మరో ఓటీటీలోకి 'గాంధీ టాక్స్'.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Gandhi Talks Movie Telugu OTT Streaming Update | Sakshi
Sakshi News home page

Gandhi Talks OTT: సేతుపతి మూకీ సినిమా.. ఓటీటీ స్ట్రీమింగ్ అప్‌డేట్

Feb 28 2026 6:23 PM | Updated on Feb 28 2026 6:25 PM

Gandhi Talks Movie Telugu OTT Streaming Update

ప్రస్తుతం పాన్ ఇండియా, భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు అనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది. ఇలాంటి టైంలో మూకీ చిత్రం తీశారంటే సాహసమనే చెప్పొచ్చు. తాజాగా అది జరిగింది కూడా. విజయ్ సేతుపతి, అదితీ రావు హైదరీ, అరవిందస్వామి ప్రధాన పాత్రల్లో 'గాంధీ టాక్స్' అనే మూవీ తీశారు. గత నెలలో థియేటర్లలోకి కూడా తీసుకొచ్చారు. తాజాగా ఈ చిత్ర తెలుగు స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

(ఇదీ చదవండి: అపచారం.. తిరుమల గుడి ముందే 'బిగ్‌బాస్' భామ డ్యాన్సులు)

శుక్రవారం (ఫిబ్రవరి 27) నుంచి ఈ సినిమా.. అమెజాన్ ప్రైమ్‌లోకి సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. కాకపోతే ప్రస్తుతం అద్దె విధానంలో అందుబాటులో ఉంది. ఇప్పుడు జీ5 ఓటీటీలోకి మార్చి 06 నుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించారు. తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ స్ట్రీమింగ్ అవుతాయని క్లారిటీ ఇచ్చారు. ఇది మూకీ సినిమానే కాబట్టి భాషతో సంబంధం లేకుండా ఎవరైనా చూడొచ్చు. భావాన్ని అర్థం చేసుకోవచ్చు.

'గాంధీ టాక్స్' విషయానికొస్తే.. ముంబైలోని ధారావిలో ఉండే పేదకుర్రాడు మహాదేవ్ విష్ణు(విజయ్ సేతుపతి). మున్సిపాలిటీలో ఉద్యోగం కోసం ప్రయత్నించగా రూ.50 వేలు లంచం అడుగుతారు. తల్లి ఆరోగ్య పరిస్థితి బాగుపడాలన్నా, ప్రేమించిన అమ్మాయి(అదితీ రావు హైదరీ) దక్కాలన్నా ఈ జాబ్ కీలకం. దీంతో ఆ డబ్బు కోసం ఓ తప్పుడు పనికి సిద్ధపడతాడు. ఇదే ముంబైలో బోస్‌మన్ (అరవింద స్వామి)ది మరో కథ. బిజినెస్‌మ్యాన్ అయినప్పటికీ ఘోరమైన నష్టాలొచ్చి రోడ్డున పడతాడు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఓ ఆలోచన చేస్తాడు. ఇంతకీ అదేంటి? విష్ణు, బోస్‌మన్ జీవితాలని డబ్బు ఎలా కలిపింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి గుజరాతీ హిట్ సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్)

Advertisement
 
Advertisement
Advertisement