ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ : మాజీ ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్‌ | Former UK Royal Andrew Arrested Amid Probe Into Epstein Ties | Sakshi
Sakshi News home page

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ : మాజీ ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్‌

Feb 19 2026 5:04 PM | Updated on Feb 19 2026 6:12 PM

Former UK Royal Andrew Arrested Amid Probe Into Epstein Ties

దశాబ్దాల పాటు సెక్స్ ట్రాఫికింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ (Jeffrey Epstein)  కేసులో మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా రిపోర్టుల ప్రకారం, ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వ పదవిలో ఉండి దుష్ప్రవర్తనకు (misconduct in public office) పాల్పడ్డారనే అనుమానంతో, బ్రిటన్ రాజుగ కింగ్ చార్లెస్-3 సోదరుడు మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్ (Andrew Mountbatten)ను సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు.  ఈ మేరకు థేమ్స్ వ్యాలీ పోలీసులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నార్ఫోక్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బ్రిటన్ చట్టం ప్రకారం నిందితుడి పేరును వారు అధికారికంగా వెల్లడించలేదు.

సమగ్రమైన పరిశీలన తర్వాతే ఆయనను అరెస్టు చేసినట్లు, ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు థేమ్స్ వ్యాలీ పోలీసులు తెలిపారని బీబీసీ నివేదించింది. 2010లో జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు ఆండ్రూ వాణిజ్య నివేదికలను పంపారన్న ఆరోపణలపై కూడా తాము విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత, ప్రభుత్వ పదవిలో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్నఆరోపణపై  దర్యాప్తు ప్రారంభించామనీ, తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ నేరంపై విచారణ జరుపుతున్నప్పుడు, దర్యాప్తు సమగ్రతను, నిష్పాక్షికతను కాపాడటం చాలా ముఖ్యమని  పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్‌కు ఆండ్రూ రహస్య సమాచారం ఇచ్చాడనే నివేదికలపై విచారణకు కింగ్ చార్లెస్ III సహకరిస్తారని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. 

ఇదీ చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు

అంతకుముందు రోజు ఉదయం, సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని వుడ్ ఫామ్ వద్దకు గుర్తు తెలియని ఆరు పోలీసు కార్లు , సుమారు ఎనిమిది మంది సాదా దుస్తులలో ఉన్న పోలీసు అధికారులు చేరుకోవడం కనిపించిందని పలు కథనాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు మాజీ యువరాజు ఈరోజు 66 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 

ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్‌: షాకింగ్‌ విషయాలు వెల్లడి

Advertisement
 
Advertisement
Advertisement