‘అతను లిఫ్ట్ అడిగితే ఓకే అన్నాను... ఇప్పుడు అతను నా పక్కనే కూర్చున్నాడు’ అనే డైలాగ్‌తో ‘సీతా పయనం’ మూవీ ట్రైలర్ ఆరంభం అయింది. హీరో అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీకి అర్జున్ దర్శకత్వం వహించడంతో పాటు అతిథి పాత్రలో నటించారు. సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, కోవై సరళ, అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా ఇతర పాత్రలుపోషించారు.
శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 14న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘మాస్ యాక్షన్, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్... ఇలా అన్ని రకాల అంశాలతో రూపొందిన చిత్రం ‘సీతా పయనం’. కుటుంబ సమేతంగా చూడదగ్గ మూవీ ఇది’’ అని మేకర్స్ తెలిపారు.


