రాజీతో కేసుల సత్వర పరిష్కారం
రామగిరి(నల్లగొండ) : రాజీతో కేసులు సత్వరం పరిష్కారం అవుతాయని జిల్లా జడ్జి ఎం.నాగరాజు అన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఆదివారం జిల్లాలో పలు కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులో సివిల్ 46, క్రిమినల్ 8,112, మోటార్ వాహన ప్రమాదబీమా 83, చెక్ బౌన్స్ 07, బ్యాంక్ 31, సైబర్ క్రైం 31, ట్రాన్స్‌కో 49, ట్రాఫిక్ చలాన్ 48,354, బీఎస్‌ఎన్‌ఎల్ 33 మొత్తం 48,388 (పెండింగ్ మరియు ప్రి లిటిగేషన్) కేసులు పరిష్కరించినట్లు వెల్లడించారు. ప్రమాద బీమా కేసుల్లో రూ.4,93,30,000 నష్టపరిహారం ఇప్పించగా, బ్యాంక్ కేసుల్లో రూ.37,76,896 రుణపరిహారం, సైబర్ క్రైం కేసుల్లో రూ.2,73,191 రికవరీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.పురుషోత్తంరావు, జడ్జిలు ఎన్.రోజారమణి, కె.కవిత, కె.దిలిప్‌రావు, ప్రమీల జైన్, కె.శిరీష, కె.సౌందర్య, కె.అనంతరెడ్డి పాల్గొన్నారు.


