ఖరీదైన హీల్స్‌ ధరించిన హీరోయిన్‌.. చెప్పుల ధర వేలల్లో కాదు! | Bigg Boss Nikki Tamboli Heels Cost will Surprise You | Sakshi
Sakshi News home page

Nikki Tamboli: హీరోయిన్‌ కాస్ట్‌లీ చెప్పులు.. లక్ష పైచిలుకే!

Feb 28 2026 6:24 PM | Updated on Feb 28 2026 6:28 PM

Bigg Boss Nikki Tamboli Heels Cost will Surprise You

'చీకటి గదిలో చితక్కొట్టుడు' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది నిక్కీ తంబోలి. కాంచన 3, తిప్పరా మీసం వంటి చిత్రాల్లో నటించినా తనకు పెద్ద గుర్తింపు రాలేదు. దాంతో ఐటం సాంగ్స్‌పై ఫోకస్‌ చేసింది. హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. లేటెస్ట్‌ రియాలిటీ షో ద 50లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్‌ చేసి మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

గోవా ట్రిప్‌
తాజాగా ఆమె ద 50 షోలోని సహకంటెస్టెంట్లతో వెకేషన్‌కు వెళ్లింది. ఈ గోవా ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో నిక్కీ బ్లూ కలర్‌ పొట్టి డ్రెస్‌లో తళుక్కుమని మెరిసింది. అయితే అందరి దృష్టి మాత్రం తను ధరించిన హీల్స్‌పైనే పడింది. కారణం ఏంటో తెలుసా? ఆ హీల్స్‌ డాల్స్‌ అండ్‌ గబ్బానా అనే లగ్జరీ బ్రాండ్‌కు చెందిన చెప్పులు.

చెప్పుల ధర ఎంతంటే?
ఆ హీల్స్‌ ధర అక్షరాలా లక్ష 46 వేలని తెలుస్తోంది. నిక్కీ తంబోలికి మేకప్‌ దగ్గరినుంచి అలంకరణ వరకు అన్నీ ఖరీదైనవి వాడటం బాగా అలవాటు. ఈ విషయాన్ని ఆమె ప్రియుడు అర్బాజ్‌ పటేల్‌ కూడా ధ్రువీకరించాడు. తను వాడే మాయిశ్చరైజర్‌ ధర రూ.75 వేలు, సీరమ్‌ రూ.50 వేలు అని తెలిపాడు.

 

 

చదవండి: అప్పటిదాకా నా కొడుకు సినిమా చూడను: సునీల్‌ శెట్టి

Advertisement
 
Advertisement
Advertisement