గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ఇటీవల 27 మున్సిపాలిటీలు విలీనమయ్యాయి. దీంతో వార్డుల సంఖ్య 150 నుంచి 300కు పెరిగింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్-1955లో వచ్చిన తాజా ఆర్డినెన్స్‌ల ఆధారంగా విస్తరణకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి నుండి మొత్తం తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ జీహెచ్‌ఎంసీ పరిధిలో భాగమైంది. 27 అర్బన్ లోకల్ బాడీస్ విలీనానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ రీఆర్గనైజేషన్ ఫ్రేమ్‌వర్క్ చేపట్టింది. ఓట్లు వేసే ప్రజాప్రతినిధుల సంఖ్యను కూడా ప్రభుత్వం 300కే ఫిక్స్ చేసింది.


