Nalgonda
-
వివాహేతర సంబంధం.. భార్య కళ్లెదుటే ప్రియుడ్ని..
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం పొలం కుమార్‌ను హతమార్చిన కేసులో నిందితులు వేల్పుల సంతోష్, వేల్పుల శైలజను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విలేకరుల సమావేశంలో వివరాలను ఏసీపీ గజ్జి కృష్ణ వెల్లడించారు. కొన్నిరోజులుగా కుమార్‌తో శైలజ సన్నిహితంగా ఉండడాన్ని చూసి వివాహేతర ఉందని సంతోష్ అనుమానించాడు. పద్ధతి మార్చుకోవాలని శైలజను మందలించాడు. అయితే తన వెంటపడుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఆమె చెప్పడంతో కుమార్‌పై సంతోష్ కోపం పెంచుకున్నాడు. అయితే బంధువుల వద్ద శైలజతో సంబంధం ఉందని కుమార్ చెబుతున్నాడు. శైలజకు కూడా ఫోన్లు చేస్తుండడంతో కుమార్‌ను చంపాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈక్రమంలో సోమవారం మాట్లాడుకుందాం రమ్మని కుమార్‌కు ఫోన్‌చేసి చెప్పడంతో వ్యవసాయమార్కెట్‌కు కారులో చేరుకున్నాడు. ఈలోగా పెద్దపల్లికి వచ్చిన సంతోష్.. జెండా వద్ద ఓ కత్తిని కొనుగోలు చేసి భార్య శైలజకు కుమార్‌ను చంపుదామనే విషయాన్ని చెప్పాడు. శైలజ దొంగతుర్తి నుంచి బస్సులో పెద్దపల్లికి చేరుకోగా.. ఆమెను బైక్‌పై తీసుకుని మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు కుమార్, సంతోష్ గొడవపడ్డారు. ఆ సమయంలోనే తన వద్ద ఉన్న కత్తి తీసి మెడ, చాతి, ముఖంపై పొడిచి చంపారు. కుమార్ చనిపోయాడని నిర్ధారించుకుని నిందితులు పరారయ్యారు. ఈమేరకు నిందితులైన భార్యాభర్తలు సంతోష్, శైలజు దొంగతుర్తిలో ఉన్నారనే సమాచారంతో అక్కడకు వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై మల్లేశ్ పాల్గొన్నారు.వివాహేతర సంబంధం.. శైలజ నుంచి ఫోన్ వచ్చిందని..! -
మాటకు కట్టుబడి పనిచేస్తాం
శాలిగౌరారం : ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి పనిచేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శాలిగౌరారంలో మంగళవారం భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తీర్చేందుకే భూభారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అధికారులే గ్రామాలకు వస్తారని రైతులు వారికున్న భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. భూభారతి చట్టంలో 80 శాతం భూ సమస్యలు తహసీల్దార్ వద్దనే పరిష్కారమవుతాయన్నారు. కాంగ్రెస్‌ది ప్రజా ప్రభుత్వమని రైతు భరోసా, రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, భూభారతి చట్టం వంటి అనేక ప్రతిష్టాత్మక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. రికార్డుల సవరణకు అవకాశం : కలెక్టర్ ఇలా త్రిపాఠి భూభారతి చట్టంలో రికార్డుల సవరణకు అవకాశం ఉందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. భూములకు సంబందించిన రికార్డులను ప్రతీ సంవత్సరం డిసెంబర్ 31న గ్రామపంచాయతీ పరిధిలో ప్రదర్శిస్తామని.. ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చని తెలిపారు. రైతులు భూ సమస్యలపై అడిగిన సందేహాలను కలెక్టర్ వేదికపై ఏర్పాటు చేసిన ప్రత్యేక బోర్డుపై విశదీకరిస్తూ అవగాహన కల్పించారు. ఆ సమయంలో కొందరు రైతులు తమ భూ సమస్యలను అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని చెప్పే క్రమంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీంతో వేదికపై ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే రైతుల సమస్యలను పరి ష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి మాన్యానాయక్, తహసీల్దార్ యాదగిరి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, మార్కెట్ చైర్మన్ పాదూరి శంకర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ నర్సింహ, పీఏసీఎస్ చైర్మన్ తాళ్లూరి మురళి, చామల మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి -
సారూ మొర ఆలకించరూ..
ఆస్తులు తీసుకుని అన్నం పెట్టడం లేదు చందంపేట మండలం గాగిల్లపురం గ్రామానికి చెందిన నక్క ముత్యాలు నలుగురు కొడుకులు, కుమార్తె ఉన్నారు. ముత్యాలు భార్య 20 సంవత్సరాల క్రితం చనిపోయింది. పిల్లలందరి పెళ్లిల్లు అయ్యాయి. 20 ఎకరాలు భూమిని నలుగురు కొడుకులకు నాలుగు ఎకరాల చొప్పున్న రిజిస్ట్రేషన్ చేశాడు. నాలుగు ఎకరాలు ముత్యాలు పేరున ఉంది. నలుగురు కొడుకులు హైదరాబాద్ హస్తినాపురంలో వివిధ పనులు చేస్తూ జీవిస్తున్నారు. చనిపోయిన దగ్గర నుంచి ముత్యాలు గొర్రెలు సాదుకుంటూ జీవనం సాగించాడు. రెండేళ్ల నుంచి ఆరోగ్యం సహకరించక నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కొడుకులు ముత్యాలును పట్టించుకోవడం లేదు. ముత్యాలు పేరున ఉన్న ఉన్న భూమి అమ్ముకుందామంటే అడ్డుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. చచ్చేటోనివి భూమి అమ్ముకుంటావా.. చావరాదు అంటున్నారని ముత్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కొడుకులు తిండి పెట్టకపోవడంతో చేతికి ఉన్న 60 తులాల వెండి కడియాలను అమ్ముకుని బతుకుతున్నానని వాపోయాడు. కొడుకులు తన బాగోగులు చూసేలా చూడాలని కోరుతూ వినతి పత్రం సమర్పించాడు. నల్లగొండ : ఆస్తులు సంపాదించి పంచి ఇచ్చినా కొడుకులు బువ్వ పెట్టడం లేదని.. ఇంటిని తన పేరు రిజిస్టర్ చేసుకున్న మనుమడు పట్టించుకోవడం లేదని.. భూమి సమస్య ఉందని.. అర్హత ఉన్నా పింఛన్ మంజూరు కాలేదేని ఇలా.. ప్రజావాణిలో బాధితులు అధికారులకు మొర పెట్టుకున్నారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ఇన్చార్జి అదనపు కలెక్టర్లు నారాయణ్ అమిత్, రాజ్‌కుమార్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దాదాపు 33 మంది వినతులు సమర్పించగా ఇందులో 14 రెవెన్యూకు, 19 వివిధ శాఖలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ సందర్భంగా ఇన్చార్జి అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలను నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులు ఏస్థాయిలో పరిష్కారం అవుతాయో వెంటనే అక్కడికి పంపాలన్నారు. కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఫొటోలు...29ఎన్ఎల్సి305–230098.మనవడు ఇల్లు తీసుకుని అన్నం పెడతలేడు చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన జంపాల అంజమ్మ నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో నివాసం ఉంటుంది. అంజమ్మ కొడుకు గోపాల్ 24 సంవత్సరాల క్రితం కండరాల క్షీణత వ్యాధితో నడవలేని పరిస్థితికి వెళ్లిపోయాడు. అంజమ్మ బిడ్డ మంగమ్మతో పాటు అల్లుడు కూడా చనిపోతే మనవడు గడ్డం జానీని అంజమ్మే సాకింది. తనను, నడవలేని స్థితిలో ఉన్న కొడుకును తనే చూసుకుంటానంటే చెప్పడంతో అంజమ్మ పేరున ఉన్న ఇంటిని మనవడి పేరున రిజిస్ట్రర్ చేసింది. ఇప్పుడు మనవడు వారిని చూసుకోవడం లేదు. ఇదేంటని అడిగితే వారిని బెదిరిస్తున్నాడు. మనవడు మమ్ములను సాదేలా చూడాలని.. లేనిపక్షంలో గిఫ్ట్ డీడీ కింద రిజిస్ట్రేషన్ చేసిన ఇంటిని తన పేరుమీదకు మార్చాలని కోరుతూ అంజమ్మ.. నడవలేని స్థితిలో ఉన్న తన కొడుకు గోపాల్‌తో కలిసి వచ్చి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. ఫ గ్రీవెన్స్ డేలో పలువురి ఫిర్యాదు -
మేం చెప్పినోళ్లకే ఇవ్వాలి!
పథకాల లబ్ధిదారుల జాబితా తయారీలో పంచాయతీ కార్యదర్శులపై నాయకుల ఒత్తిడి మిర్యాలగూడ : పభుత్వ పథకాలను ప్రజలకు అందజేయడంలో వారధులుగా పని చేసే పంచాయతీ కార్యదర్శులపై నాయకుల ఒత్తిడి పెరుగుతోంది. సంక్షేమ పథకాల అమలులో గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తున్నారు. అయితే గ్రామాల్లో నాయకులు కొందరు తాము చెప్పిన పేర్లు మాత్రమే లబ్ధిదారుల లి్స్ట్లో చేర్చాలని కార్యదర్శులపై బెదిరింపులకు దిగుతున్నారు. తమ మాట వినకపోతే దాడులు సైతం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు సాగుతోందని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. నాయకుల తీరుతో అర్హులకు పథకాలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. ధీరావత్‌తండాలో కార్యదర్శిపై దాడి మిర్యాలగూడ మండలం ధీరావత్‌తండాలో సోమవారం ఇరిగేషన్ ఏఈ రామకృష్ణతో కలిసి పంచాయతీ కార్యదర్శి కోల సాయికుమార్ ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేపట్టారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ నాయకుడు తాను చెప్పిన పేర్లు ఎందుకు లిస్ట్‌లో చేర్చలేదని కార్యదర్శిని బెదిరించాడు. తాను ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇరిగేషన్ ఏఈతో కలిసి సర్వే చేస్తున్నానని, అర్హుల జాబితా తయారీ విషయం తనకు సంబంధం లేదని సదరు కార్యదర్శి చెప్పాడు. అయినా ఆ నాయకుడు వినకుండా పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడ్డాడు. గమనించిన గ్రామస్తులు వారించినా వినకుండా కార్యదర్శిపై దుర్భాషలాడాడు. దీంతో దాడికి పాల్పడిన నాయకుడిపై పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.తాను చెప్పిన పేర్లు చేర్చలేదని దాడి చేశాడు గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా నేను ఇరిగేషన్ ఏఈతో కలిసి పాల్గొన్నాను. అయితే గ్రామానికి చెందిన ఓ నాయకుడు తాను చెప్పిన పేర్లు ఎందుకు లిస్ట్‌లో చేర్చలేదని నాపై దుర్భాషలాడి దాడి చేశాడు. దాడికి పాల్పడిన వ్యక్తిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. – కోల సాయికుమార్, పంచాయతీ కార్యదర్శి, ధీరావత్తండారక్షణ కల్పించాలి నిస్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులపై నాయకులు దాడులు చేయడం హేయమైన చర్య. ఉన్నతాధికారుల ఆదేశానుసారమే లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నాం. స్థానిక నాయకుల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాం. ప్రతి గ్రామపంచాయతీలో ఇలాంటి ఒత్తిడిలు అధికమయ్యాయి. ప్రభుత్వం మాకు రక్షణ కల్పించాలి. – కోడిరెక్క శైలజ, టీపీఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుకఠిన చర్యలు తీసుకోవాలి కార్యదర్శిపై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసుశాఖ చర్యలు తీసుకోవాలి. దాడి జరిగిన వెంటనే రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. పథకాల లబ్ధిదారులకు సంబంధించిన జాబితా ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. కార్యదర్శిపై జరిగిన దాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – రాఘవరావు, డీఎల్పీఓ ఫ నేతలకు నచ్చినట్లు పనిచేయకపోతే బెదిరింపులు ఫ ధీరావత్‌తండాలో కార్యదర్శిపై దాడి చేసిన ఓ పార్టీ నాయకుడు ఫ రక్షణ కరువైందంటున్న పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికే పని ఒత్తిడి.. మరోవైపు దాడులు గ్రామాల్లో సర్పంచ్ల పాలన ముగియడంతో బాధ్యతంతా పంచాయతీ కార్యదర్శులపై పడింది. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వీదిలైట్ల ఏర్పాటు, తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడడంవంటి అనేక పనులను పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. పంచాయతీలకు నిధులు సరిగా రాకపోయినా అప్పులు తీసుకొచ్చి మరీ గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబసర్వే, ప్రభుత్వ పథకాలకు సంబంధించి సర్వేలు, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా వంటి పథకాలకు సంబంధించిన విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంత ఒత్తిడిలో పని చేస్తున్నా.. ఇప్పుడు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక విషయంలో గ్రామాల్లో నాయకుల తీరుతో ఆందోళన చెందుతున్నారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై బెదిరింపులు ఆపాలని కోరుతున్నారు. -
సస్యశ్యామలం చేస్తాం
నల్లగొండ : ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. పలు ఎత్తిపోతల పథకాలకు, కలెక్టరేట్లో రూ.36 కోట్లతో నిర్మించనున్న అదనపు బ్లాక్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి డిండి లిప్టు ఇరిగేషన్‌కు ఎదుల ద్వారా నీరు అందించే విషయంలో నిర్లక్ష్యం చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక రూ.1800 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించామన్నారు. పిల్లాయిపల్లి, శివన్నగూడెం నుంచి నారాయణపురం, చౌటుప్పల్ మీదుగా సాగునీరు అందించేందుకు లిఫ్టు నిర్మాణం చేపడతామన్నారు. ఎస్ఎల్బీసీని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై రెండు నెలలకోసారి సమీక్షించి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వానాకాలం, యాసంగి కలుపుకుని 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి రికార్డు సృస్టించామన్నారు. తాము రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని గుర్తు చేశారు. జిల్లా నుంచి పిలిిప్పిన్స్కు బియ్యం ఎగుమతి చేస్తున్నామన్నారు. ప్రణాళికా బద్ధంగా జిల్లా అభివృద్ధి.. రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రూ.36 కోట్లతో కలెక్టరేట్ అదనపు బ్లాక్, రూ.50 కోట్లతో ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నామని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టరేట్ నిర్మించారని.. ఇప్పుడు పథకాలు పెరగడం, కార్యాలయాల పెంపు వల్ల కలెక్టరేట్ సరిపోవడం లేదన్నారు. ప్రస్తుతం నిర్మించే అదనపు భవనాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేసి బయట ఉన్న డీఈఓ, డీఎంహెచ్ఓ కార్యాలయాలను కూడా కలెక్టరేట్‌కు తీసుకొస్తామన్నారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో రూ.1600 కోట్లతో రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రణాళికా బద్ధంగా జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకుపోతున్నామన్నారు. నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మంత్రులు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఉద్యోగులు ఇంట్లో కంటే ఎక్కువ సమయం కార్యాలయాల్లో ఉంటారని తెలిపారు. ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉండేలా విశాల భవనాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, ఎమ్మెల్యేలు బాలునాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వేముల వీరేశం మాట్లాడారు. అనంతరం ఐదుగురు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు తొలి విడత రూ.లక్ష చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, మందుల సామేల్, డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ శరత్‌చంద్రపవార్, అదనపు కలెక్టర్లు నారాయణ అమిత్, రాజ్‌కుమార్, నీటిపారుదల సీఈ అజయ్‌కుమార్, డీఆర్ఓ అశోక్‌రెడ్డి, ఉదయసముద్రం ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, డీఈఈ సతీష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రాజెక్టులపై రెండు నెలలకోసారి సమీక్ష ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫ రూ.1600 కోట్లతో రోడ్ల నిర్మాణం ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫ కలెక్టరేట్లో అదనపు భవన సముదాయం, ఎత్తిపోతల పనులకు శంకుస్థాన -
అంబేడ్కర్, పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం
నల్లగొండ టౌన్ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, విద్యా వ్యాప్తి, కుల వివక్షత నిర్మూలన కోసం కృషి చేసిన మహనీయులు అంబేడ్కర్, పూలే ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ప్రొపెసర్ ఖాసీం అన్నారు. ఆయన సోమవారం నల్లగొండలోని గడియారం సెంటర్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన పూలే, అంబేడ్కర్ జన జాతరలో ఆయన మాట్లాడారు. అంతకుముందు పూలే, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. బడుగు వర్గాల విద్యాభివృద్ధికి పూలే సతీమణి సావిత్రీబాయి పూలే ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేశారన్నారు. దళితుల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ సందర్భంగా కళాకారుల ఆటపాటలు అలరించాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు, ఏపూరి సోమన్న, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, పాలడుగు నాగార్జున, దుడుకు లక్ష్మీనారాయణ, తాళ్లపల్లి రవి, ఆయా సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ర్యాలీ
నల్లగొండ: రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం నల్లగొండ పట్టణ సమీపంలోని మర్రిగూడ బైపాస్ వద్ద జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సాగింది. అనంతరం అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్ ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలో మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
దేవరకొండ : ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విలఫమైందని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం దేవరకొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రజతోత్సవ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడ నిలదీస్తాడోనని కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టిందన్నారు. అందుకే అడుగడుగునా పోలీసు ఆంక్షలు, నిర్భందాలు విధించిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు గాజుల ఆంజనేయులు, శ్రీనివాస్‌గౌడ్, నీల రవి, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు. -
ఎండలకు వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్
నల్లగొండ టౌన్ : ఈ వేసవిలో భానుడు భగ్గుమంటున్నాడు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె, పట్టణ దావాఖానాల్లో ఇప్పటికే 2.5 లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. జిల్లా సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌లో మారో 2 లక్షల ప్యాకెట్లు సిద్ధంగా ఉంచింది. దాంతో పాటుగా అంగన్వాడీ కేంద్రాలు, ఉపాధి హామీ మేట్లు, ఆశ వర్కర్లు వద్ద కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచింది. వడదెబ్బ బాధితులకు అత్యవర సేవలను అందించడానికి అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులు, సెలెన్ బాటిళ్లను సిద్దం చేసింది. వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజల్లో అవగాహన కల్పించడానికి చర్యలను చేపట్టింది. వెంటనే వైద్యం అందించేలా ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. అందులో వైద్యులతో పాటు పారామెడికల్ సిబ్బంది, ఇతర టెక్నీషియన్లు ఉన్నారు. జిల్లాలో ఎక్కడైనా వేసవిలో వచ్చే జబ్బులు ప్రభలి ప్రజలు ఇబ్బందులు పడితే వెంటనే ఆ టీం ఆ గ్రామానికి చేరుకుని వారికి అవసరమైన వైద్య చికిత్సలను అందించనుంది. అదే విధంగా వైద్యా ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి సమాచారం అందిన వెంటనే ర్యాపిడ్ రెస్పాన్స్ బృందంలోని సభ్యులను ఆయా ప్రాంతాలకు పంపించనున్నారు. వైద్యులు అందుబాటులో ఉందాల్సిందే.. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ సెంటర్లు, పల్లె, పట్టణ దావాఖానాల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. సమయపాలన పాటించడంతో పాటు పనిచేసే చోటే ఉండాలనే స్పష్టం చేసింది, వేసలో వచ్చే అన్ని రకాల జబ్బులను అరికట్టడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.ఫ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కార్యక్రమాల నిర్వహణ ఫ అందుబాటులో 2.5 లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఫ ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాల ఏర్పాటు ఫ నిత్యం అందుబాటులో ఉండాలని వైద్యులు, సిబ్బందికి ఆదేశాలు వేసవిలో జాగ్రత్తగా ఉండాలి ఎండలు పెరుగున్న నేపథ్యంలో వచ్చే వ్యాధులను అరికట్టడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సర్వం సిద్ధంగా ఉంది. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా వారికి అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందబాటులో ఉంచాం. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించాం. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ -
పోలీస్ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ
నల్లగొండ : పోలీస్ గ్రీవెన్స్ డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితుల పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్టపరంగా న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పన్ను చెల్లింపునకు అంతరాయంనల్లగొండ టూటౌన్ : నీలగిరి మున్సిపల్ కార్యాలయంలో ఆస్తి పన్ను, నీటి కుళాయి పన్ను చెల్లించేందుకు వచ్చిన ప్రజలు సర్వర్ల మొరాయింపుతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సంవత్సరం ఆస్తి పన్ను ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లిస్తే ప్రభుత్వం ఐదు శాతం రాయితీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. రాయితీపై ఆస్తి పన్ను చెల్లించడానికి ఇక రెండు రోజులే సమయం ఉండడంతో ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. సర్వర్లు పని చేయకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నుంచే సర్వర్ల సమస్య తలెత్తడంతో పన్నులు చెల్లించే అవకాశంలేక కొందరు వేచి చూడగా, మరికొందరు వెనుదిరిగి వెళ్లిపోయారు. మట్టపల్లి క్షేత్రంలో నిత్యకల్యాణంమఠంపల్లి: మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి ప్రత్యేక పూజలు, హోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం పూర్తిచేశారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్యపాశన, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు. స్వర్ణగిరీశుడికి సహస్రనామార్చన భువనగిరి : పట్టణ పరిధిలోని స్వర్ణగిరి క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి వారికి సోమవారం ఉదయం సహస్రనామార్చన వేడుక నేత్రపర్వంగా చేపట్టారు. అంతకుముందు ఆలయంలో సుభ్రబాత సేవ, తోమాల సేవ, నిత్యకల్యాణ మహోత్సవం, సాయంత్రం తిరువీధి సేవ కార్యక్రమాలు నిర్వహించారు. -
మరిన్ని నీళ్లు..
సాగునీటికి మొదటి ప్రాధాన్యం రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025- 8లోసాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ నియోజకవర్గంలో సాగు నీటి కష్టాలు తీరనున్నాయి. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందేలా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కనగల్, నల్లగొండ మండలాల్లో ఐదు ఎత్తిపోతల పథకాలను రూ.46 కోట్లతో నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే సోమవారం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ పట్టణ సమీపంలోని బక్కతాయికుంట వద్ద నాలుగు లిప్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ఐదు లిఫ్టుల ద్వారా నియోజకవర్గంలో 4,217 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఐదు లిఫ్ట్‌లు ఇవే.. ● కనగల్ మండలం పొనుగోడు వద్ద రూ.6.83 కోట్లతో ఎస్ఎల్బీసీ కెనాల్ నుంచి ఊర చెరువులో లిఫ్టు ద్వారా రెండు పంపులను ఏర్పాటు చేసి నీళ్లను ఎత్తిపోస్తారు. దీని ద్వారా పొనుగోడులోని 510 ఎకరాలకు సాగునీరు అందనుంది. నర్సింగ్‌భట్ల, దోమలపల్లి వద్ద రూ.18.95 కోట్లతో రెండు ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నారు. ఈ రెండింటి కింద మొత్తంగా 2,484 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ● నర్సింగ్‌బట్ల లిఫ్ట్ ద్వారా గంగదేవి చెరువులో ఏఎమ్మార్పీ కాల్వ నుంచి నీటిని ఎత్తిపోస్తారు. దానికింద దోనకల్ (464), గూడాపూర్ (145), కె.కొండారం (62), నర్సింగ్‌భట్ల (1088), కుందవన్పూర్లో (113), మొత్తంగా నర్సింగ్‌భట్ల లిఫ్ట్ కింద 1,872 ఎకరాలకు సాగునీరు అందనుంది. ● దోమలపల్లి వద్ద ఎత్తిపోతల ద్వారా పెద్ద చెరువులో నీరు నింపి ఎం. దోమలపల్లి, పి.దోమలపల్లికి సాగునీటిని అందించనున్నారు. దీనికింద 612 ఎకరాలకు నీరందనుంది. కంచనపల్లి, బక్కతాయికుంట ఎత్తిపోతల పథకా లను రూ.20.22 కోట్ల అంచనాతో నిర్మించనున్నారు. ● కంచనపల్లి లిఫ్ట్‌తో ఏఎమ్మార్పీ కాల్వ నుంచి పొల్కంచెరువుకు నీటిని ఎత్తిపోయనున్నారు. దీని ద్వారా 723 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. అందులో గుండ్లపల్లిలో 49 ఎకరాలు, కంచనపల్లిలో 674 ఎకరాలకు సాగునీరు అందనుంది. ● బక్కతాయికుంట లిఫ్టు ద్వారా ఆర్జాలబావి, మర్రిగూడెం గ్రామాల్లో 500 ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే నల్లగొండ పట్టణంలో భూగర్భజలాలు పెరిగేందుకు ఇది దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.న్యూస్రీల్నల్లగొండ నియోజకవర్గంలో రూ.46 కోట్లతో ఐదు ఎత్తిపోతల పథకాల నిర్మాణం ఫ లిఫ్టులకు శంకుస్థాపన చేసిన మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫ 4,217 ఎకరాలకుఅందనున్న సాగు నీరు -
పోలీస్ అమరవీరుల స్మారక భవనం ప్రారంభం
నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో కోమటిరెడ్డి ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ సహకారంతో పునర్నిర్మించిన పోలీస్ అమరవీరుల స్మారక భవనాన్ని సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. అమరవీరుల స్మారక భవనాన్ని నూతన హంగులతో తీర్చిదిద్దిన ఎస్పీ శరత్చంద్ర పవార్‌ను మంత్రి కోమటిరెడ్డి అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు రాఘవరావు, రాజశేఖర్‌రెడ్డి, ఆదిరెడ్డి, రాజశేఖర్, కొండల్‌రెడ్డి, ఆర్ఐ సంతోష్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యాన్ని సహించం
కనగల్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం రాత్రి ఆమె కనగల్ మండలంలోని శేరిలింగోటం, చెట్ల చెన్నారం గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా శేరిలింగోటం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేయగా అక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల లారీలు సరిగా రావటం లేదని తెలుసుకున్నారు. దీంతో ఆమె కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కాంట్రాక్టర్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. అవసరమైన వాహనాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించాలన్నారు. అనంతరం చెట్ల చెన్నారం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రికార్డులు సరిగా నిర్వహించకపోవడంపై సెంటర్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ అమిత్ నారయణ్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీసీఓ పత్యానాయక్ తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
‘కేసీఆర్.. మేం అనుకుంటే మీ కంటే డబుల్ మీటింగ్ పెడతాం’
నల్లగొండ జిల్లా: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. అసలు కేసీఆర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదంటూ విమర్శించారు కోమటిరెడ్డి. నల్లగొండ కలెక్టరేట్ లో అదనపు బ్లాక్ కు శంకుస్థాపన చేసిన మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీనిలో భాగంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని కేసీఆర్ అంటున్నాడు. సోనియా గాంధీ కాలు మొక్కాడు కేసీఆర్. కేసీఆర్ నీది నోరా.. మోరీనా?, తెలంగాణను మొత్తం దోచుకుతిన్నారు. దళితుడిని సీఎం చేస్తానని , మూడెకరాలు ఇస్తానని మోసం చేయలేదా ?, కేసీఆర్.. మేం అనుకుంటే నల్గగొండలో నీకంటే డబుల్ మీటింగ్ పెడతాం. ధరణితో ఏం మోసాలు చేశారో అన్నీ బయటపడతాయి’ అని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు.తెలంగాణ.. బీఆర్ఎస్ సొంతం కాదుఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ సొంతం కాదనే విషయం తెలుసుకుంటే మంచిదని విమర్శించారు. ‘వందల కోట్ల అవినీతి సొమ్ముతో మీటింగ్ పెట్టుకున్నారు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఉత్తమ్, కొమటిరెడ్డి సీఎం స్థాయి నాయకులు. ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారంటే నవ్వుకుంటున్నారు. నిన్ను ఫాంహౌస్ కు ఎందుకు పరిమితం చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు. దమ్ముంటే రా.మీరు నిర్మించిన ప్రాజెక్టులు ఎందుకు కూలిపోతున్నాయి. కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు ఎలా దోచుకున్నారో లెక్కలు చెప్తున్నాం. వెయ్యి జన్మలు ఎత్తినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. పదేళ్లలో జిల్లా అభివృద్ధి కుంటుపడింది. జిల్లాలో రైతులకు మేలు జరగలేదు. బీఆర్ఎస్ ఆగం చేసిన తెలంగాణను కాంగ్రెస్ గాడిలో పెడుతోంది. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మంచి జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ కుటుంబ పాలనలో కాదు. తెలంగాణ కోసం కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేశారు. నిన్నా మొన్న రాజకీయాల్లోకి వచ్చినోళ్లు కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి ఏదేదో మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు. -
యాదగిరిగుట్ట ఆలయ ఈఓగా వెంకట్రావ్
యాదగిరిగుట్ట: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఓగా ఎస్.వెంకట్రావ్ నియమితులయ్యారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఈఓగా 14 నెలులుగా పని చేస్తున్న భాస్కర్‌రావు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట్రావ్ గతంలో భువనగిరి డీఆర్డీఏ పీడీగా పనిచేసి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్‌గా పదోన్నతిపై వెళ్లారు. మొదటిసారి ఐఏఎస్ అధికారి యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఐఏఎస్ అధికారిని నియమించడం ఇదే మొదటిసారి. గతంలో అసిస్టెంట్ కమిషనర్ నుంచి డిప్యూటీ కమిషనర్, రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) హోదాలోనే దేవాదాయశాఖ నుంచి అధికారులను నియమించారు. వెంకట్రావ్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ డైరెక్టర్, జాయింట్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనను దేవాదాయశాఖ డైరెక్టర్‌గా బదిలీ చేసి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఈఓగా నియమించారు. ఒకటి, రెండు రోజుల్లో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
పెద్దవూర : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా సివిల్ సప్లయ్ ఆఫీసర్(డీఎస్ఓ) వెంకటేష్, డిస్ట్రిక్ట్ కో–ఆపరేటీవ్ ఆఫీసర్(డీసీఓ) పత్యానాయక్ కోరారు. పెద్దవూరలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వారు వేర్వేరుగా పరిశీలించి మాట్లాడారు. ఏఈఓలు సర్టిఫైడ్ చేసిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. లారీల సమస్యలు లేకుండా డీఎంఓతో ఫోన్లో మాట్లాడి వెంటనే రెండు లారీలను రప్పించారు. కొండమల్లేపల్లి మిల్లర్‌తో ఫోన్లో మాట్లాడి పెద్దవూర నుంచి ధాన్యం లారీలు వస్తాయని త్వరతగతిన అన్లోడ్ అయ్యేలా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి సాగు చేసి పండించిన పంటను దళారులకు అమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. వారి వెంట డీఎం హరీష్, సివిల్ సప్లయ్ డీటీ ముక్తార్, ఆర్ఐ దండ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ సీఈఓ వద్దిరెడ్డి వెంకట్‌రెడ్డి, మనోహర్, రైతులు తదితరులు ఉన్నారు. -
నేడు జిల్లాకు మంత్రుల రాక
నల్లగొండ : నల్లగొండ జిల్లాకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం రానున్నారు. జిల్లాలోని బక్కతాయికుంట, కంచనపల్లి, నర్సింగ్‌బట్ల, దోమలపల్లి, పొనుగోడు గ్రామాల్లో రూ.44 కోట్లతో చేపట్టే లిఫ్టు ఇరిగేషన్ పనులకు, రూ.36 కోట్లతో కలెక్టరేట్లో అదనపు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అంతకుముందు సోమవారం ఉదయం 10.30 గంటలకు మర్రిగూడ బైపాస్ నుంచి బక్కతాయికుంట వరకు అక్కడ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో మంత్రులు పాల్గొననున్నారు. 29న కలెక్టరేట్లో ప్రజావాణినల్లగొండ : కలెక్టరేట్లో ఈ నెల 28న (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేసి ఈ నెల 29న నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు ఈ విషయాన్ని గమనించి ఈ నెల 29న ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై వారి ఫిర్యాదులను అందజేయాలని పేర్కొన్నారు. ప్రశాంతంగా మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష నల్లగొండ : తెలంగాణ మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో, 7 నుంచి 10వ తరగతిలో మిగిలిన సీట్లలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశపరీక్ష ప్రశాంతంగా సాగిందని డీఈఓ భిక్షపతి తెలిపారు. జిల్లాలోని 17 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు పేర్కొనఆనరు. ఈ పరీక్షకు 907 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యతనల్లగొండ : మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సంపత్‌కుమార్ అన్నారు. ఆదివారం నల్లగొండలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జిల్లా చైర్మన్ చింతమల్ల గోవర్ధన్ అధ్యక్షతన జరిగిన డివిజన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మానవ హక్కులపై ప్రతిఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఆయన సభ్యులకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. సమావేశంలో పాల్క స్వప్న, బుర్ర రమేష్, సీహెచ్.అజయ్, కమలాబాయి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయాలినల్లగొండ టూటౌన్ : పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లులు, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నూకల జగదీశ్చంద్ర, పందిరి శ్యాంసుందర్ కోరారు. ఆదివారం అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్, జిల్లా కోశాధికారి ఎండీ.అబ్దుల్‌ఖాదర్, రాష్ట్ర కమిటీ సభ్యులు వనం వాణిశ్రీ, వాడపల్లి రమేష్, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు. యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజాము న ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. గర్భాలయంలోని స్వయంభూలను నిజాభిషేకం, తులసీదళ అర్చనతో కొలిచారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయద్వార బంధనం చేశారు. -
మేడేను జయప్రదం చేయాలి
మిర్యాలగూడ : ప్రపంచ కార్మికుల దినోత్సవమైన మే డేను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. ఆదివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో మేడే కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికుల హక్కులను, చట్టాలను రద్దు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా రూపొందించాలని చూస్తున్నారని విమర్శించారు. కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు అమల్లోకి వస్తున్నాయని, వీటిని తిప్పికొట్టేందుకు కార్మికులు ఐక్యంగా ఉండి బలమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులకు కనీస వేతనం రూ.20 వేలు అమలు చేయాలని, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధనకు కార్మికులు ఐక్యంగా పోరడాలని పిలుపునిచ్చారు. మేడే రోజు సాయంత్రం మిర్యాలగూడ పట్టణంలో జరిగే భారీ ర్యాలీకి కార్మికులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, నాయకులు నూకల జగదీశ్ఛంద్ర, సత్యనారాయణరావు, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, శశిధర్‌రెడ్డి, వినోద్‌నాయక్, రొండి శ్రీనివాస్, కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి -
రైతులకు సోలార్ ప్లాంట్లు
పీఎం–కుసుమ్ పథకం కింద యూనిట్ల స్థాపన సబ్‌స్టేషన్‌కు ఐదు కిలోమీటర్ల దూరం.. వ్యక్తిగత యూనిట్లకు దరఖాస్తు చేసుకున్న రైతుల భూములను ఇప్పటికే టీజీ రెడ్కో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యుత్ ఉపకేంద్రానికి 5 కిలోమీటర్లలోపు దూరం కలిగిన భూములకు సంబంధించిన దరఖాస్తులకు ఆమోదం లభించనుంది. మూడున్నర ఎకరాల పట్టా భూమి, లేదా పోడుభూమి కలిగిన రైతులను అధికారులు అర్హులుగా గుర్తిస్తున్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలతలు కలిగి, నిబంధనల ప్రకారం ఉన్న స్థలాలకు సంబంధించిన అర్జీలకు అధికారులు ఈనెల 30 వరకు ఈఎండీ చెల్లించే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారుల సంఖ్య పెరగవచ్చునని అధికారులు చెబుతున్నారు. నల్లగొండ : పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే కర్భన ఉద్గారాలను తగ్గిస్తూ.. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీంట్లో భాగంగా పీఎం–కుసుమ్ (ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్) పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల పరిధిలోని వ్యవసాయ భూముల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు టీజీ రెడ్కో సంస్థ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హులైన రైతులు 500 కిలోవాట్ల నుంచి 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) రూ.లక్ష చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈఎండీ చెల్లించేందుకు ఈనెల 30 వరకు గడువు ఉంది. ఉమ్మడి జిల్లా నుంచి 874 మంది రైతులు సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 874 మంది రైతులు అర్జీలు పెట్టుకున్నారు. వారిలో ఇప్పటికే 192 మంది రైతులు ఈఎండీ చెల్లించారు. కాగా వారిలో 123 మందికి టీఎస్ రెడ్కో అధికారులు ఎల్ఓ (లెటర్ ఆఫ్ అవార్డు) అందజేశారు. దీర్ఘకాలిక ఆదాయ వనరు వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 500 కిలోవాట్ల నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను రైతులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే ఒక్కో యూనిట్ విద్యుత్‌ను రూ.3.15 చొప్పున విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు విక్రయించడం ద్వారా వారు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. డిస్కంలతో ఒప్పందం 25ఏళ్ల పాటు కొనసాగుతుండడంతో ఇది దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని అందించనుంది. రైతులు తమ సాగు యోగ్యంకాని భూముల్లో సౌరప్లాంట్లు ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆయా భూములు ఆదాయ వనరులుగా మారుతాయి. ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరింత దోహదపడుతుందని అధికారులు అంటున్నారు. ఫ రైతుల ఆదాయం పెంచేలా ప్రభుత్వ ప్రణాళిక ఫ మూడున్నర ఎకరాల పట్టాభూమి ఉన్న వారికి అవకాశం ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 874 మంది దరఖాస్తు ఫ ఈఎండీ చెల్లింపునకు నెలాఖరు వరకు గడువు ఆసక్తిగల రైతులు ముందుకు రావాలి వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తిగల రైతులు ముందుకు రావాలి. నిబంధనల ప్రకారం ఈఎండీ చెల్లించిన దరఖాస్తుదారులు డిస్కంలతో పీపీఏ (విద్యుత్ కొనుగోలు ఒప్పందం) చేసుకోవాల్సి ఉంటుంది. రైతుల అభీష్టం మేరకు సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేలా సన్నాహాలు చేస్తున్నాం. నిబంధలన మేరకు బ్యాంకులు కూడా రుణాలు అందిస్తాయి. – ఎం.పాండురంగారావు, ఉమ్మడి జిల్లా మేనేజర్, టీజీ రెడ్కో నల్లగొండ జిల్లా అర్జీలు ఈఎండీ ఎల్ఓ చెల్లింపులు ఇచ్చింది నల్లగొండ 365 91 68 సూర్యాపేట 285 43 24యాదాద్రి 224 58 31 -
సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం
త్రిపురారం : ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆదివారం తిపురారంలో నిర్వహించిన భూ భారతి అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. ప్రతి భూ సమస్యకు భూ భారతి చట్టంతో పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ చట్టం ద్వారా మండల స్థాయిలో తహసీల్దార్ల వద్దే అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సాదాబైనామా దరఖాస్తుల పరిశీలన పూర్తి చేస్తామన్నారు. అంజనపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని 335 సర్వే నంబర్లో అటవీ భూముల సమస్య మా దృష్టికి వచ్చిందని, పరిష్కరించి గిరిజన రైతులకు న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. త్రిపురారం, దామరచర్ల, కనగల్ మండలాల్లో భూ సమస్యలు గుర్తించామని, సర్వే ద్వారా పరిష్కరిస్తామన్నారు. సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్ముకొని కార్యాలయాల చుట్టూ తిరుగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో ఉంటేనే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవచ్చాన్నారు. అంతకు ముందు గిరిజనులు వారి సాంప్రదాయ పద్ధతులతో కలెక్టర్ ఇలా త్రిపాఠికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో తహసీల్దార్ గాజుల ప్రమీల, ఎంపీడీఓ విజయకుమారి, ఆర్ఐ సైదులు, కాంగ్రెస్ జిల్లా మహిళ అధ్యక్షురాలు గోపగాని మాధవి శ్రీనివాస్, నిడమనూరు మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం, వైస్ చైర్మన్ బుసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముడిమళ్ల బుచ్చిరెడ్డి, అనుముల శ్రీనివాస్‌రెడ్డి, ధనావత్ భాస్కర్‌నాయక్, మర్ల చంద్రారెడ్డి, అంబటి సోమయ్య, సంతోష తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
రజతోత్సవ సభకు తరలిన గులాబీ శ్రేణులు
నల్లగొండ టూటౌన్: బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు జిల్లా కేంద్రం నుంచి పార్టీ నాయకులు ఆదివారం భారీగా తరలివెళ్లారు. అంతకు ముందు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ గులాబీ జెండా ఎగురవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ నియోజకవర్గం నుంచి 200కు పైగా వాహనాల్లో వరంగల్ సభకు తరలివెళ్లారు. కార్యక్రమంలో కంచర్ల కృష్ణారెడ్డి, చకిలం అనిల్‌కుమార్, కటికం సత్తయ్యగౌడ్, బొర్ర సుధాకర్, నిరంజన్ వలీ, మందడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నల్లగొండ
37° /25°ఆదర్శం.. ఆ అధికారి కోదాడ ఆర్డీఓ తన ఇద్దరు కుమారులను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 7గరిష్టం/కనిష్టంవాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.ఆర్థికాభివృద్ధికి ‘ఉన్నతి’ వంద రోజులు పని పూర్తిచేసుకున్న ఉపాధి కూలీల ఆర్థికాభివృద్దికి కేంద్రం ఉన్నతి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. సోమవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025- 8లో -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
హాలియా : రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత అని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హాలియాలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం హాలియా బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథమన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం దేశ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ నిర్వహించారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికై న కేతావత్ శంకర్‌నాయక్‌ను సన్మానించారు. కార్యక్రమంలో సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగాని మాధవి, రాష్ట్ర కార్యదర్శి కొండేటి మల్లయ్య, కర్నాటి లింగారెడ్డి, భగవాన్‌నాయక్, కుందూరు వెంకట్‌రెడ్డి, కాకునూరు నారాయణ, వెంపటి శ్రీనివాస్, చింతల చంద్రారెడ్డి, గౌని రాజా రమేష్‌యాదవ్, పిల్లి ఆంజనేయులు, ప్రసాద్‌నాయక్ పాల్గొన్నారు. ఫ ఎంపీ రఘువీర్‌రెడ్డి -
మూసీకి 532 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
మూసీ రిజర్వాయర్ కేతేపల్లి : జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది యాసంగిలో ఆయకట్టులో పంటల సాగుకు ఈనెల మొదటి వారంలో నీటి విడుదల నిలిపి వేసే నాటిని రిజర్వాయర్‌లో నీటిమట్టం 622 అడుగుల డెడ్‌స్టోరేజీకి (గరిష్ట నీటిమట్టం 645 అడుగులు) తగ్గిపోయింది. ఇరవై రోజుల నుంచి మూసీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మూసీకి ఇన్‌ఫ్లో ప్రారంభమైంది. ఇరవై రోజుల వ్యవధిలో ప్రాజెక్టు నీటిమట్టం ఎనిమిది అడుగులు పెరిగి శనివారం సాయంత్రానికి 630.50 అడుగులకు చేరుకుంది. శనివారం మూసీకి ఎగువ నుంచి 532 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఆవిరి, లీకేజీల రూపంలో 52 క్యూసెక్కుల నీరు వృథా అవుతోందని ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. 4.46 టీఎంసీల గరిష్ట నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 1.43 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. -
పశు వ్యాధులపై అవగాహన అవసరం
నల్లగొండ టౌన్ : పశువులకు వచ్చే వ్యాధ్యులపై అవగాహన ఉండాలని పశు సంవర్థక శాఖ రిటైర్డ్ రాష్ట్ర డైరెక్టర్ వై.తిరుపతయ్య అన్నారు. శనివారం ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పశు వైద్యం, పశువుల్లో వ్యాధుల నివారణ, జునోటిక్ వ్యాధుల నివారణలపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ జేడీ రమేష్, డాక్టర్ టి.నర్సింహులు, డాక్టర్ వెంకటయ్యనాయుడు, ఎం.శ్రీనివాసులు, ఎం.చరిత, సతీష్‌రెడ్డి, యాదగిరి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంచాలినల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలో ఏర్పాటు చేసిన టీఎస్‌యూటీఎఫ్ ఉద్యమ తరగతుల్లో ఆయన మాట్లాడారు. హక్కులు, బాధ్యతలు రెండు కళ్లుగా పనిచేస్తున్న టీఎస్ యూటీఎఫ్.. ఉద్యమ తరగతుల్లో ప్రభుత్వ విద్యారంగ రక్షణకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల ఎక్కడివక్కడే ఉన్నాయని.. ఇప్పటికే ఐదు డీఏలు, పీఆర్సీలు పెండింగ్ లో ఉన్నాయని, పెండింగ్ బిల్లులు రెండు సంవత్సరాల నుంచి విడుదల కాలేదన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌రెడ్డి, జి.నాగమణి, జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షులు బి.అరుణ, నర్రా శేఖర్‌రెడ్డి, కోశాధికారి వడిత్య రాజు, నల్ల నరసింహ, ఎడ్ల సైదులు, సిహెచ్.అరుణ, రామలింగయ్య, శ్రీనివా స్‌రెడ్డి, నరసింహ, రమాదేవి, వెంకన్న, చిన వెంకన్న, సైదులు, మురళయ్య పాల్గొన్నారు. -
పక్షులే ప్రాణంగా..
ఆయన ఇల్లంతా కిలకిలరావాలు ఆ ఇంట్లోకి అడుగు పెడితే చాలు పక్షుల కిలకిల రావాలు.. రామచిలుకల కిచకిచలు ఆహ్లాదం కలిగిస్తాయి. ఊర పిచ్చుకల సందడి ఎంతగానో ఆకట్టుకుంటుంది. పక్షి ప్రేమికుడైన ప్రదీప్ చిన్ననాటి హాబీ అయిన పక్షుల పెంపకమే నేడు ఫాం హౌస్‌గా మారింది. ప్రస్తుతం వివిధ దేశ విదేశాలకు చెందిన 500 రకాల పక్షులను ఇక్కడ సాకుతున్నాడు. తన లాంటి పక్షి ప్రేమికులకు వాటిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇస్తున్నాడు. – నకిరేకల్ ఫ పక్షుల పెంపకాన్ని హాబీగా మార్చుకున్న ప్రదీప్ ఫ పక్షుల కోసం ప్రత్యేక ఫాంహౌస్ ఏర్పాటు ఫ ఇక్కడ వివిధ రకాల 500 పక్షుల సంరక్షణ ఫ విదేశీ రంగురంగుల పక్షులు సైతం లభ్యం ఫ ఎక్కడ కొత్త రకం పక్షి కనిపించినా.. తెప్పించడమే పని ఫ వాటి దాణాకే నెలకు రూ.15 వేలకుపైగా ఖర్చు ఇతర దేశాల పక్షులు కూడా.. ప్రదీప్ బాల్యం నుంచి పక్షుల పెంపకాన్ని హబీగా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి పక్షులను సంరక్షిస్తున్నాడు. ప్రస్తుతం షెడ్డులో పెద్దపెద్ద జాలీ బోన్లు ఏర్పాటు చేసి పక్షులను సాకుతున్నాడు. ఇప్పుడు సుమారు 50 నుంచి 100 రకాల పక్షులను 500పైగానే పెంచుతున్నాడు. విదేశీ పక్షులు ఎక్కువగా చైన్నె, బెంగళూరు, కేరళ వంటి ప్రాంతాల్లో పెంచుతారు. ఆన్లైన్ ద్వారా సమాచారం తెలుకున్న ప్రదీప్ వాటిని ఇక్కడికి తెప్పిస్తున్నాడు. దేశంలో ఎక్కడ డిఫెరెంట్ పక్షులు కనిపించినా వాటిని తెచ్చుకుని సంరక్షించడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక్కడ మనకు మాట్లాడే రామచిలుకలు, పావురాలు, ఇతర రకాల అందమైన పక్షుల కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే ఒక్కో పక్షి రూ.600 నుంచి రూ.60 వేల పైనే ధర పలుకుతాయి. పక్షుల జీవిత కాలం ఏడాదిన్నర నుంచి 40 ఏళ్ల వరకు ఉంటుంది. నకిరేకల్ మండలం చందుపట్లకు చెందిన రాపోలు లింగయ్య రిటైర్డ్ ఉపాధ్యాయుడు. నకిరేకల్‌లోని మూసీ రోడ్డులో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. ఆయన కుమారుడు రాపోలు ప్రదీప్‌కు చిన్నతనం నుంచి పక్షులంటే ఎనలేని ప్రేమ. ప్రదీప్ 17 ఏళ్ల క్రితం నుంచి మూసీ రోడ్డులోని తన ఇంట్లో 100 పక్షులతో పెంపకాన్ని ప్రారంభించాడు. తర్వాత ఏడేళ్ల క్రితం నకిరేకల్‌లోని చీమలగడ్డలో 500 గజాల స్థలంలో రూ.10 లక్షల వ్యయంతో రేకుల షెడ్లు వేసి పక్షుల ఫాంహౌస్ ఏర్పాటు చేశాడు. ఆ పరిసర ప్రాంతమంతా చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాడు. షెడ్డుపైన జమ్ము వేసి.. స్ప్రింక్లర్ల ద్వారా నిరంతరం నీటితో తడుపుతూ ఎండ నుంచి పక్షులకు రక్షణ కల్పిస్తున్నాడు. ఫాం హౌస్‌లో పక్షుల సంరక్షణే ఆయన దిన చర్చ. పనిమీద ఎక్కడికై నా వెళ్లినా.. సాయంత్రానికి ఫాంహౌస్ చేరుకుని వాటిని సంరక్షిస్తుంటాడు. 500 పక్షులు పెంచుతున్నా చిన్నప్పటి నుంచి గ్రామీణ వాతావరణంలో పెరిగాను. అప్పటి నుంచే నాకు పక్షులంటే ప్రాణం. చిన్నతనంలో కనిపించిన ఒకటి రెండు పక్షులను తెచ్చుకున్నాను. ఆ తరువాత పక్షుల పెంపకాన్ని హాబీగా మార్చుకున్నాను. ఇప్పుడు 500 పక్షుల వరకు పెంచుతున్నాను. పక్షులు అవసరమైన వారికి వస్తే లాభాపేక్ష లేకుండా ఇస్తున్నాను. నేను ఎక్కడికి వెళ్లినా సాయంత్రంలోగా పక్షుల ఫాం హౌస్‌కు చేరుకుంటాను. చిన్న పిల్లల మాదిరిగా వాటిని సంరక్షిస్తాను. – రాపోలు ప్రదీప్,పక్షి ప్రేమికుడు, నకిరేకల్హైదరాబాద్, గుజరాత్ నుంచి దాణా ప్రదీప్ తన పక్షుల కోసం ప్రతి నెలా రూ.15 వేలపైనే దాణా కోసం ఖర్చు చేస్తున్నారు. సూర్యాపేట, హైదరాబాద్, గుజరాత్, చైన్నై తదితర ప్రాంతాల నుంచి దాణా తెప్పిస్తున్నాడు. వాటికి కొర్రలు, రాగులు, వేరుశనగ, పెసర్లు, ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ తదితర పదార్థాలను ఆహారంగా ఇస్తున్నాడు. పశు వైద్యుల సలహాలు తీసుకోవడంతోపాటు పక్షులకు వైద్యం చేయిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు. -
‘భూ భారతి’తో రైతులకు మేలు
బోర్డుపై రాస్తూ.. సందేహాల నివృత్తిప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు ఏళ్ల తరబడి వారి పేరున ఉండి సాగు చేసుకుంటున్న వారి వారసుల పేరున మార్పిడి జరగక హక్కులు ఉండటం లేదని గుర్రంపోడుకు చెందిన వనమాల కామేశ్వర్ అనే రైతు కలెక్టర్ దృష్టి తీసుకొచ్చారు. దీంతో కలెక్టర్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన బోర్డుపై వివరాలు రాస్తూ.. రైతులకు అర్థమయ్యేలా వివరించారు. ప్రభుత్వం పేదలకు అందించే అసైన్డ్ భూమి ఉదాహరణకు 1971 నుంచి కామేశ్వర్ పేరున ఉంటే ఆయన బతికి ఉన్నంతకాలం ఆయన పేరునే ఉండాలి. కానీ 2016లో మరొకరి పేరు (ఇలా అని తన పేరును బోర్డుపై రాశారు) పైకి మారిందనుకుందాం. కానీ.. అలా మారడానికి వీల్లేదు. అసైన్డ్ భూమి హక్కుదారుడు చనిపోతేనే వారి వారసులకు బదలాయింపు జరుగుతుందని వివరించారు. తల్లిదండ్రుల పేరున భూమి ఉంటేనే కుమారులు బాగా చూసుకుంటారని బతికి ఉన్నంత కాలం వారసులకు పేరు మీదికి మార్పిడి జరగకుండా అసైన్డ్ చట్టంలో పొందుపర్చారని కలెక్టర్ వివరించారు. గుర్రంపోడు : భూ భారతి చట్టంతో రైతులకు మేలు కలుగుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం గుర్రంపోడు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతులకు భూ భారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డితో కలిసి మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ధరణిలో లేని వెసులుబాట్లు భూ భారతిలో ఉన్నాయని, ఇప్పుడు తప్పు జరిగిన చోటనే సవరించే అధికారం వల్ల రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. భూ భారతిలో పట్టాదారు పూర్తి వివరాలతోపాటు ఆ భూమి నక్షా కూడా ఉండటం వల్ల భూమికి భద్రత ఉంటుందని, సరిహద్దు సమస్యలు ఉండవని పేర్కొన్నారు. త్వరలోనే గ్రామ పాలన అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గ్రామగ్రామాన అవగాహన సదస్సులు ప్రభుత్వం ప్రతి గ్రామంలో భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహించే అవకాశం ఉందని ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అన్నారు. సాగులో ఉన్న ప్రతి ఉన్న రైతుకు భూమిపై హక్కు కల్పించాలనే ఉద్దేశంలో ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలులోకి తెచ్చిందన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, తహసీల్దార్ ఫరీదుద్దీన్, ఎంపీడీఓ మంజుల తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
గులాబీ దండు వరంగల్ బాట
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు సన్నద్ధం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్‌లో ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లేందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సన్నద్ధ్దమయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో బస్సులు, కార్లు, జీపులలో ఆదివారం ఉదయమే తరలివెళ్లనున్నారు. వరంగల్ జిల్లాకు దగ్గరగా ఉన్న నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలించేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు. అన్ని గ్రామాల్లో ఆదివారం ఉదయం జెండాలు ఆవిష్కరించి సభకు బయలుదేరుతారు. వినూత్న రీతిలో.. వరంగల్ సభకు ఉమ్మడి నల్లగొండ నుంచి లక్ష మందిని తరలించేలా టార్గెట్ పెట్టుకున్నారు. అందులో సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల నుంచే సగం మంది ప్రజలు, రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని గతంలోనే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశించారు. సూర్యాపేట నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో జనం తరలించేందుకు చర్యలు చేపట్టారు. సూర్యాపేట నియోజకవర్గం నుంచి వినూత్న రీతిలో ఎడ్ల బండ్లలో ఈ నెల 22న పార్టీ శ్రేణులు వెళ్లగా, శుక్రవారం సైకిళ్లపై కూడా తరలివెళ్లారు. ఆదివారం ఉదయం వెళ్లేందుకు వందకు పైగా డీసీఎంలు, మరో వంద వరకు బస్సులు, వందల సంఖ్యలో అద్దె కార్లు, సొంత కార్లలో వెళ్లనున్నారు. అద్దె వాహనాలను బుక్ చేసుకొని.. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 13,500 మందిని బీఆర్ఎస్ సభకు తరలించాలని నిర్ణయించి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. అద్దె వాహనాలను బుక్ చేసుకొని మరీ సభకు తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో 135 డీసీఎంలు, 100 బొలేరోలు, 20 బస్సులు, తూపాన్ వాహనాల్లో వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే సభ విజయవంతానికి మండలాల్లో సభలు నిర్వహించి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారు. భువనగిరి నియోజకవర్గం నుంచి... భువనగిరి నియోజకవర్గం నుంచి 15 వేల మందిని తరలించేందుకు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఏర్పాట్లు చేశారు. 200 బస్సులతో పాటు 150 వరకు కార్లు ఏర్పాటు చేశారు. రెండు గ్రామాలకు ఒక బస్సు చొప్పున వెళ్లనున్నాయి. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివెళ్లేలా సన్నద్ధ్దం చేశారు. పార్టీ నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి కూడా సభకు పార్టీ కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలేరులో గ్రామానికో బస్సు.. ఆలేరు నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామానికి ఒక బస్సు పెట్టారు. కార్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేశారు. వరంగల్‌కు దగ్గరగా ఉన్నందున ఆ నియోజకవర్గం నుంచే పెద్ద ఎత్తున జనాలను సమీకరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత, డీసీసీబీ మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి, బూడిద బిక్షమయ్యగౌడ్ ఆధ్వర్యంలో 15వేల మంది వరకు తరలించనున్నారు. ఫ ఉమ్మడి జిల్లా నుంచి బస్సులు, కార్లు, సొంత వాహనాల్లో ఓరుగల్లుకు.. ఫ మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో నియోజకవర్గాల్లో ఏర్పాట్లు ఫ సూర్యాపేట, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు నుంచే ఎక్కువ మంది.. ఫ ఇప్పటికే సూర్యాపేట నుంచి ఎడ్లబడ్లపై వెళ్లిన రైతులు, పార్టీ శ్రేణులు -
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇచ్చేందుకు వెళ్తుండగా..
మునగాల: మండల పరిధిలోని ఆకుపాముల గ్రామ శివారు వద్ద హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారి–65పై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృత్యువాత పడింది. మునగాల ఏఎస్ఐ వెంకటరత్నం తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరు గ్రామానికి చెందిన చేడె జనార్దన్ కుమార్తె యశస్విని(24) మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. కాగా యశస్విని తన తండ్రికి బహుమతిగా ఇవ్వాలనుకుని బుల్లెట్ వాహనాన్ని కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి ఏడు గంటల సమయంలో తన సహా ఉద్యోగి బడ్డుకొండ అచ్యుత్‌కుమార్‌తో కలిసి అదే బుల్లెట్ బైక్‌పై తమ స్వగ్రామమైన తందూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో ఆకుపాముల శివారులోకి రాగానే హైవేపై పడిఉన్న గేదె కళేబరాన్ని వీరి బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న యశస్విని ఎగిరి రోడ్డుపై పడింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ఓ లారీ అతివేగంగా వచ్చి రహదారిపై పడిఉన్న యశస్విని మీదుగా వెళ్లింది. దీంతో యశస్విని తల, మెడభాగం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందింది. బైక్ నడుపుతున్న అచ్యుత్‌కుమార్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న మునగాల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని యశస్విని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో శనివారం మృతురాలి కుటుంబ సభ్యులు మునగాలకు చేరుకున్నారు. మృతురాలి బాబాయ్ చేడె సురేష్ ఫిర్యాదు మేరకు మునగాల సీఐ రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వెంకటరత్నం తెలిపారు. పోస్టుమార్టం అనంతరం యశస్విని మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం ఆకుపాముల వద్ద హైవేపై గేదె కళేబరాన్ని ఢీకొట్టిన బైక్ ఎగిరి రోడ్డుపై పడిన యువతి మీదుగా వెళ్లిన లారీ మృతురాలు పశ్చిమ గోదావరి జిల్లా తందూరు వాసి -
మే 12న ప్రపంచ సుందరీమణుల రాక
నాగార్జునసాగర్: మే 12న బుద్ధపూర్ణిమ రోజు ప్రపంచ సుందరీమణులు బుద్ధవనం సందర్శనకు రానున్నారని రాష్ట్రఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి తెలి పారు. హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ అందాల పోటీలకు హాజరయ్యే పలుదేశాల సుందరీమణులు సాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించేందుకు రాను న్న నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ నారాయణ అమిత్‌తో కలిసి శని వారం ఆమె బుద్ధవనాన్ని సందర్శించారు. అనంతరం అధికారులతో సమావేశమై మాట్లాడారు. మే 3 నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రత్యేకించి సివిల్ వర్క్ పూర్తిచేసి, బుద్ధవనం పరిసర ప్రాంతాలు, విజయవిహార్‌కు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా పరిశుభ్రంగా ఉంచడంతోపాటు లైటింగ్ ఏర్పాట్లపై దృష్టిపెట్టాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ సుందరీమణులు మొదట బుద్ధవనానికి చేరుకుంటారని, అక్కడినుంచి విజయవిహార్‌కు వచ్చి తర్వాత బుద్ధవనంలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తారని తెలిపారు. సమావేశంలో బుద్ధవనం ప్రాజెక్టు ఓఎస్డీ సుధాన్‌రెడ్డి, టూరిజం శాఖ ఎస్ఈ భాస్కర్‌రావు, అధికారులు ఉన్నారు. సాగర్‌లో ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి -
ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య
చౌటుప్పల్ : ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలో శని వారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం అంకుశాపూర్ గ్రామానికి చెందిన మేకల మహేందర్(26) కొన్నేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం లక్కారం గ్రామానికి వచ్చాడు. స్థానికంగా అద్దెకు ఉంటూ రిఫ్రిజిరేషన్ పని చేసుకుంటున్నాడు. ఆ క్రమంలో శనివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతికి గల కారణాలు తెలియలేదు. మృతుడి తండ్రి సదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ మన్మథకుమార్ తెలిపారు. చెరువులో పడి వ్యక్తి మృతిఅనంతగిరి : ప్రమాదవశాత్తు కాలుజారి ఊరచెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన అనంతగిరి మండలం వాయిలసింగారంలో శనివారం చోటుచేసుకుంది. అనంతగిరి ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వాయిల సింగారం గ్రామానికి చెందిన దేవులపల్లి రామ్మూర్తి (45) శుక్రవారం తమ గేదెలను వెతుక్కుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి ఊర చెరువులో పడ్డాడు. ఈతరాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. శనివారం స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతని భార్య దేవులపల్లి జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఏఎమ్మార్పీ కాలువలో పడి బాలుడు మృతి
పెద్దఅడిశర్లపల్లి: ఏఎమ్మార్పీ కాలువలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో శని వారం చోటుచేసుకుంది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుగ్యాల గ్రామానికి చెందిన మంటిపల్లి శివతేజ(11) శనివారం ఉదయం తమ వ్యవసాయ పొలం వద్దకు తల్లిదండ్రులతోపాటు వెళ్లాడు. వ్యవసాయ పొలం పక్కనే ఉన్న ఏఎమ్మార్పీ లింక్ కెనాల్‌కు మంచినీళ్ల కోసం వెళ్లగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఈత రాకపోవడంతో కాలువలో కొట్టుకుపోతుండగా చూసిన గ్రామస్తులు కాపాడేందుకు ప్రయత్నిచంగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి తండ్రి ముత్యాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కారు, బైక్ ఢీ.. ఒకరు మృతి చివ్వెంల(సూర్యాపేట): అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చివ్వెంల మండలం గుంజలూరు గ్రామ స్టేజీ వద్ద హైదరాబాద్–విజయవాడ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండల దాసాయిగూడెం గ్రామానికి చెందిన రుషిగంపల భిక్షం (53), మోతె మండల నామవరం గ్రామంలో బంధువుల ఇంట్లో ఓ కార్యం నిమ్తిత్తం బైక్‌పై వెళ్లి తిరిగి గ్రామానికి వస్తున్నాడు. ఈ క్రమంలో గుంజలూరు గ్రామ స్టేజీ వద్ద రహదారి దాటుతుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో భిక్షం అక్కడికక్కడే మృతిచెందాడు, మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.మహేశ్వర్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతిచింతపల్లి: అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చింతపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. చింతపల్లి ఎస్ఐ యాదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లికి చెందిన గండికోట మురళి సరస్వతి గ్రామంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం కూడా కూలి పనులకు వెళ్లారు. ఈ నేపథ్యంలో వారి కుమారుడు సతీష్(6) ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చి కుమారున్ని వెతకగా ఇంట్లోని సంపులో పడి ఉన్నాడు. వెంటనే బాలుని సంపులో నుంచి తీసి దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. బాలుని తల్లిదండ్రులు ఇరువురు కూలి పనులకు వెళ్లగా బాలుని నాయనమ్మ గండికోట అంజమ్మ, బాబాయి గండికోట శీను తోపాటు మామలు గోగుల జగన్ గోగుల స్వామిలు ఇంటి వద్ద ఉన్నారు. తమ కుమారుడిని మృతికి వారే కారణమని తల్లి సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తమ కుమారుడి మృతిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. -
హ్యాండ్‌బాల్ ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక
నల్లగొండ టూటౌన్: నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో శనివారం ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. కాగా పోటీల్లో డి.వర్షిని, పి.శృతి, వి.శ్రీజ, బి.అఖిల, పి.ధాత్రి, కె.నందు, జి.రమ్య, పి.స్రవంతి, డి.భవాని, కె.శివాని, కె.శ్రీజ, ఎం.అలేఖ్య, ఆశ్ర ముస్కాన్, ఇ.కీర్తి, ఎ.పూజ, డి.చంద్రకళ, ఎం.దుర్గాభవాని ఎంపికయ్యారు. ముందుగా ఈ పోటీలను ప్రారంభించిన అనంతరం నల్లగొండ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి శాఖ అధికారి కె.నర్సిరెడ్డి ఆకాక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 28 నుంచి 30 వరకు ఆసిఫాబాద్ జిల్లాలోని మందమర్రిలో జరిగే 54వ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్ బాల్ చాంపియన్ షిప్లో పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా హన్మకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ టాలెంట్ హంట్‌లో పాల్గొని 4వ స్థానంలో నిలిచిన నల్లగొండ జిల్లా సబ్ జూనియర్ బాలికల జట్టు సభ్యులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో చింతకాయల పుల్లయ్య, కవిత, చైతన్యకుమార్, పద్మిని గుప్తా, రామాంజనేయులు, మహేష్, నరేష్, పూర్ణబాబు, అంజి, నరేష్, ఆస్మా, మహేష్ పాల్గొన్నారు. -
తుక్కాపురానికి బిహార్ సర్పంచ్ల బృందం
భువనగిరి: మండలంలోని తుక్కాపురం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శనివారం బిహార్ రాష్ట్రానికి చెందిన 34 మంది సర్పంచ్ల బృందం నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో సందర్శించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు పంచాయతీ పరిధిలో చేపట్టిన హరితవనం, ఇంకుడు గుంతలు, మహిళా సంఘాల కార్యక్రమాలు, తడి, పొడి చెత్త సేకరణ, కంపోస్టు ఎరువుల తయారీ, అంగన్వాడీలో అందిస్తున్న పౌష్టికారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులు చాలా బాగున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ నాగిరెడ్డి, బృందం కోర్సు డైరెక్టర్ కడారి రాజేశ్వర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. -
మఠంపల్లిలో ఎద్దుల పందేలు ప్రారంభం
మఠంపల్లి: మండల కేంద్రంలోని శుభవార్త చర్చి వార్షికోత్సవంలో భాగంగా శనివారం సాయంత్రం రెండు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శుభోదయా యువజన సంఘం, చర్చి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను స్థానిక మాంట్‌ఫోర్డ్ స్కూల్ గ్రౌండ్లో ఫాదర్ మార్టిన్ పసల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో పోటీలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ పోటీలను రాత్రి పది గంటల వరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహిస్తామని కమిటీ అధ్యక్షుడు జయభారత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదూరి కిషోర్‌రెడ్డి, గాదె జయభారత్‌రెడ్డి, గాలి చిన్నపురెడ్డి, గాదె లూర్థుమారెడ్డి, టీఆర్ బాలశౌరెడ్డి, విక్టర్‌రెడ్డి, బాలరెడ్డి, కర్నె వెంకటేశ్వర్లు, చిన్నరామారావు, గోపయ్య పాల్గొన్నారు. -
మాటూర్, కొల్లూరులో పలు ఇళ్లలో చోరీ
మోటకొండూర్: మండలంలోని మాటూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాటూర్ పెద్దులు, మాటూర్ ఐలయ్య, సల్ల ఉప్పలయ్య, వడ్ల మహేష్, వడ్ల జహంగీర్, అంబాల రాజయ్య, తోటకూరి కిష్టయ్య తమ ఇళ్లకు తాళాలు వేసి వేరే ఊర్లకు వెళ్లారు. కాగా శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో రెండు బైక్‌లపై ఆరుగురు దొంగలు వచ్చి ఆయా ఇళ్ల తాళాలు పగులగొట్టి బీరువాలు తెరిచి చోరీకి పాల్పడ్డారు. ఈ చోరీలో మాటూరి బాలమణి పెద్దులు ఇంట్లో రూ.1.50 లక్షల నగదు, 20తులాల వెండి, సల్ల ఉప్పలయ్య ఇంట్లో రూ.20వేల నగదు, 35 తులాల కడియాలు, మిగతా ఐదుగురి ఇళ్లో చెక్కుడు గుత్తి, వెండి గ్లాస్లు, ఇతర ఆభరణాలు అపహరించారు. ఉదయం పక్క ఇళ్లవారు చూసి పోలీసులకు, ఇంటి యాజమానులకు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మోటకొండూర్ ఎస్ఐ నాగుల ఉపేందర్ తెలిపారు. రూ.2 లక్షలకుపైగా నగదు, ఆభరణాలు అపహరణ -
పోలీసుల అదుపులో దొంగ స్వాములు
మోత్కూరు: సంతాన ప్రాప్తికి పూజలు చేస్తామని ప్రజల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తూ మోసానికి పాల్పడుతున్న దొంగ స్వాములను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మోత్కూరు మండలం పనకబండలో శనివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన పైళ్ల సతీష్, మహాలక్ష్మి దంపతులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ గ్రామానికి చెందిన కళ్లెం విజయ్ పనకబండ గ్రామంలో సంచరిస్తూ సతీష్ నిర్వహిస్తున్న కిరాణం దుకాణం వద్దకు వెళ్లి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తికి పూజలు చేస్తామని, కన్నె స్వాములతో పూజలు చేయిస్తే పిల్లలు పుడతారంటూ బొట్లు పెట్టి నమ్మబలికారు. ముందుగా బొట్టు పెట్టగానే రూ.1,500 నగదు, రూ.700 ఫోన్ పే ద్వారా చెల్లించారు. ప్రత్యేక పూజల కోసం రూ.11 వేలకు బేరం కుదుర్చుకున్నారు. శనివారం ఉదయం తన సోదరులైన కళ్లెం జీవన్‌లాల్, కళ్లెం కృష్ణతో కలిసి ఆంజనేయ స్వాముల వేశాలతో కళ్లెం విజయ్ గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే వీరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడాన్ని గమనించిన ప్రజలు వారి పొంతన లేని సమాధానాలపై నిలదీశారు. ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత వసూలు చేశారని ప్రశ్నించగా కొందరి వద్ద వసూళ్లకు పాల్పడినట్లు స్వాములు ఒప్పుకున్నారు. దీంతో ముగ్గురికి దేహశుద్ధి చేసి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించారు. గ్రామస్తుల సమాచారంతో దొంగ స్వాములను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ డి.నాగరాజు తెలిపారు. -
భూముల రక్షణకే.. ‘భూ భారతి’
మిర్యాలగూడ : భూముల రక్షణ కోసమే భూభారతి చట్టాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి, దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లిలో భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుల్లో ఆమె ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్‌తో కలిసి మాట్లాడారు. భూ భారతి చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని గతంలో ధరణిలో ఉన్న సమస్యలన్నింటికి ఈ భూభారతి చట్టంతో పరిష్కారం లభిస్తుందని తెలిపారు. దాదాపు 80శాతం భూ సమస్యలు తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారమవుతాయని తెలిపారు. గతంలో ఏదైనా సమస్య వస్తే ధరణిలో సవరణలు చేయడం చాలా కష్టతరంగా ఉండేదని.. ఇప్పుడు తప్పు జరుగిన చోటే సవరించే అధికారం ప్రభుత్వం ఇవ్వడం శుభపరిణామమన్నారు. భూ ఆధార్ ద్వారా అన్ని సక్రమంగా అమలు చేసేందుకు పాస్‌బుక్‌లో పట్టాదారు పూర్తి వివరాలతో పాటు నక్ష ఉండడం వల్ల భూమికి భద్రత ఉంటుందని తెలిపారు. చాలా గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు వచ్చాయని.. త్వరలోనే గ్రామ పాలన అందుబాటులో వస్తుందన్నారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని కానీ, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకబడి ఉన్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసే కార్యకర్తను విస్మరించదన్నారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసి తెలంగాణను అప్పులపాలు చేసిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యూసుఫ్‌అలీ, రెవెన్యూ సిబ్బంది సత్యనారాయణ, కాంగ్రెస్ నాయకులు నూకల వేణుగోపాల్‌రెడ్డి, బండి యాదగిరిరెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, ఇజ్రాయిల్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ మిర్యాలగూడ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో 80 మంది పేదలకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తోందన్నారు. పేదలకు పట్టాలు ఇచ్చిన స్థలంలోనే ఇందిరమ్మ ఇళ్లను సైతం నిర్మించి ఇస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నారాయణ్‌అమిత్, తహసీల్దార్ హరిబాబు తదితరులు ఉన్నారు. -
జైలును పరిశుభ్రంగా ఉంచాలి
జైలును శుభ్రంగా ఉంచాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, జస్టిస్ షమీం అక్తర్ సూచించారు. శనివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025ఫ రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఫ 42 డిగ్రీలకుపైగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు ఫ మే నెలలో 46 డిగ్రీలకు చేరే అవకాశం ఫ ఇప్పటికే ఆల్ట్రా వైలెట్ (యూవీ) 10 శాతం నమోదు ఫ ఈ పరిస్థితుల్లో జనంతోపాటు.. పశుపక్షాదుల రక్షణ తప్పనిసరి ఫ వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కాపాడుకోవాలి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలిపెద్దవూర : ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి అన్నారు. పెద్దవూర మండలంలోని చలకుర్తి, పులిచర్ల, చింతపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఏఈఓలు సర్టిఫైడ్ చేసిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలన్నారు. రైతులు ధాన్యాన్ని ఇళ్ల వద్దనే ఆరబెట్టుకుని తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట ఏపీఎం గంజి లలిత, సీసీలు సత్యనారాయణ, లింగయ్య తదితరులు ఉన్నారు. యాదగిరి క్షేత్రంలో ఊంజల్ సేవోత్సవం యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు.సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం చేపట్టారు.అంతకుముందు ప్రధానాలయంలో నిత్యపూజా కార్యక్రమాలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, అనంతరం గర్భాలయంలోని స్వయంభూలకు అభిషేకం, సహస్రనామార్చన చేశారు. ఇక ప్రాకార మండపపం, ముఖ మండపంలో సుదర్శనహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవంత తదితర పూజలు నిర్వహించారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి సూర్యాపేట అర్బన్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆల్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని నిర్వహించి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సీపీఎస్ విధానాన్ని రద్దు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతున్నా ఇంతవరకు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ సమావేశంలో ఆ జేఏసీ జిల్లా చైర్మన్ షేక్ జానీమియా, అడిషనల్ జనరల్ సెక్రెటరీ తంగెళ్ల జితేందర్‌రెడ్డి, ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ పాండు నాయక్, డిప్యూటీ సెక్రెటరీ జనరల్ దున్న శ్యామ్, కో చైర్మన్లు వీరన్న, డిప్యూటీ సెక్రటరీ జనరల్ లక్కపాక ప్రవీణ్, జహంగీర్, జాయింట్ సెక్రెటరీ డి.స్వప్న, సీటీఓ డిపార్ట్మెంట్ చైర్మన్ రవీందర్ బాబు, నాయిని ఆకాష్ వర్మ, ఎం.సైదులు, బి.వెంకన్న, సతీష్, రవి, మల్సూర్ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ : వాతావరణ మార్పుల కారణంగా ఎండలు మండుతున్నాయి. ఓజోన్ పొర దెబ్బతిని సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. దీంతో ఎండ వేడిమి పెరిగి జనం అల్లాడుతున్నారు. డీ హైడ్రేషన్‌కు గురవుతున్నారు. దీనికి తోడు ఏసీల వాడకం పెరగడంతో గాలిలో తేమ శాతం తగ్గిపోతోంది. ఈ కారణంగా జిల్లాలో ఆల్ట్రా వైలెట్ (యూవీ) పది శాతం నమోదవుతోంది. ఆకాశంలో తెల్లటి మేఘాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జనం జాగ్రతలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి మంగ్యానాయక్ సూచిస్తున్నారు. కోదాడ, రామగిరి(నల్లగొండ), నకిరేకల్ : వేసవిలో జంతు ప్రేమికులు వారి పెంపుడు జంతువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక ఉష్ణోగ్రతలు వాటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. ● ఎప్పటికప్పుడు శుభ్రమైన, చల్లటి నీటిని అందుబాటులో ఉంచాలి. ● పెంపుడు జంతువు ఉండే ప్రాంతం చల్లదనంగా ఉండేలా చూసుకోవాలి. గాలి వేగంగా వెళ్తున్న స్థలాన్ని ఎంచుకోవాలి. ● మధ్యాహ్నం సమయంలో నేలపై నడవనివ్వకూడదు. ● ఊపిరాడకపోవడం, అలసట, అధిక నిద్ర లాంటి లక్షణాలను గ్రహించాలి. వాటి శరీరానికి తగినంత గాలితీసుకునే అవకాశం ఇవ్వాలి. ● పెంపుడు జంతువులు ఉండే ప్రాంతాన్ని పూర్తిగా మూసివేయకుండా.. గాలి మార్పిడి ఉండేలా చూసుకోవాలి. ● తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని ఇవ్వాలి. ● వేసవి ఒత్తిడిని తగ్గించడానికి వాటికి టానిక్లను తాగించాలి. ● పక్షుల సంరక్షణకు ఇంటి గోడలు, వరండాలు, డాబాలపై చిన్నచిన్న చిప్పల్లో నీళ్లు పోసి ఉంచాలి. ● వీటి పక్కనే చిరుధాన్యపు గింజలు పోసి ఉంచాలి. ● రోడ్ల వెంట ఉండే చెట్ల మొదళ్ల వద్ద కూడా నీటి వసతులు కల్పించాలి. సేవ్ బర్డ్స్ క్యాంపెయిన్‌లో పాల్గొనాలి వేసవిలో పక్షులు దాహార్తి తీర్చడానికి ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కానీల్లో నీటి చిప్పలు, కృతిమ గూళ్లను, ఫీడర్లను ఏర్పాటు చేయాలని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు తమ ఇళ్లలో వరండాలు, బాల్కనీల్లో పిట్టగోడలపై పిల్లల చేత నీటి కుప్పలను ఏర్పాటు చేయిస్తే బాగుంటుంది. ధాన్యపు చిప్పలను కూడా ఏర్పాటు చేసి పక్షుల మనుగడకు దోహదపడాలి. సేవ్ బర్డ్స్ క్యాంపెయిన్‌లో అందరూ భాగస్వాములు కావాలి. – కనుకుంట్ల విద్యాసాగర్‌రెడ్డి, ఉపాధ్యాయుడు, నకిరేకల్ ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి ర్యాలీని ప్రారంభిస్తున్న డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్నల్లగొండ టౌన్ : దోమల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా వ్యాధి నిర్మూలనకు దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంబించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మలేరియా వ్యాధి అనాఫిలస్ అనే దోమ కుట్టడం ద్వారా వస్తుందని.. డెంగీ, చికున్ గున్యా, బోధకాలు, మెదడువాపు వ్యాధి కూడా దోమ కుట్టడం ద్వారానే వస్తాయన్నారు. నీటి నిల్వ లేకుండా చూసుకోవడం వల్ల దోమల వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కళ్యాణచక్రవర్తి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ అరుంధతి, డాక్టర్ పద్మ, డాక్టర్ కృష్ణకుమారి, డాక్టర్ గీతావాణి, విష్ణు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేత్రపర్వంగా నిత్యకల్యాణం భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో శుక్రవారం శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యకల్యాణ వేడుక నేత్రపర్వంగా చేపట్టారు. ముందుగా వేకువజామున సుప్రభాత సేవల, తోమాల సేవ, సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారికి కల్యాణం జరిపించారు. మధ్యాహ్నం సుమారు 3వేల మందికి అన్నప్రసాద వితరణ, సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, కుంకుమార్చన నిర్వహించారు. మే 3 వరకు పింఛన్ల పంపిణీనల్లగొండ : ఆసరా పింఛన్లను మే 3వ తేదీ వరకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళల, చేయూత పింఛన్లను ఆయా పోస్టాపీసుల్లో అందజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.న్యూస్రీల్పెంపుడు జంతువులు – జాగ్రత్తలు.. -
నిందితుల అరెస్ట్
వ్యవసాయ మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను నార్కట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. - IIలోవృద్ధులు జాగ్రత్తగా ఉండాలి ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల వృద్ధులు జాగ్రత్తగా ఉండడం మంచింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే మధ్యాహ్నం వేళ వృద్ధులు బయటికి వెళ్లొద్దు. చెమటలు బాగా వచ్చి, కళ్లు తిరిగితే సంబంధిత డాక్టర్‌ను కలిసి ఈసీజీ తీయించుకోవాలి. ఎండలకు రక్తపోటు పెరుగుతుంది. విరోచనాలు, వాంతులు ఎక్కువగా అయితే డాక్టర్‌ను సంప్రదించాలి. ఎలక్ట్రోలైట్స్ పౌడర్‌ను తీసుకోవాలి. డయాబెటిస్, హైపర్‌టెన్షన్ పేషెంట్లు జాగ్రత్తగా మత్తు, శీతల పానీయాలను ఎక్కువగా తీసుకోవద్దు. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, జ్యూస్‌లు బాగా తాగాలి. – రమణ, జనరల్ ఫిజీషియన్, సూర్యాపేట -
చిన్న పిల్లల రక్షణ ప్రధానం
వేసవి కాలంలో చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో తిరిగితే పిల్లలు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. మజ్జిగ, పుచ్చకాయ, కొబ్బరి నీరు, నిమ్మరసం, కీర దోస, పుదీన నీరు తాగించాలి. తెల్లని వదులైన కాటన్ దుస్తులు వేయాలి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటికి పంపవద్దు. తలనొప్పి, తలతిరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, అధిక చెమట, అదిక దాహం కలిగితే వెంటనే సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాలి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, చిన్న పిల్లల వైద్య నిపుణుడు, నల్లగొండ -
కిచెన్, టెర్రస్ గార్డెన్లను కాపాడుకోండి ఇలా..
కోదాడ, భువనగిరిటౌన్ : చాలా మందికి గార్డెనింగ్ అంటే ఇష్టం. మొక్కల పెంపకంలో చాలా కేర్ తీసుకుంటారు. అయితే, వేసవిలో మొక్కలను కాపాడుకోవడం కష్టంతో కూడుకున్న పని. ఈ చిట్కాలు పాటిస్తే ఎండబారి నుంచి కాపాడుకోవచ్చంటున్నారు.. ఉద్యానవన అధికారులు. ● రోజూ సాయంత్రం ఆరు గంటల తరువాతే మొక్కలకు నీరు పెట్టుకోవాలి. ● ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత మొక్కలపై నేరుగా పడకుండా గ్రీన్‌మ్యాట్ పైకప్పుగా ఏర్పాటు చేసుకోవాలి. ● గ్రీన్‌మ్యాట్‌పై రెండు మూడు గంటలకు ఒకసారి నీటిని చల్లాలి. ● మొక్కలకు రసాయన ఎరువులను అందించవద్దు. మొక్కల పాదుల్లో తడి ఆరకుండా చూసుకోవాలి. ● కుండీల్లో మొక్కలు నాటితే తరచూ మట్టిని మార్చాలి. మట్టిలో ఆవు పేడ కలపాలి. మట్టి ఎక్కువ రోజులు తడిగా ఉండటానికి కుండీలో ఎండిన ఆకులను ఉంచాలి. ● మొక్కలకు వేప పిండిని ఎరువుగా ఉపయోగించవచ్చు. కుండీల్లో పదును ఉండేలా చూస్తున్నా.. గతేడాది కంటే ఈ సంవత్సరం ఎండులు ఎక్కువగా ఉన్నాయి. ఎండ వేడిమికి మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కల సంరక్షణకు జాగ్రత్తలు తీసుకుంటున్నా. కుండీల్లో నాటిన మొక్కలకు ఎప్పుడు తడిగా ఉండేలా చూస్తున్నా. సూర్యరశ్మి తక్కువ సోకే ప్రాంతాల్లో మొక్కలను ఉంచుతున్నా. – దాత్రక్ పద్మ, భువనగిరి -
ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలి
చిట్యాల : పట్టణంలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాలను మళ్లించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ పోలీసులకు సూచించారు. శుక్రవారం చిట్యాల పాలకేంద్రం వద్ద, పోలీస్‌స్టేషన్ ఎదురుగా జంక్షన్ వద్ద జరుగుతున్న ప్లైఓవర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల నేపథ్యంలో ఎదురవుతున్న ఇబ్బందులను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాహనదారులు, పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనాలను మళ్లించాలని సూచించారు. పనులు వేగవంతంగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి, సీఐ కె.నాగరాజు, ఎస్ఐ ఎన్.ధర్మా తదితరులు ఉన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
పెండింగ్ కేసులను పరిష్కరించాలి
నల్లగొండ : పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ శరత్‌చంద్రపవార్ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. కేసులను పారదర్శకంగా విచారణ చేయాన్నారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశోధన చేసి ఫైనల్ చేయాలని సూచించారు. ప్రతి అధికారికి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్పై అవగాహన ఉండాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పోలీసు అధికారులు రోజూ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకమవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలన్నారు. సైబర్ క్రైం, డయల్ 100 వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ.. వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలని తెలిపారు. రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ డ్రైవింగ్, మైనర్లు వాహనాలు నడపకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ మౌనిక, అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖర్ రాజు, లక్ష్మీనారాయణ, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఏడుగురికి పదోన్నతి పదోన్నతి పొందిన వారికి బాధ్యతలు పెరుగుతాయని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆర్మర్డ్ రిజర్వు విభాగంలో పనిచేస్తున్న ఏడుగురు కానిస్టేబుళ్లు.. హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా ఎస్పీ వారికి పట్టీలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విధులను క్రమశిక్షణ, బాధ్యతతో నిర్వర్తించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, అడ్మిన్ ఆర్ఐ సంతోష్ పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ -
భూ భారతితో సాదా బైనామాలకు మోక్షం
మునుగోడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం–2025తో అసైన్డ్ భూముల రెగ్యులరైజేషన్, సాదా బైనామాలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. మునుగోడులో గురువారం భూ భారతి చట్టం–2025పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లో అనేక సమస్యలున్నాయని, వాటన్నింటిని తొలగించి కొత్తగా భూ భారతి చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. భూ భారతి చట్టంతో సరిహద్దుల వివాదాల పరిష్కారం, మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ వంటి అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. గ్రామాల్లో భూ రికార్డుల నిర్వహణ, భూ వివాదాలను తగ్గించేందుకుగాను ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలన అధికారులను నియమించనుందని తెలిపారు. భూమి కబ్జాలో ఉన్నంత మాత్రన రైతుకు హక్కు రాదని, ప్లో చార్ట్‌తో పాటు అన్ని రకాల డాక్యుమెంట్లు ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ భూ భారతి చట్టాన్ని రైతులు సద్వీనియోగం చేసుకుని సమస్యలు పరిష్కారించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, డిప్యూటి తహసీల్దార్ నరేందర్, ఏఎంసీ చైర్మన్ నారాయణ, ఎంపీడీఓ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. -
నిలిచిన ఎంసీహెచ్ కిట్లు
నల్లగొండ టౌన్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన మాతా శిశు ఆరోగ్య (ఎంసీహెచ్) కిట్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో పాటు గర్భిణులు, బాలింతలకు అందించే ప్రోత్సాహకాలు కూడా బందయ్యాయి. అలాగే గర్భిణులకు న్యూత్రీషన్ కిట్ల సరఫరా కూడా నిలిచిపోయింది. వీటి గురించి వైద్యులు, అధికారులను అడిగితే సమాధానం దాట వేస్తున్నారని కాన్పులకు వచ్చిన మహిళల బంధువులు అంటున్నారు. కిట్లతోపాటు ప్రోత్సాహక నిధులు ఎప్పుడు ఇస్తారోనిన గర్భిణులు, బాలింతలు ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ కిట్ పేరు మార్చినా.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసీఆర్ కిట్ పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కొత్త పథకం అమలు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకున్న మహిళలు డిశ్చార్చి అయ్యే సమయంలో తల్లీబిడ్డలకు అవసరమైన 20 రకాల వస్తువులు ఉండే కేసీఆర్ కిట్ ఇచ్చేవారు. అలాగే ప్రభుత్వ వాహనంలో వారిని ఇంటి వద్దకు చేర్చేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్‌ను ఎంసీహెచ్ కిట్‌గా మార్చింది. గత మార్చి నుంచి కిట్ల సరఫరా కాకపోవడంతో కిట్ల పంపిణీ బంద్ అయింది. ఆసుపత్రుల్లో కిట్ల గురించి అడిగితే బాలింతలకు సమాధానాలు చెప్పలేక వైద్యులు అవస్థలు పడుతున్నారు. మూడేళ్లుగా నగదు ప్రోత్సాహకాల్లేవ్.. గర్భం దాల్చిన మూడు నెలల నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పేరు నమోదు చేసుకుని నెలనెలా పరీక్షలు చేయించుకుని అక్కడే ప్రసవించిన వారికి గత ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలు అందజేసింది. ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ మొత్తాన్ని గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చెకప్‌లు పూర్తయిన తర్వాత రూ.2 వేలు, ప్రసవించిన తర్వాత రూ.3 వేలు, బిడ్డకు వ్యాక్సినేషన్ తర్వాత రూ.2 వేలు, అన్ని వ్యాక్సినేషన్లు పూర్తయ్యాక జమ చేసేవారు. ఈ ప్రోత్సాహకాలను కూడా 2020 ఆగస్టు నుంచి ప్రభుత్వం నిలిపివేసింది. గతేడాది మార్చి నుంచి సరఫరా బంద్ ఫ 2022 ఆగస్టు నుంచి నగదు ప్రోత్సాహకాలూ అందట్లే ఫ న్యూట్రీషన్ కిట్లదీ అదేదారి.. ఫ గర్భిణులు, బాలింతలకు తప్పని ఎదురుచూపులుప్రభుత్వం నుంచి సరఫరా లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంసీహెచ్ కిట్లు, న్యూత్రీషన్ కిట్లు సరఫరా కావాల్సి ఉంది. అవి వచ్చిన వెంటనే అర్హులందరికీ అందజేస్తారు. ప్రోత్సాహక నిధులు కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. విడుదలైన వెంటనే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ, నల్లగొండ అందని పౌష్టికాహారం.. పౌష్టికాహారం అందించడం ద్వారా రక్తహీనత నుంచి రక్షించి మాతాశిశు మరణాలు తగ్గించేలా గత ప్రభుత్వం గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేసింది. న్యూత్రీషన్ కిట్‌లో నెయ్యి, హార్లిక్స్, ఖర్జూరాలు, పల్లీపట్టి తదితర పదార్థాలు ఉండేవి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జీజీహెచ్‌లో పేర్లు నమోదు చేసుకున్న గర్భిణులకు న్యూత్రీషన్ కిట్లు పంపిణీ చేసేవారు. ఇవి కూడా మూడేళ్లుగా సరఫరా చేయడం లేదు. -
మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
నల్లగొండ : ఇంటర్ ఫెయిల్ అయిన, ఇంప్రూవ్ మెంట్ రాసుకునే విద్యార్థులుకు మే 22 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి దస్రూనాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజూ రెండు పూటల పరీక్ష ఉంటుందని.. సప్లమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. అయితే అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులు ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఫ్టస్, సెకండియర్ పరీక్ష ఫీజు రూ.520తోపాటు ఒక్కో సబ్జెక్టుకు అదనంగా రూ.180 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.హజ్ యాత్రికులకు వ్యాక్సినేషన్నల్లగొండ టూటౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని హజ్ హౌజ్‌లో వంద మంది హజ్ యాత్రికులకు గురువారం వ్యాక్సినేషన్ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ధరిచేరవని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ పద్మ, జిల్లా ఉప వైద్యాధికారి ఎల్.వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్ బి.అరుందతి, ఆర్.వీరారెడ్డి, పి.కృష్ణ, మాజిద్అలీ, జి.రాము పాల్గొన్నారు. పంట మార్పిడితో అధిక లాభాలుకనగల్ : రైతులు పంట మార్పిడి వల్ల అధిక లాభాలు పొందవచ్చని ఆర్డీఓ అశోక్‌రెడ్డి అన్నారు. గురువారం కనగల్ మండలం తిమ్మాజిగూడెంలో రైతు కుంభం నర్సిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జిల్లా ఉద్యాన అధికారి పి.అనంతరెడ్డి, నల్లగొండ, కనగల్ వ్వవసాయాధికారులు శ్రీనివాస్, అమరేందర్‌గౌడ్‌తో కలిసి మఖానా విత్తనాలను నారుమడిలో చల్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మఖాన ఎకరానికి 32–34క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఒక కేజీ రూ.300 నుంచి రూ.800 ధర పలుకుతుందన్నారు. ఎకరానికి దాదాపు రూ.60వేల నుండి రూ.80వేల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి మర్రిగూడ : ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డీఆర్డీఓ వై.శేఖర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం మర్రిగూడ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. 17 శాతం లోపు తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే కాంటా వేయాలన్నారు. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని సూచించారు. ఏమైనా సమస్యలు తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. అంతకుముందు యరగండ్లపల్లి నర్సరీని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీఓ జి.చినమునయ్య, ఏపీఎం వెంకట్, సీసీ భారతమ్మ, ఏఈఓ విజయ్‌కుమార్, సిబ్బంది శంకర్, రాజ్యం ఉన్నారు. పోషకాహారంపై అవగాహన నల్లగొండ : గర్భిణులు సరైన పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలని భారత ఆహార సంస్థ నల్లగొండ సీనియర్ అధికారి కృష్ణవేణి అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ పక్షంలో భాగంగా, రామగిరి లోని అంగన్వాడీ కేంద్రంలో గురువారం పిల్లలకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ అధికారులు ఆదిమల్ల శంకర్, ఉద్యోగులు సునంద, సతీష్ రెడ్డి, అంగన్వాడీ కేంద్ర నిర్వాహకురాలు శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఇన్చార్జి అదనపు కలెక్టర్లు బాధ్యతల స్వీకరణ
నల్లగొండ : ఇన్చార్జి అదనపు కలెక్టర్లు (రెవెనూ, లోకల్‌బాడీ) అమిత్ నారాయణ్, రాజ్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ, ఇన్చార్జి లోకల్‌బాడీ) శ్రీనివాసులు నెలరోజుల పాటు సెలవుపై వెళ్తుండడంతో ఆయన స్థానంలో ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్‌ను నియమిస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. లోకల్ బాడీ ఇన్చార్జి అదనపు కలెక్టర్‌గా హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. నెలరోజుల పాటు వీరు విధులు నిర్వహించనున్నారు. -
ముంపు బాధితుల భూములు ఆన్లైన్లో తొలగింపు
చందంపేట : సాగర్ ముంపు బాధితులకు కేటాయించిన డీ ఫారెస్ట్ భూమిని అధికారులు రెండేళ్ల క్రితం ఆన్లైన్ నుంచి తొలగించారు. మొన్నటి వరకు ఆన్లైన్లో భూమి ఉండడంతో ఆయా రైతులు రైతుబంధు సాయం, పంట రుణాలు సైతం పొందారు. ఇప్పుడు ఆన్లైన్లో భూములు లేకపోవడంతో పెట్టుబడిసాయం, రుణాలు అందడం లేదు. భూములను తిరిగి ఆన్లైన్లో చేర్చాలని ఆయా రైతులు తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు ఎన్నిమార్లు తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు. కుటుంబానికి ఐదెకరాలు.. చందంపేట మండలంలోని బుడ్డోనితండా పంచాయతీ పరిధిలోని కాకనూరితండాలో సాగర్ ముంపు బాధితులకు ప్రభుత్వం 1970లో ఇక్కడి అటవీ భూములను కేటాయించింది. అప్పట్లో కుటుంబానికి ఐదు ఎకరాల చొప్పున డీ ఫారెస్ట్ పట్టాలు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయా కుటుంబాలు భూములు సాగుకు యోగ్యం చేసుకుని పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. ఇటీవల 33 మంది రైతులకు చెందిన 120 ఎకరాల భూమిని క్రితం ధరణి వెబ్సైట్ నుంచి తొలగించారు. దీంతో ఆయా రైతులు ప్రభుత్వ లబ్ధిని పొందలేకపోతున్నారు. వీరి భూములను ఆన్లైన్లో తొలగించడంతో న్యాయం చేయాలంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఇప్పటికై న ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమ భూములను తిరిగి ఆన్లైన్లో నమోదు చేసి రైతు బంధు సాయం, రుణ మాఫికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఫ ప్రభుత్వ సాయాన్ని కోల్పోతున్న రైతులు ఫ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం -
‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం
మర్రిగూడ : భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు గురువారం మండల కేంద్రంలోని కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. రికార్డుల సవరణలు చేసే అవకాశం భూభారతిలో ఉందన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూముల వివరాలన్నీ ఆ గ్రామ పరిధిలో ప్రదర్శిస్తామన్నారు. శివన్నగూడ ప్రాజెక్టు నిర్వాసితులకు చింతపల్లిలోనే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందజేస్తామన్నారు. భూభారతి చట్టం విప్లవాత్మకం : ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం దేశంలోనే ఒక విప్లవాత్మకమైందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. భూభారతి చట్టం వల్ల 99శాతం సమస్యలు తహసీల్దార్, ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కారమవుతాయన్నారు. శివన్నగూడ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని దాని ద్వారా మునుగోడు నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్లు బక్క శ్రీనివాస్, దేవాసింగ్, ఎంపీడీఓ రామకృష్ణశర్మ, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు, వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్లు బాలం నరసింహ, నర్సిరెడ్డి పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ఎల్ఆర్ఎస్కు సర్వర్ డౌన్ ఆటంకం!
నల్లగొండ టూటౌన్: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) గడువు దగ్గర పడుతున్న కొద్దీ అడుగడుగునా సర్వర్ డౌన్ సమస్య ఆటంకంగా మారింది. ఈనెల30వ తేదీలోగా ఎల్ఆర్ఎస్ చేయించుకున్న వారికి ఫీజులో 25 శాతం డిస్కౌంట్ కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మరో వారం రోజుల్లో గడువు ముగియనుండగా సర్వర్ డౌన్ సమస్య దరఖాస్తుదారులను కలవరానికి గురి చేస్తోంది. నీలగిరి మున్సిపల్ కార్యాలయానికి మంగళవారం ఎల్ఆర్ఎస్ ఫైల్స్ అప్‌లోడ్‌కు సర్వర్ పనిచేయకపోవడంతో రోజంతా దరఖాస్తుదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ నుంచే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తరచూ సర్వర్ పనిచేయడం లేదని, రెండు, మూడు రోజుల వరకు ఆన్లైన్లో ఫైల్స్, వివరాలను అప్లోడ్ చేయలేమని టౌన్ ప్లానింగ్ విభాగం ఉద్యోగులు చెబుతున్నారు. అయితే గడువు దాటితే డిస్కౌంట్ ఎత్తేయడంతో పాటు ఫీజు పెంచుతారేమోననే దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోకి వెళ్లిన వేలాది ప్లాట్లు.. నీలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల నుంచి 36 వేలకు పైగానే రూ.వెయ్యి చెల్లించి 2020లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. కానీ గతంలో చోటు చేసుకున్న పరిణామాల వలన వేలాది మంది ప్లాట్లు ఎఫ్టీఎల్ పరిధిలోకి వెళ్లిపోయాయి. నాలుగేళ్ల క్రితం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూముల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల నుంచి తీసుకుంది. ఆ సమయంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయం లేకుండా ఇష్టానుసారంగా సర్వే నంబర్ల వారీగా పంపించారు. ఇప్పుడు ఇదే సమస్య ప్లాట్ల యజమానులకు ఇబ్బందికరంగా మారింది. ఎఫ్టీఎల్ పరిధి వరకు కాకుండా ప్రభుత్వం సర్వే నంబర్లలో ఎంత భూమి ఉంటే ఆ భూమి మొత్తం ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని ప్రభుత్వం రెడ్ మార్క్‌లో పెట్టింది. దాంతో నీలగిరి మున్సిపాలిటీ పరిధిలోని కేశరాజుపల్లి, మర్రిగూడ ప్రాంతం, ఆర్జాలాబావి, జీవీ గూడెం ప్రాంతాల్లో 6,800 ప్లాట్లు ఎఫ్టీఎల్ పరిధిలోకి వెళ్లాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువు లేకున్నా ఎఫ్టీఎల్ చూపించడం లాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు వీరంతా ఎల్ఆర్ఎస్ చేయించుకోవాలంటే రిజిస్ట్రేషన్, మున్సిపల్, ఇరిగేషన్, తహసీల్దార్ కార్యాలయాల అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీనిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తేనే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండనుంది. సర్వర్ డౌన్ సమస్య వాస్తవమే.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు సర్వర్ డౌన్ సమస్య నెలకొంటున్న మాట వాస్తవమే. హైదరాబాద్ నుంచే ఈ సమస్య వస్తుంది. అక్కడ సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నారు. సమస్య పరిష్కారం కాగానే ఎల్ఆర్ఎస్ ప్రక్రియ సజావుగా సాగనుంది. – కృష్ణవేణి, మున్సిపల్ ఏసీపీ, నల్లగొండ ఫ రాష్ట్ర స్థాయిలోనే నెలకొన్న సాంకేతిక సమస్య ఫ ముందుకు సాగని ఎల్ఆర్ఎస్ ప్రక్రియ ఫ నిలిచిపోయిన దరఖాస్తుల అప్లోడ్ ఫ ఇబ్బందుల్లో దరఖాస్తుదారులు -
టీపీసీసీ పరిశీలకుల నియామకం
నల్లగొండ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు పరిశీలకులను నియమించింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లాకు మక్తల్ ఎమ్మెల్యే వి.శ్రీహరి ముదిరాజ్, నజీర్ అహ్మద్‌ను పరిశీలకులుగా నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు జిల్లాలో ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షులను కొనసాగించాలా.. లేక కొత్తవారిని నియమించాలా అనే దానిపై పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి నివేదిక సమర్పించనున్నారు. వీరిచ్చే నివేదికల ఆధారంగా స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులను ఆశించే వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రేపటి నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలునల్లగొండ టూటౌన్: జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాల్లో శుక్రవారం నుంచి వేసవి ప్రత్యేక క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా యుజవన, క్రీడల శాఖ అధికారి కుంభం నర్సిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్, ఔట్‌డోర్ స్టేడియంలో బాక్సింగ్ క్యాంపులు ఉంటాయని పేర్కొన్నారు. మిర్యాలగూడలోని ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్, ఔట్‌డోర్ స్టేడియంలో బాక్సింగ్ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 8 నుంచి 19 సంవత్సరాల వయసు గల చిన్నారులు శిక్షణ శిబిరాల్లో పాల్గొనాలని, పూర్తి వివరాలకు 9440072854 నంబర్లో సంప్రదించాలని కోరారు. పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉంచాలివేములపల్లి: పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర క్షయవ్యాధి (టీబీ) నిర్మూలన విభాగం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం అన్నారు. బుధవారం వేములపల్లిలోని పీహెచ్‌సీని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్‌తో కలిసి ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో టీబీ అనుమానిత వ్యక్తులను పరీక్షించి తెమడ నమూనాలను పీహెచ్‌సీలకు, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాలకు పంపించి పరీక్షలను నిర్వహించాలన్నారు. చిన్నారులకు అవసరమైన వ్యాక్సిన్లతోపాటు పాముకాటు, తేలుకాటు వంటి ఇంజిక్షన్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వారి వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ కేస రవి, జిల్లా ఫార్మసీ సూపర్వైజర్ వీరారెడ్డి, పీహెచ్సీ వైద్యులు సుచరిత తదితరులు ఉన్నారు. పారదర్శకంగా ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపికచిట్యాల: గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై బుధవారం ఆయన చిట్యాలలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ జయలక్ష్మితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అంతకుముందు పెద్దకాపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. చేనేత వృత్తిదారులను ఆదుకోవాలి నల్లగొండ టౌన్: చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో చేనేత వృత్తిదారులను ప్రభుత్వం ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం నల్లగొండలోని సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముడి సరుకులు రంగులు, రసాయనాలు, నూలు, పట్టు ధరలు పెరగడంతో చేనేత కార్మికుడికి ఉపాధి కరువైందన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కందగట్ల గణేష్, ఉపాధ్యక్షుడు కర్నాటి శ్రీరంగం, సహాయ కార్యదర్శి వనం రాములు, వాలుగొండ మధు, ఏలె శ్రీనివాస్, గడ్డం దశరథ, దయానంద్, ఏలె వెంకటేశం, రావిరాల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్ సభకు లక్ష మంది
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘వరంగల్‌లో ఈనెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి లక్షమందిని తరలించేందుకు సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా వరంగల్‌కు సమీప నియోజకవర్గాలైన ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి నుంచి 12,500 చొప్పున 50వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ జనసమీకరణ వివరాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు బీఆర్ఎస్ రజతోత్సవ సభ కాంగ్రెస్ నేతల్లో గగుర్పాటు కలిగిస్తోంది. ఇది బీఆర్ఎస్ సభనా, లేక టీఆర్ఎస్ సభనా అంటూ కాంగ్రెస్ నాయకులు ఆగమాగం అయితుండ్రు. సభకు కేసీఆర్ వస్తుండే. ఆల్రెడీ బీఆర్ఎస్ పేర ఎన్నికల్లో పోటీనే చేసినం. మీకెందుకు అనుమానం. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలతోపాటు రైతులు లక్ష మంది తరలిరానున్నారు. ఎడ్లబండ్ల యాత్ర మొదలైంది ఎడ్లబండ్లు, సైకిల్, పాద యాత్రలకు పార్టీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం నుంచి ఎడ్లబండ్ల ర్యాలీ ప్రారంభమైంది. నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయం వద్ద పూజలు చేసి రైతులు ర్యాలీని ప్రారంభించారు. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి అనే పాటను గుర్తుగా 16 బండ్లతో వరంగల్ సభకు ర్యాలీగా వెళ్లారు. అర్వపల్లి నుంచి సైకిళ్ల మీద యాత్రగా వెళతామని యువత ముందుకు వస్తే రెండు రోజులు ఆగాలని చెప్పాను. పాదయాత్రకు కూడా సిద్ధమవుతున్నారు. ఎండల తీవ్రతతో ఆగాలని సూచించాం. జనాల్లో అలాంటి వాతావరణం వస్తే సభ విజయవంతమవుద్దనేది కచ్చితమైంది. మేము పేరుకే రజతోత్సవ సభ నిర్వహిస్తున్నాం. ప్రజల ఆలోచన వేరే ఉంది. వారే పెద్ద ఎత్తున బయల్దేరి సభకు రావాలని చూస్తున్నారు. వరంగల్ సభ పండుగ వాతావరణంలో జరగబోతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో అప్పుడే సభకు ఏ విధంగా నైనా హాజరు కావాలని చూస్తున్నారు. కేసీఆర్ ఉంటే మంచి జరుగుతుందనే భావన జనాల్లో ఉంది. చరిత్రలో నిలిచిపోనుంది రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోనుంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో అలజడి మొదలైంది. సభపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. సభ తర్వాత ప్రజల్లో కాంగ్రెస్‌పై మరింత వ్యతిరేకత పెరుగుతుందన్న భయాందోళన ప్రభుత్వంలో ఉంది. అందుకే సభపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సభకు హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఫ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవానికి ఉమ్మడి జిల్లా నుంచి భారీగా జనసమీకరణ ఫ నాలుగు నియోజకవర్గాల నుంచే సగం మంది ఫ మిగతా చోట్ల నుంచి పెద్ద సంఖ్యలో తరలిస్తాం ఫ కేసీఆర్ చెప్పేది వినేందుకు ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా వస్తామంటుండ్రు ఫ కాంగ్రెస్‌కు ఓటేసినోళ్లే కసిగా సభకు రావడానికి సిద్ధమవుతుండ్రు ఫ ఎక్కడ చూసినా సభపైనే చర్చ ఫ సభ పేరు వింటేనే అధికార పక్షం జంకుతుంది ఏ నోట విన్నా సభపైనే చర్చ ఏ పెళ్లిలో, ఏ చావుకెళ్లినా బీఆర్ఎస్ సభ గురించి చర్చ సాగుతోంది. ఎన్నికల ముందు మమ్ముల చూసి పక్కకు పోయినోళ్లు కూడా ఇయ్యాల మా దగ్గరకు వస్తుండ్రు. సభకు రావాలని చూస్తుండ్రు. కాంగ్రెస్‌కు ఓటేసిన నేతలే కసిగా వరంగల్ సభకు వచ్చేందుకు సిద్ధమవుతుండ్రు. జనాలకు కేసీఆర్ అంటే చాలా ప్రేమ ఉంది. కానీ కాంగ్రెస్ నేతలు చెప్పిన మాయమాటలతో ఇంకా ఏమైనా రుణమాఫీ, రూ.2,500 వస్తుందనే ఆశతో కాంగ్రెస్‌కు ఓటేసిండ్రు. ప్రధానంగా ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు చెప్పిన మాయ మాటలకు నిరుద్యోగులు ఎట్రాక్టు అయినరు. ఇప్పటి యువతకు తెలంగాణ ఉద్యమం గురించి తెలియదు. ఎన్నికల్లో కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారు. దాంతో నిరుద్యోగులు ఎట్రాక్టు అయ్యిండ్రు. తల్లిదండ్రులకు కూడా యువతే చెప్పుకుంది. రుణమాఫీ ఇస్తే సరిపోతుందా..ఉద్యోగాలు కూడా రావాలనడంతో వారు ఆలోచనలో పడి ఓటేశారు. అలాంటి నిరుద్యోగులు కూడా ఇప్పుడు కేసీఆర్ వెంటే నడిచేందుకు సిద్ధమవుతున్నారు.కాంగ్రెస్ మోసాలు సంవత్సరంలో తెలుసుకున్నరు. ఒక్క నోటిఫికేషన్ వేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాటినే భర్తీ చేసిందని దాంతో నిరుద్యోగులు అసలు విషయం తెలుసుకున్నారు.వరంగల్ సభకు వాళ్లే ముందు నడవబోతున్నారు. కేసీఆర్‌కు ఓటేయక పొరపాటు జరిగిన విషయాన్ని గమనించి సభకు రావాలని చూస్తున్నారు. -
భూ సమస్యలకు పరిష్కారానికే భూ భారతి చట్టం
చిట్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం–2025తో భూ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. చిట్యాల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో బుధవారం ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. భూములకు సంబంధించిన మ్యుటేషన్ ఇబ్బందులు, ఇతర వివాదాలున్న భూములకు జియో కోఆర్టినేట్ ద్వారా హద్దులతో కూడిన వివరాలు ఆన్లైన్ చేసి భూధార్ కార్డులను అందజేయనున్నట్టు వివరించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ భా భారతి చట్టం తేవడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్‌రెడ్డి, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణనాయక్, ఎంపీడీఓ జయలక్ష్మీ, ఏఓ పగిడిమర్రి గిరిబాబు, ఏఎంసీ చైర్మన్ నర్రా వినోదామోహన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కాటం వెంకటేశం, డీసీసీ కార్యదర్శి పోకల దేవదాసు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనర్సింహ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులకు క్యాంపు.. టీచర్లకు శిక్షణ
నల్లగొండ: విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా జిల్లా స్థాయిలో సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేయాలని విద్యా శాఖ ప్రత్యేక ప్రణాళికా సిద్ధం చేసింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో 200 మంది విద్యార్థులకు అవకాశం కల్పించి వివిధ అంశాలు, క్రీడల్లో తర్ఫీదు ఇచ్చేందుకు ప్రత్యేక శిబిరం ఏర్పాటుకు పూనుకుంది. 40 రోజుల పాటు సమ్మర్ క్యాంపు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్యాంపులో ఇండోర్ గేమ్స్ అయిన చెస్, క్యారమ్స్‌తో పాటు డ్యాన్స్, ఆర్ట్ అండ్ క్రాప్టు, కెరీర్ గైడెన్స్, మోరల్ వ్యాల్యూస్, స్టోరీ టెల్లింగ్ అంశాలను నేర్పిస్తారు. 6 నుంచి 9వ తరగతి వరకు పిల్లలను మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ నెల 25 నుంచి జూన్ 5వ తేదీ వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని బోయవాడ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో సమ్మర్ క్యాంపు నిర్వహించనున్నారు. ఉదయం రాగిజావ, మధ్యాహ్న భోజనంతోపాటు సాయంత్రం స్నాక్స్ కూడా విద్యార్థులకు అందించనున్నారు. ఉపాధ్యాయులకూ శిక్షణ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు విద్యాబోధనలో మెళకువలు నేర్పించేందుకు గాను ఈ వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ఇచ్చేందుకు విద్యా శాఖ కార్యాచరణ రూపొందించింది. ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు (తెలుగు, ఆంగ్ల మాద్యమాల్లో తెలుగు 2, పరిసరాల విజ్ఞానం 2, ఇంగ్లిష్ 2, మ్యాథ్స్ 2) శిక్షణ ఇచ్చేందుకు ఎనిమిది మంది ఎమ్మార్పీలతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్‌కు మరో ఇద్దర్ని తీసుకుంటారు. అలాగే ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయుల శిక్షణకు ప్రభుత్వ, లోకల్ బాడీ, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ, పీడీ, జీహెచ్ఎం, ప్రిన్సిపాల్స్ నుంచి 36 మందిని డీఆర్పీలుగా తీసుకోనున్నారు. ఉర్దూ అధ్యాపకుల శిక్షణకు 10 మందిని తీసుకోనున్నారు. ఉన్నత పాఠశాలల హెచ్ఎంల శిక్షణకు నలుగురిని, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల శిక్షణకు మరో నలుగురిని ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి గల వారు గురువారంలోగా జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. రిసోర్స్ పర్సన్లుగా పనిచేయాలనుకునే వారి కోసం జిల్లా విద్యా శాఖ వెబ్సైట్ doenalgonda.bolgspot.comలో దరఖాస్తు ఫారమ్ అందుబాటులో ఉంచారు. ఎంపికై న వారి వివరాలు 28న ప్రకటిస్తారు. అయితే జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, డీఈఓ కన్వీనర్‌గా, డైట్ ప్రిన్సిపాల్ సమగ్ర శిక్ష క్వాలిటీ కోఆర్డినేటర్ సభ్యులుగా ఉండి డీఆర్పీ, ఎమ్మార్పీలను ఎంపిక చేస్తారు. అనంతరం నల్లగొండ డైట్లో విడతల వారీగా టీచర్లకు శిక్షణ ఇస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో విద్యా శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఫ వేసవి సెలవులు సద్వినియోగమయ్యేలా విద్యా శాఖ ప్రణాళిక ఫ విద్యార్థులకు వివిధ అంశాల్లో తర్ఫీదు ఫ టీచర్లకు వృత్యంతర శిక్షణ ఫ ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం అన్ని కేటగిరీల టీచర్లకు శిక్షణ వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రణాళిక రూపొందించారు. వేసవి సెలవుల్లో అన్ని కేటగిరీల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తాం. విద్యార్థులకు కూడా సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నాం. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. – భిక్షపతి, డీఈఓ, నల్లగొండ -
‘భూ భారతి’తో రైతులకు ఎంతోమేలు
నకిరేకల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం.. తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేయనుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ భారతి చట్టంపై నకిరేకల్‌లోని సాయి కల్యాణ మండపంలో బుధవారం జరిగిన అవగాహన సదస్సుకుక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఆమె హాజరై మాట్లాడారు. ఈ చట్టం ద్వారా రైతులకు భూధార్ కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే సవరించే అవకాశంతోపాటు అప్పీల్ పద్ధతి ఉందని ఈ చట్టంలో ఉందన్నారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ అవుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల భూములకు రక్షణ కవచంలా ఉండేలా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. కొత్త చట్టంతో భూముల రికార్డుల నిర్వహణ బాధ్యత, భద్రత రెవెన్యూ శాఖ తీసుకుందన్నారు. తహసీల్దార్ జమీరుద్దీన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ యానాల అశోక్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్‌కుమార్, ఎంపీడీఓ చంద్రశేఖర్, నకిరేకల్ మున్సిపల్ కమిషనర్ బాలయ్య, మున్సిపల్ చైర్పర్సన్ చౌగోని రజితా శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ దూలం సోములు, పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వేంకటేశ్వరరావు, ఏఓ జానిమియా, ఎంఈఓ మేకల నాగయ్య, ఆర్ఐలు చిరంజీవి, బోళ్ల శ్యాంసుందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు నకిరేకంటి ఏసుపాదం, లింగాల వెంకన్న, కౌన్సిలర్లు గాజుల సుకన్య, కందాల భిక్షంరెడ్డి, పోతుల సునతీరవి, గర్శకోటి సైదులు, యాసారపు లక్ష్మీవెంకన్న, పన్నాల పావనిశ్రీనివాస్రెడ్డి, గడ్డం స్వామి, చౌగోని అఖిల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫ ఎమ్మెల్యే వీరేశంతో కలిసి నకిరేకల్, చిట్యాలలో సదస్సులకు హాజరు -
రేషన్ కార్డులేక.. బియ్యం అందక..
నల్లగొండ: కొత్త రేషన్‌కార్డులతోపాటు పిల్లల పేర్లు చేర్పించేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి నేటికీ కార్డులు మంజూరు కాలేదు. దీంతో ఆయా దరఖాస్తుదారులందరికీ ఇప్పట్లో సన్న బియ్యం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉంటే కొత్తగా పెళ్లైన వారు రేషన్ కార్డు కోసం అర్జీపెట్టుకోగా పాత కార్డులో వారి పేర్లు తొలించారు. దీంతో జిల్లాలో 69 వేల మందికిపైగా ఇటు పాత కార్డుపై బియ్యం అందక, కొత్త కార్డు రాక రేషన్ బియ్యానికి దూరం అవుతున్నారు.దరఖాస్తులు స్వీకరించి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022లో కొంత మందికి ఫుడ్ సెక్యూరిటీ కార్డులు అందించింది. ఎన్నికల ముందు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో జనం పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో కొత్తగా పెళ్లైన వారు కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో వారిపేర్లు పాత కార్డుల్లో తొలగించారు. ఎన్నికల తరువాత కార్డులు ఇస్తారని భావించారు కానీ ప్రభుత్వం మారవడంతో సాధ్యం కాలేదు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించింది. దీంతో జిల్లాలో 1,25,733 మంది రేషన్ కార్డులకోసం దరఖాస్తు చేసుకున్నారు. మరలా బీసీ కులగణన సమయంలో 27,523 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే సవరణల కోసం 37,229 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటిని పరిశీలించిన జిల్లా అధికారులు దాదాపు 69,473 దరఖాస్తులను అప్రూవల్ చేసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులకు పంపించారు. వీటిని ప్రభుత్వం ఇంకా ఓకే చేయలేదు. దీంతో దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. కొత్త రేషన్‌కార్డు రాలేదు నాకు పెళ్లి కాక ముందు అమ్మ నాన్నల రేషన్ కార్డులో నా పేరుంది. పెళ్లయింది పిల్లలు కూడా ఉన్నారు. ఆ కార్డులో వారి పేర్లు లేవు. ఆరు నెలల క్రితం కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకున్నా. కొత్తకార్డు రాలేదు. నాకు సన్న బియ్యం అందడం లేదు. – చంద్రశేఖర్, బొట్టుగూడ, నల్లగొండరేషన్ బియ్యం రావడం లేదురేషన్ కార్డులో నా కుమారుడి పేరు ఎక్కించేందుకు చాలా రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్న. ఇంతవరకు పేరు ఎక్కలేదు. పలుమార్లు అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా మా బాబుకు బియ్యం రావడం లేదు. – సంగెపు నవీన్, శాబ్దుల్లాపురం, కనగల్ మండలంప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే.. కొత్త రేషన్‌కార్డులకు చేసుకున్న దరఖాస్తులన్నింటినీ పరిశీలించి అర్హుల జాబితాను పౌరసరఫరాల శాఖకు పంపించాం. ప్రభుత్వ అనుమతి వచ్చిన తరువాత ఉన్నతాధికారుల ఆదేశానుసారం సన్న బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటాం. – హరీష్, సివిల్ సప్లయ్ డీఎం, నల్లగొండ -
పాఠ్య పుస్తకాలు వచ్చేస్తున్నాయ్!
50 శాతం వచ్చాక పంపిణీ 50 శాతం పాఠ్య పుస్తకాలు జిల్లాకు వచ్చిన తర్వాత వాటిని ఆయా మండలాల వారీగా పంపిణీ చేస్తాం. పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – భిక్షపతి, డీఈఓ నల్లగొండ : పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పాఠ్యపుస్తకాలు అందించే విధంగా విద్యా శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యార్థులకు యూనిఫామ్‌కు సంబంధించి క్లాత్ రావడంతో మహిళా సంఘాలకు అప్పగించి కుట్టిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు కూడా చేరుకుంటున్నాయి. జిల్లాలో మొత్తం 1483 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మొత్తం 5,89,970 పాఠ్యపుస్తకాలు అవసరం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 1,98,100 పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరాయి. అంటే 33.57 శాతం పుస్తకాలు వచ్చాయి. వాటిని జిల్లా కేంద్రంలోని బుక్ డిపోలో భధ్రపరుస్తున్నారు. ఇంకా 3,91,870 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. మీడియంల వారీగా.. పాఠ్యపుస్తకాలు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలో ముద్రించారు. ఇక, పుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై ప్రత్యేక నంబర్లను ముద్రిస్తున్నారు. ఆ నెంబర్ల ఆధారంగా వచ్చిన పుస్తకాలను బుక్‌డిపోలో నమోదు చేస్తున్నారు. ఏ నంబర్ పుస్తకాలు ఏ మండలాలకు వెళ్తున్నాయో అని నమోదు చేస్తారు. ఇలా పుస్తకాలపైనే నంబర్లు ముద్రించడం వల్ల వాటిని బయట విక్రయించేందుకు అవకాశం ఉండదు. ఫ జిల్లాకు చేరిన 1.85 లక్షల పుస్తకాలు ఫ ప్రత్యేక నంబర్‌తో ముద్రణ ఫ పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు అందించేలా ప్రణాళిక -
బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలి
నల్లగొండ టౌన్: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. అప్పుడే 2028లో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. సోమవారం నల్లగొండలోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ 11 సార్లు సంస్థాగత ఎన్నికలను నిర్వహిస్తే 11 సార్లు కేసీఆర్ అధ్యక్షుడయ్యారని జనాభాలో సగం కూడా లేని వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి 11 సార్లు ఎలా అధ్యక్షుడవుతాడని ప్రశ్నించారు. ఈసారి అయినా బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు అడిగిన బీజేపీ ఎన్నికల అనంతరం ఆ పార్టీకి ఫ్లోర్ లీడర్లుగా బీసీల ఎందుకు అవకాశం కల్పించలేదన్నారు. బీజేపీ కూడా అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తేనే రాష్ట్రంలో మనుగడ ఉంటుందన్నారు. రెండు రోజుల్లో హైదరాబాద్‌లో మేధావులు, కుల సంఘాల నాయకులతో సెమినార్ నిర్వహించి ఈ రెండు పార్టీల కుల రంగును బయట పెడతామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ, నల్ల సోమమల్లయ్య, నకిరెకంటి కాశయ్యగౌడ్, చిక్కుళ్ల రాములు, చొల్లేటి రమేష్, బూడిద మల్లికార్జున్, జిల్లా ఆదినారాయణ, గంజి భిక్షమయ్య, గుండా కోటప్ప, అంజయ్య, లింగస్వామి, నల్ల మధు, సైదులుగౌడ్ పాల్గొన్నారు. ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ -
నేడు మిర్యాలగూడ మంత్రి ఉత్తమ్ రాక
ఫ ఇరిగేషన్, పౌరసరఫరాలపై సమీక్ష మిర్యాలగూడ : రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మంగళవారం మిర్యాలగూడకు రానున్నారు. మధ్యాహ్నం 2.30గంటలకు స్థానిక టీఎన్ఆర్ గార్డెన్లో ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎడమకాల్వ పరిధిలోని ఎత్తిపోతల పథకాల అభివృద్ధి పనులు, సాగర్ ప్రాజెక్టులోని నీటి నిల్వ, పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ షాపుల్లో అందించే సన్నబియ్యం పంపిణీ, గోదాంలో బియ్యం నిల్వ, కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమీక్షకు మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ, నకిరేకల్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, అధికారులు హాజరుకానున్నారు. బాధితులకు సత్వర న్యాయం అందాలినల్లగొండ : బాధితులకు సత్వర న్యాయం అందేలా సిబ్బంది పని చేయాలని ఎస్పీ శరత్చంద్ర పవర్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో 30 మంది బాధితుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించి మాట్లాడారు. బాధితుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పోలీస్‌స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించాలని సిబ్బందికి సూచించారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగింగచే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. కొనసాగుతున్న ‘ఓపెన్’ పరీక్షలునల్లగొండ : ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సోమవారం కొనసాగాయి. ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 1902 మందికి 1623 మంది హాజరయ్యారు. 279 మంది గైర్హాజరయ్యారు. ఓపెన్ టెన్త్ పరీక్షకు 1464 మందికి 1235 మంది హాజరు కాగా 229 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ఐసీహెచ్ పరీక్షకు 8 మందికి గాను ఆరుగురు పరీక్ష రాయగా, ఇద్దరు పరీక్షకు హాజరు కాలేదు. పరీక్ష కేంద్రాలను డీఈఓ, ఫ్లయింగ్ స్క్యాడ్ బృందాలు తనిఖీ చేశాయి. దరఖాస్తులకు నేడు ఆఖరు నల్లగొండ : ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ పథకం రెండో దశ దరఖాస్తులకు మంగళవారం (నేడు) ఒక్క రోజే గడువు ఉందని జిల్లా పరిశ్రమల శాఖ జేడీ వి.కోటేశ్వర్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి ఉండొద్దని.. టెన్త్/ఇంటర్/ఐటీఐ/ పాలిటెక్నిక్ డిప్లొమా/ డిగ్రీ పూర్తి చేసి వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి అర్హత గల వారు pminterns hip.mca.gov.in పోర్టల్‌లో లాగిన్ అయి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సర్టిఫికెట్లు అందజేతరామగిరి(నల్లగొండ): వృత్తి కోర్సులు నేర్చుకోవడం వల్ల జీవన నైపుణ్యం పెంపొందుతుందని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీనివాసరాజు అన్నారు. వృక్ష శాస్త విభాగం ఆధ్వర్యంలో టెర్రస్ గార్డెనింగ్ (మిద్దె తోట) పై 30 రోజుల వ్యవధి గల సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సోమవారం కళాశాలలో సర్టిఫికెట్లు అందజేసి మాట్లాడారు. క్యార్యక్రమంలో వృక్ష శాస్తం ఇన్చార్జ్ డాక్టర్ టి. అరవింద, వృక్షశాస్త అధ్యాపకులు ఎ.సంధ్య, డాక్టర్ జి.సరిత, డాక్టర్ పి.సునీత, అతుఫా పాల్గొన్నారు. -
మానవాళికి సోషలిజమే ప్రత్యామ్నాయం
ఫ మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి మిర్యాలగూడ : మానవాళికి సోషలిజమే ప్రత్యామ్నాయమని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడలో నిర్వహించిన సీపీఎం జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎర్రజెండాకు ఆదరణ పెరుగుతోందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎజెండా లేకుండా ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం మత రాజకీయం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతోందన్నారు. ఎర్రజెండా ఒక్కటే నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతుందన్నారు. మేడే రోజున మిర్యాలగూడలో జరిగే మహా ప్రదర్శనకు కార్మికులు, పేదలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు నూకల జగదీశ్ఛంద్ర, గాదె పద్మ, ముడావత్ రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, శఽశిధర్రెడ్డి, వినోద్‌నాయక్, రొండి శ్రీనివాస్, రెమడాల పరుశురాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, చౌగాని సీతారాములు, అయూబ్ తదితరులు పాల్గొన్నారు. -
భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం
చందంపేట : ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గతంలో ధరణిలో గత ప్రభుత్వం చాలా తప్పిదాలు చేసిందని, రైతులను ఇబ్బందులకు గురిచేసే పనులు చేసిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ రైతులకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో భూ భారతిచట్టం–2025ను తీసుకొచ్చిందన్నారు. చందంపేట మండల కేంద్రంలో సోమవారం భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి.. దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యంతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ద్వారా తహసీల్దార్ స్థాయిలోనే ఎక్కువగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మే 1 నుంచి అన్ని జిలాల్లో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్తుగా ఎంపిక చేస్తామన్నారు. చందంపేటను కూడా పైలెట్ ప్రాజెక్టుగా చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం 6వేల మంది లైసెన్స్ సర్వేయర్లను నియమించనున్నట్లు తెలిపారు. ఆధార్ కార్డులాగే రైతులకు భూదార్ కార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. గతంలో భూమి అమ్మినా.. కొన్నా.. మ్యాపింగ్ ఉండేది కాదని, ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాపింగ్ తప్పనిసరి చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ వెనుకబడిన ఈ ప్రాంతంలో భూ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, సాగర్ ముంపునకు గురై ఇక్కడికి వచ్చిన రైతులే ఎక్కువ మంది ఉన్నారని, డీఫారెస్ట్ పట్టాలు కలిగి ఉన్న రైతుల వివరాలు ఆన్లైన్ నుంచి తొలగించబడ్డాయని అన్నారు. చందంపేట మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని భూ సమస్యలు పరిష్కరించాలని మంత్రిని కోరారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ భూ భారతి చట్టం ద్వారా రైతుల సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా నిజమైన రైతులకే లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కాగా.. రైతులు ప్రస్తావించిన సమస్యలపై ఆర్డీఓ నుంచి సరైన సమాధానం రాకపోవడంపై మంత్రి.. ఆర్డీవోను మందలించారు. అనంతరం నేరెడుగొమ్ము మండల కేంద్రంలో రైతులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్డీవో రమణారెడ్డిలు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, ఏఎస్పీ మౌనిక, ఆర్డీఓ రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జమున మాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొండ్ర శ్రీశైలంయాదవ్, కృష్ణయ్య, బద్యానాయక్, సర్వయ్య, గోవింద్‌యాదవ్, సురేష్‌గౌడ్ పాల్గొన్నారు. ఫ ఆధార్ కార్డు మాదిరిగానే.. భూదార్ కార్డు ఫ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఫ చందంపేటలో భూ భారతి చట్టంపై అవగాహన -
ఇసుక అక్రమ రవాణా కానివ్వం
మిర్యాలగూడ : ఇసుక అక్రమంగా రవాణా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ‘ఆగని ఇసుక దందా’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. ఇసుక అక్రమ రవాణాపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా గనులు, భూగర్భజలశాఖ సహాయ సంచాలకుడు జాకోబ్‌ను సోమవారం ఉదయం ఆదేశించారు. ఆయన వెంటనే విచారణ జరిపి నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు. అధికారి సమర్పించిన నివేదిక ప్రకారం.. మూసీ, పాలేరు వాగుల నుంచి ఇసుక అక్రమ రవాణా కావడం లేదని, కేవలం రావులపెంట, బొమ్మకల్ నుంచి అనుమతి ఉన్న వాహనాలకు మాత్రమే ఇసుకను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. వంగమర్తి ఇసుక రీచ్ వద్ద అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేశామని.. అక్కడి నుంచి వచ్చే ప్రతి ఇసుక వాహనాన్ని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. వంగమర్తి ఇసుక రీచ్ నుంచి కేవలం అనుమతించిన వాహనాలు వెళ్తున్నాయని, ఇప్పటివరకు ఎలాంటి ఓవర్ లోడ్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. వైటీపీఎస్, కేఎన్ఆర్ సంస్థ పనులకు అనుమతులు ఉన్న ఇసుక మాత్రమే వెళ్తుందని తెలిపారు. సవరించిన ధరల ప్రకారం ట్రాక్టర్ ఇసుక రూ.4800కు అందుబాటులో ఉంచామని వివరించారు. గడిచిన రెండు రోజుల్లో ఇసుక వాహనం ద్వారా సుమారు 150 ట్రిప్పులను డెలివరీ చేశామని.. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న మరో 300 ట్రిప్పులను రెండు రోజుల్లో డెలివరీ చేయడం చేస్తామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకుగాను రెవెన్యూ, పోలీస్, మైనింగ్ తదితర శాఖల ద్వారా పూర్తి స్థాయిలో తనిఖీకి సిబ్బంది ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఒకవేళా ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.50 వేల వరకు జరిమానా విధించడంతోపాటు కోర్టుకు అప్పగిస్తామని హెచ్చరించారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
రేషన్ కార్డులేక.. బియ్యం అందక..
కొత్త వారికి మరింత సమయం! అయితే జిల్లా అధికారులు అప్రూవల్ చేసిన రేషన్‌కార్డు దరఖాస్తులపై ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే జిల్లాలో ఆ కార్డుదారులకు సన్న బియ్యం ఇచ్చే అవకాశం ఉండనుంది. అయితే జిల్లాలో ఉన్న డేటా అంతా ఆన్లైన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మరో రెండు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటిదాకా అధికారులు అప్రూవల్ చేసిన జిల్లాలోని దరఖాస్తుదారులకు సన్న బియ్యం అందేది కష్టమని తెలుస్తోంది. నల్లగొండ: కొత్త రేషన్‌కార్డులతోపాటు పిల్లల పేర్లు చేర్పించేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి నేటికీ కార్డులు మంజూరు కాలేదు. దీంతో ఆయా దరఖాస్తుదారులందరికీ ఇప్పట్లో సన్న బియ్యం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉంటే కొత్తగా పైళ్లెన వారు రేషన్ కార్డు కోసం అర్జీపెట్టుకోగా పాత కార్డులో వారి పేర్లు తొలించారు. దీంతో జిల్లాలో 69 వేల మందికిపైగా ఇటు పాత కార్డుపై బియ్యం అందక, కొత్త కార్డు రాక రేషన్ బియ్యానికి దూరం అవుతున్నారు. దరఖాస్తులు స్వీకరించి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022లో కొంత మందికి ఫుడ్ సెక్యూరిటీ కార్డులు అందించింది. ఎన్నికల ముందు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీంతో జనం పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో కొత్తగా పైళ్లెన వారు కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో వారిపేర్లు పాత కార్డుల్లో తొలగించారు. ఎన్నికల తరువాత కార్డులు ఇస్తారని భావించారు కానీ ప్రభుత్వం మారవడంతో సాధ్యం కాలేదు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించింది. దీంతో జిల్లాలో 1,25,733 మంది రేషన్ కార్డులకోసం దరఖాస్తు చేసుకున్నారు. మరలా బీసీ కులగణన సమయంలో 27,523 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే సవరణల కోసం 37,229 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటిని పరిశీలించిన జిల్లా అధికారులు దాదాపు 69,473 దరఖాస్తులను అప్రూవల్ చేసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులకు పంపించారు. వీటిని ప్రభుత్వం ఇంకా ఓకే చేయలేదు. దీంతో దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పడం లేదు. ఫ పాతకార్డుల్లోనూ పేర్లు తొలగింపు ఫ మార్పులు, చేర్పుల అర్జీలు పెండింగ్‌లోనే.. ఫ నిరీక్షణలో 69,473 మంది దరఖాస్తుదారులు -
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి
మండుతున్న ఎండలు ఫ 41 డిగ్రీలకు చేరిన సగటు ఉష్ణోగ్రత ఫ బయటికి వెళ్లేందుకు జంకుతున్న జనం నల్లగొండ టౌన్ : భానుడు తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాతావరణంలో గాలితో తేమశాతం పడిపోతుండడంతో ఫ్యాన్లు, ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని మాడుగులపల్లిలో సోమవారం జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 41 డిగ్రీలు నమోదైంది. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. ఉదయం 11 గంటలకే ఆయా పట్టణాల్లోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారి కర్వ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. పాదాచారులు, దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు ఎండల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్ చివరి వారంలోనే ఎండలు మండుతుంటే మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు. ఏసీలు, కూలర్లకు పెరిగిన గిరాకీ.. ఎండల మండుతుండడంతో ఏసీలు, కూలర్లకు గిరాకీ పెరిగింది. పట్టణాలు, పల్లెలు ఆనే తేడా లేకుండా ప్రజలు పెద్ద ఎత్తున కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో కూలర్ ధర కంపెనీని బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంది. ఏసీలు కూడా రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ధర ఉన్నాయి. -
మరోసారి ‘ఇందిరమ్మ’ సర్వే
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం రెండో విడత సర్వే ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల మొదటి విడత సర్వే పూర్తి చేసిన అధికారులు (ఎల్–1, ఎల్–2, ఎల్–3) కేటగిరీలుగా విభజించారు. ఎల్–1 కేటగిరీ వారికి మొదట ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఎల్–1 కేటగిరీలో ఎక్కువ మంది ఉండడంతో వారిలో నిజమైన అర్హులను గుర్తించేందుకు రెండో విడత సర్వే చేపడుతున్నారు. మండల స్థాయి గెజిటెడ్ అధికారులతో ఈ సర్వే సాగనుంది. ఆయా అధికారులంతా తయారు చేసిన తుది జాబితాను కలెక్టర్‌కు పంపుతారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అనుమతితో మే మొదటి వారంలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. ఎన్నికల హామీ అమలులో భాగంగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలతో ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటిచింది. ఇంటి స్థలం లేని వారికి రెండో విడతలో స్థలంతో పాటు ఇంటిని మంజూరు చేస్తామని తెలిపింది. ప్రతి నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. హామీ మేరకు ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులను స్వీకరించి మొదటి విడత సర్వే పూర్తి చేసింది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న గ్రామాల్లో పనులు ప్రారంభం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో భాగంగా మొదట పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలో ప్రతి మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి జనవరి 26న ఎల్–1 కేటగిరీ వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాల్లో 1904 ఇందిరమ్మ ఇళ్లు మంజూరుకాగా.. 400 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయించగా.. వాటిలో 200 ఇళ్లను ఆయా మండలాల్లోని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాలకు కేటాయించారు. ఇప్పుడు మిగిలిన 3300 ఇళ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు రెండవ విడత సర్వే చేపడుతున్నారు. కేటగిరీలు ఇలా.. ఫ ఎల్–1 పక్కా ఇల్లు లేకపోవడం. ఇంటి స్థలం ఉండి రేకులు, పెంకుటిల్లు, గుడిసెలో ఉన్నవారు. వీరికి మొదట ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఫ ఎల్–2 ఇల్లు, ఇంటి స్థలం రెండూ లేకపోవడం. అద్దె ఇంట్లో నివాసం ఉండడం. వీరికి ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేయనున్నారు. ఫ ఎల్3–లో ఆర్సీసీ స్లాబ్ ఇల్లు ఉండి. ఏడెకరాలు కుష్కి, మూడున్నర ఎకరాల తరి భూమి, కారు ఉన్న వారు. నిధుల మంజూరు ఇలా.. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి మొదటి విడతగా పంచాయతీ కార్యదర్శులు ముగ్గు పోస్తారు. ఆ తర్వాత హౌజింగ్ ఏఈ సిఫారసు మేరకు బేస్మెంట్ కట్టిన తర్వాత రూ.లక్ష మంజూరు చేస్తారు. ఆ తర్వాత గోడలు రూప్ లెవెల్లో పూర్తయిన తర్వాత మరో రూ.లక్ష, స్లాబ్ వేసే సమయంలో రూ.2 లక్షలు, ఇల్లంతా పూర్తయిన తర్వాత రూ.లక్షను మంజూరు చేయనున్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం రూ.5 లక్షలను 4 విడతల్లో మంజూరు చేయనున్నారు. ఫ 22వ తేదీ నుంచి మండల స్థాయి గెజిటెడ్ అధికారులతో నిర్వహణ ఫ నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్ల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ఫ మే మొదటి వారంలో ఇన్చార్జి మంత్రి అనుమతితో జాబితా ఆమోదం ఫ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న గ్రామాలకు 1,904 ఇళ్ల కేటాయింపు -
పంటల రుణ పరిమితి పెంపు
ఒక్కో పంటకు ఎకరాకు గతం కంటే రూ.4 వేలకు పైగానే.. నల్లగొండ అగ్రికల్చర్: రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ సిఫారసుల మేరకు రాష్ట్ర సహకార బ్యాంకు పంటల రుణ పరిమితిని పెంచింది. పంటల వారీగా సాగుకు అయ్యే ఖర్చులు తదితర వివరాలను అంచనా వేసి అన్నిరకాల పంటలకు 2025–26 వానాకాలం, యాసంగి సీజన్లలో పెంచిన రుణ పరిమితిని అందించనున్నారు. దాదాపు 122 రకాల పంటలతోపాటు ఇతర పెంపకం యూనిట్లకు పెంచిన రుణ పరిమితిని అమలు చేయనున్నారు. ప్రతి పంటపై పెరుగుదల గతంలో కంటే ఈ సారి రుణ పరిమితి ప్రతి పంటకు రూ.4వేలకు పైగానే పెరిగింది. ప్రధానంగా వరికి గతంలో ఎకరాకు రూ.42వేలు ఉండగా ప్రస్తుతం రూ.44వేల నుంచి 46 వేలకు పెంచారు. పత్తికి కూడా గతంలో రూ.42వేలు ఉండగా ఇప్పుడు రూ.46 వేల నుంచి రూ.48వేలకు పెరిగింది. దీంతో పాటు పందుల యూనిట్లకు రూ.26 వేల నుంచి రూ.66వేలు, ఒక్కో పాడిగేదెకు రూ.33వేల నుంచి రూ.35వేలు పెంచారు. ఇంకా కోళ్లు, మేకలు, గొర్రెలు, తేనెటీగలు, చేపల పెంకానికి గతం కంటే రూ.4వేలు పెరగగా పూల పెంపకం యూనిట్‌కు మాత్రం రూ.50వేల నుంచి రూ.62 వరకు ఇవ్వనున్నారు. ఫ వరికి రూ.46వేలు..పత్తికి రూ.48 వేలు ఫ అత్యధికంగా అరటికి రూ.లక్ష వరకు.. పంట రుణం (ఎకరానికి రూ.వేలల్లో)వరి 44- 46 శ్రీవరి 36-38జొన్న 19-21సజ్జ 16-18మొక్కజొన్న 34-36పత్తి 46-48కంది 23-25రాగులు 15-17మినుము 20-23పెసర 20-22వేరుశనగ 30-32 నువ్వులు 20-22ఆవాలు 14-15చెరుకు 80-82ఆయిల్‌పామ్ 46-48అరటి 98–లక్ష నిమ్మ 45-47మామిడి 45-47డ్రాగన్ ప్రూట్ 78-80 -
రేపు దేవరకొండలో వాహనాల వేలం
దేవరకొండ : దేవరకొండ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 22న వేలం వేయనున్నట్లు దేవరకొండ ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ద్విచక్ర వాహనాలకు రూ.10 వేలు, ఫోర్ వీలర్‌కు రూ.30 వేలు డిపాజిట్ చేసి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. వేలంలో ఎలాంటి వాహనం కొనని పక్షంలో డిపాజిట్ తిరిగి ఇస్తామని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే వారు 22వ తేదీ ఉదయం 10గంటల లోగా తమ పేరును నమోదు చేసుకోవాలని సీఐ సూచించారు. ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభంనల్లగొండ : ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. పరీక్షలకు జిల్లాలో 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదివారం జరిగిన ఇంటర్ తెలుగు పరీక్షకు 1,813 మందికిగాను 1545 మంది హాజరయ్యారు. 268 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ఇంటర్ అరబిక్ పరీక్షకు 42 మందికి 33 మంది హాజరయ్యారు. 9 మంది గైర్హాజరయ్యారు. టెన్త్ తెలుగు పరీక్షకు జిల్లాలో 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,310 మందికి 1,137 మంది హాజరయ్యారు. 173 మంది పరీక్ష రాయలేదు. పరీక్ష కేంద్రాలను డీఈఓ భిక్షపతి, ప్లయింగ్ స్క్యాడ్ బృందాలు తనిఖీ చేశాయి. సాగర్‌లో పర్యాటకుల సందడినాగార్జునసాగర్ : ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్‌లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు రోజు కావడంతో హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకుల వచ్చారు. బుద్ధవనాన్ని సందర్శించారు. లాంచీలో నాగార్జున కొండకు వెళ్లి బుద్ధుడికి సంబంధించిన చైత్యాలు, బుద్ధుని విగ్రహాలు, అలనాటి నదీలోయ నాగరికత పనిముట్లను, మ్యూజియాన్ని సందర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలిచిట్యాల: రాష్ట్రంలో ఖాళీ ఉన్న ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ డిమాండ్ చేశారు. చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన ఆ సంఘం మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సోమవారం ఇండియాకు అమెరికా ఉపాధ్యక్షుడు రానుండడంతో శ్రీగో బ్యాక్శ్రీ నినాదంతో నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మహాసభలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జిట్ట రమేష్, మండల అధ్యక్షుడు పంది నరేష్, మండల కార్యదర్శి వడ్డెగాని మహేష్, మెట్టు పరమేష్, అవిశెట్టి కిరణ్, దేశబోయిన నర్సింహ, కూనురు గణేశ్, బాతరాజు గోపాల్ పాల్గొన్నారు. -
ఆగని ఇసుక దందా !
మూసీ, పాలేరు వాగుల నుంచి అక్రమంగా రవాణా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేసేందుకు వాడపల్లి, సల్కునూరు, వేములపల్లి, యాద్గార్పల్లి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. అన్ని చెక్‌పోస్టుల్లో కట్టుదిట్టమైన నిఘా ఉంచాం. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. నాలుగు నెలల్లో 28 వాహనాలను పట్టుకుని సీజ్ చేశాం. ప్రజలు కూడా సహకరించాలి. – పీఎన్డీ.ప్రసాద్, మిర్యాలగూడ రూరల్ సీఐ మిర్యాలగూడ: మిర్యాలగూడ ప్రాంతంలో ఇసుక దందాకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. కొందరు వ్యాపారులు నిబంధలనకు విరుద్ధంగా ఈ వ్యాపారం సాగిస్తూ రూ.లక్షలు అర్జిస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలోని మూసీ, పాలేరు వాగుల నుంచి ఇసుక అక్రమంగా మిర్యాలగూడ ప్రాంతానికి తరలివస్తోంది. ఈ దందాకు అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండడంతో వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. వంగమర్తి టు మిర్యాలగూడ.. జిల్లాలోని శాలిగౌరారం మండలం వంగమర్తి నుంచి మిర్యాలగూడ నియోజకవర్గానికి ఇసుకను రోజూ పదుల సంఖ్యలో భారీ టిప్పర్లతో తరలిస్తూ దందా సాగిస్తున్నారు. ఇటీవలే ఇసుక లోడ్లతో వస్తున్న టిప్పర్‌ను మిర్యాలగూడ లారీ అసోసియేషన్ సభ్యులు పట్టుకుని ఎంవీఐకు సైతం అప్పగించారు. దీంతో అధిక లోడ్ ఉండడంతో మిర్యాలగూడ ఎంవీఐ వీరస్వామి కేసు నమోదు చేశారు. అయినా వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో థర్మల్ ప్లాంట్‌లో నిర్మాణాలు, బీబీనగర్ – నడికుడి రైల్వే రెండవ వరుస నిర్మాణ పనులు, ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నారు. ఇదే అదనుగా అభివృద్ధి పనుల పేరిట ఇసుక దందా కొనసాగుతోంది. బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు.. మిర్యాలగూడ నియోజకవర్గంలోని రావులపెంట, తక్కెళ్లపాడు ఇసుక రీచ్‌లలో రూ.3,100కే నాలుగు టన్నుల ఇసుక లభించేంది. అయితే గతంలో వర్షాలు కురిసిన సమయంలో ఇక్కడ ఇసుక బుకింగ్‌కు అనుమతించలేదు. సైట్ కూడా పనిచేయకపోవడంతో స్థానికులకు ఇసుక అందని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొందరు వ్యాపారులు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంగమర్తి, పాలేరు ప్రాంతాల నుంచి ఇసుకను టిప్పర్ల ద్వారా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతూ సొమ్ముచేసుకుంటున్నారని వినియోగదారులు అంటున్నారు. దీంతో నిరుపేద, మధ్య తరగతి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలకు ఇసుకను బ్లాక్‌లో కొనుగోలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ ఇసుక రూ.4వేల నుంచి రూ.5వేల వరకు ధరలు పెంచి విక్రయాలు సాగిస్తున్నారు. ఇప్పటికై నా మైనింగ్ శాఖ అధికారులు స్పందించి ఆన్లైన్ ఇసుక సైట్ తెరిపించి ఇసుక ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సరఫరా చేయాలని మిర్యాలగూడ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పట్టుబడుతున్న ఇసుక ట్రాక్టర్లు.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న పలు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో మాడ్గులపల్లి, వేములపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో కల్వలపాలెం, భీమనపల్లి పాలేరువాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 27 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ బాపట్ల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక లారీని దామరచర్ల మండలం వాడపల్లి పోలీసులు పట్టుకు కేసు నమోదు చేశారు. ఫ అభివృద్ధి పనుల పేరుతో వంగమర్తి నుంచి టిప్పర్ల ద్వారా తరలింపు ఫ మిర్యాలగూడలో జోరుగా విక్రయాలు ఫ అధిక ధరలకు కొంటున్న పేద, మధ్యతరగతి ప్రజలు -
దోపిడీ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం
నల్లగొండ టౌన్ : దోపిడీ రహిత సమాజ నిర్మాణమే సీపీఎం లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండలోని 3వ వార్డులో రుద్రాక్షి ఎర్రయ్య, లింగమ్మ స్మారక స్థూపాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వివిధ కారణాలతో పార్టీని వీడిన వారంతా తిరిగి సీపీఎంలోకి రావాలని పిలుపునిచ్చారు. పూటకో పార్టీ మారే భూస్వాములకు, కార్పొరేట్లకు వంత పాడుతున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లను ప్రజలు తిరస్కరించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఎర్రయ్య చూపిన మార్గంలో కూలి, భూమి పోరాటాల్లో పాల్గొనడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో దండంపల్లి సత్తయ్య, సయ్యద్ హశం, పాలడుగు నాగార్జున, ఎండీ.సలీం, వెంకట రమణారెడ్డి, సైదులు, మన్నె భిక్షం, పద్మ, అద్దంకి నరసింహ, గణేష్, అశోక్‌రెడ్డి, నరేష్, రవీందర్, లింగయ్య, రుద్రాక్షి రామచంద్రయ్య, యాదయ్య, దుర్గయ్య, జానయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు. -
హైవేపై వాహనాల రద్దీ
కేతేపల్లి : హైదరాబాద్–విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం వాహనాల రద్దీ నెలకొంది. శుభకార్యాలు ఉండటంతో హైదరాబాద్ జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల ప్రజానీకం వాహనాల్లో రాకపోకలు సాగించారు. దీంతో కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం హైదరాబాద్ వైపు విపరీతమైన రద్దీ నెలకొంది. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టోల్‌ప్లాజా సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఎన్హెచ్ఏఐ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహించారు. -
అదనపు బ్లాక్ నిర్మాణ స్థలం పరిశీలన
నల్లగొండ : నల్లగొండ కలెక్టరేట్లో నూతనంగా నిర్మి ంచనున్న అదనపు బ్లాక్ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం పరిశీలించారు. అదనపు బ్లాక్‌కు నిర్మాణ పనులకు ఈ నెల 23న మంత్రి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. మంత్రి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలినల్లగొండ టౌన్ : కార్మిక వ్యతిరేక లేబర్‌కోడ్స్ రద్దు చేయాలని, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలో నిర్వహించిన ఆల్ ట్రేడ్ యూనియన్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేందుకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేయనున్నట్లు, ఆ సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు అంబటి సోమన్న, బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలువేరు ప్రభాకర్, చినపాక లక్ష్మీనారాయణ, నూనె రామస్వామి, గుర్రం వెంకటరెడ్డి, వెంకన్న, నరసింహ, తదితరులు పాల్గొన్నారు. డీఎస్ఓ వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ నల్లగొండ : నల్లగొండ డీఎస్‌ఓగా టి.వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్‌లో ఏఎస్ఓగా పని చేస్తున్న ఆయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. శనివారం ఆయన ఇప్పటి వరకు ఇన్చార్జి డీఎస్‌ఓగా పని చేస్తున్న హరీష్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్పొరేట్ కళాశాలల నుంచి దరఖాస్తులునల్లగొండ : పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడంలో భాగంగా రిజిస్ట్రేషన్ కోసం కార్పొరేట్ జూనియర్ కాలేజీలు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ అభివృద్ధి శాఖ ఇన్చార్జి ప్రేమ్‌కరణ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధిక ఉత్తీర్ణత శాతం, ఐదు సంవత్సరాల అకడమిక్ ప్రొపైల్, రెసిడెన్షియల్ వసతి, ఉన్నత ప్రమాణాలు కలిగిన కళాశాలలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హార్డ్ కాపీని ఈ నెల 30వ తేదీలోగా కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఎంపికై న కళాశాలల్లో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు రూ.35 వేలు, ప్యాకెట్ మనీ కింద రూ.3 వేలు ఇస్తామని తెలిపారు. -
పని ఏదైనా.. చేసేది వారే!
ఈ ఫొటోలోని ఇద్దరు మిర్యాలగూడ పట్టణంలోని టాకా రోడ్డులో హెయిర్ స్టూడియోలో పని చేస్తున్న ఢిల్లీకి చెందిన మున్నా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఖాీసీం. రెండేళ్లుగా ఇక్కడే పని చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఒక దగ్గరే పని చేస్తుండటంతో స్నేహితులుగా మారారు. ఇద్దరు ఒకే దగ్గర ఉంటూ షాపునకు వెళ్లి వస్తుంటారు. ఒక్కొక్కరికి నెలకు రూ.17 వేల జీతం వస్తుందని చెప్పారు. అన్ని రంగాల్లోనూ ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల వలస కూలీలు ఎక్కడ చూసినా వారే.. హోటళ్ల నుంచి వరినాట్ల వరకు పనులు చక్కబెడుతున్నారు రైస్ మిల్లులు.. మార్కెట్లలో హమాలీలుగా వారే అధికం తోటలు, డెయిరీఫామ్‌లు, సెలూన్లలో సైతం.. కష్టం ఎక్కువ.. కూలి తక్కువ కావడంతో ఈ రాష్ట్రాల కూలీలతో పనులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసినా ఇక్కడి కూలీల కంటే.. ఇతర రాష్ట్రాల వారే ఎక్కువ మంది కనిపిస్తారు. ఫబిహార్, బెంగాల్, ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన వారు ఇటుక బట్టీలు, మార్కెట్లు, తోటలు, రైస్ మిల్లులు, డెయిరీ ఫామ్, భవన నిర్మాణం, సెంట్రింగ్, పీఓపీ, వ్యవసాయం, పౌల్ట్రీఫాం, సెక్యూరిటీ గార్డ్ పనుల్లో ఉన్నారు. ఫ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు మగ్గం వర్క్‌లు, పాల్ సీలింగ్, పెయింటింగ్, హెయిర్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, కరెంట్ ఫిట్టింగ్, సోఫాల తయారీ, పెళ్లి మండపాల తయారీలో పని చేస్తున్నారు. ఫ రాజస్థాన్‌కు చెందిన వారు టీస్టాళ్లు, వస్త్ర వ్యాపారం, హోటళ్లు, ఐస్‌క్రీమ్, ఎలక్టిక్ షాపులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏ రంగంలో చూసినా ఇతర రాష్ట్రాల వారే కీలకంగా మారారు. పనివాడిగా, కూలీగా, మేసీ్త్రలుగా, యజమానులుగా, వ్యాపారులుగా మారి వివిధ రంగాల్లో పనులను చక్కబెడుతున్నారు. వారి ప్రాంతాల్లో పనుల్లేక, వలస వచ్చిన వారు ఇక్కడ అన్ని రంగాల్లోనూ పైచేయి సాధిస్తున్నారు. తక్కువ కూలితో, ఎక్కువ సమయం పనిచేస్తున్న వీరిని ఇక్కడి ప్రజలు సైతం అక్కున చేర్చుకుంటున్నారు. వరినాట్లు వేయడానికి కూడా బిహార్ నుంచి కూలీలను తీసుకొస్తున్నారంటే వీరి ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. వలస కూలీలు ఇక్కడ భాషను నేర్చుకొని స్థానికులతో మమైకమవుతున్నారు. ఉమ్మడి నల్లగొండఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,42,686 మంది కూలీలు ఉండగా.. అందులో దాదాపు 32 వేల మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఫ నల్లగొండ జిల్లాలో 46,030 మంది కూలీలు ఉండగా, అందులో దాదాపు 10 వేల మంది ఇతర రాష్ట్రాల వారే. ఫ సూర్యాపేట జిల్లాలో 79,329 మంది కూలీలకు.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 18 వేల మంది ఉన్నట్లు అంచనా. ఫ యాదాద్రి భువనగిరి జిల్లాలో 17,327 మంది కూలీలు ఉండగా, అందులో ఇతర రాష్ట్రాల వారు దాదాపు నాలుగు వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది.భువనగిరి– చిట్యాల రోడ్డులో వలిగొండ సమీపంలో చెరుకు రసం విక్రయిస్తున్న ఇతను అనిల్ చౌహాన్. ఈయన రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇదే వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 32 వేల మంది -
పరిశోధనకు మూలం ప్రశ్నావళి
నల్లగొండ టూటౌన్: పరిశోధనకు మూలం ప్రశ్నావళి తయారీ అని ఐపీఈ ప్రొఫెసర్ వై. రామకృష్ణ అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శని వారం నిర్వహించిన ‘అకడమిక్ రైటింగ్ ఫర్ పీహెచ్డీ స్కాలర్స్ అండ్ యంగ్ టీచర్స్’ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని డేటా కలెక్షన్, ఎనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అనే అంశాలపై విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీహెచ్డీ చేసే విద్యార్థులు డేటా కలెక్షన్‌కు వెళ్లే ముందు ప్రశ్నావళి తయారు చేయడంలో ఉపయోగించే స్కేల్స్ తో పాటు వాటిని ఎనాలసిస్ చేయడానికి ఉపయోగించే ఎక్సెల్ షీట్‌పై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓయూ గ్రంథాలయ అసోసియేట్ ప్రొఫెసర్ చక్రవర్తి, ఎంజీయూ ప్రొఫెసర్ అంజిరెడ్డి, ఆకుల రవి, శ్రీదేవి, రవిచంద్ర, పీహెచ్డీ స్కాలర్స్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరీశుడికి వెండి కలశాలు బహూకరణ యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి శనివారం హైదరాబాద్‌కు చెందిన భక్తులు వెండి కలశాలు, వెండి పాత్రలు బహూకరించారు. హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌కు చెందిన బిరదవోలు వరశ్రీ కుటుంబ సభ్యులు సుమారు 7కిలోల వెండితో తయారు చేసిన 11 వెండి కలశాలు, ఒక ఏక హారతి, ఒక ధూప హారతి పాత్రలను ఈఓ భాస్కర్‌రావుకు అందజేశారు. అదేవిధంగా హైదరాబాద్‌కే చెందిన డాక్టర్ బీవీఎస్ రాంప్రసాద్ కిలో వెండితో తయారుచేసిన 2 వెండి కలశాలను ఈఓకు అందించారు. అంతకుముందు వారు గర్భాలయంలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వరి పంట కోయనీయడంలేదని ఆత్మహత్యనాగారం: వరి పంట కోయనీయకుండా అడ్డుకోవడంతో మనస్తాపానికి గురైన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫణిగిరి గ్రామానికి చెందిన వట్టె భద్రమ్మ(61), ముత్తయ్య దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. వీరికి ఏడెకరాల వ్యవసాయ భూమి ఉంది. పెద్ద కుమారుడు 20ఏళ్ల క్రితమే మృతి చెందాడు. భర్త మృతిచెందిన తర్వాత పెద్ద కోడలు విజయ తన పుట్టింటికి వెళ్లి జీవనం కొనసాగిస్తోంది. దీంతో భద్రమ్మ తన మనవరాలు(విజయ కుమార్తె) పేరిట రూ.10లక్షల విలువైన ఇంటి స్థలం, రెండెకరాల పొలం రాసిచ్చింది. అయితే తన భర్త వాటా కింద రావాల్సిన మిగతా ఎకరంన్నర పొలం తమ పేరిట రాసివ్వాలని విజయ పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టింది. అంతేకాకుండా ఆ ఎకరంన్నరలో పండించిన వరిని కోయనీయకుండా అడ్డుకోవడంతో మనస్తాపం చెందిన భద్రమ్మ శనివారం వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి చిన్న కుమారుడు పుల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్‌టీంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘువీర్‌రెడ్డి తెలిపారు. ఈతకు వెళ్లి బావిలో బాలుడు గల్లంతుసూర్యాపేటటౌన్: ఈత కొట్టేందుకు వెళ్లిన బాలుడు బావిలో గల్లంతయ్యాడు. ఈ ఘటన శనివారం సూర్యాపేట మండలం కేసారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేసారం గ్రామానికి చెందిన పల్లె వెంకన్న, లలిత దంపతుల కుమారుడు మహేందర్(11)తో పాటు అతడి స్నేహితులు వేణు, అభిలాష్, దినేష్ ఈత కొట్టేందుకు గ్రామ శివారులోని బావి వద్దకు వెళ్లారు. దినేష్ బావి ఒడ్డున కూర్చొని ఉండగా మిగిలిన ముగ్గురు బావిలోకి దూకారు. మహేందర్, వేణుకు ఈత రాకపోవడంతో మునిగిపోతుండగా బావిలో ఉన్న అభిలాష్ వారి ఇద్దరిని కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే మొదట వేణును బయటకు తీసుకొచ్చి వెంటనే మహేందర్‌ను కాపాడేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే అతడు బావిలో మునిగిపోయాడు. బావి లోతుగా ఉండటంతో కాపాడలేకపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్ఐ బాలునాయక్, తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. రెండు చైనా మోటార్లు, రెండు ట్రాక్టర్ మోటార్లతో నీటిని తోడుతున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు బాలుడి ఆచూకీ తెలిసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
యువతకు ఉపయోగపడని యూత్ హాస్టల్
నాగార్జునసాగర్: యువతకు ఉపయోగపడేలా కేంద్ర యువజన సర్వీసులు, క్రీడామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గతంలో దేశవ్యాప్తంగా 143 యూత్ హాస్టల్స్ ఏర్పాటు చేయగా.. అందులో భాగంగా తెలంగాణలో మూడు ఏర్పాటు చేశారు. ఈ మూడింటిలో ఒక దానిని నాగార్జునసాగర్‌లో సుమారు ఐదెకరాలలో నిర్మించారు. ఈ యూత్ హాస్టల్ నిర్మాణానికి 1997లో శంకుస్థాపన చేసి.. 2003లో ప్రారంభించారు. ఇది నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట ఉంది. ఇందులో ఏడు డార్మెట్లు ఉండగా 3 మహిళలు, 4 పురుషులు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. 100మంది వరకు బస చేయవచ్చు. యువత విహారయాత్రకు వచ్చినప్పుడు గ్రూపులుగా ఒకే చోట కలుసుకునేందుకు, నాలెడ్జ్ ఎక్స్చేంజ్కు ఉపయోగపడేలా దీనిని నిర్మించారు. గతంలో ఇందులో బస చేసేందుకు ఒక్కరికి ఒకరోజుకు కేవలం రూ.30 అద్దె ఉండేది. తర్వాత రూ.50 చేయగా.. ప్రస్తుతం రూ.80 చేశారు. ఇందులో రెండు గదులు కూడా ఉండగా.. వాటికి అద్దె ప్రారంభంలో రూ.300 ఉండగా ప్రస్తుతం రూ.500 ఉంది. అయితే ఈ యూత్ హాస్టల్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అవి కేవలం లాడ్జీలుగా ఉపయోగపడ్డాయి. 2015 వరకు ఇందులో పనిచేసే కేర్‌టేకర్, తోటమాలి, స్వీపర్లకు వేతనాలు పోగా రూ.14,86,000 నగదు నిల్వలు ఉన్నాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నాగార్జునసాగర్‌లో శిక్షణ ఇచ్చిన సమయంలో ఆ డబ్బులను ఖర్చు చేసి గతంలో ఉన్న బెడ్లు, బెడ్షీట్లు మార్చేందుకు, తదితర ఖర్చులకు వినియోగించారు. ఈ యూత్ హాస్టల్ ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ రంగులు కూడా వేయలేదు. గత 54నెలలుగా ఇందులో పనిచేసే వారికి వేతనాలు ఇవ్వలేదు. ఏమైనా అద్దెలు వస్తే సుమారు రూ.50వేలు జమ అయితే ఒకటి, రెండు నెలలకు చెక్కులు రాసి వేతనాలు అందిస్తుంటారు. నెహ్రూ యువకేంద్రం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ఈ యూత్ హాస్టల్‌కు మేజనేజర్గా వ్యవరిస్తుండగా.. దీనికి జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉన్నారు. ఇలాంటి యూత్ హాస్టళ్లు తెలంగాణలో సికింద్రాబాద్‌లోని బోట్స్ క్లబ్లో, హనుమకొండలో ఉన్నాయి. లీజుకు అడిగిన పర్యాటక అభివృద్ధి సంస్థఇటీవల తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ యూత్ హాస్టల్‌ను సందర్శించింది. దీనిని ఆధునీకరించి వినియోగంలోకి తీసుకొస్తే పర్యాటకులు బస చేసేందుకు ఉపయోగపడుతుందని లీజుకు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. అప్పట్లో నాగార్జునసాగర్ డ్యాంపై సీఆర్పీఎఫ్ సిబ్బంది పహారాగా ఉన్నారు. వారు బస ఇందులో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వారు తెలంగాణ వైపు పహారా విధుల నుంచి విరమించుకొని వెళ్లిపోయారు. దీంతో ఈ యూత్ హాస్టల్ ప్రస్తుతం ఖాళీగానే ఉంది. దీనిని పర్యాటక అభివృద్ధి సంస్థకు లీజుకు ఇస్తే వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర, జిల్లా అధికారులు సమాలోచనలు చేసి ప్రజలకు ఉపయోగపడేలా ఈ యూత్ హాస్టల్‌ను వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో డ్యాం భద్రతకు వచ్చిన సీఆర్పీఎఫ్ సిబ్బందికి ఈ హాస్టల్ కేటాయింపు వారు వెళ్లిపోవడంతో ప్రస్తుతం ఖాళీగానే.. ఆదాయం రాక సిబ్బందికి వేతనాలు ఇవ్వలేని దుస్థితి -
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
నల్లగొండ: గంజాయి విక్రయిస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని నల్లగొండ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి వద్ద రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్ల గొండ డీఎస్పీ శివరాంరెడ్డి శనివారం విలేకరులకు వెల్లడించారు. బిహార్ రాష్ట్రం ఖగారియా జిల్లా చౌతాం తాలూకా నిర్పూర్ గ్రామానికి చెందిన రాకేష్‌కుమార్ ఇంటర్ వరకు చదివాడు. ఆపై చదువు ఇష్టం లేక బతుకుదెరువు కోసం సూర్యాపేట జిల్లాకు వచ్చి రైస్ మిల్లులో రెండేళ్ల క్రితం హమాలీగా చేరాడు. అతడికి గంజాయి తాగే అలవాటు ఉండడంతో బిహార్ నుంచి వచ్చేటప్పుడు గంజాయి తెచ్చేవాడు. సంవత్సరం నుంచి నల్లగొండలోని శ్రీనగర్‌కాలనీలో ఉన్న వెంకటేశ్వర రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తున్నాడు. గంజాయి అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయని భావించిన రాకేష్‌కుమార్ గత ఆరు నెలల నుంచి బిహార్ రాష్ట్రం ఖగారియా జిల్లా దమారా రైల్వే స్టేషన్ సమీపంలో నివాసముండే పుష్పయాదవ్ దగ్గర గంజాయి కిలో రూ.12500 చొప్పున కొనుగోలు చేసి నల్లగొండకు తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి రూ.300 ఒక్క ప్యాకెట్ చొప్పున విక్రయిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం సొంత గ్రామానికి వెళ్లిన రాకేష్‌కుమార్ పుష్పయాదవ్ వద్ద రెండు కిలోల గంజాయి కొనుగోలు చేసి శుక్రవారం సాయంత్రం రైలులో నల్లగొండకు వచ్చాడు. అతడు రైలు దిగి వెళ్తుండగా.. పక్కా సమాచారం మేరకు నల్లగొండ టూటౌన్ పోలీసులు రైల్వే స్టేషన్‌లోని పార్కింగ్ వద్ద రాకేష్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాకేష్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించామని, పుష్పయాదవ్ పరారీలో ఉన్నట్లు డీఎస్ప పేర్కొన్నారు. మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా రాకేష్‌కుమార్ నుంచి గంజాయి కొనుగోలు చేసిన వారిని గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. రెండు కిలోల గంజాయి స్వాధీనం -
విద్యతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
మునుగోడు: విద్యతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన మునుగోడు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోతుందన్నారు. విద్యా పరమైన సమస్యల పరిష్కారానికి తాను నిత్యం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటానన్నారు. డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చొరవతో మునుగోడు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను రూ.5కోట్ల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చొల్లేటి వెంకటేశ్వర్లు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కై లాస్‌నేత, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, మాజీ ఎంపీపీ కర్నాటి స్వామి, మిర్యాల వెంకన్న, పాలకూరి నర్సింహగౌడ్, బొడ్డు నాగరాజుగౌడ్, పీఆర్టీయూ నాయకులు జాన్‌రెడ్డి, యూసుఫ్పాష, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుంకరి భిక్షంగౌడ్ పాల్గొన్నారు.● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి -
మానవత్వం చాటుకున్న ‘మాచన’
శాలిగౌరారం: పుట్టుకతో దివ్యాంగుడైన ఆ బాలుడి తండ్రి కొన్నేళ్ల క్రితం పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఆ సమయంలో రెండేళ్ల వయస్సున్న అతడిని తల్లి వదిలేసి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. ఆ బాలుడిని తాతయ్య, నానమ్మ, బాబాయి చేరదీసి సాకుతున్నారు. వికలాంగుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు శనివారం నల్లగొండ కల్టెరేట్‌కు రాగా.. వీరి పరిస్థితి తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ వైద్య పరంగా ఆ బాలుడిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. వివరాలు.. శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన ముక్కాంల సృజన్ పుట్టుకతో దివ్యాంగుడు. సృజన్ తండ్రి 2019 మే 11న గొర్రెలను మేపుకొని ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. అప్పుడు సృజన్ వయస్సు రెండు సంవత్సరాలు. భర్త మృతిచెందడం, కుమారుడు దివ్యాంగుడు కావడంతో సృజన్ తల్లి అతడిని తాతయ్య, నానమ్మ వద్ద వదిలిపెట్టి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. దీంతో సృజన్ అనాథగా మారాడు. దివ్యాంగుడైన సృజన్‌ను తాత, నానమ్మ ముక్కాంల భిక్షమయ్య, సత్తమ్మతో పాటు బాబాయి నరేశ్ సాకుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే వికలాంగుల పింఛన్ రాకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు శనివారం సృజన్‌ను తీసుకొని నానమ్మ సత్తమ్మ, బాబాయి నరేశ్ కలిసి నల్లగొండ కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టరేట్లో విధి నిర్వహణలో ఉన్న పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ వారిని గమనించి అల్పాహారం తినేందుకు సృజన్‌ను పిలిచాడు. సృజన్ నడవలేడని, తల్లిదండ్రులు కూడా లేరని బాబాయి నరేశ్ రఘునందన్‌కు తెలిపాడు. దీంతో చలించిపోయిన రఘునందన్ సృజన్‌కు ఉచితంగా వైద్యం చేయిస్తానని నానమ్మ, బాబాయికి హామీ ఇచ్చారు. వెంటనే హైదరాబాద్‌లో ఉన్న న్యూ లైఫ్ హోమియోకేర్ వైద్యుడు గద్దె సుభాష్చందర్తో ఫోన్లో మాట్లాడి సృజన్ పరిస్థితిని వివరించాడు. దీంతో సోమవారం హాస్పిటల్‌కు రావాలని వైద్యుడు సూచించడంతో.. రఘునందన్‌కు సృజన్ నానమ్మ కృతజ్ఞతలు తెలిపింది. దివ్యాంగుడైన సృజన్ పరిస్థితి చూసి చలించి సామాజిక బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాచన రఘునందన్ తెలిపారు. దివ్యాంగుడైన బాలుడికి ఉచితంగా వైద్యం అందించేందుకు ముందుకొచ్చిన పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ -
న్యాయవాదుల చట్ట సవరణను పునఃసమీక్షించాలి
భువనగిరిటౌన్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల న్యాయవాదుల చట్టం–1961ను సవరించడం వలన న్యాయవాద వృత్తి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని, ఈ చట్ట సవరణపై కేంద్రం పునఃసమీక్షించాలని అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. పార్థసారథి అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలో మామిడి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయవాదుల చట్టంను సవరించడం వలన బార్ కౌన్సిల్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని అన్నారు. అంతేకాకుండా విదేశీ లాయర్లను కేసులు వాదించేందుకు అనుమతించడం సరికాదన్నారు. వెంటనే సవరణ బిల్లును రద్దుచేసి పాత చట్టాన్ని కొనసాగించాలని కోరారు. 2019 తర్వాత బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఎన్రోల్ చేసుకున్న అడ్వకేట్లందరికీ హెల్త్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉన్నత పదవుల్లో ఉన్న జడ్జిల ఇళ్లోలో డబ్బుల సంచులు దొరకడం అవమానకరమని, ఆవిధంగా దొరికిన వారిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కుక్క దువ్వ సోమయ్య, తడక మోహన్, సహాయ కార్యదర్శి బొల్లెపల్లి కుమార్, కోశాధికారి బొడ్డు కిషన్, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ నేహాల్, యాదసు యాదయ్య, జెల్లా రమేష్, ఎండీ ఖయ్యూం, గాదపాక శంకర్, ఆకుల మల్లేశం, పిడుగు ఐలయ్య, జిట్టా భాస్కర్‌రెడ్డి, ఎస్కే హమీద్ తదితరులు ఉన్నారు. అఖిల భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి -
రేవంత్‌రెడ్డితోనే మాదిగలకు న్యాయం జరిగింది
● ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిచండూరు: తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి వలన మాదిగలకు న్యాయం జరిగిందని, ఆంధ్రాలో మాత్రం మంద కృష్ణమాదిగ వల్ల అన్యాయం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. రాష్ట్రంలో మాదిగలకు 9శాతం రిజర్వేషన్ కల్పించిన సందర్భంగా చండూరులో శనివారం నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో త్వరలో నిర్వహించబోయే వర్గీకరణ విజయోత్సవ సభకు ప్రతిఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. రోస్టర్ పాయింట్ 6శాతం కాకుండా 7శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మంద కృష్ణమాదిగ కృషిచేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల వర్గీకరణ జీఓ వచ్చిన తర్వాత తెలంగాణలో కూడా జిల్లాల వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. 30 సంవత్సరాల మాదిగల నిర్విరామ పోరాట ఫలితంగా 9శాతం రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు కురుపాటి సుదర్శన్, యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నక్క మహేష్, ఓయూ అధ్యక్షుడు జోగు గణేష్, సంజీవ, విజయ్, జంగయ్య, జగన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
మామిడికాయలు అమ్ముకొని ఇంటికి వెళ్తుండగా..
కోదాడరూరల్: మార్కెట్లో మామిడికాయలు అమ్ముకొని తిరిగి ట్రాక్టర్‌పై ఇంటికి వెళ్తుండగా.. లారీ ఢీకొనడంతో తండ్రి మృతిచెందాడు. కుమారుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ శివారులో శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం కోదాడ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామానికి చెందిన రైతు, పీఏసీఎస్ డైరెక్టర్ నేరళ్ల సైదులు(57) తన కుమారుడు సాయితో కలిసి శుక్రవారం ట్రాక్టర్లో మామిడికాయలను లోడ్ చేసుకుని సూర్యాపేట మార్కెట్లో అమ్ముకొని రాత్రి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ శివారులో వై–జంక్షన్ వద్దకు రాగానే ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో సైదులుకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా.. అతడి కుమారుడు సాయి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతుడి కుమారుడు సాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అనిల్‌రెడ్డి తెలిపారు. ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ తండ్రి మృతి.. కుమారుడికి గాయాలు -
సహకార సంవత్సరంగా ప్రకటించడం హర్షణీయం
● డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి నల్లగొండ టౌన్: 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించడం హర్షణీయమని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజాభివృద్ధికి సహకార వ్యవస్థ ఎంతో కృషి చేస్తుందన్నారు. ఈ సహకార వ్యవస్థ పురోగతికి సహకార సంఘాలు, డీసీఓ వ్యవస్థ, బ్యాంకులు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 2024–2025 ఆర్థిక సంవత్సరంలో నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వ్యాపారంలో, లాభాలు గడించడంలో, ఎన్పీఏలు తగ్గించడంలో ముందుందన్నారు. ఈ సమావేశంలో బ్యాంక్ డైరెక్టర్లు ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి, పాశం సంపత్‌రెడ్డి, కొండ సైదయ్య, గుడిపాటి సైదయ్య, వంగూరి రంగాచారి, రామచంద్రయ్య, జూలూరు శ్రీనివాస్, వీరస్వామి, శ్రవణ్‌కుమార్, సీఈఓ శంకర్రావు పాల్గొన్నారు. ఎంజీయూ పీజీ, ఎంసీఏ ఫలితాలు విడుదల నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పీజీ మూడో సెమిస్టర్, ఐపీసీ, ఎంసీఏ, ఐఎంఏఈ మూడో సెమిస్టర్ ఫలితాలను శనివారం యూనివర్సిటీ చీఫ్ ఆఫీసర్ ఆప్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. పీజీ, ఐపీసీ అండ్ ఐఎంఏఈలో 72.61 శాతం, ఎంసీఏలో 76.61 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. భవనంపై నుంచి జారిపడి తాపీ మేస్త్రి మృతి పెద్దఅడిశర్లపల్లి: మిషన్ భగీరథ ప్లాంట్‌లోని భవనంలో లీకేజీకి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడి తాపీ మేస్త్రి మృతిచెందాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో శనివారం జరిగింది. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లి మండలం అబ్బనబోయినగూడెం గ్రామానికి చెందిన నర్ర నర్సింహ(50) తాపీ మేస్త్రిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ సమీపంలో మిషన్ భగీరథ ప్లాంట్‌లోని పంప్ హౌజ్ ఫేస్–1 భవనంలో ఏర్పడిన లీకేజీకి గత మూడు రోజులుగా అతడు మరమ్మతులు చేస్తున్నాడు. శనివారం మరమ్మతు పనులు పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద జారిపడ్డాడు. దీంతో నర్సింహ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుడిపల్లి పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
జేఈఈ మెయిన్స్‌లో ‘జయ’ విద్యార్థుల విజయభేరి
సూర్యాపేటటౌన్: జేఈఈ మెయిన్స్–2025 ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారు. కళాశాలకు చెందిన 58 మంది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించినట్టు కళాశాల కరస్పాండెంట్ జయ వేణుగోపాల్ తెలిపారు. కళాశాల విద్యార్థులు కన్నా ఉజ్వన్ గణితంలో 99.969 పర్సంటైల్ సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జి.తేజశ్రీ ఆలిండియా 1622వ ర్యాంకు, కె.ఉజ్వన్ 2254వ ర్యాంకు, వి.బిందుమాధవి 2541వ ర్యాంకు, సీహెచ్.హన్షితశ్రీ 2651వ ర్యాంకు, బి.శివమణి 2769వ ర్యాంకు, జె.మేనక 8319వ ర్యాంకు, డి.జగదీషారాజు 9498వ ర్యాంకు, పి. ప్రేమ్చందర్ 9863వ ర్యాంకు సాధించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులతో పాటు అధ్యాపక బృందాన్ని కరస్పాండెంట్ జయవేణుగోపాల్, డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి అభినందించారు. ‘ప్రగతి’ విద్యార్థులకు అత్యుత్తమ ర్యాంకులునల్లగొండ: జేఈఈ మెయిన్స్–2025 ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. శనివారం ప్రకటించిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో కళాశాలకు చెందిన విద్యార్థులు వి. శ్రీనిధి రాథోడ్ 79వ ర్యాంకు, జంపాల అభినవ్ 155వ ర్యాంకు, కల్లేపల్లి సమీరా 4738వ ర్యాంకు, రమావత్ సందీప్ 4854వ ర్యాంకు, కె. స్టాలిన్ 13,358వ ర్యాంకు, టి. కార్తీక్ 13,822వ ర్యాంకు, బి. భవాని 14,118వ ర్యాంకు, డి. సునీల్‌నాయక్ 19,990వ ర్యాంకు సాధించారు. తమ కళాశాల నుంచి 95 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించినట్లు కళాశాల యాజమాన్యం తెలిపారు. ఇంటర్లో అధిక మార్కులతో పాటు జేఈఈలో ఆలిండియా ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారికి సహకరించిన తల్లిదండ్రులను, అధ్యాపక బృందాన్ని కళాశాల చైర్మన్ చందా కృష్ణమూర్తి, డైరెక్టర్లు ఎ. నరేంద్రబాబు, ఎ. శశిధర్రావు, చందా శ్రీనివాస్, పైళ్ల రమేష్‌రెడ్డి అభినందించారు. ‘గౌతమి’ విద్యార్థుల ప్రభంజనంనల్లగొండ: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నల్లగొండ పట్టణంలోని గౌతమి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. శనివారం ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో కళాశాలకు చెందిన విద్యార్థులు జి. నితీష్‌రెడ్డి 370వ ర్యాంకు, ఎం. శివాజి 2396వ ర్యాంకు, ఐ. రికిత్ 5582వ ర్యాంకు, జి. తేజస్విని 6,174వ ర్యాంకు, ఆర్. శ్రీకర్ 6,916వ ర్యాంకు, ఎ. శశివంత్ 8,468వ ర్యాంకు, పి. రాజశేఖర్ 9,241వ ర్యాంకు, ఎం. సింహాద్రి 10,497వ ర్యాంకు, ఎం. శ్రీను 10,769వ ర్యాంకు, డి. పూజిత 11,444వ ర్యాంకు, కె. జయచంద్ర 12,233వ ర్యాంకు, ఎస్. భావన 13,706వ ర్యాంకు, జె. చంద్రకోటి 14,923వ ర్యాంకు, ఎం. సాత్విక్‌రెడ్డి 15,558వ ర్యాంకు, బి. శశిధర్ 15,688వ ర్యాంకు, కె. ప్రణయ్ 17,535వ ర్యాంకు, ఆర్. శివతేజ 18,385వ ర్యాంకు, ఎం. అక్షయ్ వర్షిత్ 18,797వ ర్యాంకు, ఆర్. అభినవ్ రాథోడ్ 19,137వ ర్యాంకు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్లు కాసర్ల వెంకట్‌రెడ్డి, చల్లా వెంకటరమణ, కొమ్మిరెడ్డి రఘుపాల్‌రెడ్డి, పుట్ట వెంకటరమణారెడ్డి అభినందించారు. -
ఘనంగా భూదాన వజ్రోత్సవాలు
భూదాన్‌పోచంపల్లి : భూదానోద్యమానికి అంకురార్పణ జరిగి 75వ వసంతంలోకి అడుగిడిన సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీజ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో భూదాన వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినోబాభావే మందిరంలో ఉదయం శాంతి యజ్ఞం నిర్వహించారు. అనంతరం టూరిజం పార్కు ఆవరణలో ఉన్న భూదానోద్యమపిత ఆచార్య వినోబాభావే, ప్రథమ భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి కాంస్య విగ్రహాలకు తెలంగాణ వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, భూభారతి రూపకర్త భూమి సునీల్‌కుమార్, భూదాన యజ్ఞబోర్డు మాజీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, సర్వోదయ నాయకులు వెదిరె అరవిందారెడ్డి, తడక వెంకటేశం, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్‌రెడ్డి, భూభారతి సభ్యులు రాంరెడ్డి, గోపాల్‌రెడ్డి, స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భూభారతి–భూదాన భూముల సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భూభారతి చట్టం వల్ల ప్రతి పేదవాడి భూములకు భరోసా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం సీత శ్రీరాములు, తడక ముత్యాలు, కరగల్ల నర్సింహకు భూదాన జయంతి పురస్కారాలను కోదండరెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. వెదిరె రాంచంద్రారెడ్డి, జ్యోతిబాపూలే విగ్రహాల ప్రతిష్ఠాపనకు శంకుస్థాపన చౌటుప్పల్ పట్టణ చౌరస్తాలో ప్రతిష్ఠించనున్న భూదాత వెదిరె రాంచంద్రారెడ్డి, జ్యోతిబాపూలే విగ్రహాల ఏర్పాటు పనులకు వెదిరె రాంచంద్రారెడ్డి మనుమడు వెదిరె అరవిందారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తడక వెంకటేశం, పోచంపల్లి అర్బన్‌బ్యాంకు చైర్మన్ తడక రమేశ్, పాక మల్లేశ్, భారత లవకుమార్, సామ మధుసూధన్‌రెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, కొట్టం కరుణాకర్‌రెడ్డి, పావనిరెడ్డి, గోవర్థన్, కవిరచయిత గోపాల్, వినోబాభావే సేవా సంఘం నాయకులు ఏలే భిక్షపతి, కొయ్యడ నర్సింహ, నోముల గణేశ్, మోటె రాజు, గునిగంటి రమేశ్, పోతగల్ల దానయ్య, పెద్దల చక్రపాణి, కొమ్ము లక్ష్మణ్, శ్రీను, కుమార్, వేశాల మురళి, మెరుగు శశికళ పాల్గొన్నారు.ఫ వినోబాభావే మందిరంలో శాంతి యజ్ఞం ఫ హాజరైన వ్యవసాయ, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి, భూదాన యజ్ఞబోర్డు సభ్యులు -
ఫ భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
రైతులను ఇబ్బంది పెట్టొద్దుతిప్పర్తి: ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందులు లేకుండా ఆయా కేంద్రాల నిర్వాహకులు అన్ని చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి కొనుగోళ్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే కాంటాలు వేయాలన్నారు. ప్రతిరోజూ ట్రక్ షీట్లు డీఎం కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఆయన వెంట ఏపీఎం శ్రీదేవి, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, రైతులు ఉన్నారు. వక్ఫ్‌బోర్డు సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి నల్లగొండ టౌన్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండలోని మగ్దూమ్ భవన్లో జరిగిన ఆ పార్టీ జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్‌బోర్డు సవరణ చట్టంతో మైనార్టీలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. బోర్డు సవరణ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామిక వాదులు, మేధావులు, అన్నివర్గాల ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందించాలన్నారు. బొడ్డుపల్లి వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు మల్లేపల్లి ఆదిరెడ్డి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, అంజయ్యచారి, బొల్గూరి నర్సింహ, టి.వెంకటేశ్వర్లు, నలపరాజు రామలింగయ్య పాల్గొన్నారు. యువత అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలి చివ్వెంల(సూర్యాపేట) : యువత.. డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శుక్రవారం చివ్వెంల మండలం మున్యానాయక్ తండా ఆవాసం పీక్లాతండాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఆర్థిక అసమానతలు లేని సమసమాజం నిర్మించడమే అంబేడ్కర్ ఆశయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మర్ ఇస్లావత్ రామచంద్రనాయక్, షెడ్యూల్డ్ కులాల అధికారులు కె.శంకర్, లత, తహసీల్దార్ కృష్ణయ్య, లంబాడీ విద్యార్థి సేనా రాష్ట్ర నాయకుడు ధరావతు బాలు నాయక్, మాజీ సర్పంచ్ బీకారి, మాజీ ఎంపీటీసీ సాగర్ తదితరులు పాల్గొన్నారు. చేతికందిన బొప్పాయి నేలపాలైంది ఈయన పొగాకు నారాయణ. గుర్రంపోడు మండలం చామలేడు గ్రామం. ఈయన పిట్టలగూడెంలో ఆరెకరాలు కౌలుకు తీసుకుని బొప్పాయి సాగుచేశాడు. ఏడాదిన్నర నుంచి రూ.6 లక్షల పెట్టుబడి పెట్టాడు. మొదటి పంట 5 టన్నులు మాత్రమే కోశాడు. మిగిలిన దాదాపు 20 టన్నుల పంట కోదామనుకునేలోపే ఇటీవల వడగండ్ల వానకు తోట నేలపాలైంది. గాలి వానకు దిగుబడి దశలో ఉన్న 300 మొక్కలు నేలకూలగా మరో 300 మొక్కలపై భాగం, కొమ్మలు విరిగిపోయాయి. కాయలు, పూత, పిందె అంతా నేలపాలైంది. 20 టన్నులకుగాను సుమారు నాలుగు లక్షల రూపాయల పంట నష్టం జరిగిందని నారాయణ ఆవేదనచెందుతున్నాడు. -
మామిడి చెట్లు కూలిపోయాయి
వడగండ్ల వర్షంతో పెను నష్టం జరిగింది. మామిడి చెట్లు కూలిపోయాయి. రెండు వేలపైనే మామిడి కాయలు రాలిపోయాయి. రాలిన కాయలన్ని పండుబారడంతో పారబోశాం. ప్రతి ఏటా మామిడి తోటల నుంచి వచ్చే రాబడిపైనే మా కుటుంబం ఆధారపడి ఉంది. ఇప్పుడు చెట్లు కూలిపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. – కరెంద జానకిరాములు, ఓగోడు ప్రభుత్వం ఆదుకోవాలి నాకున్న ఏడెకరాల్లో నిమ్మతోట వేశా. 480 నిమ్మచెట్లు ఉన్నాయి. నిమ్మకాయ తెంచే దశలో వచ్చిన భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి చేతికందే నిమ్మకాయ నేలరాలింది. ఈదురుగాలులకు తోటలోని 132 నిమ్మచెట్లు నేలకూలాయి. చివరకు అప్పులే మిగిలాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. – జేరిపోతుల చంద్రమౌళి, మాధారంకలాన్ -
కళతప్పిన పార్కులు
అన్ని మున్సిపాలిటీల్లోనూ నిర్వహణ లోపం ఆహ్లాదం పంచని పార్క్‌లు దేవరకొండ: దేవరకొండ మున్సిపల్ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి నిధులతో మూడు చోట్ల చిల్డ్రన్ ప్లే పార్కులు ఏర్పాటు చేశారు. చిన్నారులు ఆడుకుంనేందుకు వివిధ ఆట పరికరాలు సమకూర్చారు. ఆహ్లాదాన్ని పంచేలా చెట్లను పెంచారు. ఏర్పాటు చేసిన కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నా.. నిర్వహణ లోపంతో నేడు ఆహ్లాదం కరువైంది. సంజయ్కాలనీ, ముత్యాలమ్మ బజార్ పార్క్‌ల్లో ఆటవస్తువులు కొన్ని ధ్వంసం కాగా చెత్తా చెదారంతో నిండి ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు పరికరాలను ధ్వంసం చేస్తుండడంతో నిర్వహణ కష్టతరంగా ఉందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. మున్సిపల్ పార్కులు వెలవెలబోతున్నాయి. నిర్వహణ లోపానికితోడు పిల్లలు ఆడుకునేందుకు వివిధ రకాలు వస్తువులు లేకపోవడంతో వాటివైపు ఎవరూ వెళ్లడం లేదు. కొన్నిచోట్ల ఇదివరకు ఏర్పాటు చేసిన ఆట వస్తువులు ధ్వంసమయ్యాయి. పచ్చదనం కోసం నాటిన మొక్కలు ఎండిపోయి ఆహ్లాదం కరువైంది. మరికొన్ని చోట్ల పార్కులకు జనం వస్తున్నా వసతులు కరువయ్యాయి. ఉదయం పూట కొన్ని పార్కుల్లోనే జనం వాకింగ్‌కు వెళ్తున్నారు. మిగతా వాటికి జనం పెద్దగా రావడం లేదు. ఫలితంగా పార్కులు కళతప్పాయి. ఈ విషయాలు ‘సాక్షి’ విజిట్‌లో వెలుగుచూశాయి. ఫ విరిగి మూలకుపడిన ఆట వస్తువులు ఫ ఎండిన గ్రీనరీ.. కనిపించని పచ్చదనం ఫ చిన్నారులకు కరువైన ఆహ్లాదం ఫ వాటివైపు వెళ్లని పట్టణ వాసులు -
న్యాయవాద సవరణ చట్టం వద్దేవద్దు
రామగిరి(నల్లగొండ): న్యాయవాద సవరణ చట్టం–2025 బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.అనంతరెడ్డి, కార్యదర్శి ఎం.నగేష్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతుల శంకరయ్య డిమాండ్ చేశారు. నల్లగొండ బార్ అసోసియేషన్ హాల్లో గురువారం ఐలు సంఘం ముద్రించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం న్యాయవాద చట్టం 1961ను మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని రూపొందించిందన్నారు. దీనివల్ల న్యాయవాద వృత్తి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాద వృత్తికి ప్రమాదకరంగా మారనున్న కొత్త చట్టం వద్దేవద్దన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎం.నాగిరెడ్డి, పి.శేఖర్, పి.బ్రహ్మా చారి, డి.నర్సాజి, ఎం.బాలయ్య, నగేష్, మసీయుద్దీన్, కిషోర్‌కుమార్, సీహెచ్. జైపాల్, ఏ.బాలయ్య, నజురుద్దీన్, లింగయ్య, రమేష్, ప్రకాష్, నరసింహ పాల్గొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ సేవలు విస్తరింపజేయాలి
నల్లగొండ టౌన్: బీఎస్ఎన్ఎల్ సేవలను మరింత విస్తరింపజేయాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఉప నాయకుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో జరిగిన టెలికం బోర్డు సలహా సంఘం సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. టెలికం రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిశోధనలు చేస్తూ సేవలను విస్తృత పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ఆ దిశగా ఽఅధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారులకు మరింత చేరువ అయినప్పుడే టెలికం రంగం అభివృద్ధిపదంలో పయనిస్తుందన్నారు. అంతకు ముందు ఎంపీ రవిచంద్రను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ పాశ్యం వెంకటేశ్వర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ గురువయ్య, అధికారులు రవిప్రసాద్, మురళికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర -
రైస్ మిల్లులో ‘విజిలెన్స్’ తనిఖీలు
చింతపల్లి: మండలంలోని నసర్లపల్లిలో గల సాయి రాఘవేంద్ర రైస్ మిల్లులో గురువారం హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక విజిలెన్స్ బృందం సభ్యులు తనిఖీలు నిర్వహించారు. మిల్లులో ఉన్న రికార్డులు పరిశీలించి అందుకు తగ్గ ధాన్యం నిల్వలు ఉన్నాయా, లేవా అని పరిశీలించారు. ధాన్యం సేకరణ ప్రారంభం కావడంతో ఇంతకు ముందు మిల్లుకు కేటాయించిన వడ్లను ఎంతమేర మర ఆడించారు. ఇంకా ఎన్ని బియ్యం ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉందని ఆరా తీశారు. ఈ తనిఖీల్లో పౌర సరఫరాల శాఖ ఇన్స్పెక్టర్ కె.వెంకటేశ్‌తోపాటు అంజయ్య తదితరులు ఉన్నారు. బంజారా కళలను పరిరక్షించుకోవాలిదేవరకొండ: బంజారా కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ వి.కోటేశ్వరరావు అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం దేవరకొండ మండలంలోని పలు తండాల్లో గిరిజనుల ఆభరణాల తయారీ, కుట్టుపని కేంద్రాలను కోటేశ్వరరావు బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు తయారు చేసే ఆభరణాలు, చేతి అల్లికలు, సంప్రదాయ దుస్తులు సామాజిక స్థితిని, సంస్కృతిని ప్రతిబింబించే చిహ్నాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. గిరిజనులు తయారు చేసే ఉత్పత్తులకు భౌగోళిక సూచిక (జీఐ) లభించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం బంజారా కళాకారులతో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మందడి శ్రీహారెడ్డి, శ్రీవత్స, కీర్తి, లావుడి బాషా తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి నిడమనూరు : ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి సూచించారు. గురువారం నిడమనూరు మండలం ఊట్కూర్, ముప్పారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలన్నారు. లారీ ట్రాన్స్‌పోర్టు, టార్ఫాలిన్లు, హమాలీ సమస్యలపై స్థానిక అధికారులతో చర్చించారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతుల వివరాలను వెంటనే ట్యాబ్‌లో నమోదు చేసి, సకాలంలో డబ్బుల జమ అయ్యేలా చూ డాలని మహిళా సంఘాల ప్రతినిధులకు, ఏపీఎంకు సూచించారు. ఆయన వెంట ఇన్చార్జ్ ఎంపీడీఓ బోనగిరి రమేష్, ఏపీఎం లక్ష్మీనారా యణ, వెలుగు సీసీ యాదయ్య ఉన్నారు. నారసింహుడికి నిత్యారాధనలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యారాధనలు నేత్రపర్వంగా చేపట్టారు. గురువారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూలకు నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చాన, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి భక్తులకు స్వామి, అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
తెలంగాణకు ఏపీ ఇసుక
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ నుంచి కొందరు లారీల్లో ఇసుకను సరిహద్దులు దాటించి తెలంగాణలో విక్రయిన్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని తెలంగాణ నేతలతో కుమ్మకై ్క ఈ దందాకు తెరతీసినట్లు తెలిసింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ముత్యాల, పల్నాడు జిల్లాలోని ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను కొందరు వ్యాపారులు లారీల్లో సామర్థ్యానికి మించి (ఒక్కో దాంట్లో 30 –35 టన్నులు) పట్టాలు కట్టి కనిపించకుండా దాచి సరిహద్దు దాటిస్తున్నారు. చెక్ పోస్టులు ఉన్న కోదాడ, నాగార్జునసాగర్, వాడపల్లి ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ ఫ్లైయాష్ పేరుతో అక్కడి సిబ్బంది కళ్లు కప్పి ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు చెక్‌పోస్టులు లేని ప్రాంతాలైన ముత్యాల–దొండపాడు, పులిచింతల బ్రిడ్జీ, మట్టపల్లి బ్రిడ్జీ, జాన్‌పహడ్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 14వ తేదీన మిర్యాలగూడ రూరల్ పోలీసులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి దాచేపల్లి మీదుగా హైదరాబాద్‌కు అక్రమంగా ఇసుకను ఆ లారీలో తరలిస్తుండగా అద్దంకి – నార్కట్‌పల్లి ప్రధాన రహదారిలో మిర్యాలగూడ మండలం కిష్టాపురం సమీపంలో పట్టుకున్నట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు. పోలీసు వాహనానాన్ని చూసి లారీ వేగంగా వెళ్తుండగా అనుమానం వచ్చి ఆపామని, లారీకి సంబంధించిన ఇసుక వివరాలను అడిగామని, ఎలాంటి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో లారీని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మిర్యాలగూడ మీదుగా హైదరాబాద్ ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి మిర్యాలగూడలో నార్కట్‌పల్లి – అద్దంకి జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున అర్ధరాత్రి వేళల్లో ఇసుకను తరలిస్తున్నట్లు తెలిసింది. ఇటుక బట్టీల్లో ఉపయోగించే ఫ్లైయాష్‌ను సరఫరా చేస్తున్నామని చెప్పి ఇసుకను తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో సన్న ఇసుకకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటంతో ఏపీ నుంచి ఇసుకను తరలించి, తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి గండిగొడుతున్నారు. ఈ ఇసుకను హైదరాబాద్‌కు మాత్రమే కాకుండా నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోనూ ఇసుకను విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ దందాలో తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలనే వినియోగిస్తూ అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. మరోవైపు మిర్యాలగూడ నియోజకవర్గంలోని మూడు రీచ్‌లు ఏడాది కాలంగా మూతపడటంతో ఈ ప్రాంతంలో ఏపీ నుంచి వస్తున్న ఇసుకను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. హుజూర్నగర్, కోదాడ, నల్లగొండ ప్రాంతాల్లోనూ ఇలా తీసుకువచ్చిన ఇసుకను విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఏపీకీ చెందిన కొందరు ప్రముఖులు తెలంగాణకు చెందిన సరిహద్దు రాజకీయ నాయకులుతో కుమ్మకై ్క ఇసుక దందాకు తెరతీశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఆంధ్రా నుంచి అక్రమంగా రవాణా ఫ ఫ్లైయాష్ పేరుతో ఇసుక తరలింపు ఫ చెక్‌పోస్టులు లేని ప్రాంతాల నుంచి వస్తున్న లారీలు ఫ హైదరాబాద్‌తో పాటు నల్లగొండ జిల్లాలో విక్రయాలు -
భూ భారతి చట్టం.. చరిత్రాత్మకం
దేవరకొండ, చింతపల్లి: ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం చరిత్రాత్మకమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. గురువారం దేవరకొండ మండలం కొండభీమనపల్లి రైతు వేదికలో, చింతపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి అవగాహన సదస్సుల్లో వారు మాట్లాడారు. భూవివాదాలు లేని తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో లేని అనేక సమస్యలకు భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం దొరుకుతుందన్నారు. ప్రతి రైతుకూ మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. భూ భారతి చట్టంపై గ్రామ గ్రామాన రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం రెవెన్యూ యంత్రాంగంపై ఉందని పేర్కొన్నారు. ఈ సదస్సుల్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఏఎస్పీ మౌనిక, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, ఆర్డీఓ రమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలుసంజీవరెడ్డి, తహసీల్దార్ శర్మ, ఎంపీడీఓ సుజాత, అగ్రికల్చర్ ఏడీ శ్రీలక్ష్మి, ఏఓ శ్రావణి కుమారి, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, వేణుధర్‌రెడ్డి, సిరాజ్‌ఖాన్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ -
రైతులకు మేలు చేసేందుకే ‘భూ భారతి’
కొండమల్లేపల్లి : రైతులకు మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. గురువారం కొండమల్లేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి చట్టంపై రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. భూ భారతితో సమీకృత సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందన్నారు. నాలుగు నెలలుగా అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. రైతులకు సంబంధించిన ఏ సమస్య అయిన ఈ చట్టం ద్వారా పరిష్కారం అవుతుందన్నారు. జూన్ 2వ తేది నుంచి భూ భారతి పోర్టల్ పూర్తిగా వినియోగంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు పదిమందిలోపే రావడంతో అధికారులు రైతులకు ముందస్తు సమాచారం చేరవేయలేదనే విమర్శలు వచ్చాయి. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ శ్రీలక్ష్మి, ఎంపీడీఓ బాలరాజురెడ్డి, తహసీల్దార్ అన్వర్‌హుస్సేన్, ఏఓ జానకిరాములు, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉట్కూరి వేమన్‌రెడ్డి, సిరాజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
మూడుచోట్ల ఫారెస్ట్ టోల్గేట్లు
నాగార్జునసాగర్: అడవిలో నుంచి వెళ్లే నాగార్జునసాగర్–హైదరాబాద్–నల్లగొండ రహదారిపై అటవీ శాఖ మూడు చోట్ల ఫాస్టాగ్‌లతో కూడిన టోల్గేట్లను ఏర్పాటు చేసింది. నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ముందు ఒకటి, పెద్దవూర నుంచి నాగార్జునసాగర్‌కు వచ్చే రహదారిలో బెట్టెలతండా సమీపంలో మరొకటి, హాలియా నుంచి నాగార్జునసాగర్‌కు వచ్చే దారిలో కుంకుడుచెట్టుతండా(సమ్మక్క–సారక్క గుడి) సమీపంలో మూడోవది ఏర్పాటు చేశారు. ఆయా టోల్గేట్ల గుండా వెళ్లే చిన్న వాహనాలకు రూ.50లు, పెద్ద వాహనాలకు రూ.80 చార్జీలు వసూలు చేసేలా ఫాస్టాగ్‌లను ఏర్పాటు చేశారు. నిత్యం రెండు మూడు సార్లు ఈ రోడ్లపై తిరిగే స్థానికులు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో ఆధార్‌కార్డు, వాహనానికి సంబంధించిన పేపర్లు ఇస్తే వారికి మినహాయింపు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా గురువారం వీటిని అధికారులు పరిశీలించారు. ఫ సాగర్– హైదరాబాద్ రూట్లో ఏర్పాటు ఫ అన్నిచోట్లా ఫాస్టాగ్ సౌకర్యం -
రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి సర్వే
నల్లగొండ: అర్హులైన వారికి కొత్త రేషన్‌కార్డులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరు చేసింది. అయితే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా మంజూరు చేసేందుకు సర్వేకు ఆదేశించింది. ఇందులో భాగంగా జిల్లా యంత్రాంగం మీసేవ యాప్ రూపొందించి సిబ్బందిని నియమించింది. వారం రోజుల నుంచి యాప్ ద్వారా అర్జీలపై క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తోంది. ప్రజాపాలనలో లక్షకుపైగా దరఖాస్తులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంక్షేమ పథకాలకు దరఖాస్తులను స్వీకరించింది. అందులో భాగంగా రేషన్ కార్డులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా 1,25,733 మంది దరఖాస్తులు అందించారు. ఇప్పుడు ఆ దరఖాస్తులపై సర్వే కొనసాగుతోంది. ఇందుకు జిల్లా వ్యాప్తంగా 622 మంది సిబ్బందిని నియమించారు. సదరు సిబ్బంది మీసేవ యాప్ ద్వారా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి యాప్‌లోనే వారి వివరాలు సేకరించి నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో చిన్న మండలాలకు 10 మంది, పెద్ద మండలాలకు 20 మంది, పెద్ద మున్సిపాలిటీలకు 30 మంది చొప్పున సిబ్బందిని కేటాయించారు. వీరికి సర్వే ఎలా చేయాలో శిక్షణ కూడా ఇచ్చారు. సర్వే తర్వాత అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపించనున్నారు. ఇప్పటికే 8,415 కార్డులు మంజూరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆన్లైన్ ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించింది. దీంతో ప్రజులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 8,415 మందిని అర్హులుగా తేల్చి కార్డులు మంజూరు చేశారు. అయితే వీరికి సన్న బియ్యం పంపిణీకి ఆదేశాలు రావాల్సి ఉంది. బీసీ కుల గణనలోనూ భారీగా అర్జీలు ప్రభుత్వం బీసీ కుల గణన ప్రక్రియ చేపట్టిన సందర్భంలో రేషన్ కార్డులు లేనివారు అందులో ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇందులో మొత్తంగా 27,523 అర్జీలు రాగా వీటి 23,428 అనుమంతించగా 4,095 దరఖాస్తులు తిరస్కరించారు. వాటిని కూడా ఇప్పటికే ప్రభుత్వానికి పంపించారు. అయితే ప్రజాపాలన దరఖాస్తుల సర్వే తరువాత అన్ని కొత్తకార్తులకు ఒకేసారి సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తారా లేక ఇప్పటికే మంజూరైన వాటికి వచ్చేనెల నుంచి ఇస్తారా అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఆదేశాలు రాగానే కొత్త కార్డులకు సన్న బియ్యం పంపిణీ చేస్తాం ఇప్పటికే కొందరికి రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీరికి ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలు ఇస్తే అప్పటి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తాం. ప్రజాపాలన దరఖాస్తుల సర్వే కొనసాగుతోంది. సర్వే పూర్తికాగానే అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపుతాం. – హరీష్, పౌరసరఫరాల శాఖ డీఎం, నల్లగొండ ఫ ప్రజాపాలనలో 1.25 లక్షల దరఖాస్తులు ఫ పరిశీలనకు ప్రత్యేకంగా మీసేవ యాప్ ఫ 622 మంది సిబ్బంది నియామకం ఫ వారం రోజులుగా కొనసాగుతున్న ప్రక్రియ -
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరండి
దేవరకొండ: వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం దేవరకొండ పట్టణంలో జరిగిన ఆ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా వాడుకుంటున్నా జిల్లా మంత్రులు ఒక్కమాట కూడా మాట్లాడడం లేదని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం.. ఏపీ సీఎం చంద్రబాబు చేతుల్లోకి పోతుందని ఆరోపించారు. ఓ పక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఎండిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేకుండా పోయిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణకు సాధ్యంకాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. బంగారు తెలంగాణ కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ మోసగాళ్ల పార్టీ అని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రవీంద్రకుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వడ్త్య రమేష్‌నాయక్, కేతావత్ బీల్యానాయక్, టీవీఎన్ రెడ్డి, కంకణాల వెంకట్‌రెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, గాజుల ఆంజనేయులు, రాఘవాచారి, సుభాష్‌గౌడ్, దస్రునాయక్, లోక్యానాయక్, ఆయా మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి -
మల్లీశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి
నల్లగొండ టౌన్: నిడమనూరు మండలం బొక్కముంతలపహాడ్ గ్రామంలో ఇటీవల మల్లీశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారిని ఉరితీయాలని బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రేమపేరుతో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న మల్లీశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని బుధవారం రాత్రి నల్లగొండలోని గడియారం సెంటర్లో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో బహుజన సంఘాల నాయకులు అనుముల సురేష్, పాలడుగు నాగార్జున, బొజ్జ పాండు, కత్తుల జగన్, కత్తుల సన్నీ, చింత శివరామకృష్ణ, రత్నకుమారి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సాగు అంచనా.. 11.60 లక్షల ఎకరాలు
వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు ముందస్తుగానే సిద్ధం చేస్తున్నాం.. వానాకాలం సీజన్‌కు సంబంధించి సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందస్తుగానే సిద్ధం చేస్తున్నాం. అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాం. సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. – పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ, నల్లగొండ నల్లగొండ అగ్రికల్చర్: వానాకాలం –2020–25కు గాను జిల్లా వ్యవసాయ శాఖ సాగు ప్రణాళిక ఖరారు చేసింది. దీనికి అవసరమైన ఎరువులు, విత్తనాల ప్రతిపాదనలు కూడా ఖరారు చేసిన వ్యవసాయ శాఖ యంత్రాంగం జిల్లా కలెక్టర్ అనుమతితో రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌కు పంపించింది. గత వానాకాలంలో 11,50,556 ఎకరాల్లో వరి, పత్తి, ఇతర పంటల సాగు కాగా ప్రస్తుత వానాకాలంలో అదనంగా సుమారు 10 వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేసింది. ప్రస్తుత వానాకాలంలో 11,60,389 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ ప్రణాళికను ఖరారు చేసింది. విత్తనాలు ఇలా: వానాకాలం సీజన్‌కు సంబంధించి పత్తి, వరి, కంది, పెసర, వేరుశనగ విత్తనాలను సిద్ధం చేయనుంది. పత్తి ప్యాకెట్లు 11.81 లక్షలు, వరి 1,26,800 క్వింటాళ్ల వివిధ రకాలకు సంబంధించిన విత్తనాలు అవసరం అని అంచనా వేసింది. కంది 1,250 క్వింటాళ్లు, పెసర 149 క్వింటాళ్లు, వేరుశనగ 1,545 క్వింటాళ్లు అవసరంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది. ఎరువులు: వానాకాలం సీజన్‌కు సంబంధించి 3,66,869 మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. యూరియా 1,44,802 మెట్రిక్ టన్నులు, డీఏపీ 61,343 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 33,758 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 1,14,043 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 12,923 మెట్రిక్ టన్నులతో కలిపి మొత్తం 3,66,869 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది. పంటల వారీగా సాగు అంచనా ఇలా.. (ఎకరాల్లో..) ఫ విత్తనాలు, ఎరువులకు ప్రతిపాదనలు ఫ ప్రభుత్వానికి నివేదిక పంపిన జిల్లా వ్యవసాయ శాఖ ఫ గతంలో కంటే సాగు విస్తీర్ణం 10వేల ఎకరాలు పెరిగే అవకాశం -
తాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలి
మర్రిగూడ: ప్రస్తుత వేసవిలో మండలంలోని అన్ని గ్రామాలు, తండాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం మర్రిగూడ ఎంపీడీఓ కార్యాలయంలో తాగునీరు, ఉపాధిహామీ, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎక్కడైనా తాగునీటి సమస్యలు ఉత్పన్నమైతే తక్షణమే పరిష్కరించాలని, మండల స్థాయిలో వీలుకాని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఉపాధిహామీ పనులకు ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం అన్ని పనులు పూర్తిచేయాలన్నారు. 200 ఇళ్లకు ఒక అధికారి నియామకం, జాబితా పరిశీలన తదితర అంశాలపై సమీక్షించారు. అంతకుముందు కలెక్టర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను సందర్శించి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్యసేవలపై వైద్యులతో మాట్లాడారు. ఓ బాలికకు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఆసుపత్రికి రాగా వెంటనే అందించాలని, తమ భూమి తమకు పట్టా చేయడం లేదని ఓ బాధితురాలు కలెక్టర్‌కు వినతిపత్రం అందించగా ఈ నెల 25లోపు సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఆమె వెంట చండూరు ఆర్డీఓ వి.శ్రీదేవి, తహసీల్దార్ బక్క శ్రీనివాస్, ఎంపీడీఓ జి.చినమునయ్య ఉన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ కృషి ఎనలేనిది
రామగిరి(నల్లగొండ): దేశంలో సామాజిక అసమానతల నిర్మూలనతోపాటు రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కృషి ఎనలేనిదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఇ.వెంకటేసు అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రపంచీకరణ తర్వాత ప్రపంచంలో సామాజిక న్యాయం ఔచిత్యం అనే అంశంపై బుధవారం నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక కీలక అంశాల్లో అంబేడ్కర్ పాత్ర ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ యువత సమాజ ఉన్నతికి పాటుప డాలని కోరారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అంతటి శ్రీనివాస్, ఐక్యూసి కోఆర్డినేటర్ వైవీఆర్.ప్రసన్నకుమార్, పరీక్ష నియంత్రణ అధికారి బి.నాగరాజు, డాక్టర్ మునిస్వామి తదితరులు పాల్గొన్నారు. ఫ హెచ్‌సీయూ ప్రొఫెసర్ ఇ.వెంకటేసు -
డిజిటల్ డోర్ నంబర్లేవీ!
నీలగిరిలో రెండేళ్ల నుంచి అసంపూర్తిగానే సర్వే రూ.1.50కోట్ల నిధులు వృథా! మున్సిపాలిటీల్లో అధికారులను ఇంటి నంబర్ల సమస్య వెంటాడుతోంది. కొన్నిచోట్ల డబుల్ ఇంటి నంబర్ల సమస్య ఉంది. ఇళ్ల యజమానుల పేర్లు, ఇంటి నంబర్లు తప్పుగా నమోదు కావడంతోపాటు, ఆస్తిపన్నులో తేడాలు తదితర వాటికి స్వస్తి చెప్పాలని ప్రభుత్వం భావించింది. దీంట్లో భాగంగా ఇంటి నంబర్ చూడగానే పూర్తి వివరాలు తెలిసేలా డిజిటల్ డోర్ నంబర్ సర్వేకు శ్రీకారం చుట్టారు. కానీ ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో కాంట్రాక్టు సంస్థలు సర్వే పూర్తి చేయలేకపోయాయి. ఒక్క నీలగిరి మున్సిపాలిటీలోనే డిజిటల్ డోర్ నంబర్ సర్వే చేయడానికి రూ.1.50 కోట్లు వెచ్చించిప్పటికీ ఏజెన్సీ సంస్థ చేసిన తప్పిదానికి నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫ పూర్తిచేయకుండానే చేతులెత్తేసిన కాంట్రాక్టు సంస్థ ఫ అరకొరగా వివరాలు సేకరించి నివేదిక అందజేత ఫ రూ.కోటిన్నర నిధులు ఖర్చయినా ప్రయోజనం శూన్యం నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన డిజిటల్ డోర్ నంబర్ల సర్వే అసంపూర్తిగా మిగిలిపోయింది. ఒప్పంద ఏజెన్సీ సంస్థ డిజిటల్ సర్వే పూర్తి చేయకముందే 90 శాతం డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చేసిన సర్వేలో కూడా పూర్తి వివరాలు సేకరించకుండా అరకొరగా చేసి చేతులు దులుపుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సంవత్సరాలు దాటినా.. నీలగిరిలో చేపట్టిన డిజటల్ డోర్‌నంబర్ల సర్వే రెండేళ్లు దాటినా నేటికీ పూర్తికాలేదు. పట్టణంలోని 48 వార్డుల్లో సర్వే దాదాపు 80 శాతం పూర్తి అయినట్లు చెబుతున్నా అంతా అసంపూర్తిగానే వదిలేసినట్లు తెలిసింది. జిల్లాలోని నీలగిరి, మిర్యాలగూడ తదితర ప్రధాన పట్టణాల్లో డిజిటల్ డోర్ నంబర్లు ఇవ్వాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగా నీలగిరిలో సర్వే చేపట్టింది. గత ఎన్నికలకు ముందే సర్వే నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో నీలగిరిలో కాంట్రాక్టు పొందిన ఏజెన్సీ సంస్థ సర్వేను అర్థాంతరంగా నిలిపివేసింది. అయితే ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడడం.. మున్సిపల్ అధికారులు బదిలీలు కావడంతో ఏజెన్సీ సంస్థ సర్వేను పూర్తిచేయనేలేదు. నిబంధనలకు విరుద్ధంగా సర్వే కచ్చితత్వంతో పారదర్శకంగా డిజిటల్ డోర్ నంబర్ సర్వే చేస్తే దాదాపు 90 శాతం వాణిజ్య, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ విద్యాసంస్థల భవనాల నుంచి ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటి అనుమతి తీసుకోకుండా భవనాలు నిర్మించుకున్న వారితోపాటు, అనుమతి ఒక అంతస్తుకు తీసుకొని మూడు,నాలుగు అంతస్తుల భవనాలు నిర్మించడం, ఇంటి నిర్మాణానికి అనుమతి తీసుకొని వాణిజ్య భవనాలు నిర్మించడం లాంటివి పట్టణాల్లో వందల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి భవనాలకు మున్సిపల్ చట్టం ప్రకారం విధించే పన్నుకు రెట్టింపు వేయాల్సి ఉంటుంది. డిజిటల్ డోర్ నంబర్ సర్వే పూర్తి చేస్తే మున్సిపాలిటీలకు 80 నుంచి 90 శాతం వరకు భవనాల ఆస్తి పన్ను పెరిగే అవకాశం ఉండేది. అయితే ఇలాంటి వాటి విషయంలో సర్వే సంస్థ కచ్చితత్వంతో పనిచేయకుండా నిబంధనలలకు విరుద్ధంగా వ్యవహరించి మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులను సైతం బురిడీ కొట్టించి మమ అనిపించిందనే ఆరోపణలు ఉన్నాయి. సర్వే పూర్తి చేయని ఏజెన్సీ సంస్థకు ప్రస్తుత మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చి మరోసారి సర్వే చేయిస్తారా లేక మిన్నకుండిపోతారా అనేదానిపై అనుమానాలు కలుగుతున్నాయి. నీలగిరిలో వార్డుల సంఖ్య 48నివాస భవనాలు 36,750 వాణిజ్య భవనాలు 2,510 నివాస, వాణిజ్య భవనాలు 3,550 మొత్తం భవనాలు 42,810ప్రస్తుతం వసూలవుతున్న ఆస్తిపన్ను రూ.17కోట్లు సర్వేకు నిధుల కేటాయింపు రూ.1.50కోట్లు పూర్తయిన సర్వే (అంచనా) 80శాతంఅనుమతి రాగానే డిజిటల్ నంబర్లు ఏజెన్సీ సంస్థ సర్వే చేసి నివేదిక ఇచ్చింది. కానీ దీనిని అమలు చేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది. మున్సిపల్ ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాగానే సర్వే ప్రకారం డిజిటల్ డోర్ నంబర్లు ఇస్తాం. – సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ -
ఎంజీ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా
నల్లగొండ టూటౌన్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఈనెల 17 నుంచి మే 15 వరకు జరగాల్సిన డిగ్రీ పరీక్షలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ (సీఓఈ) డాక్టర్ ఉపేందర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని, తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. రైతులను ఇబ్బంది పెట్టొద్దునల్లగొండ: యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయమై బుధవారం నల్లగొండ కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాలు, ఈదురుగాలులను దృష్టిలో ఉంచుకుని ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలని మిల్లర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేలా పౌరసరఫరాల, ఎన్ ఫోర్స్మెంట్ విభాగం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్ఓ హరీష్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీఏఓ శ్రవణ్, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. రామాలయంలో అలరించిన అన్నమాచార్య సంకీర్తనరామగిరి(నల్లగొండ): నల్లగొండలోని రామగిరి రామాలయంలో బుధవారం శ్రీ అన్నమాచార్య సంకీర్తనా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నమాచార్య సంకీర్తనాగాన ప్రదర్శన అలరించింది. పేరి మాధవి సంకీర్తనలు గానం చేశారు. డాక్టర్ ఎం.పురుషోత్తమచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎం.లక్ష్మీనారాయణ కీబోర్డు, ఎస్.జయప్రకాశ్ తబల, కె.భిక్షం రిథమ్స్, డాక్టర్ సీహెచ్.మల్లిఖార్జునాచారి వ్యాఖ్యానం చేశారు. ప్రతి ఇంటికీ భగీరథ నీరందించాలి త్రిపురారం: ప్రస్తుత వేసవిలో అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీరు అందేలా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి సూచించారు. బుధవారం త్రిపురారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ ప్రత్యేక అధికారులు, మండల అధికారులు, పంచాయతీ కార్యాదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామ పంచాయతీల రికార్డులను పరిశీలించి గ్రామాల్లో ఉపాధి హామీ పనులు, నర్సరీల పెంపకంపై ఆరా తీశారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తు స్వీకరణ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సమావేశంలో త్రిపురారం ఎంపీడీఓ విజయ కుమారి, సూపరింటెండెంట్ దయాకర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ భరద్వాజ్, జూనియర్ అసిస్టెంట్ మహేష్, సరిత, కోడిరెక్క రాజేంద్ర కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. 28 నుంచి పాలిసెట్ ఉచిత శిక్షణ యాదగిరిగుట్ట: టీజీ పాలిసెట్–2025 ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఈ నెల 28 నుంచి మే 8వ వరకు యాదగిరిగుట్ట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ నెల 19 వరకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అని, మే 13వ తేదీన పాలిసెట్ ప్రవేశ పరీక్షలు జరగనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు సెల్‌నంబర్ 80998 99793, 90106 29270ను సంప్రదించాలని కోరారు. -
వివక్షరహిత సమాజ నిర్మాణానికి పోరాటం
నల్లగొండ టౌన్ : అంబేడ్కర్ సూచించిన విధంగా వివక్షత, అంటరానితనం లేని సామాజం సాధనకు పోరాడదామని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక న్యాయ యాత్ర జాత మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడారు. సామాజిక న్యాయం సాధనకు ఐక్యంగా పోరాడాదామని పిలుపు నిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చాక కుల, మతాల పేర దాడులు పెరిగాయన్నారు. విద్యా వైద్యం పేదలందరికీ ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, పాలడుగు ప్రభావతి, భారతి, ఆశాలత, ఎండీ శభానా, సాయిలీల, స్వరూప, జ్యోతి, పోలెబోయిన వరలక్ష్మి, కొండా అనురాధ, జిట్టా సరోజ, నిమ్మల పద్మ, అరుణకుమారి, పద్మ, సుల్తానా, ఊర్మిళ, అరుణ, ఇందిర, శశికళ తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ సభను జయప్రదం చేయాలి
కట్టంగూర్ : వరంగల్‌లో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మేల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. మంగళవారం కట్టంగూర్‌లో నిర్వహించిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ రజతో త్సవ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, పోగుల నర్సింహ, గుండగోని రాములు, గుర్రం సైదులు, వడ్డె సైదిరెడ్డి, పెద్ది బాలనర్సింహ, దాసరి సంజయ్, మంగదుడ్ల వెంకన్న, నకిరేకంటి నర్సింహ, కిషోర్ ఉన్నారు. -
సన్న బియ్యంపై తప్పుడు ప్రచారం తగదు
ఫ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీపై తప్పుడు ప్రచారం చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకనటలో హెచ్చరించారు. ఇటీవల గోదావరిఖనికి చెందిన ఒక వ్యక్తి రేషన్‌షాపులో సన్నబియ్యానికి బదులుగా ప్లాస్టిక్ బియ్యం సరఫరా చేస్తున్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో తప్పుడు వీడియో పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నం చేశాడని.. ప్రభుత్వం వెంటనే అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిపారు. రేషన్‌దుకాణాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పోర్టిఫైడ్ సన్నబియ్యాన్ని ఎవరైనా కించపరిచే ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సన్న బియ్యం పంపిణీపై ప్రజల్లో మంచి స్పందన ఉందని, ప్రజలంతా సంతోషంగా సన్నబియ్యాన్ని స్వీకరిస్తున్నారని తెలిపారు. ఈ పథకాన్ని నీరుగార్చేందుకు కొంతమంది చేసే తప్పుడు ప్రయత్నాలు ప్రభుత్వం సహించదని తెలిపారు. పలువురు జడ్జిల బదిలీరామగిరి(నల్లగొండ) : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు జడ్జిలు మంగళవారం బదిలీ అయ్యారు. ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద మెదక్ నుంచి సూర్యాపేటకు బదిలీ అయ్యారు. ఫ్యామిలీ కోర్టు జడ్జి పి.ముక్తిదా ఎల్బీనగర్ నుంచి యాదాద్రి జిల్లా మొదటి అదనపు కోర్టుకు బదిలీ అయ్యారు. మొదటి అదనపు కోర్టు జడ్జి డాక్టర్ ఎం.శ్యాం శ్రీ సూర్యాపేట నుంచి సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టుకు బదిలీ అయ్యారు. పునరావాసం ఏర్పాటుకు స్థల పరిశీలన మర్రిగూడ : శివన్నగూడ రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న చర్లగూడెం భూ నిర్వాసిత రైతులకు పునరావాసం కల్పించేందుకు అధికారులు మంగళవారం చర్యలు చేపట్టారు. చింతపల్లి మండల పరిధిలోని వర్కాలలో 40 ఎకరాల స్థలాన్ని ఇళ్లకు కేటాయించేందుకు చండూరు ఆర్డీఓ వి.శ్రీదేవి, ఇరిగేషన్ ఈఈ రాములునాయక్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వీలైనంత త్వరగా పునరావాసం కల్పించే ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా చర్లగూడెం గ్రామస్తులు మాట్లాడుతూ ఇంటి స్థలాల కేటాయింపు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కోరారు. గతంలో చింతపల్లి మండలంలోని మదనాపురం గేట్ వద్ద పునరావాసం కల్పిస్తామని ప్రకటించి రద్దు చేశారని వాపోయారు. స్మార్ట్ వర్క్, బ్యాంక్ సేవింగ్స్‌పై అవగాహన నల్లగొండ టౌన్ : స్మార్ట్ వర్క్, విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులకు అవసరమైన కోర్సులు, బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై ఐక్యరాజ్యసమితి విద్యా మండలి సభ్యుడు వెంకట రమణారావు, నల్లగొండ కోఆపరేటివ్ బ్యాంకు సీనియర్ మేనేజర్ రవీందర్ మంగళవారం నల్లగొండలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు లక్ష్యాలు సాధించడానికి రోజు వారి జీవితంలో ఎలా అభివృద్ధి సాధించాలి అనే దానిపై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లలితకుమారి, వైస్ ప్రిన్సిపాల్ ఎన్.పావని, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నృసింహుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం సంప్రదాయ పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా చేపట్టారు. గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చన చేశారు. శ్రీసుదర్శన హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం నిర్వహించారు. సాయంత్రం సాయంత్రం వెండి జోడు సేవలను ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. -
వీపీఓలతో సమస్యలు పరిష్కారం
మాడ్గులపల్లి : విలేజ్ పోలీస్ ఆఫీసర్ (వీపీఓ) ద్వారా గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు, ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని ఎస్పీ శరత్‌చంద్రపవార్ అన్నారు. మంగళవారం మాడ్గులపల్లి మండలంలోని ఆగామోత్కూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఉంటే నేర నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. గ్రామాల్లోకి కొత్తగా వచ్చే అనుమానితల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలు విలేజ్ పోలీసు అధికారికి అందించాలన్నారు. ప్రజలు సైబర్ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. యువత మాధక ద్రవ్యాలు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఇటీవల పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌మేళాలో గ్రామానికి చెందిన ముగ్గురికి ఉపాధి అవకాశం లభించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు, రూరల్ సీఐ పీఎండీ.ప్రసాద్, ఎస్ఐ కృష్ణయ్య, వీపీఓ సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ ఎస్పీ శరత్‌చంద్రపవార్ -
ఆహార భద్రతను అమలు చేస్తున్నాం
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠినల్లగొండ : జిల్లాలో ఆహార భద్రత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకంపై పేదలంతా సంతోషంగా ఉన్నారని.. వారికి ఆహార భద్రత అందుతోందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో సన్న బియ్యంతో భోజనం, పప్పు, బాలామృతం, గుడ్డు, పాలతో పౌష్టికాహారం, తృణధాన్యాలతో లడ్డూలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వసతిగృహాల్లో ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీల ప్రకారం భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. దేవరకొండ ప్రాంతంలో మాతా శిశు మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు శారద, భారతి, జ్యోతి మాట్లాడుతూ రేషన్ దుకాణాల్లో ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకు ముందు కలెక్టర్ వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తదితరులు పాల్గొన్నారు. -
చిట్యాలలో ఫ్లై ఓవర్ పనులు ప్రారంభం
ఫ రూ.45 కోట్లు మంజూరు చేసిన కేంద్రం ప్రభుత్వం ఫ సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాల మళ్లింపుచిట్యాల : చిట్యాల పట్టణంలో 65వ నంబరు జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.45 కోట్లు మంజూరు చేసింది. పట్టణంలో 750 నుంచి 800 మీటర్ల పొడవున ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. పాల కేంద్రం సమీపం నుంచి ఎస్బీఐ బ్యాంకు వరకు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరగనున్నట్లు తెలుస్తోంది. పోలీస్‌స్టేషన్ ఎదురుగా 8 నుంచి 9 అడుగుల ఎత్తులో సుమారు నాలుగు వరుసలుగా వాహనాలు వెళ్లే విధంగా అండర్‌పాసింగ్ నిర్మించనున్నారు. ప్రస్తుతం పోలీస్‌స్టేషన్ ఎదురుగా అండర్ పాసింగ్ బ్రిడ్జిని నిర్మించే ప్రాంతంలో రహదారిపై బీటీని తొలగించే పనులు చేపట్టారు. సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకలు.. ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనుల ప్రారంభించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను సర్వీస్ రోడ్డుపైకి మళ్లించారు. దీనిలో భాగంగా జాతీయ రహదారిపై గల పాలశీతలికరణ కేంద్రం నుంచి పోలీస్‌స్టేషన్ వరకు రహదారిపై వాహనాలు రాకపోకలు లేకుండా రేకులతో మూసి వేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి నార్కట్‌పల్లి వైపు వెళ్లే వాహనాలన్నీ సర్వీస్ రోడ్డు మీదుగా పంపుతున్నారు. ఇబ్బందుల్లో వ్యాపారులు.. సర్వీస్ రోడ్డు మీదుగా వాహనాలు వెళ్తుండడంతో రోడ్డు వెంట వ్యాపార సముదాయలు ఉన్న వారు దుమ్ముతో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలు చిరు వ్యాపారులు తమ దుకాణాలను ఖాళీ చేసి వెళ్లారు. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై మిర్చి, టిఫిన్, చాయ్ బండ్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వారు ఎలా బతకాలోనని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా సర్వీస్ రోడ్డుపై స్ట్రీట్ లైట్స్‌ను ఏర్పాటు చేయకుండా సోలార్ లైట్స్‌ను మాత్రమే ఏర్పాటు చేశారు. వాటి వెలుతురు తగినంతగా రాక రాత్రి సమయంలో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేస్తాం చిట్యాల పట్టణంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి ఆరు నెలల్లోనే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. నిర్మాణ సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలను తీసుకుంటున్నాం. – నాగకృష్ణ, ప్రాజెక్టు మేనేజర్ -
పవర్‌ప్లాంట్‌లో టౌన్షిప్
వైటీపీఎస్ ఉద్యోగుల కోసం రూ.928.52 కోట్లతో క్వార్టర్లు నిర్మించనున్న జెన్కోమిర్యాలగూడ : దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ (వైటీపీఎస్) ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేపట్టనుంది. థర్మల్ పవర్‌ప్లాంట్‌లో వేల సంఖ్యలో ఇంజనీరింగ్ అధికారులు, ఉద్యోగులు, ఇతర కార్మికులు రాత్రింబవళ్లు పనిచేయనున్నారు. ఇటీవల పలువురు ఏఈలు, డీఈలను సైతం ఇక్కడికి బదిలీ చేశారు. వీరంతా స్థానికంగా నివాసం ఉండాల్సి రావడంతో జెన్కో క్వార్టర్లు నిర్మిస్తోంది. టౌన్షిప్ నిర్మాణానికి ఇటీవలే టెండర్లు దాఖలయ్యాయి. టెండర్ ఆమోదించిన తరువాత 30 నెలల్లో టౌన్షిప్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని జెన్కో గడువు నిర్ణయించింది. నిర్మాణ వ్యయం రూ.928.52కోట్లు అయినప్పటికీ జీఎస్టీ, ఇతర ఖర్చులతో కలిిపి రూ.12,200 కోట్లు దాటవచ్చని తెలుస్తోంది. మొత్తం 2,970 ఫ్లాట్లు నిర్మాణం డిజైన్లు, డ్రాయింగ్స్ ప్రకారం మొత్తం 3,52,771.02 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టౌన్షిప్ నిర్మాణం జరగనుంది. 2,21,903.67 చ.మీ విస్తీర్ణంలో నివాస గృహ సముదాయాలతో లేఅవుట్ తయారు చేశారు. 75.185 చ.మీ విస్తీర్ణంలో పార్కులు, మొక్కల పెంపకం, పచ్చిక బయళ్లు, మరో 55,682.35 చ.మీల విస్తీర్ణంలో రోడ్లు, ఇతర సముదాయాలను ఏర్పాటు చేస్తారు. ఉన్నతాధికారుల కోసం ఏ–టైప్ రెండు ఇండిపెండెంట్ క్వార్టర్లు, బి–టైప్‌లో ఆరు ఇండిపెండెంట్ క్వార్టర్లను నిర్మిస్తున్నారు. అధికారులకు డి, ఈ టైప్ క్వార్టర్లను, కార్మికలకు ఎఫ్– టైప్ క్వార్టర్లను నిర్మిస్తారు. ఈ భవనాలు 11 అంతస్తుల ఎత్తు ఉంటాయి. డీ, ఈ–టైప్ క్వార్టర్ల కోసం రెండు భవనాలు ఉంటాయి. వీటిల్లో 360 చొప్పున ఫ్లాట్లు ఉంటాయి. ఎఫ్–టైప్ క్వార్టర్లలో 1,350 ఫ్లాట్లు మొత్తం కలిపి 2,970 ఫ్లాట్లు నిర్మించనున్నారు. సకల సదుపాయాలతో.. టౌప్షిప్లో ఉద్యోగులకు సకల సదుపాయాలు కల్పి స్తారు. అగ్నిమాపక కేంద్రం, ఆసుపత్రి, పాఠశాల భవనాలు, క్లబ్ హౌస్, కమర్షియల్ కాంప్లెక్స్, ఇండోర్ స్టేడియం, మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్, స్పో ర్ట్స్ కాంప్లెక్స్, సెక్యూరిటీ రూమ్స్, మెయింటెన్స్ ఆఫీస్, రోడ్లు, డ్రెయినేజీ, అండర్‌గ్రౌండ్ పోర్టబుల్ వాటర్ ట్యాంక్స్, ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్లు, పార్కింగ్ షెడ్స్, పచ్చదనం, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, తుంగపాడు వాగుపై బ్రిడ్జి, కాంపౌండ్ వాల్, టౌన్‌షిప్‌కు అప్రోచ్ రోడ్డును జెన్కో నిర్మించనుంది. టౌన్షిప్ నుంచి విడుదలయ్యే మురుగు నీటిని శుద్ధి చేయడానికి రోజుకు వెయ్యి కిలో లీటర్ల శుద్ధి సామర్థ్యంతో సీవరేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను సైతం నిర్మిస్తుంది. టెండర్ల ప్రక్రియ పూర్తయింది టౌన్షిప్ నిర్మాణానికి ఇటీవలే టెండరు దాఖలు చేసే ప్రక్రియ పూర్తయింది. త్వరలో టెండర్లు ఓపెన్ చేయగానే టౌన్షిప్ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. సకల సౌకర్యాలతో నిర్మించే టౌన్షిప్ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. – సమ్మయ్య, యాదాద్రి పవర్ ప్లాంట్, చీఫ్ ఇంజనీర్ ఫ టెండర్ దాఖలు చేసిన మూడు నిర్మాణ సంస్థలు ఫ నిర్మాణ వ్యయం పెంచుకునేలా నిబంధన మార్పు ఫ టెండర్లు ఖరారయ్యాక 30 నెలల్లో నిర్మించాలని గడువు టెండర్ ప్రక్రియకు నిబంధనల సడలింపు యాదాద్రి పవర్‌ప్లాంట్ వద్ద రెండు వేల క్వార్టర్లతో టౌన్షిప్ నిర్మాణానికి రూ.928.52కోట్ల వ్యయంతో జెన్కో ఆరు నెలల క్రితం టెండర్లు పిలిచింది. పెరిగిన ధరలకు అనుగుణంగా నిర్మాణ వ్యయాన్ని పెంచేందుకు అనుమతించే నిబంధనను చేర్చాలని కాంట్రాక్టర్లంతా ప్రీ బిడ్ సమావేశంలో జెన్కోపై ఒత్తిడి తెచ్చారు. ఈ నిబంధన చేర్చే వరకు టెండర్ వేయమని తేల్చి చెప్పడంతో టెండర్ దాఖలు గడువును జెన్కో తొమ్మిది సార్లు పొడిగిస్తూ వచ్చింది. అయినా కాంట్రాక్టర్లు టెండర్ దాఖలు చేయలేదు. వాస్తవానికి ధరల పెంపు నిబంధన గతంలో ఉండేది. దాన్ని ఆసరాగా చేసుకోని కాంట్రాక్టర్లు ఇష్టారీతిన ధరలు పెంచమని అడుగుతుండడంతో సంస్థపై ఆర్థిక భారం పడుతుందని భావించిన జెన్కో 2009లో ఆ నిబంధనను తొలగించింది. తాజాగా కాంట్రాక్టర్ల డిమాండ్‌ను జెన్కో ప్రభుత్వానికి నివేదించింది. ధరల పెంపు నిబంధనను చేర్చేందుకు జెన్కోకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 12న ఉత్తర్వులిచ్చింది. అందుకు అనుగుణంగా గత నెల 15న మరోసారి జెన్కో టెండర్లు పిలిచింది. మూడు నిర్మాణ సంస్థలకు చెందిన కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినట్లు జెన్కో వర్గాలు తెలిపాయి. -
వెంచర్లకు చెరువు మట్టి!
ఫ రాత్రికి రాత్రే తరలింపు ఫ పట్టించుకోని అధికారులునార్కట్పల్లి : వెంచర్లకు చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా జేసీబీలు, టిప్పర్ల ద్వారా మట్టిని వెంచర్లలో నింపుతున్నారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో ప్రభుత్వ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇదే అదునుగా భావించి వెంచర్ల నిర్వాహకులు మట్టిని తరలించారు. వివరాల్లో వెళ్తే.. నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు నల్ల చెరువు 60 ఎకరాలో విస్తీర్ణం కలిగి ఉంది. ఈ చెరువు మట్టిని 20 రోజులుగా.. రైతులు పొలాలకు, ఇతరులు తమ అవసరాలకు తరలిస్తున్నారు. వెంచర్ల నిర్వాహకులు చెరువు మట్టిని తరలిస్తున్నారని కొందరు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం రైతుల వాహనాలను అడ్డుకున్నారు. అధికారులు, వెంచర్ల నిర్వాహకులతో కుమ్మక్కయి.. మట్టి తరలింపునకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అధికారులు సెలవులో ఉన్న ఈనెల 14న రాత్రి పెద్ద భారీ వాహనాలతో చెరువు మట్టిని వెంచర్లకు తరలించడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు స్పందించి వెంచర్లకు మట్టి తరలింపును అడ్డుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు చెరువు మట్టిని వెంచర్లకు అనుమతి లేకుండా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మట్టి తరలిపునకు మైనింగ్, రెవెన్యూ శాఖ నుంచి అనుమతి ఉండాలి. వెంచర్లను పరిశీలించి మట్టిని చెరువుమట్టి తరలించినట్లు నిర్ధారణ అయితే ఆయా వెంచర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుని మట్టిని సీజ్ చేస్తాం. – వెంకటేశ్వరావు, తహసీల్దార్ -
పట్టాలు కప్పి.. పంట కాపాడి
హాలియా: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడాన్ని గమనించిన స్పెషల్ పోలీస్ బృందం వాటిపై పట్టాలు కప్పి పంటను కాపాడింది. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలీనగర్ వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలివి. అలీనగర్ ప్రాంతంలో జాతీయ రహదారి ఫ్లై ఓవర్‌పై కొందరు రైతులు ధాన్యం ఆరబోశారు. మంగళవారం సాయంత్రం గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో నల్లగొండ స్పెషల్ పోలీసులు నిడమనూరు మండలం బొక్కముంతలపాడు వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా.. తడుస్తున్న ధాన్యాన్ని చూసి చలించారు. తమ వాహనాన్ని ఆపి ధాన్యం తడవకుండా పట్టాలు కప్పి పంటను కాపాడారు. పంటను కాపాడిన స్పెషల్ పోలీసులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఒకరితో సహజీవనం..మరొకరితో పెళ్లి..
నిడమనూరు: నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. యువతి కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం రాత్రి కోదాడ–జడ్చర్ల రహదారిపై బొక్కమంతలపహాడ్ గ్రామంలో రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బొక్కమంతలపహాడ్ గ్రామానికి చెందిన ధర్మారపు మల్లేశ్వరి హైదరాబాద్‌లోనే సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి హాస్టల్లో ఉంటూ నిమ్స్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. అదే గ్రామానికి కుక్కల జాన్‌రెడ్డి కూడా హైదరాబాద్‌లోనే రీహాబిలిటేషన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఒకే గ్రామం కావడంతో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. జాన్‌రెడ్డి ఇటీవల మరో యువతిని వివాహం చేసుకోవడంతో అది భరించలేక మల్లేశ్వరి ఆదివారం హాస్టల్లో విషపూరితమైన ఇంజెక్షన్ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ సిబ్బంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత సోమవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, బంధువులు మల్లేశ్వరి మృతదేహాన్ని బొక్కమంతలపహాడ్ గ్రామానికి తమకు న్యాయం చేయాలని జడ్చర్ల– కోదాడ జాతీయ రహదారిపై రాత్రి వరకు రాస్తారోకో చేపట్టారు. -
నిర్దిష్టమైన ధర నిర్ణయించాలి
నేను మూడెకరాల్లో నిమ్మ సాగు చేశాను. 250 చెట్లు ఉన్నాయి. నకిరేకల్ నిమ్మ మార్కెట్‌కు 13 బస్తాల నిమ్మకాయలు తీసుకొచ్చాను. ఒక్కో చిన్న సైజు కాయ బస్తాకు రూ.200 ధర వచ్చింది. పండు కాయలకు బస్తాకు రూ.1300, పెద్ద సైజు కాయలకు రూ.1200 మించి ధర రావడం లేదు. పది రోజుల క్రితం మార్కెట్‌కు వస్తే రోజుకు రూ.30 వేలు వచ్చేవి. నేడు రూ.10వేలకు మించి రావడం లేదు. ధర సగానికి సగం పడిపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి. నిమ్మ దీర్ఘకాలిక పంట అయినందున ప్రభుత్వం బస్తాకు ఒక నిర్దిష్టమైన ధర నిర్ణయించి అదే ధరకు కొనుగోలు చేయాలి. – అన్నెబోయిన సురేందర్, బండమీదిగూడెం, శాలిగౌరారం మండలం -
కొత్తపేట గ్రామంలో విషాదఛాయలు
కేతేపల్లి: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. కొత్తపేట గ్రామానికి చెందిన అప్పల కొండయ్య కుమారుడు ఆదిత్య(27), ఊర ముత్తయ్య కుమారుడు ప్రవీణ్(25) చిన్ననాటి నుంచి స్నేహితులు. వీరిద్దరు ఆదివారం రాత్రి కొత్తపేట నుంచి బైక్‌పై సూర్యాపేటకు బయల్దేరారు. మార్గమధ్యలో చీకటిగూడెం గ్రామ స్టేజీ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ హైవేపై ఉన్న జంక్షన్ వద్ద సూర్యాపేట వైపు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుపుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివతేజ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ వేర్వేరుగా సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి -
పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడిగా వర్రె వెంకటేశ్వర్లు
మోత్కూర్: స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడిగా మోత్కూరు మండలం సదర్శాపురం గ్రామానికి చెందిన వర్రె వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి శివశంకర్‌రావును నియమించగా.. ముగ్గురు సభ్యులలో ఒకరిగా వర్రె వెంకటేశ్వర్లును నియమితులయ్యారు. వర్రె వెంకటేశ్వర్లు ఉమ్మడి రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల మోత్కూరు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భూమి చదును చేస్తుండగా బయల్పడిన శివలింగం చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రణబోతు బాజీరెడ్డి ఆదివారం తన వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా శివలింగంతో పాటు నాగప్రతిమ బయల్పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని శివలింగాన్ని తిలకించారు. కాగా ఈ స్థలంలో గతంలో గుడి ఉండేదని గ్రామస్తులు తెలిపారు. అటవీ భూమిలో అగ్ని ప్రమాదంఅడవిదేవులపల్లి: అడవిదేవులపల్లి గ్రామ సమీపంలో గల బౌద్ధమ దేవాలయాలకు వెళ్లే ప్రధాన రహదారి వెంట సర్వే నంబర్ 435లో గల అటవీ భూమిలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగి మంటలు ఎగిసిపడటంతో సుమారు 5 ఎకరాలు అగ్నికి ఆహుతయ్యింది. పంట పొలాలకు వెళ్లి వస్తున్న కూలీలు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బంది రావడం ఆలస్యమైతే అటవీ భూమి సమీపంలో గల పంటలను మంటలు చుట్టుముట్టేవని స్థానికులు పేర్కొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత మాడ్గులపల్లి: మాడ్గులపల్లి మండలం గజలాపురం గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని ఆదివారం పట్టుకున్నట్లు ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం కురియాతండాకు చెందిన ధనావత్ శ్రీనునాయక్ మాడ్గులపల్లి మండలం గజలాపురం గ్రామంలో రేషన్ లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అదే గ్రామంలో గుండెపురి భిక్షం ఇంట్లో నిల్వ చేశాడు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 7.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి ఏఎస్ఐ జాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రమాదవశాత్తు ఆయిల్ పామ్ తోట దగ్ధం
గుర్రంపోడు: మండలంలోని చామలేడు గ్రామానికి చెందిన కొండ పెద్దులు ఆయిల్ పామ్ తోట ఆదివారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఉపాధిహామీ కూలీలు తన ఆయిల్ పామ్ తోట వెంట కాల్వలో కంపచెట్లు తొలగించి నిప్పు పెట్టి వెళ్లడంతో ఆ మంటలు తన తోటకు అంటుకొని చెట్లు దగ్ధమైనట్లు బాధిత రైతు తెలిపాడు. మొత్తం మూడెకరాల తోటలో దాదాపు రెండెకరాలలో కాపు కొచ్చే దశలో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు, డ్రిప్పు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.4లక్షల మేర నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత రైతు తెలిపారు. చౌల్లరామారంలో.. అడ్డగూడూరు: అడ్డగూడూరు మండలం చౌల్లరామారం గ్రామంలోని సౌట కుంటలో సోమవారం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌట కుంటలో ఇటీవల ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు తొలగించిన కంప చెట్లకు సోమవారం నిప్పు పెట్టడంతో పెద్దఎత్తున మంటలు ఎగిసి పక్కనే ఉన్న వరి పొలాల వైపు వ్యాపించాయి. స్థానిక రైతులు గమనించి మోత్కూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. -
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి
సంస్థాన్ నారాయణపురం: విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని, ఒక లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సర్వేల్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి బుర్రా వెంకటేశం అన్నారు. సర్వేల్ గురుకుల పాఠశాలలో 1983–84లో పదో తరగతి చదివిన ఆయన ఆదివారం పాఠశాలను సందర్శించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నూతనంగా నిర్మించిన భవనాన్ని పరిశీలించారు. నూతనంగా 5వ తరగతి అడ్మిషన్ పొందిన విద్యార్థితో ముచ్చటించారు. భవిష్యత్‌లో కలెక్టర్ అవుతానని సదరు విద్యార్థి చెప్పడంతో అభినందించారు. తాను ఈ పాఠశాలలో అడిష్మన్ కోసం తన అమ్మతో కలిసి వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకముందు పాఠశాలలో బీఆర్ అంబేడ్కర్‌తో పాటు ఇతర మహానీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు అమీర్ ఉల్లాఖాన్, పాల్వాయి రజిని, రామ్మోహన్రావు, గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి రమణకుమార్, డిప్యూటీ కార్యదర్శి ప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్‌కుమార్ తదితరులున్నారు. అంతకుముందు మల్లారెడ్డిగూడెం గ్రామంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు నర్రి యాదయ్య ఇంట్లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం -
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన
నకిరేకల్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి మంచి పాలన అందిస్తున్నారని, ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు జీఓను విడుదల చేయడంపై హర్షిస్తూ నకిరేకల్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డ్రోన్ సహాయంతో నకిరేకల్ మెయిన్ సెంటర్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయించారు. అనంతరం సాయి మందిరం సమీపంలో స్టేడియంకు వెళ్లే దారిలో మహనీయుల విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారిత కోసం జీవితాంతం పరితపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లింగాల వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మార్కెట్, మున్సిపల్ చైర్పర్సన్లు గుత్తా మంజుల, చౌగోని రజితాశ్రీనివాస్‌గౌడ్, పూజర్ల శంభయ్య, మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం, బత్తుల ఉశయ్యగౌడ్, పెద్ది సుక్కయ్య, కంపసాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం -
మరణంలోనూ వీడని భార్యాభర్తల బంధం
మునుగోడు: భర్త గుండెపోటుతో మృతిచెందడం తట్టుకోలేక ఒక్క రోజు వ్యవధిలోనే భార్య కూడా గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన నల్ల గొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పలివెల గ్రామానికి చెందిన దుబ్బ శంకరయ్య(65), దుబ్బ లక్ష్మమ్మ(61) భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. శంకరయ్య మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకరయ్య ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆదివారం శంకరయ్యకు గుండెలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు సోమవారం శంకరయ్య మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. భర్త మృతిని తట్టుకోలేక ఆయన మృతదేహంపై పడి బోరున విలపించినా లక్ష్మమ్మ కూడా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెకు హైదరబాద్‌కు తరలించారు. అక్కడకి వెళ్లేసరికి ఆమె కూడా మృతిచెందింది. అన్యోన్యంగ జీవించిన భార్యాభర్తలు ఒక్క రోజు వ్యవధిలోనే మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దంపతుల అంత్యక్రియలు సోమవారం పలివెల గ్రామంలో ఒకేసారి నిర్వహించారు. ఒక్కరోజు వ్యవధిలో గుండెపోటుతో ఇరువురు మృతి -
జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు
పెద్దవూర: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైతులకు సబ్సిడీపై మొక్కలు అందించటంతో జిల్లా వ్యాప్తంగా ఆయిల్ పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మండుతున్న ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే పంట ఎదుగుదల, దిగుబడిలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మండల ఉద్యానవన అధికారి మురళి తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా వేసిన, ఎదిగిన పంట పెరుగుదలను కాపాడుకుంటూ, పంట పరిస్థితిని బట్టి రైతులు అధికారుల సూచనలు, సలహాలు పాటించి సాగు చేపట్టాలని, తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. ● ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు ఉన్న ఆయిల్‌పామ్ తోటల్లో మొక్కకు మూడు అడుగుల దూరంలో జనుమును, పచ్చిరొట్ట ఎరువు పంటగా నాటుకోవాలి. జనుము పూతకు వచ్చిన తరువాత చిన్న, చిన్న ముక్కలుగా కోసి పాదులో చుట్టూ వేయాలి. ● ప్రతి మొక్కకు రెండువైపులా ఒక్కో మైక్రోజెట్ (30 లేదా 40 లీటర్లు డిశ్చార్జ్ అయ్యేవి) అమర్చుకోవాలి. ● వేసవిలో చిన్న మొక్కలకు రోజుకు 150–165 లీటర్ల నీటిని అందించాలి. చెట్టుకు ఇరుపక్కల జెట్‌కు గంటకు 40 లీటర్ల సరఫరా సామర్థ్యం ఉంటే రోజుకు రెండు గంటలు నీరు అందించాలి. ఎదిగిన ఆయిల్‌పామ్ తోటల్లో వేసవిలో ప్రతి చెట్టుకు రోజుకు 250–330 లీటర్ల నీటిని అందించాలి. ● మూడేళ్ల లోపు వయస్సు ఉన్న మొక్కల్లోని పూగుత్తులను ప్రతి నెల అబ్లెషన్ సాదనంతో(రెండుసార్లు) తొలగించాలి. ● అవసరం మేరకు మాత్రమే (అన్ని చెట్లు కాకుండా) ఎండిన, విరిగిన లేదా చీడపీడలు ఆశించిన ఆకులను తొలగించాలి. ● ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటలు వేసినట్లయితే ఆయిల్‌పామ్ మొక్కలతో పాటు అంతర పంటలకు కూడా సిఫారసు మేరకు నీరు తప్పనిసరిగా అందేలా చూసుకోవాలి. ● ఎదిగిన ఆయిల్‌పామ్ తోటల్లో గెలలు కోసిన తరువాత నరికి ముక్కలు చేసిన ఆయిల్‌పామ్ ఆకులను, మగ పూల గుత్తులను, మొక్కజొన్న చొప్పను, ఖాళీ అయిన ఆయిల్‌పామ్ గెలలను, పాదుల్లో మల్చింగ్గా పరచాలి. ● ఎదిగిన ఆయిల్‌పామ్ తోటల్లో పక్వానికి వచ్చిన ప్రతి గెలను, అల్యూమినియం కడ్డీ లేదా కత్తిని ఉపయోగించి కోయాలి. ఆయిల్‌పామ్ సాగులో పాటించాల్సిన మెళకువలపై ఉద్యానవన అధికారి సూచనలు ఎదిగిన ఆయిల్‌పామ్ తోటలకు నెలకు ఎకరాకు 5 కిలోల యూరియా, 3 కిలోల డీఏపీ, 5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్, 2.5 కిలోల మెగ్నీషియం సల్ఫేట్‌ను, ఒక కిలో బోరాక్స్‌ను విడివిడిగా నీటిలో కరిగించి ఫర్టిగేషన్ ద్వారా మొక్కలకు అందించాలి. ఇలా చేయడం వల్ల సమయం, ఎరువులపై ఖర్చు కూడా ఆదా చేయొచ్చు. ఆయిల్‌పామ్ తోటల్లో ఎక్కువగా పోషక లోపాలు కనిపిస్తే మట్టి, పత్ర విశ్లేషణ కొరకు నమూనాలను సిఫార్సు చేసిన రీతిలో సేకరించి విశ్లేషణ కోసం పంపాలి. -
విద్యార్థులపై ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ
యాదగిరిగుట్ట: విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనబరుస్తుందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో సోమవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు, యువతకు కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని విమర్శించారు. పేద విద్యార్థులకు రూ.5లక్షల రుణాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కేబినెట్లో ఆ విషయాన్ని ప్రసావించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థుల హక్కులు సాధించేలా పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువతది కీలకపాత్ర అన్నారు. 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ఒగ్గు శివకుమార్, జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్‌రెడ్డి, ఆలేరు నియోజకవర్గ కన్వీనర్ ర్యాకల రమేష్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాసాల ఐలేష్‌యాదవ్, కొంపల్లి నరేష్, పల్లె సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ -
పడిపోతున్న నిమ్మ ధర
నకిరేకల్: వేసవిలో నిమ్మకాయలకు మంచి ధర వస్తుందనుకున్న రైతులు సరైన ధర లేక దిగాలు చెందుతున్నారు. పది రోజుల క్రితం పండు నిమ్మకాయలు బస్తాకు రూ.1800, పెద్ద సైజు కాయలు బస్తాకు రూ.2200, చిన్న సైజు కాయలు బస్తాకు రూ.1200 ధర లభించింది. గత రెండు, మూడు రోజుల నుంచి ఈ ధరలు సగానికి సగం పడిపోతున్నాయి. నకిరేకల్ నిమ్మ మార్కెట్లో ప్రస్తుతం పండు కాయ బస్తా ధర రూ.1000 నుంచి రూ.1300, పెద్ద సైజు కాయ బస్తాకు రూ.1200 ధర పలుకుతోంది. చిన్న సైజు కాయ బస్తాకు రూ.200 ధర వస్తుంది. నిమ్మ ఎగుమతయ్యే ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో అక్కడ నిమ్మ కొనుగోళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రేటు ఉందని చెట్ల మీద చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రైతులు కాయలను కోయడంతో దిగుబడులు పెరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో కూడా నిమ్మ అధికంగా దిగుబడి రావడంతో ఢిల్లీ, గుజరాత్ వంటి నగరాల్లో ధర పెరగడం లేదని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. రోజుకు ఏడు వేల బస్తాల రాక..ఉమ్మడి జిల్లాలో సూమారు 30వేల ఎకరాలకు పైగానే నిమ్మ తోటలు సాగువుతున్నాయి. దాదాపు 20వేల రైతు కుటుంబాలు, కౌలుదారుల కుటుంబాలు నిమ్మ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఏకై క నిమ్మ మార్కెట్‌ను 2018 జూన్ 17న నకిరేకల్‌లో ప్రారంభించడంతో ఈ ప్రాంతంలో అత్యధిక విస్తీర్ణంలో నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనే ఏటా మూడు లక్షల టన్నులకు పైనే నిమ్మ దిగుబడి వస్తోంది. నకిరేకల్ నిమ్మ మార్కెట్‌కు గత 15రోజుల వరకు ప్రతిరోజు 2వేల నుంచి 3వేల వరకు నిమ్మకాయల బస్తాలు రాగా.. తాజాగా వారం రోజుల నుంచి రోజుకు 6వేల నుంచి 7వేల బస్తాలు వస్తున్నాయి. ఈ నిమ్మ మార్కెట్ నుంచి డీసీఎంలలో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గుజరాత్ ప్రాంతాలకు నిమ్మకాయలు ఎగుమతి అవుతున్నాయి. నిమ్మ దిగుబడులు పెరగడంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా నిమ్మకాయలు అధికంగా రావడంతోనే ధరలు పడిపోయాయని మార్కెటింగ్ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపి మంచి ధర వచ్చేలా చూడాలని నిమ్మ రైతులు కోరుతున్నారు. వేసవిలో లభించని ఆశించిన రేటు దిగుబడి పెరగడంతో ధర లేదంటున్న మార్కెట్ అధికారులు -
భూ భారతికి శ్రీకారం
భూ సమస్యలు ఇక చకచకా పరిష్కారంసాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఽభూమిపై హక్కుల విషయంలో రైతులకు ఎదురయ్యే సమస్యలు ఇక క్షేత్ర స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతిని తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌ను డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్లు హజరయ్యారు. ధరణి స్థానంలో ఇకపై భూ భారతి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రెవెన్యూ చట్టాన్ని తెచ్చి, ఆ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ధరణిని ప్రారంభించింది. దాంతో రైతులకు ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోగా.. కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ధరణిలో అన్ని ఆప్షన్లు లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) చట్టం చేసింది. అయితే దానిని వెంటనే అమలు చేయలేదు. ధరణిలో ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? అనే అంశాలను ముందుగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. అక్కడ గుర్తించిన సమస్యల ఆధారంగా.. వాటి పరిష్కారాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్ఓఆర్ చట్టం–2025 అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగానే భూ భారతి పోర్టల్‌ను ప్రారంభించింది. మొదట రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా భూభారతిని అమలు చేయనుంది. ఆ తరువాత జూన్ నుంచి అన్ని మండలాల్లో అమలు చేయనుంది. అంతకంటే ముందుగా జిల్లాలో ప్రతి రోజు రెండు మండలాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సమావేశాలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరుకానున్నారు. ఈ చట్టంలో క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకు, ఆర్డీఓలకు కూడా అధికారాలు లభించనున్నాయి. ఫ భూ భారతి పోర్టల్‌ను లాంచనంగా ప్రారంభించిన సీఎం ఫ జూన్ నుంచి అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అమలు ఫ మళ్లీ తహసీల్దార్, ఆర్డీఓలకు అధికారాలు ఫ భూ భారతి ప్రారంభంలో జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్, అధికారులు -
రాజ్యాంగం వల్లే.. హక్కులు, పదవులు
నల్లగొండలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళుర్పిస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ సత్యం, ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనప కలెక్టర్ శ్రీనివాస్ తదితరులునల్లగొండ టౌన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే సమాజంలో ప్రతి ఒక్కరు హక్కులు, బాధ్యతలు, పదవులను పొందగలుగుతున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం డీఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా అంబేడ్కర్ పొందు పరిచిన ఆర్టికల్స్ వల్లే తాను ఐఏఎస్ కాగలిగానని చెప్పారు. భవిష్యత్‌లో ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే వారికి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే స్ఫూర్తి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌ను ఈ నెల 14 నుంచే అమల్లోకి తీసుకురానుందని ఇది చరిత్రలో నిలిచిపోనుందన్నారు. ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్‌నాయక్ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ చదువును ఆయుధంగా తీసుకుని సామాజిక మార్పును తీసుకొచ్చిన మహానుబావుడు అంబేడ్కర్ అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అదనపు ఎస్పీ రమేష్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జి డీడీ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, ఆయా సంఘాల నేతలు చక్రహరి రామరాజు, నేలపట్ల సత్యనారాయణ, దుడుకు లక్ష్మీనారాయణ, నకిరెకంటి కాశయ్యగౌడ్, బొర్ర సుధాకర్, పాలడుగు నాగార్జున, కత్తుల జగన్‌కుమార్, గోలి ఏడుకొండలు, కత్తుల షన్ముఖకుమార్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నూనె వెంకటస్వామి, బకరం శ్రీనివాస్, బాషపాక హరికృష్ణ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
ముగిసిన మహనీయుల జయంతి ఉత్సవాలు
నల్లగొండ టూటౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరుగుతున్న మహనీయుల జయంతి ఉత్సవాలు సోమవారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి హాజరై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో 57 మంది విద్యార్థులు, అధ్యాపకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో అడప సత్యనారాయణ, వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, అల్వాల రవి, అరుణప్రియ, కొప్పుల అంజిరెడ్డి, శ్రీదేవి, ప్రేమ్‌సాగర్, సుధారాణి, వసంత, రేఖ, సరిత, కళ్యాణి, దోమల రమేష్, సబీనా హెరాల్డ్, వై.ప్రశాంతి పాల్గొన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలి నల్లగొండ టౌన్ : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు సైదిరెడ్డి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గుర్రంవెంకట్రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల వెంకన్న, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు బొంగురాల నర్సింహలు డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో వారు మాట్లాడారు. మే 20న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమ్మెను విజయవంతానికి 19న టీఎన్జీఓ భవన్లో నిర్వహించే సదస్సుకు కార్మికులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నాయకులు ఎండీ.సలీం, పరిపూర్ణచారి, ఆర్.ఆచారి, బోడ ఇస్తారి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
రాజీవ్ యువ వికాసానికి భారీగా దరఖాస్తులు
నల్లగొండ : రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లా వ్యాప్తంగా 41,157 మంది నేరుగా దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 60 వేల మందికిపైగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు సోమవారంతో ముగిసింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ యువత స్వయం ఉపాధి పొందేలా వారికి ఆర్థిక చేయూత అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి ప్రభుత్వం మొదట ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఈ నెల 4వ తేదీ చివరి గడువుగా పేర్కొంది. తర్వాత దరఖాస్తు గడువను 14వ తేదీ వరకు పొడిగించి గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓ కార్యాలయంలో, పట్టణ వాసులు మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఆయా చోట్ల ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడే దరఖాస్తు పారాలు అందుబాటులో ఉంచింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు కూడా హార్డ్ కాపీని ఆయా కార్యాలయాల్లో అందజేయాలని సూచించింది. గడువు ముగిసే నాటికి 41,157 మంది నేరుగా దరఖాస్తు చేసుకోగా, ఆన్లైన్లో 60 వేల పైచిలుకే దరఖాస్తులు వచ్చాయి. వాటి పూర్తి వివరాలు ఇంకా తేలలేదు.ఫ నేరుగా 41,157 మంది.. ఆన్లైన్లో 60వేలకు పైగా.. ఫ ముగిసిన దరఖాస్తుల గడువుఆయా కార్పొరేషన్ల వారీగా వచ్చిన ఆఫ్‌లైన్ దరఖాస్తులు..కార్పొరేషన్ దరఖాస్తులుఎస్సీ 11,375 ఎస్టీ 5,698 బీసీ 20,915 ఈబీసీ 800 మైనార్టీ 2,173 క్రిస్టియన్ 96 -
ఆరేళ్లు.. 43,314 డెలివరీలు
మెరుగైన వైద్యం అందుతుంది ప్రభుత్వ ఆస్పత్రుల మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఆస్పత్రుల్లో ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తోంది. పీహెచ్సీ స్థాయిలోనే గర్భిణుల నమోదు చేసి వారిని రెగ్యులర్‌గా చెకప్‌కు తీసుకుపోతున్నారు. డెలివరీ అయ్యేంత వరకు ఆశ వర్కర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు గణనీయంగా పెరుగుతున్నాయి. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ, నల్లగొండనల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రికార్డుస్థాయిలో ప్రసవాలు నల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంతో ప్రభుత్వ ఆస్పత్రుల వైపు వచ్చేందుకు జంకే మహిళలు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రల్లో డెలివరీలు చేయించుకోవడానికి క్యూ కడుతున్నారు. నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో రికార్డు స్థాయిలో డెలివరీలు జరుతున్నాయి. ఆరేళ్లుగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 71,737 డెలివరీలు జరగ్గా.. ఒక్క ఎంసీహెచ్‌లోనే 43,314 ప్రసవాలు జరిగాయి. మిగిలిన అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 31,829 డెలివరీలు మాత్రమే జరిగాయి. మెరుగైన వసతులు నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటుగా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఆస్పత్రి ఉండడంతో నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. దాంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్, బ్లడ్ బ్యాంకు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ క్లిట్లను అందించి ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలను తల్లి బ్యాంక్ ఖాతాలో జమచేసింది. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చే సమయంలో, డెలివరీ తరువాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి సమయంతో ప్రభుత్వ వాహనంలో వారిని ఇంటికి చేర్చుతున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగింది. నమోదు నుంచి ప్రసవం వరకు పర్యవేక్షణ గర్భం దాల్చిన మూడవ నెలలోనే ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు వారి ఇంటి వద్దనే గర్భిణుల పేర్లను ప్రత్యేక ఫొర్టల్లో నమోదు చేస్తున్నారు. ఆ తరువాత ప్రతి చెకప్ కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లడంతోపాటు టీకాలు కూడా సరైన సమయంలో వేయిస్తున్నారు. డెలివరీల కోసం పీహెచ్‌సీలకు, ఏరియా ఆస్పత్రులకు తీసుకుపోతున్నారు. అక్కడ ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే వెంటనే అక్కడి వైద్యులు జీజీహెచ్‌కు రెఫర్ చేస్తున్నారు. ఆ సమయంలో గర్భిణి పరిస్థితి, ఆమెకు అందాల్సిన వైద్యం వివరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంసీహెచ్ యాప్‌లో డాక్టర్లు అప్లోడ్ చేస్తున్నారు. జీజీహెచ్‌లో ఉండే వైద్యులు గర్భిణి ఆస్పత్రికి చేరేలోపు అప్రమత్తమై ఆమెకు అందిచాల్సిన చికిత్సకు సిద్ధంగా ఉండి డెలివరీ చేస్తున్నారు. ఇక్కడ కూడా డెలివరీ కాని పరిస్థితి ఉంటే వెంటనే హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ తదితర ఆస్పత్రులకు రెఫర్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎంసీహెచ్ యాప్‌లో ఆప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో అక్కడి ఎంసీహెచ్ నోడల్ అధికారి వైద్యులను అప్రమత్తం చేసి సకాలంలో వైద్య అందించి డెలివరీలు చేస్తున్నారు. దీంతో మాతాశిశు మరణాలు తగ్గుతున్నాయి. ఇలా అంతా సవ్యంగా సాగుతుండడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు చేయించుకోవడానికి గర్భిణులు ఆసక్తి చూపుతున్నారు. ఎంసీహెచ్‌లో డెలివరీలు ఇలా.. సంవత్సరం ప్రసవాలు 2019–20 7,190 2020–21 7,4843. 2021–22 7,546 2022–23 7,639 2023–24 7,140 2024–25 6,315 మొత్తం 43,314 -
రైతును ముంచిన వడగండ్ల వాన
శాలిగౌరారం మండలంలో 1190 ఎకరాల్లో.. శాలిగౌరారం : అకాల వర్షానికి శాలిగౌరారం మండల వ్యాప్తంగా 1190 ఎకరాలోల పంటలు, 23 ఇళ్లు దెబ్బతిన్నట్లు తహసీల్దార్ యాదగిరి, ఏఓ సౌమ్య శృతి తెలిపారు. వరి 900 ఎకరాలు, మొక్కజొన్న 30 ఎకరాలు, నిమ్మతోటలు 260 ఎకరాల్ల దెబ్బతిన్నట్లు గుర్తించారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు, ధ్కంసమైన ఇళ్లను తహసీల్దార్ యాదగిరి సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఫ 200 ఎకరాల్లో దెబ్బతిన్న తోటలు ఫ విరిగిపోయిన మామిడి, నిమ్మ చెట్లునకిరేకల్ : ఈదురుగాలులు, వడగండ్ల వర్షం రైతులను నిండా ముంచాయి. గతంలో ఎన్నడూ లేనవిధంగా వీచిన గాలులతో మామిడి, నిమ్మ చెట్ల నేల కూలాయి. వడగండ్ల దాటికి కోతకొచ్చిన వరిచేలు దెబ్బతిన్నాయి. నకిరేకల్ మండలంలో ఆదివారం సాయంత్ర ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో సుమారు 210 ఎకరాల్లో పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. మండలంలోని ఓగోడు, పాలెం, టేకులగూడెం, నడిగూడెం, వల్లాబాపురం, నోముల, కడపర్తి గ్రామాల్లో నిమ్మ, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. దాదాపు 100 మంది రైతుల తోటలు దెబ్బతిన్నట్లు ఉద్యానవన అదికారులు నిర్ధారించారు. సోమవారం నకిరేకల్ ఉద్యానవన క్లస్టర్ అధికారి ప్రవీణ్ ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న తోటలను సందర్శించి నష్టపోయిన రైతుల వివరాలను సేకరించారు. 200 నిమ్మ చెట్లు విరిగిపోయాయి నేను 25 ఏళ్ల నుంచి నిమ్మ తోట సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నా. ఈదురుగాలుల దాటికి 200 నిమ్మ చెట్లు పూర్తిగా విరిగిపోయాయి. తోటలోనే ఉన్న నా ఇంటి పైకప్పు రేకులు కూడా లేయిపోయాయి. సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. నిమ్మ తోటే మాకు బతుకుదెరువు.. ప్రభుత్వమే మాకు సాయం చేసి ఆదుకోవాలి. – జక్కు వెంకట్‌రెడ్డి, రైతు టేకులగూడెం నష్టం అంచనా వేస్తున్నాం నకిరేకల్ మండలంలో సూమారు 200 ఎకరాల్లో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. నిమ్మకాయలకు మంచి గిరాకీ ఉన్న సమయంలోనే నష్టం వాటిల్లింది. పంట నష్టం వివరాలు సేకరిస్తున్నాం. నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం. – ప్రవీణ్‌కుమార్, ఉద్యాన అధికారి, నకిరేకల్ ● -
పెండింగ్ బిల్లు వచ్చే వరకు.. ట్రాక్టర్ ఇవ్వ
చందంపేట : సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర కావొస్తోంది. వారి పదవీకాలం ముగిసిన తర్వాత నిబంధనల మేరకు వారి ఆధీనంలో ఉన్న ట్రాక్టర్లను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించాలి. కానీ చందంపేట మండలంలోని బుడ్డోనితండా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ముడావత్ బాలునాయక్ ఆరు నెలలుగా గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను తన వద్దే ఉంచుకుంటున్నాడు. పంచాయతీ కార్యదర్శి వెళ్లి ట్రాక్టర్ గురించి అడిగితే.. పంచాయతీలో తాను చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. అవి వచ్చే వరకు ట్రాక్టర్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు. బకాయి బిల్లులు వచ్చాక ట్రాక్టర్ ఇస్తానని అన్నాడు. ఇక, తన ఆధీనంలో ఉన్న ట్రాక్టర్ పరికరాలను సైతం మార్చాడని తెలిసింది. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి యాదగిరిని వివరణ కోరగా.. పెండింగ్ బిల్లు రానిదే.. ట్రాక్టర్ ఇవ్వను అంటున్నాడని చెప్పారు. -
మిస్టరీగానే తల్లి, కుమార్తె మరణం
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన తల్లి, కుమార్తె మరణం మిస్టరీగానే మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి తన అక్క కుమార్తె రాజేశ్వరీ(34)ని 2008లో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఓ ప్రైవేట్ ఆగ్రో కెమికల్ సంస్థలో పనిచేస్తున్న సీతారాంరెడ్డి నల్లగొండ జిల్లా సేల్స్ మేనేజర్‌గా బదిలీపై 15ఏళ్ల క్రితమే మిర్యాలగూడకు వచ్చి హౌసింగ్‌బోర్డులో అద్దెకు ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు వేదశ్రీ, వేద సాయిశ్రీ(13) సంతానం. ఈ నెల 10న కంపెనీ బడ్జెట్ ఆడిట్ సమావేశం ఉండటంతో సీతారాంరెడ్డి హైదరాబాద్‌కు వెళ్లాడు. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన సీతారాంరెడ్డికి గొంతుపై గాయాలతో చిన్న కుమార్తె వేద సాయిశ్రీ, బెడ్రూంలో ఉరేసుకుని భార్య రాజేశ్వరీ మృతిచెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. నోరు విప్పని పెద్ద కుమార్తె..సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె వేదశ్రీ నోరు విప్పితేనే రాజేశ్వరీ, వేద సాయిశ్రీ మృతికి గల కారణాలు తెలుస్తాయి. కానీ ఆమె మాత్రం తాను శుక్రవారం రాత్రి నిద్రపోగా శనివారం మధ్యాహ్నం మేలుకువ వచ్చిందని చెబుతోంది. దీంతో వారిపై మత్తు పదార్ధాల ప్రయోగం జరిగిందా..? అనే అనుమానాలకు తావిస్తోంది. అయితే సీతారాంరెడ్డి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు వస్తున్న సమయంలో ‘ఎక్కడ ఉన్నావు డాడీ’ అంటూ మెసేజ్ చేయడం, తల్లి ఫోన్‌కు వరుసగా వస్తున్న ఫోన్ కాల్స్‌ను కట్ చేయడం వంటివి చూస్తే పెద్ద కుమార్తె వేదశ్రీ స్పృహాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మృతదేహాలపై కత్తి గాట్లు..రాజేశ్వరీ ఎడమ చేయి మణికట్టు, పాదాల వద్ద కత్తిగాయాలు ఉండగా, వేద సాయిశ్రీ గొంతును పదునైన కత్తితో కోసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యగానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు నేతృత్వంలో మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే మృతుల ఇంట్లో ఓ లేఖ లభ్యమైనట్లు ప్రచారం జరుగుతుండగా పోలీసులు మాత్రం దానిని ధ్రువీకరించడం లేదు. మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ మోతీరాం పర్యవేక్షణలో తల్లి, కుమార్తె మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. అనుమానాస్పద స్థితిలో తల్లి, కుమార్తె మృతిఅన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ తల్లి, కుమార్తె మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. మూడు బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మృతుల శరీరాలపై కత్తిగాట్లు ఉన్నందున పోస్టుమార్టం నివేదిక తర్వాత క్లూస్‌టీం సమాచారం మేరకు లోతైన విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. -
ప్రారంభానికే పరిమితమా ?
మునుగోడు : రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించేందుకు అధికారులు వారం రోజుల క్రితం మునుగోడు మండలంలో 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కానీ నేటికీ ఏ ఒక రైతు ధాన్యం కూడా తూకం వేయలేదు. దీంతో పది పదిమేను రోజులుగా.. రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. మండల వ్యాప్తంగా ఒక్కో కొనుగోలు కేంద్రంలో 50 నుంచి 200 మంది రైతులు ధాన్యం రాశులు పోశారు. అధికారులు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ధాన్యం ఆరబెడుతూ.. సాయంత్రానికి రాశి చేస్తున్నారు. మరోవైపు ఆకాలు వర్షాలు కురుస్తుండడంతో తమ ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని కొనుగోళ్లు ప్రారంభించాల రైతులు కోరుతున్నారు. -
మాటల యుద్ధం
మంత్రి పదవిపై.. అధిష్టానం నిర్ణయం ఏమిటో? ప్రస్తుత పరిస్థితులు అన్నింటిని గమనిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. జానారెడ్డి లేఖను పరిగణనలోకి తీసుకొని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇస్తుందా..? ముందుగా ఇచ్చిన హామీ మేరకు రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి మాట నిలుపుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకే జిల్లా కాంగ్రెస్ పెద్దలు డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌కు ఎమ్మెల్సీ పదవిని ఇప్పించారన్న చర్చ సాగుతోంది. తనకు మంత్రి పదవి కావాలని బాలునాయక్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన సమయంలో ఇది జరగడం, ఆయన ఎప్పుడు బహిర్గతం అవుతారోనన్నది చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్‌లో మంత్రి పదవి మంట రేపుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మాజీ మంత్రి జానారెడ్డి తీరుపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదివారం చౌటుప్పల్, చండూరులో బహిరంగంగానే విమర్శలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో 15 రోజుల కిందట జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దాదాపుగా ఖరారైందని, ఇక ప్రకటనే తరువాయి అన్న చర్చ జోరుగా సాగింది. అదే సమయంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కేబినెట్లో చోటు కల్పించాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాయడంతో చిచ్చు మొదలైంది. రాజగోపాల్‌రెడ్డికి వచ్చే మంత్రి పదవిని అడ్డుకునేందుకు ఆయన లేఖ రాశారని రాజగోపాల్‌రెడ్డి అనుచరులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోలోపల రగులుతూనే ఉన్నా ఆ మంట ఆదివారం బహిర్గతమైంది. జానాపై భగ్గుమన్న రాజగోపాల్‌రెడ్డి ఆదివారం చౌటుప్పల్, చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీల నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, కొంతమంది దుర్మార్గులు అడ్డుపడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 20 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డి ధర్మరాజు మాదిరిగా పెద్దన్నలా వ్యవహరించకుండా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషించారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకుండా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ లేఖ రాయడమేంటని ఆయన ప్రశ్నించారు. సామాజిక న్యాయం, సామాజిక కూర్పు అంటున్న జానారెడ్డికి ఇన్నేళ్ల తర్వాత ఆ అంశం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తమ కుటుంబంలో ఇద్దరికీ పదవులు ఇస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మొత్తానికి జానారెడ్డి లేఖ కాంగ్రెస్‌లో కాకరేపగా.. ఆయనను రాజగోపాల్‌రెడ్డి ధృతరాష్ట్రుడితో పోల్చుతూ హాట్ కామెంట్ చేయడం పార్టీలో చిచ్చు రగిల్చింది. ఫ జానారెడ్డి తీరుపై భగ్గుమన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఫ ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని మండిపాటు ఫ వేరే జిల్లాలకు మంత్రి పదవులివ్వాలని లేఖ రాయడంపై అభ్యంతరం ఫ తెలంగాణ కోసం పోరాడిన కుటుంబంలో ఇద్దరికి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నమంత్రి పదవి రచ్చ ఎటు దారి తీస్తుందో? ఎప్పుడూ గుంభనంగా ఉండే జానారెడ్డి ఒక్కసారిగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ లేఖ రాయడం వెనుక ఆంతర్యమేమిటి? అన్నది చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని సూటిగా చెప్పలేక వేరే జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని లేఖ రాశారన్న చర్చ జరుగుతోంది. ఆయన లేఖ తరువాతే కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడిందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి బహిరంగా విమర్శలు చేయడం ఎటు దారి తీస్తుందో చూడాలి. అంతేకాదు మరోవైపు రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు మంత్రి అయ్యే అర్హత లేదా? అని ప్రశ్నించారు. తాను ఇన్నాళ్లూ ఆగానని, ఇకపై కచ్చితంగా మంత్రి పదవిని అడుగుతానని స్పష్టం చేశారు. అంతేకాదు ఖమ్మంలో 9 మంది గెలిస్తే మూడు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నల్లగొండలో 11 మంది గెలిచినప్పుడు ఎందుకు మూడో మంత్రి పదవి ఇవ్వరని ప్రశ్నించారు. -
రికార్డు స్థాయిలో సభలు పెట్టాం
నల్లగొండ : ఉద్యమ పార్టీగా రికార్డు స్థాయిలో సభలు పెట్టామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం ఆదివారం నల్లగొండలో నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ 25 ఏళ్ల పండుగ ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహిస్తున్నామని.. ఆ సభను విజయవంతం చేసేందుకు వెల్లువలా వచ్చేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు లాంటి నాయకులు టీఆర్ఎస్ ఉండదు మధ్యలోనే బంద్ అవుతుందని చెప్పారని.. కానీ, ఎన్నో మైలురాళ్లు, అవరోధాలను అధిగమించి తెలంగాణను అడ్డుకునే రాక్షసులను తరిమికొట్టామన్నారు. మంత్రి కోమటిరెడ్డి కోతల మంత్రిగా మారాడని.. మంత్రుల చేతకానితనం వల్లే రైతులకు మద్దతు ధర అందడం లేదన్నారు. ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగితే సహాయక చర్యలు చేసి బాధితులను వెలికితీసే దమ్ము, తెలివి కాంగ్రెస్ నాయకులకు లేదని ఎద్దేవా చేశారు. హాస్టళ్లలో కల్తీ నిత్యావసరాలు సరఫరా చేస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని.. ఇందులో మంత్రుల మనుషులే ఉన్నారని ఆరోపించారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, చకిలం అనిల్‌కుమార్, మాలె శరణ్యారెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీను, రవీందర్రావు, కరీంపాష, మారగోని భిక్షం, బోనగిరి దేవేందర్, రవీందర్‌రెడ్డి, మారగోని గణేష్, రావుల శ్రీని వాస్‌రెడ్డి, మెరుగు గోపి పాల్గొన్నారు. ఫ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనం వెల్లువలా తరలివస్తారు ఫ ఎన్నో అవరోధాలను అధిగమించి రాక్షసులను తరిమికొట్టాంఫ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి -
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
రైతులు సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం పశువులకు, గేదెల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం ఉచితంగా టీకాలు వేయనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి వైద్య బృందాలు గ్రామాలకు వెళ్లి టీకాలు వేస్తాయి. ఆయా గ్రామాలకు వచ్చినప్పుడు బృందాలకు రైతులు సహకరించి పశువులకు టీకాలను వేయించుకోవాలి. ప్రభుత్వం ఉచితంగా టీకాల వేస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ జీవీ రమేష్, జిల్లా పశువైద్యాధికారి ఫ బృందాలను ఏర్పాటు చేసిన పశు సంవర్థక శాఖ ఫ పశు వైద్యశాలలకు టీకాలు సరఫరా నల్లగొండ అగ్రికల్చర్ : పశువుల్లో వ్యాప్తి చెందే గాలికుంటు వ్యాధి నివారణ కోసం జిల్లా పశు సంవర్థక శాఖ టీకాలు వేయనుంది. ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా వేసే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కోసం జిల్లా పశుసంవర్థక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. టీకాలను వేయడానికి జిల్లా వ్యాప్తంగా 90 బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో పశు వైద్యుడితో పాటు ముగ్గురు సిబ్బంది ఉంటారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పశు వైద్యశాలలకు టీకాలను సరఫరా చేసింది. ఈ నెల 15న మంగళవారం టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మే 15వ తేదీ వరకు నెల రోజుల పాటు (సెలవు దినాలు మినహా) పశువులు, గేదెలకు టీకాలను వేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచే.. జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షలకుపైగా తెల్ల, నల్ల పశువులు ఉన్నట్లు జిల్లా పశుసంవర్థక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వేసవిని దృష్టిలో ఉంచుకుని సిబ్బంది ప్రతి గ్రామానికి ఉదయం 8 గంటలకు చేరుకుని మధ్యాహ్నం 12 గంటల వరకు టీకాలు ఉచితంగా వేయనున్నారు. ఆయా గ్రామాలకు వెళ్లే ముందు రైతులకు ముందస్తుగా సమాచారం అందించనున్నారు. ప్రతి పశువుకూ టీకా వేసేలా పశుసంవర్థక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
నల్లగొండ బిడ్డకు అత్యున్నత పదవి
నల్లగొండ : నల్లగొండ వాసికి అత్యున్నత పదవి లభించింది. హైకోర్ట్ జస్టిస్‌గా పలు ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జస్టిస్ షమీమ్ అక్తర్‌ను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ షమీమ్ అక్తర్ ఇటీవల రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా ఏమాత్రం వివాదం లేకుండా ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇచ్చారు. నల్లగొండ పట్టణానికి చెందిన ఒక సామాన్య సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన షమీమ్ పట్టణంలోనే పాఠశాల, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. నాగపూర్‌లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన అనంతరం ఎల్ఎల్ఎం, ీపీహెచ్డీ చేశారు. నల్లగొండలో దాదాపు 16 సంవత్సరాల లాయర్‌గా ప్రాక్టీస్ చేసి సివిల్, క్రిమినల్, రెవెన్యూ కేసులను వాదించారు. 2002లో జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలంగాణలోని వివిధ న్యాయ స్థానాల్లో సేవలందించారు. న్యాయపరమైన తీర్పులు, సామర్థత, చట్టంపై లోతైన అవగాహన తదితర కారణాలతో జస్టిస్ షమీమ్ అక్తర్‌కు 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు కీలకపాత్ర బడుగు, బలహీన వర్గాలు ప్రధానంగా కార్మికులు, మహిళలు, పేదల హక్కుల పరిరక్షణలో జస్టిస్ షమీమ్ అక్తర్ కీలక పాత్ర వహించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం (ఏడీఆర్) ద్వారానే సత్వర న్యాయం లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అనేక కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించి కోర్టులపై కేసుల భారాన్ని తగ్గించారు. రాజ్యాంగం అంశాలపై విశేష పట్టు ఉన్న జస్టిస్ షమీమ్ అక్తర్ తీర్పులు పలు కేసుల తుది నిర్ణయాలకు మార్గదర్శకంగా నిలిచాయి. 2022లో హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయినప్పటికీ అనేక న్యాయ సంబంధిత, రాజ్యాంగ పరమైన అంశాలపై తన ప్రసంగాల ద్వారా యువ న్యాయవాదులు, ప్రముఖులు సహచర న్యాయమూర్తులకు ఆదర్శంగా నిలిచారు. ఆయనను తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్ నియామకం -
ఆయిల్‌పాం రైతులకు ప్రోత్సాహకం
రైతులు సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పాం సాగుకు ప్రోత్సాహకం అందిస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే సాగులో ఉన్న రైతులకు ప్రోత్సాహక డబ్బులను జమ చేసింది. జిల్లాలో ఆయిల్‌పాం కంపెనీ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఆయిల్‌పాం సాగును విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. – పిన్నపురెడ్డి అనంతరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నల్లగొండ అగ్రికల్చర్ : ఆయిల్‌పాం సాగును విస్తరించడానికి ఉద్యానవన శాఖ ప్రత్యేక ప్రణాళికలను తయారు చేసింది. ఆయిల్‌పాం సాగుపై రైతుల్లో అవగాహన కల్పించడానికి క్షేత్రస్థాయి అధికారులను సన్నద్ధం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 9,768 ఎకరాల్లో అయిల్‌పాం తోటలను 2,217 మంది రైతులు సాగు చేశారు. ఆయా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి సంబంధించిన ప్రోత్సాహకం రూ.6.144 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. సాగు రెండింతలు చేయాలని లక్ష్యం.. ఆయిల్‌పాం సాగును జిల్లాలో రెండింతలు చేయాలని ఉద్యానవన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం తోటలను సాగుచేసే రైతులను ప్రోత్సహిస్తోంది. ఎకరా ఆయిల్‌పాం సాగుకు 57 మొక్కలు అవసరం కాగా ఒక్కో మొక్కకు రూ.193 గాను.. రైతు రూ.20 చెల్లిస్తే.. ప్రభుత్వం మిగతా రూ.173 చెల్లిస్తుంది. సాగుకు అవసరమైన డ్రిప్‌ను ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం సబ్సిడీపై, బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడీపై అందిస్తోంది. ఎకరానికి ప్రతి సంవత్సరం ఎరువులు, పురుగుల మందుతో పాటు అంతర్‌పంట సాగు చేసుకునేందుకు రూ.4200 ప్రోత్సాహకం ఇస్తుంది. సాగు చేసిన నాటి నుంచి కాతకు వచ్చేంత వరకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది. మెట్రిక్ టన్నుకు రూ.21 వేలు.. ఎకరం వరికి సరిపోను నీరు ఉంటే మూడు ఎకరాల్లో ఆయిల్‌పాం తోటను సాగు చేసుకోవచ్చు. ఆయిల్‌పాం తోట నాలుగు సంవత్సరాలకు కాతకు వస్తుంది. కాతకు వచ్చిన తరువాత ఆయిల్‌పాం గెలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తుంది. మెట్రిక్ టన్నుకు రూ.21 వేలకు పతాంజలి సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసుంది. కొత్తలూరులో కంపెనీ! జిల్లాలోని అనుముల మండలం కొత్తలూరు గ్రామంలో పతాంజలి సంస్థ అయిల్‌పాం కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఆ గ్రామంలో 16 ఎకరాల భూమిని ఆ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇంకో 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసి త్వరలో కంపెనీ ఏర్పాటు పనులను ప్రారంభించే అవకాశం ఉంది. అయిల్‌పాం కంపెనీ ఏర్పాటు పూర్తయితే జిల్లాలో సాగు విస్తీర్ణం బాగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఉద్యానవన శాఖ అంచనాలు వేస్తోంది. ఫ రైతుల ఖాతాల్లో డబ్బు జమచేసిన ప్రభుత్వం ఫ సాగును ప్రోత్సహించడానికి ప్రణాళికలురైతుల ఖాతాల్లో ప్రోత్సాహకం జమ ఇలా.. సంవత్సరం రైతులు విస్తీర్ణం పోత్సాహకం (రూ.కోట్లలో) 1వ 401 1856 2.8202వ 934 3933 1.6523వ 651 3290 1.3404వ 141 789 0.332 -
విద్యుత్ తీగలు తగిలి గడ్డి దగ్ధం
యాదగిరిగుట్ట రూరల్: విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్లో తీసుకెళ్తున్న గడ్డి దగ్ధమైంది. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండలం తేరాల గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నల్ల అరుణ్ ఆదివారం 130కట్టల గడ్డిని తన ట్రాక్టర్లో లోడు చేసుకుని తేరాల గ్రామం నుంచి వయా ఆలేరు, బాహుపేట మీదుగా పెద్దకందుకూరు గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బాహుపేట గ్రామానికి రాగానే విద్యుత్ తీగలు గడ్డి కట్టలకు తాకడంతో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు పెద్దవి కావడంతో డ్రైవర్ అరుణ్ ట్రాక్టర్‌పై నుంచి కిందకు దూకాడు. ట్రాక్టర్ రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. వెంటనే స్థానికుల సహాయంతో హుటాహుటిన చెరువులోని నీళ్లతో గడ్డికి అంటుకున్న మంటలను ఆర్పుతూ, జేసీబీ సహాయంతో దగ్ధమవుతున్న గడ్డిని కిందపడేశారు. అరుణ్‌కు స్వల్ప గాయాలు కావడంతో ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. నాలుగు టీంలతో గాలింపునల్లగొండ: నల్లగొండలో సంచలనం సృష్టించిన మణికంఠ ఫొటో కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఎస్పీ శరత్చంద్ర పవార్ నిందితులను పట్టుకునేందుకు నాలుగు టీంలను ఏర్పాటు చేయగా.. ఆ టీంలు గాలింపు చర్యలు చేపట్టాయి. టూటౌన్ పోలీసులు అనుమానితులతో పాటు హత్యకు ముందు మృతుడితో ఫోన్లో మాట్లాడిన వారిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. -
మిస్టరీగానే తల్లి, కుమార్తె మరణం
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన తల్లి, కుమార్తె మరణం మిస్టరీగానే మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి తన అక్క కుమార్తె రాజేశ్వరీ(34)ని 2008లో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఓ ప్రైవేట్ ఆగ్రో కెమికల్ సంస్థలో పనిచేస్తున్న సీతారాంరెడ్డి నల్లగొండ జిల్లా సేల్స్ మేనేజర్‌గా బదిలీపై 15ఏళ్ల క్రితమే మిర్యాలగూడకు వచ్చి హౌసింగ్‌బోర్డులో అద్దెకు ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు వేదశ్రీ, వేద సాయిశ్రీ(13) సంతానం. ఈ నెల 10న కంపెనీ బడ్జెట్ ఆడిట్ సమావేశం ఉండటంతో సీతారాంరెడ్డి హైదరాబాద్‌కు వెళ్లాడు. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన సీతారాంరెడ్డికి గొంతుపై గాయాలతో చిన్న కుమార్తె వేద సాయిశ్రీ, బెడ్రూంలో ఉరేసుకుని భార్య రాజేశ్వరీ మృతిచెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. నోరు విప్పని పెద్ద కుమార్తె..సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె వేదశ్రీ నోరు విప్పితేనే రాజేశ్వరీ, వేద సాయిశ్రీ మృతికి గల కారణాలు తెలుస్తాయి. కానీ ఆమె మాత్రం తాను శుక్రవారం రాత్రి నిద్రపోగా శనివారం మధ్యాహ్నం మేలుకువ వచ్చిందని చెబుతోంది. దీంతో వారిపై మత్తు పదార్ధాల ప్రయోగం జరిగిందా..? అనే అనుమానాలకు తావిస్తోంది. అయితే సీతారాంరెడ్డి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు వస్తున్న సమయంలో ‘ఎక్కడ ఉన్నావు డాడీ’ అంటూ మెసేజ్ చేయడం, తల్లి ఫోన్‌కు వరుసగా వస్తున్న ఫోన్ కాల్స్‌ను కట్ చేయడం వంటివి చూస్తే పెద్ద కుమార్తె వేదశ్రీ స్పృహాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మృతదేహాలపై కత్తి గాట్లు..రాజేశ్వరీ ఎడమ చేయి మణికట్టు, పాదాల వద్ద కత్తిగాయాలు ఉండగా, వేద సాయిశ్రీ గొంతును పదునైన కత్తితో కోసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యగానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు నేతృత్వంలో మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే మృతుల ఇంట్లో ఓ లేఖ లభ్యమైనట్లు ప్రచారం జరుగుతుండగా పోలీసులు మాత్రం దానిని ధ్రువీకరించడం లేదు. మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ మోతీరాం పర్యవేక్షణలో తల్లి, కుమార్తె మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ తల్లి, కుమార్తె మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. మూడు బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మృతుల శరీరాలపై కత్తిగాట్లు ఉన్నందున పోస్టుమార్టం నివేదిక తర్వాత క్లూస్‌టీం సమాచారం మేరకు లోతైన విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. మూడు బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు -
కాళ్ల పారాణి ఆరకముందే వివాహిత ఆత్మహత్య
చౌటుప్పల్: పైళ్లెన 27 రోజులకే ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పద్మశాలికాలనీలో ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భువనగిరి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన గాయత్రి అలియాస్ లావణ్య(19)కు చౌటుప్పల్‌కు చెందిన జెల్ల సంతోష్‌తో మార్చి 16న వివాహం జరిగింది. సంతోష్ స్థానికంగా ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగానే ఆదివారం ఉదయం సంతోష్ డ్యూటీకి వెళ్లాడు. సంతోష్ తల్లిదండ్రులు వివాహానికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న గాయత్రి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివాహానికి వెళ్లిన అత్తమామలు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి గాయత్రి విగతజీవిగా కనిపించింది. గాయత్రి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతురాలికి తల్లిదండ్రులు లేరని సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు
కేతేపల్లి: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన చల్లా రఘురాములు, చల్లా అశోక్, దిలీప్ కలిసి ఖమ్మంలో తమ బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు కారులో వెళ్తున్నారు. మార్గమధ్యలో కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామ జంక్షన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కేతేపల్లి 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రఘురాములు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కారు ఢీకొని.. బీబీనగర్: బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూరుకు చెందిన వినయ్, గౌతమ్ బైక్‌పై హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్తుండగా.. బీబీనగర్ మండల కేంద్రంలోకి రాగానే వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినయ్, గౌతమ్‌కు గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్ మృతి
తిరుమలగిరి: విధి నిర్వహణలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం గన్యానాయక్తండాకు చెందిన రమేష్ రాథోడ్(49) హెడ్‌కానిస్టేబుల్‌గా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో మూడేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రమేష్ రాథోడ్‌కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుర్చీలోనే కూలబడిపోయాడు. తోటి సిబ్బంది గమనించి వెంటనే సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య, కుమార్తె ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమా ర్తె, ఉన్నారు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
50 ఏళ్ల ఆత్మీయ సమ్మేళనం
సూర్యాపేటటౌన్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో 1971–74 వరకు బీఏ, బీకాం చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం కళాశాల ఆవరణలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆనాడు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన బి. విశ్వనాథంను ఘనంగా సన్మానించి మెమొంటో అందజేశారు. పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. కళాశాలలో మొదటి బ్యాచ్ తమదేనని, తమ బ్యాచ్‌లో మొత్తం 35 మంది ఉండగా.. ఆత్మీయ సమ్మేళనానికి 19 మంది మాత్రమే హాజరయ్యామని పేర్కొన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకొని సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వి. వెంకటేశులు, పదవీ విరమణ చేసిన అధ్యాపకులు, ఆనాటి పూర్వ విద్యార్థులు ఎన్. బాల్‌రెడ్డి, ఎన్. పిచ్చిరెడ్డి, శేఖర్‌రెడ్డి, సంజీవరెడ్డి, వెంకటరంగయ్య, కృపాకర్, అమృతారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, జానకి రాంరెడ్డి, లింగారెడ్డి, యానాల సుదర్శన్‌రెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
రైస్ మిల్లర్ల పరేషన్
మిర్యాలగూడ: రాష్ట్ర ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం డిమాండ్ పడిపోయింది. గతంలో కంటే 80శాతం మేరకు మార్కెట్లో సన్న బియ్యం డిమాండ్ లేకపోవడంతో తమ వద్ద ఉన్న బియ్యాన్ని ఎలా అమ్ముకోవాలో తెలియక మిల్లర్లు సతమతమవుతున్నారు. పైగా గత వానాకాలం సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యంలో 20శాతం మేరకు నిల్వ ఉండగా ఇప్పుడు కొనుగోలు చేసిన ధాన్యంతో మిల్లుల్లో గోదాములు నిండుకుండలా ఉన్నాయి. మార్కెట్లో సన్న ధాన్యానికి డిమాండ్ లేకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లాలో 360కు పైగా మిల్లులు.. ఉమ్మడి జిల్లాలో 360కు పైగా మిల్లులు ఉన్నాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో 190, సూర్యాపేట జిల్లాలో 100, యాదాద్రి భువనగిరి జిల్లాలో 70 మిల్లులు ఉన్నాయి. ఇందులో మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోనే 90కు పైగా మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లుల ద్వారా అత్యధికంగా సన్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు, వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. పెరిగిపోతున్న మిల్లింగ్ చార్జీలు.. ధాన్యాన్ని కొనుగోలు చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన ఖర్చులన్నీ పరిగణలోకి తీసుకుంటే పెట్టుబడి కూడా రావడం లేదని మిల్లర్లు వాపోతున్నారు. క్వింటాకు రూ.2300 సన్నరకం ధాన్యం కొనుగోలు చే స్తే దానిని బాయిలర్‌లో వేసేందుకు అదనంగా రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చు వస్తుంది. దీంతో క్వింటాకు రూ.2700 వరకు ధర పడుతుంది. దాన్ని మిల్లింగ్ చేసినట్లయితే 55కేజీల బియ్యం, 10 కేజీల నూక వస్తుంది. 55కేజీల బియ్యానికి రూ.2700 ఖర్చయితే మిల్లులకు కిలో బియ్యానికి హెచ్‌ఎంటీకి రూ.45, ఇతర క్వాలిటీకి రూ.48 ఖరీదు అవుతుంది. బ్యాగులు, ఎగుమతుల చార్జీలు, హమాలీల ఖర్చులు కలుపుకుంటే కనీసం రూ.5 ఖర్చు పడుతుంది. కానీ మార్కెట్లో హెచ్‌ఎంటీకి రూ.4500, ఇతర సన్న రకాలకు రూ.4800 ధర ఉంది. మొత్తంగా రూ.200 నుంచి రూ.300 వరకు నష్టం వస్తుంది. ప్రధానంగా హెచ్ఎంటీ రకం బియ్యానికి హైదరాబాద్‌లోనే మార్కెటింగ్ ఉంటుంది. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇవ్వడం ద్వారా హైదరాబాద్‌లో హెచ్ఎంటీ రకం బియ్యం అడిగేవారు లేకపోవడతో ధర పడిపోయింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతయ్యే సన్నరకం బియ్యం ధర కూడా పడిపోయింది. కర్ణాటకలో రైస్ భాగ్య పథకం రద్దుతో.. గతంలో సన్న బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కర్ణాటక ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేసే బదులు రైస్ భాగ్య పథకాన్ని(నగదు బదిలీ) అమలు చేశారు. రేషన్ కార్డుదారులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులకు మరికొన్ని కలుపుకుని సన్న బియ్యం కొనుక్కునేవారు. కానీ ఆ రాష్ట్రంలో సన్న ధాన్యం ఎక్కువగా దిగుబడి రావడంతో రైస్ భాగ్య పథకాన్ని రద్దు చేసి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇదే తరహాలో బిహార్, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఒడిషా, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో సన్న ధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో బీపీటీ సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా రాబోయే 9 నెలలకు కావాల్సిన స్టాక్ ప్రభుత్వం అందుబాటులో ఉంచుకుంది. దీంతో సన్న బియ్యాన్ని ప్రైవేట్ మార్కెట్లో కొనే పరిస్థితి లేకుండా పోయింది. రూ.600 కోట్లు పెండింగ్..ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని అప్పగించేందుకుగాను సీఎంఆర్ కింద మిల్లులకు ప్రతి సీజన్‌కు కేటాయిస్తుంటారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో సుమారు 270కు పైగా మిల్లులు సీఎంఆర్ పైనే ఆధారపడి నడస్తున్నాయి. గత పది సీజన్ల నుంచి సీఎంఆర్ బియ్యం అందించినందుకుగాను ప్రభుత్వం నుంచి మిల్లులకు కోట్ల రూపాయల బాకీ పడి ఉంది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే రూ.600కోట్లకు పైగా మిల్లింగ్ చార్జీలు రావాల్సి ఉంది. చార్జీలు ఇవ్వాలని మిల్లర్లు పలుమార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఫలితం లేదు. పైగా మిల్లుల వద్ద గన్నీ సంచులు పెండింగ్‌లో ఉన్నాయని సాకులు చెప్పి దానికి గాను మిల్లింగ్ చార్జీలు సరిపోతుందని ప్రభుత్వం నుంచి సమాధానం రావడంతో మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీతో పడిపోయిన డిమాండ్ ఎగుమతులు లేక మిల్లుల్లోనే బియ్యం స్టాక్ ఐదేళ్లుగా అందని సీఎంఆర్ బిల్లులు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న మిల్లర్లుమా ఇబ్బందులను గుర్తించాలిమిల్లర్ల ఇబ్బందులను కూడా ప్రభుత్వం గుర్తించాలి. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో అన్నిరకాలుగా సహకారం అందించాం. అయినప్పటికీ మాపై నిందలు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యంకు డిమాండ్ లేకపోవడంతో మిల్లుల్లో ధాన్యం పెద్దఎత్తున పేరుకుపోయింది. వాటిని అమ్ముకునేందుకు కష్టాలు పడుతున్నాం. స్టాక్ ఉన్న నిల్వలకు వడ్డీ, తరుగును పరిగణిస్తే నష్టాలే వస్తాయి. – గౌరు శ్రీనివాస్, మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుపెండింగ్ బిల్లులు చెల్లించాలిమిర్యాలగూడ పరిసరా ల్లోని మిల్లుల ద్వారా గత సీజన్లో చేసిన మిల్లింగ్ చార్జీలు కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. గన్నీ సంచుల పెండింగ్ కారణంతో బిల్లులు ఇవ్వడం లేదు. చిరిగినోయిన, పనికిరాని బస్తాలకు రూ.21 ధర నిర్ణయించడం వల్ల మిల్లర్లకు నష్టం జరుగుతుంది. మిల్లుల వద్ద గన్నీ సంచులను ప్రభుత్వం తీసుకొని మిల్లింగ్ చార్జీలను వెంటనే చెల్లించాలి. – వెంకటరమణచౌదరి, మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి -
బీపీ మండల్ సిఫారసులు అమలుచేయాలి
మునుగోడు: దేశంలో అధికశాతం ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో తగినా వాటా ఇవ్వాలని బీపీ మండల్ చేసిన సిఫారసులను ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం బీపీ మండల్ 43వ వర్ధంతి సందర్భంగా మునుగోడులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీసీల సామాజిక స్థితిగతులపై బీపీ మండల్ సమగ్ర అధ్యయనం చేసి ఇచ్చిన 40 సిఫారసుల్లో కేవలం 2 మాత్రమే అమలు చేయడం విచారకరమన్నారు. మిగిలిన సిఫారసులను అమలుచేసే వరకు తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు గుంటోజు వంకటాచారి, యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి విజయ్‌గౌడ్, బూడిద మల్లిఖార్జున్‌గౌడ్, మిర్యాల వెంకన్న, ఈదులకంటి కై లాస్‌గౌడ్, పాలకూరి కిరణ్, మేకల మల్లయ్యయాదవ్, యాదప్ప, లింగయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ -
బైక్‌ను ఢీకొన్న ట్యాంకర్.. ఒకరు దుర్మరణం
చౌటుప్పల్ రూరల్: బైక్‌ను వెనుక నుంచి కెమికల్ ట్యాంకర్ ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామానికి చెందిన వెల్గ నర్సిరెడ్డి(48) సంస్థాన్ నారయణపురం మండలం మల్లారెడ్డిగూడెంలో ఉంటున్న తన కుమార్తె ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామ స్టేజీ వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కెమికల్ ట్యాంకర్ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సిరెడ్డి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీ సులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
సాగునీటి వనరుల కల్పనలో తుంగతుర్తికి పెద్దపీట
మోత్కూరు: సాగునీటి వనరుల కల్పనలో తుంగతుర్తి నియోజకవర్గానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెద్దపీట వేశారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో గల జల సౌధ కార్యాలయంలో ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన సాగు, తాగునీరు పెండింగ్ పనులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గంలోని 9 మండలాల్లో తాగు, సాగు నీటి సమస్యలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సంబంధిత ఉన్నత స్థాయి అధికారులకు వివరించారు. రానున్న రోజుల్లో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని బిక్కేరు వాగుపై ఆరు చెక్‌డ్యాంలు కట్టడం ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందించగలిగామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాగు నీటి కొరత లేకుండా చూడటం వల్లనే పంట దిగుబడి బాగా పెరిగిందన్నారు. మరికొన్ని మండలాల్లో కూడా చెక్‌డ్యాంల నిర్మాణం అవసరమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అడ్డగూడూరు, శాలిగౌరారం మండలాల్లోని మానాయికుంట చెక్‌డ్యాం, బునాదిగాని కాల్వ, కేతిరెడ్డి కాల్వ పూర్తిచేస్తే వేలాది ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉందని వివరించారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వ, గంధమల్ల రిజర్వాయర్ ద్వారా మరిన్ని చెరువులు నింపాలని ఆయన కోరారు. చెరువులు, కుంటలు, ట్యాంకులు నింపడంతో సాగు మరింత పెరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలోని సాగు నీటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులను కేటాయించాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌అలీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
అన్నదాతను ముంచిన అకాల వర్షం
నల్లగొండ/జనగామ రూరల్/వేములపల్లి: రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో మామిడి, వరి వంటి పంటలు దెబ్బతిన్నాయి. నల్లగొండ జిల్లాలో పిడుగుపాటుతో ఓ రైతు మరణించాడు. జనగామ, ములుగు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో భారీ పంట నష్టం జరిగింది. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. జనగామ మండలంలోని పెంబర్తి, సిద్దెంకి, ఎల్లంల, గానుగుపహాడ్.. చిల్పూర్ మండలం ఫత్తేపూర్.. జఫర్‌గఢ్ మండలం ఓబులాపూర్.. పాలకుర్తి మండలం వావిలాల, నారబోయినగూడెంలో వరి పంట దెబ్బతింది. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కాటన్ యార్డులోని ఐకేపీ సెంటర్లో సుమారు 20 వేల బస్తాల ధాన్యం తడిసిపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో 150 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులకు వందల ఏళ్ల నాటి మామిడి వృక్షాలు నేలకూలాయి. శాలిగౌరారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ధాన్యం కొట్టుకుపోయింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని అనంతారం, తొండ.. జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి, కోడూరు తదితర గ్రామాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. జాజిరెడ్డిగూడెంలో నోముల నరేష్ ఇంట్లో చెట్టుకొమ్మ విరిగి గేదెపై పడటంతో అది మృత్యువాత పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాని పలు మండలాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని సల్కునూరు గ్రామంలో గోపు సుధాకర్‌రెడ్డి (63) అనే రైతు తన పొలం వద్ద పనిచేస్తుండగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. -
ఆ దమ్ము ప్రభుత్వానికి ఉందా?.. ఎస్ఎల్బీసీపై జగదీష్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్
సాక్షి, నల్గొండ జిల్లా: ఎస్ఎల్బీసీని శాశ్వతంగా మూసేస్తున్నారని.. సొరంగంలో ఉన్న మృతదేహాలను తీసుకొచ్చే దమ్ము లేదంటూ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ నెల 27న వరంగల్ సభ నేపథ్యంలో నల్లగొండలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా నీళ్ల విషయంలో ప్రభుత్వం దద్దమ్మలా మారిందన్నారు.‘‘మిర్యాలగూడలో రైతులపై మిల్లర్లు దాడి చేస్తున్నారు. కేసీఆర్ పాలన పోవడంతో నల్లగొండ జిల్లా అనాథలా మారింది. మిల్లర్ల వద్ద కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లంచాలు తీసుకున్నాడు. అందుకే మద్దతు ధర ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీకి కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు, మిల్లర్లే కనిపిస్తున్నారు. చంద్రబాబు నీళ్లు తరలించుకుపోతుంటే కాంగ్రెస్‌కు సోయి లేదు’’ అంటూ జగదీష్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
జానారెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి,యాదాద్రి భువనగిరి జిల్లా: తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటుంది.. జానారెడ్డి అడ్డుకుంటున్నారంటూ ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే కొందరికి చెమటలు పడుతున్నాయని.. ధర్మరాజుగా ఉండాల్సిన జానారెడ్డి ధృతరాష్ట్రుడిగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.‘‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పా?. పదవి అడుక్కునే పరిస్థితిలో నేను లేను. నాకు చాలా బాధగా ఉంది. నన్ను చూసి అందరూ భయపడుతున్నారు. అన్నదమ్ములకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటి?. మంత్రి పదవి అడుక్కుంటే వచ్చేది కాదు.. కేపాసిటీ బట్టి వస్తుంది. 30 ఏళ్లు మంత్రి అనుభవించిన జానారెడ్డికి రంగారెడ్డి, హైదరాబాద్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు గుర్తొచ్చిందా?’’ అంటూ రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. -
భార్గవి.. ఎందుకమ్మా ఇలా చేశావు..!
రామన్నపేట: ఉరేసుకుని యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రామన్నపేట మండలం బోగారం గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బోగా రం గ్రామానికి చెందిన కూనూరు సుదర్శన్, లక్ష్మి దంపతుల కుమార్తె కూనూరు భార్గవి(22) డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దనే ఉంటూ పీజీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. భార్గవి తండ్రి సుదర్శన్ పది నెలల క్రితమే చనిపోయాడు. తల్లి లక్ష్మి కుట్టు పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. శనివారం మధ్యాహ్నం తల్లి బయటకు వెళ్లగా.. భార్గవి ఇంట్లో దూలానికి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి తల్లికి సమాచారం అందించారు. మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్గవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.