నిత్యం అత్యాచార బెదిరింపులు: ధురంధర్‌ నటి | Ayesha Khan was Replaced from Song for Being Fat, revealed Receiving Rape Threats Daily | Sakshi
Sakshi News home page

Ayesha Khan: అత్యాచార బెదిరింపులు.. లావుగా ఉన్నానని..

Mar 4 2026 3:07 PM | Updated on Mar 4 2026 3:13 PM

Ayesha Khan was Replaced from Song for Being Fat, revealed Receiving Rape Threats Daily

ధురంధర్‌ సినిమాలో యాక్ట్‌ చేసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ చిత్రంలో షరారత్‌ అంటూ సాగే ఐటం సాంగ్‌లోనూ అదిరిపోయే స్టెప్పులతో అలరించి ఫేమ్‌ తెచ్చుకుంది ఆయేషా ఖాన్‌. అయితే గతంలోనూ ఓ సాంగ్‌లో కనిపించాల్సిందని, కానీ లావుగా ఉన్న కారణంతో తనను రిజెక్ట్‌ చేశారని చెప్తోంది. 

సడన్‌గా తీసేశారు
తాజాగా ఓ ఈవెంట్‌లో ఆయేషా ఖాన్‌ మాట్లాడుతూ.. టీ సిరీస్‌ బ్యానర్‌ నుంచి వచ్చిన ఓ పాటలో నేను సెకండ్‌ హీరోయిన్‌గా చేయాల్సింది. అప్పుడు నేను పన్నెండో తరగతి చదువుతున్నాను. తెల్లారితే షూటింగ్‌ అనగా రాత్రికి రాత్రే నన్ను తీసేశారు. నేను లావుగా ఉన్నానని సాకు చూపించారు. 

నిజంగా బాధాకరం
ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో నా శరీరం గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తూనే ఉంటారు. నేను స్కర్ట్‌ వేసుకున్నా, కుర్తా ధరించినా.. ఎలాంటి దుస్తులు ధరించినా తప్పుపడుతూనే ఉంటారు. ఏది పోస్ట్‌ చేయాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఇది నిజంగా బాధాకరం. ఎవరేమనుకుంటే నాకేంటి? నాకు నచ్చింది పోస్ట్‌ చేయాలనిపిస్తుంది. కానీ వాళ్లు హద్దులు దాటి మరీ కామెంట్స్‌ చేస్తారు.

ఫేమస్‌ కాకపోయుంటే..
అత్యాచారం చేస్తామని బెదిరిస్తారు. ఈ బెదిరింపులు నాకు రోజూ వస్తాయి. ఇలాంటి మనుషుల మధ్య ఉన్నందుకు భయంగా ఉంది. ఇలాంటివాళ్లకు ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలన్నంత కోపం వస్తుంది. వాళ్లనే మాటలు కొన్నిసార్లు నా గాయాలను గుర్తు చేస్తాయి. నేను ఇంత ఫేమస్‌ కాకపోయుంటే నిజంగానే అన్నంత పని చేసేవారేమో అని భయమేస్తుంది అని ఆయేషా చెప్పుకొచ్చింది.

సినిమా
సీరియల్స్‌లో చిన్నాచితకా పాత్రలు చేసింది ఆయేషా ఖాన్‌. హిందీ బిగ్‌బాస్‌ 17వ సీజన్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ముఖచిత్రం మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఓం భీమ్‌ బుష్‌, మనమే సినిమాల్లోనూ చిన్న పాత్రలు పోషించింది. హిందీలో జాట్‌, కిస్‌ కిస్కో ప్యార్‌ కరూన్‌ 2 సినిమాలు చేసింది.

చదవండి: విజయ్‌- రష్మిక.. ఎవరు ప్రపోజ్‌ చేశారంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement