టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరి పెళ్లి వేడుక ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ పెళ్లిలో సన్నిహితులు, బంధుమిత్రులు సందడి చేశారు. పెళ్లి తర్వాత తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు విరోష్ జంట. పెళ్లి తర్వాత విరోష్ జంట తొలిసారి భార్య, భర్తలుగా భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.
అయితే వీరి పెళ్లిని అభిమానులు కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో, హీరోయిన్ల పెళ్లి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని శ్రీ సాయికృప బాలాజీ మందిర్‌లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఓ అభిమాని ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అభిమానుల కోసం విరోష్ జంట అన్నదానం..
కాగా.. తమ అభిమానుల కోసం విరోష్ జంట కీలక నిర్ణయం తీసుకుంది. తమ వెడ్డింగ్ సందర్భంగా అభిమానుల కోసం ప్రత్యేక స్వీట్స్ పంపిణీ చేయనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మిఠాయిలు మార్చి 1వ తేదీన పంచనున్నారు. ఆ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల వద్ద ఆదివారం అన్నదానం కూడా నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కాగా.. ఈ టాలీవుడ్ జంట మార్చి 4న సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.
Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.
VDFC JAGITYAL - Dharmapuri❤️❤️#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda #ViRoshWedding pic.twitter.com/jQNFuTENir— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026
Vijay Deverakonda – Rashmika Mandanna వారి వివాహం సందర్భంగా అన్నదానం కార్యక్రమం.#VijayDeverakonda #rashmikamandanna #virosh #TeamDeverakonda pic.twitter.com/jcR3130HNM
— Adarsh Vinny (@AdarshVinn53747) February 28, 2026


