జస్ట్‌ ఆటో జర్నీ కాదు.. అంతకుమించి..! | Karnataka auto drivers mini library Goes Viral | Sakshi
Sakshi News home page

జస్ట్‌ ఆటో జర్నీ కాదు.. అంతకుమించి..!

Apr 27 2026 2:15 PM | Updated on Apr 27 2026 2:25 PM

Karnataka auto drivers mini library Goes Viral

చిన్న ఆటో అయినా..దాన్ని కస్టమర్లకు విభిన్నంగా పరిచయం చేసేలా సెట్‌ చేసే తీరు ఎవ్వరినైనా..ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇంతకు మునుపు వరకు చల్లదనం కోసం మొక్కలతో, పర్యావరణ అనుకూలంగా మార్చిన అందమైన ఆటోలను చూశాం. కానీ ఈ ఆటో డ్రైవర్‌ అంతకు మించి అన్నట్లుగా.. ఆటో జర్నీని అందిస్తున్నాడు ప్రయాణికులకు. అందుకోసం ఏం చేస్తున్నాడంటే..

అందుకు సంబంధించిన వీడియోని వర్ష అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంది. ఆ వీడియోలో ఒక సాధారణ ఆటో ప్రయాణంలా కనిపించేదాన్ని చిత్రీకరించినట్లు ఉంటుందే తప్ప, అందులో విభిన్నంగా ఏమీ కనిపించదు. కానీ కెమెరా లోపలికి మారినప్పుడు, మొత్తం ఆటోజర్నీనే మంచి అనుభూతిగా మార్చేస్తోంది. ఆ వీడియోలో సాధారణ ఆటో ప్రయాణంలా మొదట్లో కనిపించినా..ఆ తర్వాత డ్రైవర్ సీటు వెనుక, పుస్తకాలతో నిండిన ఒక చిన్న అర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. 

దొరికిన ఆ కొద్ది సమయం ఫోన్‌కి అంకితమవ్వకుండా కాసేపయినా పుస్తకాలు తెరిచేలా చేసే ప్రయత్నం ముచ్చటగొలుపుతుంది. వాటి తోపాటు ఆ ఆటోలో ప్రయాణికుల కోసం ఒక చిన్న క్యాండీల డబ్బా కూడా ఉంది. చిన్నపాటి ఆలోచన అయినా..ప్రయాణికులకు తమ జర్నీ సమయాన్ని విలువైనదిగా మార్చుకునేలా చేస్తోంది. పైగా ఫోన్‌ని స్క్రోల్‌  చేసే బదులు కొన్ని నిమిషాల పాటు చదువుకునేలా చేస్తుంది. 

మాములు ప్రయాణం అనుకున్నాం కానీ ఒక చిన్న లైబ్రరీగా మారింది అంటూ క్యాప్షన్‌ జోడించి మరి పోస్ట్‌ షేర్‌ చేశారు. నెటిజన్లు సైతం ఈ వీడియోని సైతం “ఈ ఆటో సీఎన్‌జీతో గానీ, పెట్రోల్‌తో గానీ నడవడం లేదు, ఇది కేవలం కరుణతో నడుస్తోంది. అతడు అందిస్తున్న ప్రతిదానికి అంతకుమించిన ఆశీస్సులు అందాలి అని దీవిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: సమానత్వానికి కేరాఫ్‌గా ఆ వివాహం..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement