మనసుకు కష్టంగా ఉంది.. మంచు విష్ణు కోసం లక్ష్మి పోస్ట్‌ | Manchu Lakshmi Post about Vishnu Family over Stuck in Dubai | Sakshi
Sakshi News home page

Manchu Lakshmi: గడ్డు పరిస్థితుల్లో విష్ణు కుటుంబం.. సోదరి ఎమోషనల్‌ పోస్ట్‌

Mar 2 2026 4:18 PM | Updated on Mar 2 2026 4:24 PM

Manchu Lakshmi Post about Vishnu Family over Stuck in Dubai

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌, గల్ఫ్‌ దేవాలపై ఇరాన్‌ క్షిపణులు ప్రయోగిస్తోంది. అటు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ దాడులతో పలుచోట్ల ఎయిర్‌పోర్టులను మూసివేశారు. దాంతో ఎంతోమంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు.

దుబాయ్‌లో చిక్కుకున్న మంచు విష్ణు ఫ్యామిలీ
వారిలో అజిత్‌, ఈషా గుప్తా, సోనాల్‌ చౌహాన్‌, మంచు విష్ణు వంటి పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. విష్ణు అయితే ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో నిలబడి ఉండగా తనపై నుంచే క్షిపణులు వెళ్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇది చూసి తన చిన్నకూతురు భయపడిపోయిందని పేర్కొన్నాడు. ఈ వీడియో కింద అభిమానులు విష్ణు కుటుంబంతో సహా క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు.

మనసుకి కష్టం
ఈ క్రమంలో మంచు విష్ణు సోదరి, నటి లక్ష్మీ మంచు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. దుబాయ్‌లో ఉన్న విష్ణు, అతడి కుటుంబం క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. మనకు బాగా కావాల్సిన వారు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే తట్టుకోవడం చాలా కష్టం. మీ అందర్నీ నా హృదయానికి దగ్గరగా ఉంచుకుంటాను. ఆ దేవుడి దయ మీకు రక్షణగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎప్పటికీ ప్రేమే గెలుస్తుంది అని రాసుకొచ్చింది.

చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల జాబితా

Advertisement
 
Advertisement
Advertisement