టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రతి సంక్రాంతికి హిట్ కొట్టేస్తున్నాడు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో సూపర్ హిట్ కొట్టిన ఆయన.. ఈ ఏడాది కూడా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన మనశంకర వరప్రసాద్‌గారు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అలా టాలీవుడ్‌లో సంక్రాంతి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు అనిల్ రావిపూడి.
అయితే తాజాగా ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన అనిల్ రావిపూడికి ఆసక్తికర అనుభవం ఎదురైంది. టాలీవుడ్ కమెడియన్ అలీ.. అనిల్ రావిపూడి మధ్య ఫన్నీ సంభాషణ జరిగింది. అనిల్ రావిపూడి హీరోగా చేస్తే అడ్వాన్స్ ఇస్తానని అలీ అన్నారు. అంతేకాకుండా ఈ మూవీ ఈవెంట్‌లో అనిల్‌కు అడ్వాన్స్‌గా అమెరికన్ డాలర్ ఇచ్చాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హీరోగా #AnilRavipudi... అమెరికా డాలర్‌ను అడ్వాన్స్‌గా ఇచ్చిన నటుడు #Ali pic.twitter.com/w6EfHjFXSq
— TeluguOne (@Theteluguone) February 7, 2026


