా నోడల్ అధికారులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
అన్ని వసతులు సమకూర్చాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వ బాలసదనం, అనాథాశ్రమాల్లో ఉండే పిల్లలకు అన్ని వసతులు సమకూర్చాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సోమవారం ప్రజా పాలన–ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని ప్రభుత్వ బాలసదనం, అనాధాశ్రమాల్లో నివసిస్తున్న అనాథ, సంరక్షణ అవసరమున్న పిల్లలకు ధ్రువీకరణ పత్రాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, బాలల అధికారి రవికుమార్, బాల సంక్షేమ సమితి చైర్మన్ బి.రమణారావు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
విధుల నుంచి కాంట్రాక్ట్ ఏఎన్ఎం తొలగింపు
సూర్యాపేట టౌన్ : పట్టణ పరిధిలోని రాజీవనగర్ యూపీహెచ్‌సీలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంగా పనిచేస్తున్న పోలేటి నాగమణిని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు డీఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శిశు విక్రయం కేసులో నాగమణి పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో అరెస్టు చేసి జైలు పంపించామన్నారు. ఈ కేసుకు సంబంధించి జరుగుతున్న విచారణలో భాగంగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాగమణిని విధుల నుంచి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్టు చెప్పారు. శాఖలో పని చేసే ఉద్యోగులు విధుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. లేబర్ కోడ్ల రద్దుకు పోరాడుదాంసూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లో రద్దు చేసేవరకూ పోరాడుదామని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య అన్నారు. సూర్యాపేటలో సోమవారం ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేడే పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మేడే వేడుకలను గ్రామగ్రామాన ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కునుకుంట్ల సైదులు, హమాలీ యూనియన్ అధ్యక్షుడు దొనకొండ సైదులు, పురుషోత్తం, గురుమల్లు, పాలబిందేల వెంకన్న, రమేష్ పాల్గొన్నారు. -
తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత కేసీఆర్‌దే
సూర్యాపేట టౌన్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో అడుగుఅడుగునా అణచివేతకు గురైన తెలంగాణను ఉమ్మడి పాలన నుంచి విముక్తి చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేసింది బీఆర్ఎస్ అన్నారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ప్రాణాలకు తెగించి కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వై.వెంకటేశ్వర్లు, అనిల్‌రెడ్డి, అమరవాది శ్రవణ్ పాల్గొన్నారు. -
పది నెలల్లో 15వేల కేసులు పరిష్కారం
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్రవ్యాప్తంగా పది నెలల్లో దాదాపు 15 వేల పెండింగ్ ఆర్టీఐ కేసులను పరిష్కరించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్న్ డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)–2005 అవగాహన సదస్సుకు సమాచార కమిషనర్లు పివి శ్రీనివాస్ రావు, మోహసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. రెండేళ్ల క్రితం వరకు కమిషన్ లేకపోవడంతో కమిషన్ లెవెల్లో దాదాపు 28 వేల కేసుల వరకు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. వాటిలో 18 వేల కేసుల హియరింగ్ పూర్తి చేసుకొని 16 వేల కేసుల్లో ప్రజలకు సమాచారం అందించామన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 1.20 లక్షల మంది ప్రజలు ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకుంటున్నారని తెలిపారు. మొదటి దశలో 50 శాతం కేసులను జిల్లాల పర్యటనలో పరిష్కారం చూపామని, మరో 50 శాతం కేసులను త్వరలో పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా ప్రజలకు సమాచార హక్కు చట్టంపై ఎక్కువ అవగాహన కలిగి ఉన్నారని, అందుకే సూర్యాపేట జిల్లా నుంచి భారీగా సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పౌరులు అడిగిన సమాచారాన్ని గడువులోగా అందించాల్సిన భాద్యత అధికారులపై ఉందన్నారు. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి -
రసాయన ఎరువులు అధికంగా వాడొద్దు
గరిడేపల్లి : సాగు భూములు నిస్సారం కోల్పోకుండా ఉండాలంటే రసాయన ఎరువులు, యూరియాను అధికంగా వాడొద్దని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సుకుమార్, శ్రీనివారెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు మేరకు సోమవారంరాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రైతు ముంగింట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మండలం పొనుగోడు గ్రామాన్ని శాస్త్రవేత్తల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో వారు మాట్లాడారు. ఏప్రిల్ 27 నుంచి మే 23 వరకు శాస్త్రవేత్తలు నేరుగా గ్రామాలకే వచ్చి రైతులకు సాగులో మెళకువలు నేర్పుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కటకం వేణు, మండల వ్యవసాయ అధికారి ప్రీతం కుమార్, ఏఈఓ మనోజ్, రైతులు కటకం రమేష్, కటకం గోపయ్య, సుందరి నాగేంద్రబాబు, దేవిరెడ్డి, లింగయ్య, సత్యనారాయణరెడ్డి రైతులు పాల్గొన్నారు. -
మహాశివుడికి ప్రత్యేక పూజలు
మేళ్లచెరువు : మండల కేంద్రంలోని శ్రీఇష్టకామేశ్వరీ సమేత శ్రీస్వయంభుశంభులింగేశ్వరస్వామి ఆయలంలో సోమవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, పుష్పార్చన అనంతరం గోపూజ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి అర్చకులు విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ పాల్గొన్నారు. వైభవంగా అధ్యయనోత్సవాలుమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న తిరుకల్యాణోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం అధ్యయనోత్సవాల పూజలను అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్వారాదులకు ప్రత్యేక అర్చనలు, మహానివేదన గావించి తీర్థప్రపాదాలు అందజేవారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశి ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, బదరీ నారాయణాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, అనంతాచార్యులు, నరసింహాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. ఎంజీయూలో ప్రయోగశాలలు ప్రారంభంనల్లగొండ టూటౌన్ : ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో సోమవారం యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ వివిధ ప్రయోగశాలలను ప్రారంభించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ఆకుల రవి, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రేఖ, హరీష్ కుమార్, జయంతి, సుధారాణి, సాంబశివరావు పాల్గొన్నారు. చరిత్ర అధ్యయనానికి శాసీ్త్రయ పద్ధతులు తప్పనిసరి నల్లగొండ టూటౌన్ : చరిత్ర అధ్యయనంలో ఖగోళ శాస్త్రం, శాసీ్త్రయ పద్ధతులు, పరిశోధనా విధానం వంటి అంశాలు అవసరమని ఎంజీయూ చరిత్ర విభాగం ప్రొఫెసర్ కె.అశోక్ అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో యువత కోసం చరిత్ర, చరిత్ర రచన ఎందుకు, ఎలా అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. గతాన్ని అర్థం చేసుకోవడం ద్వారా వర్తమానాన్ని సమర్థంగా విశ్లేషించి, భవిష్యత్తును సముచితంగా నిర్మించుకోవడమే చరిత్ర అన్నారు. కార్యక్రమంలో చరిత్ర విభాగం అధ్యాపకులు విజయబాబు, పనస రామకృష్ణ, షరీఫ్, శ్రీనివాస్, వివేక్, విద్యార్థులు పాల్గొన్నారు. -
అమరుల స్ఫూర్తితో ఆర్టీసీని రక్షించుకుందాం
భానుపురి (సూర్యాపేట) : కార్మికుల హక్కుల సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన డ్రైవర్ శంకర్‌గౌడ్ లాంటి అమరవీరుల స్ఫూర్తితో ఆర్టీసీని రక్షించుకుని హక్కులను సాధించుకుందామని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక డిపో ఆవరణలో ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రాణత్యాగం చేసిన నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంకర్ గౌడ్ ప్రాణత్యాగం సమ్మె డిమాండ్ల పరిష్కారానికి ప్రభావితం చేసిందన్నారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు బత్తుల సుధాకర్, డీఆర్ కుమార్, పీఎం రావు, సేవియా, లక్ష్మయ్య, రవి, నాగరాజు, డి సి నాయక్, మోహన్, పీసీ శేఖర్, అక్బర్, సందేశ్, అనిజిత్, వీరయ్య, ఎల్లమ్మ,, శ్రీదేవి అలివేలు, రజిత పాల్గొన్నారు. -
చట్టపరంగా సమస్యలు పరిష్కరిస్తాం
సూర్యాపేట టౌన్ : ప్రజా సమస్యలను చట్టపరంగా పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీనరసింహ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డేలో ఫిర్యాదుదారులను నుంచి వినతులు స్వీకరించి మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు, సూచనలు చేసి సమస్యల పరిష్కారానికి అవసరమైన దిశానిర్దేశం చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు. డ్రగ్స్ నిర్మూలన, పిల్లల భద్రత అందరి బాధ్యత డ్రగ్స్ నిర్మూలన, పిల్లల భధ్రత అందరి బాధ్యత అని జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం సూర్యాపేటలో ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బాలల భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పోలీసు అధికారులు విద్యార్థులు, యువతకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారన్నారు. ఈ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మే 2వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. బాలల భద్రతను పర్యవేక్షించడం, వ్యసనాలకు అలవాటుపడ్డ వారిలో మార్పు తేవడం, నేటి యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని జిల్లా నుండి పారదోలడమే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు లేదా మాదక ద్రవ్యాల విక్రయాలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. జిల్లా ఎస్పీ నరసింహ -
పాఠ్యపుస్తకాలు వచ్చేశాయ్..
సూర్యాపేట టౌన్ : నూతన విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేయాల్సిన పాఠ్యపుస్తకాలపై విద్యా శాఖ ముందస్తుగానే దృష్టి సారించింది. ఇప్పటికే పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. నెలన్నర తర్వాత బడులు తెరుచుకోనున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థుల చేతుల్లో పాఠ్య పుస్తకాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 72.87శాతం పాఠ్య పుస్తకాలు వచ్చేశాయి. మిగిలిన పుస్తకాలు కూడా త్వరలోనే రానున్నాయి. జిల్లాకు 3,41,350 పుస్తకాలు అవసరంజిల్లాలోని 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 60వేల మంది విద్యార్థులకు ఆయా సబ్జెక్టులకు సంబంధించి 3,41,350 పుస్తకాలు అవసరమని విద్యా శాఖ గుర్తించింది. ఇప్పటి వరకు 2,48,770(72.87శాతం) పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. వాటిని జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలోని గోదాములో భద్రపరుస్తున్నారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియం పుస్తకాల పంపిణీ దృష్ట్యా ఏడాదిలో రెండు విడతల్లో పార్ట్ 1, పార్ట్ 2గా పాఠ్యపుస్తకాలను ముద్రిస్తూ విడతల వారీగా సరఫరా చేస్తున్నారు. ప్రతి పుస్తకంపై వరుస సంఖ్య, కూ ఆర్ కోడ్‌ను ముద్రించడంతో ఉచిత పుస్తకాలు పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఏ వరుస సంఖ్య పుస్తకాలు ఏ పాఠశాలకు వెళతాయనే అంశాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయనున్నారు. జూన్ మొదటి వారంలో పంపిణీవిద్యార్థులకు అందించాల్సిన పుస్తకాలు మే నెలలో పూర్తి స్థాయిలో గోదాముకు రానున్నాయి. ఈ పుస్తకాలను జూన్ మొదటి వారంలో మండలంలోని ఎమ్మార్సీలకు పంపించి అక్కడి నుంచి సంబంధిత పాఠశాలలకు పంపిణీ చేయనున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం రోజే విద్యార్థుల చేతుల్లో కొత్త పాఠ్య పుస్తకాలు ఉండేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ముందస్తు బడిబాట సైతం నిర్వహిస్తున్నారు. ఈ బడిబాటలో ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులను, బడిబయట విద్యార్థులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించనున్నారు.ఫ ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరిన 72.87 శాతం ఫ జెడ్పీ బాలుర పాఠశాల గోదాములో భద్రపరిచిన అధికారులు ఫ పాఠశాలలు పునఃప్రారంభం రోజే అందజేసేందుకు ఏర్పాట్లుపాఠశాలల పునఃప్రారంభం రోజే పంపిణీ చేస్తాం విద్యార్థులకు పాఠశాలలు పునఃప్రారంభం రోజే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తాం. విడతల వారీగా పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. ఇప్పటికే 72శాతం పుస్తకాలు వచ్చాయి. మిగతావి కూడా త్వరలోనే వస్తాయి. వచ్చిన వాటిని గోదాములో నిల్వ చేస్తున్నాం. పూర్తిస్థాయిలో వచ్చిన తర్వాత జూన్ మొదటి వారంలో ఎంఈఓల ఆధ్వర్యంలో సంబంధిత పాఠశాలలకు అందజేస్తాం. – అశోక్, జిల్లా విద్యా శాఖ అధికారి -
సూర్యక్షేత్రంలో సౌరహోమం
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. కాగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరిపారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకురాలు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే, భక్తులు పాల్గొన్నారు. బాధితుల ఇంటి నుంచే కేసులు నమోదు ఫ ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే బాధితుల ఇళ్లకు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి ఇంటి వద్ద నుంచే కేసు నమోదు చేస్తున్నామని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాధితుల ఇంటి వద్ద నుంచే కేసు నమోదు, ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా పోలీసు శాఖ పటిష్టంగా అమలు చేస్తోందన్నారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి, బాధితుల ఇంటికి పోలీసు అధికారులు చేరుకుని పారదర్శకంగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. వారం రోజులుగా బాధితుల ఇంటి నుంచి 101 కేసులు నమోదు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ఆకృత్యాలు, విద్యాసంస్థల్లో ర్యాగింగ్, బాల్య వివాహాలు జరిగే సమయంలో సమాచారం అందుకున్న వెంటనే బాధితుల ఇంటి వద్దకు, లేదా వారికి అనుకూలమైన ప్రదేశంలో ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసి పత్రాన్ని అందజేస్తున్నామన్నారు. సమస్యలపై 100 నంబర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. డ్రగ్స్ నిర్మూలనపై నేటి నుంచి అవగాహన సూర్యాపేట టౌన్ : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన 5వ అంశం పిల్లల భద్రత, డ్రగ్స్ నిర్మూలనపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి వారం రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, యువత మత్తుకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారని, వాటి బారినుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. గంజాయి సరఫరా, వినియోగంపై, గతంలో గంజాయి కేసుల్లో ఉన్న వారిపై, వినియోగించే వారిపై పోలీసు నిఘా ఉంచామని తెలిపారు. వీరికి కౌన్సిలింగ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిసామని పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువత భాగస్వామ్యం కావాలని, మాదకద్రవ్యాల రహిత ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు. -
నలభై వసంతాలకు అపూర్వ కలయిక
హుజూర్నగర్ : వారంతా నలభై ఏళ్ల క్రితం పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఒకే వేదికపై కలిశారు. వారే హుజూర్నగర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1985–86 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు. వీరు ఆదివారం హుజూర్నగర్ పట్టణంలోని వర్తక సంఘం భవనంలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని రోజంతా గత తీపి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం అప్పట్లో తమకు పాఠాలు బోధించిన గురువులను ఘనంగా సన్మానించారు. తొలుత పాఠశాల ప్రాంగణంలో సహా విద్యార్థి గొర్రె సదాశివానందరెడ్డి రూ.లక్ష ఆర్థిక సాయంతో నిర్మించిన భారతదేశ చిత్రపటాన్ని ఎంఈఓ భూక్య సైదా నాయక్, హెడ్మాస్టర్ తాతరాజు శ్రీనివాసరావు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఎంఎస్ఎన్ రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో దామోదరా చార్యులు, రాము గురుపాదం, గోపాల్‌దాస్, వెంకటేశ్వర్లు, గణేష్, భిక్షపతి, మహబూబ్ అలీ, శ్రీను, మురళి, సక్రు, దాదాపు 70 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
సెల్ఫ్ ఎన్యుమరేషన్‌ను వినియోగించుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : జనగణన –2027 కార్యక్రమంలో భాగంగా స్వీయ గణనకు అవకాశం కల్పించామని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకొని తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వీయ గణనపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా స్వీయ గణన నమోదు ప్రక్రియను వివరించారు. మే 10వరకు ఈ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని, ప్రజలు తమ ఇంటి, కుటుంబ సభ్యుల సమాచారం, సౌకర్యాలు మొదలైన అంశాలను అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా సులభంగా నమోదు చేయవచ్చన్నారు. జనగణనలో మొదటి సారిగా స్వీయ గణనను ప్రవేశపెట్టడం దేశాన్ని డిజిటల్ దిశగా తీసుకెళ్లే ప్రక్రియలో ముఖ్యమైన అడుగు అన్నారు. ప్రతి కుటుంబం తప్పకుండా స్వీయ గణనలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి కిషన్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, ఎస్ఓ ఇస్లావత్ ఓబులాలు, ఎస్ఓవి రామారావు, ఎం.రాజేష్, తదితరులు పాల్గొన్నారు. -
రెండో విడత ఏమాయే..!
భానుపురి (సూర్యాపేట) : రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం దరఖాస్తుదారులు ఎదురు చూస్తున్నారు. మొదటి విడత ఇళ్లు జిల్లాలో ముమ్మరంగా సాగుతుండగా.. ఏప్రిల్ మాసంలో రెండో విడత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్ సమావేశాల్లోనూ నిర్మాణ శాఖకు నిధులు కేటాయించింది. అయితే ఈ నెల ముగియవస్తుండగా ఇంతవరకు ఇళ్ల మంజూరు పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి నిర్ణయం రాకఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన సమయంలో 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల మధ్యలోనే ఈ నిర్మాణం ఉండాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలతో చాలామంది తమకు బిల్లులు వస్తాయా..? ఈ ఇల్లు సరిపోతుందో లేదోనన్న అనుమానాలతో మొదట్లో ఇంటి నిర్మాణానికి ముందుకు రాలేదు. నిర్మాణాలు జరిగిన చోట ఇళ్లను చూసిన లబ్ధిదారులు ఇవి బాగున్నాయని.. బిల్లులు వెనువెంటనే వస్తున్నాయని చెప్పి ఇంటి నిర్మాణాలకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే మొదటి విడతలో ఇళ్లురాని అర్హులైన దరఖాస్తుదారులు రెండో విడతలోనైనా ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని భావించారు. ప్రభుత్వం కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మొదట్లోనే రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రకటిస్తామని చెప్పగా వీరంతా ఆనందపడ్డారు. తదనంతరం ఈ నెలాఖరు నాటికి ఇస్తామని మంత్రులు ప్రకటించగా ఇప్పటివరకు దీనిపై ఎలాంటి నిర్ణయాలు వెలువడలేదు. అధికారికంగా జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో రెండో విడతపై ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.మొదటి విడత ముమ్మరంగా..ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మొదటి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 12,868 ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులను గుర్తించి 8,252 మందికి ప్రొసీడింగ్ కాపీలు అందించారు. ఈ ఇళ్లు ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నాయి. 1,500 ఇళ్లకు పైగా గృహప్రవేశాలు జరగగా మే నెల వరకు మరో 1,500 ఇళ్లను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో 4616 నిర్మాణాలు వివిధ కారణాలతో ఇంకా ప్రారంభం కాలేదు. ఇందిరమ్మ ఇళ్లపై వీడని ఉత్కంఠ ఏప్రిల్‌లో ఇస్తామని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రకటన కానీ మాసం ముగియవస్తున్నా రాని ఆదేశాలు దరఖాస్తుదారులకు ఎదురుచూపులు -
ఆర్యవైశ్యులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యులకు అండగా ఉంటుందని, ఏ ప్రభుత్వం చేయని విధంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నదని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలను కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వల చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమ్మవారి త్యాగాన్ని గుర్తించి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యలకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. వారికి సముచిత స్థానం కల్పించేందుకు సూర్యాపేట మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మొరిశెట్టి నివేదితకు అవకాశం కల్పించిందని చెప్పారు. వాసవిమాత జయంతిని వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించుకునేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, ఏఎంసీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, డీఎంహెచ్ఓ వెంకటరమణ, సంక్షేమ అధికారి కె.నరసింహారావు, యువజన సంక్షేమ అధికారి వెంకట్‌రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వెంపటి వెంకటేశ్వరరావు, కోశాధికారి లక్ష్మీకాంత్, పట్టణ అధ్యక్షుడు మంచాల రంగయ్య, కార్యదర్శి కలకోట లక్ష్మయ్య, బండారు రాజా, తోట శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు. పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి -
‘ఎన్ఎఫ్బీఎస్’ బాధ్యతల మార్పు
తిరుమలగిరి (తుంగతుర్తి) : పేద కుటుంబాల్లో ఇంటి యజమాని మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకొచ్చిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్) నిర్వహణ బాధ్యతల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఈ పథకం బాధ్యతలను చూస్తున్న రెవెన్యూ శాఖ (తహసీల్దార్లు) నుంచి తొలగించి ఇకపై ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల పరిధిలోకి మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాప్యానికి చెక్ పెట్టేందుకే..ఇప్పటివరకు ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందాలంటే బాధిత కుటుంబాలు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. అయితే, రెవెన్యూ అధికారులపై ఉన్న పని ఒత్తిడి కారణంగా క్షేత్రస్థాయి విచారణలు, నివేదికల తయారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల లబ్ధిదారులకు సకాలంలో సాయం అందడం లేదని భావించి, పాలనను ప్రజలకు మరింత దగ్గర చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త దరఖాస్తు విధానంప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం.. ఇకపై లబ్ధిదారులు తమ దరఖాస్తులను నేరుగా గ్రామ పంచాయతీల్లో, పట్టణాల్లో వార్డు ఆఫీసర్ కార్యాలయంలో సమర్పించవచ్చు. పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఎంపీడీఓలకు నివేదికలు అందజేస్తారు. ఈ నివేదికల ఆధారంగా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు నిధులను మంజూరుకు నివేదిస్తారు. దీనివల్ల బాధితులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పనుంది. అర్హతలు, ప్రయోజనంకుటుంబానికి ఆధారమైన వ్యక్తి 18 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు ఉండి మరణించి ఉండాలి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బిలో పావర్టీ లైన్) కుటుంబాల వారు మాత్రమే దీనికి అర్హులు. అర్హత పొందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20వేల నగదు సాయాన్ని ఒకేసారి అందిస్తుంది. ప్రభుత్వం కొత్త నిబంధన చేయడంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుంది. ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్థితిగతులను తెలుసుకోవచ్చు. మంజూరైన నిధులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఫ మండలాల్లో ఎంపీడీఓలకు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లకు.. ఫ రెవెన్యూ అధికారులపై పని ఒత్తిడి తగ్గించేలా నిర్ణయం ఫ సాయం పంపిణీలో జాప్యాన్ని నివారించేలా ప్రణాళిక -
ఆత్మహత్యలతో సమస్య పరిష్కారం కాదు
నల్లగొండ : చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులు పట్టింపులకు పోకుండా ప్రజల పక్షాన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. శుక్రవారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుత్తా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుడు శంకరయ్యగౌడ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు. చర్చల ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారమవుతాయని, ఆత్మహత్యల వల్ల కుటుంబాలు నష్టపోతాయని చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయని ఈసారి తాలు సమస్య ప్రధానంగా ఉందన్నారు. ఈ విషయంలో కలెక్టర్లు, మిల్లర్లు, రైతులతో కలిసి తాలు విషయంలో ఒప్పందానికి వచ్చినట్లు తెలిసిందన్నారు. రైతు బోనస్, రైతుబంధు ప్రభుత్వానికి ఆర్థికంగా భారమనే విషయం వాస్తవమేనని ఈ విషయంలో రైతుబంధు, సన్నాలకు బోనస్ ఈ రెండింటి విషయంలో ప్రభుత్వం ఆలోచన చేసి ఏదో ఒక పథకాన్ని సంపూర్ణంగా అమలు చేస్తే బాగుంటుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాయిల్డ్ రైస్ తీసుకోవాలని కేంద్రానికి విన్నవించినా అక్కడ నుంచి ఎలాంటి సహకారం అందలేదన్నారు. ధాన్యం కొనుగోలు, ఆర్టీసీ సమ్మె విషయంలో వాస్తవాలను పక్కన పెట్టి ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి ప్రయోజనాలను పొందాలని చూస్తున్నాయన్నారు. కాలేశ్వరం విషయంలో పీసీ ఘోష్ కమిషన్ విషయంలో ఎవరికీ హైకోర్టు క్లీన్ చీట్ ఇవ్వలేదని, సెక్షన్ 8 ప్రకారం నోటీసులు ఇవ్వలేదు కాబట్టే హరీష్‌రావు, కేసీఆర్‌లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తెలిపిందన్నారు. ఫ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి -
తిరుకల్యాణోత్సవ ఏర్పాట్ల పరిశీలన
మఠంపల్లి : మండలంలోని మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేతరంలో ఈ నెల 29 నుంచి మే 4వ తేదీ వరకు జరగనున్న తిరుకల్యాణోత్సవాలకు చేపట్టాల్సిన ఏర్పాట్లను శుక్రవా రం హుజూర్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, కోదా డ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పార్కింగ్ స్థలం, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, సీఐ చరమందరాజు, తహసీల్దార్ మంగారాథోడ్, సర్పంచ్ విజయశాంతిఅప్పారావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెన్పహాడ్ : నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీడీ పవన్‌కుమార్ సూచించారు. శుక్రవారం మండలంలోని సింగారెడ్డిపాలెంలో నర్సరీని ఆయన పరిశీలించారు. ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో మొక్కలు ఎండిపోకుండా నిర్వాహకులు ప్రతి రోజు నీరు అందించాలని సూచించారు. నర్సరీల నిర్వహణపై గ్రామ పంచాయతీలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో తిరిగి విత్తనాలు నాటాలన్నారు. ఆయన వెంట సర్పంచ్ ఒగ్గు కిరణ్, ఏపీఓ రవి, పంచాయతీ కార్యదర్శి అఖిల్, ఫీల్డ్ అసిస్టెంట్ జ్యోతి ఉన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతంఅర్వపల్లి : జిల్లాలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 141 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 135 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా సహకార అధికారి పాల్వాయి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం సూర్యానాయక్తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు 20వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ భాషపాక శ్రీకాంత్, గిర్దావర్ పాటి వెంకట్‌రెడ్డి, నిర్వాహకులు ఉన్నారు. అందుబాటులో 80 టన్నుల జిప్సం చిలుకూరు : మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు 80 టన్నుల జిప్సం అందుబాటులో ఉన్నట్లు మండల వ్యవసాయాధికారి శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక టన్ను జిప్సం ధర సబ్సిడీ పోను రూ.534 అని తెలిపారు. చౌడు భూముల్లో జిప్సం చల్లడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు. జిప్సం కావాల్సిన చిలుకూరు మండలానికి చెందిన రైతులు తమ పట్టాదారు పాస్‌పుస్తకాలతో ఏఈ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
హైవేపై పశువులతో ప్రమాదాలు
మునగాల : మునగాల మండల పరిధిలో జాతీయ రహదారి పక్క గ్రామాలకు చెందిన పశువులు నిత్యం రహదారిపై సంచరిస్తున్నాయి. దీంతో వేగంగా వచ్చే వాహనాలు అదుపుతప్పి పశువులను ఢీకొడుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళ పశువులు కనిపించక ప్రమాదాలు జరిగి ప్రజలతో పాటు పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి. రాత్రి వేళ ప్రమాదాల నివారణకు పది రోజుల క్రితం మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పశువులకు రేడియం స్టిక్కర్లు వేసే కార్యక్రమం కూడా ప్రారంభించారు. అయినా కొందరు పశువుల యజమానులు మాత్రం పశువులకు స్టిక్కర్లు వేయించేందుకు ముందుకు రాలేదు. ఇప్పటికై నా పశువుల యజమానులు అప్రమత్తమై తమ మూగజీవాలు హైవేపైకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా కాసరగడ్డ దీప హుజూర్నగర్ : హుజూర్నగర్ కోర్టు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా కాసరగడ్డ దీప నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న మారుతి ప్రసాద్‌ను రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఖమ్మంలో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న కాసరగడ్డ దీపను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మే నెల రెండవ తేదీ లోపు బదిలీ అయిన కోర్టులో బాధ్యతలు స్వీకరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏఎస్ఐ సత్యనారాయణ కుటుంబానికి రూ.10లక్షల సాలరీ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ పథకం పోలీసు కుటుంబాలకు ఆర్థికంగా బాసటగా నిలుస్తోందన్నారు. సిబ్బంది అందరూ ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పోలీసు సిబ్బంది సాలరీ ప్యాకేజ్ అకౌంట్‌గా మార్పు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, ఏఓ మంజుభార్గవి, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ రామారావు, పోలీసు సంఘం జిల్లా అధ్యక్షుడు రామచందర్‌గౌడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు పాల్గొన్నారు. -
ఘోష్ కమిషన్ నివేదిక తప్పుల తడక
తిరుమలగిరి (తుంగతుర్తి) : కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఘోష్ కమిషన్ నివేదిక తప్పుల తడకగా ఉందని తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకెపల్లి రఘునందన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, నిధులు దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు సరి కాదన్నారు. కాళేశ్వరం విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిదన్నారు. కోర్టు తీర్పుతోనైనా కాంగ్రెస్ నేతల తీరులో మార్పు రావాలన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, నాయకులు దూపటి రవీందర్, మోడెపు సురేందర్, కందుకూరి బాబు, కారుపోతుల నరేష్, ఫత్తెపురం త్రిశూల్, యాకూబ్‌నాయక్, పణికెర యాదగిరి, బర్ల వెంకన్న, బొడ్డు సైదులు, ప్రవీణ్, రవి పాల్గొన్నారు. -
త్వరలో ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు
సూర్యాపేటటౌన్ : హెల్త్ కార్డుల ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, నెల రోజుల్లోపే ఉపాధ్యాయులందరికీ నగదు రహిత హెల్త్ కార్డులు మంజూరు కానున్నాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. సూర్యాపేటలోని ఐఎంఏ ఫంక్షన్హాల్లో శుక్రవారం జరిగిన పసునూరి వెంకట్రాంరెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యోగుల వయో పరిమితి పెంపు, మెరుగైన పీఆర్సీ, పదోన్నతులు, బదిలీలు వంటివి పీఆర్టీయూ కృషి మూలంగానే సాధ్యమయ్యాయన్నారు. రాబోయే కాలంలో మంచి పీఆర్సీ ఇప్పించడంతో పాటు జూలైలో బదిలీలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రెండు విడతల్లో మొత్తం పెండింగ్ బిల్లులు క్లియర్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఏఐసీసీ సభ్యుడు రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం బాగుపడాలంటే అది ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తంగెళ్ల జితేందర్‌రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పందిరి విష్ణుకుమార్, సంఘం నాయకులు బాణాల శ్రీనివాస్‌రెడ్డి, పప్పుల వీరబాబు, కందుకూరి శివశంకర్, షరీఫున్నిసా బేగం, గోలి వెంకటకృష్ణారెడ్డి, రామలింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి -
ప్లేట్లు, గ్లాసులు, ఇంటి నుంచే..
సూర్యాపేట : పట్టణంలోని నంబర్– 2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జనగణనపై ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న కొందరు ఉపాధ్యాయులు పేపర్‌ప్లేట్లను వినియోగించకుండా తమ ఇంటి వద్ద నుంచి స్టీల్ ప్లేట్లను తెచ్చుకుని అందులోనే భోజనం చేశారు. మంచినీళ్లు తాగడానికి స్టీల్ వాటర్ బాటిల్, టీ తాగడానికి స్టీల్ గ్లాసులు తెచ్చుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు వారు చేస్తున్న కృషిని గ్రీన్‌క్లబ్ అధ్యక్షుడు ముప్పాని నరేందర్‌తో పాటు అధికారులు అభినందించారు. -
‘డబుల్’ ఇళ్లు కేటాయించాలని ఆందోళన
తిరుమలగిరి (తుంగతుర్తి) : డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన పలువురు శుక్రవాం తిరుమలగిరిలోని మోత్కూరు–తొర్రూరు ప్రధాన రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని అనంతారంలో స్లాబ్ వరకు పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అనంతారం, తిరుమలగిరి మున్సిపల్ పరిధిలోని కొందరు ఉండటానికి కొద్దిరోజులుగా ఘర్షణ పడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాస్తారోకోకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వచ్చి అధికారులతో మాట్లాడి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమింపజేశారు. ఫ అనంతారం గ్రామస్తుల ధర్నా ఫ అధికారుల హామీతో విరమణ -
మూడో రోజూ ఆర్టీసీ కార్మికుల ఆందోళన
భానుపురి (సూర్యాపేట) : ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉధృతమవుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె వీడడం లేదు. అధికారులు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు సూర్యాపేట జిల్లాకేంద్రంతోపాటు కోదాడలోని ఆర్టీసీ డిపోల ముందే కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కడ లేదు. కేవలం ఎలక్ట్రిక్, అద్దె బస్సులు మాత్రమే డిపో దాటి రోడ్డెక్కుతున్నాయి. అయితే సమ్మెకు చాలామంది డ్రైవర్లు, వివిధ పార్టీలు, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు తరలివచ్చి తమ మద్దతు తెలుపుతున్నారు. మూడో రోజు సూర్యాపేట, కోదాడ డిపోల వద్ద సమ్మె చేపట్టారు. సమ్మె నేపథ్యంలో నర్సంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన శంకర్‌గౌడ్ చిత్రపటానికి ఇరు చోట్ల పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యాయత్నాలు జరుగుతుండడంతో అధికారులు పోలీసులను మోహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలో మొత్తం 170 బస్సులు ఉండగా కేవలం 60 బస్సులను మత్రమే అధికారులు నడిపించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ల కోసం ప్రభుత్వం నియామకాలు జరుపుతుందన్న ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనను తీవ్రతరం చేసేందుకు యత్నిస్తున్నారు. వివిధ సంఘాల మద్దతు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం శుక్రవారం మద్దతు తెలిపి మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన న్యాయబద్ధమైనదని, కార్మికుల సమస్యలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కార్మికులు ఉద్యోగులు సహనం కోల్పోవద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి కానీ ఎవరు ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడొద్దన్నారు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆర్టీసీ కార్మికులు చేసిన కృషిని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. పిఆర్సి చట్టబద్ధంగా అమలు చేసే అంశం కాబట్టి ప్రభుత్వానికి ఇబ్బందులుఉండబోవని చెప్పారు. అలాగే కోదాడ బస్ డిపో గేటు ఎదుట ఆర్టీసీ కార్మికులు ఽనల్లబ్యాడ్జీలతో మౌన నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరి సమ్మెకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, ఏఐటీయూసీ, సీఐటీయూ, సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిర్లక్ష్యం చేయడం సరికాదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్టీసీ డిపో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు ఆయన కార్మికులకు సంఘీభావం తెలిపే మాట్లాడారు. కార్మికులకు తమ మద్దతు ఉంటుందని వారి హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఫ వివిధ పార్టీలు, కార్మిక సంఘాల మద్దతు ఫ రోడ్డెక్కని బస్సులు.. ప్రయాణికుల తిప్పలు -
వైద్యులు సమయపాలన పాటించాలి
మునగాల : ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సిబ్బందిని ఆదేశించారు. మునగాల మండలంలోని బరాఖత్‌గూడెం శివారులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తూకం, తేమ శాతం పరీక్షలు, రవాణా సౌకర్యాలపై ఆరా తీసి మాట్లాడారు. కొనుగోలు ప్రక్రియలో లోపాలు ఉండకూడదని సిబ్బందికి సూచించారు. కేంద్రంలో రైతులకు అన్ని వసతులు కల్పించాలని చెప్పారు.హుజూర్నగర్ : ప్రభుత్వ వైద్యులు విధి నిర్వహణలో సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు విభాగాలను పరిశీలించారు. పలువురు డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది సమయం కాకముందే విధుల నుంచి వెళ్లిపోవడంపై కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు అధికంగా జరిగేలా చూడాన్నారు. ఆసుపత్రి పారిశుద్ధ్య నిర్వహణపై శానిటేషన్ సిబ్బందిని, నర్సింగ్ ఆఫీసర్లను అభినందించారు. కాయకల్పలో అవార్డు పొందాలని ఆకాక్షించారు. నూతనంగా నిర్మిస్తున్న ఓపి బ్లాక్ నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ రవి కుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ వనజ, వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. మొక్కలు ఎండిపోకుండా చూడాలి హుజూర్నగర్ : ఎండల తీవ్రత దృష్ట్యా మోడల్ కాలనీలో నాటిన మొక్కలు ఎండిపోకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. హుజూర్‌నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీ ఇళ్లను గురువారం ఆయన పరిశీలించారు. మోడల్ హౌసింగ్ కాలనీలో విద్యుత్ పనులు, వీధిదీపాలు ఏర్పాటు, గ్రీనరీ, తాగునీరు, పైలాన్ స్థూపం, సభాస్థలిని ఆయన పరిశీలించి మాట్లాడారు. కాలనీలో మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, హర్టికల్చర్ పీడీ నాగయ్య, విద్యుత్ డీఈ వెంకటకిష్టయ్య, వివిధ శాఖల అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
హైకోర్టు తీర్పు.. ప్రభుత్వానికి చెంపపెట్టు
సూర్యాపేట టౌన్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని.. కేసీఆర్, హరీష్‌రావులపై చేసిన ఆరోపణలు చెల్లవని హైకోర్టు తీర్చునివ్వడం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. గురువారం సూర్యాపేటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదని, 210 కీ.మీ. సొరంగం, బ్యారేజ్‌లు, లిప్టులు, కెనాల్స్ కాళేశ్వరంలో భాగమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిండా ముంచే కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దుష్ప్రచారాన్ని మానుకోవాలని కాంగ్రెస్ నాయకులకు హితవు పలికారు. ఎన్ని కుట్రలు పన్నినా కేసీఆర్‌ను ఏమీ చేయలేరన్నారు. రైతులపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేయించి నీరివ్వాలని, లేని పక్షంలో లక్షలాది మంది రైతులను సమీకరించి ఉద్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో నాయకులు వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పుట్ట కిషోర్, నెమ్మాది భిక్షం, మాజీ జెడ్పీటీసీ జీడి భిక్షం, ఆకుల లవకుశ, బండారు రాజా, బొమ్మగాని శ్రీనివాస్, తూడి నరసింహా రావు, బెల్లంకొండ యాదగిరి, కోడి సైదులు, ముదిరెడ్డి అనిల్‌రెడ్డి, అమరవాది శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఫ కాళేశ్వరంపై వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాజ్యాంగ విరుద్ధంఫ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ -
ఇక.. ఆటాపాట
నేటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఫ ముగిసిన 2025–26 విద్యా సంవత్సరం ఫ జూన్ 12న స్కూళ్లు పునఃప్రారంభం సూర్యాపేట టౌన్ : విద్యార్థులకు వేసవి సెలవలొచ్చాయ్.. సంవత్సరం పాటు పుస్తకాలతో కుస్తీపట్టి పాఠశాలల్లో గడిపిన విద్యార్థులు శుక్రవారం నుంచి ఆటాపాటలతో గడపనున్నారు. 2025–26 విద్యా సంవత్సరం గురువారంతో ముగిసింది. ముగింపు రోజు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశాల నిర్వహించి విద్యార్థుల ప్రొగ్రెస్ కార్డులు అందజేశారు. కాగా గురుకులాలు, వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు రెండు రోజుల క్రితమే సొంత గ్రామాలకు బయలుదేరి వెళ్లారు. ఆర్టీసీ సమ్మె కొనసాతుండడంతో బస్సుల కొరత ఏర్పడి విద్యార్థులు బైకులు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఈ వేసవి సెలవులు జూన్ 11వ తేదీ వరకు ఉండనున్నాయి. తిరిగి పాఠశాలలు 2026–27 విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి. -
పీఆర్సీ, డీఏలు తక్షణమే విడుదల చేయాలి
సూర్యాపేట టౌన్ : ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు తక్షణమే విడుదల చేయాలని బీసీ టీచర్స్ యూనియన్ (బీసీటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు బెల్లంకొండ రామమూర్తి అన్నారు. సూర్యాపేటలోని డీఈఓ కార్యాలయంలో గురువారం బీసీటీయూ క్యాలెండర్‌ను డీఈఓ అశోక్‌తో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నేరేళ్ల దేవరాజ్, కోశాధికారి శ్రీమండల సైదులు, పోతురాజు నరసయ్య, సూర్య, నాయకులు పొడిశెట్టి శ్రీధర్, ఎ.రామకష్ణ, బట్టుపల్లి సాయికుమార్ పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు రానివ్వం
భానుపురి (సూర్యాపేట) : ‘ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. ప్రధానంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇచ్చాం. ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేందుకు మండల స్థాయిలో కమిటీలను వేశా. కలెక్టరేట్లోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోల్ ప్రీ నంబర్ అందుబాటులో ఉంచాం’ అని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ వెల్లడించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. గతంలో కన్నా ఎక్కువగా కొనేలా.. గత యాసంగిలో 3,30,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాం. ఈసారి వరిసాగు పెరగడంతో వ్యవసాయ శాఖ అంచనాల మేరకు 4.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. లక్ష మెట్రిక్ టన్నుల వరకు సన్నరకాలు ఉండగా మూడు లక్షల పదివేల మెట్రిక్ టన్నులు దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేయనున్నాం. ఇందుకు 334 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా.. గతంలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. మొదటగా కొనుగోలు సెంటర్ల ఏర్పాటులోనే కఠినంగా వ్యవహరించాం. మ్యాక్స్ తదితర వాటికి ఇవ్వకుండా పీఏసీఎస్, ఐకేపీ, మెప్మా ఆధ్వర్యంలోని కొనుగోలు సెంటర్లను కేటాయించాం. జిల్లాస్థాయిలో, మండల స్థాయిలోనూ కమిటీలను ఏర్పాటు చేశాం. ఏదైనా కొనుగోలు సెంటర్లో ఇబ్బందులు వస్తే మండల స్థాయి కమిటీ పరిష్కరిస్తుంది. కలెక్టరేట్లోనూ టోల్ ప్రీ నంబర్ 62814 92368 అందుబాటులో ఉంచాం. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నాం. కేంద్రాల్లో మంచినీరు, నీడ ఉండేలా ఏర్పాట్లు చేశాం. గన్నీ బ్యాగులు, మ్యాచర్ మిషన్లు అందుబాటులో ఉంచాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు సహకరించి మ్యాచర్ వచ్చేలా, తాలు లేకుండా చూసుకోవాలి. మిల్లర్లు ఇబ్బందులు పెడితే తమకు, మండల స్థాయి కమిటీలకు తెలియజేయాలి. జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా ఆరు సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేశాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అలసత్వాన్ని అవినీతిని సహించేది లేదు. ఇప్పటివరకు 40,050 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించాం. వేగంగా ధాన్యం కొనుగోళ్లు ఫ కొనుగోలు సెంటర్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఫ సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో కమిటీలు ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి
పెన్‌పహాడ్ : రైతులు మట్టి పరీక్ష ఆధారంగా ఎరువులు వాడాలని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త ఎ.కిరణ్ అన్నారు. గురువారం పెన్‌పహాడ్ మండలం దూపహాడ్ గ్రామంలో సమగ్ర ఎరువుల వినియోగంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పచ్చిరొట్ట ఎరువుల వల్ల భూమి సారవంతం పెరుగుతందన్నారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్ష ప్రాముఖ్యత, భూసార పరీక్ష కోసం మట్టి నమూనాలను సేకరించే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో గ్రామ రైతులు పాల్గొన్నారు. కొలతల ప్రకారం ఉపాధి పనులు చేపట్టాలిమోతె : ఉపాధి హామీ పనులను కొలతల ప్రకారం నాణ్యతగా చేపట్టాలని జెడ్పీ సీఈఓ శిరీష అన్నారు. గురువారం మోతె మండలం రాఘవాపురం, హుస్సేన్‌బాద్ గ్రామాల్లో పర్యటించిన ఆమె ఉపాధి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలీలు ఉపాధి పనులు చేసే చోట కూలీలకు తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి సమస్యలున్నా ఎంపీడీఓ, ఏపీఓకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆమె వెంట ఎంపీడీఓ ఆంజనేయులు, ఏపీఓ నగేష్, ఈసీ శ్రీహరి, టీఏలు, ఎఫ్‌ఏలు, కూలీలు ఉన్నారు. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం నేరేడుచర్ల : పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ నర్సింహారావు అన్నారు. గురువారం నేరేడుచర్లలోని అంగన్వాడీ కేంద్రం– 2లో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెండో వార్డు కౌన్సిలర్ యారవ లక్ష్మి, ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజ్యలక్ష్మి, కోఆర్డినేటర్ రాజేష్, ఏఎన్ఎం సునిత, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు తదితరులు ఉన్నారు. -
హింసకు పాల్పడితే చర్యలు : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సమ్మె సమయంలో విధుల్లో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు, బస్సుల యజమానులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం, ఇళ్లపై దౌర్జన్యాలకు దిగడం వంటి ఘటనలను అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. సహాయం కోసం పోలీస్ కంట్రోల్ రూమ్: 8712686026, డయల్ 100కు కాల్చేయాలని కోరారు. -
ప్రమోషన్లతో కూడిన బదిలీలు చేపట్టాలి
మద్దిరాల : ఉపాధ్యాయులకు జూలైలో ప్రమోషన్లతో కూడిన బదిలీలు చేపట్టాలని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలన్నారు. ప్రైవేటు పాఠశాలలను నియంత్రించాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఒకే యాజమాన్యం కిందికి తీసుకు రావాలని కోరారు. ఉపాధ్యాయులకు కొత్త హెల్త్ స్కీంను మే ఒకటో తేదీ నుంచి అమలు చేయాలన్నారు. రూ.13వేల కోట్ల నిధులు ఒకే విడతగా విడుదల చేసి పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు జి.రాములు, ప్రధాన కార్యదర్శి కె.ఉమేష్‌రెడ్డి, సంఘం సభ్యులు కొరివి మధు, పి.సురేష్, ఏ.విజయ్, ఎండీ.అలీమొద్దీన్, షరీఫ్, నాగేష్, ఎల్.గోవింద్, శివప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, శిల్ప, శిరీష, శుష్మ, సరిత, తదితరులు పాల్గొన్నారు. -
26 నుంచి యోగాలో ఉచిత శిక్షణ
సూర్యాపేట : వాసవి సేవాసమితి సహకారంతో ఈ నెల 26 నుంచి మే 10 వరకు సూర్యాపేటలోని బ్రాహ్మణ కల్యాణ మండపంలో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు యోగా గురువు చాడ పాపిరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఉన్నత యోగా శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తంతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం వేసవిలో విద్యార్థుల కోసం ఈ ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యోగాతో విద్యార్థుల మేథాశక్తి పెంపొందుతుందన్నారు. ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించే యోగా శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో వాసవి సేవాసమితి ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, కోశాధికారి సోమా ప్రవీణ్‌కుమార్, పట్టణానికి చెందిన యోగా సాధకులు పాల్గొన్నారు. కూలీలందరికి ఉపాధి పనులు కల్పించాలిపాలకవీడు : అన్ని గ్రామాల్లో ఉపాధిహామీ పనులను చేపట్టి కూలీలకు పనులు కల్పించాలని అసిస్టెంట్ డీఆర్డీఓ యామిని ఆదేశించారు. పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న ఉపాధిహామీ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పని ప్రదేశంలో కూలీలతో మాట్లాడి పనుల వివరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలకు గరిష్ట వేతనం రూ.307 అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నందున ఉదయం 7 గంటలకు పనులకు హాజరై 11 గంటల లోగా ముగించుకోవాలని సూచించారు. పని ప్రదేశంలో తాగునీరు, నీడ వంటి సదుపాయాలు కల్పించాలని పంచాయతీ కార్యదర్శి వినయ్‌ను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధిహామీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మి, ఉపాధిహామీ ఏపీఓ, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. గురుకుల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్స్‌కు దరఖాస్తులుసూర్యాపేటటౌన్ : సూర్యాపేట మండలం బాలెంలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరానికి డిగ్రీలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో బీఏ(హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్), బీకాం (కంప్యూటర్స్, జనరల్) బీఎస్సీ (మ్యాథ్స్, సైన్స్, మైక్రో బయాలజీ) గ్రూపులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థినులు సంబంధిత సర్టిఫికెట్స్‌తో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ 7995010681 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. గురుకులాల్లో మెనూ అమలు చేయాలితుంగతుర్తి : హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జిల్లా సివిల్ సప్లై డీఎం శ్రీధర్‌రెడ్డి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పాఠశాలల్లో అందిస్తున్న విద్య, వారి ప్రగతి, స్నాక్స్ ఇస్తున్నారా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సిబ్బంది, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. -
పెండింగ్ కేసులను పరిష్కరించాలి
చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్ కేసుల పరిష్కారం కోసం న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. ఇటివల బాధ్యతలు చేపట్టిన జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి డాక్టర్ శివరామ్‌ప్రసాద్ స్వాగత కార్యక్రమాన్ని బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోషియేషన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. న్యాయవాదులు కక్షిదారులకు అందుబాటులోకి ఉండాలన్నారు. జూనియర్లు, సీనియర్ల సలహాలు పాటించి, వృత్తిలో రాణించాలన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తిని అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివల్ జడ్జి మంచాల మమత, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సెన్, న్యాయవాదులు పాల్గొన్నారు.ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద -
ఆన్లైన్లో విద్యార్థుల ప్రోగ్రెస్
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రగతిని ఆన్లైన్లో ఉంచేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. 2025–26 విద్యాసంవత్సరం గురువారంతో ముగియనుండగా ప్రతి విద్యార్థి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేసి విద్యార్థులకు ప్రొగ్రెస్ కార్డులు అందించనున్నారు. 1 నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు ఈ నెల 18న ముగియగా, విద్యార్థుల మార్కుల జాబితాలను ఉపాధ్యాయుల ద్వారా సేకరించిన సీఆర్పీలు వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసే ప్రక్రియను పూర్తి చేశారు. ఆన్లైన్లోనే వివరాలన్నీసూర్యాపేట జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 50వేల మంది విద్యార్థులు ఈ సంవత్సరం విద్యనభ్యసించారు. ఇప్పటి వరకు నిర్వహించిన నిర్మాణాత్మక, సంగ్రహణాత్మక, మూల్యాంకనానికి సంబంధించిన ఫలితాలను స్కూల్ ఎడ్యుకేషన్ సైట్లో అప్లోడ్ చేశారు. ఉన్నత పాఠశాలల్లో సమ్మేటివ్–2 పరీక్షలు పూర్తి కావడంతో వాటిలో విద్యార్థులు సాధించిన మార్కుల వివరాలను కూడా ఆన్లైన్లో నమోదు చేశారు. ప్రగతి పత్రంలో విద్యార్థి, పాఠశాల వివరాలు, విద్యార్థుల ప్రతిభకు సంబంధించిన వివరాలన్నీ ఉంచారు. దాంతో విద్యార్థి వివరాలన్నీ ఆన్లైన్లో లభిస్తున్నాయి. విద్యార్థి వివరాలు నమోదు చేయగానే ఆన్లైన్లో ఆటోమెటిక్‌గా ప్రొగ్రెస్ రిపోర్టులు జనరేట్ అవుతున్నాయి. వీటిని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకుంటారు. గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిని వివరిస్తారు. అనంతరం విద్యార్థుల ప్రగతి పత్రాలను అందజేయనున్నారు. నేడు కార్డులు అందజేతవిద్యాసంవత్సరం చివరి రోజైన గురువారం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది విద్యార్థుల చదువు ఎలా సాగింది.. వారు చదువుతో పాటు మిగతా విషయాల్లో ఎలా రాణించారు.. అనే విషయాలను ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించనున్నారు. భవిష్యత్ లక్ష్యాలు, వాటిని అధిగమించేందుకు ఎలా సన్నద్ధం కావాలి వంటి అంశాలను కూడా వివరిస్తారు.ఫ విద్యాశాఖ వెబ్సైట్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రగతి వివరాలు ఫ నేడు తల్లిదండ్రులతో సమావేశాలు ఫ జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు -
అదనపు జిల్లా కోర్టును మంజూరు చేయాలని వినతి
కోదాడరూరల్ : కోదాడకు అదనపు జిల్లా న్యాయస్థానాన్ని మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు హైకోర్టు జడ్జిలను కలిసి విజ్ఞప్తి చేశారు. కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్.లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో హైకోర్టు పోర్ట్‌పోలియో జడ్జి మాధవిదేవి, బిల్డింగ్ కమిటీ సభ్యుడు, హైకోర్టు జడ్జి కార్తీక్ విజయసేనారెడ్డిలను వారి చాంబర్లలో కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కోదాడలో కేసుల సంఖ్య, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు అవసరాన్ని వారు వివరించారు. నూతనంగా నిర్మిస్తున్న కోర్టు భవన పనులు త్వరగా పూర్తి అయ్యేలా అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరారు. జడ్జిలను కలిసిన వారిలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు రామిశెట్టి రామకృష్ణ, గట్ల నరసింహారావు, కోడూరు వెంకటేశ్వరరావు, గాలి శ్రీనివాస్‌నాయుడు, దేవబత్తిని నాగార్జున, సుధాకర్‌రెడ్డి, పాలేటి నాగేశ్వరరావు, ఈదుల కృష్ణయ్య, నాగుబండి కృష్ణమూర్తి, అబ్దుల్‌రహీం, కేఎల్ఎన్ ప్రసాద్ ఉన్నారు. -
మట్టపల్లి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి
భానుపురి (సూర్యాపేట) : మట్టపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 29 నుంచి మే4 వరకు నిర్వహించే స్వామివారి తిరు కల్యాణోత్సవాలకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లపై బుధవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఉత్సవ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మిషన్ భగీరథ నీటిని నిరంతరం సరఫరా చేయాలన్నారు. పోలీస్‌శాఖ పటిష్ట భద్రత కల్పించాలని, వైద్య ఆరోగ్య శాఖ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాలని సూచించారు. దేవస్థాన అనువంశిక ధర్మకర్త చెన్నూరు మట్టపల్లిరావు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సహాయసహకారాలు అందించి స్వామివారి తిరు కల్యాణోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, అడిషనల్ ఎస్పీ రవీందర్‌రెడ్డి, జడ్పీ సీఈఓ శిరీష, ఆర్డీఓ వి.శ్రీనివాసులు, కె.భాస్కర్, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కె.భాస్కర్, ఆలయ అనువంశిక ధర్మకర్త విజయకుమార్, ఈఓ బి.జ్యోతి, అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయాలిహుజూర్నగర్ : మట్టపల్లి మహా క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణోత్సవాలను విజయవంతం చేయాలని ఆర్డీఓ శ్రీనివాసులు అన్నారు. బుధవారం ఆర్డీఓ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, ఆలయంలో క్యూలైన్లు, పార్కింగ్ స్థలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కె.భాస్కర్, అనువంశిక ధర్మకర్తలు, సీఐ చరమందరాజు, తహసీల్దార్ మంగ, అధికారులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
కోదాడ డిపో వద్ద ఉద్రిక్తత
కోదాడ : సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది ఉదయం కోదాడ డిపో గేటు వద్ద బైఠాయించి లోపలి నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. కోదాడ పట్టణ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో పోలీసులు డిపో వద్దకు వచ్చి కార్మికులను బలవంతంగా అక్కడి నుంచి తొలగించారు. ఆర్టీసీ అధికారులు కొన్ని బస్సులను ప్లాట్‌ఫాం వద్దకు తీసుకొచ్చిన తరువాత కూడ కార్మికులు వాటిని అడ్డుకున్నారు. విజయవాడ– హైదరాబాద్ మధ్య నడిచే ఏపీ బస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సులు యథావిధిగా నడిచాయి. గ్రామీణ ప్రాంతాలకు బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని వినతి
హుజూర్నగర్ : ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్ కోరారు. బుధవారం హైదరాబాద్ సెక్రటేరియట్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఫీల్డ్ అసిస్టెంట్లను ఫిక్సిడ్ టెన్యూర్ ఎంప్లాయ్ (ఎఫ్‌టీఏ)గా గుర్తించాలని, గత ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో తెలంగాణ ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ రాష్ట్ర నాయకులు బొలుగురి రవి, చల్ల వెంకటేశ్వర్లు, కె.సిద్దిరాజు, పరశురాములు, రెమిడాల లింగయ్య, ఉపేందర్, శేఖర్ ఉన్నారు. -
యాదగిరీశుడికి నిత్యారాధనలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్యారాధనలు కొనసాగాయి. వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధుల్లో స్వామివారి జోడు సేవను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడాలి
నూతనకల్ : హిందూ ధర్మ పరిరక్షణకు అందరూ పాటుపడాలని వాసుదేవ సరస్వతి స్వామీజీ అన్నారు. సోమవారం నూతనకల్‌లో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సత్యం, ధర్మం వంటి విలువలను ఆచరించడం దేశ ప్రగతికి అవసరమన్నారు. పంచపరివర్తనల ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని సూచించారు. దేశంలో హిందూ సాంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో శంభులింగేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ చురుకంటి చంద్రారెడ్డి, సర్పంచ్ మహేశ్వరం మల్లికార్జున్, ఆర్ఎస్ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాసం సత్యనారాయణ, ఉప సర్పంచ్ నాగం సరితసుధీర్రెడ్డి, కాప రవికుమార్, మద్ది సంజీవరెడ్డి, బండపల్లి సురేందర్‌గౌడ్, కందుకూరి భాగ్యలక్ష్మి, యాస ముత్తారెడ్డి, అనంతుల మల్లేశ్వరి పాల్గొన్నారు. -
అసమానతలను వ్యతిరేకించిన బసవేశ్వరుడు
భానుపురి (సూర్యాపేట) : మహాత్మా బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని, ఆయన ఆశయాలను అనుసరించి సమాజంలో సౌభ్రాతృత్వం పెంపొందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు (మినీ ట్యాంక్ బండ్) వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ బసవేశ్వరుడు సమాజంలో సమానత్వం, న్యాయం, ధర్మం వంటి విలువలను ప్రచారం చేసిన మహనీయుడని కొనియాడారు. చదువు గొప్పతనాన్ని గుర్తించి దానిని ప్రజల్లోకి చదువు తీసుకెళ్లాలన్న ఆలోచనతో పాటల, రచనల ద్వారా చైతన్యం కలిగించారన్నారు. ఆయన ఆలోచనలు నేటి సమాజానికి మార్గదర్శకమన్నారు. లింగ, బలిజ కమ్యూనిటీ కోసం అవసరమైన భూమిని కేటాయించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్‌రెడ్డి, వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ అధికారి నరసింహ, తహసీల్దార్ కృష్ణయ్య, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, మార్కెట్ వైస్‌చైర్మన్ గట్టు శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, టీఎన్జీఓస్ జిల్లా సెక్రెటరీ దున్న శ్యామ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలి, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షుడు వళ్లెం శేఖర్, మున్సిపల్ కౌన్సిలర్లు, బీసీ వెల్ఫేర్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
రైతులు సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్
వ్యవసాయ మార్కెట్లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో సూర్యాపేట, కోదాడ, తిరుమలగిరి మార్కెట్లలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం మార్కెట్లో హరే రామ, హరే కృష్ణ ఫౌండేషన్ సౌజన్యంతో మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసిన రూ.5లకే భోజనం అందించే అన్నపూర్ణ క్యాంటీన్‌ను కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ బాలకృష్ణ, డీఏఓ శ్రీధర్‌రెడ్డి, డీఎంఓ నాగేశ్వరశర్మ, డీసీఓ ప్రవీణ్, ఏఎంసీ డైరెక్టర్లు పాల్గొన్నారు. -
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారం
సూర్యాపేటటౌన్ : బాధితుల సమస్యలకు చట్టపరమైన తక్షణ పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఎలాంటి సమస్యలు ఉన్నా పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు బరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు. సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు జాతీయస్థాయి అవార్డులుసూర్యాపేట : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించినట్లు చివ్వెంల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ జి. విద్యాసాగర్ తెలిపారు. ఆన్లైన్లో నిర్వహించిన ద డ్రీమ్ నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ ఆఫ్ మహారాష్ట్రలో ఆరు విభాగాలలో పాఠశాల విద్యార్థులు పాల్గొని 22 గోల్డ్ మెడల్స్, స్టార్ అవార్డ్స్ సాధించినట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ విద్యాసాగర్, ఆర్ట్ టీచర్ చింతలపాటి ప్రవీణ్‌కుమార్‌కు కూడా సంస్థ వారు నేషనల్ గ్లోబల్ అచీవ్మెంట్ అవార్డు అందించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాఠశాలలో కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు అవార్డులు అందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహుడికి పూజలుమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి ప్రత్యే పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుపర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలతో నిత్య కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. శివాలయంలోని పార్వతీ రామలింగేశ్వరస్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు పాల్గొన్నారు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా గ్రామాల్లోని బస్‌స్టాప్, పబ్లిక్ ప్రాంతాలలో, ఉపాధి హామీ పనులు జరిగే చోట, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమయ్యే హౌస్ లిస్టింగ్‌లో ప్రతి ఉద్యోగి వారి కుటుంబ వివరాలు, 33 ప్రశ్నలకు వివరాలు అందించాలన్నారు. ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు, వారికి ఆ నివేదికను అందించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, జడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, డీఎంహెచ్ఓ పి.వెంకటరమణ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, సీపీఓ కిషన్, డీటీడీఓ శంకర్, ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి అధికారి దయానందరాణి, డీఐఈఓ బి. సులోచన రాణి, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్‌రెడ్డి, సూపరింటెండెంట్లు, అధికారులు పాల్గొన్నారు. -
30న టీపీటీఎఫ్ విద్యా సదస్సు
నూతనకల్ : హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 30న నిర్వహించే విద్యా సదస్సును విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న కోరారు. సోమవారం మండల కేంద్రంలో మండల నోడల్ అధికారి డి. శివయ్య ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యా సమస్యల పరిష్కార, నేటి సమాజానికి అవసరమైన విద్యా అభివృద్ధి కోసం నిర్వహించే సదస్సుకు ఉపాధ్యాయులు, మేఽథావులు హాజరు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఢీకొండ మహేష్, కంఠ భిక్షం, హనుమంతు, కృష్ణవేణి, నారాయణదాసు శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకన్న, ఉపేందర్, బాలాజీ పాల్గొన్నారు. -
వేసవి శిబిరాలకు వేళాయే..
26 నుంచి రెండు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలుమఠంపల్లి : మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు శుభోదయ యువజ సంఘం ఆధ్వర్యంలో మాంట్‌ఫోర్డు ఉన్నత పాఠశాల మైదానంలో ఎద్దుల పందేలు నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్‌రెడ్డి తెలి పారు. సోమవారం పాఠశాల మైదానంలో ఎద్దుల పందేల కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. పోటీలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆరు విభాగాల్లో జరిగే ఈ పోటీల్లో విజేతలకు దాతల సహకారంతో రూ.7.50 లక్షల నగదు బహుమతులు అందజేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మధుసూదన్‌రెడ్డి, మనోజ్‌రెడ్డి, దిలీప్‌రెడ్డి, అఖిల్‌రెడ్డి, బాలరెడ్డి పాల్గొన్నారు.సూర్యాపేటటౌన్ : వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగా ఈ నెల 24 నుంచి జూన్ 7 వరకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారులు సిద్ధమయ్యారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి 14 ఏళ్ల లోపు బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. దరఖాస్తుల ఆహ్వానం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు జిల్లాలోని ఉత్సాహవంతులైన వ్యాయమ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారుల నుంచి అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. శిబిరం నిర్వహించదలిచిన వారు క్రీడా వివరాలు, గ్రామం, ప్రదేశం వంటి పూర్తి వివరాలతో ఈ నెల 23లోగా జిల్లా యువజన, క్రీడలశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడలశాఖ అధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. వివరాలకు సెల్ 9100949979 నంబరును సంప్రదించాలని కోరారు. రూ.60వేలు మంజూరు క్రీడా శిబిరాల నిర్వహణకు ప్రభుత్వం జిల్లాకు రూ.60వేలు మంజూరు చేసింది. ఒక్కో శిక్షకుడికి రూ.5వేల చొప్పున 10 మందికి రూ. 50వేలు ఇవ్వనున్నారు. మిగిలిన రూ.10వేలు ప్రథమ చికిత్స, సర్టిఫికెట్ల కోసం ఖర్చు చేయనున్నారు. శిబిరాలను జిల్లా యువజన క్రీడల సర్వీసులశాఖ అధికారి నిర్వహణ బాధ్యతతో పాటు పర్యవేక్షణ చేయనున్నారు. బాలభవన్‌లో లలిత కళలపై శిక్షణ..జిల్లా కేంద్రంలోని బాలభవన్‌లో లలిత కళలపై విద్యార్థులకు 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. డ్యాన్స్, పేరిణి నృత్యం, ఆర్ట్, క్రాఫ్ట్, తబలా, మ్యూజిక్, కోలాటం, డ్రాయింగ్ వంటి అంశాలపై విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వనున్నారు. ఈ నెల 26 నుంచి వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నట్లు బాలభవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణారెడ్డి తెలిపారు. బాలభవన్‌లో శిక్షణ తీసుకోదలచుకున్న విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారైతే రూ. 20, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులైతే రూ. 50 చెల్లించి పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల నుంచి స్టడీ కండక్ట్ సర్టిఫికెట్తో పాటు ఆధార్ కార్డు తీసుకొని రావాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు విద్యార్థులకు శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. 24 నుంచి జూన్ 7 వరకు నిర్వహణకు సమాయత్తం 14ఏళ్ల లోపు బాలబాలికలకు క్రీడల్లో శిక్షణ పది శిబిరాల ఏర్పాటుకు అనుమతిపలు అంశాల్లో శిక్షణ ఖోఖో, వాలీబాల్, తైక్వాండో, అథ్లెటిక్స్‌తో పాటు కబడ్డీ తదితర క్రీడాంశాల్లో విద్యార్తులకు శిక్షణ ఇవ్వనున్నారు. శిబిరాలను ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు మాత్రమే ఇందులో అవకాశం ఉంటుంది. జిల్లాలో 10 శిక్షణ శిబిరాలకు అనుమతి ఉంటుంది. ఈ శిబిరాలలో విద్యార్థులకు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలి. 24 నుంచి శిక్షణ శిబిరాలు ప్రారంభమవుతాయి. విద్యార్థులు క్రీడా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. – బి.వెంకట్‌రెడ్డి, క్రీడల అధికారి -
మహా శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలను నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పూజల్లో భక్తులు పాల్గొన్నారు. -
అధిక వడ్డీ ఆశతో మోసపోయిన బాధితులు
కొండమల్లేపల్లి : అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజల నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేసిన వ్యక్తి రెండు రోజుల క్రితం మృతిచెందగా.. అప్పు ఇచ్చిన బాధితులు ఎటూ పాలుపోని స్థితిలో ఉండిపోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల గ్రామానికి చెందిన వరికుప్పల శేఖర్ కొండమల్లేపల్లి మండల కేంద్రం సమీపంలోని దోనియాల గ్రామ శివారులో ఇల్లు నిర్మించుకొని కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. తన ఇంటికి సమీపంలోనే ఇస్తరాకులు తయారుచేసే కంపెనీని ఏర్పాటుచేసి వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఆరేళ్ల నుండి అధిక వడ్డీ ఇస్తానని చెప్పి సన్నిహితులు, బంధువులు, స్నేహితుల నుంచి డబ్బులు తీసుకున్నాడు. మొదట్లో అప్పు ఇచ్చిన వారికి వడ్డీలు బాగానే కట్టి నమ్మకం పెంచుకున్నాడు. దీంతో అమాయక ప్రజలు బయట రూ.2 వడ్డీకి బయట అప్పులు తెచ్చి శేఖర్‌కు అధిక వడ్డీకి ఇచ్చారు. ఈవిధంగా శేఖర్ సుమారు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం ఏడాది నుంచి ఇబ్బందులు.. అయితే శేఖర్ గత ఏడాది నుంచి అప్పులు ఇచ్చిన వారికి సక్రమంగా వడ్డీలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా మూడు నెలల క్రితం శేఖర్ గుండెకు స్టంట్ వేసినట్లు అతడి ఇంటి చుట్టుపక్కల వారి ద్వారా తెలిసింది. అప్పు ఇచ్చిన వారి నుంచి శేఖర్‌పై ఒత్తిడి పెరగడంతో డబ్బులు తెస్తానని కర్ణాటక రాజధాని బెంగళూరుకు వెళ్లి రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు బెంగళూరుకు వెళ్లి శేఖర్ మృతదేహాన్ని ఆదివారం ఉదయం కొండమల్లేపల్లికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో శేఖర్‌కు అప్పులిచ్చిన బాధితులంతా అతడి ఇంటి వద్దకు చేరుకొని ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. బాధితులు 50 మంది కంటే ఎక్కువే ఉన్నట్లు సమాచారం. ఇటీవల పెద్దఅడిశర్లపల్లి మండలంలోని పడమటితండాకు చెందిన బాలాజీనాయక్, మధునాయక్ అధిక వడ్డీ ఆశచూపి ప్రజలను మోసం చేసిన ఘటన మరువక ముందే కొండమల్లేపల్లిలో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు అవాక్కయ్యారు. బెంగళూరులో ఎవరున్నారు..?బెంగళూరులో శేఖర్ ఎవరితోనైనా వ్యాపారం చేసి మోసపోయాడా..? అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరు అనేది శేఖర్ కుటుంబ సభ్యులు, అతని సన్నిహితులకు మాత్రమే తెలియాలి. అప్పులిచ్చిన బాధితులు ఆదివారం ఉదయం మృతుడి ఇంటి ముందు చర్చించుకునే సందర్భంలో ముగ్గురు వ్యక్తుల పేర్లు బలంగా వినిపించాయి. వారిలో బద్రినాథ్, జాఫర్, ప్రకాష్ అనే పేర్లు ప్రత్యేకంగా బాధితులు చర్చించుకోవడం గమనార్హం. ఈ ముగ్గురికి, శేఖర్‌కి సంబంధం ఏమిటి అనేది తెలిస్తే డబ్బుల వ్యవహారం కూడా వెలుగులోకి రావచ్చని బాధితులు చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై కొండమల్లేపల్లి ఎస్ఐ అజ్మీరా రమేష్‌ని సంప్రదించగా అధిక వడ్డీకి సంబంధించి మోసపోయినట్లుగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అప్పు తీసుకున్న వ్యక్తి గుండెపోటుతో మృతి మృతుడి ఇంటి వద్ద ఎటూ పాలుపోని స్థితిలో బాధితులు -
మహిళా బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు
భానుపురి (సూర్యాపేట) : పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు వీగిపోవడంతో కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ మనువాద సిద్ధాంతాన్ని పునికి పుచ్చుకున్న పార్టీ అన్నారు. ఆ పార్టీ మహిళా బిల్లును పార్లమెంటులో చిత్తశుద్ధితో ప్రవేశపెట్టలేదని, వీగిపోతుందని తెలిసే ప్రవేశపెట్టిందన్నారు. పార్లమెంట్లో బీజేపీ ఎంపీలుగా ఎంతమంది మహిళలు ఉన్నారో చెప్పాలన్నారు. మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని దేశంలో తమకు అనుకూలంగా డీలిమిటేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చూసిందని ఆరోపించారు. దేశంలో మహిళా హక్కుల కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. దేశంలో ప్రధాని, స్పీకర్లుగా మహిళలను ఎన్నుకున్నది తమ పార్టీనే అన్నారు. సోనియా గాంధీ ఆధ్వర్యంలో యూపీఏ చైర్‌పర్సన్‌గా అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, మహిళా హక్కుల కోసం రాహుల్ గాంధీ అనేక పోరాటాలు చేశారని చెప్పారు. దేశ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్‌రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీఉల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరిగుంట్ల వేణుగోపాల్, నాయకులు అబ్దుల్ రహీం, అంజద్ అలీ, నాగుల వాసు, సునీల్ రెడ్డి, దశరథ, శ్రీనివాస్, వీరన్న నాయక్, మాణిక్యం పాల్గొన్నారు. ఫ కాంగ్రెస్‌ను దోషిగా చూపే ప్రయత్నాన్ని ఖండించాలి ఫ డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య -
అన్నదాతలకు తాలు తంటా
నల్లగొండ : జిల్లాలో ధాన్యం దిగుమతుల వ్యవహారం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. యాసంగి ధాన్యంలో తాలు ఎక్కువగా ఉందంటూ మిల్లర్లు కొర్రీలు పెడుతుండటంతో.. లారీలు రోజుల తరబడి మిల్లుల ముందే నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కల్లాల వద్దే తూకం వేసి పంపించినా, మిల్లర్లు మాత్రం దిగుమతి చేసుకునేందుకు నిరాకరిస్తుండటం రైతులు ఆందోళన చెందుతున్నారు. మిల్లర్ల కొర్రీలు.. పెరిగిన నిరీక్షణ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ధాన్యాన్ని నాణ్యత పరిశీలించిన తర్వాతే తూకం వేస్తున్నారు. అయితే, ఈ ధాన్యం మిల్లులకు వెళ్లగానే సీన్ మారుతోంది. ‘తాలు ఎక్కువగా ఉంది.. మాకు నష్టం వస్తుంది’ అంటూ మిల్లర్లు ధాన్యం దించుకోవడం లేదు. దీంతో కల్లాల నుంచి మిల్లులకు వెళ్లిన లారీలు రోజుల తరబడి రోడ్లపైనే ఉండిపోతున్నాయి. తూర్పార పట్టిన ధాన్యాన్ని మాత్రమే తీసుకుంటామని మిల్లర్లు అంటున్నారు. దీంతో లారీ అద్దెలు భారం కావడంతో పాటు, రైతులకు అకాల వర్షాల భయం పట్టుకుంది. కొనుగోళ్లలో జాప్యం మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని నిర్వాహకులు కాంటాలు వేయడం లేదు. అక్కడి నుంచి లారీలు వస్తేనే కాంటా వేసిన ధాన్యం మిల్లులకు పంపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. దీంతో కల్లాల వద్ద రైతులకు పడిగాపులు తప్పడం లేదు. బస్తాకు 2 కిలోల తరుగు.. మళ్లీ కోతలు! తూకం సమయంలోనే అధికారులు, సిబ్బంది బస్తాకు 2 కిలోల పైనే తరుగు పేరుతో అదనంగా తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే భారీగా తరుగు తీసిన తర్వాత కూడా, మిల్లుల వద్ద మళ్లీ తాలు పేరుతో ధాన్యాన్ని తిరస్కరించడం లేదా అదనపు కోతలు పెట్టాలని చూడటంపై రైతులు మండిపడుతున్నారు. మిల్లర్ల ఇష్టారాజ్యంపై అధికారులకు ఫిర్యాదు చేస్తే, ‘మిల్లర్లతో మీరే మాట్లాడుకోండి’ అని సమాధానం ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి, మిల్లుల వద్ద ధాన్యం దిగుమతులు వేగవంతమయ్యేలా చూడాలని కోరుతున్నారు. రైతులు మిల్లులకు వెళ్లే అవసరం లేదు.. ధాన్యం అమ్మిన తర్వాత రైతులు మిల్లుకు వెళ్లాల్సిన అవసరం లేదని.. ఒకవేళ రైతులను మిల్లులకు పంపిస్తే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని శనివారం నల్లగొండలో పర్యటించిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి స్పష్టం చేశారు. మిల్లులకు వచ్చిన ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలని, ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల ప్రమేయం ఉండొద్దని పేర్కొన్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. అయినా మిల్లర్లలో మార్పు రావడం లేదు. ధాన్యంలో తాలు ఎక్కువ వస్తుందని దిగుమతి చేసుకోని మిల్లర్లు రోజుల తరబడి మిల్లుల వద్దనే నిలిచిపోతున్న లారీలు కొనుగోలు కేంద్రాల్లో మందకొడిగా కాంటాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న రైతులు -
హిందూ మతం కాదు ఒక జాతి
నేరేడుచర్ల : హిందూ అనేది మతం కాదని ఒక జాతి మాత్రమేనని జగిత్యాల ధర్మరక్షణ పీఠాధిపతి లక్ష్మీనారాయణ స్వామిజీ అన్నారు. ఆదివారం నేరేడుచర్లలోని కేఎస్ఎస్ ఫంక్షన్హాల్లో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సనాతన ధర్మం సూత్రాన్ని పాటించాలని, మానవీయ కోణతంలో అందరూ ఒక్కటిగా ఉండాలని సూచించారు. ఆర్ఎస్ఎస్కు కులం, మతం లేదన్నారు. హిందూ ధర్మాన్ని పాటించే వారంతా పూజారులుగా కొనసాగవచ్చన్నారు. అఖిల భారత ధర్మజాగరణ ప్రముఖ్ ఆలే శ్యాంకుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ దేశంలోని లక్ష గ్రామాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తుందన్నారు. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కళ్లెం స్వప్న, మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకట్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, నాయకులు నాగండ్ల శ్రీధర్, అప్పిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, రామ్మోహన్రావు, కొణతం సీతారాంరెడ్డి, రామకోటేశ్వర్రావు, లక్ష్మీనారా యణ, ఆదిరెడ్డి, శ్రీనివాసారావు, వెంకటేశ్వర్లు, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.ఫ ధర్మరక్షణ పీఠాధిపతి లక్ష్మీనారాయణ స్వామిజీ -
అనుమానాస్పద స్థితిలో వాచ్మెన్ మృతి
కనగల్ : అనుమానాస్పద స్థితిలో వాచ్మెన్ మృతిచెందాడు. వివరాలు.. కనగల్ మండలం దర్వేశిపురం గ్రామ పరిధిలోని వేద ఫంక్షన్‌హాల్–2 లో ఇద్దరు వాచ్మెన్ల మధ్య పాత నూనె డబ్బాల విషయంలో శనివారం సాయంత్రం గొడవ జరిగింది. ఈ ఘటనలో కనగల్ గ్రామానికి చెందిన వాచ్మెన్ దొమ్మాటి సైదులు(56)పై గుర్రంపోడు మండలం గన్సిరాంతండాకు చెందిన మెగావత్ గోపీనాయక్ చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగి ఎవరి గదిలోకి వారు వెళ్లారు. కాగా ఆదివారం ఉదయం కడుపులో నొప్పి వస్తుందని సైదులు భార్యకు చెప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. చికిత్స నిమిత్తం అతడిని నల్లగొండకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గోపినాయక్ దాడి కారణంగానే తన భర్త సైదులు మరణించాడని మృతుడి భార్య అక్కమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చండూరు సీఐ కే. ఆదిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ఎస్. రామయ్య తెలిపారు. పోస్టుమార్టం అనంతరం సైదులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. మృతుడితో గొడవపడిన గోపినాయక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
ఓపెన్ ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : జిల్లాలో ఈ నెల 20 నుంచి 27 వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ 2023 సెక్షన్ అమలు చేయనున్నట్లు ఎస్పీ నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ పట్టణాల్లోని పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు. సూర్యక్షేత్రంలో పూజలు అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. యజ్ఞశాలలో మహా సౌరహోమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 22న సీఐటీయూ జిల్లా స్థాయి సమావేశం పెన్‌పహాడ్ : ఈ నెల 22న సూర్యాపేటలో సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ తెలిపారు. ఆదివారం మండలంలోని పొట్లపహాడ్ గ్రామంలో నిర్వహించిన సీఐటీయూ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సమన్వయ కమిటీ గ్రామ కన్వీనర్‌గా గంగారపు వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో గంగారపు వెంకన్న, నారాయణ ప్రమీల, గొబ్బి శ్రీకాంత్, ఆదిమల్ల రాములమ్మ, మంజుల పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలి ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి తగిన నిధులు కేటాయించడం లేదని రైతు సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నెమ్మకల్లో నిర్వహించిన రైతు సంఘం జిల్లా మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి కనీసం ఐదు శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, కేవలం 3.4శాతం మాత్రమే ఇస్తుందన్నారు. దేశంలో 50 శాతం మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, చిన్న సన్న కారు రైతులకు వ్యవసాయ పరికరాలను అందించాల్సి ఉన్నా అవేవీ పట్టించుకోవడం లేదన్నారు. విత్తన రంగం ప్రైవేటు కంపెనీల చేతిలోకి వెళ్లిందన్నారు. ఆయా కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో నాణ్యతలేని విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాసభలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.జంగారెడ్డి, నాయకులు మల్లు నాగార్జున్‌రెడ్డి, కొలిశెట్టి యాదగిరిరావు, రజిత శేఖర్‌రావు, కందాల శంకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, ములకలపల్లి రాములు, కోట గోపి, అవిరే అప్పయ్య, దండ వెంకట్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు కోదాడ విద్యార్థికోదాడ రూరల్ : కోదాడలోని తేజ విద్యాలయ విద్యార్థి పశ్య జతిన్‌రెడ్డి రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రమా సోమిరెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యా పేటలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్–11 చెస్ పోటీల్లో జతిన్‌రెడ్డి పాల్గొని ఐదు రౌండ్లలో ఐదు పాయింట్లు సాధించి చాంపియన్‌గా నిలిచినట్లు పేర్కొన్నారు. విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు కోచ్ కొండా నరసింహారావు అభినందించారు. -
