ఒకప్పుడు హీరోయిన్‌గా అలరించిన మమతా కులకర్ణి 2003 తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి విదేశాలకు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే డ్రగ్స్ రాకెట్‌లో పేరు వినిపించడంతో వార్తల్లోకెక్కింది. ఆ తర్వాత కుంభమేళా సందర్భంగా భారత్‌కు వచ్చిన ఆమె సన్యాసిగా మారింది. కిన్నెర అఖాడాలో చేరి మహా మండలేశ్వర్ పదవి అందుకుంది.
బుల్లితెరపై రీఎంట్రీ
అయితే కొన్ని వారాల క్రితమే ఆ హోదా నుంచి తప్పుకుంది. తాజాగా ఆమె బుల్లితెరపై కనిపించనుంది. హిందీలో ప్రసారమవుతున్న లాఫ్టర్ చెఫ్ మూడో సీజన్‌లో అతిథిగా అలరించనుంది. ఈ రియాలిటీ షో సెట్ బయట ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మీరు గమించారో, లేదో కానీ టీవీలో కనిపించక 25 ఏళ్లవుతోంది.
అది కూడా ముఖ్యమే
రెండున్నర దశాబ్దాల తర్వాత బుల్లితెరపై మళ్లీ కనిపించబోతున్నాను. చాలా ఎగ్జయిట్ అవుతున్నాను. అందరూ లైఫ్‌లో బిజీ అవడంతో పాటు సీరియస్‌గా ముందుకు వెళ్తున్నారు. మధ్యమధ్యలో హాయిగా నవ్వుకోవడం కూడా ముఖ్యమే.. ఇలాంటి షోలు అందుకు బాగా ఉపయోగపడతాయి అని చెప్పుకొచ్చింది.
చదవండి: తీహార్ జైల్లో నాలుగు నెలలు.. శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రావొద్దు: నటి


