ఓటమి.. గెలుపునకు నాంది
నల్లగొండ టూటౌన్ : విద్యార్థులు చిన్ననాటి నుంచే తమకు నచ్చిన క్రీడా పోటీల్లో పాల్గొనాలని ఓటమితో కుంగిపోకుండా గెలుపునకు నాంది పలుకాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండ పట్టణ సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీలో గల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు క్రీడల వైపు దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


