పెళ్లికి ముందు సహజీవనం.. నాకు ఛాన్స్‌ ఇచ్చుంటే.. | Actress Laya Interesting Comments about Living Relationship | Sakshi
Sakshi News home page

Laya: కాలం మారుతోంది.. ఆ టైంలో సహజీవనం కాన్సెప్ట్‌ ఉండుంటే..

Mar 2 2026 6:56 PM | Updated on Mar 2 2026 7:17 PM

Actress Laya Interesting Comments about Living Relationship

ఒకప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేసిన లయ.. పెళ్లి తర్వాత అమెరికాలో సెటిలైంది. దాంతో సినిమాలకు దూరమైంది. కాకపోతే 2018లో వచ్చిన అమర్‌ అక్బర్‌ ఆంటోనిలో అతిథి పాత్రలో మెరిసింది. గతేడాది వచ్చిన తమ్ముడు చిత్రంతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. త్వరలో హాట్‌స్టార్‌లో రాబోతున్న మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అనే షోలో జడ్జిగా కనిపించనుంది.

నాకు ఛాన్స్‌ ఇచ్చుంటే..
ఈ షోలో పెళ్లయిన దంపతులతో పాటు ప్రేమలో ఉన్న జంటలు, సహజీవనం చేస్తున్న జంటలు కూడా పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో లవ్‌- మ్యారేజ్‌- సహజీవనంపై లయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మా జనరేషన్‌లో లివింగ్‌ రిలేషన్‌షిప్‌ అన్న ప్రస్తావనే లేదు. నిజం చెప్పాలంటే మీరు ఛాన్స్‌ ఇచ్చినా సరే నేనైతే ఆ పని చేయలేను. మారుతున్న కాలం ప్రకారం.. ఇప్పటి జనరేషన్‌వాళ్లు ఒకరి గురించి మరొకరు ముందే తెలుసుకున్నాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇది కొత్తగా వస్తున్న కాన్సెప్ట్‌.

తప్పుపట్టను
అంతకుముందు పెళ్లిలో ఇలాంటి విధానాలు లేవు. విడాకులు కూడా ఎక్కువగా ఉండేవి కావు. కానీ, అన్నీ మారుతున్నాయి. కాబట్టి ఏది ఒప్పు? ఏది తప్పు? అని నేను చెప్పలేను. సహజీవనం చేస్తున్నవారిని నేను తప్పుపట్టలేను. వారి బంధం ధృడంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి పెళ్లికి ముందు కలిసుంటున్నారు. అది వారి వ్యక్తిగత విషయం అని లయ చెప్పుకొచ్చింది. 

10 జంటలతో రియాలిటీ షో
మ్యాడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ విషయానికి వస్తే.. ఇందులో పది జంటలు పాల్గొననున్నాయి. వారిలో వాసంతి కృష్ణన్‌- పవన్‌ కల్యాణ్‌, ప్రియాంక జైన్‌-శివకుమార్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ మాస్క్‌ మ్యాన్‌- హరిత, అంజలి - పవన్‌, సాండ్రా- మహేశ్, నటరాజ్‌ మాస్టర్‌ - నీతూ, సోనియా, శుభ శ్రీ, నూకరాజు జంటలు కూడా పార్టిసిపేట్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక విల్లాలో పది జంటల్ని పది వారాలు పెట్టి షో కొనసాగించనున్నారు. మరి ఇదెప్పుడు మొదలవుతుందో చూడాలి!

చదవండి: లగ్జరీ కారులో సంపూర్ణేశ్‌ షికారు.. ఈ కార్‌ ధరెంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement