‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్‌: రెండో రోజు పెరిగిన వసూళ్లు, ఎంతంటే? | Sree Vishnu And Nayan Sarika Vishnu Vinyasam Movie Day 2 Box Office Collections, Check Out Details Inside | Sakshi
Sakshi News home page

‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్‌: రెండో రోజు పెరిగిన వసూళ్లు, ఎంతంటే?

Mar 1 2026 1:49 PM | Updated on Mar 1 2026 4:31 PM

Vishnu Vinyasam Box Office Collection Day 2 Details

హీరో శ్రీవిష్ణు మంచి ఫామ్‌లో ఉన్నాడు. వరుస కామెడీ చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఆయన తాజాగా నటించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన్‌ సారిక హీరోయిన్‌గా నటించింది. మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఓ మెస్తరు అంచనాల మధ్య ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. అయినా కూడా కలెక్షన్స్‌ బాగానే వచ్చాయి. 

తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ 3.95 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, రెండో రోజు అంతకు మించిన జోరును ప్రదర్శించింది. మొదటి రోజుతో పోలిస్తే..రెండో రోజు ఏకంగా 54 శాతం పైగా బుకింగ్స్‌ని నమోదు చేసుకున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. మొత్తంగా రెండు రోజుల్లో రూ. 9.1 గ్రాస్‌ వసూళ్లను సాధించినట్లు మేకర్స్‌ అధికారికంగా వెల్లడించారు.వీకెండ్‌లో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం కూడా ఈ మూవీకి బాగా కలిసి వస్తోంది. సినిమాకు వచ్చిన టాక్‌ని బట్టి చూస్తే..వీకెండ్‌లో కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండుతులు అంచనా వేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement