వివక్షరహిత సమాజ నిర్మాణానికి పోరాటం
నల్లగొండ టౌన్ : అంబేడ్కర్ సూచించిన విధంగా వివక్షత, అంటరానితనం లేని సామాజం సాధనకు పోరాడదామని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఐద్వా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక న్యాయ యాత్ర జాత మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకున్న సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడారు. సామాజిక న్యాయం సాధనకు ఐక్యంగా పోరాడాదామని పిలుపు నిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చాక కుల, మతాల పేర దాడులు పెరిగాయన్నారు. విద్యా వైద్యం పేదలందరికీ ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి, పాలడుగు ప్రభావతి, భారతి, ఆశాలత, ఎండీ శభానా, సాయిలీల, స్వరూప, జ్యోతి, పోలెబోయిన వరలక్ష్మి, కొండా అనురాధ, జిట్టా సరోజ, నిమ్మల పద్మ, అరుణకుమారి, పద్మ, సుల్తానా, ఊర్మిళ, అరుణ, ఇందిర, శశికళ తదితరులు పాల్గొన్నారు.


