‘ది కేరళ స్టోరీ’కి కొనసాగింపుగా ‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ ఫిబ్రవరి 27న విడుదలైంది. దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్, రచయిత విపుల్ అమృత్ లాల్ షా తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్‌లో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కేరళ హైకోర్టు ఈ చిత్రాన్ని ఆపివేయాలని ఆదేశించినప్పటికీ డివిజన్ బెంచ్ ద్వారా అనుమతి పొంది విడుదలైంది. అయితే రంజాన్ మాసంలో ఈ మూవీ విడుదల కావడంతో ముస్లిమ్స్ నుంచి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కేరళ రాష్ట్రం అన్ని మతాల ఐఖ్యతకు మూలం అని ఈ చిత్రం ఒక కల్పితం మాత్రమే అంటూ పలు వీడియోలను నెటిజన్లు షేర్ చేశారు.
'ది కేరళ స్టోరీ 2' మొదటి రెండురోజుల్లో కేవలం రూ. 5.4 కోట్లు మాత్రమే రాబట్టింది. అత్యధికంగా ముంబైలో సుమారు 800 స్క్రీన్స్‌లలో ఈ మూవీని ప్రదర్శించగా కేవలం 12 శాతం మాత్రమే టికెట్ల అమ్మకాలు జరిగాయి. దేశ వ్యాప్తంగా చాలా థియేటర్లలో సీట్లు ఖాళీగా కనిపించడంతో మేకర్స్ నిరాశ చెందినట్లు తెలుస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో 836 షోలకు గాను 14% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదైంది. హైదరాబాద్ 11.75%, బెంగళూరు 12%, చెన్నై 15 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేశాయి. 2023లో వచ్చిన 'ది కేరళ స్టోరీ' ఏకంగా రూ. 300 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే, సీక్వెల్ కలెక్షన్స్ ఆ రేంజ్ మార్క్‌ను అందుకోవడం అసాధ్యమైన పని అంటూ ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.


