13 ఏళ్ల మిర్చి .. అనుష్క సినిమాల్లో.. శేఖర్ కమ్ముల హీరోయిన్‌ ఎక్కడ? | Prabhas Mirchi Actress Anushka and Richa Present Situation | Sakshi
Sakshi News home page

Mirchi Movie: 13 ఏళ్ల మిర్చి.. అనుష్క ఇంకా సినిమాల్లో.. మరి రిచా ఎక్కడ?

Feb 8 2026 10:46 AM | Updated on Feb 8 2026 12:37 PM

Prabhas Mirchi Actress Anushka and Richa Present Situation

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్‌ బస్టర్ మూవీ మిర్చి. 2013 ఫిబ్రవరి 8న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను ఓ రేంజ్‌లో ఊపేసింది. కొరటాల శివ డైరెక్షన్‌లో ఈ మూవీ రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించింది. గుంటూరు పల్నాడు ప్రాంతంలో జరిగే ప్రతీకార నేపథ్యంగా ఈ మూవీని తెరకెక్కించారు.

ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్‌గా నటించగా..మరో హీరోయిన్‌గా రిచా గంగోపాధ్యాయ మెప్పించింది. అయితే ఈ ‍మూవీ రిలీజై సరిగ్గా నేటికి 13 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా  ఈ సినిమా హీరోయిన్ల గురించి ఓసారి గుర్తు చేసుకుందాం.

అనుష్క ఇంకా సినీ ఇండస్ట్రీలోనే..

అనుష్క ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. గతేడాది ఘాటి మూవీతో అభిమానులను మెప్పించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. శ్రీకాకుళం బ్యాక్‌ డ్రాప్‌లో తెరెకెక్కించారు.

రిచా గంగోపాధ్యాయ ఎక్కడ? 

రానా హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ లీడర్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రీచా గంగోపాధ్యాయ. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఆ తర్వాత రవితేజ సరసన మిరపకాయ్, నాగవల్లి, సారొచ్చారు వంటి సినిమాల్లోనూ రీచా మెప్పించింది. ఆ తర్వాతనే మిర్చి సినిమాతో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.

అయితే హీరోయిన్‌గా టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ అందుకున్నా సరైన అవకాశాలు రాకపోవడంతో కొన్నేళ్లకే ఇండస్ట్రీకి టాటా చెప్పేసింది.  2013లో చివరిసారిగా భాయ్ సినిమాలో కనిపించింది. ా తర్వాత రీచా టాలీవుడ్ సినిమాలకు దూరమైంది.

అమెరికన్‌తో పెళ్లి..

ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసిన మిర్చి బ్యూటీ.. ఆ తర్వాత తన ఫ్రెండ్, అమెరికాలోని పోర్ట్‌లాండ్‌కు చెందిన జో లాంగేల్లాను పెళ్లాడింది. 2021లో వీరిద్దరికీ ఓ బాబు కూడా జన్మించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోయినా గతంలో తన ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే పూర్తిగా సినిమాలకు దూరమైన రిచా.. ప్రస్తుతం‌ ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement