డేట్‌ ఫిక్స్‌ | Akshay Kumar Bhoot Bangla Gets New Release Date | Sakshi
Sakshi News home page

డేట్‌ ఫిక్స్‌

Feb 8 2026 4:04 AM | Updated on Feb 8 2026 11:47 AM

Akshay Kumar Bhoot Bangla Gets New Release Date

ఈ వేసవిలో ‘భూత్‌ బంగ్లా’ తలుపులు తెరుచుకుంటాయని అంటున్నారు అక్షయ్‌ కుమార్‌. హీరో అక్షయ్‌ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న హారర్‌ కామెడీ సినిమా ‘భూత్‌ బంగ్లా’. ఈ చిత్రంలో టబు, వామికా గబ్బి, పరేష్‌ రావల్, రాజ్‌పాల్‌ యాదవ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అక్షయ్‌ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఏప్రిల్‌ 2న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత మే 15న రిలీజ్‌ చేయనున్న ట్లుగా ప్రకటించారు.

రణ్‌వీర్‌ సింగ్‌ ‘ధురంధర్‌ 2’ సినిమా మార్చి 19న రిలీజ్‌కు సిద్ధమైన కారణంగానే, ఏప్రిల్‌ 2 నుంచి మే 15కు అక్షయ్‌ కుమార్‌ ‘భూత్‌ బంగ్లా’ సినిమా రిలీజ్‌ వాయిదా పడిందనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపించింది. అయితే తాజాగా ‘భూత్‌ బంగ్లా’ సినిమాను ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లుగా శనివారం మేకర్స్‌ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. మరి... మరోసారి కూడా ‘భూత్‌ బంగ్లా’ విడుదల తేదీ మారుతుందా? లేక ఏప్రిల్‌ 10నే ఈ సినిమా థియేటర్స్‌లోకి వస్తుందా? అనేది చూడాలి. ఇక పద్నాలుగు సంవత్సరాల తర్వాత అక్షయ్‌ కుమార్, ప్రియదర్శన్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ ‘భూత్‌ బంగ్లా’ సినిమాపై బాలీవుడ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి.  

Advertisement
 
Advertisement
Advertisement