శ్రీశైలం: జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా గురువారం మల్లన్న రథోత్సవం కనుల పండువగా సాగింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామిఅమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు.
సాయంత్రం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఊరేగింపుగా రథశాల వద్దకు తోడ్కొనివచ్చి రథంపై అధిష్టింపజేశారు.


