బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం  | Babu Gari Intlo Butta Bhojanam In Zee Telugu | Sakshi
Sakshi News home page

బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం 

Mar 22 2020 10:22 AM | Updated on Mar 22 2020 10:51 AM

Babu Gari Intlo Butta Bhojanam In Zee Telugu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉగాది పండుగ సందర్భంగా ప్రముఖ వినోద చానెల్‌ జీ తెలుగు ‘బాబు గారి ఇంట్లో బుట్ట భోజనం’ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించింది.  ఈ కార్యక్రమంలో ఆదివారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉగాది సంబరాల సందర్భంగా పూర్ణాలు, పూతరేకులు, గారెలు, పులిహోర, ఉగాది పచ్చడి, ఉలవచారు, పప్పు చారు, గుత్తి వంకాయ కూర, చల్ల మిర్చి...వంటి అచ్చ తెలుగు వంటకాల విశిష్టతకు అద్దం పడతూ ఈ కార్యక్రమం కొనసాగుతోంది.  హీరోయిన్‌ అనుష్క ప్రధాన ఆకర్షణగా.. నటుడు నాగబాబు, ఆయన కుమార్తె నీహారిక, యాంకర్స్‌ అనసూయ భరద్వాజ్, ప్రదీప్‌ మాచిరాజు, రవి, పలువురు డ్యాన్స్‌ మాస్టర్స్‌... పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా తమ నటనతో అదరగొట్టారు. నీహారిక ... ‘ఓ మై డాడీ’  అంటూ మైక్‌ పట్టి పాట పడితే... అనసూయ... ‘మహానటి’ గా అభినయించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్‌ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement