బాలీవుడ్‌తోనే మొదలైన కెరీర్‌.. ఫైనలియర్‌లో ఉన్నప్పుడు! | Allu Sirish Debut in Bollywood: his Role in Aamir Khan Ghajini | Sakshi
Sakshi News home page

Allu Sirish: తెలుగులో కన్నా ముందు బాలీవుడ్‌లో.. ఆ స్టార్‌ హీరో బ్లాక్‌బస్టర్‌ మూవీలో!

Mar 2 2026 2:30 PM | Updated on Mar 2 2026 2:36 PM

Allu Sirish Debut in Bollywood: his Role in Aamir Khan Ghajini

మరో నాలుగు రోజుల్లో అల్లు శిరీష్‌ బ్యాచిలర్‌ లైఫ్‌కు ఫుల్‌స్టాప్‌ పడనుంది. మార్చి 6న నయనిక మెడలో శిరీష్‌ మూడు ముళ్లు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు, వేడుకలు జోరందుకున్నాయి. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో అల్లు శిరీష్‌ కెరీర్‌ గురించి ఓ సారి చూసేద్దాం..

బాలీవుడ్‌ మూవీతో కెరీర్‌ మొదలు
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్‌ సంస్థాపకుడు అల్లు అరవింద్‌ చిన్న కుమారుడే అల్లు శిరీష్‌. అరవింద్‌ పెద్ద కుమారుడు అల్లు అర్జున్‌ పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. అయితే శిరీష్‌ మాత్రం కొంతకాలంగా సినిమాల సంఖ్య తగ్గించేశాడు. శిరీష్‌ మూడేళ్ల వయసులో చిరంజీవి 'ప్రతిబంధ్‌' అనే హిందీ చిత్రంలో బాలనటుడిగా యాక్ట్‌ చేశాడు. ఆ తర్వాత 2013లో వచ్చిన గౌరవం సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. 

హీరోగా కంటే ముందు
కొత్త జంట చిత్రంతో క్రేజ్‌ అందుకున్నాడు. శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ: అమెరికన్‌ బర్న్‌ కన్‌ఫ్యూజ్‌డ్‌ దేశీ, ఊర్వశివో రాక్షసివో సినిమాలు చేశాడు. 2024లో వచ్చిన బడ్డీ చిత్రంలో చివరిసారి కనిపించాడు. రెండేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నాడు. అయితే 2013లో హీరోగా తన కెరీర్‌ మొదలవడానికే ముందే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం చాలా తక్కువమందికే తెలుసు! కాకపోతే హీరోగా కాదు, నిర్మాతగా! హిందీ గజిని సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించాడు. 

ఆమిర్‌ ఖాన్‌కు అభిమాని
ఈ విషయాన్ని అల్లు శిరీష్‌ స్వయంగా వెల్లడించాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో శిరీష్‌ మాట్లాడుతూ.. లగాన్‌, గులాం సినిమాలు చూశాక ఆమిర్‌ ఖాన్‌కు నేను పెద్ద అభిమాని అయిపోయాను. ఆయనతో కలిసి పని చేయాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అలాంటిది గజిని హిందీ రీమేక్‌ నా చేతుల్లోకి వచ్చేసరికి నమ్మలేకపోయాను. అప్పుడు నేను కాలేజీలో ఫైనలియర్‌ చదువుతున్నాను. నాన్న నిర్మాతగా, నేను సహ నిర్మాతగా గజిని తెరకెక్కించాం.

అదే ఎక్కువ ఇష్టం
తమిళంలో తెరకెక్కిన గజిని సినిమా అంటే నాకు చాలా ఇష్టం. దాని హిందీ రీమేక్‌ మరింత బాగుండేలా జాగ్రత్తపడ్డాం. ఈ సినిమా కోసం పని చేసిన అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. కాబట్టి నాకు హిందీ వర్షన్‌ అంటేన ఎక్కువ ఇష్టం అని పేర్కొన్నాడు. 2008లో వచ్చిన గజిని ఆ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డుకెక్కింది. అలాగే భారతేశంలో రూ.100 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ వసూలు చేసిన తొలి హిందీ మూవీగానూ చరిత్ర సృష్టించింది.

చదవండి: చదువుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి.. స్పందించిన కమెడియన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement