Ayesha Khan
-
నిత్యం అత్యాచార బెదిరింపులు: ధురంధర్ నటి
ధురంధర్ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ చిత్రంలో షరారత్ అంటూ సాగే ఐటం సాంగ్‌లోనూ అదిరిపోయే స్టెప్పులతో అలరించి ఫేమ్ తెచ్చుకుంది ఆయేషా ఖాన్. అయితే గతంలోనూ ఓ సాంగ్‌లో కనిపించాల్సిందని, కానీ లావుగా ఉన్న కారణంతో తనను రిజెక్ట్ చేశారని చెప్తోంది. సడన్‌గా తీసేశారుతాజాగా ఓ ఈవెంట్లో ఆయేషా ఖాన్ మాట్లాడుతూ.. టీ సిరీస్ బ్యానర్ నుంచి వచ్చిన ఓ పాటలో నేను సెకండ్ హీరోయిన్గా చేయాల్సింది. అప్పుడు నేను పన్నెండో తరగతి చదువుతున్నాను. తెల్లారితే షూటింగ్ అనగా రాత్రికి రాత్రే నన్ను తీసేశారు. నేను లావుగా ఉన్నానని సాకు చూపించారు. నిజంగా బాధాకరంఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో నా శరీరం గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. నేను స్కర్ట్ వేసుకున్నా, కుర్తా ధరించినా.. ఎలాంటి దుస్తులు ధరించినా తప్పుపడుతూనే ఉంటారు. ఏది పోస్ట్ చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇది నిజంగా బాధాకరం. ఎవరేమనుకుంటే నాకేంటి? నాకు నచ్చింది పోస్ట్ చేయాలనిపిస్తుంది. కానీ వాళ్లు హద్దులు దాటి మరీ కామెంట్స్ చేస్తారు.ఫేమస్ కాకపోయుంటే..అత్యాచారం చేస్తామని బెదిరిస్తారు. ఈ బెదిరింపులు నాకు రోజూ వస్తాయి. ఇలాంటి మనుషుల మధ్య ఉన్నందుకు భయంగా ఉంది. ఇలాంటివాళ్లకు ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలన్నంత కోపం వస్తుంది. వాళ్లనే మాటలు కొన్నిసార్లు నా గాయాలను గుర్తు చేస్తాయి. నేను ఇంత ఫేమస్ కాకపోయుంటే నిజంగానే అన్నంత పని చేసేవారేమో అని భయమేస్తుంది అని ఆయేషా చెప్పుకొచ్చింది.సినిమాసీరియల్స్లో చిన్నాచితకా పాత్రలు చేసింది ఆయేషా ఖాన్. హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ముఖచిత్రం మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఓం భీమ్ బుష్, మనమే సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషించింది. హిందీలో జాట్, కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2 సినిమాలు చేసింది.చదవండి: విజయ్- రష్మిక.. ఎవరు ప్రపోజ్ చేశారంటే? -
రుక్మిణి వసంత్ స్టైల్.. కాజల్ అగర్వాల్ అదే గ్లామర్
ముద్దుగా మెరిసిపోతున్న రుక్మిణి వసంత్వయసు పెరుగుతున్నా అదే గ్లామర్‌తో కాజల్పార్టీలో చిల్ అయిపోతున్న 'ధురంధర్' ఆయేషాచీరలో అందంగా మాయ చేస్తున్న శ్రీలీలజపాన్ ట్రిప్ వేసిన హీరోయిన్ నివేదా పేతురాజ్అల్లు వారి పార్టీలో మిహీక-శ్రీలీల చిల్ మోడ్ View this post on Instagram A post shared by SREELEELA (@sreeleela14) View this post on Instagram A post shared by SHIVANI NAGARAM (@shivani_nagaram) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Imanvi (@imanvi1013) View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) -
చీరలో 'ధురంధర్' బ్యూటీ.. విష్ణుప్రియ జిగేలు!
చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న ఆయేషాజిగేలుమని మెరిపించేస్తున్న బిగ్‌బాస్ విష్ణుప్రియపక్షులతో ఆడుకుంటున్న బిగ్‌బాస్ ఫేమ్ దివి'రాజాసాబ్' ఫేమ్ మనీషా చీరలో అందాలుగ్లామర్తో రచ్చ లేపేస్తున్న మంచు లక్ష్మీప్రిన్సెస్లా తయారైపోయిన 'రాజాసాబ్' రిద్ధి View this post on Instagram A post shared by Ayesha Khan (@ayeshaakhan_official) View this post on Instagram A post shared by Riddhi Kumaar (@riddhikumar_) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Manisha Kandkur (@manisha_kandkur) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Jabili 🌝 (@srideviactor) -
తమన్నాతో పోలిక.. అస్సలు నచ్చట్లేదు: 'ధురంధర్' బ్యూటీ
రీసెంట్ టైంలో అద్భుతమైన సక్సెస్ అందుకున్న సినిమా 'ధురంధర్'. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ మంచి ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఈ చిత్రంలోనే 'షరారత్' అంటూ సాగే ఐటమ్ సాంగ్‌లో అదిరిపోయే డ్యాన్స్ చేసిన ఆయేషా ఖాన్‌పైనా ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. కానీ కొందరు ఈమెని.. బాలీవుడ్ ఐటమ్ సాంగ్స్‌తో ఫేమస్ అయిన తమన్నా, నోరా ఫతేహితో పోలుస్తున్నారు. తనని వాళ్లతో పోల్చడం నచ్చలేదని ఆయేషా చెప్పుకొచ్చింది. ఈ మేరకు తమన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.'తమన్నా, నోరా ఫతేహితో నన్ను పోలుస్తున్నా రీల్స్.. సోషల్ మీడియాలో నేను కూడా చూశాను. కానీ అది నాకు నచ్చట్లేదు. వాళ్లిద్దరూ అద్భుతమైన మహిళలు. నోరా స్టేజీ ఫెర్ఫార్మెన్స్, ఎనర్జీ చూస్తుంటే నాకే ఆశ్చర్యమేస్తుంది. తను చేసిది నేను ఎప్పటికీ చేయలేను' అని నోరా గురించి మాట్లాడింది. తమన్నా గురించి కూడా మాట్లాడిన ఆయేషా ఖాన్.. 'తమన్నా ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉంది. 'ఆజ్ కీ రాత్' పాటలో ఆమెని చూసి నేను ఫిదా అయిపోయా. ఇండస్ట్రీకి నేను కొత్త. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని చెప్పుకొచ్చింది.'ధురంధర్'లో ఐటమ్ సాంగ్‌లో కలిసి చేసిన క్రిస్టల్‌తో మనస్పర్థలు అని వస్తున్న పుకార్లపైనా ఆయేషా స్పందించింది. అవన్నీ కేవలం రూమర్సే. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. మేమిద్దరం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం అని చెప్పుకొచ్చింది. హిందీ బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న ఆయేషా.. తెలుగులోనూ ముఖచిత్రం, ఓం బీమ్ బుష్, మనమే తదితర చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. కానీ 'ధురంధర్' మూవీ ఈమెకు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు.


