మాతా శిశు మరణాలను తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

మాతా శిశు మరణాలను తగ్గించాలి

Apr 28 2026 8:34 AM | Updated on Apr 28 2026 8:34 AM

సూర్యాపేట టౌన్‌ : మాతా శిశు మరణాలను తగ్గించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పెండెం వెంకటరమణ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ఆశా నోడల్‌ అధికారులు, ఆశాలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణుల నమోదు, ఏఎన్‌సీ చెకప్‌లు, సురక్షిత ప్రసవం, బాలింతల సంరక్షణ, శిశు టీకాలు, పోషకాహారం, బాలల వృద్ది పర్యవేక్షణ వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించబడుతోందన్నారు. అర్హులైన బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ 100శాతంతోపాటు డ్రాప్‌ ఔట్‌, లెప్ట్‌ ఔట్‌, మిస్డ్‌ ఔట్‌ లేకుండా 0–5 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్‌ ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ శ్రీశైలం, డిప్యూటీ డెమో వి.సంజీవ్‌రెడ్డి, డీపలో ఉమామహేశ్వరి, ఉపేందర్‌, శంకర్‌, ఆశా నోడల్‌ అధికారులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement