ఫ్యామిలీ మ్యాన్‌గా సూర్య.. టైటిల్‌ ఏంటో తెలుసా? | Suriya, Venky Atluri Movie Titled as Vishwanath and Sons | Sakshi
Sakshi News home page

Suriya: సూర్య- వెంకీ సినిమా టైటిల్‌ ఫిక్స్‌.. పోస్టర్‌ చూశారా?

Mar 2 2026 12:14 PM | Updated on Mar 2 2026 12:35 PM

Suriya, Venky Atluri Movie Titled as Vishwanath and Sons

సార్‌, లక్కీ భాస్కర్‌ చిత్రాలతో ఇతర భాషా హీరోలకు ఘన విజయాలను అందించాడు తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి. ఇప్పుడు ఈయన కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్యతో సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను సోమవారం (మార్చి 2న) రిలీజ్‌ చేశారు. సూర్య కెరీర్‌లో 46వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. 

ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామా
పోస్టర్‌లో కళ్లజోడు ధరించిన హీరో సూర్య చిన్న బాబును ఎత్తుకుని స్టైలిస్ట్‌గా కనిపిస్తున్నాడు. ఇది మనసును తాకే ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామా అని మూవీ టీం ప్రకటించింది. జూలైలో సినిమా రిలీజ్‌ చేస్తామని పేర్కొంది. ఈ మూవీలో ప్రేమలు హీరోయిన్‌ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. రవీనా టండన్‌, రాధికా శరత్‌ కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

సినిమా
మరోవైపు సూర్య చేతిలో ఇంకో రెండు సినిమాలున్నాయి. ఒకటి.. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న కరుప్పు మూవీ.. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో త్రిష కథానాయిక.  మరోటి.. మలయాళ డైరెక్టర్‌ జిత్తు మాధవన్‌ డైరెక్షన్‌లో మూవీ చేస్తున్నాడు. ఇందులో సూర్య పోలీసాఫీసర్‌గా నటిస్తున్నాడు. ఇందులో నజ్రియా హీరోయిన్‌గా కనిపించనుంది.

 

 

చదవండి: అల్లు ఫ్యామిలీలో నయనిక సిస్టర్స్‌.. ఫోటో వైరల్‌

Advertisement
 
Advertisement
Advertisement