Visakhapatnam
-
1875వ రోజుకు చేరిన ‘ఉక్కు’ దీక్షలు
బీచ్‌రోడ్డు: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో అధికారికంగా ప్రకటించాలని, అలాగే ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) అధ్యక్షుడు యు.రామస్వామి డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ రక్షణకై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 1875వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్ పునరుద్ధరణ కోసం కేంద్రం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించినప్పటికీ, ప్రైవేటీకరణను ఉపసంహరించుకున్నట్లు ఎక్కడా స్పష్టం చేయలేదన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పుష్కలంగా ఉన్న గనులను అభివృద్ధి పేరుతో జిందాల్ సంస్థకు కట్టబెడుతున్నారని విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడం వల్ల టన్నుకు ఐదు వేల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ప్లాంట్ ఉత్పత్తి పెరిగిందని చెబుతున్న ప్రభుత్వాలు, దానికి కారణమైన ఉద్యోగులకు నాలుగు నెలలకు పైగా వేతనాలు బకాయి పెట్టడం అత్యంత దారుణమన్నారు. ప్లాంట్‌లో పనిచేస్తున్న 6,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా నిర్దాక్షిణ్యంగా తొలగించారని, వారి ఆధార్ కార్డులను సైతం బ్లాక్ చేయడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. వెంటనే ఆధార్ కార్డు బ్లాక్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన వారి స్థానంలో ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి, వారికి ఎలాంటి హక్కులు, సౌకర్యాలు కల్పించకుండా కట్టు బానిసల్లా పని చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిర్వాసితులందరికీ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. దీక్షలో యూనియన్ నాయకులు శ్రీనివాసరాజు, ఇ. శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
వేధింపుల పర్వం
ఏయూలో దళిత పరిశోధకుడిపై స్పందించిన జాతీయ ఎస్సీ కమిషన్ ఈ దారుణ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ ఎస్సీ కమిషన్.. ఏడు రోజుల్లోగా పూర్తి వివరాలతో వివరణ ఇవ్వాలని వీసీ రాజశేఖర్‌కు కస్టమ్ నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ వర్సిటీ నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. కమిషన్ తాజాగా ‘అత్యవసర’ రిమైండర్‌ను పంపింది. ఇంకా నిర్లక్ష్యం వహిస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం కమిషన్‌కు ఉన్న సివిల్ కోర్టు సమానమైన అధికారాలను ప్రయోగించి కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించింది. మద్దిలపాలెం: జాతీయ స్థాయిలో ఘన చరిత కలిగిన విశ్వవిద్యాలయంగా వెలుగొందుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. వర్సిటీ ఉన్నతాధికారుల అనుచిత వైఖరి, మొండితనం కారణంగా జాతీయ స్థాయిలో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబాసాహెబ్ డా.బీఆర్ అంబేడ్కర్ పేరుతో నడుస్తున్న ప్రతిష్టాత్మక పీఠం(చైర్)లోనే ఒక దళిత పరిశోధక విద్యార్థికి ఘోర అవమానం ఎదురైంది. ‘జాతీయ ఎస్సీ కమిషన్’ఆదేశాలను సైతం వర్సిటీ ఉన్నతాధికారులు బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖతో పాటు డాక్టర్ అంబేడ్కర్ ఫౌండేషన్ ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను సైతం తుంగలో తొక్కుతూ ఒక మేధావిని మానసికంగా కుంగదీస్తున్న వైనంపై జాతీయ కమిషన్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగింది. ఫెలోషిప్ నిలిపివేత.. వీసీ, డీన్లపై వేధింపుల ఆరోపణలు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పీఠం కింద డాక్టరల్ ఫెలోగా అత్యున్నత పరిశోధన చేస్తున్న యాడాల ప్రవీణ్‌కుమార్ ఏడాది కాలంగా నరకయాతన అనుభవిస్తున్నారు. బాధితుడు జాతీయ ఎస్సీ కమిషన్‌కు సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదు ప్రకారం.. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్, ఆర్ అండ్ డీ డీన్లు తనను పదేపదే వివక్షకు గురిచేస్తున్నారు. పరిశోధనకు సంబంధించిన ఫెలోషిప్ సొమ్మును ఉద్దేశపూర్వకంగా నిలిపివేస్తూ, ఆర్థికంగా దెబ్బతీస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. కన్నతల్లిని కోల్పోయినా కరగని మానవత్వం తనకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించుకునేందుకు వీసీ కార్యాలయానికి పదేపదే తిరిగినా ప్రవీణ్‌ను కనీసం గదిలోకి కూడా రానివ్వలేదు. చివరకు వీసీ కారు ఎక్కి వెళ్తుండగా.. పరుగున వెళ్లి వేడుకున్నా కనీస మానవతా దృక్పథం చూపకపోగా, ‘అంబేడ్కర్ చైర్‌ను మూసేస్తాం, నిన్ను యూనివర్సిటీలో లేకుండా చేస్తాం’అంటూ చిన్నచూపు చూస్తూ మాట్లాడారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకవైపు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు కన్నతల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా అధికారుల మనసు కరగలేదు. చివరకు వర్సిటీ అధికారులు పెట్టిన మానసిక వేదనను భరిస్తూనే, తల్లికి సరైన వైద్యం అందించలేక ప్రవీణ్‌కుమార్ తన తల్లిని కోల్పోవాల్సి వచ్చింది. సీపీకి ఎస్సీ కమిషన్ లేఖ మరోవైపు ఈ ఘటనపై అట్రాసిటీల నిరోధక చట్టం కింద తక్షణమే కేసు నమోదు చేసేలా చట్టపరమైన చర్యలు చేపట్టాలని నగర పోలీస్ కమిషనర్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ ప్రత్యేకంగా లేఖ రాసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో నగర పోలీసులు రంగంలోకి దిగి, ఈ వేధింపుల ఆరోపణలపై అధికారికంగా దర్యాప్తు ప్రారంభించడంతో ఏయూ వర్గాల్లో వణుకు మొదలైంది. బాబాసాహెబ్ సందేశమే నన్ను బతికించింది: ప్రవీణ్ కుమార్ ‘వర్సిటీ అధికారులు పెట్టిన మానసిక వేధింపులను తట్టుకోలేక, ఒక దశలో ప్రాణాలు తీసుకోవాలని కూడా అనుకున్నాను. కానీ హక్కుల కోసం పోరాడాలి, ఉద్యమించాలి అన్న బాబాసాహెబ్ అంబేడ్కర్ సందేశం నన్ను బతికించింది. ధైర్యాన్ని కూడగట్టుకుని, అన్ని ఆధారాలతో జాతీయ కమిషన్‌ను ఆశ్రయించాను’అని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. -
13 తులాల బంగారం అపహరణ
పాల్పడిన ఇద్దరు మహిళలు? అల్లిపురం: ద్వారకా బస్టాండ్‌లో ప్రయాణికుల్లా నటించి బస్సు ఎక్కుతూ.. ఓ ప్రయాణికురాలి బ్యాగులోంచి 13 తులాల బంగారు ఆభరణాలను ఇద్దరు మహిళలు అపహరించారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. టూటౌన్ క్రైం ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలివి. సీతమ్మధారకు చెందిన అనంతనేని స్పందన తన భర్త, కుమార్తెతో కలిసి శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో తాడేపల్లిగూడెం వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు వారితో పాటే ప్రయాణికుల్లా వచ్చి, బాధితురాలి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలను అపహరించి అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. బాధితులు బస్సులో కూర్చున్న తర్వాత బ్యాగు జిప్ తెరిచి ఉండటాన్ని గమనించి లోపల చూసుకోగా వస్తువులు కనిపించలేదు. దీంతో వెంటనే వారు అవుట్‌పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవుట్‌పోస్టు పోలీసులు ఈ సమాచారాన్ని టూటౌన్ క్రైం ఎస్ఐ శ్రీనివాస్‌కు తెలియజేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ.. ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ఈ ఫుటేజీలో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కుమార్తె వెంటే తల్లి..
అగనంపూడి: ఆ ఇంట పెళ్లి బాజాలు మోగి ఇంకా 24 గంటలు కూడా గడవలేదు.. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆ నవవధువు కళ్లల్లో వేనవేల ఆశలు.. పుట్టింటి వారి ఆశీస్సులు, అత్తారింటి వారి ఆదరణతో మురిసిపోతున్న వేళ.. విధి ఆ కుటుంబంపై పగబట్టింది. కారు రూపంలో వచ్చిన మృత్యువు ఆ పచ్చని సంసారంలో తీరని నిప్పులు పోసింది. వివాహం జరిగిన మరుసటి రోజే జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవవధువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ఆమె తల్లి కూడా ఆదివారం తెల్లవారుజామున కన్నుమూసింది. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆడబిడ్డలు అనంతలోకాలకు వెళ్లడంతో ఆ గ్రామం కన్నీటి సముద్రమైంది. మృతురాలి సోద రుడు పలకా రాము తెలిపిన వివరాల ప్రకారం.. అగనంపూడి కొండయ్యవలసకు చెందిన రామేశ్వరి (31)కి, పరవాడ మండలం వాడచీపురుపల్లికి చెందిన నరసింగరావుతో ఈ నెల 13న వైభవంగా వివాహం జరిగింది. 14వ తేదీ సాయంత్రం వధువు పుట్టింటికి కారులో బయలుదేరింది. మరికొద్ది నిమిషాల్లో కన్నవారి ఇల్లు చేరుకుంటారనగా, అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు సమీపంలో కారు నడుపుతున్న భర్త నరసింగరావు ఒక్కక్షణం అలసటతో కళ్లు మూశాడు. అంతే.. కారు అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ హృదయవిదారక ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న నవవధువు రామేశ్వరి పెళ్లి పట్టుచీరలోనే అక్కడికక్కడే మృతిచెందింది. కళ్లముందే కూతురు ప్రాణాలు కోల్పోవడంతో గుండె పగిలేలా రోదించిన తల్లి కనకమహాలక్ష్మి (51) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఆమె కూడా తుదిశ్వాస విడిచింది. ప్రమాదంలో గాయపడిన మరో కుమార్తె వరలక్ష్మి, అల్లుడు నరసింగరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లీకూతుళ్ల మరణంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. -
21 నుంచి జీవీఎంసీ కార్మికుల సమ్మె బాట?
డాబాగార్డెన్స్: జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్‌తో ఈ నెల 19న జరిగే చర్చలు ఫలవంతం కాకపోతే, 21 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి హెచ్చరించారు. జగదాంబ జంక్షన్ సమీపంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషనర్ గత ఒప్పందాల మినిట్స్‌ను అమలు చేస్తారని ఆశించామని, కానీ కౌన్సిల్లో చేసిన తీర్మానాలను ఇప్పటివరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సరఫరా, వెటర్నరీ, పార్కులు, రిటైర్డ్, కారుణ్య నియామకాలు, లోడర్ల వేతనాల వంటి అంశాలపై ఇచ్చిన హామీలను పక్కన పెట్టారని మండిపడ్డారు. ఇటీవల ఇన్చార్జి కమిషనర్(కలెక్టర్)తో జరిగిన ఒప్పందాన్ని కూడా అమలు చేయలేదని విమర్శించారు. చివరకు హెల్త్ అలవెన్స్ బకాయిలు, విలీన కార్మికుల పీఎఫ్ సొమ్ము, సప్లిమెంటరీ కార్మికుల జీతాల బిల్లులు, ఇన్కమ్ ట్యాక్స్ సొమ్ము, జీవో 333 ఏరియర్స్‌ను కూడా చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోడర్లు, బదిలీ, కాంట్రాక్ట్, ప్యాకేజీ, డైలీ వేజ్ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, సెలవులు ఇవ్వకుండా జీవీఎంసీ గొప్పలు చెప్పుకుంటోందని దుయ్యబట్టారు. నిత్యం చెత్త, దుర్వాసనలో ప్రాణాలకు తెగించి పనిచేసే వారికి కేవలం రూ.450 కూలి ఇచ్చి, బానిసల్లా పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. వీరికి 3 నుంచి 4 నెలలుగా జీతాలు చెల్లించకపోతే కుటుంబాలు ఎలా బతకాలని ప్రశ్నించారు. విలీన కార్మికులకు మినిమమ్ టైమ్ స్కేల్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించి ఏడాది గడుస్తున్నా అమలు చేయలేదన్నారు. మరణించిన, రిటైర్డ్ కార్మికుల పిల్లలకు ముందుగా ఉపాధి కల్పించకుండా, బయటి వ్యక్తులను తీసుకోవడం ద్వారా పోస్టులను అమ్ముకుంటున్నారని కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అవినీతి జరిగాక ఇప్పుడు కమిషనర్ చర్యలకు ఆదేశాలు ఇవ్వడం.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. కమిషనర్ గతంలో అంగీకరించిన డిమాండ్లను నిర్దిష్ట కాలపరిమితిలో అమలు చేయాలని, లేని పక్షంలో ఈ నెల 21 తర్వాత నిరవధిక సమ్మెలోకి వెళ్తామని స్పష్టం చేశారు. సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి యు.రాజు, వర్కింగ్ జనరల్ సెక్రటరీ ఎం.వి.ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పారావు, ఉపాధ్యక్షుడు నాయుడు, నీటి సరఫరా విభాగం నాయకుడు వెంకట్రావు, ఆదినారాయణ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
డ్యూటీలో కఠినం..సేవలో అమ్మతనం
అల్లిపురం: శాంతిభద్రతల పరిరక్షణలో లాఠీ పట్టి రౌడీల గుండెల్లో వణుకు పుట్టించే ఖాకీలు.. ఆపదలో ఉన్న అభాగ్యులను చూస్తే కరిగిపోతారని విశాఖ టూటౌన్ క్రైం పోలీస్ స్టేషన్ మహిళా హెడ్ కానిస్టేబుల్ నిరూపించారు. తోటివారికి సాయం చేయడంలోనే పరమార్థం ఉందని నమ్మి, తనదైన శైలిలో ఉదారత చాటుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు.. హెడ్ కానిస్టేబుల్ సూరిశెట్టి జలఉష (పీసీ 2714). సమాజం గర్వించదగ్గ రీతిలో తన మానవత్వాన్ని చాటుకున్నారు. పెందుర్తిలోని ‘శ్రీ మణిప్రకాష్ అనాథ ఆశ్రమం’ నిర్వాహకులు దొడ్డి ప్రకాష్ చేస్తున్న సేవలకు ముగ్ధురాలైన జలఉష, ఆశ్రమానికి తన వంతుగా రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనాథల మధ్యే గడుపుతూ వారికి ఒక రోజు సేవకురాలిగా మారిపోయారు. ఐదేళ్లుగా వీడని సేవా బంధం : ఈ సందర్భంగా జలఉష మాట్లాడుతూ.. ఆశ్రమంలో దాదాపు 250 మందికి పైగా అనాథలను, నిరాశ్రయులను, మానసిక వికలాంగులను చేరదీసి వారికి పునరావాసం కల్పిస్తూ చేస్తున్న సేవలు నన్ను ఎంతగానో కదిలించాయి. అందుకే ఐదేళ్లుగా ప్రతి ఏటా రూ. 5 వేల చొప్పున విరాళం ఇస్తూ వస్తున్నాను. ఈ ఏడాది రూ. 50 వేల ఆర్థిక సాయం అందించడం తృప్తినిచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, విధుల్లో భాగంగా నగరంలో ఎక్కడైనా దిక్కుతోచని స్థితిలో ఉన్న అభాగ్యులు, వృద్ధులు కనిపిస్తే పోలీసుల తరఫున ఈ ఆశ్రమానికే పంపిస్తామని, నిర్వాహకులు వారిని ఎల్లప్పుడూ ఆదరిస్తారన్నారు. -
ఇంటర్ నాన్ టీచింగ్ సంఘం అధ్యక్షుడిగా బాబ్జీ
డాబాగార్డెన్స్: ఉమ్మడి విశాఖ జిల్లా ఇంటర్మీడియట్ విద్య నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఆదివారం విశాఖ ప్రభుత్వ బాలికల కళాశాలలో ప్రశాంతంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్య ఉద్యోగుల సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎన్నికలకు జోనల్ కార్యదర్శి ఎన్. మురళీమోహన్ ఎన్నికల అధికారిగా, పరిశీలకుడిగా వ్యవహరించారు. ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా విశాఖ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ఉద్యోగి బొట్టా కేఎస్ బాబ్జీ ఎన్నికయ్యారు. జిల్లా కార్యదర్శిగా అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉద్యోగి ఎన్.రమేష్‌బాబు, కోశాధికారిగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉద్యోగి ఆర్.ఎస్.ఎస్.ఎన్ మూర్తి, ఉపాధ్యక్షుడిగా భీమునిపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాల జూనియర్ అసిస్టెంట్ ఎం.ఎస్.కె చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీహెచ్ సుధాకర్, రాష్ట్ర జోనల్ మహిళా కార్యదర్శి ఎన్.ఈశ్వరమ్మ, రాష్ట్ర సంఘం నాయకుడు జీవీ అప్పారావు, జిల్లా నాయకులు బంకపల్లి రామారావు అభినందించారు. అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు చెందిన ఇంటర్మీడియట్ విద్య నాన్–టీచింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఆర్తనాదం
ఆసరా కోసంరెండేళ్లయినా కొత్త పింఛన్లకు దిక్కులేదు జిల్లాలో 50 వేల మంది ఎదురుచూపులు కనికరించని చంద్రబాబు ప్రభుత్వంకదలలేని భర్త.. కరగని ప్రభుత్వం వైఎస్సార్సీపీ హయాంలోనే మెరుగైన వ్యవస్థ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏడాదికి రెండుసార్లు క్రమం తప్పకుండా కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో అర్హులను గుర్తించి జాబితాలు ప్రకటించేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు.. వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీన వేకువజామునే లబ్ధిదారుల ఇంటి తలుపుతట్టి మరీ చేతిలో పింఛను డబ్బులు పెట్టేవారు. ఐదేళ్ల కాలంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా పింఛన్లు అందించిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గత 23 నెలలుగా ఒక్క కొత్త పింఛను కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవు. జిల్లాలో మొత్తం దివ్యాంగ పింఛన్దారులుపింఛన్ వస్తేనే బతకగలను నేను పుట్టుకతోనే అంధురాలిని. రెండు కళ్లు కనిపించవు. ఇతరుల సహాయం లేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నాది. ఎవరైనా సాయం చేస్తేనే బతుకుబండి నడుస్తుంది. పింఛన్ కోసం సచివాలయానికి, పీజీఆర్ఎస్కు ఎన్నోసార్లు అతి కష్టం మీద వెళ్లి దరఖాస్తు చేసుకున్నాను. కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని, మళ్లీ రమ్మని చెప్పి అధికారులు వెనక్కి పంపిస్తున్నారు. నాకు వేరే ఎలాంటి ఆధారం లేదు. పింఛను వస్తేనే నా జీవితం సాగుతుంది. నాలాంటి అభాగ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి. – టి.హేమ, అంధ దివ్యాంగురాలు, వాంబేకాలనీ, మధురవాడమంచానికే పరిమితమైన కొడుకు రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం మాది. సెంటు భూమి లేదు, కూలి పనులు చేద్దామన్నా వయసు సహకరించదు. మూడేళ్ల క్రితం వరకు మా కొడుకు లక్ష్మణే మాకు అన్నీ తానై చూసుకునేవాడు. కానీ కాలం మాపై పగబట్టింది. ఒక ప్రమాదం.. ఆపై వింత వ్యాధి, పక్షవాతం మా కొడుకు జీవితాన్ని ఛిద్రం చేశాయి. కాళ్లూ చేతులూ చచ్చుబడిపోయి మంచానికే పరిమితమయ్యాడు. 2024లోనే 50 శాతం అంగవైకల్యంతో సదరం సర్టిఫికెట్ వచ్చింది. అప్పుడే పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్నాం. ఎన్నికలు వచ్చాయని ఆపారు.. ఆ తర్వాత ప్రభుత్వం మారింది కానీ, మా తలరాత మారలేదు. రెండేళ్లుగా పింఛన్ కోసం తిరగని గడప లేదు, ఎక్కని మెట్టు లేదు. రేపు మేం కళ్లు మూస్తే.. మంచం మీద ఉన్న మా కొడుకు గతి ఏంటన్నదే మా భయం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మా కొడుకుకు పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి. – బండి అప్పారావు, కనకరత్నం రేవిడి గ్రామం, పద్మనాభం మండలం (బాధిత తల్లిదండ్రులు) మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండేళ్లు అవుతున్నా.. రాష్ట్రంలో కొత్త పింఛన్ల ఊసే లేదు. ఎన్నికల ముందు 50 ఏళ్లు దాటిన వారికి, వివిధ కేటగిరీలకు చెందిన దివ్యాంగులకు తక్షణమే పింఛన్లు ఇస్తామని ప్రచార సభల్లో చంద్రబాబు పెద్ద ఎత్తున హామీలు గుప్పించారు. కానీ, అధికారం చేపట్టి 23 నెలలవుతున్నా.. ఎంతో మంది అర్హులు ఉన్నా.. నేటికీ ఒక్క కొత్త పింఛను కూడా మంజూరు చేయలేదు. ఫలితంగా అన్ని వర్గాలకు చెందిన నిరుపేదలు ఆశ నిరాశల మధ్య నిరీక్షిస్తున్నారు. కొత్త పింఛన్లు ఎప్పుడొస్తాయంటూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. తమ ఇంటి సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా చక్కర్లు కొడుతున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం కనికరించడం లేదు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఆన్లైన్లో సైట్ ఓపెన్ కాకపోవడంతో దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోతోంది. కోతలపైనే చంద్రబాబు సర్కార్ దృష్టి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ నూతన పింఛన్లు మంజూరు చేస్తామని ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల వేళ ప్రగల్భాలు పలికారు. కానీ, కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను పూర్తిగా అటకెక్కించారు. కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారో అధికారులకే స్పష్టత లేని దయనీయ పరిస్థితి నెలకొంది. ‘ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే అర్హుల జాబితాలను పంపుతామని, అంతవరకు మేమేమీ చేయలేమని’ క్షేత్రస్థాయి అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఒకపక్క కొత్త పింఛన్ల ఊసే లేదు, మరోపక్క ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లలో కోత విధించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఏ పనీ చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న దివ్యాంగులకు కూటమి సర్కార్ తీరని అన్యాయం చేస్తోంది. రీ–వెరిఫికేషన్ పేరుతో లబ్ధిదారుల సంఖ్యను కుదించే చర్యలకు తెరతీయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. -
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై నేడు నిరసన
మహారాణిపేట: రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో శాంతియుత నిరసనలు చేపట్టాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని కేకే రాజు మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఇంధన ధరలను తగ్గిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, ఇప్పుడు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ధరలకు పెట్రోలు, డీజిల్ విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ పెంపు వల్ల రవాణా రంగం, రైతాంగంతో పాటు సామాన్య ప్రజలపై నిత్యావసరాల రూపంలో అదనపు భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమాల్లో పార్టీ పార్లమెంట్ సభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కేకే రాజు పిలుపునిచ్చారు. -
ఎయిడ్స్ బాధితులకు అండగా మేమంతా..
డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు మహారాణిపేట: అంతర్జాతీయ ఎయిడ్స్ దీపస్మృత్యంజలి దినం సందర్భంగా ఆదివారం నగరంలో ర్యాలీ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవీ/ఎయిడ్స్‌తో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబాలకు, వ్యాధితో పోరాడుతున్న వారికి మేమున్నాం అనే భరోసా కల్పించేందుకు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుంచి సత్యం జంక్షన్ మీదుగా రామాటాకీస్ వరకు ఈ ర్యాలీ సాగింది. డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు ఈ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. గత 20 ఏళ్లలో జిల్లాలో 7,445 మంది ఈ వ్యాధితో మరణించారని, ప్రస్తుతం 26,203 మంది బాధితులు ఏఆర్టీ మందులు వాడుతున్నారని తెలిపారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణాధికారి డాక్టర్ రోణంకి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాజిటివ్ నెట్వర్క్ సభ్యులు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మా బతుకులెలా?
బంగారం కొనొద్దంటే.. డాబాగార్డెన్స్: ‘దేశ ఆర్థిక వ్యవస్థను, రూపాయి విలువను కాపాడేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలి’అంటూ ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు ఇప్పుడు స్వర్ణకార వృత్తిదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ‘జనాలు బంగారం కొనవద్దంటే మా ఉపాధి మాటేమిటి? మా కుటుంబాలను ఎవరు పోషిస్తారు?’అంటూ ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్వర్ణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం ధరలు చుక్కలనంటడం, దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతిపై 10 శాతం సుంకం విధించడంతో దేశీయంగా నగల వ్యాపారం తీవ్ర సంక్షోభంలో పడింది. తాజా పరిణామాలతో అసలు ఈ వృత్తి మనుగడలోనే ఉంటుందా అనే భయం వారిని వెంటాడుతోంది. కేవలం కార్మికులే కాకుండా, నగల వ్యాపారంపై ఆధారపడిన వేలాది కుటుంబాలు తమ భవిష్యత్తుపై తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నాయి. ఉపాధిపై భయాందోళనలు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సుమారు 50 వేలకు పైగా కుటుంబాలు స్వర్ణకార వృత్తిపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి జీవిస్తున్నాయి. పాతనగరంతో పాటు ద్వారకానగర్, కంచరపాలెం, ఎంవీపీ కాలనీ, గాజువాక, భీమిలి, అనకాపల్లి తదితర ప్రాంతాల్లో ఈ వృత్తిదారులు పెద్ద సంఖ్యలో కేంద్రీకృతమై ఉన్నారు. ఒక్క విశాఖ నగర పరిధిలోనే 30 వేల నుంచి 35 వేల కుటుంబాలు ఈ రంగంలో ఉన్నాయి. వీరిలో పాతబస్తీలోనే 15 నుంచి 20 వేల మంది జీవనం సాగిస్తున్నట్లు సంఘాల నేతలు చెబుతున్నారు. ఇందులో పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చి ఇక్కడే స్థిరపడిన వృత్తిదారులు 6 నుంచి 7 వేల మంది వరకు ఉండగా, ముస్లిం వర్గానికి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా ఈ రంగం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లడంతో స్థానిక వృత్తిదారులకు పనులు దొరకడం గగనమైపోయింది. ఉపాధి కోల్పోయిన చాలా మంది ఇప్పటికే ఇతర రంగాల వైపు మళ్లగా, మిగిలిన వారు ప్రధాని తాజా వ్యాఖ్యలతో పూర్తిగా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కార్పొరేట్ తాకిడి.. పెరిగిన పన్నుల భారం గత పదేళ్లుగా చిన్న తరహా బంగారు ఆభరణాల వ్యాపారం క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. స్థానిక దుకాణాల వ్యాపారమంతా కార్పొరేట్ షోరూమ్‌ల వైపు మళ్లింది. ఒకప్పుడు బంగారు నగల వ్యాపారానికి గుండెకాయ లాంటి పాతనగరంలో ఇప్పుడు స్వర్ణకారులు పనుల్లేక అల్లాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాలు ఆశించగా, కొనుగోళ్లు ఆపాలని ప్రధాని చెప్పడం కోలుకోలేని దెబ్బ తీసిందని వృత్తిదారులు వాపోతున్నారు. ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలి రాష్ట్రంలో స్వర్ణకార వృత్తిదారులు పనులు లేక, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి నెలకొంది. ధరలు పెరిగి వ్యాపారాలు మందగించిన తరుణంలో, ప్రధాని మోదీనే ఏడాది పాటు ఆభరణాలు కొనవద్దని చెబితే ఈ రంగంపై ఆధారపడిన సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఒకవైపు దిగుమతి సుంకం పెంచారు. మరోవైపు జీఎస్టీ భారం కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. కార్పొరేట్ షోరూంల పోటీతో ఇప్పటికే సతమతమవుతున్న స్వర్ణకారులకు ప్రధాని ప్రకటన ‘మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు’తయారైంది. గతంలో కార్మికులకు అండగా నిలిచిన సంక్షేమ పథకాలు ప్రస్తుతం అందడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వర్ణకారులను ఆదుకోవాలి. – గురజాపు రవి, అధ్యక్షుడు, విశాఖ నగర విశ్వబ్రాహ్మణ సంఘం రోడ్డున పడకుండా చూడండి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల బంగారు నగల విక్రయాలు పూర్తిగా పడిపోతున్నాయి. కొనేవారు లేక వ్యాపారులు, ఆర్డర్లు లేక వృత్తిదారులు అల్లాడుతున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపించకుండా నగలు కొనవద్దంటే మా లాంటి పేద కార్మికులు ఏమైపోవాలి? ఒకప్పుడు నగల తయారీ కోసం ప్రజలు నేరుగా స్వర్ణకారుల వద్దకే వచ్చేవారు. కానీ కార్పొరేట్ సంస్థల ఆకర్షణీయమైన ప్రకటనల వల్ల మా వద్దకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పుడు పన్నుల భారం, ప్రభుత్వ ఆంక్షల వల్ల మా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని మా వృత్తిని కాపాడాలి. – పక్కి కొండబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర స్వర్ణకార సంఘం -
అన్నమయ్య పద నర్తనం..మంత్రముగ్ధం
ఏయూ క్యాంపస్: భగవంతుడికి మనలోని భక్తిని మాత్రమే సమర్పించాలని అన్నమాచార్య వంశస్థులు తాళ్లపాక హరి నారాయణాచార్యులు అన్నారు. విశాఖ ఆర్ట్ అండ్ డ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్య శోభాయాత్ర, అన్నమయ్య పద నర్తనం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, బీచ్‌రోడ్డులోని అన్నమయ్య విగ్రహం వద్ద నిర్వహించిన పద నర్తనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ..‘ధనంతో కేవలం కొన్నింటిని మాత్రమే సంపాదించగలం..అదే విద్య ఉంటే దేన్నయినా పొందవచ్చు. కాబట్టి విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సరస్వతీ కటాక్షం ఉన్నచోట లక్ష్మీ కటాక్షం దానంతట అదే సిద్ధిస్తుంది’అని ఆయన పేర్కొన్నారు. అలాగే, ప్రతి ఒక్కరూ అన్నమాచార్య సంకీర్తనల్లో దాగి ఉన్న భావాలను, తాత్పర్య రహస్యాలను తెలుసుకోవాలని సూచించారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో నిత్యం సంకీర్తనలు గానం చేసే భాగ్యం తనకు దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎల్లప్పుడూ ధర్మాన్ని అనుసరించే వారి వద్దనే భగవంతుడు కొలువై ఉంటాడని స్పష్టం చేశారు. నేటి చిన్నారులు విజ్ఞానాన్ని సముపార్జించి దేశ ప్రగతికి పాటుపడాలని, జ్ఞానం, విజ్ఞానం, అజ్ఞానం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించాలని హితబోధ చేశారు. అనంతరం తిరుమల శ్రీవారి ఏకాంత సేవలో ఆలపించే గీతాలను ఆయన సుమధురంగా పాడి.. భక్తులను మంత్రముగ్ధులను చేశారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు చేసిన పద నర్తనం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కందుల నాగరాజు, నాట్య గురువులు కళారత్న హరి రామమూర్తి, వీఏడీఏ జనరల్ సెక్రటరీ కన్నం వెంకట రమణారావు, బ్రహ్మకుమారి రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
బాబుది పా‘శవ’క పాలన
బీచ్‌రోడ్డు (విశాఖ): మాయమాటలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. అవ్వతాతలకు, వితంతువులకు, దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు శవపేటికలలో వృద్ధుల మృతదేహాల నమూనాలతో వినూత్న నిరసన చేపట్టారు. ‘చనిపోయిన వృద్ధుల పింఛన్లయినా కొత్త వారికి ఇప్పించండి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. భారీగా హాజరైన కార్యకర్తలు, నాయకుల నినాదాలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది.పేదల పొట్ట కొడుతున్నారు ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 66 లక్షల పైచిలుకు పెన్షన్లు అందజేశారని గుర్తు చేశారు. కానీ, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రెండేళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వకపోగా, కుంటిసాకులతో ఆరు లక్షల మందికిపైగా అవ్వతాతల పెన్షన్లు తొలగించి వారి పొట్ట కొట్టారని మండిపడ్డారు.సూపర్ సిక్స్ పథకాలు చెప్పి ఒక్క హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా, తండ్రీకొడుకులు తెలంగాణలో పండగలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. గత రెండేళ్లలో సహజంగా చనిపోయిన వృద్ధుల స్థానంలోనూ కొత్త పింఛన్లు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ 31వ వార్డు అధ్యక్షుడు దొడ్డి బాపూ ఆనంద్, దక్షిణ నియోజకవర్గ పరిశీలకులు వీసాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
‘రాజ్యాంగ పదవి నుంచి రఘురామను తొలగించాలి’
డాబాగార్డెన్స్: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దళితులు, దళిత క్రైస్తవులపై చేస్తున్న వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం అండదండలున్నాయని మాల మహనాడు వ్యవస్థాపక కార్యదర్శి భాగం గోపాలరావు ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి, రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తున్న ఆయనను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శనివారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం చింతాడ ఆనంద్ కేసులో దళితులు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీ స్టేటస్ రద్దు అవుతుందని తీర్పు ఇచ్చిందని, అయితే ఆ తీర్పులో ఎస్టీ, బీసీ, ఓసీ కులాలకు చెందిన క్రైస్తవులపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. ఈ తీర్పు మిగిలిన వర్గాల క్రైస్తవులకు వర్తించదా అని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చి నేటికి 77 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కుల వివక్ష, అంటరానితనం, గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతూనే ఉన్నాయన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఇటీవల దళితులు, దళిత క్రైస్తవుల గురించి చాలా హీనంగా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో దళితులందరూ క్రైస్తవులని సంబోధించి మాట్లాడడం దారుణమన్నారు. హిందూ మతంలో ఉన్న హిందూ దళితుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సరికాదన్నారు. డిప్యూటీ స్పీకర్ వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసినట్టు వార్తలు వస్తున్నాయని, ఒక ఉన్నతాధికారితో ఆయనకున్న వ్యక్తిగత విభేదాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో ఉన్న దళితులకు ఆపాదించడం మంచిది కాదని హెచ్చరించారు. అలాంటి వ్యక్తి డిప్యూటీ స్పీకర్‌గా ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని, చంద్రబాబు సర్కార్ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. రఘురామకృష్ణంరాజుకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయని, ముఖ్యంగా చంద్రబాబుకి, రఘురామకు మధ్య లాలూచీ ఉందని ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఫ్లెక్సీ తన దారికి అడ్డుగా లేకపోయినప్పటికీ, కార్యకర్తల మెప్పుకోసం రఘురామ తన చేతులతో ఫ్లెక్సీని చింపి వేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమన్నారు. -
ప్లాస్టిక్ రహిత విశాఖే లక్ష్యంగా పనిచేద్దాం
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పిలుపుఎంవీపీకాలనీ: ప్లాస్టిక్ రహిత విశాఖే లక్ష్యంగా అంతా కలిసికట్టుగా పనిచేద్దామని నగర ప్రజలకు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ రామిరెడ్డితో కలిసి, స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–2026 సంవత్సరానికి గాను విశాఖ ప్రథమ స్థానం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలు, కార్యాచరణ ప్రణాళికలను వివరించడంతో పాటు ఉద్యోగులకు అవగాహన కల్పించారు. శివాజీ పార్క్ వేదికగా శనివారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రూ.1,500 కోట్లతో నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. వ్యర్థాల కోసం డస్ట్బిన్లను తప్పనిసరిగా వాడాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా బహిష్కరించాలన్నారు. నేషనల్ డెంగ్యూ డేని గుర్తు చేస్తూ.. ఇళ్లతో పాటు నగర పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. అనంతరం కలెక్టర్ ‘సే నో టు ప్లాస్టిక్–బ్రింగ్ యువర్ ఓన్ బ్యాగ్’ నినాదంతో కూడిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. పారిశుధ్య మెరుగుదలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు పారిశుధ్య కార్మికులను సన్మానించారు. అలాగే పారిశుధ్యం, వ్యాధుల నియంత్రణపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ నల్లనయ్య, ప్రధాన వైద్యాధికారి నరేష్కుమార్, ఈస్ట్ జోన్ కమిషనర్ శివప్రసాద్, డీపీవో నాగార్జునరావు, డీడీహెచ్ ఇన్చార్జి వాసుకి తదితరులు పాల్గొన్నారు. -
మంటలే..
పగలే కాదు.. రాత్రి కూడా 2001 నుంచి వేడి తగ్గుదలలో 9 శాతం క్షీణత ● రాత్రి వేళల్లోనూ చల్లబడని విశాఖ ● వేసవి కాలంలో సగటు హీట్ ఇండెక్స్ 42 డిగ్రీలుగా నమోదు ● మే నెలాఖరు, జూన్ మొదటి వారంలో 50 డిగ్రీలకు చేరుకుంటున్న ఇండెక్స్ ● అర్బన్ హీట్ ఐలాండ్‌గా మారుతున్న ప్రధాన నగర పరిధి ● సీఎస్ఈ నివేదికలో హెచ్చరికలు ఒకప్పుడు పగటిపూట ఎండలు మండినా.. సాయంత్రం కాగానే సముద్రపు చల్లటి గాలులతో హాయిగా సేదతీరిన విశాఖ.. ఇప్పుడు రాత్రి వేళల్లోనూ నిప్పుల కొలిమిలా మారుతోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ), ట్రిపుల్ ఐటీ కొట్టాయం పరి శోధకులు సంయుక్తంగా నిర్వహించిన తాజా శాసీ్త్రయ అధ్యయనం పలు ఆందోళనకరమైన అంశాల్ని బహిర్గతం చేసింది. అంతర్జాతీయ జర్నల్ ‘డిస్కవర్ హజార్డ్స్’లో ప్రచురితమైన ఈ నివేదిక.. గత మూడు దశాబ్దాల నాసా వాతావరణ సమాచారాన్ని క్షుణ్ణంగా విశ్లేషించింది. రాబోయే రోజుల్లో విశాఖవాసులు ఉక్కపోత, అస్థిర వాతావరణ ముప్పును ఎదుర్కోనున్నారని హెచ్చరించింది. విశాఖలో పగటి ఉష్ణోగ్రతల కంటే రాత్రి వేళల్లో వేడి తగ్గకపోవడమే అతిపెద్ద సమస్యగా మారుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది. –సాక్షి, విశాఖపట్నం క్లైమెట్ హాట్స్పాట్స్పరిశోధకులు 1990 నుంచి 2019 వరకు అంటే దాదాపు 3 దశాబ్దాల్లో విశాఖలోని ఉష్ణోగ్రతలు, వర్షపాతం, తేమ శాతానికి సంబంధించిన అధికారిక డేటాను సేకరించారు. అధునాతన సాంకేతికత కలిగిన సీజనల్ ఆటోరెగ్రెసివ్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ ఏరియా(సరిమా), జీఐఎస్ మోడల్స్ ఆధారంగా వాతావరణ మార్పులను విశ్లేషించారు. దీని ప్రకారం 2019 నుంచి 2028 మధ్య కాలంలో విశాఖ వాతావరణంలో తీవ్రమైన అస్థిరత ఉంటుందని, పగలు–రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని ఈ మోడలింగ్ అంచనా వేసినట్లు అధ్యయనంలో స్పష్టం చేశారు. చిన్నగా కావాలి రాత్రి వేళల్లోనూ ఉక్కిరిబిక్కిరి ఈ అధ్యయనం ప్రకారం, గతంలో వేసవి కాలంలో (మార్చి–మే) నగర సగటు ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల నుంచి 36 డిగ్రీల మధ్య నమోదయ్యేవి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇప్పుడు 35.6 డిగ్రీల నుంచి 37 వరకూ పెరుగుతోంది. అంతకంటే ఆందోళనకరమైన అంశమేంటంటే.. రాత్రి వేళల్లోనూ సగటు ఉష్ణోగ్రతలు 27.1 డిగ్రీల నుంచి 28.1 డిగ్రీల కంటే తగ్గుముఖం పట్టడం లేదు. 2001–2010 కాలంతో పోలిస్తే, 2014–2023లో విశాఖలో రాత్రి వేళల్లో వేడి తగ్గడం 9 శాతం మేర క్షీణించింది. అంటే నగరం గతంలో కంటే తక్కువగా చల్లబడుతోంది. ముఖ్యంగా వేసవి కాలంలో (మార్చి–మే) రాత్రి ఉష్ణోగ్రతలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న క్లైమేట్ హాట్‌స్పాట్స్ నగర పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ వాతావరణం ఒకేలా లేదు. కాంక్రీట్ కట్టడాల వల్ల జనసాంద్రత, పారిశ్రామికీకరణ ఆధారంగా ఉష్ణోగ్రతల్లో తీవ్ర వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గాజువాక, స్టీల్‌ప్లాంట్ పరిసరాలు, ఎయిర్‌పోర్టు జోన్లను అత్యంత వేడిగా ఉండే ‘హాట్‌స్పాట్స్’గా పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పచ్చదనం క్షీణించడం, పారిశ్రామిక కార్యకలాపాలు, వాహనాల కాలుష్యం దీనికి ప్రధాన కారణాలు మారాయి. వీటికి భిన్నంగా గ్రామీణ స్వభావం కలిగిన పద్మనాభం వంటి ప్రాంతాలు ఇప్పటికీ కొంత చల్లగా ఉండటం గమనార్హం. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
బ్లాక్ స్పాట్లను పరిశీలించిన ట్రాఫిక్ పోలీసులు అల్లిపురం: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా శనివారం ఈస్ట్ సర్కిల్–1 ట్రాఫిక్ సీఐ ఎం.శ్రీను, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.బుచ్చిరాజు కలిసి తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఆర్టీసీ కాంప్లెక్స్, గొల్లలపాలెం, జగదాంబ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. బ్లాక్ స్పాట్లలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వారు నిశితంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సమస్యను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఐ శ్రీను, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బుచ్చిరాజు తెలిపారు. ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో వాటన్నింటినీ గుర్తించి, ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. టూటౌన్ ట్రాఫిక్ ఎస్ఐ సింహాచలం, రవాణా శాఖ అధికారులు విజయ్ కుమార్, వెంకటేశ్వరరావు, రమ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీవో బాధ్యతల నుంచి తప్పించండి
కలెక్టర్‌కు ఇన్చార్జి ఆర్డీవో శేష శైలజ లేఖ? మహారాణిపేట: విశాఖ రెవెన్యూ డివిజనల్ అధికారి(ఇన్చార్జి)గా ఉన్న శేష శైలజ తనను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆమె కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌కు లేఖ సమర్పించినట్లు తెలిసింది. ప్రస్తుతం కలెక్టరేట్లో ఉన్న కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న శేష శైలజను, అప్పటి కలెక్టర్ ఇన్చార్జి ఆర్డీవోగా నియమించారు. అప్పటి నుంచి ఆమె ఆర్డీవోగా, కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్‌గా రెండు పదవుల్లోనూ కొనసాగుతున్నారు. గత ఏడాది అక్టోబర్ 21న అప్పటి డీఆర్వో బి.హెచ్.భవానీ శంకర్, ఆర్డీవో పి.శ్రీలేఖలను ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో అప్పటి హెచ్‌పీసీఎల్ భూసేకరణ అధికారిగా పనిచేస్తున్న సనపల సుధాసాగర్‌ను ఇన్చార్జి ఆర్డీవోగా నియమించారు. కొంతకాలం తర్వాత సుధాసాగర్ విజయనగరం ఆర్డీవోగా బదిలీ కావడంతో, ఆయన అప్పటికప్పుడు రిలీవ్ అయ్యారు. ఆ సమయంలో కలెక్టరేట్ కేఆర్సీలో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న శేష శైలజకు ఇన్చార్జి ఆర్డీవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే విశాఖ ఆర్డీవో పోస్టుకు ప్రోటోకాల్ బాధ్యతలు ఎక్కువగా ఉండడంతో, తాను ఈ అదనపు బాధ్యతలను నిర్వహించలేనని శేష శైలజ కలెక్టర్‌కు లేఖ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై ప్రస్తుతం కలెక్టరేట్లో జోరుగా చర్చ సాగుతోంది. తదుపరి ఆర్డీవో బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే దానిపై అధికారులు ఆలోచనలో పడ్డారు. -
భూములు గుంజుకుని..పరిహారానికి కొర్రీలా?
ఆనందపురం: అభివృద్ధి పేరుతో నాడు విలువైన భూములను గుంజుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. నేడు ఆ బాధితులకు నష్టపరిహారం అందించే విషయంలో కొర్రీలతో వేధింపులకు గురిచేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని తర్లువాడ గ్రామంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన రైతులకు మూడు సెంట్ల స్థలాన్ని కేటాయించే విషయంలో చుక్కలు చూపిస్తున్నారు. డీఆర్డీఏ స్లిప్పులు ఉన్న 520 మంది రైతులకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పి.. ఇపుడు తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేయడం పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిబంధకంగా మారిన తనిఖీలు తహసీల్దార్ ఎస్.శ్రీనుబాబు ఆదేశాల మేరకు శనివారం 15 మంది గ్రామ రెవెన్యూ అధికారుల బృందం గ్రామంలో ముమ్మరంగా అర్హుల వెరిఫికేషన్ పేరిట తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల తీరుపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రతి ఇంటికీ వెళుతూ, గతంలో ప్రభుత్వం ఇచ్చిన డీఆర్డీఏ స్లిప్ నంబర్లతో సరిపెట్టకుండా.. ఆధార్ నంబర్, బియ్యం కార్డు నంబర్, ఇంటి పన్ను రసీదు నంబర్ల కోసం ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాకుండా, గతంలో వీరికి ప్రభుత్వ ఇళ్ల నిర్మాణ పథకం ఏమైనా వచ్చిందా లేదా అనే కోణంలో క్షుణ్ణంగా పరిశీలిస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. హక్కుగా రావాల్సిన పరిహారానికి అర్హతలా? గూగుల్ డేటా సెంటర్ కోసం రైతులు తమ భూములను త్యాగం చేశారు. దానికి ప్రతిఫలంగా నేరుగా నష్టపరిహారం ఇవ్వాల్సింది పోయి, ఇప్పుడు కొత్తగా ఇన్ని కొర్రీలు, తనిఖీలు చేయడాన్ని రైతులు నిలదీస్తున్నారు. గతంలో ఇళ్లు వచ్చి ఉంటే ఇప్పుడు నష్టపరిహారం కింద ఇచ్చే ఇళ్ల స్థలాన్ని నిరాకరిస్తారా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ బేషరతుగా పరిహారం ఇవ్వాలే తప్ప, ఇలా సంక్షేమ పథకాల తరహాలో వడపోత కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడుతున్నారు. లబ్ధిదారుల్లో అయోమయం మరోవైపు, గ్రామంలో ఇంకా కొంతమంది లబ్ధిదారులైన రైతుల పేర్లను అధికారులు వెరిఫై చేయాల్సి ఉంది. ఈ ముసుగులో ఎక్కడ తమ పేర్లను జాబితా నుంచి తొలగిస్తారోననే భయం మిగిలిపోయిన రైతుల్లో నెలకొంది. కాలయాపన చేయకుండా తమ పేర్లను కూడా తనిఖీ చేసి, ఈ అసంబద్ధ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, తమకు దక్కాల్సిన న్యాయమైన నష్టపరిహారాన్ని వెంటనే అందజేయాలని బాధితులు రెవెన్యూ అధికారులను డిమాండ్ చేస్తున్నారు. -
అండమాన్ తీరాన్ని తాకిన రుతు పవనాలు
సాక్షి, విశాఖపట్నం: అండమాన్ తీరాన్ని రుతు పవనాలు తాకాయి. ఈ నెల 26న కేరళను తొలకరి పలకరించనుందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో అండమాన్, నికోబార్‌లో వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు అంచనాలకు అనుగుణంగానే నైరుతి గాలులు పయనిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, మొత్తం నికోబార్ దీవులు, శ్రీవిజయపురం (బ్లెయిర్ పోర్ట్) సహా అండమాన్ దీవులలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వెల్లడించింది.రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే సమయంలో అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలతో పాటు తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి కూడా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణం కంటే ముందే.. అంటే మే 26 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిన్న (శుక్రవారం) తెలిపిన సంగతి తెలిసిందే. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయి. ఇది భారతదేశంలో నైరుతి రుతుపవనాల కాలం (జూన్ నుండి సెప్టెంబర్) ప్రారంభాన్ని సూచిస్తుంది. అయితే, ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంతకుముందు పేర్కొంది. ఈ సీజన్లో 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణం కావచ్చని.. ఎల్ నినో ప్రభావం వల్ల దేశంలో వర్షపాతం తగ్గుతుందని ఐఎండీ తెలిపింది. -
అద్దె అడిగితే గొంతు కోశాడు
సూర్యాపేట జిల్లా: అద్దె డబ్బులు అడిగినందుకు కక్ష పెంచుకుని ఒక మహిళను దారుణంగా హత్య చేసి, ఐదు తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన నిందితుడిని ఫోర్త్ టౌన్ పోలీసులు కేవలం రెండు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. ఈ సంచలన కేసు వివరాలను నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర క్రైం డీసీపీ కే. లతామాధురి వెల్లడించారు. కేసు వివరాలిలా.. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్‌లోని నాగ ఆనంద్ అపార్టుమెంట్లో పిల్లా పార్వతి (53) తన భర్త చంద్రశేఖర్‌తో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఉన్న ఒక దుకాణాన్ని తాటిచెట్లపాలేనికి చెందిన గన్నవరపు రాము అద్దెకు తీసుకుని ‘దుర్గా భవానీ హెయిర్ స్టైల్స్’ షాపు నిర్వహిస్తున్నాడు. నిందితుడు రాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో మూడు నెలలుగా షాపు అద్దె బకాయి పడ్డాడు. ఆ అద్దె డబ్బుల కోసం పార్వతి గట్టిగా అడగడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. గురువారం సాయంత్రం పార్వతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి రాము లోపలికి ప్రవేశించాడు. అద్దె విషయంలో ఆమెతో గొడవపడి, అనంతరం ఆమె గొంతు నులిమి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె ధరించిన 2.5 తులాల పుస్తెల తాడు, 2.5 తులాల నల్లపూసల దండ, చెవి దిద్దులను అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త చంద్రశేఖర్ ఇంటికి వచ్చి చూడగా, పార్వతి విగతజీవిగా పడి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముమ్మర దర్యాప్తు : సమాచారం అందిన వెంటనే ఈస్ట్ ఏసీపీ లక్ష్మణమూర్తి, క్రైమ్ డీసీపీ కే. లతామాధురి పర్యవేక్షణలో క్లూస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు నిందితుడు రాముగా గుర్తించారు. నిందితుడు దొంగిలించిన బంగారు ఆభరణాలతో హైదరాబాద్‌కు పారిపోవడానికి రైల్వే స్టేషన్ గేటు వద్దకు చేరుకోగా, దర్యాప్తు బృందం అతడిని వెంబడించి చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్‌కు తరలించారు. నగరంలో కలకలం రేపిన ఈ కేసును కేవలం రెండు గంటల్లోనే ఛేదించిన ఈస్ట్ జోన్ క్రైమ్ సీఐ, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తరఫున క్రైమ్ డీసీపీ అభినందించారు. -
ఆటోలు లాగుతూ సీపీఎం నిరసన
డాబాగార్డెన్స్: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ గురజాడ విగ్రహం వద్ద ఆటోను తాడుతో లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పొదుపు నాటకాలు ఆపాలని మండిపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సంక్షోభంపై అమెరికా ఒత్తిళ్లకు మోదీ లొంగిపోయారని విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ధరలు పెంచి సామాన్యులను దొంగదెబ్బ తీశారని, ధరలు తగ్గించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వి.కృష్ణారావు, ఆర్కేఎస్వీ కుమార్, జగదాంబ జోన్ కన్వీనర్ ఎం.సుబ్బారావు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బైక్‌లను తాడుతో లాగి సీపీఐ నిరసన ఇంధన ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్లో ద్విచక్ర వాహనాలను తాడుతో లాగుతూ వినూత్న నిరసన చేపట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రహ్మాన్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తూ, సామాన్యులపై మాత్రం భారాలు మోపుతోందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో గెలిపించినందుకు ప్రజలకు ఇచ్చే బహుమతులు ఇవేనా అని ప్రశ్నించారు. వ్యాపారవేత్తలకు తక్కువ ధరలకే భూములు కట్టబెడుతున్నారని, పెరిగిన పెట్రో ధరలతో నిత్యావసరాలు భగ్గుమంటాయని, ఈ పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అత్తిలి విమల, రాష్ట్ర సమితి సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు, జిల్లా సహాయ కార్యదర్శి పి.చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పేదల పొట్ట కొట్టొద్దు: ఆటో ఫెడరేషన్ ఆగ్రహం భారీగా పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్‌గేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు కుమ్మకై ్క ప్రజలపై భారం మోపాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 50 సార్లు ధరలు పెంచిందని, పశ్చిమాసియా యుద్ధాన్ని బూచిగా చూపి దేశంలో ఇంధన ధరలు పెంచడం వల్ల రవాణా రంగం దెబ్బతిని ఆహార భద్రత కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు దీనిపై తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. -
అప్పన్న సాక్షిగా ట్రస్ట్ కోల్పోయిన కూటమి
సింహాచలం : వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యుల నియామకంలో పారదర్శకత లోపించిందని కూటమి నాయకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ పదవుల కోసం ఆశగా ఎదురుచూసిన సొంత పార్టీల నేతలకు మొండిచేయి ఎదురైంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారిని పక్కనపెట్టి, కూటమితో ఏమాత్రం సంబంధం లేని వారికి, స్థానికేతరులకు బోర్డులో చోటు కల్పించడంపై ఆశావాహులు మండిపడుతున్నారు. జగన్ హయాంలో పారదర్శకత సింహాచలం దేవస్థానానికి 2005 నుంచి 2019 వరకు ట్రస్ట్‌బోర్డు నియామకం జరగలేదు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 2020 మార్చిలో, మళ్లీ 2022 ఏప్రిల్‌లో ట్రస్ట్‌బోర్డులను ఏర్పాటు చేశారు. అప్పట్లో స్థానికులకు, ఆలయ విశిష్టతను కాపాడే వారికి పెద్దపీట వేయడంతో పాటు మహిళలకు 50 శాతం అవకాశం కల్పించారు. అయితే 2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దాదాపు రెండేళ్ల పాటు బోర్డును నియమించకపోవడం సొంత నేతల్లోనే అసంతృప్తికి దారితీసింది. ఎట్టకేలకు శుక్రవారం 17 మంది సభ్యులతో బోర్డును ఏర్పా టు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ పార్టీ శ్రేణులకు కనీస సమాచారం లేకుండా ఆగమేఘాల మీద ఈ జాబితాను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనర్హులకు పెద్దపీట ప్రకటించిన జాబితాలో అనర్హులకు పెద్దపీట వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తర నియోజకవర్గానికి చెందిన ఒక హోటల్ సీఈవో గుత్తికొండ శ్రీలతకు టీడీపీ కోటాలో బోర్డు సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. ఆమె అసలు పార్టీ కోసమే పనిచేయలేదని టీడీపీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. అలాగే టీడీపీ సానుభూతిపరుడైన మధుపాడ సన్యాసిరావును బీజేపీ ప్రతినిధిగా చూపించి నియామకం చేపట్టడంపై కమలనాథులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమకు కూడా తగిన ప్రాధాన్యం దక్కలేదని జనసేన నాయకులు అసంతృప్తితో ఉన్నారు. పట్టించుకోని ఎమ్మెల్యే సిఫార్సులు భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు సూచించిన వారికి కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారు కూడా పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. వీటన్నింటికీ మించి, సింహాచలం దేవస్థానంతో నేరుగా ముడిపడి ఉన్న అడవివరం గ్రామానికి చెందిన వారికి కూడా బోర్డులో కనీస అవకాశం కల్పించలేదు. అప్పన్న ట్రస్ట్ బోర్డు నియామక జీవో విడుదల సింహాచల దేవస్థానం నూతన ధర్మకర్తల మండలిని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నియమించింది. వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు అధ్యక్షుడిగా, మరో 16 మందిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మండలి రెండేళ్లపాటు కొనసాగనుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన జాబితానే ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. బీజేపీకి అవమానం ఏపీలో బీజేపీ పూర్తిగా టీడీపీమయమైపోయింది. సింహాచలం ట్రస్ట్ బోర్డు నియామకాల్లో టీడీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయాలపై అవగాహన లేని వారిని నియమించి అపప్రధ పాలవుతోంది. కూటమి వల్ల లబ్ధి పొందుతూనే బీజేపీని ప్రతి విషయంలోనూ చిన్నచూపు చూస్తోంది. కనీసం బీజేపీ నగర, రాష్ట్ర అధ్యక్షులకు తెలియకుండానే, తమకు అనుకూలంగా ఉండేవారిని బీజేపీ కోటాలో నియమించుకోవడం పార్టీని దెబ్బతీయడమే. గత ప్రభుత్వం 80 శాతం వరకు భక్తులకు ప్రాధాన్యం ఇస్తే, ప్రస్తుత బోర్డు మాత్రం దేవస్థానం భూముల అన్యాక్రాంతంపై నోరు మెదపని వారి కోసం వేసినట్లుగా ఉంది. –విజయశంకర్ ఫణీంద్ర, బీజేపీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ -
నిద్రమత్తులో సర్కారు వైద్యం
బీచ్ రోడ్డు: వైద్యరంగంలో స్టాఫ్ నర్సుల పాత్ర ఎంతో విశిష్టమైనది. రోగుల పట్ల కన్నతల్లిలా, తోడబుట్టినవారిలా ప్రేమను చూపిస్తూ, వారిని ఆరోగ్యవంతులుగా మార్చడంలో వైద్యుల కంటే నర్సులే ఎక్కువ సమయం వెచ్చిస్తుంటారు. అయితే అటువంటి పవిత్రమైన వృత్తికి కొందరి నిర్లక్ష్యం మాయని మచ్చగా మారుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలు అందించే క్రమంలో కొంతమంది సిబ్బంది చూపిస్తున్న అలసత్వం సామాన్య ప్రజల పాలిట శాపంగా మారుతోంది. విధి నిర్వహణలో ఉండి కూడా వార్డులను వదిలి గాఢ నిద్రలోకి వెళ్లడం, రోగి బంధువులపై అహంకారంగా ప్రవర్తించడం వంటి ఘటనలు విస్మయానికి గురిచేస్తున్నాయి. నొప్పితో విలవిలలాడినా కరగని మనసు.. ఇందుకు నిదర్శనంగా పెదవాల్తేరులోని ప్రభుత్వ ఛాతి ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఘటన అత్యంత దిగ్భ్రాంతి కలిగిస్తోంది. కడుపునొప్పితో బాధపడుతున్న ఒక బాలికను మెరుగైన చికిత్స కోసం ఇక్కడికి పంపగా, అక్కడ ఆమెకు ఎదురైన అనుభవం వర్ణనాతీతం. గత నెల 27న ఆసుపత్రిలో చేరిన ఆ బాలికకు శనివారం సాయంత్రం నుంచి విపరీతమైన నొప్పి రావడంతో రోగి తల్లి నర్సుల సహాయం కోరింది. అయితే ఆ సమయంలో సేవలు అందించాల్సిన సిబ్బంది కనీస మానవత్వం లేకుండా.. ‘మేము రేపు డ్యూటీకి రావాలా వద్దా’.. అంటూ ఆమెను గద్దించి పంపేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్న రోగి తండ్రి వచ్చి చూసేసరికి అక్కడి సిబ్బంది అందరూ విధులను గాలికి వదిలేసి గాఢ నిద్రలో ఉన్నారు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్లు లేకపోవడం చూస్తుంటే వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ప్రశ్నిస్తే ‘డిశ్చార్జ్’ వేటు.. అంతటితో ఆగకుండా.. బాధితులు ప్రశ్నించినందుకు గానూ ఆసుపత్రి ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు మరింత విచారకరం. ఆ బాలికను అత్యవసర స్థితిలో 108 ద్వారా కేజీహెచ్‌కు తరలించాల్సి వచ్చింది. తీరా అక్కడ నొప్పి తగ్గాక తిరిగి వార్డుకు తీసుకొస్తే, మీకు టీబీ లేదు, మీకు డిశ్చార్జ్ ఇచ్చేసాం.. అంటూ కనికరం లేకుండా బయటకు పంపేశారు. ఆదివారం నాడు ఆ రోగిని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక ఆ కుటుంబం పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. చివరికి ప్రైవేట్ వైద్యుడిని సంప్రదిస్తే అది ‘పేగు టీబీ’ అని తేలడం, ఇక్కడి ప్రభుత్వ వైద్యుల నిర్ధారణలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రశ్నించినందుకు రోగులను ఆసుపత్రి నుంచి వెళ్లగొట్టడం అంటే అది శిక్షించడమే తప్ప చికిత్స అందించడం అనిపించుకోదు. అందుకే ప్రైవేట్‌కు ఆశ్రయం రోగులను అంటురోగస్తులుగా చూస్తూ, ప్రతి చిన్న విషయానికి లంచాలు ఆశిస్తూ, ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించే ఇలాంటి సిబ్బంది వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల ప్రతిష్ట మంటగలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల వల్లే పేద ప్రజలు అప్పులు చేసైనా ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కేవలం తూతూమంత్రపు చర్యలు చేపట్టి వదిలేయడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. ఒక నిండు ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు నిద్రపోతున్న సిబ్బందిపై, అలాగే వారిని వెనకేసుకొస్తున్న ఉన్నతాధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ తండ్రి పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశం.. విచారణ కమిటీ నియామకం ఈ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్, అంతర్గత విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇద్దరు ప్రొఫెసర్లతో కూడిన కమిటీ ఏర్పాటైంది. అయితే ఈ విచారణ నిష్పక్షపాతంగా జరగాలని ప్రజలు కోరుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం సదరు యువతికి మెరుగైన చికిత్స అందించేందుకు మా వైద్య బృందం సిద్ధంగా ఉంది. ఆ రాత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరుపై బాధితులకు క్షమాపణలు తెలిపాం. వారు తిరిగి వస్తే ప్రత్యేక పర్యవేక్షణలో వైద్యం అందిస్తాం. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –డాక్టర్ సునీల్, ఛాతి ఆసుపత్రి సూపరింటిండెంట్ -
అభివృద్ధి పేరుతో భారీ దోపిడీ
మధురవాడ: అభివృద్ధి పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా దోచుకుంటున్నారని వైఎస్సార్సీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనువాసరావు (చిన్న శ్రీను) విమర్శించారు. శుక్రవారం మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు బొట్టవానిపాలెంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యులు పోతిన హనుమంత రావు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. టీడీపీకి చెందిన నమ్మి అప్పలరాజు, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మారికవలస నుంచి కొమ్మాది జంక్షన్, గణేష్‌నగర్ మీదుగా బొట్టవానిపాలెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హనుమంతరావు జన్మదినం సందర్భంగా నాయకులు కేక్ కట్ చేశారు. చిన్న శ్రీను మాట్లాడుతూ.. సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూములను ఆరిలోవలో డేటా సెంటర్ పేరుతో అప్పగించడం దారుణమని, ఆ నరసింహస్వామి ఆగ్రహానికి వారు గురికాక తప్పదని హెచ్చరించారు. ఎంపీ భరత్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ. 5వేల కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూమిని దోచుకున్నారని విమర్శించారు. ‘త్రిశూలం’ పేరుతో రూ. 3 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, దేవుడి పేరుతో కూడా దోపిడీకి వెనుకాడటం లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీలకు, ముఖ్యంగా యాదవులకు అన్ని రంగాల్లో పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందని భీమిలి నియోజకవర్గ పరిశీలకుడు తైనాల విజయ్‌కుమార్ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీలో 50 మంది చేరిక : టీడీపీలో నుంచి వైఎస్సార్సీపీలోకి నమ్మి అప్పలరాజు ఆధ్వర్యంలో 50 మంది చేరారు. ఆయతో పాటు నమ్మి రమణ, నమ్మి నర్శింహులు, ఇయ్యపు రమేష్, పంచదార్ల శివకృష్ణ, బర్ల శ్రీను తదితరు 50మందికి నాయకులు పార్టీ కుండువాలు వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానం పలికారు. వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యులు, 5వ వార్డు అధ్యక్షుడు పోతిన హనుమంతురావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వివిధ విభాగాల నాయకులు వంకాయల మారుతీ ప్రసాద్, ముగడ రమణ, అక్కరమాని రామునాయుడు, పిళ్లా పాపారావు, చేకూరి రజని, జగ్గుపిల్లి నరేష్, తమ్మినేని వరలక్ష్మి, రామా రావు, అప్పన్న, పోతిన మూర్తిబాబు, బంగారు ప్రకాశ్, సూర్యప్రకాశరావు, శేషుబాబు పాల్గొన్నారు. -
తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రతిపాదిత ప్రాజెక్టులపై రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ ఎన్.తేజ్‌భరత్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముందుగా జీవీ ఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన ప్రాజెక్టులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్ మాట్లాడుతూ భీమిలి, అనకాపల్లి ప్రాంతాల్లో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి తక్షణం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గుర్తించిన మురికివాడల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. సముద్ర జలాల ను శుద్ధి చేసి తాగునీటిగా మార్చే డీశాలినేషన్ ప్రాజెక్టుల అమలుపై ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని తెలిపారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా తాగునీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా, పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ అంశాలపైనే ప్రజల నుంచి అధిక ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఆస్తిపన్ను బకాయిల వసూళ్లపై కమిషనర్ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, పి.నల్లనయ్య, జేడీ అమృత్, డి.విజయభారతి, వ్యయ పరిశీలకుడు వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు, ప్రధాన ఇంజనీర్ సత్యనారాయణరాజు, జోనల్ కమిషనర్లు, పర్యవేక్షక ఇంజనీర్లు, వీఎంఆర్డీఏ చీఫ్ ఇంజనీర్ వినయ్‌కుమార్ పాల్గొన్నారు. -
సమష్టిగా ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం..
మహారాణిపేట : పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్య సంరక్షణ కోసం విశాఖ జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం ‘ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్’ అంశంపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాలు, బీచ్‌లు, మార్కెట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు తదితర ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని తగ్గించి వస్త్ర సంచులు, జూట్ బ్యాగులు, పునర్వినియోగ వస్తువుల వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు నిర్వహించి రహదారులు, కాలువలు, చెరువులు, బీచ్ ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ర్యాలీలు, గోడ చిత్రాలు, వీధి నాటకాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. -
ప్రజా సమస్యలు ప్రశ్నిస్తే అక్రమ కేసులా?
మహారాణిపేట: ప్రజా సమస్యలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, యువజన, విద్యార్థి విభాగ నాయకులను టార్గెట్ చేస్తూ పోలీసులు అక్రమ కేసులతో వేధిస్తున్నారని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం కృష్ణ ఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యువత పట్ల చంద్రబాబు ప్రభుత్వం అత్యంత పాశవికంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే, వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వివిధ పోలీస్ స్టేషన్లలో వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కర్నూలులో వైఎస్సార్ సీపీ యువజన విభాగం సిటీ అధ్యక్షుడు బాలును టార్గెట్ చేసి తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న బాలాంజనేయులుపై ఎస్సీ, ఎస్టీ కేసులతో పాటు ఎన్నికల సమయంలో కారులో మద్యం పెట్టి తప్పుడు కేసులు నమోదు చేశారని అన్నారు. ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా టీడీపీ నేతల ఒత్తిళ్లకు లోనై పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసుల నిరంతర వేధింపులను తట్టుకోలేక బాలాంజనేయులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడే పరిస్థితి ఏర్పడిందని కరణం కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లో విశాఖ నేతలకు చోటు
విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీల్లో విశాఖ జిల్లాకు చెందిన పలువురు నేతలను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాంధ్ర జోన్–1 ఆర్టీఐ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జీలకర్ర నాగేంద్ర (గాజువాక), రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా ఎన్నెటి రమణ (గాజువాక), రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ కార్యదర్శిగా పాలకొండ మోహన్‌కృష్ణ (విశాఖ తూర్పు), రాష్ట్ర వలంటీర్ వింగ్ కార్యదర్శిగా సంపంగి ఈశ్వరరావు (గాజువాక)లను నియమించారు. జిల్లా పార్టీ కమిటీ కార్యదర్శిగా గొండేసి నాగిరెడ్డి (గాజువాక), జిల్లా అధికార ప్రతినిధిగా ఆడారి దివ్యకళ (విశాఖ ఉత్తరం)ను ఎంపిక చేశారు. అలాగే జిల్లా యాదవ విభాగం అధ్యక్షుడిగా ఎడ్ల వేణుగోపాల కృష్ణ (విశాఖ తూర్పు), జిల్లా ఆర్టీఐ వింగ్ ఉపాధ్యక్షుడిగా కొసిరెడ్డి గణేష్ (గాజువాక), జిల్లా మైనారిటీ సెల్ కార్యదర్శిగా షేక్ ప్రవీణ్ సుల్తానా (విశాఖ తూర్పు)లను నియమించారు. అదేవిధంగా గాజువాక నియోజకవర్గ ఆర్టీఐ వింగ్ అధ్యక్షుడిగా మామిడి రాము, విశాఖ తూర్పు నియోజకవర్గ వడ్డెర విభాగం అధ్యక్షుడిగా కుంచల చిన్నకొండయ్య, విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయి బ్రాహ్మణ విభాగం అధ్యక్షుడిగా ఎ.సుబ్బారావును నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
జిల్లాపై పడుతున్న అదనపు భారం (ఒక్క రోజులో..)
విశాఖ జిల్లా వ్యాప్తంగా మొత్తం 120 పెట్రోల్ బంకులు (హెచ్‌పీసీఎల్–42, ఐవోసీ–46, బీపీసీ–39) ఉన్నాయి. ఇక్కడ నిత్యం జరిగే ఇంధన వినియోగం, తాజా పెంపు వల్ల ప్రజలపై పడుతున్న రోజువారీ భారం వివరాలు ఇలా ఉన్నాయి: ఇంధన రకం రోజువారీ వినియోగం లీటరుపై పెంపు రోజువారీ అదనపు భారం (కిలో లీటర్లలో) పెట్రోల్ 385 రూ.3.29 రూ. 12,66,650 డీజిల్ 710 రూ.3.25 రూ. 23,07,500 మొత్తం 1,095 –––– రూ. 35,74,150 నెలవారీ భారం: ఈ తాజా పెంపు వల్ల ఒక్క విశాఖ జిల్లా వాహనదారులపైనే నెలకు సుమారు రూ.10.72 కోట్ల అదనపు భారం పడనుంది. -
పాలిటెక్నిక్ లేటరల్ ఎంట్రీ అడ్మిషన్లు
మురళీనగర్: ఎస్బీటీఈటీ ఆధ్వర్యంలో ఐటీఐ బ్రిడ్జ్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులకు డిప్లమా ద్వితీయ సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ అడ్మిషన్లకు జూన్ 10వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ కేవీ రమణ తెలిపారు. కంచరపాలెం, విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్, తిరుపతి ఎస్.వి.ప్రభుత్వ పాలిటెక్నిక్‌లను పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారని చెప్పారు. ఈ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 1 గంట వరకు గణితం, మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు భౌతిక శాస్త్రం, 3.45 నుంచి 5.15 వరకు రసాయన శాస్త్రం పరీక్ష ఉంటుందని చెప్పారు. అర్హులైన అభ్యర్థులు ఎస్బీటీఈటీ వెబ్సైట్లో ఈనెల 30వ దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం
పెదగంట్యాడ : యారాడ తీరంలో గురువారం గల్లంతైన ఇంటర్ విద్యార్థి మృతదేహం శుక్రవారం లభ్యమైంది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దిబ్బపాలెం గ్రామంలో కదిరి అప్పన్న కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇతని కుమారుడు కదిరి వికాస్ (17) గాజువాకలోని ఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితుడు కదిరి భూలోకరాజుతో కలసి సరదాగా గడిపేందుకు గురువారం సాయంత్రం యారాడ తీరానికి వెళ్లాడు. బీచ్‌లో కాసేపు ఉత్సాహంగా గడిపిన తర్వాత స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. కెరటాల ఉధృతికి ఇద్దరు సముద్రంలో కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న కోస్ట్‌గార్డ్స్ గమనించి కాపాడే ప్రయత్నం చేయగా కదిరి భూలోకరాజును పట్టుకుని ఒడ్డుకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో వికాస్ గల్లంతయ్యాడు. దీంతో పోలీసులు సముద్రంలో గాలించగా శుక్రవారం ఉదయం యారడ తీరంలో ఆ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటనపై న్యూపోర్టు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేకే లైన్‌తో కూడిన రైల్వేజోన్ ప్రకటించాలి
సీతంపేట: విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కె.కె. లైన్‌ను చేర్చాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎంపీ శ్రీభరత్ బీచ్ రోడ్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి వినతిపత్రం అందజేయనున్నట్లు ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జె.టి. రామారావు తెలిపారు. శుక్రవారం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ‘కె.కె. లైన్‌తో ఉన్న రైల్వే జోన్ – భవిష్యత్తు కార్యాచరణ’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రధాన ఆస్తులు, ఆదాయ మార్గాలను ఇతర జోన్లకు అప్పగించి విశాఖకు కేవలం పేరు మాత్రమే ఇవ్వడం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కె.కె. లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్ అసంపూర్ణమని, దీని సాధన కోసం పాదయాత్రలు, ర్యాలీలు, ‘చలో ఢిల్లీ’ వంటి కార్యక్రమాలతో దశలవారీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు ఇప్పటికై నా గళమెత్తాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు అడారి కిషోర్ కుమార్, కస్తూరి వెంకట్రావు, గొలగాని రాము, ఎం.ఎల్.ఎన్. పట్నాయక్ , పలు మహిళా, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నగలు కాజేసి..
కొనుగోలుదారుగా వచ్చి.. అల్లిపురం : నగరాన్ని షాక్‌కు గురిచేసిన కౌసల్య జ్యువెలరీ షాప్ చోరీ కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. కొనుగోలుదారుల్లా నటిస్తూ షాపులోకి వచ్చిన ఓ మహిళ, తన సహచరుడితో కలిసి 425 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన సినీ స్టైల్లో చోటుచేసుకుంది. అయితే పోలీసులు కూడా అంతే వేగంగా స్పందించి నిందితులను పట్టుకొని దొంగిలించిన నగలను స్వాధీనం చేసుకున్నారు. ‘కూతురు పెళ్లి’ కథతో నమ్మించి.. వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన ఎం.సుధీందర్ నిర్వహిస్తున్న కౌసల్య జ్యువెలరీ షాప్‌నకు ఈ నెల 12న మధ్యాహ్నం ఒమ్మి మంగమ్మ అలియాస్ మంగా వచ్చింది. ఆమె షాపు యజమానికి పాత పరిచయమే. దీంతో ఎలాంటి అనుమానం రాలేదు. షాపులోకి వచ్చిన మంగా ‘కారులో నా బంధువు ఉన్నాడు. ఆయనకు శారీరక వైకల్యం ఉంది. లోపలికి రాలేడు. మా అమ్మాయి పెళ్లికి నగలు కొనాలి’ అంటూ భావోద్వేగ కథ అల్లింది. పలు రకాల బంగారు ఆభరణాలు చూపించమని కోరింది. కొన్ని డిజైన్లు ఎంపిక చేసిన తర్వాత ‘వాటిని కారులో ఉన్న బంధువుకు చూపించి వస్తాను’ అని చెప్పింది. ఆమైపె నమ్మకం ఉంచిన షాప్ యజమాని రెండు ట్రేల్లో సుమారు 425 గ్రాముల బంగారు ఆభరణాలను ఇచ్చాడు. ఒక్క క్షణంలో ప్లాన్ అమలు నగలు చేతికి అందుకున్న వెంటనే మంగా బయటకు వెళ్లి కారులో కూర్చుంది. అక్కడ ముందే సిద్ధంగా ఉన్న సహచరుడు దేవర రామకృష్ణతో కలిసి క్షణాల్లో అక్కడి నుంచి పరారైంది. ఏమి జరిగిందో అర్థం చేసుకునేలోపే భారీ చోరీ జరిగిపోయింది. షాక్‌కు గురైన షాప్ యజమాని వెంటనే వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు ప్రారంభించారు. అసలు మాస్టర్‌ప్లాన్ ఇదే.. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో త్వరగా డబ్బు సంపాదించాలని భావించిన మంగం తరచూ వెళ్లే జ్యువెలరీ షాప్‌ను టార్గెట్‌గా ఎంచుకుంది. యజమాని నమ్మకాన్ని ఉపయోగించుకోవాలని ముందే నిర్ణయించింది. తన బంధువు రామకృష్ణను దివ్యాంగుడిగా కారులో కూర్చోబెట్టి డ్రామా ఆడింది. కూతురు పెళ్లి పేరుతో యజమాని సానుభూతి పొందింది. చివరకు నమ్మకాన్నే ఆయుధంగా మార్చుకొని భారీ చోరీకి పాల్పడింది. 24 గంటల్లోనే అరెస్ట్ క్రైమ్ డీసీపీ కె.లతామాధురి పర్యవేక్షణలో పోలీసులు సీసీ కెమెరాలు, వాహనాల కదలికలు, పాత పరిచయాల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. చివరకు ఈ నెల 13న మధ్యాహ్నం వీఐపీ రోడ్ డౌన్ సమీపంలోని మాస్క్ జంక్షన్ వద్ద ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 423 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ప్లెజర్ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సినీ తరహాలో జరిగిన ఈ చోరీ కేసును కేవలం 24 గంటల్లో ఛేదించిన విశాఖ నగర పోలీసుల పనితీరుపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
బాంబ్
పెట్రోమహారాణిపేట: గత కొద్దిరోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై భారీ భారాన్ని మోపింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, దేశీయ చమురు సంస్థల ఆర్థిక ఒత్తిడిని సాకుగా చూపుతూ ఇంధన ధరలను భారీగా పెంచేసింది. పెంచిన ధరలు (లీటరు పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.25) శుక్రవారం ఉదయం నుంచే అమలులోకి వచ్చాయి. 2022 ఏప్రిల్ తర్వాత ఇంధన ధరల్లో ఇంత పెద్ద మొత్తంలో మార్పులు రావడం ఇదే తొలిసారి. సార్వత్రిక ఎన్నికల ముందు 2024 మార్చిలో లీటరుకు రూ.2 తగ్గించిన ప్రభుత్వం, తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే మళ్లీ ధరల బాదుడుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. పలు రంగాలపై ‘చమురు’ దెబ్బ పెట్రోల్, డీజిల్ ధరలు ఆమాంతం పెరగడంతో రవాణా రంగం తీవ్ర సంక్షోభంలో పడింది. లారీ యజమానులు ఇప్పటికే రవాణా ఛార్జీలను పెంచేశారు. ఆటో డ్రైవర్లు కూడా ప్రయాణ ధరలను పెంచుతున్నట్లు ప్రకటిస్తున్నారు. రవాణా రంగం: లారీలు, ఆటోల ఛార్జీల పెరుగుదల వల్ల కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. ఆర్టీసీ, మత్స్య రంగం: నిత్యం వేల లీటర్ల డీజిల్ వినియోగించే ఆర్టీసీ బస్సులపై, విశాఖ ఫిషింగ్ హార్బర్లోని బోట్లపై ఈ పెంపు తీవ్ర ప్రభావం చూపనుంది. అంతర్జాతీయ మార్కెట్లో బేరల్ ధరల సాకుతో చమురు సంస్థలు చేతులెత్తేస్తుండటంతో, సామాన్య వినియోగదారులు ఏం చేయాలో పాలుపోక గగ్గోలు పెడుతున్నారు. తాజా ధరల వివరాలు (లీటరుకు) పాత ధర కొత్త ధర పెట్రోల్ రూ.108.45 రూ.111.74 డీజిల్ రూ.96.22 రూ.99.47 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల బహుమతి ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాత ధరలు పెంచడం ప్రజలను వంచించడమే. ఎన్నికల ముందే ఈ భారం వేసి ఉంటే బాగుండేది. ఇంధన ధరల పెంపు ప్రభావం అన్ని రంగాలపై పడి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చేదైన బహుమతి. – సాదదాసు సుధాకర్, ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలి కేంద్ర ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఈ నిర్ణయం వల్ల లీటరుపై మూడు రూపాయలకు పైగా భారం పడటం అన్యాయం. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలి. – మాజీ కన్వీనర్, నూర్ భాషా దూదేకుల ముస్లిం సంక్షేమ సంఘం, విశాఖపట్నం -
‘చంద్రబాబు రూల్స్ పెడతారు.. కానీ ఫాలో అవ్వరు’
సాక్షి, విశాఖపట్నం: ‘‘చంద్రబాబు ఖర్చులు తగ్గించుకొని డబ్బు ఆదా చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు మాటలు నిజమేనని ప్రజలు నమ్మారు. చంద్రబాబు ప్రకటన చేసి 24 గంటలు గడవక ముందే చంద్రబాబు, లోకేష్ వేర్వేరు ప్రత్యేక విమానాల్లో పుట్టపర్తి వెళ్ళారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరగడానికి రెండేళ్లలో రూ.120 కోట్లు ఖర్చు చేశారు. లోకేష్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు రూల్స్ పెడతారు.. కానీ ఫాలో అవరు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దుయ్యబట్టారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు ప్రతి ఒక్కరూ ముగ్గురు నలుగురు పిల్లలను కనాలని చెప్పారు. ఆ సూత్రం లోకేష్‌కు ఎందుకు వర్తింపు చేయలేదు. పబ్లిసిటీ మీద ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారు. చంద్రబాబు రూల్స్ పెట్టి.. అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్నారు. ఢిల్లీలో చంద్రబాబు ఇంటి మరమ్మత్తుల కోసం రూ.6.50 కోట్లు కేటాయించారు. రెండేళ్లలో 3 లక్షల 70 వేల కోట్లు అప్పు ఈ రెండేళ్లలో చంద్రబాబు సాధించారు.టీడీపీ వైఎస్సార్సీపీ బోథ్ ఆర్ నాట్ సేమ్ లోకేష్. వైఎస్సార్సీపీ వైఎస్ ఆశయాల నుంచి పుట్టింది. టీడీపీ వైస్రాయ్ హోటల్ నుంచి పుట్టింది. టీడీపీది బీరు బారు పార్టీ.. వైఎస్సార్సీపీది విద్యా వైద్య విధానం పార్టీ. వైఎస్ జగన్‌ను చూస్తే నరనరాన భయం చంద్రబాబు లోకేష్‌లో కనిపిస్తుంది. చంద్రబాబు ఉత్తరాంధ్ర మొత్తానికి గుండు కొట్టిస్తున్నారు. ఎక్కడ ఏ కొండ కనిపించిన గుండు కొడుతున్నారు. కూటమి భూ అక్రమాలు మీద వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అవసమైతే వైఎస్ జగన్ ఈ పోరాటంలో పాల్గొంటారు. గతంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచితే ఆ భారం ప్రజలు మీద పడకుండా వైఎస్సార్ నిర్ణయం తీసుకున్నారు’’ అని గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. -
అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు
సాక్షి, విశాఖపట్నం: అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు ప్రవేశించాయి. ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 24 గంటల్లో దక్షిణ అండమాన్‌ను రుతు పవనాలు తాకనున్నాయి. 60 శాతం స్టేషన్లలో 2.5 సెంటీమీటర్ల వర్షపాతం ఆధారంగా నైరుతి ఆగమనాన్ని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రుతుపవనాలకు సహకరిస్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఏపీలోని చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.కాగా, భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ఐదు రోజులు ముందే.. అంటే మే 26నే కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇవాళ(శుక్రవారం) ప్రకటించింది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 1న కేరళలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దేశంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలానికి ఇదే ఆరంభం. అంతకుముందు నిన్న (మంగళవారం) వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేస్తూ.. ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి రుతుపవనాల రాకకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని పేర్కొంది.సాధారణంగా మే 20 ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవులను తాకే రుతుపవనాలు, ఆ తర్వాత పశ్చిమ దిశగా భారత ప్రధాన భూభాగం వైపు విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది రుతు పవనాల సీజన్లో భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇందుకు 'ఎల్ నినో పరిస్థితులు ఏర్పడటమే కారణం కావచ్చని పేర్కొంది. ఐఎండీ ప్రకారం... ఈ ఏడాది భారతదేశంలో 80 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. -
యారాడ తీరంలో ఇంటర్ విద్యార్థి గల్లంతు
పెదగంట్యాడ: యారాడ తీరంలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగి ఓ ఇంటర్ విద్యార్థి గల్లంతవ్వగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. న్యూపోర్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిబ్బపాలెం గ్రామానికి చెందిన కదిరి వికాస్ (17) గాజువాకలోని ఓ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో గురువారం సాయంత్రం తన స్నేహితుడు కదిరి భూలోకరాజుతో కలిసి సరదాగా గడిపేందుకు యారాడ బీచ్‌కు వెళ్లాడు. బీచ్‌లో కాసేపు గడిపిన అనంతరం ఇద్దరూ స్నానం కోసం సముద్రంలోకి దిగారు. అయితే కెరటాల ఉధృతికి ఇద్దరూ లోపలికి కొట్టుకుపోతుండగా, అక్కడే ఉన్న కోస్ట్‌గార్డ్ సిబ్బంది గమనించి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. భూలోకరాజును చాకచక్యంగా కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. వికాష్‌ను రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అలల తాకిడికి వికాస్ సముద్రంలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న న్యూపోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాణాలతో బయటపడిన భూలోకరాజును చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. తండ్రి అప్పన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. -
ఇంధన భద్రతే దేశాభివృద్ధికి కీలకం
ఐఐపీఈ స్నాతకోత్సవంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్ సబ్బవరం : దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ధి, సాంకేతిక స్వావలంబన అత్యంత కీలకమని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సరస్వత్ పేర్కొన్నారు. సబ్బవరం మండలంలోని వంగలి వద్ద గల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) శాశ్వత ప్రాంగణంలో గురువారం నిర్వహించిన ఆరో వార్షిక స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, ఎనర్జీ స్టోరేజ్ వంటి అత్యాధునిక సాంకేతిక రంగాల్లో భారత్ ప్రస్తుతం వేగంగా ముందుకు సాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, ఆవిష్కరణాత్మక దృక్పథంతో దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షుడు ఆచార్య పీకే బానిక్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో మొత్తం 114 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. వీరిలో 92 మంది బీటెక్ విద్యార్థులు, 15 మంది ఎంఎస్సీ అప్లైడ్ జియాలజీ విద్యార్థులతో పాటు ఇద్దరు పీహెచ్డీ పరిశోధకులు ఉన్నారు. విద్యలో సమగ్ర ప్రతిభ కనబరిచిన అన్సుల్ చటర్జీకి అత్యున్నతమైన ‘ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్’ను అందజేశారు. అలాగే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్‌లో అమితన్షు దాస్ బంగారు పతకాన్ని, అనుపమ్ ఆనంద్ వెండి పతకాన్ని అందుకోగా, పెట్రోలియం ఇంజనీరింగ్ విభాగంలో హర్షకుమార్ అభిజిత్ స్వర్ణ పతకాన్ని, సోహమ్ ముఖర్జీ రజత పతకాన్ని కై వసం చేసుకున్నారు. ఎంఎస్సీ అప్లైడ్ జియాలజీలో అమర్దీప్ ప్రసాద్, దేవదత్త సెంగుప్తా వరుసగా బంగారు, వెండి పతకాలను స్వీకరించారు. సంస్థ డైరెక్టర్ ఆచార్య శాలివాహన్ మాట్లాడుతూ ఐఐపీఈకి కేటాయించిన శాశ్వత ప్రాంగణంలో తొలిసారిగా స్నాతకోత్సవం నిర్వహించడం తమకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రామ్ ఫల్ ద్వివేది, బోర్డు సభ్యులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వికెట్ కీపర్లకు కిరణ్ మోరే శిక్షణ
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో ఔత్సాహిక వికెట్ కీపర్ల కోసం నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే కీలక మెళకువలు నేర్పారు. గురువారం విజయనగరంలోని నార్త్ జోన్ క్రికెట్ అకాడమీలో జరిగిన ఈ సెషన్లో అండర్–16, 19, 23 విభాగాలతో పాటు సీనియర్ మెన్ జట్టు కీపర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోరే తన సుదీర్ఘ అనుభవాన్ని కీపర్లతో పంచుకుంటూ, వారి నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలో మార్గదర్శనం చేశారు. సీనియర్ కీపర్లు రికీ బుయ్, గిరినాథ్, రేవంత్ సహా వివిధ విభాగాలకు చెందిన లోహిత్, హేమంత్, రిషికుమార్ వంటి క్రీడాకారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ.. ఆంధ్ర క్రికెటర్ల భవిష్యత్తుకు పునాది వేసేలా ఈ శిబిరాన్ని నిర్వహించినందుకు కిరణ్ మోరేను అభినందించారు. -
నీలి సంద్రం.. గాల్లో విహారం
ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ బీచ్ ప్రస్తుతం సాహస క్రీడలకు నెలవుగా మారింది. ఇక్కడ కొత్తగా అందుబాటులోకి వచ్చిన పారాగ్లైడింగ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నీలిరంగు సముద్రపు అలలపై గాలిలో తేలుతూ, విహంగ వీక్షణంగా తీర ప్రాంత అందాలను ఆస్వాదించడం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తోంది. నిపుణులైన పైలట్ల పర్యవేక్షణలో సాగుతున్న ఈ పారాగ్లైడింగ్, అటు స్థానికులను ఇటు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆకాశం నుంచి సాగర తీరాన్ని చూస్తూ ప్రకృతి ఒడిలో విహరిస్తున్న పర్యాటకులు ఈ అనుభవాన్ని మరుపురాని జ్ఞాపకంగా అభివర్ణిస్తున్నారు. –ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
పెదగంట్యాడ: క్రేన్ డ్రైవర్ బాధ్యతారాహిత్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక నిరుపేద కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. రోడ్డు పక్కన బైక్ ఆపి ఫోన్ మాట్లాడుకుంటున్న వ్యక్తిని గమనించకుండా, ప్రాణాల పట్ల కనీస విచక్షణ లేకుండా క్రేన్‌తో తొక్కించి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గంగవరం గ్రామానికి చెందిన కంబాల మాధవరావు (45) బుధవారం రాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడంతో, ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ ముట్టడికి దిగారు. గురువారం ఉదయం నుంచే కంపెనీ గేటు ముందు భైఠాయించిన బాధితులు, న్యాయం చేయాలంటూ హోరెత్తించిన నినాదాలతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. ఈ ప్రమాదం జరిగిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. మృతుడి కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని, భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు మృతదేహాన్ని రోడ్డుపైనే ఉంచి ఆందోళన చేపట్టారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో న్యూపోర్టు పోలీసులు రంగ ప్రవేశం చేసి బందోబస్తు నిర్వహించారు. వైఎస్సార్సీపీ 64వ వార్డు అధ్యక్షుడు ధర్మాల శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు, బాధితులు కలిసి శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. అయితే యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ లభించడంతో చర్చలు ఫలించాయి. న్యూపోర్టు పోలీసుల చొరవతో బాధితులు తమ ఆందోళనను విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. నిబంధనలు బేఖాతరు గంగవరం రోడ్డులో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉన్నప్పటికీ, శ్రావణ్ కంపెనీ నిబంధనలను బేఖాతరు చేస్తూ మృత్యుశకటాలను నడుపుతోంది. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పోలీసులు, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ రహదారిపై భారీ వాహనాల కారణంగా ఇప్పటివరకు ఏడుగురు వ్యక్తులతో పాటు నాలుగు పశువులు ప్రాణాలు కోల్పోవడం ఇక్కడి ప్రమాదకర స్థితికి అద్దం పడుతోంది. తమకు న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, రోడ్డుపైనే టెంట్ వేసి వాహనాల రాకపోకలను అడ్డుకోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు శ్రావణ్ షిప్పింగ్ కంపెనీకి ప్రాణాలంటే కనీస గౌరవం లేదు. పగలు, రాత్రి తేడా లేకుండా అతివేగంతో భారీ వాహనాలను నడుపుతూ మృత్యుఘంటలు మోగిస్తున్నారు. ఇప్పటికే ఈ వాహనాల వల్ల ఏడుగురు వ్యక్తులు, నాలుగు ఆవులు బలైపోయాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. పోలీసులు వెంటనే స్పందించి ఈ రోడ్డుపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించాలి. లేనిపక్షంలో కంపెనీకి నిప్పు పెట్టడానికై నా వెనకాడం. – బడి సోములమ్మ, గంగవరం నిర్లక్ష్యం వీడాలి గంగవరం, యారాడ ప్రాంతాలకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. సరిగ్గా అదే సమయంలో శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ భారీ వాహనాలు అతివేగంగా, బాధ్యతారాహిత్యంగా దూసుకొస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. గతంలో ఎన్నో ఘోరాలు జరిగినా, ఎందరో ప్రాణాలు కోల్పోయినా ఈ వాహనాలను అదుపు చేయకపోవడం శోచనీయం. ఇప్పటికై నా పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. –పేర్ల నల్లయ్య, గంగవరం -
భవనంపై నుంచి పడి తాపీ మేసీ్త్ర మృతి
పీఎం పాలెం: భవన నిర్మాణ పనుల కోసం నగరానికి వచ్చిన ఓ తాపీ మేసీ్త్ర ప్రమాదవశాత్తు పై అంతస్తు నుంచి కింద పడి మృతి చెందిన విషాద ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పీఎం పాలెం సీఐ జి. బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మానికి చెందిన ఉంకుల రాము (47) క్రికెట్ స్టేడియం సమీపంలోని ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. పగలు పని ముగించుకుని రాత్రి అదే భవనం నాలుగో అంతస్తులో తోటి కార్మికులతో కలిసి నిద్రించాడు. తెల్లవారుజామున రాము కనిపించకపోవడంతో తోటి వారు వెతకగా, భవనం ప్రహరీ అవతల శవమై కనిపించాడు. రాత్రి సమయంలో నిద్రమత్తులో భవనం అంచుకు వెళ్లినప్పుడు రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదవశాత్తు కింద పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు యుగంధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. -
హత్య కేసులో ఇద్దరు అరెస్టు
పీఎం పాలెం: సుమారు రెండు నెలల క్రితం జరిగిన ఓ హత్య కేసు మిస్టరీని పీఎం పాలెం పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పీఎం పాలెం సీఐ జి. బాలకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ ఆరో వార్డు పరిధిలోని బక్కన్నపాలెం ప్రాంతంలో గల ఎంవీవీ కన్స్ట్రక్షన్స్ వద్ద పనిచేసే కార్మికుల మధ్య జరిగిన ఘర్షణే ఈ హత్యకు దారితీసింది. జార్ఖండ్‌కు చెందిన సికందర్ కుమార్ అనే భవన నిర్మాణ కార్మికుడికి మద్యపానం వ్యసనం ఉంది. నిత్యం మద్యం సేవించి తోటి కార్మికులను అసభ్య పదజాలంతో దూషించడం, వారిపై దౌర్జన్యం చేయడం వంటి పనులతో అందరికీ తలనొప్పిగా మారాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 14న సికందర్ కుమార్ పనికి వెళ్లకుండా ఇతర కార్మికులతో గొడవకు దిగాడు. అతడిని పనికి తీసుకువచ్చిన సూపర్ వైజర్లు, జార్ఖండ్ రాష్ట్రానికే చెందిన శ్యామ్‌ప్రకాష్ సింగ్, అన్సారీలు అతడిని మందలించారు. అయితే.. సికందర్ వారిపైనే ఎదురుదాడికి దిగడంతో వాగ్వాదం కాస్తా పెను ఘర్షణగా మారింది.దీంతో కోపోద్రిక్తులైన శ్యామ్‌ప్రకాష్ సింగ్, అన్సారీలు సికందర్‌పై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న అతడిని సమీపంలోని తుప్పల్లో పడేసి వెళ్లిపోయారు. కొంత సమయం తర్వాత వచ్చి చూడగా సికందర్ మృతిచెందినట్టు గుర్తించారు. ఈ విషయం బయటకు తెలిస్తే హత్యానేరం తమపై పడుతుందన్న భయంతో నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారై తమ సొంత రాష్ట్రమైన జార్ఖండ్‌లో తలదాచుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనను హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ అధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితుల సెల్ ఫోన్ డేటా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారు జార్ఖండ్‌లో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారు. గురువారం వారిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం నిందితులకు రిమాండ్ విధించింది. కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. -
ఏయూ ఇంజనీరింగ్!
‘చినబాబు’ చేతికి అమరావతి నుంచే టెండర్ల ‘రింగ్’.. అంతా గంపగుత్తగా అప్పగింత!గతంలోనూ ఇదే తరహా దోపిడీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో (2014–2019) కూడా ఇదే తరహాలో ఏయూ ఇంజనీరింగ్ విభాగాన్ని పక్కనబెట్టి దోపిడీకి తెరలేపారు. అప్పట్లో వర్సిటీ పనులన్నింటినీ ఏపీఈడబ్ల్యూఐడీసీ ద్వారానే టెండర్లు పిలిచారు. ఆ సమయంలో కాంట్రాక్ట్ సంస్థలు సిండికేట్‌గా ఏర్పడి, అంచనా విలువల కంటే 6 నుంచి 8 శాతం అదనపు ధరలను కోట్ చేసి పనులు దక్కించుకున్నాయి. దీనికి తోడు, ఈ టెండర్ల వ్యవహారాన్ని పర్యవేక్షించినందుకు గానూ ఏపీఈడబ్ల్యూఐడీసీ సంస్థకు ఏయూ అదనంగా 6 శాతం కన్సల్టెన్సీ ఫీజు చెల్లించాల్సి వచ్చింది. అంటే అప్పట్లోనే వర్సిటీపై 12 నుంచి 14 శాతం అదనపు భారం పడింది. సాధారణంగా ఏయూ ఇంజనీరింగ్ విభాగం నేరుగా టెండర్లు పిలిస్తే.. పోటీ కారణంగా కాంట్రాక్టర్లు ప్రస్తుతం ఉన్న టెండర్ ధర కంటే కనీసం 4 శాతం తక్కువ ధరకే పనులు దక్కించుకుంటారు. కానీ ఏపీఈడబ్ల్యూఐడీసీ మార్గంలో వెళ్లడం వల్ల ఆ 4 శాతం ఆదా కాకపోగా, అదనపు ఖర్చులన్నీ కలిపి ఏయూ ఖజానాపై ఏకంగా 16 నుంచి 18 శాతం వరకు అదనపు భారం పడుతుందని వర్సిటీ అధికారులు లెక్కలతో సహా గుర్తుచేస్తున్నారు. ఈ సంస్థ ద్వారా పిలిచే టెండర్లలో కొద్దిమంది మాత్రమే ‘రింగ్’గా ఏర్పడి పనులు దక్కించుకుంటారని, ఫలితంగా పనులన్నీ నాసిరకంగా మారుతాయనే ఆరోపణలు ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఇప్పటికే అమరావతి కోసం ఆంధ్రా యూనివర్సిటీ నుంచి రూ.300 కోట్ల నిధులను మళ్లించిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా వర్సిటీ స్వయంప్రతిపత్తిని, దాని ఇంజనీరింగ్ విభాగాన్ని దెబ్బతీసేందుకు వ్యూహం రచించింది. వర్సిటీలో జరిగే అభివృద్ధి, నిర్మాణ పనులన్నింటినీ అమరావతి నుంచే పర్యవేక్షించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా బ్రిటీష్ కాలం నాటి ఘనచరిత్ర కలిగిన ఏయూ సొంత ఇంజనీరింగ్ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, సుప్తచేతనావస్థలోకి నెట్టేసేందుకు పావులు కదుపుతోంది. ఇకపై ఏయూలో చేపట్టబోయే పనులన్నింటికీ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఈడబ్ల్యూఐడీసీ) ద్వారానే టెండర్లు పిలిచి, పనులను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే, వర్సిటీ పనులన్నీ ఇకపై ‘చినబాబు’ చేతుల్లోకి వెళ్లనున్నాయన్నమాట. కేంద్రీకృత పద్ధతిలో అమరావతి నుంచే టెండర్లను ఆహ్వానించి, తమకు కావాల్సిన వారికి పనులు దక్కేలా ‘రింగ్’ తిప్పేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనులు ఎవరికి దక్కాలో ముందే నిర్ణయించి, అమరావతి నుంచే చక్రం తిప్పేందుకే సొంత విభాగానికి తాళం వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఏపీఈడబ్ల్యూఐడీసీకి పనుల అప్పగింతపై తీవ్ర విమర్శలు సొంత ఇంజనీరింగ్ విభాగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర? టెండర్ల పేరుతో ఏయూపై 16–18 శాతం అదనపు భారం! గతంలోనూ నాసిరకం పనులపై వీసీ లేఖ రాసినా ఫలితం శూన్యం ప్రభుత్వ తాజా నిర్ణయంతో స్థానిక సబ్–కాంట్రాక్టర్లు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏపీఈడబ్ల్యూఐడీసీ నిబంధనలన్నీ కేవలం పెద్ద కార్పొరేట్ సంస్థలకే లాభం చేకూర్చేలా.. వారు ‘రింగ్’ అయ్యేందుకే అనుకూలంగా మారుస్తారనే విమర్శలు ఉన్నాయి. వర్సిటీలో ఉండే చిన్న చిన్న పనులను కూడా విడివిడిగా కాకుండా, అన్నింటినీ కలిపి ఒకే పెద్ద ‘గంపగుత్త’ (ప్యాకేజీ) టెండరుగా మార్చే ప్రమాదం ఉందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కాంట్రాక్టర్లకు పనులు దక్కే అవకాశం పూర్తిగా మూసుకుపోతుంది. ఒకవైపు గీతం కోసం ఏయూకి చెందిన ప్రతిష్టాత్మక దూరవిద్య, డిఫెన్స్ కోర్సులను భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు వర్సిటీ ఖజానాను ఖాళీ చేస్తూ.. ఇప్పుడు ఏకంగా నిర్మాణ పనుల టెండర్లను కూడా అమరావతి నుంచే నియంత్రించేందుకు సిద్ధమవుతుండడంపై వర్సిటీ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ‘పనులన్నీ నాసిరకమే’ అంటూ వీసీ లేఖ గతంలో ఏపీఈడబ్ల్యూఐడీసీ వ్యవహారం ఎంత దారుణంగా సాగిందంటే.. నాటి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు 2016లోనే దీనిపై ప్రభుత్వానికి బహిరంగంగానే లేఖ రాశారు. ఏపీఈడబ్ల్యూఐడీసీకి అప్పగించిన పనులేవీ సకాలంలో పూర్తి కావడం లేదని, పైగా పనులన్నీ అత్యంత నాసిరకంగా ఉన్నాయని ఆయన ఆ లేఖలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కన్సల్టెన్సీ ఫీజు కింద వర్సిటీ 6 శాతం అదనపు సొమ్ము చెల్లించి నష్టపోతోందని, కాబట్టి ఏయూ సొంత ఇంజనీరింగ్ విభాగం ద్వారానే పనులు చేసుకునేందుకు అనుమతించాలని కోరారు. కానీ, నాటి ప్రభుత్వ పెద్దలు ఆ లేఖను బుట్టదాఖలు చేశారు. ఇప్పుడు కూడా అదే పాత దోపిడీ ఫార్ములాను అమలు చేస్తూ, వర్సిటీ హక్కులను కాలరాసేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. -
చెత్తలో జీవనం..చిరునవ్వులో ఆత్మగౌరవం
మురికి కూపాల్లోనూ ఆత్మవిశ్వాసం వెతుక్కునే ఒక శ్రమజీవి కథ ఇది. ప్రజలు పనికిరావని పారేసిన ప్లాస్టిక్ వ్యర్థాలే ఈయనకు జీవనాధారం. ఆ భుజాన ఉన్న మూటలో కేవలం ప్లాస్టిక్ సీసాలు మాత్రమే లేవు, రేపటి పూట ఆకలి తీరుతుందన్న ఆశలు కూడా ఉన్నాయి. నెత్తిన మోస్తున్న బరువు శరీరాన్ని కుంగదీస్తున్నా, ఆయన ముఖంలోని ఆ చిరునవ్వు పేదరికాన్ని గెలిచిన ధీరత్వాన్ని చాటుతోంది. నగర వీధులను శుభ్రం చేస్తూ, పర్యావరణానికి మేలు చేస్తున్న ఈ అదృశ్య యోధుడికి తన శ్రమ తప్ప మరే పెట్టుబడీ లేదు. ఆ మూటలో మోస్తున్నది చెత్తను కాదు, తన కుటుంబ భవిష్యత్తును. –ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
మహిళ దారుణ హత్య
తాటిచెట్లపాలెం: నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అక్కయ్యపాలెం, శ్రీనివాసనగర్‌లోని పీఆర్కే నాగ్ ఆనంద్ హైట్స్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న పార్వతి (53)ని దుండగులు హతమార్చారు. మృతురాలి భర్త దొండపర్తిలో పాన్‌షాప్ నిర్వహిస్తుండగా, ఆయన గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తన దుకాణానికి వెళ్లాడు. తిరిగి రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి చేరుకునేసరికి పార్వతి విగతజీవిగా పడి ఉండటం చూసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకున్న దుండగులు లోపలికి ప్రవేశించి, కాళ్లు చేతులు బంధించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న మంగళసూత్రం, నల్లపూసల తాడు, చెవి రింగులు, చేతి గాజులను దోచుకుని అక్కడ నుంచి పరారయ్యారు. నేరం జరిగిన ప్రదేశంలో క్లూస్ దొరకకుండా ఉండేందుకు దుండగులు కారంపొడి చల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలి మెడపై గాయాలు ఉండటాన్ని బట్టి, నిందితులతో ఆమె తీవ్రంగా పెనుగులాడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు పార్వతి సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో తన పిల్లలతో ఫోన్లో మాట్లాడినట్లు స్థానికులు తెలిపారు. దీనిని బట్టి ఆ తర్వాతే ఈ హత్య జరిగి ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న ఫోర్త్‌టౌన్ క్రైం పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి. క్రైం డీసీపీ, ఏసీపీలతో పాటు లా అండ్ ఆర్డర్ ఏసీపీలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. -
పెళ్లింట పెను విషాదం
అగనంపూడి: పెళ్లి ముచ్చట్లు తీరకముందే.. నూరేళ్ల బంధానికి పునాది పడకముందే నవవధువు అనంత లోకాలకు చేరుకుంది. భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ పుట్టింటికి వస్తున్న తరుణంలో.. మృత్యువు కారు రూపంలో ఆమెను కబలించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లికుమార్తె తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ హృదయవిదారక ఘటన అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో గురువారం జరిగింది. పరవాడ మండలం వాడచీపురుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఈరుగుల సన్యాసమ్మ కుమారుడు నరసింగరావు (43) వాడచీపురుపల్లి పంచాయతీలో క్లాప్ వ్యాన్ డ్రైవర్. ఆయనకు అగనంపూడి నిర్వాసితకాలనీ కొండయ్యవలసకు చెందిన నడుపూరు పెంటారావు, కనకమహాలక్ష్మిల కుమార్తె రామేశ్వరి (31)తో బుధవారం రాత్రి వివాహం జరిగింది. తిరుగుమరుగుళ్లలో భాగంగా గురువారం సాయంత్రం 3.30 గంటల సమయంలో నవ వధువు రామేశ్వరి ఇంటికి వెళ్లేందుకు ఆమె భర్త నరసింగరావు, ఆమె తల్లి కనకమహాలక్ష్మి, సోదరి కలిసి కారులో వాడచీపురుపల్లి నుంచి అగనంపూడికి బయల్దేరారు. ఆ కారును నర్సింగరావే నడుపుతున్నాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరిపోతారనుకున్న సమయంలో అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న నరసింగరావుకు కళ్లు మూతలు పడడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వీధిలైట్ల స్తంభాన్ని ఢీకొట్టింది. కారు ముందు సీట్లో కూర్చున్న వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తల్లి కనకమహాలక్ష్మి తీవ్ర గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతుంది. సోదరి వరలక్ష్మి, నర్సింగరావు కూడా గాయపడ్డారు. రామేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్నీరు మున్నీరవుతున్న బంధువులు అత్తారింట్లో అడుగుపెట్టి ఆనందంగా ఉండాల్సిన వధువు ప్రమాదంలో తీరనిలోకాలకు చేరుకోవడంతో ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. పెళ్లి వేడుక ముగిసి 24 గంటలు కూడా కాకముందే పెళ్లికూతురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు సైతం కన్నీరు మున్నీరవుతున్నారు. -
ఖాకీలుబొమ్మలేనా!
ఉమ్మడి జిల్లాలోని పోలీసుల అత్యుత్సాహమో... అధికారపార్టీ నేతల నుంచి వచ్చే ఒత్తిళ్ల వల్లనో... పూర్తిగా విచారణ చేయకుండానే జరిగిన సంఘటనలపై నిర్ధారణకు వచ్చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా కేసులను కూడా అదే తరహాలో నమోదు చేస్తున్నారు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసుల వ్యవహారశైలితో బాధిత కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఇటీవల సంచలనం సృష్టించిన గాజువాకలో జరిగిన మౌనిక హత్య కేసులో ఏకపక్షంగా హంతకుడు నేవీ అధికారి చింతాడ రవీంద్ర చెప్పిన విషయాన్నే యథాతథంగా అదే వివరాలను పోలీసులు వెంటనే ప్రకటించారు. విచారణలో మాత్రం హత్య వేరే ప్రాంతంలో జరిగినట్టు గుర్తించారు. ఈ ఘటనలో విశాఖ పోలీసులు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ ఘటన మరువకముందే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగిన ఒక వ్యక్తి మరణంపై యాక్సిడెంట్ అంటూ స్థానిక పోలీసులు ప్రకటించడం అనుమానాలకు దారి తీసింది. కనీసం పోస్టుమార్టం నివేదిక ఇంకా అందకముందే ఎందుకు అంత త్వరగా పోలీసులు ప్రకటనలు గుప్పించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామ సమీపంలో యువకుడు లాలం సాయికుమార్ అనుమానాస్పద మృతిపై యాక్సిడెంట్ అంటూ పోలీసులు ప్రకటించడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో అటు మౌనిక, ఇటు సాయికుమార్ హత్య, అనుమానాస్పద మృతిపై సదరు బాధిత కుటుంబ సభ్యులు విచారణ చేయాలంటూ ఇటు పోలీసు కమిషనర్‌ను, అటు అనకాపల్లి జిల్లా ఎస్పీని కలిసి విన్నవించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే పోలీసులు ఈ విధంగా హడావుడిగా జరిగిన సంఘటనలపై ప్రకటనలు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అది యాక్సిడెంట్ కాదు...! ఇప్పటికే గాజువాకలో జరిగిన మౌనిక హత్య కేసులో మరోసారి విచారించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నా నిందితుడు చెప్పిన వివరాలనే పోలీసులు ఎలా చెబుతారంటూ మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పోలీసులు లోతుగా విచారణ జరపకుండానే వివరాలను పత్రికా ముఖంగా బహిరంగంగా ప్రకటించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా విచారణ జరిపించాలని కుటుంబ సభ్యులు కలెక్టర్‌తో పాటు పోలీసు కమిషనర్‌ను కలిసి విజ్ఞప్తి చేశా రు. ఈ పరిస్థితుల్లో తాజాగా అనకాపల్లి జిల్లాలో నూ ఇదే తరహా సంఘటన జరగడం పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి నర్సీపట్నం మండలం గబ్బాడ గ్రామ సమీపంలోని నెల్లిమెట్ల వద్ద ఈ నెల 9వ తేదీన లాలం సాయికుమార్ (30) అనే యువకుడు అనుమానాస్పదంగా మరణించాడు. బైక్‌పై నర్సీపట్నం వెళుతుండగా యాక్సిడెంట్ జరిగిందంటూ పోలీసులు ప్రకటించారు. అయితే, సంఘటన జరిగిన ప్రదేశాన్ని గమనించిన కుటుంబ సభ్యులు మాత్రం మృతి అనుమానాస్పదంగా ఉందని అంటున్నారు. యాక్సిడెంట్ జరిగినట్టుగా పోలీసులు చెబుతున్నా, పరిసరాలను గమనిస్తే హత్యే కావొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అనకాపల్లి జిల్లా ఎస్పీని కలిసేందుకు గురువారం కార్యాలయానికి వచ్చి విచారణ చేయాలంటూ విన్నవించారు. అయితే, ఎస్పీని కలిసేందుకు సైతం కార్యాలయంలోనికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఉదయం 11 గంటల నుంచి సాయంతం 5 గంటల వరకూ వారు వేచి ఉండాల్సి వచ్చింది. సాయంత్రం 5.15 గంటల సమయంలో ఎస్పీ తుహిన్ సిన్హా కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా మృతుడి భార్య లాలం రాజ్యలక్ష్మి తమ గోడును వినిపించుకుంది. దీంతో ఆయన స్పందించి కేసులో పూర్తి విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణికి ఈ కేసు విచారణ బాధ్యతలు అప్పగించారు.హత్య చేసి యాక్సిడెంట్ అంటున్నారు...! తన భర్త లాలం సాయికుమార్‌ను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారంటూ మృతుడు లాలం సాయికుమార్ భార్య రాజ్యలక్ష్మి వాపోతున్నారు. మా కుటుంబానికి న్యాయం చేయాలని గురువారం అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హాను కలిసి విన్నవించారు. రోలుగుంట మండలం బుచ్చింపేట గ్రామంలో ఈనెల 9వ తేదీన తన భర్త లాలం సాయికుమార్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పథకం ప్రకారం హత్యచేశారనేది ఆమె ఆరోపణ. సంఘటన జరిగి నాలుగు రోజులైనప్పటికీ పోస్టుమార్టం నివేదిక ఎందుకు రాలేదని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. సంఘటన జరిగిన తర్వాత పోలీసులు ఒక్కోసారి ఒక విధంగా తమకు సమాచారం ఇచ్చారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పోలీసులు వ్యవహారశైలి మరోసారి ఉమ్మడి విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అత్యుత్సాహమా!.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లా? పూర్తిగా విచారణ చేయకుండానే కేసుల నిర్ధారణ బాధిత కుటుంబాల నుంచి విమర్శలు మళ్లీ విచారణ చేయాలంటూ నివేదనలు గతంలో గాజువాకలో మౌనిక ఇప్పుడు నర్సీపట్నంలో లాలం సాయి మృతిపై అదే తీరు నా భర్తను హత్య చేశారు ఈ నెల 9న ఉదయం 11 గంటలకు నా భర్త లాలం సాయికుమార్‌కు గాలి రాజేష్, సుర్ల సతీష్ ఫోన్ చేసి రమ్మన్నారు. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి మాకిరెడ్డి నానాజీతో కలిసి మద్యం సేవించారు. అదేరోజు సుమారుగా సాయంత్రం 5.30 సమయంలో నా భర్త లాలం సాయికుమార్ మృతిచెందినట్టు తమకు పోలీసులు నుంచి ఫోన్ వచ్చింది. ఎలా మృతి చెందాడని అడగగా..బైక్‌ను కారు ఢీ కొట్టిందని ఒకసారి, బైక్ చెట్టును ఢీ కొట్టిందని మరోసారి, మూడోసారి సెల్ఫ్ యాక్సిడెంట్ అయిందని పొంతన లేని సమాధానం చెప్పారు. నా భర్త ఎలా మృతిచెందాడో పూర్తి సమాచారం ఇవ్వాలని ఎస్పీకి వినతిపత్రం అందజేశాను. – రాజ్యలక్ష్మి, మృతుడు సాయికుమార్ భార్య మృతికి కారణాలను వెలికితీయాలి నా మేనల్లుడు ఎలా మృతిచెందాడో ఇప్పటికీ అనుమానంగానే ఉంది. యాక్సిడెంట్ జరిగితే మృతుడి శరీరంపై గాయాలు ఉంటాయి, కానీ ఎక్కడా గాయాలు కనిపించలేదు. కాలిపై మాత్రమే చిన్న రక్కులా ఉంది. ఈ విషయంపై ఎస్పీ తుహిన్ సిన్హాకు లిఖిత పూర్వకంగా వినతిప్రతం అందజేశాం. మూడు రోజుల్లో కేసును ఛేదించడం జరుగుతుందని చెప్పారు. –నాగరాజు, మృతుడి మేనమామ, బుచ్చింపేట గ్రామం -
భరోసా లేక అప్పులు
వేట లేక పస్తులు..మహారాణిపేట: సముద్రపు అలలనే ఊపిరిగా మల్చుకుని, గంగమ్మ తల్లి ఒడిలో వేట సాగిస్తూ జీవించే గంగపుత్రుల బతుకు నేడు అల్లకల్లోలమవుతోంది. వేట సాగితేనే కడుపు నిండే మత్స్యకారులకు, ఏటా వచ్చే 61 రోజుల వేట నిషేధ కాలం ఒక అగ్నిపరీక్షలా మారింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు సముద్ర సంపద సంరక్షణ కోసం ప్రభుత్వం విధించే ఈ ఆంక్షల వల్ల వేలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ‘మత్స్యకార భరోసా’ రూపంలో అందిన సాయం ఈ సంధి కాలంలో వారికి కొండంత అండగా నిలిచేది. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలులో జాప్యం చేయడం, నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టడం మత్స్యకార గ్రామాల్లో పెను ఆందోళనకు దారితీస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధి గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2019 నుంచి 2023 వరకు క్రమం తప్పకుండా ప్రతి ఏటా వేట నిషేధ కాలంలోనే, అంటే జూన్ 15 లోపు మత్స్యకారుల ఖాతాల్లో రూ.10 వేలు భృతిని జమ చేసేవారు. జిల్లా వ్యాప్తంగా 2019లో 18,925 మంది, 2020లో 20,273 మంది, 2021లో 11,193 మంది, 2022లో11,389 మంది, 2023లో 12,173 మందికి లబ్ధి చేకూరింది. 2024లో ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ఈ సాయాన్ని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం గతేడాది పట్టించుకోలేదు. గతేడాది 12,138 మందికి ఈ భరోసా అందినా, ఈ ఏడాది మాత్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది 13,597 మందితో అర్హుల జాబితాను సిద్ధం చేసి సచివాలయాల్లో ప్రదర్శించినట్లు అధికారులు చెబుతున్నా, నేటికీ నిధుల మంజూరుపై స్పష్టత లేకపోవడం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు జిల్లాలోని 32 కిలోమీటర్ల తీర ప్రాంతం, 15 మత్స్యకార గ్రామాలు, 30 ఫిష్ లాండింగ్ కేంద్రాలపై ఆధారపడి జీవించే వేలాది మందికి ఇప్పుడు పూట గడవడం కష్టంగా మారింది. జిల్లాలో ఉన్న 668 మరపడవలు, 1272 మోటారు బోట్లు, 428 సాంప్రదాయ తెప్పలకు ఈ పథకం వర్తిస్తుంది. అయితే ప్రభుత్వం విధిస్తున్న కఠిన నిబంధనలు మత్స్యకారుల పాలిట శాపంగా మారుతున్నాయి. కుటుంబంలో ఒక్కరికే భృతి పరిమితం చేయడం, విద్యుత్ బిల్లు నెలకు 300 యూనిట్లు దాటితే పథకం కట్ చేయడం, బోట్లకు రిజిస్ట్రేషన్ లేదన్న వంకతో అర్హులను పక్కన పెట్టడం వంటి చర్యలు వారిని మరింత కుంగదీస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో తండ్రికి భరోసా ఇస్తే కుమారులకు నిరాకరించడం వల్ల అనేక కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అప్పుల్లో కూరుకుపోయిన మత్స్యకారులు వేట ఆగి నెల రోజులు దాటిపోవడంతో, అప్పటివరకు వేటాడి తెచ్చిన కొద్దిపాటి సొమ్ము ఖర్చయి పోయింది. ప్రస్తుతం ఇల్లు గడవాలంటే వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఏది ఆగినా ఆకలి ఆగదు అన్నట్టుగా, గంగపుత్రులు తమ ఆకలి తీర్చుకోవడానికి చేబదుళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తూ సముద్రంలోకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న తమకు, కనీసం ఈ సంధి కాలపు భత్యం సకాలంలో ఇస్తే అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉంటామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నగదు సాయమే కాకుండా, బియ్యం వంటి నిత్యావసర సరుకులు కూడా అందజేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని గంగమ్మ తల్లి బిడ్డలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. అధికారుల మాటలు తప్ప, ఆచరణలో ఆదుకునే హస్తం కనిపించకపోవడంపై తీరప్రాంతం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. -
పరిశోధన రంగంలో రాణించాలని ఉంది
మద్దిలపాలెం: ఏపీపీజీఈసెట్–2026 ఫలితాలలో నగరానికి చెందిన సీపాన అలేఖ్య రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. గురువారం విడుదలైన ఈ ఫలితాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ గీతం వర్సిటీలో బీటెక్ బయోటెక్నాలజీ పూర్తి చేశానని, ఏయూలో ఎంటెక్ చేరాలనే లక్ష్యంతో ప్రిపేర్ అయ్యానని తెలిపింది. రోజుకు 4 గంటల పాటు శ్రమించి ఈ ఘనత సాధించినట్లు ఆమె పేర్కొన్నారు. భవిష్యత్తులో మెడికల్ బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలు చేసి, కొత్త ఆవిష్కరణల్లో భాగస్వామి కావడమే తన ధ్యేయమని అలేఖ్య వెల్లడించారు. -
భారతీయ ఆభరణ కళా వేదిక ‘ద ఇండియా ఎడిట్’
ఏయూ క్యాంపస్: భారతీయ ఆభరణ కళ అద్భుత వైవిధ్యాన్ని ప్రతిబింబించేలా వైభవ్ జ్యూయలర్స్ ఆధ్వర్యంలో ఆభరణాల ప్రదర్శన, అమ్మకాల వేదిక ‘ద ఇండియా ఎడిట్’ బీచ్‌రోడ్డులోని గ్రాండ్ బే హోటల్లో బుధవారం ప్రారంభమైంది. విశిష్ట అతిథులు డా.సుయాన్ చాపన్(ఐఎఫ్ఎస్), కంచెర్ల రాంప్రసాద్, భారత్ మల్లిక రత్నకుమారి గ్రంధి(సీఎండీ) జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రతి ప్రాంత విశిష్టత నుంచి ప్రేరణ పొందిన నాలుగు సిగ్నేచర్ కలెక్షన్లను ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. వైభవ్ సంస్థ చైర్పర్సన్ గ్రంధి మల్లికా మనోజ్ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల ఆభరణాల సాంప్రదాయా న్ని చాటిచెప్పే అసాధారణ ప్రదర్శనగా దీన్ని పేర్కొన్నారు. భారతీయ ఆభరణ కళకు చెందిన అద్భుత వైవిధ్యాన్ని ఈ ప్రదర్శనలో ఆవిష్కరించామన్నారు. ఈ ప్రదర్శన 14, 15 తేదీల్లో ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న కళాకారుల అద్భుత హస్త కళా నైపుణ్యాన్ని పరిచయంచేసే ‘జ్యూయలరీ మ్యాప్ అఫ్ ఇండియా‘ను ఆవిష్కరించారు. -
తీరని భూ వ్యాధులు!
రెవెన్యూ క్లినిక్‌లు..22ఏ ఉచ్చులో సామాన్యుడు జిల్లాలో ప్రధానంగా 22ఏ నిషిద్ధ జాబితా నుంచి భూముల తొలగింపు అంశం జటిల సమస్యగా మారింది. తరతరాలుగా అనుభవిస్తున్న భూములు కూడా సాంకేతిక కారణాలతో ఈ జాబితాలో చేరిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తహసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులు నివేదికలు పంపినా, ఉన్నతాధికారులు వాటిపై నిర్ణయం తీసుకోకుండా కొర్రీలు వేస్తున్నారు. ఫైళ్లను వెనక్కి పంపడం లేదా అమరావతిలోని సీసీఎల్ఏ కార్యాలయానికి పంపించి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. క్లినిక్ పేరుతో కాలయాపన చేయకుండా, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి శాశ్వత విముక్తి కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మహారాణిపేట: చంద్రబాబు ప్రభుత్వ ఆరంభ శూరత్వం మరోసారి బయటపడింది. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌ల పేరుతో చేసిన హడావుడి ‘అట్టర్ ఫ్లాప్ షో’గా మారింది. తమ భూములను కాపాడుకునేందుకు, రికార్డుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు బాధితులు అధికారుల చుట్టూ తిరగడంతోనే కాలం గడిచిపోతోంది. పారదర్శకత, వేగవంతమైన పరిష్కారం అంటూ ఊదరగొట్టిన సర్కారు.. క్షేత్రస్థాయి అమలులో మాత్రం చేతులెత్తేసింది. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్తో పాటు రెవెన్యూ క్లినిక్ పేరుతో భూ సమస్యలపై అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ విధానం బాధితులకు ఊరటనివ్వకపోగా, అదనపు భారంగా మారింది. మండలాలకు తాళం.. గతంలో ప్రజలు తమ సమస్యల కోసం సమీపంలోని తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. ప్రతి సోమవారం మండల స్థాయిలో ఉండాల్సిన తహసీల్దార్లు, డివిజన్ స్థాయిలో ఉండాల్సిన ఆర్డీవోలు అందరూ తమ కార్యాలయాలకు తాళం వేసి కలెక్టరేట్లోని రెవెన్యూ క్లినిక్‌కు వస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు తమ గోడు వెళ్లబోసుకోవడానికి వందల రూపాయలు ఖర్చు చేసుకుని, వ్యయప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి రావాల్సి వస్తోంది. కలెక్టరేట్లో వినతిపత్రం తీసుకుంటున్నారే తప్ప, అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. 10 దశల ప్రక్రియ.. అంతా అయోమయం! రెవెన్యూ క్లినిక్‌లో ఫిర్యాదు చేస్తే చాలు సమస్య తీరిపోతుందని ప్రచారం చేసిన ప్రభుత్వం, అందులో 10 దశల క్లిష్టమైన ప్రక్రియను పెట్టి సామాన్యులను అష్టకష్టాల పాలు చేస్తోంది. రీ–సర్వే లోపాలు, ఎఫ్–లైన్ పిటిషన్లు, 22ఏ తొలగింపు వంటి 14 రకాల అంశాలపై అర్జీలు తీసుకుంటున్న అధికారులు.. వాటిని పరిష్కరించడంలో మాత్రం నత్తనడకన సాగుతున్నారు. ముఖ్యంగా 22ఏ జాబితా నుంచి భూముల తొలగింపు అంశం అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. 1179 వినతులు.. 187 పరిష్కారాలు! ప్రభుత్వ ఆదేశాల మేరకు గతేడాది డిసెంబర్ 10వ తేదీ నుంచి జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు. దీనికి జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు కూడా హాజరవుతున్నారు. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు వినతులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు మొత్తం 1179 అర్జీలు వచ్చాయి. అందులో కేవలం 187 మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. మరోవైపు ఏకంగా 388 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. ఇంకా 604 వినతులు వివిధ దశల్లో పెండింగ్‌లోనే మూలుగుతున్నాయి. గణాంకాలు చెబుతున్న ‘వైఫల్యం’ మొత్తం వినతులు 1179 పరిష్కరించినవి 187 తిరస్కరించినవి 388 పెండింగ్ 604 -
ఈఎస్ఐలో సువిధా సమాగం
సీతంపేట: ప్రతి నెల రెండో బుధవారం నిర్వహించే ‘సువిధా సమాగం’ కార్యక్రమాన్ని నరసింహనగర్‌లోని ఈఎస్ఐ కార్పొరేషన్ ఉప ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, యాజమాన్య ప్రతినిధులు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈఎస్ఐ సంస్థ జాయింట్ డైరెక్టర్ కె.ఆర్.రవికుమార్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ప్రతినిధి డాక్టర్ లలిత, మల్కాపురం ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ప్రతినిధి డాక్టర్ శేషగిరి, అసిస్టెంట్ డైరెక్టర్ వేమూరి శ్యామ్ ప్రసాద్ నేతృత్వం వహించారు. కార్మికులు విన్నవించుకున్న సమస్యలలో కొన్నింటికి అధికారులు తక్షణ పరిష్కారం చూపారు. మిగిలిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తదుపరి ‘సువిధా సమాగం’కార్యక్రమం జూన్ 10న మధ్యాహ్నం 3 గంటలకు ఇదే కార్యాలయంలో జరుగుతుందని అధికారులు వెల్లడించారు. -
జలధార–జలహారతి పనులు వేగవంతం చేయాలి
మహారాణిపేట: జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా చేపట్టిన ‘జలధార–జలహారతి’ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. జలధార–జలహారతి 100 రోజుల కార్యక్రమంపై ఎన్ఆర్ఈజీఎస్, ఇరిగేషన్, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు పని కల్పించడంతో పాటు, చెరువుల పూడికతీత, గట్ల బలోపేతం, కాలువల డిసిల్టింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళలకు మెరుగైన జీవనోపాధి కల్పించేలా గ్రూప్ యాక్టివిటీస్‌ను పెంచాలని డీఆర్డీఏ పీడీకి సూచించారు. పెట్టుబడుల కోసం సమన్వయంతో పనిచేయాలి జిల్లాలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటికే కుదిరిన అవగాహన ఒప్పందాల ప్రగతిని, గ్రౌండింగ్ దశలో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూములతో పాటు అవసరమైతే ప్రైవేటు భూములను కూడా సమీకరించే అవకాశాలను పరిశీలించాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో విద్యుత్, రహదారుల వంటి మౌలిక వసతులను ముందస్తుగానే కల్పించాలని స్పష్టం చేశారు. పర్యాటక, ఐటీ, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, ఆర్డీవోలు, ఏపీఐఐసీ అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
గోల్డ్ హంటర్స్!
● ఉదయం 7.45 గంటలు.. జ్యోతి నగర్.. మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లి మొదటి సవాల్ విసిరారు. ● ఉదయం 8.05 గంటలు.. పంజాబ్ హోటల్ జంక్షన్లో మహిళ మెడలోంచి చైన్ తెంచేసి పారిపోయి హడలెత్తించారు. ● ఉదయం 8.15 గంటలు కంచరపాలెం జయభారత్నగర్లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళే లక్ష్యంగా చైన్ అపహరించిన దొంగలు రెప్పపాటులో మాయమయ్యారు. ● ఉదయం 11.30 గంటలు... విమాన్‌నగర్ బస్టాప్ వద్ద బస్ కోసం ఎదురు చూస్తున్న మహిళ మెడలో గొలుసు లాక్కుని పరారైపోయారు. సాక్షి, విశాఖపట్నం: మహానగరంలో ‘గోల్డ్’వేట మొదలైంది. గన్ పట్టుకున్న వేటగాడు అడవిలో పొంచి ఉన్నట్టు.. బైక్ ఎక్కిన దొంగలు.. జనం మధ్యే ‘స్నాచింగ్’పంజా విసిరారు. నాలుగు గంటల వ్యవధిలో 13 తులాల బంగారాన్ని కొట్టేశారు. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న విశాఖ వీధులు ఇప్పుడు ‘గోల్డ్ హంటర్స్’ దూకుడుతో ఉలిక్కిపడుతున్నాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలో, నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో హంటర్స్ చేసిన హడావుడి చూస్తుంటే.. పోలీసుల నిఘా వ్యవస్థకు గట్టి సవాల్ విసిరినట్టే కనిపిస్తోంది. టైమ్ ఫిక్స్.. టార్గెట్ గోల్డ్.! బుధవారం ఉదయం నుంచి జరిగిన చైన్‌స్నాచింగ్ కేసుల్లో దొంగల రూట్ మ్యాప్ చూస్తే ఎవరికై నా ఆందోళన కలగాల్సిందే. వచ్చింది ద్విచక్ర వాహనంపై.. పోయింది సుమారు 13 తులాల పసిడి. బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టారు. అయితే.. నాలుగు చోట్లా చేసింది ఒక్కరేనా.. లేదా అంతర్రాష్ట్ర ముఠా పనా అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. ‘నిఘా’ నేత్రాలు నిద్రపోతున్నాయా.? నగర రక్షణ కోసం సిటీలో ఏర్పాటు చేసిన ‘మూడో కన్ను(సీసీ కెమెరాలు)’అనేక చోట్ల రెప్పవాల్చిన విషయం చైన్ స్నాచింగ్ ముఠా పసిగట్టినట్లుందనే వదంతులు వినిపిస్తున్నాయి. సేఫ్ సిటీగా ఉన్న విశాఖ నగరం.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గోల్డ్ హంటర్స్ సిటీగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖ సిటీ పోలీస్ అధికారిక గణాంకాల ప్రకారం... నగర వ్యాప్తంగా 13,485 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అధికారిక రికార్డులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ డేటా, ఇటీవల పోలీస్ శాఖ నిర్వహించిన అంతర్గత ఆడిట్ నివేదికల ప్రకారం.. వీటిలో పోలీస్ శాఖవే కాకుండా ‘నేను సైతం’ప్రోగ్రామ్ కింద ప్రజలు, షాపుల యజమానులు పెట్టినవి కూడా ఉన్నాయి. వీటిలో ఎన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సిగ్నల్ పంపుతున్నాయనే లైవ్ స్టేటస్ ద్వారా దాదాపు 40 శాతం అంటే 5,394 సీసీ కెమెరాలు మాత్రమే వర్కింగ్ కండిషన్లో ఉన్నాయని గుర్తించారు. ఇదే.. దొంగలకు అనువుగా మారిందనే అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసుల యాక్షన్ ప్లాన్ షురూ..! వరుస ఘటనలతో అప్రమత్తమైన నగర పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. గతంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులే నిందితులు కావడంతో.. బుధవారం జరిగిన చోరీలు కూడా వారి పనేనని ప్రాథమికంగా నిర్ధారించారు. సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు, పనిచేస్తున్న కొన్ని కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల వేటలో నిమగ్నమయ్యారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు పెరిగినప్పటి నుంచి చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా జరుగుతుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. వీలైనంత త్వరగా గోల్డ్ హంటర్స్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు మార్చిలో 7 ఏప్రిల్‌లో 5 మే 13 వరకూ 4 -
‘చైన్’ చోరీలతో బెంబేలు
గోపాలపట్నం: విశాఖనగరంలో ఒకే రోజు గంటల వ్యవధిలో నాలుగు చోట్ల జరిగిన చైన్ స్నాచింగ్‌లతో ప్రజలు హడలెత్తిపోయారు. కంచరపాలెం, ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7.30 నుంచి 11.30 మధ్య నాలుగు చోట్ల చైన్ స్నాచర్లు చెలరేగిపోయారు. మహిళల మెడల్లో ఉన్న చైన్లను తెంచుకుపోయారు. బాధితులు పోలీసులు తెలిపిన వివరాలు.. మొదటి చోరీ.. ఉదయం 7.30 సమయంలో మర్రిపాలెం జ్యోతీనగర్ వద్ద పంచముఖి లక్ష్మి(62) కాయగూరలు కొనుగోలు చేసేందుకు వచ్చింది. 7.45 గంటలకు తిరుగుముఖం పడుతూ ఇంటి సందులో మలుపుతిరుగుతున్న సమయంలో కాపుకాసి ఉన్న దుండగుడు వెనక నుంచి వచ్చి మెడలోని గొలుసు తెంచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన లక్ష్మి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో కొంత భాగం తెంచుకుపోయాడు. లాకెట్టు, చైన్‌లో సగభాగం తన చేతిలో ఉండిపోయింది. సుమారు రెండున్నర తులాల వరకు దుండగుడు లాక్కెళ్లిపోయినట్లు బాధితురాలు వాపోతోంది. రెండో చోరీ పంజాబ్ హోటల్ జంక్షన్ వద్ద ఉదయం 8.05 గంటల సమయంలో రాజీవ్‌నగర్‌కు చెందిన నిడమల రత్నకుమారి విధులకు హాజరయ్యేందుకు బస్టాప్ సమీపంలోని సర్వీస్ రోడ్డులో ఆటో కోసం నిరీక్షిస్తోంది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో పుస్తెల తాడు, నల్లపూసల దండ తెంచుకెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె అప్రమత్తం కావడంతో చేతిలో పుస్తెలు, నల్లపూసల దండ కొంతభాగం ఉండిపోయింది. మిగిలిన సుమారు రెండున్నర తులాలు తెంచుకుపోయాడు. మూడో చోరీ ఉదయం 8.15 గంటల సమయంలో కంచరపాలెం జైభారత్‌నగర్ వద్ద ఎస్ కోట దరి జామి వెళ్లేందుకు వర్రి అరుణ బస్టాప్‌కు నడుస్తూ వస్తోంది. కాపుకాసిన దుండగుడు రెండు తులాల గొలుసు, రెండు తులాల నల్లపూసల దండ లాక్కుపోయాడు. నాలుగో చోరీ విమాన్‌నగర్ వద్ద అదే ప్రాంతానికి చెందిన ఎం.అచ్చయ్యమ్మ(56) ఉదయం 11.30కు నగరంలో జరిగే ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు బస్టాప్ వద్ద నిరీక్షిస్తోంది. అక్కడే ఉన్న ఓ యువకుడు ఆమెను సమీపించాడు. బైక్‌పై మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. వెంటనే ఆమె మెడలో ఉన్న 5 తులాల నల్లపూసల దండ, చైన్ తెంచుకుని బైక్‌పై వెళ్లిపోయారు. గమనించిన ఓ వ్యక్తి తన బైక్‌తో వెంబడించే ప్రయత్నం చేసినా ఆ వ్యక్తిని ఢీకొట్టేందుకు యత్నించి తప్పించుకుపోయారు. కరాసా వద్ద బైక్ చోరీ ఆ సమయంలోనే కరాసాకు చెందిన ఓ యువకుడి ద్విచ్రవాహనం చోరీకి గురయింది. కరాసా వద్ద నైట్ ఫుడ్ స్టాల్స్ ఉన్న చోట 10.30 సమయంలో పార్కింగ్ చేసిన తన బైక్‌ను ఎవరో దొంగిలించడంతో బాధితుడు వెంటనే వాట్సాప్ ఫిర్యాదుతోపాటు, స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు కూడా చేశాడు. తన బైక్‌తోనే ఈ చోరీలకు పాల్పడ్డారేమోనని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఉదయం 7.30 నుంచి దొంగతనాలు జరుగుతుండటంతో ఈ వాహనం వాడి ఉండరని పోలీసులు చెప్తున్నారు. చైన్ స్నాచింగ్‌లపై బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చంద్రమౌళి తెలిపారు. కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు సీసీ కెమెరాల్లో చిక్కిన స్నాచర్ల ముఖాలు -
పలు రైళ్ల గమ్యం కుదింపు
తాటిచెట్లపాలెం: పలు రైల్వేస్టేషన్లలో జరుగుతున్న ఆధునికీకరణ పనుల నేపథ్యంలో ఆయా తేదీల్లో బయల్దేరే పలు రైళ్ల గమ్యం కుదిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ● ఈ నెల 15, 16, 18, 19, 20, 22, 23, 25, 26, 27, 29, 30వ తేదీల్లో తిరుపతిలో బయల్దేరే తిరుపతి–పూరి(17480) ఎక్స్‌ప్రెస్ మాలతిపత్‌పూర్ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 17, 18, 20, 21, 22, 24, 25, 27, 28, 29, 31 తేదీల్లో పూరిలో బయల్దేరాల్సిన పూరి–తిరుపతి(17479) ఎక్స్‌ప్రెస్ పూరి నుంచి కాకుండా మాలతిపత్‌పూర్ నుండి బయల్దేరుతుంది. ఈ తేదీల్లో మాలతిపత్‌పూర్–పూరి మధ్య ఈ రైలు రాకపోకలు సాగించదు. ● జూన్ 7 నుంచి 18 వరకు విశాఖలో బయల్దేరే విశాఖపట్నం–కోర్బా(18518) ఎక్స్‌ప్రెస్ బిలాస్పూర్ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో జూన్ 8 నుంచి 19 వరకు కోర్బాలో బయల్దేరాల్సిన కోర్బా–విశాఖపట్నం(18517) ఎక్స్‌ప్రెస్ కోర్బా నుంచి కాకుండా బిలాస్పూర్ నుండి బయల్దేరుతుంది. ఈ తేదీల్లో బిలాస్పూర్–కోర్బా మధ్య ఈ రైలు రాకపోకలు సాగించదు. ● ఈ నెల 18న విశాఖపట్నం–పలాస–విశాఖపట్నం(67289/67290) మెము పాసింజర్ శ్రీకాకుళం రోడ్ వరకు మాత్రమే నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్ నుంచి విశాఖ చేరుకుంటుంది. ఈ తేదీలో శ్రీకాకుళం రోడ్–పలాస మధ్య ఈ రైలు రాకపోకలు సాగించదు. -
సీబీఎస్ఈ ప్లస్2లో శ్రీ చైతన్య జోరు
మద్దిలపాలెం: సీబీఎస్ఈ ప్లస్ 2 ఫలితాల్లో నగరంలోని శ్రీచైతన్య విద్యాసంస్థలు జాతీయ స్థాయిలో తమ అధిక్యతను చాటుకున్నాయి. విశాఖ నుంచి అత్యధికంగా ఎస్కే ముక్తర్మదీనా 485, ఆలీ అగ్బార్ 484, బి.జోష్న 482, పి.భార్గవ్ నాయుడు 481, కె.గణేంద్ర 480 మార్కులతో సత్తా చాటారని సంస్థ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం కేవీ రమణ, డీన్లు ఎన్.రఘుకుమార్, కె.బంగారుబాబులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 480 ఆపై 5 గురు, 470కి పైగా 10 మంది, 450కి పైగా 52 మంది విద్యార్థులు మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. 530 మంది విద్యార్థులు డిస్టింక్షన్ సాధించడం తమకు గర్వకారణమన్నారు. ఈ మేరకు విద్యార్థులకు, శిక్షణ అందించిన అధ్యాపకులకు, సిబ్బందికి, తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. -
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అక్రమ కేసులు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, ప్రతిపక్ష పార్టీ నాయకులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. జీవీఎంసీ ఎదుటనున్న గాంధీ విగ్రహం వద్ద పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత నిరసనలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. కర్నూలులో వైఎస్సార్ సీపీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు బాలుపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధించడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ విశాఖ జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డిపై మాదకద్రవ్యాల పేరుతో అక్రమంగా కేసులు మోపి, బెయిల్ రాకుండా వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్నారని మండిపడ్డారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉరుకూటి చందు మాట్లాడుతూ ఎన్నికల హామీలను గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మహమ్మద్ ఇమ్రాన్, ఉత్తరాంధ్ర యుజన విభాగం అధ్యక్షుడు అంబటి శైలేష్ మాట్లాడుతూ.. పోలీస్ కేసులతో భయపెట్టి వైఎస్సార్ సీపీ యువజన విభాగం నోరు నొక్కాలని చూస్తే.. అంతకు రెట్టింపు బలంతో ప్రజా సమస్యలపై, ఎన్నికల హామీలపై ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ , విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ్, యువజన విభాగం రాష్ట్ర నాయకులు కిరణ్, కనకాల ఈశ్వర్, గుజ్జు ధీరజ్ రెడ్డి, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎస్కే మహంతి, సనపల రవీంద్ర భరత్, నీలి రవి, మనోజు, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు మువ్వల సంతోష్, తాడి రవితేజ, రవి కిరణ్, పార్టీ నాయుకులు బిపిన్ కుమార్ జైన్, భీశెట్టి ప్రసాద్, ఉమ్మడి కళ్యాణ్, చంద్రమౌళి, రమేష్, రాఘవులు, సురేష్, హరికృష్ణ, రాజు, కొట్యాడ సూర్య తదితరులు పాల్గొన్నారు. -
వెల్లంకి, ఎస్ఆర్పురం పంచాయతీలకు ‘ఐఎస్వో’ గుర్తింపు
ఆనందపురం: జిల్లాలోని రెండు మండలాలకు అరుదైన గౌరవం దక్కింది. ఆనందపురం మండలంలోని వెల్లంకి, పెందుర్తి మండలంలోని ఎస్ఆర్పురం గ్రామ పంచాయతీలు ప్రతిష్టాత్మకమైన ఐఎస్వో 9001:2015 సర్టిఫికేషన్‌కు ఎంపికయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ గుర్తింపు కోసం మొత్తం 24 పంచాయతీలను ఎంపిక చేయగా, గత 18 నెలలుగా సాగిన సుదీర్ఘ కసరత్తు, వివిధ దశల పరిశీలనల అనంతరం ఈ రెండు గ్రామాలు తుది జాబితాలో నిలిచి రికార్డు సృష్టించాయి. ఈ సర్టిఫికేషన్ ద్వారా సదరు పంచాయతీల్లో రికార్డుల శాసీ్త్రయ నిర్వహణ, పారదర్శకమైన ప్రజా సేవలు, పన్నుల వసూళ్లలో సమర్థత, కార్యాలయ పరిశుభ్రత వంటి అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలు అమలు కానున్నాయని అధికారులు వెల్లడించారు. గత మూడు రోజులుగా ‘టాటా క్వాలిటీ సెర్ట్ సర్వీసెస్’ ప్రతినిధి శ్రీజిత్ కె. అనిరుధ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆడిట్ అనంతరం ఈ సర్టిఫికేషన్‌ను ఖరారు చేశారు. ముఖ్యంగా వెల్లంకి పంచాయతీలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, ప్రజలకు త్వరితగతిన సేవలందించే విధానం, సిబ్బంది సత్ప్రవర్తనను ఆడిట్ ప్రతినిధులు స్వయంగా పరిశీలించి ప్రత్యేకంగా ప్రశంసించారు. తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయ లైజన్ ఆఫీసర్ ఇమాముద్దీన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా స్వర్ణ గ్రామ అధికారి ఆర్.పూర్ణిమాదేవి, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇ.జి.ఉషారాణి, ఆనందపురం డిప్యూటీ ఎంపీడీవో భూపతి సత్యనారాయణ, జీఏవి శ్రీరామ్మూర్తి, వంకర ప్రసాద్, స్వర్ణ గ్రామ సిబ్బంది పాల్గొన్నారు. -
అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
డాబాగార్డెన్స్: జీవీఎంసీ, గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ అందించిన మూడు అర్బన్ చాలెంజ్ ఫండ్ ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కేంద్రం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా భారత ప్రభుత్వ గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ(ఎంవోహెచ్‌యూఏ) ఆధ్వర్యంలో నేషనల్ అపెక్స్ కమిటీ(ఎన్ఏసీ) ఈ నెల 11న న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు వెల్లడించినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. నేషనల్ అపెక్స్ కమిటీ సమావేశంలో మూడు ప్రాజెక్టుల ప్రతిపాదనలు కమిటీకి అందించామన్నారు. మధురవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, 24/7 తాగునీటి సరఫరా, నగరవ్యాప్తంగా బల్క్ అండ్ సెమీ బల్క్ నీటి సరఫరా వ్యవస్థ ఆటోమేషన్ ప్రాజెక్టులకు రూ.1501.03 కోట్ల వ్యయంతో ఆమోదం దక్కినట్లు పేర్కొన్నారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద రూ.375.26 కోట్ల గ్రాంట్ లభించనుందన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా జీవీఎంసీ పరిధిలోని మధురవాడ, ఈస్ట్, భీమిలో జోన్లలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు ఆధునిక యూజీడీ వ్యవస్థ, 24 గంటల తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. -
ఎన్టీఏను రద్దు చేయాలి
బీచ్‌రోడ్డు: నీట్ పరీక్షా పత్రం లీకేజీకి నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థి సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. ఏఐడీఎస్వో, ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ ధర్నాలో విద్యార్థులు, విద్యావేత్తలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విద్యా వ్యవస్థను ఎన్టీఏ అస్తవ్యస్తం చేస్తోందని వారు విమర్శించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌర చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు ఆచార్య కోలవెన్ను చాంద్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్టీఏను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం విద్య ఉమ్మడి జాబితాలో ఉందని, కావున మెడికల్ ప్రవేశ పరీక్షల బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని ఆలిండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ(ఏఐఎస్ఈసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.గోవిందరాజులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులు అభిలాష్, సంతోష్ కుమార్, ధ్రువ్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. నీట్ డైరెక్టర్ జనరల్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని, పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సొంత దుకాణం!
ఓ ప్రొఫెసర్ నిర్వాకంగురువారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2026సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఒకవైపు ప్రభుత్వం ఆంధ్రా యూనివర్సిటీ నిధులను వందల కోట్ల మేర మళ్లించి ఆర్థికంగా కుదేలు చేస్తుంటే.. మరోవైపు యూనివర్సిటీలోనే ఉన్నత హోదాల్లో ఉన్న కొందరు అధికారులు ఖజానాకు రావాల్సిన కన్సల్టెన్సీ ఆదాయాన్ని సొంత ఖాతాల్లోకి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఏకంగా వ్యక్తిగత జీఎస్టీ నంబర్, సొంత బ్యాంకు ఖాతాలతో కన్సల్టెన్సీ ఫీజులను వసూలు చేసి లక్షల రూపాయలు దండుకున్న ఓ ప్రొఫెసర్ వ్యవహారం ఇప్పుడు ఏయూలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే వేతనాల చెల్లింపులకే నిధుల్లేక ఇబ్బందులు పడుతున్న యూనివర్సిటీలో ఈ అక్రమాలు మరింత ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. నిబంధనలు గాలికి.. నిధులు ఖాతాలోకి సాధారణంగా ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, సాంకేతిక రంగాలకు సంబంధించిన డిజైన్లు, సలహాలు, ప్రాజెక్టు అంచనాలు, పరిశోధనల కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు యూనివర్సిటీని సంప్రదిస్తాయి. ఈ సేవలను సంబంధిత విభాగాల ప్రొఫెసర్లు కన్సల్టెన్సీ రూపంలో అందిస్తారు. ఇందుకు సంబంధించిన ఫీజు మొత్తం యూనివర్సిటీ ఖజానాలో జమ కావాలి. యూనివర్సిటీ జీఎస్టీ నంబర్, అధికారిక బ్యాంకు ఖాతాల ద్వారానే ఈ లావాదేవీలు జరగాల్సి ఉంటుంది. అయితే, నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కిన ఓ ప్రొఫెసర్ వ్యక్తిగత జీఎస్టీ నంబర్‌ను తీసుకుని, కన్సల్టెన్సీ సేవల పేరుతో వచ్చిన మొత్తాలను నేరుగా తన ఖాతాల్లోకి మళ్లించినట్టు తెలుస్తోంది. విషయం బయటకు వస్తుందనే అనుమానంతో ఆ జీఎస్టీ నమోదును ఇటీవల రద్దు చేసుకున్నారన్న ప్రచారం కూడా ఏయూ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సంస్థా‘గత’ లాభం.. ప్రొఫెసర్ల సొంతం వాస్తవానికి కన్సల్టెన్సీ ద్వారా వచ్చే ఆదాయాన్ని యూనివర్సిటీ డెవలప్మెంట్ ఫండ్‌కు జమ చేస్తారు. అనంతరం నిబంధనల ప్రకారం అందులో భాగాన్ని సంబంధిత ప్రొఫెసర్‌కు పారితోషికంగా చెల్లిస్తారు. ఈ విధానం వల్ల యూనివర్సిటీకి ఆదాయం రావడంతో పాటు పరిశ్రమలు–విద్యాసంస్థల మధ్య అనుసంధానం బలపడుతుంది. విద్యార్థులకు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అందుతుంది. కానీ, ఈ వ్యవస్థనే కొందరు వ్యక్తిగత సంపాదన మార్గంగా మార్చుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ విభాగాల్లో కన్సల్టెన్సీ ప్రాజెక్టులు అధికంగా ఉండటంతో భారీ మొత్తాలు చేతులు మారుతున్నాయని సమాచారం. అవినీతి ‘తిమింగలానికి’ అందలమా? సదరు ప్రొఫెసర్ తన వ్యక్తిగత జీఎస్టీ, బ్యాంకు ఖాతాలను సమర్పించి కన్సల్టెన్సీ ఫీజుల రూపంలో లక్షల రూపాయలు వసూలు చేసినట్టు యూనివర్సిటీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికే కూటమి ప్రభుత్వం ఇటీవల మరింత ఉన్నత హోదా కల్పించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రొఫెసర్ వ్యవహారశైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. అయినా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్నతస్థాయి అండదండలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శతాబ్ది సంబరాల్లో.. అక్రమాల జాతర ఇటీవల నిర్వహించిన ఏయూ శతాబ్ది ఉత్సవాల ఖర్చులపైనా పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏయూ నిధుల నుంచే రూ.63.50 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ వ్యయాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీచ్ రోడ్డులో నిర్వహించిన ర్యాలీకి ఓ ప్రైవేటు సంస్థ టీషర్టులను స్పాన్సర్ చేసినప్పటికీ, ఆ ఖర్చును కూడా కలిపి సుమారు రూ.10 లక్షల వరకు వ్యయం చూపించారన్న ఆరోపణలు ఉన్నాయి. టెంట్లు, భోజన ఏర్పాట్లు, స్టేజ్ నిర్మాణం తదితర పనుల్లోనూ భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారాల్లోనూ మిగిలిన ఉన్నతాధికారులతో పాటు సదరు ప్రొఫెసర్ భారీగా దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జీతాలకు కరవు.. ‘గీతం’కి లబ్ధి ఒకవైపు యూనివర్సిటీ నిధుల మళ్లింపు, మరోవైపు అంతర్గత అవినీతి కారణంగా ఏయూ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలో సగం రోజులు పూర్తవుతున్నా ఉద్యోగులకు వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జీతాల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. మరోవైపు ఏయూలోని డిఫెన్స్, దూరవిద్య విభాగాలను నిర్వీర్యం చేస్తూ.. పక్కనే ఉన్న గీతం యూనివర్సిటీకి లబ్ధి చేకూరుస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. చంద్రబాబు సర్కార్ అనుసరిస్తున్న తీరు చూస్తుంటే.. వర్సిటీని భ్రష్టు పట్టించి, చివరకు ఎంపీ భరత్ తాత మూర్తి చెప్పినట్టుగా ఏయూని ’దెయ్యాల కొంప’గా మార్చేందుకు ఉన్నతాధికారులు కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. యూనివర్సిటీ ఖజానాకు రావాల్సిన కన్సల్టెన్సీ ఫీజుల మళ్లింపు వ్యక్తిగత జీఎస్టీ, బ్యాంకు ఖాతాలతో లక్షల రూపాయల వసూళ్లు రూ.300 కోట్ల నిధుల మళ్లింపుతో కుదేలైన ఏయూకు అంతర్గత దోపిడీ దెబ్బ శతాబ్ది ఉత్సవాల ఖర్చుల్లోనూ భారీ అక్రమాల ఆరోపణలు ‘ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా?’ అన్న చందంగా తయారైంది ఆంధ్రా యూనివర్సిటీ పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వమే వందల కోట్ల నిధులను పక్కదారి పట్టించి వర్సిటీని ఆర్థికంగా కుదేలు చేస్తుంటే.. ‘మేమేం తక్కువ?’ అన్నట్లుగా ఉన్నతాధికారులు కూడా కన్సల్టెన్సీ ఫీజులను సొంత ఖాతాలకు మళ్లిస్తూ వర్సిటీ ఖజానాకు కన్నం వేస్తున్నారు. -
రైల్వే పోలీసులకు చిక్కిన ‘బెంగళూరు’ దొంగలు
తాటిచెట్లపాలెం: బెంగళూరులోని హలసూరు గేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బంగారు ఆభరణాలు దొంగిలించిన నలుగురిని విశాఖ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీఆర్పీ సిబ్బంది తెలిపిన వివరాలు... జీఆర్పీ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ సీహెచ్ ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో ఆర్పీఎఫ్ ఎస్ఐలు బి.శేషసాయి, టి.శ్రీనివాసరావు, సీపీడీఎస్ సిబ్బంది విశాఖ రైల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని గుర్తించి, వారి బ్యాగుల్ని పరిశీలించారు. వారి వద్ద సుమారు 550 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.71,163ల నగదు లభ్యమైంది. విచారించగా వీరు ఈ ఆభరణాలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని హలసూరు గేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగిలించినవిగా గుర్తించారు. వీటి గురించి అక్కడ కేసు నమోదైనట్లు తెలుసుకుని, వారి నుంచి ఆభరణాలు స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ నిమిత్తం కర్ణాటక పోలీసులకు అప్పగించినట్లు జీఆర్పీ సిబ్బంది తెలిపారు. నిందితులు పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్‌కు చెందిన ఎస్కే ముస్తాక్ ఆలీ, రంజన్మిద్య, ఎస్కే మిర్జుల్ ఇస్లాం, ఎస్కే లాలన్ ఆలీలుగా వెల్లడించారు. -
నేటి నుంచి శుభకార్యాలకు బ్రేక్
మహారాణిపేట : వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, నిశ్చితార్థాలుం ఇలా శుభకార్యాలతో కళకళలాడే వేళకు తాత్కాలికంగా విరామం పడింది. గురువారం నుంచి వరుసగా 36 రోజుల పాటు శుభముహూర్తాలు లేకపోవడంతో పెళ్లి బాజాలు మూగబోనున్నాయి. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్ 18 వరకు వివాహాది శుభకార్యాలకు బ్రేక్ పడింది. వేద పండితుల ప్రకారం ఈ కాలాన్ని ‘మూఢమి’గా పరిగణిస్తారు. అందుకే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి ప్రధాన శుభకార్యాలను చాలామంది వాయిదా వేస్తున్నారు. అయితే అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం, రిజిస్ట్రేషన్లు వంటి కార్యక్రమాలు మాత్రం నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. జూన్ 19 నుంచి మళ్లీ పెళ్లి సందడి జూన్ 19న నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కావడంతో మళ్లీ శుభముహూర్తాల సందడి మొదలుకానుంది. జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత జూలై 1 నుంచి 9 వరకు కూడా వివాహాలు, గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లోనూ పలు శుభముహూర్తాలు లభించనున్నాయి. గత డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీగా వివాహాలు జరగడంతో పట్టణాలు, గ్రామాలు పెళ్లి వేడుకలతో కళకళలాడాయి. ఇప్పుడు మరోసారి జూన్ చివరి నుంచి అదే సందడి కనిపించనుంది. పెళ్లి రంగానికి తాత్కాలిక మందగమనం శుభముహూర్తాలు లేకపోవడంతో వివాహాలకు అనుబంధంగా ఉన్న వందలాది వృత్తులు తాత్కాలికంగా మందగించనున్నాయి. కళ్యాణ మండపాలు, కేటరింగ్, టెంట్ హౌస్‌లు, డెకరేషన్, పూల వ్యాపారులు, బంగారు దుకాణాలు, వస్త్ర వ్యాపారులు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండ్ మేళాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, హోటళ్లు, లాడ్జిలు ఇలా అనేక రంగాలపై ప్రభావం పడనుంది. అయితే జూన్ 19 నుంచి మళ్లీ ముహూర్తాల సీజన్ ప్రారంభం కావడంతో ఈ రంగాలన్నీ తిరిగి ఊపందుకోనున్నాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 19 వరకు ఆగాల్సిందే.. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్ 18 వరకు ప్రధాన శుభకార్యాలకు విరామం ఉంటుంది. జూన్ 19 నుంచి మళ్లీ శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. – అయిలూరి శ్రీనివాస దీక్షితులు -
పెళ్లింట పెను విషాదం
అగనంపూడి: పెళ్లి ముచ్చట్లు తీరకముందే, నూరేళ్ల బంధానికి పునాది పడకముందే నవవధువు అనంత లోకాలకు చేరుకుంది. భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ పుట్టింటికి వస్తున్న తరుణంలో.. మృత్యువు కారు రూపంలో ఆమెను కబలించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెళ్లికుమార్తె తల్లి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ హృదయవిదారక ఘటన విశాఖ జిల్లా అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో గురువారం జరిగింది. పరవాడ మండలం వాడచీపురుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఈరుగుల సన్యాసమ్మ కుమారుడు నరసింగరావు (43) వాడచీపురుపల్లి పంచాయతీలో క్లాప్ వ్యాన్ డ్రైవర్.ఆయనకు అగనంపూడి నిర్వాసితకాలనీ కొండయ్యవలసకు చెందిన నడుపూరు పెంటారావు, కనకమహాలక్ష్మిల కుమార్తె రామేశ్వరి (31)తో బుధవారం రాత్రి వివాహం జరిగింది. తిరుగుమరుగుళ్లలో భాగంగా గురువారం నవ వధువు రామేశ్వరి ఇంటికి వెళ్లేందుకు ఆమె భర్త నరసింగరావు, ఆమె తల్లి కనకమహాలక్ష్మి, సోదరి కలిసి కారులో వాడచీపురుపల్లి నుంచి అగనంపూడికి బయల్దేరారు. ఆ కారును నర్సింగరావే నడుపుతున్నాడు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరిపోతారనుకున్న సమయంలో అగనంపూడి ఉక్కు జనరల్ ఆస్పత్రి రోడ్డు ఏలేరు కాలువ సమీపంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న నరసింగరావుకు కళ్లు మూతలు పడడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వీధిలైట్ల స్తంభాన్ని ఢీకొట్టింది. కారు ముందు సీట్లో కూర్చున్న వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె తల్లి కనకమహాలక్ష్మి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించింది. సోదరి వరలక్ష్మి, నర్సింగరావు తీవ్రంగా గాయపడ్డారు. రామేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. -
భూ సమస్యలపై ‘రెవెన్యూ’ రాబందులు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మా భూమి రెవెన్యూ రికార్డులో ఇబ్బందులున్నాయి. నాకు ఎప్పుడో పట్టా ఇచ్చారు. అయితే ఆన్లైన్లో ప్రభుత్వ భూమి అని ఉంది. పరిష్కరించండి.. అంటూ విశాఖ మధురవాడకు చెందిన ఒక వ్యక్తి విశాఖ కలెక్టరేట్లో అర్జీ ఇచ్చారు. తర్వాత కొన్ని రోజులకు ఫలానా మంత్రి పేషీ నుంచి అంటూ అతడికి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత ఓ మంత్రి సోదరుడు, ఓఎస్డీ అంటూ కొందరు ఫోన్‌చేసి ఏకంగా అతడి ఇంటికి వెళ్లారు. మీ భూమి సమస్యలను మేం పరిష్కరిస్తాం.. సగం ధరకే మాకివ్వండి.. అంటూ బేరసారాలాడారు. తనకు ఈ సమస్య ఉందని ఏకంగా అమరావతిలోని మంత్రికి ఎలా తెలిసిందో అర్థంగాక ఆ వ్యక్తి ఆశ్చర్యపోయారు. ఆనందపురం, సబ్బవరం, భీమిలిలో డీ–పట్టాలు ఉన్న పలువురు రైతులతోను ఇదే తరహాలో ఓ మంత్రి సోదరుడు, పీఏ అంటూ చర్చలు జరుపుతున్నారు. అసైన్డ్ భూములను ప్రభుత్వం త్వరలో రెగ్యులరైజ్ చేస్తుందని, మీ భూములను మేం చూసుకుంటామంటూ బేరసారాలు ఆడుతున్నారు. అడ్డకు పావుసేరు ధరకే బేరసారాలను కొనసాగిస్తున్నట్టు సమాచారం. లేదంటే భూసమీకరణ కింద మీ భూములు తీసుకుంటారంటూ బెదిరింపులకు దిగుతున్నారు.ఇవే కాదు ఉమ్మడి విశాఖ జిల్లాలో భూమి ధరలు బాగా ఉన్న ప్రాంతాల్లో మంత్రి సోదరుడు, ఓఎస్డీ, పీఏలు రంగంలోకి దిగుతున్నారు. ప్రధానంగా మధురవాడ, ఆనందపురం, సబ్బవరం, భోగాపురం, అచ్యుతాపురం ప్రాంతాల్లోని విలువైన భూముల విషయంలో తలదూరుస్తున్నట్లు తెలుస్తోంది. విలువైన భూమికి సంబంధించి ఎవరైనా తమకు సమస్య ఉందంటూ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే సదరు మంత్రి అనుచరగణం వాలిపోతోంది. నేరుగా ఫిర్యాదులో పేర్కొన్న నంబరుకు ఫోన్‌చేసి ‘మీ సమస్య మాకు తెలుసు. మేం విశాఖకు వచ్చి మీతో మాట్లాడతాం’ అంటూ మంత్రి పీఏ పేరుతో కాల్స్ చేస్తున్నారు. ఇక డీ–పట్టా భూముల విషయంలోను మీ భూమి భూసేకరణలో పోతుందంటూ భయాందోళనకు గురిచేసి, తక్కువ ధరకే తమ పేరులతో ఒప్పందం రాయించేసుకుంటున్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఒక అధికారి ఈ వ్యవహారంలో మొన్నటివరకు వారికి సహకరించారు. ఫిర్యాదు కాపీ ఎలా వెళుతోంది?వాస్తవానికి కలెక్టరేట్లోనో, తహశీల్దారు కార్యాలయంలోనే సోమవారం బాధితులు ఫిర్యాదు చేసిన తర్వాత.. ఫోన్ నంబర్లతో సహా ఆ వివరాలు మంత్రి పేషీకి వెంటనే చేరిపోతున్నాయి. ఈ వ్యవహారంలో ఉద్యోగ విరమణ చేసిన ఓ అధికారితో పాటు స్థానిక రెవెన్యూ యంత్రాంగం సహకరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ఆ రిటైర్డ్ అధికారికి స్థానిక రెవెన్యూ అధికారులతో ఉన్న సంబంధాలతోనే మంత్రి పేషీకి సమాచారం చేరుతున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద భూముల విషయాలతో పాటు ఏయే పనులు అవుతాయనేది కూడా స్థానిక రెవెన్యూ అధికారుల ద్వారా సమాచారం ఉండటంతో పక్కాగా మంత్రి అనుచరులు రంగంలోకి దిగి భూదందాలు సాగిస్తున్నట్టు అర్థమవుతోంది.ఓఎస్డీదే పైచేయి వాస్తవానికి ఆ రిటైర్డ్ అధికారిని భూలావాదేవీల వ్యవహారాలు పరిశీలించేందుకు మంత్రి ప్రత్యేకంగా నియమించుకున్నారు. అధికారికంగా నియామకపత్రం లేకుండానే ఆ రిటైర్డ్ అధికారి గత మూడునెలలు సేవలందించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ వివాదాస్పద భూములున్నాయి? ఏయే అంశాల్లో రికార్డులను మార్చి వ్యవహారం నడిపించవచ్చనే విషయాలపై మంత్రికి సలహాలిచ్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారాల విషయంలో మంత్రి ఓఎస్డీకి, ఆ రిటైర్డ్ అధికారికి మధ్య విభేదాలు వచ్చినట్టు సమాచారం. వారం రోజుల కిందట ఆ ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో.. రిటైర్డ్ అధికారిని ఇంటికి సాగనంపారు. రిటైర్డ్ అధికారి ఇచ్చిన సలహాలు, సూచనలతోనే విశాఖలోని భారీ విలువ చేసే భూముల వ్యవహారంలో మంత్రి తమ్ముడు, ఓఎస్డీ, పీఏలు భారీగా దందాలు కొనసాగించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
అప్పన్న కొండకు గుండు!
ఈ ఫొటోలో కనిపించేది సింహాచలం కొండ. సింహాద్రి అప్పన్న దేవస్థానానికి చెందిన ఈ కొండను డేటా సెంటర్ పేరుతో భారీ యంత్రాలతో ఇష్టారాజ్యంగా తవ్వే స్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ కొండ కనుమరుగు కానుంది. నరసింహస్వామి కొలువైన కొండకు చంద్రబాబు ప్రభుత్వం ఎసరు పెట్టడం తీవ్ర అపచారమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొండ నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ‘చప్టా’ కూడా మూసుకుపోవడంతో ముడసర్లోవకూ నీటి ఎద్దడి ఏర్పడనుంది.భీమిలిలోని పావురాల కొండపై క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి బౌద్ధం ఆనవాళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రైవేట్ రిసార్టుకు భూమి కేటాయించడంతో భారీ యంత్రాలతో కొండలన్నీ పిండి పిండి చేస్తున్నారు. దీంతో బౌద్దం ఆనవాళ్లు కానరాకుండా పోవడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అప్పన్న కొండపై అపచారం..! నరసింహస్వామి కొలువుదీరిన క్షేత్రానికే ఎసరు..! అందమైన విశాఖ నగరంలో కొండలన్నింటినీ చంద్రబాబు ప్రభుత్వం పిండి చేస్తోంది. భారీ యంత్రాలతో పెద్ద పెద్ద కొండలను సైతం తవ్వుతూ నేలమట్టం చేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఎర్రమట్టి దిబ్బలకు ఎసరు పెట్టగా.. ఇప్పుడు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వెళ్లే రోడ్డు వెంట ఉన్న కొండలతో పాటు సింహాచలం కొండలనూ వదలడం లేదు. ప్రైవేట్ రిసార్టులు, డేటా సెంటర్ పేరుతో కొండలన్నీ నుజ్జు నుజ్జు చేస్తున్నారు. మరికొద్ది నెలల్లో కొండలన్నీ నేలమట్టమై ప్రైవేటు రిసార్టులు దర్శనమివ్వనున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా విపత్తుల నుంచి విశాఖను కాపాడుతున్న కొండలన్నీ కనుమరుగు కానున్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముడసర్లోవకు నీటి ముప్పు...!సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని (సింహాచలం కొండ) డేటా సెంటర్ పేరుతో ప్రభుత్వం లాక్కుంది. ఇప్పుడు ఈ కొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి. హనుమంతవాక నుంచి గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న ఈ కొండపైనే నరసింహస్వామి కొలువై ఉన్నారు. అప్పన్న కొలువై ఉన్న కొండను తవ్వేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఇది తీవ్ర అపచారమని హెచ్చరిస్తున్నారు. దీన్ని లెక్క చేయకుండా తవ్వకాలు భారీ స్థాయిలో సాగిస్తున్నారు. సింహాచలం కొండ నుంచి వర్షపు నీరు నేరుగా ముడసర్లోవలోకి వస్తుంది. కొండ నుంచి వచ్చే నీరు ముడసర్లోవలోకి చేరేందుకు వీలుగా ప్రత్యేకంగా మూడు ప్రాంతాల్లో సపటలను ఏర్పాటు చేశారు. మధ్యలో ఉన్న బీఆర్టీఎస్ రోడ్డు కింద నీరు వెళ్లేందుకు వీలుగా వీటి నిర్మాణం జరిగింది. భీమిలిలోని పావురాల కొండను తవ్వేస్తున్నారిలా.. తాజాగా జరుగుతున్న తవ్వకాలతో ఈ నీటి ప్రవాహం నిలిచిపోనుంది. ముడసర్లోవరకు ప్రవాహం ఆగిపోతే చుట్టుపక్కల ఉన్న నివాసిత కాలనీలకు కూడా నీటి గండం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ వేసవి కాలంలో పీక్ సీజన్లోనూ ఈ కాలనీలకు నీటి ఎద్దడి సమస్య లేదు. కేవలం 60–70 అడుగుల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు కొండను పూర్తిగా తవ్వేస్తుండటంతో ముడసర్లోవలోకి నీరు వెళ్లే అవకాశం లేదు. ఫలితంగా ముడసర్లోవ పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఇక్కడ ఏర్పాటు చేసిన 2.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్లకు కూడా సమస్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేట్ రిసార్టుల కోసం పావురాల కొండ...!బీచ్ రోడ్డులో భీమిలికి వెళ్లే మార్గంలో కొత్తవలస వద్ద క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి బౌద్ధం ఆనవాళ్లు ఉన్న పావురాల కొండ ఉంది. ఇది ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాచీన బౌద్ధ నిధిగా వ్యవహరిస్తుంటారు. ఈ కొండను ఇప్పుడు ప్రైవేట్ రిసార్టుల కోసం కేటాయించారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటి బౌద్ధ నిధి ఆనవాళ్లను చంద్రబాబు ప్రభుత్వం భారీ యంత్రాలతో తొలిచే యత్నం చేస్తోంది. పావురాల కొండ ఉన్న కొత్తవలస రెవెన్యూ పరిధిలో 15 ఎకరాలను ప్రైవేటు రిసార్టు కోసం ధారాదత్తం చేశారు. ఈ మేరకు 2025 అక్టోబరులో చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నెం 39) జారీ చేసింది. 66 ఏళ్ల లీజుతో పాటు మరో 33 ఏళ్లు పొడిగించే వెసులుబాటుతో మొత్తం 99 ఏళ్లకు మైరా బే వ్యూ రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ సంస్థకు కట్టబెట్టింది. దీని కోసం పావురాల కొండను అడ్డంగా తవ్వేస్తున్నారు. ప్రైవేటు రిసార్టుల కోసం పావురాలకొండలోని 15 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో కాపీ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో పాటు ప్రభుత్వం ప్రాచీన బౌద్ధమత ఆనవాళ్లు లేకుండా చేస్తోంది. అంతేకాదు.. పక్కనే మిగతా కొండలను కూడా 99 ఏళ్ల పాటు లీజుకు కట్టబెట్టి పిండి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకవైపు ఇప్పటికే ఎండాడలో రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తమ బంధువైన గీతం యజమాని, విశాఖ ఎంపీ భరత్‌కు అప్పగించేందుకు సిద్ధమైన ప్రభుత్వ పెద్దలు మరోవైపు కొండలన్నింటినీ ప్రైవేట్ రిసార్టుల కోసం తమ అనుయాయులకు కట్టబెడుతున్నారు. -
ఒంటరిగా ఉన్న మహిళ కాళ్లు, చేతులు కట్టేసి.. హత్య చేసి..
విశాఖ: అక్కయ్యపాలెంలో ఓ మహిళ హత్య కలకలం రేపింది. ఒంటరిగా ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు దారుణానికి తెగబడ్డారు. పార్వతి (50) అనే మహిళ కాళ్లు, చేతులు కట్టేసి, హత్య చేశారు. ఆమె ఇంట్లోని లాకర్‌ను బద్దలుకొట్టి బంగారం, నగదు దోచుకెళ్లారు.ఈ ఘటన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కయ్యపాలెం శ్రీనివాస్‌నగర్, పుట్ట బంగారమ్మ గుడి సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. బంగారం కోసమే ఈ హత్య జరిగి ఉంటుందనే అనుమానంతో దర్యాప్తు చేపట్టారు. -
కాళ్ల పారాణి ఆరకముందే కానరాని లోకాలకు నవవధువు
సాక్షి,విశాఖ: వారు పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకొని బంగారు జీవితం గడపాలని కలలు కన్నారు. కానీ ఆ దంపతుల ఆశలు అడియాసలయ్యాయి. నవ వధువు కాళ్ల పారాణి ఆరకముందే రోడ్డు ప్రమాదంలో మృత్యువు ఆమెను కబళించింది. వరుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వధువు, వరుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి.పోలీసుల వివరాల ప్రకారం, విశాఖపట్నం జిల్లా అగనంపూడి సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కారు అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ వధువు రామేశ్వరి మృతి చెందగా, వరుడు నర్సింగరావు తీవ్ర గాయాలపాలయ్యాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని అత్యవసర చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.బుధవారం రాత్రి 1.58 గంటలకు వాడచీపురు పల్లిలో రామేశ్వరి - నర్సింగరావు వివాహం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వివాహం జరిగిన కొన్ని గంటలకే గురువారం అత్తగారిల్లైన అగనంపూడికి బయల్దేరారు. మార్గం మధ్యలో కారు ప్రమాదానికి గురైంది. రాత్రి పెళ్లి, మరుసటి రోజు ప్రమాదంలో వధువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.ఘనంగా పెళ్లి చేసి కుమార్తెను సంతోషంగా అత్తగారింటికి సాగనంపిన తల్లిదండ్రులు, ఆమె మృతదేహాన్ని చూసి గుండెలవేసిలా రోదిస్తున్నారు. ఈ దృశ్యం స్థానికుల్ని కంటతడి పెట్టిస్తోంది. -
నైరుతి రుతుపవనాలపై ఐఎండీ గుడ్‌న్యూస్
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల రాకపై భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. రుతుపవనాల ముందస్తు రాకకు అనుకూల వాతావరణం ఉందని పేర్కొంది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు.. అండమాన్‌ను తాకనున్నాయని.. ఈ నెలాఖరులోపే కేరళంలోకి రుతు పవనాలు ప్రవేశించనుందని వెల్లడించింది. మే 16, 17 తేదీల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలుపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలో నైరుతి రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది. సాధారణంగా నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు మే 15 నాటికి ప్రవేశిస్తాయి.. అలాగే మే 20 నాటికి అండమాన్ సముద్రం అంతటా విస్తరిస్తాయి. ఈ ఏడాది రుతుపవనాల రాక ఈ కాలక్రమానికి అనుగుణంగానే ఉండబోతోందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంపై రుతుపవనాల రాక దాదాపు షెడ్యూల్ ప్రకారమే ఉన్నట్లు కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు అన్నారు.గతేడాది నైరుతి రుతుపవనాలు సాధారణ షెడ్యూల్ కంటే ముందే.. అంటే మే 13 నాటికే దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవులకు చేరుకున్నాయి. వాతావరణ రికార్డుల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు మే 20 నాటికి అండమాన్ సముద్రాన్ని కవర్ చేసి.. జూన్ 1 నాటికి కేరళం తీరాన్ని తాకుతాయి. అయితే, 2026 నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని ఐఎండీ ముందస్తు అంచనాలు పేర్కొన్నాయి. -
పంచ గ్రామాల భూసమస్యకు చంద్రబాబు తప్పిదమే కారణం
సింహాచలం: పంచగ్రామాల భూ సమస్యకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని, 1996–97లో ఆయన సీఎంగా ఉన్నప్పుడే సింహాచలం దేవస్థానానికి రైత్వారీ పట్టాలు కట్టబెట్టారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. అప్పటి నుంచే ఈ ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కోరుతూ సీపీఎం గత పది రోజులుగా చేపట్టిన పాదయాత్ర ముగింపు సందర్భంగా మంగళవారం సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘గడిచిన మూడు దశాబ్దాలుగా పంచగ్రామాల నివాసితులు, రైతులు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. పట్టాలు సాధించే వరకు ఈ పోరాటం ఆగదు. 1996–97లో దేవస్థానానికి ఇచ్చిన పట్టాలను రద్దు చేసి, ప్రస్తుత నివాసితుల పేరిట పట్టాలు ఇవ్వాలి. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలి’ అని హెచ్చరించారు. విశాఖ వాసులను నిర్వాసితులుగా మార్చేస్తూ, నగరం పేరును ‘గూగుల్ పట్నం’గా మార్చేస్తున్నారని విమర్శించారు. 12 వేల మంది ప్రజలు దశాబ్దాలుగా సమస్యతో సతమతమవుతుంటే పట్టించుకోని ప్రభుత్వం, కేవలం ఒక కలం పోటుతో 260 ఎకరాల దేవస్థానం భూములను ఎకరం కేవలం 99 పైసలకే గూగుల్ సంస్థకు కట్టబెట్టడం దారుణమని ధ్వజమెత్తారు. ఇది లీజు అగ్రిమెంట్ కాదు, నేరుగా సేల్ అగ్రిమెంట్ అని ఆరోపించారు. పారిశ్రామికవేత్తల తీర్పు కోరుతున్న చంద్రబాబు.. తనను ప్రజలు గెలిపించారో లేక పారిశ్రామికవేత్తలు గెలిపించారో ఆలోచించుకోవాలన్నారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పడం ఒక పెద్ద మోసం అని, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. గూగుల్ ఏర్పాటు కోసం రూ.22వేల కోట్ల రాయితీలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కాకుంటే చలో అమరావతి నిర్వహిస్తామని ప్రకటించారు. సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ.. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సభలో సీపీఎం నాయకులు బి.గంగారావు, పి. వెంకటరెడ్డి, అజశర్మ, బి.రమణి, పి.వి.ఎస్.ఎన్. శాస్త్రి, సమైక్య ప్రజా రైతు సంక్షేమ సంఘం కార్యదర్శి టి.వి.కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. సభలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు బహిరంగ సభలో పాల్గొన్న పంచ గ్రామాల ప్రజలు -
కేజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలందించాలి
మహారాణిపేట: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పరిపాలన, పర్యవేక్షణ, సిబ్బంది వినియోగం, రోగులకు మార్గదర్శక వ్యవస్థను బలోపేతం చేయాలని ఎంపీ శ్రీభరత్ సూచించారు. మంగళవారం ఆంధ్ర వైద్య కళాశాలలో కేజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్‌తో కలిసి నిర్వహించారు. ఆసుపత్రి సేవలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన ఎంపీ, సిబ్బంది కొరత లేదా అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోందన్నారు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ల్యాబ్ పరీక్షల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని విభాగాల్లో పడకల కొరతతో ఇద్దరు రోగులు ఒకే బెడ్‌ను వినియోగిస్తుండగా, మరికొన్ని విభాగాల్లో పడకలు ఖాళీగా ఉండటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అత్యవసర విభాగాల్లో సౌకర్యాల విస్తరణ, ఎయిర్ కండీషనింగ్ సమస్యల పరిష్కారం, మరుగుదొడ్ల నిర్వహణ, స్ట్రెచర్లు, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కొంతమంది సిబ్బంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఎంపీ తీవ్రంగా స్పందించారు. మృతదేహాల తరలింపు, పోస్టుమార్టం సేవల్లో డబ్బులు డిమాండ్ చేయడం సహించబోమని హెచ్చరించారు. ‘మే ఐ హెల్ప్ యూ’ డెస్కులు కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మాట్లాడుతూ రోగులకు సరైన మార్గదర్శకత్వం అందించేందుకు ఆసుపత్రి పరిధిలో ఎనిమిది ‘మే ఐ హెల్ప్ యూ’ డెస్కులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓపీ విభాగాలు, ల్యాబ్‌లు, ఇతర ప్రధాన ప్రాంతాల్లో నర్సింగ్ విద్యార్థులు, భద్రతా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బందితో సహాయక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఫోన్ కాల్స్, మెసేజ్‌ల ద్వారా ఫాలోఅప్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారం కోసం కంప్లైంట్ బాక్సులు, టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదులు అందిన వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నామని, కొంతమంది అవుట్సోర్సింగ్ సిబ్బందిపై ఇప్పటికే సస్పెన్షన్, టర్మినేషన్ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. -
సమష్టి పోరాట ఫలితమే విశాఖ రైల్వే జోన్
అల్లిపురం: విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడం రాజకీయ పార్టీలు, పౌర, ప్రజాసంఘాల సమష్టి విజయం అని రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు. మంగళవారం అల్లిపురంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, ప్రజాస్వామ్యవాదుల కృషితో సాగిన పోరాట ఫలితమే నేటి ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్’అని ఆయన స్పష్టం చేశారు. ఇది ఏ ఒక్క పార్టీకో లేదా వ్యక్తికో దక్కిన విజయం కాదని, రాష్ట్రంలోని అన్ని శక్తులు ఏకతాటిపైకి వచ్చి చేసిన పోరాటమని గుర్తు చేశారు. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ఈ ప్రకటన వెనుక అనేక మంది త్యాగాలు, ఎదుర్కొన్న నిర్బంధాలు, కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పోరాటంలో సీపీఐ, సీపీఎం సహా ఇతర వామపక్షాలు, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ, లోక్‌సత్తా, బీజేపీ నాయకుల కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ జోన్ ద్వారా వచ్చే ప్రయోజనాలు ఉత్తరాంధ్ర ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా అందరం కలిసి కృషి చేద్దామని సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఐ నాయకులు ఎ.విమల, ఎస్.కె.రహిమాన్, కె.సత్యనారాయణ, పి.చంద్రశేఖర్, ఎం.పైడిరాజు, సి.హెచ్.క్షేత్రపాల్ రెడ్డి, ఎం.మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్ జేవీ సత్యనారాయణమూర్తి -
● ఏం ఎండరా బాబూ!
నగరంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. సముద్ర తీరం కావడంతో గాలిలో తేమ శాతం పెరిగి, ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండ ప్రభావం మొదలవుతోంది. మధ్యాహ్నం అయ్యే సరికి ప్రధాన రహదారులన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. రోడ్లపై వెళ్తుంటే వేడి గాలులు ముఖానికి తగిలి పాదచారులు, ద్విచక్ర వాహనదారులు అల్లాడిపోతున్నారు. ఎండ వేడికి భయపడి ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావడానికి సాహసించడం లేదు.అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే గొడుగులు, టోపీలు ధరించి బయటకు వస్తున్నారు. రోడ్లపై విపరీతమైన వేడిమి వల్ల ఎండమావులు ఏర్పడుతున్నాయి. రోడ్డుపై నీళ్లు ఉన్నట్లు కనిపిస్తూ వాహనదారులను భ్రమింపజేస్తున్నాయి. ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
మహిళలు, బాలికల రక్షణకే తొలి ప్రాధాన్యం
మహిళా పోలీస్ స్టేషన్ సీఐ కంది నీలిమ అల్లిపురం: మహిళలు, బాలికలపై జరిగే నేరాల పట్ల ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు మహిళా పోలీస్ స్టేషన్ కొత్త సీఐ కంది నీలిమ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆమె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మహిళా పోలీస్‌స్టేషన్ ఏసీపీ సీహెచ్ అంబేడ్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఏసీపీ అంబేడ్కర్ మాట్లాడుతూ.. మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేయాలని సీఐకి సూచించారు. శక్తి యాప్ వినియోగం, మహిళా చట్టాలపై విద్యార్థినులకు నిరంతరం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీఐ నీలిమ మాట్లాడుతూ.. గతంలో తాను ఎస్ఐగా ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తానని, బాధితులకు, ఫిర్యాదుదారులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. -
పూడిక తీశారా? నిధులు నొక్కేశారా?
అక్కడ కాలువ కట్టలేదు.. కనీసం కొత్త స్లాబులు వేయలేదు. కానీ బిల్లులు మాత్రం అక్షరాలా రూ.78 లక్షలు! మధురవాడ జోన్లో జీవీఎంసీ నిధుల దుర్వినియోగం పరాకాష్టకు చేరింది. కొమ్మాది–కార్‌షెడ్ జంక్షన్ల మధ్య పూడిక తీత పనులు ‘కాసుల వర్షం’ కురిపించగా.. సామాన్య జనం మాత్రం చిన్నపాటి వర్షానికే మురుగు నీటిలో నానుతున్నారు. ఇది ఇంజనీరింగ్ అద్భుతమో లేక పాలకుల ‘పంపిణీ’ పథకమో అర్థం కాక స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. మధురవాడ: జీవీఎంసీ మధురవాడ జోన్లో ప్రజాధనం పక్కదారి పట్టింది. కేవలం కాలువల్లో పూడిక తీయడానికే రూ. 78 లక్షలు ఖర్చు చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. తీరా సమస్య పరిష్కారమైందా? అంటే అదీ లేదు. దీంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. కూటమి పాలకులు, అధికారులు కుమ్మకై ్క సామాన్యుల పన్నుల సొమ్మును కాలువ పాలు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాలువ నిర్మాణానికి ఖర్చయ్యే నిధులను కేవలం చెత్త తీయడానికే వెచ్చించడం గమనార్హం. పేరుకే పనులు.. తీరని కష్టాలు సుమారు 25 ఏళ్ల క్రితం జాతీయ రహదారి నిర్మాణ సమయంలో కొమ్మాది జంక్షన్ నుంచి కార్‌షెడ్ జంక్షన్ వరకు సర్వీసు రోడ్డును ఆనుకుని భారీ కాలువలు నిర్మించారు. ఈ కాలువలపై ఉన్న స్లాబులు కాలక్రమేణా ధ్వంసం కావడంతో మురుగునీరు, చెత్తాచెదారం పేరుకుపోయి నీరు ప్రవహించే దారి లేకుండా పోయింది. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో దాదాపు 5 కిలోమీటర్ల మేర ఈ కాలువల్లో పూడిక తొలగించేందుకు రూ. 78 లక్షలతో పనులు చేపట్టారు. అయితే, ఇంత భారీ మొత్తాన్ని కేవలం పూడిక తీతకే కేటాయించడం విస్మయానికి గురిచేస్తోంది. పనులు జరిగిన సమ యంలో పగిలిపోయిన స్లాబులను బాగు చేయడం గానీ, కొత్తవి వేయడం గానీ చేయకుండా.. కేవలం చెత్త తీసినట్లు లెక్కలు చూపి నిధులు మ ళ్లించార నే విమర్శలు వినిపిస్తున్నాయి. అ ప్పట్లో జరిగిన ఖర్చు వివ రాలు ఇప్పటివరకు బయటకు రాకుండా గోప్యంగా ఉంచడం మరి న్ని అనుమానాలకు తావిస్తోంది. మొదటికే వచ్చిన సమస్య ఇంత భారీ ఖర్చుతో పనులు చేపట్టినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికే మధురవాడ అప్ బ్రిడ్జి ప్రాంతం మళ్లీ చెరువులా మారిపోయింది. కార్‌షెడ్, మిథిలాపురి ఉడా కాలనీ, చంద్రంపాలెం, శివశక్తినగర్ జంక్షన్ల వద్ద వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు, పాదచారులు నరకయాతన అనుభవించారు. పూడిక తీసినట్లు రికార్డులు చెబుతున్నా, నీటి ప్రవాహం ఎందుకు ఆగడం లేదన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సమగ్ర విచారణ జరపాలి కూటమి పాలకులు కేవలం చెత్త తొలగింపు పేరుతో రూ.78 లక్షల ప్రజాధనం వెచ్చించారు. కనీసం స్లాబులు కూడా వేయకుండా పూడికతీత పేరుతో నిధులు నొక్కేశారు. ఈ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్లిందో తక్షణమే విచారణ జరపాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. –డి. అప్పలరాజు, సీపీఎం నాయకుడు -
మద్దిలపాలెంలో సత్యారెడ్డి అరాచకం
ఎంవీపీకాలనీ: మద్దిలపాలెంలో 23వ వార్డు మాజీ కార్పొరేటర్ భర్త గుడ్ల సత్యారెడ్డి అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ఒకపక్క లిక్కర్ దందాతో, మరోపక్క నిర్మాణ రంగం(బిల్డర్‌గా)లో బెదిరింపులకు పాల్పడు తూ ఆయన భయాందోళనలు సృష్టిస్తున్నారు. తాజాగా సత్యారెడ్డి, అతని అనుచరులపై నీలాపు మోహనరావు అనే వ్యక్తి ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని అరాచక పర్వం మరోసారి వెలుగులోకి వచ్చింది. మద్దిలపాలెంలోని దేవి హోమ్స్ ఎదురుగా ఉన్న తన 384 గజాల స్థలాన్ని మోహనరావు గతంలో డెవలప్మెంట్కు ఇచ్చారు. అయితే ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన షేర్ ఇవ్వాలని ఆయన కొన్నేళ్లుగా సత్యారెడ్డిని కోరుతున్నారు. ఈ వివాదంపై సత్యారెడ్డి స్పందించకపోవడంతో, మోహనరావు 2024లో కోర్టును ఆశ్రయించారు. విచారణలో సమయంలో కోర్టు సమక్షంలో సత్యారెడ్డి రూ.16 లక్షలు బాధితుడికి చెల్లించారు. అయితే మరికొంత నగదుతో పాటు ఒక ఫ్లాట్, కార్ పార్కింగ్ స్థలం, అద్దె నగదు మోహనరావుకు చెల్లించాల్సి ఉంది. వీటిని కూడా కోర్టు సమక్షంలోనే చెల్లిస్తానని హామీ పత్రం ఇచ్చిన సత్యారెడ్డి, కొంతకాలంగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. మరోవైపు, వివాదంలో ఉన్న ఫ్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ కాకపోయినా.. కొందరు తెలియక అడ్వాన్స్ చెల్లిస్తుండటంతో దాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. బాధితుడిపై పిడిగుద్దులు : కోర్టు ఆదేశాలను ధిక్కరించి ప్లాట్లు విక్రయిస్తుండటంతో, బాధితుడు మోహనరావు ఈ నెల 8న భవన సముదాయం వద్దకు వెళ్లి కొనుగోలుదారులను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న సత్యారెడ్డి తన అనుచరులు నాగేశ్వరరెడ్డి, రవి, మహేష్, భరత్‌లతో కలిసి అక్కడికి చేరుకుని మోహనరావుపై దాడి చేశారు. పిడిగుద్దులతో విరుచుకుపడటంతో మోహనరావు తీవ్రంగా గాయపడ్డారు. బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలతో ఉన్న ఆయన ఈ దాడితో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. స్థానికుల సాయంతో వారి నుంచి తప్పించుకుని కేజీహెచ్‌లో చేరిన ఆయన.. మెరుగైన వైద్యం కోసం ఎంవీపీకాలనీలోని మెడికవర్‌లో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలు ఎంఎల్సీ నమోదు చేయగా, ఎస్ఐ డి.డి.నాయుడు బాధితుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఎట్టకేలకు కేసు నమోదు : ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల వరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేయలేదు. సత్యారెడ్డి మాజీ కార్పొరేటర్ భర్త కావడంతో పాటు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటం వల్లే పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా, తీవ్ర వివాదస్పదమైన ఈ ఘటనపై ఎట్టకేలకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎంవీపీ పోలీసు స్టేషన్ వర్గాలు వెల్లడించాయి. తనపై దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు మోహనరావు డిమాండ్ చేస్తున్నారు. -
ఐఐపీఈ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు
సబ్బవరం: భారతీయ పెట్రోలియం అండ్ శక్తి సంస్థ(ఐఐపీఈ) ఆరో స్నాతకోత్సవాన్ని ఈ నెల 14న వంగలిలోని శాశ్వత క్యాంపస్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం వర్సిటీలో విలేకరుల సమావేశంలో ఐఐపీఈ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షుడు ఆచార్య పి.కె.బానిక్ వివరాలు వెల్లడించారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వి.కె.సరస్వత్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందజేస్తారు. ఈ ఏడాది మొత్తం 114 మంది విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. వీరిలో 97 మంది బీటెక్, 15 మంది పీజీ, ఇద్దరు పీహెచ్డీ విద్యార్థులు ఉన్నారు. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్, గోల్డ్, సిల్వర్ మెడల్స్‌తో పాటు ప్రత్యేక పురస్కారాలు ప్రదానం చేస్తారు. 2025–26 విద్యా సంవత్సరంలో బీటెక్‌లో 84.82 శాతం ప్లేస్‌మెంట్స్ నమోదయ్యాయి. కెమికల్ ఇంజనీరింగ్‌లో అత్యధికంగా రూ.17.90 లక్షలు, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో రూ.16.22 లక్షల వార్షిక వేతనం లభించింది. తొలిసారిగా సొంత శాశ్వత క్యాంపస్‌లో స్నాతకోత్సవం నిర్వహించడం గర్వకారణమని ఆచార్య బానిక్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో 601 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఐఐపీఈ డైరెక్టర్ ఆచార్య శాలివాహన్, అసోసియేట్ డీన్ హిమాంగ్షు కాకతి, రిజిస్ట్రార్ రామ్‌ఫల్ ద్వివేది పాల్గొన్నారు. -
అహర్నిశలు శ్రమించిన విద్యార్థులు
నీట్ పరీక్ష కోసం అహర్నిశలు శ్రమించి, ఎన్నో వ్యయప్రయాసలు భరించి పరీక్ష రాసిన విద్యార్థులకు ఈ పరిణామం విషమ పరీక్షగా మారింది. పరీక్ష పూర్తయ్యిందన్న ఆనందంలో ఉన్న విద్యార్థులు ఇప్పుడు మళ్లీ పునశ్చరణకు సిద్ధం కావాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నీట్ పరీక్షలో తరచూ తలెత్తుతున్న సమస్యలు విద్యార్థుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీంతో బైపీసీ కోర్సుపై కూడా విద్యార్థుల్లో వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంటోంది. –మల్లెంపల్లి మురళీకృష్ణ, డైరెక్టర్, ఎసెంట్ మెడికల్ అకాడమీ -
సెంట్రల్ జైలులో న్యాయ సహాయక కేంద్రం ప్రారంభం
కాఫీ తాగుతూ.. కార్గో చూస్తూ..సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సముద్ర తీరంలో చల్లని గాలిని ఆస్వాదిస్తూ, వేడి వేడి కాఫీ తాగుతూ.. భారీ నౌకల్లో కార్గో హ్యాండ్లింగ్ ఎలా జరుగుతుందో చూడాలని ఉందా? సముద్రపు అలల సవ్వడి వింటూ... విదేశాల నుంచి వచ్చే క్రూయిజ్ పర్యాటకులకు చిరునవ్వుతో హాయ్ చెప్పాలని భావిస్తున్నారా? భారీ నౌకల్లోకి సరుకుల ఎగుమతులు, దిగుమతులు ఎలా చేస్తారో ఎలాంటి అనుమతులు లేకుండానే దగ్గరి నుంచి చూడాలని ఉందా?.. విశాఖ నగర వాసులకు ఈ కోరికలన్నీ త్వరలోనే తీరనున్నాయి. నగర పౌరుల కోసం విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) సరికొత్త పర్యాటక కానుకను సిద్ధం చేసింది. విశాఖ వాసులకు పర్యాటక కానుక రూ.16 కోట్లతో 600 మీటర్ల పొడవైన అందమైన ‘పబ్లిక్ పోర్ట్ ప్రొమెనేడ్’ను పోర్టు అధికారులు నిర్మించారు. తీర ప్రాంత పర్యాటక మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ప్రజలకు ఆకర్షణీయమైన విహార ప్రదేశాలను అందించే లక్ష్యంతో మంగళవారం విశాఖ పోర్టు ఇన్చార్జి చైర్మన్ డాక్టర్ ఎం. అంగముత్తు ఈ ప్రొమెనేడ్‌ను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పచ్చటి ల్యాండ్‌స్కేపింగ్‌తో దీనిని అత్యంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఎటువంటి ప్రవేశ రుసుం లేకుండానే సముద్రతీరంలో వాకింగ్ చేసుకునే వెసులుబాటు, చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేక ఆటస్థలం, అలాగే సువిశాలమైన పార్కింగ్ సదుపాయం ఇక్కడ కల్పించారు. ఈ నెలాఖరు నుంచి ఈ ప్రదేశం నగర ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని చైర్మన్ అంగముత్తు తెలిపారు. క్రూయిజ్ టెర్మినల్‌కు సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న దారి గుండా ఈ ప్రొమెనేడ్‌ను చేరుకోవచ్చు. లైవ్ మారిటైం వీక్షణ సాధారణంగా ఏ పోర్టులో జరిగే కార్యకలాపాలనైనా సామాన్యులు దగ్గరి నుంచి చూసే అవకాశం ఉండదు. కానీ, విశాఖలో మాత్రం పోర్టులో జరిగే సముద్ర వ్యాపార కార్యక్రమాలను ప్రజలు లైవ్‌గా వీక్షించేలా ఈ ప్రొమెనేడ్‌ను డిజైన్ చేయడం విశేషం. భారీ నౌకల నుంచి సరుకుల రవాణా, అంతర్జాతీయ క్రూయిజ్‌ల రాకపోకలను ప్రజలు సురక్షితంగా చూసి ఆనందించేందుకు వీలుగా ఇక్కడ ప్రత్యేకమైన డెక్స్‌ను ఏర్పాటు చేశారు. దేశంలోనే ఎంతో ప్రత్యేకం దేశంలో అనేక సముద్ర తీర ప్రాంతాల్లో ప్రొమెనేడ్లను అభివృద్ధి చేశారు. పుదుచ్చేరిలో రాక్ బీచ్ ప్రాంతంలో కిలోమీటరుకుపైగా ఉన్న బీచ్ రాక్ ప్రొమెనేడ్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పర్యాటకులు హాయిగా సేద తీరేందుకు ఏర్పాట్లు చేశారు. కేఫ్‌ల్లో కాఫీ తాగుతూ సముద్ర అందాలను తిలకించే వీలుంది. ఇక ముంబైలో 3 కిలోమీటర్ల పొడవైన ‘క్వీన్స్ నెక్లెస్ ఆర్క్’ముంబై డ్రైవ్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ముంబై కోస్టల్ రోడ్ ప్రొమెనేడ్ ఏకంగా 7.5 కిలోమీటర్ల పొడవుతో షియోన్ పార్క్ నుంచి షిరోన్ పార్క్ వరకూ అభివృద్ధి చేశారు. ఇక కోల్‌కతా వద్ద నది తీరం వెంబడి విహార ప్రదేశాన్ని అభివృద్ది చేయగా.. కొచ్చి వద్ద బ్యాక్ వాటర్ వద్ద ఉన్న నడక మార్గం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే.. విశాఖ ప్రొమెనేడ్ మాత్రం వీటన్నింటికీ భిన్నం. సముద్ర అందాలను ఆస్వాదించడంతో పాటు, నౌకాశ్రయంలో జరిగే లైవ్ వ్యాపార కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కేవలం విశాఖ పబ్లిక్ ప్రొమెనేడ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
కన్నీట్ సుడులు
నీట్ రద్దుతో విద్యార్థుల కన్నీటి పర్యంతంప్రభుత్వ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం రెండేళ్ల శ్రమ బుగ్గిపాలేనని అభ్యర్థుల ఆవేదన రెండేళ్ల కష్టం.. ఎన్నో ఆశలు.. ఒక వైద్య సీటు కోసం జీవితాన్ని పుస్తకాలకే అంకితం చేసిన లక్షలాది విద్యార్థుల కలలను నీట్ రద్దు నిర్ణయం ఒక్కసారిగా ఛిద్రం చేసింది. ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తుండగా.. మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనలోకి నెట్టేసింది. మద్దిలపాలెం: వైద్యుడై సమాజానికి సేవ చేయాలని, తెల్లకోటు వేసుకుని స్టెతస్కోప్‌తో రోగి నాడి పట్టుకోవాలని.. లక్షలాది మంది విద్యార్థులు రెండేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. మే 3వ తేదీన పరీక్ష రాసి బయటకు వచ్చేటప్పుడు, వారి కళ్లలో ఒక రకమైన సంతృప్తి.. ‘అమ్మా, నాన్నా.. నేను డాక్టర్ అవుతాను’ అన్న ధీమా. కానీ, ఆ సంతోషం చిటికెలో ఆవిరైపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నీట్ యూజీ 2026 రద్దు నిర్ణయం, లక్షలాది మంది విద్యార్థుల గుండెల్లో గునపమై దిగినట్టయింది. ప్రతిభావంతులు బలి రాజస్థాన్‌లో వెలుగు చూసిన ‘పేపర్ లీక్’ ఉదంతం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పునాదులను కదిలించింది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించడం, పరీక్షను ర ద్దు చేయడం సరైన నిర్ణయమే కావచ్చు. కానీ, అక్రమాలకు పాల్పడిన కొందరు స్వార్థపరుల వల్ల, రాత్రింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది సాధారణ విద్యార్థులు ఇప్పుడు అనిశ్చితిలో పడిపోయారు. ఆగిపోయిన కల.. ఆవిరైన శ్రమ చిన్న చిన్న గదుల్లో బందీలై, పుస్తకాలే ప్రపంచంగా బతికిన విద్యార్థుల ఆవేదన వర్ణనాతీతం. ‘రెండేళ్ల శ్రమ.. వేల గంటల సాధన.. అంతా ఒక్క నిర్ణయంతో బూడిదలో పోసిన పన్నీరైంది. మళ్లీ అదే ఏకాగ్రతతో పుస్తకాలు పట్టగలమా? ఆ ఉత్సాహం మళ్లీ వస్తుందా?’ అని విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లిదండ్రుల పరిస్థితి మరింత దయనీయం. తమ పిల్లల చదువు కోసం రెక్కల కష్టం ధారబోసి, కోచింగ్ సెంటర్లకు రూ.లక్షలు కుమ్మరించిన వారు, ఇప్పుడు తమ బిడ్డల నిరాశను చూసి తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటుండగాం తల్లిదండ్రులు వారిని ఓదార్చలేని పరిస్థితి నెలకొంది. ఎన్టీఏ భరోసా సరిపోతుందా? రీ–ఎగ్జామ్ కోసం కొత్తగా దరఖాస్తు చేయక్కర్లేదని, ఫీజు కట్టనవసరం లేదని ఎన్టీఏ చెబుతోంది. కానీ, విద్యార్థులకు కావాల్సింది ఆర్థిక వెసులుబాటు కాదు, మానసికస్థైర్యం. ఒకసారి రాసిన పరీక్షను, అది కూడా లీకేజీ మరకల మధ్య మళ్లీ రాయాల్సి రావడం అంటే, విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే. వ్యవస్థ మారేది ఎప్పుడు? పేపర్ లీక్.. రద్దు.. వేలాది మంది విద్యార్థుల కన్నీళ్లు. ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న అక్రమార్కులకు కఠిన శిక్ష పడాల్సిందే. ఈ రద్దు నిర్ణయం వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందేమో కానీ, విద్యార్థుల మనసులకు తగిలిన గాయాన్ని మాత్రం అంత సులభంగా మాన్పలేదు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి నీట్ పరీక్షల్లో వరుసగా వెలుగుచూస్తున్న పేపర్ లీకేజీ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పీడీఎస్‌వో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.సురేష్ డిమాండ్ చేశారు. మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో ‘గెస్ పేపర్’ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారమైన ప్రశ్నలు అసలు పరీక్షలో రావడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందన్నా రు. గత ఏడాది కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నీట్ స్కామ్‌ల వల్ల ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌వో డిమాండ్ చేసింది. కేంద్ర అసమర్థత వల్లే : ఎస్ఎఫ్ఐ మద్దిలపాలెం: నీట్ పేపర్ లీకేజీ ఘటనకు కేంద్ర ప్రభుత్వ అసమర్థతే కారణమని ఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా కమిటీ విమర్శించింది. జిల్లా అధ్యక్షుడు జి.అజయ్, కార్యదర్శి డి.వెంకటరమణ మాట్లాడుతూ, జాతీయ స్థాయి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పూర్తిగా విఫలమైందన్నారు. నీట్లో భారీ స్థాయిలో ప్రశ్నలు లీక్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయని, ఇది పరీక్షల నిర్వహణలో ఉన్న లోపాలను బయటపెడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ కేంద్రీకరణ విధానాల వల్లే ఎగ్జామ్ మాఫియా పెరిగి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. -
పక్కా ప్రణాళికతో లక్ష్య సాధన
కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ మహారాణిపేట: జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తన చాంబర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల వార్డుల మ్యాపింగ్, మన మిత్ర శిక్షణ, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో మిస్సింగ్ వివరాల నమోదు, మత్స్యకార లబ్ధిదారుల ఈ–కేవైసీ తదితర అంశాల పురోగతిని తెలుసుకున్నారు. స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు సేవలు, పీ4– బంగారు కుటుంబాల అనుసంధానం, కౌశలం పరీక్షలు, ఉద్యో గ మేళాల నిర్వహణ, ఆధార్ ప్రత్యేక శిబిరాల ఏర్పా టు వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఉద్యోగుల హాజరు పర్యవేక్షణతో పాటు ఏపీ సేవా సేవలు, ఫీల్డ్ పెండెన్సీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలాగే స్వర్ణ వార్డు–స్వర్ణ గ్రామం సేవలను విస్తృతం చేయాలని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని సూచించారు. పౌరుల ఈ–కేవైసీ ప్రక్రియను లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల వార్డుల మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని, గాజువాకలో అధిక పెండింగ్ ఉండటంపై సంబంధిత జోనల్ కమిషనర్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. కౌశలం కార్యక్రమం ద్వారా సుమారు 90 వేల మందికి పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు సచివాలయాలకు నేమ్ బోర్డులను ఏర్పాటు చేయాలని, ఎవరైనా సచివాలయాలను తనిఖీ చేస్తే తనకు ముందస్తు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా స్వర్ణగ్రామ–స్వర్ణవార్డు అధికారి పూర్ణిమాదేవి, జీవీఎంసీ అదనపు కమిషనర్ సత్యవేణి, డీడీవో ఉషారాణి, జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ప్రత్యక్షంగా పాల్గొనగా, అన్ని జోనల్ కమిషనర్లు, ఎంపీడీవోలు వర్చువల్‌గా హాజరయ్యారు. -
పోర్ట్ స్టేడియం లీజులో రూ.40 కోట్ల కుంభకోణం
జనసేన నేత పీతల మూర్తి యాదవ్ బీచ్‌రోడ్డు: విశాఖ పోర్ట్ స్టేడియం లీజును తీసుకున్న ‘విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్’సంస్థకు, థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరిట రూ.40 కోట్లు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్లో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో సహకరిస్తున్న విశాఖ పోర్ట్ అధికారులపై సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖలు తక్షణమే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సదరు సంస్థకు ఎటువంటి చెల్లింపులు చేయకూడదని, ప్రస్తుతం బదిలీపై వెళ్తున్న చైర్మన్ అంగముత్తు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని మూర్తి యాదవ్ పేర్కొన్నారు. రూ.40 కోట్ల పోర్ట్ ధనాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు అధికారు లు అత్యుత్సాహం చూపుతున్నారని ఆరోపించారు. వాస్తవానికి, తమకు రూ.48 కోట్ల పరిహారం చెల్లించాలంటూ విశ్వనాథ్ సంస్థ ఫిబ్రవరి 2న చీఫ్ ఇంజినీర్‌కు లేఖ రాసిందని.. దీని ఆధారంగా కోర్టు తీర్పులకు విరుద్ధంగా, థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరిట అక్రమ మార్గంలో కోట్లు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తొలుత ఉన్న అంచనాలను కాదని, నష్టపరిహారం తక్కువగా ఉందనే నెపంతో కోల్‌కతాకు చెందిన ‘మెకాన్’అనే సంస్థకు తిరిగి అంచనాల బాధ్యత అప్పగించారని దుయ్యబట్టారు. పాత అంచనాల కంటే కనీసం 50 శాతం అదనంగా అంచనాలను పెంచాలని సదరు సంస్థకు లోపాయికారీగా ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. విశ్వనాథ్ సంస్థపై ప్రస్తుత చైర్మన్ అంగముత్తు గతంలో చర్యలు తీసుకుని లీజు ఒప్పందాన్ని రద్దు చేశారని, అయితే ఆయన బదిలీ కావడంతో ప్రస్తుతం ఇన్చార్జి చైర్మన్‌గా కొనసాగుతున్నారని మూర్తి యాదవ్ తెలిపారు. కొత్త చైర్మన్‌గా జస్మిత్ సింగ్ బింద్రా ఆదివారమే నియమితులైనందున, ఆయన బాధ్యతలు స్వీకరించే వరకు అంగముత్తు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకూడదని డిమాండ్ చేశారు. -
స్టీల్‌ప్లాంట్ సీఎండీగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీగా ఎం.ఎన్.వి.ఎస్.ప్రభాకర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభాకర్ నాగపూర్‌లోని వీఆర్సీ నుంచి మెటలర్జీలో బీటెక్ పూర్తి చేసిన తర్వాత 1991లో సెయిల్‌లో మేనేజ్మెంట్ ట్రైనీ (టెక్నికల్)గా తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన హెచ్ఆర్, మార్కెటింగ్‌ల్లో ఎంబీఏ పూర్తి చేశారు. వివిధ ఆపరేషన్ల యూనిట్లలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన 2025 ఫిబ్రవరి 1న ఎన్.ఎస్.ఎల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. ఆయన నాయకత్వంలో సంస్థ రేటెడ్ కెపాసిటీకి దగ్గరగా కార్యకలాపాలను స్థిరీకరించడం, సాంకేతిక–ఆర్థిక అంశాల్లో గణనీయమైన మెరుగుదల, ఉత్పాదకతను పెంచడం జరిగింది. ఈ తరుణంలో ఆయన స్టీల్‌ప్లాంట్ సీఎండీగా నియమితులయ్యారు. -
బాబూ.. అది పుష్పక విమానం కాదు..
విశాఖపట్నం: సాగర తీరంలో ఈ యువకుల ప్రయాణం చూస్తుంటే.. అది బైకులా కాకుండా అందరూ ఇట్టే ఇమిడిపోయే ‘పుష్పక విమానం’లా కనిపిస్తున్నట్టుంది. నిబంధనల ప్రకారం ఇద్దరికే చోటున్నా, ఏకంగా నలుగురు ఎక్కి ‘చతుర్ముఖ’ ప్రయాణంతో ట్రాఫిక్ రూల్స్‌ను నడిరోడ్డుపై గాలికొదిలేశారు. అటు హెల్మెట్ లేదు.. ఇటు భద్రతా లేదు.. కేవలం సరదా కోసం ప్రాణాలను పణంగా పెడుతూ చేస్తున్న ఈ సాహసం ఏ మాత్రం అదుపు తప్పినా తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తుంది. -
మద్యం మానిపిస్తే ఆత్మహత్య చేసుకుంటా..
విశాఖపట్నం జిల్లా: మద్యానికి బానిసై కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్న ఓ వ్యక్తి, పునరావాస కేంద్రానికి తరలిస్తుండగా నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. బలవంతంగా మద్యం మానిపిస్తే బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంటానని అలజడి సృష్టించాడు. రిహాబిలిటేషన్ కేంద్రానికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ద్విచక్ర వాహనం పైనుంచి దిగిపోయి, ఆర్టీసీ బస్సు కింద పడుకుని నానా యాగీ చేశాడు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాలపట్నం సమీపంలోని బాజీ జంక్షన్‌కు చెందిన భార్గవ్ మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని కుటుంబ సభ్యులను వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో అతడికి మద్యం మానిపించేందుకు చినముషిడివాడలోని రిహాబిలిటేషన్ కేంద్రానికి తరలిస్తున్నారు. అయితే సుజాతనగర్ బీఆర్టీఎస్ రహదారిపై ఒక్కసారిగా వాహనం దిగిపోయిన భార్గవ్.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపేశాడు. వెంటనే బస్సు కింద పడుకుని, తనను కేంద్రానికి తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటానని భీష్మించాడు. దీంతో ప్రయాణికులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని స్టేషన్‌కు తరలించారు. అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి, అతడికి మెరుగైన మానసిక చికిత్స అందించాలని కుటుంబ సభ్యులకు సూచించారు. -
● ఆసరాగా అడుగులు.. నమ్మకమే వెలుగులు
కనురెప్పల వెనుక కాంతి లేకపోతేనేం... గుండె లోతుల్లో నమ్మకపు దీపం వెలుగుతుంటే! గమ్యం చేరడానికి దారి చూపించే కళ్లు లేకున్నా.. చేయి విడవని తోడు, గుండె నిండిన ధైర్యమే వీరి బలం! ఈ లోకం వీరికి కనిపించకపోవచ్చు.. కానీ ఒకరి స్పర్శ మరొకరికి కొండంత అండ. చీకటి తెరలను చీల్చుకుంటూ సాగుతున్న ఈ అడుగులు.. మనుషుల మధ్య ఉండాల్సిన మమకారానికి మౌన భాష్యమని స్పష్టం చేస్తున్నాయి. వన్‌టౌన్ పాత పోస్టాఫీసు ప్రాంతంలో ఒకరికొకరు ఆసరాగా నిలిచిన ఈ దృశ్యం, చూపు లేకున్నా నమ్మకంతో గమ్యాన్ని ముద్దాడవచ్చని చాటిచెబుతోంది. – ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
పరిష్కార వేదిక.. ఫలితం ఎక్కడ?
మహారాణిపేట: సమస్య చిన్నదైనా దానికి పరిష్కారం లభించడం లేదు. ఫలితంగా అదే సమస్యపై పదే పదే అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడంతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)పై జనం పెదవి విరుస్తున్నారు. మండల కేంద్రాల్లో తమ గోడు పట్టించుకోకపోవడంతో జిల్లా కేంద్రానికి వచ్చినా.. ఇక్కడ కూడా అదే తంతు కొనసాగుతోందని బాధితులు మండిపడుతున్నారు. ముఖ్యంగా భూ వివాదాలు, ఉపాధి, సంక్షేమ పథకాలు, ఆదాయ ధ్రువపత్రాలు, గృహ స్థలాలు, తాగునీరు, పింఛన్లు వంటి సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. విన్నవించుకున్న 15 రోజుల్లో పరిష్కారం లభించకపోవడంతో బాధితులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తోంది. సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు ప్రజలు వివిధ సమస్యలపై మొత్తం 348 వినతులు సమర్పించారు. వాటిలో రెవెన్యూ విభాగానికి 35, జీవీఎంసీకి 76, పోలీస్ శాఖకు 27, ఇతర విభాగాలకు సంబంధించి 210 వినతులు ఉన్నాయి. ఫిర్యాదులు రీ–ఓపెన్ కాకూడదు: కలెక్టర్ పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి వచ్చే వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు మళ్లీ రీ–ఓపెన్ కాకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత విభాగాధిపతులదేనని స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. సమస్యకు సరైన పరిష్కారంతో పాటు సంబంధిత ఎండార్స్‌మెంట్‌ను కూడా తప్పనిసరిగా ఫిర్యాదుదారులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం.విశ్వేశ్వర నాయుడు, ఏడీసీ సత్యవేణి పాల్గొన్నారు. రెవెన్యూ క్లినిక్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. -
అక్షయపాత్రకు ఇవ్వొద్దు
మహారాణిపేట: మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) డిమాండ్ చేసింది. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట కార్మికులు నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్లోని పీజేఆర్‌ఎస్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి.మణి మీడియాతో మాట్లాడుతూ.. అక్షయపాత్రకు పథకాన్ని అప్పగిస్తే ఏళ్ల తరబడి నమ్ముకున్న కార్మికుల ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మికుల ఉపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. జనవరి నెల నుంచి పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, పెరిగిన ధరల దృష్ట్యా ప్రభుత్వమే నేరుగా గ్యాస్ సరఫరా చేయాలని కోరారు. యూనియన్ జిల్లా కార్యదర్శి జి.మంగశ్రీ, అధ్యక్షురాలు భవాని, కార్మికులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
నక్కపల్లి : రైతుకు చెందిన భూమిని మ్యూటేషన్ చేసేందుకు రూ.1.50 లక్షలు తీసుకుంటూ నక్కపల్లి మండలం పెదతీనార్ల వీఆర్వో కొప్పిశెట్టి చిట్టిబాబు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కశింకోట మండలం వెదురుపర్తి గ్రామానికి చెందిన ముక్కా శ్రీను అనే రైతు నక్కపల్లి మండలం పెదతీనార్లలో రెండు వేర్వేరు సర్వే నంబర్లలో 5.57 ఎకరాల భూమిని 2023లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఈ భూమిలో కొబ్బరి పంట వేసి సాగు చేసుకుంటున్నాడు. మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక సర్వే నంబరుకు సంబంధించి 2.14 ఎకరాలకు భూమికి మ్యూటేషన్ జరిగింది. 3.43 ఎకరాల భూమి మ్యూటేషన్ జరగలేదు..రికార్డుల్లో కొనుగోలు చేసిన వ్యక్తి, అమ్మిన వ్యక్తి పేరు లేదు. వేరొక అసామి పేరున నమోదయి ఉంది. బాధితుడు కొనుగోలు చేసిన భూమిలో 2.14 ఎకరాల భూమిని ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్క్ కోసం సేకరించింది. ఈ భూమి మాత్రమే బాధితుడి పేరున రికార్డుల్లో మ్యూటేషన్ అయి నమోదై ఉండడంతో దానికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. మిగిలిన భూమికి నష్టపరిహారం ఇవ్వలేదు. దీంతో మిగిలిన భూమిని మ్యూటేషన్ చేయాలని రెవెన్యూ అదికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులు మాత్రం సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో బాధితుడు శ్రీను వీఆర్వో కొప్పిశెట్టి చిట్టిబాబును సంప్రదించగా, మ్యుటేసన్కు రూ.లక్షల్లో మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అడ్వాన్సుగా రూ.1.50 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం బాధితుడు ఈనెల7వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అడ్వాన్సు రూ.1.50 లక్షలు సోమవారం విశాఖపట్నం ఎయిర్‌పోర్టు సమీపంలో వీఆర్వోకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నాయకత్వంలో సిబ్బంది వలవేసి పట్టుకున్నారు. అక్కడ నుంచి నిందితుడిని నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వీఆర్వో సొంత గ్రామం నక్కపల్లి మండలం ఉపమాకలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పట్టుబడ్డ వీఆర్వోపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. -
వార్డుల విభజనలో లోపాలు సరిచేయాలి
మహారాణిపేట: వార్డుల విభజనలో తప్పిదాలు లేకుండా చూడాలని, ఓటరు జాబితాలను వెంటనే సరి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు కోరారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆయన కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 19 నుంచి వార్డుల విభజన ప్రక్రియ చేపడుతున్నారని, అందులోని లోపాలను సరిచేసి, ఓటరు జాబితాను పునర్వ్యవస్థీకరించిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్నారు. వార్డుల సంఖ్య పెరిగి, అవి చిన్నవిగా ఉంటేనే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని, అప్పుడే ప్రజలకు సుపరిపాలన అందుతుందని పేర్కొన్నారు. జిల్లా జనతా వారధి కన్వీనర్ పి.శ్రీనివాసరావు, కో–కన్వీనర్ మూల వెంకట్రావు, నాయకులు దేవర చంద్రశేఖర్, నరసింగరావు, కె.రవిరాజ్, తిప్పనబోయిన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి
మహారాణిపేట: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కార్యదర్శి ఉమ్మడి నితిన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, విద్యార్థుల ఖాతాల్లో నిధులు జమ కాలేదన్నారు. దీంతో అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందని, ఫీజులు చెల్లించలేదనే కారణంతో కొన్ని కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, సర్క్యులర్లను కూడా కొన్ని కళాశాలలు పట్టించుకోవడంలేదన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యార్థుల సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రూ.5,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
పోర్టులో కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
సాక్షి, విశాఖపట్నం : మేజర్ పోర్టులతో పోటీపడుతూ 100 మిలియన్ టన్నుల హ్యాండ్లింగ్ లక్ష్యంతో పాటు.. కాలుష్య రహిత పోర్టుగా మార్చడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తున్నామని విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ డా.అంగముత్తు స్పష్టం చేశారు. పోర్టు పరిధిలో పలు కీలక మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభంతో పాటు కొత్త ప్రాజెక్టులకు సోమవారం శంకుస్థాపనలు చేశారు. పబ్లిక్ ప్రొమెనెడ్ అభివృద్ధి, పోర్టు నిర్వహణ వ్యవస్థ, 38 టీకేఎం రైల్వే ట్రాక్‌ల విద్యుదీకరణ, పరిపాలన భవనంలోని డిస్ప్లే కారిడార్, ఎస్టీపీ సమీపంలో 170 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ, ప్రస్తుత ఎంసీహెచ్వీ రైల్వే ట్రాక్ అప్‌గ్రెడేషన్, ఎస్ఎల్ కాలువ జెట్టీ సమీపంలో మరమ్మతులు, రైల్వే ట్రాక్‌ల్లో మలుపుల సవరణతో మెరుగుదల పనులతో పాటు కస్టమ్స్ సరిహద్దు గోడ నిర్మాణాన్ని చైర్మన్ డా.అంగముత్తు ప్రారంభించారు. భద్రత, మౌలిక సదుపాయాల బలోపేతానికి సంబంధించిన పలు ముఖ్యమైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. వీటిలో అన్ని గేట్ల వద్ద అండర్ వెహికల్ స్కానింగ్ సిస్టమ్‌ల ఏర్పాటు, కార్గో గేట్ల వద్ద రేడియోలాజికల్ డిటెక్షన్ పరికరాల ఏర్పాటు, కాన్వెంట్ జంక్షన్ ఆర్చ్ నుంచి హెచ్–7 జంక్షన్ వరకు బీటీ రోడ్డుకు రీగ్రేడింగ్ పనులు, ఓహెచ్సీ లోపలి రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. -
వాణిజ్య మంట
ఇంటి గ్యాస్తోమహారాణిపేట: నగరంలో వంట గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా పడగ విప్పింది. గృహ అవసరాల కోసం కేటాయించిన సిలిండర్లు బహిరంగంగానే పక్కదారి పడుతున్నాయి. అంతర్జాతీయ యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపుతూ, నగరంలోని బ్లాక్ మార్కెట్ వ్యాపారులు అక్రమ విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు. వాణిజ్య సిలిండర్ల ధరలు ఒక్కసారిగా పెరగడం, వాటి లభ్యతపై ఆంక్షలు ఉండటంతో వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. ధరల పెరుగుదలే కారణం గత నెలలో రూ.2,165 ఉన్న వాణిజ్య సిలిండర్ ధర ప్రస్తుతం రూ.3,146.50కు చేరింది. వెయ్యి రూపాయల మేర భారం పెరగడంతో చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు లాభాల కోసం గృహ అవసరాలకు వాడే సిలిండర్లపై ఆధారపడుతున్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొంత మంది గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, డెలివరీ బాయ్స్ కుమ్మకై ్క సామాన్యుడి పొయ్యి కింద సెగ పెడుతున్నారు. అదనపు సొమ్ము ఇస్తే చాలు, నిబంధనలతో సంబంధం లేకుండా సిలిండర్లను సరఫరా చేస్తున్నారు. ఓటీపీ విధానానికి తూట్లు అసలు ధర కంటే రూ.800 నుంచి రూ.1,000 వరకు అదనంగా వసూలు చేస్తూ గృహ సిలిండర్లను హోటళ్లకు మళ్లిస్తున్నారు. భద్రత కోసం ప్రవేశపెట్టిన ఓటీపీ విధానాన్ని ఇక్కడ పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. అధిక మొత్తంలో డబ్బులిస్తే ఓటీపీ అవసరం లేకుండానే సిలిండర్లు ఇస్తున్నారు. దీని వల్ల సాధారణ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్నా, మొబైల్‌కు ఓటీపీ వచ్చినా 15 రోజులైనా సిలిండర్ చేతికి అందడం లేదు. తమ సిలిండర్ ఎప్పుడు వస్తుందో తెలియక వినియోగదారులు ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. పెరిగిన ఆహార ధరలు ఈ విషయంపై వినియోగదారులు నిలదీస్తే.. అంతా డెలివరీ బాయ్స్ చేస్తున్న పనేనని ఏజెన్సీలు తప్పించుకుంటున్నాయి. ఈ కృత్రిమ కొరత వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు గ్యాస్ ధరల పెరుగుదలను సాకుగా చూపి హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఆహార పదార్థాల ధరలను భారీగా పెంచేశారు. దీంతో సామాన్యులు అటు గ్యాస్ దొరక్క, ఇటు బయట తినలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంతగా బహిరంగ దందా సాగుతున్నా సివిల్ సప్లైస్, విజిలెన్స్ శాఖల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రారంభంలో కొన్ని దాడులు చేసినా, ఆ తర్వాత నిఘా పూర్తిగా నిద్రపోతోంది. ఫలితంగా రోడ్ల మీద గృహ సిలిండర్లు పెట్టి విక్రయించే ఆహార వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి, గ్యాస్ ఏజెన్సీల అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఓటీపీ విధానం సక్రమంగా అమలయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
ప్రపంచ వ్యాప్తంగా విశాఖ ఉత్పత్తులకు గిరాకీ
విశాఖ నుంచి తరలివెళ్లే మత్స్య సంపదకు అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. ప్రస్తుతం భారత్ నుంచి జరిగే ఎగుమతుల్లో అమెరికా 35 శాతం వాటాతో అతిపెద్ద కొనుగోలుదారుగా కొనసాగుతుండగా, చైనా మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే అమెరికాకు జరిగే ఎగుమతులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. చైనాకు మాత్రం ఎగుమతులు ఏకంగా 22 శాతం పెరగడం విశేషం. వీటితో పాటు ఆగ్నేయాసి యా, జపాన్ దేశాలకూ విశాఖ నుంచి భారీగా సముద్ర ఉత్పత్తు ల ఎగుమతులు సాగుతున్నాయి. ప్రధాన మార్కెట్లకు జరిగిన ఎగుమతుల వివరాలివి.. -
జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలపాలి
మహారాణిపేట : జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలపాలని, దానికి ప్రత్యేక కార్యాచరణ, విజన్‌తో కూడిన కృషి అవసరమని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో చర్చించిన అంశాలు, ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యతలు, అమలు చేయాల్సిన కార్యాచరణపై సోమవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేపీఐ, పబ్లిక్ పర్సెప్షన్, పీజీఆర్ఎస్, స్వర్ణవార్డు–స్వర్ణగ్రామ సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని, జిల్లా, నియోజకవర్గాల వారీగా పబ్లిక్ పర్సెప్షన్ వివరాలను విశ్లేషించాలని తెలిపారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఫిర్యాదుపై జిల్లా స్థాయి అధికారులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. వ్యవసాయం, వైద్యం, గృహనిర్మాణం, సంక్షేమం, ఇరిగేషన్ తదితర రంగాల్లో నాణ్యమైన సేవలు అందించాలని పేర్కొన్నారు. గంగవరం పోర్టు రహదారి నిర్మాణంలో అధికారులు చొరవ చూపాలని చెప్పారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో స్పెషల్ ఆఫీసర్లు భాగస్వామ్యం కావాలని, స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు. పబ్లిక్ పర్సెప్షన్లో రాష్ట్రంలో జిల్లా ద్వితీయ స్థానంలో ఉండటం హర్షణీయమని, అదే ఉత్సాహంతో అన్ని రంగాల్లో విశాఖను నంబర్–1గా నిలపాలని పిలుపునిచ్చారు. కౌశలం, కుసు మ్, సంజీవని పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని, ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, కొత్త ప్రా జెక్టుల గుర్తింపు, యారాడ బీచ్ వద్ద పర్యాటక ప్రా జె క్టులు, ఎకనామిక్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జేసీ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం.విశ్వేశ్వర నాయుడు పాల్గొన్నారు. -
నీలి అలలపై సాహస కేరింతలు
వేసవి భానుడి భగభగలకు విరుగుడుగా చిన్నారులు జలకాలాటల్లో మునిగితేలుతున్నారు. నీలి రంగు నీటి అలలపై తమ సాహస విన్యాసాలతో అబ్బురపరుస్తున్నారు. నిలకడగా ఉన్న పడవ అంచునే వేదికగా చేసుకుని, గాల్లో గంతేస్తూ.. విల్లులా వొంకరలు తిరుగుతూ నీటిలోకి దూకుతున్న తీరు చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఎండ వేడిని మర్చిపోయి, కేరింతల మధ్య సాగుతున్న ఈ చిచ్చరపిడుగుల విన్యాసాలు తీర ప్రాంతంలో సందడిని నింపుతున్నాయి. పడవ ఇంజిన్‌పై నుంచి గాల్లోకి ఎగురుతూ వారు చేస్తున్న జల విన్యాసాలు సాహసానికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. – ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
జూలై 28న గిరి ప్రదక్షిణ
సింహాచలం: వరాహ లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు అధికారులను ఆదేశించారు. సోమవారం దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం, వైదికులు, వివిధ విభాగాల సెక్షన్ హెడ్లతో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఆయన ముందస్తు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జూలై 28న 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ, 29న కొండపై ఆలయ ప్రదక్షిణలు జరుగుతాయని వెల్లడించారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఎక్కడికక్కడ తాగునీరు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు, తాత్కాలిక షెడ్లు, వైద్య శిబిరాలు, మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. మార్గంలో ఏయే ప్రదేశాల్లో ఏ సౌకర్యాలు అవసరమో క్షేత్రస్థాయిలో గుర్తించి, ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. బారికేడ్ల ఏర్పాటు, విద్యుద్దీకరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో దేవస్థానం ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు, డిప్యూటీ కలెక్టర్ మధులత, డిప్యూటీ ఈవో రాధ, ఈఈ రాంబాబు, ఏఈ రవిరాజు, ఏఈవోలు రమణమూర్తి, పిల్లా శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
పోలీసు పరిష్కార వేదికకు 130 ఫిర్యాదులు
జీవీఎంసీ పీజీఆర్ఎస్కు 82 వినతులు డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు మొత్తం 82 వినతులు వచ్చాయి. అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, పి.నల్లనయ్య హాజరై నగర ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ వినతుల్లో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి 49 ఫిర్యాదులు అందాయి. మిగిలిన వాటిలో రెవెన్యూ విభాగానికి 12, జోనల్ అడ్మినిస్ట్రేషన్‌కు 7, ఇంజినీరింగ్ సెక్షన్‌కు 7, ప్రజారోగ్య విభాగానికి 3, అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 2, హార్టికల్చర్ విభాగానికి ఒకటి, యూసీడీ విభాగానికి ఒకటి చొప్పున వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్(అమృత్) డి.విజయభారతి, ప్రధాన ఇంజినీర్ పీవీవీ సత్యనారాయణరాజు, సీసీపీ ప్రభాకరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి.వాసుదేవరెడ్డి, డీసీఆర్ ఎస్.శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. -
15 నుంచి ‘వైఎస్సార్ సీపీ ఎంఏపీఎల్’ క్రికెట్ టోర్నీ
మహారాణిపేట: వైఎస్సార్ సీపీ మొల్లి అప్పారావు ప్రీమియర్ లీగ్(ఎంఏపీఎల్) క్రికెట్ పోటీలు ఈ నెల 15 నుంచి 18వ తేదీ నిర్వహించేందుకు ఏర్పా ట్లు జరుగుతున్నాయి. ఈ పోటీల పోస్టర్‌ను సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు జన్మదినం పురస్కరించుకుని.. 10వ వార్డు యువజన విభాగం అధ్యక్షుడు కంటుబోతు తులసీరాం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ పరిశీలకురాలు పేడాడ రమణి కుమారి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జీవీ రామచంద్రరావు, జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్, సునీల్, 10వ వార్డు అధ్యక్షుడు పతివాడ కనకరాజు పాల్గొన్నారు. వీరితో పాటు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు కాగితాల రవికిరణ్ రెడ్డి, నాయకులు కె.కన్నబాబు, దంతిన రామా రావు, చొల్లంగి నాగేశ్వరరావు, మెట్ట సూర్యనారాయణ, మీసాల ప్రదీప్, రవీంద్ర చౌదరి, శశికుమార్, రౌతు సంతోష్, మాచర్ల రవి, గోవింద్ తదితరులు హాజరయ్యారు. -
మరణానంతరం నేత్రదానం
పెందుర్తి: గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తి నేత్రాలను దానం చేసి అతని కుటుంబం మానవత్వం చాటుకుంది. వివరాలివి.. పెందుర్తి పాతూరులో నివాసం ఉంటున్న పెతకంశెట్టి రాము(46) శనివారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ నేత్రదానం కోసం కుటుంబ సభ్యులను సంప్రదించారు. వెంటనే భార్య సత్యవతి, కుమారుడు త్రినాథ్, బావమరిది శరగడం సంతోష్ నేత్రదానానికి ఒప్పుకుని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌సత్యనారాయణ చేతుల మీదుగా అంగీకార పత్రం అందించారు. మొహిసిన్ నేత్రనిధి ప్రతినిధులు మనోజ్, లక్ష్మి మృతుని నేత్రాలను సేకరించారు. -
వైద్యం
పడకేసినయూపీహెచ్సీ, పీహెచ్‌సీల్లో అందుబాటులో లేని వైద్యులు వైద్యుల అవతారం ఎత్తుతున్న నర్సులు, ఫార్మసిస్టులు కానరాని స్పెషలిస్ట్ వైద్యులు 66 యూపీహెచ్‌సీలు, 9 పీహెచ్ిసీల్లో అరకొర సౌకర్యాలుకొబ్బరితోట యూపీహెచ్‌సీలో వైద్యురాలిగా అవతారం ఎత్తిన నర్సు మహారాణిపేట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వ వైద్యం నేడు పడకేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే ఒకప్పుడు పేదవాడికి ప్రాణవాయువులా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితులు తలకిందులయ్యాయి. నాడి పట్టి చూసే నాథుడే కరువవ్వడంతో, సామాన్యుడు దవాఖానా మెట్లు ఎక్కాలంటేనే వణికిపోతున్నాడు. పర్యవేక్షణ లోపం, పాలకుల నిర్లక్ష్యం వెరసి ప్రభుత్వ వైద్య రంగం ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతోంది. వైద్యులు లేని దవాఖానాలు.. వెలవెలబోతున్న వార్డులు ఒకప్పుడు రోగులతో కళకళలాడే పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు నేడు వెలవెలబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం వైద్యులు అందుబాటులో లేకపోవడమే. విధి నిర్వహణలో ఉండాల్సిన డాక్టర్లు ఆస్పత్రులకు రాకపోవడంతో రోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రోగితో వచ్చే వారు గంటల తరబడి వేచి చూసినా, డాక్టర్ దర్శనం కలగానే మిగులుతోంది. దీంతో ‘సర్కారు దవాఖానాకు పోతే టైం వేస్ట్’ అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది. మందుల కొరత ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మందుల కొరత తీవ్రస్థాయికి చేరింది. గతంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే రోగులకు నెలరోజులకు సరిపడా మందులు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు స్టాకు లేదనే నెపంతో కేవలం వారం రోజులకు మాత్రమే ఇస్తుండటంతో సామాన్యులు ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. డాక్టర్లు రాసిచ్చిన మందులు ఆస్పత్రిలో దొరక్కపోవడంతో పేద రోగులు బయట కొనుగోలు చేయలేక, వ్యాధి నయం కాక తీవ్ర అవస్థలు పడుతున్నారు. అటకెక్కిన సేవలు ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సేవలు అటకెక్కినట్లు కనిపిస్తున్నా, పాలకులు, ఆరోగ్య శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఓపీ సేవల దగ్గర నుంచి అత్యవసర మందుల వరకు ప్రతిచోటా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అడిగే నాథుడే లేకపోవడంతో ప్రభుత్వ వైద్య రంగం ప్రతిష్ట మసకబారుతోంది. ఇప్పటికై నా సర్కార్ స్పందించి, మందుల కొరతను తీర్చి, వైద్యులు విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోకపోతే పేదవాడికి ప్రాణరక్షణ కరువయ్యే ప్రమాదం ఉంది. ఖాళీల భర్తీలో ప్రభుత్వం విఫలం ఆస్పత్రుల్లో బదిలీల వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉన్న వైద్యులలో కొందరు ఆస్పత్రికి వచ్చి కేవలం ముఖ గుర్తింపు హాజరు వేసి, ఆపై తమ వ్యక్తిగత పనులకు లేదా ప్రైవేటు ప్రాక్టీసులకు వెళ్లిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నర్సులు, ఫార్మసిస్టులే ‘డాక్టర్ల’ అవతారం ఎత్తుతున్నారు. తమకున్న పరిమిత వైద్య పరిజ్ఞానంతో వారు మందులు రాసి ఇస్తున్నారు. ఇది ఒకరకంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అత్యవసర పరిస్థితుల్లో రోగులు చేసేదేమీ లేక, తమ జేబులు ఖాళీ అయినా సరే ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ వైద్యం అటకెక్కిందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపీ సేవల దగ్గర నుంచి మందుల పంపిణీ వరకు ప్రతిచోటా కొరత వేధిస్తోంది. ఆరోగ్య శాఖాధికారుల పర్యవేక్షణ నామమాత్రంగానే ఉండటంతో వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి పేదలకు వైద్య సేవలు సక్రమంగా అందించాలని పలువురు కోరుతున్నారు. -
అన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు విరాళాలు సమర్పించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విశాఖకు చెందిన సీహెచ్.దుర్గాప్రసాద్ రూ.1,00,001 విరాళం అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డి, ఆలయ పర్యవేక్షకుడు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. చికెన్ ధరలు -
శిల్పారామంలో కోలాట సంబరం
పీఎంపాలెం: పీఎం పాలెం శిల్పారామం వేదికగా ఆదివారం సాయంత్రం జానపద కళల కోలాహలం నెలకొంది. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ ప్రదర్శనలో భక్తి, జానపద బాణీలు శిల్పారామం ప్రాంగణంలో మారుమోగాయి. నగరానికి చెందిన శ్రీ శివసాయి కోలాటం గ్రూపు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన అట్టహాసంగా సాగింది. కార్యక్రమం తొలుత శ్రీరాముని కీర్తిస్తూ సాగే ‘రఘుకుల తిలకా రారా’.. అనే భక్తి గీతంతో ప్రారంభమైంది. మహిళా కళాకారులు లయబద్ధంగా కోలాటం ఆడుతూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అనంతరం ‘రావు రావు తల్లీ..’, గోపికలు ఏమయినారు.., రంగని కళ్యాణం, శివశివ మూర్తి ఘననాధ.. వంటి కీర్తనలకు జానపద శైలిలో ప్రదర్శించిన కోలాట రీతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాకారులు కళ్యాణి, శ్రావణి, నీహారిక, మహాలక్ష్మి, వర్షిణి, శిరీష, మేఘన, జ్యోతి తదితరులు తమ నైపుణ్యంతో అలరించారు. -
శ్రీవారి భక్తులకు సువర్ణావకాశం
కొమ్మాది: తిరుమల శ్రీవారి ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రతి శుక్రవారం స్వామివారికి అలంకరించే మేల్చాట్ (పట్టు) వస్త్రాన్ని సమర్పించే అరుదైన అవకాశాన్ని రుషికొండలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులకు కల్పిస్తోంది. భక్తుల కోరిక మేరకు ఈ సువర్ణ అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారికి పట్టు వస్త్రాన్ని అందించే భక్తుల పేరున ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సేవలో పాల్గొనాలని ఆకాంక్షించే భక్తులు ముందుగా 9866397593, 8074404845 నంబర్లను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. -
హాట్ వెదర్.. జూలో షికార్
వేసవి సెలవులు, దానికి తోడు ఆదివారం కావడంతో జూ పార్కు సందర్శకుల తో కళకళలాడింది. ఎండను సైతం లెక్కచేయకుండా నగరవాసులు తమ కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి వన్యప్రాణులను వీక్షించేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. కొందరు గొడుగులు చేతబట్టి తిరగగా, మరికొందరు నడుస్తూ.. చెట్ల కింద సేదతీరుతూ జంతువులను, పక్షులను ఆసక్తిగా తిలకించారు. ఓ చిన్నారి మూడు చక్రాల సైకిల్‌పై జూలో విహరిస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది. మరోవైపు భానుడి ప్రతాపానికి వన్యప్రాణులు సైతం విలవిల్లాడాయి. ఎండ వేడికి తట్టుకోలేక చాలా జంతువులు చెట్ల నీడకేపరిమితమయ్యాయి. గజరాజులు నీటి కొలనును వదలకుండా జలకాలాటలాడుతూ కనువిందు చేశాయి. చింపాంజీలు, కోతులు, కనుజులు, నీల్గైస్ ఎన్క్లోజర్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తాటాకు పందిళ్ల కింద.. నెమళ్లు, నల్ల హంసలు నీటి స్ప్రింక్లర్ల వద్ద సేదదీరాయి. జిరాఫీలు, జీబ్రాలు చెట్ల నీడను ఆశ్రయించాయి. – ఆరిలోవ/సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
రైల్వే జోన్‌పై టీడీపీ సంబరాలు సిగ్గుచేటు
డాబాగార్డెన్స్: రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2014లోనే రైల్వే జోన్ విశాఖలో ఏర్పాటు చేయాల్సి ఉందని, అలాంటిది దాదాపు 13 ఏళ్ల తర్వాత జోన్ ప్రకటించినా.. టీడీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని సిటు రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నరసింగరావు అన్నారు. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వామపక్షాలు, ప్రతిపక్షాల పోరాట ఫలితంగానే ఇప్పటికి రైల్వే జోన్ సాధించుకున్నామని పేర్కొన్నారు. నగరంలోని సిటు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సిటు రాష్ట్ర కార్యదర్శులు ఆర్కేఎస్వీ కుమార్, పి.మణి, పబ్లిక్ సెక్టార్ కో ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ జ్యోతీశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత రైల్వేజోన్ ప్రకటించడంపై టీడీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. పేరుకే సౌత్‌కోస్ట్ జోన్ ప్రకటించినా, జోన్‌లోని గుండెకాయ వంటి కోరాపుట్‌ను తొలగించడంతో ఏపీపై కేంద్ర ప్రభుత్వ సవతి తల్లి ప్రేమ బహిర్గతమైందని ఎద్దేవా చేశారు. 2014 నుంచి మోదీ ప్రభుత్వం రైల్వే రిక్రూట్మెంట్ ఆపేసిందని, దీంతో సుమారు 5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సౌత్కోస్ట్లో కలపాలని సీఎం చంద్రబాబు ఇటీవల స్వయంగా కోరినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. జోన్ ఏర్పాటు వల్ల ఏం ప్రయోజనం ఒరుగుతుందో చెప్పాలని టీడీపీ నాయకులకు సవాల్ చేశారు. పేరుకు మాత్రమే సౌత్‌కోస్ట్ జోన్ ఆంధ్రప్రదేశ్‌కు వస్తుందని, కేకే లైన్ ఈస్ట్ కోస్ట్‌కు కేటాయించడంతో లాభాలన్నీ ఒడిశాకే వెళతాయన్నారు. భారతదేశంలో రైల్వే రవాణా అతి చౌకగా, సౌకర్యవంత ప్రయాణమని, కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైల్వే ప్రైవేటీకరణపై దూకుడుగా ఉందని ఆక్షేపించారు. రైల్వేను ముక్కలు చేసి అమ్మడానికి రంగం సిద్ధం చేసిందని ఆరోపించారు. రైల్వే ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని రైల్వే కార్మికులకు సిటు తరఫున విజ్ఞప్తి చేశారు. -
డీఆర్ఎం కప్ టీటీ విజేత సెర్సా
విశాఖ స్పోర్ట్స్ : రైల్వే ఇండోర్ ఎన్క్లేవ్ వేదికగా రెండు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన డీఆర్ఎం కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ముగిసింది. ఈ క్రీడా సంగ్రామంలో సెర్సా జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచి విజేతగా అవతరించగా, ిస్పీనిక్స్ జట్టు రన్నరప్ స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో హోరాహోరీ పోరు సాగింది. సెమీఫైనల్ మ్యాచుల్లో పింపుల్ పాంథర్స్‌పై సెర్సా జట్టు, ముస్తాంగ్ జట్టుపై స్పినిక్స్ జట్టు గెలుపొంది ఫైనల్‌కు చేరుకున్నాయి. అత్యంత ఆసక్తికరంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో సెర్సా క్రీడాకారులు అంకిత్, బోలిక్, ప్రప్తి త్రయం తమ అద్భుతమైన ఆటతీరుతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. స్పినిక్స్ జట్టు తరపున బరిలోకి దిగిన ప్రయాష్, కుందు, మహీధర్‌లు గట్టి పోటీని ఇచ్చినప్పటికీ, కీలక సమయాల్లో సెర్సా క్రీడాకారులు పైచేయి సాధించి టైటిల్‌ను కై వసం చేసుకున్నారు. ఇక సెమీస్‌లో ఓడిన జట్ల మధ్య మూడో స్థానం కోసం నిర్వహించిన పోటీలో అరుణ్, ప్రసన్న, జస్సికాతో కూడిన జట్టు విజయం సాధించి తర్వాతి స్థానంలో నిలిచింది. క్రీడాకారుల నైపుణ్యానికి, పట్టుదలకు ఈ టోర్నమెంట్ వేదికగా నిలిచింది. విజేత జట్లకు డీఆర్ఎం లిలిత్ బోహ్రా ట్రోఫీలు అందజేశారు. విజేతలకు ట్రోఫీలు అందజేసిన డీఆర్ఎం -
క్రీడాకారులు ఫూల్
స్విమ్మింగ్ పూల్..విశాఖ అంటేనే క్రీడలకు, ముఖ్యంగా ఆక్వా స్పోర్ట్స్‌కు కేరాఫ్ అడ్రస్. ఎందరో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈతగాళ్లను అందించిన ఘన చరిత్ర సాగరతీరంలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు ఉంది. ఎన్నో ప్రతిష్టాత్మక టోర్నీలకు వేదికగా నిలిచి, రాష్ట్ర జట్టులో సింహభాగం స్విమ్మర్లను తయారుచేసిన ఈ ప్రతిష్టాత్మక కేంద్రం ప్రస్తుతం నిర్వహణా లోపాలతో కునారిల్లుతోంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.2.41 కోట్ల భారీ వ్యయంతో ఈ కాంప్లెక్స్‌ను ఆధునీకరించారు. 1995 ఆగస్టు 22న అప్పటి మేయర్ సబ్బంహరి సారథ్యంలో విశాఖ పోర్ట్ ట్రస్ట్, జీవీఎంసీ సంయుక్త నిధులతో ఈ కేంద్రాన్ని నిర్మించారు. నాటి నుంచి క్రీడాకారుల పాలిట దేవాలయంగా విరాజిల్లిన ఈ కాంప్లెక్స్, నేడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో తన ఉనికిని, నాణ్యతను కోల్పోతోంది. – విశాఖ స్పోర్ట్స్ ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లోకి ఈ కాంప్లెక్స్ వెళ్లినప్పటి నుంచి క్రీడాకారుల శిక్షణ గాలికొదిలేసి, కేవలం లాభార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ ఆస్తులపై పెత్తనం చెలాయిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో సుమారు 1500 నుంచి 1800 మంది వరకు, వింటర్ సీజన్లో కూడా రోజుకు 300 మందికి పైగా శిక్షణ కోసం ఇక్కడికి వస్తుంటారు. సమ్మర్ సీజన్లో ఒక్కొక్కరు నుంచి రూ.3000 వసూలు చేస్తున్నారు. ఇంతమంది వస్తున్నా అందుకు తగ్గట్టుగా కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రైవేట్ నిర్వాహకులు ఘోరంగా విఫలమయ్యారు. తీవ్ర ఇబ్బందులు శిక్షణార్థుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. పూల్‌లో ఈత నేర్చుకోవడం కంటే, ఒడ్డున నిరీక్షించడానికే ఎక్కువ సమయం వృథా అవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మూడు గంటల పాటు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ టైమ్ స్లాట్లు కేటాయించి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, కనీస పర్యవేక్షణ కరువైంది. 16 అడుగుల లోతు గల ప్రధాన పూల్..పక్కనే ఉన్న 3 నుంచి 6 అడుగుల లెర్నింగ్ పూల్‌లో కలిపి నిత్యం వందలాది మంది కిక్కిరిసిపోతున్నారు. గంట స్లాట్‌లో ఒక చిన్నారికి కేవలం అరగంట పాటు మాత్రమే నీటిలో స్విమ్మింగ్ చేసే అవకాశం దక్కుతోందని, మిగిలిన 20 నిమిషాల నుంచి అరగంట సమయం కేవలం క్యూలో నిలబడటానికే సరిపోతోందని వాపోతున్నారు. కోచ్‌ల కొరత వందలాది మంది పిల్లలకు కేవలం ముగ్గురు కోచ్‌లు, నలుగురు లైఫ్ గార్డులు మాత్రమే అందుబాటులో ఉండటం నిర్వాహకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. శిక్షణ గురించి ప్రశ్నిస్తే ‘కోచ్‌లు దొరకడం లేదు’ అనే రొటీన్ సమాధానం వస్తోందని, అసలు బాధ్యతాయుతమైన కాంట్రాక్టర్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియని పరిస్థితి నెలకొందని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దలు స్వతంత్రంగా ప్రాక్టీస్ చేద్దామన్నా విపరీతమైన రద్దీ వల్ల నిరాశే ఎదురవుతోంది. ఎంవీపీ కాలనీలోని ఎస్3 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోనే ఇదే పరిస్థితి ఇదే తరహా పరిస్థితి ఎంవీపీ కాలనీలోని ఎస్3 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోనూ కనిపిస్తోంది. ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల క్రీడాకారుల భద్రత, రక్షణ, నాణ్యమైన శిక్షణ అనే అంశాలు మరుగున పడిపోయి, క్రీడా ప్రాంగణాలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయనేది నగ్న సత్యం. విశాఖ కీర్తి ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికై నా జీవీఎంసీ కమిషనర్ , కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, ఈ ప్రైవేట్ సంస్థల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని, ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు న్యాయం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. -
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడికి గ్లోబల్ విజనరీ అవార్డు
ఆరిలోవ: పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, తోటగరువు జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు మడ్డు శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ విజనరీ సమ్మిట్ ఎక్స్పో అవార్డు ఇన్ ఎడ్యుకేషన్–2026’లభించింది. రుషికొండలోని రిసార్ట్స్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఐకాన్ గ్లోబల్ విజనరీ సంస్థ ప్రతినిధులు ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. గ్రామ అభ్యుదయ కమిటీని ఏర్పాటు చేసి, గ్రామీణ యువతకు విద్యా సంబంధిత పోటీ పరీక్షల్లో విశేష తోడ్పాటునందించినందుకు గాను ఈ అవార్డు దక్కినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ ప్రతినిధులు, ఉపాధ్యాయులు ఆయన్ని అభినందించారు. -
లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు పోరాటం ఆగదు
బీచ్‌రోడ్డు: కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని, తక్షణమే వీటిని ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.నరసింగరావు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద లేబర్ కోడ్స్ నిబంధనల కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కార్మికులను బానిసలుగా చేస్తూ, కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చేలా మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ రూల్స్‌ను విడుదల చేసిందని విమర్శించారు. దీనికి అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిబంధనలు రూపొందించుకోవాలని కేంద్రం కోరిందన్నారు. ఈ రూల్స్ గనుక అమలైతే కార్మికులు తీవ్రంగా నష్టపోతారని, ఇప్పటివరకు అనుభవిస్తున్న హక్కులన్నీ కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనల్లో పని గంటలు, జీతభత్యాలు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై స్పష్టత లేదని.. యాజమాన్యాలకే సర్వహక్కులు కల్పించేలా ఇవి ఉన్నాయని మండిపడ్డారు. ఇది కార్మికులను బానిసలుగా మార్చడమేనని, లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, రాష్ట్ర కార్యదర్శి పి.మణి, విశాఖ జిల్లా పబ్లిక్ సెక్టార్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్.జ్యోతీశ్వరరావు, ఎం.సుబ్బారావు, జి.టి.ప్రకాష్, చిన్నప్పుడు, వి.కృష్ణారావు, ఎం.సూరీడు, పోలేశ్వరరావు, చంద్రమౌళి, సత్యనారాయణ, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
● ఆనందాల సాగరం
భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు సముద్ర తీరం ఒక చల్లని చిరునామాగా మారింది. వారాంతం కావడంతో ఆదివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో ప్రజలు సాగర తీరానికి పోటెత్తారు. చిన్నా పెద్దా తేడా లేకుండా కేరింతలు కొడుతూ ఉత్సాహంగా కనిపించారు. కొందరు సముద్రంలో స్నానాలు చేయగా.. చిన్నారులు అలలతో ఆటలాడుతూ మురిసిపోయారు. యువత సెల్ఫీలు దిగుతూ, ఇసుక తిన్నెలపై కూర్చుని స్నేహితులతో ముచ్చట్లు పెట్టుకుంటూ సందడి చేశారు. – ఏయూక్యాంపస్/సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
‘ముక్కల మామిడి’కి భలే గిరాకీ
ఎంవీపీకాలనీ: మామిడి సీజన్ రాగానే అందరికీ గుర్తొచ్చేది విభిన్న రుచుల సమ్మేళనం. తీపి, వగరు, కారం కలగలిసిన కమ్మదనాన్ని అందించడంలో మామిడికి సాటి లేదు. ప్రస్తుతం సీజన్లో రైతుబజార్లలో గ్రామీణ రైతులు నేరుగా విక్రయిస్తున్న మామిడికి ఆదరణ పెరిగింది. గత వారం రోజులుగా పండ్లను విక్రయిస్తున్న రైతులు, రెండు రోజులుగా పచ్చళ్లకు అనువైన కాయలను భారీగా అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఎంవీపీ కాలనీ రైతు బజార్‌తో పాటు నగరంలోని సీతమ్మధార, నరసింహనగర్, కంచరపాలెం, ఆరిలోవ సహా పలు ప్రాంతాల్లోని రైతుబజార్లు మామిడి కాయల కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. వినియోగదారులు పచ్చడి కాయలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపడమే కాకుండా, అక్కడే రైతులతో ముక్కలు కొట్టించుకుంటున్నారు. నగర ప్రజల అభిరుచికి అనుగుణంగా రైతులు సైతం విభిన్న రకాల మామిడి ఉత్పత్తులను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. మంచి నాణ్యత.. అందుబాటులో ధరలు సీజన్ ప్రారంభం కావడంతో మామిడి కాయలు, పండ్లు సామాన్యులకు అందుబాటు ధరల్లోనే దొరుకుతున్నాయని రైతుబజార్ అధికారులు తెలిపారు. వివిధ రకాల రసాల కాయలు కేజీ రూ.40కే లభిస్తున్నాయి. పచ్చళ్ల కోసం ఎక్కువగా వాడే కలెక్టర్ కాయలు రూ.30, సువర్ణరేఖ రూ. 40కి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రైతులు నేరుగా తోటల నుంచి తీసుకురావడం వల్ల నాణ్యత బాగుందని, అందుకే గిరాకీ ఎక్కువగా ఉందని వెల్లడించారు. రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున వినియోగదారులు ఇప్పుడే కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. తాము విక్రయించే ఉత్పత్తులు రుచికరంగా ఉండటంతో పాటు పచ్చళ్లు నిల్వకు అనువుగా ఉంటాయని రైతులు పేర్కొంటున్నారు. ధరల వివరాలు.. మామిడి రకం ధర (కేజీల్లో) పర్యాలు రూ.30 కలెక్టర్ కాయలు రూ.30 వివిధ రసాలు రూ.40 కొలంగోవా రూ.35 సువర్ణరేఖ రూ.40 -
బాల్య వివాహం నిలిపివేత
పెందుర్తి: పెందుర్తిలో తలపెట్టిన ఒక బాల్య వివాహానికి పోలీసులు అడ్డుకట్ట వేశారు. వివరాలివి. స్థానిక రాచ్చెరువు ప్రాంతంలోని ఒక కల్యాణ మండపంలో బాల్య వివాహం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిపై స్పందించిన సీఐ కె.వి.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐలు ఎన్వీ భాస్కరరావు, స్వామినాయుడు తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. వివాహ వేదిక వద్ద బాలిక కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సరైన వయసు రాకుండా వివాహం చేయడం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలను, చట్టపరమైన ఇబ్బందులను వారికి వివరించారు. అనంతరం బాలల సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించి, వివాహాన్ని నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే తక్షణమే 1098 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. -
● చెట్టు నీడలో..
నగరం నిప్పుల కొలిమిలా మారింది. మధ్యాహ్నం వేళ భానుడి ప్రతాపానికి రోడ్లన్నీ జనసంచారం లేక వెలవెలబోతున్నాయి. అయితే రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద జీవులు, ఎండ తీవ్రతను సైతం లెక్కచేయకుండా తమ కష్టార్జితం కోసం శ్రమిస్తున్నారు. మధ్యాహ్నం వేళ.. కాస్త విశ్రాంతి కోసం.. కాంక్రీట్ వనాల మధ్య ఉన్న ఒక పచ్చని చెట్టును ఆశ్రయించారు. సిమెంట్ రోడ్డుపై వారు పోతున్న ఆ గాఢ నిద్ర వారి దైనందిన పోరాటానికి మౌన సాక్ష్యం. – ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
హెల్మెట్ భారం కాదు.. భరోసా
ఏయూక్యాంపస్: అవగాహన, అప్రమత్తతతోనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. ఆదివారం బీచ్‌రోడ్డులో ‘ఆప్ సబ్ కీ ఆవాజ్’సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో హోంగార్డులకు సీపీ చేతులమీదుగా హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం వల్ల ప్రమాదాలను నివారించడమే కాకుండా విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రమాద సమయంలో ప్రాణనష్టాన్ని నివారించడానికి హెల్మెట్ ఎంతో దోహదపడుతుందని, వాహనం నడిపేవారితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ భారం కాదు.. భరోసా అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా నగర పోలీసు శాఖలో పనిచేస్తున్న 400 మంది హోంగార్డులకు హెల్మెట్లు అందజేశారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు హోంగార్డులు, పోలీసు సిబ్బందితో కలిసి బైక్ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించిన ఆప్ సబ్ కీ ఆవాజ్ సేవా సంస్థ ప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు వడ్లమూడి శివకుమార్, కార్యదర్శి బవిశెట్టి కిరణ్ కుమార్, ఏడీసీపీ(ట్రాఫిక్) కె.ప్రవీణ్ కుమార్, ఏసీపీ (ట్రాఫిక్) ఎం.శ్రీనివాసరావు, పలువురు ట్రాఫిక్ సీఐలు, ఎస్ఐలు, పెద్ద సంఖ్యలో హోంగార్డులు పాల్గొన్నారు. -
హిందూ మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా భారత్!
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ సామర్థ్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లే దిశలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా సముద్రం మధ్యలో యుద్ధనౌకలకు అవసరమైన ఇంధనం, నీరు, మందుగుండు, ఇతర సామగ్రి, రేషన్‌ను ఎప్పటికప్పుడు అందించే అత్యాధునిక ఐదు భారీ ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎఫ్ఎస్ఎస్) నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తిగా స్వదేశీ డిజైన్, పరికరాలతో రూ.19,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో భాగంగా తాజాగా హిందుస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్)లో ఐదవ, చివరి ఫ్లీట్ సపోర్ట్ షిప్ స్టీల్ కటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.ఈ ఐదవ నౌక నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమానికి ఇండియన్ నేవీ యుద్ధనౌకల నిర్మాణ, నియంత్రణాధికారి వైస్ అడ్మిరల్ సంజయ్సాధు, షిప్‌యార్డు సీఎండీ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త శిఖరాలను అధిరోహించడమే కాకుండా, విదేశాలపై ఆధారపడకుండా సొంతంగా భారీ నౌకలను నిర్మించుకునే సత్తాను చాటిచెబుతోంది. భారత నౌకాదళం హిందూ మహాసముద్రంలో తిరుగులేని శక్తిగా ఎదగడానికి ఈ నౌకలు కీలకంగా మారనున్నాయి. కొన్ని ముఖ్యాంశాలు..⇒ కొచ్చికి చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ స్మార్ట్ ఇంజనీరింగ్ అండ్ డిజైన్ సొల్యూషన్స్ (ఎస్ఈడీఎస్) రూపకల్పనతో జరుగుతున్న ఈ ప్రాజెక్టులో హిందుస్థాన్ షిప్‌యార్డు, ఎల్అండ్టీ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.⇒ ప్రాజెక్టులో రెండు నౌకలు కట్టుపల్లిలో, మిగిలిన మూడు విశాఖపట్నంలో నిర్మీతమవుతున్నాయి. ⇒ కేవలం యుద్ధ అవసరాలకే కాకుండా, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టడానికి, విదేశాల్లో చిక్కుకున్న పౌరులను రక్షించడానికి ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ⇒ తమను తాము రక్షించుకోవడానికి, శత్రువులను ఎదుర్కోవడానికి అవసరమైన క్షిపణి వ్యవస్థలు, జలాంతర్గామి వ్యతిరేక ఆయుధాలు, సమీప శ్రేణి రక్షణ వ్యవస్థలను సైతం ఈ నౌకలు కలిగి ఉంటాయి. వీటిలో అమర్చిన ఇంజన్లు, విద్యుత్ ఉత్పత్తి పరికరాలు అత్యంత సమర్థవంతంగా, సురక్షితంగా పనిచేస్తాయి.⇒ ప్రతి ఎఫ్‌ఎస్‌ఎస్‌లో ఒక ధ్రువ్ హెలికాప్టర్ నిలిపేందుకు హ్యాంగర్ సదుపాయం ఉంది. ⇒ మొదటి నౌకను 2027 జూన్‌లో అప్పగించాలని భావిస్తుండగా, ఆ తర్వాత ప్రతి 10 నుంచి 12 నెలలకోసారి ఒక్కో ఎఫ్ఎస్ఎస్ చొప్పున మూడేళ్లలో 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్స్‌ని జలప్రవేశం చేసేలా వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించారు. -
10వ తేదీ వచ్చినా జమ కాని వేతనాలు నెలకు రూ.34 కోట్ల భారం ఖాళీ అయిన వర్సిటీ ఖజానా ఇప్పటికే రూ.300 కోట్ల అంతర్గత నిధుల మళ్లింపు శతాబ్ది ఉత్సవాలకే రూ.63.5 కోట్లు ఖర్చు జీతాలు, పెన్షన్ల కోసం ఉద్యోగుల ఆందోళన
విశాఖ సిటీ: శతాబ్ది వేడుకలు ఘనంగా జరుపుకున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. జ్ఞానాన్ని పంచే గురువుల చేతుల్లో జీతపు చీటీ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏయూ ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాలు వీధిన పడ్డాయి. ప్రతి నెలా ఒకటో తేదీకి ఖాతాల్లో జమయ్యే వేతనాలు ఇప్పుడు 10వ తేదీ దాటినా అందని ద్రాక్షగా మారాయి. పెరుగుతున్న జీవన వ్యయాలు, కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులతో సతమతమవుతున్న ఉద్యోగులు జీతాల కోసం యాజమాన్యం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెల కూడా ఇప్పటివరకు వేతనాలు జమ కాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి గ్రాంట్లు విడుదలయ్యే వరకు వేచి చూడాలని అధికారులు చెబుతున్నట్లు సమాచారం. ఖాళీ అయిన ఖజానా.. జీతాలకే నిధుల కొరత ఏయూలో సుమారు 300 మంది బోధన సిబ్బంది, 1,400 మంది బోధనేతర ఉద్యోగులు, 3,400 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరందరికీ ప్రతి నెలా సుమారు రూ.34 కోట్ల మేర నిధులు అవసరం అవుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వం ‘బ్లాక్ గ్రాంట్’ రూపంలో ఈ మొత్తాన్ని విడుదల చేయాలి. అయితే గత కొన్ని నెలలుగా ప్రభుత్వం నుంచి సరైన గ్రాంట్లు అందకపోవడంతో యూనివర్సిటీ అంతర్గత నిధుల నుంచే వేతనాలు చెల్లిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ నిధులూ పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఇప్పటికే రెండు దఫాల్లో సుమారు రూ.300 కోట్ల యూనివర్సిటీ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాల కోసం దాచుకున్న నిధులు కరిగిపోవడంతో, ప్రస్తుతం జీతాలు చెల్లించడమే యాజమాన్యానికి భారంగా మారింది. శతాబ్ది ఉత్సవాల భారమూ ఏయూపైనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఏయూ శతాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయకపోవడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఉత్సవాల నిర్వహణ కోసం ఏయూ తన సొంత నిధుల నుంచే సుమారు రూ.63.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒకవైపు ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ప్రచార ఆర్భాటాల కోసం విశ్వవిద్యాలయ నిధులు ఖర్చు కావడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ గ్రాంట్లు విడుదల చేయకపోతే, రాబోయే నెలల్లో వేతనాల చెల్లింపే అసాధ్యమవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. విద్యార్థులపై ఫీజుల భారం ప్రభుత్వ నిధులు అందకపోవడంతో వర్సిటీ అధికారులు ఇప్పుడు విద్యార్థులపై ఆర్థిక భారం మోపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫీజులు బకాయి ఉన్నాయనే కారణంతో హాల్‌టికెట్లు నిలిపివేయడం, గతంలో హాస్టళ్లను మూసివేయడం వంటి చర్యలు విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించాయి. ఉన్నత విద్యా వ్యవస్థను రక్షించాల్సిన ప్రభుత్వమే విశ్వవిద్యాలయాల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తోందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఏయూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం రాష్ట్ర ఉన్నత విద్యా రంగానికే ప్రమాద సంకేతమని మేధావులు హెచ్చరిస్తున్నారు. వెంటనే పెండింగ్ గ్రాంట్లు విడుదల చేసి, ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఓ(ఆ)న్ డ్యూటీ!
సాక్షి, విశాఖపట్నం: దేశంలోని ప్రధాన పోర్టులతో పోటీపడుతూ సముద్ర వాణిజ్య రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాఖపట్నం పోర్టు.. ప్రస్తుతం కొందరు అధికారుల ‘సొంత’ ప్రయోజనాలకు వేదికగా మారుతోంది. పోర్టు ప్రగతిని పరుగులు పెట్టించాల్సిన యంత్రాంగం, దిశానిర్దేశం లేక చతికిలపడుతోంది. ముఖ్యంగా మార్కెటింగ్ విభాగం పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్క’లా తయారైంది. ఏటా ప్రతిష్టాత్మక ఐఐఎంల నుంచి మేధావులను నియమించుకుంటున్నా, వారి మేధస్సు పోర్టు అభ్యున్నతికి కాకుండా.. ట్రాఫిక్ విభాగాధికారుల వ్యక్తిగత పనులకు పరిమితమవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. విధి నిర్వహణలో ఉండాల్సిన సిబ్బందిని అధికారుల సొంత పనులకు వినియోగించుకుంటూ ‘ఆన్ డ్యూటీ’ని కాస్తా ‘ఓన్ డ్యూటీ’గా మార్చేయడం పోర్టు భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది. ప్రచారమెక్కడ? ప్రగతి ఏది? ఒక సంస్థ అభివృద్ధి చెందాలంటే కేవలం మౌలిక సదుపాయాలు ఉంటే సరిపోదు.. ఆ వసతులను ప్రపంచానికి చాటిచెప్పే బలమైన ప్రచార యంత్రాంగం ఉండాలి. విశాఖ పోర్టులో కంటైనర్ టెర్మినల్ సహా తొమ్మిది సంస్థలు కార్గో నిర్వహణలో పాలుపంచుకుంటున్నాయి. నిజానికి ఈ సంస్థల నుంచి కార్గో ఉత్పత్తి పెరగాలంటే పోర్టు యాజమాన్యం చొరవ చూపాలి. ఎప్పటికప్పుడు వాణిజ్య వర్గాలతో సమావేశమై, ‘ట్రేడ్ మీట్స్’ నిర్వహిస్తూ ఎగుమతి, దిగుమతిదారులకు అవసరమైన సౌకర్యాలపై చర్చించాలి. కానీ, ఇక్కడ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పోర్టు ఆదాయంలో 90 శాతం కేవలం భూములు, భవనాల లీజుల ద్వారానే వస్తోంది తప్ప, సరకు రవాణా నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయ వృద్ధి శూన్యం. కార్గో నిర్వహణ చేసే ప్రైవేటు సంస్థలు వృద్ధి సాధిస్తున్నా, దానివల్ల పోర్టుకు రావాల్సిన రాబడి పెరగకపోవడం అధికారుల ఉదాసీనతకు నిలువెత్తు నిదర్శనం. ఐఐఎం మేధస్సు.. ఫైళ్లకే పరిమితం పోర్టు కార్యకలాపాలను విస్తరించాలని, అంతర్జాతీయ స్థాయి విక్రయ వ్యూహాలను రచించాలని ప్రతి రెండేళ్లకోసారి ఐఐఎం నిపుణులను నియమించుకుంటున్నారు. వీరిని మార్కెటింగ్ ప్రమోషన్ కోసం వినియోగించాల్సి ఉండగా, ట్రాఫిక్ విభాగాధికారులు వీరిని తమ వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునే ‘అసిస్టెంట్లు’గా మార్చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయ ఫైళ్లను సిద్ధం చేయడం, అధికారుల ఇంటి పనులు, వ్యక్తిగత పనులు చక్కబెట్టడానికే వీరి సమయం సరిపోతోందని సమాచారం. పోర్టు మార్కెటింగ్‌కు ఊపిరి పోయాల్సిన నిపుణులను ఇలా వినియోగించుకోవడం వల్ల కొత్త వ్యాపార అవకాశాలన్నీ పక్కదారి పడుతున్నాయి. సామర్థ్యం ఉన్నా.. సాఫల్యమెక్కడ? కాగితాల్లో పోర్టు సామర్థ్యం అద్భుతంగా పెరుగుతోంది. 2008–09లో 80 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న సామర్థ్యం ఇప్పుడు 120 మిలియన్ టన్నులకు చేరింది. కానీ, ఆ సామర్థ్యానికి తగ్గట్టుగా కార్గో నిర్వహణ జరుగుతుందా అంటే సమాధానం ‘లేదు’ అనే వస్తోంది. ఉదాహరణకు కంటైనర్ టెర్మినల్ సామర్థ్యం 1.3 మిలియన్ టీయూవీలు కాగా, ప్రస్తుతం అందులో సగం కూడా వాడకం జరగడం లేదు. ఇతర ప్రాంతాలకు మళ్లుతున్న కార్గోను ఆకర్షించేలా దూకుడుగా వ్యవహరించాల్సిన పోర్టు ట్రాఫిక్ విభాగం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సరకు రవాణా వృద్ధి కూడా అక్కడ ఉన్న ప్రైవేటు సంస్థల సొంత ప్రయత్నాలే తప్ప, పోర్టు అధికారుల చొరవ ఏమాత్రం లేదన్నది బహిరంగ రహస్యం. నిర్లక్ష్యం నీడలో ‘సాగర’ వాణిజ్యం పోర్టుకు వచ్చే నౌకలు బెర్తుల కోసం రోజుల తరబడి బయటే వేచి చూడాల్సిన దైన్యం నెలకొంది. ట్రాఫిక్ విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో, అక్కడ అధికారులదే రాజ్యంగా మారింది. సంస్థ ప్రయోజనాల కంటే వ్యక్తిగత లాభాలకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ట్రేడ్ మీట్లు నిర్వహించి పోర్టు సౌకర్యాలను వివరించాల్సిన బాధ్యతను గాలికొదిలేశారు. ఎక్కడో ఒకచోట ఏడాదికో, రెండేళ్లకోసారి తూతూమంత్రంగా సమావేశాలు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు. మార్కెటింగ్ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ విభాగమే సర్వస్వంగా వ్యవహరిస్తోంది. అధికారుల ఈ ‘సొంత’ పోకడల వల్ల విశాఖ పోర్టు అపారమైన నష్టాన్ని చవిచూస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, మార్కెటింగ్ విభాగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి, పోర్టు ప్రగతికి బాటలు వేయకపోతే.. విశాఖ పోర్టు తన పూర్వ వైభవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పోర్టు వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
జోన్ సరే.. కొలువుల బోర్డు ఏది?
సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాల పోరాటం తర్వాత విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటవుతుందన్న సంతోషం నిరుద్యోగ యువతలో కనిపించడం లేదు. 2019లో జోన్ ఏర్పాటుపై ప్రకటన వెలువడినప్పటి నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తూనే ఉంది. దీనిపై మొదటి నుంచి వైఎస్సార్ సీపీ ఆందోళన చేస్తున్నా.. టీడీపీ, జనసేన నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో కేంద్రం ఇక్కడ బోర్డు ఏర్పాటుపై కాలయాపన చేస్తోంది. జోన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ, అందులో ఆర్ఆర్బీపై స్పష్టత ఇవ్వకపోవడం ఉత్తరాంధ్ర నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దేశవ్యాప్తంగా 19 జోన్లలో 21 ఆర్ఆర్బీలు ఉండగా, విశాఖ విషయంలో మాత్రం సాంకేతిక కారణాల సాకుతో జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంప్రతిపత్తి లేని ‘పేపర్ జోన్’? సాధారణంగా భారతీయ రైల్వేలో ఏ జోన్ ఏర్పడినా, ఆ పరిధిలో ఉద్యోగ నియామకాల కోసం ప్రత్యేకంగా ఒక ఆర్ఆర్బీ ఉంటుంది. కానీ కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయంలో కేంద్రం భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది. సికింద్రాబాద్, భువనేశ్వర్లలో ఇప్పటికే బోర్డులు ఉన్నాయని, వాటి ద్వారానే ఇక్కడి నియామకాలు చేపట్టవచ్చనేది అధికారుల వాదనగా కనిపిస్తోంది. అయితే, ఒక భారీ జోన్‌ను నిర్వహించేటప్పుడు దానికి స్వయంప్రతిపత్తి కలిగిన నియామక మండలి లేకపోతే, అది కేవలం ఒక ‘పేపర్ జోన్’గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఆర్ఆర్బీ ఇవ్వరెందుకు? ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 ప్రధాన కార్యనిర్వాహక జోన్లు ఉండగా, ఆర్ఆర్బీలు మాత్రం 21 ఉన్నాయి. కొన్ని పెద్ద జోన్ల పరిధిలో ఒకటి కంటే ఎక్కువ బోర్డులు ఉండగా, మరికొన్ని బోర్డులు రెండు, మూడు జోన్ల అవసరాలను తీరుస్తున్నాయి. గతంలో వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ బోర్డు పరిధిలో ఉండేది. కానీ ఇప్పుడు కొత్త జోన్ కేంద్రంగా విశాఖ అవతరించిన తర్వాత కూడా పాత బోర్డులపైనే ఆధారపడటం ఈ ప్రాంత అభ్యర్థుల ఉపాధి హక్కులను కాలరాయడమే అవుతుందనే వాదన వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర యువత ఉపాధికి ముప్పు ఆర్ఆర్బీ విశాఖకు కేటాయించకపోతే నియామక ప్రక్రియ మొత్తం ఒడిశా లేదా తెలంగాణలోని బోర్డుల నియంత్రణలోకి వెళ్తుంది. దీని వల్ల నోటిఫికేషన్లు వెలువడినప్పుడు మన అవసరాల కంటే ఆయా బోర్డుల పరిధిలోని ప్రాంతాలకే ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అభ్యర్థులు తమ సొంత ప్రాంతంలోని రైల్వే లైన్లలో పని చేయాలన్నా.. ఇతర రాష్ట్రాల్లోని ఆర్ఆర్బీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. పరీక్షలు, దరఖాస్తుల పరిశీలన, వైద్య పరీక్షల కోసం అభ్యర్థులు వందల కిలోమీటర్ల దూరంలోని భువనేశ్వర్ లేదా సికింద్రాబాద్ వెళ్లడం భారంగా మారుతుంది. రైల్వే గ్రూప్–డి వంటి పోస్టులకు స్థానిక భాషా పరిజ్ఞానం కీలకం. ఇతర రాష్ట్రాల బోర్డులు నియామకాలు చేపట్టినప్పుడు, తెలుగు అభ్యర్థులకు సమాచారం చేరవేయడంలోనూ, ప్రశ్నపత్రాల రూపకల్పనలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని వల్ల తెలుగు విద్యార్థులు సాంకేతికపరంగా వెనుకబడే ప్రమాదం ఉంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు అనేది కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదు, అది ఉత్తరాంధ్ర ఆత్మగౌరవంతో ముడిపడి ఉంది. కేవలం భవనాలు, ప్లాట్‌ఫాంలు పెంచితే అది అభివృద్ధి అనిపించుకోదు. స్థానిక యువతకు ఉపాధి దొరికినప్పుడే రైల్వే జోన్ కల సాకారమవుతుంది. తక్షణమే కేంద్రం స్పందించి విశాఖకు ఆర్ఆర్బీ మంజూరు చేయాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికతకు ప్రాధాన్యం పెరుగుతుంది విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందని ప్రకటించినప్పుడు ఉత్తరాంధ్ర యువతలో ఎన్నో ఆశలు చిగురించాయి. కానీ ఇప్పుడు ఆర్ఆర్బీ ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఉద్యోగ నియా మకాల్లో స్థానికులకు ప్రాధాన్యం దక్కాలంటే విశాఖలోనే సొంత బోర్డు ఏర్పాటు చేయాలి. ఒకవేళ భువనేశ్వర్ బోర్డు ద్వారానే రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగితే, వారు పరీక్ష కేంద్రాలను కూడా అక్కడే కేటాయించే అవకాశం ఉంది. దీని వల్ల ఇక్కడ అభ్యర్థుల కంటే ఇతర ప్రాంతాల వారికే ఎక్కువ వెసులుబాటు కలుగుతుంది. ఒక స్వతంత్ర జోన్‌కు స్వయంప్రతిపత్తి కలిగిన నియామక బోర్డు లేకపోతే, అది అధికారాలు లేని కేవలం ఒక నామమాత్రపు కార్యాలయంగానే మిగిలిపోతుంది. – ఎం.మన్మధరావు, ఉద్యోగార్థి జోన్ ఇచ్చి.. బోర్డును విస్మరిస్తే ఎలా? నేను గత మూడేళ్లుగా రైల్వే గ్రూప్–డీ, ఇతర పోటీ పరీక్షల కోసం శ్రమిస్తున్నాను. ఉత్తరాంధ్ర నిరుద్యోగుల కలలు నిజం కావాలంటే విశాఖలో ఆర్ఆర్బీ ఏర్పాటు చేయడం అత్యవసరం. స్థానికంగా బోర్డు అందుబాటులో లేకపోతే, ఉద్యోగ నోటిఫికేషన్లలో దొర్లే తప్పులను గానీ, ఫలితాల జాప్యాన్ని గానీ ప్రశ్నించే హక్కు అభ్యర్థులకు లేకుండా పోతుంది. ఏదైనా చిన్న సమస్య తలెత్తినా, ఫిర్యాదు చేయడానికి పొరుగు రాష్ట్రాల్లోని కార్యాలయాలకు వెళ్లడం మాలాంటి వారికి ఆర్థికంగా, మానసికంగా పెనుభారం. విశాఖను రైల్వే జోన్ కేంద్రంగా ప్రకటించి, ఆర్ఆర్బీని మాత్రం కేటాయించకపోవడం అంటే.. నియామకాల కోసం మమ్మల్ని మళ్లీ ఇతర రాష్ట్రాలపై ఆధారపడేలా చేయడమే. – కె.అప్పారావు, రైల్వే ఉద్యోగ అభ్యర్థి -
కొత్త జిల్లాల్లోనూ త్వరలో నర్సుల సంఘ ఎన్నికలు
మహారాణిపేట: కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కూడా వచ్చే రెండు నెలల్లో ప్రభుత్వ నర్సుల సంఘ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.రాధమ్మ తెలిపారు. శనివారం కేజీహెచ్ క్లాక్‌రూమ్‌లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో 13 జిల్లాల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహించామని, కొత్త జిల్లాల నుంచి కూడా సంఘాల ఏర్పాటుకు డిమాండ్ వస్తోందని చెప్పారు. అందువల్ల ఆయా జిల్లాల్లో సభ్యత్వ నమోదు చేపట్టి ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తామని వెల్లడించారు. అదే సందర్భంగా విశాఖ జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు ఉపాధ్యక్ష పదవులను ప్రభుత్వ (జీఏడీ) అనుమతితో కో–ఆప్షన్ ద్వారా భర్తీ చేసినట్లు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఎ.జయలక్ష్మి, ఎస్.జి.గౌరి, జి.హేమలత, పి.కల్పనలను నియమించగా, కార్యవర్గ సభ్యురాలిగా డి.విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఇన్–సర్వీస్ నర్సులు ఎమ్మెస్సీ చదివేందుకు ప్రభుత్వం త్వరలో జీవో విడుదల చేయనుందని, విశాఖ నర్సింగ్ కళాశాలకు 10 సీట్లు కేటాయించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వా టి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నా మని చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట మ్మ, జిల్లా అధ్యక్షురాలు గంగాభవాని, జిల్లా కార్యదర్శి జీవీ ఎస్ వరలక్ష్మి, కోశాధికారి వంశీ, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరి, ఈసీ సభ్యులు పద్మజ, వినీల, మెహర్ శాంతి, లిల్లి పాల్గొన్నారు. ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రాధమ్మ -
ఈ–కేవైసీ కష్టాలు
మహారాణిపేట: పేద ప్రజలకు అందే రేషన్ బియ్యం, సంక్షేమ పథకాలపై ప్రభుత్వం నిబంధనల కత్తి వేలాడదీస్తోంది. తెలుపు/రైస్ కార్డుదారులు ఈనెల 31వ తేదీలోగా తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ–కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయాలని కూటమి సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిర్ణీత గడువులోగా వేలిముద్రలు నమోదు చేయించుకోని పక్షంలో, వచ్చే నెల నుంచి నిత్యావసర వస్తువుల సరఫరా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మందకొడిగా నమోదు జిల్లాలో ఈ–కేవైసీ ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగడం లేదు. నగర, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈనెల 7వ తేదీ నాటికి సుమారు 80 శాతం మించి కాలేదని తెలుస్తోంది. సర్వర్ లింక్ ఫెయిల్ అవ్వడం, కనెక్టివిటీ సమస్యల వల్ల నమోదు ఆలస్యమవుతోంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలకు వేలిముద్రలు సరిగ్గా పడకపోవడం అడ్డంకిగా మారింది. కొందరివి పూర్తిగా చెరిగిపోవడంతో నమోదు ప్రక్రియ నిలిచిపోతోంది. పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఈ–కేవైసీ నత్తనడకన సాగడానికి కారణమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్యాస్ సబ్సిడీపైనా ప్రభావం కేవలం రేషన్ మాత్రమే కాకుండా, గ్యాస్ సబ్సిడీ పొందేందుకు కూడా ఈ–కేవైసీ అడ్డంకిగా మారింది. సాంకేతిక కారణాల వల్ల ఈ–కేవైసీ పూర్తికాని వారు, రేషన్ కార్డు లేని వారు తమకు రావాల్సిన గ్యాస్ రాయితీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనపు వసూళ్లు నిజానికి ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తిగా ఉచితం. కానీ, కొందరు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు దీన్ని లాభసాటిగా మార్చుకుంటున్నారు. రేషన్ డీలర్లు లేదా కంపెనీ ప్రతినిధులమని చెబుతూ కార్డుదారులకు ఫోన్లు చేసి, ఆధార్ వివరాలతో పాటు డబ్బులు తీసుకుని ఈ–కేవైసీ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన కూలీలు, చిరుద్యోగులు ఈ గడువును అందుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి 6 నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ–కేవైసీ పూర్తి చేసుకోవాలి. ప్రతి రేషన్ డిపో వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంది. సభ్యులు తమ ఆధార్ కార్డుతో వెళ్లి తక్షణమే నమోదు చేసుకోవాలి. –వి.భాస్కరరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
విశాఖలో సెమీ రింగురోడ్డు
విశాఖ సిటీ: నగరంలో రానున్న 50 ఏళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శనివారం వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌పై ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక ఈ నెలాఖరుకల్లా సిద్ధమవుతుందని చెప్పారు. వీఎంఆర్డీఏ పరిధిలోని 6,836 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌పై సుమారు 3,720 అభ్యంతరాలు వచ్చాయని మంత్రి తెలిపారు. వీటిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించి, ఎమ్మెల్యేలు సూచించిన వినతుల్లో దాదాపు 90 శాతం సమస్యలను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానిస్తూ నిర్మిస్తున్న ఏడు రహదారులలో మూడు పూర్తయ్యాయని వివరించారు. దీంతో పాటు భోగాపురం నుంచి విశాఖ నగరం వరకు ఒక ప్రత్యేకమైన బీచ్ కారిడార్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ నగర ప్రజల భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం రూ.14 వేల కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలోని 95 శాతం ఇళ్లకు నేరుగా పైపులైన్ల ద్వారా తాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు ఎం.శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్ పాల్గొన్నారు. -
రాయల్ బెంగాల్ టైగర్ ‘మంజునాథ్’ దత్తత
ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల దత్తత కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ‘మంజునాథ్’ అనే రాయల్ బెంగాల్ టైగర్‌ను ఏడాది కాలానికి కమల్ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ దత్తత తీసుకుంది. ఆ సంస్థ యజమాని దీపక్ కర్నాని బృందం శనివారం జూ క్యూరేటర్ జి.మంగమ్మను కలిసి, పులి వార్షిక నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ.54,000ల చెక్కును అందజేశారు. అనంతరం పులి ఎన్‌క్లోజర్ వద్ద క్యూరేటర్ ఇతర అధికారులతో కలిసి దాతలకు దత్తత పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా క్యూరేటర్ మాట్లాడుతూ.. వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావడానికి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. దత్తత తీసుకున్న సంస్థ ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బృందం సభ్యులు బి.భానువెంకట ప్రతాప్, ఉదయ కిరణ్, జూ అసిస్టెంట్ క్యూరేటర్ గోపి, జూ వైద్యుడు డాక్టర్ భాను తదితరులు పాల్గొన్నారు. -
జనసేన Vs టీడీపీ.. ఫ్లెక్సీలో ఫొటోపై రచ్చ..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో టీడీపీ, జనసేనలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. విశాఖ సౌత్ నియోజకవర్గంలో తాజాగా టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆధిపత్యం కోసం ఇరు వర్గాల నేతలు మాటల దాడి చేస్తున్నారు. దీంతో, ఈ వ్యవహారంలో చర్చనీయాంశంగా మారింది.విశాఖ సౌత్ నియోజకవర్గంలో కనకమహాలక్ష్మి ఆలయ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక, ఫ్లెక్సీలో టీడీపీ ఇన్చార్జ్ సీతంరాజు సుధాకర్ ఫొటోలు కనిపించలేదు. జనసేన నేతలు టీడీపీ నాయకుడి ఫొటోలను పెట్టలేదు. దీంతో, రాజకీయ దుమారం రేగింది. జనసేన నేతల వైఖరిపై సుధాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే, విశాఖ సౌత్‌లో గత కొంతకాలంగా జనసేన ఎమ్మెల్యే వంశీ, సీతంరాజు సుధాకర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో జనసేన నేతల తీరుపై టీడీపీ అధిష్టానానికి సుధాకర్ ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా టీడీపీ నేతలు.. జనసేన కేడర్‌పై మండిపడుతున్నారు. జనసేన నాయకులు పొత్తు ధర్మం పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . -
పైరవీల ‘వల’లో పేదల ‘ఆశ’
మహారాణిపేట: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించే ‘ఆశ’ వర్కర్ల పోస్టులకు గతంలో లేని విధంగా విపరీతమైన డిమాండ్ పెరిగింది. గతంలో ఆరోగ్య రంగంపై కనీస అవగాహన ఉన్న వారితో ఈ పోస్టులను భర్తీ చేసేవారు, కానీ ప్రస్తుతం ఈ ఉద్యోగాలను చేజిక్కించుకోవడానికి పైరవీలు, రాజకీయ సిఫార్సులు ఊహించని స్థాయిలో సాగుతున్నాయి. జిల్లాలో ఖాళీగా ఉన్న కేవలం 68 ఆశ వర్కర్ల పోస్టుల కోసం సుమారు 6 వేల మంది నిరుద్యోగ మహిళలు దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి పోస్టుకు సగటున వంద మందికి పైగా పోటీ పడుతుండటంతో, ఎంపిక ప్రక్రియ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారికి పెద్ద సవాలుగా మారింది. బ్రోకర్ల దందా మరోవైపు ఈ నియామకాల్లో రాజకీయ జోక్యం పరాకాష్టకు చేరుకుంది. వార్డు, మండల స్థాయి పోస్టుల కోసం సాక్షాత్తూ ఎమ్మెల్యేలే నేరుగా రంగంలోకి దిగడంతో, స్థానిక మాజీ కార్పొరేటర్లకు, ఎమ్మెల్యేలకు మధ్య తీవ్రస్థాయిలో ‘కోల్డ్ వార్’ నడుస్తోంది. అటు కూటమి నాయకులు, ఇటు మాజీ ప్రజాప్రతినిధులు తమ అనుచరులకు పోస్టులు ఇప్పించుకోవడానికి జిల్లా అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయం ఇప్పుడు సిఫార్సు లేఖలతో నిండిపోయింది. ఎమ్మెల్యేలు, వారి వ్యక్తిగత సహాయకులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ రాజకీయ ఒత్తిడిని ఆసరాగా చేసుకున్న కొంతమంది మధ్యవర్తులు, శాఖలోని కొందరు ఉద్యోగులు బేరసారాలకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు రేటు నిర్ణయించి, నిరుద్యోగ మహిళలను మాయమాటలతో నమ్మిస్తూ బ్రోకర్లు దందా సాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల కనుసన్నల్లో.. ప్రస్తుతం పీహెచ్‌సీలు, యూపీహెచ్సీల పరిధిలో దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. నిబంధనల ప్రకారం 25 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉండి, స్థానిక సచివాలయం పరిధిలో నివసించే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మెరిట్, రోస్టర్ విధానాన్ని అనుసరించి ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే భర్తీ ప్రక్రియ సాగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. కార్పొరేటర్ల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం అంతా ఎమ్మెల్యేల హవానే నడుస్తోంది. స్థానికంగా ఉండే మాజీ కార్పొరేటర్ల సిఫార్సులను పక్కన పెట్టి, ఎమ్మెల్యేలు నేరుగా వార్డు స్థాయి పోస్టుల్లో జోక్యం చేసుకోవడం స్థానిక నేతల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. పారదర్శకతతో భర్తీ చేయాల్సిన సేవా పోస్టులు కాస్తా, రాజకీయ పైరవీలకు, భారీ బేరసారాలకు వేదికగా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంపిక చేసిన జాబితాను జిల్లా అధికారులు ఆమోదించాల్సి ఉన్న నేపథ్యంలో, చివరికి ఎవరికి ఈ పోస్టులు దక్కుతాయోనన్న ఉత్కంఠ నెలకొంది. -
పవర్ గర్జన
పట్టాలపైహెచ్పీ విద్యుత్ ఫ్రైట్ లోకోమోటివ్స్ సాక్షి, విశాఖపట్నం : భారతీయ రైల్వే సరుకు రవాణా ముఖచిత్రాన్ని మార్చే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. అంతర్జాతీయ ఇంజనీరింగ్ దిగ్గజం సీమెన్స్ రూపొందించిన అత్యంత శక్తివంతమైన 9000 హార్స్పవర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు భారతీయ పట్టాలపై అరంగేట్రం చేశాయి. ఈ అత్యాధునిక ఇంజిన్ల మొదటి సెట్‌ను వాణిజ్య కార్యకలాపాల కోసం రైల్వే శాఖకు అప్పగించారు. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా లోకోమోటివ్ల నిర్వహణ కోసం దేశంలోనే మొదటి డిపోను విశాఖపట్నంలో ప్రారంభించడం గమనార్హం. ఒప్పందం కుదిరిన 36 నెలల్లోనే 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో మొదటి సెట్‌ని సిద్ధం చేయడం విశేషం. 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో.. ఈ ‘డీ9’ మోడల్ 9000 హెచ్‌పీ లోకోమోటివ్‌లు యూరోపియన్ ప్రమాణాలతో, 90 శాతం స్వదేశీ సాంకేతికతతో తయారయ్యాయి. గుజరాత్‌లోని దాహోద్ ఫ్యాక్టరీలో వీటిని నిర్మిస్తున్నారు. ఇందులో వాడిన ‘రైలిజెంట్ ఎక్స్’ అనే ప్లాట్‌ఫామ్ ద్వారా ఇంజిన్‌లో ఏదైనా లోపం తలెత్తే అవకాశం ఉంటే ముందే గుర్తించవచ్చు. అధిక సామర్థ్యం వల్ల విద్యుత్ వినియోగం తగ్గడమే కాకుండా, కర్బన ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. విశాఖ సహా 4 నిర్వహణ కేంద్రాలు ఈ లోకోమోటివ్ల జీవితకాల నిర్వహణ కోసం ‘లైఫ్‌సైకిల్ పార్ట్నర్షిప్ మోడల్’లో దేశవ్యాప్తంగా నాలుగు డిపోలను ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో తొలి డిపో కార్యకలాపాలు ప్రారంభం కాగా, త్వరలోనే రాయ్‌పూర్, ఖరగ్‌పూర్, పూణేలలో కూడా డిపోలను అందుబాటులోకి తీసుకురానున్నారు. -
మృతదేహానికీ వివక్షేనా?
ప్రశ్నార్థకమైన మానవత్వం ఒక ఎంపీటీసీ హోదాలో ఉన్న వ్యక్తికే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, ఇక సామాన్య గిరిజనుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే రోగుల పట్ల కేజీహెచ్ సిబ్బంది వైఖరి మారాలని, మరణంలోనైనా వారికి గౌరవం దక్కాలని స్థానికులు కోరుతున్నారు. చివరికి సుభద్ర, భాగ్యలక్ష్మి బాధితులను పరామర్శించి, వాహనం ఏర్పాటు చేసి పంపించడంతో ఆ విషాద ప్రయాణం ముందుకు సాగింది. మహారాణిపేట : ‘పేదవాడికి ప్రాణం ఉన్నప్పుడు వైద్యం దొరకదు.. ప్రాణం పోయాక గౌరవం దక్క దు’. ఉత్తరాంధ్రకు తలమానికం అని చెప్పుకునే కేజీహెచ్‌లో గిరిజనుల పట్ల అమానుషత్వం మరోసారి బట్టబయలైంది. ఒక ఎంపీటీసీ హోదాలో ఉన్న గిరిజన నాయకుడి మృతదేహాన్ని తరలించడానికి ‘మహాప్రస్థానం’ వాహనాన్ని నిరాకరించి, వ్యవస్థ ఎంతటి మొద్దునిద్రలో ఉందో చాటిచెప్పారు. ప్రజాప్రతినిధులు రోడ్డెక్కితే తప్ప కదలని ఈ మొండి యంత్రాంగంపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆఖరి ప్రయాణానికి అడ్డంకులు జి.కె.వీధి మండలం దామనాపల్లి ఎంపీటీసీ కొర్ర భీమరాజు (45) అనారోగ్యంతో పోరాడుతూ శుక్రవారం ఉదయం కేజీహెచ్‌లో తుదిశ్వాస విడిచారు. కొండ కోనల నుంచి మెరుగైన వైద్యం అందుతుందని ఆశతో వచ్చిన ఆ కుటుంబానికి, మరణం తర్వాత కోలుకోలేని చేదు అనుభవం ఎదురైంది. కనీసం మృతదేహాన్ని తరలించడానికి ‘మహాప్రస్థానం’ వాహనాన్ని గానీ, అంబులెన్స్‌ను గానీ కేటాయించమని వేడుకున్నా.. ఆసుపత్రి అధికారులు కనికరించలేదు. దిక్కుతోచని స్థితిలో అమాయక గిరిజనులు ‘వాహనాలు అందుబాటులో లేవు’ అంటూ సిబ్బంది చెప్పిన మాటలు బాధితుల గుండెల్లో బాణంలా గుచ్చుకున్నాయి. ఆసుపత్రిలోని ఎస్టీ సెల్‌కు సమాచారం అందించినా, అక్కడ కూడా స్పందన కరువైంది. తమ వారిని కోల్పోయిన బాధ ఒకవైపు, పార్థివ దేహాన్ని ఇంటికి ఎలా తీసుకెళ్లాలో తెలియని అయోమయం మరోవైపు.. ఆ గిరిజనుల వేదన వర్ణనాతీతం. వ్యవస్థల మధ్య సామాన్యుడు, ముఖ్యంగా గిరిజనుడు ఎంతటి అగౌరవానికి గురవుతున్నాడో ఈ దృశ్యాలు కళ్లకు కట్టాయి. నేతల జోక్యంతో కదిలిన యంత్రాంగం ఈ విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్పర్సన్, నేరుగా సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగడంతో నిమిషాల వ్యవధిలోనే ‘లేవన్న’ వాహనాలు ప్రత్యక్షమయ్యాయి. కేజీహెచ్‌లో మృగ్యమైన మానవత్వం -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పగడ్బందీ ఏర్పాట్లు
మహారాణిపేట: జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమన్వయ సమీక్షా సమావేశంలో ఆమె పలు కీలక సూచనలు చేశారు. ఈనెల 21 నుంచి జూన్ 2 వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం జిల్లాలో మొత్తం 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, లైటింగ్, టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, 200 మీటర్ల పరిధిలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థుల రాకపోకలకు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. -
దేవస్థానం స్థలంలో నిర్మించిన గోడ తొలగింపు
ఆరిలోవ: జీవీఎంసీ 9వ వార్డు పరిధిలోని ప్రశాంతినగర్ కొండవాలు ప్రాంతంలో నెలకొన్న దారి వివాదంపై సింహాచలం దేవస్థానం అధికారులు స్పందించారు. ఓ వ్యక్తి అక్రమంగా నిర్మించిన ఇంటి గోడను శుక్రవారం దేవస్థానం సిబ్బంది సమక్షంలో తొలగించారు. స్థానిక మెట్ల మార్గానికి అడ్డంగా గోడ నిర్మించడంతో పాటు దారిని మూసివేయడంపై ఇద్దరు వ్యక్తుల మధ్య గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఈ వివాదంలో మనస్తాపం చెందిన రాజేశ్వరరావు అనే వ్యక్తి ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఈనెల 2న ‘సాక్షి’ దినపత్రికలో ‘దారి వివాదం.. ఆత్మహత్యాయత్నం’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. మెట్ల మార్గానికి అడ్డంగా ఉన్న గేటును సిబ్బంది సమక్షంలో స్థానికులే తొలగించగా, అక్రమంగా నిర్మించిన గోడను అధికారులు కూల్చివేశారు. దేవస్థానం స్థలంలో నిర్మించిన గోడను తొలగించిన అధికారులు.. మరుగుదొడ్డి కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్‌ను మాత్రం అలాగే వదిలేయడంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణాల తొలగింపులో అధికారులు పక్షపాతం చూపడం సరికాదని కాలనీవాసులు పేర్కొంటున్నారు. -
రక్తదానంతో తలసేమియా రోగులకు ప్రాణదానం
మహారాణిపేట : ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా మహారాణిపేటలోని రెడ్‌క్రాస్ భవనంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డునాంట్కు నివాళులర్పించిన ఆమె, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలకు అండగా నిలిచేందుకు యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 50కి పైగా సార్లు రక్తదానం చేసిన 25 మంది ప్లాటినం దాతలను ఆమె సత్కరించారు. పేదలకు అందుబాటు ధరల్లో పరీక్షలు అందించేందుకు ఏర్పాటు చేసిన ‘జనతా రేట్ల’ డయాగ్నస్టిక్ ల్యాబ్‌ను పరిశీలించి, తలసేమియా చిన్నారులతో ముచ్చటించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం చైర్మన్ సి హెచ్.బలసతీష్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు, ఐఆర్సీఎస్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మురళీకృష్ణ పట్నాయక్, ఎండి. రెహమ్తుల్లా, నరవ ప్రకాష్ రావు, జి.ప్రసాద్ రావు, విష్ణువర్ధన రెడ్డి, ప్రొఫెసర్ హరనాథ్, పి.రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఈసెట్‌లో గాజువాక విద్యార్థికి మొదటి ర్యాంకు
గాజువాక : స్థానిక అజీమాబాద్కు చెందిన పండ్ల వ్యాపారి గోవిందరాజు కుమారుడు సింహాద్రి వంశీ ఏపీఈసెట్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో 158 మార్కులు సాధించి రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. కంచరపాలెంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా కెమికల్ ఇంజనీరింగ్ చదివిన అతడు 93 శాతం మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. డిఫెన్స్లోగాని, స్పేస్ సెక్టార్లో గాని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉద్యోగం సాధించాలనే తపనతో నిరంతరం శ్రమించానని, రోజుకు 12 గంటల పాటు చదివి విజయం సాధించానని వంశీ పేర్కొన్నాడు. -
రైల్వే ఆధునికీకరణలో సరికొత్త అధ్యాయం
ఇండియన్ రైల్వే ఆధునీకరణలో ఇది సరికొత్త అధ్యాయం. ఈ లోకోమోటివ్స్ ద్వారా భారీ సరుకును వేగంగా తరలించడం ద్వారా సప్లై చైన్‌లో జాప్యం ఉండదు. అధిక సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ఇంజిన్ల వల్ల కర్బన ఉద్గారాలు తగ్గి, సుస్థిర అభివృద్ధికి దోహదపడేలా రూపొందించాం. దేశీయంగా తయారు చెయ్యడంతో పాటు నిర్వహణ కేంద్రాల ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం. వేగవంతమైన రవాణా వల్ల పారిశ్రామిక ఉత్పత్తులు త్వరగా మార్కెట్లోకి చేరడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతంలా మారుతుంది. – సునీల్ మాథుర్, సీమెన్స్ ఎండీ, సీఈవో -
మెట్రో సీసీకి భారీ విజయం
విశాఖ స్పోర్ట్స్ : సూపర్ నాకవుట్ వన్డే మ్యాచ్‌ల్లో మెట్రో సీసీ, గెలాక్సీ సీసీ జట్లు పరుగుల వరద పారించి భారీ విజయాలను అందుకున్నాయి. రైల్వే స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మెట్రో సీసీ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 526 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ హ్రితిక్ కేవలం 45 బంతుల్లోనే 13 సిక్సర్లు, 8 ఫోర్లతో 119 పరుగులు చేయగా, మిడిలార్డర్లో పరమ్‌వీర్ 147 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరికి తోడుగా కెప్టెన్ యువన్ (85), వినోద్ (87), శ్రావణ్ (52) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం ఛేదనకు దిగిన వైజాగ్ బ్లూస్ జట్టు 18.1 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. మెట్రో బౌలర్ అచ్యుత్ 5 వికెట్లతో ప్రత్యర్థి నడ్డి విరవడంతో మెట్రో సీసీ 435 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. మరోవైపు వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన హిందూ ట్రోఫీ మ్యాచ్‌లో గెలాక్సీ సీసీ జట్టు సిటీ పోలీస్‌పై 360 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గెలాక్సీ సీసీ 478 పరుగులకు ఆలౌటైంది. హిమకర్ (61), భస్వంత్ (76), ధీరజ్ (59) రాణించడంతో జట్టు భారీ స్కోరును అందుకోగలిగింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సిటీ పోలీస్ జట్టు గెలాక్సీ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 25.5 ఓవర్లలో 118 పరుగులకే చాపచుట్టేసింది. యశ్వంత్, వాసు, ధీరజ్‌లు తలో రెండు వికెట్లు తీసి పోలీస్ జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. జగదీష్ (21) మినహా మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేకపోవడంతో పోలీస్ జట్టుకు భారీ పరాజయం తప్పలేదు. ఘోరంగా ఓడిన సిటీ పోలీస్ జట్టు -
ఘనంగా సిరి వెంకటేశ్వర డెవలపర్స్ 20వ వార్షికోత్సవం
సీతంపేట: సిరి వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ 20వ వార్షికోత్సవాన్ని శుక్రవారం శంకరమఠం రోడ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.కె.రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మిత్రులు, శ్రేయోభిలాషులు, మార్కెటింగ్ సిబ్బంది అందించిన నిరంతర సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు. 20 ఏళ్లలో 20 వెంచర్లను దిగ్విజయంగా పూర్తి చేశామని, ప్రస్తుతం 6 ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ముఖ్యంగా ఆనందపురం సమీపంలోని గూగుల్ సిటీకి దగ్గరగా సరికొత్త వెంచర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ బృందం, ఖాతాదారులు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని సంస్థ పురోగతిని అభినందించారు. -
పతకాల వేటలో సాగర్‌నగర్ స్టార్లు
క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా శారీరక దృఢత్వానికి ఎంతో తోడ్పడతాయి. అయితే నేటి తరం యువత సెల్ ఫోన్లకు బందీలుగా మారుతోంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా రీల్స్, ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో గడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. దీని వల్ల అలసత్వం, మతిమరుపు, కంటి సమస్యలు వంటి అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. దీనిని గమనించిన పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు వేదికగా నిలుస్తోంది సాగర్‌నగర్ బాస్కెట్‌బాల్ అకాడమీ(ఎస్ఎన్బీఏ). సాగర్‌నగర్‌కు చెందిన విద్యార్థులు ఒకవైపు చదువులో రాణిస్తూనే, మరోవైపు క్రీడల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పలు పోటీల్లో ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 2018లో ప్రారంభమైన ఈ అకాడమీలో, కోచ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన సుమారు 300 మందిలో, ఇప్పటివరకు 20 మంది జాతీయ స్థాయిలో, 30 మంది రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించడం విశేషం. భవిష్యత్‌లో మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించడమే తమ లక్ష్యమని విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం సాగర్‌నగర్ బాస్కెట్‌బాల్ అకాడమీ ఆధ్వర్యంలో సాగర్‌నగర్ గ్రౌండ్లో ఇప్పటికే సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 8.30 వరకు, తిరిగి సాయంత్రం 6 నుంచి 8 వరకు శిక్షణ ఇస్తున్నారు. కనీసం 10 ఏళ్ల వయసు పైబడిన వారు శిక్షణకు అర్హులు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోచ్ సూచించారు. దేశం తరఫున ఆడటమే నా కల ఇటీవల డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం కఠోర సాధన చేస్తున్నాను. ఏదో ఒక రోజు భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, దేశం గర్వపడేలా చేయడమే నా జీవిత లక్ష్యం. – ఎన్. నవ్య, క్రీడాకారిణి దేశానికి కెప్టెన్‌గా వ్యవహరించాలి గతేడాది డెహ్రాడూన్ జాతీయ పోటీల్లో ఏపీ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప అనుభవం. భవిష్యత్తులో మరింత శ్రమించి, భారత బాస్కెట్ బాల్ జట్టుకు నాయకత్వం వహించాలనేది నా బలమైన ఆశయం. – వి.వి.వాట్సన్ మెరుపు వేగంతో సాగే క్రీడ బాస్కెట్‌బాల్. ఇటువంటి క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించాలంటే కఠోర సాధన, శ్రమ ఎంతో అవసరం. వాటన్నింటినీ అధిగమించి, జాతీయ స్థాయిలో తమ ముద్ర వేస్తున్నారు సాగర్‌నగర్ క్రీడాకారులు. ఇటీవల డెహ్రాడూన్ వంటి నగరాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన నవ్య, వాట్సన్ వంటి క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొందిన వారే.. ప్రతి ఏటా సమ్మర్ క్యాంప్ ద్వారా ఉచితంగా శిక్షణ పొందుతూ.. చాంపియన్లుగా మారుతున్నారు. – కొమ్మాది గొప్ప క్రీడాకారుడిగా ఎదగడమే లక్ష్యం బాస్కెట్ బాల్ నాకు క్రమశిక్షణను నేర్పింది. జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, అత్యుత్తమ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకోవడమే నా టార్గెట్. అందుకే నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నాను. – నీల్, క్రీడాకారుడు -
అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి వ్యక్తి మృతి
బీచ్‌రోడ్డు : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన మీసాల సత్యనారాయణ (39) తీవ్రమైన మద్యపాన వ్యసనంతో బాధపడుతుండేవాడు. దీని నుంచి అతడిని విముక్తి కలిగించేందుకు కుటుంబ సభ్యులు నగరంలోని మానసిక ఆసుపత్రిలోని డి–ఎడిక్షన్ సెంటర్లో చేర్పించారు. శుక్రవారం ఆసుపత్రి సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లిన సత్యనారాయణ, అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. మృతుడికి 2016లో చంద్రకళతో వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం మత్తులో భార్యను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మూడేళ్లుగా సత్యనారాయణ తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయా తేదీలలో పలు రైళ్ల రీ షెడ్యూల్ తాటిచెట్లపాలెం: సౌత్ ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని రూప్స స్టేషన్లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ మార్గంలో నడిచే పలు కీలక రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. పవన్‌కుమార్ వెల్లడించారు. ఈ మార్పుల ప్రకారం హౌరా–సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (12703) ఈ నెల 11, 12, 13 తేదీలలో రెండు గంటలు, 14న గంట, 15న గంటన్నర, 17న నాలుగు గంటల ఆలస్యంగా హౌరా నుంచి బయల్దేరనుంది. అదేవిధంగా సికింద్రాబాద్–హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (12704) ఈ నెల 15న గంట, 16న రెండు గంటల ఆలస్యంగా సికింద్రాబాద్ నుంచి బయల్దేరనుంది. వీటితో పాటు న్యూ జల్పయ్గురి–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 15న గంట ఆలస్యంగా, హౌరా–ఎస్ఎంవీటీ బెంగళూరు దురంతో ఎక్స్‌ప్రెస్ 16న గంట, 17న రెండు గంటల ఆలస్యంగా హౌరా నుంచి బయల్దేరనున్నాయి. -
గిరి ప్రదక్షిణ వైభవంపై పాట రాస్తా
గేయ రచయిత శ్యామ్సింహాచలం : సింహాచలం పుణ్యక్షేత్రం, గిరిప్రదక్షిణ ఉత్సవ విశిష్టతను చాటిచెప్పేలా త్వరలోనే ఒక అద్భుతమైన పాటను రాస్తానని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ తెలిపారు. శుక్రవారం ఆయన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని మహిమాన్విత కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న ఆయనకు, అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ ‘బలగం’ సినిమాలోని ‘ఊరూ పల్లెటూరు దీనితీరే అమ్మ తీరు’ పాటకు జాతీయ అవార్డు రావడం ఆ స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆయనకు క్షేత్ర మహత్యాన్ని వివరించి, స్వామివారి వైభవంపై పాటలు రాయాలని కోరగా.. తప్పకుండా గిరిప్రదక్షిణ ఉత్సవంపై పాట రాస్తానని శ్యామ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం పీఆర్వో అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
‘విభజన హామీల సాధనలో టీడీపీ విఫలం’
సాక్షి, విశాఖపట్నం: విభజన హామీలు అమలు చేయమని వైఎస్సార్సీపీ అనేక పోరాటాలు చేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ప్రత్యేక హోదా రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని... ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వం విభజన హామీలు గాలికి వదిలేశారన్నారు. చంద్రబాబు తన ప్యాకేజీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు 2016లో ఆమరణ నిరాహార దీక్ష చేశాను’’ అని ఆయన గుర్తు చేశారు.‘‘నా మీద అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆత్మహత్యా యత్నం కేసు నమోదు చేయించింది. ఆ కేసులో 6 నెలల జైలు శిక్ష, ఐదు వేలు జరిమానా విధించింది. ఆ కేసు కొట్టివేయాలని చేయాలని హయ్యర్ కోర్టులో అప్పీల్ చేశాము.. వాల్తేర్ డివిజన్‌తో కూడిన విశాఖ రైల్వే స్టేషన్ కావాలి. ఆదాయం వచ్చే కేకే లైన్ ఒడిశాకు అప్పగించారు. రాష్ట్ర నాయకుల చేతగానితనం వలన కేకే లైన్ ఒడిశాకు పోయింది. విశాఖ వచ్చిన రైల్వే శాఖ మంత్రిని కేకే లైన్ గురించి ఎందుకు అడగలేదు.?. రైల్వే జోన్ గురించి ఎంపీ భరత్‌కు ఏం తెలుసు? విశాఖ రైల్వే జోన్‌కు ఆదాయం లేకపోయినా పర్వాలేదని ఎలా మాట్లాడతారు?’’ అంటూ అమర్నాథ్ నిలదీశారు. -
ఏపీకి అలర్ట్.. రాగల మూడు గంటల్లో..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో అనకాపల్లి, అల్లూరి, పోలవరం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ రోజు, రేపు(శుక్ర,శని) వానలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మరో వైపు కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండగా... ఇటు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అధిక వేడి, ఉక్కపోతకు తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటికి రావాలంటేనే జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకునేందుకు కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు డీ హైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుందన్నారు. వీటితో పాటు పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవడం ఉత్తమం. బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీతో పాటు కళ్లజోడు తప్పనిసరిగా పెట్టుకోవాలి. మహిళలు గొడుగులు తప్పనిసరిగా ఉపయోగించాలి. కాటన్ దుస్తులు ధరించడం శ్రేయస్కరమని వైద్యులు తెలిపారు. -
కూటమికి షాక్.. బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విశాఖ: అమరావతిలో నిర్మాణాలపై జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతి, పర్యావరణం విషయంలో కూటమి నేతలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు.జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతిలో పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. అమరావతిలో నిర్మాణాలు నిబంధనలకు లోబడి నిర్మించాలి. రాజధాని నిర్మాణంలో 84 శాతం సాగు, పర్యావరణ భూములు ఉన్నాయి. అమరావతి పరిధిలో ఉన్న నదులు, కాలువలు, వాగులను పరిరక్షించాలి. అవినీతి, పర్యావరణంపై రాజీలేని పోరాటం చేస్తాను. ఈ విషయంలో కూటమి నేతలను కూడా వదిలిపెట్టను. రాజకీయ పార్టీలపై నమ్మకం పోయింది. ఈ సమాజాన్ని మీడియా కాపాడాలి’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి ప్రాథమిక కర్తవ్యం. ప్రభుత్వాలు పారిశ్రామిక వృద్ధి లేదా ఇతర ప్రాజెక్టుల పేరుతో పర్యావరణ నియమాలను విస్మరించినప్పుడు, యువత మరియు పౌర సమాజం ఒక బలమైన నిఘా శక్తిగా (Watchdog) మారడం అత్యవసరం. కేంద్ర సాధికార కమిటీ (CEC) వెల్లడించిన అంశాలు క్షేత్రస్థాయిలో ఉన్న భయంకరమైన వాస్తవాలను ప్రతిబింబిస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. -
‘లక్షింపేట మారణకాండ బాధితులకు న్యాయం చేయాలి’
డాబాగార్డెన్స్: లక్షింపేట మారణకాండ బాధితులకు న్యాయం చేయాలని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక(విదసం) రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు. లక్షింపేట మృతుల కుటుంబాలకు న్యాయం కోసం ప్రభుత్వం నియమించిన ఓపెన్ కోర్టు వల్ల బాధితులకు న్యాయం జరిగేలా లేదని ఆరోపిస్తూ.. విదసం ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వెంకట్రావు మాట్లాడుతూ 2012 జూన్ 12న మాలపల్లిపై తూర్పు కాపులు బాంబులు, బరిశెలు, కత్తులు, గొడ్డలతో వచ్చి కళ్లల్లో కారం చల్లి కిరాతకంగా చేసిన హత్యాకాండలో ఐదుగురు దళితులు చనిపోయారని గుర్తు చేశారు. నాడు దళిత సంఘాల పోరాటం ఫలితంగా ప్రభుత్వం లక్షింపేటలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసిందని, 14 ఏళ్లుగా జరుగుతున్న న్యాయ ప్రక్రియ నేడు కీలక దశకు చేరిందన్నారు. రెండేళ్లుగా ఈ కేసు వాదనకు ప్రత్యేక ప్రాసిక్యూటర్ లేరని, బాధితులు కోరినా ప్రభుత్వం నియమించలేదని ఆక్షేపించారు. ప్రస్తుతం జరుగుతున్న న్యాయ విచారణపై తమకు సందేహాలున్నాయని, ప్రస్తుత విచారణ తీరు చూస్తే.. తీర్పుపై బాధితులకు నమ్మకం లేదన్నారు. దీనిపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. నిరసనలో గుడివాడ ప్రసాద్, యడ్ల గోపి, గోడి వెంకటేశ్వరరావు, గుడాల ఈశ్వరరావు, పి.భాస్కరరావు, ఉమా మహేశ్వరి, గుడివాడ భాస్కరరావు, సీహెచ్ రాంబాబు, నావేటి గురుదేవి, ఉదయ్, కై లాస్ నాయక్, చాపల దాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆ ప్రాంతాలను విశాఖ న్యాయస్థానాల పరిధిలోనే ఉంచండి
అల్లిపురం: భీమునిపట్నం న్యాయస్థాన పరిధిలోకి చేర్చిన పెందుర్తి, చినగదిలి మండల ప్రాంతాలను విశాఖ న్యాయస్థానాల పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్‌కు విశాఖ న్యాయవాదులు విన్నవించారు. ఈ మేరకు అమరావతిలో గురువారం కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు మాట్లాడుతూ మధురవాడ, రుషికొండ, విశాలాక్షినగర్, పెందుర్తి, వేపగుంట, సుజాతానగర్, నరవ, ఆరిలోవ ప్రాంతాలలో కొంతభాగం భీమునిపట్నం న్యాయస్థాన పరిధిలోకి వెళ్లాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈప్రాంతాల్లో నివసించే కక్షిదారులు, న్యాయవాదులు వ్యయప్రయాసలకు లోనవుతున్నారని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతాలన్నీ విశాఖ న్యాయస్థానాల పరిధిలోనే ఉండేవన్నారు. న్యాయవాదులు చెప్పిన వివరాలను పరిశీలించిన చీఫ్ జస్టిస్ లిసా గిల్ తప్పకుండా పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. చీఫ్ జస్టిస్‌ను కలిసిన వారిలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ఎస్.కృష్ణమోహన్, కె.రామజోగేశ్వరరావు, బి.వి.ఆర్.మూర్తి, కె.ఎల్.డి.నాగశ్రీ, సంఘం నాయకులు గాలి రామిరెడ్డి ఉన్నారు. -
కై లాసగిరిపై ఆకర్షణగా త్రిశూలం
ఆరిలోవ: నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కై లాసగిరిపై త్రిశూలం ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 9న దీని ప్రారంభోత్సవం కావడంతో పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే ఇక్కడ ప్లాట్‌ఫాంపై త్రిశూలం, డమరుకం అమర్చడం పూర్తయింది. ఇంకా ఉద్యానవనం, సందర్శకులు సేదదీరేందుకు సిమెంట్బెంచీల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. డమరుకంతో కూడిన త్రిశూలం ప్రారంభమైతే ఈ పర్యాటక కేంద్రం మరింత ఆకర్షణీయంగా మారనుందని వీఎంఆర్డీఏ అధికారులు భావిస్తున్నారు. రూ.1.55 కోట్లతో కొండ చివరన ఏర్పాటు చేసిన 55 అడుగుల పొడవుండే ఈ త్రిశూలం కై లాసగిరికి వెళ్లే పర్యాటకులతో పాటు నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు కనిపిస్తుంది. జాతీయరహదారిపై డెయిరీఫారం, ఇసుకతోట, మద్దిలపాలెం వరకు, బీచ్‌రోడ్డు వైపు ఎంవీపీ కాలనీ, ఏయూ వరకు, బీఆర్టీఎస్ రోడ్డులో ఆరిలోవ, ముడసర్లోవ వైపు ఇది స్పష్టంగా కనిపిస్తుంది. -
ఏయూలో నిలిచిన కొలువుల భర్తీ
విశాఖ సిటీ: చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. రాజకీయ కుతంత్రంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రక్రియను రద్దు చేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందన్న దుర్బుద్ధితో గత నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. దీంతో ఏయూలో ఖాళీగా ఉన్న 523 అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న వేలాది మంది ఆశలు ఆవిరైపోయాయి. ఏయూలో దీర్ఘకాలంగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2014–2019 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం కనీసం ఆ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏయూలో 523 అధ్యాపక పోస్టుల భర్తీ కోసం 2023లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికలకు సమయం ఆసన్నమవడంతో భర్తీ ప్రక్రియ పూర్తి కాలేదు. సుదీర్ఘ నిరీక్షణ వృథానేనా? ఎన్నికలకు ముందు భారీగా ఉద్యోగాలు కల్పిస్తామని చంద్రబాబు అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. కొత్త ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ పూర్తవుతుందని దరఖాస్తుదారులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఆ నోటిఫికేషన్‌ను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అభ్యర్థులు ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయింది. తాజాగా తీసుకున్న నిర్ణయం అభ్యర్థులకు శరాఘాతంగా మారింది. నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు పరీక్షలు నిర్వహించకపోగా, ఇప్పుడు ఏకంగా రద్దు చేయడంపై దరఖాస్తుదారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కకూడదనే..! గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నియామకాలు చేపడితే, ఆ ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్న భయంతోనే ప్రస్తుత ప్రభుత్వం ఈ కుట్రకు తెరలేపిందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్సిటీల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేసింది. ఏయూలో నాక్ ‘ఏ+’గ్రేడ్ 3.74 స్కోరుతో దూసుకుపోతున్న తరుణంలో, అధ్యాపక కొరతను తీర్చడం వర్సిటీ అభివృద్ధికి ఎంతో కీలకం. కానీ, రాజకీయ స్వార్థం ముందు నిరుద్యోగుల భవిష్యత్తు తృణప్రాయంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నోటిఫికేషన్ రద్దు ఏయూలో ఖాళీగా ఉన్న 523 అధ్యాపక పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించినట్లు ఏయూ రిజిస్ట్రార్ రాంబాబు ప్రకటించారు. 2023, నవంబర్ 1న ప్రచురించిన నోటిఫికేషన్ ఉనికిలో లేదని స్పష్టం చేశారు. అప్పుడు దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు రుసుం తిరిగి పొందేందుకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ www. andhrauniversity.edu.inని సందర్శించాలని సూచించారు. పాత నోటిఫికేషన్ రద్దు చేసిన అధికారులు కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మాత్రం చెప్పకపోవడం గమనార్హం. సుదీర్ఘ కాలం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ రద్దు నిర్ణయంపై తీవ్రంగా మండిపడుతున్నారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు -
ఆర్టీసీ బస్ ఢీకొని నర్స్ మృతి
ఆరిలోవ: జాతీయ రహదారిపై బస్ ఢీకొన్న ఘటనలో ఓ నర్స్ మృతి చెందింది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాలు.. ఆరిలోవ ప్రాంతం గాంధీనగర్‌కు చెందిన నీలపు ప్రవళిక(22) గీతం ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. గురువారం సాయంత్రం ఆమె ఆస్పత్రి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఎండాడ మీదుగా ఇంటికి బయలుదేరింది. హైవేపై విశాఖ వ్యాలీ స్కూల్ కూడలి వద్ద సిగ్నల్ పడటంతో వాహనం నిలిపింది. అదే సమయంలో మధురవాడ నుంచి నగరానికి వస్తున్న ఆర్టీసీ బస్ ఆగివున్న ప్రవళిక స్కూటీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో స్కూటీ పైనుంచి ప్రవళిక కింద పడి తలకు తీవ్రగాయం కావడంతో అధిక రక్త స్రావమైంది. తోటి ఉద్యోగులు, ప్రయాణికులు కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆటోలో సమీపంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. -
గట్టెక్కేలా!
నష్టాల నుంచి సహజంగాఎల్పీజీ భారం నుంచి పీఎన్జీ వైపు.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కీలక నిర్ణయం పశ్చిమాసియా యుద్ధంతో ఆకాశాన్నంటిన ఎల్పీజీ ధరలు గతంలో టన్ను ఎల్పీజీ రూ.70 వేలు.. ప్రస్తుతం రూ. 1.15 లక్షలు ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు యాజమాన్యం చర్యలు రోజుకు 62 వేల క్యూబిక్ మీటర్ల లక్ష్యంతో కొత్త పైప్‌లైన్ ఇంధన ఆదాతో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నంవిశాఖ సిటీ: విశాఖ ఉక్కు కర్మాగారం ఒక కీలకమైన ఇంధన మార్పునకు శ్రీకారం చుట్టింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల కారణంగా ఎల్పీజీ ధరలు ఆకాశాన్నంటడంతో, స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, కర్మాగారాన్ని నష్టాల నుంచి గట్టెక్కించే లక్ష్యంతో పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ) వాడకాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఈ నూతన ఇంధన సరఫరా వ్యవస్థను ప్లాంట్‌లోని గ్యాస్ మిక్సింగ్ స్టేషన్ వద్ద ప్రారంభించడం ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచింది. ఎల్పీజీ ధరల సెగ : ఈ ఏడాది ఫిబ్రవరిలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి విశాఖ ఉక్కు బడ్జెట్ తలకిందులైంది. అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడంతో ఎల్పీజీ ధరలు అసాధారణంగా పెరిగాయి. యుద్ధానికి ముందు టన్ను ఎల్పీజీ ధర సుమారు రూ. 70 వేలు ఉండగా, అది ప్రస్తుతం రూ.1.15 లక్షలకు చేరుకుంది. దీంతో దాదాపు 65 శాతం అదనపు భారం ప్లాంట్‌పై పడింది. ప్లాంట్‌లోని స్టీల్ బ్లూమ్స్ కటింగ్, రోలింగ్ మిల్లుల వంటి విభాగాల్లో గ్యాస్ వినియోగం అత్యంత కీలకం. పెరిగిన ధరల వల్ల ప్రతి టన్ను ఉక్కు ఉత్పత్తిపై వ్యయం గణనీయంగా పెరిగి, సంస్థను మరింత నష్టాల్లోకి నెట్టింది. పీఎన్జీతో భారీ పొదుపు ఎల్పీజీ భారంగా మారడంతో స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం పీఎన్జీ వైపు మళ్లింది. ఇంధన సామర్థ్యాన్ని శాసీ్త్రయంగా గిగా క్యాలరీలలో కొలిచినప్పుడు ఎల్పీజీ, పీఎన్జీ మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో ఒక గిగా క్యాలరీ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఎల్పీజీ ద్వారా సుమారు రూ. 9,000 ఖర్చయ్యేది. ఇప్పుడు పీఎన్జీ ద్వారా అదే స్థాయి శక్తిని కేవలం రూ. 6,500కే పొందడం సాధ్యమవుతోంది. అంటే ప్రతి గిగా క్యాలరీ ఇంధనంపై ప్లాంట్‌కు దాదాపు రూ.2,500 మేర ఆదా అవుతోంది. తద్వారా సుమారు 28 శాతం మేర ఇంధన ఖర్చు తగ్గుతోంది. ప్లాంట్ పూర్తి స్థాయిలో నడవాలంటే గంటకు సుమారు 45 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ అవసరం ఉంటుంది. ఇందులో ప్రధానంగా కోక్ ఓవెన్ గ్యాస్(సీవోజీ) వాడతారు. అయితే ప్లాంట్‌లోని ఐదు కోక్ ఓవెన్ బ్యాటరీల పని తీరు మందగించడం వల్ల గంటకు 15 వేల క్యూబిక్ మీటర్ల గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ లోటును పూడ్చడానికి గతంలో వాడిన ఎల్పీజీ స్థానాన్ని ఇప్పుడు పీఎన్జీ భర్తీ చేయనుంది. 4.5 కిలోమీటర్ల పైప్‌లైన్ ఈ ఇంధన మార్పిడి ప్రాజెక్టును ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) సమన్వయంతో చేపట్టారు. విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్ సమీపంలో ఉన్న ఐవోసీఎల్ ఎల్ఎన్జీ హబ్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు ప్రత్యేకంగా 4.5 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్‌ను నిర్మించారు. ఈ పనులు ఏప్రిల్ 2వ తేదీన ప్రారంభం కాగా, కేవలం నెల రోజుల్లోనే పూర్తి చేసి గ్యాస్ సరఫరాను ప్రారంభించారు. పైప్‌లైన్ ద్వారా గ్యాస్ నేరుగా ప్లాంట్‌కు చేరడం వల్ల రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా, సిలిండర్ల నిల్వ, భద్రతా పరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయాయి. సరఫరా లక్ష్యాలు.. భవిష్యత్తు ప్రణాళిక మొదటి దశలో భాగంగా ప్రస్తుతం రోజుకు 18 వేల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల పీఎన్జీని ప్లాంట్ అవసరాలకు వినియోగిస్తున్నారు. దీనివల్ల తక్షణమే రోజువారీ ఖర్చుల్లో కొంత ఉపశమనం లభించింది. అయితే ప్లాంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండో దశ పనులను కూడా వేగవంతం చేశారు. 2027 మే నాటికి పీఎన్జీ సరఫరాను రోజుకు 62 వేల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకుంటే, ప్లాంట్ తన ఇంధన అవసరాల కోసం ఎల్పీజీపై ఆధారపడటాన్ని పూర్తిగా నిలిపివేసే అవకాశం ఉంది. -
వీనుల విందుగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు
మద్దిలపాలెం: త్యాగరాజ స్వామి 259వ జయంతి ఉత్సవాన్ని కళాభారతి ఆడిటోరియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ అధ్యక్షుడు మంతెన సత్యనారాయణరాజు, కార్యదర్శి డాక్టర్ రాంబాబు నాదస్వర విద్వాంసులు అప్పన్న, వీణా విద్వాంసులు పద్మ రవిశంకర్, డాక్టర్ బీకేడీ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఏడు నాదస్వరాలు, నాలుగు డోళ్లు కలిపి బృందంగా మంగళకరంగా త్యాగరాజ స్వామి జయంత్యుత్సం ప్రారంభమైంది. త్యాగరాజ ఆరాధనలో భాగంగా 29 వీణలతో గంటసేపు వీణా కచేరీ వీనుల విందుగా సాగింది. ఆహూతులను సంగీత సాగరంలో ఓలలాడించింది. అనంతరం 21 మంది వేణుగానామృతాన్ని అద్భుతంగా ఆలాపించారు. వీరితోపాటు 30 మంది వయోలిన్‌పై చేసిన కచేరీ మంత్రముగ్ధులను చేసింది. వేదికపై 125 మంది కళాకారులతో జరిగిన బృందగాన కచేరీ ఈ ఉత్సమానికే వన్నె తెచ్చింది.


