ఓటీటీలోకి కొత్త సినిమా.. రూ.50 లక్షలతో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్ | Laalo Krishna Sada Sahaayate Movie OTT Streaming Update | Sakshi
Sakshi News home page

OTT Movie: సామాన్యుడికి కృష్ణుడు సాక్షాత్కరిస్తే.. ఓటీటీలో హిట్ మూవీ

Feb 28 2026 3:23 PM | Updated on Feb 28 2026 3:34 PM

Laalo Krishna Sada Sahaayate Movie OTT Streaming Update

ఇప్పుడంతా ఓటీటీ జమానా. ఓ భాషలో అద్భుతమైన సక్సెస్ చేసుకున్న ఏ సినిమా అయినా సరే ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసేయొచ్చు. అలా గతేడాది గుజరాతీలో తీసిన ఓ డివోషనల్ మూవీ.. బంపర్ బ్లాక్‌బస్టర్ అయింది. రూ.50 లక్షల బడ్జెట్‪‌తో తీస్తే రూ.100 కోట్ల కలెక్షన్ అందుకుంది. ఇప్పుడీ చిత్రం ఎట్టకేలకు స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన విజయ్ సేతుపతి మూకీ సినిమా)

గుజరాతీ సినీ ఇండస్ట్రీలో తొలి రూ.100 కోట్ల వసూళ్లు అందుకున్న సినిమా 'లాలో-కృష్ణ సదా సహాయతే'. గతేడాది అక్టోబరు 10న రిలీజ్ కాగా.. నవంబరు 28న దేశవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. లాంగ్ రన్‌లో కళ్లు చెదిరే కలెక్షన్ అందుకుంది. ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి అద్భుతం సృష్టించింది. దీనికి కారణం కథలోని బలం.

2019లో గుజరాతీలో రిలీజైన 'చాల్ జీవీ లాయియే' చిత్రం రూ.50 కోట్ల వసూళ్లు సాధించగా.. 'లాలో' సినిమా దాన్ని అధిగమించేసింది. రూ.100 కోట్ల ఘనత సాధించిన తొలి గుజరాతీ మూవీగా నిలిచింది. కృష్ణుడి లీలలు చూపించే బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. అంకిత్ సఖియా దర్శకుడు. రీవా రచ్, శ్రుహద్ గోస్వామి ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడీ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో మార్చి 06 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీ, గుజరాతీ భాషల్లోనే చూడొచ్చు.

'లాలో-కృష్ణ సదా సహాయతే' విషయానికొస్తే.. లాలో పాత్రధారి ఓ ఆటో డ్రైవర్. గతంలో జరిగిన సంఘటనల వల్ల ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. తాగుడుకు బానిసవుతాడు. ఓసారి అనుకోకుండా ఒక ఫామ్‌హౌస్‌లో చిక్కుకుపోతాడు. ఆ ఏకాంతంలో అతడికి కృష్ణుడి లీలలు ఆవిష్కృతమవుతాయి. ఆ ఆధ్యాత్మిక చింతనలో ముక్తి మార్గంవైపు నడుస్తాడు. గతం తాలూకు బాధలు, తన మనసులోని అలజడిని దాటుకుని కొత్త ఆశలతో ముందుకెళ్లడం మొదలపెడతాడు. చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ‘D/o ప్రసాదరావు కనుబడుటలేదు’ వెబ్‌ సిరీస్‌ రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement