తమన్నాతో పోలిక.. అస్సలు నచ్చట్లేదు: 'ధురంధర్' బ్యూటీ | Ayesha Khan Reacts Compare With Tamannaah Bhatia | Sakshi
Sakshi News home page

Ayesha Khan: ఆమెతో నాకు ఎలాంటి మనస్పర్థలు లేవు

Feb 8 2026 3:09 AM | Updated on Feb 8 2026 11:52 AM

Ayesha Khan Reacts Compare With Tamannaah Bhatia

రీసెంట్ టైంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ మంచి ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఈ చిత్రంలోనే 'షరారత్' అంటూ సాగే ఐటమ్ సాంగ్‌లో అదిరిపోయే డ్యాన్స్ చేసిన ఆయేషా ఖాన్‌పైనా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. కానీ కొందరు ఈమెని.. బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్‌తో ఫేమస్ అయిన తమన్నా, నోరా ఫతేహితో పోలుస్తున్నారు. తనని వాళ్లతో పోల్చడం నచ్చలేదని ఆయేషా చెప్పుకొచ్చింది. ఈ మేరకు తమన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

'తమన్నా, నోరా ఫతేహితో నన్ను పోలుస్తున్నా రీల్స్.. సోషల్ మీడియాలో నేను కూడా చూశాను. కానీ అది నాకు నచ్చట్లేదు. వాళ్లిద్దరూ అద్భుతమైన మహిళలు. నోరా స్టేజీ ఫెర్ఫార్మెన్స్, ఎనర్జీ చూస్తుంటే నాకే ఆశ్చర్యమేస్తుంది. తను చేసిది నేను ఎప్పటికీ చేయలేను' అని నోరా గురించి మాట్లాడింది. తమన్నా గురించి కూడా మాట్లాడిన ఆయేషా ఖాన్.. 'తమన్నా ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉంది. 'ఆజ్ కీ రాత్' పాటలో ఆమెని చూసి నేను ఫిదా అయిపోయా. ఇండస్ట్రీకి నేను కొత్త. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని చెప్పుకొచ్చింది.

'ధురంధర్'లో ఐటమ్ సాంగ్‌లో కలిసి చేసిన క్రిస్టల్‌తో మనస్పర్థలు అని వస్తున్న పుకార్లపైనా ఆయేషా స్పందించింది. అవన్నీ కేవలం రూమర్సే. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం అని చెప్పుకొచ్చింది. హిందీ బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఆయేషా.. తెలుగులోనూ ముఖచిత్రం, ఓం బీమ్ బుష్, మనమే తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కానీ 'ధురంధర్' మూవీ ఈమెకు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement