ugadi
-
టోక్యోలో ఘనంగా ఉగాది పండుగ
జపాన్‌లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా (Komatsugawa) పార్క్‌లో ఉగాది పండుగను భారతీయులు ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్‌కు చెందిన స్థానికులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఉగాది సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఉగాది పచ్చడిని తయారు చేసి, దాని ప్రాముఖ్యతను పాల్గొన్న వారికి వివరించారు. అలాగే రాశి ఫలాలను వినిపిస్తూ కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అనంతరం వివిధ రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి అందరూ కలిసి భోజనం చేశారు.పిల్లల కోసం బ్యాగ్ జంపింగ్ వంటి వినోదాత్మక పోటీలు నిర్వహించగా, పెద్దల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమం అనంతరం కొత్తగా వచ్చిన కుటుంబాలు పరస్పరం పరిచయం చేసుకుని, విదేశాల్లో భారతీయ సంప్రదాయాలను ఎలా కొనసాగించాలన్న దానిపై చర్చించారు. ఈ వేడుకల ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు. వివిధ దేశాల ప్రజలు కలిసి సంస్కృతులను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన TAJ(Telugu association of Japan)కమిటీ సభ్యులకు, అలాగే పాల్గొన్న అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. -
సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్‌లోని తెలుగు వాసులు ఈ ఏడాది ఉగాది పండుగను సంప్రదాయానికి అనుగుణంగా, ఆత్మీయంగా మరియు వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20, 2026 తేదీలలో ఈ ఉత్సవాలు చాంగీ రామర్ దేవాలయం, సెంగ్కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం మరియు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రత్యేకంగా, టీమ్ శివ ప్రసాద్ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాలయాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి మరియు ప్రసాదాన్ని పంపిణీ చేశారఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆనందం, ఐక్యత మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది.ఈ ఉత్సవాల ద్వారా సాంప్రదాయం, సంస్కృతి, భక్తి మరియు ఐక్యత మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో, సింగపూర్‌లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు. -
హైదరాబాద్ : రెయిన్ బో విస్టాస్ రాక్ గార్డెన్ ఫేజ్–2లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో ‘ఉగాది’ వేడుకలు (ఫొటోలు)
-
షడ్రుచుల సంగమం..!
తెలుగు సంవత్సరాది వెలుగులు విరజిమ్మింది. ఆహ్లాదభరిత వేదికపై ఆత్మీయ ఆహ్వానం అందుకుంది. మూసాపేట రెయిన్ బో విస్టాస్ రాక్ గార్డెన్ ఫేజ్–2లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ‘ఉగాది’ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. అధునాతన నగరంలో అచ్చమైన పల్లె వాతావరణాన్ని తలపించేలా సంప్రదాయ దుస్తులతో రెయిన్బో వాసులు పాల్గొనడం, షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని ఆస్వాదించడం కనువిందు చేసింది. లలితా, విష్ణు సహస్ర నామ పారాయణలతో మొదలైన ఈ వేడుకలు జ్యోతి ప్రజ్వలన, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉగాది పచ్చడి ప్రసాదం, బొబ్బట్లు, పులిహోరాల పంపిణీతో పూర్తయ్యాయి. లలితా విష్ణు సహస్ర నామ పారాయణంతో పాటు భక్తి గీతాలాపనతో ఉగాది వేడుక ప్రారభమైంది. సుమారు 450 మంది లలితా విష్ణు సహస్ర నామ పారాయణం చేయడంతో పాటు, శ్లోకాలను ఆలపించి ఆధ్యాత్మిక పరిమళాలు అందించారు. గ్రూపు కో–ఆర్డినేటర్ వాణి ఆధ్వర్యంలో సహస్ర నామ పారాయణం జరిగింది. తెలుగులో ఆడిపాడిన చిన్నారులు.. ఆధునిక, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునే చిన్నారులకు తెలుగు రుచిని చూపిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా స్వచ్ఛమైన తెలుగులో ‘లేవండిరా ముందుగా ఈ రోజే ఉగాది పండుగ’ అంటూ ఆలపించిన పాట అహూతులను అలరించింది. రామలక్ష్మి ఆమె విద్యార్థుల బృందం ఆలపించిన పాట అతిథులను ఆకట్టుకుంది. పాటలోనే ఉగాది విశిష్టత తెలిపే విధంగా చక్కగా ఉందని అతిథులు ప్రశంసించారు.పరాభవం నుంచి ప్రాభవంలోకి.. ముఖ్య అతిథి, శృంగేరి శారదా పీఠం ఆస్థాన పౌరాణికులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ధర్మమార్గంలో నడిచే వారికి ప్రాభవం అని, అధర్మంలో నడిచే వారికి పరాభవమని, పరాభవం నుంచి ప్రాభవంలోకి రావటమే పరాభవ నామ సంవత్సరమని వివరించారు. మనల్ని అనుగ్రహించి ఆధ్యాతి్మకతకు, సత్య మార్గాన్ని చూపించే సంవత్సరమే పరాభవ నామ సంవత్సరమన్నారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రీల్స్ వదిలిపెట్టి రియాలిటీలోకి రావాలని తెలిపేదే పరాభవం అని అన్నారు. ఈ సంవత్సరం శుభాలు ఎక్కువగా జరుగుతాయని, మిగిలిన ప్రపంచంలో యుద్ధ భయం ఉంటుంది కానీ, భారత దేశానికి ఉండదన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, పశు, వృక్ష సంపద పెరుగుతుందని వివరించారు. పాలకుల్లో చికాకులు పెరుగుతాయి, వ్యాపారస్తులకు బాగుంటుంది. కొత్త పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. అప్పులు చేసి భూములు కొనుగోలు చేయవద్దని, బంగారం, వెండి, రత్నాలు కొనుగోలు చేసే బదులు, కరెన్సీ నోట్లు ఇంట్లో ఉంటేనే మంచిదన్నారు. ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారికి పరాభవం ఉండబోదన్నారు. ఈ సీజన్లో 50 డిగ్రీలకుపైగా వేడి పెరుగుతుందని, అగ్ని ప్రమాదాలు, రోగాలు, కల్తీ ఎక్కువగా జరుగుతాయన్నారు. ఈ సంవత్సరంలో అధిక జ్యేష్ట మాసంతో కలిపి మొత్తం 13 నెలలు ఉంటాయన్నారు. పంచాంగం అంటే విజ్ఞాన భాండాగారం, కొందరు చేసిన తప్పులకు జ్యోతిష్కులను నిందించవచ్చు కానీ, శా్రస్తాన్ని అపహాస్యం చేయవద్దని సూచించారు. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం సాహితీవేత్త ప్రముఖ తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ పాతూరి నాగరాజు సంవత్సర పురుషోపాసన అనే అంశంపై ప్రసంగించారు. ప్రకృతిలో వచ్చే మార్పు, ప్రకృతితో కలిసి జరుపుకునేదే ఉగాది అని పేర్కొన్నారు. కాలచక్రాన్ని అనుసరించాలని సూచించారు. ఉగాది పండుగ, సంవత్సర పురుషోపాసన గురించి క్లుప్తంగా వివరించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో రెయిన్ బో విస్టాస్ రాక్‌గార్డెన్ అధ్యక్షులు టీఎస్ రెడ్డి, ఉపాధ్యక్షులు కృపాకర్‌రెడ్డి, తదితర మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.అమోఘం.. రుచుల మిశ్రమం..ఈ వేడుకల్లో షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని కుండలలో తయారు చేశారు. అపార్ట్ మెంట్ వాసులు వాణి, జ్యోతి, నిర్మల, అపర్ణ, మాళవిక ఉగాది పచ్చడిని తయారు చేసి అందరికీ పంపిణీ చేశారు. దీంతో పాటు బొబ్బట్లు, పులిహోర ప్రసాదంగా అందజేశారు. తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు ఉన్నట్లుగానే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నీ కలిస్తేనే పరిపూర్ణ జీవితం అవుతుందని ఉగాది పచ్చడి పరమార్థాన్ని మననం చేసుకున్నారు. పిజ్జాలు, బర్గర్ల మధ్య నివసించే నగరవాసులకు షడ్రుచుల పచ్చడి, బొబ్బట్లు సిసలైన రుచులను పంచాయి. (చదవండి: 'ఉగాది' అంతరార్ధం? ఆ కారణంగానే ఈ పండుగ జరుపుకుంటున్నామా?) -
షడ్రుచుల సంగమం.. ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
లలితా విష్ణు సహస్ర నామ పారాయణంతో పాటు భక్తి గీతాలాపనతో ఉగాది వేడుక ప్రారభమైంది. సుమారు 450 మంది లలితా విష్ణు సహస్ర నామ పారాయణం చేయడంతో పాటు, శ్లోకాలను ఆలపించి ఆధ్యాత్మిక పరిమళాలు అందించారు. గ్రూపు కో–ఆర్డినేటర్ వాణి ఆధ్వర్యంలో సహస్ర నామ పారాయణం జరిగింది. తెలుగులో ఆడిపాడిన చిన్నారులు.. ఆధునిక, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునే చిన్నారులకు తెలుగు రుచిని చూపిస్తూ తెలుగుదనం ఉట్టిపడేలా స్వచ్ఛమైన తెలుగులో ‘లేవండిరా ముందుగా ఈ రోజే ఉగాది పండుగ’ అంటూ ఆలపించిన పాట అహూతులను అలరించింది. రామలక్ష్మి ఆమె విద్యార్థుల బృందం ఆలపించిన పాట అతిథులను ఆకట్టుకుంది. పాటలోనే ఉగాది విశిష్టత తెలిపే విధంగా చక్కగా ఉందని అతిథులు ప్రశంసించారు.పరాభవం నుంచి ప్రాభవంలోకి.. ముఖ్య అతిథి, శృంగేరి శారదా పీఠం ఆస్థాన పౌరాణికులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ధర్మమార్గంలో నడిచే వారికి ప్రాభవం అని, అధర్మంలో నడిచే వారికి పరాభవమని, పరాభవం నుంచి ప్రాభవంలోకి రావటమే పరాభవ నామ సంవత్సరమని వివరించారు. మనల్ని అనుగ్రహించి ఆధ్యాత్మితకు, సత్య మార్గాన్ని చూపించే సంవత్సరమే పరాభవ నామ సంవత్సరమన్నారు.కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రీల్స్ వదిలిపెట్టి రియాలిటీలోకి రావాలని తెలిపేదే పరాభవం అని అన్నారు. ఈ సంవత్సరం శుభాలు ఎక్కువగా జరుగుతాయని, మిగిలిన ప్రపంచంలో యుద్ధ భయం ఉంటుంది కానీ, భారత దేశానికి ఉండదన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని, పశు, వృక్ష సంపద పెరుగుతుందని వివరించారు. పాలకుల్లో చికాకులు పెరుగుతాయి, వ్యాపారస్తులకు బాగుంటుంది. కొత్త పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. అప్పులు చేసి భూములు కొనుగోలు చేయవద్దని, బంగారం, వెండి, రత్నాలు కొనుగోలు చేసే బదులు, కరెన్సీ నోట్లు ఇంట్లో ఉంటేనే మంచిదన్నారు. ఆర్థిక క్రమశిక్షణ ఉన్నవారికి పరాభవం ఉండబోదన్నారు. ఈ సీజన్లో 50 డిగ్రీలకుపైగా వేడి పెరుగుతుందని, అగ్ని ప్రమాదాలు, రోగాలు, కల్తీ ఎక్కువగా జరుగుతాయన్నారు. ఈ సంవత్సరంలో అధిక జ్యేష్ట మాసంతో కలిపి మొత్తం 13 నెలలు ఉంటాయన్నారు. పంచాంగం అంటే విజ్ఞాన భాండాగారం, కొందరు చేసిన తప్పులకు జ్యోతిష్కులను నిందించవచ్చు కానీ, శాస్త్రాన్ని అపహాస్యం చేయవద్దని సూచించారు. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. అనంతరం సాహితీవేత్త ప్రముఖ తెలుగు ప్రొఫెసర్ డాక్టర్ పాతూరి నాగరాజు సంవత్సర పురుషోపాసన అనే అంశంపై ప్రసంగించారు. ప్రకృతిలో వచ్చే మార్పు, ప్రకృతితో కలిసి జరుపుకునేదే ఉగాది అని పేర్కొన్నారు. కాలచక్రాన్ని అనుసరించాలని సూచించారు. ఉగాది పండుగ, సంవత్సర పురుషోపాసన గురించి క్లుప్తంగా వివరించారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో రెయిన్ బో విస్టాస్ రాక్‌గార్డెన్ అధ్యక్షులు టీఎస్ రెడ్డి, ఉపాధ్యక్షులు కృపాకర్‌రెడ్డి, తదితర మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.అమోఘం.. రుచుల మిశ్రమం..ఈ వేడుకల్లో షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని కుండలలో తయారు చేశారు. అపార్ట్ మెంట్ వాసులు వాణి, జ్యోతి, నిర్మల, అపర్ణ, మాళవిక ఉగాది పచ్చడిని తయారు చేసి అందరికీ పంపిణీ చేశారు. దీంతో పాటు బొబ్బట్లు, పులిహోర ప్రసాదంగా అందజేశారు. తీపి, కారం, పులుపు, ఉప్పు, చేదు, వగరు ఉన్నట్లుగానే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నీ కలిస్తేనే పరిపూర్ణ జీవితం అవుతుందని ఉగాది పచ్చడి పరమార్థాన్ని మననం చేసుకున్నారు. పిజ్జాలు, బర్గర్ల మధ్య నివసించే నగరవాసులకు షడ్రుచుల పచ్చడి, బొబ్బట్లు సిసలైన రుచులను పంచాయి.తెలుగు సంవత్సరాది వెలుగులు విరజిమ్మింది. ఆహ్లాదభరిత వేదికపై ఆత్మీయ ఆహ్వానం అందుకుంది. మూసాపేట రెయిన్ బో విస్టాస్ రాక్ గార్డెన్ ఫేజ్–2లో ‘సాక్షి’ దినపత్రిక ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ‘ఉగాది’ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. అధునాతన నగరంలో అచ్చమైన పల్లె వాతావరణాన్ని తలపించేలా సంప్రదాయ దుస్తులతో రెయిన్బో వాసులు పాల్గొనడం, షడ్రుచులతో తయారు చేసిన ఉగాది పచ్చడిని ఆస్వాదించడం కనువిందు చేసింది. లలితా, విష్ణు సహస్ర నామ పారాయణలతో మొదలైన ఈ వేడుకలు జ్యోతి ప్రజ్వలన, పంచాంగ శ్రవణం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉగాది పచ్చడి ప్రసాదం, బొబ్బట్లు, పులిహోరాల పంపిణీతో పూర్తయ్యాయి. – కూకట్పల్లి/మూసాపేటఅలరించిన భక్తి ‘గీతాంజలి‘ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన కార్యక్రమం ‘భక్తి జామింగ్‘. అపార్ట్ మెంట్ కి చెందిన గీతాంజలి ప్రత్యేకంగా తన బృందంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆ బృందం ఆలపించిన హిందీ, తెలుగు భక్తి గీతాలు గంట పాటు శ్రోతలను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. ప్రదర్శన అనంతరం ఆహూతులు అందరూ నిల్చుని చేసిన కరతాళ ధ్వనులతో ప్రాంగణం మారుమోగింది. -
శ్రీశైలంలో రమణీయంగా రథోత్సవం పులకించిన భక్తులు (ఫొటోలు)
-
ఎంపీ ఎమ్మెల్యే కాలనీ కల్చర్ సెంటర్ లో ఘనంగా ఉగాది వేడుకలు
హైదరాబాద్ : ఎంపీ ఎమ్మెల్యే కాలనీ కల్చరల్ సెంటర్, విజయ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సంయుక్తంగా ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు పెద్ది రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాగిడి లక్ష్మా రెడ్డి, సొసైటీ ప్రెసిడెంట్ కొలను హనుమంత రెడ్డి, సెక్రటరీ సందీప్ రెడ్డి వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఉగాది పంచాంగ శ్రవణం అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పరంపర కళాకారులు ప్రదర్శించిన మహాకాళి నృత్యం ఆద్యంతం కట్టి పడేసింది. దీంతో పాటు నిర్వహించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమం వీనుల విందుగా సాగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ భూపాల్ రెడ్డి, ప్రముఖ సామాజికవేత్త శిల్పా రెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా సంప్రదాయ పిండి వంటల తో విందును ముగించారు. -
పరాభవ నామ సంవత్సరం పసందుగా అవార్డుల ప్రదానోత్సవం
తెలుగువారి సంవత్సరాది ఉగాది సినీ ప్రేమికులకు కొత్త హుషారునిచ్చింది... అవార్డులు అందుకున్న వేళ తారల మనసులు మురిసిన వేళ... అభిమానులకు ఆనంద హేల... గురువారం ఉగాది పర్వదినాన హైదరాబాద్ హైటెక్స్ వేదికగా ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు’ల వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో నాటి తారలు సావిత్రి, శ్రీదేవి, సౌందర్యలకు నివాళిగా నేటి తార నిధీ అగర్వాల్ చేసిన డ్యాన్స్ ఓ హైలైట్... వేదికపై దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్... లవ్ సాంగ్స్ నుంచి మాస్ సాంగ్స్ వరకూ శ్రేయా ఘోషల్ పాడిన పాటలు... సింగర్ మంగ్లీ పాడిన పాటలు... ఇలా వీనుల విందుగా, తారల తళుకులతో కనువిందుగా జరిగింది ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు’ల వేడుక. ఆ విశేషాలు...అవార్డుల విషయంలో పక్క రాష్ట్రం వెనుకంజలో ఉందితెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్’కి మూలం అయినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కగారికి, మంత్రి జూపల్లిగారికి, అలాగే కమల్‌హాసన్ గారికి, నాగార్జునగారికి, జయసుధగారికి, నాగచైతన్య, రష్మికా మందన్నాతో పాటు ఇతర అవార్డుగ్రహీతలందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు చెబుతున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవింపబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నది నానుడి. ఈ మాటల ఆదర్శంతో ఆగిపోయిన ఈ అవార్డుల పంపిణీకి పునరుజ్జీవం పోసిన రేవంత్ రెడ్డిగారికి ధన్యవాదాలు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్‌కి తెలంగాణ ప్రభుత్వం సినిమా వారిని ఆహ్వానించి, సినిమా అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడం, సినిమాకి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యతకి థ్యాంక్స్. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘వేవ్స్’ కార్యక్రమంలో నన్ను, కమల్‌హాసన్ వంటి వాళ్లని భాగస్వామ్యం చేయడం సంతోషం. సినిమానే కదా అనే చిన్నచూపు చూడకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవచ్చు. హాలీవుడ్ సినిమా అంటే అమెరికా గుర్తొస్తుంది. ఈరోజు ఇండియన్ సినిమా అంటే హైదరాబాద్–తెలంగాణ గుర్తుకు రావాలనే ముఖ్యోద్దేశంతో రేవంత్ రెడ్డిగారు చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి మనందరం చేదోడు వాదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీవైపు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. పక్కనే ఉన్న మన తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల, వాళ్లని ఉత్సాహపరిచే విధానంలో కొంచెం వెనుకంజలో ఉందనుకుంటున్నాను కాబట్టి సినిమా వాళ్లకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు తెలంగాణ అవార్డులను స్ఫూర్తిగా తీసుకుని, మరింత ప్రోత్సహిస్తే కనుక ఎంతో మంది యంగ్‌స్టర్స్ మరిన్ని సినిమాలు చేస్తారు. రాష్ట్రానికి సినిమా రెవెన్యూ కూడా సమకూరుతుంది. సీనియర్స్‌కి గౌరవం ఇచ్చే విధంగా, యంగ్‌స్టర్స్‌కి స్ఫూర్తినిచ్చేలా ఈ అవార్డుల ఎంపిక జరిగింది. ఇందుకు జ్యూరీకి అభినందనలు.– చిరంజీవి (ఎన్టీఆర్ జాతీయ అవార్డుగ్రహీత)హద్దులు చెరిపేసినందుకు ధన్యవాదాలుమై ఫ్రెండ్ చిరంజీవిగారు... బ్రదర్ నాగార్జునగారు. నా ఫ్యామిలీ... చెన్నైలో ఎవరైతే ఉంటారో... వారందరూ ఇక్కడ ఉన్నారు. 16 సంవత్సరాల వయసులో తొలిసారి నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా హైదరాబాద్‌కు వచ్చాను ఏయన్నార్‌గారి ‘శ్రీమంతుడు’ సినిమా కోసం. అందుకే నా ‘దశావతారం’ సినిమాలో ‘ఎంతో చిన్నది జీవితం’ అనే పాట వినిపిస్తుంది. అలా అప్పట్నుంచి నేను హైదరాబాద్‌లో పని చేస్తున్నాను. కొంత సమయం కిందట నేను సింగీతంగారి అవార్డు అందుకున్నాను. అప్పుడు ఆయనతో నేను చేసిన తొలి సినిమా ‘సొమ్ము ఒకడిది... సోకు ఒకడిది’ గుర్తొచ్చింది. పని మొత్తం ఆయన చేశారు. అవార్డు నేను అందుకున్నాను. సింగీతంగారితో నేను 50 సంవత్సరాలుగా కలిసి పని చేస్తున్నాను. మా నాన్నగారి పేరు శ్రీనివాసన్ కనుక... సింగీతం శ్రీనివాసరావుగారంటే నాకు ఇష్టం అని కాదు. నా సినిమా కెరీర్లో నేను కలిసిన యంగస్ట్ సీనియర్ ఆయన. సింగీతంగారికి అవార్డును అందించినందుకు ధన్యవాదాలు సార్ (ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ...). నా బ్రదర్... చిరంజీవిగారు. సినిమాల్లో నా జూనియర్. పాలిటిక్స్‌లో సీనియర్. 1970లో మేం లీడ్ రోల్స్ చేశాం. ఇప్పుడు 70స్లోనే ఉన్నాం. నీ మనసు గురించి కాదు... నీ వయసు గురించి (నవ్వుతూ). గద్దర్‌గారి లక్షల అభిమానుల్లో నేను ఒకడిని. రచయిత, విప్లవకారులు అయిన గద్దర్‌గారి పేరిట అవార్డు ఇస్తున్నందుకు ధన్యవాదాలు సార్. ఆయన అభిమానులుగా మేం థ్యాంక్స్ చెబుతున్నాం. ఇక నో మోర్ కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్‌వుడ్, బాలీవుడ్.. ఒకే ఒక సినిమా... ఇండియన్ సినిమా. ఆ హద్దులను మీరు చెరిపేశారు (టీజీఎఫ్ అవార్డుల్లో తెలంగాణ ప్రభుత్వం కోలీవుడ్, బాలీవుడ్ స్టార్స్‌ని అవార్డుగ్రహీతలుగా, ప్రదానం చేసేవారుగా భాగం చేయడం). భవిష్యత్ తరాల కోసం మేం కూడా సపోర్ట్‌గా ఉంటాం. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా గర్వంగా ఉంది. – కమల్‌హాసన్ (పైడి జయరాజ్ అవార్డుగ్రహీత)ఏపీలో తెలుగు చిత్రపరిశ్రమ ఉనికిని గుర్తించాలినంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారు అని గత 13 ఏళ్లుగా ఇండస్ట్రీ ఎదురు చూస్తున్నా ఇవ్వలేదు. అలాంటిది హీరో కృష్ణగారి అభిమాని రేవంత్ రెడ్డిగారు గద్దర్ అవార్డులు మేము ఇస్తాం అని చెప్పి, 2025లో ప్రారంభించి అమోఘంగా ప్రదానం చేశారు. ఇప్పుడు కూడా ఆ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. తెలుగు సినిమా ఉనికిని గుర్తించి, గౌరవించి ఇంతమంది కళాకారులను సగర్వంగా గౌరవిస్తున్నందుకు ఆయనకు సెల్యూట్. గొప్ప ప్రజా వాగ్గేయకారుడు అయిన గద్దర్‌గారి పేరు మీద అవార్డు ఇస్తున్న రేవంత్గారికి సెల్యూట్, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నాకు కాంతారావుగారి అవార్డు ఇచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్ ఆర్గార్ల తర్వాత మూడో హీరో కాంతారావుగారు. తెలంగాణ గడ్డ బిడ్డ ఆయన. జానపద హీరో. తెలుగు ఎంజీఆర్ ఆయన. ఎలాంటి పాత్ర వేసినా రామారావుగారి తర్వాత మెప్పించిన గొప్ప నటుడాయన. అలాంటి కాంతారావుగారి అవార్డుని నాకు ఇచ్చి, నా జన్మధన్యం చేసిన రేవంత్ రెడ్డిగారికి థ్యాంక్స్. చంద్రబాబునాయుడుగారు... మీకు దండం పెడుతున్నా. మీరు చాలా పెద్దవారు. తెలంగాణలో రేవంత్ రెడ్డిగారు దూసుకెళ్లిపోతున్నారు చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేసుకుంటూ, గద్దర్ పేరిట అవార్డులు ఇచ్చుకుంటూ... ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆంధ్ర రాష్ట్ర ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి, గౌరవించి మీరు కూడా దయ ఉంచి నంది అవార్డులు ఇవ్వండి సార్.. ఇండస్ట్రీని ప్రోత్సహించండి.– ఆర్. నారాయణమూర్తి (కాంతారావు అవార్డుగ్రహీత)ఏయన్నార్ అవార్డు అందుకోవడం ఆనందంముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కగార్లకు ధన్యవాదాలు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ‘దిల్’ రాజు, ప్రియాంక, చిరంజీవి, కమల్‌హాసన్ గార్లతో పాటు... ప్రతి ఒక్కరికీ పేరు పేరు నా నమస్కారాలు. ఏయన్నార్‌గారి అవార్డును అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రిగారికి థ్యాంక్స్. ఏయన్నార్‌గారి గురించి చె΄్పాలంటే... ఎంతో చె΄్పాలి. మా తరంలో ఆయనతో ఎక్కువ చిత్రాల్లో నటించాను. 1976 అన్నపూర్ణ స్టూడియోస్ ఫస్ట్ ఫ్లోర్లో రామానాయుడుగారు నిర్మించిన ‘సెక్రటరీ’ సినిమాతో మా జర్నీ మొదలైంది. అక్కడ్నుంచి ఎన్నో గొప్ప చిత్రాలు... ఎన్నో గొప్ప బ్లాక్‌బస్టర్స్. ఆయన ఎంత గొప్ప నటులో నేను చె΄్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరోగా సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చినప్పుడు...ఆయన అన్నారు.. ‘ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది కదా... నా స్టైల్‌ను నేను ఏమైనా మార్చుకోవాలా?, యాక్టింగ్‌లో ఏమైనా మార్పు తెచ్చుకోవాలా? నా బాడీ లాంగ్వేజ్‌లో మార్పు రావాలా?’ అని అందర్నీ అడిగేవారు. నన్ను కూడా అడిగారు. అంత గొప్ప నటులు ఆయన. అంత సింపుల్‌గా ఉంటారు. ఆయన్నుంచి మనందరం నేర్చుకోవాలి. నన్ను ఎప్పుడూ లిటిల్ ఫ్రెండ్ అంటుంటారు. నేను ఆయన లిటిల్ ఫ్రెండ్‌నే. ఆయన లెగసీ కంటిన్యూ అవుతోంది. నాగార్జునగారు, సుమంత్, సుశాంత్, అఖిల్... ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నాగచైతన్య. ఏయన్నార్ లివ్స్ ఆన్ . రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్. సీయంగారు గత ఏడాది నాకు చైర్పర్సన్ గా అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఏయన్నార్ అవార్డు వరించింది. నేను శాసన సభ్యురాలిగా ఫస్ట్ రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ డైనమిక్ స్పీకర్. తెలంగాణ మూమెంట్ సమయంలో హౌస్ అడర్జ్న్డ్ అయినప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి, మాట్లాడేవారు. అసెంబ్లీ విధి విధానాల గురించి చెప్పేవారు. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అయినందుకు గర్వంగా ఉంది. ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా ఎమర్జ్ అయ్యారు.– ఏయన్నార్ అవార్డుగ్రహీత జయసుధఈ అవార్డు నాకో మోటివేషన్అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా పదహారు సంవత్సరాల సినిమా ప్రయాణంలో ముఖ్యమైన గౌరవం... గుర్తింపు ఇది. ఎన్నో థ్యాంక్స్ చె΄్పాలి. గద్దర్‌గారు గొప్ప వ్యక్తి. నిజమైన విప్లవకారులు. కుల వివక్షపై వ్యతిరేకంగా, గౌరవం కోసం పోరాడారు. అలాంటి వ్యక్తి పేరిట ఇలాంటి గొప్ప ఇన్షియేట్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, ‘దిల్’ రాజుగార్లకు ధన్యవాదాలు. ప్రతి సినిమాకు నేను వంద శాతం ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాను. కొన్ని వర్కౌట్ అయ్యాయి... మరికొన్ని కాలేదు. ‘తండేల్’ సినిమాలో నేను పోషించిన తండేల్ రాజు పాత్రను నా మనసులో పెట్టుకునేలా చేసింది. చాలా సంతోషంగా ఉంది. అలాంటి ఎఫర్ట్స్‌కు ఇలాంటి ఓ అవార్డు రావడం నిజమైన గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవార్డు చూస్తుంటే ఇంకా నేర్చుకోవాలని, ఇంకా ఎదగాలని... నటుడిగా ఇంకా కథలు చె΄్పాలని మోటివేషన్ లా ఉంది. అల్లు అరవింద్‌గారికి, వాసు, చందు మొండేటి, దేవిగారు, సాయి పల్లవి, నవీన్ నూలి, కార్తీక్ ఘట్టమనేని, శేఖర్ మాస్టర్, సుప్రీమ్ మాస్టర్, కార్తీక్ తీడ... ఇలా ‘తండేల్’ సినిమాలోని అందరికీ థ్యాంక్స్. మీ అందరి ఎఫర్ట్స్ లేకుంటే ఇక్కడ అవార్డు తీసుకుని ఉండేవాడిని కాదు. నా పిల్లర్స్, నా స్ట్రెంత్... మా అమ్మా నాన్న. అలాగే శోభిత... అభిమానులందరికీ ‘ఈపాలి యేట గురి తప్పేదేలేదేస్... ఇక రాజులమ్మ జాతరే’.– నాగచైతన్య (ఉత్తమ నటుడు – ‘తండేల్’)ఈ అవార్డు మరింత నమ్మకాన్నిచ్చిందిఅందరికీ హాయ్.. హ్యాపీ ఉగాది. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. రేవంత్ సార్... ఈ అవార్డును మీ చేతుల మీదుగా అందుకోవడం వెరీ వెరీ స్పెషల్. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, దిల్ రాజు సార్లకు, హోల్ జ్యూరీ కమిటీకి థ్యాంక్స్. ఒకప్పుడు నా నటనపైన నేను ట్రోల్స్ ఎదుర్కొన్నాను. కానీ, ఈరోజు నా నటన నచ్చి రాష్ట్ర స్థాయి అవార్డు ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే నేను చాలా కాలం ఇండస్ట్రీలో ఉంటాననుకుంటున్నాను. ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాకి అవార్డు రావడం చాలా ప్రత్యేకం. పైగా ఇలాంటి సినిమాలు మరిన్ని నిర్మించే నమ్మకాన్ని ఇచ్చింది. నన్ను భూమా పాత్రలో అద్భుతంగా చూపించిన రాహుల్ రవీంద్రన్ కి థ్యాంక్స్. దీక్షిత్, ధీరజ్ సార్, విద్య మేడం, గీతా ఆర్ట్స్‌కి థ్యాంక్స్. చాలా సంవత్సరాల క్రితం నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక కూతురుగా భావించి ప్రేమ ఇచ్చారు. ఈ రోజు కోడలిగా మీ ముందు నిల్చున్నాను... ఇది చాలా గర్వంగా ఉంది. మీ ప్రేమకు ధన్యవాదాలు.. – రష్మికా మందన్నా, (ఉత్తమ నటి, ‘ది గర్ల్ ఫ్రెండ్’)అవార్డు విజేతలుఉత్తమ నటుడు – నాగ చెతన్య (తండేల్)ఉత్తమ నటి – రష్మికా మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయిఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరాఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్ షో నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వాఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ – లిటిల్ హార్డ్స్ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాంఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం – కోర్టు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్ఉత్తమ బాలల చిత్రం – అనగనగనాఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)ఉత్తమ సహాయ నటుడు – శివాజీ (దండోరా)ఉత్తమ సహాయ నటి– భూమిక (యుఫోరియా)ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె. రాబిన్ (దండోరా)ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప)ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ (జిగ్రీస్)ఉత్తమ బాలనటుడు – రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ – అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్ (కుబేర)ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తీక్ ఘట్టమనేని (మిరాయ్)ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్) ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్ రాధాకృష్ణన్ (కిష్కిందపురి)ఉత్తమ కొరియోగ్రాఫర్ – గిర గిర గిర (ఛాంపియన్)ఉత్తమ ఆర్ట్ డైరక్టర్ – తోట తరణి (ఛాంపియన్ )ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – గోవింద్ (అఖండ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – చంద్రకాంత్ (చంద్రకాంత్)ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్ – 23ఉత్తమ మేల్ యాక్టర్ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)ఉత్తమ నటి – అనంతిక (8 వసంతాలు)స్పెషల్ జ్యూరీ హీరో – రోషన్ (చాంపియన్ ) -
Viral Video: ఉగాది పచ్చడి చేసిన సమంత..
-
‘పరాభవ’అంటే అవమానం కాదు, ఇదీ అర్థం!
Ugadi 2026 తెలుగువారు జరుపుకునే మొదటి పండుగ ఉగాది. ఉగాది అంటే ‘యుగమునకు ఆది’ అని అర్థం. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రాంభించిన రోజుగా దీనిని మనం జరుపుకుంటాం. కాలగమనంలో వచ్చే 60 సంవత్సరాలలో ‘పరాభవ’ నామ సంవత్సరం (Sri Parabhava Nama Samvatsara ugadi) ఒకటి.సాధారణంగా ‘పరాభవం’ అంటే అవమానం అనే అర్థం స్ఫురిస్తుంది. కానీ శాస్త్రపరంగా, ఆధ్యాత్మికంగా దీనికి లోతైన అర్థం ఉంది. ‘పరా’ అంటే గొప్పదైన, ‘భవ’ అంటే పుట్టుక లేదా స్థితి. అంటే, అహంకారాన్ని విడిచిపెట్టి, వినయంతో మెలగడం ద్వారా ఉన్నతమైన స్థితిని పొందడమని దీని అంతరార్థం. ఈ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉంటూనే, ధర్మబద్ధమైన జీవనం సాగించాలని పంచాంగకర్తలు చెబుతుంటారు. అంటే మనిషి తనలోని అహంకారాన్ని చంపుకుని, వినయంతో మెలగడం ద్వారా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందడమే ఈ సంవత్సర సందేశం. ధర్మబద్ధమైన జీవనం సాగించే వారికి ఏ పరాభవమూ కలగదని పెద్దల మాట. ‘పరాభవ’ నామ సంవత్సరం మనకు ఒక హెచ్చరికను, అదే సమయంలో ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. పాత కక్షలు, కార్పణ్యాలను విడిచిపెట్టి, ప్రకృతితో మమేకమై సరికొత్త లక్ష్యాలతో ముందుకు సాగడమే ఈ ఉగాది ఆగమన ఉద్దేశం. మన పొరబాట్లను మనం తెలుసుకొని, వినమ్రతతో కొత్త పాఠాలు నేర్చుకోవడం ద్వారా ‘విజయం’ వైపు అడుగులు వేయవచ్చని ‘పరాభవ’ సంవత్సరం సూచిస్తుంది. ఆకు రాలడం చెట్టుకు ‘ఓటమి’ (పరాభవం) లా అనిపించవచ్చు, కానీ అది కొత్త చిగురు రావడానికి (వసంతం) సిద్ధమవ్వడం మాత్రమే. చీకటి పడటం వెలుగుకు ఓటమి కాదు, అది మరో ఉదయానికి పునాది. అలాగే, మనిషి తనలోని అహంకారాన్ని, పాత ఆలోచనలను పరాభవించి (ఓడించి), సరికొత్త వ్యక్తిత్వంతో ఉదయించడమే ఈ సంవత్సరపు అసలైన అంతరార్థం. ఒక రచయితకు విమర్శలు ఎలాగైతే తన రచనను మరింత పదును పెడతాయో, ఈ సంవత్సరం కూడా మన వ్యక్తిత్వాన్ని అలా తీర్చిదిద్దుతుంది. మనం గడిచిన కాలపు అనుభవాలను చేదు పచ్చడిలా కాకుండా, జీవితాన్ని పదును పెట్టేపాఠాలుగా స్వీకరించాలి. సమయం విలువ తెలిసిన వాడు చరిత్రను నిర్మిస్తాడు. అక్షరం విలువ తెలిసిన వాడు కాలాన్ని శాసిస్తాడు. ఈ పరాభవ నామ సంవత్సరం పాఠకుల మనసుల్లో ఒక కొత్త ఆలోచనను, ఆత్మస్థైర్యాన్ని అందిస్తుంది. ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ, మానవ సంబంధాలలోని సున్నితత్వాలను, మనుషుల మధ్య పెరిగే అగాధాలను పూడ్చేలా ఈ ’పరాభవ’ కాలం ఒక గొప్ప ప్రేరణ కాగలదు. ప్రతి ఉగాది మన జీవితంలో కొత్త ఆశలను, ఆశయాలను నింపుతుంది. ‘పరాభవ’ నామ సంవత్సరం పేరులో కఠినత్వం ఉన్నప్పటికీ, అది మనల్ని క్రమశిక్షణతో ఉండమని హెచ్చరిస్తుంది. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేయడమే ఉగాది యొక్క అసలైన సందేశం.ఉగాదికి కొన్ని రోజుల ముందే ప్రకృతి లో మార్పులు మొదలవుతాయి. ఎండి΄ోయిన చెట్లు ఆకులు రాల్చి, సరికొత్త లేలేత చిగురుటాకులతో నిండుగా కనిపిస్తాయి. వేప చెట్లు పూత పూస్తాయి, మామిడి చెట్లు పిందెలు వేస్తాయి. ముఖ్యంగా, మధురమైన కంఠంతో కోయిల పాడే పాటలు ఉగాది ఆగమనాన్ని మనకు తెలియజేస్తాయి.ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ప్రకృతి తనను తాను పునరుద్ధరించుకునే సమయం. మన మనస్సులోని చెడు ఆలోచనలను వదిలి, కొత్త ఆశయాలతో జీవితాన్ని మొదలు పెట్టడానికి ఈ ఆగమనం ఒక చక్కని అవకాశం.ఉగాది పచ్చడి తీపి, పులుపు, కారం, ఉప్పు, వొగరు, చేదు ఈ ఆరు రుచుల సమ్మేళనం జీవితంలోని సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలని బోధిస్తుంది. గ్రహగతులు ఎలా ఉన్నాయి? ఎవరికి ఆదాయం మెండుగా ఉంది? ఎవరికి అరిష్టాలు ఉన్నాయి? వంటి విషయాలను ఉగాది పంచాంగ శ్రవణం తెలుసుకుని తదనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. తెలుగు భాషా సౌందర్యాన్ని చాటిచెప్పేలా కవులు కవి సమ్మేళనాలతో కొత్త సంవత్సరానికి వన్నె తెస్తారు.‘పరాభవ’ అంటే ఈ పేరు ఉన్నంత మాత్రాన అందరికీ చెడు జరుగుతుందని కాదు. ఈ సంవత్సరంలో పుట్టిన వారు సాహసవంతులుగా, పట్టుదల గలవారుగా ఉంటారని చెబుతుంటారు. ఈ సంవత్సరంలో వర్షాలు సాధారణంగా ఉంటాయని, ప్రజల్లో కొంచెం అసహనం లేదా విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుందని సూచించబడింది. తెలుగు పంచాంగ చక్రంలో ఇది 40వ సంవత్సరం. ఈ సంవత్సరానికి రాక్షస గణాధిపతి కాలపురుషుడు అధిపతిగా ఉంటారు. ఈ ఏడాది ఉగాది గురువారం రావడం వల్ల గురు గ్రహ అనుగ్రహం విశేషంగా ఉంటుందని ఒక నమ్మకం. కొత్త పనులు ప్రారంభించడానికి, అక్షరాభ్యాసాలకు గృహ ప్రవేశాలకు ఈ సంవత్సరం అనుకూలమైన ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి.ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారిఉగాది ఆగమనం ఒక చైతన్యానికి ప్రతీక. మనిషి తన గతంలోని ΄÷ర΄ాట్లను విడిచిపెట్టి, నూతన ఉత్సాహంతో భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ఈ పండుగ మనకు దిశానిర్దేశం చేస్తుంది. ప్రకృతితో కలిసి మనం కూడా కొత్తగా వికసించడమే ఉగాది పండుగలోని పరమార్థం.– రామలక్ష్మీ సదానందమ్ -
ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)
-
ఐదు వేల ఏళ్ల ఫ్యాషన్.. అప్పటికీ, ఇప్పటికీ..
ఉగాది అనగానే అందరికీ పంచెకట్టు గుర్తుకువస్తుంది. నేటి ఆధునిక కాలంలో జీన్స్, టీ-షర్టులు, సూట్లు ఎన్ని వచ్చినా, భారతీయుల ఆత్మగౌరవానికి, సంస్కృతికి నిలువుటద్దం ‘పంచె’. వేల ఏళ్లుగా మహర్షుల నుంచి మహారాజుల వరకు, సామాన్యుల నుంచి స్వాతంత్ర్య సమరయోధుల వరకు ప్రతి ఒక్కరూ గర్వంగా ధరించిన వస్త్రమిది. మన సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన పంచె (ధోతీ) ప్రస్థానం గురించి ఆసక్తికర విశేషాలు..సింధు నాగరికత నుంచే..పంచె చరిత్ర నేటిది కాదు.. దాదాపు 5,000 ఏళ్ల క్రితం నాటిది. క్రీస్తుపూర్వం 2500 కాలంలోని సింధు లోయ నాగరికత తవ్వకాల్లో బయటపడిన శిల్పాలను గమనిస్తే, అప్పటి పురుషులు నడుము చుట్టూ ఒక పొడవైన వస్త్రాన్ని ధరించేవారని తెలుస్తున్నది. భారత దేశ ఉష్ణమండల వాతావరణానికి, ఇక్కడి తేమతో కూడిన వేడికి ఈ పంచెకట్టు ఎంతో సౌకర్యవంతంగా ఉండటంతో ఇది కాలక్రమేణా మన జీవనశైలిలో భాగమైపోయింది.‘ధౌత’ నుంచి ‘ధోతీ’ వరకూ..పంచెను ఉత్తరాదిలో ‘ధోతీ’ అని పిలుస్తారు. ఈ పదం సంస్కృత పదమైన ‘ధౌత’ నుంచి ఉద్భవించింది. వేద కాలంలో దీనిని ‘వస్త్ర’ లేదా 'అంతరీయ' అని పిలిచేవారు. అప్పట్లో దైనందిన జీవితంలోనే కాకుండా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా దీనిని తప్పనిసరిగా ధరించేవారు. నేటికీ దేవాలయాల్లో లేదా పూజా కార్యక్రమాల్లో పంచె ధరించడం అనేది క్రమశిక్షణకు, పవిత్రతకు నిదర్శనంగా భావిస్తారు.ప్రాంతం ఏదైనా.. ప్రాభవం ఒక్కటే!భారతదేశం విభిన్న సంస్కృతుల నిలయం. అందుకే పంచె కట్టులో కూడా ప్రాంతాన్ని బట్టి మార్పులు వచ్చాయి.ఆంధ్రప్రదేశ్‌లో: దీనిని ‘పంచె’ అని పిలుస్తారు. రెండు వైపులా మడతలతో గట్టిగా కట్టడం ఇక్కడి ప్రత్యేకత.తమిళనాడులో: 'వేష్టి' అంటారు. సాధారణంగా ఒకే మడతతో సరళంగా కట్టుకుంటారు.కేరళలో: 'ముండు' అని పిలుస్తారు.బెంగాల్లో: అందమైన కుచ్చెళ్లతో, ముడులతో ప్రత్యేక శైలిలో ధరిస్తారు.సాధారణంగా 5 గజాల పొడవు ఉండే ఈ వస్త్రాన్ని దాదాపు ఐదు ముడులతో కట్టడం ఒక కళ. దక్షిణ భారత దేశంలో తెల్లటి పంచెలకు బంగారు రంగు జరీ అంచు (గోల్డ్ బోర్డర్) ఉండటం గౌరవ సూచకంగా భావిస్తారు.స్వాతంత్య్ర పోరాటంలో అస్త్రంగా..బ్రిటీష్ కాలంలో విదేశీ వస్త్రాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పంచె ఒక శక్తివంతమైన ఆయుధంగా నిలిచింది. మహాత్మా గాంధీ స్వయంగా పంచెను ధరించి, విదేశీ దుస్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇది సమానత్వానికి చిహ్నంగా మారి, దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంగా రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి రాజకీయ నేతలకు ఇది ఒక అధికారిక ఆహార్యంగా మారింది.ఆధునిక కాలంలో కొత్త హంగులుమారుతున్న కాలానికి అనుగుణంగా పంచె కూడా తన రూపురేఖలను మార్చుకుంటోంది. ఒకప్పుడు కేవలం సంప్రదాయ వస్త్రానికే పరిమితమైన పంచె, నేడు ఫ్యాషన్ ప్రపంచంలోనూ తన సత్తా చాటుతోంది. నేటి తరం యువత కోసం ‘ధోతీ ప్యాంట్స్’ అందుబాటులోకి వచ్చాయి. ఇవి అటు పాశ్చాత్య సౌకర్యాన్ని, ఇటు భారతీయ లుక్‌ను అందిస్తున్నాయి. ప్రముఖ సెలబ్రిటీలు, ఫ్యాషన్ డిజైనర్లు కూడా వేదికల మీద పంచెకట్టుతో మెరుస్తూ దీనికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు ఏవైనా పంచె లేకుండా మన వేడుక పూర్తికాదు. పత్తి (కాటన్) తో తయారయ్యే పంచెలు నిత్యం ధరించడానికి సౌకర్యంగా ఉంటే, పట్టు పంచెలు వైభవానికి గుర్తుగా నిలుస్తాయి. పంచె అనేది కేవలం ఒక వస్త్రం కాదు అది మన భారతీయత మూలాలతో ముడిపడిన ఒక అనుబంధం.ఇది కూడా చదవండి: బాంబుల మోత.. భయం లేకుండా విద్యార్థులకు పాఠాలు ఇలా.. -
ఉగాది వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్ దంపతులు
-
పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు (ఫొటోలు)
-
ఉగాది ప్రత్యేకం భక్షాలు
జడ్చర్ల టౌన్: తెలుగు నూతన సంవత్సరం ఉగాది అనగానే షడ్రుచులతో కూడిన పచ్చడితోపాటు బెల్లం, చక్కెరతో చేసే భక్షాల వంటకం ప్రత్యేకం. ఈ రెండు ఉంటేనే ఉగాది పండుగ చేసుకున్నట్లు లెక్క. తెలంగాణ ప్రాంతంలో భక్షాలు, ఆంధ్ర, మహారాష్ట్ర, యూపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లో బొబ్బట్లు, పోలెలు అని పిలుచుకుంటారు. భక్షాలను మైదాపిండి, శనగపప్పు, బెల్లం, చక్కెర, ఇలాచీలు ఉపయోగించి చేస్తారు. అయితే ప్రతిఏటా బెల్లం భక్షాలకు డిమాండ్ పెరుగుతుంది. ఆరోగ్య రీత్యా బెల్లం వినియోగం మంచిదనే అభిప్రాయం ఉండటంతో వాటిపట్ల కొనుగోలు దారులు ఆసక్తి చూపుతున్నారు. 15 వేలకు పైగా అమ్మకం పట్టణంలో పలుచోట్ల తయారు చేసి విక్రయిస్తుండటంతో పండుగ ఒక్కరోజే అన్ని కేంద్రాల్లో కలిపి 15వేలకు పైగా అమ్ముడవుతుంటాయి. యాంత్రిక జీవనం, పనిఒత్తిడి, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి చిన్న కుటుంబాలు పెరగటంతో భక్షాలు ఇళ్లల్లో తయారు చేసుకునేందుకు సమయం చాలటం లేదు. కొందరికి సమయం ఉన్నా చేయటానికి రాకపోవటంతో పండుగ పూట ఎలా అన్న అసంతృప్తి వెంటాడుతుంది. అలాంటి వారందరికీ భక్షాల తయారీ, విక్రయాలు వరంగా మారుతున్నాయి. పెరిగిన ధరలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఇబ్బందుల వల్ల భక్షాల ధరలకు సైతం రెక్కలు వచ్చాయి. గతేడాది చక్కెర భక్షాలు రూ.20– 22 ఉండగా ఈ ఏడాది రూ.24కు పెరిగింది. అదే బెల్లం భక్షం అయితే గత ఏడాది రూ.24 ఉండగా ఈ ఏడాది రూ.26కు పెంచారు. అయితే బేకరీలు, చిప్స్ సెంటర్లలో మాత్రం చక్కెర భక్షాలు ఇష్టారాజ్యంగా రూ.30కి ఒకటి విక్రయిస్తున్నారు. ఫార్మా సెజ్ కారణంగా పోలేపల్లి ఫార్మా సెజ్ కారణంగా జడ్చర్లలో వివిధ రాష్ట్రాల ప్రజలు వలస వచ్చి నివసిస్తున్నారు. వీరిలో ఆంధ్ర, మహారాష్ట్ర ప్రజలు బొబ్బట్లు, పోలెలుగా పిలుచుకునే భక్షాలను పండగపూట తినాలన్న ఆతృత కలిగి ఉండటం వల్ల ప్రతి ఏటా తయారీదారులకు డిమాండ్ పెరుగుతుంది. ఒక కూలి గంటకు 50 భక్షాలు తయారు చేస్తున్నప్పటికి వాటిని నిల్వచేసి విక్రయించే అవకాశం లేకపోవటంతో ఎక్కువగా ఆర్డర్లు తీసుకోలేకపోతున్నట్లు విక్రయదారులు పేర్కొంటున్నారు. ధరలు పెంచక తప్పటం లేదు గత కొన్నేళ్లుగా భక్షాలు తయారు చేస్తున్నాం. ఉగాది, దసరా పండగ రోజుల్లో భక్షాలకు ప్రతిఏటా ఆర్డర్లు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఉగాదికి బుధవారం సాయంత్రం వరకు ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. అయితే పెరిగిన కూలీ ధరలు, గ్యాస్ సిలిండర్ల సమస్య వల్ల ధరలు పెంచక తప్పటం లేదు. ముందు రోజు చేసి నిల్వ చేసే పరిస్థితి ఉండదు. తెల్లవారుజాము నుంచి తయారు చేయాల్సి వస్తుంది. – కోటకాడి కౌసల్య, బాలాజినగర్, జడ్చర్ల ఆర్డర్లు తీసుకోలేకపోతున్నాం.. ఉగాది పండుగకు ప్రతిఏటా 2వేల నుంచి 3వేలకు పైగా భక్షాలు తయారు చేస్తాం. ఎక్కువ ఆర్డర్లు వస్తున్నప్పటికీ తీసుకోలేని పరిస్థితి. గ్యాస్ సమస్య వల్ల ఈ ఏడాది భక్షాలు తయారు చేయటం కష్టంగా మారింది. – రాజనర్సింహ, భక్షాల విక్రయదారు, సాయినగర్ కాలనీ -
ఆ రాశి వారికి గోల్డెన్ డేస్ స్టార్ట్.. ఇక ఆడిందే ఆట.. పాడిందే పాట
-
ఉగాది వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు
-
‘పరాభవ’ ఉగాది
ఈనాటితో ఆరంభమయ్యే తెలుగు సంవత్సరం పేరు ‘పరాభవ’. పేరు పరాభవ కనక ఈ సంవత్సరంలో ఎదురు దెబ్బలూ, ప్రతికూల ఫలాలూ ఎక్కువ ఉంటాయని అపోహ పడాల్సిన పని లేదు. విశ్వావసు సంవత్సరం తన పేరుకు తగ్గట్టు విశ్వాన్నంతా సంపదలతో నింపలేదు. ‘రుధిరోద్గారి’ పేరు గల సంవత్సరం వచ్చినప్పుడల్లా నెత్తుటేరులు పారటం లేదు. 1962 ‘శుభకృత్తు’లో మనకు చైనాతో యుద్ధ పరాజయం కలిగింది. కాబట్టి, సంవత్సరం ఏదయినా, కాలం శుభాశుభ మిశ్రమంగానే నడుస్తుంది. అది కాలం తత్త్వం. అది కడలి. అందులో శుభాశుభాల అలలు వస్తూ పోతూనే ఉంటాయి. రెంటివల్లా ప్రయోజనం ఉంటుంది. రెండూ నిలిచేవి కావు.పరాభవోపి ఉత్సవ ఏవ మానినాం – దైవ వశం వల్ల ఎదురయ్యే అవమానాలు కూడా అభిమాన ధనులైన ధీరులకు ఉత్సాహ కరాలే – అంటాడు మహాకవి భారవి. పరాభవాలు ఎరగకుండా అఖండ విజయాలు సాధించిన ఘనులు చరిత్రలో ఎవరూ లేరు. అపజయాలే విజయాలకు సోపానాలు. ‘నాకు విపత్తులు తగినన్ని ఎప్పుడూ కలుగుతూ ఉండాలి. అవి లేకపోతే భగవంతుడిని స్మరించి, భజించి, తరించేందుకు తగిన ప్రేరణ ఉండదు’ అని ప్రార్థిస్తుంది, ఎన్నో పరాభవాలనూ, కష్టాలనూ ఎదుర్కొని జయించిన కుంతీ దేవి.మూడు పదులు నిండక ముందు వ్యధాగ్రస్తుడై ‘నాకుషస్సులు లేవు, నాకుగాదులు లేవు’ అని వగచిన కవి కుమారుడు కృష్ణశాస్త్రి గారు, అనుభవంతో పండి, ఎనభయ్యోపడికి చేరువయ్యాక, ‘అసలు, రానున్నదెప్పటికపుడు మంచి...’ అని బల్లగుద్ది ఉగాదిని ఆహ్వానించారు.ఎప్పుడు ఏ అనుభవం ఎదురయితే అప్పుడు దాన్ని ఆస్వాదించవచ్చు. ఇప్పుడు మాత్రం ఉగాదినీ, వసంత నవరాత్రులనూ హృదయపూర్వకంగా, సానందంగా, సాదరంగా (కవి శిరోమణి జ్ఞానానంద కవిగారి అందమైన మాటలతో) స్వాగతించుదాం:వలపులు గ్రుమ్మరించి, రస భావ పరంపర కూతమిచ్చి, పేశల సుమనోజ్ఞమౌ నవ వసంత వధూటిని వింత సోయగమ్ముల కులికింప జేసి, పరిఫుల్ల విక స్వర మూర్తివై, తెలుంగుల దరిశించు నీకు శత కోటి నమస్సులుగాది సుందరీ! – ఎం. మారుతి శాస్త్రి -
శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు.. కనుల పండువగా ప్రభోత్సవం (ఫొటోలు)
-
సాక్షి స్పెషల్.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు (ఫొటోలు)
-
"ఉగాది" రోజునే పంచాంగ శ్రవణం ఎందుకంటే..?
తెలుగు సంవత్సరాల ప్రకారం చైత్రమాసంలోని పాడ్యమితో కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రోజునే ఉగాది పండుగ జరుపుకుంటారు. ఆ రోజు ప్రముఖంగా ఆచరించేది పంచాంగ శ్రవణం. ఈ రోజునే ఎందుకంటే..తెలుగు సంవత్సరాది ప్రారంభమయ్యేది ఆ పర్వదినంతోనే కాబట్టి. ఉగాది రోజున ఆలయంలోగానీ, ఓ ఆధ్యాత్మిక ప్రదేశంలో గానీ పండితుల సమక్షంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. మరి అంత విశిష్టత గల పంచాంగ శ్రవణం వల్ల కలిగే ప్రయోజనాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదోక దిక్సూచిలా ఉండేది. శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగమును వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్లీ ఏడాది వచ్చే ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు.సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.రాజు - చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.మంత్రి - సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.సేనాధిపతి - సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.సస్యాధిపతి - సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.పంచాంగకర్తలు తమ పంచాంగాల్లో ఈ క్రింద శ్లోకంతో పంచాంగ రచన కుపక్రమిస్తారు.తిధిః వారంచ నక్షత్రం యోగః కరణమేవ చపంచాంగమితి విఖ్యాతం కాల్కోయం కర్మసాధకతిధి వారము, నక్షత్రము, యోగము, కరణము అనునవి ఐదు అంగములు కలది కనుక ‘పంచాంగం’ అన్నారు. మానవుల జీవితాలు కాలంపైన, కాలం గ్రహాల సంచారంపైన ఆధారపడి ఉన్నాయి. గ్రహాల సంచారంపై జ్యోతిష శాస్త్రం ఆధారపడి ఉంది. మనిషి పుట్టినది మొదలు గిట్టేవరకు వాని భవిష్యత్తు గ్రహ సంచారంమీద ఆధారపడి ఉంటుంది. మనిషి జన్మించిన సమయం తిథి, వారం, నక్షత్రములను బట్టి జాతక రచన జరుగుతుంది. ఈ వివరణలన్నిటికీ పంచాంగమే ప్రమాణము. పంచాంగం మనిషి యొక్క జాతక ఫలాన్ని తెలుపుతుంది. పంచాంగం ఏఏ ఫలాలనిస్తుందో జ్యోతిష శాస్తజ్ఞ్రులు ఇలా చెప్పారు.తిధేశ్చ శ్రీయమాప్నోది వారాదాయుష్మవర్ధనీమ్నక్షత్రాద్హరతే పాపమ్ యోగాద్రోహ నివారణమ్కర్ణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం దశమే ఫలమ్కాల విత్కర్మకృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్సంపదల కోరేవారు తిథియందు, దీర్ఘాయువు కోరేవారు వారం యందు, పాప విముక్తిని పొందగోరేవారు నక్షత్రమునందు, ఆరోగ్యము అభిలషించేవారు యోగమునందు, కార్యసిద్ధిని కాంక్షించేవారు కరణముయందు శ్రద్ధ వహించాలని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. శాస్త్రం పంచాంగం గురించి ఇంకా ఏమి చెప్పుచున్నదంటే.‘‘ శ్రీ కల్యాణ గుణావహం రిపుహరం దుస్స్వప్నదో షారుహంగంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాంఆయుర్వర్థన ముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రాదంనానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతాం’’.ఇది శుభాన్ని, మంగళాన్ని ఇచ్చేది, శత్రువులను హరించేది, దుస్స్వప్నాలను దోషాలను తొలగించేది; గంగాస్నాన ఫలం ఇచ్చేది, గోదాన ఫలం ఇచ్చేది, సత్సంతానాన్ని ప్రాప్తింపజేసేది అంటూ అందరూ పంచాంగం ప్రయోజనాన్ని పొందాలని ఆకాంక్షించింది.పంచాంగశ్రవణం చేసిన వారికి సూర్యభగవానుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, గురుడు-సంపదను, కుజుడు- శుభాన్ని, బుధుడు-బుద్ధిని, కుజుడు- సుఖాన్ని, శని- ఐశ్వర్యాన్ని, రాహువు- బాహు బలాన్ని, కేతువు-కులాధిక్యాన్ని కలిగిస్తారు.ప్రతి ఒక్కరు సాయంత్రం దేవాలయాలలో లేదా సత్సంగాలలో పంచాంగ శ్రవణం చేయడం తప్పనిసరి అని స్పష్టపరిచింది శాస్త్రం. జ్యోతిషశాస్త్ర రీత్యా తెలియజేసే ఫలితాలను తెలుసుకుని, ఆసంవత్సరంలో తాము తీసుకోబోయే లేదా ఆచరించవలసిన కార్యక్రమాలకు తగు విధమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది.(చదవండి: ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!) -
చైత్రమాసం విశిష్టత..! తెలుగు సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయంటే..
“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత"ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం.సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి "ఉగాది, "శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం వంటి విశిష్టమైన రోజులెన్నో ఈ మాసంలోనే ఉన్నాయి.అలా చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటిరాశియైన మేషరాశిలో సంచరిస్తున్నాడు.ప్రభవ నామ సంవత్సరంతో ప్రారంభమైన తెలుగు సంవత్సరాలు అక్షయతో ముగుస్తాయి. అంటే మనిషి పుట్టిన సంవత్సరం నుంచి తిరిగి అరవై ఏళ్ల తర్వాత అదే సంవత్సరం మొదలువుతుంది.అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది.అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి.ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’.ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే..కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు.కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది.అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి.మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది.తెలుగు సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయంటే..ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని తలంచాడు. దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు.అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు. వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.(చదవండి: -
'ఉగాది' అంతరార్ధం? ఆ కారణంగానే ఈ పండుగను..
భాషాపరంగా యుగాది సరైన పదం. ఉగాది అనే పదం వికృతిపదం. అయితే రెండూ ఒకే అర్థాన్ని బోధించే పదాలే. నిజానికి “యుగాది” అనే పదమే కాలాంతరంలో 'ఉగాది'గా మారింది. సోమకాసురుని నుండి వేదాలను విష్ణువు రక్షించిన రోజు ఉగాది. నూతన కల్పంలో జగత్తు సృష్టిని బ్రహ్మ ప్రారంభించిన రోజు. ఆరు రుచుల కలయికతో అనారోగ్యాలను అంతం చేసేది ఉగాది. హిందువుల పండుగల సంప్రదాయానికి మొదలు ఉగాది. వరాహమిహిరుడు ఈ ఉగాది నాడే పంచాంగాన్ని పరిచయం చేశాడని అంటారు. శ్రీరా ముడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు మొదలైన వారు ఉగాదినాడే పట్టాభిషిక్తులైనారని ఆర్యులు చెబుతారు. సంవత్సరాది నాడు ప్రజలు తెల్లవారక ముందే నిద్ర లేచి, కాలకృ త్యాలు తీర్చుకొని, తలకు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి, ఇష్టదైవానికి పూజలు చేసి, షడ్రుచుల పచ్చడిని ఆరగించాలి. నిర్ణీత సమయంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం చేయాలి.తిథిర్వారం చ నక్షత్రం యోగః కరణమేవ చ,పంచాగస్య ఫలం శృణ్వన్ గంగాస్నాన ఫలం లభేత్.తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే పంచాంగ శ్రవణం వల్ల గంగా స్నానంతో సమానంగా పుణ్యం, పురు షార్థం లభిస్తుందని పై శ్లోకం చెబుతున్న భావం. కొత్త సంవత్సరంలో గ్రహ, రాశిఫలాల్లో, నామ నక్షత్రాల్లో తేడా వస్తే దోషనివారణ కోసం శాంతి హోమాలు, వ్రతాలు, పూజలు చేసి సుఖశాంతులతో ప్రజలు జీవించడానికి పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది. నవగ్రహాల్లో సూర్యుడు తేజస్సును, చంద్రుడు భోగభాగ్యాలను, కుజుడు శుభాలను, బుధుడు బుద్ధి వికాసాన్ని, గురుడు జ్ఞాన విత్తాన్ని, శుక్రుడు కార్యసిద్ధిని, శనీశ్వరుడు దుఖ వినాశాన్ని, రాహువు సంతోషకరమైన రాణింపును, కేతువు చెప్పుకోదగి నంత గొప్పదనాన్ని కలిగిస్తారని విద్వాంసులు చెబుతారు.ఆరోగ్యమనే మహాభాగ్యాన్ని కలిగించేది ఉగాది పచ్చడి. శాస్త్రవచనాల్లో దానికి నింబకుసుమ భక్షణం, అశోకకళికా ప్రాశనం అనే పేర్లు కూడా ఉన్నాయి. తీపి, ఉప్పు, చేదు, వగరు, పులుపు, కారం సమపాళ్లలో కలిపి ఈ పచ్చడిని తయారు చేస్తారు. తీపికి బెల్లం, ఉప్పునకు ఉప్పు, చేదుకు వేపపూత, వగరుకు మామిడి ముక్కలు, పులుపునకు చింత పండు, కారమునకు మిరియాలు ఉగాది పచ్చడిలో వాడు తారు. వీటికి తోడు తమతమ ఇష్టాలను బట్టి జీలకర్ర, అరటిపండ్లు, ఎండుద్రాక్ష, జీడిపప్పు వంటివి కూడా కలిపి గొప్ప ఔషధంగా ఆరగిస్తారు. ఈ పచ్చడిని చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు ఒక పక్షం రోజులు సేవిస్తే వాత, పిత్త, కఫములకు చెందిన రోగాలన్నీ పటాపంచలవుతాయని వైద్యశాస్త్రం చెబుతుంది. భారతదేశంలో ఆంధ్ర రాష్టేతరులు సైతం సంవత్సరాది ఉత్సవాలను జరుపుకుంటారు. తమిళులు, మళయాళీలు, మరాఠీలు, సిక్కులు ఈ పండుగను జరుపుకోవడం విశేషం.(చదవండి: ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!) -
ఆరు రుచుల పండుగ
ఆనందం తియ్యగా, భయం పుల్లగా, దిగులు ఉప్పగా, కోపం కారంగా, బాధ చేదుగా, ఆసక్తి వగరుగా ఉంటాయి. ఈ రుచులు లేకపోతే స్వాదిష్టత లేదు. ఈ అనుభూతులు లేనిది జీవితం కాదు. అందుకే ఉగాది మనల్ని అన్ని రుచులతో అన్ని అనుభూతులతో అనుదినాన్ని సెలబ్రేట్ చేసుకోమని అంటున్నారు సాహితీవేత్త జి.వి. పూర్ణచందు‘రుచి’లో సంస్కృతి ఉంది. సౌందర్యం ఉంది. అనుభూతి ఉంది. ఆనందం ఉంది. ‘రుచించటం’ అంటే కమ్మగా మనసుకు అంగీకార యోగ్యంగా, ఙ్ఞానదాయకంగా ఉండటం అని! ఉగాదిని ఆరు రుచుల పండుగగా భావించటం వలన రుచులు మన శరీరంపై, మనసుపై, మస్తిష్కంపై కలిగించే ప్రభావాన్ని అర్థం చేసుకోవటం సాధ్యం అవుతుంది. ఉగాది నాలుకకు, మనసుకు, మెదడుకు సంబంధించిన రుచుల సమ్మేళనంగా జరిగే పండుగ. తెలుగులో ‘ఉగము’ అంటే ఆయువు. ‘ఆద’ అంటే కష్టం. ‘ఆదట’ అంటే ప్రేమ, తృప్తి. కాబట్టి ‘ఉగాది’ సుఖదుఃఖాల్ని, నిర్మాణ విచ్ఛిన్నాల్ని, తీపి పులుపుల్ని సమన్వయం చేసుకుంటూ సాగిపోవాలని, జీవితాన్ని ప్రేమించి సంతృప్తి పొందాలని, ఉన్నతికి మెట్లు పరుచుకోవాలని మనకు సూచిస్తోంది. ఉగాది నుండి ఉగాది దాకా జరిగే పరిణామాల్ని, ఎదురయ్యే అవరోధాల్ని గోచార రీత్యా అంచనావేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటాడు తెలుగువాడు!మనసు రుచులు రుచులు ఆరు... తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు... ఒక్కో రుచికీ ఒక్కో ప్రభావం ఉంటుంది. ఈ ఆరు రుచులూ శరీరానికే కాదు మనసుకూ మెదడుకు కూడా పోషణ నిస్తాయి. ఆహారంలోని ఆరు రుచులే సత్త్వ రజస్తమో గుణాలను ప్రేరేపిస్తున్నాయని భగవద్గీత పేర్కొంది. ‘యథా అన్నం తథా మనః’ ఆహారం ద్వారానే ఆత్మాభివృద్ధి, మానసిక ఉన్నతి సిద్ధిస్తాయి. మన ఆహారమే మన ఆరోగ్యాన్ని, మన మనస్తత్వాన్ని, జీవన ధోరణిని నిర్ణయిస్తుంది. భోజనం అనేది కడుపు నింపి పోషించటానికే కాదు, అది మానసిక పరిపక్వతకు కూడా కారణం అవుతోంది. నోటికైనా, మనసుకైనా, మెదడుకైనా రుచులు ఆరే! జీవితానికి ఆనందాన్ని, సంప్రదాయాన్ని, సామూహిక అనుభూతిని అందించేది ఆరు రుచులతో కూడిన ఆహారం. ఉగాది పండుగ ఈ ఆరు రుచుల ప్రాధాన్యతని నొక్కి చె΄్తోంది.త్రిగుణాత్మక రుచులుమనిషి మెదడులోని ఆలోచనలను తమోగుణం నియమిస్తే, రజోగుణం ప్రవర్తింపచేస్తే, సత్త్వగుణం నియంత్రిస్తుందని మన సిద్ధాంతం. మెదడు రుచులకు కూడా ఇలాంటి గుణాలే ఉంటాయి. ఆనందం తియ్యగా, భయం పుల్లగా, దిగులు ఉప్పగా, కోపం కారంగా, బాధ చేదుగా, ఆసక్తి వగరుగా ఉంటాయి. వీటిలో ఏ రుచిని వదిలి జీవించగలం...? నోటి రుచుల్ని, మనసు రుచుల్ని సమ్మేళనం చేసుకోగలిగితే శరీరమూ మనసు, ఇంద్రియాలతో పాటు ఆత్మ కూడా సంతృప్తి చెందుతుంది. ఉగాది పండుగ ఆరు రుచులకూ అంతటి ప్రాధాన్యత నిచ్చింది.నోటి రుచులుతీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు.... ఈ 6 రుచులు ఒకదానితో ఒకటి వివిధ నిష్పత్తుల్లో కలవటం ద్వారా 63 రుచులు అవుతాయి. ఈ 63 రుచుల మర్మాన్ని తెలుసుకుని, ఆహార పదార్ధాల్ని వండుకోగలిగితే ఆహారం ఆరోగ్యదాయకంగా పోషకంగా ఉంటుంది. భారత దేశం మొత్తంలో తమ ప్రధానమైన ఆహారాన్ని అన్నం అని నోరారా పిలిచేది ఒక్క తెలుగువారే! మనకు అన్నం అంటే ఆరు రుచులతో కూడిన పదార్థాలను ఆస్వాదిస్తూ తినటం అని! అలా మనల్ని ఆరు రుచులకి అంకితం చేసింది ఉగాది! ఈనాటికీ ఉగాది ప్రబోధం ఆరు రుచుల్ని విడవొద్దనే! ఉగాది పచ్చట్లో వేపపూతని కూడా చేర్చటం ద్వారా ఆహార ఔషధ ప్రాధాన్యతని ఉగాది గుర్తు చేస్తోంది! -
కొత్త తరం ఉగాది స్వరం
ఉగాదంటే వాకిట్లో పూల రుతువుచిగుర్లేసే తీవెల నుండి... విప్పారే పూవుల నుండి... కోయిలమ్మల గొంతుల నుండీ... చుట్టూ లోకమంతా పరుచుకునే ఆనందాన్ని ఆగి చూడటానికి... కొండగుర్తు లాంటి రోజొకటి కావాలి. ఉగాది ఆ ఉత్సాహాన్ని ఉత్సవం చేసే రోజు. కోయిల గొంతులో సంబరం వంటి ఈ తెలుగువారి పండుగపై కవయిత్రి మానస చామర్తి ఏమంటున్నారో తెలుసుకుందాం...ఉగాది చాలా నెమ్మదైన పండుగనిపిస్తుంది నాకు. సంక్రాంతికి ఉన్నట్టు పెద్ద ఆర్భాటముండదు. దసరా దీపావళులకున్నట్టు సందడీ, సెలవులూ ఉండవు. పైపెచ్చు పిల్లల పరీక్షల కాలం. ఒక్కటంటే ఒక్కటే రోజుకు సెలవు. అయినా అది కాదు లెక్క. విరబూసే పూల ఋతువు వాకిట్లో కనపడుతున్నప్పుడు, గుప్పెడు గుప్పెడు ప్రాణాలు గొంతు విప్పి ఉదయాలను మేల్కొల్పుతున్నప్పుడు, క్యాలెండర్ కన్నా ముందు హృదయానికే తెలుస్తుంది, ఈ కాలమేదో ప్రత్యేకమని. ఏడాది మొత్తానికీ ఇది పండుగకాలమని. అందుకే గీతలో కృష్ణుడు కూడా, తాను ఋతువులలో వసంతాన్నని చెప్పుకున్నాడు (ఋతూనాం కుసుమాకరః). ఆ వసంత ఋతువు, చైత్ర మాసపు తొలిరోజునే మనం ఉగాదిగా పిలుస్తున్నాం. చిగుర్లేసే తీవెల నుండి, విప్పారే పూవుల నుండి, కోయిలమ్మల గొంతుల నుండీ చుట్టూ లోకమంతా పరుచుకునే ఆనందాన్ని ఆగి చూడటానికి, కొండగుర్తు లాంటి రోజొకటి కావాలి! ఉగాది ఆ ఉత్సాహాన్ని ఉత్సవం చేసుకునే సందర్భం. రేగిపళ్ళు, పసిడితోరాలు, పానకం వడపప్పులు, పుస్తకాల మీద పసుపు ఓంకారాలు, బొమ్మల కొలువులు, గోంగూరకాడలు...ఒక్కో పండక్కీ జతపడే ఆనవాయితీ ఒకటుంది మనకి. ఉగాది అంటే అట్లా గుర్తొచ్చేవి మరీ ముఖ్యంగా ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం.ఏడాది పొడుగునా అన్నీ దొరికే ఈ కాలంలో కూడా ఉగాది పచ్చడి మాత్రం ఉగాది రోజునే దొరుకుతుంది. నచ్చి, ఇంకోసారి చెయ్యమని మారాం చేస్తే, ఇది ఈ ఒక్కరోజే తినాలని ఆ పసి్రపాణాన్ని బుజ్జగించిన అమ్మ గొంతు చెవుల్లో ఇంకా అట్లానే వినపడుతోంది. వేపకొమ్మల నుండి వేప పూవులను సాధించుకుని, తెల్లటి పల్చటి రేకులను మాత్రం జాగ్రత్తగా వొలిచి ఆ పచ్చడి గిన్నెలో కలపడం నా పని. చిన్నప్పుడంతా ఉగాది రోజు ఉదయాన్నే ఎవరో పుణ్యాత్ములు ఇంటింటికీ తిరిగి గుమ్మాల దగ్గర వేపకొమ్మలు పెట్టి వెళ్ళేవాళ్ళు. ఇంటికొకరు చొప్పున చెట్లెక్కి వేపకొమ్మలు విరిచే శ్రమను తప్పించడమన్నమాట. కావాలా? అని అడగడం కూడా ఉండేది కాదు. వేప పూరేకులు వొలిచి, పొట్లాలు చుట్టి, రేటు కట్టి అమ్ముతున్న ఈ రోజుల్లో నిలబడి చూస్తే, నా చిన్నప్పటి ఊరికీ, ఆ వేపగాలికీ చాలా దూరం వచ్చేశాననిపిస్తోంది. రాజపూజ్యమూ– అవమానమూ, ఆదాయమూ వ్యయమూ, పుట్టి బుద్ధెరిగాక ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా ఇవి జంటగా నాకు బాగున్న దాఖల్లాల్లేవు. అయినా పంచాంగ శ్రవణమంటే చెవులప్పజెప్పి కూర్చోవడమే తెలుసు. మానవ సహజమైన ఆశ ఒకటి, ఎవరేమి చెప్పినా అంతా మంచే జరగనుందని నమ్మబలికేది. ఆ అద్భుతాల కోసం ఏడాది పొడుగునా ఎదురుచూడటమే జీవితమనిపించేది. కొత్త సంవత్సరం, కొత్త ఋతువు, కొత్త మాసం...మట్టి పలక మీద నీళ్ళు జల్లి, శ్రద్ధగా తుడిచి మళ్ళీ నచ్చినవేవో రాసుకోమన్నట్టు– కొత్త ఉగాది. జనవరి ఒకటికి రాసుకుని మర్చిపోయిన కలలకి మళ్ళీ కాస్త కదలిక వచ్చే రోజు. మళ్ళీ కొత్త ఆలోచనలు, కొత్త నియమాలతో కొత్త జాబితాలు తయారు. మళ్ళీ నిండు వాగ్దానమై చేతుల్లో పడ్డట్టుండే జీవితం. ఆరోగ్యంగా మేలుకునే ప్రతిరోజూ మనిషికి దొరికే కొత్త అవకాశమే కానీ, ఉగాది మాత్రం వాగ్దానమనిపిస్తుంది. ఉదయాన్నే లేస్తే చాలు. అడుగు బయటపెడితే చాలు పూలు, సీతాకోకల రంగుల తేజస్సు, విరిసే మల్లెల పరిమళం, కోయిల గొంతులోని సంబరం – అయాచితంగా మనిషికి బట్వాడా అయిపోతాయని నాకనిపిస్తుంది. ఆ కాస్త వ్యవధి, ఆ కాస్త ప్రయత్నం ఆశించగలమా ఈ హడావుడి జీవితాల నుండీ, అన్నది ప్రశ్న. ఉగాది రోజు ఏం చేస్తే, ఏడాదంతా అదే చేస్తామన్న అమాయకపు నమ్మిక ఒకటి ఉండేది. అందుకని మంచి మాటలే మాట్లాడటం, మంచిపనులే చెయ్యడం, ఇష్టమైన వాళ్ళని కలవడం, కలిసి, ఏడాదంతా మనదేనని చెప్పుకోవడం... ఎదిగే క్రమంలో ఎక్కడో పారేసుకున్నాను ఈ అందమైన విశ్వాసాన్ని. సాయంకాలపు నడకల్లో మామిడిచెట్లు కనపడితే ఇప్పుడు చూపు ఆగిపోతోంది. ఆ పూతవేసిన లేతమావి శోభ కాళ్ళను కట్టిపడేస్తోంది. పక్క వీధిలో ఉండే స్నేహితురాలొకరు, ఈ ఏడాదికి మొదటగా పూశాయంటూ దోసెడు మల్లెలు చూపించారు. ఎగబీల్చిన పరిమళం నా ఊపిర్లో కలిసిపోయింది. గుత్తులు గుత్తులుగా వాకిట్లో ఏవేవో పూవులు. ఆ పూల మధువు కోసం పూటా కొందరు కొత్త అతిథులు. ‘ఎవరు వారు వచ్చేరు? పూవుల తేరుపై; చైత్ర రథంలోన శ్యామపత్రపథంపైన, ఎవరా వచ్చేది?’ అని ప్రశ్నించి, అది ఉగాది అది ఉగాది అంటారు కృష్ణశాస్త్రి. ఉగాదితో పాటు వచ్చే ఈ అతిథులను చూస్తే నాకైతే ‘రొద సేయకే తుమ్మెదా...‘ అని పాడాలనిపిస్తుంది. నెలల తరబడి నీళ్ళు పోస్తూ ఆశగా చూసినన్నాళ్ళూ పూలు రాల్చని మొక్కల మీదకి, మొగ్గలు మొదలవుతూనే తుమ్మెదల తాకిడి. ఆ పూల మెత్తదనాన్ని తాకి చూసే వీలైనా లేకుండా మత్తుగా ఆ పూరెమ్మల మీదే తూగుతూ కనపడతాయ్. ‘ఈ పూల ఋతువంతా ఈ తేటిదో... ఈ తోటమాలిదో...’ అన్న సినీకవి సందేహం ఇప్పుడు నాది కూడా. -
ఉగాది పండుగ సందేశం ఇదే!
తెలుగు వారి పండుగల చిట్టాలో ఉగాది ముఖ్యమైనది. పూర్వ కాలంలో దీనినే ‘యుగాది’గా పిలిచేవారు. అంటే యుగానికి ఆదిగా దీనికి నిర్వచనం. ఆంగ్ల సంవత్సరాది జనవరి ఒకటిన ప్రారంభం అవుతుండగా, మన తెలుగు సంవత్సరాది చైత్ర మాసంలో ప్రారంభమవుతుంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో వచ్చే ఈ పండుగతో కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో పాటు వరుసగా పర్వదినాలు వస్తాయి. రానున్న సంవత్సరాన్ని పరాభవ నామ సంవత్సరంగా వ్యవహరిస్తారు.శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ వసంతంలో చిగుళ్లు తొడిగి కొత్త సింగారాలొలుకుతుంటాయి. రుతువుల్లో మొదటిదైన వసంతం మనోహరమైనదీ, ఆహ్లాదకరమైనదీ. వసంత రుతువు తానే అన్నాడు శ్రీకృష్ణుడు. అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం. తిథుల్లో తొలి గౌరవం పాడ్యమిది. బ్రహ్మ సృష్టి ఆరంభించినది ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడే అంటోంది బ్రహ్మపురాణం. రామ పట్టాభిషేకం జరిగిందీ, శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిందీ, కలియుగం ప్రారంభమైందీ ఆ రోజేనని పండితులు చెబుతారు.ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త వరాహమిహిరుడి అంచనాల ప్రకారం చైత్రమే తొలి మాసం. ఆ రోజే తొలి పంచాంగాన్ని జనజీవన స్రవంతికి అంకితం చేశాడాయన. విక్రమార్కుడూ, ఆంధ్రరాజుల చక్రవర్తి శాలివాహనుడూ సింహాసనాన్ని అధిష్ఠించిందీ ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే చాంద్రమానాన్ని అనుసరించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలు చైత్ర శుద్ధ పాడ్యమినే నూతన సంవత్సర ఆరంభ దినంగా, కొత్తదనానికి ప్రారంభంగా భావించి పండగ జరుపుకొంటారు.ఉత్కంఠ గొలిపే సంవత్సర ఫలితాలను, కందాయ ఫలాలను పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవడం ఉగాది నాటి ముఖ్య వేడుక. కొత్త చిగుళ్లతో, రంగురంగుల పూలతో, పరిమళాల పన్నీరుతో కొమ్మకొమ్మకీ మామిడి తోరణాలు, కోయిల పాటలు వసంతానికి పచ్చని గురుతులై ప్రాణికోటికి శుభం పలుకుతున్నాయి. షడ్రుచుల ప్రసాదం కోసం మామిడి పిందెలు, వేపపూతలు సిద్ధంగా ఉన్నాయి.అన్ని రుచులు సమానంగా ఆస్వాదించాలనీ, అన్ని అనుభవాలు కలిస్తేనే సంపూర్ణ జీవితమనే సందేశాన్ని ఉగాది పచ్చడి మానవాళికి అందిస్తోంది. సంవత్సరమంతా జీవితంలో ఏర్పడే కష్టనష్టాలు, సుఖ సంతోషాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలనే తాత్విక సందేశం ఉగాది పండుగలో ఉంది.– నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ -
తెలుగువారందరికీ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉగాది శుభాకాంక్షలు
హైదరాబాద్: ప్రపంచంలోని తెలుగువారందరికీ తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘పరాభవ నామ ఉగాది శుభ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు మాట్లాడే సోదరులు, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ తెలుగు నూతన సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆశీర్వాదాలు, సమృద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.‘ఉగాది ఆనందం, ఆశల పండుగ. ఈ నూతన సంవత్సరం కొత్త ఉత్సాహం, ప్రకాశవంతమైన భవిష్యత్తును తీసుకురావాలి. ఉగాది స్ఫూర్తిని, సంప్రదాయ ఉగాది పచ్చడిలోని విభిన్న రుచులు సూచించే భావాన్ని ఆమోదించి, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఆశావాద దృక్పథంతో ఎదుర్కొందాం. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రతి ఒక్కరికీ, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, సమృద్ధి, ఐక్యత, ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలి’ అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన సందేశంలో పేర్కొన్నారు. -
Ugadi: తెలుగు ప్రజలకు జగన్ ఉగాది శుభాకాంక్షలు
-
ఉగాది పండుగ నాడు తప్పక ఆచరించాల్సినవి...!
ఉగాది.. తెలుగు ప్రజల కొత్త ఏడాదికి ప్రారంభం. చైత్ర మాస శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున చేసే పనులు ఏడాది మొత్తం జీవితంపై ప్రభావం చూపిస్తుందని పెద్దలు, పండితులు చెప్తారు. అందుకే ఉగాది రోజు కొన్ని శుభకార్యాలు చేయడం ఆచారంగా ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.ఉగాది రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు, సాంప్రదాయాలు చేయడం వల్ల ఆ ఏడాది మొత్తం శుభంగా ఉంటుందనేది భక్తుల నమ్మకం.ప్రభాత వేళే మేల్కొనడం – బ్రహ్మ ముహూర్తంలో లేచి, తైలస్నానం (నువ్వుల నూనెతో స్నానం) చేయడం శ్రేయస్కరం.కొత్త బట్టలు ధరించడం – కొత్త ఆరంభానికి సంకేతంగా, ఈ రోజు అందరూ కొత్త బట్టలు ధరించి ఉగాదిని ఆహ్వానిస్తారు.వేప పచ్చడి సేవించడం – తీపి, చేదు, కారం, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచులను కలిపి తయారుచేసిన ఉగాది పచ్చడి జీవితంలోని అనేక అనుభవాలను సూచిస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.పంచాంగ శ్రవణం – ప్రతి ఉగాది రోజున కొత్త సంవత్సర ఫలితాలను తెలుసుకునేందుకు పండితుల ద్వారా పంచాంగ శ్రవణం చేయడం ఉత్తమం. మినపప్పు , కందిపప్పు, శెనగపప్పుతో చేసిన పదార్ధాలు స్వీకరించాలి, స్వయంపాకంగా దానం ఇవ్వాలి.బ్రాహ్మణులకు దానము ఇవ్వాలి. కుదిరితే అన్నదానం చేయాలి. జలదానం చేయాలి. తల్లిదండ్రులకు భక్తితో నమస్కరించాలి, భార్యను ప్రేమతో చూచి కుదిరితే గాజులు కొనిచ్చి /కొనిపెట్టి , కుంకుమ బొట్టు పెట్టి ఆమెను దేవతగా భావించాలి. తద్వారా పార్వతీదేవి యొక్క ఆశీస్సులు పొందగలము. గురువునకు ఉగాదినాడు 3 ప్రదక్షిణలు చేసినవారు, 3 సార్లు భూప్రదక్షిణ చేసిన ఫలితం పొందుతారు. లక్ష్మీదేవిని పూజించి వ్యూహలక్ష్మీ మంత్రమును జపించుకోవటం, ఈశ్వరునికి అభిషేకం చేసుకోవటం శ్రేష్ఠం. పంచాంగ శ్రవణం చేయండి, కుదిరితే పంచాంగం లేక మంచి పుస్తకాలు దానం చేయడం మరింత ఉత్తమం. ఆలా చేస్తే పిల్లల యొక్క విద్య వృద్ధి చెoదుతుంది. పసుపు కుంకుమలు దానం ఇవ్వండి. బూరెలతో కూడిన భోజనము చేస్తే భూరి సంపదలు ఇస్తాడు పరమాత్మ. కోపం వదిలి, అన్నీ మంచి పలుకులు పలుకుదాము, ఈ నూతన సంవత్సరం సకల శుభాలను పొందుదాం... ఇవేగాక చాలామంది ఉగాది పండుగ నాడు ఇంటిపై కాషాయ ధ్వజం ఎగురవేయడం వంటివి చేస్తుంటారు. ఇలా ఎందకు చేస్తారు దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక రహస్యాలు ఏంటంటే.విజయ ప్రతీకగా..నూతన సంవత్సర ఆరంభం (విజయ ప్రతీక)... తెలుగు రాష్ట్రాలలో ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం, ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. కాషాయ రంగు త్యాగానికి, పవిత్రతకు, ధర్మానికి చిహ్నం. కొత్త సంవత్సరం అంతా ధర్మబద్ధంగా, విజయవంతంగా సాగాలని కోరుకుంటూ ఇంటిపై ధ్వజాన్ని ఎగురవేస్తారు.చారిత్రక నేపథ్యం (విజయ సంకల్పం)... చారిత్రక కోణంలో చూస్తే, ఈ రోజును విజయ దినంగా కూడా భావిస్తారు. శాలివాహన చక్రవర్తి శకులను జయించి 'శాలివాహన శకం' ప్రారంభించిన శుభసందర్భం ఇది. ధ్వజం అనేది విజయానికి గుర్తు. ప్రతి ఇంటిపై ఈ జెండాను ఉంచడం ద్వారా ఆ కుటుంబం రక్షణ, ఐక్యతను చాటుతారు.ఆధ్యాత్మిక అర్థం... కాషాయం అంటే సూర్యోదయ కిరణాల రంగు. ఇది చీకటిని (అజ్ఞానాన్ని) తొలగించి వెలుగును (జ్ఞానాన్ని) ప్రసాదించే రంగు. హిందూ సంప్రదాయంలో జెండాను 'కేతువు' అని పిలుస్తారు. ఇంటి పైన జెండా ఎగురవేయడం వల్ల దుష్టశక్తులు దరిచేరవని, దైవ రక్షణ ఉంటుందని భక్తుల నమ్మకం.పండుగ అలంకరణలో భాగం...సాధారణంగా ఉగాదినాడు గుమ్మాలకు మామిడి తోరణాలు, వేప రెమ్మలతో పాటు ఇంటి కప్పు పైన లేదా బాల్కనీలో కాషాయ జెండాను కడతారు. ఇది ఇంటికి ఒక పవిత్రమైన రూపాన్ని ఇస్తుంది. ధ్వజం కట్టేటప్పుడు జెండా శుభ్రంగా, చిరగకుండా ఉండాలి.సాధారణంగా దీనిపై 'ఓం' కారము లేదా హనుమంతుడి చిహ్నం ఉంటుంది. జెండాను ఎత్తైన ప్రదేశంలో గాలికి రెపరెపలాడేలా కట్టడం శుభప్రదంగా భావిస్తారు.(చదవండి: పరాభవ నామ సంవత్సరం ఆధ్యాత్మిక అంతరార్థం..!) -
ఇజ్రాయెల్ టు జపాన్.. అంతటా ఉగాది పచ్చడి క్రేజ్
ఉగాది అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘ఉగాది పచ్చడి’. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు.. ఇలా ఆరు రుచుల సమ్మేళనంతో జీవిత పాఠాన్ని నేర్పే ఈ పచ్చడి మన తెలుగు వారికే ప్రత్యేకం అనుకుంటాం. అయితే ఈ ఆచారం కేవలం మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ‘జీవిత సారాన్ని’ తినిపించే సంప్రదాయాలు ఉన్నాయనే సంగతి మీకు తెలుసా? అవేంటో ఒకసారి చూద్దాం!ఇజ్రాయెల్ ‘సెడర్ ప్లేట్’: చేదు జ్ఞాపకంయూదుల ‘పాసోవర్’ పండుగలో వడ్డించే ‘సెడర్ ప్లేట్’ మన ఉగాది పచ్చడికి గట్టి పోటీ ఇస్తుంది. ఇందులో ‘మారోర్’ అనే చేదు ఆకును తింటారు. ఇది వారి పూర్వీకులు పడ్డ కష్టాలను గుర్తుచేస్తుంది. అదే ప్లేట్లో ‘చరోసెట్’ అనే పండ్లు, గింజల తీపి మిశ్రమం ఉంటుంది. అంటే కష్టం (చేదు) తర్వాత సుఖం (తీపి) వస్తుందని చెప్పడమే దీని ఉద్దేశం. ఇది మన వేపపువ్వు, బెల్లం కాంబినేషన్ మాదిరిగానే ఉందనుకుంటున్నారా?జపాన్ 'ఓసేచి': బాక్సుల్లో భవిష్యత్తుజపనీయులు కొత్త సంవత్సరంలో ‘ఓసేచి ర్యోరి’ అనే ప్రత్యేక వంటకాల బాక్సును పంచుకుంటారు. ఇందులో ఒక్కో పదార్థానికి ఒక్కో అర్థం ఉంటుంది. నల్ల సోయా చిక్కుళ్లు తింటే ఆరోగ్యం, చేప గుడ్లు తింటే సంతాన ప్రాప్తి అని వారి నమ్మకం. మన ఉగాది పచ్చడిలో మామిడి వగరు లాగే, వారు కూడా ప్రకృతి ఇచ్చే ప్రతి పదార్థాన్ని ఒక ఆశీర్వాదంగా జపనీయులు భావిస్తారు.ఇరాన్ 'హఫ్త్-సీన్': ఏడు వస్తువులు.. ఏడు పాఠాలు!పర్షియన్ కొత్త సంవత్సరం ‘నౌరూజ్’ సమయంలో ఇరానీయులు ‘హఫ్త్-సీన్’ అనే టేబుల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో ‘ఎస్’ అక్షరంతో మొదలయ్యే ఏడు పదార్థాలు ఉంటాయి. వెల్లుల్లి ఆరోగ్యానికి, వినెగర్ సహనానికి ప్రతీక అని చెబుతారు. మన పచ్చడిలో చింతపండు పులుపు ఎలాగో, అక్కడ వినెగర్ అలా అన్నమాట. ఈ సంప్రదాయం వెనుక ఉన్న లోతైన అర్థం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.చైనా ‘లాబా గంజి’: ఎనిమిది రకాల అదృష్టంచైనీయులు ‘లాబా’ పండుగ నాడు ఎనిమిది రకాల ధాన్యాలు, పండ్లతో చేసిన గంజిని తాగుతారు. ఇది కేవలం ఆకలి తీర్చడానికే కాదు, రాబోయే ఏడాది అంతా అదృష్టం కలిసిరావాలని చేసే ఒక ప్రార్థన. మన ఉగాది పచ్చడిలో కొత్త బెల్లం ఎలాగైతే కొత్త ఆశలను చిగురింపజేస్తుందో, ఈ లాబా గంజి చైనీయులకు అంతటి పవిత్రమైనది.మహారాష్ట్ర 'పంఛరస': అదే సంప్రదాయంమన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో గుడి పడ్వా రోజున ‘పంఛరస’ పేరుతో వేపపువ్వు, బెల్లం, ఉప్పు, జీలకర్ర కలిపిన లడ్డూలను తింటారు. పేరు వేరైనా పరమార్థం ఒక్కటే. జీవితం అంటే కేవలం తీపి మాత్రమే కాదు, అన్ని రుచులను సమానంగా స్వీకరించాలని ఈ వంటకం మనకు గుర్తు చేస్తుంది. ఈ పోలికలను చూస్తుంటే ‘వసుదైక కుటుంబం’ అనే భావన మనలో కలుగుతుంది.రుచులు వేరైనా భావం ఒక్కటేమనిషి ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడుతున్నా జీవితంలోని ఒడిదుడుకులను ఆహారం ద్వారా అర్థం చేసుకోవడం ఒక అందమైన సంప్రదాయం. ఉగాది పచ్చడి అయినా, పాసోవర్ చేదు ఆకులైనా.. కష్టాన్ని భరిస్తూ సుఖాన్ని వెతుక్కోవడమే అసలైన విజయం. అందుకే ఈ ఏడాది ఉగాది పచ్చడి తీసుకునేటప్పడు దానిలోని ‘ప్రపంచవ్యాప్త తత్వాన్ని’ గుర్తుచేసుకోండి. ఇది కూడా చదవండి: విచ్చలవిడి ‘యూజర్ల’పై ప్రభుత్వం ఉక్కుపాదం -
రీల్స్ పిచ్చి.. ఇంటి యజమానిని పార్శిల్ చేసిన కుటుంబం?!
బెంగళూరులోని వ్యాలికవల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం చేసిన విచిత్ర ప్రయత్నం స్థానికులను, పోలీసులను షాక్‌కు గురి చేసింది. ఒక మహిళ, ఆమె భర్త, అత్త, మరిది కలిసి పెద్ద ప్యాకేజీని కొరియర్ సర్వీస్ ఆఫీసుకు తీసుకెళ్లారు.పార్శిల్ తరలించే ముందు దాని బరువు ఎంత ఉంది? అందులో ఏమున్నాయి? అని అడగడం సర్వసాధారణం. ఈ ఘటనలో కూడా పార్శిల్ సర్వీస్ కార్యాలయం ప్రతినిధులు ఇదే విధంగా ఆరా తీశారు. సిబ్బంది పార్శిల్ లోపల ఏముందో చెప్పాలని అడగ్గా కుటుంబ సభ్యులు సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు. ‘మేము కష్టపడి ఇంత దూరం వచ్చాం. ఈ పార్శిల్‌ను తాము చెప్పిన అడ్రస్‌కు పంపాలి’ అని పట్టుబడుతూ వాగ్వాదానికి దిగారు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన సిబ్బంది ప్యాకేజీని తెరిచి చూడగా.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఇంటి యజమాని బయటకు వచ్చాడు.కంగుతిన్న సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.విచారణలో కుటుంబం చెప్పిన వివరణ మరింత ఆశ్చర్యకరంగా మారింది. ఉగాది, రంజాన్ మాసంలో బస్సు, ట్రైన్ టికెట్లు దొరకకపోతే గమ్యస్థానానికి ఎలా వెళ్లాలో చూపించేందుకు ఇంటి యజమానిని తెల్లబస్తాలో పెట్టి పార్శిల్ కేంద్రానికి తీసుకువచ్చామని, ఇదంతా సోషల్ మీడియా రీల్స్ కోసం చేశామని తెలిపారు. తరువాత పోలీసులు కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరికి వారు క్షమాపణలు చెబుతూ, తాము చేసిన పని బాధ్యతారహితమని అంగీకరిస్తూ వీడియోను రికార్డు చేశారు.పోలీసులు కుటుంబానికి కఠిన హెచ్చరిక జారీ చేసి, ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లు మళ్లీ చేయవద్దని సూచించారు. చివరికి వారిని విడిచిపెట్టారు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. వినోదం కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి. Daughter & family stuff father in gunny bag, take him to courier office to "send parcel" out of Bengaluru all for a reel showing it's easier to courier a man than book bus/train tickets this festive season. Now in police station. Weird world. 😭pic.twitter.com/gGEpKeeYjM— Ghar Ke Kalesh (@gharkekalesh) March 17, 2026 -
శ్రీశైలంలో ఉగాది జాతర..నల్లమలలో పాదయాత్రగా వెళ్తున్న కర్ణాటక భక్తులు (ఫోటోలు)
-
పరాభవ నామ సంవత్సరం ఆధ్యాత్మిక అంతరార్థం..!
తెలుగు వారి నూతన సంవత్సరం, పరాభవ నామ సంవత్సరం మార్చి 19, 2026న ప్రారంభం కాబోతుంది. అయితే చాలా మంది సంవత్సరం పేరు చూసి భయపడుతున్నారు. ఇదే సంవత్సరంరా బాబు..అసలు బాగుంటుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. పేరే పరాభవ నామ సంవత్సరం అంటే అన్ని పరాభవాలే, అవమానాలేనా అని ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ పరాభవ నామ సంవత్సరం అంతరార్థం ఏంటో సవివరంగా తెలుసుకుందామా..!.మనిషిలో ఉన్న 'అహంకారం', 'గర్వం', 'స్వార్థం' పరాభవం పాలు కావడాన్ని (ఓడిపోవడాన్ని) ఇది సూచిస్తుంది. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలను జయించి, వినయంతో ఉండాలని ఈ సంవత్సరం మనకు బోధిస్తుంది. అహంకారంతో విర్రవీగే పాలకులకు, వ్యక్తులకు ఈ సంవత్సరం గట్టి గుణపాఠం నేర్పుతుంది. కానీ... వినయంతో, నిజాయితీగా, ధర్మబద్ధంగా కష్టపడే వారికి అద్భుతమైన విజయాలను అందిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో పరాభవ నామ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం ఉగాది పచ్చడి కూడా విలక్షణమైనదిగానే పరిగణిస్తారట. ఎందుకంటే.. ఆరు రుచుల తోపాటు ప్రతికూలత అనుకూలత అనే రెండింటిని సమానంగా చూపుతుంది. ఎవరు అయితే సవాళ్లను అధిగమించి, సహనంతో ముదుకు సాగుతారో వారికి ఈ సంవత్సరం అదృష్టాన్ని ఇస్తుందంట. అలాగే సంవత్సరం ఫలితాలు అనేవి కేవం కొత్త ఏడాది పేర్లపైనే ఆధారపడి ఉండవు, ఇవన్నీ కూడా కర్మ, ప్రయత్నం, ధర్మం, భక్తి ఆధారంగా మారతాయి. కానీ ఈ పేర్లు కేవలం మీకు ఒక సూచను ఇస్తాయని వారు తెలుపుతున్నారు.(చదవండి: చైత్రమాసం విశిష్టత..! తెలుగు సంవత్సరాలు ఎలా ఏర్పడ్డాయంటే..) -
శ్రీశైలంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన ఉగాది మహోత్సవాలు (ఫోటోలు)
-
గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌలకు ఎంత డిమాండో!!
ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తీవ్రమైంది. దీంతో ఇండక్షన్ స్టౌలకు డిమాండ్ భారీగా పెరిగింది. అయితే.. ఇండక్షన్ స్టౌల కొరత పెరగడంతో.. ఇప్పటికిప్పుడు వాటిని తయారు చేసే పరిస్థితులు లేవని, చైనా నుంచి ముడిపదార్థాలు దిగుమతి అవ్వడానికి 45 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది. ఇండక్షన్ స్టౌల లభ్యత భారీగా తగ్గిపోవడానికి కారణాలేమిటి? వరుస పండగల వేళ.. పౌరుల పరిస్థితి ఏమిటి?500 శాతం డిమాండ్ హిందువులకు నూతన సంవత్సరమైన ఉగాది.. అదేవిధంగా ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకొనే రంజాన్ మరో మూడునాలుగు రోజుల్లో రానున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాపై ప్రతికూల ప్రభావం పడడంతో పండుగ పూట పిండివంటలు చేసుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఎల్పీజీ సరఫరా సరిగ్గా లేకపోవడంతో ఇప్పటికే హాస్టళ్లలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి.హోటళ్లలో దోశ, పూరీ, మైసూర్ బజ్జీ వంటి పదార్థాలు అందుబాటులో లేకుండా పోయాయి. కార్పొరేట్ సంస్థలు, ఐటీ సంస్థల్లోని క్యాంటీన్లు కూడా మూతపడ్డాయి. గృహావసరాల సిలిండర్ సరఫరాలో ఇబ్బందులు లేవని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. బుక్ చేసిన వారం పది రోజులకు గానీ గ్యాస్ బండ అందని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో.. ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అటు ఆన్లైన్లో ఈ-కామర్స్ ప్లాట్ ఫారాల్లో.. ఇటు ఆఫ్‌లైన్‌లో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ షోరూంలలో కూడా ఇండక్షన్ స్టౌల కొరత నెలకొంది. ఇండక్షన్ స్టౌల కోసం ఒక్కసారిగా 500 శాతం దాకా డిమాండ్ పెరిగిందని డీలర్లు చెబుతున్నారు.ఇప్పటికిప్పుడు ఇండక్షన్ స్టౌల ఉత్పత్తిని పెంచొచ్చా?ఇండక్షన్ స్టౌల తయారీలో కీలకమైన ముడి పదార్థాలు చైనా నుంచి వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్పత్తిదారులు ముడిపదార్థాల కోసం ఇప్పటికిప్పుడు ఆర్డరిచ్చినా.. అవి భారత్‌కు చేరడానికి కనీసం 45 రోజుల సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక్క ఇండక్షన్ స్టౌ అని కాకుండా.. ఎయిర్ ఫ్రయ్యర్లు, ఓటీజీలు, మైక్రోవేవ్ ఓవెన్లు, సోలార్ కుక్కర్లకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణం భోపాల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యపట్టణం లఖ్నవూల్లో దాదాపుగా ఇండక్షన్ స్టౌలకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా ఉంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇండక్షన్ స్టౌల కోసం డిమాండ్ బాగా పెరిగింది. ధరలు కూడా పైపైకి వెళ్తున్నాయి. నెల క్రితం వరకు 2,200 రూపాయలకు దొరికే ఇండక్షన్ స్టౌ ధర ఇప్పుడు 3 వేల రూపాయలకు చేరుకుంది. ఫిలిప్స్ కంపెనీకి చెందిన ముంబై బ్రాంచ్ మేనేజర్ వివేక్ గౌర్ కూడా దీనిపై స్పందించారు. ఎల్పీజీ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు వెల్లడించారు. డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాల్సి ఉంటుందన్నారు. భోపాల్‌లోని ఉషా ఇంటర్నేషనల్ డిప్యూటీ సేల్స్ మేనేజర్ వినీత్ శర్మ కూడా సాక్షితో మాట్లాడుతూ నెలకు సగటున వెయ్యి యూనిట్ల మేర ఇండక్షన్ స్టౌల విక్రయాలు జరిగేవని... ఇప్పుడు రోజుకు 10 వేల యూనిట్ల మేర విక్రయాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.ఇప్పటికిప్పుడు ఉత్పత్తిని పెంచడానికి ముడిపదార్థాల అవసరం ఉంటుందని, అందుకు చైనానే మార్గమని చెబుతున్నారు. ముఖ్యంగా ఇండక్షన్ స్టౌ తయారీలో ఉపయోగించే హీట్ ప్లేట్లు చైనా నుంచి వస్తాయి. కంట్రోలింగ్ వ్యవస్థ, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం భారత్ ప్రధానంగా చైనాపైనే ఆధారపడుతోంది. ఇప్పుడు ఆ పదార్థాల కోసం 45 రోజుల పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది.ఏయే రంగాలపై ప్రభావం?గ్యాస్ కొరత దాదాపు అన్నిరంగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ఉత్తరాది కార్మికులు ఎక్కువగా పనిచేస్తుంటారు. వీరికి రెగ్యులర్ ఎల్పీజీ కనెక్షన్లు ఉండవు. చిన్న సిలిండర్లతో వంటలు చేసుకుంటారు. సాధారణంగా 650 నుంచి 750 వరకు 5 కేజీల చిన్న సిలిండర్ల రీఫిలంగ్ చార్జీలుంటాయి. గడిచిన 15 రోజులుగా మార్కెట్లో చిన్న సిలిండర్ల రీఫిల్లింగ్ జరగడం లేదు. దీంతో వాళ్లంతా స్వస్థలాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా హోటల్ రంగంపై సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. దీని ప్రభావం పర్యాటకరంగంపై పడుతుంది. ఇండక్షన్ స్టౌలు ఇళ్లలో వంటకు సరిపోతాయే తప్ప.. హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లలో వంటకు పెద్దగా ఉపయోగపడవు.రాబోయే పండుగలపై ఈ ప్రభావం ఎలా ఉండనుంది?ఉగాదికి భక్ష్యాలు చేయడం ప్రత్యేకత. దీంతోపాటు.. కొత్త మామిడికాయలతో చేసే పులిహోర, పంచభక్ష్య పలహారాలను దేవుడికి నివేదన చేయడం తెలుగువారి సంప్రదాయం. అదేవిధంగా రంజాన్ ఈద్ సందర్భంగా షీర్‌కుర్మా, ఇతర వంటకాలు చేయడం ఆనవాయితీ. దీంతో.. గ్యాస్ కొరత, ఇండక్షన్ స్టౌల లభ్యత లేకపోవడం ఈ పండుగలపై తీవ్రంగా కనిపించనుంది. ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు.. అంటే మార్చి 27న శ్రీరామ నవమి, ఏప్రిల్ 3న గుడ్‌ఫ్రైడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి.ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పండుగల నేపథ్యంలో సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రానికి లేఖ రాశారు. జిల్లాల స్థాయిలో గ్యాస్ సరఫరాను స్వయంగా కలెక్టర్లు మానిటర్ చేస్తున్నారు. -
శ్రీ పరాభవ నామ సంవత్సర రాశిఫలాలు...
మేష రాశి ఆదాయం11, వ్యయం5, రాజయోగం2, అవమానం4.అశ్విని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా)భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో)కృత్తిక 1వ పాదము (ఆ)విశేష గౌరవ మర్యాదలు అందుకుంటారు. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చే విషయంలో శ్రద్ధ వహించరు. అనవసర విషయాలతో సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఏలినాటి శని ప్రభావంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపాలు ఉంటాయి. ఆర్థికంగా క్రమక్రమంగా మంచి మార్పులు ఉంటాయి. ఖర్చులు అదుపు చేయలేరు. వస్త్రాభరణ వాహనాదుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తారు. కొత్త ఋణాలు సమయానికి అందుబాటు అవుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన రీతిగా ప్రమోషన్ లు ఉండవు. స్థానచలన ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ప్రతిపనిలోనూ శ్రమ, ఒత్తిడి ఎక్కువవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులకు ఒత్తిడి పెరిగినా, లాభదాయకంగానే ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు శుభ పరిణామాలు. నూతన వ్యాపార ప్రయత్నాలలో పనులు వేగవంతం అవుతాయి. షేర్ వ్యాపారులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనం, కాలం అధికంగా ఖర్చు అవుతాయి. కోర్టు వ్యవహారాలలో చిక్కులు తప్పవు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల ప్రయత్నాలు జోరుగా సాగుతాయి. స్త్రీలకు ఉద్యోగాలలో ఒత్తిడి ఎక్కువవుతుంది. ఆరోగ్య రక్షణ, కుటుంబ రక్షణలో విజయవంతం అవుతారు. గర్భిణులకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. అశ్విని: ఉద్యోగంలో అధికారుల సహాయ నిరాకరణ ఎదురవుతుంది. బంధువులతో తరచుగా కలçహాలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు విఫలం అవుతాయి. ఆర్థిక లావాదేవీలలో అసంతృప్తి ఎదురవుతుంది. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకొని అవమానపడుతుంటారు.భరణి: ఆగ్రహావేశాలు ప్రదర్శించి, కలహాలలో చిక్కుకుంటారు. అన్ని అంశాలలో అగౌరవం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల వ్యవహారాల జోలికి పోతే సమస్యలు తప్పవు. స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాలకు విఘ్నాలు ఎదురవుతాయి.కృత్తిక: ఓర్పు నేర్పులతో సాధించుకుంటూ ముందుకు వెడతారు. పుణ్యక్షేత్ర సందర్శన, పుణ్యకార్యాలలో పాల్గొనడం ద్వారా ధనవ్యయం అధికంగా చేస్తుంటారు. నమ్మించి మోసం చేసేవారు అధికంగా ఉంటారు. వాహన మరమ్మతుల కోసం తరచు ధనవ్యయం అవుతుంది.శాంతి మార్గం: శనికి జప దాన తర్పణలు చేయిస్తూ ఉండండి. రోజూ శివాలయంలో ప్రదోష కాలంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. సుందరకాండ, గజేంద్రమోక్షం పారాయణ, పంచముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. ఏప్రిల్: ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి. 10వ తేదీ తరువాత దూర ప్రయాణాలు విరమిస్తే మంచిది. ధనం వెసులుబాటు ఇబ్బందికరం అవుతూ ఉంటుంది. అధికారుల సహకారం తగ్గుతుంది. బుద్ధి చురుకుగా పనిచేసినా, పనులు శ్రమతో పూర్తవుతాయి. కొత్త ఋణాలు చేయడం మంచిది కాదు. వృథా కాలక్షేపాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య రీత్యా ఖర్చు పెరుగుతుంది. మే: తెలివి, ధైర్యం ఉన్నా, చాలా విషయాల్లో పనులు సానుకూలం కావు. ఆదాయ మార్గాలు బాగానే ఉన్నా, అనవసర ఖర్చులు నియంత్రించలేరు. ఆర్థిక వ్యవహారాలలో కుటుంబసభ్యులతో విభేదాలు రాగలవు. ఋణ సౌకర్యం బాగుంటుంది. ఆరోగ్యం చికాకు సృష్టిస్తుంది. విద్యార్థులకు, షేర్ వ్యాపారులకు గురుబలం అనుకూలం. జూన్: పనుల్లో ఆటంకాలు ఉంటాయి. 8వ తేదీ తరువాత మంచి మార్పులు. 20 తేదీ నుంచి కాలం ఇంకా బాగుంటుంది. 20వ తేదీ లోపల ఆరోగ్యం బాగా చూసుకోవాలి. అన్ని వ్యవహారాలలోనూ మంచి సలహాలు అందుతాయి. ఇతరులకు సలహాలిచ్చి అవమానాలు పొందుతారు. తరచు దేవాలయ సందర్శన చేస్తారు. జులై: కుటుంబ వ్యవహారాలను బాగా చక్కదిద్దుతారు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య స్నేహ బంధం బాగుంటుంది. వృత్తి విషయాలలో అధికారులకు, వర్కర్స్కు మధ్య బంధం బాగా ఉంటుంది. స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాలు స్వయంగా చేసుకోవడం మంచిది. ఆర్థిక విషయాలను స్వయంగా చక్కబెట్టుకుంటారు. గౌరవ మర్యాదలు పొందుతారు.ఆగస్ట్: వృత్తి విషయంలో ఆధిపత్యం సాధిస్తారు. కుటుంబ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. విద్యార్థులకు కాలం అనుకూలం. కోర్టు విషయాలు, శుభకార్య విషయాలు సానుకూలం. నూతన వస్తువుల కొనుగోలుకు అధిక ధనవ్యయం చేస్తారు. సెప్టెంబర్: అనవసర సంచారం పెరుగుతుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య పరిరక్షణ కారణంగా కొంతకాలం ఏ పనిలోనూ సమయపాలన కుదరదు. అధికారులు సహకరిస్తారు. ఋణాలు తీర్చే విషయంలో మాట నిలబెట్టుకోలేరు. 18వ తేదీ తరువాత మంచి మార్పులు ఉంటాయి. ఇతరుల పొరపాట్లకు మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. అక్టోబర్: కొన్నిసార్లు శారీరక శ్రమ, కొన్నిసార్లు మానసిక చికాకులతో ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా వ్యవహరించినా, వారికి మంచి ఫలితాలు దక్కక ఇబ్బందికరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. ఖర్చుల నియంత్రణ మీద దృష్టి పెట్టాలి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రాంతాలకు స్వయంగా వాహనాలు నడపడం శ్రేయస్కరం కాదు. నవంబర్: ప్రతిపని సమస్యాత్మకం అవుతూ ఉంటుంది. ఉద్యోగ భద్రత మీద దృష్టి ఉంచండి. కుటుంబ విషయాలు సాధారణ స్థాయిగా ఉంటాయి. మనసుకు ఆనందం ఇచ్చే వార్తలు వింటారు. రోజువారీ పనుల్లో కూడా సొంత నిర్ణయాలు, సమయపాలన లేకపోవడం ఉంటాయి. పుణ్యకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. పనులు వేగం పుంజుకుంటాయి. డిసెంబర్: పనులేవీ సరిగా సాగవు. ప్రధానంగా కుటుంబ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. నూతన ప్రయత్నాలు సరిగా ఉండవు. కావలసిన వనరులు లభ్యంకాక వ్యాపారం ఇబ్బందికరం అవుతుంది. ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి పెడతారు. సమస్యలు పెరుగుతాయి. ధనం సర్దుబాటు కాకపోవడం వల్ల కొన్ని పనులను మధ్యలోనే వదిలేస్తారు. మాటతీరు నియంత్రించుకోవలసిన కాలం. జనవరి: ఆర్థిక లావాదేవీలను విజయవంతంగా నడుపుతారు. ఉద్యోగ వ్యాపారాలలో ప్రోత్సాహకర ఫలితాలు అందుతాయి. కుటుంబంలో మంచి వాతావరణం నెలకొని సుఖపడతారు. చాలా ప్రయాణాలు చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. వీలైనంత వరకు మితభాషణ చేస్తూ ఉండండి. కొత్త ఋణాలు చేయవద్దు. ఫిబ్రవరి: అన్ని అంశాలలోను పురోగతి ఉంటుంది. తేలికగా పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. అందరి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రతికూలత ఉన్న పనులు కూడా ఈ నెలలో ప్రారంభిస్తే సానుకూలం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో స్థానచలనం, ప్రమోషన్లు వంటివి ఆశించినట్లయితే, ఈ నెలలోనే వాటికి ప్రయత్నం ప్రారంభించాలి. మార్చి: ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిని దాటవేస్తారు. అధికారుల అండదండలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా మారతాయి. శుభకార్య పుణ్యకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అలంకరణ వస్తువులు, వాహనాల కొనుగోలు విషయాలలో దృష్టి పెంచుతారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండవలసిన కాలం. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఇబ్బందులు ఉంటాయి. వృషభ రాశిఆదాయం–5, వ్యయం–14, రాజయోగం–5, అవమానం–4కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ)మృగశిర 1,2 పాదములు (వే,వో)నిబద్ధతతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధు విరోధం ఎక్కువగా ఉంటుంది. కుటుంబసభ్యులతో కలిసి ధర్మ కార్యాచరణ చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తుంటారు. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి వార్తలు సంతోషం కలిగిస్తాయి. శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉంటారు. ఆదాయ వ్యయాలను అదుపులోకి తెచ్చుకుంటారు. వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, అలంకరణ వస్తువుల కొనుగోలు ఖర్చు పెరుగుతుంది. ఫైనాన్స్ వాప్యారులు లాభాలు అందుకుంటారు. సకాలంలో ఋణాలు దొరుకుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ఉద్యోగ కార్యకలాపాలలో తెలివిగా వ్యవహరిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులు మంచి లాభాలు పొందుతారు. ఉద్యోగ వ్యవహారాలలో తెలివితేటలతో, ధైర్య సాహసాలతో వ్యవహరించి ఊహకు అందని లాభాలను అందుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలతో కూడిన శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు శ్రమతో లాభాలు పొందుతారు. అధికారుల నుంచి సహకారం తక్కువ ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో సహకారం అందుతుంది. షేర్ వ్యాపారులకు దినదినాభివృద్ధిగా ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కోర్టు వ్యవహారాలు ఏదో రీతిలో పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు సమర్థతకు తగిన గుర్తింపు వస్తుంది. శుభ, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలకు గ్రహానుగ్రహం బాగుంది. కృత్తిక 2, 3, 4: ఎన్నో విజయాలు సాధిస్తారు. నరఘోష తరచుగా అనుభవిస్తారు. బంధువులతో పొరపొచ్చాలు ఎదురు కావచ్చు. మాటతీరు నియంత్రించుకోవడం లాభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు బాగుంటాయి.రోహిణి: వృత్తిరీత్యా దూరప్రయాణాలు చేస్తారు. అనారోగ్య వంతులైన కుటుంబసభ్యులకు కావలసిన వసతులు సమకూరుస్తారు. ఏదో తెలియని మానసిక చికాకులు వెంటాడుతుంటాయి. బంధుమిత్రుల ద్వారా నరఘోషకు గురవుతారు.మృగశిర 1, 2: ఆటంకాలు ఎదురైనా, ప్రారంభించిన ప్రతిపనిలోనూ విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం సహకరించడం, పిల్లల వలన శుభ పరిణామాలు, కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం అనుకూలంగా ఉండడం వల్ల ఆనందంగా ఉంటారు. శాంతి మార్గం : రోజూ గోపూజ, లక్ష్మీనారాయణ పూజ చేయడం శుభప్రదం. దక్షిణామూర్తి స్తోత్రం రోజూ పారాయణ చేయడం ద్వారా విజయశాతం పెరుగుతుంది. అక్టోబర్‌లో రాహు కేతువులకు జప, దాన, తర్పణలతో పాటు తెల్లటి పుష్పాలతో అమ్మవారి అర్చన, సప్తముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. ఏప్రిల్: ఉద్యోగ, వ్యాపారాలలో అంతా సానుకూలం. కుటుంబంలో చికాకులు వస్తాయి. తెలివిగా సరిచేస్తారు. ఆర్థిక, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తపడతారు. తరచు మానసిక ఒత్తిడి ఉంటుంది. కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. విజయాలు సాధించి, గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన వాహనాలు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. మే: వాతావరణ ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి కేంద్రీకరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 15వ తేదీ తరువాత పనులు వేగంగా చేయలేని పరిస్థితి ఉంటుంది. వద్దు అనుకుంటూనే అనేక ప్రయాణాలు చేస్తారు. స్నేహితులు, బంధువులతో వ్యవహార సమస్యలు సానుకూలం కాగలవు. జూన్: చాలా జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. సంబంధం లేని సమస్యలు రాగలవు. రోజువారీ పనులు కూడా సరిగా చేయలేరు. ఇతరుల వ్యవహారములలో కలుగచేసుకోవద్దు. ఆరోగ్య, ఋణ, కలహ విషయాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుతుంది. వ్యాపారులకు పనివారితో సమస్యలు ఎక్కవవుతాయి. ముఖ్యులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని వ్యవహారాలలోను మంచి సలహాలు పొందుతారు. జులై: ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం కాపాడుకుంటారు. ఉద్యోగ భద్రత ఉంటుంది. పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారులు తమ ఆలోచనలను అమలు చేయగలుగుతారు. ఒక్కోసారి పెంపుడు జంతువుల సేవల కోసం ముఖ్యమైన పనులు ఆలస్యం చేస్తుంటారు. ఆగస్ట్: పనులు వేగంగా సాగినా, శ్రమాధిక్యం ఉంటుంది. వాహన, యంత్రాల మరమ్మతులకు అధిక వ్యయం జరుగుతుంది. పుణ్య, శుభకార్యాలలో బంధుమిత్రులను కలుస్తారు. ఆరోగ్యం సమస్యల విషయంలో వైద్యులను కలవడం శ్రేయస్కరం. గృహోపకరణాల కొనుగోలుకు ధనవ్యయం అవుతుంది. కోర్టు, ఇతర వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి. సెప్టెంబర్: తరచు ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో సాధారణ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు అంతా శుభప్రదం. దూర ప్రయాణాలు చేస్తారు. ఋణాలు తీర్చేందుకు అవకాశాలు ఉండవు. ఓర్పుగా వ్యవహరించడం మంచిది. మార్కెటింగ్ ఉద్యోగులు, విద్యార్థులకు శ్రమాధిక్యం. ప్రతిరోజూ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. అక్టోబర్: కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. వాహనాలు అలంకరణ వస్తువుల కొనుగోలు గురించి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితులు, కుటుంబసభ్యులతో కలహాలు రాకుండా జాగ్రత్తపడండి. పిత్రార్జిత ఆస్తి వ్యవహారాలలో ఓర్పుతో వ్యవహరించడం మంచిది. అధికారుల సహకారం బాగా ఉంటుంది. చదువు బాగా సాగుతుంది. మీ తెలివిని అందరూ గుర్తిస్తారు. నవంబర్: పెద్దల ఆరోగ్య విషయంగానూ, పిల్లల అభివృద్ధి విషయంలోనూ అసంతృప్తిగా ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలలో మొండిగా ఉంటారు. కోపావేశాలు నియంత్రించుకోవాలి. అవయవ ప్రతికూలతలు ఉంటాయి. వైద్యపరంగా అనవసర ఖర్చు ఉంటుంది. బంధుమిత్రులతో పాత విషయములలో కలహములు రాగలవు. పిల్లల విషయంలో ప్రత్యేక పర్యవేక్షణ ఉంచండి. డిసెంబర్: మామూలు పనులు కూడా ఒత్తిడితో పూర్తవుతాయి. ఉద్యోగ భద్రత ఉంటుంది. పనులు స్వయంగా చేసుకుంటే వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఋణాలను సకాలంలో చెల్లించకుంటే, ఇబ్బందులు తప్పవు. తరచు తలెత్తే అజీర్ణ సమస్యలు భయం కలిగిస్తాయి. జనవరి: నూతన ప్రయత్నాలు సరిగా సాగవు. దూర ప్రయాణాలను విరమించండి. కుటుంబ, వృత్తి విషయాలకు సమయం సమతూకంగా కేటాయించలేక ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి. ఋణ సౌకర్యం బాగానే ఉంటుంది కాని, అది పొందకపోవడం భవిష్యత్‌కు మంచిది. ఫిబ్రవరి: తరచుగా భోజన సౌకర్యం లోపిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో అనవసరంగా అధికారుల నుంచి, తోటివారి నుంచి మాట పడతారు. ఆర్థిక, కుటుంబ విషయాలు అనుకూలం. సమయపాలన లోపించి, పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. అవమానకర సంఘటనలు ఎదురు కాకుండా వ్యవహరించండి. మార్చి: అప్రయత్నంగా కొన్ని వ్యవహారములు సానుకూలం అవుతాయి. ఉద్యోగాలలో పనులు తెలివిగా చేస్తారు. ఎంతో శ్రమతో ఆర్థిక సమస్యలను పరిష్కరించుకో గలుగుతారు. అన్ని విషయాలలో కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. అనవసర కాలక్షేపాలు చేయరు. కుటుంబ, వృత్తి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చిన వారికి లాభదాయకంగా ఉంటుంది. విద్యా వ్యాసంగంలో వారికి కాలం అనుకూలం.మిథున రాశిఆదాయం– 8, వ్యయం– 11, రాజయోగం– 1, అవమానం– 7.మృగశిర 3,4 పాదములు (కా, కి)ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ)పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా)వృథా కాలక్షేపాలకు అవకాశం ఇవ్వవద్దు. కుటుంబ విషయాలలో అనుకూలత ఉన్నా, సంవత్సరాంతంలో తెలియని భయానికి గురవుతారు. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలలో పాల్గొంటారు. ఆర్థిక కార్యకలాపాలలో సానుకూలత. విఘ్నాలు ఎదురైనా, పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు అధికంగా చేయవలసి ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారులకు అక్టోబర్ వరకు అనుకూలం. సంవత్సరం ద్వితీయార్ధంలో ఋణాలు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఆరోగ్య పరిస్థితులు అక్టోబర్ వరకు బాగుంటాయి. అక్టోబర్ నుంచి మానసిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగులకు అధికారుల మందలింపులు ఎక్కువ అవుతాయి. స్థానచలనం, ప్రమోషన్లలో సానుకూలతలు తక్కువ. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారులు ఏడాది ప్రథమార్ధంలో ఒత్తిడి లేకుండా వ్యాపారం చేస్తారు. ద్వితీయార్ధంలో ఒత్తిడికి లోనవుతారు. మార్కెటింగ్ ఉద్యోగుల స్థితి కూడా ఇలాగే ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలకు అక్టోబర్ వరకు అద్భుతమైన కాలం. షేర్ వ్యాపారులకు మధ్యమధ్యలో ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యార్థులు సంవత్సరాంతంలో అనాలోచితంగా ప్రవర్తించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో శుభపరిణామాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఒత్తిడి కలిగిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో మోసపోయే అవకాశాలు ఎక్కువ. ఈ రాశి స్త్రీలకు అక్టోబర్ వరకు సానుకూలంగానూ, అక్టోబర్ తర్వాత మానసిక ఒత్తిడితోనూ ఉంటుంది. శ్రమతో పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు పనివారితో ఇబ్బందులు. గర్భిణులు సాధారణస్థాయి జాగ్రత్తలు పాటించి మంచి ఫలితాలు పొందుతారు.మృగశిర 3, 4: సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంప్రదించకుండా అక్టోబర్ తరువాత పుణ్య, సామాజిక కార్యక్రమాలకు విరాళాల వంటివి హామీ ఇవ్వవద్దు. దూరప్రాంత ప్రయాణాలు కూడా చేయవద్దని సూచన. వృథా కాలక్షేపాలు, అనవసర శ్రమ ఎక్కువ చేస్తారు.ఆరుద్ర: కుటుంబ విషయంలో సరైన నిర్ణయాలు జరగవు. వృథా ఖర్చులు నియంత్రించలేని స్థితి. సంవత్సరం ద్వితీయార్ధంలో విచిత్రస్థితిని ఎదుర్కొంటారు. మానసిక ఇబ్బందులు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు శ్రేయస్కరం కాదు. పాత ఆరోగ్య, ఋణ సమస్యలు చికాకులు యిస్తాయి.పునర్వసు 1, 2, 3 : అన్ని అంశాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. ప్రణాళిక లేకుండా ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. గోప్యత పాటించక సొంత విషయాలను బయటపెట్టుకుని, చికాకులు పొందుతారు. అక్టోబర్ తరువాత వృథా కాలక్షేపాలు ఎక్కువ అవుతాయి.శాంతి మార్గం: అక్టోబర్‌లో రాహు కేతువులకు జప, దాన, తర్పణలు చేయించండి. స్వయంగా దత్తస్తవరాజం, విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం శ్రేయస్కరం. అక్టోబర్ నుంచి దుర్గా సప్తశ్లోకీ పారాయణ ప్రతిరోజూ 11 సార్లు చేయండి. మినుములతో చేసిన పదార్థాలను దానం చేయండి. త్రిముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: చక్కటి బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. ముందు జాగ్రత్తలలో ఆరోగ్య రక్షణ చేసుకుంటారు. పనులు అర్ధాంతరంగా వదిలేయడం వంటివి ఎక్కువవుతాయి. కుటుంబ సభ్యులతో సయోధ్య పెరుగుతుంది. అవరో«ధాలు సృష్టించే సహచరులు ఉంటారు. వృత్తిలో పనివారితో ఒత్తిడి పెరుగుతుంది. తరచుగా వాహన సమస్యలు వస్తాయి. మే: పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా సాగుతాయి. వాహనాలతోనూ, స్నేహితులతోనూ జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు తలెత్తుతాయి. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి. ప్రయత్నాలన్నీ అధిక వ్యయంతో ముడిపడి ఉంటాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు. జూన్: బంధువులకు అనారోగ్య విషయంగా తరచుగా ప్రయాణాలు చేస్తారు. ఆదాయం బాగానే ఉన్నా, అనవసర వ్యయం ఎక్కువగా చేస్తుంటారు. వృథా ప్రయాణాలు చేస్తుంటారు. అకాల భోజనం నిత్యకృత్యం అవుతుంది. వ్యాపారులు కొత్త కొత్త ఆలోచనలను అమలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలం అవుతాయి. జులై: రోజువారీ పనుల్లోను, వృత్తి విషయాల్లోను ఆటంకాలు తప్పవు. ఉద్యోగులకు అధికారుల నుంచి రక్షణ లభించని స్థితి ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తపడండి. వ్యాపారులు బాగా జాగ్రత్తలు పాటించవలసిన కాలం. కొత్త ఋణాలు దొరకక పోగా, పాత ఋణాలు ఇబ్బంది పెడతాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆగస్ట్: విజ్ఞాన వినోద కార్యాలలో పాల్గొంటారు. అవసరమైన పనులు వాయిదా వేస్తారు. రోజువారీ పనులు ఆలస్యం చేస్తారు. విద్యార్థులకు విద్యాభంగం అనేకసార్లు ఎదురవుతుంది. ఋణ సౌకర్యం అందుకుంటారు. ఎందులోనూ స్థిరబుద్ధి ఉండదు. అనవసర కాలక్షేపాలకు ఆకర్షితులవుతారు. కుటుంబ అవసరాలలో కూడా దృష్టి ఉంచరు. సెప్టెంబర్: ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. అందరి సహాయ సహకారాలతో మాసం చివర్లో విజయాలు సాధిస్తారు. పుణ్య కార్యాలలో ఆటంకాలు ఎదురవుతాయి. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. అలంకరణ వస్తువులు, వాహనాలు తరచు మరమ్మతులకు వస్తాయి. ఆర్థిక వ్యవహారాలను స్వయంగా చూసుకోవడం మంచిది. అక్టోబర్: కుటుంబ సభ్యులతో కలసి తీర్థయాత్రలు, విజ్ఞాన విహారయాత్రలు చేస్తారు. కొన్నిసార్లు అవయవ ప్రతికూలత ఉన్నట్లు భావనలోకి వెడతారు. వృత్తి విషయాలు సానుకూలం. దురలవాట్లు ఉన్నవారికి ఇబ్బందులు రాగలవు. వద్దు అనుకుంటూనే ఇతరులకు ధనం సర్దుబాటు చేస్తారు. ఆరోగ్య, ఆర్థిక వ్యవహారాలలో తెలివిగా మెలగుతారు. నవంబర్: మాట తీరు, నడవడి నియంత్రించుకుంటారు. భార్యా పుత్ర కలహం పెరుగుతుంది. ఉద్యోగం వ్యాపారాలలో తోటివారితో కలహాలు రాగలవు. వాహన మరమ్మతు ఖర్చులు ఉంటాయి. స్వయంగా వాహనాలు నడుపుతూ దూర ప్రయాణములు చేయవద్దు. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ అయినా, పనులు లాభిస్తాయి. డిసెంబర్: కాలం అనుకూలిస్తుంది. గత సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయండి. రోజువారీ పనులు అకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో విజయాలు అందుకుంటారు. సమస్యలు రాకుండా జాగ్రత్తపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. మంచి వ్యక్తులు మీకు మంచి సలహాలు ఇస్తుంటారు. జనవరి: కుటుంబ విషయంలోను, బంధుమిత్రులతోను జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రయాణాలు చేయవద్దు. ఆదాయ వ్యయాలపై పూర్తి నియంత్రణకు ప్రయత్నించండి. పాత ఋణములు, పాత ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తపడండి. నూతన ప్రయత్నాలు ఆర్భాటంగా మొదలైనా, సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు లేవు.ఫిబ్రవరి: స్థిరచిత్తం ఉంచరు. మొండి ధైర్యంతో అనవసర విషయాలను కదిలిస్తారు. సోమరితనంతో తోటివారితో కలహాలు తెచ్చుకుంటారు. కుటుంబ అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. ఆర్థిక వనరులు బాగానే సమకూరుతాయి. విజ్ఞాన, వినోద, విహార కార్యక్రమాల వైపు మనసు లాగుతుంది. అత్యవసరమైన పనుల్లో సరిగా దృష్టి ఉంచక ఇబ్బంది పడతారు. మార్చి: ఏ సమస్యనైనా తెలివిగా సాధిస్తారు. బుద్ధి కుశలతతో ఉద్యోగ విధి నిర్వహణలో గౌరవం పెంచుకుంటారు. రాబోవు కాలంలో ప్రమోషన్ ఆశించేరీతి పనితీరు ఉంటుంది. ఆరోగ్యం బాగా కాపాడుకుంటారు. వ్యాపారులు సమస్యలను అధిగమిస్తారు. ఋణ సౌకర్యం బాగుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపారాలలో ప్రణాళికతో ఉంటారు. పుణ్య కార్యాలు చేస్తారు. స్థానచలన, ప్రమోష¯Œ లకు ప్రత్యేక ప్రయత్నాలు సాగిస్తారు. విద్యా వ్యాసంగం బాగుంటుంది. కర్కాటక రాశిఆదాయం–2, వ్యయం–11, రాజయోగం–4, అవమానం–7.పునర్వసు 4వ పాదము (హి)పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా)ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ)దైనందిన కార్యక్రమాలలో సమయపాలన, నియమపాలన లేకుండా వ్యవహరిస్తారు. భార్యాపుత్రల నడవడి మీకు నచ్చక, మీ నడవడి వారికి నచ్చక చికాకులు పొందుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంఘంలో గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్తపడండి. స్నేహితులతో జాగ్రత్తలు వహించండి. అవసరానికి తగిన ఆదాయం అందదు. ఖర్చులు నియంత్రించలేరు. శుభ కార్యాల వలన ఖర్చులు పెరుగుతాయి. వృథా ఖర్చులు అధికమవుయి. ఋణాల వల్ల ఇబ్బందులు ఎదరవుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలం. ఉద్యోగాలలో రావలసిన ప్రమోష¯Œ లకు అడ్డంకులు సృష్టించే వారు ఉంటారు. మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. ట్రాన్స్ఫర్ వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి చక్కని అవకాశాలు జారిపోతాయి. వ్యాపారులు ఋణాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఫైనాన్స్ వ్యాపారులకు మొండి బాకీలు పెరుగుతాయి. అవసరానికి కొత్త ఋణాలు సర్దుబాటు కావు. నూతన వ్యాపార ప్రయత్నాలలో ధనవ్యయం అధికం అవుతుంది. షేర్ వ్యాపారులకు లాభాలు ఉన్నా చికాకులు తప్పవు. విద్యార్థులకు శ్రద్ధ లోపిస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ధనవ్యయం, కాలహరణం తప్పవు. కోర్టు వ్యవహారాలు చికాకులను కలిగిస్తాయి. స్థిరాస్తి లావాదేవీలు కలసిరావు. ఈ రాశి స్త్రీలకు పని ప్రదేశాల్లో తోటివారితోనూ, ఇంట్లోని పనివారితోను ఇబ్బందులు తలెత్తుతాయి. అక్టోబర్ తరువాత మొండి వైఖరి పెరుగుతుంది. గర్భిణులకు అనాలోచిత ప్రవర్తన ఎక్కువ అవుతుంది. జాగ్రత్త పడండి.పునర్వసు 4: పిల్లల నుంచి సహాయ సహకారాలు పెరుగుతాయి. రోజువారీ పనులు సకాలంలో జరుగుతాయి. ఆర్థిక జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో ఆలోచనలను వేగంగా అమలు చేసి జరగవు అనుకున్న పనులను సాధించగలుగుతారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది.పుష్యమి: ఒంటరి ప్రయాణాలు, అనవసర కాలక్షేపాలు మానుకోండి. సంబంధం లేని వ్యవహారాల గురించి సమయం పాడుచేసుకోవడం, అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. శుభకార్య ప్రయత్నాలు జరుగుతాయి.ఆశ్లేష: పుణ్యకార్యాలు చేస్తారు. మానసిక ఒత్తిడిని జయిస్తారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. పాత ఋణ వ్యవహారాలు అక్టోబర్ లోపుగా కొలిక్కి వస్తాయి. అక్టోబర్ తరువాత ఇతరుల నుంచి సహాయ నిరాకరణ పెరుగుతుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.శాంతి మార్గం: రాహు, కేతువులకు జపదాన హోమాదులు చేయండి. రాహు శాంతికి రోజూ దుర్గా సప్తశ్లోకీ పారాయణ చేయండి. కేతు శాంతికి రోజూ లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయండి. మంగళవారాలలో పొయ్యిదానం చేయండి. షణ్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. ఏప్రిల్: ఆదాయం ఆలస్యంగా అందుతుంది. ఖర్చులు నియంత్రించలేరు. శరీరం శుష్కించే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలలో సానుకూలత తక్కువ. స్థిరాస్తి వ్యవహారాలు సరిగా సాగవు. మనస్పర్థలు, వృథా కాలక్షేపాలు విడనాడిన వారికి సౌఖ్యం ఉంటుంది. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. విద్యార్థులు జాగ్రత్త వహించాలి. మే: ఆదాయం తక్కువగా ఉన్నా, ఖర్చులు నియంత్రించగలుగుతారు. పుణ్య, శుభకార్యాలలో పాల్గొంటారు. స్వేచ్ఛగా సంచరిస్తారు. ద్వితీయార్ధంలో వాహన సంబంధ చికాకులు ఉంటాయి. షేర్ వ్యాపారులకు కాలం బాగుంది. విద్యార్థులకు, రైతులకు ఈ నెల 15 తరువాత అసంతృప్తి ఉంటుంది. కళత్ర అవయోగాలు ఉంటాయి. జూన్: వాహన చికాకులు ఉంటాయి. పనిముట్ల వాడకంలో గాయపడే అవకాశం ఉన్నది. వృథా కాలక్షేపాలు చేస్తారు. మాటతీరు వల్ల కలహాలు, ఆరోగ్య సమస్యలు తరచుగా ఉంటాయి. పెంపుడు జంతువుల వలన ఇబ్బంది ఉంటుంది. చేసిన పనులకు గుర్తింపు దొరకదు. జులై: కొన్నిసార్లు ధైర్యంగా ఉంటారు. కొన్నిసార్లు తెలియని అధైర్యంతో తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. కోర్టు వ్యవహారాలలో మంచి సలహాలు ఇచ్చేవారు ఉంటారు. ప్రశాంతత తగ్గుతుంది. ఉద్యోగ విధి నిర్వహణలో నిబద్ధత లేక అధికారుల ఆగ్రహావేశాలకు లోనవుతారు. ఆగస్ట్: సందర్భానుసారంగా ప్రవర్తింప లేకపోవడం, అందరినీ దూషించడం వంటి చేష్టలు అధికం అవుతాయి. సహకరిస్తారు అనుకున్న వారు సహకరించని స్థితి ఎదురవుతుంది. కొన్ని ముఖ్య వ్యవహారాలను మరచిపోయే అవకాశం ఉంటుంది. కుటుంబ కార్యక్రమాలలో పాల్గొంటారు. మాట తీరు అదుపులో ఉంచుకోవడం క్షేమం. సెప్టెంబర్: స్థానచలన ప్రయత్నాలు బాగా జరుగుతాయి. ఉద్యోగ వృద్ధిలో ఆటంకాలు ఉంటాయి. తల్లి దండ్రుల ఆరోగ్య విషయంలో చికాకులు రాగలవు. ప్రతి పనిలోనూ ఆర్థిక వెసులుబాటు తక్కువ. వ్యాపారులకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతాయి. భార్యాభర్తలకు; యజమానికి, పనివారికి సయోధ్య సరిగా ఉండని కాలం. కొన్ని పాత సమస్యలు సానుకూలం చేసుకుంటారు. అక్టోబర్: కుటుంబంలో పెద్దల ఆరోగ్యం అనుకూలం. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. అన్ని వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం వలన విజయాలు సాధిస్తారు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఉంటాయి. సమస్యలను ముందే గ్రహంచి. జాగ్రత్తలు పాటిస్తారు. భోజన వసతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబ విషయాలకు ప్రాధాన్యం యిస్తారు. నవంబర్: అన్ని వ్యవహారాల్లోనూ సానుకూలత. ఆర్థిక ఇబ్బందులు దాటగలరు. స్నేహితుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శ్రమ ఎక్కువ అవుతుంది. విద్యా వ్యాసంగం బాగా ఉంటుంది. ఋణ వ్యవహారాలలో మాట నిలబెట్టుకోలేరు. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండవు. డిసెంబర్: కాలం అనుకూలం. క్రమంగా చాలా విజయాలు సాధిస్తారు. నూతన ప్రయోగాలు చేస్తారు. కుటుంబంలో మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. ఒక్కో సమస్య పరిష్కరించే క్రమంలో మంచి సలహాలు అందుతాయి. అధికారుల సహకారం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. జనవరి: రోజువారీ పనులలోనూ బుద్ధి స్థిరత్వం ప్రదర్శించలేరు. కుటుంబ సభ్యుల సహకారం మాత్రం బాగుంటుంది. «ఖర్చుల నియంత్రణలో విఫలమవుతారు. పనులు స్వతంత్రంగా చేయడం శ్రేయస్కరం. నూతన ప్రయత్నాలు తగ్గించడం శ్రేయస్కరం. పాత సమస్యల విషయంలో మాత్రమే దృష్టి ఉంచండి. ఇతరులకు చేసే సహకారం ఇబ్బందికరం కాగలదు.ఫిబ్రవరి: వృత్తి్త విషయాలను స్వయంగా చూసుకోకపోతే భవిష్యత్తు ఇబ్బందికరం కాగలదు. ఉద్యోగ విషయాలలో మార్పులకు అవకాశం ఇవ్వవద్దు. ఆదాయం తగ్గుతుంది. కుటుంబ అవసరాలు తీర్చడంలో ఇబ్బంది పడతారు. పెద్దల ఆరోగ్యం ఇబ్బందికరం. ప్రతిపనిలోనూ అధిక ధనవ్యయం జరుగుతుంది. మార్చి: అత్యవసరమైన వృత్తి విషయాలు సమయ పాలన లేకుండా చేసి ఇబ్బందిపడతారు. ఋణాలు చికాకు పెడతాయి. స్వల్పంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నూతన ప్రయత్నాలకు సానుకూలత లేదు. వృథా ఖర్చు పెరుగుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. తరచుగా వాతావరణ ప్రభావానికి లోనవుతుంటారు.సింహ రాశిఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–7, అవమానం–3.మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే)పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ)ఉత్తర 1వ పాదము (టే)దైనందిన కార్యక్రమాలలో పనులు సమయానికి పూర్తికావు. కుటుంబ విషయాలలో మీ ప్రవర్తన ఇతర కుటుంబ సభ్యులకు ఇబ్బందికరం కాకుండా జాగ్రత్తపడండి. శుభకార్యాలలో తరచుగా బంధుమిత్రులను కలుస్తుంటారు. రోజువారీ స్నాన భోజన నిద్రాసమయాలు భంగపడేలా అనవసర కాలక్షేపాలు పెరుగుతాయి. పిల్లల వలన ఖర్చు పెరుగుతుంది. విరో«ధాలు ఎక్కువ అవుతాయి. అనవసర భయం పెరుగుతుంది. ఒక అవసరం కోసం ఉంచుకొన్న డబ్బు మరొకదానికి ఖర్చవుతుంది. అనవసర హామీలు ఇవ్వకండి. అక్టోబర్ నుంచి క్రమంగా మంచి మార్పులు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారులకు మొండి బాకీలు పెరుగుతాయి. ఋణ వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. ఉద్యోగాలలో సమయపాలన పాటించలేరు. మార్కెటింగ్ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి అక్టోబర్ తర్వాత క్రమంగా అనుకూలం. వ్యాపారులకు ద్వితీయార్ధం బాధాకరంగా ఉంటుంది. భాగస్వాములతో విభేదాలు వ్యాపారాలలో ఇబ్బందులు పెంచుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఆటంకాలు అధికం. షేర్ వ్యాపారులు ఓర్పుగా వ్యవహరించాలి. తప్పుడు సలహాలకు ఆకర్షితులై సమస్యలు తెచ్చుకుంటారు. విద్యార్థులకు వృథా కాలక్షేపాలు ఎక్కువవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఆలస్యంగా పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు అందవు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు ఆర్థిక అనుకూలత ఉండదు. ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వస్తువులు పోగొట్టుకోవడం వంటివి జరుగుతాయి. గర్భిణులు పెద్దలు, వైద్యుల సలహాలు అనుసరించడం మంచిది.మఘ: తెలివి బాగా పని చేస్తుంది. అక్టోబర్ నుంచి తెలివికి ధైర్యం తోడవుతుంది. ఆదాయ వ్యయ ఋణాలను సమతూకంగా నడపలేక శ్రమకు లోనవుతారు. కుటుంబ సభ్యులతో మోసపూరిత వాతావరణం ఉంటుంది.పుబ్బ: మానసికంగా చికాకులకు లోనవుతారు. ప్రయాణాలలో వస్తువులు మరచిపోవడం వంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. స్నేహితులతో కలిసి చేసే పనులలో సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చులు అధికం అవుతాయి.ఉత్తర 1: ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోకండి. పనుల్లో ఖర్చులు ఎక్కువ అవుతాయి. నమ్మినవారు సరిగా సహకరించరు. పనివారు తరచుగా ఇబ్బందులు సృష్టిస్తారు. వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు. లాభాలు లేని వ్యాపారం చేయవలసి ఉంటుంది.శాంతి మార్గం: శని రాహు కేతు గురువులకు శాంతి చేయించండి. రోజూ గోపూజ, నవగ్రహ పూజ చేయడం శ్రేయస్కరం. నిత్యం రావిచెట్టు కింద ఆంజనేయస్వామి ఉన్న దేవాలయంలో ‘శ్రీరామ శ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం, చతుర్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: పుణ్యకార్యాలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి విషయాలలో దృష్టి ఉంచలేరు. మాటతీరు నియంత్రించుకోవాలి. ప్రయాణ అసౌకర్యాలు తరచుగా ఉంటాయి. బంధుమిత్రుల కలయికలు ఉంటాయి. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు సత్ఫలితాలను సాధిస్తారు. మే: ఆగ్రహావేశాలను అదుపు చేసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో గొప్పగా వ్యవహరిస్తారు. అయితే ఫలితాలు గొప్పగా ఉండవు. రోజువారీ కార్యక్రమాలు సరిగా సాగవు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. జూన్: ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడతారు. పని ఒత్తిడి పెరుగుతుంది. 20వ తేదీ తర్వాత ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో సరిగా దృష్టి ఉంచలేని స్థితి. శ్రమతో పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు ఒత్తిడి. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు సక్సెస్ అవుతారు. జులై: ఉద్యోగరీత్యా తిరుగుడు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు గమనిస్తారు. జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలలో విశేష లాభాలు అందుకుంటారు. సమయపాలన పాటించక ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు.ఆగస్ట్: వ్యర్థ ప్రయాణాలు, వ్యర్థ కాలక్షేపాలు విరమించుకోవడం మంచిది. వాహనాలు యంత్ర పరికరాలు ఇబ్బంది పెడతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. విద్యా వ్యాసంగం బాగుంటుంది. స్థిరాస్తులు, వాహనాల అమ్మకాలలో జాగ్రత్తలు పాటించాలి. సెప్టెంబర్: ఆరోగ్యం విషయంలో 18వ తేదీ తరువాత జాగ్రత్త వహించాలి. ఋణ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు 18వ తేదీ వరకు సానుకూలం షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించాల్సిన కాలం. విద్యార్థులకు రైతులకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరము. అక్టోబర్: అధికారుల ఆగ్రహావేశాలు ఎక్కువ అవుతాయి. కొత్త ప్రయత్నాలు చేయవద్దు. బుద్ధి స్థిమితం కోల్పోవుతారు. బంధువులతో కలసి చేసే పనులలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారులకు ఇబ్బందికర ఘటనలు ఎక్కువ అవుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండదు. నవంబర్: బుద్ధి స్థిరత్వం తరచుగా తగ్గుతుంది. ఇతరుల వ్యవహారాలలో కలుగచేసుకోవద్దు. కుటుంబ విషయాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. కొత్త ప్రయత్నాలు చేయకండి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. నూతన ఉద్యోగ, వ్యాపారాలలో ప్రయత్నాలు సఫలం అవుతాయి. డిసెంబర్: ప్రతి పనిలోనూ అవరోధాలు ఎదురైనా, వాటిని అధిగమిస్తారు. ఓర్పుగా సమస్యలు దాటగలరు. కొత్త ప్రయత్నాలు చేయవద్దు. మితభాషణ అవసరం. ఇతరులను నమ్మి ఆర్థిక లావాదేవీలు చేయవద్దు. పాత ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తిరగ బెట్టకుండా జాగ్రత్తలు పాటించండి. జనవరి: ప్రతి విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలం కాదు. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా సాగవు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా సానుకూలం కాదు. ఖర్చులు, అనారోగ్యం ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యులకు వచ్చే సమస్యలు మీ పనులను పాడు చేస్తాయి. వాహన సౌకర్యం కూడా సరిగా ఉండదు అనే చెప్పాలి. ఫిబ్రవరి: పాత కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఋణ సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తపడండి. ఆదాయ వ్యయాలు సమన్వయంతో ఉండవు. అధికారుల అనాదరణ, తోటివారితో సహాయ నిరాకరణ వలన పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల మీద ఏమాత్రం ఆధారపడినా ఇబ్బందులు తప్పవు. ప్రయాణాలు తగ్గించడం శ్రేయస్కరం. మార్చి: తొందరపాటుగా ప్రవర్తించడం మంచిదికాదు. భోజన సౌఖ్యం కొరవడుతుంది. వాహన చికాకులు ఉంటాయి. ఇతరుల నుంచి ఆశించిన రీతిగా సహకారం అందదు. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యం. ఉద్యోగంలో పని బాధ్యత పెరుగుతుంది. వ్యాపారులకు శ్రమ ఎక్కువ, లాభం తక్కువగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉంటుంది. ఋణాలు చేయకపోవడం మంచిది.కన్యా రాశిఆదాయం– 8, వ్యయం– 11, రాజయోగం– 3, అవమానం– 3.ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ)హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా)చిత్త 1,2 పాదములు (పే, పో)ఈ సంవత్సరం గురువు మి«థునంలో (దశమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (లాభం), అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (వ్యయం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (సప్తమం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (షష్ఠం) కేతువు సింహంలో (వ్యయం); తర్వాత రాహువు మకరంలో (పంచమం) కేతువు కర్కాటకంలో (లాభం) సంచరిస్తారు.రోజువారీ పనులు ఆలస్యమైనా ఆ ప్రభావం ఇతర కార్యక్రమాలపై పడకుండా చూసుకుంటారు. కుటుంబ విషయాలలో సానుకూలం. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనలు. పనులు ఆలస్యమైనా, విజయవంతం. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలు సఫలం. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కొత్త కొత్త ఖర్చులు పెరుగుతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. తీర్థక్షేత్ర దర్శనం, వాహన మార్పులు చేస్తారు. ఫైనాన్స్ వ్యాపారులకు లాభాలు. బాకీల వసూలు ఆలస్యం. నరాలు, గుండె సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు. మిగిలినవారికి అనుకూలం. ప్రమోషన్ వ్యవహారాలు సానుకూలం. మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో నిదానంగా పనులు సానుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో పనులు మందకొడిగా సాగినా, ఫలితాలు లాభదాయకం. షేర్ వ్యాపారులకు లాభాలు మందగమనం. విద్యార్థులకు విద్యా వ్యాసంగం కుంటుపడుతుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో శుభపరిణామాలు. కోర్టు వ్యవహారాలలో సానుకూలత. స్థిరాస్తి వ్యవహారాలలో సత్ఫలితాలు. ఈ రాశి స్త్రీలకు సకాలంలో ఏ పనీ సాగదు. అవసరానికి తగిన ఆర్థిక వెసులుబాటు దొరకని పరిస్థితి. గర్భిణులకు ఇబ్బందులు ఉండవు కాని, ఏదో తెలియని ఆందోళనకు లోనవుతారు.ఉత్తర 2, 3, 4: ప్రమోషన్లు ఆలస్యం. పిల్లలు సహకరిస్తారు. పెద్దల ఆరోగ్యం అనుకూలం. హస్త: కిందిస్థాయి వారితో అవమానపడే పరిస్థితులు. తెలివిగా పనులు సాధించుకోగలుగుతారు. శ్రమాధిక్యత. చిత్త 1, 2: ఆర్థికంగా, శారీరకంగా శ్రమకు లోనవుతారు. ఇతరుల మీద ఆధారపడి పనులు పాడు చేసుకుంటారు. శాంతి మార్గం: దశరథకృత శని స్తోత్రం రోజూ పఠించండి. శ్రీరామ శ్శరణం మమ అని చెబుతూ ఆంజనేయస్వామికి రోజూ 11 ప్రదక్షిణలు చేయండి. బీదసాదలకు చెప్పులు, వస్త్రాలు దానం, శనివారం నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేయడం, షణ్ముఖ రుద్రాక్ష ధారణ శుభప్రదం.ఏప్రిల్: పాత ఋణములు ఇబ్బందికరం. కొత్త ఋణాలు అవసరానికి అందవు. ఖర్చులు నియంత్రించలేరు. విద్యార్థులు, షేర్ వ్యాపారులు, ఫైనాన్ వ్యాపారులకు చికాకులు. సామాజిక గౌరవం. మే: కుటుంబ విషయంలోనూ, వృత్తి విషయంలోనూ పనివారితో సమస్యలు. పనులు వాయిదా వేస్తుంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. జూన్: ఒత్తిడి లేకుండా పనులు నెరవేరవు. ఆర్థిక వెసులుబాటులో చికాకు పడతారు. నూతన ప్రయత్నాలు సరిగా సాగవు. ఋణ వ్యవహారాలు, స్నేహితులతో కలసి చేసే పనులలో ఇబ్బందులు. కుటుంబ సభ్యులతో సఖ్యత తగ్గుతుంది. జులై: వాగ్వాదాలు తరచుగా ఉంటాయి. భోజన అసౌకర్యం. వాహనాలు, పనిముట్ల వల్ల గాయాలు. పిల్లల ప్రవర్తన నచ్చకపోవడం. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రేగడం జరుగుతాయి. ఆగస్ట్: వ్యవహారాలలో లాభాలు అందుకుంటారు. ఆర్థిక, కుటుంబ అనుకూలత తక్కువ. సమాజంలో విలువ పెరుగుతుంది. సెప్టెంబర్: తేలికగా పనులు సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలం. విచిత్ర సందర్భాలు ఎదురవుతాయి. యంత్రాలు, పనిముట్లు, వాహనాలు ఇబ్బంది కలిగిస్తాయి. అక్టోబర్: కొత్త కొత్త ప్రణాళికలను అమలు చేస్తారు. చాలా లాభాలు అందుకుంటారు. విజయాలు, గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో శుభ పరిణామాలు. నవంబర్: రోజువారీ వ్యవహారాలు సరిగా సాగవు. సహకరించే వారు వ్యతిరేకించే అవకాశం ఉన్నది. సంబంధంలేని విషయాలలో అవమానాలు. అధిక ఖర్చులు, కలహాలు. డిసెంబర్: క్రమంగా మంచి మార్పులు. శుభవార్తలు వింటారు. లాభాలు బాగా అందుతాయి. సుఖశాంతులు, విజయావకాశాలు పెరుగుతాయి. జనవరి: పనులు ఆలస్యం. ఉద్యోగంలో ఒత్తిడి. వ్యాపారులకు పెట్టుబడులు అందినా, స్థిరమైన వ్యాపారం చేయలేని పరిస్థితి. ఫిబ్రవరి: అద్భుతమైన బుద్ధి కుశలత ప్రదర్శిస్తారు. అకారణంగా విచిత్ర సమస్యలు వస్తుంటాయి. విద్యా విషయంతో గౌరవం పొందుతారు. కుటుంబ విషయాలు అనుకూలం. వృథా కాలక్షేపంతో పనులకు ఆటంకాలు. మార్చి: రోజువారీ పనులలో ఆలస్యం. అవమానకర ఘటనలు. తరచుగా వృథా ఖర్చులు. ప్రయాణాలలో ఇబ్బందులు. శుభ, పుణ్యకార్యాలలో చికాకులు. ∙∙తులా రాశిఆదాయం– 5, వ్యయం– 14, రాజయోగం– 6, అవమానం– 3చిత్త 3,4 పాదములు (రా, రి)స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా)విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే)ఈ సంవత్సరం గురువు మిథునంలో (భాగ్యం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (దశమం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (లాభం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (షష్టం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (పంచమం) కేతువు సింహంలో (లాభం); తర్వాత రాహువు మకరం (అర్ధాష్టమం)లో కేతువు కర్కాటకంలో (రాజ్యం) సంచరిస్తారు.దైనందిన కార్యక్రమాలలో సాధారణ స్థితి. సమయపాలనతో పనులు పూర్తి చేసుకుంటారు. కుటుంబ విషయాలలో శ్రద్ధగా వ్యవహరిస్తారు. పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు. ఆర్థిక సమస్యలను నివారించుకుంటారు. ఆదాయం సకాలంలో అందుతుంది. పెద్ద పెద్ద వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, శుభకార్య విజయాల వలన ఖర్చులు. పుణ్యకార్యాలు, పుణ్యక్షేత్ర సందర్శనలు. కొత్త స్నేçహాలు భవిష్యత్తుకు ఉపకరిస్తాయి. సకాలంలో కావలసిన ఋణాలు. ఆరోగ్య అనుకూలత. ఉద్యోగ కార్యకలాపాలలో గౌరవ మర్యాదలు. ప్రమోషన్లకు, స్థానచలనాలకు, నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలం. వ్యాపారులకు లాభాలు. వ్యాపార ఋణాలు తీర్చుకోవడానికి, మొండి బాకీల వసూలుకు అనుకూలం. మార్కెటింగ్ ఉద్యోగులకు, ఫైనాన్స్ వ్యాపారులకు పూర్తి సానుకూలత. షేర్ వ్యాపారులకు లాభాలు. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగుంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలో, కోర్టు వ్యవహారాలలో విజయావకాశాలు. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగ భద్రత అధికం. ఆదాయ వ్యయాల మధ్య సమతూకం. బంధువులతో వైరం రాకుండా జాగ్రత్తపడండి. గర్భిణులు చక్కటి జాగ్రత్తలు పాటిస్తారు. సుఖ ప్రసవం జరుగుతుంది.చిత్త 3, 4 : వృత్తి వ్యవహారాలలో గౌరవ మర్యాదలు. ఆదాయ వ్యయాలను అదుపు చేస్తారు. స్వాతి: కొన్ని పనులు తేలికగాను, మరికొన్ని పనులు అధిక శ్రమతోను పూర్తవుతాయి. విశాఖ 1, 2, 3: రోజువారీ పనులు అకాలంలో పూర్తి అవుతుంటాయి. వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు.శాంతి మార్గం: లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నిత్యం పారాయణ చేయండి. పుట్టతో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రంలో రోజూ అర్చనలు చేయండి. లేకుంటే ఇంటిలోనైనా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయడం, అష్టముఖ రుద్రాక్షధారణ శుభప్రదం. ఏప్రిల్: మంచి నిర్ణయాలు తీసుకుంటారు.ఆరోగ్య, ఆదాయ విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు. అందరి నుంచి సహకారం. పనులు సకాలంలో అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం చికాకులు సృష్టిస్తుంది. మే: గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థిక, కుటుంబ, ఆరోగ్య విషయాలలో శ్రద్ధగా వ్యవహరిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో కొత్త ప్రయోగాలకు అనుకూలం కాదు. జూన్: కొన్ని సందర్భాలలో కలహప్రదంగా వ్యవహరిస్తారు. పనులు సరిగా సాగవు. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు. జులై: బుద్ధి కుశలతను ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు ఆగ్రహావేశాలకు లోనవుతారు. పెద్దల ఆరోగ్య విషయంలో చికాకులు రాగలవు. ఆగస్ట్: సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులు, మిత్రులు సహకరిస్తారు. గౌరవ మర్యాదలు పొందుతారు. స్థానచలన ప్రయత్నాలు వేగవంతం. శుభకార్య ప్రయత్నాలకు అనుకూలం. సెప్టెంబర్: ఆర్థిక వనరులు అందుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పుణ్య, శుభకార్యాలలో శుభ పరిణామాలు. పెద్దలను, బంధువులను దర్శిస్తారు. అక్టోబర్: వాహనాల కొనుగోలు, పాడైన వస్తువుల మరమ్మతులపై శ్రద్ధ చూపుతారు. కుటుంబ అవసరాలు తీర్చడంలో, శుభకార్యాలలో లాభదాయక ఫలితాలు. నవంబర్: చాలా విజయాలు సాధిస్తారు. వాహన ఖర్చులు పెరుగుతాయి. పనుల వాయిదా వల్ల చికాకులు. ఉద్యోగ, ఆర్థిక విషయాలలో సత్ఫలితాలు. పిల్లల గురించి మంచి వార్తలు వింటారు. పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. డిసెంబర్: తెలివిగా వ్యవహారాలు సాధిస్తారు. కొన్ని విషయాలు ఇబ్బందికరం. వృత్తి ఉద్యోగాలలో విజయాలు. ఋణ సౌకర్యం అవసరానికి తగిన విధంగా అందుకుంటారు. జనవరి: ఆదాయ వ్యయ ఋణ వ్యవహారాలలో సమన్వయం. ఇబ్బంది లేని జీవనం. క్షణం వృథా చేయకుండా ఉంటారు. ఎంతటి పని అయినా తేలికగా సాధిస్తారు. ఫిబ్రవరి: అనేక విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం. అవయవ ప్రతికూలతలు. ఉద్యోగంలో అభివృద్ధి. ఊహించని లాభాలు పొందుతారు. మార్చి: ఒక్కోసారి విజయపరంపర కొనసాగుతుంది. కొన్నిసార్లు ఇబ్బందికర ఘటనలు ఎదురవుతాయి. వృత్తి విషయాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో శ్రద్ధ చూపక కలహాలకు అవమానాలకు అవకాశం ఇస్తారు. వృథా కాలక్షేపాలు ఎక్కువ అవుతాయి. ఋణ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వ్యాపార భాగస్వాములతో విభేదాలు తలెత్తవచ్చు. ∙∙ వృశ్చిక రాశిఆదాయం– 11, వ్యయం– 5, రాజయోగం– 2, అవమానం– 6విశాఖ 4 వ పాదము (తొ)అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే)జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ)ఈ సంవత్సరం గురువు మిథునంలో (అష్టమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (భాగ్యం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (రాజ్యం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (పంచమం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (అర్ధాష్టమం) కేతువు సింహంలో (దశమం); తర్వాత రాహువు మకరంలో (తృతీయం) కేతువు కర్కాటకంలో (భాగ్యం) సంచరిస్తారు.దైనందిన కార్యక్రమాలను సక్రమంగా పూర్తి చేస్తుంటారు. మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబ విషయాలలో జూన్ వరకు చికాకులు. సంవత్సరం అంతా సాధారణ ఫలితాలు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం జూన్ వరకు ఇబ్బందికరంగానూ, జూలై నుంచి బాగా అనుకూలంగానూ ఉంటుంది. విద్యా విజ్ఞాన వినోద కార్యకలాపాలలో పిల్లలతో కలిసి పాల్గొంటారు. ద్వితీయార్ధంలో ఆర్థిక లాభాలు బాగుంటాయి. దాన ధర్మాలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారు. పిల్లల శుభ కార్యాలకు అధిక వ్యయం చేస్తారు. చోరభయం, రోగభయం, అగ్నిభయంతో జులై వరకు ముఖ్య వ్యవహారాలను వదిలేస్తారు. ఋణ వ్యవహారాలు అనుకూలం. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా చూసుకుంటారు. అక్టోబర్ వరకు చిన్న చిన్న ఇబ్బందులు. ఉద్యోగ వ్యవహారాలలో గౌరవ మర్యాదలు. మార్కెటింగ్ ఉద్యోగులకు ద్వితీయార్ధంలో అభివృద్ధికరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వేగంగా జరుగుతాయి. వ్యాపారులకు జులై నుంచి అనుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో శ్రమతో విజయాలు. షేర్ వ్యాపారులకు లాభాలు. విద్యార్థులు ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఫలితాలు బాగుంటాయి. స్థిరాస్తి లావాదేవీలు నెమ్మదిగా సానుకూలం. ఈ రాశి స్త్రీలకు ఆదాయం బాగుంటుంది. అలంకరణ వస్తువులు, గృహోపకరణాల కొనుగోలు. శుభకార్య ప్రయత్నాలు లాభిస్తాయి. గర్భిణులకు ప్రతిబంధకాలు ఉండవు. విశాఖ 4: శ్రమతో పనులు సాధ్యపడతాయి. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలు విజయవంతం.అనురాధ: ఆర్థికంగా ఎదుగుతారు. విదేశీ నివాస ప్రయత్నాలు విజయవంతం. జ్యేష్ఠ: తెలియని భయం. కుటుంబ సభ్యులతో కలహాలు. అనవసర ప్రయాణాలు. గురువుల సందర్శన.శాంతి మార్గం: నవగ్రహ మండపం ఉన్న దేవాలయంలో రోజూ పూజ చేయండి. దత్తాత్రేయ స్వామి ఆరాధన విశేష ఫలప్రదం. పేద విద్యార్థులకు అవసరమైన వస్తువులు ఇవ్వడం మంచిది. షణ్ముఖ రుద్రాక్షధారణ శుభçప్రదం.ఏప్రిల్: కుటుంబంలో అనైక్యత. స్వబుద్ధితో పనులు సానుకూలం అవుతాయి. పనుల్లో చికాకులు. ఒంటరిగా దూర ప్రయాణాలు తగ్గించండి. ఋణ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మే: పనులు వాయిదా వేస్తారు. సొంత విషయాల్లో గోప్యత పాటించడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. స్త్రీలకు ఆరోగ్య సమస్యలు. అనుకున్న ప్రణాళికలకు, ఆచరణకు పొంతన ఉండదు. జూన్: నూతన ప్రయత్నాలు సాగకున్నా, రోజువారీ వ్యవహారాలు బాగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో అధికారుల సహకారం పెరుగుతుంది. వ్యాపారంలో చురుకుగా పాల్గొంటారు. బంధువుల సహకారం బాగుంటుంది. జులై: పనులు సానుకూలం అవుతున్నట్లుగా గోచరించినా, ఏదో ఒక చికాకు దాగి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు, వ్యవహార చికాకులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పుణ్య, శుభకార్యాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. విద్యా వ్యాసంగం సరిగా సాగదు. ఆగస్ట్: చాలాసార్లు సోమరితనం ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు విజయలక్ష్యంతో ముందుకు వెడతారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తారు. పుణ్య, శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో సహకారం బాగుంటుంది. సెప్టెంబర్: క్రమక్రమంగా మంచి ఫలితాలు. ఉద్యోగ వ్యాపారాలలో పనుల సానుకూలతలో అన్ని వనరులు సహకరిస్తాయి. అక్టోబర్: ఉద్యోగులకు అనుకూలత తక్కువ. సకాలంలో అన్న వస్త్రాలు సమకూరని పరిస్థితి. ఇతరుల మాటలు విని కుటుంబ కలహాలు తెచ్చుకుంటారు. వ్యాపారులు ఓర్పు వహించాలి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. నవంబర్: బంధువుల సహకారం బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరం. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. ఆర్థిక లావాదేవీలు చక్కగా చేస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. జరగవని వదిలేసిన పనులు కూడా పూర్తవుతాయి.డిసెంబర్: కాలాన్ని లాభదాయకంగా మార్చుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రద్ధ పెంచుతారు. శుభకార్య ప్రయత్నాలలో భార్య తరఫు బంధువులు సహకరిస్తారు. కొత్త ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలకు సానుకూలం. జనవరి: మంచి మార్పులు ఉంటాయి. ఓర్పుగా ప్రవర్తించి విజయాలు సాధిస్తారు. స్నేహితులు, బంధువులు సహకరిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఫిబ్రవరి: కుటుంబ అవసరాలు తీర్చడానికి బాగా శ్రమిస్తారు. వృత్తి వ్యాపారాలలోను, కుటుంబ వ్యవహారాలలోను బంధు మిత్రుల సహకారం బాగుంటుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.మార్చి: పని ఒత్తిడి పెరుగుతుంది. ధైర్యంగా ఉంటారు. అందరి సహకారం ఉంటుంది. ఏదో తెలియని అంశాలలో కలహాలు తప్పవు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకం. అలంకరణ వస్తువుల కొనుగోలు, శుభకార్య ప్రయత్నాలు బాగుంటాయి. వాహనములు, ఎలక్ట్రికల్ వస్తువులకు మరమ్మతులు చేయించాల్సి వస్తుంది.ధనూ రాశిఆదాయం–14, వ్యయం–11, రాజయోగం– 5, అవమానం– 6మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ)పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా)ఉత్తరాషాఢ 1వ పాదము (బే)ఈ సంవత్సరం గురువు మిథునంలో (సప్తమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుండి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (అష్టమం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (నవమం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (చతుర్థం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (తృతీయం) కేతువు సింహంలో (భాగ్యం); తర్వాత రాహువు మకరం (ద్వితీయం)లో కేతువు కర్కాటకంలో (అష్టమం) సంచరిస్తారు.దైనందిన కార్యక్రమాలలో చిన్న చిన్న సమస్యలు. సకాలంలో పనులు పూర్తి చేసుకోవడానికి శ్రమిస్తారు. కుటుంబ విషయాలలో అనుకూలత తక్కువ. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండవు. దేహ గాంభీర్యం కోల్పోయే అవకాశం ఉన్నది. ఫైనాన్స్ వ్యాపారులకు సమస్యలు రాగలవు. అనవసర ఋణాలు చేస్తారు. ఆరోగ్య విషయాలలో ద్వితీయార్ధంలో చికాకులు. ఉద్యోగ కార్యకలాపాలలో నిబద్ధతతో విధి నిర్వహణ చేయవలసిన కాలం. మార్కెటింగ్ ఉద్యోగులు ఎంతో శ్రమిస్తేనే తప్ప టార్గెట్లు చేరుకోలేరు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో చికాకులు. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఉన్నవారు తొందరపడి చేస్తున్న వ్యాపారం మానవద్దు. షేర్ వ్యాపారులకు శ్రమ ఎక్కువ. లాభాలు తక్కువ. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఎక్కడా ఇబ్బంది ఉండదు. కోర్టు వ్యవహారాలు సానుకూలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం. ఈ రాశి స్త్రీలకు అనాలోచిత ప్రవర్తన వల్ల చికాకులు. సంఘంలో గౌరవ మర్యాదలు. ఉద్యోగం ఒత్తిడి. వైద్య ఖర్చులు అధికం.మూల: ఆర్థిక లావాదేవీలు భారంగా ఉంటాయి. వ్యాపారులకు ఇబ్బందులు. సమయపాలన ఉండదు. పూర్వాషాఢ: తరచుగా అలసట, శ్రమ. చోర, అగ్ని, అధికార బాధలు. మాట తీరుతో సమస్యలు తలెత్తుతాయి. ఉత్తరాషాఢ 1: ప్రతిపనిలోనూ ప్రారంభంలో ధనం సమకూరక ఇబ్బందిపడటం, క్రమంగా సర్దుబాటు జరిగి పనులు పూర్తి చేసుకోవడం వంటివి ఉంటాయి. తరచుగా బుద్ధి భ్రంశానికి లోనవుతారు. శాంతిమార్గం: గురువుకు, శనికి శాంతి చేయించుకోవడం అవసరం. ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామి దేవాలయంలోనూ, ప్రదోషకాలంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయండి. నిత్యం గోసేవ చేయండి. కుదిరినప్పుడు యతీశ్వరులను ధర్శించి సేవించండి. చతుర్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: అన్ని వ్యవహారాలలోను 19వ తేదీ లోపల వేగం పెంచండి. 19వ తేదీ నుంచి వ్యవహార ప్రతిబంధక అంశాలలో బాగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. వృత్తి విషయాలలో దూకుడు తగ్గించాలి. షేర్ వ్యాపారులకు సామాన్య ఫలితాలు, విద్యార్థులకు మంచి ఫలితాలు. మే: కోపావేశములు నియంత్రించుకోవాలి. రోజువారీ పనులపై దృష్టి కేంద్రీకరించండి. కొత్త పనులు చేపట్టవద్దు. ప్రతిపనీ స్వయంగా చేసుకోవలసి వస్తుంది. తద్వారా పని ఒత్తిడి పెరుగుతుంది. అధికారులు, కింది ఉద్యోగల వల్ల చికాకులు. జూన్: ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. మీ వ్యవహారాలలో ఇతరుల ప్రమేయం తగ్గించండి. ఆదాయ వ్యయాల సమన్వయంపై దృష్టి ఉంచండి. ఉద్యోగ విధి నిర్వహణలో అన్యమనస్కంగా వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. స్నేహితుల సహాయ నిరాకరణ తరచుగా ఉంటుంది. జులై: అన్ని వ్యవహారాలలో ఓర్పు ప్రదర్శించాలి. ఇతరుల మీద ఆధారపడి పనులు చేయవద్దు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించండి. పాత ఋణాల పట్ల జాగ్రత్తపడండి. అనవసర ప్రయాణాలు తగ్గించండి.ఆగస్ట్: చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కాలం. వృథా ఖర్చులు, అనవసర ప్రయాణాలు చేయవద్దు. ఇతరులకు హామీలు ఇవ్వవద్దు. భార్య తరపు బంధువుల రాకపోకలు పెరుగుతాయి. తరచుగా శుభకార్య నిమిత్తం చేసే ప్రయాణాలలో అధిక వ్యయం జరుగుతుంది.సెప్టెంబర్: ఎంతో శ్రమతో తెలివిగా పరిస్థితులు చక్కబెడతారు. భోజన, వస్త్ర, స్నాన సౌకర్యాలు కూడా ఇబ్బందికరం. కుటుంబ సభ్యులతో కలహాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ, వృత్తి విషయాలను ఇతరులతో చర్చించకండి. అక్టోబర్: తరచుగా శుభవార్తలు, పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యంలో మంచి మార్పు. తరచు చోర, అగ్ని, రోగ భయాలు. శరీర సౌష్టవం, మాటల గాంభీర్యం కోల్పోతారు. నవంబర్: ఇబ్బందుల నుంచి బయటపడతారు. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు వేగం అందుకుంటాయి. కావలసిన ఋణ సౌకర్యం, సహకారం అందుతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలం. విద్యార్థులకు అనుకూలం కాదు. డిసెంబర్: మంచి మార్పులు ప్రారంభం. పనులు సానుకూలం. చాలాకాలంగా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు. ఆర్థిక వెసులుబాటు.ప్రయాణాలు, అలంకరణ వస్తువుల కొనుగోలు అధికం. జనవరి: తరచుగా చోర, రోగ, అగ్ని భయం. వాహన సమస్యలు, ఖర్చులు. తరచుగా ద్రవ్యలోపం. ఆరోగ్య, ఋణ విషయాలలో సమస్యలు. ఉద్యోగ వ్యాపారాలలో డబ్బు ఇబ్బందులు, అధికార ఒత్తిడి. నమ్మిన వారు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి: మందకొడితనం ఆవహిస్తుంది. పనులు వేగం చేయలేరు. అన్ని పనులూ శ్రమతో పూర్తి అవుతాయి. ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ విషయాలను సమన్వయం చేయలేరు. దూర ప్రయాణాలు విరమించడం మంచిది. విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించ వలసిన కాలం. మార్చి: ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. అనవసర విషయాలలో తలదూర్చవద్దు. ఉద్యోగ, కుటుంబ వ్యవహారాలలో శ్రమచేసి లబ్ధి పొందుతారు. నూతన ఉద్యోగ వ్యాపారాలు ఇబ్బందికరం. అధికారుల అండ ఉన్నా, వృత్తి చికాకులు తప్పవు. విద్యార్థులకు అనుకూలం కాదు.మకర రాశిఆదాయం– 2, వ్యయం– 8, రాజయోగం– 1, అవమానం– 2ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ)శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ)ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి)ఈ సంవత్సరం గురువు మిథునంలో (షష్ఠం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (సప్తమం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (అష్టమం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (తృతీయం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (ద్వితీయం) కేతువు సింహంలో (అష్టమం); తర్వాత రాహువు మకరంలో (జన్మం) కేతువు కర్కాటకంలో (సప్తమం) సంచరిస్తారు.దైనందిన కార్యక్రమాలకు ఆటంకాలు వస్తుంటాయి. వాటిని తెలివిగా దాటవేస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. కుటుంబ విషయాలలో ఇతరుల ప్రమేయం వల్ల తరచుగా కలహాలు. ఆర్థిక కార్యకలాపాలలో ఓర్పు అవసరం. ఖర్చులు పరిధి దాటతాయి. శుభకార్యాల కోసం, వస్తువుల మరమ్మతుల కోసం ఖర్చులు పెరుగుతాయి. ప్రతి పనిలోనూ ఓర్పు అవసరం. ఇతరులపై ఆధారపడి ఏ పనీ చేయవద్దు. ఫైనాన్స్ వ్యాపారులకు అక్టోబర్ నుంచి మోసపూరిత వాతావరణం. అవసరానికి కావలసిన ఋణాలు అందవు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉంటారు. అక్టోబర్ నుంచి ఆరోగ్య సమస్యల వల్ల పనులకు ఆటంకాలు. ఉద్యోగ కార్యకలాపాలలో మంచి ఫలితాలు. తోటివారి నుంచి సహకారం తక్కువ. మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ. జూన్ నుంచి అక్టోబర్ వరకు అనుకూలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అయోమయ పరిస్థితులు. వ్యాపారులకు అనవసర చికాకులు. శ్రమాధిక్యం, లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఇతరుల సలహాలు విని పెట్టుబడుల జోలికి పోవద్దు. నూతన వ్యాపార ప్రయత్నాలలో తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. షేర్ వ్యాపారులు తెలివిగా వ్యాపారం చేసినా, అనుకున్న స్థాయి ఫలితాలు దక్కవు. విద్యార్థులకు విద్యా వ్యాసంగం దారి మళ్ళుతుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి మంచి సలహాలు సహకారం అందవు. కోర్టు వ్యవహారాలలో మోసపోయే అవకాశాలు ఎక్కువ. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు ఉద్యోగ విధి నిర్వహణలో చక్కటి పరిస్థితులు ఉంటాయి. అయితే, ఆర్థిక ఎదుగుదల తక్కువ. అక్టోబర్ తరువాత వైద్య విషయంలో కూడని సలహాలు అందుతాయి. గర్భిణులు అక్టోబర్ నుంచి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఉత్తరాషాఢ 2, 3,4: ప్రతిపనికీ అధిక శ్రమ చేయవలసి వస్తుంది. ఉద్యోగ విషయంగా రక్షణ అధికంగా ఉంటుంది. తోటివారి సహాయ సహకారాలు తక్కువ. కొత్త పెట్టుబడులకు కాలం అనుకూలం. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది.శ్రవణం: ఆదాయానికి తగిన ఖర్చు ఉంటుంది. వృథా ఖర్చులను నియంత్రించ గలుగుతారు. ణాలు తీర్చే ప్రయత్నంలో గొప్ప కృషి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలలో మంచి ఫలితాలు ఉంటాయి. అధిక శ్రమ తప్పదు. ధనిష్ఠ 1, 2: ఉద్యోగ వ్యాపారాలలో చాలా చక్కటి ఫలితాలు అందుకుంటారు. తరచుగా దూరప్రాంత సందర్శన చేస్తుంటారు. ఏ విషయంలోనూ స్థిరబుద్ధి ప్రదర్శించరు. వృత్తి విషయాలలో అవసరమైన సలహాలు అందవు. శాంతి మార్గం: ప్రతినిత్యం ఎక్కడ వేదపారాయణ జరుగుతున్నా వెళ్ళి వినడం ప్రారంభించండి. ప్రాతఃకాలంలో దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ లేదా శ్రవణం చేయండి. అక్టోబర్‌లో గురు రాహు కేతువులకు శాంతి చేయించండి. గురువారం శనగలు, తీపి పదార్థాలను దానం చేయండి. సప్తముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: ప్రతి విషయంలోనూ సానుకూల ఫలితాలు. ఆర్థిక లావాదేవీలు సాఫీగా సాగవు. వృత్తి విషయాలలో ఒత్తిడి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో అనుకూల వార్తలు. కోరుకున్న రీతిగా స్వేచ్ఛగా సంచరిస్తారు. సంతానం ద్వారా అనుకూలత. మే: పెద్దల ఆరోగ్య విషయంగా, పిల్లల వృద్ధి విషయంగా చికాకులు. రోజువారీ పనులలో సమయ పాలన చేయలేరు. ఆరోగ్య, ఋణ విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు. షేర్ వ్యాపారులకు 15వ తేదీ వరకు అనుకూలం. విద్యా వ్యాసంగం, ప్రయాణాలు ఇబ్బందికరం. జూన్: తెలివి బాగా పనిచేసినా, చాలా పనులు సాధించలేని పరిస్థితి. ఖర్చులు విచిత్రంగా వస్తుంటాయి. వాటిని నియంత్రించలేరు. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలం. ప్రయాణాలు తగ్గించాలి. వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు చేసి అమలు చేసి సఫలమవుతారు. జులై: సమస్యలు సరిచేసుకోవడంలో నైపుణ్యం ప్రదర్శిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో శుభవార్త అందుతుంది. ఆర్థిక విషయాలు సామాన్యం. వృత్తి విషయంలో తోటివారి సహాయ సహకారాలు, అధికారుల అండదండలు బాగుంటాయి. ఆగస్ట్: స్వయంగా చేసుకునే పనులు బాగా పూర్తవుతాయి. ఇతరుల సమస్యలపై దృష్టి పెట్టకుండా, మీ రోజువారీ పనులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. విదేశీ నివాస ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి. స్థిరాస్తి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. సెప్టెంబర్: శ్రమ ఎక్కువ అయినా, సోమరితనం ప్రదర్శించకుండా వేగంగా ప్రణాళికలు చేస్తే సానుకూల ఫలితాలు అందుతాయి. 18వ తేదీ తరువాత సానుకూలత తక్కువ. సహకరించేవారు తక్కువ. ఖర్చులు ఎక్కువ. ఋణ సౌకర్యం సరిలేక కొన్ని పనులు ఆగుతాయి. విద్యా వ్యాసంగం బాగుంటుంది. అక్టోబర్: ఆకస్మిక ధనలాభం. వృత్తి రీత్యా తరచు అవరోధాలు. శుభ, పుణ్యకార్యాలలో మీ శ్రమ ఆలస్యంగా సఫలం అవుతుంది. ఋణ వ్యవహారాలలో అవమానాలు రాకుండా జాగ్రత్తపడండి. ఇతరుల మాటలు నమ్మి కొత్త ప్రయత్నాలు చేయవద్దు. వృత్తి విషయాలు స్వయంగా చూసుకోండి. నవంబర్: కుటుంబ వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. వృత్తిరీత్యా కలహాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా ఉండవు. ఆరోగ్య సమస్యలకు మంచి సలహాలు అందుతాయి. తరచుగా విద్యాభంగం పొందుతారు.డిసెంబర్: మంచి మార్పులకు శ్రీకారం పడుతుంది. వ్యాపారులకు మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో శ్రద్ధ ప్రదర్శించి అధికారుల ప్రోత్సాహం అందుకుంటారు. కుటుంబ, ఉద్యోగ, వ్యాపారాలలో పనివారిపై ఆధారపడటం మంచిది కాదు. ఆర్థిక లాభాలు బాగుంటాయి. జనవరి: ఆర్థిక లావాదేవీలు సమస్య కాకుండా జాగ్రత్త పడతారు. రోజువారీ పనులలో అవాంతరములు ఉంటాయి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సమస్యలు రాకుండా చూసుకుంటారు. స్నేహితులతో జాగ్రత్త వహించాలి. ప్రతి నిమిషం ఒక పరీక్షా కాలంగా ఉంటుంది. ఫిబ్రవరి: మోసపూరిత వాతావణానికి దగ్గరవుతారు. కలహాలు, ఋణాలు, వాహన చికాకులు, ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి నిత్యం వెంబడిస్తాయి. స్త్రీలు పని ఒత్తిడికి లోనవుతారు. ఋణ వ్యవహారాలలో తెలివిగా వ్యవహరిస్తే మంచిది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో శుభవార్తలు. మార్చి: మానసిక చికాకులు ఉంటాయి. అన్నీ తెలిసి కూడా పనులు సానుకూలం చేయలేని స్థితి. ఆర్థిక వెసులుబాటు సామాన్యంగా ఉంటుంది. వస్తువుల కొనుగోలులో మోసపోతారు. ఉద్యోగ, వ్యాపార విషయాలు ఎవరితోనూ చర్చించవద్దు. వృత్తి విషయంలో ఒత్తిడి పెరుగుతుంది.∙∙కుంభ రాశిఆదాయం– 2, వ్యయం– 8, రాజయోగం– 4, అవమానం– 2ధనిష్ఠ 3,4 పాదములు (గూ, గే)శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు)పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా)ఈ సంవత్సరం గురువు మిథునంలో (పంచమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (షష్ఠం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (సప్తమం) సంచరిస్తారు. శని సంవత్సరమంతా మీనంలో (ద్వితీయం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (జన్మం) కేతువు సింహంలో (సప్తమం) తర్వాత రాహువు మకరం (వ్యయం)లో కేతువు కర్కాటకంలో (షష్ఠం) సంచరిస్తారు.దైనందిన కార్యక్రమాలలో ఒక మాయ వెంబడిస్తున్నట్లుగా ఉంటుంది. పనులు సమయపాలనతో చేయలేరు. ఫలితంగా ఇతర పనులు పాడవుతాయి. కుటుంబ విషయాలు సహా అన్ని వ్యవహారాలలోనూ ఏలినాటి శని, జన్మ వ్యయ రాహు ప్రభావంగా వృథా కాలక్షేపాలు, దాటవేత పద్ధతి, అవమానించడం, అవమానాలు పొందడం, పరుష వాక్య ప్రయోగంతో ఇబ్బందులు పొందుతారు. ఆర్థిక కార్యకలాపాలలో ఆదాయ వ్యయాలు నియంత్రణలో ఉంటాయి. ఋణ వ్యవహారాలలో అవమానం ఎదురవుతుంది. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. ఆరోగ్యం పట్ల తగిన దృష్టి ఉంచరు. పాత సమస్యలు తిరగపెట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగ కార్యకలాపాలలో సరైన నిర్ణయాలు చేయలేరు. తోటివారి సహాయ సహకారాలు తక్కువ. అధికారుల ఒత్తిడి జూన్ తరువాత పెరుగుతుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలత లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి సలహాలు అందవు. వ్యాపారులకు మానసిక ఒత్తిడి, మోసపూరిత వాతావరణం. స్వయంగా పరిశీలించాకనే నిర్ణయాలు చేయండి. ఇతరుల జోలికిపోవద్దు. నూతన వ్యాపార ప్రయత్నాలలో పనులు సమయపాలనతో సాగవు. షేర్ వ్యాపారులలో ఆలోచనకు, అమలుకు పొంతన ఉండదు. విద్యార్థులకు మానసిక సానుకూలత ఉండదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు సరిగా సాగవు. కోర్టు వ్యవహారాలలో సమస్యలు పెరుగుతాయి. స్థిరాస్తి లావాదేవీలు ఇబ్బందికరం. ఈ రాశి స్త్రీలకు పని ఒత్తిడి ఎక్కువ. తరచుగా చికాకులు. కుటుంబ సభ్యులతో సఖ్యత తగ్గుతుంది. ఉద్యోగంలో ఎదుగుదల లోపిస్తుంది. గర్భిణులకు జాగ్రత్తలు అవసరం. పెద్దలు, వైద్యుల సలహాలు పాటించండి. ప్రయాణాలు తగ్గించండి.ధనిష్ఠ 3, 4 : మోసపూరిత వాతావరణం ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల మీద ఆధారపడిన పనులు ఇబ్బంది కలిగిస్తాయి. వస్తువులు మరచిపోవడం, చోరీ కావడం వంటివి జరుగుతాయి.శతభిష: కలహాలకు అవకాశం ఇవ్వవద్దు. ఓర్పు, సహనం అవసరం. పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా జాగ్రత్తపడండి. కొత్త వ్యవహారాలలో తలదూర్చకండి. ఋణాలు చేయవద్దు. ఉద్యోగంలో జాగ్రత్తలు అవసరం.పూర్వాభాద్ర 1, 2, 3: ఆగ్రహావేశాలు తగ్గించాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోకండి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగండి. వృథా కాలక్షేపాలకు స్వస్తి పలకండి. తక్కువ స్థాయి వారి నుంచి ప్రమాదాలకు అవకాశం. శాంతి మార్గం: గ్రహచారం పూర్తి విరుద్ధంగా ఉన్నందున రోజూ రామాయణ పారాయణ చేయడం శ్రేయస్కరం. శని గురు రాహు కేతువులకు శాంతి చేయించండి. ఇష్టదైవ నామస్మరణ చేయండి. రోజూ దుర్గా సప్తశ్లోకీ పారాయణ చేయడం ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేయడం, అష్టముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: కొత్త వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు. చాలావరకు పనులు సఫలం. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది లేకుండా సాగుతాయి. 10వ తేదీ నుంచి పనులు వేగం అందుకుంటాయి. విద్యా వ్యాసంగం ఇబ్బందికరం. వృత్తిలో అధికారుల సహకారం గొప్పగా ఉంటుంది. పుణ్యకార్యాలు చేస్తారు. మే: ఒంటరి కాలక్షేపాలు, ఒంటరిగా ప్రయాణాలు శ్రేయస్కరం కాదు. మోసపూరిత వాతావరణం. ఇతరులపై ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మొండి ధైర్యం పెరుగుతుంది. తెలివిగా ఉంటారు. అలా ఉన్నా, చికాకుపడే అవకాశం ఉన్నది. స్థిరాస్తి వ్యవహారాలు చికాకులు సృష్టిస్తాయి. జూన్: ప్రతిపనికీ ఆదాయ వనరులు ఇబ్బందికరం. కుటుంబసభ్యులతో సఖ్యత లోపిస్తుంది. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు. విద్యార్థులు, ఫైనాన్స్, షేర్ వ్యాపారులకు బుద్ధి స్థిరంగా పనిచేయక ఇబ్బందిపడే అవకాశం ఉంది. జులై: ఇతరుల విషయాల జోలికి వెళ్ళవద్దు. ఆర్థిక వ్యవహారాలు అదుపులో ఉండవు. తెలియక పొరపాటు చేసి పశ్చాత్తాపపడే పరిస్థితి ఎదురవుతుంది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు. విద్యావ్యాసంగం సరిగా సాగదు. ఆగస్ట్: కుటుంబ కలహాలు తలెత్తవచ్చు. సంబంధంలేని సమస్యలకు బాధ్యత వహించవలసి వస్తుంది. నూతన ప్రయత్నాలు విరమించడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. అజీర్ణ సమస్యలు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్: పనులు చక్కగా పూర్తవుతాయి. తెలియక పొరపాట్లు చేసి పశ్చాత్తాపపడతారు. అందరినీ గౌరవించడం, అందరి చేత గౌరవం పొందడం జరుగుతుంది. వృత్తి రీత్యా జాగ్రత్తలు తీసుకుని ఫలితాలు సాధిస్తారు. శ్రమ ఎక్కువ అవుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. అక్టోబర్: పుణ్యకార్యాలలో కాలక్షేపం చేస్తారు. ప్రతిపనినీ సానుకూలం చేసుకుంటారు. కుటుంబ సమస్యలకు పరిష్కారం అందుతుంది. ఇతరులకు సలహాలు చెప్పి కొన్ని సందర్భాలలో గౌరవం పొందుతారు. కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. ఆర్థిక వ్యవహారాలలో ఇబ్బందులు. నవంబర్: పని ఒత్తిడి ఎక్కువ. ఫలితాలు శూన్యం. రోజువారీ పనులు సరిగా సాగవు. పుణ్య శుభకార్యాలలో ఇబ్బందులు, ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలతలు. అవసరానికి కావలసిన ధనం, ఋణం సర్దుబాటు కాని స్థితి. డిసెంబర్: తెలివిగా వ్యవహరిస్తారు. శ్రమతో పనులు పూర్తి అవుతుంటాయి. ఆర్థిక వ్యవహారాలలో విచిత్ర పరిస్థితులు. అధిక వ్యయం ఉంటుంది. ఓర్పుతో కుటుంబ విషయాలు సర్దుబాటు చేసుకుంటారు. అనవసర విషయాలలో భయాందోళనలు పెరుగుతాయి. జనవరి: ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. మోసపూరిత వాతావరణం అధికం. కొత్త వ్యవహారాలు చేయరాదు. ఆర్థిక లావాదేవీలు సమన్వయం చేయలేక ఒత్తిడికి లోనవుతారు. అందరినీ అవమానించడం, అవమానింపబడడం వంటివి జరిగి చికాకులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి: ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపారాలలో ముఖ్యమైన అంశాలు వదిలివేసి అధికారుల ఆగ్రహావేశాలకు లోనవుతారు. ప్రయాణ చికాకులు, వాహన చికాకులు ఉంటాయి. విద్యార్థులు కాలానుగుణంగా ప్రవర్తించని స్థితి ఉంటుంది. మార్చి: ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరం. కావలసిన సమయానికి ఋణాలు దొరకవు. ప్రయాణ అసౌకర్యం తరచుగా ఎదురవుతుంది. వస్తువులు మరచిపోవడం కాని, దొంగతనానికి గురవడం కాని జరుగుతుంది. మీ ప్రవర్తన పిల్లల దగ్గర తేలికపడేలా ఉంటుంది. మీన రాశి ఆదాయం– 14, వ్యయం– 11, రాజయోగం– 7, అవమానం– 5పూర్వాభాద్ర 4 వ పాదము (ది)ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా)రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి)ఈ సంవత్సరం గురువు మిథునంలో (అర్ధాష్టమం) జూన్ 1 వరకు ఉంటారు. జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు, తిరిగి జనవరి 25 నుంచి సంవత్సరాంతం వరకు కర్కాటకంలో (పంచమం) అక్టోబర్ 31 నుంచి జనవరి 25 వరకు సింహంలో (షష్ఠం) సంచరిస్తారు. శని సంవత్సరం అంతా మీనంలో (జన్మం) సంచరిస్తారు. రాహువు డిసెంబర్ 6 వరకు కుంభంలో (వ్యయం) కేతువు సింహంలో (షష్ఠం); తర్వాత రాహువు మకరంలో (లాభం) కేతువు కర్కాటకంలో (పంచమం) సంచరిస్తారు. దైనందిన కార్యక్రమాలో మిశ్రమ స్పందనగా కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ విషయాలలో కుటుంబసభ్యుల ధోరణి సరిపడదు. మనసు సరిలేని స్థితి. తరచుగా పనులు మరచిపోతుంటారు. అక్టోబర్ వరకు ప్రతిభకు తగిన గుర్తింపు దొరకదు. పనులు సానుకూలమే కాని, ఆలస్యం అవుతాయి. అక్టోబర్ వరకు అనాలోచితంగా ఉంటారు. ఆర్థిక కార్యకలాపాలలో ఇబ్బంది ఉండదు. అన్ని కార్యక్రమాలోనూ తగిన ఆర్థిక వనరులను స్వయంగా సమకూర్చుకుంటారు. జూన్ తర్వాత శుభ పుణ్య సామాజిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఫైనాన్స్ వ్యాపారులు అక్టోబరు నుంచి మంచి ఫలితాలు అందుకుంటారు. పాత ఋణాలు ఇబ్బందికరం కాదు. ద్వితీయార్ధం కొత్తవి కావలసిన రీతిగా అందుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. పాత సమస్యలు తీరతాయి. చర్మవ్యాధులు ఉన్నవారికి ఇబ్బంది తప్పదు. ఉద్యోగ కార్యకలాపాలలో జూన్ వరకు పనులు ఆలస్యంగా సాగుతాయి. జూన్ తరువాత క్రమంగా అక్టోబర్ వరకు మంచి మార్పు ఉంటుంది. అక్టోబర్ తరువాత ప్రమోషన్ అవకాశాలు ఎక్కువ. మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు వేగంగా సాగుతాయి. వ్యాపార్తలకు ఆశించిన మంచి ఫలితాలు ప్రారంభంలో ఉండవు కాని, క్రమంగా భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశ చిగురిస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఇబ్బందులు లేని స్థితి. షేర్ వ్యాపారులు నవంబర్ నుంచి లాభాలు అందుకుంటారు. విద్యార్థులకు అనుకున్న స్థాయిలో ఫలితాలు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు సజావుగా పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాలలో ఏదో ఒక స్థాయిలో సమస్య పరిష్కారం చేసుకునే అవకాశం వస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం. ఈ రాశి స్త్రీలకు బుద్ధికుశలత ప్రదర్శించడానికి అవకాశం లేని పరిస్థితులు. ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలలో సమస్యలు ఉంటాయి. నూతన ప్రయత్నాలు సరిగా సాగవు. గర్భిణులు జాగ్రత్తలు పాటించడం ద్వారా సుఖపడతారు.పూర్వాభాద్ర 4: ద్వితీయార్ధంలో మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి పనిలోనూ ధనవ్యయం అధికం. ఏ పనీ సకాలంలో చేయరు. అయినా అన్ని పనులు సానుకూలం. కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. ఉత్తరాభాద్ర: ఎక్కువ కాలం పనులు మందగమనం. తరచుగా జీర్ణ, చర్మసంబంధ సమస్యలు రాగలవు. ఆలోచనలు అమలు చేయుదిశగా ఎవరితోనూ మనోభావాలను పంచుకోరు. రేవతి: అద్భుతమైన మాటతీరుతో ఎన్నో విజయాలు అందుకుంటారు. బంధు మిత్రులు బాగా సహకారం చేస్తారు. వృత్తిరీత్యా ఏర్పడుతున్న ఆలస్యం గురించి చింతించకుండా ధైర్యంగా ముందుకు సాగుతారు.శాంతి మార్గం: శని రాహు కేతువులకు సంవత్సరారంభంలోను, అక్టోబర్‌లో శని గురువులకు శాంతి చేయించడం మంచిది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ‘మంచం’ దానం చేయండి. నిత్యం ప్రదోషకాలంలో శివ సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. అష్టముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: చాలా వ్యవహారాలలో పనులు ఆలస్యం. నిత్యకృత్యాలు కూడా అకాలంలో సాగిస్తారు. అధికారుల వ్యతిరేకత ఉంటుంది. వాహనాలు తరచు మరమ్మతులకు వస్తుంటాయి. షేర్ వ్యాపారులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. మే: క్రమంగా మంచి ఫలితాలు ప్రారంభం అవుతాయి. భవిష్యత్ మీద ఆశ జనిస్తుంది. ఆరోగ్యం సానుకూలంగా ఉంటుంది. శుభ కార్యాలలో పాల్గొనడం, పుణ్యకార్యాలు చేసే ఆలోచనలు పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు క్రమంగా మంచి ఫలితాలు ఉంటాయి. జూన్: పెద్దల ఆరోగ్య విషయంలో బాగా జాగ్రత్తలు పాటించండి. పిల్లల విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఓర్పుగా ఉంటారు. అయితే చాలాసార్లు నిరుత్సాహంగా ఉంటారు. పనులు స్వయంగా చేసుకోవడం అవసరం. దూరప్రయాణాలు విడనాడండి. జులై: తెలివిగా పనులు సానుకూలం చేసుకుంటారు. రోజువారీ పనులు అకాలంలో జరుగుతాయి. స్వబుద్ధితో విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారి ప్రయత్నాలు తేలికగా పూర్తి అవుతాయి. కోర్టు, స్థిరాస్తి వ్యవహారాలు, శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆగస్ట్: శ్రమతో పనులు పూర్తవుతాయి. మాటతీరు నియంత్రించుకోవాలి. అవగాహన లోపాలు పెరిగి ఉద్యోగ వ్యాపారాలలో చికాకులు. నూతన ప్రయత్నాలు వేగంగా చేసినా, ఫలితం ఉండదు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత లేదు. సెప్టెంబర్: శుభకార్య ప్రయత్నాలలో విశేష ఫలితాలు. సోమరితనం ప్రదర్శించి పనులు పాడు చేస్తారు. ఆర్థిక లావాదేవీలను స్వయంగా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందికర ఘటనలు. మంచి పనులపై దృష్టి కేంద్రీకరిస్తారు. అక్టోబర్: నిత్యకృత్యాలు అకాలంలో చేయడం వలన వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు. ప్రతి పనిలోనూ వ్యాకులతకు లోనవుతారు. బంధుమిత్రులతో కలహాలకు అవకాశం ఇవ్వకండి. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. విద్యార్థులకు కాలం అనుకూలం. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు తొందరపాటును విడనాడాలి. కోర్టు వ్యవహారాలు సానుకూలం. నవంబర్: రోజువారీ పనులు సరిగా సాగవు. సహకరించే వారు కూడా వ్యతిరేకించే పరిస్థితి. నూతన ప్రయత్నాలు విఫలం. ఉద్యోగ భద్రత, వ్యాపార అనుకూలత తక్కువ. కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఇతరుల నుంచి శత్రుభావం ఎక్కువ. పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. డిసెంబర్: ఆరోగ్యం జాగ్రత్తలు పాటించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా చూసుకోవాలి. రోజువారీ పనులకు, ఉద్యోగ విధులకు సమన్వయం కుదరక ఇబ్బందులు. ఆర్థిక, కుటుంబ, వృత్తి విషయాలలో ఇతరుల సలహాలు తీసుకోకండి. కొత్త ఋణాలు చేయవద్దు. జనవరి: బుద్ధికుశలతతో పనులు సానుకూలం చేసుకుంటారు. అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. పాత సమస్యలు పరిష్కరించుకుంటారు. ధనం వెసులుబాటు, ఆరోగ్యం బాగుంటాయి. కుటుంబ సమస్యలు తీర్చుకోవడంలో తెలివిగా ఉంటారు. ఫిబ్రవరి: చేపట్టిన పనులు తేలికగా పూర్తికావు. తెలివి ధైర్యం విడనాడరు. కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాలు సమర్థంగా సాధిస్తారు. నూతన ప్రయత్నాలు వేగం అవుతాయి. సామాజిక కార్యక్రమాలలో కీర్తి పెరుగుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలకు అనుకూలం. అందరి నుంచి ఆశించిన సహకారం అందుతుంది. మార్చి: మంచి ఫలితాలు ఎన్ని ఉంటాయో, ఇబ్బందికర అంశాలు కూడా అన్ని ఉంటాయి. కుటుంబ అవసరాలు తీర్చే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తారు. అందరికీ సలహాలు ఇస్తుంటారు. అతిధోరణితో తోటివారి నుంచి చికాకులు కొని తెచ్చుకుంటారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, నూతన వృత్తి ప్రయత్నాలలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పుష్కర నిర్ణయముయమునా నదీ పుష్కరములు: ది.01–06–2026 తెల్లవారితే 02–06–2026 గం.12:17లకు గురువు కర్కాటక రాశిలో ప్రవేశం. యమునానదీ పుష్కరాలు ప్రారంభం. రాత్రికాలంలో గురువు ప్రవేశం అయినది కావున 2వ తేదీ నుంచి 12 రోజులు పుష్కరదినములుగా గణన చేయవలెను. అధిక జ్యేష్ఠ బహుళ విదియ మంగళవారం నుండి అధిక జ్యేష్ఠ బహుళ త్రయోదశీ శనివారం వరకు. ముఖ్య గమనిక : పితృశ్రాద్ధం చేశాక దేవాలయములకు వెళ్ళరాదు. నేడు పుష్కరాలు వ్యాపారధోరణిని అనుసరిస్తున్నాయి. పితృకార్యం చేసిన రోజు ఇతర దేవతా ఆరాధనలకు విశేషం లేదు. పితృ దేవతలే ప్రతిమనిషి జీవితంలోను ప్రధాన దేవతలు. పుష్కర యాత్రకు వెళ్ళినవారు ముందురోజే దేవాలయ సందర్శనం చేయండి. పితృ దేవతా సంబంధంగా కార్యం చేసిన రోజు దేవాలయ దర్శనం కూడదు. (పితృకార్యం అనంతరం). గమనించి సంచరించండి. పుష్కర సందర్భంగా ప్రారంభం నుంచి 12 రోజులు పూర్తిగా పుష్కరుడు ఆ పుష్కర నది మీదే విహరిస్తూ ఉంటారు. కావున 12 రోజులు 24 గంటలూ కూడా విశేషమే. అయినప్పటికీ రాత్రి 2వ యామము, 3వ యామము స్నానానికి నిషేధము. అలాగే కృత్రిమమైన మురికినీరుతో పుష్కరశ్రాద్ధము చేయుట కూడా నిషేధమే. పుష్కరాలు 12 రోజులు అయిన తరువాత ప్రతిరోజూ అపరాహ్ణ కాలంలో ఆ నదిమీదే పుష్కరుడు విహరిస్తాడు. అందువలన ఆ సంవత్సర కాలంలో ఏ రోజైననూ అపరాహ్ణ కాలంలో ఆ పుష్కరనదిని ఉద్దేశించి శుచిగా, శుభ్రమైన జలంతో పుష్కరశ్రాద్ధము నిర్వహించవచ్చు. అది ఈ 12 రోజుల మధ్యలో చేసిన ఫలితాన్నే సూచిస్తుంది. రాబోవు ప్లవంగ సంవత్సరంలో గోదావరి నది పుష్కరాలు: ది.26–06–2027 ప్లవంగ జ్యేష్ఠ బహుళ సప్తమీ శనివారం గోదావరి నదీ పుష్కరాలు ప్రారంభం. -పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336 -
శ్రీ పరాభవ నామ సంవత్సర శుభ ముహూర్తములు (2026 – 27)
చైత్ర మాసం 19/03 చైత్ర శుద్ధ పాడ్యమి గురు ఉత్తరాభాద్ర ఉగాది నూతన వస్త్రాభరణధారణ వ్యాపారాదులకు వృషభం ఉ.11:00 (దుస్పక్). మిథునోపి ప.12:01 20/03 విదియ శుక్ర రేవతీ వృషభం ఉ.10:19. మి«థునం ప.11:45 (రహితం లేదు)21/03 తదియ శని అశ్విని దం, అన్న, అక్షర, సీమంత, పుంసవన, దేవతా ప్రతిష్ఠ, నిశ్చితార్థం, వాస్తు కర్మలు, రిపేర్లు మిథునం ప.12:01 విశేషం.25/03 సప్తమి బుధ మృగశిర అన్న, అక్షర, ఉప, వ్యాపార, దేవతా ప్రతిష్ఠ, సీమంత, పుంసవన, వాస్తుకర్మలు, రిపేర్లు నిశ్చితార్థం వృషభం ఉ.గం.9:5527/03 నవమి కళ్యాణములు కర్కాటక లగ్న ప.1:00–3:12. 1:00కు తలంబ్రాలు పోసేలాగా చూసుకోండి. దశమి పుష్యమి గృప్ర ధను రా.12:30.28/03 దశమి శని పుష్యమి అన్న, అక్షర, వ్యాపార, సీమంత, పుంసవన, వాస్తు కర్మలు, రిపేర్లు, బోరింగ్, ఉపనయనం, దేవతా ప్రతిష్ఠలు వృషభం ఉ.గం.9:43. 29/03 ద్వాదశీ ఆది మఘ వివాహం వృషభం రాత్రి 11:55 నిశీధి.30/03 త్రయోదశీ సోమ మఘ వివాహం వృషభం ప.గం.ఉ.9:30 (సగ్రహ)01/04 పౌర్ణమి, బుధ, ఉత్తర, అన్న, వాస్తుకర్మలు, వివాహం, దేవతాప్రతిష్ఠ, వివాహం, సీమంత, పుంసవన, నిశ్చితార్థం వ్యాపారం వృషభం మార్తాండ రహితం ఉ.గం.9:30. హస్త ధనుస్సు రా.గం.11:45 వివాహం.02/04 పాడ్యమి గురు హస్త అన్న, వాస్తుకర్మలు, రిపేర్లు, దేవప్రతిష్ఠ, వ్యాపార, సీమంత పుంసవన, బోరింగ్, నిశ్చితార్థం, వృషభం ఉ.గం.9:23 03/04 విదియ శుక్ర, చిత్త, గృప్ర, శంకు, వాస్తు కర్మలు దేవతాప్రతిష్ఠలు అన్న, సీమంత, పుంసవన, నిశ్చితార్థం, వ్యాపారం, బోరింగ్, దం మిధునం ప.11:01 శుభాంశ. స్వాతీ ధనస్సు రా.11:35.04/04 తదియ శని స్వాతి వివాహం, అన్న, అక్షర, వ్యాపార, దేవ ప్రతిష్ఠ, వాస్తుకర్మలు, రిపేర్లు, సీమంత పుంసవన, నిశ్చితార్థం, బోరింగ్లకు వృషభం 9:16.05/04 చవితి ఆది అనురాధ వివాహం, గృప్ర, గర్భాదానం, ధనస్సు రా.గం.11:45.06/04 చవితి సోమ అనురాధ వ్యాపారం, అన్న, సీమంత, పుంసవన, గృప్ర, శంకు, దేవతాప్రతిష్ఠ, వాస్తు రిపేర్లు, బోరింగ్, నిశ్చితార్థం వృషభం ఉ.గం.9:07. మిధునోపి ఉ.11:45 (6శుక్ర)08/04 షష్ఠి బుధ మూల సమస్త శుభకర్మలు దేవతా ప్రతిష్ఠ, వ్యాపార, అన్న, శంకు, బోరింగ్ వృషభం ఉ.గం.8:59 (8చం). మి«థునోపి ఉ.గం.11:00 (7చం)10/04 నవమి శుక్ర ఉత్తరాషాఢ వివాహం, గర్భాదాన, గృప్ర, ధనస్సు రా.గం.11:45.11/04 నవమి శని ఉత్తరాషాఢ సమస్త శుభకర్మలు వాస్తు కర్మలు వ్యాపారాదులకు బోరింగ్, నిశ్చితార్థ సీమంతాదులకు వృషభం ఉ.గం.8:51. శ్రవణం మిథునం ఉ.గం.11:00. దశమి శ్రవణం వివాహం, గర్భాదానం ధనుస్సు రా.గం.11:30.12/04 దశమి ఆది శ్రవణం వివాహం, శంకు, వాస్తుకర్మలు దేవ ప్రతిష్ఠలు, బోరింగ్, అన్న, అక్షర, ఉప, వ్యాపార, సీమంత, పుంసవన, వృషభం ఉ.గం.8:42. మిథునోపి 11:00. ఏకాదశీ ధనిష్ఠ వివాహం గృప్ర, గర్బ, ధనస్సు రా.గం.11:45.13/04 ఏకాదశీ, సోమ, ధనిష్ఠ, మిథునం ప.గం.11:00.వైశాఖ మాసం18/04 పాడ్యమి శని అశ్వినీ మిథునం ప.గం.11:01. పూర్ణచంద్రుడితో కూడిన సోమవారం వివాహమునకు దోషం కాదు. 20/04 తదియ సోమ రోహిణీ వివాహం అన్న, అక్షర, ఉప, సీమంత, పుంసవన దేవతాప్రతిష్ఠ, గృప్ర, శంకు, బోరింగ్, వ్యాపారం మిథునం ఉ.గం.10:51. కర్కాటకం ప.గం.12:01. చవితి వివాహం, గృప్ర, గర్భాదానం, వృశ్చికం రా.గం.8:27.23/04 సప్తమి గురు పునర్వసు, అన్న, అక్షర, సీమంత, పుంసవన, శంకుస్థాపన, బోరింగ్, దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం, మిథునం ఉ.గం.10:49. కర్కాటకోపి ప.గం.11:46. గర్భాదానాదులకు వృశ్చికం రా.గం.8:19.24/04 అష్టమి శుక్ర పుష్యమి కర్కాటకం బోరింగ్, పుంసవనం, అత్యవసర విషయాలకు ఉ.గం.11:38. గర్భాదానం వృశ్చికం రా.గం.8:15.25/04 నవమి శని మఘ వివాహం మకరం రా.గం.12:53 (8చం. సగ్రహచంద్ర)26/04 దశమి ఆది మఘ వివాహం వృషభం ఉ.గం.7:44. మిథునోపి ఉ.గం.10:33.29/04 త్రయోదశీ బుధ హస్త అత్యవసర ఉప నయనాది శుభాలకు ఉ.గం.11:01. చతుర్దశీ వివాహం, గర్భాదానం, నిశ్చితార్థం వృశ్చికం రా.గం.9:01. బుధ/గురు చిత్త మకరం రా.గం.12:33.30/04 చతుర్దశి గురు చిత్త అన్న, శంకు, గృప్ర, ప్రతిష్ఠ, బోరింగ్, వ్యాపారం, నిశ్చితార్థం, సీమంత పుంసవన వృషభం ఉ.గం.7:30. గృప్ర వశ్చికం రా.గం.7:47.01/05 పూర్ణిమ శుక్ర స్వాతి మిథునం ఉ.గం.10:15. సమస్త శుభాలకు కర్కాటకం ఉ.గం.11:14. వివాహం గప్ర వృశ్చికం రా.గం.7:43. మకరోపి వివాహార్థం రా.గం.12:29.03/05 విదియ ఆది అనురాధ వివాహం, శంకు, గృప్ర, వ్యాపారం, బోరింగ్, నిశ్చితార్థం, దేవతాప్రతిష్ఠ, సీమంత, పుంసవన, అన్న, అక్షర, ఉప, వృషభం మార్తాండ రహితం ఉ.గం.7:22 (12ర7చం) గర్భాదానం వివాహం మకరం రా.గం.12:21.04/05 తదియ సోమ అనురాధ, అన్న, అక్షర, ఉప, శంకు, గృప్ర, నిశ్చితార్థం, వివాహం, సీమంతం, గృప్ర, దేవతాప్రతిష్ఠ, వ్యాపారం వృషభం ఉ.7:14.06/05 పంచమి బుధ మూల అన్న, సీమంత, పుంసవన, వివాహం, నిశ్చితార్థం, బోరింగ్, వాస్తుకర్మలు, దేవతాప్రతిష్ఠ వృషభం ఉ.గం.7:05.07/05 షష్ఠి గురు ఉత్తరాషాఢ వివాహం గృప్ర వృశ్చికం రా.గం.7:23.08/05 షష్ఠి శుక్ర ఉత్తరాషాఢ అన్న, అక్షర, ఉప, సీమంత, పుంసవన, శంకు, గృప్ర, వివాహ నిశ్చితార్థం దేవతాప్రతిష్ఠ, వ్యాపారం, బోరింగ్ వృషభం ఉ.గం.6:58. సప్తమి మిథునం ప.గం.9:45. కర్కాటకం ప.గం.10:42. సప్తమి శ్రవణం వివాహం. సీమంత వేడుక నిశ్చితార్థం వృశ్చికం రా.గం.7:15.09/05 సప్తమి శని శ్రవణం మిథునం ఉ.గం.8:55 విశేషం. అష్టమి శని ధనిష్ఠ మకరం రా.గం.11:45.10/05 అష్టమి ఆది ధనిష్ఠ మిథునం ఉ.గం.9:39. నవమి వృశ్చికం రా.గం.7:10.అధిక జ్యేష్ఠ మాసంక్రింద యిచ్చిన ముహూర్తములు, అత్యవసరంలో బోరింగ్‌కు, వాస్తు రిపేర్లకు, నిత్యంలో అన్నప్రాశన, సీమంతం, వేడుక సీమంత, పుంసవన, జాతకర్మ, నామకరణలకు మాత్రమే.18/05 విదియ సోమ రోహిణీ కర్కాటకం ఉ.గం.10:01.20/05 పంచమి బుధ పునర్వసు ధనుస్సు ఉ.గం.8:30.21/05 పంచమి గురు పునర్వసు మిథునం ఉ.గం.8:50.22/05 షష్ఠి శుక్ర పుష్యమి మిథునం ఉ.గం.7:30.25/05 దశమి సోమ ఉత్తర మి«థునం ఉ.గం.8:30. కర్కాటకం ప.గం.9:26. ధనుస్సు రా.గం.8:00.27/05 ఏకాదశీ బుధ హస్త మిథునం ఉ.గం.7:30.28/05 ద్వాదశీ గురు చిత్త మిథునం ఉ.గం.7:30. త్రయోదశీ కర్కాటక ఉ.గం.9:30. ధనుస్సు సా.గం.8:00.29/05 చతుర్దశీ శుక్ర స్వాతీ కర్కాటకం ఉ.గం.10:01.30/05 పౌర్ణమి శని అనురాధ ధనుస్సు సా.గం.8:00.31/05 పౌర్ణమి ఆది అనురాధ మిథునం ఉ.గం.7:30.04/06 చవితి గురు ఉత్తరాషాఢ మిథునం ఉ.గం.7:00. ధనస్సు రా.గం.7:30.05/06 పంచమి శుక్ర శ్రవణం ధనిష్ఠ రా.గం.7:30.06/06 షష్ఠి శని ధనిష్ఠ కర్కాటకం ఉ.గం.10:01. ధనస్సు రా.గం.7:30. సగ్రహ చంద్రక్రాంతి దోషం07/06 సప్తమి ఆది శతభిషం కర్కాటకం ఉ.గం. 10:01. ధనుస్సు రా.7:30. సగ్రహ చంద్రక్రాంతి దోషం.నిజ జ్యేష్ఠ మాసం16/06 విదియ మంగళ / బుధ పునర్వసు బోరింగ్ వృషభం తె.గం.5:26.17/06 తదియ బుధ పునర్వసు అన్న, సీమంతం, పుంసవనం కర్కాటకం ఉ.గం.9:01. పుష్యమీ గర్భాదానం రా.గం.9:25.18/06 చవితి గురు పుష్యమీ అన్న, పుంసవన, సీమంత, బోరింగ్ కర్కాటకం ఉ.గం.8:03.19/06 షష్ఠి శుక్ర మఘ వివాహం మకరం రా.గం.9:18.20/06 షష్ఠి శని మఘ వివాహం కర్కాటకం ఉ.గం.7:55.21/06 అష్టమి ఆది ఉత్తర మకరం వివాహాది రా.గం.8:45. అష్టమి ఆది/సోమ ఉత్తర వివాహం వృషభం తె.గం.4:02. విశేషం.22/06 అష్టమి సోమ ఉత్తర సమస్త శుభాలకు కర్కాటకం ఉ.గం.9:01. నవమి హస్త మకరం వివాహం గృప్ర రా.గం.9:01.23/06 దశమి మంగళ/బుధ చిత్త, గృప్ర, బోరింగ్ వృషభం తె.గం.4:02.24/06 దశమి బుధ చిత్త (అన్న, అక్షర) ఏకాదశీ స్వాతి, వివాహం, గర్భాదానం మకరం రా.గం.9:01. ఏకాదశీ బుధ / గురు స్వాతీ వివాహం మేషం రా.గం.2:23.25/06 ఏకాదశి గురు స్వాతీ అన్న, అక్షర, వివాహ, బోరింగ్ కర్కాటకం ఉ.గం.7:38.27/06 త్రయోదశీ శని అనురాధ వివాహం మకరం రా.గం.8:46.28/06 చతుర్దశీ ఆది/సోమ మూల వివాహం మేషం రా.గం.2:01 విశేషం.29/06 పౌర్ణమి సోమ మూల వివాహాది శుభాలకు కర్కాటకం మార్తాండ రహితం ఉ.గం.7:30. వివాహం మకరం రా.గం.8:38 విశేషం.01/07 విదియ బుధ ఉత్తరాషాఢ అన్న, అక్షర, సీమంత, పుంసవన, బోరింగ్, వ్యాపార, దేవతాప్రతిష్ఠ, నిశ్చితార్థం, వివాహం, కర్కాటకం ఉ.గం.7:15. మేషం రా.1:30.02/07 విదియ గురు ఉత్తరాషాఢ అన్న, అక్షర, అకాలవటు, ఉప, వివాహ, సీమంత, పుంసవన, బోరింగ్ వ్యాపారం, దేవతాప్రతిష్ట, నిశ్చితార్థం కర్కాటకం ఉ.7:11 (8రా). తదియ శ్రవణం వివాహం మకరం రా.గం.8:22. వివాహం మేషం రా.గం.1:52.03/07 తదియ శుక్ర శ్రవణం అన్న, అక్షర, బోరింగ్, వివాహ, సీమంత, పుంసవన, వ్యాపారం ప్రతిష్ఠ నిశ్చితార్థం కర్కాటకం ఉ.7:07 (8రా). చవితి ధనిష్ఠ మకరం వివాహం రా.8:18. శుక్ర/శని మేషం వివాహం రా.1:48.08/07 నవమి బుధ అశ్వినీ వివాహం మకరం మార్తాండ రహితం రా.8:01. బుధ/గురు మేషం రాత్రి 1:31.ఆషాఢ మాసంసీమంత, పుంసవన, వాస్తు తదితరాలకు అత్యవసర ముహూర్తాలు 15/07 పాడ్యమి బుధ పుష్యమీ కర్కాటకం ఉ.7:30 19/07 షష్ఠి ఆది ఉత్తర ధనుస్సు సా.6:00.20/07 సప్తమి సోమ హస్త ధనుస్సు సా.6:00.22/07 నవమి బుధ స్వాతి ధనుస్సు సా.5:30.24/07 ఏకాదశీ శుక్ర అనురాధ ధనుస్సు సా.5:30.29/07 పౌర్ణమి బుధ శ్రవణం ధనుస్సు సా.5:00.30/07 పాడ్యమి గురు శ్రవణం ధనుస్సు సా.5:00.31/07 విదియ శుక్ర ధనిష్ఠ ధనుస్సు సా.5:00.08/08 ఏకాదశీ శని మృగశిర ధనుస్సు సా.4:30.19/07 షష్ఠి ఆది ఉత్తర తుల ప.11:55.24/07 ఏకాదశీ శుక్ర అనురాధ తుల ప.11:50.30/07 పాడ్యమి గురు శ్రవణం తుల ప.11:50.31/07 విదియ శుక్ర ధనిçష్ఠ తుల ప.11:50.08/08 దశమి శని రోహిణి తుల ప.11:50.శ్రావణ మాసం15/08 తదియ శని ఉత్తర నిశ్చితార్థం, అన్న, అక్షర, వ్యాపార, సీమంత, పుంసవన, వివాహ, శంకు, బోరింగ్లకు తుల ప.గం.12:00 (12చం/శు)16/08 చవితి ఆది హస్త, అన్న, వ్యాపార, బోరింగ్, శంకు, సీమంత, పుంసవన, వివాహములకు తుల ప.గం.11:55. హస్త ఆది/సోమ వివాహం వృషభం రా.12:32.20/08 అష్టమి గురు అనురాధ తుల ప.గం.11:50. నవమి గురు/శుక్ర అనురాధ వివాహం వృషభం రా.గం.12:30 (7చం). వివాహ శంకు కర్కాటకం తె.గం.4:01.21/08 నవమి శుక్ర అనురాధ వివాహం, అన్న, అక్షర, బోరింగ్, వ్యాపారం, సీమంత, పుంసవన, నిశ్చితార్థం తుల ప.గం.11:34.22/08 ఏకాదశీ శని/ఆది మూల వివాహం శంకు కర్కాటకం తె.గం.4:30.26/08 త్రయోదశీ బుధ శ్రవణం అన్న అక్షరాది శుభాలకు తుల ప.గం.10:01. చతుర్దశి శ్రవణం వివాహం వృషభం రా.గం.11:50. వివాహం, శంకు కర్కాటకం రా.గం.4:16.27/08 పౌర్ణమి గురు ధనిష్ఠ సమస్త శుభాలకు తుల ప.గం.11:01. గృప్ర, వివాహం వృషభం రా.గం.11:50 28/08 పాడ్యమి శుక్ర శతభిషం సీమంతం వేడుకలకు నిశ్చితార్థములకు మకరం ప.గం.4:33. గృప్ర, వివాహం, వృషభం రా.గం.11:42. శుక్ర/శని వివాహ, శంకు, వ్యాపార, బోరింగ్లకు కర్కాటక తె.గం.3:20.30/08 తదియ ఆది ఉత్తరాభాద్ర తుల ఉ.గం.10:54 . వివాహం గృప్ర వృషభం రా.గం.11:34. శంకు, వివాహం, బోరింగ్ కర్కాటకం తె.గం.3:18. తె.గం.4:01. శుభాంశ.31/08 చవితి సోమ రేవతి తుల ఉ.గం.10:56. వృషభం రా.గం.11:30.01/09 పంచమి మంగళ/బుధ అశ్విని కర్కాటకం తె.గం.4:05. అద్భుతమైన ముహూర్తం.03/09 అష్టమి గురు/శుక్ర రోహిణి కర్కాటకం తె.గం.3:50.04/09 అష్టమి శుక్ర రోహిణి తుల ప.గం.10:39. నవమి శుక్ర/శని మృగశిర శంకు, బోరింగ్ తె.గం.3:50 కర్కాటకం.05/09 నవమి శని మృగశిర తుల ప.గం.10:35.06/09 ఏకాదశీ ఆది పున వృషభం రా.గం.11:11. ఆది/సోమ కర్కాటకం తె.గం.3:45 శుభాంశ.07/09 ఏకాదశీ సోమ పున తుల ప.గం.10:25.భాద్రపద మాసంఅన్నప్రాశన, జాతకర్మ, సీమంత, పుంసవన, నామకరణాదులకు ముహూర్తములు12/09 విదియ శని ఉత్తర తుల ప.గం.10:01.13/09 తదియ ఆది హస్త తుల ప.గం.10:03.14/09 చవితి సోమ చిత్త తుల ప.గం.9:50.16/09 షష్ఠి బుధ అనురాధ మేషం రా.గం.8:01.17/09 షష్ఠి గురు అనురాధ తుల ఉ.గం.9:10.21/09 దశమి సోమ ఉత్తరాషాఢ తుల ఉ.గం.9:00. ఏకాదశీ మేషం రా.8:81.24/09 త్రయోదశీ గురు ధనిష్ఠ తుల ఉ.గం.9:10. శతభిషం మేషం రా.గం.7:50.25/09 చతుర్దశీ శుక్ర శతభిషం తుల ఉ.గం.9:20.26/09 పౌర్ణిమ శని ఉ.భాద్ర మేషం రా.గం.7:55. ఆశ్వీయుజ మాసం11/10 శుద్ధ పాడ్యమి ఆది చిత్త నవరాత్రి కలశ స్థాపనలకు తుల ఉ.గం.6:40–7:00. వ్యాపారాదులకు నిశ్చితార్థం మేషం రా.7:29.12/10 విదియ సోమ స్వాతి వ్యాపారం అన్న, అక్షర, నిశ్చితార్థం తుల ఉ.గం.8:01. నిశ్చితార్థం సీమంత వేడుకలు మేషం రా.గం.7:00.14/10 చవితి బుధ అనురాధ అన్న, అక్షర, సీమంత, పుంసవన, నిశ్చితార్థం వృశ్చికం ఉ.గం.8:51. సీమంతాదులకు మేషం రా.గం.7:00.మూలా నక్షత్రం అక్షరాభ్యాస నక్షత్రాలలో లేదు తెలుసుకోండి.17/10 సప్తమి శని మూల త్రిరాత్ర దీక్ష కలశస్థాపనలకు వృశ్చికం ఉ.గం.8:30.18/10 దుర్గాష్టమీ సందర్భంగా వాహనపూజ, యంత్రపూజలకు ఉ.గం.9:30.19/10 మహానవమి సందర్భంగా వాహనపూజలు యంత్ర పూజలకు ఉ.గం.9:30.20/10 విజయదశమి సందర్భంగా వ్యాపారులకు పూజ సమయం ఉ.9:50సా.6:0021/10 దశమీ బుధ ధనిష్ఠ అన్న, సీమంత, పుంసవనలకు వృశ్చికం 8:35. ఏకాదశీ శతభిషం మేషం సా.6:30.22/10 ఏకాదశీ గురు శతభిషం అన్న సీమంత పుంసవన వృశ్చికం ఉ.గం.8:00.24/10 చతుర్దశీ శని ఉత్తరాభాద్ర మేషం రా.గం.6:50.25/10 పౌర్ణమి ఆది రేవతి మేషం రా.గం.6:50.28/10 తదియ బుధ రోహిణి వృషభం రా.గం.7:45.29/10 చవితి గురు మృగశిర వృషభం రా.గం.7:41 (వివాహ, గృప్ర, గర్భాదానం)30/10 పంచమి శుక్ర మృగశిర వృశ్చికం ఉ.7:40.01/11 సప్తమి ఆది పునర్వసు అన్న, అక్షర, శంకు, బోరింగ్, సీమంత, పుంసవన వృశ్చికం ఉ.గం.7:30.02/11 అష్టమి సోమ పుష్యమి వృశ్చికం ఉ.గం.7:30.05/11 ఏకాదశీ గురు ఉత్తర వృశ్చికం ఉ.7:30.07/11 ధ¯Œ తేరస్ పూజలకు మిథునం రా.గం.8:309:00.08/11 దీపావళి పూజలకు మిథునం రా.గం.8:35.కార్తీక మాసం11/11 విదియ బుధ అనురాధ అన్న, అక్షర, వైశ్యోపనయన, నిశ్చితార్థం, సీమంత, పుంసవన, వివాహం, బోరింగ్, శంకు, గృప్ర, వ్యాపారం వృశ్చికం ఉ.గం.7:08.12/11 చవితి గురు మూల వివాహం మిథునం రా.గం.9:31.13/11 చవితి శుక్ర మూల అన్న, అక్షర, వైశ్యోప నయన, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, వివాహం, బోరింగ్, ధనుర్లగ్న ఉ.గం.10:13.14/11 పంచమీ శని ఉత్తరాషాఢ వివాహం, నిశ్చితార్థం, వేడుక సీమంత, గృప్ర వషభం రా.గం.6:50. షష్ఠి వివాహం కర్కాటకం రా.గం.10:30. 15/11 షష్ఠి ఆది ఉత్తరాషాఢ అన్న, అక్షర, వైశ్యోప నయన, వివాహ, దేవ ప్రతిష్ఠ, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, వ్యాపార, బోరింగ్, శంకు, గృప్ర, వృశ్చికం ఉ.గం.6:52. నిశ్చితార్థం, వివాహం, గృప్ర వృషభం రా.గం.6:36. మిథునం రా.గం.9:22.16/11 సప్తమి సోమ శ్రవణం అన్న, అక్షర, వైశ్యోప నయనం, శంకు, బోరింగ్, వ్యాపార, సీమంత, ప్రతిష్ఠ వ్యాపారం వృశ్చికం ఉ.గం.6:45. వేడుక సీమంతం, వివాహం, వృషభం రా.గం.6:29. మిథునం రా.గం.9:15.18/11 నవమి బుధ శతభిషం వివాహం, గృప్ర, గర్భాదాన, నిశ్చితార్థం మిధునం రా.గం.7:55. వివాహం కర్కాటకం రా.గం.10:02.20/11 ఏకాదశీ శుక్ర, ఉత్తరాభాద్ర అన్న, అక్షర, సీమంత, పుంసవన, వైశ్యోపనయన, వివాహ, శంకు, గృప్ర, ప్రతిష్ఠ, వ్యాపారం ధనుస్సు ఉ.గం.9:39. ద్వాదశీ శుక్ర/శని రేవతీ శంకు వివాహం తుల తె.గం.5:30.21/11 ద్వాదశీ శని రేవతీ వివాహం గృప్ర మిథునం రా.గం.8:57. వివాహం కర్కాటకం రా.గం.9:47. త్రయోదశీ శని/ఆది శంకు వివాహం తుల తె.గం.5:30.22/11 త్రయోదశీ ఆది అశ్వినీ అన్న, అక్షర, వైశ్యోప నయన, సీమంత, పుంసవన, వివాహం, శంకు, బోరింగ్, వ్యాపారం, ధనుస్సు ఉ.గం.9:32. వివాహం, గృప్ర, గర్భాదానం మిథునం రా.గం.8:50.24/11 బ.పాడ్యమి మంగళ/బుధ రోహిణి వివాహం, శంకు, బోరింగ్ తుల తె.గం.5:16.25/11 పాడ్యమి బుధ రోహిణి అన్న, వివాహ, శంకు, గృప్ర, ప్రతిష్ఠ, వ్యాపార, సీమంత, పుంసవన, ధనుః ఉ.గం.9:23. వివాహ, సీమంత వేడుక, గృప్ర, మిథునం రా.గం.8:30. వివాహం కర్కాటకం రా.గం.9:31.26/11 విదియ గురు మృగశిర అన్న, అక్షర, వైశ్యోప నయన, ప్రతిష్ఠ, వివాహం, గృప్ర, మిథునం రా.గం.8:30. కర్కాటకం రా.గం.9:27.28/11 పంచమి శని/ఆది పుష్యమి శంకుస్థాపన తుల తె.గం.4:59.29/11 పంచమీ ఆది పుష్యమీ అన్న, అక్షర, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం, వైశ్యోపనయన, దేవప్రతిష్ఠ ధనుః ప.గం.9:0402/12 దశమి బుధ/గురు ఉత్తర శంకు/వివాహ, బోరింగ్, తుల తె.గం.4:44.03/12 దశమి గురు ఉత్తర అన్న, అక్షర, వైశ్యోపనయన, శంకు, గృప్ర, బోరింగ్, సీమంత, పుంసవన, నిశ్చితార్థం, వ్యాపార, దేవతాప్రతిష్ఠ, ధనుః ఉ.గం.8:53. హస్త వివాహం గర్భాదానం మిథునం రా.గం.8:01.04/12 ఏకాదశీ శుక్రవారం హస్త అన్న, అక్షర, వైశ్యోపనయనం, శంకు, ప్రతిష్ఠ, బోరింగ్, వ్యాపార, వివాహం, ధనుస్సు ఉ.గం.7:50. చిత్త గృప్ర ధనుస్సు రా.గం.9:57.మార్గశిర మాసం10/12 విదియ గురు మూల ధనుస్సు ఉ.గం.8:24. వివాహం మిథునం రా.గం.7:35.11/12 తదియ శుక్ర/శని ఉత్తరాషాఢ వివాహం బోరింగ్ తుల తె.గం.4:08.12/12 చవితి శని ఉత్తరాషాఢ వివాహం నిశ్చితార్థం గృప్ర మిథున రా.గం.7:26. శని/ఆది వివాహం శంకు తుల తె.గం.3:50.13/12 చవితి ఆది శ్రవణం ధనుస్సు ఉ.గం.7:10. పంచమి ఆది శ్రవణం వివాహం నిశ్చితార్థం మిథునం రా.గం.7:28. ఆది/సోమ వివాహం శంకు తుల తె.గం.3:50.14/12 పంచమి సోమ ధనిష్ఠ వివాహ, అన్న, అక్షర, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం, సీమంత, పుంసవన, నిశ్చితార్థం, ప్రతిష్ఠ, ధనుస్సు ఉ.గం.8:10. షష్ఠి వివాహం గృప్ర నిశ్చితార్థం మిథునం రా.గం.7:24.16/12 సప్తమి బుధ శతభిషం వివాహం, గృప్ర, శంకు, నిశ్చితార్థం, బోరింగ్, వ్యాపారం, అన్న అక్షర, సీమంత, పుంసవన, ధనుస్సు ఉ.గం.8:02.17/12 నవమి గురు/శుక్ర ఉత్తరాభాద్ర వివాహం తుల తె.గం.3:45 (6చం)18/12 దశమి శుక్ర/శని రేవతి వివాహం వృశ్చికం తె.గం.4:42.19/12 ఏకాదశీ శని/ఆది అశ్విని వివాహం వృశ్చికం తె.గం.4:38.22/12 చతుర్దశీ మంగళ/బుధ రోహిణి వివాహం గృప్ర వృశ్చికం తె.గం.4:26.25/12 తదియ శుక్ర/శని పుష్యమి గృప్ర వృశ్చికం తె.గం.4:11.27/12 పంచమి ఆది/సోమ మఘ వివాహం వృశ్చికం తె.గం.4:02.30/12 అష్టమి బుధ/గురు హస్త సమస్త శుభాలకు వృశ్చికం తె.గం.3:56.31/12 నవమి గురు/శుక్ర చిత్త సమస్త శుభాలకు వృశ్చికం తె.గం.3:53.01/01 దశమి శుక్ర/శని స్వాతి సమస్త శుభాలకు వృశ్చికం తె.గం.3:49పుష్య మాసంపగటికాల ముహూర్తములు తక్కువ ఉన్నాయి. విప్రాజ్ఞతో శిశువులకు అన్నప్రాశనలు పూర్తి చేసుకోండి. మేషలగ్నం మాత్రమే సీమంతాదులకు గ్రాహ్యం.09/01 విదియ శని శ్రవణం మేషం ప.గం.12:30.10/01 తదియ ఆది శ్రవణం మేషం ప.గం.12:30.11/01 చవితి సోమ ధనిష్ఠ మేషం ప.గం.12:20.14/01 సప్తమి గురు ఉత్తరాభాద్ర మేషం ప.గం.12:15.15/01 అష్టమి శుక్ర రేవతి మేషం ప.గం.12:15.16/01 నవమి శని అశ్విని మేషం ప.గం.12:05.22/01 పౌర్ణమి శుక్ర పుష్యమి మేషం ప.గం.12:00.27/01 షష్ఠి బుధ హస్త మేషం ప.గం.11:15.28/01 సప్తమి గురు చిత్త మేషం ప.గం.11:30.31/01 దశమి ఆది అనురాధ మేషం ప.గం.11:00.మాఘ మాసం08/02 విదియ సోమ శతభిషం అన్న, అక్షర (ఉప10ర) దేవతా ప్రతిష్ఠ, వ్యాపారం, శంకు, బోరింగ్, సీమంత, పుంసవన మేషం ప.గం.11:28. తుల రా.గం.11:11.ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం బహుదోషం09/02 చవితి మంగళ / బుధ ఉత్తరాభాద్ర ధనుః తె.గం.4:30.10/02 చవితి బుధ ఉత్తరాభాద్ర మేషం ప.గం.11:20. తుల రా.గం.11:03. పంచమి బుధ/గురు ఉత్తరాభాద్ర వృశ్చికం రా.గం.1:08.11/02 పంచమి గురు రేవతి అన్న, అక్షర, అకాల వటు, ఉప, సీమంత, పుంసవన, నిశ్చితార్థం మేషం ప.గం.11:13. వషభం ప.గం.12:01. వివాహాదులకు తుల రాగం.12:04 నిశీధి. షష్ఠి గురు/శుక్ర రేవతీ వివాహం, గృప్ర వృశ్చికం రా.గం.1:01. అశ్విని వివాహం, బోరింగ్, శంకు ధనుస్సు తె.గం.3:13.12/02 షష్ఠి శుక్ర అశ్విని శంకు, బోరింగ్, నిశ్చితార్థం వివాహం (ఉప10ర) అన్న, అక్షర, సీమంత, పుంసవన ప్రతిష్ఠలకు మేషం ప.గం.11:13.14/02 నవమి ఆది/సోమ రోహిణి వివాహాదులకు వృశ్చికం రా.గం.2:01.15/02 నవమి సోమ రోహిణి, అన్న, అక్షర, ఉప, వివాహం, నిశ్చితార్థం, దేవతా ప్రతిష్ట, వ్యాపారం, శంకు, గృప్ర, అన్న, అక్షర మేషం ప.గం.11:01. వివాహం తుల రా.గం.11:30.17/02 ఏకాదశీ బుధ ఆర్ద్ర మేషం ప.గం.10:50. ద్వాదశీ బుధ పునర్వసు గర్భాదానం తుల రా.గం.11:43.18/02 ద్వాదశీ గురు పునర్వసు అన్న, సీమంత పుంసవన, శంకు బోరింగ్లకు వృషభం ప.గం.11:45. త్రయోదశీ పుష్యమి గృప్ర, గర్భాదానం వృశ్చికం రా.గం.12:33.19/02 చతుర్దశీ పుష్యమి శుక్ర అన్న, శంకు, బోరింగ్, సీమంత, పుంసవన, వృషభం ప.గం.11:46.20/02 పౌర్ణమి శని మఘ వివాహం తుల రా.గం.11:29.21/02 పౌర్ణమి శని మఘ వివాహం వృషభం ప.గం.12:01.22/02 విదియ సోమ ఉత్తర వివాహం తుల రా.గం.11:20. పూర్ణచంద్రుడు + సోమవారం దోషం కాదు.25/02 పంచమి గురు చిత్త అన్న, అక్షర, శంకు, గృప్ర, నిశ్చితార్థం, సీమంత, ఉప, పుంసవన ప్రతిష్ఠ, వ్యాపారం వృషభం ఉ.గం.11:52. స్వాతీ వివాహం తుల రా.గం.11:01. ధనుస్సు రా.గం.3:21. వృశ్చికం రా.గం.12:10.26/02 షష్ఠి శుక్ర స్వాతి వషభం అగ్నిపంచకం ప.గం.11:44.27/02 సప్తమి శని అనురాధ తుల అగ్నిపంచకం రా.గం.11:04. వివాహం, గృప్ర వృశ్చికం రా.గం.12:10. అష్టమి శని/ఆది అనురాధ వివాహ, గృప్ర, శంకు, ధనుః రా.తె.గం.3:13.ఫాల్గుణ మాసం 10/03 విదియ బుధ రేవతి నిశ్చితార్థం వృషభం ప.11:01. తదియ బుధ రేవతి వివాహం గర్భాదానం తుల రా.గం.10:19 వివాహ గృప్ర వృశ్చికం రా.గం.11:16.11/03 తదియ గురు రేవతి అన్న, అక్షర, వివాహ, శంకు, బోరింగ్, వ్యాపార, సీమంత, పుంసవన నిశ్చితార్థ, ప్రతిష్ఠ మేషం ఉ.గం.9:21. అశ్విని వృషభం ఉ.గం.11:30. చవితి గురు అశ్విని వివాహం తుల రా.గం.10:15. వృశ్చికం రా.గం.11:12.12/03 చవితి శుక్ర అశ్విని అన్న, వివాహ, శంకు, బోరింగ్, సీమంతం, పుంసవనం, నిశ్చితార్థం, ప్రతిష్ఠలకు వృషభం ఉ.గం.10:20 మార్తాండ రహితం.14/03 షష్టి ఆది రోహిణి వివాహ, గృప్ర, నిశ్చితార్థం, సీమంత, పుంసవన (ఉపనయన 10ర) అన్న, అక్షర, దేవతా ప్రతిష్ఠ, బోరింగ్, శంకు, వృషభం ఉ.గం.10:44. సప్తమి ఆది రోహిణి వివాహ గృప్ర రా.గం.12:12.15/03 సప్తమి సోమ మృగశిర సమస్త శుభాలకు, వాస్తు కర్మలకు ప్రతిష్ఠలకు మేషం ఉ.గం.09:01.17/03 దశమి బుధ పునర్వసు అన్న, అక్షర, అత్యవసర ఉప సీమంతం పుంసవనం, శంకు, బోరింగ్లకు మేషం ఉ.గం.8:49 వృషభం ఉ.గం.10:30.18/03 ఏకాదశీ గురు పుష్యమి అన్న, అక్షర, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, ప్రతిష్ట, శంకు, బోరింగ్, వ్యాపార, మేషం ఉ.గం.8:45. గృప్ర, గర్భాదానం వృశ్చికం రా.గం.10:40 (సగ్రహచంద్ర)20/03 త్రయోదశీ శని మఘ వివాహం వృషభం ఉ.గం.10:15. చతుర్దశీ మఘ వివాహం వృశ్చికం రా.గం.10:35.21/03 పౌర్ణమి ఆది ఉత్తర వివాహం గృప్ర వృశ్చికం రా.గం.10:30.22/03 పౌర్ణమి సోమ ఉత్తర అన్న, వివాహం, సీమంత, పుంసవన, నిశ్చితార్థ, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం మేషం ఉ.గం.8:36. వృషభం ఉ.గం.10:06. బ.పాడ్యమి సోమ హస్త తుల రా.గం.9:21. వృశ్చికం రా.గం.10:24.24/03 విదియ బుధ చిత్త అన్న, అక్షర, ఉప, నిశ్చితార్థ, సీమంత, పుంసవన, శంకు, గృప్ర, బోరింగ్, వ్యాపారం, వషభం ఉ.గం.9:59. తదియ బుధ స్వాతి వివాహ, వృశ్చికం రా.గం.10:16.25/03 తదియ గురు స్వాతి వివాహాది మేషం ఉ.గం.8:28. వృషభం ఉ.గం.9:30.26/03 పంచమి శుక్ర అనురాధ వృశ్చికం రా.గం.10:30.27/03 పంచమి శని అనురాధ వృషభం ఉ.గం.9:51. షష్ఠి శని వృశ్చికం రా.గం.10:30.29/03 సప్తమి సోమ మూల వృషభం ఉ.గం.9:44. తుల రా.గం.8:56.31/03 నవమి బుధ ఉత్తరాషాఢ çవృషభం ఉ.గం.9:40. దశమి వృశ్చికం రా.గం.10:01.01/04 దశమి గురు శ్రవణం వృషభం ఉ.గం.9:28. వృశ్చికం రా.గం.9:45. -పంచాంగ కర్తశ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులుఫోన్లు: 08676 2414336 /98485 20336 -
ఉగాదిన మూసీ పనులకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్ /లంగర్‌హౌస్: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తెలుగు సంవత్సరాది ఉగాదికి మూసీనది అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్) అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలిదశలో హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అలాగే ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 20 కిలోమీటర్ల మేర సుందరీకరణ చేయనున్న సంగతి తెలిసిందే. తొలి దశకు రూ.5 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేయగా.. ఇందులో రూ.4,100 కోట్ల రుణాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అందించనుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోనుంది. బుద్వేల్ టు కోస్గి గాంధీ సరోవర్తోపాటు బుద్వేల్–కోస్గి గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. తెలంగాణలో రాబోయే 81 కి.మీ., 4 లేన్ల (భవిష్యత్‌లో 6–లేన్లు) ఈ రేడియల్ రోడ్డు.. ఔటర్ ఎగ్జిట్ 17 బుద్వేల్ నుంచి కోస్గిని కలుపుతుంది. ఇది ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్), ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్)లను అనుసంధానిస్తుంది. ఈ రహదారి ప్రధానంగా చందనవెల్లి, పేరారం వంటి పారిశ్రామిక ప్రాంతాల గుండా వెళుతుంది. ఇక్కడే గాంధీ సరోవర్ గాంధీ సరోవర్ ప్రాజెక్టు లంగర్‌హౌస్ బాççపూఘాట్ వద్ద నిర్మించనున్నారు. హైదర్షాకోట్లోని ఆర్మీ పాఠశాల మీదుగా టిప్పుఖాన్ బ్రిడ్జి వైపు వెళ్లే రహదారిని ఆర్మీ పాఠశాల వద్ద మూసివేసి నేరుగా తీసుకెళ్లి నూతన బ్రిడ్జి నిర్మించి నార్సింగి రోడ్డుకు కలపనున్నారు. ఇక్కడి నుంచి మొదలై లంగర్‌హౌస్‌లోని బాçపూఘాట్ దగ్గరలో ఉన్న నాలా వరకు గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర రక్షణ శాఖకు చెందిన 52 ఎకరాల స్థలం ఉంది.ఆ భూమిని బదిలీ చేయాలని పలుమార్లు కేంద్రాన్ని కోరగా.. 38.09 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించింది. ఈ మిలటరీ ప్రాంతంతోపాటు ప్రభుత్వ భూమిలో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామన్న త్రివేణి సంగమం వద్ద చెట్లు తొలగించి, చదును చేస్తున్నారు. గురువారం టిప్పుఖాన్ బ్రిడ్జి వద్ద నిర్మించనున్న ప్రాజెక్టు ప్రారంభ ప్రాంతం, నూతన అధునాతన స్ప్రింగ్ బ్రిడ్జి నిర్మించున్న ప్రాంతాల్లో జేసీబీలతో చెట్లను తొలగిస్తూ అధికారులు పనులు ప్రారంభించారు. -
రాఖీ నుంచి దీపావళి వరకు.. పండగలే సినిమా టైటిల్స్ అయితే..!
అన్నయ్య.. అన్నావంటే ఎదురవనా.. ఇది పాట మాత్రమే కాదు నిజం కూడా! అమ్మానాన్నకు చెప్పుకోలేని విషయాలు కూడా ఆడవాళ్లు.. అన్నకు చెప్పుకుంటారు. ఏ కష్టం వచ్చినా అన్న సలహా తీసుకోవాల్సిందే! ఇబ్బందుల్లో ఉంటే అన్నకు ఫోన్ రావాల్సిందే! అతడు క్షణంలో చెల్లెలి ముందు ప్రత్యక్షం కావాల్సిందే! ఈ అనుబంధాన్ని దేనితోనూ వెలకట్టలేము. ఈ అన్నాచెల్లెళ్ల ప్రేమను లోతుగా చూపిస్తూ కంటతడి పెట్టించే సినిమాలు వెండితెరపై ఎన్నో వచ్చాయి. అక్కడిదాకా ఎందుకు రక్షా బంధన్ పండగపై రాఖీ అనే సినిమా కూడా ఉంది. కృష్ణవంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. రాఖీయే కాదు, ఇలా ఎన్నో పండగలు సినిమా టైటిల్స్‌గా ఆవిష్కృతమై తెరపై అద్భుతాలు సృష్టించాయి. అవేంటో చూసేద్దాం..సంక్రాంతివెంకటేశ్, శ్రీకాంత్, శివబాలాజీ, స్నేహ, ఆర్తి అగర్వాల్, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. ముప్పలనేని శివ డైరెక్ట్ చేశాడు. 2005లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.మహాశివరాత్రిరాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మహాశివరాత్రి. రేణుకశర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేసింది.దసరానాని హీరోగా వచ్చిన దసరా సినిమా ఏ రేంజ్లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీ 2023లో విడుదలైంది.హోలీఉదయ్కిరణ్ హీరోగా నటించిన హోలీ సినిమాకు ఎస్వీఎన్ వరప్రసాద్ దర్శకత్వం వహించాడు. 2002లో వచ్చిన ఈ మూవీ జనాల్ని బాగానే ఆకట్టుకుంది.ఉగాదిఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా నటించడంతోపాటు దర్శకత్వం వహించిన మూవీ ఉగాది. లైలా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం 1997లో రిలీజైంది.నందమూరి కల్యాణ్‌రామ్ విజయదశమి, సునీల్ కృష్ణాష్టమి, కృష్ణ భోగిమంటలు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురుపౌర్ణమి.. ఇంకా దీపావళిపై రెండు సినిమాలు.. ఇలా బోలెడన్ని వచ్చాయి.చదవండి: నిర్మాతలు ఎటూ తేల్చకపోతే చిరంజీవి ఆ పని చేస్తానన్నారు -
లండన్‌లో ఘనంగా తాల్ 20వ వార్షికోత్సవం, ఉగాది సంబరాలు
తెలుగు అసోసీయేషన్ ఆఫ్ లండన్(తాల్(TAL)) 20వ వార్షికోత్సవం తోపాటు, ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఏప్రిలల 26న ఈస్ట్ లండన్‌లోని లేక్వ్యూమార్కీలో ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా హాజరయ్యారు. దీంతో ఇది తాల్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నిలిచింది. ఈ వేడుకలో ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల తన బృందంతో లైవ్ కాన్సర్ట్ ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఈవెంట్ కన్వీనర్ రవీందర్ రెడ్డి గుమ్మకొండ, కల్చరల్ ట్రస్టీ శ్రీదేవి ఆలెద్దుల ప్రత్యేక అథిధులుగా పాల్గొన్నారు. ముందుగా ఫల్గాం విషాద సంఘటనలో అసువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ 2 నిముషాల మౌనం పాటించి ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాల్ సమైక్యతను, మానవతా విలువలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాలను నిర్వహించింది. తాల్ 20 సంవత్సరాల మైలురాయిని చేరుకున్న సందర్భంగా ఛైర్మన్ రవి సబ్బా ఈ తాల్ విజయ పరంపరకు తోడ్పడిన గత చైర్మన్లు, ట్రస్టీలు, ఉగాది కన్వీనర్లందర్నీ ఘనంగా సత్కరించారు. తాల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాములు దాసోజుని తాల్ కమ్యూనిటీ లీడర్షిప్ అవార్డుతో సత్కరించారు. తాల్ వార్షిక పత్రిక "మా తెలుగు 2025"ని కూడా ఈ వేడుకలో ఆవిష్కరించారు. అందుకు కృషి చేసిన సూర్య కందుకూరి, ప్రధాన సంపాదకుడు రమేష్ కలవల తదితర సంపాదక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో తాల్ చరిత్రను ప్రతిబింబించే ఫోటో గ్యాలరీ ప్రదర్శన ద్వారా గత రెండు దశాబ్దాల విశేషాలను చిత్ర మాలికా రూపంలో ప్రదర్శించారు. ఇక ఈ వేడుకలోనే స్పోర్ట్స్ ఇన్ ఛార్జ్ సత్య పెద్దిరెడ్డి తాల్ ప్రీమియర్ లీగ్ (TPL) T20 క్రికెట్ సీజన్‌ను కూడా ప్రారంభించారు. ముఖ్యఅతిథి రామ్ మిరియాల2025 ఛాంపియన్ ట్రోఫీని ఆవిష్కరించారు.(చదవండి: టంపాలోనాట్స్ సంబరాల వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్లు) -
జర్మనీలో ఉగాది, శ్రీరామనవమి సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
స్కాట్లాండ్లో ఘనంగా ఉగాది సంబరాలు
స్కాట్లాండ్లోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ (TAS) ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబరాలు నిర్వహించారు. ఇవి తెలుగు సంస్కృతిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచాయి. ఈ ఉగాది సంబరాలు స్కాట్లాండ్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న మిడ్లాథియన్‌లోని డాల్కీత్ స్కూల్ కమ్యూనిటీ వద్ద నిర్వహించారు.శ్రీ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సంఘం ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కాట్లాండ్లో ఉన్న వందలాది తెలుగు కుటుంబాలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆకర్షణగా నిలిచారు. వందకి పైగా కళాకారులు తమ ప్రతిభ, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుక ప్రస్తుత, మాజీ కమిటీ సభ్యులతో జ్యోతి ప్రజ్వలన మొదలవ్వగా, అనంతరం “మా తెలుగు తల్లికి” గేయంతో సాంస్కృతిక కార్యక్రమంతో ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా భారత కాన్సులేట్ అధికారి ఆజాద్ సింగ్, లోథియన్ ప్రాంతానికి చెందిన MSP ఫోయిల్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని, ఇతర సంఘాల ప్రతినిధులను చైర్మన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, హానరరీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి తదితరులు ఘనంగా సత్కరించారు.. సాంస్కృతిక కార్యదర్శి పండరి జైన్ కుమార్ పొలిశెట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, కళాకారులు, ప్రేక్షకులు, స్పాన్సర్లు, వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య ఆకర్షణగా “మనబడి” పిల్లలు ప్రదర్శించిన “పరమానందయ్య శిష్యుల కథ” నాటకం, భాషా నేర్పరితో పాటు సాంస్కృతిక విలువలను చక్కగా చాటింది. ఈ ఉగాది సంబరాలు 2025 తెలుగు వారసత్వాన్ని ముందుకెళ్లలా, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించడం తోపాటు.. TAS సంఘం ఐక్యత, సేవా ధోరణిని ప్రతిబింభించేలా నిలిచాయి.(చదవండి: న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు) -
న్యూజిలాండ్‌లో ఘనంగా ఉగాది సంబరాలు
ఆక్లాండ్ నగరంలో తెలంగాణా అసోసియేషన్ అఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరాది విశ్వవాసు సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలను నిర్వహించుకున్నారుఈ కార్యక్రమం లో తెలుగుతనం, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా పంచాంగ శ్రవణంతో రాశి ఫలితాలను స్థితిగతులను విని ఆనందించారు. ఆ తర్వాత చిన్నారులు పెద్దలు వివిధ తెలుగు సాంప్రదాయ పాటలు, నృత్యాలతో అలరించడమే కాకుండా సాంప్రదాయ పిండి వంటలతో సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన టే అటటు డెంటల్ క్లినిక్ మోనిక శ్రీకాంత్ తోపాటు సామజికసేవాలో ముందున్న తెలుగు ప్రతినిధులను ఉగాది పురస్కారాలతో గౌరవంగా సన్మానించుకోవడం తోపాటు చిన్నారులకు నృత్యకారులకు బహుమతులని అందజేయడం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ అద్యేక్షతన జరిగిన ఈ వేడుకలో ప్రముఖ వ్యాపారవేత్త శివ కిలారి, రవి సంకర్ అల్ల, సత్యనారాయణ తట్టల, అసోసియేషన్ మాజీ అధ్యక్షలు పట్లోళ్ల నరేందర్ రెడ్డి, మేకల ప్రసన్న కుమార్,శైలందర్ రెడ్డి, విశ్వనాధు బాల, విజేత యాచమనేని, మధు ఎర్ర, శైలజ బాలకుల్ల, లింగం గుండెల్లి, శశికాంత్ గున్నాల, కావ్య, వర్ష పట్లోళ్ల, మేకల స్వాతి,కిరణ్మయి, విశ్వనాథ్ అవిటి, సలీం, ప్రమోద్, విజయ్ శ్రీరామ్, చంద్రకిరణ్,రమేష్ రామిండ్ల, మనోహర్ కన్నం, హరీష్, రమేష్ ఆడెపు, పవన్, అనిల్ మెరుగు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.(చదవండి: హాంగ్‌కాంగ్‌లో ఘనంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు) -
గ్రాండ్‌గా మంచు ఫ్యామిలీ ఉగాది వేడుకలు (ఫోటోలు)
-
ఉగాది లుక్.. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ఉగాది వేడుకల్లో రామ్ చరణ్ ముద్దుల కూతురు క్లీంకార (ఫొటోలు)
-
విజయవాడ : ముద్దులొలికిన సంప్రదాయం..క్యాట్‌వాక్‌లు (ఫొటోలు)
-
తెలుగు పండగ.. తెంగ్లిష్ శుభాకాంక్షలు
ఒకసారి కర్ణాటక లోని కూర్గ్ ట్రెక్ కి వెళ్ళాను.. సాహసికుల పరిచయాలు అయ్యాయి.. ఇంతలో ఒక కన్నడ మిత్రుడు నా దగ్గరికి వచ్చి.. "మీ తెలుగు రాష్ట్రాల నుంచి నువ్వే వచ్చావా?... అంటూ వచ్చీరాని తెలుగులోనే పలకరించాడు... మరో ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా వచ్చారని.. వారిని చూపించాను... ఆ ఇద్దరిని చూసి.. "నువ్వు చెప్పింది నిజమేనా?.. తెలుగు వాళ్లేనా?" అన్నాడు."మరేం లేదు.. వచ్చినప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఇంగ్లిష్ లేదా హిందీ లో సంభాషిస్తుంటేనూ... అంటూ నసిగాడు..ఆయన చెప్పింది నిజమే.. అదేదో 30 రోజుల్లో ఆంగ్లం, హిందీ నేర్చుకోవడం ఎలాగో సాధన చేస్తున్నట్టు.. ఇద్దరూ కూడబలుక్కుని తెలుగు తప్ప ఆంగ్లం, హిందీలో మాట్లాడుతుండటం గమనించాను.."మా తెలుగు వాళ్ళం... ఏ ఇద్దరం కలుసుకున్నా.. తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో మాట్లాడుకుంటామ్... అంతే".. అని కన్నడ మిత్రుడికి సమాధానం ఇచ్చి వెళ్ళిపోయాను. నా మాటల్లో వెటకారం అర్థమైన కన్నడ మిత్రుడు నవ్వుకున్నాడు..ఈ జ్ఞాపకం ఇప్పుడు ఎందుకంటే.. ఈ రోజు ఉదయం నుంచి "హ్యాపీ ఉగాది".. అంటూ శుభాకాంక్షల వెల్లువ...పైగా "ఎంజాయ్ ఉగాది... హౌ డూ యూ సెలబ్రేట్ ఫెస్టివల్ బ్రో".. అంటూ సందేశాలు.. .తెలుగువారి పండగైన మకర సంక్రాంతికి.. హ్యాపీ పొంగల్ (ఇది కేవలం తమిళులది) అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మీ పరాయి మోజు పాడుగాను..ఉండేది.. అమెరికా అయినా.. అన్నవరమైనా.. కనీసం తెలుగు వారి దగ్గరైనా.. తెలుగు పండగ రోజయినా.. తెలుగులో వెలగండి. మాతృభాషలో మాట్లాడుకునే మన పొరుగు రాష్ట్రాల సోదరుల్ని చూసైనా మారండి..అందరికీ ఉగాది శుభాకాంక్షలు..- బాలు అయ్యగారి -
తిరుమలలో ఉగాది వేడుకలు (ఫొటోలు)
-
విశ్వావసు నామ ఉగాది వేడుక సంబరాల్లో యువత (ఫొటోలు)
-
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
-
చైత్ర మాసం విశిష్టత.. వ్రతాల మాసంగా ఎందుకు పిలుస్తారు..?
చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటి రాశియైన మేషరాశిలో సంచరిస్తాడు. పురాణాలు చైత్రమాసాన్ని మధుమాసంగా, పవిత్ర మాసంగా కీర్తిస్తాయి. శుభాకార్యలు జరపకపోయినా..ఈ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు పండితులు. కొత్త సంవత్సరం ప్రారంభ సూచిక, మనందరికీ ఇష్టమైన ఉగాది పండుగతో ప్రారంభమయ్యే ఈ చైత్ర మాసం విశిష్టత, వ్రతాల మాసంగా పిలవడానికి కారణం తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది. అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి. ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’. ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు. కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది. అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60 ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి. మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది.పురాణ గాథ!ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని సంకల్పించారు. దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు. అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు. వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.వ్రతాలన్నీ ఈ మాసంలోనే..“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత"ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి "ఉగాది, "శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటి అవతారం అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం, వసంత నవరాత్రులు వంటి విశిష్టమైన వ్రతాలు ఆచరించేది ఈ మాసంలోనే. అమ్మకు ఇష్టమేన మాసం కూడా..అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం చైత్రమాసం. అమ్మవారిని ఈ కాలంలో పూజించిన వారికి విశేషఫలం లభిస్తుందని దేవీభాగవతమహిమ చెపుతోంది. దీనికి గల కారణం ఏమిటో శివుడే స్వయంగా బ్రహ్మవిష్ణువులకు వివరించినట్లు శివపురాణం చెపుతున్నది. ఈశ్వరుడు సృష్టి, స్థితి, సంహారం, తిరోభావం, అనుగ్రహం అనబడే అయిదు జగత్కార్యాలు చేస్తుంటాడు. ఈ అయిదుపనులలో సకలలోకాల ప్రాణుల ఉత్పత్తి లేక ఆరంభం, సృష్టిగా పిలుస్తారు. ఆరంభం అయిన ప్రాణులు, లోకాలు పోషింపబడి స్థిరంగా ఉండుట అనగా, జీవుల నుంచి జీవులు ఉత్పన్నులవుతూ కొనసాగడాన్ని స్థితి అంటారు. జీవులు కొంతకాలం అభివృద్ధిని చెంది, శిథిలావస్థకు వచ్చి, వినాశమును పొందడాన్ని సంహారం అంటారు. ప్రాణం బయటకు వచ్చి వేరొక దేహాన్ని పొంది, వేరు లోకాలకు పోవడాన్ని “తిరోధానం” అంటారు. జననమరణాదిచక్రమును తొలగించి ముక్తినివ్వడాన్ని అనుగ్రహము అంటారు. ఈ పంచకృత్యాలు నడిపించేపని భవుడు, భవానికి ఇచ్చాడు. ఈ పనులన్నీ ప్రారంభమైన కాలం చైత్రమాసం. అందువల్లనే ఈ కాలంలో భవానిని పూజించమని భవుడు చెప్పాడు.భవభవానీప్రీతికరమాసం, మధుమాసం కనుక ఈ మాసంలో ఆదిదంపతులను పూజించాలి.రామాయణ పారాయణము చేసేది కూడా.."రామో విగ్రహవాన్ ధర్మః" అని రామాయణంలో వాల్మీకి స్పష్టం చేసాడు. ధర్మాచరణకోసం ఎన్నో శాస్త్రాలు తిరగవేయవలసిన అవసరం లేదు. రాముని జీవితాన్ని సంపూర్ణంగా చదవాలి. జీర్ణించుకోవాలి. అప్పుడు ధర్మసూక్ష్మాలు స్పష్టంగా తెలుస్తాయి. శిష్యునిగా, ధర్మప్రభువుగా, దాతగా, రక్షకునిగా, శిక్షకునిగా ఒకటేమిటి అనేకపాత్రలు శ్రీరామచంద్రునిలో కనిపిస్తాయి.సంపూర్ణమానవునిగా జీవితం గడిపిన దివ్యావతారం శ్రీరామావతారం. శ్రీరామచంద్రుని ఆవిర్భావం జరిగినది చైత్రమాసంలోనే. అందువల్లనే చైత్రమాసాన్ని ధర్మమాసం అంటారని సౌరసంహిత చెపుతోంది. ఈ మాసంలో రామాయణ పారాయణము, శ్రవణమూ ఈ రెండూ అనంతఫలితాలను ఇస్తాయి. మానవులజీవితాలను వారివారి కర్మఫలాలను అనుసరించి నడుపుతూ సుఖదుఃఖాలను ఇచ్చేవారిలో నవగ్రహ దేవతలది ప్రధాన స్థానం. నవగ్రహాలలో ఒకరైన కేతువు గ్రహంగా ఆవిర్భవించినది చైత్రమాస కృష్ణపక్షచతుర్దశీ తిథి. ఈ తిథినాడు దర్భలు శిరస్సున ధరించి, నదీస్నానం చేసి కేతుతర్పణాలు ఇచ్చి, ఉలవలు దానం చేసినవారికి సకలబాధలూ తొలగుతాయి. ఊపిరితిత్తుల రోగాలు తక్షణమే తొలగిపోతాయి. కాబట్టి అంత మహిమాన్వితమైన ఈ మాసాన్ని భక్తులందరూ తమ శక్త్యానుసారం పూజలు చేసి..ఆ భగవంతుడి కృపకు పాత్రులుకండి. (చదవండి: -
తెలుగువారికి వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
తాడేపల్లి: తెలుగు సంవత్సరాది(ఉగాది) పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆయన అభిలషించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ తన సందేశంలో ఆకాంక్షించారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#Ugadi— YS Jagan Mohan Reddy (@ysjagan) March 30, 2025 -
ఉగాది రోజున నోరూరించే కమ్మని పిండివంటలు ఈజీగా చేసుకోండిలా..!
పూర్ణాలు..కావలసినవి: పచ్చిశనగ పప్పు – అర కేజీ, బెల్లం – అరకేజీ, యాలక్కాయలు – పది, బియ్యం – రెండు కప్పులు, పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి. శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి ∙నానిన బియ్యం మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ∙నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లు΄ోసి మూడు విజిల్స్ రానివ్వాలి ∙ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి ∙శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి ∙బియ్యం, మినపగుళ్ల రుబ్బులో కొద్దిగా ఉప్పు వేసి తి΄్పాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ∙మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ.పరమాన్నం..కావలసినవి: బియ్యం – అర కప్పు, పాలు – కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నెయ్యి – ముప్పావు కప్పు, జీడి పప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూను, పచ్చకర్పూరం – చిటికెడు. తయారీ: ముందుగా బియ్యాన్ని కడిగి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో పాలుపోసి కాయాలి. కాగిన పాలల్లో నానబెట్టిన బియ్యం వేసి తిప్పుతూ ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికాక దించి చల్లారనివ్వాలి. స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడి పప్పు పలుకులు వేసి గోల్డ్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. స్టవ్ మీద మరో పాత్ర పెట్టి బెల్లం తురుము వేయాలి. దీనిలో పావుకప్పు నీళ్లుపోసి సిరప్‌లా మారేవరకు ఉడికించి, చల్లారనివ్వాలి. బెల్లం సిరప్‌లోనే యాలకుల పొడి, పచ్చ కర్పూరం వేసి తిప్పాలి. బెల్లం సిరప్ చల్లారక అన్నంలో వేసి బాగా కలపాలి, దీనిలో మిగిలిన నెయ్యి, జీడిపప్పుతో గార్నిష్ చేస్తే పరమాన్నం రెడీ.మామిడికాయ పులిహోరకావలసినవి: బియ్యం – కప్పు, పచ్చిమామిడి కాయ – మీడియం సైజుది ఒకటి, పచ్చికొబ్బరి తురుము – అర కప్పు, ఆవాలు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పచ్చిశనగ పప్పు – టీ స్పూను, వేరుశనగ గుళ్ళు – రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు – మూడు రెమ్మలు, పచ్చిమిర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి – నాలుగు, మెంతులు – పావు టీస్పూను, ఆయిల్ – నాలుగు టేబుల్ స్పూన్లు, పసుపు – పావు టీస్పూను, చింతపండు ఉసిరికాయంత, బెల్లం తురుము – రెండు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం పొడి పొడిగా వచ్చేలా వండి ఆరబెట్టుకోవాలి మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా తరగాలి. ఎండు మిర్చి, మెంతులు, అరటీస్పూను ఆవాలను దోరగా వేయించుకుని పొడిచేయాలి. ఈ పొడిలో పచ్చికొబ్బరి, మామిడికాయ ముక్కలు, చింతపండు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు వేయాలి. చిటపటలాడాక మినప పప్పు, శనగ పప్పు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేయాలి ∙ఇవన్ని వేగాక వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి. ఇవి వేగాక పసుపు, గ్రైండ్ చేసిన మామిడికాయ మిశ్రమం వేసి ఐదు నిమిషాలు వేయించాలి ∙తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి, ఆరబెట్టిన అన్నాన్ని వేసి కలిపితే మామిడికాయ పులిహోర రెడీ. (చదవండి: 6 రుచులు... 6 ఆరోగ్య లాభాలు) -
శ్రీశైలంలో ఘనంగా ఉగాది బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
ఈ 5 రాశుల వారు పట్టిందల్లా బంగారమే!
-
అనిల్- చిరంజీవి సినిమా ముహూర్తం తేదీ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ రంగంలోకి దిగుతోంది. దర్శకుడు అనిల్ ఇప్పటికే స్క్రిప్టు వినిపించడం పూర్తయింది. ఆపై మెగాస్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇక షూటింగ్ పనులు ఎప్పుడు ప్రారంభవ అవుతాయి అనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.మార్చి 30న ఉగాది పండుగ సందర్భంగా చిరు-అనిల్ సినిమా గ్రాండ్‌గా పూజా కార్యక్రమంతో చిరు నవ్వుల పండగ బొమ్మకి శ్రీకారం చుట్టనున్నారు. రామానాయుడు స్టూడియోలో జరగనున్న ఈ కార్యక్రమంలో వెంకటేష్‌తో పాటు పలువురు స్టార్స్ పాల్గొంటారని తెలుస్తోంది. ఈ మూవీలో శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో చిరంజీవి సందడి చేయనున్నారు. ఇందులో చిరంజీవి తనలోని కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్, భావోద్వేగాలతో మంచి వినోదాన్ని పంచుతారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ పాత్ర కోసం అదితిరావు హైదరి పరిశీలనలో ఉన్నట్టు టాక్ ఉంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.అనిల్ రావిపూడి బలమే కామెడీ.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఓ కామెడీ సినిమా చేస్తున్నారంటే..దానిపై కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించబోతున్నారట. అలాగే కథలో కూడా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. చిరు మూవీ అనగానే.. డూయెట్లు, లవ్‌ట్రాక్ మస్ట్. కానీ అనిల్ వాటి జోలికి వెళ్లడం లేదట. చిరంజీవిని కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా చూపించబోతున్నారట. చిరంజీవి వయసు తగ్గట్టుగానే పాత్రను రాసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’లో చిరంజీవి నటిస్తున్న విషయం తెలిసిందే.. ఆపై ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయనున్నారు. -
6 రుచులు... 6 ఆరోగ్య లాభాలు
ఉగాది పచ్చడిని సేవించే ఆచారం శాలివాహన శకారంభం నుంచి మొదలైనట్లుగా చరిత్రకారులు చెబుతారు. సంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని కొత్త మట్టికుండలోతయారు చేస్తారు. ఉగాది పచ్చడిలో వేపపూత, మామిడి పిందెలు, చింతపండు, ఉప్పు, మిరియాల పొడి, బెల్లం, అరటిపండు ముక్కలు ఉపయోగిస్తారు. వీటి వల్ల ఉగాది పచ్చడి ఆరురుచుల సమ్మేళనంగా తయారవుతుంది. ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలు, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం....బెల్లం, అరటి పండ్లు– తీపిబెల్లం తీపిగా ఉంటుంది. ఎండ వేడిమి వల్ల కలిగే అలసటను పోగొట్టి, తక్షణ శక్తినిస్తుంది. బెల్లాన్ని అరటిపండుతో కలిపి తీసుకోవడం శ్రేష్ఠమని ఆయుర్వేదం చెబుతోంది. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలను అరటిపండు నిరోధిస్తుంది.చింతపండు– పులుపుఉగాది పచ్చడి తయారీకి పాత చింతపండు ఉపయోగించడం మంచిది. పాత చింతపండు ఉష్ణాన్ని, వాత దోషాలను తగ్గిస్తుంది. బడలికను పోగొడుతుంది. జఠరశక్తిని పెంచుతుంది. మూత్రవిసర్జన సజావుగా సాగేందుకు దోహదపడుతుంది. వేసవిలో చింతపండు రసం తీసుకోవడం వల్ల ఉష్ణదోషాలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది.ఉప్పురుచులకు రారాజులాంటిది ఉప్పు. ఉప్పులేని పప్పులు, కూరలు, పచ్చళ్లు రుచించవు. ఆహారంలో అనునిత్యం ఉపయోగించే ఉప్పు త్రిదోషాలను– అంటే, వాత పిత్త కఫ దోషాలు మూడింటినీ పోగొడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, ఉప్పును మోతాదులోనే వాడాలి.మామిడి పిందెలు– వగరుమామిడి కాయలు ముదిరితే పులుపుగా ఉంటాయి గాని, పిందెలు వగరుగా ఉంటాయి. మామిడి పిందెల వగరుదనం లేకుంటే, ఉగాది పచ్చడికి పరిపూర్ణత రాదు. మామిడి పిందెలలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. మామిడి పిందెలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని త్రిదోషాలను హరించి, శక్తిని కలిగిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.వేపపూలు– చేదువసంతారంభంలో వేపపూలను తినే ఆచారం దాదాపు అన్నిప్రాంతాల్లోనూ ఉంది. దీనిని ‘నింబకుసుమ భక్షణం’ అంటారు. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిలో వేపపూలను ఉపయోగించడం మన తెలుగువాళ్లకే చెల్లింది. వేపపూలు కఫదోషాన్ని, క్రిమిదోషాలను పోగొడతాయి. జీర్ణకోశ సమస్యలను నివారిస్తాయి.మిరియాల పొడి–కారంమిరియాలను నేరుగాను, పొడిగాను వంటకాల్లో తరచుగా వినియోగిస్తూనే ఉంటాం. మిరియాలు రుచికి కారంగా ఉన్నా, శరీరానికి చాలా మేలు చేస్తాయి. మిరియాలు కఫదోషాన్ని, విష దోషాలను హరిస్తాయి. చర్మవ్యాధులను అరికట్టడమే కాకుండా, జీర్ణశక్తిని, శరీరంలోని జీవక్రియలను పెంచుతాయి. అందుకే సంప్రదాయ ఆయుర్వేద ఔషధాల్లో మిరియాలను విరివిగా ఉపయోగిస్తారు. -
కొత్త తరానికి చెబుదాం
తెలుగువారి తొలి పండగ వచ్చేస్తోంది. నూతనోత్సాహంతో ఉగాదిని ఆహ్వానించడానికి సిద్ధమవుతున్న వేళ... కొత్త తరానికి పండగల అర్థం తెలుస్తోందా? అంటే... ‘పెద్దవాళ్లు చెబితేనే తెలుస్తుంది’ అంటున్నారు ప్రముఖ రచయితలు రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్. ఉగాది ప్రత్యేకంగా ఇంకా ఈ ఇద్దరూ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం.పండగలు జరుపుకోవడం ఎవరూ మానేయలేదు. పిండివంటలు చేసుకోవడానికైనా పండగలు చేసుకుంటున్నాం. పండగ పూట తల స్నానం చేసి, ఉగాది పచ్చడి తిన్న తర్వాతే మిగతా పనులు చేయాలని పిల్లలకు పెద్దలు చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త తరానికి పాత తరంవాళ్లు చెబుతుండాలి. ఎందుకంటే పండగలన్నీ ముందు తరంవాళ్లు చేసుకుంటూ వచ్చారు కాబట్టి చెప్పడం వారి బాధ్యత. కొత్త తరాన్ని పాజిటివ్‌గా స్వాగతించాలి. వారూ వెల్‌కమింగ్‌గానే ఉంటారు. మన తానులో పెరిగిన ముక్కలు వేరేలా ఎలా ఉంటారు? కొత్త తరానికి పద్ధతులన్నీ కొత్తే. పోనీ ఇవాళ్టి పాత తరం అనుకున్నవారికి ఎవరు చెప్పారు? వారి ముందు తరంవారు చెబితేనే కదా వీరికి తెలిసింది. ఇది రిలే పందెంలాంటిది. ఒక తరానికి ఒక తరానికి సక్రమంగా విషయాలను అందజేయాల్సిన బాధ్యత ముందు తరానికి ఉంటుంది. యువతని నిందించడం సరికాదు: ప్రపంచాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మంచి కోణంలో... దుర్గార్మపు కోణంలో... ఎప్పుడూ మొదటి కోణంలో చూస్తే మంచిది. అది కాదనుకుని యువత పెడదారి పట్టిందని, ఏదేదో జరిగిపోతోందని యువతరాన్ని నిందించడం సరికాదు. ఏదీ వక్రీకరించిన కోణంలో చూడొద్దు. ఫారిన్ కల్చర్ అంటున్నాం... విదేశాలు వెళ్లి చూస్తే ఇక్కడికన్నా ఎక్కువ అక్కడ పండగలు బాగా జరుపుకుంటున్నారు. అన్నమాచార్యుల కీర్తనలు కూడా పాడుతున్నారు. ఇక్కడితో పోల్చితే అమెరికా ఫాస్ట్ ఫార్వార్డ్ అనుకోవాలి కదా. కానీ అక్కడ మన సంప్రదాయాలు బతికే ఉన్నాయి. ఇక ఎప్ప టికీ ఇండియా రామని తెలిసిన కుటుంబాలు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు... మన సంప్రదాయాల గురించి చెబుతున్నారు. పిల్లలూ నేర్చుకుంటున్నారు. యువతరం బాధ్యతగా ఉంటోంది: సారవంతమైన నేల అది (యువతరాన్ని ఉద్దేశించి). బీజం వేయడం అనేది మన చేతుల్లో ఉంది. ముందు తరం బాధ్యతగా ఉండి, తర్వాతి తరానికి దగ్గరుండి అన్నీ నేర్పించి, అన్నీ ఆచరించేలా చేయాలి. వీళ్లు పాటిస్తూ వాళ్లు పాటించేలా చేయాలి. పొద్దున్నే వీళ్లు స్నానం చేయకుండా... పిల్లలను స్నానం చేసి, పూజలు చేయమంటే ఎందుకు చేస్తారు? నువ్వు చేయడంలేదు కదా? అంటారు. ఒకవేళ మాటల రూపంలో చెప్పకపోయినా... ముందు తరం ఆచారాలు పాటిస్తుంటే వీళ్లు చూసి, నేర్చుకుంటారు... అనుసరించడానికి ఇష్టపడతారు. బోధించే విధానం సక్రమంగా ఉండాలి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే... మనం అనుకున్నంతగా యువతరం ఏమీ దిగజారిపోలేదు. చెప్పాలంటే మనకన్నా ఇంకా బాధ్యతగా ఉంటూ, పాతా కొత్తా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నారు. ఈ కాలపు పిల్లలు ఇంటికీ, బయటికీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తెలిసినవాళ్లు. వాళ్లలో ఏదైనా లోపం ఉందీ అంటే... చెప్పేవాళ్లదే కానీ వాళ్లది కాదు. సో... ఏ పండగని ఎందుకు జరుపుకోవాలో విడమర్చి యువతరానికి చెప్పాల్సిన బాధ్యత ముందు తరానిదే. సంవత్సరాది ఎందుకు జరుపుకుంటున్నాం? ఉగాది పచ్చడి విశిష్టత వంటివి చెప్పి, పండగ అర్థం తెలియజేయాలి.పండగ‘రుచి’చూపాలి– అనంత శ్రీరామ్పండగలు జరుపుకునే తీరు మారింది. పెళ్లిళ్లల్లో ఎప్పుడైతే మనకు లేని రిసెప్షన్ అని మొదలుపెట్టామో అలానే పండగలు జరుపుకునే తీరులోనూ మార్పు వచ్చింది. ఉగాది గురించి చెప్పాలంటే... మా ఊరులో ఐదు రోజులు ఉగాది జాతర జరుగుతుంది. మాది వెస్ట్ గోదావరి, యలమంచిలి మండలం, దొడ్డిపట్ల గ్రామం. జాతర సందర్భంగా ఊరేగింపులు అవీ చేస్తుంటారు. ఇప్పుడూ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు జాతరలో భాగంగా మేజిక్ షోస్ అంటూ వెస్ట్రన్ కల్చర్ మిక్స్ అయిపోయింది. ఉగాది అంటే కవి సమ్మేళనాలు విరివిగా జరిగేవి. ఇప్పుడలా లేదు. ఎవరైనా విద్యావంతులు లేదా శాంతి సమాఖ్యలు వాళ్లు ఏదో టౌన్ హాలులో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసినా ఓ ఇరవై ముప్పైమంది ఉంటున్నారు... అంతే. ఉగాది ప్రత్యేకం అమ్మవారి జాతర: ఇక మా ఊరి ఉగాది గురించి చెప్పాలంటే... మాణిక్యాలమ్మ మా గ్రామ దేవత. ఉగాది సమయంలో మాకు ఆ అమ్మవారి జాతర ఉంటుంది. ఉగాది ప్రత్యేకం అంటే ఆ జాతరే. ఐదు రోజులు ఘనంగా చేస్తారు. ఐదో రోజు అయితే అమ్మవారిని బాగా అలంకరించి, ఊరేగించి, తెప్పోత్సవం చేస్తారు. నేను ప్రతి ఏడాది దాదాపు మిస్ కాకుండా వెళతాను. ఈసారి కుదరదు. ఆరు రుచులను సమానంగా ఆస్వాదించాలి: ఉగాది పచ్చడిలోని షడ్రుచుల గురించి చెప్పాలంటే... నేను ‘ఒక్కడున్నాడు’ సినిమాలో ‘ఇవ్వాళ నా పిలుపు... ఇవ్వాలి నీకు గెలుపు... సంవత్సరం వరకు ఓ లోకమా...’ అని పాట రాశాను. అది పల్లవి. పాట మొదటి చరణంలో రుచుల గురించి రాశాను. ‘కొంచెం తీపి... కొంచెం పులుపు పంచే ఆ ఉల్లాసమూ... కొంచెం ఉప్పు... కొంచెం కారం పెంచే ఆ ఆవేశమూ... చేదూ వగరూ చేసే మేలూ... సమానంగా ఆస్వాదించమని ఇవ్వాళ నా పిలుపు’ అని రాశాను. ఆరు విభిన్నమైన రుచులను సమానంగా ఆస్వాదిస్తేనే జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలమని చెప్పడమే ఆ పాట ఉద్దేశం. అంటే... జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ సమానంగా స్వీకరించగలగాలి.ఆ బాధ్యత పెద్దవాళ్లదే: ఇక నేటి తరం గురించి చెప్పాలంటే... ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలతో హాలోవెన్ అంటూ రకరకాల వేషాలు వేయిస్తున్నారు. వేలంటైన్స్ డే అనీ ఇంకా వేరే ఎక్కడెక్కడనుంచో తెచ్చిపెట్టుకున్న పండగలను జరుపుతున్నారు. అయితే పిల్లలకు మన పండగల గురించి చెప్పాలి. వేరే సంబరాలు ఎలా ఉన్నా కూడా మన పండగలకు ఎక్కువప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా పాత తరం ఆచరిస్తే కొత్త తరానికి అర్థం అవుతుంది. వాళ్లు మన సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళతారు. మా గ్రామంలో ఉగాది అంటే... ఇంట్లో పిల్లలకు వేప పూత, మామిడికాయలు, చెరుకు గడలు తెమ్మని టాస్కులు ఇచ్చేవారు. అవి తెచ్చే క్రమంలో మాకు పండగలు అర్థమయ్యేవి. అలా మా ముందు తరంవాళ్లు మాకు నేర్పించారు. కొత్త తరానికి మనం అలా నేర్పిస్తే వాళ్లు పాటిస్తారు. ముందు తరాలకు సంస్కృతీ సంప్రదాయాలను నేర్పించే బాధ్యత పెద్దవాళ్లదే.– డి.జి. భవాని -
షడ్రుచుల ఉగాదికి..ప్రకృతే పరవశించేలా ఈ చేనేత చీరల్లో మెరుద్దాం..!
పచ్చని తోరణాలు.. షడ్రుచుల ఆస్వాదన.. సంప్రదాయ వస్త్రధారణ ఉగాదికి స్వాగతం పలుకుతూ కొత్త ఉత్సాహాన్ని మదికి మోసుకువస్తాయి. చేనేత చీరలు, ఎంబ్రాయిడరీ సొగసులు వాటి రంగుల హంగులు ప్రకృతి పరవశించేలా పండగకు మరింత శోభను తీసుకువస్తాయి. ముఖ్యంగా పసుపు, ఆరెంజ్, ఆకుపచ్చ, ఎరుపు రంగులు పండగ కళను రెట్టింపుగా మన కళ్లకు కడతాయి. చేనేత కళపండగ నాడు కళను రెట్టింపు చేసే అలంకరణకు ప్రాముఖ్యత ఇస్తుంటారు. అయితే, అందుకు పెద్ద హడావిడి లేకుండా మనవైన చేనేతలలో కాంతిమంతమైన రంగులున్న చీరలను ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో కంచిపట్టు చీరల నుంచి కలనేత వరకు అన్నీ పండగను వెలిగించేవే.సహజమైన రంగులుప్రకృతి నేపధ్యంగా ఉగాది జరుపుకుంటారు కాబట్టి పసుపు, ఆకుపచ్చ, నారింజ, ఎరుపు రంగుల కాటన్, తెలుపు, ఎరుపు కాంబినేషన్, పింక్ కలర్ టస్సర్, సిల్క్ చీరలు ప్రత్యేక ఆకర్షణతో ఆకట్టుకుంటాయి. డిజైన్లుచెక్స్, లైన్స్‌తో ఉన్న డిజైన్లు, మెరుపులు లేకుండా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్, సహజంగా అనిపించే పెయింటింగ్స్ ఈ పండగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇతర అలంకరణలు..చీరలకు లాంగ్ స్లీవ్స్ బ్లౌజులు, టెంపుల్ జ్యువెలరీ లేదా థ్రెడ్, టెర్రకోట జ్యువెలరీ బాగుంటాయి. పసుపు, ఎరుపు కాంబినేషన్ ప్లెయిన్ గాజులు, సహజంగా అనిపించేలా తక్కువ మేకప్ ప్రత్యేకతను చూపుతుంది.శిరోజాల అలంకరణలో జడ, కొప్పులు, పువ్వులకు ప్రాధాన్యమిస్తే పండగ ప్రకృతి కళతో ఆకట్టుకుంటుంది. (చదవండి: అందంగా ఉండాలంటే..సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి..!) -
బ్యాంకులకు వరుస సెలవులు..
ఉగాది, రంజాన్ వచ్చేస్తున్నాయి. వారాంతం, వెంటనే పండుగల కారణంగా బ్యాంకులకు వరుస సెలవులు లభిస్తున్నాయి. రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలు కాకుండా.. ప్రత్యేకంగా పండుగలను దృష్టిలో ఉంచుకుని కూడా బ్యాంకులకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవులు అందిస్తుంది.మార్చి 28న జుమాత్-ఉల్-విదా కారణంగా జమ్మూకశ్మీర్‌లో బ్యాంకులకు సెలవు, ఆ తరువాత 30న ఉగాది సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. 31వ తేదీ రంజాన్ సందర్బంగా కూడా బ్యాంకులకు సెలవు.ఆర్ధిక సంవత్సరం చివరి రోజు (మార్చి 31)రంజాన్ మార్చి 31న వచ్చింది. సాధారణంగా ఆ రోజు బ్యాంకులకు సెలవు. కానీ ఆర్ధిక సంవత్సరం చివరి రోజు కాబట్టి బ్యాంకులు పనిచేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడికావాల్సి ఉంది.మొత్తం మీద 28వ తేదీ నుంచి 31 వరకు మూడు రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయని తెలుస్తోంది. బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది). -
ఉగాదికి ముందుగానే శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు..(ఫొటోలు)
-
సాయం అందించే చేతులకు వేదిక పీ–4
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ–4 విధానం ద్వారా ప్లాట్‌ఫామ్ నిర్మిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ–పీ–4 విధానంపై సోమవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని, ఎవరినీ ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్నారైలు కూడా పీ–4లో భాగస్వాములు కావొచ్చన్నారు. పీ–4 విధానంలో ప్రభుత్వ పాత్ర కేవలం ఇరువర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడమేనని, ప్రభుత్వం తరఫున ఎవరికీ అదనపు సాయం ఉండదన్నారు. ఉన్నతవర్గాల వాళ్లు సాయానికి ముందుకొచ్చేలా వారిలో స్ఫూర్తి నింపాలని సూచించారు. లబ్ధి పొందేవారిని ‘బంగారు కుటుంబం’గా, సాయం చేసే వారిని ‘మార్గదర్శి’గా పిలవాలని సూచించారు. బంగారు కుటుంబం ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదని, గ్రామసభ, వార్డు సభల ద్వారా తుది జాబితా రూపొందిస్తే వివాదరహితంగా ఉంటుందన్నారు. పీ–4 కార్యక్రమానికి, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ వర్గాల ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి కలగనుంది. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడండి రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం వేసవి ప్రణాళిక, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధిత శాఖలతో సీఎం సమీక్ష నిర్వహించారు. పశువులకు నీరు అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రూ.35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. మున్సిపాలిటీల్లో నీటి సమస్య పరిష్కారానికి అవసరమైన రూ.39 కోట్లు విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మున్సిపల్ కార్మికులకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు బయట ప్రాంతాల్లో పని అప్పగించొద్దన్నారు. ఆపరేషన్ మోడల్లో పోలవరం–బనకచర్ల పోలవరం–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఆపరేషన్ మోడల్లో నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గోదావరి జలాలను పోలవరం నుంచి లిఫ్టుల ద్వారా తరలించేందుకు అయ్యే విద్యుత్ వినియోగాన్ని ప్రాజెక్టు ప్రాంతంలోనే పంప్డ్ స్టోరేజ్, సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడం ద్వారా ఉత్పత్తి చేసి ఆర్థిక భారం తగ్గించవచ్చన్నారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై సోమవారం సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. -
ఉగాదిలోపు రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీకి ఉగాదిలోపు కొత్త అధ్యక్షుడు వస్తారనే ప్రచారం పార్టీవర్గాల్లో ఊపందుకుంది. దీనికి సంబంధించి ఒకటి, రెండురోజుల్లోనే పూర్తి స్పష్టత వస్తుందని ముఖ్యనేతలు చెబుతున్నారు. తాజాగా కేరళ పార్టీ అధ్యక్షుడిగా రాజీవ్చంద్రశేఖర్ను నియమించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. త్వరలోనే కేంద్రమంత్రి శోభకరాంద్లజే తెలంగాణకు వచ్చి అభిప్రాయసేకరణ జరుపుతారని తెలుస్తోంది. ఇది ముగిశాక ఒకనేత పేరుతో నామినేషన్ పత్రాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి.. మరుసటి రోజు అధ్యక్షుడి ప్రకటన ఉండొచ్చునని అంటున్నారు.అధ్యక్ష పదవి కోసం పార్టీలో పాత–కొత్త నేతల మధ్య ‘జాతివైరం’స్థాయిలో ఇప్పటికీ సాగుతోంది. పార్టీ సిద్ధాంతాలు, హిందుత్వ భావాలున్న పాత నాయకులకే ఈ పదవి ఇవ్వాలని కొందరు పట్టు పడుతున్నారు. పార్టీలో చేరాక, ఎంపీగా, ఎమ్మెల్యేగా లేదా మరో పదవికో ఎన్నికయ్యాక పాత–కొత్త అంటూ ఉండదని కొందరు (గత మూడు, నాలుగేళ్లలో చేరి ఆయా పదవులు పొందినవారు) వాదిస్తున్నారు. పార్టీలో కొత్తరక్తం నింపి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారంలోకి తీసుకొచ్చేందుకు అనేక మార్పులు చేయాల్సి ఉంటుందని ఈ వర్గం సూచిస్తోంది.అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ముఖ్యనేతలు, సీనియర్ నేతలు, పాత–కొత్త నాయకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ⇒ ఈసారి బీసీ వర్గానికి చెందిన నేతకు అవకాశం దక్కొచ్చుననే ఊహాగానాలు ఎక్కువగా సాగుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరి్వంద్, బీజేఎల్పీ ఉపనేత పాయల్‌శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.కాసం వెంకటేశ్వర్లు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి తదితరులు పోటీపడుతున్నారు. ⇒ ఇక ఓసీ నాయకుల విషయానికొస్తే ఎంపీలు డీకే అరుణ, ఎం.రఘునందన్‌రావు, ఇంకా పి.మురళీధర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తదితరులు ఈ పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ⇒ అధ్యక్ష పదవిని కోరుకుంటున్న వారిలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు కూడా ఉన్నారు. అయితే కొన్నిరోజులుగా అనూహ్యంగా కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సంజయ్‌ను మళ్లీ అధ్యక్షుడిగా నియమించేందుకు బీజేపీ అధినాయకత్వం మొగ్గుచూపొచ్చుననేది ఈ ప్రచార సారాంశం. అయితే అధ్యక్ష పదవి కోసం తాను పోటీలో లేనంటూ తాజాగా సంజయ్ వివరణ ఇచ్చారు. అయినా, పార్టీని ముందుండి నడిపించేందుకు ఆయన్నే అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని కొందరు నేతలు చెబుతున్నారు. బీసీ నేతకు ఇస్తే ఈటల రాజేందర్‌కు దక్కొచ్చునని గతంలోనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. పీఎం మోదీ, సీనియర్ నేతలు అమిత్ షా, నడ్డా వంటివారు ఈటలకే ఓటేస్తారనే ప్రచారం జరిగింది.నేనంటే నేను అని ప్రచారంగతంలో ఎన్నడూలేని విధంగా తనకే అధ్యక్ష పదవి వస్తుందంటూ కొందరు ముఖ్యనేతలు సైతం ప్రచారం చేసుకోవడం పట్ల రాష్ట్ర పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే తాను అధ్యక్షుడిని అవుతున్నానంటూ వారు మీడియాకు, అనుచరులకు లీక్‌లు ఇచ్చుకోవడం ఇటీవల బాగా పెరిగిపోయింది. పార్టీనాయకుల్లో ఇలాంటి పోకడలు గతంలో ఎప్పుడూ లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై రాష్ట్రపార్టీలో ఏకాభిప్రాయం కుదరని కారణంగానే జాతీయ నాయకత్వం కూడా డైలమాలో పడిందని సమాచారం. ఈ పరిస్థితుల్లో అధినాయకత్వం ఎవరి వైపు మొగ్గుచూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
శ్రీశైలం : కర్ణాటక,మహారాష్ట్రాల నుంచి పాదయాత్రగా వేలాది భక్తులు (ఫొటోలు)
-
హోలీ.. ఉగాది పండుగలు: మార్చిలో బ్యాంక్ హాలిడేస్ ఇవే..
ఫిబ్రవరి 2025 ముగుస్తోంది. దేశంలోని బ్యాంకుల నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చిలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసి ఉంటాయో జాబితాను (Bank Holidays) విడుదల చేసింది. వచ్చే నెలలో వివిధ పనుల నిమిత్తం బ్యాంకులకు వెళ్లాల్సినవారు తప్పకుండా ఈ సెలవుల జాబితాను తెలుసుకోవాలి. తద్వారా మీ ప్రాంతంలో బ్యాంకులు ఎన్ని రోజులు మూసిఉంటాయో.. ఏయే రోజుల్లో పనిచేస్తాయో తెలుస్తుంది. తదనుగుణంగా బ్యాంకింగ్ పనిని ప్లాన్ చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది.మార్చిలో బ్యాంక్ హాలిడేస్➤మార్చి 7 (శుక్రవారం): 'చాప్చార్ కుట్' పండుగను సందర్భంగా మిజోరాంలో సెలవు దినం.➤మార్చి 13 (గురువారం): మార్చి 13న హోలిక దహన్, అట్టుకల్ పొంగళ పండుగ కారణంగా జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.➤మార్చి 14 (శుక్రవారం): హోలీ పండుగ సందర్భంగా.. త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్, కేరళ, నాగాలాండ్ మినహా ఇతర రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సెలవు.➤మార్చి 15 (శనివారం): కొన్ని రాష్ట్రాలు మార్చి 14కి బదులుగా మార్చి 15న హోలీని జరుపుకుంటాయి. ఈ జాబితాలో త్రిపుర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, మణిపూర్ ఉన్నాయి.➤మార్చి 22 (శనివారం): 'బీహార్ దివస్' లేదా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మార్చి 22న బీహార్‌లో బ్యాంకులకు సెలవు.➤మార్చి 27-28 (గురువారం-శుక్రవారం): ఇస్లామిక్ క్యాలెండర్లో ముఖ్యమైన రోజు అయిన షబ్-ఎ-ఖదర్ను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్ మార్చి 27న సెలవు దినంగా పాటిస్తుంది. రంజాన్ నెల చివరి శుక్రవారం అయిన జుమాత్-ఉల్-విదాను పురస్కరించుకుని కేంద్రపాలిత ప్రాంతం మార్చి 28న సెలవు దినంగా పాటిస్తుంది.➤మార్చి 31 (సోమవారం): మిజోరం, హిమాచల్ ప్రదేశ్ మినహా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మార్చిలో ఈద్ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తాయి.బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ సెలవు దినాల్లో కూడా అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది). -
ఉగాది సాహిత్య సమ్మేళనం, ఎంట్రీలకు ఆహ్వానం!
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారథి- సింగపూర్ & వంశీ ఇంటర్నేషనల్- భారత దేశం సంయుక్త ఆధ్వర్యంలో..విశ్వావసు నామ సంవత్సర ఉగాది (మార్చ్ 30, 2025) సందర్భంగాఉగాది సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశం ఉచితమని తెలిపారు. ‘విశ్వాససు’ నామ ఉగాది శుభ సందర్భంగా కొత్త సంవత్సరానికి ‘సాహిత్య స్వాగతం’ పలుకుతూ వైవిధ్యభరితమైన సాహిత్యాంశాలతో రోజంతా జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆనందించమని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు, పండితులు, రచయితలు, సాహితీవేత్తలు, భాషాభిమానులందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం.తేదీ: ఏప్రిల్ 13, 2025, ఆదివారంసమయం: ఉదయం 9:00 నుంచి రాత్రి 9:00 దాకావేదిక: శ్రీ త్యాగరాయ గానసభ, చిక్కడపల్లి, హైదరాబాద్.సంగ్రహ కార్యక్రమం ప్రారంభ సభకవి సమ్మేళనంమహిళా పృఛ్ఛకులతో అష్టావధానం - ‘ద్విశతావధాని’ డా బులుసు అపర్ణనూతన పుస్తకావిష్కరణ సభ-2025కవి సమ్మేళనం నమోదు వివరాలుభారత దేశం, సింగపూర్, అమెరికా దేశ సంస్థల నిర్వహణలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మకమైన సాహిత్య సమ్మేళనం లో పాల్గొని తమ స్వీయ కవితలని సభా ముఖంగా వినిపించే ఆసక్తి ఉన్నవారు సకాలంలో ఈ క్రింది లింక్ లో నమోదు చేసుకుని సహకరించమని కోరుతున్నాం.నమోదు పత్రంhttps://docs.google.com/forms/d/e/1FAIpQLSc8fSIPdScAsrz89h6Q9rAWNIqazuTtUeWPgpIpew93Wv3qEQ/viewformనమోదు ఆఖరి తేదీ: మార్చ్ 15, 2025• నమోదు పత్రం లో అందిన కవితలు మాత్రమే పరిశీలించబడతాయి.• కవిత వ్యవధి 3 నిమిషాలు (25 వాక్యాలు) దాటరాదు.• కవిత ఏదైనా సాహిత్య, సామాజిక, ఆధ్యాత్మిక అంశంపై రాయవచ్చు. మత కుల రాజకీయ ప్రసక్తి లేకుండా కవిత శుభసూచకంగా ఉండాలి.• స్థానికులకి తగిన గుర్తింపు, బయట ప్రాంతాలనుండి వచ్చేవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.• కవితల ఎంపికలో అంతిమ నిర్ణయం నిర్వాహకులదే.నూతన పుస్తకావిష్కరణలునమోదు ఆఖరి తేదీ: మార్చ్ 15, 2025 (ఉగాది)‘విశ్వావసు’ నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనంలో తమ నూతన గ్రంధాలు సభా ముఖంగా ఆవిష్కరించ దలచుకున్న వారు వివరాలతో సంప్రదించాలని, కేవలం 2025 లో ప్రచురించబడిన కొత్త పుస్తకాలు మాత్రమే ఆవిష్కరణకి పరిశీలిస్తామని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.వివరాలకోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లుప్రధాన సమన్వయ కర్త: రాధిక మంగిపూడి (+91 9029409696)రత్న కుమార్ కవుటూరు +65 91735360 (సింగపూర్)డా. వంశీ రామరాజు +91 9849023852 (హైదరాబాద్)డా. వంగూరి చిట్టెన్ రాజు +1 8325949054 (హ్యూస్టన్, టెక్సాస్, అమెరికా) మరిన్ని NRI వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి: -
ఉగాదికి గద్దర్(సినిమా)అవార్డులు: భట్టి విక్రమార్క
సాక్షి,హైదరాబాద్:ఉగాదికి గద్దర్ (సినిమా) అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.ఈ మేరకు శనివారం(జనవరి18) సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం వెల్లడించారు. అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని కమిటీ సభ్యులు,అధికారులకు సూచించారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామని ఈ సందర్భంగా భట్టి తెలిపారు.అవార్డుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు చెప్పారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు.గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవార్డుల ప్రదానం జరగలేదన్నారు. రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ఏటా అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ నిబంధనలపై కమిటీ చర్చించింది.గతంలో తెలుగు సినిమా రంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులు బహుకరించేవారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల సంప్రదాయం కొనసాగినప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం సినిమా రంగానికి అవార్డులివ్వలేదు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత సినిమా రంగానికి తెలంగాణ యుద్ధనౌక గద్దర్ పేరుతో అవార్డులివ్వాలని నిర్ణయించింది. -
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకేలో ఉగాది సంబరాలు!
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకే (తెలుగు సంఘం) వార్షిక ఉగాది సంబరాలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఇది తెలుగు సంస్కృతి మరియు సంప్రదాయాలకు ఒక చిరస్మరణీయ వేడుక. ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలతో, ఈ కార్యక్రమం సంస్థకు ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. అంతేకాకుండా 2024-26 కాలానికి కొత్తగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించారు.ఎడిన్బర్గ్ కాలేజ్-గ్రాంటన్ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది తెలుగువారు హాజరయ్యారు. స్కాట్లాండ్లో నివశిస్తున్న తెలుగు సమాజంలో ఉన్నటువంటి బలమైన బంధం, ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచింది.ముఖ్య అతిథులుగా భారత కాన్సుల్ జనరల్ బిజయ్ సెల్వరాజ్, లోథియన్ ప్రాంతానికి చెందిన ఎంఎస్పిలు సారా బోయాక్, ఫోయ్సోల్ చౌదరి, కొల్లిన్టన్ కౌన్సిలర్ స్కాట్ ఆర్థర్ సహా ప్రముఖులు గౌరవ అతిథులుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారి ఉనికి ఈ కార్యక్రమం వైభవాన్ని పెంచింది. గొప్ప సాంస్కృతిక వైవిధ్యం ఉన్న ఎడిన్బర్గ్ లాంటి నగరంలో ఉగాదిని జరుపుకోవడం గురించి, దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది.“టాస్-యుకె ఉగాది సంబరాలు 2024” లో తెలుగు సమాజం ప్రతిభ, సంప్రదాయాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అధికారులు.సిలికానాంధ్రా వారి ‘మనబడి’ ద్వారా తెలుగు నేర్చుకునే పిల్లలు “మా తెలుగు తల్లికి” ప్రార్థనాగీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.2022-24 కాలానికి గాను సాంస్కృతిక కార్యదర్శిగా వ్యవహరించిన విజయ్ కుమార్ పర్రి తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అతిథులు, ముఖ్య అతిథులు మరియు ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ క్రార్యక్రమాన్ని ప్రారభించారు. సమూహ నృత్యాలు, సోలో గానం, తెలుగు కవితల పారాయణ, అనంత్ రామానంద్ గార్లపాటి చేసిన ముఖ్యమైన ఉగాది పంచాంగంతో సహా మంత్రముగ్దులను చేసే ప్రదర్శనలతో వేదిక ఆకర్షణీయంగా మారింది. ఐదుగురు గాయకులు, బ్యాండ్ ప్లేయర్లతో కూడిన స్థానిక భారతీయ బ్యాండ్ "వాయిస్ ఆఫ్ ఎకో" ప్రదర్శన ఈ కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచింది. వారి ఆకర్షణీయమైన ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, ఉత్సవాలకు అదనపు ఉత్సాహాన్ని జోడించాయి.హోస్ట్స్ సత్య శ్యామ్ జయంతి, రంజిత్ నాగుబండి, శ్రుతి పల్లెమోని, స్రవంతి పొట్లూరి, హిమజా మాచిరాజు రోజంతా జరిగే ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు నైపుణ్యంగా మార్గనిర్దేశం చేసి, శక్తిని, ఉత్సాహాన్ని నింపారు. వారి చమత్కారమైన పరిహాసం, ఆకర్షణీయమైన సంభాషణలు హాజరైనవారిని రోజంతా వినోదభరితంగా ఉంచాయి.సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, ఈ కార్యక్రమంలో సాంప్రదాయ సమకాలీన దుస్తులలో వివిధ ఋతువుల పోకడలను ప్రదర్శించే ఫ్యాషన్ షో ప్రదర్శన కూడా జరగడం విశేషం.ఎడిన్బర్గ్ దీపావళి, కన్నడ అసోషియేషన్ ఆఫ్ స్కాట్లాండ్ - ఎడిన్బర్గ్, ఎడిన్బర్గ్ హిందు మందిర్ అండ్ కల్చరల్ సెంటర్, ఇండియన్ ఆర్ట్స్ కనెక్షన్, 3 గుడ్ డీడ్స్, స్కాటిష్ ఇండియన్ ఆర్ట్స్ ఫోరం, ఒడిశా సొసైటి ఆఫ్ స్కాట్లాండ్, బీహార్ కమ్యూనిటీ మరియు స్కాటిష్ ఇండియన్ ముస్లిం అసోషియేషన్ వంటి ఇతర భారతీయ సంఘాల అతిథులు చేరడం ఔత్సాహికుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.వేడుకను విజయవంతం చేయడంలో ఈవెంట్ స్పాన్సర్లు ప్రధాన స్పాన్సర్లు బ్రైటర్ మోర్టగేజెస్, బెల్లి ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్, సహ-స్పాన్సర్ అల్లి భవన్లు కీలక పాత్ర పోషించారు, .ఇక 2024-26 సంవత్సరానికి కొత్తగా ఎన్నికైన టాస్-యూకే ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ శివ చింపిరి, అధ్యక్షుడు ఉదయ్ కుమార్ కుచాడి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గడ్డం, సంయుక్త కార్యదర్శి నిరంజన్ నూక, కోశాధికారి విజయ్ కుమార్ పర్రి, మహిళా మరియు ప్రాజెక్టుల కార్యదర్శి మాధవిలత దండూరి, కల్చరల్ సెక్రెటరీ పండరి జైన్ కుమార్ పోలిశెట్టి, క్రీడా కార్యదర్శి బాలాజీ కర్నాటి, యువజన శాఖా కార్యదర్శి రాజశేఖర్ సాంబ, ఐటి కార్యదర్శి జాకీర్ షేక్, పిఆర్ కార్యదర్శి నరేష్ దీకొండలను సభ్యులకు పరిచయం చేశారు.చివరిగా మాజీ చైర్పర్సన్ మైథిలి కెంబూరి చేసిన గణనీయమైన కృషికి గుర్తింపుగా, గౌరవనీయ చైర్‌పర్సన్‌గా సత్కరించారు.జన గణ మన, కొత్తగా నియమితులైన జనరల్, జాయింట్ సెక్రటరీల ధన్యవాదాలతో కార్యక్రమం ముగిసింది. ఇక ఈ కార్యక్రమంలో హాజరైన తెలుగువారు సంస్కృతి, స్నేహం, వేడుకలతో నిండిన రోజుగా మధురమైన జ్ఞాపకాలతో బయలుదేరారు.“టాస్-UK ఉగాది సంబరాలు 2024” ఒక తెలుగు వారసత్వ వేడుక మాత్రమే కాదు. తెలుగు సమాజం ఐక్యత, స్థితిస్థాపకతకు నిదర్శనం. టాస్-యుకె అభివృద్ధి చెందడమేగాక ఉగాది స్ఫూర్తిని తెలుగు వారిలో నింపుతూ.. రాబోయే సంవత్సరాల్లో మరింత మార్గదర్శకంగా, స్ఫూర్తిదాయకంగా తెలుగు వారి శ్రేయస్సుకు చేదోడుగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. (చదవండి: టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!) -
చికాగోలో ఘనంగా ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు!
అమెరికా ఇల్లినాయిస్లోని చికాగోలో చికాగో తెలుగు అసోసీయేషన్(సీటీఏ) ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం చికాగోలోని బాలాజీ టెంపుల్ ఆడిటోరియంలో జరిగిది. ఈ వేడకలకు దాదాపు 500 మందికి పైగా హాజరయ్యారు. సీటీఏ కల్చరల్ డైరెక్టర్ శ్రీమతి సుజనా ఆచంట, ఈ కార్యక్రమానికి హాజరైన వారికి స్వాగతం పలకి, వేడుకను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య రూపాలు, శాస్త్రీయ సంగీతం, తెలుగు భాష స్కిట్లు ఎంతగానో అరించాయి. అలాగే ఉగాది పచ్చడి పోటీలు కూడా నిర్వహించారు. శోభా తమ్మన, జానకి నాయర్, ఆశా అడిగా, వనిత వీరవల్లి వంటి గౌరవనీయ గురువులు ఆధ్వర్యంలో దాదాపు వందమందికి పైగా పిల్లలు శాస్త్రీయ నృత్యాలు, సంగీతంతో అలరించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో గురు రమ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన అనతి నీయారాతో సహా..ముగింపులో రవిశంకర్ మరియు అతని బృందం పాడిన 'భో శంభో', 'బ్రహ్మ ఒకటే' వంటి భక్తి పాటలు హైలెట్‌గా నిలిచాయి. ఈ ఈవెంట్‌కి అతిధులుగా సత్య, ఏటీఏకు చెందిన కడిమళ్ల, కరుణాకర్ మాధవరం తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో సీటీఏ కల్చరల్ కమిటీ సభ్యులు రాణి వేగే, సుజనా ఆచంట, అనిత గోలి, శ్రీ, చిట్టినేని, మధు ఆచంట, అనూష విడపలపాటి, ప్రత్యేక వాలంటీర్ల బృందం, సాయిచంద్ మేకల, భవానీ సరస్వతి, మాధవి తిప్పిశెట్టి, రత్న చోడ, వెంకట్ తొక్కాల,నాగభూషణ్ భీమిశెట్టి, పృద్వి సెట్టిపల్లి, సునీల్, రమేష్, నరేంద్ర, బాల, చక్రధర్, వివేక్ కిలారు, రామానుజం, శశిధర్, రమేష్, మృదుల, సీటీఏ బోర్డు సభ్యులు ప్రవీణ్ మోటూరు, రావు ఆచంట, శేషు ఉప్పలపాటి, అశోక్ పగడాల, ప్రసాద్ తాళ్లూరు, వేణు ఉప్పలపాటి, రాహుల్ విరాటపు, రమేష్ మర్యాల, తదితరులు కీలకపాత్ర పోషించారు. కాగా, సీటీఏ అధ్యక్షుడు నాగేంద్ర వేగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి, జయప్రదం చేయడంలో సహాయసహకరాలు అందించిన సీటీఏ బోర్డు సభ్యులకు వాలంటీర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: అమెరికా వాతావరణం కన్నా మేరా భారత్ మహాన్ !) -
ఉగాది రోజు ఊహించని అతిథి.. అలేఖ్య తారకరత్న ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ హీరో తారకరత్న కుటుంబం ఉగాది సెలబ్రేట్ చేసుకున్నారు. తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి తన ముగ్గురు పిల్లలతో కలిసి తెలుగు నూతన సంవత్సర పండుగను సంతోషంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. ఉగాది వేడుకలకు స్వయంగా తానే తారకరత్న ఇంటికి వెళ్లారు. పండుగ రోజు సంతోషంగా వారితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని అలేఖ్య తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. అలేఖ్య తన ఇన్‌స్టాలో రాస్తూ..'మా లైఫ్‌లో నాన్న లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి అంకుల్ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉంటాయి. కష్ట, సుఖాల్లోనూ ఎప్పుడు మా వెంటే ఉంటూ ధైర్యం చెప్పే వ్యక్తి. ఎలక్షన్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ మా కోసం ప్రత్యేకంగా రావడం ఇంతకు మించిన సంతోషం లేదు. ఇలాంటి సమయంలో మాతో ఉంటే ఆ విలువేంటో ఆయనకే తెలుసు. ఉగాది రోజును మాకు స్పెషల్‌గా మార్చిన విజయ్‌సాయి అంకుల్‌పై మా ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది' అంటూ ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. కాగా.. గతేడాది గుండెపోటుతో తారకరత్న మరణించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Nandamuri Alekhya (@alekhyatarakratna) -
ట్రెండీ లుక్‌లో యషికా ఆనంద్..కూతురితో మంచు లక్ష్మి సెలబ్రేషన్స్!
ట్రెండీ లుక్‌లో యషిక ఆనంద్.. ఉగాది ఫెస్టివల్ మూడ్‌లో అతుల్య రవి... నభా నటేశ్ ట్రైడిషనల్ లుక్ వైరల్... గ్రీన్ డ్రెస్‌లో తేజస్విని గౌడ హోయలు.. కూతురితో మంచు లక్ష్మి ఉగాది సెలబ్రేషన్స్.. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) -
తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు
-
అందరికీ మంచి జరగాలి..
-
Ugadi 2024: ఈ పండుగకి 'ఉగాది' అనే పేరు ఎలా వచ్చిందంటే..?
తెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిళ్లలో క్రోధి నామ సంవత్సరం సందడి మొదలైంది. ఉగాది అంటే ప్రతీ ఒక్కరికి గుర్తుకొచ్చేది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమే పండుగ ప్రత్యేకత. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తు చేసేదే పచ్చడి. హిందూ పురాణాల ప్రకారం, ఉగాదిలో ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం.. ఈ గమనానికి ఆది ఉగాది.. అంటే సృష్టి ఉగాది రోజు నుంచే ప్రారంభమైందని అర్థం. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాఢ్యమి తిథి రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు ‘గుడిపడ్వా’గా, తమిళులు ‘పుత్తాండు’, మలయాళీలు ‘విషు’, సిక్కులు ‘వైశాఖీ’, బెంగాలీలు ‘పోయ్ లా బైశాఖ్’గా జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రముఖ ఆలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం పఠిస్తారు. ఈ నేపథ్యంలో క్రోధి నామ సంవత్సరంలోకి అడుగు పెట్టనున్నాం. ఇవి చదవండి: చైత్ర మాసం విశిష్టత? వసంత నవరాత్రులు ఎందుకు చేస్తారు? -
Ugadi 2024: ఆరు రుచులను కలపగా.. విరిసిన 'ఉగాది'
జీవితమనే చెట్టు గొప్ప గొప్ప లక్ష్యాల చిగుర్లు వేసింది ప్రయత్నాల పూత పూసింది విరివిగా కానీ చేదుగా; అభిమానం అడ్డొచ్చి పడింది పిందెలుగా అయితే గుత్తులు గుత్తులుగా, అంతలో.. చింత చిరాకుపడి, పులుపుని రేపడం మొదలుపెట్టింది ఊరుకోని పట్టుదల పచ్చపచ్చగా వ్యాపించి ఎదగడం మొదలుపెట్టింది; కటువుగా కారం చల్లినట్లు.. నిర్ణయాలు వాటి వాటి స్థానం తీసుకున్నాయి; ధైర్యం విషయ గుజ్జుని గ్రహించింది.. లోపాలకు వగరు మందేసింది.. పరిశ్రమ కఠోరంగా అన్నిటినీ కలిపంది.. విజయం తియ్యగా వరించింది కృతజ్ఞత ఎక్కువ మోతాదులో కాకుండా.. తగిన మోతాదులో ఉపయోగించాలని ఉప్పు ఉపదేశించింది.. మొత్తానికి కచ్ఛాపచ్ఛాగా పచ్చడవుతున్న జీవితం.. మాంఛి.. పసందైన షడ్రుచులతో నడుస్తున్నది! :::మాధవి మేళ్ళచెర్వు, గుంటూరు క్రోధి నామ సంవత్సర రాశిఫలాల కోసం క్లిక్ చేయండి -
ఉగాది పంచాంగం.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మీ జాతకం తెలుసుకోండి
తెలుగు పంచాంగం ప్రకారం.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి.. ఆదాయం, ఆరోగ్యం, కుటుంబం, కెరీర్, విద్యా, వివాహ పరంగా ఎలా ఉంటుందనే పూర్తి వివరాలను ఉగాది సంబంధిత కథనాలు మీకోసం.. శ్రీ క్రోధి నామ సంవత్సర మేష రాశిఫలాలు (2024–25) ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–3. అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా) భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో) కృత్తిక 1వ పాదము (ఆ) గురువు మే 1 వరకు మేషం (జన్మం)లోను తదుపరి వృషభం (ద్వితీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (లాభం)లోను రాహువు మీనం (వ్యయం)లోను కేతువు (షష్ఠం)లోను సంచరిస్తారు. రోజువారి కార్యక్రమాలలో చాలా సమయపాలన పాటించి మంచి ఫలితాలు అందుకుంటారు. అందరికీ సహకరిస్తారు. అందరూ మీకు సహక రిస్తారు. భోజనం, మంచి వస్త్రధారణ వంటి వాటిలో మీ కోరికలు తీరతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. స్వేచ్ఛగా కావలసిన రీతిగా హాయిగా జీవనం సాగిస్తారు. కొన్నిసార్లు కార్య విఘ్నమునకు అవకాశం వున్నా పెద్దగా ఇబ్బందికరం కాదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మకార్యాచరణ చేసి సంఘంలో గౌరవం పొందుతారు. ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే, శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలే అందుతాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.. -
Ugadi 2024: నూతన సంవత్సరంలో.. 2024-25 కాల నిర్ణయమిదే..
ఉగాదితో కొత్త తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతాం. ఇది తెలుగువాళ్ల పండుగ. ఈ తెలుగు సంవత్సరాదిలో మన రాశి ఎలా ఉంది. ఈ ఏడాది కర్తరీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆ రోజు నవనాయక ఫలితాలు ఎలా ఉంటాయి? వంటివి చూసుకుని గానీ కొత్త పనులు, వ్యాపారాలు మొదలు పెట్టారు. మరీ ఈ ఏడాది డొల్లు కర్తరీ ఎప్పుడు ప్రారంభమయ్యిందంటే..? డొల్లు కర్తరీ ప్రారంభం.. ది.04.05.2024 ప.12:35లకు చైత్ర బహుళ ఏకాదశీ శనివారం రోజు డొల్లుకర్తరీ ప్రారంభం అవుతుంది. పెద్ద కర్తరీ ప్రారంభం.. ది.05.11.2024, ఉ.10:27లకు వైశాఖ శుద్ధ చవితి శనివారం రోజు నిజకర్తరీ (పెద్ద కర్తరీ) ప్రారంభం. కర్తరీ త్యాగం.. ది.28.05.2024 రా.7:21 వైశాఖ బహుళ పంచమి తత్కాల షష్ఠి మంగళవారం రోజు కర్తరీ త్యాగం. ‘‘మృద్దారు శిలాగహకర్మాణివర్జయేత్’’ మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మలు ప్రారంభించుటకు కర్తరీకాలము సరియగునది కాదు. పై సూత్రం ఆధారంగా వాస్తుకర్మలు నూతనంగా ఈ రోజు నుండి చేయరాదు. దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంకుస్థాపన, ద్వారం ఎత్తుట మరియు పాకలు, షెడ్లు, పెంకుటిళ్ళు, కప్పు విషయమై పని ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. రాబోవు విశ్వావసు నామ సంవత్సరం (2025–26) కర్తరీ నిర్ణయము 4 మే 2025 వైశాఖ శుద్ధ సప్తమి సుమారు సా.గం.7:00లకు డొల్లు కర్తరీ ప్రారంభం. 11 మే 2025 వైశాఖ శుద్ధ చతుర్దశీ సుమారు సా.గం.5:00లకు పెద్ద కర్తరీ ప్రారంభం. 28 మే 2025 జ్యేష్ఠ శుద్ధ విదియ రోజు సుమారు రా.గం.2:00లకు కర్తరీ త్యాగం. నవనాయక ఫలితాలు (2024– 2025) రాజు కుజుడు: కుజుడు రాజయిన సంవత్సరం అగ్నిభయం, వాయువు చేత అగ్ని రెచ్చ గొట్టబడడం, గ్రామ పట్టణాలలో తరచు అగ్ని భయములు ఉండును. వర్షములు ఉండవు. ధరలు అధికం అవుతాయి. రాజులకు యుద్ధములుండును. మంత్రి శని: వర్షపాతము తక్కువ. పంటలు తక్కువగా ఉంటాయి. సమాజంలో ఎక్కువ పాపకర్మలు ఇబ్బందులు సృష్టిస్తాయి. అన్ని వ్యవహారములు మందఫలములు ఇస్తాయి. తరచుగా సమాజంలో నిరంతరం ఆపదలు ఉంటాయి. గోవులకు ఇబ్బంది. తక్కువ స్థాయిలో ఉన్నవారు అందరూ అభివృద్ధిలోకి వస్తారు. సేనాధిపతి శని: సేనలకు రాజుకు సయోధ్య ఉండదు. ప్రజలు అధర్మ వర్తనులు అగుదురు. నల్లధాన్యములు ఫలించును. రాజులు అధర్మవర్తనులు అగుదురు. ప్రజలు పాప కర్మలు అధికం చేస్తారు. రవాణా సౌకర్యములలో యిబ్బంది ఉంటుంది. సస్యాధిపతి కుజుడు: కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రధాన్యజాతులు, ఎర్ర భూములు మంచి ఫలితాలనిస్తాయి. మెట్ట ధాన్యములు బాగా ఫలిస్తాయి. మాగాణి పంటలు, మధ్యమ ఫలితాలు యిస్తాయి. ధాన్యాధిపతి చంద్రుడు: గోవులు సమృద్ధిగా పాలు ఇచ్చును. వ్యాధులు ఉండవు. దేశము సువృష్టితో సుభిక్షంగా ఉండును. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారం, బియ్యం, చెరుకు, పంచదార ధరలు సరసముగా ఉండును అని గ్రంథాంతర వచనము. అర్ఘాధిపతి శని: అర్ఘాధిపతి శని అయినచో మహాభయములు కలుగును. వర్షములు తగ్గును. రోగ, చోర, అగ్ని భయములు కలుగును. ఆహార సౌకర్యములు తగ్గును. ప్రజలలో భయము పెరుగును. పాఠాంతరంలో నల్లభూములు, నల్లధాన్యములు, నువ్వులు, మినుములు, బొగ్గు, సీసం, చర్మవస్తువులు, ఇనుము, తారు, నల్లమందు ధరలు సరసముగా ఉండును. మేఘాధిపతి శని: వర్ష ప్రతిబంధకములు ఎక్కువ. రాజులకు ధనము లోటు ఉండును. చలిబాధలు ప్రజలకు జ్వరములు, ఆహార ధాన్యం కొరత. వ్యాధులు ప్రబలును. నల్ల ధాన్యములు బాగా పండును. రసాధిపతి గురువు: గురువు రసాధిపతి అయినచో చందన, కర్పూర, కంద మూలములు సులభముగా దొరకును. కుంకుమ పువ్వు మొదలగు ఇతర రస వస్తువులు దొరకవు. అన్ని పంటలకు అనుకూల వర్షములు ఉంటుంది. వృక్షజాతులు ఫలించును. ఆరోగ్యములు బాగుంటాయి. పాఠాంతరంలో బంగారం, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరుకు ధరలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. నీరసాధిపతి కుజుడు: పుష్ప వృక్షములు, ఫల వృక్షములు, ఫల పుష్పాదులతో కూడి ఉండును. బంగారం, మణులు, రక్తచందనము, కట్టెలు వీటికి ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయి. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరములు, రాగి, ఇత్తడి, కంచు మొదలగు వాటి ధరలు పెరిగి నిలబడును. దానిమ్మ వంటివి బాగా ఫలించును. ఇవి చదవండి: Ugadi 2024: శుభముహూర్తాలు, శుభ ఘడియల వివరాలివిగో..! -
ఉగాది వేళ బంగారం కొందామనుకుంటే.. ప్చ్!
Gold Rate today: ఉగాది వేళ బంగారం కొందామనుకున్న పసిడి ప్రియులకు బంగారం ధరలు నిరుత్సాహాన్ని కలిగించాయి. ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి దేశవ్యాప్తంగా బంగారం ధరలు మళ్లీ ఈరోజు (ఏప్రిల్ 8) పెరిగాయి. క్రితం రోజున స్థిరంగా ఉన్న పసిడి ధరలు 10 గ్రాములకు ఈరోజు రూ.490 మేర పెరిగాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , అంతర్జాతీయ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లు హెచ్చుతగ్గులు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. హైదరాబాద్ నగరంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి రూ.65,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున పెరిగి రూ.71,620 వద్దకు ఎగిసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇలా.. ♦ బెంగళూరులో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర అత్యధికంగా రూ.450 పెరిగి రూ.66,600లు ఉండగా 24 క్యారెట్ల బంగారం రూ.490 చొప్పున పెరిగి రూ.72,650 ఉంది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 ఎగిసి రూ.65,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 పెరిగి రూ.71,770 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.65,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.71,620 వద్దకు చేరింది. cost of silver today: ఇక వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా మళ్లీ పెరిగాయి. క్రితం రోజు స్థిరంగా ఉన్న రజతం ఈరోజు కేజీకి రూ.1000 చొప్పున పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.88,000 ఉంది. ఇది క్రితం రోజున రూ. 87,000 లుగా ఉండేది. -
Ugadi 2024: శుభముహూర్తాలు, శుభ ఘడియల వివరాలివిగో..!
హిందూ మతంలోని ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి. తెలుగు క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది అంటేనే కొత్త ఆశలకు పునాది. కొత్త కార్యక్రమాలను ఉత్సాహంగా ప్రారంభించుకునేందుకు మంచి ముహూర్తం. ఈ సందర్భంగా ఈ ఏడాది ముహూర్తాలు, శుభ ఘడియలు ఎలా ఉన్నాయో చూద్దాం. చైత్ర మాసం (జనవరి) 09/04 శుద్ధ పాడ్యమి మంగళ అశ్వినీ వత్సరాది త్వేన నూతన వస్త్రాభరణ ధారణాదులకు మిథునం ప.గం.11:00 నుండి 11:45. 10/04 విదియ బుధ అశ్విని వ్యాపారాదులకు మేషం ఉ.6:50. భరణి, కృత్తికలు శుభ కార్య నిషేధం. 12/04 చవితి శుక్ర రోహిణి, అన్న, వ్యాపార, మేషం ఉ.గం.7:05. సీమంతం మిథునం ప.గం.10:20. 13/04 షష్ఠి శని మృగశిర సీమంతం వశ్చికం రా.గం.8:30ల 9:00వ. 14/04 షష్ఠి ఆది ఆర్ద్ర నక్షత్ర సంబంధ కర్మలకు వృషభం ఉ.గం.8.25. మిథునోపి ప.గం.11:19. 15/04 సప్తమి సోమ పునర్వసు అన్న, అక్షర, ఉప, సీమంత, వ్యాపార, పుంసవన, దేవాలయ కర్మలు, బోరింగ్, శంఖు, వషభం ఉ.గం.8:24 విశేషం. 17/04 శ్రీరామనవమి కళ్యాణములకు కర్కాటక లగ్నం ప.గం.11:34కు ప్రారంభం. 18/04 దశమి గురు మఘ వివాహం కర్కాటకం ప.గం.12:01. అగ్ని పంచకం 8 కు ఏకాదశీ వృశ్చికము వివాహముకు విశేషం రా.గం.8:54. 19/04 ఏకాదశీ శుక్ర మఘ వివాహము మిథునం ఉ.గం.11:00 విశేషం. 20/04 ద్వాదశీ శని ఉత్తర వివాహం, గర్భ, వ్యాపారం, వృశ్చికం (సగ్రహ) రా.గం.8:30. (గృప్రలకు శనివారం) సీమంతం రా.గం.8:00ల 8:30. త్రయోదశీ శని/ఆది ఉత్తర వివాహం, అత్యవసర గృప్ర మకరం రా.గం.1:10. 21/04 త్రయోదశీ ఆది ఉత్తర అత్యవసర విషయా లకు మిథునం అగ్నిపంచకం ఉ.గం.10:50. హస్త వివాహ, వ్యాపార, సీమంతం వృశ్చికం రా.గం.8:21 (సగ్రహ చంద్ర) ధనురపి రా.గం.11:32. 22/04 చతుర్దశీ సోమ హస్త అన్న వ్యాపార, సీమంత, సమస్త వాస్తుకర్మలు, సమస్త దేవాలయ పనులు మిథునం ప.గం.10:47. చిత్త గప్ర, గర్భాదానాదులకు ధనస్సు రా.గం.11:29. సీమంత వేడుకలకు రా.గం.8:00ల 8:30. 24/04 బ.పాడ్యమి బుధ స్వాతి అన్న, వ్యాపార, వృషభం ఉ.గం.7:47. అన్న, శంకు, వ్యాపార, సీమంత, బోరింగ్, దేవాలయ పనులు, మిథునం ఉ.గం.10:38. ధనుర్లగ్నం రాత్రి 10:30 అత్యవసరం. 26/04 తదియ శుక్ర అనురాధ సమస్త వాస్తు, దేవాలయ పనులకు వివాహ, సీమంత, వ్యాపార, ఉప, అక్షర, అన్న మిథునం ఉ.గం.10:30. (6చం). వివాహ గప గర్భాదానం ధనస్సు రా.గం.10:30. 27/04 చవితి శని జ్యేష్ఠ అత్యవసర విషయములకు మిథునం ప.గం.9:30. 28/04 పంచమి ఆది మూల వివాహం ధనస్సు రా.గం.11:50. లగ్న చంద్ర. సీమంత వేడుకలకు వృశ్చికం రా.గం.7:30ల 8:00 (6శుక్ర). సూచన 28 రాత్రి తెల్లవారితే 29 శుక్ర మూఢమి ప్రారంభం. 02/05 నవమి గురు ధనిష్ఠ అన్న, సీమంత మిథునం ఉ.గం.9:01. 03/05 దశమి శుక్ర శతభిష అన్న, సీమంత మిథునం ఉ.గం.10:01. 05/05 ద్వాదశీ ఆది ఉత్తరాభాద్ర అన్న సీమంత మిథునం ఉ.గం.9:50. 06/05 త్రయోదశీ సోమ రేవతి అన్న సీమంత మిథునం ఉ.గం.9:45 వైశాఖ మాసం (ఫిబ్రవరి) 10/05 తదియ శుక్ర రోహిణి అన్న, సీమంత, డోలా రోహణ మిథున ఉ.గం.9:30. 12/05 పంచమి ఆది పునర్వసు సీమంతాదులకు వృశ్చిక రా.గం.7:30ల 8:00. 13/05 షష్ఠి సోమ పునర్వసు అన్న, సీమంతాదులకు డోలారోహణం మిథున ఉ.గం.9:15. పుష్యమి సీమంతం వృశ్చికం రా.గం.7:30. 18/05 దశమి శని ఉత్తర అన్న, సీమంత, ఊయల, బోరింగ్, మిథునం ఉ.గం.8:55. సీమంతం వృశ్చికోగ్నిః రా.గం.7:00ల 7:30. 19/05 ఏకాదశీ ఆది హస్త మిథునం ఉ.గం.8:30. 20/05 ద్వాదశీ సోమ చిత్త అన్న, సీమంత, ఊయల, బోరింగ్ మిథునం ఉ.గం.8:50. 23/05 పౌర్ణిమ గురు అనురాధ అన్న, సీమంత, ఊయల, బోరింగ్ కర్కాటకం ప.గం.11:01. సీమంతాదులకు ధనస్సు రా.గం.8:30. 24/05 పాడ్యమి శుక్ర అనురాధ అన్న, బోరింగ్, సీమంతం, ఊయల మిథునం ఉ.గం.7:30 (6చం) 26/05 తదియ ఆది మూల అన్న, బోరింగ్, సీమంతం, ఊయల మిథునం ఉ.గం.8:10. 27/05 చవితి సోమ ఉ.షాఢ అన్న, బోరింగ్, సీమంత ధనుః ఉ.గం.10:45. 29/05 షష్ఠి బుధ శ్రవణం మిథునం ఉ.గం.8:01. సప్తమి ధనిష్ఠ సీమంతం ధనస్సు రా.8:00. 30/05 సప్తమి గురు శతభిషం అన్న, బోరింగ్, సీమంతం కర్కాటకం ఉ.గం.9:01 (8 చం,శ) 01/06 దశమి శని ఉత్తరాభాద్ర కటకం ఉ.గం.8:50. 02/06 ఏకాదశీ ఆది రేవతి కటకం ఉ.గం.8:50. జ్యేష్ట మాసం (మార్చి) 07/06 పాడ్యమి శుక్ర మృగశిర కర్కాటకలగ్నం ఉ.గం.10:01 (8 శని) 09/06 తదియ ఆది పునర్వసు అన్న, సీమంత, బోరింగ్ మిథునం ఉ.గం.7:40. 10/06 చవితి సోమ పుష్యమి అన్న, సీమంత, బోరింగ్ కర్కాటకం ఉ.గం.8:34 (8 శని) 13/06 సప్తమి గురు పుబ్బ కర్కాటకం ఉ.గం.8:30 (8 శని) 14/06 అష్టమి శుక్ర ఉత్తర కర్కాటకం ఉ.గం.8:22 (సంక్రమణం) 15/06 నవమి శని హస్త కర్కాటకం ఉ.గం.8:22 (సంక్రమణం) 17/06 ఏకాదశీ సోమ చిత్త కర్కాటకం ఉ.గం.8:01. అన్న, సీమంత, స్వాతి సీమంతం మకరం రా.గం.8:30ల 9:30. 19/06 త్రయోదశీ బుధ అనురాధ సా.గం.6:40. గోధూళి 20/06 చతుర్దశీ గురు అనురాధ కర్కాటకం అన్న, సీమంత కటకం ఉ.8:35. 21/06 పౌర్ణిమ శుక్ర మూల సీమంతం మకరం రా.గం.8:15ల 8:30. 22/06 పాడ్యమి శని మూల అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:25. 23/06 విదియ ఆది ఉత్తరాషాఢ సీమంత మకరం రా.గం.8:15ల 8:20. 24/06 తదియ సోమ ఉత్తరాషాఢ అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:15. సీమంతం మకరం రా.8:01 (6శుక్ర) 26/06 పంచమి బుధ ధనిష్ఠ అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:08. 27/06 షష్ఠి గురు శతభిషం అన్న, సీమంతం కర్కాటకం ఉ.8:04. 29/06 అష్టమి శని ఉ.భా. అన్న, సీమంత కర్కాటకం ఉ.8:00. 30/06 నవమి ఆది రేవతి కర్కాటకం ఉ.గం.8:00. 01/07 దశమి సోమ అశ్విని కర్కాటకం ఉ.8:00. 03/07 ఏకాదశీ బుధ రోహిణి కర్కాటకం ఉ.8:00. ఆషాఢ మాసం (ఏప్రిల్) 06/07 పాడ్యమి శని పునర్వసు వృశ్చిక సా.గం.4:01. 07/07 విదియ ఆది పుష్యమి అన్న, సీమంత కర్కాటకం ఉ.గం.7:01. సీమంతం మకరం రా.గం.7:30ల 8:30. 11/07 పంచమి గురు పుబ్బ కర్కాటకం ఉ.గం.7:30. షష్ఠి ఉత్తర సీమంతం రా.గం.7:30ల 8:00. మూఢమి వెళ్ళి ఉత్తరాయనం వున్న కారణంగా దేవాలయ కార్యములు 16 వరకు గ్రాహ్యము. 12/07 సప్తమి శుక్ర హస్త సీమంతం మకర రా.గం.7:30. 13/07 అష్టమి శని చిత్త సీమంత మకరం రా.గం.7:30. 14/07 అష్టమి ఆది చిత్త అన్న, సీమంత కర్కాటకం ఉ.గం.7:30. నవమి సీమంతం మకరం రా.గం.7:30. 15/07 నవమి సోమ స్వాతి అన్న, అక్షర, సీమంత, దేవాలయ ముహూర్తములు కటకం ఉ.7:30. 17/07 ఏకాదశీ బుధ అనురాధ తుల ప.గం.1:30 (8 కుజ) వృశ్చికం సా.4:01. సీమంతాదులకు ధనస్సు సా.5:30. 19/07 త్రయోదశి శుక్ర మూల సీమంతం ధనుః రా.గం.6:01. 21/07 పాడ్యమి ఆది ఉత్తరాషాఢ సీమంతం ధనస్సు సా.గం.4:30. 22/07 పాడ్యమి సోమ శ్రవణం అన్న, సీమంతం తుల ప.గం.12:01. విదియ సీమంత ధనుః రా.గం.5:30. 24/07 చవితి బుధ శతభిషం సీమంతం ధను సా.గం.5:30. 26/07 షష్ఠి శుక్ర ఉత్తరాభాద్ర అన్న, సీమంత తుల ప.గం.12:01. 27/07 సప్తమి శని రేవతీ అన్న, సీమంత తుల ప.గం.12:01. ధనస్సు సా.గం.4:45ల 5:00. 31/07 ఏకాదశి బుధ రోహిణి అన్న, సీమంత తుల ప.గం.11:30. ధనస్సు సా.గం.4:45ల 5:00. 01/08 ద్వాదశీ గురు మగశిర అన్న, సీమంత తుల ప.గం.11:30. 02/08 చతుర్దశీ శుక్ర పునర్వసు ధనస్సు సా.గం.5:01. శ్రావణ మాసం (మే) 05/08 విదియ సోమ మఘ మేషం రా.గం.11:39. 07/08 చవితి బుధ ఉత్తర వివాహం, గర్భాదానం మేషం రా.గం.11:34. బుధ/గురు వివాహం, గప్ర మిథునం తె.గం.2:30. 08/08 చవితి గురు ఉత్తర సీమంతం, వ్యాపారం ధనస్సు ప.గం.4:45. పంచమి గురు హస్త వివాహం, గప్ర మేషం రా.గం.11:27. గురు/శుక్ర మిథునం వివాహం, శంకు తె.గం.3:45. 09/08 పంచమి శుక్ర హస్త అన్న, సీమంత తుల ప.గం.11:01 (8 కు) సీమంతం ధనుః సా.గం.4:45. వివాహ, గర్భా మేషం రా.గం.11:23. షష్ఠి చిత్త శంకు గృప్ర మిథునం తె.గం.3:41. 10/08 షష్ఠి శని చిత్త సీమంతం, వ్యాపారం ధనుః సా.గం.4:00ల 4:30. సప్తమి శని/ఆది స్వాతి మిథునం తె.గం.3:44 విశేషం. 11/08 సప్తమి ఆది స్వాతి అన్న, అక్షర, సీమంతా దులకు తుల ప.గం.12:01 (8 కు) గర్భ, వివాహం మేషం రా.గం.11:19. ఆది సోమ మి«థునం తె.గం.3:01. 15/08 ఏకాదశీ గురు మూల తుల ప.గం.12:01 (8 కుజ) సీమంతం ధనస్సు సా.గం.4:15. వివాహం మేషం రా.గం.10:58. గురు/శుక్ర వివాహం, శంకు, మిథునం, వాస్తు కర్మలు వివాహం తె.గం.3:14. 17/08 త్రయోదశీ శని ఉత్తరాషాఢ సీమంత, వ్యాపార ధనుః ప.గం.3:50. వివాహం మేషం రా.గం.10:55. మిథునం తె.గం.3:10. 18/08 చతుర్దశి ఆది శ్రవణం సమస్త శుభాలకు తుల ప.గం.11:39. శ్రవణం మేషం రా.గం.10:51. వివాహం మిథునం తె.గం.5:06. కర్కాటక సంబంధిత కార్యములు తె.గం.4:30. 19/08 పౌర్ణిమ సోమ ధనిష్ఠ వివాహం మేషం రా.గం.10:47. సీమంతం, వ్యాపారం మకరం సా.గం.5:10ల 5:30. 22/08 తదియ గురు ఉత్తరాభాద్ర తుల ప.గం.11:23 (8 కుజ). వ్యాపారం ధనస్సు ప.గం.2:30. సీమంతాదులకు మకరం ప.గం.5:15. చవితి వివాహం, గర్భ, మేషం రా.గం.10:32. గురు/శుక్ర వివాహ, గృప్ర మిథునం తె.గం.2:50. కర్కాటకం తె.గం.4:30. 23/08 చవితి శుక్ర రేవతి తుల ప.గం.11:19 (8 కుజ) వ్యాపారం, సీమంత పంచమి మకరం సా.గం.5:11. వివాహం మేషం రా.గం.10:28. అశ్విని శుక్ర/ శని శంకు, గృప్ర మిధునం తె.గం.2:46. కర్కాటక తె.గం.4:30. 24/08 షష్ఠి శని అశ్విని వ్యాపారాదులకు ధనస్సు 2:00ల 3:00. మేషం రా.గం.10:17 వివాహం. 28/08 దశమి బుధ మృగశిర సమస్త శుభాలకు, దేవాలయ పనులకు, వాస్తు కర్మలకు తుల ప.గం.11:00. భాద్రపద మాసం (జూన్) 04/09 విదియ బుధ ఉత్తర అన్న, సీమంత వ్యాపారం తుల ఉ.గం.10:28. 05/09 విదియ గురు హస్త అన్న, సీమంత తుల ఉ.గం.9:01. 06/09 తదియ శుక్ర చిత్త అన్న, సీమంత తుల ప.గం.10:25. 07/09 చవితి శని చిత్త అన్న, సీమంత తుల ప.గం.10:21. గణేశ చతుర్థి. 08/09 పంచమి ఆది స్వాతి అన్న, సీమంత తుల ప.గం.10:17. 09/09 షష్ఠి సోమ అనురాధ మకరం ప.గం.4:00ల 4:30 సీమంతం. 12/09 నవమి గురు మూల మకరం ప.గం.4:00ల 4:30 సీమంతం 14/09 ఏకాదశి శని ఉత్తరాషాఢ మకరం ప.గం.4:00. 15/09 ద్వాదశీ ఆది శ్రవణం అన్న, సీమంతం తుల ఉ.గం.9:49. 16/09 త్రయోదశి సోమ ధనిష్ఠ అన్న, సీమంతం తుల ఉ.గం.9:45. మహాలయ పక్షం 18 ప్రారంభం. శుభకార్య నిషేధం. ఆశ్వీయుజ మాసం (జూలై) 03/10 పాడ్యమి గురు హస్త కలశస్థాపనాది సర్వములకు తుల ఉ.గం.7:00 ప్రా. 04/10 విదియ శుక్ర చిత్త అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు, బోరింగ్ తుల ఉ.గం.7:30. వ్యాపారాదులకు మకరం ప.2:00ల 3:00. స్వాతి మేషం రా.గం.7:33. వృషభం రా.గం.8:30. 05/10 తదియ శని స్వాతి అన్న, అక్షర, సీమంత, వ్యాపారం, దేవాలయ పనులకు, బోరింగ్ తుల ఉ.గం.8:30. మేషం సా.గం.6:30ల 7:00. 07/10 పంచమి సోమ అనురాధ అన్న, అక్షర, సీమంత, వ్యాపారం, దేవాలయ పనులకు, బోరింగ్ తుల ఉ.గం.8:20. వ్యాపారాదులకు మకరం ప.గం.2:30. మేషం రా.గం.7:35. 09/10 సప్తమి మూల బుధ మకరం ప.గం.2:11. మేషం సా.గం.7:00. 10/10 అష్టమి గురు పూర్వాషాఢ యంత్ర పూజలు మకరం ప.గం.2:00ల 2:30. 11/10 నవమి శుక్ర ఉత్తరాషాఢ యంత్ర పూజ, వాహన పూజలు తుల ఉ.గం.7:00ల 8:00. మకరం ప.గం.2:00ల 2:15. 12/10 విజయదశమి సందర్భంగా మకరం ప.గం.2:00ల 2:15. 13/10 ఏకాదశీ ఆది ధనిష్ఠ అన్న, అక్షర వైశ్యోపనయన, వివాహ, శంకు, బోరింగ్, దేవాలయ పనులు, వ్యాపారం తుల ఉ.గం.7:57. మకరం వ్యాపారం ప.గం.1:37. వివాహం మేషం రా.గం.7:06. శతభిషం కర్కాటకం రా.గం.1:10. 14/10 ద్వాదశీ సోమ శతభిషం మకరం ప.గం.10:34. మేషం రా.గం.7:02. 16/10 చతుర్దశీ బుధ ఉత్తరాభాద్ర వ్యాపారాదులకు మకరం 1:27. మేషం వివాహాదులకు సా.గం.6:35. వివాహ, గృప్ర, గర్భాదానం వృషభం రా.గం.8:24. 17/10 పౌర్ణమి గురు రేవతి సమస్త శుభాలకు మకరం ప.గం.12:30ల 1:00. అశ్విని వివాహం వషభం రా.8:20. 20/10 చవితి ఆది రోహిణి వృషభం రా.గం.8:15. వివాహ, గప్ర, గర్భాదానాదులకు మిథునం రా.గం.10:59. 21/10 చవితి సోమ మృగశిర మకరం ప.గం.1:30. గృప్రలకు వషభం రా.గం.8:12 మిధునం రా.గం.10:55. అన్న, అక్షర, గృప్ర, వృశ్చికం ఉ.గం.8:25. 23/10 సప్తమి బుధ పునర్వసు మిథునం రా.గం.9:30. 24/10 అష్టమి గురు పుష్యమి మకరం ప.గం.12:15ల 12:30. మిథునం రా.గం.10:30. 26/10 దశమి శని మఘ వివాహం మిథునం రా.గం.10:35. 27/10 ఏకాదశీ ఆది మఘ వివాహం వృశ్చికం ఉ.గం.8:11. మకరం ప.12:15. కార్తీక మాసం (ఆగస్టు) 03/11 విదియ ఆది అనురాధ అన్న, అక్షర వైశ్యో పనయన, వివాహ, దేవాలయ పనులు, వాస్తు కర్మలు, సీమంత, పుంసవన, ఊయల, నామకరణం, జాతకర్మ మకరం ప.గం.11:59. వివాహం గృప్ర వృషభ రా.7:12. గర్భ, గృప్ర, వివాహం మిధునం రా.గం.10:03 (6శు) 04/11 తదియ సోమ జ్యేష్ఠ వృశ్చికం ఉ.గం.7:33. 07/11 షష్ఠి గురు ఉత్తరాషాఢ వృషభం రా.గం.7:30ల 8:00 సీమంతం, వివాహం మిథునం రా.గం.9:50. 08/11 సప్తమి శుక్ర ఉత్తరాషాఢ సమస్త శుభాలకు వృశ్చికం ఉ.గం.7:20. 09/11 అష్టమి శని శ్రవణం వృశ్చికం ఉ.గం.8:15. నవమి ధనిష్ఠ వివాహాదులకు వృషభం రా.గం.6:53. నవమి వివాహం మిథునం రా.9:46. 10/11 నవమి ఆది ధనిష్ఠ సమస్త శుభాలకు, వైశ్యోపనయన, వాస్తుకర్మలు, దేవాలయ పనులకు వృశ్చికం 7:20. విశేషం. శతభిషం వృషభం రా.6:30. దశమి ఆది మిథునం రా.గం.9:40. 11/11 ఏకాదశి సోమ పూర్వాభాద్ర మిథునం రా.గం.8:00ల 8:30. 13/11 ద్వాదశీ బుధ రేవతి వృశ్చికం సమస్త కార్యములు ఉ.6:54. 14/11 త్రయోదశీ గురు అశ్విని సమస్త శుభాలకు వృశ్చికం ఉ.6:50. 17/11 విదియ ఆది రోహి వివాహం, గర్భ, గృప్ర, వ్యాపార, సీమంతాదులకు మిథునం రా.గం.7:30ల 8:00. పుష్కరాంశ 9:07. విదియ ఆది రోహిణి ధనస్సు ఉ.గం.9:30 (8 కు) శంకు వివాహం తుల తె.5:42. 18/11 తదియ సోమ మృగశిర వ్యాపారం, సీమంతం సా.5:00. 20/11 షష్ఠి బుధ పుష్యమి గృప్ర, గర్భదానం, వ్యాపారం మిథునం రా.8:53. 22/11 అష్టమి శుక్ర/శని మఘ వివాహం తుల తె.గం.5:22. 24/11 దశమి ఆది/సోమ ఉత్తర వివాహం, శంకు, బోరింగ్ తుల తె.గం.5:14. 25/11 దశమి సోమ ఉత్తర గర్భ, గృప్ర, మిథునం రా.గం.8:33. 28/11 త్రయోదశీ బుధ స్వాతి మిథునం రా.8:28. మార్గశిర మాసం (సెప్టెంబరు) 02/12 విదియ సోమ మూల మేషం ప.గం.4:01. మిథునం రా.గం.7:30ల 8:00. 04/12 చవితి బుధ ఉత్తరాషాఢ వివాహం గర్భ, గృప్ర, మి«థునం రా.గం.8:04. 05/12 పంచమి గురు ఉత్తరాషాఢ వ్యాపారం మేషం ప.గం.3:50. శ్రవణం వివాహం, గర్భ మి«థునం రా.గం.7:49. గురు/శుక్ర శంకుస్థాపన, వ్యాపారం తుల తె.గం.4:30. 06/12 షష్ఠి శుక్ర శ్రవణం వ్యాపారం మేషం ప.గం.3:45. ధనిష్ఠ సీమంతాదులకు మిధునం రా.గం.7:00ల 7:30. శుక్ర/శని వివాహం, శంకు, బోరింగ్ తుల తె.గం.4:30. 07/12 సప్తమి శని శతభిషం వివాహ గృప్ర మిథునం రా.గం.7:46. వ్యాపారం మేషం ప.గం.3:41. శంఖు, బోరింగ్, వివాహం తుల తె.గం.4:26. 09/12 నవమి సోమ ఉత్తరాభాద్ర మిథునం రా.గం.7:39. 14/12 చతుర్దశి శని రోహిణి మేషం ప.గం.3:08 వ్యాపారాదులకు. పౌర్ణమి శని రోహిణి వివాహం, గృప్ర, గర్భాదానం మిథునోగ్ని రా.గం.7:26. శంకు, బోరింగ్, వివాహం, వ్యాపారం తుల తె.గం.3:55 (కోరల పౌర్ణిమ) 15/12 పాడ్యమి ఆది మృగశిర వ్యాపారం మేషం ప.గం.3:04. 18/12 చవితి బుధ/గురు రోహిణి తుల రా.తె.గం.3:01. 20/12 షష్ఠి శుక్ర/శని మఘ వివాహం తుల రా.తె.గం.3:30. 22/12 అష్టమి ఆది/సోమ ఉత్తర వృశ్చికం తె.గం.4:19 సమస్త శుభాలకు. 24/12 దశమి మంగ/బుధ చిత్త వృశ్చికం తె.గం.4:11 శంకు. 25/12 ఏకాదశీ బుధ/గురు స్వాతీ వివాహ, శంకు, బోరింగ్ వృశ్చికం తె.గం.4:08లకు. పుష్య మాసం (అక్టోబర్) 01/01 విదియ బుధ ఉత్తరాషాఢ మేషం ప.గం.12:55. 02/01 తదియ గురు శ్రవణం మేషం ప.గం.12:55. వృషభం ప.గం.4:00. 03/01 చవితి శుక్ర ధనిష్ఠ మేషం ప.గం.12:50. వృషభం ప.గం.3:10. 04/01 పంచమి శని శతభిషం మేషం ప.గం.12:50. వృషభం ప.గం.3:10. 06/01 సప్తమి సోమ ఉత్తరాభాద్ర మేషం ప.గం.12:30. 08/01 నవమి బుధ అశ్విని మేషం ప.12:30. 11/01 త్రయోదశి శని రోహిణి మేషం ప.12:10. 12/01 చతుర్దశి ఆది మృగశిర మేషం ప.12:10. ఉత్తరాయనం అనుసరించి దేవాలయ పనులు అనుష్ఠించవచ్చు. 19/01 షష్ఠి ఆది ఉత్తర అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు మేషం ప.గం.12:01. 20/01 సప్తమి సోమ, హస్త, అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు, అత్యవసర ఉపనయన, శంకు మేషం ప.గం.12:01. 24/01 దశమి శుక్ర అనురాధ అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులకు అత్యవసర ఉపనయన / శంకు మేషం ప.గం.12:01. 26/01 ద్వాదశీ ఆది మూల మేషం ప.12:01. మాఘ మాసం (నవంబర్) 30/01 పాడ్యమి గురు ధనిష్ఠ అన్న, సీమంత, వ్యాపారం మేషం ప.గం.11:59. 31/01 విదియ శుక్ర శత అన్న, అక్షర, సీమంత, దేవాలయ పనులు, వాస్తు కర్మలు, వివాహం, అత్యవసర ఉపనయనం, వ్యాపారం, ఊయల మేషం ప.గం.11:55. 02/02 చవితి ఆది ఉత్తరాభాద్ర అన్న, అక్షర, సీమంత, వ్యాపార, అత్యవసర ఉపనయన, వివాహం దేవాలయ పనులు, వాస్తు కర్మలు, ఊయల, వ్యాపారం మేషం ప.గం.11:51. 03/02 షష్ఠి సోమ రేవతి అన్న, అక్షర వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, ఊయల, సీమంత మేషం ప.గం.11:47. 07/02 దశమి శుక్ర రోహిణి అన్న, అక్షర, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, వివాహం, అత్యవసర ఉపనయనం, సీమంతం, ఊయల మేషం ప.గం.11:43. 08/02 ఏకాదశి శని మృగశిర అన్న, అక్షర, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, వివాహం అత్యవసర ఉపనయనం, ఊయల, సీమంతం ప.గం.11:39. గృప్ర. వృషభం ప.గం.12:15. 10/02 త్రయోదశీ సోమ పునర్వసు అన్న, అక్షర, ఉప, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం, సీమంతం, ఊయల మేషం ప.గం.11:34. వృషభోపి ప.12:01. 13/02 బ.పాడ్యమి గురు మఘ వివాహం వృషభం ప.గం.12:01. 14/02 తదియ శని ఉత్తర ఉపనయనం (వారదోషం), అన్న, అక్షర, సీమంత, వాస్తుకర్మలు, దేవాలయ పనులు, ఊయల, వ్యాపారం, వివాహం మేషం ఉ.గం.11:01. 15/02 చవితి హస్త ఆది వృషభం ప.గం.11:59. 17/02 పంచమి సోమ చిత్త అన్న, అక్షర, సీమంత, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపారం మేషం ఉ.గం.10:45. 18/02 సప్తమి మంగళ/బుధ స్వాతి మకరం తె.గం.5:45. 20/02 అష్టమి గురు అనురాధ మేషం ప.గం.10:01. వృషభం ప.గం.11:59. 21/02 నవమి శుక్ర అనురాధ సమస్త శుభకర్మలు, వాస్తు కర్మలు, దేవాలయ పనులు, వ్యాపార పనులకు మేషం ఉ.గం.10:38 వషభం ప.గం.12:01. 23/02 దశమి ఆది మూల సమస్త శుభములకు మేషం ఉ.గం.10:01. వషభం ప.గం.12:01. ఫాల్గుణ మాసం (డిసెంబర్) 01/03 తదియ శని/ఆది ఉత్తరాభాద్ర వివాహం, శంకు, వ్యాపారం మకరం తె.గం.4:30. 02/03 తదియ ఆది అన్న అక్షర, సీమంత, వ్యాపార, ఊయల, ఉప, వివాహం, దేవాలయ పనులు, వాస్తుకర్మలు మేషం ప.గం.9:58 విశేషం. వృషభం ప.గం.11:29. చవితి ఆది/సోమ రేవతి శంకు, వివాహం మకరం తె.గం.4:28. 03/03 చవితి సోమ రేవతి సమస్త శుభాలకు, వాస్తు కర్మలకు మేషం ఉ.గం.9:51. వృషభం అశ్విని ప.గం.11:20. 06/03 సప్తమి గురు రోహిణి అన్న, అక్షర, సీమంత, ఉప, వ్యాపార, దేవాలయ కర్మలు, వాస్తు కర్మలు మేషం ఉ.గం.9:12. వృషభం ఉ.గం.11:30. 09/03 ఏకాదశీ ఆది/సోమ పుష్యమీ శంకు మకరం తె.గం.3:56. 10/03 ఏకాదశీ సోమ పుష్యమి అన్న, అక్షర, ఊయల, సీమంత, శంకు, బోరింగ్, దేవాలయ పనులు, వ్యాపారం మేషం ఉ.గం.8:40. 14/03 పౌర్ణమి శుక్ర ఉత్తర వృషభం ఉ.గం.10:30. 15/03 పాడ్యమి శని హస్త వృషభం ఉ.గం.10:30. అన్న, సీమంత, ఊయల. 16/03 విదియ ఆది హస్త వృషభం ఉ.గం.9:50. 17/03 తదియ సోమ చిత్త అన్న, సీమంత, ఊయల వృషభం ఉ.గం.10:15. 20/03 షష్ఠి గురు అనురాధ అన్న, సీమంత, ఊయల వృషభం ఉ.గం.10:15. 22/03 అష్టమి శని మూల వృషభం ఉ.గం.10:08. 24/03 దశమి సోమ ఉత్తరాషాఢ వృషభం ఉ.గం.10:00. ఇవి చదవండి: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే.. -
ప్ర‘పంచాంగం’
విశ్వంలో ఏదైనా చక్రగతిలోనే తప్ప సరళరేఖలో సాగదు; మానవజీవితమూ దీనికి మినహాయింపు కాదు. పగటిని రాత్రి అనుసరిస్తుంది; సూర్యుని చంద్రుడూ, నక్షత్రాలూ అనుసరిస్తాయి. మనిషి జీవితంలోనూ సుఖాల వెలుగును వెన్నంటే కష్టాల చీకట్లూ ఉంటాయి. జీవపరిణామక్రమంలో మనిషిలో మెదడు అభివృద్ధి చెంది ఆలోచన పదునెక్కినకొద్దీ అతణ్ణి అమితంగా తికమక పెట్టిన వాటిలో ఈ చక్రగమనం ఒకటి. మనుగడ పూర్తిగానూ, నేరుగానూ ప్రకృతివనరులపై ఆధారపడిన ఆదిమకాలంలో వేడి, వర్షం, చలి చక్రగతిని ఎందుకు అనుసరిస్తాయన్నది, కడుపు నిండిన తర్వాత కలిగే జిజ్ఞాస కాదు; కడుపు నింపుకోవడంతో ముడిపడిన చిక్కుప్రశ్న. ఈ ఋతుపరివర్తనలో అతని చుట్టూ ఉన్న పరిసరాలు మారిపోయి; తను ఆహారం కోసం ఆధారపడిన కొన్ని రకాల జంతువులు అదృశ్యమై, కొత్తవి అడుగుపెడుతున్నాయి! దీనిని అర్థంచేసుకోడానికీ, దీనికి ఎవరు కారణమో తెలుసుకోడానికీ సమయం పట్టింది. పెరిగి తరిగే చంద్రకళలే కారణమనుకుని వాటిని కాలానికి అన్వయించుకుని ఋతుచక్రానికి కాలచక్రాన్ని జోడించుకున్నాడు. అలా కాలగణనంలో చాంద్రమానం అడుగుపెట్టి ఇప్పటికీ ఒక సంప్రదాయంగా కొన సాగుతోంది. ఆ క్రమంలోనే రేపు, అంటే చైత్ర శుక్ల పాడ్యమి నాడు మనం జరుపుకొంటున్నది స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఉగాది. ఉగాదిని ఇప్పుడు మనం ఒక పండుగగానే భావిస్తాం; గడిచిన ఏడాది ఎదురైన కష్టనష్టాలూ, ఆశాభంగాల పాత దుస్తులు విడిచేసి కొత్త ఆశలూ, ఉత్సాహాల ఉడుపులు ధరించే సందర్భమను కుంటాం; ఆరు రుచుల సమ్మేళనంగా జీవితాన్ని సంకేతించేదిగా గుర్తుపెట్టుకుంటాం; పంచాంగ శ్రవణానికీ, కవితా శ్రవణానికీ కూడా చెవులు అప్పగిస్తాం. నూతనశోభకు, శుభానికి తలుపు తెరిచేలా తోచే ఏ సందర్భమైనా పండుగే. అయితే, ఉగాది పేరిట కొత్త సంవత్సర ప్రారంభాన్ని పండుగగా మలచడం వెనుక ఎంతో కథ ఉంది; అంతుబట్టని కాలచక్రపు తిప్పుళ్ళకు బిత్తరపోయి, తిరిగి నిలదొక్కుకోడానికి బతుకు చేసే పెనుగులాట ఉంది; కాలగమనాన్ని అర్థం చేసుకోవడానికి పడిన అంతులేని వైజ్ఞానిక ప్రయాస ఉంది; మనం అనాగరికునిగా పొరబడే ఆదిమానవుణ్ణే తొలి ఖగోళ వేత్తగా రూపించి నిరూపించే అద్భుత నేపథ్యం ఉంది. తప్పులు, సవరణల రూపంలో సాగిన ఆ కాలగణనం కసరత్తులోకి తొంగిచూసినప్పుడు నాటి మానవుల ఆరాటపోరాటాలతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలు మన కళ్లను మెరుపులా తాకి ఆశ్చర్యం గొలుపుతాయి. చంద్రుని వృద్ధిక్షయాల ఆధారంగా కాలాన్ని గణించడం, యాభైవేల సంవత్సరాల క్రితమే పాతరాతియుగంలో మొదలైనట్టు శాస్త్రవేత్తలు నిరూపించారు. అప్పటి గుహాచిత్రాలలో కనిపించిన పొడవాటి దండాన్ని చంద్రకళల ఆధారంగా కాలాన్ని కొలిచే సాధనంగా గుర్తించారు. ఇప్పటికీ పన్నెండు రాశులలో ఒకటిగా ఉన్న మేషరాశిని సూచించే పొట్టేలు బొమ్మతో సహా వివిధ జంతు వుల బొమ్మలు ఆ దండంపై ఉన్నాయి. అనంతరకాలంలో పురోహితులు, మాంత్రికులు, పాలకులు ధరించే దండాలకు అదే మాతృక అయినట్టు తేల్చారు. చంద్రునితో ఋతువుల మార్పును ముడి పెట్టి చాంద్రమానానికి అలా తెరదీయడం గొప్ప ముందడుగే కానీ; ఋతుచక్రానికి, చాంద్రమానంలోని మాసచక్రానికి పొంతన కుదరకపోవడంతో, ఋతుపరివర్తనకు సూర్యుడు కారణమన్న ఎరుక పుట్టి సౌరమానం అడుగుపెట్టింది. భూమి తనచుట్టూ తాను తిరుగుతూ; ఇరవైమూడున్నర డిగ్రీల ఒంపుతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందన్న గ్రహింపు లేని ఆ కాలంలో కూడా సంవత్స రానికి 300 నుంచి 400 రోజులను లెక్కగట్టడాన్ని నేటి శాస్త్రవేత్తలు అబ్బురంగానే పరిగణిస్తారు. చాంద్రమానం సంవత్సరానికి 354 రోజులను లెక్కిస్తే, మరింత నిర్దుష్టమైన సౌరమానం 365 పైచిలుకు రోజులను లెక్కించింది. రెంటిమధ్యా ఉన్న 11 రోజుల పైచిలుకు తేడాను సరిపెట్టి రెండు మానాలనూ సమన్వయించడం ఖగోళ పండితులకు పెద్ద సవాలే అయింది. రోమన్, జూలి యన్, గ్రెగేరియన్ లాంటి ఎన్ని కాలగణన పద్ధతులు వచ్చినా ఇలాంటి సమస్యలు నేటికీ అపరిష్కృతంగానే ఉన్నాయని ‘కేలండర్ కథ’ అనే పుస్తకంలో డా. మహీధర నళినీమోహన్ అంటారు. మనదేశానికి చెందిన భాస్కరాచార్యులు సహా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఖగోళపండితులు సంవత్సరానికి 365 రోజుల పైచిలుకును సక్రమంగానే గుర్తించారు. కానీ అందులో ప్రకృతి సిద్ధంగా ఉన్న భిన్నాంకం వారి మేధకు లొంగేది కాదు. చాంద్రమానంలో భాగమైన నెలకు 29 రోజుల పైచిలుకు లెక్కా అలాంటిదే. భూభ్రమణంలో ఒంపు వల్ల కాలగణనంలో ఏర్పడే ఆ వైవిధ్యమే లేనప్పుడు ఋతుపరివర్తనే అంతరించి మరింత విషమసమస్య తలెత్తే మాటా నిజమే. మొత్తంమీద అప్పటినుంచీ ఇప్పటివరకూ కేవల చాంద్రమానం, కేవల సౌరమానం; చాంద్ర– సౌరమానాల సమన్వయం అనే మూడు పద్ధతులూ అమలులో ఉన్నాయి. విశేషమేమిటంటే, కాల గణనానికి అనుసరించిన పద్ధతుల్లోనూ, ఆ క్రమంలో ఎదురైన సమస్యల పరిష్కారంలో సాఫల్య, వైఫల్యాలలోనూ ప్రపంచానుభవం ఒక్కలాంటిదే. కనుక ‘పంచాంగం’ అనే మాటను ‘ప్రపంచాంగం’గానూ చెప్పుకోవడంలో తప్పులేదు. పైన చెప్పిన సౌర, చాంద్రమానాల సమన్వయాన్నే ‘యుగం’ అంటారని ‘జనకథ’ అనే పుస్తకంలో రాంభట్ల కృష్ణమూర్తిగారి వివరణ. అధికమాసాలను పాటించడం ఇందులో భాగమే. అప్పుడు కూడా రెండు మానాల సమన్వయం అయిదేళ్ళకోసారే సాధ్యమవుతుంది. అదే అసలైన ‘యుగాది’. ఇప్పుడు ‘ఉగాది’ పేరుతో ఏటా జరుపుకొంటున్నాం. -
ఈ రాశి వారికి నూతన ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు
వృషభ రాశి ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–7, అవమానం–3. కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ) మృగశిర 1,2 పాదములు (వే,వో) గురువు మే 1 వరకు మేషం (వ్యయం)లోను తదుపరి వృషభం (జన్మం)లోను సంచరిస్తారు. శని కుంభం (దశమం)లోను రాహువు మీనం(లాభం)లోను కేతువు (పంచమం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో నూతనోత్సాహంతో పనులు చేస్తుంటారు. భోజనం, నిద్ర, వస్త్రధారణ వంటి నిత్యకృత్యాలు బాగా సానుకూలమై ఆనందిస్తారు. అన్ని కార్యములలో ధనవ్యయం అధికమవడం, విఘ్నాలు రావడం జరిగినా, చివరకు కార్యవిజయం సాధిస్తారు. విజ్ఞాన విషయాలు తెలుసుకోవడంలో కాలక్షేపం బాగా జరుగుతుంది. విహార యాత్రలు, వినోద కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ఏది ఏమైనా ఆనందంగా కాలక్షేపం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ విషయాలలో ప్రతి ప్రయత్నంలోనూ శ్రమ, విఘ్నాలు ఉంటాయి. అయితే తెలివిగా, ధైర్యంగా నిర్ణయాలు చేసి సమస్యలను అధిగమించగలుగుతారు. అధికారుల నుంచి వచ్చే ప్రతిఘటనలను చక్కగా ఓర్పుగా సరిచేయగలుగుతారు. వ్యాపారులకు ప్రభుత్వ పాలసీలు, అధికారుల ప్రవర్తన కొంచెం చికాకులు స్పష్టిస్తాయి. తరచుగా బుద్ధి భ్రంశానిరి లోనయినా, మళ్లీ త్వరగా తేరుకుంటారు. నూతన ప్రయత్నాలలో చాలా సానుకూల ఫలితాలు అందుకుంటారు. మంచికాలమే! కుటుంబ విషయాలు చూస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు. సాధారణ స్థాయి ఫలితాలు అందుతాయి. పెద్దల ఆరోగ్యస్థితి బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుటుంబపరంగా చేయవలసిన శుభ, పుణ్యకార్యాలు అన్నీ జరుగుతుంటాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. బంధు మిత్రులతో కలసి శుభ కార్యాలు, పుణ్యకార్యాలు, కులాచార కార్యాలు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం మందగమనంగా ఉంటుంది. అయితే ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఇబ్బందులు ఉండవు. ఖర్చులను సరైన పద్ధతిలో నియంత్రించగలుగుతారు. మితభాషణ, ఓర్పుగా ఆలోచించడం, దూకుడుతనం అనేవి ఖర్చుల విషయంలో విడనాడటం మంచిది. మీరు అందరికీ బాగా సహకారం చేస్తారు. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే పాత సమస్యలు తరచుగా తిరగబడే అవకాశం ఉంటుంది. అయినా బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెడతారు. మంచి కాలక్షేపం జరుగును. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగ నిర్వహణ, కుటుంబ నిర్వహణ కష్టసాధ్యంగా అనిపించినా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి ముందుకు సాగుతారు. ప్రత్యేక గుర్తింపు మాత్రం ఉండదు. గర్భిణీ స్త్రీల విషయమై మీ దగ్గర నుంచి కాలం అనుకూలంగా ఉన్నది. ఇబ్బందికర ఘటనలు ఉండవు. షేర్ వ్యాపారులకు క్రమక్రమంగా లాభమార్గం వైపు ప్రయాణం సాగుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చక్కటి సలహాలు అందుతాయి. కార్యవిజయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో విజయం సాధించే అవకాశం ఉన్నది. మంచికాలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి శుభ పరిణామాలు ఉంటాయి. అంతటా సహకరించేవారు ఉంటారు. విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు రావు కానీ, మొత్తం మీద సానుకూల ఫలితాలే ఉంటాయి. రైతుల విషయంలో అంతా శుభ ఫలితములే! జంతువులు, పక్షులు పెంచేవారికి లాభదాయకం. కృత్తిక నక్షత్రం వారికి ధైర్యం బాగా ఉంటుంది. సకాలంలో పనులు చేసినా రావలసిన గుర్తింపు రాదు. వృత్తిరీత్యా ఇబ్బంది ఉండదు. రోహిణి నక్షత్రం వారికి తరచుగా వృత్తి మార్పు విషయంగా ఆలోచనలు పెరుగుతుంటాయి. వృత్తిపరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తుల లావాదేవీల్లో ఇబ్బందులు పడతారు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి విచిత్ర స్థితి నెలకొని ఉంటుంది. అనవసర వాగ్యుద్ధాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు మొండిగా, కొన్నిసార్లు శాంతంగా ప్రవర్తిస్తుంటారు. వాహన చికాకులు తప్పవు. శాంతి మార్గం: తరచుగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి. రోజూ శివాలయంలో ప్రదోష కాలంలో 11 ప్రదక్షిణలు చేసి లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్ర పారాయణ చేయండి. గోపూజ, గురు జపం, దానం చేయించండి. ఏప్రిల్: తెలివిగా ఆర్థిక లావాదేవీలు సాగిస్తారు. సంకల్పించిన పనులు వేగంగా జరుగుతాయి. కుటుంబ జీవనం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వచ్చి, మంచి ప్రతిభ చూపిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన, నదీస్నానం చేస్తారు. ఆరోగ్య విషయంలో తెలివిగా ఉండి రక్షణ పొందుతారు. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. విద్యా వ్యాసంగంలో ఉన్నవారికి మంచి కాలం. మే: కుజ– బుధ– శుక్రుల అనుకూల సంచారంతో మొదటి రెండు వారాలు అత్యంత అనుకూలం. విందు వినోదాలు, విహారయాత్రలు ఉంటాయి. ద్వితీయార్ధంలో శారీరక అలసట, కొన్ని వివాదాల వల్ల సమస్యలు ఉంటాయి. రవి, శివారాధన శుభప్రదం. మాసారంభం అనుకూలం. సమస్యలను తెలివిగా సాధించుకుంటారు. ఆరోగ్య, ఋణ విషయాల్లో జాగ్రత్త ప్రదర్శిస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మొదటి రెండు వారములు అనుకూలం. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి ఫలితాలు. కుటుంబ పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం. జూన్: వ్యయ కుజ, ద్వితీయ రవి సంచారం వలన తరచు సమస్యలు, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలు, స్త్రీల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. 8వ తేదీ నుండి మృగశిర నక్షత్రం వారికి స్వల్ప ఆరోగ్య చికాకులు ఉంటాయి. కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. భక్తి, కాలక్షేపం ఎక్కువ అవుతుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలులో అధిక ధనవ్యయం అవుతుంది. జులై: ప్రథమార్ధం మిశ్రమ ఫలితాలు. ద్వితీయార్ధంలో ఖర్చులు పెరుగును. మనోధైర్యంతో పనులు చక్కబెడతారు. పనిలో గుర్తింపు పొందుతారు. అధికారయోగం ఉంది. వివాదాలు సర్దుకుంటాయి. కుజస్తోత్ర పారాయణం చేయాలి. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. అనవసర ప్రయాణాలను విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆగస్ట్: కొంత ఒదిగి ఉండటం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల చురుకుదనం తగ్గుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. 2వ వారంలో శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నవగ్రహారాధన శుభప్రదం. 15వ తేదీ వరకు రోహిణీ నక్షత్రంతో కుజుడు జాగ్రత్తలు అవసరం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. చాలా సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. సెప్టెంబర్: సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెద్దల అనుగ్రహంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రవి– కుజ– శుక్రులకు శాంతి, శివకుటుం ఆరాధన శుభప్రదం. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి. ధనవ్యయం అధికం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. అక్టోబర్: ఈ నెల అంతా శుభప్రదం. శత్రు, ఋణ బాధల నుంచి ఉపశమనం. ఉన్నతాధికారుల సందర్శన, స్థానచలనం, అధికారయోగం. రాజకీయ రంగంలో విశేష జనాకర్షణ. స్త్రీలతో స్వల్ప సమస్యలు ఉంటాయి. కుజ శాంతి, లక్ష్మీ–లలితా స్తోత్ర పారాయణ శుభప్రదం. షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి అనుకూలం. రైతులకు, విద్యార్థులకు కూడా సానుకూలం. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలలో అనుకూలత ఉంటుంది. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలం. నవంబర్: ప్రయాణ లాభం. మనోధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కోర్టు సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కాలభైరవారాధన శుభప్రదం. ఆర్థిక కార్యకలాపాలు స్వయంగా చూసుకుంటూ సమస్యల నుంచి బయటపడతారు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. డిసెంబర్: మానసిక ఆందోళన పెరుగుతుంది. అధిక ఖర్చులు. గతంలో చేసిన అశ్రద్ధ వలన ఇప్పుడు సమస్యలు ఎదురవుతాయి. రుద్రాభిషేకం చేయుట మంచిది. ఉద్యోగంలో తోటివారి సహకారం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు అందుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో సత్ఫలితాలు. జనవరి: ప్రయాణమూలక ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉమామహేశ్వర స్తోత్రపారాయణ మంచిది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు ప్రశాంతంగా ఉండడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేసుకోవాలి. రోహిణీ నక్షత్రం వారికి మాత్రం లాభాలు అధికం. షేర్ వ్యాపారులు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లాభం. ఫైనాన్స్ వ్యాపారులు మొండి బాకీలు వసూలులో జాగ్రత్తపడాలి. ఫిబ్రవరి: దైవానుగ్రహంతో సమస్యలు తీరుతాయి. పూర్వం నుంచి చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. వృత్తిలో గుర్తింపు, విశేష కీర్తి కలుగుతాయి. అధికారయోగం. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. భక్తి కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన లాభం. ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలం. మార్చి: పనులు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, బదిలీలు అనుకూలం. ఋణ సమస్యలు తగ్గుతాయి. నూతన కనక–వస్తు–వాహన కొనుగోలు అనుకూలం. శుభకార్యాలు జరుగుతాయి. -
ఈ నూతన సంవత్సరాన ఈ రాశి వారికి ఋణ విషయాలలో విచిత్ర స్థితి
మిథున రాశి ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–3, అవమానం–6. మృగశిర 3,4 పాదములు (కా, కి) ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ) పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా) గురువు మే 1 వరకు మేషం (లాభం)లోను తదుపరి వృషభం (వ్యయం)లోను సంచరిస్తారు. శని కుంభం (భాగ్యం)లోను రాహువు మీనం (దశమం)లోను కేతువు (చతుర్థం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలిసీ తెలియని పొరపాట్లు జరగడం ప్రతి విషయంలోనూ ఉంటాయి. ఎవరినీ నమ్మి, ఎవరి మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ పరిథిలో ఉన్న పనులు మాత్రమే చేయండి. వీలైనంత వరకు కొత్త వ్యవహారాలు చేపట్టవద్దు. మీకు కొన్ని సందర్భాలలో మంచి గురువులు మంచి సూచనలు చేస్తారు. ఊహించని విధంగా కొన్ని సందర్భాలలో మీకు ఎప్పుడూ సహకరించనివారు కూడా ఈ సంవత్సరంలో సహకారం అందిస్తారు. కొన్ని సందర్భాలు విజయవంతంగా ఉంటాయి. ఉద్యోగ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి విషయంలోనూ స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోండి. అలాగే అధికారులతో కూడా జాగ్రత్తలు పాటించాలి. మితభాషణ చాలా అవసరం. తోటివారు కొన్నిసార్లు అనుకూలంగా, కొన్నిసార్లు ప్రతికూలంగా ప్రవర్తిస్తారు. వర్కర్స్‌తో బహుజాగ్రత్తలు పాటించడం, వాక్కును నియంత్రించుకోవడం అవసరం. ఇంటిలో ఉండే పనివారితో కూడా జాగ్రత్తలు అవసరం. వ్యాపార విషయాలు అనుకూలమే. నూతన ప్రయత్నాలకు అనుకూలత తక్కువ. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయిలో ఉంటాయి. అన్ని కోణాలలోనూ గురువు వ్యయ సంచారం దృష్ట్యా మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులు అందరితోనూ కలసి సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో పిల్లల నడవడిక మీకు ఇబ్బంది కలుగజేస్తుంది. బంధువులతో బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే శుభకార్యాల నిర్వహణ విషయంగా ధనవ్యయం అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భములలో అధిక ధనలాభం చేకూరుతుంది. అవగాహన లేమితో ఆర్థిక ప్రణాళికలు సాగుతాయి. ఋణ విషయాలలో విచిత్ర స్థితి ఉంటుంది. కావలసిన కొత్త ఋణాలు ఆలస్యంగా అందుతాయి. భార్యాపిల్లలు తరచుగా ప్రయాణాలు చేయుట వలన ధనవ్యయం అధికం అవుతుంది. ఆరోగ్య విషయంగా చాలా మంచి మార్పులు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా మంచి వైద్యం లభిస్తుంది. చక్కటి శుభ పరిణామాలు ఉంటాయి. హృద్రోగులకు మాత్రం చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగంలో అభివృద్ధి ఎక్కువగా గోచరిస్తుంది. కుటుంబ విషయాలు, సాంఘిక వ్యవహారాలను సమర్థంగా నడుపగలుగుతారు. అందరి నుంచి సహకారం ప్రోత్సాహం బాగా లభిస్తుంది. గర్భిణీ స్త్రీల విషయమై గురువు వ్యయసంచారం దృష్ట్యా మే నుంచి కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్ వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండవు కానీ, నష్టాలు మాత్రం ఉండవు. మంచికాలమే. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యా వ్యాసంగంలో వారికి అనుకూలత తక్కువ. ఉద్యోగ రీత్యా వెళ్ళేవారికి కాలం అనుకూలం. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు సానుకూలం అవుతుంటాయి. ఏదో రూపంగా కార్యసిద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికమైనా, కార్యసిద్ధికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురువు వ్యయస్థితి సంచార ఫలితంగా తగినంత జాగ్రత్తతో అభ్యాసం చేయాలి. రైతుల విషయంలో శ్రమ చేసిన దానికి సమస్థాయి ఫలితాలు ఉండకపోయినా, నష్టం మాత్రం ఉండదు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి అసహనం పెరుగుతుంది. గొప్ప కోసం అధికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులను నమ్మి పనులు తలపెట్టవద్దని ప్రత్యేక సూచన. మితభాషణ మీకు రక్షణ. ఆరుద్ర నక్షత్రం వారికి కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నాయి. అవమానకర ఘటనలు, అధిక ధనవ్యయం చికాకు పెడతాయి. వాహన లాభం ఉంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వస్తువులను పోగొట్టుకోవడం లేదా మరొక రూపంగా అయినా నష్టం జరుగుతుంది. ఋణ, ఆరోగ్య విషయాలు ద్వితీయార్ధంలో చికాకు కలిగిస్తాయి. శాంతి మార్గం: మే నెలలో గురుశాంతి చేయించండి. తెల్లజిల్లేడు, మారేడు, గరికలతో గణపతి అర్చన, ప్రాతఃకాలంలో ఎర్రటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. రోజూ ‘గజేంద్ర మోక్షం’ పారాయణ చేయండి. షణ్ముఖ రుద్రాక్ష ధరించండి. ఏప్రిల్: ఈనెల శుభవార్తలు వింటారు. అన్ని రంగాలలో రాణిస్తారు. అధికారలాభం, అనుకూల స్థానచలనం. రాజకీయరంగంలో ఉన్నత పదవులు దక్కుతాయి. కుటుంబ సౌఖ్యం, ఆర్థిక లాభాలు, కార్యజయం కలుగుతాయి. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులకు శ్రమ ఎక్కువైనా, లాభం ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యో గులు ఇబ్బంది పడతారు. స్వబుద్ధితో చేసే పనులన్నీ లాభిస్తాయి. రైతులకు చికాకులు ఉంటాయి. మే: అనుకున్న పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. శత్రుబాధలు తొలగుతాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. నిత్య శివదర్శనం, తీర్థస్నానాలు మంచివి. షేర్ వ్యాపారులకు అనుకూలం. ధనవ్యయం అధికమవుతుంది. విద్యార్థులకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. విదేశీ ప్రయత్నాల్లో తగిన సలహాలు అందవు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడతారు. జూన్: ప్రయాణాలవల్ల శారీరక అలసట. లాభాలు ఉన్నా, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సూర్యారాధన మంచిది. కోర్టు, ఋణ వ్యవహారాల్లో పరిష్కారమార్గం దొరుకుతుంది. పిల్లల వలన సౌఖ్యం కలుగుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు. జులై: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వం వలన సమస్యలు కలుగుతాయి. నిత్యం శివ, సుబ్రహ్మణ్య ధ్యానం మంచిది. అధికారులు ఎప్పుడు అనుగ్రహిస్తారో, ఎప్పుడు ఆగ్రహిస్తారో తెలియని పరిస్థితి. స్థిరాస్తి కొనుగోలు, విదేశీ ప్రయత్నాలు, షేర్ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. రైతులకు, విద్యార్థులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. ఆగస్ట్: ఈనెలలో అన్నివిధాలా బాగుంటుంది. ఆర్థికపుష్టి కలుగును, శుభవార్తలు వింటారు. పనులు శరవేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. నెలాఖరున కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. 15వ తేదీ నుంచి మృగశిర నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు, రోజువారీ పనులు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. కొత్త ఋణాలు సమయానికి అందుతాయి. పాతవి తీర్చగలుగుతారు. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. పెద్దల ఆరోగ్యంలో అనుకూలత ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన, గురువుల దర్శనం చేస్తారు. సెప్టెంబర్: కుటుంబ పరిస్థితులు అనుకూలం. వృత్తిలో ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. çసంతాన సౌఖ్యం, గృహ, వస్తు వాహన లాభం. బంధువులతో ఇబ్బందులు కలుగుతాయి. రుద్రాభిషేకం, శివకుటుంబ ఆరాధన మంచిది. ఆర్ద్రా నక్షత్రం వారు కొంచెం ఇబ్బందికి గురవుతారు. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్త పడాలి. పెద్దల ఆరోగ్యం ఇబ్బందికరం అవుతుంది. విదేశీ, స్థిరాస్తి ప్రయత్నాలలో మోసపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైన లావాదేవీలను గోప్యంగా ఉంచడం మంచిది. అక్టోబర్: ఈనెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉంది. బంధువర్గంతో సమస్యలు, పనుల్లో ఆలస్యం, శారీరక శ్రమ ఉంటాయి. తరచు వివాదాలు ఉండే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య అభిషేకం, శ్రీరామరక్షాస్తోత్రం పారాయణ మంచిది. పునర్వసు నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు. షేర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వాహనాలు, పనిముట్ల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి కాలక్షేపం ప్రమాదకరం కాగలదు. నవంబర్: కుటుంబ ఖర్చులు పెరిగినా, అవసరానికి తగ్గ ధనం లభిస్తుంది. దాంపత్య జీవితంలో మనస్పర్థలు ఏర్పడతాయి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణ మంచిది. షేర్ వ్యాపారులు, రైతులు, విద్యార్థులకు కొంచెం అనుకూల స్థితి తక్కువ. డిసెంబర్: ఈనెల గ్రహసంచారం ప్రతికూలం. భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులను ఇతరుల సహాయంతో అధిగమిస్తారు. వ్యర్థ ప్రయాణాలు, వృథా ఖర్చులు, లాభాలు అంతంత మాత్రం. నవగ్రహ శాంతి చేసుకోవాలి. ఋణ బాధల వల్ల ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు చికాకులు. కోర్టు వ్యవహారాలలో ప్రతికూలత. జనవరి: ఉద్వేగపూరిత ఆలోచనలతో ఒత్తిడికి లోనవుతారు. బంధువర్గం అనుకూలత, మిత్ర సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక చికాకులు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులకు శ్రమ ఎక్కువ. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి. షేర్ వ్యాపారులకు శుభసూచకం. ఆర్ద్రా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు. ఫిబ్రవరి: కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రతి పనికీ అధిక ప్రయత్నం అవసరం. విష్ణు ఆరాధన శుభప్రదం. ఆర్ద్రానక్షత్రం వారికి లాభదాయకం. «శ్రమ ఎక్కువైనా కార్య సాఫల్యావకాశాలు బాగున్నాయి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు, స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ. మార్చి : ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పెను మార్పులు. మీ మాటకు విలువ పెరుగుతుంది. -
ఉగాది ఆరంభంతో ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి అవకాశం
కర్కాటక రాశి ఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–6, అవమానం–6 పునర్వసు 4వ పాదము (హి) పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా) ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ) గురువు మే 1 వరకు మేషం (దశమం)లోను తదుపరి వృషభం (లాభం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (అష్టమం)లోను రాహువు మీనం (నవమం)లోను కేతువు (తృతీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. సమయపాలనతో ఏ పనీ కూడా చేయరు. పుణ్యకార్యాలలో ఎక్కువ కాలక్షేపం జరుగుతుంది. అన్న, వస్త్ర, స్నానాది కార్యక్రమాలు కూడా ఆలస్యంగా చేయవలసి వస్తుంది. కొన్ని పనులను దాటవేసే ఆలోచనలు చేస్తారు. కొన్ని పనులను ధైర్యంగా సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. తరచుగా ‘నరఘోష’కు గురి అవుతుంటారు. తద్వారా చికాకు పడతారు. అష్టమ శని వల్ల అన్ని రంగాలలోనూ స్నేహితుల మధ్య, బంధువుల మధ్య కలహాలు తలెత్తుతాయి. జాగ్రత్తపడండి. ఉద్యోగ విషయాలు చాలా శ్రమాధిక్యం అవుతుంటాయి. మీకు గురుబలం దృష్ట్యా అన్ని పనులు చేయడానికి తగిన ఆలోచనలు చేయగలిగినా, అమలు చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ప్రమోషన్‌కు తగిన అర్హతలు ఉన్నప్పటికీ అడ్డంకులు చాలా ఉంటాయి. నమ్మకంగా మీ పక్కనే ఉంటూ మీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేవారు అధికంగా ఉంటారు. వ్యాపారులకు వ్యాపారం బాగానే ఉన్నా, ప్రభుత్వ అధికారుల ద్వారా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి సలహాలు అందుతాయి. కుటుంబ విషయాలు చూస్తే మీ ప్రవర్తన కొన్ని సందర్భాలలో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు మీ బంధువులు బాగా సహకారం చేస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గురుబలం బాగా ఉన్న కారణంగా పిల్లల అభివృద్ధి కూడా బాగుంటుంది. తరచుగా ప్రయాణములు అధికంగా చేయడం తద్వారా ఆరోగ్య, ఆర్థిక చికాకులు పొందడం ఉంటుంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే లాభంలో మే 1 నుంచి గురువు సంచరించడం ప్రారంభించాక చాలా మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. ఆదాయం బాగా ఉన్నా, ఖర్చులు మీ ఇష్టానుసారం ఉండవు. పాత ఋణాలు తీర్చడానికి ఉంచిన ధనం కూడా ఇతర అవసరాలకు వినియోగిస్తారు. కొత్త ఋణాలు అవసరానికి తగిన రీతిగా అందుతాయి. వాహనాల కొనుగోలు ఆలోచనలు ఫలప్రదం అవుతాయి. ఆరోగ్య విషయంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. తద్వారా సమస్యలను దాటవేసే ప్రయత్నంలో సఫలం అవుతారు. కొత్త కొత్త సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే, ముందు జాగ్రత్తలతో దాటవేయగలరు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఎంత శ్రమించినా తగిన గుర్తింపు రాదు. అలాగని బాధపడక ముందుకు సాగుతారు. ఉద్యోగ, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం బాగుంది. కాబట్టి ఇబ్బందులు రావనే చెప్పాలి. మానసిక ఆందోళన ఉంటుంది. షేర్ వ్యాపారులకు అనుకూలమైన సమయం గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. కానీ నష్టపడే కాలం కాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అవరోధాలు ఎక్కువ. విద్య నిమిత్తంగా వెళ్ళేవారు శ్రమతో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు చికాకులు చూపుతాయి. కలçహాలు కోర్టు విషయంగా పెరగగలవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనం సర్దుబాటు ఉన్నా, వస్తు నిర్ణయం విషయంలో శ్రమ ఎక్కువ. విద్యార్థులు విద్యా విషయంగా బాగుంటుంది. ఇతర, అనవసర విషయాలు తరచుగా ఇబ్బంది కలిగిస్తాయి. రైతుల విషయంలో తెలివిగా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అయినా కొన్నిసార్లు చేతికి వచ్చిన పంట చేజారుతుంది. పునర్వసు నక్షత్రం 4 వారికి బంధు మిత్రులు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబానికి, వృత్తికి సమతూకంగా కాలం కేటాయించలేక అసహనం చెందుతారు. స్వయంగా పర్యవేక్షించే పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. పుష్యమి నక్షత్రం వారికి తరచు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాలు, స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అధిక వ్యయంతో సఫలమవుతాయి. ఆశ్లేష నక్షత్రం వారికి కొన్నాళ్లు అనుకూలం, కొన్నాళ్లు ప్రతికూలంగా సంవత్సరం అంతా గడుస్తుంది. కోర్టు వ్యవహారాలలో నమ్మినవారు మోసం చేసే అవకాశం ఉంది. సాంఘిక కార్యక్రమాలలో గౌరవభంగం జరగవచ్చు. శాంతి మార్గం: శని, రాహువులకు జపం, దానం చేయించండి. ఆంజనేయస్వామి దేవాలయంలో ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి, తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. ఏప్రిల్: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తుపై స్పష్టత వస్తుంది. నూతన వస్త్రధారణ, ఆభరణ– వాహనాల కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువర్గంతో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ, సామాజిక వ్యవహారాల్లో మౌనం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. రైతులు, మార్కెటింగ్ ఉద్యోగులు, షేర్ వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించి మంచి ఫలితం అందుకుంటారు. మే: వృత్తి వ్యాపారాలలో ఊహించని అనుకూలత. ఆర్థిక లాభాలున్నా, ఖర్చులు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించును. అవరోధాలను అధిగమిస్తారు. ఋణాల విషయంలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి. రైతులకు అనుకూలం. జూన్: స్థానమార్పులు ఉంటాయి. పట్టుదలతో పనులన్నీ పూర్తిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. ఫైనాన్స్ షేర్ వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాలలో కిందిస్థాయి వారితో చికాకులు తప్పవు. అధికారుల అండదండలు ఉంటాయి. కోర్టు విషయాలు, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలం. జులై: పనులు లాభదాయకంగా ఉంటాయి. ధనం నిల్వ చేయగలరు. ఊహించని ప్రయాణాల వల్ల ఇబ్బందులు. శుభవార్తలు వింటారు. భూ–గృహలాభం ఉంది. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. రైతులు, విద్యార్థులు శ్రమతో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆగస్ట్: ఈ నెల ఏ పని చేపట్టినా అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబ విషయమై డబ్బు నీళ్ళలా ఖర్చవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత లోపిస్తుంది. 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆశ్లేషా నక్షత్రం వారికి కుటుంబ సభ్యులతో సయోధ్య కుదరని సందర్భాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు అనుకూలం. సెప్టెంబర్: మనోధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులను ప్రభావితం చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులు రాబోవు ఆరు మాసాలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య, ఆర్థిక, ఋణ వ్యవహారాలలో రాబోవు ఆరు మాసాలు ప్రతికూల స్థితి. శని కుజ గ్రహముల శాంతి చేయించండి. అక్టోబర్: పనుల్లో ఆలస్యం, శారీరక రుగ్మతల బాధ పెరుగుతాయి. మనోధైర్యం తగ్గుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్తి వివాదాలు తలెత్తుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. మీకు లేదా మీ కుటుంబ పెద్దలకు వైద్యం అత్యావశ్యకం అవుతుంది. అతి శ్రమ చేస్తారు. షేర్ వ్యాపారులు, రైతులు, విద్యార్థులు తెలివి, ఓర్పుతో సమస్యలను అధిగమిస్తారు. నవంబర్: రానున్న 5 నెలలు అనేక సమస్యలు ఉంటాయి. కుజ శాంతి చేసుకోవడం మంచిది. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఇతరులపై ఆధారపడకుండా వ్యవహరించాలి. మనస్పర్ధలు ఉంటాయి. మీరు చేయవలసిన పనులు ఆలస్యం కావడం వల్ల కుటుంబంలో చికాకులు మొదలవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అనుకూలతలు లేవు. షేర్ వ్యాపారులు నష్టపడకుండా బయటకు రావడం కష్టసాధ్యం. శుభకార్య ప్రయత్నాలు, అభివృద్ధి ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేయవద్దని సూచన. డిసెంబర్: వృత్తిలో విశేష గుర్తింపు లభిస్తుంది. నిరాటంకంగా పనులు పూర్తవుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఉన్నతాధికారుల సందర్శనం, అనుకూల బదిలీలు ఉంటాయి. ఋణ సమస్యలు తగ్గుతాయి. దాంపత్యంలో ఇబ్బందులు, పిల్లల నుంచి సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫలితం తక్కువ. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించుకోవాలి. స్థిరాస్తి లావాదేవీలు, కోర్టు వ్యవహారాలలో వాయిదాలు శ్రేయస్కరం. జనవరి: శారీరక శ్రమ పెరుగుతుంది. అకాల ప్రయాణాలతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో మనస్పర్థల వలన మనస్తాపం. బంధువర్గం సహకరిస్తారు. ఋణవిముక్తి కలుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పునర్వసు నక్షత్రంవారికి కలహ, ఋణ, ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండవచ్చు. షేర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు, రైతులకు బాగా అనుకూలం. ఫిబ్రవరి: మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులు కలుగుతాయి. పనులు ఆలస్యమైనా, సహనంతో పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. విష్ణు ఆరాధన మంచిది. బంధు మిత్రులకు సేవ చేయవలసిన పరిస్థితి వలన మీ దైనందిన కార్యక్రమాలు ఆలస్యం అవుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు ఫలితాలు బాగుంటాయి. ఫైనాన్స్ వ్యాపారాలకు, విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మార్చి: కుటుంబ పెద్దలకు స్వల్ప ఆరోగ్య సమస్యలు. తీర్థయాత్రలు చేస్తారు. వృత్తిలో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో మందగమనం. అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు. -
ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
సింహ రాశి ఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–2, అవమానం–2. మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే) పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ) ఉత్తర 1వ పాదము (టే) గురువు మే 1 వరకు మేషం (నవమం)లోను తదుపరి వృషభం (దశమం)లోను సంచరిస్తారు. శని కుంభం (సప్తమం)లోను రాహువు మీనం (అష్టమం)లోను కేతువు (ద్వితీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో సమయపాలన లేకపోవడం మిమ్మల్ని బాగా లాభ ఫలితాలకు దూరం చేస్తుంది. ఉద్యోగ విధి నిర్వహణకు కూడా ఎన్నోసార్లు ఆలస్యంగా వెళతారు. అనవసర ఆలోచనలు, తద్వారా భయాందోళనలు ఎక్కువ అవుతాయి. మీరు ఎంత పద్ధతిగా ఉంటే అంత లాభాలు వచ్చే కాలం. ఇబ్బందులు పోగొట్టుకోవడం మీ ప్రయత్నాలలోనే ఉన్నది. వృథా కాలక్షేపాలు చేయవద్దు. సప్తమ శని వల్ల అన్ని పనులూ ఆలస్యం అవుతుంటాయి. అయితే స్వక్షేత్ర శని అయిన కారణంగా నష్టం ఉండదు. ఉద్యోగ విషయాలలో అధికారుల ద్వారా ఒత్తిడి బాగా పెరగగలదు. మే నుంచి సంవత్సరాంతం వరకు మీ తోటివారు, మీ కింద స్థాయి ఉద్యోగుల ద్వారా కూడా సహకారం తగ్గగలదు. అందరితోనూ స్నేహభావం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళండి. వ్యాపార లావాదేవీలు బాగానే జరుగుతాయి. నూతన వ్యాపారం ఆలోచనలు కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంటాయి. అదే రీతిగా నూతన ఉద్యోగ ప్రయత్లాలో కూడా సానుకూలత ఉంటుంది. అష్టమ రాహువు వలన మీరు అందరినీ అనుమానించడం, మీరు తరచుగా అవమానాలకు గురికావడం జరుగుతుంది. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. కుటుంబ అవసరాలు తీర్చే పనిలో మీరు అలసత్వం ప్రదర్శిస్తారు. అది ఇబ్బందికరం అవుతుంది. మీకు, కుటుంబ సభ్యులకు మధ్య కార్య నిర్వహణ విషయంగా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి. మనస్తాపం పెరుగుతుంది. బంధువులతో తరచుగా ఇబ్బంది ఉంటుంది. జ్ఞాతివైరం ఉన్నవారికి ఈ సంవత్సరం ఆ వైరం పెరగగలదు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం బాగానే ఉంటుంది. అయితే ఆలస్యంగా అందుతుంది. ఖర్చులను నియంత్రించలేని స్థితిలో ఉంటారు. ఋణ సౌకర్యం కూడా ఆలస్యంగా ఉంటుంది. పాత కొత్త ఋణాలు ప్రారంభంలో ఇబ్బందులు సృష్టించినా, క్రమంగా సానుకూలం అవుతుంటాయి. వృథాగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. విద్యా విజ్ఞాన విహార యాత్రల విషయంగా ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. తీసుకుంటారు కూడా. చర్మవ్యాధులు, జీర్ణ సంబంధమైన ఇబ్బంది, రక్తపోటు ఉన్నవారు బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. గమనించండి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువ అవుతుంటుంది. ఉద్యోగం, కుటుంబం విషయాలలో సమన్యాయంగా వ్యవహరించేందుకు అవకాశాలు ఉండవు. ప్రతి పనీ ఆలస్యం అవుతుండటం వలన మీకు ఆగ్రహావేశాలు పెరుగుతుంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు చాలా అవసరం అనే చెప్పాలి. వైద్య సలహాలు జాగ్రత్తగా పాటించండి. షేర్ వ్యాపారులకు దూకుడు తగ్గించమని సూచన. మే నెల తరువాత మీరు వేరే వారితో పోలిక లేకుండా ముందుకు సాగండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ఏ పనీ సవ్యంగా సాగదు. నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు చేయండి. కోర్టు వ్యవహారములలో ఉన్నవారికి చికాకులు పెరిగే అవకాశం ఉంటుంది. పనులు వ్యతిరేకం కాకుండా జాగ్రత్త తీసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి దారి తప్పించేవారు ఎక్కువ అవుతారు. అవకాశం ఉంటే కొనుగోలు వాయిదా వేయండి. విద్యార్థులకు మానసిక వ్యవస్థ విద్యా వ్యాసంగముల కంటే ఇతర అంశాల మీదకు ఎక్కువగా ప్రసరిస్తుంది. రైతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా ఆశించిన ఫలితాలు అందవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. మఘ నక్షత్రం వారు పనులు వాయిదా వేయడం వలన సమస్యలు ఎదుర్కొంటారు. షేర్వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు సందర్భానుసారంగా ప్రవర్తించక గడ్డు పరిస్థితులు తెచ్చుకుంటారు. అవసరానికి తగిన ధనం సర్దుబాటు అవుతుంది. పుబ్బ నక్షత్రం వారు వృథా కాలక్షేపం చేస్తారు. విద్యా, విజ్ఞాన కార్యక్రమాలలో పాల్గొంటారు. ద్వితీయార్ధంలో ధైర్యంగా అనేక విజయాలు సాధిస్తారు. బంధు మిత్రులు సహకరిస్తారు. ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు పుణ్య, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. శాంతి మార్గం: శని, రాహు గ్రహశాంతి చాలా అవసరం. ప్రాతఃకాలంలో నిత్యం ఆంజనేయస్వామి వారి దేవాలయంలో రామనామం చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదోష కాలంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: ఈ నెల ప్రతివిషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇతరులపై పనిభారం మోపి, నిద్రావస్థలో ఉంటే నష్టపోతారు. అహంభావంతో ఇబ్బందుల్లో పడతారు. ఖర్చులు, ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులు జాగ్రత్త కనబరచాలి. విద్యార్థు్థలకు, రైతులకు ఆశించిన ఫలితాలు అందవు. మే: ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు చూస్తారు. ఋణబాధల నుంచి విముక్తి. ఉన్నత పదవులు చేపడతారు. అధికారుల మెప్పు పొందుతారు. కుటుంబ వాతావరణం ఆనందం కలిగిస్తుంది. కుజశాంతి శుభప్రదం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం శూన్యం. రైతులకు అనుచిత సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత లేదు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు పనులు వాయిదా వేయడం శ్రేయస్కరం. జూన్: వృత్తిలో రాణిస్తారు. విశేష ధనలాభం. బదిలీలు అనుకూలం. రాజకీయ రంగంలో వారికి మంచి పదవులు దక్కుతాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. నెలాఖరున ఒక శుభవార్త అనందం కలిగిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం కృషి చేస్తారు. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు ఈ నెల రోజులు అనుకూలం. పుబ్బా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు తప్పవు. జులై: నేర్పుతో పనులన్నీ సునాయాసంగా పూర్తిచేస్తారు. శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. శత్రుబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. సాంఘిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫైనాన్స్, వ్యాపారులు, షేర్ వ్యాపారులకు 16వ తేదీ తరువాత చికాకులు ఉంటాయి. ఆగస్ట్: పనిఒత్తిడి పెరిగినా, సకాలంలో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఖర్చులకు తగిన ఆదాయం లభిస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. 18వ తేదీ నుంచి మఘ నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు రాగలవు. విద్యార్థులు అధిక శ్రమ చేయాలి. రైతులకు అనుకూలత తక్కువ. సెప్టెంబర్: ఆర్థిక లాభాలు, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. ఉన్నత పదవులు చేపడతారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఉత్సాహం కోల్పోకుండా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తుంది. 13వ తేదీ వరకు పుబ్బ నక్షత్రంవారికి పనులు ఇబ్బందికరం కాగలవు. షేర్ వ్యాపారులు మంచి తెలివి, ధైర్యం ప్రదర్శించి కాలం అనుకూలం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. సకాలానికి ఋణాలు అందుతాయి. అక్టోబర్: ఉన్నతాధికారులను సందర్శిస్తారు. విశిష్ట బాధ్యతలు చేపడతారు. శత్రుబాధల నుంచి విముక్తి. ఈనెల నుంచి ఊహించని ఖర్చులు, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, దాంపత్యసౌఖ్యం లోపించడం జరుగుతాయి. కుజశాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు ఇబ్బందికరం అవుతాయి. నవంబర్: పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. çసంతానం రాణింపు ఆనందం కలిగిస్తుంది. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. పనులు ఆలస్యం అవుతుంటాయి. దూరప్రాంత ప్రయాణాలు విరమించండి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ. డిసెంబర్: ఈ నెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉన్నది. మీ తప్పు లేకున్నా నిందలు పడవలసి వస్తుంది. స్త్రీ విరోధం, దాంపత్య విభేదాలు కలుగుతాయి. మౌనం మంచిది. విద్యార్థులకు సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. షేర్ వ్యాపారులు ఇబ్బందికి గురవుతారు. కోర్టులు, స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి. జనవరి: ఇతరుల విషయాలలో జోక్యం లేకుండా, మీ పనులలో శ్రద్ధవహిస్తే లక్ష్యాన్ని సాధించ గలుగుతారు. ఋణ– రోగ– శత్రు బాధల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులు తొందరపాటుతనం తగ్గించాలి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో సానుకూలత తక్కువ. ఫిబ్రవరి: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. అకాల భోజనం, వ్యర్థ ప్రయాణాల వలన ఆరోగ్య సమస్యలు. వృత్తిలో ఊహించని మార్పులు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పుబ్బ నక్షత్రం వారు విశేష లాభాలు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులు, రైతులు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మార్చి: భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు. పనులు నత్తనడకన సాగుతాయి. స్థిరాస్తుల విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. -
కన్యా రాశి వారికి ఈ ఉగాది సంవత్సరాన మంచి శుభవార్త
కన్యా రాశి ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–5, అవమానం–2. ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ) హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా) చిత్త 1,2 పాదములు (పే, పో) గురువు మే 1 వరకు మేషం (అష్టమం)లోను తదుపరి వృషభం (నవమం)లోను సంచరిస్తారు. శని కుంభం (షష్ఠ)లోను రాహువు మీనం (సప్తమం)లోను కేతువు (జన్మ)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చక్కగా చురుకుగా పాల్గొంటారు. నిద్ర, భోజనం వంటివి సమయపాలనలో చక్కగా నడుపుతూ ముందుకు వెడతారు. అయినా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. మీ కుల ఆచార వ్యవహారాలను పాటించండి. పుణ్యకార్యాలు చేయడం, గురువులను దర్శించడం చేస్తుంటారు. తరచుగా శుభ కార్యాలలో పాల్గొంటారు. బంధువులు, మిత్రుల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తుంటారు. మే తరువాత కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. అవి మీకు బాగా సహకారంగా ఉండే స్నేహాలే. ఉద్యోగ విషయాలు చాలా బాగా ఉంటాయి. శని సంచారం బాగున్న కారణంగా సంవత్సర ఆరంభం నుంచి ఫలితాలు బాగుంటాయి. అయితే మే తరువాత ఇంకా అనుకూలం. ప్రమోషన్ వంటి ప్రయత్నాలు లభిస్తాయి. అదే రీతిగా స్థానచలన ప్రయత్నాలు సానుకూలమే. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా సానుకూలము. అధికారుల సహకారం బాగుంటుంది. భోజనం, వస్త్రం, నిద్ర పూర్తిగా ఆస్వాదిస్తారు. ప్రతి విషయంలోనూ భయపడటం లేదా చికాకుపడటం వంటివి జరుగుతుంటాయి. కుటుంబ విషయాలు చూస్తే పెద్దల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు కూడా తరచుగా వింటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధనధాన్యవృద్ధి బాగా ఉండటం ఆనందానికి కారణం అవుతుంది. కులాచారానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. బంధువుల సహకారం బాగా ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే కాలం. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే మే వరకు కొంత చికాకుగాను మే నుంచి అనుకూలంగాను ఉంటాయి. మీరు చేసిన పరిశ్రమకు తగిన ఆర్థిక లాభాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడంలో, అవసరానికి కావలసిన కొత్త ఋణాలు పొందడంలో మంచి ఫలితాలు తద్వారా గౌరవం అందుతాయి. తరచుగా వ్యర్థ సంచారం కూడా చేయవలసి ఉంటుంది. కాళ్ళు చేతులు వాటి వేళ్ళు అనేక సందర్భా లలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంగా ప్రత్యేక ఇబ్బందులు ఉండవు. గురువు వృషభంలోకి మార్పు తీసుకున్న దగ్గర నుంచి పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. మానసిక అనారోగ్యం ఉన్నవారు కొంచెం చికాకు పొందుతారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి విషయంలోనూ క్రమంగా సానుకూల స్థితి పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల బాగుంటుంది. సమర్థంగా కుటుంబ విషయాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, మంచి మార్పులు ఉంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం, శనిబలం అనుకూలత దృష్ట్యా చాలా అనుకూల స్థితి ఉంటుంది. ఒత్తిడికి లోనవ్వద్దు. షేర్ వ్యాపారులకు మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా లాభదాయకం అవుతాయి. లాభదాయకంగా కాలం గడుస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగుతాయి. విద్య, ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళేవారికి అనుకూలమే. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి స్వయంగా వ్యవహారాలు పరిశీలించుకోమని సూచన. తద్వారా విజయావకాశాలు ఎక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మే దగ్గర నుంచి గురుబలం బాగుంది. మంచి అవకాశాలు ఉంటాయి. ఒత్తిడికి లోనవ్వద్దు. రైతుల విషయంలో శ్రమకు తగిన లాభాలు అందుతాయి. మీరు మంచి సలహాలు అందుకోవడంలో విఫలమవుతారు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 వారిలో మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడితో లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యా, వైద్య వృత్తుల వారు లాభం అందుకుంటారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. హస్త నక్షత్రం వారు కొత్త జీవన శైలికి దగ్గర అవుతారు. కొత్తగా జీవనోపాధి మార్గాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యుల అభివృద్ధి వార్తలు వింటారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. చిత్త నక్షత్రం 1, 2 వారికి రోజువారీ భోజనాది విషయాలలోనూ అనుకూలత తక్కువ. అనుకోకుండా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటారు. శాంతి మార్గం: రాహు కేతువులకు జప దానాలు అవసరం. ప్రతిరోజూ గణపతిని, దుర్గను అర్చించిన తరువాత మిగిలిన పనులు చేయండి. ‘దుర్గాసప్తశ్లోకి’ స్తోత్రం రోజూ 11సార్లు పారాయణ చేయాలి. ఏప్రిల్: ఈనెల ప్రతికూల ఫలితాలు ఎక్కువ. శ్రమకు తగిన లాభం లేకపోవటం, ఖర్చులు పెరగటం జరుగుతాయి. వృత్తిలో మాటపడవలసి వస్తుంది. కుజ శాంతి, నవగ్రహారాధన మంచిది. షేర్ వ్యాపారులు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు ఆందోళనకర ఘటనలు ఎదుర్కొంటారు. మే: ఈ నెల కూడా ప్రతికూలంగానే ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం లోపించటం, పని ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం. రాబోవు మూడు మాసాలలో ఆరోగ్య ఋణ విషయాలలో శ్రద్ధ అవసరం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు పెరిగే కాలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి విషయాలు లాభదాయకం. జూన్: ఉద్యోగంలో రాణిస్తారు. అనుకూలంగా స్థానచలనం, అభివృద్ధి జరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఋణ సమస్యలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు జరుగుతాయి. గురువులను దర్శించుకుంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి ఫలితాలు. హస్తా నక్షత్రం వారికి మానసిక ఒత్తిడి తప్పదు. జులై: ఈనెల అంతా అనుకూలమే. ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు, ప్రశంసలు లభిస్తాయి. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉన్నది. 16వ తేదీ తరువాత పాత సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు అందుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు వేగంగా జరుగుతాయి. ఆగస్ట్: శ్రమతో కార్యజయం. నిర్విఘ్నంగా పనులు పూర్తవుతాయి. స్థానచలన సూచనలు, ప్రయాణ లాభాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. 18వ తేదీ తరువాత జీవిత భాగస్వామికి, వ్యాపార భాగస్వామికి కూడా ఆరోగ్య సమస్యలు రావడం వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. సెప్టెంబర్: పనులన్నీ శరవేగంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లోటు ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది. బంధు మిత్ర సహకారం లభిస్తుంది. నిత్యం ధ్యానం చేయుట మంచిది. 13వ తేదీ నుంచి ఉత్తర నక్షత్రం వారికి చికాకులు పెరుగుతాయి. చిత్త నక్షత్రం వారికి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కాలం ప్రారంభమైంది. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. అక్టోబర్: వ్యాపారంలో పెను మార్పులు, ఊహించని లాభాలు. రానున్న 6 నెలలు అత్యంత అనుకూలం. సమస్యలు, శత్రు బాధలను సునాయాసంగా అధిగమిస్తారు. వేగంగా పనులు పూర్తి చేస్తారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలు. ఫైనాన్స్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. ప్రయాణ సౌఖ్యం, సాంఘిక గౌరవం. నవంబర్: ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయ నేతలకు ఉన్నత పదవులు లభిస్తాయి. శత్రుబాధలు తొలగుతాయి. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు అనుకూలం. పుణ్య, శుభకార్యాలలో పాల్గొంటారు. డిసెంబర్: కుటుంబ ఒత్తిడి వలన కొన్ని చికాకులు ఉంటాయి. సంతానం విద్యలో రాణించటం వలన ఆనందం కలుగుతుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. అనుకున్న దాని కంటే లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఉంటుంది. షేర్ వ్యాపారులు మంచి ఆదాయం పొందుతారు. జనవరి: ఈ నెల ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు, శత్రుబాధలు, పని ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఆర్ధిక బలం పెరుగుతుంది. çఉత్తర నక్షత్రం వారికి మానసిక కష్టాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారములు కూడా అనుకూలమే. ఫిబ్రవరి: గత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఊహిం చని విధంగా అందరి సహకారం లభిస్తుంది. ప్రతిభకు తగిన గౌరవమర్యాదలు ఉంటాయి. ఆర్ధిక స్థిరత్వం, ఋణ రోగ శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతాయి. దాంపత్య జీవితంలో కొంత అభిప్రాయ భేదాలు ఉండును. చిత్త నక్షత్రం వారికి కార్యలాభం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు సఫలం. రైతులకు శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం.ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచుతారు. మార్చి: ఈ నెల ప్రతికూలత ఎక్కువ. వ్యర్థ ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. భాగస్వామ్య వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. అభిప్రాయ భేదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహారాధన చేయుట శుభకరం. -
తులారాశి వారికి ఈ సంవత్సరం ఇలా జరగవచ్చు
తులా రాశి ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–1, అవమానం–5. చిత్త 3,4 పాదములు (రా, రి) స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా) విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే) గురువు మే 1 వరకు మేషం (సప్తమ)లోను తదుపరి వృషభం (అష్టమం)లోను సంచరిస్తారు. శని కుంభం (పంచమం)లోను రాహువు మీనం (షష్ఠం)లోను కేతువు (వ్యయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలాకాలం తరువాత మంచి అనుకూల కాలం ప్రారంభం అయింది. పాత సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. సమయం వృథా చేయవద్దని సూచన. ప్రతి కార్యంలోనూ మీకు ఎన్నో విఘ్నములు ఎదురవుతాయి. అయినా ఓర్పుగా వ్యవహరిస్తే, మీకు విజయం దక్కుతుంది. గురువు సంచారం మే వరకు అనుకూలం. రాహు ప్రభావంగా అన్ని విషయాలలోను చాలా ధైర్యంగా కాలక్షేపం చేస్తారు. ఇది ప్రత్యేక వరము అనే చెప్పాలి. ఉద్యోగ విషయాలలో అధికమైన పరిశ్రమ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. అధికారుల ద్వారా మీకు ప్రోత్సాహం, సహకారం చాలా అధికంగా ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు బాగా అనుకూల స్థితి ఉంటుంది. శ్రమకొద్దీ లాభం అందుతుంది. వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా వరకు అనుకూల స్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీకంటే తక్కువ స్థాయి వారితో అవమానాలు, అవరోధాలు రాగలవు. జాగ్రత్తపడండి. కుటుంబ విషయాలు చూస్తే సంతతి విషయంలో బాగా చింతన ఎక్కువ అవుతుంది. జ్ఞాతి విషయంలో వ్యాజ్యాలు ఉన్నట్లయితే, అవి ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంటుంది. ఇతర అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది. పెద్దల సహకారం మీకు బాగా ఉంటుంది. తెలివిగా ప్రవర్తిస్తారు. పాత ఋణాలు, కొత్త ఋణాల విషయంలో మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే చాలా హెచ్చు తగ్గులు ఆదాయ విషయంలో గోచరిస్తాయి. తరచుగా శుభ కార్యాలలో పాల్గొనడానికి, అలంకరణ వస్తువులు కొనుగోలుకు ఖర్చు బాగా పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఆలోచనలు ఫలవంతం అవుతాయి. ఇతరులు కలిగించే ఇబ్బందులు ఒక్కోసారి మీకు లాభదాయకంగా మారడం వలన అమితోత్సాహంగా ఉంటారు. ఆరోగ్యవిషయంగా బహు శ్రద్ధ, జాగ్రత్తలు పాటిస్తారు. తద్వారా ఇబ్బంది లేని విధంగా జీవనం చేస్తారు. పాత ఆరోగ్య సమస్యలకు కూడా చాలా చక్కటి వైద్య సదుపాయం చేకూరుతుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్యం బాగా అనుకూలం అవుతుంది. వీరు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బహు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై సుఖజీవనం సాగుతుంది. చాలా ప్రశాంత జీవనం చేస్తారు. షేర్ వ్యాపారులకు గురుబలం, రాహు అనుకూలత దృష్ట్యా మంచి ఆలోచనలు చేయడం ద్వారా లాభాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. సుఖంగా ఉంటారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి లాభదాయక కాలము. త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికం అయినా, పనులు సానుకూలం అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులకు గురుబలం బాగుంది. ప్రవేశ పరీక్షలలో కూడా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ. మంచి సలహాలు అందుతాయి. లాభాలు బాగా అందుతాయి. చిత్త నక్షత్రం 3, 4 పాదముల వారికి ఆర్థిక సహకారం కొంచెం లోపిస్తుంది. బంధు మిత్రుల సహాయ సహకారాలు బాగుంటాయి. ఆరోగ్యం మీద దృష్టి ఉంచుతారు. స్వాతి నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్రానికి చెందిన స్త్రీలు అనుకోని లాభాలు అందుకుంటారు. సంతోషంగా కాలక్షేపం చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. విశాఖ నక్షత్రం 1, 2, 3 వారికి సకాలంలో ఋణ సౌకర్యం సమకూరుతుంది. కొత్త ప్రాజెక్ట్‌లు చేపడతారు. యోగ్యమైన జీవనం సాగిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. శాంతి మార్గం: తెలుపురంగు పుష్పాలతో జగదాంబను అర్చించండి. ప్రతి మూడు మాసములకు ఒకసారి నవగ్రహ హోమం చేయండి. రోజూ భువనేశ్వరీ సహస్రనామ పారాయణ చేయండి. ఏప్రిల్: ప్రతి పనిలోనూ అవరోధాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక గౌరవం దక్కుతుంది. వ్యాపారలాభం, ప్రయాణ లాభం ఉన్నాయి. కొత్త పనులు చేపడతారు. భూ– ఆభరణ కొనుగోలు చేస్తారు. షేర్ వ్యాపారులు మంచి నిర్ణయాలతో లాభిస్తారు. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలలో అధికారుల తోడ్పాటు బాగుంటుంది. విద్యార్థులకు అన్ని అంశాలూ అనుకూలిస్తాయి. గురువులను పూజ్యులను దర్శిస్తారు. శుభకార్య, సామాజిక కార్యక్రమాలలో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మే: ఈ నెల మధ్యలో కొన్ని కీలక విషయాల నిమిత్తం పెద్దలను సంప్రదిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో జాగరూకతతో ఉండాలి. అధికారయోగం ఉంది. స్త్రీలతో వివాదాలు వద్దు. చేయవలసిన పనులు వదిలి అనవసరమైనవి చేస్తుంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విదేశీ ప్రయత్నాలు సానుకూలం. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత తక్కువ. జూన్: వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. కొన్ని విషయాలలో మాటపడవలసి వస్తుంది. స్థిరాస్తి పనులు కొంత ఆలస్యమవుతాయి. స్వాతీ నక్షత్రం వారికి తరచు ఆరోగ్య సమస్యలు, కలహాలు ఉంటాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు, షేర్ వ్యాపారులకు మంచి సూచనలు అందవు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. జులై: ఉద్యోగ వ్యాపారాలలో విశేష గౌరవం, లాభాలు ఉంటాయి. అధికారయోగం ఉంది. ఇతరుల విషయాలలో జోక్యం వలన ఇబ్బందులు కలుగుతాయి. 3వ వారం నుంచి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. అన్ని వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. రోజువారీ కార్యములు అస్తవ్యస్తంగా ఉంటాయి. స్వాతీ నక్షత్రం వారు కలహాలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు, ఋణ సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తలు పాటించాలి. ఆగస్ట్: వృత్తిలో రాణిస్తారు. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు దక్కుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వాహన కొనుగోలుకు అనుకూలం. ఇంట్లో శుభాలు జరుగుతాయి. కొత్త పరిచయాలు, ప్రయాణాలు లాభిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి లావాదేవీలలో జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు. సెప్టెంబర్: దైవదర్శనం చేసుకుంటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వస్త్రాభరణ లాభం ఉంది. చిత్త నక్షత్రం వారు తెలివిగా సమస్యలను అధిగమిస్తారు. ఆదాయం సరిగా ఉండదు. ఖర్చులు, ఋణాలలో యిబ్బందులు, పిల్లల వలన చికాకులు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు కాలం ప్రతికూలం. విదేశీ ప్రయత్నాలలో అవరో«ధాలు ఎక్కువ. అక్టోబర్: మీ పనితీరులో మార్పులు చేస్తారు. ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. అనుకూల బదిలీలు ఉంటాయి. కుటుంబాభివృద్ధి, శుభకార్యాలు జరుగుతాయి. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు మంచికాలం. నవంబర్: ఎక్కువ శ్రమ లేకుండానే పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగ సమస్యలను మీ ప్రతిభతో అధిగమిస్తారు. అధికార యోగం ఉంది. బదిలీలు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలు కారణంగా ఖర్చు పెరుగుతుంది. షేర్ వ్యాపారులకు అధిక లాభములు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు కాలం పరిపూర్ణంగా అనుకూలం. డిసెంబర్: ఈ నెల అత్యంత అనుకూలం. విందు వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలం. స్వేచ్ఛగా ప్రవర్తిస్తారు. పుణ్య క్షేత్ర సందర్శన చేస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. జనవరి: ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత. కొత్త పరిచయాలు లాభిస్తాయి. మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. కుటుంబంలో చికాకులు, ఆరోగ్య సమస్యలు వల్ల ఇబ్బందులు. భూ– గృహ– వాహన కొనుగోలుకు అనుకూలం. అధికారుల సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుంటారు. పాత ఆరోగ్య, ఋణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తపడండి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఫిబ్రవరి: ఈనెల అంత అనుకూలంగా లేదు. ప్రతి పనిలోనూ జాప్యం వలన ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులు మీతో సన్నిహితంగా ఉన్నా, మీ జాగ్రత్తలో మీరుండాలి. పెట్టు బడులు ఆశించిన లాభాన్ని ఇవ్వవు. ఇతరుల విషయాలలో జోక్యం వలన ప్రతికూలత పెరుగుతుంది. నవగ్రహ ఆరాధన మంచిది. రోజువారీ పనులు అకాలంలో పూర్తవుతుంటాయి. విద్యార్థులు విద్యా వ్యాసంగానికి దూరం అవుతారు. సాంఘిక కార్యక్రమాలలో జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులకు అనుకూలం. రైతులకు శ్రమాధిక్యం. ఫైనాన్స్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. మార్చి: కార్యజయం. ఆరోగ్య, ఋణ సమస్యలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. శత్రుబాధలు తగ్గుతాయి. రాజకీయరంగంలో అనుకూలత పెరుగుతుంది. స్త్రీవిరోధం వద్దు. లక్ష్మీస్తోత్ర పారాయణ మంచిది. -
ఈ రాశి వారికి ఈ ఉగాది నూతన సంవత్సరంతో ఫలితం ఎలా ఉందంటే?
వృశ్చిక రాశి ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–5. విశాఖ 4 వ పాదము (తొ) అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే) జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ) గురువు మే 1 వరకు మేషం (షష్ఠం)లోను తదుపరి వృషభం (సప్తమం)లోను సంచరిస్తారు. శని కుంభం (చతుర్థం)లోను రాహువు మీనం (పంచమం)లోను కేతువు (లాభం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సమయపాలన సరిగా ఉండదు. పైన చెప్పిన నాలుగు గ్రహాల సంచారం సరిగాలేదు. అయితే ప్రతి నెలలోనూ ఏదో ఒక గ్రహం బహు అనుకూలతతో ఉండటం వల్ల మీరు సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్లగలరు. పనిముట్లు వాడకంలో జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ వస్తువులు చౌర్యానికి గురి కావడం, లేదా మీరే వాటిని ఎక్కడైనా మరచిపోవడం జరుగుతుంది. అప్రయత్నంగా శుభకార్యాలలో పాల్గొనడం, బంధుమిత్రుల కలయిక, సాంఘిక కార్యకలాపాలు సాగించడం వంటివి ఉంటాయి. ఉద్యోగ విషయాలలో అధికారుల గురించి మీకు భయం వెంటాడుతుంటుంది. మీరు పదవిలో మార్పు తీసుకోవాలని కానీ స్థానచలనం తీసుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు సరిగా సాగవు. అయితే విచిత్రం ఏమిటంటే వృత్తి రీత్యా ఈ సంవత్సరం మే నుంచి గురువు వలన రక్షణ బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు తక్కువ, కానీ నష్టం ఉండదు. నూతనంగా వ్యాపారం పెట్టాలి అనే వారికి అన్ని రంగాలలోనూ అడ్డంకులు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం చోటు చేసుకొని, ఆ సందర్భాలు ఇంట్లో కలహాలకు దారి తీస్తాయి. అవగాహన లోపాలు ఎక్కువ అవుతాయి. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి సాధారణ స్థాయితో ఉంటాయి. అందరూ మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు. కానీ మీ ప్రవర్తన అనుకూలంగా ఉండదు. తరచూ శరీరం బరువు తగ్గే అవకాశాలు వున్నాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనంతో ముడిపడిన ప్రతి అంశం కొంచెం ఇబ్బందికరమే అయినా, డబ్బు లేదని ఏ పనీ ఆగదు. గతం కంటే రాబడి తగ్గుతుంది. కానీ ఇబ్బంది కాదు. అనవసర ఖర్చులను నియంత్రిస్తారు. తరచుగా అధికారులు, బంధువులూ, పూజ్యుల రాకపోకలు దృష్ట్యా ధనవ్యయం అవుతుంది. ఒంటరిగా కాలక్షేపం చేయడం, ఒంటరిగా దూరప్రాంత ప్రయాణాలు చేయడానికి కాలం అనుకూలం కాదు. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు పాటించాలి. పాత సమస్యలు తిరగబెట్టగలిగే అవకాశం గోచరిస్తోంది. వైద్య సదుపాయాల మీద మీకు సదుద్దేశం కలిగే అవకాశం లేదు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో ప్రతి పనీ మీరే స్వయంగా చూసుకోండి. సాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అని సూచన. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలము నడుస్తున్నది అనే చెప్పాలి. దూకుడువద్దు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరిగా సాగకపోగా అనవసర సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయి. వాయిదా వేయండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురుబలం బాగా ఉన్న కారణంగా ఓర్పుగా మంచి ఫలితాలు అందుకుంటారు. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ మంచి సలహాలు అందవు. నష్టం లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి పాత ఆరోగ్య సమస్యలు తిరగబడవచ్చు. సాంఘిక కార్యక్రమాలలో మంచి పేరు వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి కుటుంబ విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. జ్యేష్ఠ నక్షత్రం వారికి ప్రయత్నాలు తేలికగా సఫలం కావు. పనులు ఆలస్యమవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. శాంతి మార్గం: శని, గురు, రాహువులకు శాంతి చేయించండి. ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ ధ్యానం చేయండి. రోజూ గోపూజ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది. ఏప్రిల్: ఉద్యోగంలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. సంతానంతో అభిప్రాయ భేదాలుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు అనుకూలం. తరచు శుభవార్తలు వింటారు. మే: ఈనెల ప్రతికూలత ఎక్కువ. నిందలు పడవలసి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు. నవగ్రహ శాంతి మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు అనుకూలం విదేశీ ప్రయత్నాలలో శుభవార్త అందుతుంది. స్థిరాస్తి, కోర్టు విషయాలు బాగా అనుకూలం. జూన్: తెలియని ఆందోళన ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. అధికారులతో ఉన్న సమస్యలు సర్దుకుంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. దాంపత్యంలో అన్యోన్యత లోపిస్తుంది. ఎవరో చేసిన పొరపాటుకు మీరు సమాధానం చెప్పవలసి వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి అందరి నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. షేర్ వ్యాపారులకు, రైతులకు అనుకూలం. జులై: కుటుంబ, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఉన్నత అధికారులతో అభిప్రాయ భేదాల వల్ల సమస్యలు ఉంటాయి. స్థిరాస్తి పనులు ఆలస్యమవుతాయి. కుటుంబ సభ్యులతో కలసి చేసే పనులు విజయవంతం అవుతాయి. మొదటి రెండు వారాలలో మంచి ఫలితాలు అందుతాయి. షేర్ వ్యాపారులకు లాభాలు తక్కువ. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఆగస్ట్: ఉద్యోగంలో మార్పులు. ఉన్నత పదవులు చేపడతారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య, ఋణ సమస్యలు పెరుగుతాయి. కుజ శాంతి చేయాలి. సంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన కొనుగోలు, స్థిరాస్తి కొనుగోలు ఆలోచనలు పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. రైతులు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. సెప్టెంబర్: రాజకీయవేత్తలకు అనుకూలం. ఉన్నత పదవులు దక్కుతాయి. వ్యాపారలబ్ధి. బదిలీలు అనుకూలం. ప్రయాణ లాభం. కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. శుభపరిణామాలు కనిపిస్తాయి. కుజశాంతి మంచిది. రాబోవు ఆరు మాసాలు ఆరోగ్య, ఋణ విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆదాయ వ్యయాలు ఇబ్బందికరం అవుతుంటాయి. విదేశీ ప్రయత్నాలు షేర్ వ్యాపారాలు ఇబ్బందికరం కావచ్చు. అక్టోబర్: ఈనెల అనుకూలత తక్కువ. శ్రమకు తగిన ప్రతిఫలం, గుర్తింపు దక్కుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలకు తగిన ఖర్చులు ఉంటాయి. అవసరాలకు తగిన ఆదాయం అందదు. వృత్తి ఉద్యోగాల్లోను, ఆరోగ్యంపైన జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. నవంబర్: ఈనెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో ఇతరులపై ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. వ్యాపారం మందగిస్తుంది. కొత్త పనులు ఆలస్యమవుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు. నిరుత్సాçహానికి లోనవుతారు. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. డిసెంబర్: కుటుంబ, ఆరోగ్యపరమైన ఖర్చులు పెరుగుతాయి. స్థానచలనానికి ప్రయత్నిస్తారు. పనులు ముందుకు సాగవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. ఋణ సమస్యలు పెరుగుతాయి. విష్ణు ఆరా ధన శ్రేయస్కరం. కుటుంబ వాతావరణంలో ప్రశాంతత లోపిస్తుంది. పాత ఆరోగ్య సమస్యలు భయం కలిగిస్తాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు రైతులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. జనవరి: ఎప్పటి నుంచో పడిన శ్రమకు ఇప్పుడు సత్ఫలితాలు లభిస్తాయి. బదిలీలు అనుకూలం. భోజన సౌఖ్యం. మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారం లాభిస్తుంది. వివాహాది ప్రయత్నాలు చేస్తారు. విష్ణు ఆరాధన మంచిది. అనురాధ నక్షత్రం వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. షేర్ వ్యాపారులు సరిగా వ్యాపారం చేయలేరు. ప్రతి విషయంలోనూ గోప్యత పాటించడం మంచిది. విద్యార్థులు, రైతులు మరింత శ్రద్ధ పెట్టాలి. ఫిబ్రవరి: రవి–కుజ–బుధుల సంచారం ప్రతికూలముగా ఉన్నది. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. పనులలో ఆలస్యం, కుటుంబ ఖర్చులు పెరగటం, శారీరక శ్రమ అధికమవడం జరుగుతాయి. పెద్దల, గురువుల సహకారంతో పనులు పూరవుతాయి. సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. నవగ్రహారాధన చేయడం మంచిది. ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ ఇతరుల సలహాలు స్వీకరింపవద్దు. ప్రతి పనీ స్వయంగా చూసుకోవాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. పెద్దలకు, పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో విఫలం అవుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలుంటాయి. మార్చి: ఈనెల గ్రహసంచారం అనుకూలంగా లేదు. ఇతరులతో కొంత మితంగా వ్యవహరించుట మంచిది. వ్యర్థప్రసంగాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పనులు ఆలస్యమవుతాయి. ఉద్యోగంలో తోటివారితోను, అధికారులతోను విభేదాలు పెరుగును. పెద్దల సహాయం లభిస్తుంది. దైవారాధన మానవద్దు. -
ఈ రాశి వారు ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే..
ధనూ రాశి ఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–7, అవమానం–5 మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ) పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా) ఉత్తరాషాఢ 1వ పాదము (బే) గురువు మే 1 వరకు మేషం (పంచమం)లోను తదుపరి వృషభం (షష్ఠం)లోను సంచరిస్తారు. శని కుంభం (తృతీయం)లోను రాహువు మీనం (చతుర్థం)లోను కేతువు (దశమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో చాలా చక్కటి సమయపాలన చేసి సుఖపడతారు. అన్ని విషయాలలోనూ స్వతంత్ర నిర్ణయాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చాలా సందర్భాలలో మీకు శుభవార్తలు అందుతాయి. మీ వ్యవహారాలలో శుభ పరిణామాలు ఎక్కువసార్లు ఉంటాయి. విజ్ఞాన వినోద విహార యాత్రలు ఎక్కువగా సాగిస్తారు. స్నేహితుల మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ మాట తీరు ఇతరులకు మానసిక చికాకులు సృష్టించి, తద్వారా విభేదాలు తీసుకురాగలదు. వాగ్ధోరణిని నియంత్రించండి. ఉద్యోగ విషయాలు అంతా బాగానే ఉంటాయి కానీ, అనవసర విషయాలు మిమ్మల్ని అశాంతికి లోనయ్యేలాగా చేస్తుంటాయి. స్థిర బుద్ధి ప్రదర్శించకపోవడం దృష్ట్యా మధ్య మధ్య చికాకులు ఉంటాయి. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చేస్తే స్వస్థలం లేదా అనుకూల స్థలం చేరుకోగలరు. మీకు మంచి మార్పులకు కూడా కాలం అనుకూలం అవుతుంది. వ్యాపారులకు అనుకూల స్థితి ఉంటుంది. ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యాపార సమస్యలు, ప్రభుత్వ తరఫు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తి అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే తరచుగా భార్యాపుత్ర విరోధం ప్రతి విషయంలోనూ ఎదురవుతుంది. కానీ తెలివిగా సరిచేయగలుగుతారు. పెద్దల ఆరోగ్య విషయంగా జరిగే పనులు మీ ఇతర కార్యక్రమాలను ఇబ్బంది పెడతాయి. పనులు వాయిదా వేసి ఒంటరిగా ఎక్కడకు అయినా వెళ్ళాలి అని తరచుగా అనిపిస్తుంది. తరచుగా శుభకార్య, పుణ్యకార్య నిమిత్త ప్రయాణాలు మీ వలన ఆగిపోవడం దృష్ట్యా కుటుంబ సభ్యులు అసంతృప్తి చెందుతారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనవ్యయం బాగా అధికం అవుతుంది. అరికట్టలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన అవసరాలను కూడా వాయిదా వేయాల్సిన స్థితి ఉంటుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే సందర్భంలో సమస్యలు ఎదురౌతాయి. మీ అందరితోనూ మితవాదం చేయుట శ్రేయస్కరం. ఏ విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేరు. ఆరోగ్య విషయంగా వాత సంబంధ అనారోగ్యం ఉన్నవారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మిగిలిన వారి విషయంలో పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. మొత్తం మీద మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశికి చెంది స్త్రీలకు సరైన గుర్తింపు లేని విధంగా ఉద్యోగ పరిస్థితులు ఉంటాయి. అయితే ఇబ్బందికర ఘటనలు ఉండవు. కుటుంబ విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై మే నెల తరువాత ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు బాగా పాటించండి. షేర్ వ్యాపారులకు వ్యాపారం బాగున్నా, తగిన లాభాలు అందని పరిస్థితి. ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు కొంచెం ఇబ్బంది పెట్టినా, సానుకూలం అవుతుంటాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి మే నెల నుంచి ధనవ్యయం అధికం అవుతుంది. కార్యలాభం దూరమే. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి కావలసిన వనరులు తేలికగా లభ్యం అవుతాయి. మంచి నిర్ణయం చేస్తారు. విద్యార్థులకు శ్రమతో కూడిన మంచి ఫలితాలు వస్తాయి. గురుబలం తక్కువ. అన్ని విద్యా విషయాలు జాగ్రత్తగా చూడండి. రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవు. అయితే మీరు చేసే శ్రమ ఒక్కటే మీకు శ్రీరామరక్ష. మూల నక్షత్రం వారికి సాంఘిక కార్యక్రమాలలో అవమానాలు ఎదురవుతాయి. అయిష్టంగానే కొన్ని పనులు చేయవలసి వస్తుంది. కుటుంబ, ఆర్థిక, వృత్తి విషయాలలో అసంతృప్తి పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వారు ముందు జాగ్రత్త చర్యలతో పరిస్థితులను సానుకూలం చేసుకుంటారు. తరచు విహార యాత్రలు చేస్తారు. గురువులను దర్శించుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు నియమబద్ధంగా వృత్తి ఉద్యోగాలు నిర్వర్తిస్తారు. అభివృద్ధి ఉన్నా, తగిన ఫలితాలు రావు. కుటుంబంలో సానుకూలత సాధిస్తారు. శాంతి మార్గం: సంవత్సర ఆరంభంలో రాహువుకు, మే నెలలో గురువుకు జపం చేయించండి. ప్రాతఃకాలంలో రోజూ తెల్లటి పుష్పాలతో అమ్మవారి అర్చన చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: పని మీద దృష్టి పెట్టలేరు. ఇతర కార్యకలాపాలపై ఆసక్తి వలన ఇబ్బందులు కలుగుతాయి. అశ్రద్ధ, అకాలభోజనం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహస్తోత్రం పఠించాలి. ఉద్యోగ వ్యాపారాలలో కోరిన విధంగా ముందుకు వెడతారు. కుటుంబ సమస్యలకు, ఋణ సమస్యలకు, కోర్టు వ్యవహారాలకు మంచి పరిష్కారాలు పొందుతారు. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. మే: నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారం గతంలోకన్నా లాభిస్తుంది. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. దుర్జన సాంగత్యం వలన ఊహించని సమస్యలు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు కలిసివస్తాయి. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్ వ్యాపారుల ప్రణాళికలు సరిగా సాగవు. రైతులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. జూన్: తరచు ఊహించని ప్రయాణాలు. దాంపత్య జీవితంలో మనస్పర్థలు కలుగుతాయి. పనిఒత్తిడి వలన ఇంటి పనులు నిర్వహించలేరు. వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. శివకుటుంబ ఆరాధన మంచిది. మూలనక్షత్రం వారు ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరులను నమ్మి కొత్త ప్రయత్నాలు చేయరాదు. ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. షేర్, ఫైనాన్స్ వ్యాపారులకు విచిత్ర సమస్యలు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి. జులై: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. వ్యాపారంలో విభేదాలు, శత్రుబాధలు తొలగుతాయి. ఉద్యోగంలో రాణిస్తారు. ప్రభుత్వ పనుల్లో జాప్యం. భూమి కొనుగోలు చేస్తారు. శివ–విష్ణు స్తోత్ర పారాయణ మేలు. క్రమంగా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. షేర్ వ్యాపారులకు అద్భుతాలు జరుగుతాయి. విద్యార్థులకు రైతులకు అనుకూలం. ఆగస్ట్: ఈనెల అనుకూలత తక్కువ. చెప్పుకోలేని సమస్యలు. వృథా కాలక్షేపం వలన పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. నవగ్రహ శాంతి చేయడం మేలు. పుణ్యకార్య శుభకార్య, కుటుంబ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు అధికంగా చేస్తుంటారు. ఆర్థిక వెసులుబాటు తక్కువ. వస్తువులు చౌర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. షేర్ వ్యాపారులకు దూకుడు తగదు. రైతులకు కాలం అనుకూలం. సెప్టెంబర్: ఉద్యోగంలో సమస్యలు కొలిక్కి వస్తాయి. అధికార యోగం. ప్రతిభకు తగిన పురస్కారాలు లభిస్తాయి. వ్యాపార లబ్ధి. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు. కుటుంబ సమస్యలకు పెద్దల సలహాలతో పరిష్కారం లభింస్తుంది. రాబోవు ఆరుమాసాలు ఆర్థిక, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. విద్యార్థులకు, రైతులకు కూడా ఇబ్బందికరమైన కాలమే. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం కాదు. అక్టోబర్: ఉద్యోగ వ్యాపారాలలో కార్యసిద్ధి. రాజకీయవేత్తలు ఉన్నత పదవులు చేపడతారు. ఇప్పటి నుంచి 6 నెలలు పనులలో జాప్యం, తరచు ఆరోగ్య సమస్యలు, ఇతరులతో వివాదాలు ఉంటాయి. కుజ, సుబ్రహ్మణ్య శాంతి చేయాలి. వాహనాలు, పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు ఓర్పుగా వ్యవహరించాల్సిన కాలం. నవంబర్: స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలలో చికాకులు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టంలేని బదిలీలు, ప్రయాణాలు వలన శ్రమాధిక్యం, అకాల భోజనం, పనుల్లో జాప్యం జరుగుతాయి. ఋణాలు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు దూకుడు తగ్గించడం మంచిది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. డిసెంబర్: పనులన్నీ నత్తనడకన సాగుతాయి. ఎంత శ్రమించినా ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ప్రయాణాల వలన ఇబ్బందులు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త. శివ–విష్ణు ఆరాధన శుభప్రదం. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. తెలివి ఉన్నా, ధైర్యం చేయలేక చాలా పనులు ఆపివేస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. జనవరి: ఆర్థిక ప్రణాళిక రూపొందిస్తారు. పనుల నిమిత్తం ఎక్కువగా తిరగవలసి రావటం, శ్రమాధిక్యం ఉంటాయి. కార్యజయం ఉన్నది. విష్ణుస్తోత్ర పారాయణ శ్రేయస్కరం. ఆదాయ వ్యయాల సమతుల్యత సాధించలేరు. దైనందిన జీవనం సరిగా సాగదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు అతి శ్రమ, స్వల్ప ఫలితం ఉంటాయి. ఫిబ్రవరి: నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో విశేష గౌరవం పొందుతారు. స్థిరాస్తి కోర్టు విషయాలు సర్దుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విష్ణు–సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. పూర్వాషాఢ నక్షత్రం వారికి అన్ని రంగాల్లోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. çఅభివృద్ధి కోసం చేసే ప్రతి పనీ ఇబ్బందికరం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, శుభకార్య ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. మార్చి: విశేష వ్యాపారలబ్ధి ఉంటుంది. పనులన్నీ నేర్పుతో పూర్తి చేస్తారు. వ్యాపార నిమిత్త ప్రయాణాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. నవగ్రహారాధన చేయుట మంచిది. -
ఈ ఉగాది సంవత్సరాన ఈ రాశి వారికి ప్రమోషన్ అవకాశమే
మకర రాశి ఆదాయం–14 , వ్యయం–14 , రాజయోగం–3 , అవమానం–1 . ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ) శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ) ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి) గురువు మే 1 వరకు మేషం (చతుర్థం)లోను తదుపరి వృషభం (పంచమం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (ద్వితీయం)లోను రాహువు మీనం (తృతీయం)లోను కేతువు (భాగ్యం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో ఎక్కడా ఆటంకాలు ఉండవు. సమయపాలన బాగా చేస్తుంటారు. ఏలినాటి శని చివరి సమయంలో ఉన్నది. గురుబలం అనుకూలత దృష్ట్యా అంతా మంచి ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిగత గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉండేలాగ మీరు సహవాసాలు నడుపుకోండి. తరచుగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది. స్వబుద్ధితో చేసే కార్యములు అన్నీ విజయమే అందిస్తాయి. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ విషయాలలో అధికంగా తిరగవలసి ఉంటుంది. మార్కెటింగ్ వారికి మరీ ఎక్కువగా ఈ తిరుగుడు ఉంటుంది. అయితే అది లాభదాయకమే. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు మే నెల తరువాత చాలా సానుకూలం అవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఊహాతీతంగా లాభదాయక వార్తలు వింటారు. వ్యాపారులు స్వబుద్ధి, స్థిరబుద్ధి ప్రదర్శించిన వారికి మే నెల నుంచి అంతా శుభపరిణామాలే ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే స్వంత బంధువర్గం మిమ్మల్ని అపార్థం చేసుకోవడం లేదా మీరు వారిని అపార్థం చేసు కోవడం జరుగుతుంది. అయితే క్రమేణా గురుబలం వలన అవి సమసి పోతాయి. పిల్లల విషయంలో మీ అంచనాలు చక్కటి ప్రతిఫలం చూపుతాయి. మీ కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అనుకూలం అవుతాయి. అనుకోకుండానే వాహన లాభం పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలలో ఉన్నవారికి వేగంగా పనులు పూర్తవుతాయి. పాత ఋణాలు తీర్చే విషయంలోను, అవసరమైన కొత్త ఋణాలు పొందే విషయంలోనూ గ్రహచారం బాగా అనుకూలిస్తుంది. తరచుగా శుభవార్తలు వింటారు. గురువులను పూజ్యులను కలుస్తారు. విద్యార్జనపై ఆసక్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏదేని పాత సమస్యలు ఉంటే వాటికి మంచి వైద్యం లభిస్తుంది. బాగా జాగ్రత్తలు వహించి ఎటువంటి సమస్యలు రాకుండా కాలక్షేపం చేస్తారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు అన్ని రంగాలలోనూ అభివృద్ధి ఉంటుంది. ప్రధానంగా గురుబలం దృష్ట్యా కుటుంబ విషయాలలో మంచి విజయం అందుకుంటారు. అలంకరణ వస్తు కొనుగోలు కోరిక తీరుతుంది. గర్భిణీ స్త్రీల విషయమై అంతా శుభపరిణామాలే గోచరిస్తున్నాయి. చక్కటి ఆరోగ్యస్థితి ఉంటుంది. షేర్ వ్యాపారులకు లాభదాయకమైన కాలం. ఎటువంటి చాంచల్యమూ లేని స్థిర ఆలోచనలు విజయాన్నిస్తాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి కాలం కలసి వస్తుంది. విద్యా విషయంగా వెళ్ళేవారికి లాభం ఎక్కువ. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు ఆలస్యం. శ్రమాధిక్యతతో లాభాన్నిస్తాయి. విజయం తథ్యము. స్థిరాస్తి కోనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు పూర్తి అవుతాయి కానీ ఆలస్యం చోటు చేసుకుంటుంది. విద్యార్థులకు విద్యా వ్యాసంగం మీద దృష్టి స్థిరంగా ఉంచితే గురుబలం వలన మంచి విజయాలు అందుకుంటారు. రైతుల విషయంలో అంతా శుభప్రదమే. మంచి సూచనలు, సలహాలు అందుకుని లాభం పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3,4 వారు నిత్యం చేసే పనికి పొందే ఫలితానికి పొంతనలేని స్థితి ఉంటుంది. ఖర్చులు నియంత్రించలేక ఇబ్బంది పడతారు. అవసరానికి కావలసిన ధనం సర్దుబాటు కాక పనులు వాయిదా వేయవలసిన స్థితి ఉంటుంది. శ్రవణం నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, ఆలస్యంగానైనా ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో అద్భుత ఫలితాలు అందుకుంటారు. ఖర్చులు నియంత్రించడంలో విఫలం అవుతారు. ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలవారు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి పనిలోనూ వాయిదా వేసే లక్షణాలు ప్రదర్శిస్తారు. అనవసర విషయాలలో చర్చలు భయం, అవమానం కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. శాంతి మార్గం: అమ్మవారి అర్చన చేయండి. రోజూ సుబ్రహ్మణ్య, దుర్గాపూజలు చేస్తుండండి. ‘శ్రీమాత్రే నమః’ నామంతో ధ్యానం చేయడం, సుందరకాండ శ్రవణం చేయడం మంచిది. శని జపం చేయించండి. ఏప్రిల్: ఈనెల అన్ని రంగాలవారికీ కాలం కలసి వస్తుంది. 3వ వారంలో కొన్ని సమస్యలు ఎదురైనా, మనోధైర్యంతో ఎదుర్కొంటారు. స్థిరాస్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో కొంత అలజడి ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. షేర్ వ్యాపారులు లాభపడతారు. విదేశీ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. స్థిరాస్తి ప్రయత్నాలలో కాలం అనుకూలం. మే: ఈ నెల పనులు సానుకూలంగా సాగుతాయి. ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడతాయి. విలాస జీవితం గడుపుతారు. కుటుంబంలో స్వల్ప మనస్పర్థలు ఏర్పడతాయి. శివ–విష్ణు స్తోత్రపారాయణ శుభప్రదం. విదేశీ ప్రయత్నాలలో మంచి సలహాలు అందవు. షేర్ వ్యాపారులకు అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పథకాల రూపకల్పనకు, స్థిరాస్తి కొనుగోలుకు మంచి కాలం. పెద్దవారి ఆరోగ్యం బాగుండటం, పిల్లల అభివృద్ధి వలన సుఖపడతారు. జూన్: ఈ నెల అత్యంత అనుకూలం. అన్ని రంగాలవారు అభివృద్ధి చెందుతారు. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. మొండి బాకీల వసూలవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. జులై: ఈనెల గ్రహ సంచారం ప్రతికూలంగా ఉంది. ఎదుటి వారి మేలు కోసం మీరు చేసే పనుల వలన ఇబ్బందులు తప్పవు. అందరూ మీతో విరోధిస్తారు. వ్యాపారం గతం కన్నా తగ్గుతుంది. నవగ్రహారాధన మంచిది. ఋణ సమస్యలు విచిత్రంగా ఉంటాయి. ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువ అయినా, ఇబ్బంది ఉండదు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు ఇబ్బందులు ఉండవు. ఆగస్ట్: ఈనెల ప్రథమార్ధం ఎటువంటి సమస్యలు లేక సామాన్యంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో పనులన్నిటా ఆటంకాలు ఎదురవుతాయి. 4వ వారంలో శుభాలు కలుగుతాయి. వృత్తిలో రాణిస్తారు. అనవసర విషయాలలో కలగ చేసుకొని కలహాలు తెచ్చుకుంటారు. మీ మాటకు గౌరవం తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. సెప్టెంబర్: ఈ నెల అనేక శుభాలు జరుగుతాయి. వ్యాపార లబ్ధి. వృత్తిలో ఆటంకాలను అధిగమిస్తారు. స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. భూ వాహన కొనుగోలుకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. గురువులను సందర్శిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. అక్టోబర్: ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు. అధికారయోగం ఉంది. రాజకీయవేత్తలకు అనుకూలం. ప్రభుత్వ సంబంధ పనులు పూర్తవుతాయి. దాంపత్య జీవితంలో తెలియని అశాంతి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారులకు అనుకోని లాభాలు. విద్యార్థులకు మంచి కాలం. షేర్ వ్యాపారులు అద్భుతంగా రాణిస్తారు. నెల అంతా పుణ్య, శుభకార్యాలు నిర్వహిస్తారు. నవంబర్: ఈనెల శుభ ఫలితాలు కలుగుతాయి. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఇప్పటి నుంచి 5 నెలల పాటు జీవిత, వ్యాపార భాగస్వాములతో విభేదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కుజ శాంతి చేయాలి. అధికారుల సహాయంతో ప్రమోషన్లు, స్థానచలనాల్లో లాభం అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి ప్రయత్నాలు లాభదాయకం. షేర్ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన, గురువుల సందర్శన చేసుకుంటారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. డిసెంబర్: ఈనెల అన్ని రంగాలవారికీ అనుకూలమే. వ్యాపారలబ్ధి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. 16వ తేదీ తరువాత స్వయంకృతాపరాధం అన్నట్లుగా కొన్ని పనులు పాడు చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు, ఇతర చికాకులు 16వ తేదీ నుంచి పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి జరుగుతుంది. జనవరి: ఈనెల వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. అకాల భోజనం వలన ఆరోగ్య సమస్యలు. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. ఫిబ్రవరి: వ్యాపారం లాభ దాయకంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యవహార ప్రతిబంధకాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నం సఫలం అవుతుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలుంటాయి. మార్చి : ఈ నెల ఎక్కువ శుభపరిణామాలు జరుగుతాయి. అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. నూతన పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విష్ణు ఆరాధన శ్రేయస్కరం. -
ఈ ఉగాది కొత్త సంవత్సరంతో.. ఈ రాశి వారకి ఎలా ఉందంటే..?
కుంభ రాశి ఆదాయం–14, వ్యయం–14, రాజయోగం–6, అవమానం–1 ధనిష్ఠ 3,4 పాదములు (గుూ, గే) శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు) పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా) గురువు మే 1 వరకు మేషం (తృతీయం)లోను తదుపరి వృషభం (చతుర్థం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (జన్మం)లోను రాహువు మీనం (ద్వితీయం)లోను కేతువు (అష్టమం)లోను సంచరిస్తారు. రోజూవారీ కార్యక్రమాలలో ఆలస్యం బాగా చోటు చేసుకుంటుంది. ఏలినాటి శని వలన సహజంగా ఉండే ఇబ్బందులు ఉంటాయి. కానీ భయభ్రాంతులను చేసే స్థాయి కాదు అని గమనించాలి. ప్రతిపనీ రెండవసారి, మూడవసారి ఓర్పుగా వెంబడిస్తే లాభిస్తుంది. ఇది మీరు ప్రత్యక్షంగా గమనించవచ్చు. ప్రాకృత ధర్మంలో ఉన్న వారికి సమస్యలు రావు. వేరే మార్గంలో మీ ప్రవృత్తిని మార్పు చేసుకొనేవారు మాత్రమే ఇబ్బంది పొందుతారు. శని ఆలస్యం చేస్తాడు కానీ పనులు పాడు చేయడు. ఇది నిజం. ఉద్యోగ విషయాలలో భయపడవద్దు. మార్పు తీసుకోవద్దు. వృత్తి మార్పుకు ఇది మంచి కాలం కాదు. చేస్తున్న ఉద్యోగంలో ఉంటూ కొత్త ఉద్యోగ అన్వేషణ చేయండి. ఇబ్బంది ఉండదు. చేస్తున్నది మానేసి కొత్త ప్రయత్నం చేస్తే అది వికటిస్తుంది. చేస్తున్న పనిలో సరైన గుర్తింపు రాలేదని బాధపడవద్దు. స్థానచలన ప్రయత్నాలు స్వయంగా సమీక్షించుకోకపోతే మీకు సానుకూలత లేని ప్రదేశం చేరుకోవలసి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు తక్కువ స్థాయి ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్తపడండి. తరచుగా శుభవార్తలు వింటుంటారు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా ఇబ్బందులు రాగలవు. అలాగే మీ పిల్లల ద్వారా మీకు ఉన్న ఆశలు, కోరికలు సరిగా పూర్తి అవకపోవడం చేత కొంచెం మానసికంగా చికాకులు ఉంటాయి. మీ ముఖంలో తేజస్సు తగ్గే అవకాశం ఉంటుంది. మీ వాక్కులు బాగా కఠినంగా వస్తుంటాయి. నియంత్రించండి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనం వృథాగా ఖర్చు చేసే సందర్భాలు ఎన్నోసార్లు వస్తుంటాయి. ఆదాయం సమయానికి తగిన విధంగా అందకపోవచ్చు. ఆదాయం అందుతుంది. అయితే ఆలస్యంగా అందుతుంది. ఋణాలు కూడా అవసరానికి తగిన రీతిగా సమయానికి అందవు. మీరు ఆర్థిక విషయాలలో ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. మీరు వాగ్దానాలను, హామీలను నెరవేర్చలేరు. వాహన ఖర్చులు అధికం అవుతాయి. ఆరోగ్య విషయంగా, పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టే అవకాశాలు ఉన్నాయి. నరాలు, చర్మం, ఎముకలు, గుండెజబ్బులు వంటి పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది ఉంటుంది. కొత్త సమస్యలు కూడా రాగలవు. ఈ రాశికి చెందిన స్త్రీలకు తరచుగా ఆలోచనలు స్థిరత్వం కోల్పోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి. తద్వారా కుటుంబ విషయాలకు ఉద్యోగ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితిలో ఉంటారు. జాగ్రత్తపడండి. గర్భిణీ స్త్రీల విషయమై జాగ్రత్తలు చాలా అవసరం. వైద్య సలహాలు చాలా బాగా అనుసరించవలసి ఉంటుది. షేర్ వ్యాపారులకు స్థిరబుద్ధి అవసరం. ఇతరులతో పోలిక, ఇతరుల సూచనలు తీసుకున్నా మీ బుద్ధినే వాడండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు మందగిస్తాయి. ఒకటి లేదా రెండు సార్లు కూడా వైఫల్యం రావచ్చును. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఎవరినీ నమ్మి ఏ పనులు చేయవద్దని సూచన. కార్య సాఫల్యం తక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి బహు జాగ్రత్తలు అవసరం. స్వబుద్ధి వికాసం ఈ విషయంలో అవసరం. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. బుద్ధి స్థిరం కోల్పోవు అవకాశాలు ఉన్నాయి. అయితే మంచి ఫలితాలు ఉంటాయి. రైతుల విషయంలో మే తరువాత గురువు అనుకూలమే కాబట్టి పంటలకు ఇబ్బంది రాదని అనుకోండి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 వారు తొందరపాటు ధోరణితో చికాకులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపార, ఋణ వ్యవహారాలను ఓర్పుగా నిర్వహించండి. శతభిష నక్షత్రం వారు ఆరోగ్యపరంగా జాగ్రత్త పడవలసిన కాలం. విద్యార్థులు మందగొడిగా అధ్యయనం సాగిస్తుంటారు. శుభకార్యాల పనులు వేగంగా సాగుతాయి. పూర్వాభాద్ర నక్షత్రం 1,2,3 వారు పరిధి దాటి ఋణాలు చేసి స్థిరాస్తి కొనుగోలు చేయు స్థితి ఉంటుంది. తరచుగా సంఘంలో పెద్దలను కలుసుకుంటారు. ఖర్చులు అదుపు తప్పుతాయి. శాంతి మార్గం: రోజూ ఆంజనేయుని దేవాలయంలో ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. శని, గురువులకు జపం దానం చేయండి. గోపూజ చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: పనులు శరవేగంగా పూరవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉన్నతాధికారులను సందర్శిస్తారు. బదిలీలు అనుకూలిస్తాయి. వ్యాపారం బాగుంటుంది. బంధు మిత్రులతో జాగ్రత్త అవసరం. విష్ణు ఆరాధన మంచిది. 15వ తేదీ తరువాత అనుకూలంగా ఉంటుంది. దూరప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆరోగ్య రక్షణ మీద దృష్టి ఉంచుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. షేర్ వ్యాపారులు, రైతులు, మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతారు. మే: ఈనెల ప్రతి విషయం ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం మంచిది. బంధువర్గంతో విభేదాలు. చివరి వారం మంచి వార్తలు వింటారు. మీ కృషికి తగిన గౌరవం లభించదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార పెట్టుబడులు, నూతన వాహనాల కొనుగోలుకు సమయం అనుకూలము కాదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్, వ్యాపారులకు, విద్యార్థులకు చివరి వారం అనుకూలం. జూన్: ఈ నెల అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా చేయగలరు. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు సర్దుకుంటాయి. స్థిరాస్తి వ్యవహారం అనుకూలిస్తుంది. ద్వితీయార్ధంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట సరిపడని పరిస్థితి ఉంటుంది. శతభిషా నక్షత్రం వారికి అవమానకర ఘటనలు ఎదురవుతాయి. షేర్, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు సమస్యలను అధిగమిస్తారు. జులై: ఈ నెల ప్రథమార్ధంలో ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకం. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఋణ సమస్యలు తగ్గుతాయి. ద్వితీయార్ధంలో నిందలపాలవుతారు. నవగ్రహ ఆరాధన మంచిది. ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు అధిక జాగ్రత్తలు పాటించాలి. రైతులు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. ఆగస్ట్: దాంపత్యంలో అన్యోన్యత తగ్గుతుంది. ఇంటా బయట చికాకులు. వ్యర్థ ప్రయాణాల వలన శారీరక శ్రమ, ప్రయోజనం శూన్యంగా ఉంటుంది. నవగ్రహారాధన శుభప్రదం. వృత్తిలో అధికారుల ఒత్తిడి ఉంటుంది. ఋణ, ఆరోగ్య, ప్రయాణ విషయాలలో జాగ్రత్త అవసరం. వస్తువులు చౌర్యానికి గురవుతాయి. సెప్టెంబర్: ఈ నెల కొంత ఒదిగి ఉండటం మేలు. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఒక శుభం జరుగుతుంది. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. షేర్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు. ఋణ, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల వలన ఇబ్బంది ఉంటుంది. అక్టోబర్: పనులకు ఆటంకాలు వచ్చినా, వాటిని అధిగమిస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై జాగ్రత్తలు అవసరం. శతభిషా నక్షత్రం వారు కొన్ని సందర్భాలలో తెలివిగా ప్రదర్శించి విజయాలు అందుకుంటారు. ధనం సర్దుబాటు ఇబ్బందికరమైనా, ప్రతి పనికీ ధనం సాధించుకుంటారు. షేర్ వ్యాపారులకు సాధారణ ఫలితాలు. ఫైనాన్స్ వ్యాపారులకు, రైతులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నవంబర్: ఈ నెల అంతా అనుకూలమే. సమస్యలు తొలగుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు. శత్రుబాధలు తొలగుతాయి. అవసరానికి తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. దూరప్రాంత ప్రయాణాలు అధికంగా చేస్తారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలు. డిసెంబర్: ఇంటా బయటా అన్నింటా కార్యజయం. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. విశేష అధికారయోగం. ఆదాయం పెరుగుతుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. భూ– వస్తు– వాహన– ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనాలతో జాగ్రత్త అవసరం. ఆటోమొబైల్ రంగం వారికి చికాకులు వస్తుంటాయి. వ్యాపారాలు మందగమనమే అయినా, అనుకున్న లాభాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులు తొందరపాటు విడనాడాలి. జనవరి: తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తిలో విశేష గౌరవం. ఆరోగ్యం అనుకూలం. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్త్ర– ఆభరణ– గృహలాభం ఉంది. కొత్త ప్రయోగాలు చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి ప్రయత్నాలను తెలివిగా సానుకూలం చేసుకుంటారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఫిబ్రవరి: కుటుంబంలో అందరూ ఉన్నతస్థానంలో ఉంటారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి. తరచు ప్రయాణాలవల్ల శారీరకశ్రమ. మోసపూరిత వాతావరణం ఉంటుంది. విష్ణు స్తోత్ర పారాయణ మంచిది. 19వ తేదీ నుంచి ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. పిల్లల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తారు. పెద్దల ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచుతారు. షేర్, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు విశేష ఫలితాలు. విదేశీ ప్రయత్నాలకు సానుకూలం. మార్చి: శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం అభివృద్ధి చూసి ఆనందిస్తారు. వ్యాపారం మిశ్రమంగా సాగుతుంది. శివారాధన మంగళప్రదం. -
ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి
మీన రాశి ఆదాయం–11 , వ్యయం–5 , రాజయోగం–2 , అవమానం–4 పూర్వాభాద్ర 4 వ పాదము (ది) ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా) రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి) గురువు మే 1 వరకు మేషం (ద్వితీయం)లోను తదుపరి వృషభం (తృతీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (వ్యయం)లోను రాహువు మీనం (జన్మం)లోను కేతువు (సప్తమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సరైన నిర్ణయాలు చేయలేక ఇబ్బందికి గురవుతుంటారు. గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా ఉండేలాగా మీ నడవడికను సరిచేసుకోండి. కొన్నిసార్లు దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు. జాగ్రత్తపడండి. రోజువారీ భోజనం విషయంలో కూడా మీకు సమయపాలన, సంతుష్టి ఉండవు. ప్రతిరోజూ చేయవలసిన పని వదిలి దూరంగా వెళ్ళాలి అనే కోరిక బాగా పెరుగుతుంది. నిత్య కర్మలను వాయిదా వేయవద్దు. ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నది. అయితే జన్మ రాహువు కూడా ఇబ్బందికరమే. ప్రతిపనీ శ్రమయుక్తమే. ఉద్యోగ విషయాలలో పని మీద ఉత్సాహం కలగక సరిగా పనిచేయరు. మీరు కుటుంబం, ఉద్యోగం తప్ప మరి ఏ ఇతర విషయాలకూ ప్రాధాన్యమివ్వ వద్దు. గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వస్తుంది. అయినా ఓర్పు వహించండి. ప్రమోషన్ అందడం కష్టసాధనం. మీరు సరైన జాగ్రత్తలు పాటింపకపోతే అయిష్టమైన స్థానానికి స్థానచలనం కలుగుతుంది. కొన్నిసార్లు వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా, అధికారుల ద్వారా, గుమస్తాల ద్వారా ప్రతికూల స్థితులు రాగలవు. మైత్రీభావం ప్రదర్శించండి. కుటుంబ విషయాలు చూస్తే ఎవరితోనూ మీకు మాట కలవదు. వీలయినంతవరకు మౌనం పాటించండి. బంధువుల విషయంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తలు పాటించండి. పిల్లల అభివృద్ధి విషయంలో అసంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది. అయితే మీ జాగ్రత్తల వలన మీరు అన్ని రకాల సమస్యలు దాటగలరు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే తరుచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కాని సందర్భాలు ఎన్నో ఉంటాయి. పాత ఋణాలు విషయంగా హామీ నెరవేర్చలేరు. కొత్త ఋణాలు అవసరానికి అందవు. చాలా విచిత్ర స్థితి ఒక్కసారిగా ప్రారంభం అవడంతో మీరు కూడా అయోమయంలో ఉంటారు. మీ దగ్గర డబ్బులు తీసుకున్నవారు సమయానికి తీర్చరు. ఖర్చులు నియంత్రించిన వారికి మంచి కాలం. ఆరోగ్య విషయంగా పాత సమస్యలు తిరగపెట్టే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించవలసిన కాలం. వైద్య సలహాలు బాగా పాటించండి. ఆరోగ్యవంతులు కూడా ప్రతిరోజూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఏదో తెలియని చికాకులు తరచుగా వస్తుంటాయి. ఈ సంవత్సరం మీరు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సమన్యాయం పాటించక ఇబ్బందులు పడతారు. గర్భిణీ స్త్రీల విషయమై బహు జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు క్రమం తప్పకుండా పాటించండి. షేర్ వ్యాపారులకు మంచి వ్యాపారం చేయలేకపోగా అనవసర సమయంలో పెట్టుబడులు పెడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో వున్నవారికి పనులు సరిగా కావు. అందుకోసం చింతించనవసరం లేదు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి అన్ని పనులూ చికాకులు సృష్టిస్తాయి. ఎవరూ సరిగా సహకరించరు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం ప్రతి అంశంలోనూ ఎదురవుతుంది. విద్యార్థులకు చాలా విచిత్ర స్థితి ఉంటుంది. రాబోవు మూడు సంవత్సరాలు మీరు స్థిరబుద్ధిని బాగా ప్రదర్శించాలి. రైతుల విషయంలో కృషి సరిగా చేయకపోవడం, తప్పుడు సలహాలు అందడం వంటివి తరచుగా ఉంటాయి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. పనులు మందగమనంగా ఉంటాయి. కిందస్థాయి వారితో వృత్తి నష్టాలు వస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపారాలలో పనులు ఆలస్యమైనా, లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కొత్త ప్రయోగాలకు మంచికాలం కాదు. రేవతి నక్షత్రం వారు గృహ, వ్యాపార నిర్వహణలలో పనివాళ్ల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. వృత్తి విషయాలలో అధికారుల సహకారం తక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శాంతి మార్గం: శని, రాహు, గురువులకు తరచుగా శాంతి చేయించడం మంచిది. రోజూ ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామికి ‘శ్రీరామశ్శరణం మమ’ అని, సాయం సమయంలో శివాలయంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఏప్రిల్: ఈ నెల ఆర్థిక సమస్యల వలన మానసిక ఒత్తిడి. ఋణం చేయవలసి వస్తుంది. పనులు ఎంత శ్రద్ధగా చేసినా, ఆశించిన ప్రతిఫలం ఉండదు. ఉద్యోగంలో పైఅధికారులతో సమస్యలు వస్తాయి. మీ పనులలో ఇతరుల ప్రమేయం వలన సమస్యలు వస్తాయి. శారీరక మానసిక ఒత్తిడి తప్పదు. మే: పనిలో నేర్పు ప్రదర్శిస్తారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. సమస్యలను పట్టుదలతో పరిష్కరిస్తారు. ధనలాభం ఉంది. ఆరోగ్యం కొంత ఇబ్బందికరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకోలేరు. విద్యార్థులకు, రైతులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు రాబోవు సంవత్సర కాలం అధిక జాగ్రత్తలు అవసరం. జూన్: ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ అవసరం, అభిప్రాయ భేదాల వల్ల మనస్తాపం ప్రయాణాలవల్ల అలసట. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తవుతాయి. షేర్, ఫైనాన్స్, వ్యాపారాలలో చిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. విద్యార్థులకు, రైతులకు చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు అనుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. జులై: కుటుంబ సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. పట్టుదలతో పెద్దపనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఉద్యోగంలో రాణిస్తారు. భూ–వాహన–స్థిరాస్తి లాభం. ఇష్ట దైవారాధన శుభప్రదం. ధనం సర్దుబాటు కాకున్నా, కొన్ని పనులు వేగంగా సాగుతాయి. 16వ తేదీ తరువాత సానుకూలం. మాసాంతంలో కార్య విజయం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు కాలం సామాన్యం. ఆగస్ట్: కాలం అనుకూలం. ఉద్యోగంలో శత్రు బాధలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఋణ రోగ సమస్యలు తగ్గుతాయి. స్త్రీలతో వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ విషయాలలో మొండి వైఖరితో సమస్యలు పెంచుకుంటారు. వృత్తి విషయాలలో కోపావేశములతో కొన్నిసార్లు ఇబ్బంది పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. సెప్టెంబర్: ఈనెల గ్రహానుకూలత తక్కువ. ఎదుటివారి విషయాలకన్నా స్వవిషంపై శ్రద్ధ వహించడం శ్రేయస్కరం. ఉద్యోగ బదిలీలు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. నూతన వాహన కొనుగోలు ఆలోచనలు విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. విద్యార్థులకు, రైతులకు కాలం సరిగా లేదు. అక్టోబర్: మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఇంట్లో స్త్రీలకు ఆరోగ్య ఇబ్బందులు. కుజ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల శుభం కలుగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. షేర్ వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు. రైతులకు, మార్కెటింగ్ వ్యాపారులకు అనుకూలం కాదు. ధనం వెసులుబాటు జరగదు. నవంబర్: ఇంటా బయటా మీమాటకు విలువ తగ్గును. ఏపనికైనా పలుమార్లు చెప్పవలసి వచ్చును. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో సమస్యల పట్ల ఆందోళన చెందక నేర్పుతో వ్యవహరిస్తారు. పిల్లల నుంచి సహకారం తక్కువ. ఉద్యోగ కుటుంబ వ్యవహారాల నిర్వహణలో సరైన దృష్టి ఉంచలేరు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. డిసెంబర్: ఉద్యోగంలో పెనుమార్పులు మీకు అనుకూలిస్తాయి. ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. రాజకీయవేత్తలకు మంచి అవకాశాలు లభిస్తాయి. శివ దర్శనం శుభప్రదం. మీ ఆరోగ్యం అనుకూలమే కానీ మానసిక స్థితి కొంచెం ఇబ్బందికరం. విద్యార్థులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. రైతులకు, షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వేగం అవుతాయి. జనవరి: వృత్తిలో రాణిస్తారు. వ్యాపారం లాభదాయకం. రాజకీయవేత్తలు ప్రజల మన్ననలు పొందుతారు. అధికారయోగం ఉంది. శత్రుబాధల నుంచి విముక్తి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగ, వ్యాపారాలలో మీ స్థిరత్వానికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తపడండి. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు సహకారం తక్కువ. ఫిబ్రవరి: తీర్థయాత్రలు చేస్తారు. సత్సాంగత్యం వలన లబ్ధి పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతోషాన్ని కలిగిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదైవ ధ్యానం శుభకరం. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి విషయంలో ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయి. ఋణాలు అవసరానికి అందుతాయి. పాత ఋణ సమస్యలను తెలివిగా అధిగమిస్తారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. మార్చి: ఎన్ని సమస్యలు ఉన్నా, ఓర్పుతో వ్యవహరిస్తారు. కుటుంబ సహకారంతో పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ బదిలీల వల్ల అలసట, శారీరక శ్రమ ఉంటాయి. ఆర్ధిక విషయాలలో ఇతరులపై ఆధారపడవద్దు. మోసపూరిత పరిస్థితులు ఉంటాయి. -
ఈ కొత్త సంవత్సరం మేష రాశివారికి ఆర్థిక లాభాలు ఉంటాయి
మేష రాశి ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–3. అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా) భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో) కృత్తిక 1వ పాదము (ఆ) గురువు మే 1 వరకు మేషం (జన్మం)లోను తదుపరి వృషభం (ద్వితీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (లాభం)లోను రాహువు మీనం (వ్యయం)లోను కేతువు (షష్ఠం)లోను సంచరిస్తారు. రోజువారి కార్యక్రమాలలో చాలా సమయపాలన పాటించి మంచి ఫలితాలు అందుకుంటారు. అందరికీ సహకరిస్తారు. అందరూ మీకు సహక రిస్తారు. భోజనం, మంచి వస్త్రధారణ వంటి వాటిలో మీ కోరికలు తీరతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. స్వేచ్ఛగా కావలసిన రీతిగా హాయిగా జీవనం సాగిస్తారు. కొన్నిసార్లు కార్య విఘ్నమునకు అవకాశం వున్నా పెద్దగా ఇబ్బందికరం కాదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మకార్యాచరణ చేసి సంఘంలో గౌరవం పొందుతారు. ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే, శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలే అందుతాయి. గురుబలం క్రమేణా పెరుగుతున్న కారణంగా ద్వితీయార్ధంలో సత్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. రాహు ప్రభావంగా మధ్య మధ్య చికాకులు ఉంటూనే మీకు అభివృద్ధి సాగుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలి తప్పదు. అదే రీతిగా ట్రాన్స్ఫర్ కావలసిన వారు జాగ్రత్తగా ప్రయత్నించాలి. అధికారులు బాగా సహకరిస్తారు. కుటుంబ విషయాలు చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బంధువులతో గత సమస్యలకు పరిష్కారం దొరికి కలహాలు తీరుతాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంగా అనుకూల వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి విషయంలో కూడా మంచి ప్రయత్నాలు జరుగుతాయి. శుభకార్య పుణ్యకార్య నిమిత్తంగా ప్రయాణాలు చేయడం పూజ్యులు, గురువులు, బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే సమయానికి, అవసరానికి తగిన ఆదాయం బాగా అందుతుంది. గతంలో వున్న ఋణ సమస్యలు తీరడానికి ఈ సంవత్సరం అంతా అనుకూలం. అవసరానికి కావలసిన కొత్త ఋణాలు కూడా బాగా అందుతాయి. ప్రతి వ్యవహారములను ఆర్థిక లోటు అనేది లేకుండా సాగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో కూడా చాలా మంచి పరిణామాలు వుంటాయి. ఆరోగ్య విషయంగా అనవసర అనుమానాలు వస్తుంటాయి. మీకు ఈ సంవత్సరం గ్రహచారం ఆధారంగా ఎక్కువ ఇబ్బందులు ఉండవు. పాత సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. కళ్లు, నరాల సమస్యలు ఉన్నవారికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు కాలం బాగా యోగంగా వున్నది. వృత్తి రీత్యా అభివృద్ధి ఉన్నది. కుటుంబ విషయంగా కూడా గొప్పగా కాలక్షేపం చేయగలుగుతారు. ప్రతి విషయం లాభదాయకమే అవుతుంది. గర్భిణీ స్త్రీల విషయమై సుఖ ప్రసవానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే రాహువు వలన మధ్య మధ్య చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు దూకుడుతనం పనికిరాదు. జాగ్రత్తగా వ్యవహరించిన వారికి అంతా శ్రేయోదాయకమైన ఫలితాలుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికం అవుతుంది. అయినా పని విజయవంతం అవుతుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోవద్దని సూచన. ముఖ్యమైన వారిని మాత్రమే అనుసరించండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్న వారికి ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. ప్రణాళికలు రూపుదాల్చుకుంటాయి. విద్యార్థులకు గురుబలం దృష్ట్యా మే నుంచి చాలా విశేష ఫలితాలు ఉంటాయి. మే వరకు సాధారణం. రైతుల విషయంలో అనుకూల వాతావరణం ఉన్నది. శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. అశ్వని నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆర్థిక వెసులుబాటు బాగున్నా, మానసిక ఒత్తిడి ఎక్కువ. ఉద్యోగులకు శ్రమతో కూడిన లాభాలు. భరణి నక్షత్రం వారికి రాహు ప్రభావం ఎక్కువ. కుజుడు కూడా అధిక ప్రభావం చూపుతాడు. ఆరోగ్యశ్రద్ధ తీసుకోవాలి. మీ ప్రవర్తన ఇతరులకు, ఇతరుల ప్రవర్తన మీకు నచ్చక చికాకులు పొందుతారు. కృత్తిక నక్షత్రం 1వ పాదం వారికి అద్భుతమైన కాలం. ఊహకు అందని అవకాశాలు వస్తుంటాయి. శుభ పుణ్యకార్యాల నిమిత్తం ప్రయాణాలు, ధనవ్యయం. శాంతి మార్గం: రాహు సంచారం అనుకూలం లేని కారణంగా ‘దుర్గా సప్తశ్లోకీ’ పారాయణ చేయండి. ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. రాహు శాంతికి జప దానాలు చేయించడం శ్రేయస్కరం. ఏప్రిల్: మానసిక శారీరక శ్రమ వల్ల అశాంతి. ధైర్యంగా ఉంటారు. పుణ్యకార్యాల కోసం ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాల వల్ల చికాకులు. ఆరోగ్యం గురించి ముందు జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాలకు వెళ్ళవద్దు. కుటుంబ వ్యవహారాలను గోప్యంగా ఉంచండి. షేర్ వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగ చికాకులు ఉంటాయి. విద్యార్థులకు శ్రమ కలిగినా, ఫలితం అందదు. చివరి వారంలో రవి కుజ ప్రతికూలం. ఆరోగ్యశ్రద్ధ వహించాలి. మే: ఆర్థిక లాభాలు ఉంటాయి. అహంభావం వల్ల ఇబ్బందులు. ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది. ఉద్యోగంలో విభేదాలు ఉన్నా, మాట నియంత్రణతో పనులు పూర్తిచేస్తారు. షేర్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు గురుబలం బాగుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. కోర్టు, స్థిరాస్తి కొనుగోలు విషయాలు వాయిదా వేయండి. జూన్: ఉద్యోగ, వ్యాపారాల్లో విశేష రాణింపు, ఆర్థిక– వస్తు– వాహన లాభాలు ఉంటాయి. స్థానచలనం అనుకూలత ఉన్నది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ వల్ల శుభం. 19వ తేదీ వరకు అశ్వనీ వారికి, 19వ తేదీ నుండి భరణీ నక్షత్రం వారికి కలహాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్, మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితాలు శూన్యం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన సత్ఫలితాలు ఉంటాయి. జులై: మొదటి రెండువారాల్లో మిశ్రమ ఫలితాలు. 3, 4 వారాల్లో రవి– కుజుల ప్రభావంతో కుటుంబంలో చికాకులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల రాకపోకలు ఎక్కువ. ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. విదేశీ నివాస, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు, షేర్ వ్యాపారాలకు అనుకూలం. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు అందుకుంటారు. ఆగస్ట్: కుజ– బుధ– శుక్రుల అనుకూలత వలన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక లాభం, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల, భూలాభం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నరదృష్టి పెరుగుతుంది. కాలభైరవాష్టక పారాయణ మంచిది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు కాలం అనుకూలం. సెప్టెంబర్: ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన– వస్తు– వాహన– గృహ లాభ సూచనలు ఉన్నాయి. శత్రు ఋణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుక్రునికి జప దానాదులు చేయాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు ద్వితీయార్ధంలో తగ్గుతాయి. ఫైనాన్స్ వ్యాపారులకు మొండి బాకీలు పెరుగుతాయి. స్నేహితులతో కలసి చేసే వ్యవహారాలు చిక్కులు సృష్టిస్తాయి. విద్యార్థులకు రైతులకు అనవసర వ్యవహారాలు ప్రాధాన్యం అందుకుంటాయి. అక్టోబర్: ఈనెల ప్రతికూలత ఎక్కువ. విమర్శలు ఎదురవుతాయి. పనులు నత్తనడకన సాగుతాయి. వచ్చే 6 నెలలు కుజ సంచారం ప్రతికూలం. ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. రవి, శుక్రులకు దానం, కుజునకు విశేష శాంతి చేయాలి. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. అయితే నష్టాలు ఉండవు. విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ మంచి ఫలితాలు ఉంటాయి. నవంబర్: చతుర్థ– అష్టమాల్లో కుజ– రవుల సంచారంతో అధికశ్రమ, తక్కువ ప్రతిఫలం. పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యా వ్యాసంగం బాగుంటుంది. రైతులకు మంచి సలహాలు అందుతాయి. భరణీ నక్షత్రం వారికి ఉద్యోగంలో అధికారులు ఒత్తిడి పెంచినా, మీ తెలివితో వారిని ఆకర్షిస్తారు. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించాలి. డిసెంబర్: అనవసర విషయాల్లో జోక్యం వలన ఇబ్బందులు. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి పనుల్లో ఆలస్యం. రవి, కుజ, శుక్రులకు శాంతి చేయాలి. వ్యాపారులకు బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. విదేశీ నివాస, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సరిగా సాగవు. జనవరి: పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ధనలాభం, గృహ వాహన వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, భూ కొనుగోలు, విదేశీ ప్రయత్నాలు సఫలం. వ్యాపారులకు మంచి లాభాలు. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు, కోర్టు వ్యవహారాలకు అనుకూలం. ఫిబ్రవరి: పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగవ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఋణ– రోగ– శత్రు బాధల నుంచి ఉపశమనం. శుక్ర, లక్ష్మీ ఆరాధన మంచిది. షేర్ వ్యాపారులకు దూకుడు కూడదు. ఆర్థిక లావాదేవీలు గోప్యంగా ఉంచండి. గురువులు, శ్రేయోభిలాషులు సహకారం అందిస్తారు. మార్చి: శ్రమకు తగిన గుర్తింపు. స్థానచలనం అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దైవదర్శనం, తీర్థస్నానం, యథాశక్తి దానధర్మాలు చేయడం మంచిది. -
Ugadi Rasi Phalalu 2024 To 25: శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలు..
మేష రాశి ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–3. అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా) భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో) కృత్తిక 1వ పాదము (ఆ) గురువు మే 1 వరకు మేషం (జన్మం)లోను తదుపరి వృషభం (ద్వితీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (లాభం)లోను రాహువు మీనం (వ్యయం)లోను కేతువు (షష్ఠం)లోను సంచరిస్తారు. రోజువారి కార్యక్రమాలలో చాలా సమయపాలన పాటించి మంచి ఫలితాలు అందుకుంటారు. అందరికీ సహకరిస్తారు. అందరూ మీకు సహక రిస్తారు. భోజనం, మంచి వస్త్రధారణ వంటి వాటిలో మీ కోరికలు తీరతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. స్వేచ్ఛగా కావలసిన రీతిగా హాయిగా జీవనం సాగిస్తారు. కొన్నిసార్లు కార్య విఘ్నమునకు అవకాశం వున్నా పెద్దగా ఇబ్బందికరం కాదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మకార్యాచరణ చేసి సంఘంలో గౌరవం పొందుతారు. ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే, శని సంచారం అనుకూలత దృష్ట్యా మంచి ఫలితాలే అందుతాయి. గురుబలం క్రమేణా పెరుగుతున్న కారణంగా ద్వితీయార్ధంలో సత్ఫలితాలు ఎక్కువ ఉంటాయి. రాహు ప్రభావంగా మధ్య మధ్య చికాకులు ఉంటూనే మీకు అభివృద్ధి సాగుతుంది. ప్రమోషన్ ప్రయత్నాలు చేసుకోవాలి తప్పదు. అదే రీతిగా ట్రాన్స్ఫర్ కావలసిన వారు జాగ్రత్తగా ప్రయత్నించాలి. అధికారులు బాగా సహకరిస్తారు. కుటుంబ విషయాలు చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. బంధువులతో గత సమస్యలకు పరిష్కారం దొరికి కలహాలు తీరుతాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంగా అనుకూల వార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి విషయంలో కూడా మంచి ప్రయత్నాలు జరుగుతాయి. శుభకార్య పుణ్యకార్య నిమిత్తంగా ప్రయాణాలు చేయడం పూజ్యులు, గురువులు, బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే సమయానికి, అవసరానికి తగిన ఆదాయం బాగా అందుతుంది. గతంలో వున్న ఋణ సమస్యలు తీరడానికి ఈ సంవత్సరం అంతా అనుకూలం. అవసరానికి కావలసిన కొత్త ఋణాలు కూడా బాగా అందుతాయి. ప్రతి వ్యవహారములను ఆర్థిక లోటు అనేది లేకుండా సాగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో కూడా చాలా మంచి పరిణామాలు వుంటాయి. ఆరోగ్య విషయంగా అనవసర అనుమానాలు వస్తుంటాయి. మీకు ఈ సంవత్సరం గ్రహచారం ఆధారంగా ఎక్కువ ఇబ్బందులు ఉండవు. పాత సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. కళ్లు, నరాల సమస్యలు ఉన్నవారికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు కాలం బాగా యోగంగా వున్నది. వృత్తి రీత్యా అభివృద్ధి ఉన్నది. కుటుంబ విషయంగా కూడా గొప్పగా కాలక్షేపం చేయగలుగుతారు. ప్రతి విషయం లాభదాయకమే అవుతుంది. గర్భిణీ స్త్రీల విషయమై సుఖ ప్రసవానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అయితే రాహువు వలన మధ్య మధ్య చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు దూకుడుతనం పనికిరాదు. జాగ్రత్తగా వ్యవహరించిన వారికి అంతా శ్రేయోదాయకమైన ఫలితాలుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికం అవుతుంది. అయినా పని విజయవంతం అవుతుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోవద్దని సూచన. ముఖ్యమైన వారిని మాత్రమే అనుసరించండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్న వారికి ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. ప్రణాళికలు రూపుదాల్చుకుంటాయి. విద్యార్థులకు గురుబలం దృష్ట్యా మే నుంచి చాలా విశేష ఫలితాలు ఉంటాయి. మే వరకు సాధారణం. రైతుల విషయంలో అనుకూల వాతావరణం ఉన్నది. శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. అశ్వని నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఆర్థిక వెసులుబాటు బాగున్నా, మానసిక ఒత్తిడి ఎక్కువ. ఉద్యోగులకు శ్రమతో కూడిన లాభాలు. భరణి నక్షత్రం వారికి రాహు ప్రభావం ఎక్కువ. కుజుడు కూడా అధిక ప్రభావం చూపుతాడు. ఆరోగ్యశ్రద్ధ తీసుకోవాలి. మీ ప్రవర్తన ఇతరులకు, ఇతరుల ప్రవర్తన మీకు నచ్చక చికాకులు పొందుతారు. కృత్తిక నక్షత్రం 1వ పాదం వారికి అద్భుతమైన కాలం. ఊహకు అందని అవకాశాలు వస్తుంటాయి. శుభ పుణ్యకార్యాల నిమిత్తం ప్రయాణాలు, ధనవ్యయం. శాంతి మార్గం: రాహు సంచారం అనుకూలం లేని కారణంగా ‘దుర్గా సప్తశ్లోకీ’ పారాయణ చేయండి. ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణలు చేయండి. రాహు శాంతికి జప దానాలు చేయించడం శ్రేయస్కరం. ఏప్రిల్: మానసిక శారీరక శ్రమ వల్ల అశాంతి. ధైర్యంగా ఉంటారు. పుణ్యకార్యాల కోసం ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాల వల్ల చికాకులు. ఆరోగ్యం గురించి ముందు జాగ్రత్త అవసరం. ఇతరుల వ్యవహారాలకు వెళ్ళవద్దు. కుటుంబ వ్యవహారాలను గోప్యంగా ఉంచండి. షేర్ వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగ చికాకులు ఉంటాయి. విద్యార్థులకు శ్రమ కలిగినా, ఫలితం అందదు. చివరి వారంలో రవి కుజ ప్రతికూలం. ఆరోగ్యశ్రద్ధ వహించాలి. మే: ఆర్థిక లాభాలు ఉంటాయి. అహంభావం వల్ల ఇబ్బందులు. ఆరోగ్యం మధ్యస్థంగా ఉంది. ఉద్యోగంలో విభేదాలు ఉన్నా, మాట నియంత్రణతో పనులు పూర్తిచేస్తారు. షేర్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు గురుబలం బాగుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. కోర్టు, స్థిరాస్తి కొనుగోలు విషయాలు వాయిదా వేయండి. జూన్: ఉద్యోగ, వ్యాపారాల్లో విశేష రాణింపు, ఆర్థిక– వస్తు– వాహన లాభాలు ఉంటాయి. స్థానచలనం అనుకూలత ఉన్నది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ వల్ల శుభం. 19వ తేదీ వరకు అశ్వనీ వారికి, 19వ తేదీ నుండి భరణీ నక్షత్రం వారికి కలహాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్, మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితాలు శూన్యం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన సత్ఫలితాలు ఉంటాయి. జులై: మొదటి రెండువారాల్లో మిశ్రమ ఫలితాలు. 3, 4 వారాల్లో రవి– కుజుల ప్రభావంతో కుటుంబంలో చికాకులు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల రాకపోకలు ఎక్కువ. ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. విదేశీ నివాస, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు, షేర్ వ్యాపారాలకు అనుకూలం. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు అందుకుంటారు. ఆగస్ట్: కుజ– బుధ– శుక్రుల అనుకూలత వలన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక లాభం, ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల, భూలాభం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. నరదృష్టి పెరుగుతుంది. కాలభైరవాష్టక పారాయణ మంచిది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు కాలం అనుకూలం. సెప్టెంబర్: ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ధన– వస్తు– వాహన– గృహ లాభ సూచనలు ఉన్నాయి. శత్రు ఋణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుక్రునికి జప దానాదులు చేయాలి. భార్యాభర్తల మధ్య విభేదాలు ద్వితీయార్ధంలో తగ్గుతాయి. ఫైనాన్స్ వ్యాపారులకు మొండి బాకీలు పెరుగుతాయి. స్నేహితులతో కలసి చేసే వ్యవహారాలు చిక్కులు సృష్టిస్తాయి. విద్యార్థులకు రైతులకు అనవసర వ్యవహారాలు ప్రాధాన్యం అందుకుంటాయి. అక్టోబర్: ఈనెల ప్రతికూలత ఎక్కువ. విమర్శలు ఎదురవుతాయి. పనులు నత్తనడకన సాగుతాయి. వచ్చే 6 నెలలు కుజ సంచారం ప్రతికూలం. ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. రవి, శుక్రులకు దానం, కుజునకు విశేష శాంతి చేయాలి.షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. అయితే నష్టాలు ఉండవు. విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ మంచి ఫలితాలు ఉంటాయి. నవంబర్: చతుర్థ– అష్టమాల్లో కుజ– రవుల సంచారంతో అధికశ్రమ, తక్కువ ప్రతిఫలం. పెద్దలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యా వ్యాసంగం బాగుంటుంది. రైతులకు మంచి సలహాలు అందుతాయి. భరణీ నక్షత్రం వారికి ఉద్యోగంలో అధికారులు ఒత్తిడి పెంచినా, మీ తెలివితో వారిని ఆకర్షిస్తారు. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించాలి. డిసెంబర్: అనవసర విషయాల్లో జోక్యం వలన ఇబ్బందులు. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి పనుల్లో ఆలస్యం. రవి, కుజ, శుక్రులకు శాంతి చేయాలి. వ్యాపారులకు బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. విదేశీ నివాస, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు సరిగా సాగవు. జనవరి: పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అధికారుల నుంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ధనలాభం, గృహ వాహన వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సౌఖ్యం, భూ కొనుగోలు, విదేశీ ప్రయత్నాలు సఫలం. వ్యాపారులకు మంచి లాభాలు. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు, కోర్టు వ్యవహారాలకు అనుకూలం. ఫిబ్రవరి: పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగవ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఋణ– రోగ– శత్రు బాధల నుంచి ఉపశమనం. శుక్ర, లక్ష్మీ ఆరాధన మంచిది. షేర్ వ్యాపారులకు దూకుడు కూడదు. ఆర్థిక లావాదేవీలు గోప్యంగా ఉంచండి. గురువులు, శ్రేయోభిలాషులు సహకారం అందిస్తారు. మార్చి: శ్రమకు తగిన గుర్తింపు. స్థానచలనం అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దైవదర్శనం, తీర్థస్నానం, యథాశక్తి దానధర్మాలు చేయడం మంచిది. వృషభ రాశి ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–7, అవమానం–3. కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ) మృగశిర 1,2 పాదములు (వే,వో) గురువు మే 1 వరకు మేషం (వ్యయం)లోను తదుపరి వృషభం (జన్మం)లోను సంచరిస్తారు. శని కుంభం (దశమం)లోను రాహువు మీనం(లాభం)లోను కేతువు (పంచమం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో నూతనోత్సాహంతో పనులు చేస్తుంటారు. భోజనం, నిద్ర, వస్త్రధారణ వంటి నిత్యకృత్యాలు బాగా సానుకూలమై ఆనందిస్తారు. అన్ని కార్యములలో ధనవ్యయం అధికమవడం, విఘ్నాలు రావడం జరిగినా, చివరకు కార్యవిజయం సాధిస్తారు. విజ్ఞాన విషయాలు తెలుసుకోవడంలో కాలక్షేపం బాగా జరుగుతుంది. విహార యాత్రలు, వినోద కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తుంటారు. ఏది ఏమైనా ఆనందంగా కాలక్షేపం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ విషయాలలో ప్రతి ప్రయత్నంలోనూ శ్రమ, విఘ్నాలు ఉంటాయి. అయితే తెలివిగా, ధైర్యంగా నిర్ణయాలు చేసి సమస్యలను అధిగమించగలుగుతారు. అధికారుల నుంచి వచ్చే ప్రతిఘటనలను చక్కగా ఓర్పుగా సరిచేయగలుగుతారు. వ్యాపారులకు ప్రభుత్వ పాలసీలు, అధికారుల ప్రవర్తన కొంచెం చికాకులు స్పష్టిస్తాయి. తరచుగా బుద్ధి భ్రంశానిరి లోనయినా, మళ్లీ త్వరగా తేరుకుంటారు. నూతన ప్రయత్నాలలో చాలా సానుకూల ఫలితాలు అందుకుంటారు. మంచికాలమే! కుటుంబ విషయాలు చూస్తే పెద్దగా ఇబ్బందులు ఉండవు. సాధారణ స్థాయి ఫలితాలు అందుతాయి. పెద్దల ఆరోగ్యస్థితి బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. కుటుంబపరంగా చేయవలసిన శుభ, పుణ్యకార్యాలు అన్నీ జరుగుతుంటాయి. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. బంధు మిత్రులతో కలసి శుభ కార్యాలు, పుణ్యకార్యాలు, కులాచార కార్యాలు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం మందగమనంగా ఉంటుంది. అయితే ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే విషయంలో ఇబ్బందులు ఉండవు. ఖర్చులను సరైన పద్ధతిలో నియంత్రించగలుగుతారు. మితభాషణ, ఓర్పుగా ఆలోచించడం, దూకుడుతనం అనేవి ఖర్చుల విషయంలో విడనాడటం మంచిది. మీరు అందరికీ బాగా సహకారం చేస్తారు. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయితే పాత సమస్యలు తరచుగా తిరగబడే అవకాశం ఉంటుంది. అయినా బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెడతారు. మంచి కాలక్షేపం జరుగును. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగ నిర్వహణ, కుటుంబ నిర్వహణ కష్టసాధ్యంగా అనిపించినా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి ముందుకు సాగుతారు. ప్రత్యేక గుర్తింపు మాత్రం ఉండదు. గర్భిణీ స్త్రీల విషయమై మీ దగ్గర నుంచి కాలం అనుకూలంగా ఉన్నది. ఇబ్బందికర ఘటనలు ఉండవు. షేర్ వ్యాపారులకు క్రమక్రమంగా లాభమార్గం వైపు ప్రయాణం సాగుతుంది. సమస్యల నుంచి బయటపడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చక్కటి సలహాలు అందుతాయి. కార్యవిజయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో విజయం సాధించే అవకాశం ఉన్నది. మంచికాలం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి శుభ పరిణామాలు ఉంటాయి. అంతటా సహకరించేవారు ఉంటారు. విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు రావు కానీ, మొత్తం మీద సానుకూల ఫలితాలే ఉంటాయి. రైతుల విషయంలో అంతా శుభ ఫలితములే! జంతువులు, పక్షులు పెంచేవారికి లాభదాయకం. కృత్తిక నక్షత్రం వారికి ధైర్యం బాగా ఉంటుంది. సకాలంలో పనులు చేసినా రావలసిన గుర్తింపు రాదు. వృత్తిరీత్యా ఇబ్బంది ఉండదు. రోహిణి నక్షత్రం వారికి తరచుగా వృత్తి మార్పు విషయంగా ఆలోచనలు పెరుగుతుంటాయి. వృత్తిపరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తుల లావాదేవీల్లో ఇబ్బందులు పడతారు. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి విచిత్ర స్థితి నెలకొని ఉంటుంది. అనవసర వాగ్యుద్ధాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు మొండిగా, కొన్నిసార్లు శాంతంగా ప్రవర్తిస్తుంటారు. వాహన చికాకులు తప్పవు. శాంతి మార్గం: తరచుగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి. రోజూ శివాలయంలో ప్రదోష కాలంలో 11 ప్రదక్షిణలు చేసి లక్ష్మీనృసింహ కరావలంబస్తోత్ర పారాయణ చేయండి. గోపూజ, గురు జపం, దానం చేయించండి. ఏప్రిల్: తెలివిగా ఆర్థిక లావాదేవీలు సాగిస్తారు. సంకల్పించిన పనులు వేగంగా జరుగుతాయి. కుటుంబ జీవనం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వచ్చి, మంచి ప్రతిభ చూపిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన, నదీస్నానం చేస్తారు. ఆరోగ్య విషయంలో తెలివిగా ఉండి రక్షణ పొందుతారు. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. విద్యా వ్యాసంగంలో ఉన్నవారికి మంచి కాలం. మే: కుజ– బుధ– శుక్రుల అనుకూల సంచారంతో మొదటి రెండు వారాలు అత్యంత అనుకూలం. విందు వినోదాలు, విహారయాత్రలు ఉంటాయి. ద్వితీయార్ధంలో శారీరక అలసట, కొన్ని వివాదాల వల్ల సమస్యలు ఉంటాయి. రవి, శివారాధన శుభప్రదం. మాసారంభం అనుకూలం. సమస్యలను తెలివిగా సాధించుకుంటారు. ఆరోగ్య, ఋణ విషయాల్లో జాగ్రత్త ప్రదర్శిస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మొదటి రెండు వారములు అనుకూలం. షేర్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి ఫలితాలు. కుటుంబ పెద్దల ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలం. జూన్: వ్యయ కుజ, ద్వితీయ రవి సంచారం వలన తరచు సమస్యలు, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలు, స్త్రీల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. 8వ తేదీ నుండి మృగశిర నక్షత్రం వారికి స్వల్ప ఆరోగ్య చికాకులు ఉంటాయి. కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. భక్తి, కాలక్షేపం ఎక్కువ అవుతుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలులో అధిక ధనవ్యయం అవుతుంది. జులై: ప్రథమార్ధం మిశ్రమ ఫలితాలు. ద్వితీయార్ధంలో ఖర్చులు పెరుగును. మనోధైర్యంతో పనులు చక్కబెడతారు. పనిలో గుర్తింపు పొందుతారు. అధికారయోగం ఉంది. వివాదాలు సర్దుకుంటాయి. కుజస్తోత్ర పారాయణం చేయాలి. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. అనవసర ప్రయాణాలను విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. ఆగస్ట్: కొంత ఒదిగి ఉండటం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల చురుకుదనం తగ్గుతుంది. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. 2వ వారంలో శుభవార్త ఆనందం కలిగిస్తుంది. నవగ్రహారాధన శుభప్రదం. 15వ తేదీ వరకు రోహిణీ నక్షత్రంతో కుజుడు జాగ్రత్తలు అవసరం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. చాలా సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. సెప్టెంబర్: సంతానం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. పెద్దల అనుగ్రహంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. రవి– కుజ– శుక్రులకు శాంతి, శివకుటుం ఆరాధన శుభప్రదం. ఉద్యోగులకు అధికారుల అండదండలు ఉంటాయి. ధనవ్యయం అధికం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. అక్టోబర్: ఈ నెల అంతా శుభప్రదం. శత్రు, ఋణ బాధల నుంచి ఉపశమనం. ఉన్నతాధికారుల సందర్శన, స్థానచలనం, అధికారయోగం. రాజకీయ రంగంలో విశేష జనాకర్షణ. స్త్రీలతో స్వల్ప సమస్యలు ఉంటాయి. కుజ శాంతి, లక్ష్మీ–లలితా స్తోత్ర పారాయణ శుభప్రదం. షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి అనుకూలం. రైతులకు, విద్యార్థులకు కూడా సానుకూలం. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలలో అనుకూలత ఉంటుంది. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం అనుకూలం. నవంబర్: ప్రయాణ లాభం. మనోధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కోర్టు సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. కాలభైరవారాధన శుభప్రదం. ఆర్థిక కార్యకలాపాలు స్వయంగా చూసుకుంటూ సమస్యల నుంచి బయటపడతారు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. డిసెంబర్: మానసిక ఆందోళన పెరుగుతుంది. అధిక ఖర్చులు. గతంలో చేసిన అశ్రద్ధ వలన ఇప్పుడు సమస్యలు ఎదురవుతాయి. రుద్రాభిషేకం చేయుట మంచిది. ఉద్యోగంలో తోటివారి సహకారం బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు అందుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో సత్ఫలితాలు. జనవరి: ప్రయాణమూలక ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉమామహేశ్వర స్తోత్రపారాయణ మంచిది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు ప్రశాంతంగా ఉండడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేసుకోవాలి. రోహిణీ నక్షత్రం వారికి మాత్రం లాభాలు అధికం. షేర్ వ్యాపారులు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత లాభం. ఫైనాన్స్ వ్యాపారులు మొండి బాకీలు వసూలులో జాగ్రత్తపడాలి. ఫిబ్రవరి: దైవానుగ్రహంతో సమస్యలు తీరుతాయి. పూర్వం నుంచి చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. వృత్తిలో గుర్తింపు, విశేష కీర్తి కలుగుతాయి. అధికారయోగం. బంధుమిత్రుల రాకపోకలు పెరుగుతాయి. భక్తి కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమతో కూడిన లాభం. ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలం. మార్చి: పనులు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అధికారిక గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, బదిలీలు అనుకూలం. ఋణ సమస్యలు తగ్గుతాయి. నూతన కనక–వస్తు–వాహన కొనుగోలు అనుకూలం. శుభకార్యాలు జరుగుతాయి. మిథున రాశి ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–3, అవమానం–6. మృగశిర 3,4 పాదములు (కా, కి) ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ) పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా) గురువు మే 1 వరకు మేషం (లాభం)లోను తదుపరి వృషభం (వ్యయం)లోను సంచరిస్తారు. శని కుంభం (భాగ్యం)లోను రాహువు మీనం (దశమం)లోను కేతువు (చతుర్థం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తెలిసీ తెలియని పొరపాట్లు జరగడం ప్రతి విషయంలోనూ ఉంటాయి. ఎవరినీ నమ్మి, ఎవరి మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ పరిథిలో ఉన్న పనులు మాత్రమే చేయండి. వీలైనంత వరకు కొత్త వ్యవహారాలు చేపట్టవద్దు. మీకు కొన్ని సందర్భాలలో మంచి గురువులు మంచి సూచనలు చేస్తారు. ఊహించని విధంగా కొన్ని సందర్భాలలో మీకు ఎప్పుడూ సహకరించనివారు కూడా ఈ సంవత్సరంలో సహకారం అందిస్తారు. కొన్ని సందర్భాలు విజయవంతంగా ఉంటాయి. ఉద్యోగ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి విషయంలోనూ స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోండి. అలాగే అధికారులతో కూడా జాగ్రత్తలు పాటించాలి. మితభాషణ చాలా అవసరం. తోటివారు కొన్నిసార్లు అనుకూలంగా, కొన్నిసార్లు ప్రతికూలంగా ప్రవర్తిస్తారు. వర్కర్స్‌తో బహుజాగ్రత్తలు పాటించడం, వాక్కును నియంత్రించుకోవడం అవసరం. ఇంటిలో ఉండే పనివారితో కూడా జాగ్రత్తలు అవసరం. వ్యాపార విషయాలు అనుకూలమే. నూతన ప్రయత్నాలకు అనుకూలత తక్కువ. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయిలో ఉంటాయి. అన్ని కోణాలలోనూ గురువు వ్యయ సంచారం దృష్ట్యా మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాలలో కుటుంబ సభ్యులు అందరితోనూ కలసి సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. కొన్ని సందర్భాలలో పిల్లల నడవడిక మీకు ఇబ్బంది కలుగజేస్తుంది. బంధువులతో బహు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే శుభకార్యాల నిర్వహణ విషయంగా ధనవ్యయం అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భములలో అధిక ధనలాభం చేకూరుతుంది. అవగాహన లేమితో ఆర్థిక ప్రణాళికలు సాగుతాయి. ఋణ విషయాలలో విచిత్ర స్థితి ఉంటుంది. కావలసిన కొత్త ఋణాలు ఆలస్యంగా అందుతాయి. భార్యాపిల్లలు తరచుగా ప్రయాణాలు చేయుట వలన ధనవ్యయం అధికం అవుతుంది. ఆరోగ్య విషయంగా చాలా మంచి మార్పులు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా మంచి వైద్యం లభిస్తుంది. చక్కటి శుభ పరిణామాలు ఉంటాయి. హృద్రోగులకు మాత్రం చిన్న చిన్న చికాకులు ఉంటాయి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఉద్యోగంలో అభివృద్ధి ఎక్కువగా గోచరిస్తుంది. కుటుంబ విషయాలు, సాంఘిక వ్యవహారాలను సమర్థంగా నడుపగలుగుతారు. అందరి నుంచి సహకారం ప్రోత్సాహం బాగా లభిస్తుంది. గర్భిణీ స్త్రీల విషయమై గురువు వ్యయసంచారం దృష్ట్యా మే నుంచి కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్ వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉండవు కానీ, నష్టాలు మాత్రం ఉండవు. మంచికాలమే. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి విద్యా వ్యాసంగంలో వారికి అనుకూలత తక్కువ. ఉద్యోగ రీత్యా వెళ్ళేవారికి కాలం అనుకూలం. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు సానుకూలం అవుతుంటాయి. ఏదో రూపంగా కార్యసిద్ధి చేకూరుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికమైనా, కార్యసిద్ధికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురువు వ్యయస్థితి సంచార ఫలితంగా తగినంత జాగ్రత్తతో అభ్యాసం చేయాలి. రైతుల విషయంలో శ్రమ చేసిన దానికి సమస్థాయి ఫలితాలు ఉండకపోయినా, నష్టం మాత్రం ఉండదు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి అసహనం పెరుగుతుంది. గొప్ప కోసం అధికంగా ఖర్చు చేస్తారు. ఆరోగ్య ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులను నమ్మి పనులు తలపెట్టవద్దని ప్రత్యేక సూచన. మితభాషణ మీకు రక్షణ. ఆరుద్ర నక్షత్రం వారికి కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరంగా మారే సూచనలు ఉన్నాయి. అవమానకర ఘటనలు, అధిక ధనవ్యయం చికాకు పెడతాయి. వాహన లాభం ఉంది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వస్తువులను పోగొట్టుకోవడం లేదా మరొక రూపంగా అయినా నష్టం జరుగుతుంది. ఋణ, ఆరోగ్య విషయాలు ద్వితీయార్ధంలో చికాకు కలిగిస్తాయి. శాంతి మార్గం: మే నెలలో గురుశాంతి చేయించండి. తెల్లజిల్లేడు, మారేడు, గరికలతో గణపతి అర్చన, ప్రాతఃకాలంలో ఎర్రటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. రోజూ ‘గజేంద్ర మోక్షం’ పారాయణ చేయండి. షణ్ముఖ రుద్రాక్ష ధరించండి. ఏప్రిల్: ఈనెల శుభవార్తలు వింటారు. అన్ని రంగాలలో రాణిస్తారు. అధికారలాభం, అనుకూల స్థానచలనం. రాజకీయరంగంలో ఉన్నత పదవులు దక్కుతాయి. కుటుంబ సౌఖ్యం, ఆర్థిక లాభాలు, కార్యజయం కలుగుతాయి. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులకు శ్రమ ఎక్కువైనా, లాభం ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యో గులు ఇబ్బంది పడతారు. స్వబుద్ధితో చేసే పనులన్నీ లాభిస్తాయి. రైతులకు చికాకులు ఉంటాయి. మే: అనుకున్న పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. శత్రుబాధలు తొలగుతాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. నిత్య శివదర్శనం, తీర్థస్నానాలు మంచివి. షేర్ వ్యాపారులకు అనుకూలం. ధనవ్యయం అధికమవుతుంది. విద్యార్థులకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. విదేశీ ప్రయత్నాల్లో తగిన సలహాలు అందవు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త పడతారు. జూన్: ప్రయాణాలవల్ల శారీరక అలసట. లాభాలు ఉన్నా, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. వివాహాది ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సూర్యారాధన మంచిది. కోర్టు, ఋణ వ్యవహారాల్లో పరిష్కారమార్గం దొరుకుతుంది. పిల్లల వలన సౌఖ్యం కలుగుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు సాధారణ ఫలితాలు. జులై: ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మధ్యవర్తిత్వం వలన సమస్యలు కలుగుతాయి. నిత్యం శివ, సుబ్రహ్మణ్య ధ్యానం మంచిది. అధికారులు ఎప్పుడు అనుగ్రహిస్తారో, ఎప్పుడు ఆగ్రహిస్తారో తెలియని పరిస్థితి. స్థిరాస్తి కొనుగోలు, విదేశీ ప్రయత్నాలు, షేర్ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. రైతులకు, విద్యార్థులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. ఆగస్ట్: ఈనెలలో అన్నివిధాలా బాగుంటుంది. ఆర్థికపుష్టి కలుగును, శుభవార్తలు వింటారు. పనులు శరవేగంగా పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. నెలాఖరున కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. 15వ తేదీ నుంచి మృగశిర నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు, రోజువారీ పనులు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి.కొత్త ఋణాలు సమయానికి అందుతాయి. పాతవి తీర్చగలుగుతారు. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. పెద్దల ఆరోగ్యంలో అనుకూలత ఉంటుంది. పుణ్యక్షేత్ర సందర్శన, గురువుల దర్శనం చేస్తారు. సెప్టెంబర్: కుటుంబ పరిస్థితులు అనుకూలం. వృత్తిలో ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. çసంతాన సౌఖ్యం, గృహ, వస్తు వాహన లాభం. బంధువులతో ఇబ్బందులు కలుగుతాయి. రుద్రాభిషేకం, శివకుటుంబ ఆరాధన మంచిది. ఆర్ద్రా నక్షత్రం వారు కొంచెం ఇబ్బందికి గురవుతారు. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్త పడాలి. పెద్దల ఆరోగ్యం ఇబ్బందికరం అవుతుంది. విదేశీ, స్థిరాస్తి ప్రయత్నాలలో మోసపోయే అవకాశాలు ఉంటాయి.ముఖ్యమైన లావాదేవీలను గోప్యంగా ఉంచడం మంచిది. అక్టోబర్: ఈనెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉంది. బంధువర్గంతో సమస్యలు, పనుల్లో ఆలస్యం, శారీరక శ్రమ ఉంటాయి. తరచు వివాదాలు ఉండే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య అభిషేకం, శ్రీరామరక్షాస్తోత్రం పారాయణ మంచిది. పునర్వసు నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు. షేర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వాహనాలు, పనిముట్ల పట్ల జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి కాలక్షేపం ప్రమాదకరం కాగలదు. నవంబర్: కుటుంబ ఖర్చులు పెరిగినా, అవసరానికి తగ్గ ధనం లభిస్తుంది. దాంపత్య జీవితంలో మనస్పర్థలు ఏర్పడతాయి. లక్ష్మీ అష్టోత్తరం పారాయణ మంచిది. షేర్ వ్యాపారులు, రైతులు, విద్యార్థులకు కొంచెం అనుకూల స్థితి తక్కువ. డిసెంబర్: ఈనెల గ్రహసంచారం ప్రతికూలం. భాగస్వామ్య వ్యాపారాలలో ఇబ్బందులను ఇతరుల సహాయంతో అధిగమిస్తారు. వ్యర్థ ప్రయాణాలు, వృథా ఖర్చులు, లాభాలు అంతంత మాత్రం. నవగ్రహ శాంతి చేసుకోవాలి. ఋణ బాధల వల్ల ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు చికాకులు. కోర్టు వ్యవహారాలలో ప్రతికూలత. జనవరి: ఉద్వేగపూరిత ఆలోచనలతో ఒత్తిడికి లోనవుతారు. బంధువర్గం అనుకూలత, మిత్ర సహకారం లభిస్తుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థిక చికాకులు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులకు శ్రమ ఎక్కువ. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో మంచి సలహాలు అందుతాయి. షేర్ వ్యాపారులకు శుభసూచకం. ఆర్ద్రా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు. ఫిబ్రవరి: కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రతి పనికీ అధిక ప్రయత్నం అవసరం. విష్ణు ఆరాధన శుభప్రదం. ఆర్ద్రానక్షత్రం వారికి లాభదాయకం. «శ్రమ ఎక్కువైనా కార్య సాఫల్యావకాశాలు బాగున్నాయి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు, స్థిరాస్తి వ్యవహారాలు సానుకూలం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ. మార్చి : ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో పెను మార్పులు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కర్కాటక రాశి ఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–6, అవమానం–6 పునర్వసు 4వ పాదము (హి) పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా) ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ) గురువు మే 1 వరకు మేషం (దశమం)లోను తదుపరి వృషభం (లాభం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (అష్టమం)లోను రాహువు మీనం (నవమం)లోను కేతువు (తృతీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. సమయపాలనతో ఏ పనీ కూడా చేయరు. పుణ్యకార్యాలలో ఎక్కువ కాలక్షేపం జరుగుతుంది. అన్న, వస్త్ర, స్నానాది కార్యక్రమాలు కూడా ఆలస్యంగా చేయవలసి వస్తుంది. కొన్ని పనులను దాటవేసే ఆలోచనలు చేస్తారు. కొన్ని పనులను ధైర్యంగా సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. తరచుగా ‘నరఘోష’కు గురి అవుతుంటారు. తద్వారా చికాకు పడతారు. అష్టమ శని వల్ల అన్ని రంగాలలోనూ స్నేహితుల మధ్య, బంధువుల మధ్య కలహాలు తలెత్తుతాయి. జాగ్రత్తపడండి. ఉద్యోగ విషయాలు చాలా శ్రమాధిక్యం అవుతుంటాయి. మీకు గురుబలం దృష్ట్యా అన్ని పనులు చేయడానికి తగిన ఆలోచనలు చేయగలిగినా, అమలు చేసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ప్రమోషన్‌కు తగిన అర్హతలు ఉన్నప్పటికీ అడ్డంకులు చాలా ఉంటాయి. నమ్మకంగా మీ పక్కనే ఉంటూ మీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేవారు అధికంగా ఉంటారు. వ్యాపారులకు వ్యాపారం బాగానే ఉన్నా, ప్రభుత్వ అధికారుల ద్వారా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి సలహాలు అందుతాయి. కుటుంబ విషయాలు చూస్తే మీ ప్రవర్తన కొన్ని సందర్భాలలో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. కొన్నిసార్లు మీ బంధువులు బాగా సహకారం చేస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో మీరు ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గురుబలం బాగా ఉన్న కారణంగా పిల్లల అభివృద్ధి కూడా బాగుంటుంది. తరచుగా ప్రయాణములు అధికంగా చేయడం తద్వారా ఆరోగ్య, ఆర్థిక చికాకులు పొందడం ఉంటుంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే లాభంలో మే 1 నుంచి గురువు సంచరించడం ప్రారంభించాక చాలా మంచి మార్పులు ప్రారంభం అవుతాయి. ఆదాయం బాగా ఉన్నా, ఖర్చులు మీ ఇష్టానుసారం ఉండవు. పాత ఋణాలు తీర్చడానికి ఉంచిన ధనం కూడా ఇతర అవసరాలకు వినియోగిస్తారు. కొత్త ఋణాలు అవసరానికి తగిన రీతిగా అందుతాయి. వాహనాల కొనుగోలు ఆలోచనలు ఫలప్రదం అవుతాయి. ఆరోగ్య విషయంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. తద్వారా సమస్యలను దాటవేసే ప్రయత్నంలో సఫలం అవుతారు. కొత్త కొత్త సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే, ముందు జాగ్రత్తలతో దాటవేయగలరు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఎంత శ్రమించినా తగిన గుర్తింపు రాదు. అలాగని బాధపడక ముందుకు సాగుతారు. ఉద్యోగ, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం బాగుంది. కాబట్టి ఇబ్బందులు రావనే చెప్పాలి. మానసిక ఆందోళన ఉంటుంది. షేర్ వ్యాపారులకు అనుకూలమైన సమయం గుర్తించలేని పరిస్థితి ఉంటుంది. కానీ నష్టపడే కాలం కాదు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి అవరోధాలు ఎక్కువ. విద్య నిమిత్తంగా వెళ్ళేవారు శ్రమతో విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు చికాకులు చూపుతాయి. కలçహాలు కోర్టు విషయంగా పెరగగలవు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనం సర్దుబాటు ఉన్నా, వస్తు నిర్ణయం విషయంలో శ్రమ ఎక్కువ. విద్యార్థులు విద్యా విషయంగా బాగుంటుంది. ఇతర, అనవసర విషయాలు తరచుగా ఇబ్బంది కలిగిస్తాయి. రైతుల విషయంలో తెలివిగా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అయినా కొన్నిసార్లు చేతికి వచ్చిన పంట చేజారుతుంది. పునర్వసు నక్షత్రం 4 వారికి బంధు మిత్రులు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబానికి, వృత్తికి సమతూకంగా కాలం కేటాయించలేక అసహనం చెందుతారు. స్వయంగా పర్యవేక్షించే పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. పుష్యమి నక్షత్రం వారికి తరచు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాలు, స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు అధిక వ్యయంతో సఫలమవుతాయి. ఆశ్లేష నక్షత్రం వారికి కొన్నాళ్లు అనుకూలం, కొన్నాళ్లు ప్రతికూలంగా సంవత్సరం అంతా గడుస్తుంది. కోర్టు వ్యవహారాలలో నమ్మినవారు మోసం చేసే అవకాశం ఉంది. సాంఘిక కార్యక్రమాలలో గౌరవభంగం జరగవచ్చు. శాంతి మార్గం: శని, రాహువులకు జపం, దానం చేయించండి. ఆంజనేయస్వామి దేవాలయంలో ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి, తెల్లటి పుష్పాలతో లక్ష్మీ అర్చన చేయండి. ఏప్రిల్: ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తుపై స్పష్టత వస్తుంది. నూతన వస్త్రధారణ, ఆభరణ– వాహనాల కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువర్గంతో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరుగుతాయి. రాజకీయ, సామాజిక వ్యవహారాల్లో మౌనం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. రైతులు, మార్కెటింగ్ ఉద్యోగులు, షేర్ వ్యాపారులు జాగ్రత్తగా వ్యవహరించి మంచి ఫలితం అందుకుంటారు. మే: వృత్తి వ్యాపారాలలో ఊహించని అనుకూలత. ఆర్థిక లాభాలున్నా, ఖర్చులు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలించును. అవరోధాలను అధిగమిస్తారు. ఋణాల విషయంలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి. రైతులకు అనుకూలం. జూన్: స్థానమార్పులు ఉంటాయి. పట్టుదలతో పనులన్నీ పూర్తిచేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. ఫైనాన్స్ షేర్ వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపారాలలో కిందిస్థాయి వారితో చికాకులు తప్పవు. అధికారుల అండదండలు ఉంటాయి. కోర్టు విషయాలు, స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలం. జులై: పనులు లాభదాయకంగా ఉంటాయి. ధనం నిల్వ చేయగలరు. ఊహించని ప్రయాణాల వల్ల ఇబ్బందులు. శుభవార్తలు వింటారు. భూ–గృహలాభం ఉంది. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. రైతులు, విద్యార్థులు శ్రమతో మంచి ఫలితాలు అందుకుంటారు. ఆగస్ట్: ఈ నెల ఏ పని చేపట్టినా అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబ విషయమై డబ్బు నీళ్ళలా ఖర్చవుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత లోపిస్తుంది. 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆశ్లేషా నక్షత్రం వారికి కుటుంబ సభ్యులతో సయోధ్య కుదరని సందర్భాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులకు అనుకూలం. సెప్టెంబర్: మనోధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులను ప్రభావితం చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. షేర్ వ్యాపారులు రాబోవు ఆరు మాసాలు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య, ఆర్థిక, ఋణ వ్యవహారాలలో రాబోవు ఆరు మాసాలు ప్రతికూల స్థితి. శని కుజ గ్రహముల శాంతి చేయించండి. అక్టోబర్: పనుల్లో ఆలస్యం, శారీరక రుగ్మతల బాధ పెరుగుతాయి. మనోధైర్యం తగ్గుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదురవుతాయి. స్థిరాస్తి వివాదాలు తలెత్తుతాయి. పెద్దల సహకారంతో పనులు పూర్తిచేస్తారు. మీకు లేదా మీ కుటుంబ పెద్దలకు వైద్యం అత్యావశ్యకం అవుతుంది. అతి శ్రమ చేస్తారు. షేర్ వ్యాపారులు, రైతులు, విద్యార్థులు తెలివి, ఓర్పుతో సమస్యలను అధిగమిస్తారు. నవంబర్: రానున్న 5 నెలలు అనేక సమస్యలు ఉంటాయి. కుజ శాంతి చేసుకోవడం మంచిది. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఇతరులపై ఆధారపడకుండా వ్యవహరించాలి. మనస్పర్ధలు ఉంటాయి. మీరు చేయవలసిన పనులు ఆలస్యం కావడం వల్ల కుటుంబంలో చికాకులు మొదలవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో అనుకూలతలు లేవు. షేర్ వ్యాపారులు నష్టపడకుండా బయటకు రావడం కష్టసాధ్యం. శుభకార్య ప్రయత్నాలు, అభివృద్ధి ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. కొత్త ప్రయత్నాలు చేయవద్దని సూచన. డిసెంబర్: వృత్తిలో విశేష గుర్తింపు లభిస్తుంది. నిరాటంకంగా పనులు పూర్తవుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఉన్నతాధికారుల సందర్శనం, అనుకూల బదిలీలు ఉంటాయి. ఋణ సమస్యలు తగ్గుతాయి. దాంపత్యంలో ఇబ్బందులు, పిల్లల నుంచి సమస్యలు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫలితం తక్కువ. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించుకోవాలి. స్థిరాస్తి లావాదేవీలు, కోర్టు వ్యవహారాలలో వాయిదాలు శ్రేయస్కరం. జనవరి: శారీరక శ్రమ పెరుగుతుంది. అకాల ప్రయాణాలతో ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో మనస్పర్థల వలన మనస్తాపం. బంధువర్గం సహకరిస్తారు. ఋణవిముక్తి కలుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పునర్వసు నక్షత్రంవారికి కలహ, ఋణ, ఆరోగ్య సమస్యలు అధికంగా ఉండవచ్చు. షేర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. బంధువుల రాకపోకలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల సహకారం లభిస్తుంది. విద్యార్థులకు, రైతులకు బాగా అనుకూలం. ఫిబ్రవరి: మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులు కలుగుతాయి. పనులు ఆలస్యమైనా, సహనంతో పూర్తిచేస్తారు. కుటుంబ పెద్దల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. విష్ణు ఆరాధన మంచిది. బంధు మిత్రులకు సేవ చేయవలసిన పరిస్థితి వలన మీ దైనందిన కార్యక్రమాలు ఆలస్యం అవుతాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు ఫలితాలు బాగుంటాయి. ఫైనాన్స్ వ్యాపారాలకు, విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మార్చి: కుటుంబ పెద్దలకు స్వల్ప ఆరోగ్య సమస్యలు. తీర్థయాత్రలు చేస్తారు. వృత్తిలో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో మందగమనం. అకాల భోజనం వల్ల ఆరోగ్య సమస్యలు. ∙∙ సింహ రాశి ఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–2, అవమానం–2. మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే) పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ) ఉత్తర 1వ పాదము (టే) గురువు మే 1 వరకు మేషం (నవమం)లోను తదుపరి వృషభం (దశమం)లోను సంచరిస్తారు. శని కుంభం (సప్తమం)లోను రాహువు మీనం (అష్టమం)లోను కేతువు (ద్వితీయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో సమయపాలన లేకపోవడం మిమ్మల్ని బాగా లాభ ఫలితాలకు దూరం చేస్తుంది. ఉద్యోగ విధి నిర్వహణకు కూడా ఎన్నోసార్లు ఆలస్యంగా వెళతారు. అనవసర ఆలోచనలు, తద్వారా భయాందోళనలు ఎక్కువ అవుతాయి. మీరు ఎంత పద్ధతిగా ఉంటే అంత లాభాలు వచ్చే కాలం. ఇబ్బందులు పోగొట్టుకోవడం మీ ప్రయత్నాలలోనే ఉన్నది. వృథా కాలక్షేపాలు చేయవద్దు. సప్తమ శని వల్ల అన్ని పనులూ ఆలస్యం అవుతుంటాయి. అయితే స్వక్షేత్ర శని అయిన కారణంగా నష్టం ఉండదు. ఉద్యోగ విషయాలలో అధికారుల ద్వారా ఒత్తిడి బాగా పెరగగలదు. మే నుంచి సంవత్సరాంతం వరకు మీ తోటివారు, మీ కింద స్థాయి ఉద్యోగుల ద్వారా కూడా సహకారం తగ్గగలదు. అందరితోనూ స్నేహభావం ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళండి. వ్యాపార లావాదేవీలు బాగానే జరుగుతాయి. నూతన వ్యాపారం ఆలోచనలు కొంచెం ఇబ్బందిని కలిగిస్తుంటాయి. అదే రీతిగా నూతన ఉద్యోగ ప్రయత్లాలో కూడా సానుకూలత ఉంటుంది. అష్టమ రాహువు వలన మీరు అందరినీ అనుమానించడం, మీరు తరచుగా అవమానాలకు గురికావడం జరుగుతుంది. కుటుంబ విషయాలు చూస్తే సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. కుటుంబ అవసరాలు తీర్చే పనిలో మీరు అలసత్వం ప్రదర్శిస్తారు. అది ఇబ్బందికరం అవుతుంది. మీకు, కుటుంబ సభ్యులకు మధ్య కార్య నిర్వహణ విషయంగా చిన్న చిన్న భేదాభిప్రాయాలు వస్తాయి. మనస్తాపం పెరుగుతుంది. బంధువులతో తరచుగా ఇబ్బంది ఉంటుంది. జ్ఞాతివైరం ఉన్నవారికి ఈ సంవత్సరం ఆ వైరం పెరగగలదు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం బాగానే ఉంటుంది. అయితే ఆలస్యంగా అందుతుంది. ఖర్చులను నియంత్రించలేని స్థితిలో ఉంటారు. ఋణ సౌకర్యం కూడా ఆలస్యంగా ఉంటుంది. పాత కొత్త ఋణాలు ప్రారంభంలో ఇబ్బందులు సృష్టించినా, క్రమంగా సానుకూలం అవుతుంటాయి. వృథాగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. విద్యా విజ్ఞాన విహార యాత్రల విషయంగా ఖర్చు పెరుగుతుంది. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. తీసుకుంటారు కూడా. చర్మవ్యాధులు, జీర్ణ సంబంధమైన ఇబ్బంది, రక్తపోటు ఉన్నవారు బహు జాగ్రత్తలు తీసుకోవలసిన కాలం. గమనించండి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువ అవుతుంటుంది. ఉద్యోగం, కుటుంబం విషయాలలో సమన్యాయంగా వ్యవహరించేందుకు అవకాశాలు ఉండవు. ప్రతి పనీ ఆలస్యం అవుతుండటం వలన మీకు ఆగ్రహావేశాలు పెరుగుతుంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు చాలా అవసరం అనే చెప్పాలి. వైద్య సలహాలు జాగ్రత్తగా పాటించండి. షేర్ వ్యాపారులకు దూకుడు తగ్గించమని సూచన. మే నెల తరువాత మీరు వేరే వారితో పోలిక లేకుండా ముందుకు సాగండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ఏ పనీ సవ్యంగా సాగదు. నిరుత్సాహపడకుండా ప్రయత్నాలు చేయండి. కోర్టు వ్యవహారములలో ఉన్నవారికి చికాకులు పెరిగే అవకాశం ఉంటుంది. పనులు వ్యతిరేకం కాకుండా జాగ్రత్త తీసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి దారి తప్పించేవారు ఎక్కువ అవుతారు. అవకాశం ఉంటే కొనుగోలు వాయిదా వేయండి. విద్యార్థులకు మానసిక వ్యవస్థ విద్యా వ్యాసంగముల కంటే ఇతర అంశాల మీదకు ఎక్కువగా ప్రసరిస్తుంది. రైతుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా ఆశించిన ఫలితాలు అందవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. మఘ నక్షత్రం వారు పనులు వాయిదా వేయడం వలన సమస్యలు ఎదుర్కొంటారు. షేర్వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు సందర్భానుసారంగా ప్రవర్తించక గడ్డు పరిస్థితులు తెచ్చుకుంటారు. అవసరానికి తగిన ధనం సర్దుబాటు అవుతుంది. పుబ్బ నక్షత్రం వారు వృథా కాలక్షేపం చేస్తారు. విద్యా, విజ్ఞాన కార్యక్రమాలలో పాల్గొంటారు. ద్వితీయార్ధంలో ధైర్యంగా అనేక విజయాలు సాధిస్తారు. బంధు మిత్రులు సహకరిస్తారు. ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు పుణ్య, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. శాంతి మార్గం: శని, రాహు గ్రహశాంతి చాలా అవసరం. ప్రాతఃకాలంలో నిత్యం ఆంజనేయస్వామి వారి దేవాలయంలో రామనామం చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. ప్రదోష కాలంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: ఈ నెల ప్రతివిషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇతరులపై పనిభారం మోపి, నిద్రావస్థలో ఉంటే నష్టపోతారు. అహంభావంతో ఇబ్బందుల్లో పడతారు. ఖర్చులు, ఆరోగ్యంపై శ్రద్ధవహించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులు జాగ్రత్త కనబరచాలి. విద్యార్థు్థలకు, రైతులకు ఆశించిన ఫలితాలు అందవు. మే: ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు చూస్తారు. ఋణబాధల నుంచి విముక్తి. ఉన్నత పదవులు చేపడతారు. అధికారుల మెప్పు పొందుతారు. కుటుంబ వాతావరణం ఆనందం కలిగిస్తుంది. కుజశాంతి శుభప్రదం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం శూన్యం. రైతులకు అనుచిత సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలత లేదు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు పనులు వాయిదా వేయడం శ్రేయస్కరం. జూన్: వృత్తిలో రాణిస్తారు. విశేష ధనలాభం. బదిలీలు అనుకూలం. రాజకీయ రంగంలో వారికి మంచి పదవులు దక్కుతాయి. కొత్త పరిచయాలు లాభిస్తాయి. నెలాఖరున ఒక శుభవార్త అనందం కలిగిస్తుంది. భవిష్యత్ కార్యాచరణ కోసం కృషి చేస్తారు. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు ఈ నెల రోజులు అనుకూలం. పుబ్బా నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు తప్పవు. జులై: నేర్పుతో పనులన్నీ సునాయాసంగా పూర్తిచేస్తారు. శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. శత్రుబాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. సాంఘిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ. ఫైనాన్స్, వ్యాపారులు, షేర్ వ్యాపారులకు 16వ తేదీ తరువాత చికాకులు ఉంటాయి. ఆగస్ట్: పనిఒత్తిడి పెరిగినా, సకాలంలో పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఖర్చులకు తగిన ఆదాయం లభిస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. 18వ తేదీ నుంచి మఘ నక్షత్రం వారికి ఇబ్బందికర ఘటనలు రాగలవు. విద్యార్థులు అధిక శ్రమ చేయాలి. రైతులకు అనుకూలత తక్కువ. సెప్టెంబర్: ఆర్థిక లాభాలు, వాటికి తగిన ఖర్చులు ఉంటాయి. ఉన్నత పదవులు చేపడతారు. ఎన్ని సమస్యలు ఉన్నా ఉత్సాహం కోల్పోకుండా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తుంది.13వ తేదీ వరకు పుబ్బ నక్షత్రంవారికి పనులు ఇబ్బందికరం కాగలవు. షేర్ వ్యాపారులు మంచి తెలివి, ధైర్యం ప్రదర్శించి కాలం అనుకూలం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. సకాలానికి ఋణాలు అందుతాయి. అక్టోబర్: ఉన్నతాధికారులను సందర్శిస్తారు. విశిష్ట బాధ్యతలు చేపడతారు. శత్రుబాధల నుంచి విముక్తి. ఈనెల నుంచి ఊహించని ఖర్చులు, కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, దాంపత్యసౌఖ్యం లోపించడం జరుగుతాయి. కుజశాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు ఇబ్బందికరం అవుతాయి. నవంబర్: పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. çసంతానం రాణింపు ఆనందం కలిగిస్తుంది. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు.మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. పనులు ఆలస్యం అవుతుంటాయి. దూరప్రాంత ప్రయాణాలు విరమించండి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు సానుకూలత తక్కువ. డిసెంబర్: ఈ నెల గ్రహసంచారం ప్రతికూలంగా ఉన్నది. మీ తప్పు లేకున్నా నిందలు పడవలసి వస్తుంది. స్త్రీ విరోధం, దాంపత్య విభేదాలు కలుగుతాయి. మౌనం మంచిది. విద్యార్థులకు సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. షేర్ వ్యాపారులు ఇబ్బందికి గురవుతారు. కోర్టులు, స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందికరం అవుతాయి. జనవరి: ఇతరుల విషయాలలో జోక్యం లేకుండా, మీ పనులలో శ్రద్ధవహిస్తే లక్ష్యాన్ని సాధించ గలుగుతారు. ఋణ– రోగ– శత్రు బాధల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులు తొందరపాటుతనం తగ్గించాలి. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలలో సానుకూలత తక్కువ. ఫిబ్రవరి: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. అకాల భోజనం, వ్యర్థ ప్రయాణాల వలన ఆరోగ్య సమస్యలు. వృత్తిలో ఊహించని మార్పులు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పుబ్బ నక్షత్రం వారు విశేష లాభాలు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలం. షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు. విద్యార్థులు, రైతులు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం. మార్చి: భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు. పనులు నత్తనడకన సాగుతాయి. స్థిరాస్తుల విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కన్యా రాశి ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–5, అవమానం–2. ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ) హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా) చిత్త 1,2 పాదములు (పే, పో) గురువు మే 1 వరకు మేషం (అష్టమం)లోను తదుపరి వృషభం (నవమం)లోను సంచరిస్తారు. శని కుంభం (షష్ఠ)లోను రాహువు మీనం (సప్తమం)లోను కేతువు (జన్మ)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చక్కగా చురుకుగా పాల్గొంటారు. నిద్ర, భోజనం వంటివి సమయపాలనలో చక్కగా నడుపుతూ ముందుకు వెడతారు. అయినా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. మీ కుల ఆచార వ్యవహారాలను పాటించండి. పుణ్యకార్యాలు చేయడం, గురువులను దర్శించడం చేస్తుంటారు. తరచుగా శుభ కార్యాలలో పాల్గొంటారు. బంధువులు, మిత్రుల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తుంటారు. మే తరువాత కొత్త కొత్త పరిచయాలు అవుతాయి. అవి మీకు బాగా సహకారంగా ఉండే స్నేహాలే. ఉద్యోగ విషయాలు చాలా బాగా ఉంటాయి. శని సంచారం బాగున్న కారణంగా సంవత్సర ఆరంభం నుంచి ఫలితాలు బాగుంటాయి. అయితే మే తరువాత ఇంకా అనుకూలం. ప్రమోషన్ వంటి ప్రయత్నాలు లాభిస్తాయి. అదే రీతిగా స్థానచలన ప్రయత్నాలు సానుకూలమే. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా సానుకూలము. అధికారుల సహకారం బాగుంటుంది. భోజనం, వస్త్రం, నిద్ర పూర్తిగా ఆస్వాదిస్తారు. ప్రతి విషయంలోనూ భయపడటం లేదా చికాకుపడటం వంటివి జరుగుతుంటాయి. కుటుంబ విషయాలు చూస్తే పెద్దల ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు కూడా తరచుగా వింటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధనధాన్యవృద్ధి బాగా ఉండటం ఆనందానికి కారణం అవుతుంది. కులాచారానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. బంధువుల సహకారం బాగా ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే కాలం. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే మే వరకు కొంత చికాకుగాను మే నుంచి అనుకూలంగాను ఉంటాయి. మీరు చేసిన పరిశ్రమకు తగిన ఆర్థిక లాభాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడంలో, అవసరానికి కావలసిన కొత్త ఋణాలు పొందడంలో మంచి ఫలితాలు తద్వారా గౌరవం అందుతాయి. తరచుగా వ్యర్థ సంచారం కూడా చేయవలసి ఉంటుంది. కాళ్ళు చేతులు వాటి వేళ్ళు అనేక సందర్భా లలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంగా ప్రత్యేక ఇబ్బందులు ఉండవు. గురువు వృషభంలోకి మార్పు తీసుకున్న దగ్గర నుంచి పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం లభిస్తుంది. మానసిక అనారోగ్యం ఉన్నవారు కొంచెం చికాకు పొందుతారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి విషయంలోనూ క్రమంగా సానుకూల స్థితి పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల బాగుంటుంది. సమర్థంగా కుటుంబ విషయాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, మంచి మార్పులు ఉంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం, శనిబలం అనుకూలత దృష్ట్యా చాలా అనుకూల స్థితి ఉంటుంది. ఒత్తిడికి లోనవ్వద్దు. షేర్ వ్యాపారులకు మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా లాభదాయకం అవుతాయి. లాభదాయకంగా కాలం గడుస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగుతాయి. విద్య, ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళేవారికి అనుకూలమే. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి స్వయంగా వ్యవహారాలు పరిశీలించుకోమని సూచన. తద్వారా విజయావకాశాలు ఎక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మే దగ్గర నుంచి గురుబలం బాగుంది. మంచి అవకాశాలు ఉంటాయి. ఒత్తిడికి లోనవ్వద్దు. రైతుల విషయంలో శ్రమకు తగిన లాభాలు అందుతాయి. మీరు మంచి సలహాలు అందుకోవడంలో విఫలమవుతారు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 వారిలో మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడితో లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యా, వైద్య వృత్తుల వారు లాభం అందుకుంటారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. హస్త నక్షత్రం వారు కొత్త జీవన శైలికి దగ్గర అవుతారు. కొత్తగా జీవనోపాధి మార్గాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యుల అభివృద్ధి వార్తలు వింటారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. చిత్త నక్షత్రం 1, 2 వారికి రోజువారీ భోజనాది విషయాలలోనూ అనుకూలత తక్కువ. అనుకోకుండా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తుంటారు. శాంతి మార్గం: రాహు కేతువులకు జప దానాలు అవసరం. ప్రతిరోజూ గణపతిని, దుర్గను అర్చించిన తరువాత మిగిలిన పనులు చేయండి. ‘దుర్గాసప్తశ్లోకి’ స్తోత్రం రోజూ 11సార్లు పారాయణ చేయాలి. ఏప్రిల్: ఈనెల ప్రతికూల ఫలితాలు ఎక్కువ. శ్రమకు తగిన లాభం లేకపోవటం, ఖర్చులు పెరగటం జరుగుతాయి. వృత్తిలో మాటపడవలసి వస్తుంది. కుజ శాంతి, నవగ్రహారాధన మంచిది. షేర్ వ్యాపారులు జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు ఆందోళనకర ఘటనలు ఎదుర్కొంటారు. మే: ఈ నెల కూడా ప్రతికూలంగానే ఉంటుంది. ఉద్యోగంలో గౌరవం లోపించటం, పని ఒత్తిడి, అధికారులతో సమస్యలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరం. రాబోవు మూడు మాసాలలో ఆరోగ్య ఋణ విషయాలలో శ్రద్ధ అవసరం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ కొద్దీ లాభాలు పెరిగే కాలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి విషయాలు లాభదాయకం. జూన్: ఉద్యోగంలో రాణిస్తారు. అనుకూలంగా స్థానచలనం, అభివృద్ధి జరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఋణ సమస్యలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు జరుగుతాయి. గురువులను దర్శించుకుంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి ఫలితాలు. హస్తా నక్షత్రం వారికి మానసిక ఒత్తిడి తప్పదు. జులై: ఈనెల అంతా అనుకూలమే. ఉద్యోగ వ్యాపారాలలో ఊహించని లాభాలు, ప్రశంసలు లభిస్తాయి. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఆరోగ్యం మిశ్రమంగా ఉన్నది. 16వ తేదీ తరువాత పాత సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు అందుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు వేగంగా జరుగుతాయి. ఆగస్ట్: శ్రమతో కార్యజయం. నిర్విఘ్నంగా పనులు పూర్తవుతాయి. స్థానచలన సూచనలు, ప్రయాణ లాభాలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. 18వ తేదీ తరువాత జీవిత భాగస్వామికి, వ్యాపార భాగస్వామికి కూడా ఆరోగ్య సమస్యలు రావడం వల్ల పని ఒత్తిడి పెరుగుతుంది. సెప్టెంబర్: పనులన్నీ శరవేగంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లోటు ఉండదు. ఆరోగ్యం బాగుంటుంది. బంధు మిత్ర సహకారం లభిస్తుంది. నిత్యం ధ్యానం చేయుట మంచిది. 13వ తేదీ నుంచి ఉత్తర నక్షత్రం వారికి చికాకులు పెరుగుతాయి. చిత్త నక్షత్రం వారికి భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కాలం ప్రారంభమైంది. విద్యార్థులు, రైతులు మంచి ఫలితాలు పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. అక్టోబర్: వ్యాపారంలో పెను మార్పులు, ఊహించని లాభాలు. రానున్న 6 నెలలు అత్యంత అనుకూలం. సమస్యలు, శత్రు బాధలను సునాయాసంగా అధిగమిస్తారు. వేగంగా పనులు పూర్తి చేస్తారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలు. ఫైనాన్స్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులకు అనుకూలం. ప్రయాణ సౌఖ్యం, సాంఘిక గౌరవం. నవంబర్: ఈ నెల అత్యంత అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారాలలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. రాజకీయ నేతలకు ఉన్నత పదవులు లభిస్తాయి. శత్రుబాధలు తొలగుతాయి. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు అనుకూలం. పుణ్య, శుభకార్యాలలో పాల్గొంటారు. డిసెంబర్: కుటుంబ ఒత్తిడి వలన కొన్ని చికాకులు ఉంటాయి. సంతానం విద్యలో రాణించటం వలన ఆనందం కలుగుతుంది. ఉద్యోగంలో కొన్ని సమస్యలకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. అనుకున్న దాని కంటే లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఉంటుంది. షేర్ వ్యాపారులు మంచి ఆదాయం పొందుతారు. జనవరి: ఈ నెల ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు, శత్రుబాధలు, పని ఒత్తిడి పెరుగుతాయి. కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. ఆర్ధిక బలం పెరుగుతుంది. çఉత్తర నక్షత్రం వారికి మానసిక కష్టాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువైనా, ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. కోర్టు వ్యవహారములు కూడా అనుకూలమే. ఫిబ్రవరి: గత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఊహిం చని విధంగా అందరి సహకారం లభిస్తుంది. ప్రతిభకు తగిన గౌరవమర్యాదలు ఉంటాయి. ఆర్ధిక స్థిరత్వం, ఋణ రోగ శత్రు బాధల నుంచి విముక్తి కలుగుతాయి. దాంపత్య జీవితంలో కొంత అభిప్రాయ భేదాలు ఉండును. చిత్త నక్షత్రం వారికి కార్యలాభం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు సఫలం. రైతులకు శ్రమతో కూడిన లాభాలు ఉంటాయి. ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం.ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచుతారు. మార్చి: ఈ నెల ప్రతికూలత ఎక్కువ. వ్యర్థ ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుతాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. భాగస్వామ్య వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. అభిప్రాయ భేదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. నవగ్రహారాధన చేయుట శుభకరం. తులా రాశి ఆదాయం–2, వ్యయం–8, రాజయోగం–1, అవమానం–5. చిత్త 3,4 పాదములు (రా, రి) స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా) విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే) గురువు మే 1 వరకు మేషం (సప్తమ)లోను తదుపరి వృషభం (అష్టమం)లోను సంచరిస్తారు. శని కుంభం (పంచమం)లోను రాహువు మీనం (షష్ఠం)లోను కేతువు (వ్యయం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలాకాలం తరువాత మంచి అనుకూల కాలం ప్రారంభం అయింది. పాత సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. సమయం వృథా చేయవద్దని సూచన. ప్రతి కార్యంలోనూ మీకు ఎన్నో విఘ్నములు ఎదురవుతాయి. అయినా ఓర్పుగా వ్యవహరిస్తే, మీకు విజయం దక్కుతుంది. గురువు సంచారం మే వరకు అనుకూలం. రాహు ప్రభావంగా అన్ని విషయాలలోను చాలా ధైర్యంగా కాలక్షేపం చేస్తారు. ఇది ప్రత్యేక వరము అనే చెప్పాలి. ఉద్యోగ విషయాలలో అధికమైన పరిశ్రమ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. అధికారుల ద్వారా మీకు ప్రోత్సాహం, సహకారం చాలా అధికంగా ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు బాగా అనుకూల స్థితి ఉంటుంది. శ్రమకొద్దీ లాభం అందుతుంది. వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా వరకు అనుకూల స్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీకంటే తక్కువ స్థాయి వారితో అవమానాలు, అవరోధాలు రాగలవు. జాగ్రత్తపడండి. కుటుంబ విషయాలు చూస్తే సంతతి విషయంలో బాగా చింతన ఎక్కువ అవుతుంది. జ్ఞాతి విషయంలో వ్యాజ్యాలు ఉన్నట్లయితే, అవి ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంటుంది. ఇతర అంశాలలో అనుకూల స్థితి ఉంటుంది. పెద్దల సహకారం మీకు బాగా ఉంటుంది. తెలివిగా ప్రవర్తిస్తారు. పాత ఋణాలు, కొత్త ఋణాల విషయంలో మీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే చాలా హెచ్చు తగ్గులు ఆదాయ విషయంలో గోచరిస్తాయి. తరచుగా శుభ కార్యాలలో పాల్గొనడానికి, అలంకరణ వస్తువులు కొనుగోలుకు ఖర్చు బాగా పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ఆలోచనలు ఫలవంతం అవుతాయి. ఇతరులు కలిగించే ఇబ్బందులు ఒక్కోసారి మీకు లాభదాయకంగా మారడం వలన అమితోత్సాహంగా ఉంటారు. ఆరోగ్యవిషయంగా బహు శ్రద్ధ, జాగ్రత్తలు పాటిస్తారు. తద్వారా ఇబ్బంది లేని విధంగా జీవనం చేస్తారు. పాత ఆరోగ్య సమస్యలకు కూడా చాలా చక్కటి వైద్య సదుపాయం చేకూరుతుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్యం బాగా అనుకూలం అవుతుంది. వీరు మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బహు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం అనుకూలం. గర్భిణీ స్త్రీల విషయమై సుఖజీవనం సాగుతుంది. చాలా ప్రశాంత జీవనం చేస్తారు. షేర్ వ్యాపారులకు గురుబలం, రాహు అనుకూలత దృష్ట్యా మంచి ఆలోచనలు చేయడం ద్వారా లాభాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. సుఖంగా ఉంటారు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి లాభదాయక కాలము. త్వరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి ధనవ్యయం అధికం అయినా, పనులు సానుకూలం అయ్యే అవకాశం ఉన్నది. విద్యార్థులకు గురుబలం బాగుంది. ప్రవేశ పరీక్షలలో కూడా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ. మంచి సలహాలు అందుతాయి. లాభాలు బాగా అందుతాయి. చిత్త నక్షత్రం 3, 4 పాదముల వారికి ఆర్థిక సహకారం కొంచెం లోపిస్తుంది. బంధు మిత్రుల సహాయ సహకారాలు బాగుంటాయి. ఆరోగ్యం మీద దృష్టి ఉంచుతారు. స్వాతి నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్రానికి చెందిన స్త్రీలు అనుకోని లాభాలు అందుకుంటారు. సంతోషంగా కాలక్షేపం చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. విశాఖ నక్షత్రం 1, 2, 3 వారికి సకాలంలో ఋణ సౌకర్యం సమకూరుతుంది. కొత్త ప్రాజెక్ట్‌లు చేపడతారు. యోగ్యమైన జీవనం సాగిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. శాంతి మార్గం: తెలుపురంగు పుష్పాలతో జగదాంబను అర్చించండి. ప్రతి మూడు మాసములకు ఒకసారి నవగ్రహ హోమం చేయండి. రోజూ భువనేశ్వరీ సహస్రనామ పారాయణ చేయండి. ఏప్రిల్: ప్రతి పనిలోనూ అవరోధాలు ఎదురవుతాయి. బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. ఉద్యోగంలో ప్రత్యేక గౌరవం దక్కుతుంది. వ్యాపారలాభం, ప్రయాణ లాభం ఉన్నాయి. కొత్త పనులు చేపడతారు. భూ– ఆభరణ కొనుగోలు చేస్తారు. షేర్ వ్యాపారులు మంచి నిర్ణయాలతో లాభిస్తారు. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయాలలో అధికారుల తోడ్పాటు బాగుంటుంది. విద్యార్థులకు అన్ని అంశాలూ అనుకూలిస్తాయి. గురువులను పూజ్యులను దర్శిస్తారు. శుభకార్య, సామాజిక కార్యక్రమాలలో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు బాగుంటాయి. మే: ఈ నెల మధ్యలో కొన్ని కీలక విషయాల నిమిత్తం పెద్దలను సంప్రదిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలలో జాగరూకతతో ఉండాలి. అధికారయోగం ఉంది. స్త్రీలతో వివాదాలు వద్దు. చేయవలసిన పనులు వదిలి అనవసరమైనవి చేస్తుంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విదేశీ ప్రయత్నాలు సానుకూలం. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత తక్కువ. జూన్: వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఉత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. కొన్ని విషయాలలో మాటపడవలసి వస్తుంది. స్థిరాస్తి పనులు కొంత ఆలస్యమవుతాయి. స్వాతీ నక్షత్రం వారికి తరచు ఆరోగ్య సమస్యలు, కలహాలు ఉంటాయి. కొత్త వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. విద్యార్థులకు అనుకూలత తక్కువ. రైతులు, షేర్ వ్యాపారులకు మంచి సూచనలు అందవు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. జులై: ఉద్యోగ వ్యాపారాలలో విశేష గౌరవం, లాభాలు ఉంటాయి. అధికారయోగం ఉంది. ఇతరుల విషయాలలో జోక్యం వలన ఇబ్బందులు కలుగుతాయి. 3వ వారం నుంచి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు, ఖర్చులు పెరుగుతాయి. అన్ని వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. రోజువారీ కార్యములు అస్తవ్యస్తంగా ఉంటాయి. స్వాతీ నక్షత్రం వారు కలహాలతో ఇబ్బంది పడతారు. ఆరోగ్య సమస్యలు, ఋణ సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తలు పాటించాలి. ఆగస్ట్: వృత్తిలో రాణిస్తారు. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు దక్కుతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వాహన కొనుగోలుకు అనుకూలం. ఇంట్లో శుభాలు జరుగుతాయి. కొత్త పరిచయాలు, ప్రయాణాలు లాభిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి లావాదేవీలలో జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు. సెప్టెంబర్: దైవదర్శనం చేసుకుంటారు. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వస్త్రాభరణ లాభం ఉంది. చిత్త నక్షత్రం వారు తెలివిగా సమస్యలను అధిగమిస్తారు. ఆదాయం సరిగా ఉండదు. ఖర్చులు, ఋణాలలో యిబ్బందులు, పిల్లల వలన చికాకులు ఉంటాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు కాలం ప్రతికూలం. విదేశీ ప్రయత్నాలలో అవరో«ధాలు ఎక్కువ. అక్టోబర్: మీ పనితీరులో మార్పులు చేస్తారు. ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. అనుకూల బదిలీలు ఉంటాయి. కుటుంబాభివృద్ధి, శుభకార్యాలు జరుగుతాయి. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు మంచికాలం. నవంబర్: ఎక్కువ శ్రమ లేకుండానే పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగ సమస్యలను మీ ప్రతిభతో అధిగమిస్తారు. అధికార యోగం ఉంది. బదిలీలు అనుకూలం. అలంకరణ వస్తువుల కొనుగోలు కారణంగా ఖర్చు పెరుగుతుంది. షేర్ వ్యాపారులకు అధిక లాభములు ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు కాలం పరిపూర్ణంగా అనుకూలం. డిసెంబర్: ఈ నెల అత్యంత అనుకూలం. విందు వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యం అనుకూలం. స్వేచ్ఛగా ప్రవర్తిస్తారు. పుణ్య క్షేత్ర సందర్శన చేస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. జనవరి: ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత. కొత్త పరిచయాలు లాభిస్తాయి. మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. కుటుంబంలో చికాకులు, ఆరోగ్య సమస్యలు వల్ల ఇబ్బందులు. భూ– గృహ– వాహన కొనుగోలుకు అనుకూలం. అధికారుల సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకుంటారు. పాత ఆరోగ్య, ఋణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తపడండి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఫిబ్రవరి: ఈనెల అంత అనుకూలంగా లేదు. ప్రతి పనిలోనూ జాప్యం వలన ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులు మీతో సన్నిహితంగా ఉన్నా, మీ జాగ్రత్తలో మీరుండాలి.పెట్టు బడులు ఆశించిన లాభాన్ని ఇవ్వవు. ఇతరుల విషయాలలో జోక్యం వలన ప్రతికూలత పెరుగుతుంది. నవగ్రహ ఆరాధన మంచిది. రోజువారీ పనులు అకాలంలో పూర్తవుతుంటాయి. విద్యార్థులు విద్యా వ్యాసంగానికి దూరం అవుతారు. సాంఘిక కార్యక్రమాలలో జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులకు అనుకూలం. రైతులకు శ్రమాధిక్యం. ఫైనాన్స్ వ్యాపారులకు జాగ్రత్త అవసరం. మార్చి: కార్యజయం. ఆరోగ్య, ఋణ సమస్యలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. శత్రుబాధలు తగ్గుతాయి. రాజకీయరంగంలో అనుకూలత పెరుగుతుంది. స్త్రీవిరోధం వద్దు. లక్ష్మీస్తోత్ర పారాయణ మంచిది. వృశ్చిక రాశి ఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–4, అవమానం–5. విశాఖ 4 వ పాదము (తొ) అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే) జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ) గురువు మే 1 వరకు మేషం (షష్ఠం)లోను తదుపరి వృషభం (సప్తమం)లోను సంచరిస్తారు. శని కుంభం (చతుర్థం)లోను రాహువు మీనం (పంచమం)లోను కేతువు (లాభం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సమయపాలన సరిగా ఉండదు. పైన చెప్పిన నాలుగు గ్రహాల సంచారం సరిగాలేదు. అయితే ప్రతి నెలలోనూ ఏదో ఒక గ్రహం బహు అనుకూలతతో ఉండటం వల్ల మీరు సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్లగలరు. పనిముట్లు వాడకంలో జాగ్రత్తలు తీసుకోండి. తరచుగా మీ వస్తువులు చౌర్యానికి గురి కావడం, లేదా మీరే వాటిని ఎక్కడైనా మరచిపోవడం జరుగుతుంది. అప్రయత్నంగా శుభకార్యాలలో పాల్గొనడం, బంధుమిత్రుల కలయిక, సాంఘిక కార్యకలాపాలు సాగించడం వంటివి ఉంటాయి. ఉద్యోగ విషయాలలో అధికారుల గురించి మీకు భయం వెంటాడుతుంటుంది. మీరు పదవిలో మార్పు తీసుకోవాలని కానీ స్థానచలనం తీసుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు సరిగా సాగవు. అయితే విచిత్రం ఏమిటంటే వృత్తి రీత్యా ఈ సంవత్సరం మే నుంచి గురువు వలన రక్షణ బాగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు తక్కువ, కానీ నష్టం ఉండదు. నూతనంగా వ్యాపారం పెట్టాలి అనే వారికి అన్ని రంగాలలోనూ అడ్డంకులు ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో చాలా ఆలస్యం చోటు చేసుకొని, ఆ సందర్భాలు ఇంట్లో కలహాలకు దారి తీస్తాయి. అవగాహన లోపాలు ఎక్కువ అవుతాయి. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి సాధారణ స్థాయితో ఉంటాయి. అందరూ మిమ్మల్ని గౌరవించే విధంగా ఉంటారు. కానీ మీ ప్రవర్తన అనుకూలంగా ఉండదు. తరచూ శరీరం బరువు తగ్గే అవకాశాలు వున్నాయి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనంతో ముడిపడిన ప్రతి అంశం కొంచెం ఇబ్బందికరమే అయినా, డబ్బు లేదని ఏ పనీ ఆగదు. గతం కంటే రాబడి తగ్గుతుంది. కానీ ఇబ్బంది కాదు. అనవసర ఖర్చులను నియంత్రిస్తారు. తరచుగా అధికారులు, బంధువులూ, పూజ్యుల రాకపోకలు దృష్ట్యా ధనవ్యయం అవుతుంది. ఒంటరిగా కాలక్షేపం చేయడం, ఒంటరిగా దూరప్రాంత ప్రయాణాలు చేయడానికి కాలం అనుకూలం కాదు. ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు పాటించాలి. పాత సమస్యలు తిరగబెట్టగలిగే అవకాశం గోచరిస్తోంది. వైద్య సదుపాయాల మీద మీకు సదుద్దేశం కలిగే అవకాశం లేదు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఉద్యోగంలో ప్రతి పనీ మీరే స్వయంగా చూసుకోండి. సాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు అవసరం అని సూచన. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. షేర్ వ్యాపారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలము నడుస్తున్నది అనే చెప్పాలి. దూకుడువద్దు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు సరిగా సాగకపోగా అనవసర సలహాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఫలితాలు వ్యతిరేకంగా వచ్చే అవకాశాలున్నాయి. వాయిదా వేయండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మే నుంచి గురుబలం బాగా ఉన్న కారణంగా ఓర్పుగా మంచి ఫలితాలు అందుకుంటారు. రైతుల విషయంలో శ్రమ ఎక్కువ మంచి సలహాలు అందవు. నష్టం లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి పాత ఆరోగ్య సమస్యలు తిరగబడవచ్చు. సాంఘిక కార్యక్రమాలలో మంచి పేరు వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి కుటుంబ విషయంలో అసంతృప్తి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. జ్యేష్ఠ నక్షత్రం వారికి ప్రయత్నాలు తేలికగా సఫలం కావు. పనులు ఆలస్యమవుతాయి. ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. శాంతి మార్గం: శని, గురు, రాహువులకు శాంతి చేయించండి. ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ ధ్యానం చేయండి. రోజూ గోపూజ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది. ఏప్రిల్: ఉద్యోగంలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. సంతానంతో అభిప్రాయ భేదాలుంటాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు అనుకూలం. తరచు శుభవార్తలు వింటారు. మే: ఈనెల ప్రతికూలత ఎక్కువ. నిందలు పడవలసి వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల వల్ల ఇబ్బందులు. నవగ్రహ శాంతి మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు అనుకూలం విదేశీ ప్రయత్నాలలో శుభవార్త అందుతుంది. స్థిరాస్తి, కోర్టు విషయాలు బాగా అనుకూలం. జూన్: తెలియని ఆందోళన ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. అధికారులతో ఉన్న సమస్యలు సర్దుకుంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. దాంపత్యంలో అన్యోన్యత లోపిస్తుంది. ఎవరో చేసిన పొరపాటుకు మీరు సమాధానం చెప్పవలసి వస్తుంది. అనురాధ నక్షత్రం వారికి అందరి నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలం. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు వేగం అవుతాయి. షేర్ వ్యాపారులకు, రైతులకు అనుకూలం. జులై: కుటుంబ, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఉన్నత అధికారులతో అభిప్రాయ భేదాల వల్ల సమస్యలు ఉంటాయి. స్థిరాస్తి పనులు ఆలస్యమవుతాయి. కుటుంబ సభ్యులతో కలసి చేసే పనులు విజయవంతం అవుతాయి. మొదటి రెండు వారాలలో మంచి ఫలితాలు అందుతాయి. షేర్ వ్యాపారులకు లాభాలు తక్కువ. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఆగస్ట్: ఉద్యోగంలో మార్పులు. ఉన్నత పదవులు చేపడతారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్య, ఋణ సమస్యలు పెరుగుతాయి. కుజ శాంతి చేయాలి. సంప్రదాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన కొనుగోలు, స్థిరాస్తి కొనుగోలు ఆలోచనలు పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. రైతులు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. సెప్టెంబర్: రాజకీయవేత్తలకు అనుకూలం. ఉన్నత పదవులు దక్కుతాయి. వ్యాపారలబ్ధి. బదిలీలు అనుకూలం. ప్రయాణ లాభం. కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. శుభపరిణామాలు కనిపిస్తాయి. కుజశాంతి మంచిది. రాబోవు ఆరు మాసాలు ఆరోగ్య, ఋణ విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆదాయ వ్యయాలు ఇబ్బందికరం అవుతుంటాయి. విదేశీ ప్రయత్నాలు షేర్ వ్యాపారాలు ఇబ్బందికరం కావచ్చు. అక్టోబర్: ఈనెల అనుకూలత తక్కువ. శ్రమకు తగిన ప్రతిఫలం, గుర్తింపు దక్కుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలకు తగిన ఖర్చులు ఉంటాయి. అవసరాలకు తగిన ఆదాయం అందదు. వృత్తి ఉద్యోగాల్లోను, ఆరోగ్యంపైన జాగ్రత్త అవసరం. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. నవంబర్: ఈనెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో ఇతరులపై ఆధారపడితే ఇబ్బందులు తప్పవు. వ్యాపారం మందగిస్తుంది. కొత్త పనులు ఆలస్యమవుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు. నిరుత్సాçహానికి లోనవుతారు. బంధు మిత్రుల రాకపోకలు పెరుగుతాయి. డిసెంబర్: కుటుంబ, ఆరోగ్యపరమైన ఖర్చులు పెరుగుతాయి. స్థానచలనానికి ప్రయత్నిస్తారు. పనులు ముందుకు సాగవు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ. ఋణ సమస్యలు పెరుగుతాయి. విష్ణు ఆరా ధన శ్రేయస్కరం. కుటుంబ వాతావరణంలో ప్రశాంతత లోపిస్తుంది. పాత ఆరోగ్య సమస్యలు భయం కలిగిస్తాయి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు రైతులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. జనవరి: ఎప్పటి నుంచో పడిన శ్రమకు ఇప్పుడు సత్ఫలితాలు లభిస్తాయి. బదిలీలు అనుకూలం. భోజన సౌఖ్యం. మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యాపారం లాభిస్తుంది. వివాహాది ప్రయత్నాలు చేస్తారు. విష్ణు ఆరాధన మంచిది. అనురాధ నక్షత్రం వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. షేర్ వ్యాపారులు సరిగా వ్యాపారం చేయలేరు. ప్రతి విషయంలోనూ గోప్యత పాటించడం మంచిది. విద్యార్థులు, రైతులు మరింత శ్రద్ధ పెట్టాలి. ఫిబ్రవరి: రవి–కుజ–బుధుల సంచారం ప్రతికూలముగా ఉన్నది. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. పనులలో ఆలస్యం, కుటుంబ ఖర్చులు పెరగటం, శారీరక శ్రమ అధికమవడం జరుగుతాయి. పెద్దల, గురువుల సహకారంతో పనులు పూరవుతాయి. సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. నవగ్రహారాధన చేయడం మంచిది. ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ ఇతరుల సలహాలు స్వీకరింపవద్దు. ప్రతి పనీ స్వయంగా చూసుకోవాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. పెద్దలకు, పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చేయడంలో విఫలం అవుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. భక్తి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలుంటాయి. మార్చి: ఈనెల గ్రహసంచారం అనుకూలంగా లేదు. ఇతరులతో కొంత మితంగా వ్యవహరించుట మంచిది. వ్యర్థప్రసంగాలతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. పనులు ఆలస్యమవుతాయి. ఉద్యోగంలో తోటివారితోను, అధికారులతోను విభేదాలు పెరుగును. పెద్దల సహాయం లభిస్తుంది. దైవారాధన మానవద్దు. ధనూ రాశి ఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–7, అవమానం–5 మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ) పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా) ఉత్తరాషాఢ 1వ పాదము (బే) గురువు మే 1 వరకు మేషం (పంచమం)లోను తదుపరి వృషభం (షష్ఠం)లోను సంచరిస్తారు. శని కుంభం (తృతీయం)లోను రాహువు మీనం (చతుర్థం)లోను కేతువు (దశమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో చాలా చక్కటి సమయపాలన చేసి సుఖపడతారు. అన్ని విషయాలలోనూ స్వతంత్ర నిర్ణయాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చాలా సందర్భాలలో మీకు శుభవార్తలు అందుతాయి. మీ వ్యవహారాలలో శుభ పరిణామాలు ఎక్కువసార్లు ఉంటాయి. విజ్ఞాన వినోద విహార యాత్రలు ఎక్కువగా సాగిస్తారు. స్నేహితుల మీద ఆధారపడి ఏ పనీ చేయవద్దు. మీ మాట తీరు ఇతరులకు మానసిక చికాకులు సృష్టించి, తద్వారా విభేదాలు తీసుకురాగలదు. వాగ్ధోరణిని నియంత్రించండి. ఉద్యోగ విషయాలు అంతా బాగానే ఉంటాయి కానీ, అనవసర విషయాలు మిమ్మల్ని అశాంతికి లోనయ్యేలాగా చేస్తుంటాయి. స్థిర బుద్ధి ప్రదర్శించకపోవడం దృష్ట్యా మధ్య మధ్య చికాకులు ఉంటాయి. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చేస్తే స్వస్థలం లేదా అనుకూల స్థలం చేరుకోగలరు. మీకు మంచి మార్పులకు కూడా కాలం అనుకూలం అవుతుంది. వ్యాపారులకు అనుకూల స్థితి ఉంటుంది. ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యాపార సమస్యలు, ప్రభుత్వ తరఫు సమస్యలు కూడా ఈ సంవత్సరం సానుకూలంగా పూర్తి అవుతాయి. కుటుంబ విషయాలు చూస్తే తరచుగా భార్యాపుత్ర విరోధం ప్రతి విషయంలోనూ ఎదురవుతుంది. కానీ తెలివిగా సరిచేయగలుగుతారు. పెద్దల ఆరోగ్య విషయంగా జరిగే పనులు మీ ఇతర కార్యక్రమాలను ఇబ్బంది పెడతాయి. పనులు వాయిదా వేసి ఒంటరిగా ఎక్కడకు అయినా వెళ్ళాలి అని తరచుగా అనిపిస్తుంది. తరచుగా శుభకార్య, పుణ్యకార్య నిమిత్త ప్రయాణాలు మీ వలన ఆగిపోవడం దృష్ట్యా కుటుంబ సభ్యులు అసంతృప్తి చెందుతారు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనవ్యయం బాగా అధికం అవుతుంది. అరికట్టలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన అవసరాలను కూడా వాయిదా వేయాల్సిన స్థితి ఉంటుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే సందర్భంలో సమస్యలు ఎదురౌతాయి. మీ అందరితోనూ మితవాదం చేయుట శ్రేయస్కరం. ఏ విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేరు. ఆరోగ్య విషయంగా వాత సంబంధ అనారోగ్యం ఉన్నవారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మిగిలిన వారి విషయంలో పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. మొత్తం మీద మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశికి చెంది స్త్రీలకు సరైన గుర్తింపు లేని విధంగా ఉద్యోగ పరిస్థితులు ఉంటాయి. అయితే ఇబ్బందికర ఘటనలు ఉండవు. కుటుంబ విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. గర్భిణీ స్త్రీల విషయమై మే నెల తరువాత ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు బాగా పాటించండి. షేర్ వ్యాపారులకు వ్యాపారం బాగున్నా, తగిన లాభాలు అందని పరిస్థితి. ప్రశాంత చిత్తంతో ఆలోచించండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు కొంచెం ఇబ్బంది పెట్టినా, సానుకూలం అవుతుంటాయి. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి మే నెల నుంచి ధనవ్యయం అధికం అవుతుంది. కార్యలాభం దూరమే. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి కావలసిన వనరులు తేలికగా లభ్యం అవుతాయి. మంచి నిర్ణయం చేస్తారు. విద్యార్థులకు శ్రమతో కూడిన మంచి ఫలితాలు వస్తాయి. గురుబలం తక్కువ. అన్ని విద్యా విషయాలు జాగ్రత్తగా చూడండి. రైతుల విషయంలో మంచి సలహాలు దొరకవు. అయితే మీరు చేసే శ్రమ ఒక్కటే మీకు శ్రీరామరక్ష. మూల నక్షత్రం వారికి సాంఘిక కార్యక్రమాలలో అవమానాలు ఎదురవుతాయి. అయిష్టంగానే కొన్ని పనులు చేయవలసి వస్తుంది. కుటుంబ, ఆర్థిక, వృత్తి విషయాలలో అసంతృప్తి పెరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం వారు ముందు జాగ్రత్త చర్యలతో పరిస్థితులను సానుకూలం చేసుకుంటారు. తరచు విహార యాత్రలు చేస్తారు. గురువులను దర్శించుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు నియమబద్ధంగా వృత్తి ఉద్యోగాలు నిర్వర్తిస్తారు. అభివృద్ధి ఉన్నా, తగిన ఫలితాలు రావు. కుటుంబంలో సానుకూలత సాధిస్తారు. శాంతి మార్గం: సంవత్సర ఆరంభంలో రాహువుకు, మే నెలలో గురువుకు జపం చేయించండి. ప్రాతఃకాలంలో రోజూ తెల్లటి పుష్పాలతో అమ్మవారి అర్చన చేయడం, ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: పని మీద దృష్టి పెట్టలేరు. ఇతర కార్యకలాపాలపై ఆసక్తి వలన ఇబ్బందులు కలుగుతాయి. అశ్రద్ధ, అకాలభోజనం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరుగుతాయి. నవగ్రహస్తోత్రం పఠించాలి. ఉద్యోగ వ్యాపారాలలో కోరిన విధంగా ముందుకు వెడతారు. కుటుంబ సమస్యలకు, ఋణ సమస్యలకు, కోర్టు వ్యవహారాలకు మంచి పరిష్కారాలు పొందుతారు. పుణ్యకార్యాలలో పాల్గొంటారు. మే: నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. వ్యాపారం గతంలోకన్నా లాభిస్తుంది. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. దుర్జన సాంగత్యం వలన ఊహించని సమస్యలు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు కలిసివస్తాయి. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. షేర్ వ్యాపారుల ప్రణాళికలు సరిగా సాగవు. రైతులకు, విద్యార్థులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. జూన్: తరచు ఊహించని ప్రయాణాలు. దాంపత్య జీవితంలో మనస్పర్థలు కలుగుతాయి. పనిఒత్తిడి వలన ఇంటి పనులు నిర్వహించలేరు. వ్యాపార భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. శివకుటుంబ ఆరాధన మంచిది. మూలనక్షత్రం వారు ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇతరులను నమ్మి కొత్త ప్రయత్నాలు చేయరాదు. ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. షేర్, ఫైనాన్స్ వ్యాపారులకు విచిత్ర సమస్యలు ఉంటాయి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెడతాయి. జులై: దాంపత్య జీవితంలో సమస్యలు సర్దుకుంటాయి. వ్యాపారంలో విభేదాలు, శత్రుబాధలు తొలగుతాయి. ఉద్యోగంలో రాణిస్తారు. ప్రభుత్వ పనుల్లో జాప్యం. భూమి కొనుగోలు చేస్తారు. శివ–విష్ణు స్తోత్ర పారాయణ మేలు. క్రమంగా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. షేర్ వ్యాపారులకు అద్భుతాలు జరుగుతాయి. విద్యార్థులకు రైతులకు అనుకూలం. ఆగస్ట్: ఈనెల అనుకూలత తక్కువ. చెప్పుకోలేని సమస్యలు. వృథా కాలక్షేపం వలన పని ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. నవగ్రహ శాంతి చేయడం మేలు. పుణ్యకార్య శుభకార్య, కుటుంబ కార్యక్రమాల నిమిత్తం ప్రయాణాలు అధికంగా చేస్తుంటారు. ఆర్థిక వెసులుబాటు తక్కువ. వస్తువులు చౌర్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. షేర్ వ్యాపారులకు దూకుడు తగదు. రైతులకు కాలం అనుకూలం. సెప్టెంబర్: ఉద్యోగంలో సమస్యలు కొలిక్కి వస్తాయి. అధికార యోగం. ప్రతిభకు తగిన పురస్కారాలు లభిస్తాయి. వ్యాపార లబ్ధి. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు. కుటుంబ సమస్యలకు పెద్దల సలహాలతో పరిష్కారం లభింస్తుంది. రాబోవు ఆరుమాసాలు ఆర్థిక, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు అధికంగా పాటించాలి. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. విద్యార్థులకు, రైతులకు కూడా ఇబ్బందికరమైన కాలమే. విదేశీ ప్రయత్నాలకు అనుకూలం కాదు. అక్టోబర్: ఉద్యోగ వ్యాపారాలలో కార్యసిద్ధి. రాజకీయవేత్తలు ఉన్నత పదవులు చేపడతారు. ఇప్పటి నుంచి 6 నెలలు పనులలో జాప్యం, తరచు ఆరోగ్య సమస్యలు, ఇతరులతో వివాదాలు ఉంటాయి. కుజ, సుబ్రహ్మణ్య శాంతి చేయాలి. వాహనాలు, పనిముట్ల వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు ఓర్పుగా వ్యవహరించాల్సిన కాలం. నవంబర్: స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలలో చికాకులు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్టంలేని బదిలీలు, ప్రయాణాలు వలన శ్రమాధిక్యం, అకాల భోజనం, పనుల్లో జాప్యం జరుగుతాయి. ఋణాలు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు దూకుడు తగ్గించడం మంచిది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విద్యార్థులకు, రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. డిసెంబర్: పనులన్నీ నత్తనడకన సాగుతాయి. ఎంత శ్రమించినా ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ప్రయాణాల వలన ఇబ్బందులు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త. శివ–విష్ణు ఆరాధన శుభప్రదం. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. తెలివి ఉన్నా, ధైర్యం చేయలేక చాలా పనులు ఆపివేస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. జనవరి: ఆర్థిక ప్రణాళిక రూపొందిస్తారు. పనుల నిమిత్తం ఎక్కువగా తిరగవలసి రావటం, శ్రమాధిక్యం ఉంటాయి. కార్యజయం ఉన్నది. విష్ణుస్తోత్ర పారాయణ శ్రేయస్కరం. ఆదాయ వ్యయాల సమతుల్యత సాధించలేరు. దైనందిన జీవనం సరిగా సాగదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు అతి శ్రమ, స్వల్ప ఫలితం ఉంటాయి. ఫిబ్రవరి: నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో విశేష గౌరవం పొందుతారు. స్థిరాస్తి కోర్టు విషయాలు సర్దుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విష్ణు–సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది.పూర్వాషాఢ నక్షత్రం వారికి అన్ని రంగాల్లోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. çఅభివృద్ధి కోసం చేసే ప్రతి పనీ ఇబ్బందికరం అవుతుంది. షేర్ వ్యాపారులకు అనుకూలం. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, శుభకార్య ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. మార్చి: విశేష వ్యాపారలబ్ధి ఉంటుంది. పనులన్నీ నేర్పుతో పూర్తి చేస్తారు. వ్యాపార నిమిత్త ప్రయాణాలు లాభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబంలో ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. నవగ్రహారాధన చేయుట మంచిది. మకర రాశి ఆదాయం–14 , వ్యయం–14 , రాజయోగం–3 , అవమానం–1 . ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ) శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ) ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి) గురువు మే 1 వరకు మేషం (చతుర్థం)లోను తదుపరి వృషభం (పంచమం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (ద్వితీయం)లోను రాహువు మీనం (తృతీయం)లోను కేతువు (భాగ్యం)లోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో ఎక్కడా ఆటంకాలు ఉండవు. సమయపాలన బాగా చేస్తుంటారు. ఏలినాటి శని చివరి సమయంలో ఉన్నది. గురుబలం అనుకూలత దృష్ట్యా అంతా మంచి ఫలితాలు ఉంటాయి. మీ వ్యక్తిగత గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉండేలాగ మీరు సహవాసాలు నడుపుకోండి. తరచుగా సామాజిక కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉంటుంది. స్వబుద్ధితో చేసే కార్యములు అన్నీ విజయమే అందిస్తాయి. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ విషయాలలో అధికంగా తిరగవలసి ఉంటుంది. మార్కెటింగ్ వారికి మరీ ఎక్కువగా ఈ తిరుగుడు ఉంటుంది. అయితే అది లాభదాయకమే. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు మే నెల తరువాత చాలా సానుకూలం అవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలలో ఊహాతీతంగా లాభదాయక వార్తలు వింటారు. వ్యాపారులు స్వబుద్ధి, స్థిరబుద్ధి ప్రదర్శించిన వారికి మే నెల నుంచి అంతా శుభపరిణామాలే ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే స్వంత బంధువర్గం మిమ్మల్ని అపార్థం చేసుకోవడం లేదా మీరు వారిని అపార్థం చేసు కోవడం జరుగుతుంది. అయితే క్రమేణా గురుబలం వలన అవి సమసి పోతాయి. పిల్లల విషయంలో మీ అంచనాలు చక్కటి ప్రతిఫలం చూపుతాయి. మీ కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అనుకూలం అవుతాయి. అనుకోకుండానే వాహన లాభం పొందే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే గురుబలం దృష్ట్యా మంచి ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలలో ఉన్నవారికి వేగంగా పనులు పూర్తవుతాయి. పాత ఋణాలు తీర్చే విషయంలోను, అవసరమైన కొత్త ఋణాలు పొందే విషయంలోనూ గ్రహచారం బాగా అనుకూలిస్తుంది. తరచుగా శుభవార్తలు వింటారు. గురువులను పూజ్యులను కలుస్తారు. విద్యార్జనపై ఆసక్తి కలుగుతుంది. ఆరోగ్య విషయంగా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏదేని పాత సమస్యలు ఉంటే వాటికి మంచి వైద్యం లభిస్తుంది. బాగా జాగ్రత్తలు వహించి ఎటువంటి సమస్యలు రాకుండా కాలక్షేపం చేస్తారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు అన్ని రంగాలలోనూ అభివృద్ధి ఉంటుంది. ప్రధానంగా గురుబలం దృష్ట్యా కుటుంబ విషయాలలో మంచి విజయం అందుకుంటారు. అలంకరణ వస్తు కొనుగోలు కోరిక తీరుతుంది. గర్భిణీ స్త్రీల విషయమై అంతా శుభపరిణామాలే గోచరిస్తున్నాయి. చక్కటి ఆరోగ్యస్థితి ఉంటుంది. షేర్ వ్యాపారులకు లాభదాయకమైన కాలం. ఎటువంటి చాంచల్యమూ లేని స్థిర ఆలోచనలు విజయాన్నిస్తాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి కాలం కలసి వస్తుంది. విద్యా విషయంగా వెళ్ళేవారికి లాభం ఎక్కువ. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి పనులు ఆలస్యం. శ్రమాధిక్యతతో లాభాన్నిస్తాయి. విజయం తథ్యము. స్థిరాస్తి కోనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు పూర్తి అవుతాయి కానీ ఆలస్యం చోటు చేసుకుంటుంది. విద్యార్థులకు విద్యా వ్యాసంగం మీద దృష్టి స్థిరంగా ఉంచితే గురుబలం వలన మంచి విజయాలు అందుకుంటారు. రైతుల విషయంలో అంతా శుభప్రదమే. మంచి సూచనలు, సలహాలు అందుకుని లాభం పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3,4 వారు నిత్యం చేసే పనికి పొందే ఫలితానికి పొంతనలేని స్థితి ఉంటుంది. ఖర్చులు నియంత్రించలేక ఇబ్బంది పడతారు. అవసరానికి కావలసిన ధనం సర్దుబాటు కాక పనులు వాయిదా వేయవలసిన స్థితి ఉంటుంది. శ్రవణం నక్షత్రం వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి, ఆలస్యంగానైనా ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో అద్భుత ఫలితాలు అందుకుంటారు. ఖర్చులు నియంత్రించడంలో విఫలం అవుతారు. ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలవారు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి పనిలోనూ వాయిదా వేసే లక్షణాలు ప్రదర్శిస్తారు. అనవసర విషయాలలో చర్చలు భయం, అవమానం కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. శాంతి మార్గం: అమ్మవారి అర్చన చేయండి. రోజూ సుబ్రహ్మణ్య, దుర్గాపూజలు చేస్తుండండి. ‘శ్రీమాత్రే నమః’ నామంతో ధ్యానం చేయడం, సుందరకాండ శ్రవణం చేయడం మంచిది. శని జపం చేయించండి. ఏప్రిల్: ఈనెల అన్ని రంగాలవారికీ కాలం కలసి వస్తుంది. 3వ వారంలో కొన్ని సమస్యలు ఎదురైనా, మనోధైర్యంతో ఎదుర్కొంటారు. స్థిరాస్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో కొంత అలజడి ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. షేర్ వ్యాపారులు లాభపడతారు. విదేశీ ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. స్థిరాస్తి ప్రయత్నాలలో కాలం అనుకూలం. మే: ఈ నెల పనులు సానుకూలంగా సాగుతాయి. ఆర్ధిక స్థితిగతులు మెరుగుపడతాయి. విలాస జీవితం గడుపుతారు. కుటుంబంలో స్వల్ప మనస్పర్థలు ఏర్పడతాయి. శివ–విష్ణు స్తోత్రపారాయణ శుభప్రదం. విదేశీ ప్రయత్నాలలో మంచి సలహాలు అందవు. షేర్ వ్యాపారులకు అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త పథకాల రూపకల్పనకు, స్థిరాస్తి కొనుగోలుకు మంచి కాలం. పెద్దవారి ఆరోగ్యం బాగుండటం, పిల్లల అభివృద్ధి వలన సుఖపడతారు. జూన్: ఈ నెల అత్యంత అనుకూలం. అన్ని రంగాలవారు అభివృద్ధి చెందుతారు. ఉద్యోగంలో బదిలీలు అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. మొండి బాకీల వసూలవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. జులై: ఈనెల గ్రహ సంచారం ప్రతికూలంగా ఉంది. ఎదుటి వారి మేలు కోసం మీరు చేసే పనుల వలన ఇబ్బందులు తప్పవు. అందరూ మీతో విరోధిస్తారు. వ్యాపారం గతం కన్నా తగ్గుతుంది. నవగ్రహారాధన మంచిది. ఋణ సమస్యలు విచిత్రంగా ఉంటాయి. ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువ అయినా, ఇబ్బంది ఉండదు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు ఇబ్బందులు ఉండవు. ఆగస్ట్: ఈనెల ప్రథమార్ధం ఎటువంటి సమస్యలు లేక సామాన్యంగా ఉంటుంది. ద్వితీయార్ధంలో పనులన్నిటా ఆటంకాలు ఎదురవుతాయి. 4వ వారంలో శుభాలు కలుగుతాయి. వృత్తిలో రాణిస్తారు. అనవసర విషయాలలో కలగ చేసుకొని కలహాలు తెచ్చుకుంటారు. మీ మాటకు గౌరవం తగ్గుతుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. షేర్ వ్యాపారులకు, రైతులకు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి ప్రయత్నాలు వాయిదా వేయడం మంచిది. సెప్టెంబర్: ఈ నెల అనేక శుభాలు జరుగుతాయి. వ్యాపార లబ్ధి. వృత్తిలో ఆటంకాలను అధిగమిస్తారు. స్థిరాస్తి, కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. భూ వాహన కొనుగోలుకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. గురువులను సందర్శిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. అక్టోబర్: ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు. అధికారయోగం ఉంది. రాజకీయవేత్తలకు అనుకూలం. ప్రభుత్వ సంబంధ పనులు పూర్తవుతాయి. దాంపత్య జీవితంలో తెలియని అశాంతి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారులకు అనుకోని లాభాలు. విద్యార్థులకు మంచి కాలం. షేర్ వ్యాపారులు అద్భుతంగా రాణిస్తారు. నెల అంతా పుణ్య, శుభకార్యాలు నిర్వహిస్తారు. నవంబర్: ఈనెల శుభ ఫలితాలు కలుగుతాయి. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఇప్పటి నుంచి 5 నెలల పాటు జీవిత, వ్యాపార భాగస్వాములతో విభేదాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కుజ శాంతి చేయాలి. అధికారుల సహాయంతో ప్రమోషన్లు, స్థానచలనాల్లో లాభం అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి ప్రయత్నాలు లాభదాయకం. షేర్ వ్యాపారులకు అనుకూలం. పుణ్యక్షేత్ర సందర్శన, గురువుల సందర్శన చేసుకుంటారు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారు. డిసెంబర్: ఈనెల అన్ని రంగాలవారికీ అనుకూలమే. వ్యాపారలబ్ధి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. 16వ తేదీ తరువాత స్వయంకృతాపరాధం అన్నట్లుగా కొన్ని పనులు పాడు చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు, ఇతర చికాకులు 16వ తేదీ నుంచి పెరుగుతాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి జరుగుతుంది. జనవరి: ఈనెల వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది. అకాల భోజనం వలన ఆరోగ్య సమస్యలు. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. ఫిబ్రవరి: వ్యాపారం లాభ దాయకంగా ఉంటుంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యవహార ప్రతిబంధకాలు ఉంటాయి. ఉద్యోగులు ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నం సఫలం అవుతుంది. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఫలితాలుంటాయి. మార్చి : ఈ నెల ఎక్కువ శుభపరిణామాలు జరుగుతాయి. అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. నూతన పరిచయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. విష్ణు ఆరాధన శ్రేయస్కరం. కుంభ రాశి ఆదాయం–14, వ్యయం–14, రాజయోగం–6, అవమానం–1 ధనిష్ఠ 3,4 పాదములు (గుూ, గే) శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు) పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా) గురువు మే 1 వరకు మేషం (తృతీయం)లోను తదుపరి వృషభం (చతుర్థం)లోనూ సంచరిస్తారు. శని కుంభం (జన్మం)లోను రాహువు మీనం (ద్వితీయం)లోను కేతువు (అష్టమం)లోను సంచరిస్తారు. రోజూవారీ కార్యక్రమాలలో ఆలస్యం బాగా చోటు చేసుకుంటుంది. ఏలినాటి శని వలన సహజంగా ఉండే ఇబ్బందులు ఉంటాయి. కానీ భయభ్రాంతులను చేసే స్థాయి కాదు అని గమనించాలి. ప్రతిపనీ రెండవసారి, మూడవసారి ఓర్పుగా వెంబడిస్తే లాభిస్తుంది. ఇది మీరు ప్రత్యక్షంగా గమనించవచ్చు. ప్రాకృత ధర్మంలో ఉన్న వారికి సమస్యలు రావు. వేరే మార్గంలో మీ ప్రవృత్తిని మార్పు చేసుకొనేవారు మాత్రమే ఇబ్బంది పొందుతారు. శని ఆలస్యం చేస్తాడు కానీ పనులు పాడు చేయడు. ఇది నిజం. ఉద్యోగ విషయాలలో భయపడవద్దు. మార్పు తీసుకోవద్దు. వృత్తి మార్పుకు ఇది మంచి కాలం కాదు. చేస్తున్న ఉద్యోగంలో ఉంటూ కొత్త ఉద్యోగ అన్వేషణ చేయండి. ఇబ్బంది ఉండదు. చేస్తున్నది మానేసి కొత్త ప్రయత్నం చేస్తే అది వికటిస్తుంది. చేస్తున్న పనిలో సరైన గుర్తింపు రాలేదని బాధపడవద్దు. స్థానచలన ప్రయత్నాలు స్వయంగా సమీక్షించుకోకపోతే మీకు సానుకూలత లేని ప్రదేశం చేరుకోవలసి ఉంటుంది. వ్యాపారంలో లాభాలు తక్కువ స్థాయి ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే బంధువులతో కలహాలు రాకుండా జాగ్రత్తపడండి. తరచుగా శుభవార్తలు వింటుంటారు. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా ఇబ్బందులు రాగలవు. అలాగే మీ పిల్లల ద్వారా మీకు ఉన్న ఆశలు, కోరికలు సరిగా పూర్తి అవకపోవడం చేత కొంచెం మానసికంగా చికాకులు ఉంటాయి. మీ ముఖంలో తేజస్సు తగ్గే అవకాశం ఉంటుంది. మీ వాక్కులు బాగా కఠినంగా వస్తుంటాయి. నియంత్రించండి. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ధనం వృథాగా ఖర్చు చేసే సందర్భాలు ఎన్నోసార్లు వస్తుంటాయి. ఆదాయం సమయానికి తగిన విధంగా అందకపోవచ్చు. ఆదాయం అందుతుంది. అయితే ఆలస్యంగా అందుతుంది. ఋణాలు కూడా అవసరానికి తగిన రీతిగా సమయానికి అందవు. మీరు ఆర్థిక విషయాలలో ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. మీరు వాగ్దానాలను, హామీలను నెరవేర్చలేరు. వాహన ఖర్చులు అధికం అవుతాయి. ఆరోగ్య విషయంగా, పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టే అవకాశాలు ఉన్నాయి. నరాలు, చర్మం, ఎముకలు, గుండెజబ్బులు వంటి పాత ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది ఉంటుంది. కొత్త సమస్యలు కూడా రాగలవు. ఈ రాశికి చెందిన స్త్రీలకు తరచుగా ఆలోచనలు స్థిరత్వం కోల్పోయే సందర్భాలు ఎన్నో ఉంటాయి. తద్వారా కుటుంబ విషయాలకు ఉద్యోగ విషయాలకు సమన్యాయం చేయలేని స్థితిలో ఉంటారు. జాగ్రత్తపడండి. గర్భిణీ స్త్రీల విషయమై జాగ్రత్తలు చాలా అవసరం. వైద్య సలహాలు చాలా బాగా అనుసరించవలసి ఉంటుది. షేర్ వ్యాపారులకు స్థిరబుద్ధి అవసరం. ఇతరులతో పోలిక, ఇతరుల సూచనలు తీసుకున్నా మీ బుద్ధినే వాడండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు మందగిస్తాయి. ఒకటి లేదా రెండు సార్లు కూడా వైఫల్యం రావచ్చును. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఎవరినీ నమ్మి ఏ పనులు చేయవద్దని సూచన. కార్య సాఫల్యం తక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి బహు జాగ్రత్తలు అవసరం. స్వబుద్ధి వికాసం ఈ విషయంలో అవసరం. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. బుద్ధి స్థిరం కోల్పోవు అవకాశాలు ఉన్నాయి. అయితే మంచి ఫలితాలు ఉంటాయి. రైతుల విషయంలో మే తరువాత గురువు అనుకూలమే కాబట్టి పంటలకు ఇబ్బంది రాదని అనుకోండి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 వారు తొందరపాటు ధోరణితో చికాకులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపార, ఋణ వ్యవహారాలను ఓర్పుగా నిర్వహించండి. శతభిష నక్షత్రం వారు ఆరోగ్యపరంగా జాగ్రత్త పడవలసిన కాలం. విద్యార్థులు మందగొడిగా అధ్యయనం సాగిస్తుంటారు. శుభకార్యాల పనులు వేగంగా సాగుతాయి. పూర్వాభాద్ర నక్షత్రం 1,2,3 వారు పరిధి దాటి ఋణాలు చేసి స్థిరాస్తి కొనుగోలు చేయు స్థితి ఉంటుంది. తరచుగా సంఘంలో పెద్దలను కలుసుకుంటారు. ఖర్చులు అదుపు తప్పుతాయి. శాంతి మార్గం: రోజూ ఆంజనేయుని దేవాలయంలో ‘శ్రీరామశ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయండి. శని, గురువులకు జపం దానం చేయండి. గోపూజ చేయడం శ్రేయస్కరం. ఏప్రిల్: పనులు శరవేగంగా పూరవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉన్నతాధికారులను సందర్శిస్తారు. బదిలీలు అనుకూలిస్తాయి. వ్యాపారం బాగుంటుంది. బంధు మిత్రులతో జాగ్రత్త అవసరం. విష్ణు ఆరాధన మంచిది. 15వ తేదీ తరువాత అనుకూలంగా ఉంటుంది. దూరప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆరోగ్య రక్షణ మీద దృష్టి ఉంచుతారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. షేర్ వ్యాపారులు, రైతులు, మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతారు. మే: ఈనెల ప్రతి విషయం ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం మంచిది. బంధువర్గంతో విభేదాలు. చివరి వారం మంచి వార్తలు వింటారు. మీ కృషికి తగిన గౌరవం లభించదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు వ్యాపార పెట్టుబడులు, నూతన వాహనాల కొనుగోలుకు సమయం అనుకూలము కాదు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్, వ్యాపారులకు, విద్యార్థులకు చివరి వారం అనుకూలం. జూన్: ఈ నెల అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా చేయగలరు. ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు సర్దుకుంటాయి. స్థిరాస్తి వ్యవహారం అనుకూలిస్తుంది. ద్వితీయార్ధంలో కొన్ని అడ్డంకులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో మాట సరిపడని పరిస్థితి ఉంటుంది. శతభిషా నక్షత్రం వారికి అవమానకర ఘటనలు ఎదురవుతాయి. షేర్, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు సమస్యలను అధిగమిస్తారు. జులై: ఈ నెల ప్రథమార్ధంలో ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకం. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఋణ సమస్యలు తగ్గుతాయి. ద్వితీయార్ధంలో నిందలపాలవుతారు. నవగ్రహ ఆరాధన మంచిది. ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు అధిక జాగ్రత్తలు పాటించాలి. రైతులు, విద్యార్థులకు అనుకూలత తక్కువ. ఆగస్ట్: దాంపత్యంలో అన్యోన్యత తగ్గుతుంది. ఇంటా బయట చికాకులు. వ్యర్థ ప్రయాణాల వలన శారీరక శ్రమ, ప్రయోజనం శూన్యంగా ఉంటుంది. నవగ్రహారాధన శుభప్రదం. వృత్తిలో అధికారుల ఒత్తిడి ఉంటుంది. ఋణ, ఆరోగ్య, ప్రయాణ విషయాలలో జాగ్రత్త అవసరం. వస్తువులు చౌర్యానికి గురవుతాయి. సెప్టెంబర్: ఈ నెల కొంత ఒదిగి ఉండటం మేలు. ఖర్చులు నియంత్రించుకోవాలి. ఒక శుభం జరుగుతుంది. శివ–సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది. షేర్ వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు, రైతులకు అనుకూలత లేదు. ఋణ, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల వలన ఇబ్బంది ఉంటుంది. అక్టోబర్: పనులకు ఆటంకాలు వచ్చినా, వాటిని అధిగమిస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయమై జాగ్రత్తలు అవసరం. శతభిషా నక్షత్రం వారు కొన్ని సందర్భాలలో తెలివిగా ప్రదర్శించి విజయాలు అందుకుంటారు. ధనం సర్దుబాటు ఇబ్బందికరమైనా, ప్రతి పనికీ ధనం సాధించుకుంటారు. షేర్ వ్యాపారులకు సాధారణ ఫలితాలు. ఫైనాన్స్ వ్యాపారులకు, రైతులకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నవంబర్: ఈ నెల అంతా అనుకూలమే. సమస్యలు తొలగుతాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు. రాజకీయవేత్తలకు ఉన్నత పదవులు. శత్రుబాధలు తొలగుతాయి. అవసరానికి తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. దూరప్రాంత ప్రయాణాలు అధికంగా చేస్తారు. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులకు మంచి ఫలితాలు. డిసెంబర్: ఇంటా బయటా అన్నింటా కార్యజయం. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. విశేష అధికారయోగం. ఆదాయం పెరుగుతుంది. పనులు వేగంగా పూర్తవుతాయి. భూ– వస్తు– వాహన– ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వాహనాలతో జాగ్రత్త అవసరం. ఆటోమొబైల్ రంగం వారికి చికాకులు వస్తుంటాయి. వ్యాపారాలు మందగమనమే అయినా, అనుకున్న లాభాలు ఉంటాయి. విద్యార్థులకు అనుకూలం. షేర్ వ్యాపారులు తొందరపాటు విడనాడాలి. జనవరి: తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తిలో విశేష గౌరవం. ఆరోగ్యం అనుకూలం. వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్త్ర– ఆభరణ– గృహలాభం ఉంది. కొత్త ప్రయోగాలు చేస్తారు. విదేశీ ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి ప్రయత్నాలను తెలివిగా సానుకూలం చేసుకుంటారు. విద్యార్థులకు, రైతులకు అనుకూలం. ఫిబ్రవరి: కుటుంబంలో అందరూ ఉన్నతస్థానంలో ఉంటారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి. తరచు ప్రయాణాలవల్ల శారీరకశ్రమ. మోసపూరిత వాతావరణం ఉంటుంది. విష్ణు స్తోత్ర పారాయణ మంచిది. 19వ తేదీ నుంచి ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. పిల్లల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తారు. పెద్దల ఆరోగ్య పరిరక్షణ మీద దృష్టి ఉంచుతారు. షేర్, ఫైనాన్స్ వ్యాపారులకు, విద్యార్థులకు విశేష ఫలితాలు. విదేశీ ప్రయత్నాలకు సానుకూలం. మార్చి: శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం అభివృద్ధి చూసి ఆనందిస్తారు. వ్యాపారం మిశ్రమంగా సాగుతుంది. శివారాధన మంగళప్రదం. మీన రాశి ఆదాయం–11 , వ్యయం–5 , రాజయోగం–2 , అవమానం–4 పూర్వాభాద్ర 4 వ పాదము (ది) ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా) రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి) గురువు మే 1 వరకు మేషం (ద్వితీయం)లోను తదుపరి వృషభం (తృతీయం)లోను సంచరిస్తారు. శని కుంభం (వ్యయం)లోను రాహువు మీనం (జన్మం)లోను కేతువు (సప్తమం)లోను సంచరిస్తారు. రోజు వారీ కార్యక్రమాలలో సరైన నిర్ణయాలు చేయలేక ఇబ్బందికి గురవుతుంటారు. గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా ఉండేలాగా మీ నడవడికను సరిచేసుకోండి. కొన్నిసార్లు దుర్మార్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టగలరు. జాగ్రత్తపడండి. రోజువారీ భోజనం విషయంలో కూడా మీకు సమయపాలన, సంతుష్టి ఉండవు. ప్రతిరోజూ చేయవలసిన పని వదిలి దూరంగా వెళ్ళాలి అనే కోరిక బాగా పెరుగుతుంది. నిత్య కర్మలను వాయిదా వేయవద్దు. ఏలినాటి శని ప్రథమ భాగంలో ఉన్నది. అయితే జన్మ రాహువు కూడా ఇబ్బందికరమే. ప్రతిపనీ శ్రమయుక్తమే. ఉద్యోగ విషయాలలో పని మీద ఉత్సాహం కలగక సరిగా పనిచేయరు. మీరు కుటుంబం, ఉద్యోగం తప్ప మరి ఏ ఇతర విషయాలకూ ప్రాధాన్యమివ్వ వద్దు. గుర్తింపు లేకుండా కాలక్షేపం చేయవలసి వస్తుంది. అయినా ఓర్పు వహించండి. ప్రమోషన్ అందడం కష్టసాధనం. మీరు సరైన జాగ్రత్తలు పాటింపకపోతే అయిష్టమైన స్థానానికి స్థానచలనం కలుగుతుంది. కొన్నిసార్లు వ్యాపారులకు అనవసర విషయాల ద్వారా, అధికారుల ద్వారా, గుమస్తాల ద్వారా ప్రతికూల స్థితులు రాగలవు. మైత్రీభావం ప్రదర్శించండి. కుటుంబ విషయాలు చూస్తే ఎవరితోనూ మీకు మాట కలవదు. వీలయినంతవరకు మౌనం పాటించండి. బంధువుల విషయంగా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా చాలా జాగ్రత్తలు పాటించండి. పిల్లల అభివృద్ధి విషయంలో అసంతృప్తి తప్పనిసరిగా ఉంటుంది. అయితే మీ జాగ్రత్తల వలన మీరు అన్ని రకాల సమస్యలు దాటగలరు. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే తరుచుగా అవసరానికి డబ్బులు సర్దుబాటు కాని సందర్భాలు ఎన్నో ఉంటాయి. పాత ఋణాలు విషయంగా హామీ నెరవేర్చలేరు. కొత్త ఋణాలు అవసరానికి అందవు. చాలా విచిత్ర స్థితి ఒక్కసారిగా ప్రారంభం అవడంతో మీరు కూడా అయోమయంలో ఉంటారు. మీ దగ్గర డబ్బులు తీసుకున్నవారు సమయానికి తీర్చరు. ఖర్చులు నియంత్రించిన వారికి మంచి కాలం. ఆరోగ్య విషయంగా పాత సమస్యలు తిరగపెట్టే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తలు పాటించవలసిన కాలం. వైద్య సలహాలు బాగా పాటించండి. ఆరోగ్యవంతులు కూడా ప్రతిరోజూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకు ఏదో తెలియని చికాకులు తరచుగా వస్తుంటాయి. ఈ సంవత్సరం మీరు కుటుంబ, ఉద్యోగ, వ్యాపార విషయాలలో సమన్యాయం పాటించక ఇబ్బందులు పడతారు. గర్భిణీ స్త్రీల విషయమై బహు జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు క్రమం తప్పకుండా పాటించండి. షేర్ వ్యాపారులకు మంచి వ్యాపారం చేయలేకపోగా అనవసర సమయంలో పెట్టుబడులు పెడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో వున్నవారికి పనులు సరిగా కావు. అందుకోసం చింతించనవసరం లేదు. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి అన్ని పనులూ చికాకులు సృష్టిస్తాయి. ఎవరూ సరిగా సహకరించరు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి మోసపూరిత వాతావరణం ప్రతి అంశంలోనూ ఎదురవుతుంది. విద్యార్థులకు చాలా విచిత్ర స్థితి ఉంటుంది. రాబోవు మూడు సంవత్సరాలు మీరు స్థిరబుద్ధిని బాగా ప్రదర్శించాలి. రైతుల విషయంలో కృషి సరిగా చేయకపోవడం, తప్పుడు సలహాలు అందడం వంటివి తరచుగా ఉంటాయి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ వారు మానసిక ఒత్తిడికి లోనవుతారు. పనులు మందగమనంగా ఉంటాయి. కిందస్థాయి వారితో వృత్తి నష్టాలు వస్తుంటాయి. ఉద్యోగ వ్యాపార శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఉద్యోగ వ్యాపారాలలో పనులు ఆలస్యమైనా, లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో కొత్త ప్రయోగాలకు మంచికాలం కాదు. రేవతి నక్షత్రం వారు గృహ, వ్యాపార నిర్వహణలలో పనివాళ్ల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. వృత్తి విషయాలలో అధికారుల సహకారం తక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. శాంతి మార్గం: శని, రాహు, గురువులకు తరచుగా శాంతి చేయించడం మంచిది. రోజూ ప్రాతఃకాలంలో ఆంజనేయస్వామికి ‘శ్రీరామశ్శరణం మమ’ అని, సాయం సమయంలో శివాలయంలో ‘శ్రీమాత్రే నమః’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఏప్రిల్: ఈ నెల ఆర్థిక సమస్యల వలన మానసిక ఒత్తిడి. ఋణం చేయవలసి వస్తుంది. పనులు ఎంత శ్రద్ధగా చేసినా, ఆశించిన ప్రతిఫలం ఉండదు. ఉద్యోగంలో పైఅధికారులతో సమస్యలు వస్తాయి. మీ పనులలో ఇతరుల ప్రమేయం వలన సమస్యలు వస్తాయి. శారీరక మానసిక ఒత్తిడి తప్పదు. మే: పనిలో నేర్పు ప్రదర్శిస్తారు. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. సమస్యలను పట్టుదలతో పరిష్కరిస్తారు. ధనలాభం ఉంది. ఆరోగ్యం కొంత ఇబ్బందికరం. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన శుభప్రదం. షేర్ వ్యాపారులు లాభాలు అందుకోలేరు. విద్యార్థులకు, రైతులకు, మార్కెటింగ్ ఉద్యోగులకు రాబోవు సంవత్సర కాలం అధిక జాగ్రత్తలు అవసరం. జూన్: ఆర్థిక విషయాలలో క్రమశిక్షణ అవసరం, అభిప్రాయ భేదాల వల్ల మనస్తాపం ప్రయాణాలవల్ల అలసట. పెద్దల అనుగ్రహంతో పనులు పూర్తవుతాయి. షేర్, ఫైనాన్స్, వ్యాపారాలలో చిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. విద్యార్థులకు, రైతులకు చికాకులు తప్పవు. షేర్ వ్యాపారులకు అనుకూలం. నూతన వ్యాపార ప్రయత్నాలలో విఘ్నాలు ఉంటాయి. జులై: కుటుంబ సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. పట్టుదలతో పెద్దపనులు పూర్తిచేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఉద్యోగంలో రాణిస్తారు. భూ–వాహన–స్థిరాస్తి లాభం. ఇష్ట దైవారాధన శుభప్రదం. ధనం సర్దుబాటు కాకున్నా, కొన్ని పనులు వేగంగా సాగుతాయి. 16వ తేదీ తరువాత సానుకూలం. మాసాంతంలో కార్య విజయం. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు కాలం సామాన్యం. ఆగస్ట్: కాలం అనుకూలం. ఉద్యోగంలో శత్రు బాధలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. ప్రయాణాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఋణ రోగ సమస్యలు తగ్గుతాయి. స్త్రీలతో వివాదాలకు దూరంగా ఉండండి. కుటుంబ విషయాలలో మొండి వైఖరితో సమస్యలు పెంచుకుంటారు. వృత్తి విషయాలలో కోపావేశములతో కొన్నిసార్లు ఇబ్బంది పొందుతారు. షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. సెప్టెంబర్: ఈనెల గ్రహానుకూలత తక్కువ. ఎదుటివారి విషయాలకన్నా స్వవిషంపై శ్రద్ధ వహించడం శ్రేయస్కరం. ఉద్యోగ బదిలీలు అనుకూలం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగవు. నూతన వాహన కొనుగోలు ఆలోచనలు విరమించండి. షేర్ వ్యాపారులకు అనుకూలం కాదు. విద్యార్థులకు, రైతులకు కాలం సరిగా లేదు. అక్టోబర్: మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పెరుగుతాయి. ఇంట్లో స్త్రీలకు ఆరోగ్య ఇబ్బందులు. కుజ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల శుభం కలుగుతుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. షేర్ వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు. రైతులకు, మార్కెటింగ్ వ్యాపారులకు అనుకూలం కాదు. ధనం వెసులుబాటు జరగదు. నవంబర్: ఇంటా బయటా మీమాటకు విలువ తగ్గును. ఏపనికైనా పలుమార్లు చెప్పవలసి వచ్చును. పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో సమస్యల పట్ల ఆందోళన చెందక నేర్పుతో వ్యవహరిస్తారు. పిల్లల నుంచి సహకారం తక్కువ. ఉద్యోగ కుటుంబ వ్యవహారాల నిర్వహణలో సరైన దృష్టి ఉంచలేరు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలం. డిసెంబర్: ఉద్యోగంలో పెనుమార్పులు మీకు అనుకూలిస్తాయి. ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. రాజకీయవేత్తలకు మంచి అవకాశాలు లభిస్తాయి. శివ దర్శనం శుభప్రదం. మీ ఆరోగ్యం అనుకూలమే కానీ మానసిక స్థితి కొంచెం ఇబ్బందికరం. విద్యార్థులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. రైతులకు, షేర్ వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వేగం అవుతాయి. జనవరి: వృత్తిలో రాణిస్తారు. వ్యాపారం లాభదాయకం. రాజకీయవేత్తలు ప్రజల మన్ననలు పొందుతారు. అధికారయోగం ఉంది. శత్రుబాధల నుంచి విముక్తి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఉద్యోగ, వ్యాపారాలలో మీ స్థిరత్వానికి ఇబ్బంది రాకుండా జాగ్రత్తపడండి.విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు సహకారం తక్కువ. ఫిబ్రవరి: తీర్థయాత్రలు చేస్తారు. సత్సాంగత్యం వలన లబ్ధి పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతోషాన్ని కలిగిస్తాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదైవ ధ్యానం శుభకరం. పెద్దల ఆరోగ్యం, పిల్లల అభివృద్ధి విషయంలో ఆనందకరమైన పరిస్థితులు ఉంటాయి. ఋణాలు అవసరానికి అందుతాయి. పాత ఋణ సమస్యలను తెలివిగా అధిగమిస్తారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు అనుకూలం. మార్చి: ఎన్ని సమస్యలు ఉన్నా, ఓర్పుతో వ్యవహరిస్తారు. కుటుంబ సహకారంతో పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగ బదిలీల వల్ల అలసట, శారీరక శ్రమ ఉంటాయి. ఆర్ధిక విషయాలలో ఇతరులపై ఆధారపడవద్దు. మోసపూరిత పరిస్థితులు ఉంటాయి. -
బిగ్ ‘సి’ ఉగాది ప్రత్యేక ఆఫర్లు
హైదరాబాద్: మొబైల్స్ విక్రయ సంస్థ బిగ్ ‘సి’ ఉగాది సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఏసీల కొనుగోలుపై 7.50% వరకు తక్షణ తగ్గింపు అందిస్తుంది. ఎలాంటి వడ్డీ, డౌన్‌పేమెంట్ లేకుండా సులభ వాయిదాల పద్ధతిలో వీటిని కొనుగోలు చేయవచ్చు. మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతితో పాటు సంవత్సరం పూర్తిగా, రెండో ఏటా రూ.8వేల వరకు ‘మొబైల్ ప్రొటెక్షన్’ అదనంగా పొందవచ్చు. బ్రాండెడ్ ఉపకరణాలపై 51% వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రజలంతా ఉగాది ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకోవాలని సంస్థ సీఎండీ బాలు చౌదరి కోరారు. -
Ugadi 2024: కవి పలికిన ఉగాది
చిన్నప్పుడు వీధిబడిలో చదివిన పిల్లలకు తెలుగు ఋతువులు, వాటి ధర్మాలు నోటి మీద వుంటాయ్. సాయంత్రం పూట అన్ని తరగతుల్ని ఒకచోట మళ్లేసి, చైత్ర వైశాఖాలు, ప్రభవ విభవలు చెప్పించేవారు. అందులో జ్ఞాపకమే – ‘చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, చెట్లు చిగిర్చి, పూలు పూయును’ అనే మాటలు. తెలుగు నెలల్లో ఫాల్గుణం పన్నెండోది. చైత్రం మొదటిది. మొదటి నెల మొదటి రోజునే ఉగాది అని, యుగాది అని అన్నారు. ప్రాచీన సాహిత్యంలో వసంత శోభలు వెల్లివిరుస్తాయి గాని, ఉగాది పండుగ ప్రస్తావనలు రావు. కవులు ప్రకృతిని అక్షరాలలో నిక్షిప్తం చేయడానికి తమ శక్తి సామర్ధ్యాలను ధారపోశారు. కొత్త చిగుళ్లతో పొటమరించే మొగ్గలలో ప్రతి చెట్టూ దీప స్తంభమై వెలుగుతుంది. కవిత్రయ కవి ఎర్రన – ‘ఎందున పుష్పసౌరభమే ఎందును మంద మాదాలిఝంకృతుల్ ఎందును సాంద్ర పల్లవము లెందునుకోకిల కంఠ కూజితం’ అని వర్ణించాడు. ఋతు సంహార కావ్యంలో కాళిదాసు: పుంస్కోకిలః చూత రసాస వేన మత్తః ప్రియాం చుమ్బతి రాగహృష్ణః అన్నారు. ఎవరే భాషలో అన్నా కోయిలలు, తుమ్మెదలు శృంగార క్రీడలో మునిగి తేలుతున్నాయనే కవి హృదయం. ఉగాది అనగానే గుర్తొచ్చేది పంచాంగాలు, అందులో మన కందాయ ఫలాలు, సంవత్సర ఫలితాలు. భవిష్యత్తు గురించి తెల్సుకోవడంలో ఎవరికైనా వుత్సుకత, వుత్సాహం వుంటుంది. షడ్రుచుల ఉగాది ప్రసాదం తర్వాత పంచాంగ శ్రవణం యీ రెండే ప్రస్తావనకి వస్తాయి. ఆరు రుచులకు ఆరు స్వారస్యాలు చెబుతారు. ఆరోగ్య రహస్యాలు వివరిస్తారు. ఊగిపోయే చెరకు తోటలు ఊహల్లో తీపి నింపుకోమంటాయ్. విరబూసిన వేపపూతలు పచ్చి నిజాల్లోని చేదుని గ్రహించ మంటున్నాయ్. ఈ తరుణంలో లేచిగుళ్లు తింటూ పచ్చని చెట్టుకొమ్మల్లోంచి కోయిల మధుర మధురంగా పాడుతుంది. కొండా కోనా కూహూ రావాలతో ప్రతిధ్వనిస్తాయి. మనం రెట్టిస్తే ‘కూహూ’ అని మరింత ధాటిగా కోయిల జవాబిస్తుంది. కవులు వసంత వర్ణనల్లో కోయిలకు అగ్రస్థానం యిచ్చారు. కోయిల స్వరానికి తిరుగులేని స్థాయి వుంది. అందుకని కవికోకిలలుగా వ్యవహారంలోకి వచ్చారు. వీణ చిట్టిబాబు కోయిలని అద్భుతంగా పలికించేవారు. అయితే, శ్రోతల్ని వూరించేవారు. ఇంత గొప్ప గౌరవం ఇచ్చినందుకు మనం వసంత రుతువులో గళం విప్పకపోతే ఏమాత్రం మర్యాదకాదని కవులు ఉగాదికి కవితలల్లడం మొదలుపెట్టారు. అది క్రమంగా ఆచారంగా మారింది. ఆకాశవాణిలో ఉగాది కవిసమ్మేళనం ఉండి తీరాల్సిందే. దువ్వూరి రామిరెడ్డికి, గుర్రం జాషువాకి ‘కవి కోకిల’ బిరుదు ఉంది. హేమా హేమీలతో వాసిగల కవులందరితో కావ్యగోష్ఠి జరుగుతోంది. విశ్వనాథ, జాషువా, కాటూరి ప్రభృతులున్నారు. ‘నిర్వాహకులు ఇక్కడ గుర్రాన్ని గాడిదని ఒక గాటన కట్టేశారు’ అన్నారట విశ్వనాథ ప్రారంభోపన్యాసంలో. ‘నాకూ అదే అనిపిస్తోంది’ అన్నారు గుర్రం జాషువా. అంతరార్థం తెలిసిన సభ చప్పట్లతో మార్మోగింది. బెజవాడ ఆకాశవాణి కేంద్రంలో ఉగాది కవి సమ్మేళనం ఆహూతుల సమక్షంలో జరుగుతోంది. సంగీత సాహిత్యాల మేలు కలయిక. బాలాంత్రపు రజనీకాంతరావు నాటి స్టేషన్ డైరెక్టర్. పేరున్న కవులంతా నాటి సమ్మేళనంలో ఉన్నారు. సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావుకి అధ్యక్షపీఠం కట్టబెట్టారు. విశ్వనాథ గురించి మాట్లాడుతూ నార్ల ‘నాకూ వారికీ అభిప్రాయ భేదాలున్నప్పటికీ ప్రతిభ విషయంలో నాకెప్పుడూ గౌరవమే’ అన్నారు. ప్రేక్షక శ్రోతల్లో వొదిగి కూర్చున్న రజనీకి గుండెల్లో రాయి పడింది. విశ్వనాథ మైకు ముందుకొస్తే ఏదో అనకమానడు, రచ్చరచ్చ అవుతుందని భయపడుతున్నారు. విశ్వనాథ వంతు రానే వచ్చింది. ‘మిత్రుడు నార్ల అభిప్రాయ భేదాలున్నప్పటికీ అన్నాడు. మాకు సొంత అభిప్రాయాలు ఏడిస్తే అప్పుడూ భేదాలుండేవి. ఆయన కారల్ మార్క్స్ అభిప్రాయాలు పట్టుకు వేలాడుతున్నాడు, నేను శంకరాచార్యని పట్టుకు అఘోరిస్తున్నా’ అనగానే సభ నిలబడి కరతాళ ధ్వనులు చేసింది. ఒక్కసారి ప్రాచీనుల్ని పరామర్శిస్తే ఆదికవి నన్నయ్య భారతం ఆదిపర్వంలో వసంతకాలాన్ని వర్ణిస్తూ ఎన్నో పద్యాలు చెప్పాడు. వసు చరిత్రలో రామరాజ భూషణుడి పద్యాలు లయాత్మకంగా ఉంటాయని చెబుతారు. వసంత వర్తనలో–‘లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనాభిగాభంగ దోప్రసంగ మలయానిల విలోలదళ సాసవరసాల ఫలసాదర’ అని సాగే ఈ పద్యాన్ని వీణ మీద వాయించగా విన్నవారున్నారు. జానపదుల జీవన స్రవంతిలో ఉగాది ఉన్నట్టు లేదు. ఎక్కడా మన సామెతల్లో ఈ పండగ ప్రసక్తి కనిపించదు, వినిపించదు. సంకురాత్రి, శివరాత్రి సామెతల్లో కనిపిస్తాయ్. పూర్వం గ్రామ పురోహితుడు ఈ పండగనాడు వేప పూత ప్రసాదం ఇంటింటా పంచేవాడు. వారు ధనధాన్యాల రూపంలో చిరుకానుకలు సమర్పించేవారు. ఉగాదినాడు వ్యక్తులవే కాదు దేశాల రాష్ట్రాల జాతకాలు కూడా పంచాంగం ద్వారా పండితులు నిర్ధారిస్తారు. ‘ఖగోళంలో కూడా క్యాబినెట్ ఉంటుందండీ. సస్యాధిపతిగా ఫలానా గ్రహం వుంటే పంటలు బాగుంటాయి. అలాగే వర్షాలకి హర్షాలకి అధిపతులుంటారు. పంచాంగమంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలే కాదు చోర అగ్ని యుద్ధ ప్రమాదాల్ని కూడా ఢంకా బజాయించి చెబుతాయ్’ అంటారు పంచాంగవేత్తలు. ఆ ఢంకా సంగతి అట్లా వుంచితే, ప్రస్తుత కాలంలో మాత్రం పంచాంగాల్ని బహుముఖంగా ప్రదర్శింపచేస్తున్నారు. ఏ పార్టీ కార్యాలయానికి వెళితే ఆ పార్టీకి అనువుగా పంచాంగ ఫలితాలుంటాయి! పార్టీ అధినాయకులు కూడా చక్కగా సమయానికి తగుమాటలాడే వారినే పిలిచి పీట వేస్తారు. పంచాంగం మీద పట్టు కంటే లౌకికజ్ఞానం ప్రధానం. పేరులో విళంబి వుంది కాబట్టి నిదానంగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గోష్ఠిలా సాగుతుందని అనకోవద్దు. కాలానికి ఒక వేగం వుంటుంది. అది చచ్చినా మారదు. తెలుగు సంవత్సరాల పేర్లకి వాటి లక్షణాలకి మాత్రం సంబంధం లేదు. ఈ మధ్య కొత్త సంవత్సరమంటే ఉగాది మాత్రమేనని, జనవరి ఒకటి కానేకాదని ఒక సిద్ధాంతం లేవనెత్తారు. ముఖ్యంగా దేవాలయాలు తెలుగుకి కట్టుబడి వుండాలన్నారు. ఉన్న సమస్యలకి కొత్తవి తగిలించుకోవడమంటే యిదే! మన ఆడపడుచులు పుట్టినరోజుని ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అత్తారింటోనూ, తెలుగు లెక్కన పుట్టింట్లోనూ జరుపుకుంటున్నారు. అన్నీ డబల్ డబల్... ఆనందం కూడా డబల్. జీవితాన్ని సాల్వా దాళ్వాలతో పండించు కోవడమంటే యిదే. ఒక పెద్దాయన దగ్గర ఉగాది ప్రస్తావన తెస్తే, మాకు మార్చిలో బోనస్‌లు వచ్చేవి. సంవత్సరాదీ అప్పుడే వచ్చేది. ఇప్పుడే వుంది, మార్చి వచ్చిందంటే, ఐ.టి.రిటర్న్స్ దిగులు తప్ప అన్నాడు. ఇంకో సీనియర్ సిటిజెన్ ఆ నాటి ఆంధ్రవారపత్రిక ఉగాది సంచికల్ని తల్చుకున్నాడు. ‘కునేగా మరి కొళుందు’ సెంటు కొట్టుకుని ఘుమ ఘుమలతో వచ్చేది. ఇప్పుడు ఏ పరిమళమూ లేదని చప్పరించేశాడు. ‘మీకు తెలియదండీ, విజయవాడ రేడియో కవి సమ్మేళనలో అద్భుతమైన కవితలు వినిపించేవి. ఓ సంవత్సరం ఆరుద్ర, వేదంలా ప్రవహించే గోదావరి/ వెన్నెల వలె విహరించే కృష్ణవేణి అంటూ కవిత చదివారు. ఆ తర్వాత పాతికేళ్లకి ‘ఆంధ్ర కేసరి’ సినిమాకి పాట రాస్తూ వేదంలా ఘోషించే గోదావరి/ అమరధామంలా వెలుగొందే రాజమహేంద్రి అని రాశారు. నేను చెన్నపట్నం ఆరుద్ర ఫోన్ నెంబర్ తీసుకుని చేశా. మీరప్పుడు చదివిందే యిప్పుడు మళ్ళీ రాశారని నిలదీశా. ఆరుద్ర స్టన్ అయిపోయి మీకున్నంత జ్ఞాపకశక్తి నాకు లేకపోయింది. మన్నించండని ఫోన్ పెట్టేశాడు. మనకేంటి భయం?’ అని లోకల్ పొయెట్ నాకు వివరించారు. ఒకళ్లేమో ‘రారా ఉగాదీ’ అనీ, ఇద్దరేమో ‘రావద్దు ఉగాదీ’ అని మొదలుపెడతారు. యీ కవి గోష్ఠులలో ఏదో ఒకటి తేల్చండి పాపం అన్నాడొకాయన అసహనంగా. పిలుపులు రాని కవులకు కొంచెం అలకగానే ఉంటుంది. ఒక్కోసారి యీ అలక కవులంతా ఓ వేదిక మీదకు చేరుతారు. అవి పి.క.సమ్మేళనాలవుతాయ్. ఉగాది నాడు పిలుపొస్తే ఏడాది పొడుగునా మైకు అందుబాటులో ఉంటుందని ఓ నమ్మకం. ‘మాకుగాదులు లేవు, మాకుష్షస్సులు లేవు’ అని కోపం కొద్దీ అన్నారే గాని కృష్ణశాస్త్రి వసంతాన్ని దోసిళ్లకెత్తుకున్నాడు. ‘మావి చిగురు తినగానే.. ’ లాంటి పాటలెన్నో రాశారు. సుఖదుఃఖాలు చిత్రంలో ‘ఇది మల్లెల వేళయనీ, ఇది వెన్నెల మాసమనీ తొందరపడి ఒక కోయిల ముందే కూసిందీ’ పాట హిట్టున్నర హిట్టు. తర్వాత ఎవరో అడిగారట వెన్నెల మాసమేమిటి, వెన్నెల పక్షం ఉంటుంది గాని అని. నేను మల్లెల మాసమనీ, వెన్నెల వేళయనీ రాయాలని మనసులో అనుకున్నా కాని కాయితం మీదకి అలా వచ్చింది అన్నారట. మిగతా సంగతులు ఎట్లా వున్నా ఉగాది మార్కెట్లోకి మల్లెపూలు తీసుకువస్తుంది. వేసవి చెమటల్ని పరిహరిస్తూ మల్లెలు పరిమళిస్తాయ్. ఈ కాలం యువత ఇతర వత్తిళ్లలో పడిపోయి దాంపత్య వత్తిళ్లు మర్చిపోతున్నారు. ఇంటికి వెళ్తూ ధరకి వెరవకుండా రెండుమూరల మల్లె మొగ్గులు తీసికెళ్లండి. ఆ మల్లెవాసనలు వుత్తేజకరమైన ఆలోచనలు పుట్టిస్తాయి. వచ్చిన వసంతాన్ని అందిపుచ్చుకుని ఆనందించాలి గాని జారిపోనీకూడదు. ప్రతీరాత్రి వసంతరాత్రి కావాలని కాంక్షిస్తూ– – శ్రీరమణ (2018లో ఉగాది సందర్భంగా దివంగత రచయిత, కవి శ్రీరమణ అందించిన ప్రత్యేక వ్యాసం ఇది) -
తిరుమలలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (ఫొటోలు)
-
ఆదాయం తక్కువ.. ఖర్చు ఎక్కువ.. ఊరట ఏమిటంటే..
-
అంతా సమానమే..
-
వారు ఆ విషయంలో జాగ్రత్త పాటించాలి
-
అదృష్టాన్ని నమ్ముకోవచ్చు..
-
రాజకీయ నాయకులకు అండదండలు.. కానీ
-
అన్నీ ఎక్కువే..
-
చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో ఉగాది వేడుకలు
-
వేపకు మళ్లీ ‘డై బ్యాక్’ ముప్పు!
ల్లెపల్లెనా, రోడ్ల పక్కన, అడవుల్లో విస్తృతంగా పెరిగే మన వేపచెట్లకు మరోసారి ‘డై బ్యాక్’జబ్బు ముప్పు పొంచి ఉంది. సుమారు మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ‘టీ మస్కిటో’, ఫంగస్ దాడితో తీవ్రంగా దెబ్బతిన్న లక్షలాది వేపచెట్లు ఈ ఏడాది ఉగాది తర్వాత కోలుకుంటున్న క్రమంలో మళ్లీ టీ మస్కిటో దాడి మొదలుపెట్టింది. ఈసారి ఫిబ్రవరి నుంచి అకాల వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ పంజా విసురుతోంది. ఫలితంగా చెట్లన్నీ కొమ్మలతో సహా ఎండి పోవడంతోపాటు ఆకులు రాలిపోతున్నాయి. దీనివల్ల చెట్లకు పోషకాలు అందక క్రమంగా చచ్చిపోతున్నాయి. దీన్నే డై బ్యాక్‌గా పిలుస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ తగ్గనున్న వేప విత్తన దిగుబడి... రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రం కావొచ్చని శాస్త్రేవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెగుళ్లు సోకడం వేపవిత్తనాల దిగుబడి భారీగా తగ్గిందని చెబుతున్నారు. ఈ ఏడాది 50 నుంచి 80% దాకా విత్త నాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని, దీని ప్రభావం వేప ఉత్పత్తులు, నీమ్కేక్స్, నీమ్ ఆయిల్, నీమ్ కోటింగ్‌పై ఆధారపడిన పరిశ్రమలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. డై బ్యాక్ జబ్బును జాతీయ స్థాయిలో దీనిని కట్టడి చేసేందుకు కార్యాచరణను చేపట్టక పోతే భవిష్యత్‌లో వేప ఆధారిత ముడిపదార్థాలను విదేశాల నుంచి దివగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఎదురుకావొచ్చని చెబుతున్నారు. కొనసాగుతున్న పరిశోధనలు.. ఈ సమస్యపై ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫారెస్ట్ కాలేజీ ఆఫ్ రిసెర్చ్ ఇన్స్టి ట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) ఐఐసీటీ, జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విడి విడిగా పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వేపచెట్లకు ఎదురవుతున్న కీటక దాడు లు, చెదలు, ఫంగస్‌లను ఎలా కట్టడి చేయాలనే దాని పై పరిష్కారాలు కనుగునేందుకు కృషి చేస్తున్నాయి. ఎఫ్సీఆర్ఐలో పరి శోధన నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ బి.జగదీశ్‌కుమార్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఫోమోప్సిస్ అజాడిరాచ్టే అనే పాథోజెన్ ద్వారా వేప చెట్లకు ఈ జబ్బు సోకుతున్నట్లు గుర్తించారు. ఈ పాథోజెన్ గాలి ద్వారా సులభంగా వ్యాప్తికి అవకాశం ఉన్నందున వేపచెట్లు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాక వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. రాష్ట్రమంతటా వేప చెట్లు విస్తరించి ఉన్నందున అన్నింటికీ వివిధ రసా యన మిశ్ర మాలతో పిచికారీ చేయడం అసాధ్యంగా మారిందని వివరించారు. అయితే వేపకు బతికే శక్తిసామ ర్థ్యాలు ఎక్కువగా ఉన్నందున పెద్దచెట్లకు అంతగా నష్టం ఉండదని ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా విభాగం రిటైర్డ్ సంచాలకుడు డాక్టర్ ఆర్.జగదీశ్వర్ అభిప్రాయపడ్డారు. కానీ గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు ఎక్కువ కావడంతో వేపచెట్టు నుంచి విత్తనం నేలపై పడి తిరిగి మొలకెత్తడం తగ్గిపోయిందన్నా రు. అందు వల్ల వేప ముడిపదార్థాల ఉత్పత్తి, సరఫరాలో తగ్గుదల కనిపిస్తోందని సాక్షితో మాట్లాడుతూ చెప్పారు. -
తమిళ ఉగాది త్వరలోనే రానుంది
ఉగాది పర్వదినం ఎప్పటికీ ప్రత్యేకమే అని సినీనటి నమిత అన్నారు. వివరాలు.. తమిళ ఉగాది పండగను డిశంబర్ 31గా దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గతంలో మార్చిన విషయం తెలిసిందే. అయితే చాలామంది ఏప్రిల్ 14వ తేదీనే తమిళ ఉగాదిగా జరుపుకుంటున్నారు. మరికొందరు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పటి కుర్రకారు కలల నటి నమిత కూడా డిశంబర్ 31వ తేది తమిళ ఉగాది కాదు అని పేర్కొన్నారు. దక్షిణాది సినీ పరిశ్రమలో గ్లామర్ క్వీన్‌గా వెలిగిన ఈమె తమిళంలో నటుడు విజయ్‌కాంత్‌కు జంటగా ఎంగళ్ అన్న చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. తరువాత సత్యరాజ్, విజయ్, అజిత్, శరత్‌కుమార్ వంటి స్టార్ హీరోలతో జత కట్టి పాపులర్ అయ్యారు. అభిమానులను మచ్చాన్ అంటూ ముద్దుగా సంబోధిస్తూ వారి కలల రాణిగా మారారు. 2017లో తన ప్రేమికుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యారు. ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చిన నమిత అంతకు ముందే రాజకీయరంగ ప్రవేశం చేశారు. భారతీయ జనతా పార్టీలో చేరి ప్రస్తుతం ఆ పార్టీలో కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా ఈమె మంగళవారం ఒక వీడియోను మీడియాకు విడుదల చేశారు. అందులో అందరికీ తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. అదే విధంగా తమిళ ఉగాది డిశంబర్ 31వ తేదీ కాదనీ, ఏప్రిల్ 14నేనని అన్నారు. తమిళ ఉగాది త్వరలోనే రానుందని, మీరంతా కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని సూచించారు. ఈ ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నటి నమిత -
పోస్టర్ చూద్దాం.. ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్
పండగ చేద్దాం.. పోస్టర్ చూద్దాం అన్నట్లు ఉగాది సందర్భంగా బోలెడన్ని కొత్త పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని పోస్టర్లను చూద్దాం. ♦ వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెడికల్ మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోందనే టాక్ వినిపిస్తోంది. ♦ పల్లకి మోస్తున్నారు గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘రామబాణం’. ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమా మే 5న విడుదల కానుంది. ♦ నాగచైతన్య పోలీస్‌గా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘కస్టడీ’. కృతీ శెట్టి హీరోయిన్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న రిలీజవుతుంది. ♦ కల్యాణ్ రామ్ టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సినిమాను అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ♦ ‘మామా మశ్చింద్ర’ చిత్రంలో ట్రిపుల్ క్యారెక్టర్స్ చేస్తున్నారు సుదీర్‌బాబు. దర్శక–నటుడు హర్షవర్థన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో దుర్గ, పరశురామ్, డీజే పాత్రల్లో కనిపిస్తారు సుధీర్‌బాబు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ♦ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న విడుదల కానుంది. ♦ వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘అర్జునదారి గాండీవ’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ♦ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’. 2012 యుగాంతం కాన్సెప్ట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి ముప్పానేని రవీంద్ర బెనర్జీ నిర్మాత. ♦ పోలీసాఫీసర్‌గా కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం ‘మీటర్’. అతుల్యా రవి హీరోయిన్గా నటించారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ల సమర్పణలో చెర్రీ (చిరంజీవి), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ♦ దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం ‘అహింస’. గీతికా తివారి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించారు. పి. కిరణ్ నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ♦ ‘రౌడీబాయ్స్’ ఫేమ్ ఆశిష్ హీరోగా రూపొందుతున్న ద్వితీయ చిత్రం ‘సెల్ఫీష్ ’. ఈ చిత్రానికి విశాల్ కాశి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి సహనిర్మాతలు. ♦ రాయ్ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ సినిమాను రమణ మొగిలి, తిరుపతిరెడ్డి బీరం నిర్మించారు. ‘‘స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న సెక్సువల్ హెరాస్‌మెంట్‌కు చరమగీతం పాడటానికి పోరాడిన ఓ మహిళ కథ ఇది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
శ్రీవారి చెంత వేడుకగా ఉగాది ఆస్థానం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వ్రస్తాలను ధరింపచేసి పంచాంగ శ్రవణం నిర్వహించారు. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తం గా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమలలోని క్యూకాంప్లెక్స్‌లో 2 కంపార్టుమెంట్లు నిండి ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 57,559 మంది స్వామివారిని దర్శించుకుని హుండీలో రూ.4.26 కోట్లు వేశారు. టైం స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో, దర్శన టికెట్లు లేని వారికి 12 గంటల్లో , ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్నవారికి 3 గంటల్లో దర్శనమవుతోంది. ప్రత్యేక ఆకర్షణగా ఫల పుష్పాలంకరణ ఉగాదిని పురస్కరించుకుని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయం లోపల విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం చెంత ఎండు కొబ్బరితో దశావతారాలు, కొబ్బరిపూలతో చేసిన శ్రీలంక ఆర్ట్ అలంకరణలు, పుచ్చకాయలతో ఆకర్షణీయంగా చెక్కిన శ్రీపద్మావతి శ్రీనివాసుల కల్యాణఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయం వెలుపల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని తీసుకెళుతున్న గరుత్మంతుడు అనే ఘట్టాన్ని రూపొందించారు. గొల్ల మండపం పక్కన ఉగాది లక్ష్మీదేవితో శ్రీమహావిష్ణువు, ఉద్యానవనంలో ఆడుకుంటున్న బాలల రూపంలో ఉన్న శ్రీరాముడు హనుమంతుడు, ఉగాది రోజున మామిడి వనంలో కాయలు కోస్తున్న శ్రీకృష్ణుడు, పౌరాణిక ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి న 150 మంది పుష్పాలంకరణ కళాకారులు 3 రోజుల పాటు శ్రమించి ఆకర్షణీయమైన ఫల, పుష్ప ఆకృతులను రూపొందించారు. -
శ్రీస్వామి వారి ఆదాయం 14, వ్యయం 11
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రీశోభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర వేడుకలను బుధవారం ఆచార్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వయంభూలు కొలువైన ప్రధానాలయంలో భక్ష్యా లు తయారు చేసి, షడ్రుచులతో సిద్ధం చేసిన పచ్చడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీస్వామి, అమ్మవార్లకు నివేదించారు. సాయంత్రం ముఖ మండపంలో శ్రీస్వామి వారిని అలంకరించి మాఢ వీధుల్లో సేవోత్సవం జరిపించారు. తూర్పు రాజగోపురం ముందు అధిష్టించి ఆచార్యులు పంచాగ పఠనం చేశారు. యాదాద్రి నృసింహస్వామిది తులా రాశి కాగా ఈ ఏడాది శ్రీస్వామి వారికి 14 ఆదాయం, 11 వ్యయం, శ్రీలక్ష్మీ అమ్మవారిది మేషరాశి కాగా ఆదాయం 5, వ్యయం 5, ఆండాళ్ అమ్మవారిది సింహ రాశి కాగా ఆదాయం 14 వ్యయం 2 ఉన్నట్లు ఆచార్యులు వివరించారు. శ్రీశోభకృత్లో భక్తులతో పాటు ప్రజలంతా ఆనందంగా ఉంటారని ఆచార్యులు వెల్లడించారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తాయని, వడగళ్లు సైతం పడతాయని తెలిపారు. రైతాంగానికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కలసి వచ్చే అంశం అని అన్నారు. వేసవిలో ఎండలు దంచి కొడతాయన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి వైరస్ ప్రజలకు సోకదని తెలిపారు. ఈ వేడుకల్లో ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ముఖ్య అర్చకులు, పండితులు, పురోహితులు పాల్గొన్నారు. -
Telangana: సంవత్సరాంతంలో రాజకీయ ఒడిదుడుకులు
సాక్షి, హైదరాబాద్: ‘ఈ సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఆశ్చర్యకర ఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ పరిణామాలు విపరీతమైన రాజకీయ ఒడిదుడుకులకు కారణమవుతాయి. అక్టోబర్ 31కి రాహువు, కేతు గ్రహాలు మారుతున్నందున.. ఈ ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై ఉంటుంది’అని శృంగేరీ ఆస్థాన పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. అధికార పక్షంలోని కొందరినుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలో అధికారంలోని పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని సూచించారు. ఈ ఏడాది బుధుడు రాజుగా ఉన్నందున.. ఈ పరిణామాలను ప్రభుత్వం నిలువరించగలదన్నారు. సప్తమాధిపతి అయిన గురువు అష్ట్టమంలో మౌఢ్య స్థితిలో ఉన్నందున ప్రతిపక్షాలు తమ ఉనికి కోసం బాగా కష్టపడాల్సి వస్తుందని వెల్లడించారు. శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం ఉదయం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పక్షాన ఈ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగాన్ని పఠించారు. కొన్నేళ్లుగా దేశంలో, రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నా..సామాజిక అశాంతి నెలకొంటుందని వెల్లడించారు. అశాంతి ఏర్పడ్డా, పోలీసు శాఖ సమర్థంగా ఎదుర్కొంటుందన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. ‘గురుడు జలాశయ కారకుడు అయినందున రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండలుగా మారతాయి. కేంద్ర, రాష్ట్రాలు విద్యారంగంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. వర్సిటీల్లోనూ, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో కూడా అక్రమాలకు అవకాశం ఉంది. ఉన్నత న్యాయస్థానాలు కీలక తీర్పులు ఇవ్వబోతున్నాయి. వచ్చే మార్చిలో ప్రకృతి ఉపద్రవాలు, మత ఘర్షణలు, సామాజిక అశాంతికర పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది. బుధుడు భాగ్యమందు మంచి స్థితిలో ఉన్నందున రాష్ట్రంలో సుస్థిర పాలన కొనసాగుతుంది. ధన భాగ్యాధిపతి శుక్రుడు కావటంతో ఆర్థిక రంగం కొంత పురోగమిస్తుంది. కీలక పథకాలను కొనసాగించాలంటే అప్పులు చేయక తప్పని పరిస్థితి. మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తారు. విద్య, వైజ్ఞానిక రంగాల్లో పరిశోధనలు సాగుతాయి. ఏప్రిల్, మే నెలల్లో విపరీతమైన ఎండలు కాసే అవకాశం ఉంది. ఆగస్టు, సెప్టెంబర్లలో భారీ వర్షాలు కురుస్తాయి. మంచి పంటలు పండుతాయి. గురు, శుక్ర మౌఢ్యాలు 40 రోజులు మాత్రమే ఉన్నందున రాష్ట్రంలో శుభకార్యాలు విపరీతంగా జరుగుతాయి. పాల ఉత్పత్తి బాగా పెరగనున్నా.. పాలల్లో, ఆహారపదార్థాల్లో కల్తీ సమస్య కూడా పెరుగుతుంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో తుపానులు ఏర్పడతాయి. ఏప్రిల్ 22 నుంచి మే 3 వరకు గంగా పుష్కరాలు ఉంటాయి’ అని పేర్కొన్నారు. సీఎం దైవ బలాన్ని సంపాదించుకోవాలి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన కర్కాటక రాశికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉన్నా యని సంతోష్ కుమార్ శాస్త్రి పేర్కొన్నారు. ఆదా యం 11 వ్యయం 8 రాజపూజ్యం 5, అవమానం 4గా ఉంటుందని, రాహువులో రవి దశ ముగిసి చంద్ర దశ నడుస్తోందని, జనవరి 17న అష్టమ శని దోశం ఏర్పడినందున జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. సీఎం దైవ బలాన్ని సంపాదించుకోగలిగితే అవాంతరాలను అధిగమించే వీలుంటుందన్నారు. కాగా, మంచి వానలతో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పంచాంగం సూచించటం పట్ల ఆనందంగా ఉందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం పండితులను సన్మానించారు. -
ఉగాది పచ్చడి తింటాం.. చేయడం రాదు: శివాని, శివాత్మిక
హైదరాబాద్‌లో ఉంటే అమ్మ, నాన్న, మేమిద్దరం కలిసి పండగ జరుపుకుంటాం. అమ్మ ఉగాది పచ్చడి, గారెలు, పులిహోర, పాయసం.. ఇలా అన్నీ చేస్తుంది. ఒకవేళ మేం చెన్నైలో ఉంటే... అక్కడి మా బంధువులతో పండగ జరుపుకుంటాం. మా ఇద్దరికీ పచ్చడి తినడం తప్ప చేయడం రాదు. మా చిన్నప్పుడు ఇద్దరం ముగ్గులు వేసేవాళ్లం. పండగ అంటే మాకు ముగ్గులే ఎగ్జయిటింగ్. ఇక పండగ రోజున కొత్త బట్టలంటే అది ఆ రోజు మూడ్‌ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి ఫుల్ ట్రెడిషనల్‌గా డ్రెస్ చేసుకుంటాం.. చక్కగా నగలు పెట్టుకుని గుడికి వెళతాం. చీర, లంగా, ఓణీ, చుడీదార్.. ఇలా ఏదో ఒకటి ప్రిఫర్ చేస్తాం. ఇప్పుడు చెన్నైలో ఉన్నాం. ఈసారి ఫుల్ ట్రెడిషనల్‌గా రెడీ అవుతాం. ఈ ఉగాది అందరి జీవితాల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇంకా మంచి ఆర్టిస్ట్‌గా గుర్తింపు సంపాదించుకోవాలనుకుంటున్నాను. ఇంకా మంచి నటిగా ఎదగాలని ఉంది. అలాగే మంచి డాక్టర్ అవ్వాలన్నది లక్ష్యం. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ మెడిసన్ చేస్తున్నాను. ఏం చేసినా నిబద్ధతతో చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. వర్కవుట్, షూటింగ్, చదువు, హార్స్ రైడింగ్.. ఏదైనా మరింత క్రమశిక్షణగా చేయాలనుకుంటున్నాను. – శివాని ఈ సంవత్సరం చేతినిండా పని ఉండాలని కోరుకుంటున్నాను. తెలుగు, తమిళంలో సినిమాలు చేయాలనుకుంటున్నాను. అలాగే ఇతర భాషల్లోనూ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. కెరీర్‌పరంగా ఎదగాలన్నదే ప్రస్తుత లక్ష్యం. వీలైతే ఏదైనా స్పోర్ట్ నేర్చుకోవాలని ఉంది. ఏడాది మొత్తం చాలా ప్రశాంతంగా గడిచిపోవాలని ఉంది. ఆరోగ్యం బాగుండాలి. – శివాత్మిక -
Sri Shobhakruth Nama Ugadi 2023: శోభాయమానం
ఉగాది మన తొలిపండుగ. ఈసారి ఉగాదికి పేరు శోభకృత్. శోభ అంటే కాంతి. మన జీవితాలకు అవసరమైన...భాగ్యాల, సౌభాగ్యాల కాంతిని ఈ ఉగాది ఇస్తుందనిఆశిద్దాం. ఈసారి వసంత విషువత్ జరిగిన మరుసటి రోజున ఉగాది వచ్చింది. అంటే వసంత విషువత్ మొదలు అయిన మరుసటి రోజున చైత్రమాసంమొదలు అయింది. ఇది ఒక విశేషం. ఇలా జరగడం అరుదు. ఈ అరుదైన సంఘటన మనకు, దేశానికి, ప్రపంచానికి అత్యంత మేలు చెయ్యాలని అపేక్షిద్దాం. ఉగాదితో చాంద్ర–సౌర (లూని సోలర్) సంవత్సరం మొదలు అవుతుంది. పౌర్ణమి చంద్రుడు చిత్త లేదా చిత్ర నక్షత్రంతో ఉండడం చైత్రమాసం. చైత్రమాసం తొలిరోజు అంటే చైత్రశుక్ల పా డ్యమి రోజు ఉగాది అవుతుంది. చంద్రుడు ఒక నక్షత్రంతో మొదలుపెట్టి, భూమి చుట్టూ తిరిగి మళ్లీ ఆ నక్షత్రం దగ్గరకు రావడానికి పట్టే కాలం నాక్షత్రమాసం అవుతుంది. సూర్యుడు భూమధ్యరేఖను ఉత్తరంవైపుగా దాటడం వసంత విషువత్ అవుతుంది. వసంత విషువత్ మార్చ్ 21న జరుగుతుంది. ఆ రోజు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. సూర్య, చంద్ర గమనాలుప్రాతిపదిక కాబట్టి చాంద్ర–సౌర సంవత్సరం అవుతుంది. వ్యావహారిక శకానికి పూర్వం తొలిదశలో సప్త ఋషులు నాక్షత్ర సంవత్సరాన్ని, చాంద్ర–సౌర సంవత్సరాన్ని కలిపి పంచాంగాన్ని అమలులోకి తెచ్చారు. మూడు, ఐదు సంవత్సరాలలో వచ్చే అధికమాసాలను కలుపుకుని ఐదు సంవత్సరాలతో ఒక యుగం అని పంచాంగం పరంగా అమలు చేశారు. అప్పట్లో ఆ యుగం ఆరంభం శరత్ విషువత్, శరత్ ఋతువులో ఉండేది. ఈ ఐదు సంవత్సరాల యుగంలో మొదటి సంవత్సరంలో మొదటి రోజు యుగాది అని అయింది; అదే ఉగాది అయింది. ఈ యుగం జ్యోతిష శాస్త్రానికి ఆనుగుణ్యంగానూ రూపొందింది. ‘జ్యోతి’ అంటే నక్షత్రం అనీ ‘షం’ అంటే సంబంధించిన అనీ అర్థాలు. జ్యోతిషం అంటే నక్షత్రానికి సంబంధించినది అని అర్థం. నాక్షత్ర చాంద్ర– సౌర గమనాల ప్రా తిపదికన మన పంచాంగం నిర్మితమైంది. పంచాంగం ప్రకారం మనకు ఉగాది నిర్ణీతమైంది. సప్త ఋషుల తరువాత విశ్వామిత్ర మహర్షి పంచాంగంలోనూ, కాలగణనంలోనూ కొన్ని ప్రతిపా దనలను, మార్పులను తీసుకువచ్చాడు. ఆ తరువాత కాలక్రమంలో జరుగుతూ వచ్చిన ఖగోళమార్పులకు తగ్గట్లు గర్గ మహర్షి సంవత్సరాదిని వసంత విషువత్ కు మార్చాడు. ఆర్యభట్టు, వరాహమిహిరుడు దాన్నే కొనసాగించారు. అదే ఇప్పటికీ వస్తోంది. వసంత విషువత్‌తో వసంతం మొదలు అవుతుంది; సాంప్రదాయిక సంవత్సరాన్ని లేదా ఆచార వ్యవహారాల కోసం సంవత్సరాన్ని చైత్రమాసంతో మొదలుపెట్టారు. వసంతాన్ని కుసుమాకరం అనీ, కుసుమాగమం అనీ అంటారు. కుసుమానికి పుష్పం, పండు, ఫలం అని అర్థాలు ఉన్నాయి. ఈ మూడూ మనకు ఎంతో అవసరం అయినవి. తప్పకుండా మనం వీటిని ΄÷ందాలి. మన జీవితాలు కూడా నిండుగా పుష్పించాలి, పండాలి, ఫలవంతం అవ్వాలి. వసంతాన్ని ప్రకృతి ఇస్తున్న సందేశంగా మనం గ్రహించాలి. వసంతం ఒక సందేశం దాన్ని మనం అందుకోవాలి, అందుకుందాం. ఆరు ఋతువులకు ఆదిగా వచ్చేది ఈ పండుగ. సంవత్సరంలోని ఆరు ఋతువులకు ప్రతీకలుగా తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపుల్ని తీసుకుని ఆ రుచుల కోసం వేపపువ్వు, బెల్లం, మిరియాలపొడి, చింతపండు, ఉప్పు, మామిడి ముక్కల్ని కలిపి ఉగాది పచ్చడిని మనం తీసుకుంటున్నాం. నింబకుసుమ భక్షణం అని పేరు. ఇది ఉగాది పండుగలో ముఖ్యాంశం. మరో ముఖ్యాంశం పంచాంగ శ్రవణం. ఆదిలోనే ఎవరి రాశి ప్రకారం వారికి సంవత్సరంలో జరగడానికి అవకాశం ఉన్న మేలు, కీడులను వ్యక్తులకు సూచన్రపా యంగా పంచాంగం చెబుతుంది. పంచాంగ శ్రవణానికి ముందుగా మనం అభ్యంగన స్నానం చేసి, మామిడి తోరణాలతో, పుష్పాలతో ఇళ్లను అలంకరించుకుని దైవపూజ చెయ్యాలి; చేద్దాం.ప్రకృతి ఇచ్చిన సందేశాలుగా అందివచ్చిన ఉగాదిని, వసంతాన్ని ఆకళింపు చేసుకుని, ఆదర్శంగా తీసుకుని, మనం మనకు, ఇతరులకు ఈ ఏడాదిలోని అన్ని ఋతువుల్లోనూ హితకరం అవ్వాలి, అవుదాం. మంచికి తొలి అడుగుగా, ఒక పండుగగా, తొలి పండుగగా ఉగాది మనకు అందివచ్చింది. ఇతర పండుగలా కాకుండా ఉగాది కాలానికి, ప్రకృతికి సంబంధించిన పండుగ. మనిషి కాలానికి, ప్రకృతికి అనుసంధానం అవ్వాలని తెలియజెప్పే ఒక విశిష్టమైన పండుగ ఉగాది. వసంత ఋతువు రావడాన్ని వసంతావతారం అని కూడా అంటారు. వసంతావతారం సంవత్సరానికి ఉన్న అవతారాలలో గొప్పది. ఆపై శోభాయామానమైంది. సంవత్సరానికి శోభ వసంతం. వసంతం మనకు వచ్చే ఋతువుల్లో ప్రధానమైంది లేదా కేంద్రభాగం. చెట్లకు కొత్త చివుళ్లు, కోయిలల గానాలు, పచ్చదనం, పువ్వుల కళకళలు. వీటిని వసంతం తెస్తుంది, ఇస్తుంది. వసంతంలో ఎక్కువ వేడి, చలి ఉండవు. వాతావరణం ఉల్లాసకరంగా ఉంటుంది. వసంతం శ్రేష్ఠమైంది కాబట్టే ‘అహమృతూనాం కుసుమాకరః‘ అంటూ కృష్ణుడు భగవద్గీతలో తాను ఋతువుల్లో వసంతాన్ని అని చెప్పాడు. సంవత్సరంలో ఉండే మంచితనం వసంతం. వసంతం ప్రకృతి నుంచి మనకు అందివచ్చే మంచితనం. ‘... సంతో వసంతవల్లోకహితం చరంతః ...’ అని వివేకచూడామణిలో ఆదిశంకరాచార్య అన్నారు. అంటే మంచివాళ్లు వసంతంలాగా లోకహితాన్ని ఆచరిస్తారు అని అర్థం. వసంతం వంటి హితం, హితం వంటివసంతం మనకు, సంఘానికి, దేశానికి, ప్రపంచానికి ఎంతో అవసరం. – రోచిష్మాన్ -
విజయలక్ష్మి కటాక్షానికి అన్ని పార్టీల తహతహ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది. శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా ప్రతిఒక్కరూ తమ జాతకాన్ని కొత్త పంచాంగంలో వెతుక్కుంటున్నారు. ఈ ఉగాది సాధారణ ప్రజల కంటే.. రాజకీయ నాయకులకు ఎంతో కీలకమైంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్న ప్రత్యర్థులు, ఈసారి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో అధికార–ప్రతిపక్ష నేతలంతా నూతన పంచాంగంలో తమ జాతకాలలో ఆదాయ వ్యయాల మాట ఎలా ఉన్నా.. రాజ్యపూజ్యంపైనే కన్నేశారు. అవమానాల మాట పక్కనబెట్టి.. రాజ్యపూజ్యం దక్కుతుందా? లేదా? అన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితిని ఒకసారి పరిశీలిస్తే.. సిరిసిల్ల: ఇక్కడి నుంచి ప్రాతిని ధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆ ర్కు ప్రత్యర్థులు పెద్దగా లేరు. కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్‌రెడ్డి మినహా ఇక్కడ ఆయనకు గట్టి వైరిపక్షం కానరావడం లే దు. ఈసారి బీజేపీ మాత్రం సెలబ్రెటీని రంగంలోకి దించుతార న్న ప్రచారం సాగుతోంది. వేములవాడ: ప్రస్తుత ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్(బీఆర్ఎస్)కు చిరకాల ప్రత్యర్థి ఈసారి కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ పేరు వినిపిస్తుండగా.. తాను స్వతంత్రంగానైనా పోటీచేస్తానని అదే పార్టీ నేత తుల ఉమ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నారైలు గోలి మోహన్ (ఇప్పటికే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు), మరో ఎన్నారై తోట రాంకుమార్ కూడా బరిలో నిలిచేందుకు ఆసక్తిగా ఉన్నారు. జగిత్యాల: డాక్టర్ సంజయ్ ఇప్పటికే వరుసగా గ్రామాల్లో పర్యటిస్తూ.. పల్లె నిద్ర పేరుతో ప్రజలకు చేరవవుతున్నారు. ఇక మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి (కాంగ్రెస్) కూడా పోటాపోటీగా పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల భోగశ్రావణి బీజేపీ నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. కోరుట్ల: ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు(బీఆర్ఎస్) వరుసగా అ భివృద్ధి పనులు, శంకుస్థాపనలు అంటూ పర్యటిస్తున్నారు. ఈసారి జువ్వాడి న ర్సింగరావు(కాంగ్రెస్) గట్టిపోటీ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నారు. మార్పులు జ రిగితే వీరిద్దరు కుమారులను బరిలో దింపుతారన్న ప్రచారమూ జరుగుతోంది. ధర్మపురి: ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్(బీఆర్ఎస్)కు ఈసారి గట్టిపోటీ ఉంది. ఇక్కడ నుంచి అడ్లూరి లక్ష్మణ్ (కాంగ్రెస్), మాజీ ఎంపీ గడ్డం వివేక్ (బీజేపీ) కూడా బరిలోకి దిగుతారని ప్రచారం సాగుతోంది. పెద్దపల్లి: ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి (బీఆర్ఎస్)కి సొంత పార్టీ నుంచే తీవ్ర పోటీ ఉంది. ఎమ్మెల్యే టికెట్ కోసం.. సొంత పార్టీకే చెందిన ఎన్నారై నల్ల మనోహర్‌రెడ్డి, జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ నేత విజయరమణారావు నుంచి వీరికి గట్టి పోటీ ఎదురవనుంది. బీజేపీ నుంచి గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, గొట్టిముక్కల సురేశ్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. బీఎస్పీ నుంచి దాసరి ఉష బరిలో ఉన్నారు. మంథని: ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు(కాంగ్రెస్)కు, పుట్ట మధు(బీఆర్ఎస్)కు ఈసారి హోరాహోరీ పోరు నడవనుంది. ఇక్కడ వీరిద్దరు మినహా మూడో పార్టీ అభ్యర్థులెవరూ ఇంతవరకూ ఆసక్తి చూపలేదు. రామగుండం: ప్రస్తుత ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు, ఈసారి కాంగ్రెస్ నేత ఠాకూర్ మక్కాన్ సింగ్(కాంగ్రెస్) గట్టి పోటీ ఎదురవనుంది. వీరితోపాటు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ(బీజేపీ) కూడా బరిలో ఉండటంతో పోరు రసవత్తరంగా మారనుంది. కరీంనగర్: బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ తీగల వంతెన, ఎమ్మారెఫ్, స్మార్ట్ సిటీ పనులతో కరీంనగర్‌పై ఫోకస్ పెట్టారు. హిందుత్వం, మార్పు అన్న ఎజెండాతో భారతీయ జనతా పార్టీ( బీజేపీ ) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నుంచి పోటీ ఎదరవనుంది. బీజేపీ నుంచి కొత్త జయపాల్‌రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ఎమ్మెస్సార్ మనవడు రోహిత్, నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వైస్సార్టీపీ నుంచి డాక్టర్ నగేశ్ బరిలో నిలవనున్నారు. చొప్పదండి: ప్రస్తుతం ఎమ్మెల్యే రవిశంకర్ (బీఆర్ఎస్)కు ఇంటిపోరు తప్పేలా లేదు. అదేపార్టీ నుంచి గజ్జెల కాంతం, కత్తెరపాక కొండయ్య, కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు. ఈసారి మేడిపల్లి సత్యం (కాంగ్రెస్) నుంచి గట్టి పోటీ ఇవ్వనున్నారు. బీజేపీ నుంచి బొడిగె శోభ, సుద్దాల దేవయ్యల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్సార్టీపీ నుంచి అక్కెనపల్లి కుమార్ బరిలో నిలవనున్నారు. మానకొండూరు: ఇక్కడనుంచి రెండుసా ర్లు ఎమ్మెల్యేగా గెలిచిన రసమయి బాలకిషన్‌కు ఈసారి ఇంటిపోరు తీవ్రంగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఇక్కడేనుంచే పోటీచేసిన ఓరుగంటి ఆ నంద్ కూడా టికెట్ కోసం యత్నిస్తున్నా రు. కాంగ్రెస్ నుంచి కవ్వంపల్లి సత్యనా రాయణ, బీజేపీ గడ్డం నాగరాజు, దరువు ఎల్లన్న బరిలో నిలవనున్నారు. హుజూరాబాద్: గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ప్రస్తు తం బీజేపీలో ఉన్నారు. బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఈసారి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
మిథున రాశి: అన్నింటా శుభయోగం.. ఆ ఒక్కటి చేస్తే మరింత రాజయోగం
మిథున రాశి (ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 4) మిథునరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. చతుర్థ పంచమ స్థానాలలో కేతుగ్రహ సంచారం, దశమ లాభస్థానాలలో గురు రాహువుల సంచారం, భాగ్యస్థానంలో శని, రవిచంద్ర గ్రహణాలు, గురుశుక్ర మౌఢ్యమిలు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. కార్యానుకూలత ఎక్కువగా ఉంటుంది. కీలకమైన స్థానాలలో ఉన్నవారి వల్ల లబ్ధి చేకూరుతుంది. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇబ్బందులను అధిగమించి, విద్యారంగంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. విదేశీయాన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజాసంబంధాలు, రాజకీయ విషయాలు బాగుండవు. డబ్బులతో అన్నీ సాధించలేమని గుర్తిస్తారు. అగ్రిమెంట్స్, కాంట్రాక్టులు, మార్కెటింగ్, వాణిజ్య ప్రదర్శనలు, ప్రకటనలు, ఉత్తర ప్రత్యుత్తరాలు లాభిస్తాయి. కంటి దోషాలు పెరిగే అవకాశం ఉంది. కొనుగోలు, అమ్మకాల విషయంలో స్వయంగా నిర్ణయాలు తీసుకోండి. స్పెక్యులేషన్‌కు దూరంగా వుండటం మంచిది. శత్రువర్గం ఇబ్బంది పెట్టలేని స్థాయిలో ఉంటారు. ఒకనాటి మిత్రులు అగర్భశత్రువులు అవుతారు. అందరూ బలహీనులు అని భావించవద్దు. తగిన సమయం కోసం వేచి ఉన్నారని గ్రహించండి. జీవితంలో నెరవేరవు అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తిచేస్తారు. సాంకేతిక పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. ఓం నమశ్శివాయ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఎక్కువ ఆలస్యం చేయకుండా శుభకార్యాలను ఘనంగా నిర్వహిస్తారు. పార్టీ మారడం వల్ల మంచి రాజకీయ ఫలితాలు పొందగలుగుతారు. చిన్నాచితకా వ్యాపారాలు, చేతివృత్తులు, ఆధ్యాత్మిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. సువర్ణాభరణాల భద్రతలో జాగ్రత్తలు అవసరం. సంతానం వల్ల కుటుంబానికి కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. వ్యక్తిగత పరపతి పెరగడంతో పాటు శత్రువులు కూడా పెరుగుతారు. విదేశీయాన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఎగుమతి, దిగుమతి వ్యవహారాలలో అప్రమత్తత అవసరం. క్రెడిట్ కార్డులు, బ్యాంకు వ్యవహారాలు, పొదుపు డిపాజిట్ల వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. బెట్టింగ్‌లలో పాల్గొనవద్దు, నష్టపోతారు. బంధువులకు సహాయం చేయడం వల్ల చికాకులు ఎదురవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి సాధిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులు అంచనాల మేరకు ఫలిస్తాయి. మీరు కొన్న స్థిరాస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. మీ వ్యాపార భాగస్వాములు, సహోద్యోగులు అసూయాపరులై ఉంటారు. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. పార్శ్వపు నొప్పి, ఈఎన్టీ సమస్యలు రావచ్చు. కష్టపడి పనిచేసి ఫలితాలను ఆశిస్తారు. సామర్థ్యం లేని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా కార్యనష్టం, కాలహరణం జరుగుతుంది. మనుషుల మనోభావాల్ని స్పష్టంగా చదవగలరు. సంతానం విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అనివార్యం అవుతాయి. ప్రేమ వివాహాలు విఫలం అవుతాయి. విద్యారంగంలో కృషి చేసేవారికి ఆరంభంలోనే ఉద్యోగం వస్తుంది. వాస్తవిక దృష్టితో ఆలోచించి, కుల మత వర్గాలకు అతీతంగా శక్తిసామర్థ్యాలకు పెద్దపీట వేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో మధ్యవర్తిత్వం వల్ల చట్టపరమైన ఇబ్బందులు రావచ్చు. ఇతరులు సలహాలు చెప్పడానికి వీలులేని వాతావరణం కలిగించవద్దు. పట్టువిడుపులు మంచికి దారితీస్తాయని గ్రహించండి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం నవగ్రహ పాశుపత హోమం చేయాలి, శక్తికంకణం లేదా శక్తిరూపు ధరించాలి. ఉపయోగంలేని వ్యక్తుల సాంగత్యం ఇబ్బందికరంగా మారుతుంది. వాళ్ళను వదిలించుకోవడం కష్టంగా మారుతుంది. మేలు చేస్తారని మీరు భావించిన వ్యక్తులు ముఖం చాటువేస్తారు. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం బాగుంది. సన్నిహితులతో, ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి ఏ కార్యక్రమాలలోనైనా నిర్ణయం తీసుకోండి. ఎవరికీ లొంగి ఉండాల్సిన అవసరం లేదని భావిస్తారు. మిమ్మల్ని గుప్పెట్లో పెట్టుకోవాలనే వారికి భంగపాటు తప్పదు. అవివాహితులకు ఘనంగా వివాహం జరుగుతుంది. సౌందర్య చిట్కాలు, యోగాభ్యాసాలు, మెడిటేషన్ మొదలైన వాటి వల్ల ప్రయోజనం పొందుతారు. ఆరావళి కుంకుమ, శ్రీలక్ష్మీ చందనంతో అమ్మవారిని పూజిస్తే మంచిఫలితాలు ఉంటాయి. లీజులు, అగ్రిమెంట్లు, లైసెన్సులు లాభిస్తాయి. సంవత్సర ద్వితీయార్ధంలో జీవితం మరో కొత్త పంథాలో నడుస్తుంది. విడిపోవాలన్న వారితో శాశ్వతంగా విడిపోతారు. సంతాన పురోగతి బాగుంటుంది. చెప్పుడు మాటలు విని నష్టపోతారు. శుభకార్యాలకు సంబంధించిన బరువు బాధ్యతలు దించుకుంటారు. పిల్లల విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు సంభవిస్తాయి. మీ వివాదాల ప్రభావం పిల్లల మీద పడకుండా జాగ్రత్త వహించండి. కీళ్ళనొప్పులు, గైనిక్ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ లాభించదు. చిట్టీలు కట్టి మోసపోతారు. హనుమాన్ వత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. అలంకార సామగ్రి అమ్మేవారికి, చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి. కుటుంబ విషయాలు, వ్యక్తిగత విషయాలు పిల్లల ముందు చర్చించకపోవడం మంచిది. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యార్థినీ విద్యార్థులకు మెరిట్ మార్కులు, స్కాలర్షిప్స్ వస్తాయి. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ లాభిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. జీవితభాగస్వామి లేదా తత్సమానమైన వ్యక్తితో విభేదాలు తీవ్రతరం అవుతాయి. వ్యాపారంలో మీరు ప్రవేశపెట్టిన కొత్త ఉత్పత్తులు అత్యంత ప్రజాదరణకు నోచుకుంటాయి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. ధనాన్ని పొదుపు చేస్తారు. మాతృవర్గం వైపు బంధువులకు సహాయం చేయవలసి వస్తుంది. సొంత వ్యాపారాలు కలిసివస్తాయి. పొదుపు పథకాలు అమలు చేసి లబ్ధి పొందుతారు. విలువైన వస్తువుల భద్రత గురించి ఎక్కువ శ్రద్ధ చూపండి. బ్యూటీ పార్లర్స్ నడిపేవారికి, అలంకార సామగ్రి విక్రయాలు మొదలైన వ్యాపారాలు లాభిస్తాయి. కళా, సాంస్కృతిక రంగాలలో, నాట్య, సంగీత రంగాలలో రాణిస్తారు. చలనచిత్ర, టీవీ రంగాలలో అవకాశాలు లభిస్తాయి. పిల్లలను అతి గారాబం చేయడం వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతాయి. సంతాన సాఫల్యకేంద్రాల వల్ల, దొంగ స్వామీజీల వల్ల మోసపోతారు. బిజినెస్ మేనేజ్మెంట్, ఐటీ రంగాలలోని వారు రాణిస్తారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉన్నత విద్యకు ఎంపికవుతారు. స్వయంకృషితో శ్రమించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. అనువంశికంగా మీకు రావలసిన ఆస్తిలో పెద్దలు రాసిన డాక్యుమెంట్స్‌లో కొన్ని లోపాలు బయటపడతాయి. ఈ లోపాల కారణంగా మీరు కానీ, మీ జీవిత భాగస్వామి కానీ నష్టపోయే అవకాశం ఉంది. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వల్ల నరదిష్టి, నరఘోష తొలగిపోతుయి, జనాకర్షణ ఏర్పడుతుంది. సాధారణ విద్యలోనూ, వైద్య విద్యలోనూ బాగా రాణిస్తారు. మొత్తం మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. -
Ugadi 2023 బిగ్ ‘సి’: వినూత్నఫెస్టివ్ ఆఫర్లు
హైదరాబాద్: మొబైల్స్ రిటైల్ విక్రయ సంస్థ ‘బిగ్ సి’ ఉగాది పండుగ సందర్భంగా వినూత్న ఆఫర్లు ప్రకటించింది.మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై ఆకర్షణీయ రాయితీలు అందిస్తున్నట్లు కంపెనీ సీఎండీ యం.బాలు చౌదరి తెలిపారు. స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై పదిశాతం వరకు క్యాష్ బ్యాక్‌తో పాటు ఎలాంటి వడ్డీ, డౌన్ పేమెంట్ లేకుండా సులభ ఈఎంఐలలో పొందొచ్చన్నారు. (March18th పసిడి ప్రియులకు షాక్: ఆల్‌టైం రికార్డు, ఇక కొన్నట్టే..?!) స్మార్ట్ టీవీల కొనుగోలుపై 1,500 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుందన్నారు. సులభ ఈఎంఐ పద్ధతిలో ల్యాప్టాప్స్ కొనే సౌకర్యం కూడా ఉందన్నారు. ‘‘ప్రతి కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంటుంది. మా రిటైల్ స్టోర్లలో ఆన్లైన్ కంటే తక్కువ ధరలకే ఉత్పత్తులు లభిస్తాయి. ప్రజలంతా ఈ ఆఫర్లను వినియోగించుకోవాలి’’ అని బాలు చౌదరి కోరారు. బ్రాండెడ్ ఉపకరణాలపై 51 శాతం తగ్గింపు, ఐఫోన్ కొనుగోలుపై రూ.5,000 తక్షణ తగ్గింపు, రూ.2000 విలువైన అడాప్టర్ ఉచితం వంటి ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్లలో శాంసంగ్ మొబైల్‌పై రూ.పదివేలు, Vivoపై రూ.5,000, Oppo మొబైల్‌పై 10 శాతంతగ్గింపు లాంటివి ఉన్నాయి. (వాల్‌మార్ట్ భారీ పెట్టుబడులు: ఫోన్‌పే రూ. 1,650 కోట్ల సమీకరణ) -
సకల శుభాల శోభ
ఉగాది రావడంతోనే వేసవి మనకు పరిచయం అవుతుంది. షడ్రుచులతో కొత్త చిగురుల సందడి మొదలవుతుంది.సకల శుభాలను మోసుకువచ్చే ఉగాదికి సకల హంగులూ అద్దేవి మన చేనేతలే. పండగ రోజులే కాకుండా వేసవి మొత్తం కాటన్ డ్రెస్సులతోనే కలర్ఫుల్గా కనిపించడం ఎలాగా అని ఆలోచించేవారికి సరైన ఎంపికతోనే సిద్ధంగా ఉన్నాయి. అచ్చతెలుగు అమ్మాయిలా లంగాఓణీలో కనిపించాలనుకున్నా, లెహంగాలో గ్రాండ్ లుక్‌తో మెరిసి΄ోవాలన్నా, చుడీదార్‌తో ఆధునికం అనిపించాలన్నా, చీర అంచుతోనే అందాన్ని చుట్టేయాలన్నా మన చేనేతలు ఎప్పుడూ అగ్రభాగాన ఉంటాయి. పట్టుకున్నప్రా ముఖ్యత కాటన్స్కు లేదు అనుకునేవారికి సరైన ఎంపిక అవుతున్నాయి. వాటిలో ఖాదీ, మంగళగిరి, ఇక్కత్, నారాయణపేట్, గద్వాల్, వెంకటగిరి... వంటి కాటన్ హంగులు తీరైన నిండుదనాన్ని తీసుకువస్తున్నాయి. ప్రతిరోజూ పండగే అనిపించే శోభను మోసుకువస్తున్నాయి. ఈ వేసవిని శోభకృతుతో ఇంపైన కళగా మార్చేద్దాం. -
పాన్ ఇండియా సినిమాలు ...ఆ రోజు ఫ్యాన్స్ కి పండగే!
ప్రస్తుతం టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాలు ఓ రేంజ్ లో తెరకెక్కుతున్నాయి. ఇక ఆ సినిమాల అప్డేట్స్ కోసం మూవీ లవర్స్ తో పాటు...స్టార్ హీరోల అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలు అంటే వాళ్ల బర్త్‌డే కి మాత్రమే కాకుండా ఫెస్టివల్ కి కూడా ఏదొక అప్డేట్ ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. అలాగే ఈ ఉగాదికి టాలీవుడ్ నుంచి చాలా సినిమా అప్డేట్స్ రాబోతున్నాయి. మహేశ్ బాబు -త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ #ssmb28. అతడు, ఖలేజా తర్వాత ఈ కాంబినేషనల్ రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీ భారీ అంచనాలే ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఏప్రిల్ నెలాఖారు కల్లా సాంగ్స్ , ఒక ఫైట్ మినహా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేలా డైరెక్టర్ త్రివిక్రమ్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు. ఈ సినిమా రీస్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్డేట్ కోసం మహేశ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ లో ఈ మూవీ కి టైటిల్ ఏమి పెడతారనే విషయం పై చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఉగాది నాడు ఈ సినిమా టైటిల్ ప్రకటనతో పాటు మహేశ్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీని నిర్మిస్తున్న హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మార్చి 22న ఖచ్చితంగా అప్డేట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు ఇక నందమూరి బాలకృష్ణ అభిమానులు కూడా #NBK108 అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో బాలకృష్ణ కూతురిగా శ్రీలీల నటిస్తోంది. ఇక ఉగాది నాడు ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ ఇమేజ్ కి తగ్గట్లు ఓ పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారనే మాట టీటౌన్ లో వినిపిస్తోంది. వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్న అఖిల్ మూవీ ఏజెంట్. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న అఖిల్ మూవీ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 28న రిలీజ్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఏజెంట్ మూవీకి సంబంధించి ఇప్పటికే టీజర్ సాంగ్స్ విడుదల చేశారు. ఇక ఉగాది నాడు అక్కినేని సర్ప్రైజ్ ఇచ్చే విధంగా ఏజెంట్ మూవీ నుంచి ఓ అప్డేట్ ఉంటుందనే ప్రచారం ఫిల్మ్ సర్కిల్స్ లో సాగుతోంది. గ్లోబల్ ఇమేజ్ అందుకున్న ప్రభాస్ బాలీవుడ్ లో నటించిన డెబ్యూ మూవీ ఆదిపురుష్. జూన్ 16న విడుదల కానున్న ఈ మూవీకి సంబంధించి...ఓ క్రేజీ అప్డేట్ ఉగాది రోజు రానుందట. ఆదిపురుష్ మైథిలాజికల్ ఫిల్మ్ కాబట్టి ఉగాది నాడు ప్రభాస్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునే విధంగా డైరెక్టర్ ఓంరౌత్ టీమ్ ప్లాన్ చేస్తుందట. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్.సి.15. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉంది. కాబట్టి ఉగాది నాడు ఆర్.సి.15 టైటిల్ అనౌన్స్ చేసి...బర్త్‌డే రోజు టీజర్ రిలీజ్ చేసేందుకు డైరెక్టర్ శంకర్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా బోళా శంకర్...శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ కోసం కూడా మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ మెహర్ రమేష్ ఉగాది రోజు మెగా ట్రీట్ ఖచ్చితంగా ఇస్తాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సో...ఉగాది నాడు సినీ అభిమానులను ఏ మూవీ అప్డేట్స్ పలకరిస్తాయో చూడాలి మరి. -
విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్‌కు రెడీ.. మాస్ పోస్టర్ రిలీజ్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఉగాది సందర్భంగా ఈ నెల 22న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. విశ్వక్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్‌పై కరాటే రాజు (విశ్వక్ సేన్ తండ్రి) నిర్మించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించారు. రిలీజ్ డేట్ ప్రకటించి, విడుదల చేసిన పోస్టర్లో క్లాస్‌తో పాటు మాస్ లుక్‌లో కనిపించారు విశ్వక్ సేన్. ‘‘దాస్ కా ధమ్కీ’ని తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నాం. ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ కె. బాబు, సంగీతం: లియోన్ జేమ్స్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉగాది తర్వాత గొర్రెల పంపిణీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రెండో విడత గొర్రెల పంపిణీ ఉగాది, శ్రీరామనవమి పండగల తర్వాత చేపడతామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. గొర్రెల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ పథకం యూనిట్ వ్యయాన్ని కూడా పెంచుతామన్నారు. ఆదివారం సంగారెడ్డిలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం, కురుమ సంఘం భవన నిర్మాణానికి శుంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో హరీశ్‌రావు మాట్లాడుతూ రూ.300 కోట్లతో హైదరాబాద్‌లో గొల్ల, కురుమల ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్నామన్నారు. టీడీపీ ప్రభుత్వం గొల్ల, కురుమలను వాడుకుందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు బడ్జెట్లో బీసీల సంక్షేమానికి రూ.2 వేల కోట్లతో సరిపెట్టి, బీసీలకు అన్యాయం చేస్తోందని హరీశ్ విమర్శించారు. కురుమ సామాజిక వర్గంలో బాల్యవివాహాలు ఎక్కువగా జరిగేవని, కల్యాణలక్ష్మి పథకం అమలు చేసిన తర్వాత ఈ బాల్యవివాహాలు బంద్ అయ్యాయన్నారు. రాష్ట్రంలో గొల్ల, కురమలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక మాజీ మంత్రి రేవన్న సీఎం కేసీఆర్‌ను కలిసి గొంగడి కప్పి అభినందించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఈ విషయంలో రేవన్నకు ఏఐసీసీ నోటీసులు కూడా జారీ చేసిందన్నారు. సభలో ఎంపీలు బీబీపాటిల్, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్‌రావు, హెచ్‌డీసీ రాష్ట్ర చైర్మన్ చింతప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గొల్ల కుర్మ సంఘం నేతలు నగేశ్, శ్రీహరి, పాండు తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న కాలనీలు: ‘తూర్పు’లో ఉగాదికి రెడీ
సాక్షి, రాజమహేంద్రవరం: ఉగాది పండగ నాటికి లబ్ధిదారులను శాశ్వత గృహ యజమానులుగా మార్చేందుకు, తద్వారా వారి కుటుంబాల్లో పండగ సంతోషాన్ని సంపూర్ణంగా నింపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ లక్ష్యాన్ని ఉగాదికి ఒక రోజు ముందే అధిగమించే ఏర్పాట్లలో జిల్లా అధికారులు తలమునకలవుతున్నారు. జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న పేదల ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కాలనీల్లో మిగిలి ఉన్న చిన్నచిన్న పనులను పూర్తి చేస్తున్నారు. మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేక బృందంగా ఏర్పడి గృహ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇల్లు కట్టుకోలేని వారికి అవగాహన కల్పించి, నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తుండటంతో లబ్ధిదారులు సైతం ముందుకు వస్తున్నారు. ఉగాదికి 6,319 గృహ ప్రవేశాలు పేదలకు శాశ్వత నివాసం కల్పించాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 1.46 లక్షల మందికి ఉచితంగా ఇంటి పట్టాలు పంపిణీ చేసింది. వీటిలో తొలి దశలో రూ.113.48 కోట్లతో 63 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఇవి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. మరికొన్నింటిలో లబ్ధిదారులు గృహప్రవేశాలు సైతం చేసుకున్నారు. మిగిలిన వాటి పనులు వేగంగా సాగుతున్నాయి. ఉగాది నాటికి 6,318 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి, లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని అధికార యంత్రాంగం సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా యుద్ధప్రాతిపదికన నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1,211 ఇళ్ల పనులు వంద శాతం పూర్తయ్యాయి. మిగిలిన 5,107 నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రతి మండలంలో హౌసింగ్ అధికారులు, తహసీల్దార్లు ప్రత్యేక బృందంగా ఏర్పడి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నారు. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచుతున్నారు. తాగునీటి వసతికి బోర్లు తవ్వుతున్నారు. తాగు, ఇతర అవసరాలకు నీటిని సమకూరుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన కాలనీల్లో నివసించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. అనపర్తి, బిక్కబోలు, తొర్రేడు, చాగల్లు, కొవ్వూరు కృష్ణారావు చెరువు, కడియం, దామిరెడ్డిపల్లి, నిడదవోలు వైఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లో గృహ నిర్మాణ పనులు శరవేగంతో సాగుతున్నాయి. జగనన్న కాలనీల్లో విద్యుత్ సౌకర్యం కల్పించే పనులు కూడా చురుకుగా సాగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 755 కాలనీల్లో రూ.411 కోట్ల అంచనాతో పనులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో సైతం అధునాతన విధానం అవలంబిస్తున్నారు. మూడు పెద్ద లే అవుట్లు అయిన కొమరగిరి, వాకలపూడి (కాకినాడ), వెలుగుబంద (రాజానగరం) జగనన్న కాలనీల్లో ప్రయోగాత్మకంగా భూగర్భ విద్యుత్ సరఫరాకు కార్యాచరణ సిద్ధమైంది. ప్రతి వారం లబ్ధిదారులతో ముఖాముఖి ఉగాది నాటికి గృహప్రవేశాలకు ముమ్మర కసరత్తు చేస్తున్నాం. ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన సాగుతున్నాయి. మిగిలినవి కూడా వేగవంతం చేసేందుకు ప్రతి శనివారం క్షేత్ర స్థాయి పర్యటనలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతున్నాం. ఏవైనా సమస్యలుంటే చెప్పాలని కోరుతున్నాం. ఇల్లు కట్టుకుంటే బిల్లు సకాలంలో వస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైతన్యం తీసుకువస్తున్నాం. ఉగాది నాటికి అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి గృహప్రవేశాలు చేపడుతాం. జిల్లాలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 13,019 ఇళ్లకు విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నాం. – కె.మాధవీలత, కలెక్టర్ లక్ష్యాన్ని అధిగమిస్తాం ఉగాది నాటికి ప్రభుత్వం నిర్దేశించిన గృహ నిర్మాణాల లక్ష్యాన్ని అధిగమిస్తాం. జిల్లా వ్యాప్తంగా 6,318 గృహప్రవేశాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించగా.. ఇప్పటికే 1,211 పూర్తి చేశాం. మిగిలినవి త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రత్యేక హౌసింగ్ కార్యక్రమం నిర్వహిస్తూ లబ్ధిదారులను చైతన్యపరుస్తున్నాం. – జి.పరశురాం, ఇన్చార్జి హౌసింగ్ పీడీ -
సంక్రాంతికి కాదు.. ఉగాదికి సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయాన్ని సంక్రాంతి వేళ ప్రారంభించాలనుకున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. ఉగాది నాటికి సిద్ధం కానున్నట్టు తెలుస్తోంది. దీంతో సంక్రాంతి వేళ కొత్త సచివాలయ భవనం ప్రారంభోత్సవం సందిగ్ధంలో పడింది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి దాని ప్రారంభోత్సవంపై అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు. ఆ దిశగా ఆదేశాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. ►సంక్రాంతి నాటికి ప్రారంభం అన్నట్టుగా తనిఖీల సందర్భంలో ముఖ్యమంత్రి సూచించటం, సంక్రాంతికి ప్రారంభించనున్నట్టు మంత్రులు పలు సందర్భాల్లో పేర్కొనటంతో అధికారులు పనుల్లో వేగం పెంచుతూ వచ్చారు. కానీ.. ప్రధాన భవన నిర్మాణం పూర్తయినా, భవనం లోపల వసతులు కల్పించే పనులు, డ్రైనేజీ, టెలిఫోన్, లైటింగ్, ఏసీ, నీటి పైప్‌లైన్.. ఇలాంటి ఏర్పాట్లు ఏవీ పూర్తి కాలేదు. దీంతో ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగించే పరిస్థితి లేదు. ఒకవేళ సంక్రాంతికి ప్రారంభించాలన్న అభిప్రాయంతోనే సీఎం ఉంటే, దానికి ఆటంకం కలగకుండా అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సిద్ధం చేశారు. ప్రారంభోత్సవం అంటూ నిర్వహిస్తే, ఆ కార్యాలయంలోనే పూజ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, ఆ పూజా కార్యక్రమానికి సంబంధించి కూడా అధికారికంగా సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. భవనం పూర్తి స్థాయిలో సిద్ధం కావటానికి మరో రెండు నెలల సమయం పడుతుందని, ఉగాది నాటికి అన్ని పనులూ పూర్తయి ప్రారంభించేందుకు వీలుగా సంసిద్ధమవుతుందంటూ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే రోడ్లు భవనాల శాఖ మంత్రికి విన్నవించారు. ఒకవేళ సంక్రాంతి వేళ పూజా కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఆదేశిస్తే, సీఎం కార్యాలయంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాన్ని కూడా సిద్ధం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో సీఎం కార్యాలయం సిద్ధం కాగా, సీఎస్ కార్యాలయంలో ఆయన ఛాంబర్ వరకు పూర్తయింది. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించేందుకు సీఎస్ కార్యాలయంలో భాగంగా నిర్మిస్తున్న హాలు సిద్ధం కాలేదు. గత దసరాకు ప్రారంభించాలని ప్రభుత్వం గట్టిగా ఆదేశించినప్పటికీ, భవనం పూర్తి కాకపోవటంతో అది కుదరలేదు. అప్పట్లో సంక్రాంతి వేళ ప్రారంభించాలనుకున్నారు. ఇప్పుడూ సిద్ధం కాకపోవటంతో మళ్లీ ఉగాదికి మారింది. దాదాపు 3 వేల మంది కార్మికులు, ఇంజనీర్లు మూడు షిఫ్టుల్లో రాత్రింబవళ్లూ పనిచేస్తున్నా, భారీ నిర్మాణం, అనుబంధంగా ఎన్నో ఏర్పాట్లు ముడిపడి ఉండటం, ఇటీవల ఫార్ములా ఈరేసింగ్ కోసం ఆ ప్రాంగణంలోని కార్మికుల వసతి తొలగించడంతో వారు దూర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లాల్సిన పరిస్థితితో కొంత ఇబ్బంది ఏర్పడటం.. ఇలా రకరకాల కారణాలతో పనుల్లో జాప్యం జరిగింది. లుంబినీపార్కు ఎదురుగా ప్రధాన ద్వారం.. కొత్త సచివాలయం ప్రధాన ద్వారం లుంబినీ పార్కు ఎదురుగా నిర్మితమవుతోంది. తెలంగాణ రాకముందు ఇక్కడే ప్రధాన ద్వారం ఉండేది. వాస్తుపరంగా అదే కుదరటంతో ఇప్పుడు అక్కడే ఆర్చితో కూడిన ప్రధాన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కాన్వాయ్ ఇందులో నుంచే సచివాలయంలోకి ప్రవేశిస్తుంది. మూడు దిశలు.. నాలుగు ప్రవేశ ద్వారాలు.. కొత్త సచివాలయానికి మొత్తం నాలుగు ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ద్వారం తూర్పు దిశలో లుంబినీకి ఎదురుగా రానుండగా, ఎన్టీఆర్ గార్డెన్స్ వైపు ఉన్న గేటు వద్ద ఉద్యోగుల ప్రవేశ ద్వారం నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం బిర్లామందిరం వైపు రోడ్డులో ఉన్న పౌరసరఫరాల శాఖ పెట్రోలు బంకును తొలగించారు. దాన్ని సికింద్రాబాద్ ఆర్.పి.రోడ్డులోకి మారుస్తున్నారు. తొలగించిన పెట్రోలు బంకు ఉన్న ప్రాంతంలో సందర్శకుల కోసం గేటు నిర్మిస్తున్నారు. దానికి తెలుగుతల్లి ఫ్లైఓవర్ దిగువ కూడలి నుంచి నేరుగా ఓ రోడ్డు నిర్మించారు. వాస్తుపరంగా మూడు ద్వారాలు ఉండటం సరికాదన్న ఉద్దేశంతో, భవనం వెనకవైపు మింట్ దిశలో నాలుగో ద్వారాన్ని నిర్మిస్తున్నారు. దాన్ని అత్యవసర ద్వారంగా వాడతారు. అత్యవసర పరిస్థితిలో తప్ప సాధారణ రోజుల్లో దాన్ని వినియోగించరు. -
'అప్పటి వరకు ఇబ్బందులు తప్పవు.. రాబోయే రోజుల్లో మరిన్ని చావులు'
హుబ్లీ: కార్తీకమాసం నుంచి ఉగాది వరకు రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తప్పవని ధార్వాడలో కోడి శ్రీ మఠం స్వామీజీ జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది చివరి వరకు, ఆ తర్వాత కూడా అశుభాలే ఉంటాయన్నారు. గాలి వానలు, భుకంపాలు, అగ్నిప్రమాదాలు, చావులు వంటివి పెరుగుతాయన్నారు. రోగాలతో జీవరాశులు మృత్యువాత పడుతాయన్నారు. రాజకీయ అస్థిరత ఉంటుందని, అన్ని పార్టీలు విడిపోయే లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. మూడు పార్టీల్లో చిలికలు తప్పవన్నారు.తాను ఏ వ్యక్తినీ ఉద్దేశించి చెప్పడం లేదని, తాను సన్యాసినని పేర్కొన్నారు. వర్షాలు ఇలాగే కొనసాగుతాయని, రబీ పంటలు అన్నదాతకు చేతికందుతాయన్నారు. చదవండి: (బీకాం విద్యార్థిని ఆత్మహత్య.. తల్లిదండ్రుల మాటలే..) -
హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!
హాంకాంగ్‌లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కోవిడ్ నిబంధనల కారణంగా ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఉగాది వేడుకల్ని ఆన్లైన్ వేదికగా నిర్వహించింది. ఈ వేడుకల్లో తెలుగు సంస్కృతిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కన్నుల విందుగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని హాంకాంగ్ తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీమతి జయ పీసపాటి ప్రారంభించగా, శాంతి మోగంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ ఉగాది వేడుకలను ఆర్థిక కార్యదర్శి రాజశేఖర్ మన్నే, ట్రెజరర్ నర్రా వరప్రసాద్, జనరల్ సెక్రటరీ గరదాస్ జ్ఞానేశ్వర్ తో పాటు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో ఘనంగా నిర్వహించారు. -
దిగ్విజయంగా కొనసాగిన శ్రీమద్ భాగవత సప్తాహం
సింగపూర్‌లో ప్రఖ్యాత తెలుగు సంస్థలైన 'శ్రీ సాంస్కృతిక కళాసారథి', 'తెలంగాణ కల్చరల్ సొసైటీ', 'తెలుగు భాగవత ప్రచార సమితి' 'కాకతీయ సాంస్కృతిక పరివారం' సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల వేదికపై వారం రోజులపాటు "శ్రీమద్ భాగవత సప్తాహం" కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఉగాది రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం అద్భుతంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సింగపూర్ ప్రజలందరికీ ప్రధాని నరేంద్ర మోడీ గారి తరఫున ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సమాపణోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీజేపీ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.దుర్గాప్రసాద్‌రావు, బీజేపీ రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తి, టీటీడీ పూర్వ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ వారం రోజులపాటు కార్యక్రమంలో వేర్వేరు తేదీలలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రధాన నిర్వాహకులు రత్న కుమార్ కవుటూరు, నీలం మహేందర్, ఊలపల్లి భాస్కర్, మరియు రాంబాబు పాతూరి, కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ రెడ్డి, రమేష్ గడప తదితరులు డాక్టర్ మేడసాని కి ఇతర అతిథులకు తమ కృతజ్ఞతలు తెలియజేసి ప్రపంచ నలుమూలల నుండి తెలుగువారందరూ కలసి భాగవత వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకోవసిన ఆవశ్యకత ఉందన్నారు. -
టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు
డల్లాస్ (టెక్సాస్): శ్రీ శుభ కృత్ నామ నూతన సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ 2022 ఏప్రిల్ 2వ తేదీని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించారు. ఈ మేరకు ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర పత్రికా ప్రకటన విడుదల చేశారు. టెక్సాస్ రాష్ట్రంలో వివిధ నగరాలలో నివశిస్తున్న లక్షలాది తెలుగు కుటుంబాల వారు విభిన్న సంస్కృతుల వారితో మమేకమవుతూ విద్య, వైద్య, వాణిజ్య, ప్రభుత్వ, కళా రంగాలలో తెలుగువారు పోషిస్తున్న పాత్ర మరువలేనిదని టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ అన్నారు. తెలుగు వారికున్న క్రమశిక్షణ, కుటుంబ విలువల పట్ల గౌరవం, వృత్తిపట్ల నిభద్దత, విద్య పట్ల శ్రద్ధ ఇతరులకు ఆదర్శప్రాయం అన్నారు. టెక్సాస్ రాష్ట్రంలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని వారు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని ఆ అధికారిక ప్రకటనలో పిలుపునిచ్చారు. అనంతరం డాక్టర ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ టెక్సాస్ రాష్ట్రంలో చిరకాలం గా నివశిస్తున్న తెలుగు వారి పట్ల టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ ప్రత్యేక గౌరవం, శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు. ఉగాది పండుగ వేడుకల్లో గవర్నర్ సతీమని సిసీలియా కూడా మమేకమయ్యారని తెలిపారు. అంతేకాకుండా ఉగాది రోజుని తెలుగు భాషా వారసత్వ దినంగా ప్రకటించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని వెల్లడించారు. -
సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శుభకృత్ నామ సంవత్సర ఉగాది న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసునకు సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం మరియు విశేషపూజలతో పాటు,మహాగణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి వార్లకు అభిషేకము మొదలగు విశేష కైంకర్యములతో పాటు శ్రీవారి కళ్యాణోత్సవానికి ఏప్రిల్ 2 స్థానిక సెరంగూన్ రోడ్‌లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా,గోవింద నామస్మరణల మధ్య నిర్వహించారు. కళ్యాణోత్సవానంతరం శ్రీవారు ఆస్ధానంలో ఉండగా నిర్వహించిన పంచాంగ శ్రవణంను అందరూ ఆసక్తిగా ఆలకించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సింగపూర్‌లో నిర్వహించిన వేడుకలకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీవారి కళ్యాణోత్సవానికి సింగపూర్ న్యాయ, హోం అఫ్ఫైర్స్ శాఖ మంత్రి కె షణ్ముగం సన్నిధిలో ఆశీస్సులు పొందారు. తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ తెలుగువారందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలపటంతో పాటు , కోవిద్ నిబంధనల మేరకు సింగపూర్ తెలుగు సమాజం గత రెండు సంవత్సరాలలో ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహించ లేకపోయిందని, ఎంతో కాలం తరవాత ఉగాది పండగ సందర్భంగా అందరినీ ప్రత్యక్షంగా కలవడం ఆనందంగా ఉందని అన్నారు. అలానే ఈ ఉగాది నాడు సుమారు 4000 మందికి సింగపూర్ లోనే అరుదుగా లభించే వేపపువ్వు అందించామని, సంప్రదాయబద్ధంగా తయారుచేసిన షడ్రచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడి ని ప్రత్యేక ప్యాకెట్ రూపం లో సుమారు 5000 మందికి పైగా అందించామని తెలియచేసారు. తిరుమల తిరుపతి దేవస్థానం మరియు తి. తి. దే. కార్యవర్గ సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి గారి సహాయ సహకారాలతో కళ్యణోత్సవం లో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్డూ ప్రసాదం, వడ, అభిషేక జలం, తలంబ్రాలు మరియు వస్త్రాలు అందచేసామని తెలిపారు. కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన పెరుమాళ్ దేవస్ధాన కార్యవర్గాలకు,దాతలకు, ప్రతి ఒక్కరికీ కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి పుల్లన్నగారి కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు, వాలంటీర్లకు, కార్యక్రమానికి హాజరైన మరియు లైవ్ ద్వారా వీక్షించిన అందరికీ కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేశారు. -
వినువీధుల్లో ఉల్కాపాతం కనువిందు
ఆసిఫాబాద్/కోటపల్లి/రెబ్బెన: ఉగాది రోజు శనివారం రాత్రి 8గంటల ప్రాంతంలో ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉల్కాపాతం కనువిందు చేసింది. ఆదిలాబాద్ జిల్లా తాంప్సీ, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం వెంచపల్లి మీదుగా సుపాక, ఆలుగామ గ్రామం వైపు మహారాష్ట్రలోని తేకడా గ్రామం వరకు ఉల్కలు జారిపడ్డాయి. కుమ్రుంభీం జిల్లా కేంద్రం ఆసిఫాబాద్, వాంకిడి, బెజ్జూర్, రెబ్బెన మండలాలతోపాటు మహారాష్ట్ర సరిహద్దులోని పలువురు ప్రజలు ఉల్కాపాతాన్ని వీక్షించారు. తోకచుక్కల మాదిరి ఉల్కలు భూమి మీదకు దూసుకు వస్తుండడంతో కొందరు సెల్ఫోన్లతో చిత్రీకించారు. నిప్పులు కక్కుతూ ఉల్కలు నేలరాలినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఉల్కాపాతం పడుతుందని టీవీ చానళ్లలో, సోషల్ మీడియాల్లో వార్తలు రావడంతో గ్రామస్తులు కొంత ఆందోళనకు గురయ్యారు. -
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఉగాది ఉత్తమ రచనల పోటీ
ఉగాది సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు నిర్వహించిన 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో విజేతల పేర్లను నిర్వాహకులు ప్రకటించారు. . ఈ సారి పోటీకి అమెరికా, కెనడా, న్యూజీలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్ డమ్, దక్షిణ ఆఫ్రికా, అబు ధాభి. హాంగ్ కాంగ్, సింగపూర్, ఐర్లాండ్, భారత దేశాల నుంచి ఎంట్రీలు వచ్చాయి. విజేతలకు నిర్వాహాకులు అభినందలు తెలిపారు. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి ఉత్తమ కథానిక విభాగం విజేతలు 1) “మరో కురుక్షేత్రం”- పాణిని జన్నాభట్ల (బోస్ట్‌న్, ఎంఏ, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) ‘‘ధారావాహిక హత్యలు” –నిర్మలాదిత్య (భాస్కర్ పులికల్ (టాంపా, ఫ్లోరిడా, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “భూలోక స్వర్గం” – డా. కె. గీత (మోర్గాన్హిల్, కాలిఫోర్నియా, ప్రశంసా పత్రం) 4) “ఆట – పోరు”- తాడికొండ కె. శివకుమార శర్మ, (గ్రేటర్ వాషింగ్టన్, డీసీ, ప్రశంసా పత్రం) ఉత్తమ కవిత విభాగం విజేతలు 1) “ఈ రాత్రికి సౌత్ ఆఫ్రికా” -గౌతమ్ లింగా (జోహెన్నస్‌బర్గ్, దక్షిణాఫ్రికా) ($116 నగదు పారితోషికం) 2) “ఏమంటేనేం?”- స్వాతి శ్రీపాద (డెట్రాయిట్, మిచిగాన్, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “ఒంటరి సాయంత్రాలు”- రవి మంత్రిప్రగడ (డబ్లిన్, ఐర్లాండ్ ప్రశంసా పత్రం) 4) “పువ్వు” - సతీష్ గొల్లపూడి (ఆక్లాండ్, న్యూజీలాండ్, ప్రశంసా పత్రం) “నా మొట్టమొదటి కథ” విభాగం విజేతలు 1) “క్రైమ్ నెవెర్ పేస్” – వీకేవీ ప్రసాద్ (హైదరాబాద్, ఇండియా, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) “రెండు నిమిషాలు- అమృత వర్షిణి (లోన్ట్రీ, యూఎస్ఏ) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “ఆడ పిల్ల”- షేక్ షబ్బర్ హుస్సేన్ (కడప, ఏపీ) ప్రశంసా పత్రం "నా మొట్ట మొదటి కవిత” విభాగం విజేతలు 1) “భూమిని హత్తుకునే క్షణాలకోసం”- అసిఫా గోపాల్ (నెల్లూరు, ఏపీ, $116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 2) “తను వెళ్ళిపోయింది”- రాజు గడ్డం (కడవిపల్లి గ్రామం, ఇండియా) ($116 నగదు పారితోషికం, ప్రశంసా పత్రం) 3) “శిల-కల”- ఆవుల కార్తీక (హైదరాబాద్) ప్రశంసా పత్రం -
ఉగాదికి తెలుగు లోగిళ్ల ముస్తాబు
సాక్షి, అమరావతి: శుభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగకు తెలుగు లోగిళ్లు ముస్తాబయ్యాయి. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణంతో పాటు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించనుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే ఉగాది వేడుకల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా పాల్గొననున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి 11.50 గంటల వరకు ఉగాది కార్యక్రమాలు కొనసాగనున్నాయి. వివిధ వేద పాఠశాలల విద్యార్థుల మంత్రోచ్ఛారణ మధ్య ముఖ్యమంత్రి దంపతులకు పూర్ణకుంభం స్వాగతం పలుకుతారు. 10.42 గంటలకు పంచాంగ శ్రవణం అనంతరం వ్యవసాయ, ఉద్యాన శాఖల ఉగాది క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా పంచాంగకర్తలతో పాటు వివిధ ఆలయాల్లో పనిచేసే అర్చకులు, వేద పండితులను సీఎం సన్మానించనున్నారని దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ తెలిపారు. అన్ని జిల్లాల్లో అర్చకులు, వేద పండితులకు సన్మానం ఉగాది పండుగ సందర్భంగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం వివిధ ఆలయాల్లో పనిచేసే అర్చకులతో పాటు వేద పండితులను ఘనంగా సన్మానించనుంది. ప్రతి జిల్లాలో కలెక్టర్ల పర్యవేక్షణలో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలను నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో 62 ఏళ్లకు పైబడిన ముగ్గురు ఆర్చకులతో పాటు ఒక వేద పండితుడిని సన్మానించనున్నారు. సన్మాన గ్రహీతలకు రూ.10,116 సంభావన, కొత్త వస్త్రాలను కలెక్టర్ల చేతుల మీదుగా అందజేస్తారు. ఇందుకు గాను దేవదాయ శాఖ ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. మరో వైపు రాష్ట్రంలోని అన్ని పెద్ద ఆలయాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించాలని, ఆ సందర్భంగా ఆ సమీపంలో ఆదాయం లేని ఆలయాల్లో పనిచేసే ఇద్దరు అర్చకులతో పాటు ఒక వేద పండితుడిని సన్మానించాలని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్ ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని.. -
శ్రీ శుభకృతు నామ సంవత్సరం రాశి ఫలితాలు
-
ఉగాది 2022: శ్రీ శుభకృత్ నామ సంవత్సర కర్తరీ నిర్ణయం
డొల్లు కర్తరీ ప్రారంభం: 04–05–2022, రా.12:04లకు అనగా (05/05) శుభకృత్‌నామ సంవత్సర వైశాఖ శుద్ధ చవితి బుధవారం రాత్రి తెల్లవారితే గురువారం మృగశిరా నక్షత్రం రోజున రవి భరణి నక్షత్రం మూడవ పాదంలో ప్రవేశించడంతో డొల్లుకర్తరీ ప్రారంభం అవుతుంది. పెద్ద కర్తరీ ప్రారంభం: 11–05–2022, రా.10:04లకు శుభకృత్ నామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి తత్కాల ఏకాదశి బుధవారం ఉత్తరఫల్గుణీ నక్షత్రం రోజున రవి కృత్తికలో ప్రథమపాదంలో ప్రవేశించడంతో పెద్దకర్తరీ ప్రారంభం అవుతుంది. ‘మృద్దారు శిలాగృహకర్మాణి వర్జయేత్’ మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మలు ప్రారంభించడానికి కర్తరీకాలం సరైనది కాదు. పై సూత్రం ఆధారంగా దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంఖుస్థాపన, ద్వారం ఎత్తుట, పాకలు, షెడ్లు, పెంకుటిళ్ళు, పైకప్పు నిర్మాణ పనులు ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. కర్తరీ పూర్తి (త్యాగం): 29–05–2022, ఉ.7:37లకు వైశాఖ బహుళ చతుర్దశి ఆదివారం కృత్తికా నక్షత్రం రోజున రవి రోహిణి నక్షత్రం రెండవ పాదంలో ప్రవేశించడంతో కర్తరీకాలం పూర్తవుతుంది. మూఢమి వివరములు శుక్ర మూఢమి: (15–09–2022 నుంచి 1–12–2022 వరకు) మూఢమి ప్రారంభం: 15–9–2022 శుభకృత్ నామ సంవత్సరం భాద్రపద బహుళ పంచమి గురువారం రోజున శుక్రుడు రవి నుండి ప్రాగస్తం (అనగా తూర్పుదిశగా అస్తమించడం వలన) మూఢమి ప్రారంభం అయినది. మూఢమి అంత్యం: 1–12–2022 మార్గశిర శుద్ధ అష్టమి రోజున శుక్రుడు రవి నుండి పశ్చాదుదయం (అనగా పశ్చిమ దిశగా ఉదయించడం) వలన మూఢమి పూర్తవుతుంది. నోట్: మూఢమికి ముందు కొన్ని రోజులు గ్రహాలకు వృద్ధత్వం అని పేరు. మూఢమి తరువాత బాలత్వం అని పేరు. ఆ రోజులలో శుభకార్యములు చేయరాదు. మకర సంక్రాంతి పురుష లక్షణమ్: 14–01–2023, రా.గం.2:14లకు (ఘ.49–01) స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సరం హేమంత ఋతువు పుష్య మాసం బహుళ సప్తమి తత్కాల అష్టమి శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం చిత్తా నక్షత్రం రెండవ పాదం కన్యారాశి సుకర్మయోగం బాలవకరణం తులాలగ్నం సమయంలో రవి మకరరాశి ప్రవేశం. సూ.ఉ.6:38. సూ.అ.5:40. దినప్రమాణం 27:36. -
ఉగాది 2022: నవనాయక ఫలితాలు (2022– 2023)
రాజు – శని శని రాజు అయిన సంవత్సరంలో విచిత్ర వర్షాలు కురిసి పంటలు సామాన్యంగా ఫలిస్తాయి. రాజక్రోధం అధికమై యుద్ధాలు, చోరభయం కలుగుతాయి. రెండవ పంటలు, పర్వత పంటలు బాగా పండుతాయి. ధరలు సరిగా ఉండవు. స్వల్పవర్షాలు కురుస్తాయి. జనులు కపట స్వభాంతో సంచరిస్తారు. అధర్మమార్గంలో నడుచుకుంటారు. తక్కువస్థాయి ప్రజలు సుఖపడతారు. ఇది సహజ శని లక్షణం. అయితే శని స్వక్షేత్ర సంచారి కావడం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. రాజవాహన ఫలములు అశ్వం రాజవాహనం– భూకంపాది ఉపద్రవాలు. రాజయుద్ధం, వర్షాభావం, పంటలు తగ్గడం, ఆహార ధాన్యాల కొరత, ధాన్యాదుల ధరలు పెరుగుదల, దుర్భిక్షం, జనహాని, ధనహాని కలుగుతాయి. మంత్రి–గురు గురువు మంత్రిగా ఉన్న సంవత్సరం అధిక ధాన్యపంటలు, సంపదలు, అధిక వర్షాలు, వృక్షాలు, çపంటలు బాగా ఫలిస్తాయి. భూమి గోకులంలా ఉంటుంది. సువృష్టితో భూమి సస్యసంపూర్ణమవుతుంది. భూమి సంపూర్ణ జలాలతో ఉంటుంది. రాజులు సమరోత్సాహం చూపుతారు. గ్రంథాతర వచనం: గోవులు అధిక క్షీరములు ఇచ్చును. ధాన్యము బాగా ఫలించును. క్షేమ, ఆరోగ్య, సుభిక్షములు కలుగును. సేనాధిపతి–బుధ మేఘాలకు వాయుబాధ ఎక్కువై కష్టంతో వర్షిస్తాయి. సస్యాలు కూడా దానికి తగినట్లుగానే ఫలిస్తాయి. ప్రజలు కామాచార పరాయణులై ఉంటారు. సస్యాధిపతి – రవి సూర్యుడు పూర్వ సస్యాధిపతి కావడం వల్ల ఈతిబాధలతో పూర్వ సస్యములు పీడింపబడును. ఉలవలు, శనగలు, కందులు, వేరుశనగ, ఎర్రధాన్యములు, మిర్చి, వక్కలు సమృద్ధిగా ఉత్పత్తి అయి ధరలు తగ్గి ఉంటాయి. తక్కిన ధాన్యములకు ధరలు పెరుగుతాయి. బంగారం, వెండి ధరలలో ఒడిదుడుకులు ఉంటాయి. అని ఇతర గ్రంథ వచనం. ధాన్యాధిపతి –శుక్రుడు అతివృష్టి సుభిక్షము మంచి పంటలు ప్రజలకు ఆరోగ్యము లభించును. అర్ఘాధిపతి–బుధుడు మంచి వర్షాలు కురుస్తాయి. ధరలు బాగుంటాయి. మంచి పంటలు పండుతాయి. పాషండులు, ఇంద్రజాలికులు, యువకులు దుçష్టులుగా పెరుగుతారు. మేఘాధిపతి –బుధుడు మేఘగర్జనలు పిడుగుపాటులు గాలితో కూడిన వర్షములు వచ్చును. మధ్య దేశమునందు మంచి వర్షము వచ్చును. సర్వత్ర మధ్యస్థాయి వృష్టి సస్యములుండును అని గ్రంథాంతరము. రసాధిపతి – కుజుడు కుజుడు రసాధిపతిగా ఉన్నప్పుడు జీలకర్ర, ఉప్పు, నెయ్యి, తైలము, బెల్లము మొదలగునవి ధరలు పెరగవు. నీరసాధిపతి – రవి : రత్నములు మణులు చందనము వెండి, బంగారము, రాగి మొదలగు ధాతు లోహములకు ధరలు తగ్గును. రాష్ట్ర, రాజ, ప్రజాక్షోభములు జననాశము జరుగునని గ్రంథాంతర వచనము. -
వేపకూ ‘ఉగాది’
సాక్షి, హైదరాబాద్: వేప చెట్లు మంచు ముత్యాలతో నిండినట్టు తెల్లటి పూతతో కళకళలాడుతున్నాయి. చైత్రమాసం ముంగిట ఇలా ఇవి కొత్త శోభను సంతరించుకోవటం సహజం. కానీ, ఈసారి దీనికో ప్రత్యేకత ఉంది. సరిగ్గా 4 నెలల కిందట వేప పరి స్థితి వేరు. ఉంటుందా లేదా అన్నంత ప్రమాదంలో పడిందా వృక్ష జాతి. కానీ.. నిలువెల్లా ఔషధ గుణాలను ఇముడ్చుకున్న వేప భయంకరమైన శిలీంద్ర దాడిని ఎదుర్కొంది. చిగుళ్లు, ఆకులు, కొమ్మలు.. క్రమంగా వాడి, ఎండిపోతూ చెట్టు నిలువెల్లా మాడిపోయే పరిస్థితిని అధిగమినించింది. చైత్రం ముంగిట ఆ చెట్టుకు మరో‘ఉగాది’ప్రారంభమైంది. కొత్త సంవ త్సరం వేళ షడ్రుచుల ఉగాది పచ్చడిలో తన ప్రత్యేకతను నిలుపుకొనేందుకు సిద్ధమైంది. పూతతో పునరుజ్జీవ కళ ఫోమోస్సిస్ అజాడిరక్టేగా పిలిచే డై–బ్యాక్ వ్యాధి వేపను ప్రభావితం చేసింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో వేపకు సోకిన ఈ వ్యాధి తెలంగాణలో గతేడాది ఆగస్టులో ప్రవేశించింది. తొలుత గద్వాల ప్రాంతంలో రిపోర్టు అయింది. ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పాకి నవంబర్ చివరి నాటికి ఉధృతమైంది. గాలిద్వారా ప్రబలిన ఈ శిలీంద్రం దాదాపు అన్ని వేపచెట్లకు సోకింది. కొమ్మల చివర్లలో ప్రారంభమై క్రమంగా చెట్టు అన్ని ప్రాంతాలకు పాకుతూ ఆకులు మాడిపోయేలా చేసింది. శాస్త్రవేత్తలు దీనిని అతితీవ్ర వ్యాధిగా గుర్తించారు. దీంతో రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వం దృష్టికి తెచ్చి, వెంటనే దాని నివారణకు పిచికారీ చేయాల్సిన మందులను సూచించింది. కానీ స్వతహాగా కీటక నాశని లక్షణాలున్న వేప.. జనవరి చివరి నాటికి శిలీంద్ర ప్రభావా న్ని తగ్గించుకోగలిగింది. వాతావరణంలో వచ్చి న మార్పులతో శిలీంద్రం క్రమంగా బలహీనపడింది. దీంతో పుంజుకున్న వేప మరొకసారి నిండుగా పూత పూసి పునరుజ్జీవ కళను సంతరించుకుంది. చనిపోయిన చెట్లు ఒక శాతంలోపే.. డై–బ్యాక్‌కు గురైన వేప చెట్లు క్రమంగా పుంజుకుని పూర్వ వైభవానికి చేరుకుంటున్నాయని, ఇప్పట్లో వాటికి మళ్లీ ప్రమాదం ఉండకపోవచ్చని అగ్రి వర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. డై–బ్యాక్‌కు గురైన చెట్లలో దాదాపు ఒక శాతం చెట్లు డిక్లైన్ (క్షీణత) బారినపడ్డట్టు గుర్తించారు. వాటిల్లో దాదాపు 0.7 శాతం చెట్లు ఈపాటికే చనిపోయాయని, మిగతావి కూడా కోలుకునే పరిస్థితి ఉండకపోవచ్చని వర్సిటీ పరిశోధన విభాగం సంచాలకులు జగదీశ్వర్ ‘సాక్షి’తో చెప్పారు. డై–బ్యాక్‌కు గురై కోలుకునే చెట్లకు కావాల్సిన పోషకాలు సకాలంలో అందాల్సి ఉంటుంది. కానీ చెట్ల చుట్టూ నీటిని పీల్చుకునేందుకు అవాంతరం కలిగించేలా కాంక్రీట్ చేసి ఉండటం, మురికినీరు నిరంతరం చుట్టూ నిలిచి ఉండటం లాంటివి చెట్లు చనిపోవటానికి ఎక్కువ కారణమవుతున్నాయని గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. పరీక్షల్లో కానరాని శిలీంద్రం.. వేప డై–బ్యాక్‌కు గురైన సమయంలో చాలా ప్రాంతాల నుంచి చెట్ల నమూనాలు సేకరించి వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ల్యాబ్‌లో కల్చర్ టెస్టులు నిర్వహించారు ఇందులో చాలా రకాల శిలీంద్రాలు గుర్తించా రు. కానీ నాలుగైదు రకాలు ఎక్కువగా ఉన్న ట్టు తేలింది. ఇప్పుడు శిలీంద్రాన్ని జయించిన చెట్ల నుంచి మళ్లీ నమూనాలు సేకరించి వారం కింద మళ్లీ పరీక్షించారు. ఈసారి వాటిపై శిలీంద్రాల అవశేషాలు కనిపించలేదని పేర్కొన్నారు. పూత పూర్తిగా సురక్షితమే శిలీంద్ర ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో వేపపై పిచికారీ చేయాల్సిన రసాయనాలను మేం సూచించాం. కానీ ఇప్పుడు వేప పూర్తిగా కోలుకుంది. దాని పూత కూడా పూర్తిగా సురక్షితమే. ఉగాది పచ్చడిలో నిరభ్యంతరంగా వినియోగించొచ్చు. ఈ సమయంలో వేపచెట్లపై పురుగుమందుల పిచికారీ చేయకూడదు. అది పర్యావరణం, ఇతర జంతువులపై ప్రభావం చూపుతుంది. – జగదీశ్వర్, అగ్రి వర్సిటీ పరిశోధన విభాగం సంచాలకులు -
సంస్కృతీ వటవృక్షాన్ని రక్షించుకోవాలి
ఉగాది పండుగ తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ. తెలుగు నూతన సంవత్సరాదిగా పిలుచుకునే ఈ రోజున... జీవితంలో ఎదు రయ్యే వివిధ రకాల అను భవాలకు ప్రతీకగా భావించే షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి చేసుకుని తినే ఆచారం ఉంది. ఇందులో కారం, పులుపు, వగరు, ఉప్పు, తీపి, చేదు రుచులు ఉంటాయి. ఈ పచ్చడి తినడం... ఒక రకంగా పర్యావరణానికి ఇచ్చే గౌరవమే. ఇందులో వాడే ప్రతి వస్తువు ప్రకృతి ప్రసాదించిన చెట్ల నుంచి వచ్చిన పదార్థమే. ఇప్పుడు ఇందులో చేదును ప్రసా దించే వేప చెట్ల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘అజారక్టా ఇండికా’ అనే శాస్త్రీయ నామం కలి గిన వేప చెట్టును పురాణాలలో లక్ష్మీదేవికి ప్రతీకగా చెప్పారు. ఈ భూమి మీద ఎక్కువగా మన దేశంలోనే కనిపించే చెట్టు వేప. ఈ ఆకులలో 150 రకాల విశి ష్టమైన రసాయనాల సమ్మేళనం ఉంది. పురాతన కాలం నుంచి వేపను వివిధ అవసరాలకు, చికిత్సలకు వాడుతున్నారు. వేప చెట్టు వేర్ల నుంచి చిగుర్ల వరకూ అన్ని భాగాలనూ భారతీయులు ఉపయోగించుకుం టున్నారు. ఆయుర్వేద వైద్యంలో వేపకు ఎంతో ప్రాధాన్యం వుంది. పేగుల్లో పురుగులు, మొలలు, దురదలు, దద్దుర్లు, పచ్చకామెర్లు, అల్సర్లు, అతి మూత్ర వ్యాధి; తామర, కుష్ఠు, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు; జ్వరం, మలేరియా, రక్త సంబంధ వ్యాధులను తగ్గించడానికి ఈ వేప చెట్టు ఎంతో ఉపయోగకారి. మనదేశంలో దంతధావనం ఎక్కు వగా వేప పుల్లతోనే చేయడం మనకు తెలిసిన విష యమే. అతి ప్రాచీన కాలం నుంచీ పంటపొలాలకు వేప పిండి, వేప నూనెలను ఎరువుగా, కీటక నాశినిగా వాడుతున్నారు. మన సంప్రదాయ వ్యవసాయంలో వేప విడదీయరాని భాగం. ఇంతటి విశిష్టత కలిగిన ఈ వేప చెట్టు మనుగడ ప్రమాదంలో పడింది. గత రెండు మూడు సంవత్సరా లుగా వేపచెట్లు తరచుగా ఎండిపోతున్నాయి. చాలా చోట్ల కూలడమూ కనిపిస్తోంది. ముఖ్యంగా తెలం గాణ, రాయలసీమ ప్రాంతాలలో ఇటీవల ఈ సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. గత మూడు నాలుగు సంవ త్సరాల క్రితం గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ సమస్య వెలుగులోకి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ జీవవైవిధ్య విభాగం ప్రత్యేక అధ్యయనం చేసింది. బాగా ఎదిగిన వేపచెట్లపై ‘లొరాంథస్’ అనే పరాన్న మొక్క ఎదగ డమే ఇందుకు కారణమని గుర్తించారు. భారీగా ఎదిగిన వేప చెట్లను ఆసరా చేసుకుని ఎదిగే ఈ లొరాంథస్ వేప చెట్టులో ఉండే నీటితో పాటు లవణాలు, పోషకాలను పీల్చుకుంటుంది. ఫలితంగా వేప చెట్టు ఎండిపోయి కూలిపోతుంది. అయితే వేపచెట్లపై ఈ లొరాంథస్ను గుర్తించిన వెంటనే, చెట్టును మొత్తం కొట్టేయకుండా, అది ఉన్న కొమ్మను నరికివేయడం ద్వారా మిగతా చెట్టుకు వ్యాపించ కుండా కాపాడవచ్చునని అప్పట్లో జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. అయితే ఇటీవల కొద్ది నెలలుగా ‘డిపాక్ డిసీజ్ ఆఫ్ నీవ్ు’ అని వ్యవహరించే మరో వ్యాధితో వేప చెట్లు చనిపోవడం వెలుగు చూసింది. ఈ వ్యాధి నుంచి కాపాడాలంటే వైరస్ సోకిన కొమ్మలను కత్తరించి కాల్చివేయడం, అలాగే చెట్టుకు ఎక్కువ నీరు పోయడం వంటి చర్యలు చేపట్టాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా నగరీకరణ వల్ల కాంక్రీట్ నిర్మాణాలు రావడం వల్ల చెట్టు కాండం వరకూ నిర్మాణాలు జరపడంతో చెట్టు వేర్లకు అందాల్సిన నీరు, పోషకాలు తగినంత అందకపోవడం వల్ల కూడా చెట్లు అంతరిస్తున్నాయి. ఎంతో విలువైన ‘వేప చేదులోని తియ్యదనాన్ని’ భావి తరాలకు అందించడానికి ప్రభుత్వాలు వేపచెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలి. మోతె రవికాంత్ వ్యాసకర్త ‘సెఫ్’ వ్యవస్థాపక అధ్యక్షులు మొబైల్ : 94919 24345+ -
Ugadi 2022: షడ్రుచుల ఉగాది
-
ఉగాది పచ్చడిలో ఎన్ని చెట్ల అవసరం ఉంది? వాటి గురించి పిల్లలకు తెలుసా!
ఉగాది సమయం ఆ వేప పూత ఆ మావి వగరు ఆ చింత చిగురు ‘పదిగ్రాముల వేపపూత 200 రూపాయలు’... ఆన్లైన్లో చూసి కొనేంతగా ఎదిగాం. ప్రకృతితో కలిసి చేసేదే పండగ... ఉగాది వేళలో మావిచిగురు కోకిల పాట... గాలికి ఊగే వేపపూత... ఈకాలపు పిల్లలకు తెలియని దూరానికి చేరాం. గతంలో వేప చెట్టు, మావిడి చెట్టు... ప్రతి వీధిలో ఉండేవి. ఇప్పుడు? పండగ హడావిడికి సిద్ధమవుతున్నాం. ప్రకృతి స్తబ్దతను గమనిస్తున్నామా? ఉగాది పచ్చడిలో ఎన్ని చెట్ల అవసరం ఉంది? వేపచెట్టు. వేపపువ్వు చేదుకి. మామిడి చెట్టు. మామిడి పిందె వగరుకి. చింతచెట్టు. పులుపు రుచికి. కొన్నిచోట్ల కొబ్బరి కోరు వేస్తారు. అంటే కొబ్బరి చెట్టు. మరికొన్ని చోట్ల బాగా మగ్గిన అరటిపండు ముక్కలు కలుపుతారు. అంటే అరటి చెట్టు. ఇవన్నీ ఇప్పుడు ఎన్ని ఇళ్లల్లో ఉన్నాయి. పిల్లలు ఎంతమంది వీటిని తాకి చూస్తున్నారు. ఎందరు వీటి నీడలో ఆడుతున్నారు. ఎందరు వీటిని చూశాం అని చెబుతున్నారు. నగరం అయినా.. పట్టణం అయినా.. పల్లె అయినా. ఆ వేప కొమ్మలు... చెట్టు పెంచడం మన ఆచారం. చెట్టుతో పాటు ఇల్లు ఉండాలనుకోవడం మన సంస్కృతి. ప్రతి వీధికి వేప చెట్టు అరుగు ఉండేది. వీధిలోని ఒకటి రెండు ఇళ్ల వాళ్లయినా ముంగిలిలో వేప చెట్టు వేసుకునేవారు. కొన్ని చెట్లు పెరిగి పెద్దవై ప్రహరీగోడను కప్పేసేవి. చెట్ల కొమ్మలు ఇంటి వైపుకు వాలి నీడను పెంచేసేవి. పిల్లలు రాలిన వేప ఆకులు తొక్కుకుంటూ ఆడుకునేవారు. పసుపుపచ్చటి వేపపండ్లు తుంచి వగరు తీపితో ఉండే వాటి రుచిని చూసేవారు. వాటి గింజలను గుజ్జును పారేసి ఖాళీ డిప్పలలో పుల్లను గుచ్చి ఆడుకునేవారు. వేణ్ణీళ్లలో వేపాకులను కలిపి తల్లులు స్నానం చేయిస్తుండేవారు. నెలకు ఒకటి రెండుసార్లు లేత వేపాకులను నూరి చిన్ని ముద్దలను చేసి చక్కెర అద్ది మింగించేవారు. దడుపు చేస్తే, జ్వరం వస్తే వేప మండలు దిష్టి తీసి నెమ్మది కలిగించేవారు. వేపపుల్లతో పళ్లుతోమడం అలవాటు చేసేవారు. వేపబద్దతో నాలిక గీసుకోవడం ఆరోగ్యం. ఉగాది పండగ రోజు వేపపూత పిల్లల చేతే కోయించేవారు. వేప బెరడుకు బంక కారితే పిల్లలు దానిని గిల్లి సీసాల్లో దాచుకునేవారు. వేప కాండంపై పాకే గండు చీమలు, గెంతుతూ వెళ్లే ఉడతలు, కొమ్మల్లో గూడు పెట్టే కాకులు, ఇంట్లో కోళ్లు పెంచుతుంటే గనక అవి ఎరిగి రాత్రిళ్లు ఆ కొమ్మలపైనే తీసే నిద్ర... పండగలో చెట్టును పెట్టింది చెట్టును కాపాడుకోమని. ప్రకృతిని తెలుసుకోమని. ఇవాళ పెద్ద చెట్లు వేస్తున్న ఇళ్లు ఎన్ని? పెద్ద చెట్లకు వీలైన స్థలం ఎక్కడ దొరుకుతోంది? పూల కుండీలు, మిద్దెతోట... సర్దుబాటు జీవనం... రెక్కలు సాచిన విశాలమైన వృక్షాలు గత చరిత్రగా మారాయి. ఆ మామిడి పిందెలు... మామిడి చెట్టు ఉన్న ఇంటికి మర్యాద జాస్తి. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా వచ్చి మామిడి ఆకులు అడుగుతారు. ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటే ‘ఆ మామిడి చెట్టున్న ఇల్లు’ అని చెబుతారు. మామిడి చెట్లు చాలామటుకు శుభ్రంగా ఉంటుంది. వాటి గుబురు ఆకులను చూస్తే ఆనందం కలుగుతుంది. వచ్చిన బంధువులంతా ‘ఏ మామిడి’ అని ఆరా తీస్తారు. బంగినిపల్లో, బెంగుళూరో, నీలమో, నాటు మామిడో... ఏదో ఒక జవాబు చెప్పాలి. పిల్లలు మామిడి కొమ్మలకు తాళ్లు కట్టి ఊయల ఊగుతారు. చిన్న కొమ్మలపై ఎక్కి కూచుంటారు. వేసవి వస్తే ఒళ్లంతా విరగబూసే మామిడి పూత మీద అందరి కళ్లు పడతాయి. పిందెల వేస్తున్నప్పటి నుంచి దిష్టి తగలకుండా యజమానులు నానా పాట్లు పడతారు. ఉండుండి పాడిగాలి వీచి పిందె రాలితే అదో బాధ. కోతుల దండు ఊడి పడితే వాటిని తరిమికొట్టే వరకూ గాబరా. కాయ గుప్పిటంత పెరిగాక కోసి పచ్చడి చేస్తే ఆ రుచి అద్భుతం. ఉగాది పచ్చడి మన ఇంటి కాయ తెచ్చే రుచి అద్భుతం. చిటారున గుబురులో పండిన కాయ పిల్లలు నిద్ర లేచి చెట్టు కిందకు వెళితే రాలి కనపడుతుంది. కోయిలలు వచ్చి పాట పాడి పిల్లలను బదులివ్వమంటుంది. చిలుకలు పండిన కాయలను సుష్టుగా భోం చేసి ఎర్ర ముక్కులు చూపించి పోతాయి. మామిడి చెట్టు ఉంటే ఇంట్లో ఇంకో మనిషి ఉన్నట్టే. కాని కారు పార్కింగ్ కోసం ఆ చెట్టును వదిలేసిన ఇళ్లే ఇప్పుడు. పిల్లలూ... మామిడిపండ్లను మీరు మోర్ మార్కెట్స్‌లోనే చూడక తప్పదు. చింతచెట్టు కథలు జాస్తి... చింతచెట్టు ఇంట్లో పెంచరు. ఆ చెట్టు ఊరిది. ప్రతి ఊళ్లో చింతచెట్టు అరుగు ఉంటుంది. అది మనుషులు కూడా తమ చింతలు మాట్లాడుకునేంత గాఢమైన నీడను కలిగి ఉంటుంది. వేసవి మధ్యాహ్నాలు చింత చెట్టు కింద పట్టే నిద్ర సామాన్యంగా ఉండదు. చింతకాయలు కాస్తే పిల్లలు వాటిని రాళ్లతో రాల్చి నోట పెట్టుకుంటారు. ఆడవాళ్లు దోటీలు పట్టుకుని వచ్చి చింత చిగురు కోసి వండుతారు. ఊరికి కొత్తగా ఎవరైనా వస్తే చింత చెట్టు ఆరా తీస్తుంది. గూడు లేని వాళ్లకు రాత్రిళ్లు అది ఇల్లు అవుతుంది. కాని చింత చెట్టు అంటే భయం కూడా ఉంటుంది. దెయ్యాలు దానిలో టూ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకుని ఉంటాయని పుకార్లు ఉంటాయి. చింతచెట్టు కింద పడుకున్నవారి గుండెల మీద రాత్రుళ్లు దెయ్యం కూచుంటుంది. చింతచెట్టుకు రాత్రిళ్లు కార్బన్ డై ఆక్సైడ్ విడిచే సామర్థ్యం ఎక్కువగా ఉండటం వల్లే తగిన ఆక్సిజన్ అందక ఈ భ్రాంతులు. చింతచెట్టు లేని బాల్యం చాలా బోసి. కొంగలు వాలడానికి ఇష్టపడే చెట్టు అది. ఇవాళ ఊళ్లలో ఫ్లెక్సీలు ఉన్నాయి. విగ్రహాలు ఉన్నాయి. చింత చెట్టు మాత్రం లేదు. ఆలోచించాలి అందరం... గతంలో ఎన్నో ఇళ్ల పెరళ్లలో అరటి చెట్లు ఉండేవి. చాలా ఇళ్లల్లో కొబ్బరి చెట్లు వేసేవారు. బాదం చెట్లు పెంచే ఇళ్లకు లెక్క ఉండేది కాదు. చెట్టుకు వదిలాకే కట్టుబడికి స్థలం వదిలేవారు. కట్టేది ఒక ఇల్లయితే చెట్టు నీడ ఒక ఇల్లు అని ఆ కాలంలో తెలుసు. కాని ఇవాళ కాంక్రీట్ ఇళ్లు మాత్రమే కట్టి వేడి పెంచుతున్నాం. ఎండ మండుతోందని అవస్థలు పడుతున్నాం. ఉగాది అంటే చెట్లకు ప్రాభవ సమయాలు ఉన్నట్టు బతుకుకు కూడా ప్రాభవ సమయాలు ఉంటాయని తెలుసుకోవడం. తీపిని ఆస్వాదించడంతో పాటు చేదును మింగాలని తెలుసుకోవడం. తుఫానొచ్చి కొమ్మలు విరిగి పడినా మళ్లీ చిగురించవచ్చని తెలుసుకోవడం. చెట్టుకు పిల్లల్ని దూరం చేయవద్దు. బాల్యాన్ని అరుచితో నింపొద్దు. ఆలోచించండి. కొత్త ఉగాదికి ఆహ్వానం పలకండి. -
Fashion: ఉగాదికి ఓణీ... తక్కువ ఖర్చుతోనే ఇలా అందంగా!
కాలం మంచితనంతో నేసిన ఆనందాలే మన వేడుకలు. నలుగురు కలిసే చోట.. నవ్వుల విందులు వేసే చోట.. సంబరాలు నట్టింట కొలువుండే చోట .. పండగ కాంతి దేదీప్యంగా వెలగాలంటే మన చేనేతలతో మరింత కొత్తగా సింగారించుకోవాలి ఏడాది పొడవునా ఇంటింటా శుభాలు నిండాలి. తెలుగింటి మగువల సంప్రదాయ ఆహార్యం లంగావోణీ. పదహారణాల పోలికతో హృదయాల్లో కొలువుండే అందమైన రూపం. అందుకే మార్కెట్లోకి ఎన్ని డిజైనర్ డ్రెస్సులు వచ్చినా లంగా– ఓణీ ప్రాభవం ఇసుమంతైనా తగ్గలేదు. ఈ ప్రకృతి పండగ మరింత శోభాయమానంగా జరపుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాయి మన చేనేతలు. హైదరాబాద్ మేడ్చల్‌లో ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ తరుణి సిరిగిరి వేడుకలలో లంగా– ఓణీ చేనేత హంగామా గురించి ఇలా అందంగా పరిచయం చేస్తున్నారు. ‘‘సాధారణంగా వేడుకల్లో లెహంగా డిజైన్స్ భారీ ఫ్లెయిర్, నెటెడ్ మెటీరియల్‌తో చూస్తుంటాం. కానీ, ఇది వేసవి కాలం. ఈ సీజన్‌కి తగ్గట్టు మన అలంకరణ కూడా ఉంటే రోజంతా సౌకర్యంగా ఉండటంతో సందర్భాన్ని మరింతగా ఆనందిస్తాం. పచ్చని సింగారం కంచిపట్టు సంప్రదాయ వేడుక ఏదైనా కంచిపట్టు లేకుండా పూర్తవదు అనేది మనందరికీ తెలిసిందే. సాధారణంగా లంగాబ్లౌజ్ ఒక రంగు కాంబినేషన్ తీసుకొని దుపట్టా కాంట్రాస్ట్ కలర్ వాడతారు. ఇక్కడ పచ్చదనం మరింతగా హైలైట్ అవడానికి బ్లౌజ్, దుపట్టా రెండూ ఒకే రంగులో ఉన్నవి ఉపయోగించాను. ఇష్టమైన ఇకత్ ప్లెయిన్ ఇకత్ ఫ్యాబ్రిక్‌ను లెహంగాకు తీసుకున్నప్పుడు బార్డర్ లేకపోతే ఎలా అని ఆలోచిస్తారు. అందుకే, అంచుభాగాన్ని ఎంబ్రాయిడరీ చేసి, ఈ లెహెంగాను డిజైన్ చేశాను. అలాగే, బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అదేరంగు ఇకత్తో డిజైన్ చేసి, కాంట్రాస్ట్ ఓణీని వాడాను. ఇది ఏ సంప్రదాయ వేడకకైనా అమ్మాయిలకు ఎవర్గ్రీన్ కాన్సెప్ట్ అవుతుంది- తరుణి సిరిగిరి, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ భామకు గొల్లభామ తెలంగాణకే ప్రత్యేకమైన గొల్లభామ చేనేతకు అంతర్జాతీయంగానూ పేరుంది. కాటన్ మెటీరియల్ అనగానే పెదవి విరిచేవారికి కూడా సరైన ఎంపిక అవుతుంది. గొల్లభామ కాటన్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన లెహెంగా, దీని మీదకు కలంకారీ దుపట్టాను ఉపయోగించాను. తక్కువ ఖర్చుతో హ్యాండ్లూమ్స్ని పార్టీవేర్‌గానూ ఉపయోగించవచ్చు అనడానికి ఇదో ఉదాహరణ. సింపుల్ అనిపించే ఫ్యాబ్రిక్స్‌ని కూడా భిన్నమైన లుక్ వచ్చేలా హైలైట్ చేసుకోవచ్చు. గ్రాండ్‌గా గద్వాల్ పట్టు వివాహ వేడుకల్లో అమ్మాయి అలంకరణ గ్రాండ్‌గా కనిపించాలంటే పట్టు లంగా ఓణీ సరైన ఎంపిక అవుతుంది. పెద్ద జరీ అంచు ఉన్న మెటీరియల్‌ను ఇందుకు ఎంచుకోవాలి. అలాగే ఓణీ కూడా జరీ బార్డర్‌తో ఉన్నది ఎంచుకుంటే కళగా కనిపిస్తారు. పెద్ద అంచు ఉన్న గద్వాల్ పట్టుతో డిజైన్ చేసిన లంగా ఓణీ కాంబినేషన్ ఇది. – ఎన్.ఆర్ -
అనకాపల్లి నూకాంబిక ఆలయంలో కొత్త అమావాస్య పూజలు
-
సింగపూర్‌లో తొలిసారిగా శ్రీమద్ భాగవత సప్తాహం
సింగపూర్‌లో ప్రఖ్యాత తెలుగు సంస్థలు శ్రీ సాంస్కృతిక కళాసారథి, తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగు భాగవత ప్రచార సమితి, కాకతీయ సాంస్కృతిక పరివారంల సంయుక్తంగా ఉగాది పండగని పురస్కరించుకుని పంచ మహా సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ చేతుల మీదుగా శ్రీమద్ భాగవత సప్తాహాం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. 2022 ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతీరోజు సాయంత్రం 4:30 గంటలకు (సింగపూర్‌టైం రాత్రి 7 గంటలకు) శని, ఆదివారాల్లో రాత్రి 10:30 గంటలకు (సింగపూర్ టైం మధ్యాహ్నం ఒంటిగంట) వర్చువల్‌గా ఈ వేడుకలు నిర్వహిస్తారు. యూట్యూబ్, ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
ఏప్రిల్ 2న కొత్త జిల్లాలను ప్రారంభించనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యస్థీకరణ అంశం కొలిక్కి వస్తోంది. వారం రోజుల్లో తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో అధికారులు కార్యాలయాలను గుర్తించారు. కొత్తగా ఏర్పాటయ్యే 13 జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది రోజున (ఏప్రిల్ 2) లాంఛనంగా ప్రారంభిస్తారు. కొత్త జిల్లాలకు కలెక్టర్, ఒక జేసీ, ఎస్పీని ప్రభుత్వం నియమించనుంది. రెవెన్యూ డివిజన్లు కూడా పెరిగే అవకాశం ఉంది. పోలీస్ శాఖలోనూ విభజనకు కసరత్తులు జరుగుతున్నాయి. మరోవైపు ఆర్థిక శాఖ కూడా ఉద్యోగుల విభజన అంశాన్ని పూర్తి చేస్తోంది. ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల పేర్లు మార్పు, కొన్ని మండలాల జిల్లాల మార్పులు వంటి అంశాలను ప్రభత్వుం పరిశీలిస్తోంది. చదవండి: (కాలిఫోర్నియా టు అనాతవరం.. సొంతూరిలో సాఫ్ట్వేర్ కంపెనీ) -
ఉగాదికి ఉద్యోగ నోటిఫికేషన్లు.. తొలివిడతలో భారీ సంఖ్యలో భర్తీ?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ముమ్మరంగా కసరత్తు సాగుతోంది. ఉగాది నాటికి తొలివిడత నోటిఫికేషన్ జారీచేసే అవకాశముంది. ఏప్రిల్ 2న ఉగాది పండుగ జరుపుకోనుండగా, మరో రెండువారాల్లోగా తొలి విడత నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 27 ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల శాసనసభలో ప్రకటించిన విషయం తెలిసిందే. దశలవారీగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడతగా 30 వేల నుంచి 40 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు సమాచారం. ఎక్కువ మంది ఈ మెగా ఉద్యోగమేళాలో భాగం పంచుకోవాలన్న ఉద్దేశంతో విడతలవారీగా ఈ నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు సమాచారం. ఒకేసారి 80 వేల పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయడం వల్ల ఇబ్బందులుంటాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. కాగా, వివిధ శాఖల నుంచి వస్తున్న ఉద్యోగ ఖాళీల సమాచారంపై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. గురువారంనాటికి 10 ప్రభుత్వ శాఖలు కొలువుల భర్తీకి అనుమతి కోరుతూ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపించాయి. హోం, వైద్యారోగ్య, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను ఆర్థిక శాఖ పరిశీలిస్తోంది. హోంశాఖలో 18,334 పోస్టులు, వైద్యారోగ్య శాఖలో 12,755, పాఠశాల విద్యాశాఖలో 13,086 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు కొన్ని మార్పులను సూచించగా ఒకటి రెండు రోజుల్లో ఆ శాఖల నుంచి తుది ప్రతిపాదనలు మళ్లీ ఆర్థిక శాఖకు అందనున్నాయి. సీఎం సూచనలు అందిన వెంటనే జీవోలు సీఎం కేసీఆర్ నుంచి సూచనలు అందిన వెంట నే శాఖల వారీగా తొలివిడత పోస్టుల భర్తీకి పరిపాలనాఅనుమతులు జారీ చేస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేయనుంది. ఆ వెంటనే సంబంధిత శాఖల సమన్వయంతో ఆయా నియామక సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్నాయి. వివిధ శాఖల నుంచి వస్తున్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమాచారంలో ఎక్కడా తేడా రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. నోటిఫికేషన్లో ఎలాంటి తప్పులు రాకుండా తగిన చర్యలు చేపట్టారు. తొలివిడత నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియ రెండువారాల్లో పూర్తి కానుందని, వచ్చే నెల ప్రారంభంలో నోటిఫికేషన్లు రావచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా.. ఉగాది ఉత్తమ రచనల పోటీ
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” రెండు విభాగాలు ఉన్నాయి. ప్రధాన విభాగంలో భారతదేశం మినహా విదేశాలలో ఉన్న తెలుగు రచయితల నుంచి అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నారు. కథలు, కవితల విభాగాల్లో ఎంట్రీలు పంపవచ్చు. బహుమతిగా 116 డాలర్లు అందిస్తారు. యూనికోడ్ ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించాలి. వీలయినంత వరకూ అన్ని రచనలూ యూనికోడ్ (గౌతమి ఫాంట్స్) లో మాత్రమే పంపించాలి. చేతివ్రాతలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. PDF, JPEG లలో పంపించినా ఆమోదిస్తారు. తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చు. ఏప్రిల్ 1న విజేతల వివరాలు 2022 ఏప్రిల్ 1న ఉగాది పండుగ రోజు లేదా అంతకు ముందు కానీ ప్రకటించబడతాయి. విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం. 2022 మార్చి 15లోగా ఎంట్రీలు పంపాలి. బహుమతి పొందిన రచనలూ, ప్రచురణ కి అర్హమైన ఇతర రచనలూ కౌముది.నెట్ లోనూ, మధురవాణి. కామ్, తదితర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి. ఆసక్తి ఉన్న వారు తమ రచనలను sairacha@gmail.com, vangurifoundation@gmail.com ఈమెయల్ చేయగలరు. -
కొత్త జిల్లాలకు ముహూర్తం ఖరారు.. సీఎం వైఎస్ జగన్ ఆర్డర్స్
-
ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కన్నుమూత
-
ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మహామహోపాధ్యాయ, పౌరాణిక సార్వభౌమ, అభినవ వ్యాస బిరుదాంకితులు, ప్రముఖ పురాణ వేదశాస్త్ర పండితులు, ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి (96) శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న చంద్రశేఖర శాస్త్రి స్వస్థలం గుంటూరు జిల్లా క్రోసూరు. ఆయనకు భార్య సీతారామ ప్రసన్నలక్ష్మి, ఆరుగురు కుమారులు రామకృష్ణ, వీరరాఘవశర్మ, రామనాథ్, రామారావు, దత్తాత్రేయ, దక్షిణామూర్తి, ఇద్దరు కుమార్తెలు ఆదిలక్ష్మి, సరస్వతి ఉన్నారు. చంద్రశేఖర శాస్త్రి భాతిక కాయానికి శనివారం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లాది కన్నుమూతపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం జగన్ దిగ్భ్రాంతి చంద్రశేఖర శాస్త్రి మరణంపట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్‌తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలను అవపోసన పట్టిన మహా పండితుడు ఆయనని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా బాధించింది: కిషన్‌రెడ్డి మల్లాది చంద్రశేఖర శాస్త్రి శివైక్యం చెందడంపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్రంగా బాధించిందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
అమెరికా: జార్జియాలో తెలుగుకు దక్కిన ఖ్యాతి
అట్లాంటా: తెలుగు జాతి, సంప్రదాయం ప్రపంచ పటంపై వెలుగుతోంది. తాజాగా అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో తెలుగుకు అద్భుతమైన గుర్తింపు లభించింది. అక్కడ అధికారికంగా తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జార్జియా రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 12వ తేదీ ఉగాది సందర్భంగా ఆ రోజును తెలుగు భాష, హెరిటేజ్ దినోత్సవంగా గుర్తిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ బ్రెయిన్ పి.కెంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలుగువారి సేవలను జార్జియా ప్రభుత్వం ప్రశంసించింది. దాంతోపాటు తెలుగు సంప్రదాయం, భాష బాగుంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా నార్త్ స్టెయిర్స్ ఆఫ్ జార్జియాలో జరిగిన ఉగాది వేడుకలో తెలుగు వారికి దానికి సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని అధికారులు అందించారు. జార్జియాలో తెలుగువారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వైద్యులు, ఇంజనీర్లుగా జార్జియా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నారు. దాదాపు 500 మంది అక్కడి విద్యా రంగంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులుగా ఉన్నారు. భారతదేశ సంప్రదాయాన్ని పరిరక్షిస్తూనే తెలుగు వారుగా గుర్తింపు పొందుతున్నారు. ఏప్రిల్ 12వ తేదీని తెలుగు భాష, హెరిటేజ్ దినోత్సవంగా గుర్తించి ఆ రోజు పాటలు, ఆటలు, సాహిత్య పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. -
లండన్ లో ఘనంగా ఉగాది వేడుకలు
లండన్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలను 24 ఏప్రిల్ 2021న ఘనంగా జరుపుకున్నారు. గత సంవత్సరాలకు భిన్నంగా తొలిసారి అంతర్జాలంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గేయరచయిత భువనచంద్ర హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా సింగర్ ఎస్పీ శైలజ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తాల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకోగా, ఎంపీ సీమ మల్హోత్రా యూకేలో తాల్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా అమరగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖచిత్రంతో ఉన్న తాల్ ‘మా తెలుగు’వార్షిక సంచికను విశిష్ట అతిథులుగా ప్రముఖ రచయిత కాళిపట్నం రామారావు, సాహితివేత్త ఓలేటి పార్వతీశం ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత్రి హేమ మాచర్ల సంపాదకీయం వహించిన ఈ సంచిక విడుదలకు సూర్య కందుకూరి మరియు తాల్ వైస్ చైర్మన్ రాజేష్ తోలేటి సహకరించారు. ఆద్యంతం సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో, లండన్ లోని తెలుగువారే కాదు, తెలుగురాష్ట్రాల్లోని కళాకారులు అదిరే అభి, సినీ గాయకులు సాకేత్ కొమండూరిమరియు సాహితి చాగంటి, లండన్ ఆర్ జె శ్రీవల్లి, పేరడిగురుస్వామి, 4 లెగ్స్ కిరణ్, ఇమిటేషన్ రాజు వారి వారి ప్రదర్శనలతో అలరించారు. సురభి డ్రామా థియేటర్ వారి మాయాబజార్ నాటకం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాల్ కల్చరల్ సెంటర్ విద్యార్థులుప్రదర్శించిన భరత నాట్యం, కర్ణాటక సంగీతం, తెలుగు పద్యాలు అందరినీ అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో గాన గంధర్వుడు అమరగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి తాల్ నివాళులు అర్పించింది. యూకేలోని తెలుగు గాయకులతో ఎస్ పీ శైలజ కలిసి ఎస్ పీ బాలు పాటలతో ఎస్ పీబికి స్వరాభిషేకం చేసారు. యూకే వైద్య మరియు కీలక రంగాల్లో సేవలందిస్తున్న తెలుగు వారికి ధన్యవాదాలు తెలుపుతూ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమానికి సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఈ వేడుకల్లో తాల్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనగా, చైర్మన్ భారతి కందుకూరి తెలుగు వారి అందరికి ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, తాల్ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. అలాగే ఈ వేడుకలను ఇంత వైభవముగా నిర్వహించిన కన్వీనర్లు వెంకట్ నీల, విజయ్ బెలిదే మరియు వారి బృందంని అభినందించారు. తాల్ ట్రస్టీలు కిషోర్ కస్తూరి, నవీన్ గాదంసేతి, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, గిరిధర్ పుట్లూర్, అనిల్ అనంతుల, అనిత నోముల, ఈ కార్యక్రమ విజయానికి కారకులయిన కళాకారులు, చిన్నారులు, సహాయ సదుపాయాలు అందించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. స్పోర్ట్స్ ట్రస్టీ అనిత నోముల మాట్లాడుతూ మే 15న ప్రారంభం అయి 3 నెలల పాటు జరిగే తాల్ ప్రీమియర్ లీగ్ (TPL) గురించి వివరించి, అందరూ పాల్గొని యూకే తెలుగు క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. సుమారు ఎనిమిది గంటలపాటు సాగిన ఈ కార్యక్రమాన్నివివిధ అంతర్జాల మాధ్యమాలలో అంతరాయం లేకుండా నిర్విరామంగా పనిచేసిన తాల్ సాంకేతిక బృంద కీలక సభ్యులు వంశీ మోహన్ సింగులూరి, కిరణ్ కప్పెటలను తాల్ సభ్యులందరూ కొనియాడారు. అన్ని వయసుల వారిని అలరించిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా అయిదు వేల మందికి పైగా వీక్షించారు. -
అంగరంగ వైభవంగా.. విశ్వవ్యాప్తంగా ప్లవ నామ ఉగాది
న్యూ యార్క్ : ప్రపంచ సాహిత్య చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం, (తానా)సాహిత్య విభాగం – తానా ప్రపంచ సాహిత్య వేదికనిర్వహణలో - "ప్రపంచ తెలుగు మహాకవి సమ్మేళనం - 21" భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 10 వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 11ఉదయం 9 గంటల వరకు 25 గంటల పాటు అంతర్జాల దృశ్య సమావేశం నిర్విరామంగా,అపూర్వంగా జరిగింది. ప్లవ నామ ఉగాది పర్వదిన సందర్భంగా భారత దేశం, అమెరికా దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 21 దేశాల్లోని, 21తెలుగు సంఘాలనుండి 246 మంది కవులు, పండితులు, సాహితీప్రియులు,యువతీ యువకులు అత్యంత ఉత్సాహంగా ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు కళ్యాణి ద్విభాష్యం, ప్రముఖ గాయని లక్ష్మి భావజలు శ్రావ్యంగాగానం చేసిన “మా తెలుగు తల్లికి మల్లె పూదండ” గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గౌరవనీయులు భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తన సందేశంలో – తానా సంస్థ తెలుగు భాషా సంస్క్రుతలకు ప్రాధాన్యమిస్తూ 21 దేశాల్లోని, 21 సంస్థలతో ప్రపంచ మహాకవి సమ్మేళనం నిర్వహించడం ఆనంద దాయకమని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న, వీక్షిస్తున్న తెలుగు ప్రజలందరికి ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తానా అధ్యక్షులుతాళ్ళూరి జయ శేఖర్ మాట్లాడుతూ "ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి తెలుగు భాష అభివృద్ధికి పాటుపడాలనే ఉద్దేశంతో ఇంతటి బృహత్ అక్షర యజ్ఞం తలపెట్టటం జరిగింది. మాతృభాషలోనే మన నాగరికత, ఉనికి ఇమిడి ఉన్నాయి. భాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని" పిలుపునిచ్చారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. గత సంవత్సర కాలంగా ప్రతి నెలా ఆఖరి ఆదివారం వివిధ అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాలం లో సాహిత్య సమావేశాలను, మరి కొన్ని ప్రత్యేక సాహిత్య కార్యక్రమాలను జరుపుకుంటున్నామని, కాని ఇంత పెద్ద కార్యక్రమం జరుపుకోవడం ఇదే మొదటిసారని, విశ్వ వ్యాప్తంగా ఈ సాహితీ యజ్ఞంలో పాల్గొంటున్న తెలుగు సంఘాల అధ్యక్షులకు, భాషాభిమానులకు, వీక్షకులకు ఘన స్వాగతం పలికారు. 25 గంటల పాటు ఎంతో ఉత్సాహంగా సాగిన ఈ ప్రపంచ మహాకవి సమ్మేళనం వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్నిర్వహణలో ఆద్యంతం అతి వైభవంగా జరిగింది.తానా మహిళా విభాగం సమన్వయకర్త శిరీష తూనుగుంట్ల కావలసిన సాంకేతిక సహకారాన్ని అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లబ్ద ప్రతిష్టులైన కవులు, పండితులు తమ కవితలతో ఆద్యంతం అలరించారు. ఒక్కో దేశానికి ఒక్కో గంట సమయం కేటాయించబడి ఆగంటలో ఆ దేశానికి సంబంధించిన కవులతో కవిసమ్మేళనాలు నిర్వహించబడ్డాయి. ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ శ్రీ జి. చంద్రయ్య, విశిష్ట అతిథిగా మహా సహస్రావధాని బ్రహ్మ శ్రీ గరికిపాటి నరసింహారావు, ప్రత్యేక అతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాస్ హాజరై తెలుగు భాషా వైభవాన్ని పెంచడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రసంగించారు. ముగింపు సభకు ముఖ్య అతిథిగా పద్మ భూషణ్ డా. కె. ఐ. వర ప్రసాద్ రెడ్డి హాజరై “నూతన పదకోశ అభివృద్దే భాషా పరిరక్షణకుమూలమని, ఆదిశగా అందరూఆలోచించాలని" అన్నారు.విశిష్ట అతిథిగా హాజరైన తనికెళ్ల భరణి, ప్రత్యేక అతిధులుగా హాజరైన ప్రముఖ పాత్రికేయులు జాస్తి విష్ణు(ఈనాడు), కె. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి), దిలీప్ రెడ్డి (సాక్షి) హాజరై భాషాభివృద్దికి విలువైన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు: శ్రీ సాంస్కృతిక కళా సమితి- సింగపూర్; మలేషియా తెలుగు సంఘం- మలేషియా; హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య- హాంకాంగ్; తెలుగు కళా సమితి – ఒమన్; తెలుగు కళాసమితి – ఖతర్; తెలుగు సంఘాల ఐక్యవేదిక – కువైట్; సౌదీ తెలుగు అసోసియేషన్- సౌదీ అరేబియా; తెలుగు కళా సమితి – బెహ్రైన్; తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా - సౌత్ ఆఫ్రికా; తెలుగు అసోసియేషన్ ఆఫ్ బోట్స్వానా; నైజీరియా తెలుగు సంఘం – నైజీరియా; ఫ్రాన్స్ తెలుగు సంఘం – ఫ్రాన్స్; ఫిన్‌ల్యాండ్ తెలుగు సంఘం – ఫిన్లాండ్; డెన్మార్క్ తెలుగు సంఘం – డెన్మార్క్; నార్వే తెలుగు సంఘం – నార్వే; నార్తర్న్ ఐర్లండ్ తెలుగు సంఘం- నార్తర్న్ ఐర్లండ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ – యూకే; తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్ లాండ్- స్కాట్ లాండ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ న్యూజీల్యాండ్ – న్యూజీల్యాండ్; తెలుగు మల్లి – ఆస్ట్రేలియా; తెలుగు అసోసియేషన్ ఆఫ్ చైనా – చైనా; అమెరికా, మరియు భారతదేశం. వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రసార మాధ్యమాలలో ప్రసారం చేసిన యాజమాన్యాలకు, కార్యవర్గసభ్యులకు, తెలుగు సంఘాల అధ్యక్షులకు, పాల్గొన్న సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
ప్రధాని మోదీ తెలుగు ప్రజలకు ,తెలుగులోఉగాది శుభాకాంక్షలు
-
ఉగాది స్పెషల్ పోస్టర్లు: ఫిదా అంటున్న సినీ లవర్స్
ఉగాది పండగ అంటే అందరికీ కొత్త సంవత్సరంగానే తెలుసు.. కానీ సినీ ప్రియులకు మాత్రం ఇది కొత్త పోస్టర్ల పండగ. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ఈ రోజు అభిమానులను సర్ప్రైజ్ చేస్తూ ఎన్నో పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఆరగిస్తూ ఆ పోస్టర్లేంటో చూసేద్దాం.. ఆయుధమైనా ...అమ్మాయి అయినా ... సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది. #Acharya ఉగాది శుభాకాంక్షలు!!@AlwaysRamCharan @sivakoratala @MatineeEnt @KonidelaPro pic.twitter.com/sW24eo5FJl — Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2021 ఆయుధమైనా.. అమ్మాయి అయినా.. సిద్ధుడి చేతిలో ఒదిగిపోతుంది అంటూ ఆచార్య నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ పూజా హెగ్డే కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 13న థియేటర్లలో సందడి చేయనుంది. లేదంటే కరోనా విస్తృతిని దృష్టిలో పెట్టుకుని విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. Ugadi wishes to you and your family ! Stay safe ... take care #Lovestory@sai_pallavi92 @sekharkammula@SVCLLP #AmigosCreations @AsianSuniel @pawanch19 @adityamusic @niharikagajula pic.twitter.com/lkpmupZ1TM — chaitanya akkineni (@chay_akkineni) April 13, 2021 నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం లవ్‌స్టోరీ. ఉగాది రోజు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా బాట పట్టింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. Looking forward to another fun schedule with the team 🙌! #HappyUgadi#F3Movie#F3OnAug27th@IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official pic.twitter.com/uby6jO2enY — Venkatesh Daggubati (@VenkyMama) April 13, 2021 పండగ రోజు కొత్త షెడ్యూల్ మొదలు పెట్టాం అంటున్నారు ఎఫ్ 3 యూనిట్ సభ్యులు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ఓ రేంజ్లో ఉంటుందని చెప్తున్న ఈ సినిమాను ఆగస్టు 27న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. #HappyUgadi from Team #Thimmarusu.. Get ready for an entertaining thriller in theatres from May 21!@ActorSatyadev#PriyankaJawalkar @actorbrahmaji @ActorAnkith@smkoneru @nooble451 @SharanDirects@EastCoastPrdns@SOriginals1 @vamsikaka @SricharanPakala @MangoMusicLabel pic.twitter.com/yNTva0xdSW — BARaju (@baraju_SuperHit) April 13, 2021 సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తిమ్మరుసు. ఉగాది పండగను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి సత్యదేవ్ లుక్‌ను రిలీజ్ చేశారు. చిక్కుముడులను విప్పేందుకు తీక్షణంగా ఆలోచిస్తున్నట్లున్న కనిపిస్తున్న ఈ లుక్ ఉగాది పచ్చడిలా బాగుందంటున్నారు సినీ లవర్స్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 21న విడుదల కానుంది. Hope this Ugadi brings you peace & abounding happiness ! Let's stay safe while we celebrate the day with our loved ones 🙏#Narappa pic.twitter.com/SxtIuVqQRf — Venkatesh Daggubati (@VenkyMama) April 13, 2021 కుటుంబంతో కలిసి బయటకు పయనమయ్యాడు నారప్ప. ఇంతకుముందు ఉగ్రరూపంలో కనిపించి భయపెట్టిన వెంకటేశ్ ఇందులో మాత్రం ఫ్యామిలీమ్యాన్‌గా ఆకట్టుకున్నాడు. Ugadi wishes from the team of #VirataParvam pic.twitter.com/LVfzsevt8W — Haricharan Pudipeddi (@pudiharicharan) April 13, 2021 సాయి పల్లవి అచ్చమైన గ్రామీణ యువతిగా నటిస్తున్న చిత్రం విరాట పర్వం. ఉగాది పర్వదినాన స్పెషల్ పోస్టర్‌తో విందు భోజనం పెట్టింది చిత్రయూనిట్. సాయిపల్లవి కడప మీద ముగ్గు వేస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రానా దగ్గుబాటి నక్సలైట్ నాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలవుతోంది. Baadshah @KicchaSudeep’s #K3Kotikokkadu Team Wishing everyone a #HappyUgadi Dubbing works are on full Swing, Release in Kannada&Telugu simultaneously!@ArjunJanyaMusic @MadonnaSebast14 @shraddhadas43 #ShivaKarthik @thegcgofficial @shreyasgroup @anandaudioTolly @Mymoviebazaar pic.twitter.com/o73wH0tMz4 — BARaju (@baraju_SuperHit) April 13, 2021 కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న చిత్రం కే3 కోటికొక్కడు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు సుదీప్. డబ్బింగ్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయంటోంది చిత్రయూనిట్. అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు....!!#TuckJagadish #HappyUgadi@NameisNani @riturv @aishu_dil @IamJagguBhai @DanielBalaje @ShivaNirvana @MusicThaman @praveenpudi @sahugarapati7 @harish_peddi @sahisuresh @Shine_Screens @adityamusic pic.twitter.com/HfT4JUHdRK — BARaju (@baraju_SuperHit) April 13, 2021 ఫ్యామిలీ పిక్‌ను షేర్ చేసింది టక్ జగదీష్ టీమ్. ఇందులో నేచురల్ స్టార్ నాని సకుటుంబ సపరిమేతవారంగా పండగ వేడుకలు జరుపుకుటున్నట్లుగా ఉంది. అందరూ నవ్వులు చిందిస్తోన్న ఈ లుక్ నాని ఫ్యాన్స్‌కు తెగ నచ్చింది. ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన టక్ జగదీష్‌ను కరోనా వల్ల వాయిదా వేశారు. ఉగాది శుభాకాంక్షలతో త్వరలో మీ ముందుకు వస్తున్నాము! Team #Seetimaarr wishes everyone #HappyUgadi 🌿@YoursGopichand @tamannaahspeaks @SS_Screens #ManiSharma @DiganganaS @bhumikachawlat @adityamusic @_apsara_rani @soundar16 @actorrahman @TarunRajArora pic.twitter.com/iVQZxg1qlb — Sampath Nandi (@IamSampathNandi) April 13, 2021 గోపీచంద్ సిటీమార్ నుంచి మాస్ లుక్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఐదుగురు ఆడవాళ్లు బైక్ నడుపుతున్న పోస్టర్‌ను రిలీజ్ చేయగా ఇది ఊరమాస్‌గా ఉందంటున్నారు నెటిజన్లు. అందరికీ శ్రీ ప్లవనామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!#SonofIndia🇮🇳 #HappyUgadi pic.twitter.com/kCMO7bidPT — Mohan Babu M (@themohanbabu) April 13, 2021 సన్ ఆఫ్ ఇండియా నుంచి మోహన్‌బాబు లుక్‌ను రిలీజ్ చేశారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాను విష్ణు మంచ్ నిర్మిస్తున్నాడు. Thrilling Trilingual flick #Seethayanam movie Team wishes everyone a Happy Ugadi Here's the brand New Poster @akshith_sk @AnahitaBhooshan @DirPrabhakar #RohanBharadwaj #LalithaRajyalakshmi @padmanabhmusic @ColorCloudsEnt @LahariMusic @PulagamOfficial pic.twitter.com/ejlUqOaiML — BARaju (@baraju_SuperHit) April 13, 2021 సీతాయణం నుంచి ఉగాది స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఉగాది శుభాకాంక్షలు 'మే' లో వస్తున్నాం @MeghamshSrihari @SamVegesna @RiddhiKumar_ @ItsMeghaC #RajendraPrasad @VegesnaSatish1 #MLVSatyanarayana @anuprubens@ShreeLyricist@rajeshmanne1 #LakshyaProductions #KothiKommachi pic.twitter.com/7s0ssBACvg — BARaju (@baraju_SuperHit) April 13, 2021 మేలో వస్తున్నామంటున్న కోతి కొమ్మచ్చి.. సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టామంటున్న సర్కారు వారి పాట SuperStar @urstrulymahesh joins #SarkaruVaariPaata 2nd Schedule today with all necessary safety precautions 💥#HappyUgadi 😊@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/kerp3YcaL8 — BARaju (@baraju_SuperHit) April 13, 2021 Team #AndarubagundaliAnduloNenundali Wishes a Very Happy Ugadi ,Filled With laughter, joy and fulfilment! #HappyUgadi#Ali & @ItsActorNaresh #Mouryaani 🎬 : #SripuramKiran 🎼 : @RakeshPazhedam@SivaMallala @IamEluruSreenu pic.twitter.com/DBvbsaIIIV — BARaju (@baraju_SuperHit) April 13, 2021 అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు....!! Team #GullyRowdy wishes you A very Happy & safe Ugadi.#HappyUgadi@sundeepkishan @actorsimha #NehaHarirajShetty #GNageswaraReddy #RamMiryala @iamsaikartheek @konavenkat99 @MVVCinema_ @KonaFilmCorp @MangoMusicLabel pic.twitter.com/hHWtPiOcvZ — BARaju (@baraju_SuperHit) April 13, 2021 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు! - #101JillalaAndagadu #HappyUgadi#SrinivasAvasarala @iRuhaniSharma #SagarRachakonda @DopRaamReddy @shakthikanth @bhaskarabhatla #KiranGanti #DilRaju @DirKrish @SVC_official @FirstFrame_Ent #Shirish @YRajeevReddy1 #JSaiBabu pic.twitter.com/f1Z4QDskIf — BARaju (@baraju_SuperHit) April 13, 2021 Here's, the Captivating First Look Poster of #AadiSaiKumar's #BLACK 💥 Team #Black wishes everyone a Happy UGADI 🎋 Written & Directed : #GBKrishna Producer : #MahankaliDiwakar Music : #SureshBobbili DOP : #SatishMuthyala@IamEluruSreenu @dhani_aelay#HappyUgadi2021 pic.twitter.com/fOjTHgBd9x — BARaju (@baraju_SuperHit) April 13, 2021 #HappyUgadi from Team #HouseArrest!! 🎧 #FreeBirds ▶️ https://t.co/y9EjBrWr3L#HouseArrestOnMay7th@Sekhar_Dreamz @anuprubens @boselyricist @Chaitanyaniran @Niran_Reddy @AsrinReddy @Actorysr @IamSaptagiri @ChotaKPrasad @Yuvadop @Primeshowtweets @ARMusic2021 pic.twitter.com/cuNUpXyP1n — BARaju (@baraju_SuperHit) April 13, 2021