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలి
మోతె : జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడే దళిత వర్గాలకు న్యాయం జరుగుతుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసీం అన్నారు. ఆదివారం మోతె మండలం రావిపహాడ్ గ్రామంలో ఏబీఆర్ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ ఫలాలు జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, బీసీలకు అందించాలన్నారు. విద్యకు అధిక బడ్జెట్‌ను కేటాయించి అందరికి ఉచిత, నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. నేడు తెలంగాణలో ఎస్సీ మాదిగ కులస్తులు 40 నుంచి 50 లక్షల మంది ఉన్నారని, 80 ఏళ్ల నుంచి దళితుల పరిస్థితి హీనంగా ఉందని పేర్కొన్నారు. తళితులు మతం మారినంత మాత్రాన రిజర్వేషన్లు తొలగిస్తామనడం సబబు కాదన్నారు. దళితులు విద్యతోనే చైతన్యవంతులు కావాలని, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అనంతరం ఏపూరి సోమన్న కళా బృందంతో ఆటా, పాటా కార్యక్రమం నిర్వహించారు. ఏబీఆర్ యువజన సంఘం అధ్యక్షుడు కాంపాటి దిలీప్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడి లింగయ్య, నాయకులు పొడపంగి యలమంచి, ముత్తయ్య, బక్కమ్మ కిష్టయ్య, శ్యామలేటి కోటేష్, సంఘం ఉపాధ్యక్షుడు తిర్పయ్య, ప్రధానకార్యదర్శి ప్రభంజన్, కోశాధికారి వీమళ్ల రాము, గుర్వయ్య, రమేష్, వెంకన్న పాల్గొన్నారు.ఫ ఓయు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కాశీం -
అగ్నిప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
ర్యాలీని ప్రారంభిస్తున్న జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి, పట్టణంలో వాహనాల ర్యాలీ సూర్యాపేటటౌన్ : అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాలని జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి కోరారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఆదివారం పట్టణంలో అగ్నిమాపక వాహనాల ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ ర్యాలీ శంకర్ విలాస్ సెంటర్ మీదుగా కొత్త బస్టాండ్, ఖమ్మం రోడ్డు, పాత బస్టాండ్ నుంచి అగ్నిమాపక కేంద్రం వరకు సాగింది. అనంతరం షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు వంటి జన సమూహ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. -
మార్కెట్లో మాయాజాలం
ఫ కోదాడ మార్కెట్లోని పట్టాలు, తేమ యంత్రాలు మాయం ఫ ఒక్క సీజన్‌కే మూలనపడ్డ డ్రయ్యర్ ఫ ఉద్యోగిని సస్పెండ్ చేసిన అధికారులుకోదాడ : రైతుల ప్రయోజనార్ధం ఏర్పాటు చేసిన కోదాడ వ్యవసాయ మార్కెట్‌తో రైతులకు పెద్దగా ప్రయోజనం కలుగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌కు కోట్ల రూపాయల ఆదాయం, పూర్తిస్థాయి పాలకవర్గం, అధికారులు ఉన్నప్పటికీ కనీసం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేని దుస్థితి నెలకొంది. మార్కెట్లో ఉండాల్సిన ధాన్యం ఆరబోసే పట్టాలు, తేమ చూసే యంత్రాలు కనిపించడం లేదు. రూ.లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన డ్రయ్యర్ ఒక్క సీజన్‌కే మూలన పడింది. అధికారులు ఇందుకు బాధ్యుడిని చేస్తూ ఉద్యోగిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. రైతు ప్రయోజనాలు శూన్యం పట్టణ నడిబొడ్డున ఉన్న కోదాడ వ్యవసాయ మార్కెట్‌కు విశాలమైన ఆవరణ, గోదాములు, కార్యాలయం ఉన్నాయి. మార్కెట్‌కు సెస్ రూపంలో సంవత్సరానికి రూ.4 నుంచి రూ.5 కోట్ల ఆదాయం వస్తున్నది. అయినా రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడంలో వెనుకబడినట్లు విమర్శలున్నాయి. మార్కెట్లో కేవలం ఆదివారం పశువుల సంత తప్ప ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం లేదు. రైతులను మిల్లర్లు దోచుకుంటున్నా పాలకవర్గం, అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. విచారణ చేసి.. కోదాడ మార్కెట్ ద్వారా రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి పట్టాలను, తేమ చూసే యంత్రాలను కొనుగోలు చేసి గత సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపణీ చేశారు. వీటిలో చాలా వాటిని మార్కెట్లో పని చేసే ఓ ఉద్యోగి మాయం చేశాడనే ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేసి ఇటీవల సదరు ఉద్యోగిని సస్పెండ్ చేశారు. వాటిలో కొన్నింటిని రికవరీ చేయగా మరికొన్ని కనిపించడం లేదని సమాచారం. స్వీపింగ్ కాంట్రాక్టర్‌ను తొలగించి అడపాదడపా అడ్డా కూలీలతో మార్కెట్ ఆవరణను క్లీన్ చేయిస్తూ భారీ ఎత్తున బిల్లులు డ్రా చేస్తున్నారని కొందరు మార్కెట్ డైరెక్టర్లే ఆరోపిస్తున్నారు. ప్రతి ఆదివారం జరిగే పశువుల సంత కోసం వచ్చే రైతులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదనే విమర్శలున్నాయి. రిపేరులో డ్రయ్యర్ గత వానకాలం సీజన్లో ఐకేపీ కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందని నిర్వాహకులు కొనుగోళ్లకు నిరాకరించడంతో అనేక చోట్ల రైతులు ఆందోళనలు చేశారు. దాంతో కోదాడ వ్యవసాయ మార్కెట్ అధికారులు సుమారు రూ.10 లక్షలతో డ్రయ్యర్ (ధాన్యం ఆరబెట్టే యంత్రం) కొనుగోలు చేశారు. దీనిని వినియోగించేందుకు ఖర్చు విపరీతంగా వస్తుండడంతో రైతులు గత సీజన్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. దానికి తోడు ఈ యంత్రం అప్పుడే రిపేర్‌కు వచ్చింది. బాగు చేయించకుండా యంత్రాన్ని తీసుకొచ్చి మార్కెట్ కార్యాలయం ముందు పడేశారు. అది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతోంది.వానకాలం సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పట్టాలు, తేమశాతం కొలిచే మిషన్లను ఇచ్చాము. వాటిలో కొన్ని వెనక్కి రాలేదు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. త్వరలో పూర్తిగా రికవరీ చేస్తాం. డ్రయర్ రిపేరుకు రావంతో పక్కన పెట్టాం. స్వీపింగ్ కాట్రాక్టర్ పెద్దగా అవసరం లేక పోవడంతో రద్దు చేశాం. దీనివల్ల మార్కెట్‌కు ఖర్చు తగ్గింది. రాహూల్, మార్కెట్ కార్యదర్శిపట్టణంలో కూరగాయలు, మాంసం విక్రయాలు ఒకే చోటు నిర్వహించేందుకు గానూ గత ప్రభుత్వ హయంలో అక్టోబర్ 31, 2021న కోదాడ వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.7.20 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులను మొదలు పెట్టిన కాంట్రాక్టర్ పిల్లర్ల వరకు పూర్తి చేశాడు. అయితే సకాలంలో బిల్లులు రావడం లేదని పనులను ఆపేశాడు. ఈలోగా కొత్త ప్రభుత్వం రాగా దీనిగురించి పట్టించుకునే వారు లేక పనులు ముందుకు సాగడం లేదు. దాంతో మార్కెట్లో రెండు ఎకరాల స్థలం ఐదేళ్లుగా నిరుపయోగంగా మారింది. -
వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే
గుర్రంపోడు : కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను గ్రహించిన ప్రజలు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం గుర్రంపోడు మండలకేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే రెండున్నర ఏళ్లు గడిచాయని, మిగిలిన రెండున్నరేళ్లలో చివరి ఏడాది ఎన్నికల ఏడాదిపోగా ఏడాదిన్నర సమయమే ఉందన్నారు. కార్యకర్తలు కొద్దిగా ఓపిక పట్టాలని, ఎన్ని వేధింపులకు గురిచేసినా భరించాలని.. బీఆర్ఎస్ అధికారం రాగానే వడ్డీతో సహా తీర్చుకుందామని చెప్పారు. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ వాళ్లకే అర్థమైందన్నారు. అందుకే వారు అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతమాత్రం చిత్తశుద్ధి లేదని, ఎస్ఎల్బీపీ టన్నెల్ బీఆర్ఎస్ హాయాంలో 11 కిలోమీటర్లు తవ్వితే, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిన టన్నెల్లో శవాలను కూడా తీయలేకపోయిందని ధ్వజమెత్తారు. ప్రమాద స్థలానికి టూరిస్టు ప్లేస్‌కు వచ్చినట్లు మంత్రులు విమానంలో చక్కర్లు కొట్టారని విమర్శించారు. అసెంబ్లీలో రుణమాఫీపై ప్రశ్నిస్తే ఇంకా ఏమీ లేదని అయిపోయిందన్నారని, రుణమాఫీ చేసింది కేవలం 40 శాతమేనని చెప్పారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తున్నారని, మళ్లీ సీఎంగా కేసీఆర్‌ను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అంతకుముందు మాజీ మంత్రి హరీష్‌రావుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్, కూసుకుంట్ల ప్రబాకర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, పల్లె రవికుమార్, పార్టీ ఎన్ఆర్ఐ ప్రధాన కార్యదర్శి నాగులవంచ నర్సింహారావు, పాశం గోపాల్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.ఫ మాజీ మంత్రి హరీశ్‌రావు -
బైక్, ఆటోను ఢీకొట్టిన కారు
మోత్కూరు : మండలంలోని పాలడుగు గ్రామంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, ఆటోను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. వలిగొండ మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన ముక్కెర్ల చంద్రయ్య(70) బైక్‌పై మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో రోడ్డు దాటుతుండగా.. వలిగొండ నుంచి వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం కారు అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ఆటోను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు చంద్రయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సతీష్‌కుమార్ తెలిపారు. ఒకరు మృతి మరో ముగ్గురికి గాయాలు -
నేటి నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
భువనగిరి : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ(టాస్) ఆధ్వర్యంలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. తొలిసారిగా ఈ విద్యాసంవత్సరంలో ఓపెన్ విద్యార్థులకు వాట్సాప్ ద్వారా పాఠాలు బోధించడం, రెగ్యులర్ విద్యార్థుల మాదిరిగా పాఠ్యపుస్తకాలతో పాటు స్టడీ మెటీరియల్స్ అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలు పరీక్షల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 8,835 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. 44 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 44 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఏర్పాట్లు పూర్తి.. పరీక్షల నిర్వహణ కోసం అన్ని కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్ష కేంద్రాలలో విద్యుత్ సదుపాయం, తాగునీరు, ఫ్యాన్లతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య సేవలందించేందుకు పరీక్ష కేంద్రాలలో ఏఎన్ఎంలను అందుబాటులో ఉంచారు. 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన వారికి పరీక్ష కేంద్రాలలోకి అనుమతించనున్నారు. పరీక్ష కేంద్రాలలోకి సెల్ఫోన్లు అనుమతించబడదు.ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాల వివరాలు ఇలా.. జిల్లా తరగతి హాజరుకానున్న పరీక్ష విద్యార్థులు కేంద్రాలు నల్లగొండ టెన్త్ 1,611 08 ఇంటర్ 2,226 10 సూర్యాపేట టెన్త్ 990 06 ఇంటర్ 2,012 11 యాదాద్రి టెన్త్ 569 04 ఇంటర్ 1,427 05 టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం ఉమ్మడి జిల్లాలో 44 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 8,835 మంది విద్యార్థులు


