టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఫంకీ. ఈ మూవీకి 'జాతిరత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం పహించారు. గతేడాది హిట్ మూవీ లేకపోవడంతో ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు మాస్ కా దాస్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కయాదు లోహర్ కనిపించనుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది చూసిన విశ్వక్ సేన్.. ఇప్పడున్న విశ్వక్ సేన్ వేరని అన్నారు. మైక్ తీసుకోగానే బూతులు తిట్టే విశ్వక్ కాదన్నారు. ఇప్పుడున్న విశ్వక్ సేన్ చాలా మారిపోయాడని తెలిపారు. ప్రస్తుతమున్న విశ్వక్ సేన్‌ను చూస్తుంటే అనుదీప్‌ను చూసినట్లు ఉందని ప్రశంసలు కురిపించారు.
కాగా.. ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది.
సంవత్సరం క్రితం చూసిన Vishwaksen కి ఇప్పటికి మారిపోయినట్టు లేడు.
Mic ఇస్తే ఇష్టమొచ్చినట్టు బూతులు తిట్టేసి, arrogant బిహేవ్ చేసే Vishwak ను కాకుండా anudeep ను చూసినట్టు లేదు.
- @vamsi84 pic.twitter.com/63cBPhgh15— Rajesh Manne (@rajeshmanne1) February 7, 2026


