breaking news
uk
-
దేశాన్ని వీడతానన్న గ్రామం
లండన్: ప్రభుత్వ నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ యూకేలోని ఒక చిన్న గ్రామం తన నిరసన గళాన్ని బలంగా విన్పించింది. తప్పదనుకుంటే బ్రిటన్ నుంచి వేరుబడి యూరప్‌తో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామంలోని మెజారిటీ ప్రజలంతా ఏకతాటి మీదకొచ్చారు. యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో కొనసాగాలా వద్దా అంటూ చేపట్టిన ఒక అనధికారిక రెఫరెండమ్‌లో పిడ్డింగ్టన్ గ్రామానికి చెందిన ప్రజలంతా పాల్గొన్నారు. ఈ గ్రామ జనాభా కేవలం 350. వీరిలో 311 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరిలో 285 మంది యూకే నుంచి విడిపోవాలని ఓటేశారు. 26 మంది బ్రిటన్‌లోనే కొనసాగాలని అనుకూలంగా ఓటేశారు. ‘‘మెజారిటీ ప్రజలు తమ ప్రభుత్వ వ్యతిరేకతను బలంగా చాటారు. ఇది ఒక ప్రాంతానికి సంబంధించిన సందేశం కాదు. యావత్ ప్రపంచానికి మేమిచ్చే సందేశం’’ అని అక్కడి గ్రామ కౌన్సిల్ చైర్మన్ టిమ్ మెక్నాలీ వ్యాఖ్యానించారు. గ్రామానికి కేవలం 800 మీటర్ల దూరంలో ఉన్న సైన్యానికి చెందిన ఒక పాత స్థావరాన్ని విదేశీ వలసదారులకు కేటాయించి అక్కడ 1,200 శరణార్థి గృహాలను నిర్మించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తుండటంతో పిడ్డింగ్టన్ గ్రామస్తుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు వందలాదిగా కొత్తగా ఇళ్లను నిర్మిస్తే ఈ ప్రాంతంలో ఇళ్ల ధరలు అమాంతం పెరిగిపోతాయని, ఇది స్థానిక మధ్యతరగతి కుటుంబాల కొత్త ఇంటి కలను కాలరాస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. వలసదారుల రాకతో ఈ ప్రాంతంలో భద్రత కరువవుతుందని, నేరాలు పెరిగే ప్రమాదముందని వాళ్లంతా ఆరోపిస్తున్నారు. ఈ రెఫరెండమ్ ప్రభుత్వ వ్యతిరేకత, స్థానిక ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం అని పలువురు అభిప్రాయపడ్డారు. 1940లలో నాజీ జర్మనీ వైమానిక దాడులను బ్రిటన్ సేనలు అడ్డుకున్నట్లే ఇప్పుడు మేం విదేశీ వలసదారుల రాకను అడ్డుకోబోతున్నాం. మా ముందు తరాల వాళ్లు పోరాడినట్లే మేం సైతం పోరాటం కొనసాగిస్తాం’’అని 76 ఏళ్ల గ్రామçస్తుడు హెర్బెర్ట్ ఓవెన్ చెప్పారు. కానీ స్థానికంగా కొందరు మీడియా ప్రతినిధులు మాత్రం ఈ ఘటనను ఒక వింతగా కొట్టిపారేశారు. బ్రిటన్ నుంచి ఒక గ్రామం విడిపోయేందుకు సాహసించిన కథతో రూపొందిన ‘పాస్‌పోర్ట్ టు పిమ్లికో’ సినిమాతో ఈ ఘటనను పోల్చిచూస్తున్నారు. -
వీళ్ల స్కామ్ లు అంతా ఇంతా కాదు.. 3 గంటలు టాయిలెట్ లోనే
-
నాలుగు దేశాలుగా విడిపోనున్న UK..?
-
రమానందన కేసులో బిగ్ ట్విస్ట్ అడ్డంగా దొరికిన పోలీసులు..!
-
పాపం నందు.. UKలో దారుణమైన పరిస్థితి ఇక తప్పించుకోలేరు!
-
నందనకు సపోర్ట్ గా ఏపీ పోలీసులు?
-
రూ. 12,300 కోట్ల సీఎం విజయ్ డీల్ : 9 వేల ఉద్యోగాలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనలో భాగంగా నాలుగు కీలక పెట్టుబడి ఒప్పందాలపై సంతకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచారం ప్రకారం, ఈ ఒప్పందాల విలువ దాదాపు రూ. 12,300 కోట్లు కాగా, దీనివల్ల సుమారు 9,000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అంచనా. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే రూ. 1 లక్ష కోట్లకు పైగా విలువైన పెట్టుబడి అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా చెన్నైలో 'గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్' (GCC) ఏర్పాటు కోసం ఎర్నస్ట్ & యంగ్ (Ernst & Young) ద్వారా ఒక బ్రిటిష్ కంపెనీతో రూ. 1,000 కోట్ల ఒప్పందంపై కూడా విజయ్ సంతకం చేశారు. వీటిలో అతిపెద్ద ఒప్పందం 'సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్'తో జరిగింది. ఈ ఒప్పందంగా రూ. 11,000 కోట్ల పెట్టుబడితో కుదిరింది. దీని ద్వారా డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, అసెంబ్లీ రంగాల్లో దాదాపు 7వేల ఉద్యోగాలు వస్తాయి.గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (చెన్నై): బ్రిటన్ కంపెనీతో ఎర్నెస్ట్ అండ్ యంగ్ (Ernst & Young) ద్వారా రూ. 1,000 కోట్ల ఒప్పందం కుదిరింది. దీని ద్వారా 2,000 ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభించనున్నాయి సిగ్మా టెక్నాలజీ గ్రూప్: స్వీడన్‌కు చెందిన ఈ సంస్థ చెన్నై, తిరుచిరాపల్లిలో తమ కేంద్రాలను విస్తరించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల 600 ఉద్యోగాలు రానున్నాయి. విల్సన్ పవర్ సొల్యూషన్స్: తిరువల్లూరు జిల్లాలో రూ. 300 కోట్ల పెట్టుబడితో మరో ఒప్పందం కుదిరింది. దీని ద్వారా దాదాపు 400 ఉద్యోగాలు లభిస్తాయి.ఫోకస్ రంగాలు: అధునాతన తయారీ (అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్), ఆటోమొబైల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, మరియు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. యూకే పర్యటనలో మోటార్ స్పోర్ట్స్ మరో ముఖ్యమైన అంశం తమిళనాడులో ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ నగరాన్ని అభివృద్ధి చేయడం, రేసింగ్‌కు సంబంధించిన తయారీ మరియు అనుబంధ పరిశ్రమలలో అవకాశాలను సృష్టించడం వంటి ప్రభుత్వ ప్రణాళికలతో కూడా ఈ పర్యటనకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌ను సందర్శించి, ప్రముఖ నటుడు, రేసర్ అజిత్ కుమార్ పాల్గొన్న రేసును జెండా ఊపి ప్రారంభించారు. తమిళనాడులో ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ ప్రణాళికలో ఇది భాగం. ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్ప్రతిపక్షం విమర్శలు- టీవీకే స్పందనఅయితే, ఈ పెట్టుబడుల ప్రోత్సాహం పారదర్శకత లోపించిందని ప్రతిపక్షాల నుంచి విమర్శలను కూడా రేకెత్తించింది. విజయ్ పర్యటన వివరాలు, సమావేశాలపై పారదర్శకత కొరవడిందంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో టీవీకే స్పందించింది . దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్న నేపథ్యంలో (పోటీ ఫెడరలిజం), ఎంఓయూలు కుదిరిన వెంటనే వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని తెలిపింది.సెప్టెంబర్ 16 వరకు యూకేలోనే ఉండనున్న విజయ్ మరిన్ని ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. -
యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు..
-
యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు!
బ్రిటన్ గగనతలంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం దేశవ్యాప్తంగా విమాన రాకపోకలను తీవ్రంగా దెబ్బతీసింది. వెయ్యికి పైగా విమానాలు రద్దు కాగా.. మరెన్నో విమానాలు గంటల తరబడి ఆలస్యమయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాల్లోనే, విమానాశ్రయాల టెర్మినల్స్‌లోనూ గంటలపాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. విమానాలను రద్దు చేయడం, దారి మళ్లించడం, షెడ్యూళ్లు మార్చడంతో బ్రిటన్ మాత్రమే కాకుండా యూరప్‌లోని పలు ప్రాంతాల్లోనూ విమాన సేవలు అస్తవ్యస్తమయ్యాయి. బ్రిటన్ గగనతల నియంత్రణ సేవలను నిర్వహించే నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ (NATS)కు చెందిన ఫ్లైట్ డేటా ప్రాసెసింగ్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడమే ఈ సంక్షోభానికి కారణం. లండన్‌లోని హీత్రూ, గాట్విక్, స్టాన్స్టెడ్, సిటీ విమానాశ్రయాలతోపాటు మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, ఎడిన్బర్గ్ తదితర ప్రధాన ఎయిర్‌పోర్టులపై దీని ప్రభావం పడింది. ఒక దశలో విమానాలను ఇతర యూరప్ విమానాశ్రయాలకు మళ్లించాల్సి వచ్చింది. విమానాలు, సిబ్బంది తమ నిర్ణీత ప్రాంతాల్లో లేకపోవడంతో.. సాంకేతిక సమస్య పరిష్కారమైన తర్వాత కూడా దాని ప్రభావం వెంటనే తొలగిపోలేదు.గంటల తరబడి నిరీక్షణ..సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. రన్‌వేలపై విమానాల్లోనే గంటల తరబడి కూర్చోవాల్సి రావడంతో పలువురు తీవ్ర అసహనానికి గురయ్యారు. కొన్ని విమానాలను చివరకు రద్దు చేయడంతో ప్రయాణికులు టెర్మినల్స్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా భారీ రద్దీ, బ్యాగేజీ సమస్యలు, సమాచార లోపంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. బ్రిటిష్ ఎయిర్వేస్ 100కు పైగా విమానాలను రద్దు లేదా దారి మళ్లించగా.. ర్యాన్ఎయిర్ 65 వేల మందికి పైగా ప్రయాణికులపై ప్రభావం పడినట్లు వెల్లడించింది. ఈజీజెట్ సహా పలు విమానయాన సంస్థల సర్వీసులపైనా అంతరాయం ఏర్పడింది.సమస్య పరిష్కారం కానీ..సాయంత్రానికి సాంకేతిక లోపాన్ని పరిష్కరించినట్లు నాట్స్ ప్రకటించింది. వ్యవస్థ సాధారణ స్థితికి వస్తోందని, నిలిచిపోయిన విమానాల భారీ బ్యాక్‌లాగ్‌ను క్లియర్ చేస్తున్నామని వెల్లడించింది. అయితే అంతరాయం ప్రభావం వెంటనే తొలగిపోలేదు. హీత్రూ విమానాశ్రయంలో ఆ రోజు రాత్రి రాకలను నిలిపివేసి.. కేవలం బయలుదేరే విమానాలను మాత్రమే నడిపారు. భారత్-యూకే సర్వీసులపైనా ప్రభావంఈ సాంకేతిక సమస్యతో భారత్ నుంచి యూకేకు, యూకే నుంచి భారత్‌కు నడిచే విమాన సర్వీసులపైనా ప్రభావం పడింది. విమానాలు, సిబ్బంది వేరే ప్రాంతాల్లో చిక్కుకోవడంతో తదుపరి సర్వీసుల షెడ్యూళ్లలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన స్థితిని సంబంధిత ఎయిర్‌లైన్‌తో నిర్ధారించుకోవాలని సూచించారు. వరుస వైఫల్యాలతో విమర్శలునాట్స్లో ఇలాంటి సమస్యలు పునరావృతమవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో ఫ్లైట్-ప్లాన్ ప్రాసెసింగ్‌లో లోపంతో భారీగా విమానాలు నిలిచిపోయాయి. ఆ ఘటనలో ఎయిర్‌లైన్స్‌కు భారీగా రీఫండ్లు, పరిహారం చెల్లించాల్సి వచ్చింది. తాజాగా మరోసారి సాంకేతిక వైఫల్యం తలెత్తడంతో బ్రిటన్ విమానయాన మౌలిక వసతుల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి. ఇటు బ్రిటన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఘటనపై పూర్తి నివేదిక కోరింది. NATS చీఫ్ మార్టిన్ రోల్ఫ్ మాత్రం అసలు సమస్యకు ఖచ్చితమైన కారణం ఇంకా తమకు తెలియలేదని తెలిపారు.ఇదీ చదవండి: ముంచేసిన మరో విపత్తు.. జలమయంగా జపాన్ -
యూకే వీసా స్కామ్.. ‘మాస్టర్ మైండ్ అతడే’ : యూట్యూబర్ నందన
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: యూకే వీసా రెన్యువల్, ఉద్యోగాల మోసం కేసుకు సంబంధించి ఏపీ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో యూట్యూబర్ నందూస్ వరల్డ్ అలియాస్ రమానందన విచారణ ముగిసింది. సుమారు నాలుగు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. ఈ కేసు విచారణపై ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం పలు కీలక విషయాలు వెల్లడించారు.బాధితుడు క్రాంతికుమార్ ఫిర్యాదు మేరకు రమానందన, ఆమె భర్త మధుకర్, మధుకర్ తండ్రి మోహనరావుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుల కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని, తాము విచారణకు హాజరవుతామని, లుక్ అవుట్ నోటీసులు ఎత్తివేయాలని రమానందన మెయిల్ ద్వారా కోరినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆమె విచారణకు హాజరయ్యారని పేర్కొన్నారు.పోలీసుల విచారణలో వీసా రెన్యువల్ లావాదేవీలతో తనకేం సంబంధం లేదని రమానందన తెలిపినట్లు సీఐ తెలిపారు. ‘డెస్టినీ కన్సల్టెన్సీ’తో తనకెలాంటి సంబంధం లేదని, ఆ వ్యవహారమంతా తన భర్త మధుకరే చూసుకుంటాడని ఆమె చెప్పినట్లు వెల్లడించారు. తనకు ఏమీ తెలియదని, తన భర్తనే అడగాలని రమానందన విచారణలో పేర్కొన్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.విచారణ నిమిత్తం రమానందన మూడు వారాల సెలవుపై ప్రస్తుతం ఇండియాకు వచ్చారు. ఆమె తిరిగి యూకే వెళ్లిన తర్వాత ఆమె భర్త మధుకర్ విచారణకు వస్తారని చెబుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 16న రమానందనను మరోసారి విచారించనున్నట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు వెల్లడించారు.యూకే వీసా రెన్యువల్స్, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ పేరుతో డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ రమానందనపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పీఎస్‌తో పాటు మరికొన్ని చోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఇబ్రహీంపట్నం తరలించి ఈ విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఆమెను పోలీసులు తదుపరి చర్యల నిమిత్తం విచారిస్తున్నారు. 👉ఇదీ చదవండి : పోలీసుల అదుపులో నందూస్ వరల్డ్ -
విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన
-
యూట్యూబర్ నందన అరెస్ట్ వెనుక..!
-
నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO
-
Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!
-
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సాక్షి,హైదరాబాద్: యూకే వీసా స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి పరారీలో ఉన్న ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన నందన దంపతులపై గతంలోనే కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమె కదలికలను గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు అప్రమత్తమై ఆమెను అదుపులోకి తీసుకున్నారు.లండన్‌లో పర్మినెంట్ ఉద్యోగాలు, భారీ వేతనాలు ఇప్పిస్తామని నందన దంపతులు పలువురికి ఆశ చూపారు. ఈ నకిలీ ఉద్యోగాల ఆశతో నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ కావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న అనంతరం, ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ నిమిత్తం ఆమెను ఏపీలోని కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఈ మోసంలో ఆమె భర్త మధుకర్ పాత్రపై కూడా పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. నందనపై ఉన్న కేసులు, లుక్అవుట్ నోటీసుల ఆధారంగా పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు.👉ఇదీ చదవండి : నందూస్ వరల్డ్‌లో ఏం జరుగుతోంది? -
పదేళ్ల తర్వాత యజమాని చెంతకే చేరిన చిలుక..!
ఈ రోజుల్లో ఏదైనా పోతే మళ్లీ మన చెంతకే చేరుతుందనేది చెప్పడం కష్టం. అది మనిషైనా.. పెంపుడు జంతువైనా.. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ మనకు దూరమైనవి తిరిగి చెంతకు చేరితే ఆ ఆనందం మాటలకందనిది. అలాంటి భావోద్వేగ స్థితిని అనుభవిస్తున్నాడు ఈ వ్యక్తి.ఇంగ్లాండ్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌కు చెందిన రాబర్ట్ మోర్టిమర్ అనే వ్యక్తి, పెంపుడు చిలుక అపహరణకు గురైంది. దాదాపు పదేళ్ల తర్వాత అదే చిలుక అతడి చెంతకు చేరింది. నిజానికి అతడు అది ఎప్పుడో చచ్చిపోయి ఉంటుందని అనుకున్నాడు. యాదృచ్ఛికంగా దాని ఆచూకి తెలియడం, తన చెంతకు చేరడం ఆ వ్యక్తిని ఆనందంలో ముంచెత్తింది. అదెలా అపహరణకు గురైందంటే..2017లో బ్రాడ్ఫోర్డ్ నగరంలోని తన ఇంటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నా బార్నీ అనే పెంపుడు చిలుక కనిపించకుండా పోయింది. యజమాని రాబర్ట్ దాన్ని ఎవరో ఎత్తుకుపోయారని చాలా బాధపడ్డాడు. ఆ సమయంలో తన పక్షి ఆచూకీ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏళ్లు గడిచే కొద్దీ ఆ పెంపుడు పక్షి మళ్లీ కనిపించే అవకాశాలే అస్సలు కనిపించలేదు. కానీ ఇటీవల ఆ చిలుక యజమాని 56 ఏళ్ల రాబర్ట్‌కు స్థానిక పోలీసు అధికారి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. బార్నీ అనే చిలుక సజీవంగా దొరికిందని, ఫోన్ చేసి చెప్పారు. అది నిజమా కల అని ఒక్కసారిగా విస్తుపోయాడు రాబర్ట్. అంతేగాదు ఆ చిలుక ఎక్కడైతే దొంగలింపబడిందో..అక్కడికి సుమారు 20 మైళ్ల దూరంలో ఐక్య(IKEA) పార్కింగ్ స్థలంలో దొరికింది. జంతు సంరక్షణ కార్యకర్త బార్నీకి అటాచ్ చేసి ఉన్న మైక్రోచిప్‌ని స్కాన్ చేయగా..దానికి అనుసంధానించి ఉన్న ఫోన్ నెంబర్ పనిచేయకపోవడంతో యజమానిని గుర్తించలేకపోయినట్లు పోలీసులు చెప్పారు. అయితే చాలామంది అది మా చిలుక అంటూ వచ్చారు గానీ..వాళ్లెవరూ తమ వద్ద సరైన ఆధారాలను చూపించలేకపోయారు అని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆ పక్షికి ఉన్న చిప్ ద్వారా దాని పేరు బార్నీ అని తెలిసింది. తాము మొదటిసారి దానిపేరుతో పిలవగానే నా పేరు వీళ్లకి ఎలా తెలుసు అన్నట్లుగా ఆశ్చర్యపోయిందన్నారు. ఆ తర్వాత తాము ఇంటర్నెట్లో దాని కోసం వెతకగా..తిరిగి దాని యజమాని చెంతకు చేర్చగలిగామని చెప్పారు. (చదవండి: వీల్‌చైర్‌లో మహిళ పుల్ అప్స్..! వీడియో వైరల్) -
ఒక్కసారిగా మీ ఉద్యోగం పోయినా ఇతడిలా ఉండాలి..
అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. అయితే, టెకీకి తన తండ్రి అందించిన అచంచలమైన మద్దతు ధైర్యాన్ని ఇచ్చింది. యూకేలో జేపీ మోర్గాన్ ఉద్యోగం నుంచి తనను తొలగించిన తర్వాత కైష్ అన్సారీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగ వీడియోను పంచుకున్నారు. అందులో తన తండ్రి తనకు ఓదార్పునిచ్చిన తీరు కనిపించింది.గతంలో టైలర్‌గా పనిచేసిన తన తండ్రి, తన ఉద్యోగం గురించి కాకుండా ప్రధానంగా తన మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన చెందారని చెప్పారు. తనను తాను జాగ్రత్తగా చూసుకోవాలని ప్రోత్సహించారని కైష్ అన్సారీ తెలిపారు. “ఈ వీడియోను సానుభూతి కోసం షేర్ చేయడం లేదు. కష్టకాలంలో ఉన్న ఎవరికైనా మీరు ఒంటరిగా లేరని గుర్తు చేయడానికే పంచుకుంటున్నాను. ఏ పరిస్థితుల్లోనైనా మీ కుటుంబం మీకు అండగా ఉంటుంది” అని కైష్ అన్సారీ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోయిన విషయంపై కైష్ అన్సారీ మాట్లాడుతూ.. “ఉద్యోగం నుంచి తొలగించడం బాధాకరం. మీరు ఎంత అనుభవం ఉన్నవారైనా, ఎంత కష్టపడి పనిచేసినా.. ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోతే మీపై మీకు, మీ వృత్తిపై, మీ భవిష్యత్తుపై సందేహాలు మొదలవుతాయి” అని రాశారు. కైష్ అన్సారీ ఉత్తరప్రదేశ్‌లోని డియోరా జిల్లాలోని సలేమ్పూర్కు చెందినవారు. ప్రస్తుతం యూకేలో నివసిస్తున్నారు.తండ్రి మాటలతో ధైర్యం తీవ్రమైన వృత్తిపరమైన ఆత్మన్యూనతకు గురైన సమయంలో తన తండ్రి చెప్పిన మాటలు తనకు ఎలా ధైర్యం ఇచ్చాయో ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ హృదయాన్ని హత్తుకునే సంభాషణను వివరిస్తూ.. కష్టకాలంలో కుటుంబం తనపై ఉంచే నమ్మకమే అత్యంత గొప్ప ప్రేరణ అని చెప్పారు.“అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులతో జరిగే ఒక్క సంభాషణ నిజంగా ముఖ్యమైన విషయం ఏమిటో గుర్తు చేస్తుంది. ఉద్యోగం కోల్పోయిన తర్వాత నా నాన్నతో జరిగిన సంభాషణలోని చిన్న భాగం ఇది. నిజాయితీగా చెప్పాలంటే, ఆయన చెప్పిన మాటలు ఆయన ఊహించిన దానికంటే నాకు ఎంతో భాగా అర్థమయ్యాయి. నా నాన్న ఎప్పుడూ నాకు అత్యంత గొప్ప ప్రేరణనిచ్చే వ్యక్తుల్లో ఒకరు. ప్రతి విజయంలోనూ, ప్రతి కష్టకాలంలోనూ ఆయనకు నాపై ఉన్న నమ్మకం ఎప్పుడూ మారలేదు. నాపై నాకు సందేహం వచ్చినప్పుడు ముందుకు సాగాలని గుర్తు చేస్తారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరగనప్పుడు జీవితం అక్కడితో ముగిసిపోదని చెబుతారు” అని కైష్ అన్సారీ తెలిపారు.సంభాషణను ఎందుకు షేర్ చేశారు?భావోద్వేగానికి లోనైన అన్సారీ స్పందిస్తూ.. “అలాంటి మద్దతును కుటుంబం మాత్రమే ఇవ్వగలదు. ఇదే పరిస్థితిని మౌనంగా ఎదుర్కొంటున్న ఎంతోమంది ఉన్నారని నాకు తెలుసు కాబట్టే దీన్ని పంచుకుంటున్నాను. ఉద్యోగాలు కోల్పోవడం, తిరస్కరణలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు విఫలంకావడం, అనిశ్చితి, ఆర్థిక ఒత్తిడి లేదా ‘ఇక నేను ఏం చేయాలి?’ అని ఆలోచించడం.. వంటి నాకు తెలుసు” అని తెలిపారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ తిరస్కరణలకు గురవుతున్న వారికి, ఆర్థిక ఆందోళనతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ సందేశం ఓదార్పునిస్తుందని ఆయన ఆశించారు.“వారిలో మీరు ఒకరైతే, దయచేసి గుర్తుంచుకోండి.. ఉద్యోగం కోల్పోవడం మీ విలువకు ప్రతిబింబం కాదు. అది మీ వృత్తిలో జరిగిన ఒక సంఘటన మాత్రమే, మీ వృత్తికి ముగింపు కాదు. ఒక్క ఎదురుదెబ్బ కారణంగా ఇప్పటివరకు మీరు సాధించిన ప్రతిదాన్ని మర్చిపోకండి. నేర్చుకుంటూ ఉండండి. మెరుగుపడుతూ ఉండండి. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తూనే ఉండండి. నమ్మకాన్ని కోల్పోవద్దు. మనం ఇంకా కనుగొనని అవకాశాలు ముందున్నాయి. కొన్నిసార్లు జీవితం ఒక తలుపును మూసివేసి, అంతకంటే మెరుగైన దిశగా మనల్ని నడిపిస్తుంది” అని తెలిపారు.నాన్న విషయానికి వస్తే… తన తండ్రికి కృతజ్ఞతలు తెలుపుతూ అన్సారీ.. “మీ ప్రేమ, మీ మద్దతు, మీ దీవెనలు ఎప్పుడూ ముందుకు సాగేందుకు నాకు బలాన్ని ఇచ్చాయి. నేను ఉద్యోగాన్ని కోల్పోయి ఉండవచ్చు. కానీ నా ఆత్మవిశ్వాసాన్ని, నా ఆశయాన్ని, పోరాడాలనే నా సంకల్పాన్ని కోల్పోలేదు. ఈ ఎదురుదెబ్బను ఎదుర్కొని, మరింత బలంగా తిరిగి వస్తాను. అంతకంటే మంచి ఉద్యోగ అవకాశంతో తిరిగి వస్తానని ఆశిస్తున్నాను” అని తెలిపారు.నా మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన తన తండ్రి తన ఉద్యోగం కోల్పోవడం గురించి ఎప్పుడూ ఆందోళన చెందలేదని, తాను ఎలా ఉన్నాననే విషయంపైనే ఎక్కువగా ఆందోళన చెందారని అన్సారీ చెప్పారు. “ఆయన ప్రధానంగా నా మానసిక ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. ఎందుకంటే నా కుటుంబానికి పూర్తి బాధ్యత నాదే. నా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న ఏకైక వ్యక్తిని నేనే. ఆయన వృత్తిరీత్యా టైలర్. అందుకే నా కుటుంబం కోసం పని ప్రారంభించడానికి నాకు ఇంకా శక్తి ఉందని చెప్పారు. ప్రాథమికంగా, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయనను విశ్రాంతి తీసుకోమని నేను చెప్పాను. ప్రస్తుతం యూకేలో ఉద్యోగ మార్కెట్ కొంత కష్టంగా ఉంది. అయినప్పటికీ నాకు కొన్ని ఉద్యోగ ఇంటర్వ్యూలు వస్తున్నాయి. ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్నాను. త్వరలోనే నాకు మరింత మంచి ఉద్యోగం లభిస్తుంది” అని చెప్పారు. View this post on Instagram A post shared by Kaish Ansari (@theengineerguy_) -
మీలాంటి మిలీనియల్స్ ఇల్లు ఎందుకు కొనలేకపోతున్నారో తెలుసా?
విద్య పూర్తిచేసుకుని ఉద్యోగం సంపాదించడం, సొంత ఇల్లు కొనడం, ఆ తర్వాత పెళ్లి చేసుకుని భార్య, పిల్లలతో కుటుంబ జీవితాన్ని ప్రారంభించడం.. గత తరాలు అనుసరించిన ఈ జీవన విధానం ప్రస్తుతం చాలా మంది మిలీనియల్స్‌కు దూరమైన కలలా మారింది. భారత్‌లోని మెట్రో నగరాలతో పాటు ఎన్నో దేశాల్లో సొంత ఇల్లు కట్టుకోవడం గగనంగా మారింది. ఇల్లు కొనడం అంటే మొదటగా గుర్తువు వచ్చేది మిలీనియల్స్. జెన్ జీలో చాలా మంది ఇప్పుడిప్పుడే ఉద్యోగం, పెళ్లి బంధంలోకి అడుగుపెడుతుంటారు. మిలీనియల్స్‌లో చాలా మంది ఇల్లు కొనే ఆలోచనలో ఉంటారు. దీంతో మిలీనియల్స్ తరానికి సొంత ఇల్లు కొనడం చాలా కాలంగా పెద్ద సవాలుగా మారిన తీరుపై ఓ సర్వే చేశారు. అక్కడ 1990 దశకం మధ్యలో బ్రిటన్‌లో జన్మించిన వారికి ప్రస్తుతం సొంత ఇల్లు ఉండే అవకాశం సుమారు 25 శాతమే ఉంది. 1990 దశకంలో 20 ఏళ్ల వయసులో ఉన్నవారికి సొంత ఇల్లు ఉండే అవకాశం దీనికి దాదాపు రెండింతలు ఉండగా, అంతకుముందు తరాల్లో ఇది మరింత ఎక్కువగా ఉండేది.ప్రధాన కారణం ఇళ్ల ధరలు దీర్ఘకాలంగా ఇళ్ల ధరలు మన ఆదాయాల కంటే వేగంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి. తనఖా రుణాల మార్కెట్లో మార్పులు కూడా ప్రభావం చూపినప్పటికీ, ఇళ్ల నిర్మాణం తగినంతగా జరగకపోవడమే అసలు సమస్యగా హౌసింగ్ ఆర్థికవేత్త పాల్ చెషైర్ పేర్కొంటున్నారు.జనాభా పెరుగుదల, చిన్న కుటుంబాల్లో నివసించే ధోరణికి అనుగుణంగా ఇంగ్లాండ్‌లో ఏటా మరో 300,000 ఇళ్లు అవసరమని ప్రభుత్వం గతంలో అంచనా వేసింది. అయితే గత ఏడాది 208,000 ఇళ్లు మాత్రమే నిర్మించారు. కనీసం మూడు దశాబ్దాలుగా ఏ ఏడాదిలోనూ 300,000 కొత్త ఇళ్ల నిర్మాణం జరగలేదు.నిర్మాణ వ్యయాలు పైపైకి భూమి, నిర్మాణ కార్మికుల వేతనాలు, ఇటుకలు సహా నిర్మాణ వ్యయాలు పెరిగాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కలప, ఉక్కు, ప్లాస్టర్‌బోర్డ్, కాంక్రీట్, ఇన్సులేషన్ వంటి ముడి పదార్థాల లభ్యత తగ్గడంతో వాటి ధరలు మరింత పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధం ఇంధన వ్యయాలను ఒక్క ఏడాదిలో 15 శాతం పెంచి నిర్మాణ ఖర్చులను మరింత పెంచింది. ఇరాన్లో యుద్ధం కూడా ధరలను మరింత పెంచింది. 2015లో £150,000తో నిర్మించగలిగిన ఇల్లు ఇప్పుడు £230,000 వరకు ఖర్చవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ వ్యయం మరో 15 శాతం పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.అయితే ఇటీవల ఇళ్ల ధరలు వేతనాల కంటే నెమ్మదిగా పెరుగుతున్నాయి. 2021లో సగటు ఆదాయానికి ఇళ్ల ధరల నిష్పత్తి దాదాపు 9 రెట్లు ఉండగా, ఇప్పుడు 7.6 రెట్లకు తగ్గింది. కొన్ని రుణ సంస్థలు 5 శాతం డిపాజిట్తోనే తనఖా రుణాలు ఇస్తున్నాయి. మరికొన్ని సందర్భాల్లో 40 ఏళ్ల వరకు రుణ కాలపరిమితి కూడా అందుబాటులో ఉంది.వడ్డీ రేట్లు ఇటీవలి గరిష్ఠ స్థాయి నుంచి తగ్గడం, ఇళ్ల ధరల పెరుగుదల మందగించడంతో వేతనాలతో పోలిస్తే తనఖా చెల్లింపుల భారం కూడా తగ్గింది. నేషన్వైడ్ గణాంకాల ప్రకారం, 2007లో తొలిసారి ఇల్లు కొనేవారి తనఖా చెల్లింపులు చేతికి వచ్చే ఆదాయంలో 45 శాతం ఉండగా, ప్రస్తుతం 32 శాతంగా ఉన్నాయి. దీర్ఘకాల సగటు 30 శాతంతో పోలిస్తే ఇది ఇంకా ఎక్కువే అయినా పరిస్థితి మెరుగుపడుతున్న దిశలో ఉంది.అయితే తక్కువ డిపాజిట్, ఎక్కువ కాలపరిమితి రుణాలకు ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎక్కువ కాలం వడ్డీ చెల్లించాల్సి రావడంతో మొత్తం ఖర్చు పెరుగుతుంది. ఇళ్ల విలువ పెరగకపోతే కొనుగోలుదారులు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది.ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు కీర్ స్టార్మర్ ప్రభుత్వం ప్రణాళికా అనుమతుల ప్రక్రియను సరళీకరించే చర్యలు చేపట్టింది. గ్రీన్ బెల్ట్ ప్రాంతాల్లో మరిన్ని ఇళ్ల నిర్మాణానికి కూడా సంస్కరణలు అవకాశం కల్పించనున్నాయి. అయితే నిర్మాణ సంస్థలు మరింత నమ్మకంతో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకునే చర్యల ఫలితాలు కనిపించేందుకు మాత్రం ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులే అనేక దేశాల్లో ఉన్నాయని అంచనా.ఇదీ చదవండి: 24 గంటల్లో ‘జంతర్ మంతర్ 2.0’.. సీజేపీ హెచ్చరిక -
యూకేలో కుప్పకూలిన విమానం భారత సంతతి దంపతుల దుర్మరణం
లండన్: యూకేలోని వేల్స్లో మారుమూల ప్రాంతంలో చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో అందులో ఉన్న భారత సంతతికి చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు. గత శుక్రవారం ఈ విషాదం చోటు చేసుకుంది. తమ ప్రఖ్యాత సభ్యుడు, అతని భార్య విమాన ప్రమాదంలో మరణించడం చాలా విచారకరం అంటూ ఒక ఫ్లయింగ్ క్లబ్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. గ్వినెడ్లోని ట్రాస్వినిడ్ సమీపంలోని ఒక మారుమూల ప్రదేశంలో వారు ప్రయాణిస్తున్న తేలికపాటి విమానాన్ని గుర్తించడంతో, లీసెస్టర్షైర్లోని సిస్టన్కు చెందిన కేతన్ స్వాలి, శీతల్ స్వాలి అక్కడికక్కడే మరణించినట్లు ప్రకటించారు. ఈ జంట బర్టన్-అపాన్-ట్రెంట్‌లోని టేటెన్హిల్ విమానాశ్రయం నుండి షేర్వుడ్ ఫ్లయింగ్ క్లబ్ నుండి అద్దెకు తీసుకున్న పైపర్ PA28 విమానంలో ప్రయాణిస్తున్నారని ప్రాథమిక విచారలో తేలింది. ఇదీ చదవండి: 14 ఏళ్లకే సోషల్ మీడియాలో సంచలనం ఎవరీ ‘ఏలియన్ స్టార్’పైపర్ 2ఏ రకానికి చెందిన ఈ విమానాన్ని కేతన్ స్వాలి నడుపుతుండగా, ఆయనతోపాటు భార్య శీతల్ ప్రయాణిస్తున్నారు. వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలోని టటెన్హిల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న వీరి విమానం స్నోడోనియాలోని కేర్నర్ఫాన్ విమానాశ్రయంలో ల్యాండవ్వాల్సి ఉంది. అయితే, విమానం జాడ తెలియకుండా పోయింది. అన్వేషణ చేపట్టిన అధికారులు విమాన శకలాలను, మృతదేహాలను నార్త్ వేల్స్‌లోని ట్రాస్ఫినిడ్ వద్ద కనుగొన్నారు. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. లీసెస్టర్‌కు చెందిన ఆర్క్ యూరో టేరడ్ లిమిటెడ్ అనే ఇంజినీరింగ్ కంపెనీకి కేతన్ స్వాలి డైరెక్టర్‌గా ఉన్నారు.ఇదీ చదవండి: రూ. 5వేలతో ముంబైకి, పూటగడవని స్థితి..ఇపుడు సూపర్ స్టార్డమ్ -
కేరళ గుడిలో విదేశీ ఎంపీతో మళ్లీ వివాహం!
ప్రేమకు సరిహద్దులు లేవని ఈ జంట కారణంగా మరోసారి నిరూపితమైంది. ప్రేమ ఎలా పుడుతుందో తెలియదు గానీ దాన్ని గెలిపించుకోవడం కోసం ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటారు, ఎంత కాలమైన నిరీక్షిస్తారు. అచ్చం అలానే ఈ స్కాటిష్ ఎంపీ పదేళ్లు నిరీక్షించి మరీ కేరళ మహిళను పెళ్లాడాడు స్కాటిష్ రాజకీయ నాయకుడు. దేశం దాటిన ఈ దంపతుల ప్రేమ కథ ఏంటో చూద్దామా..!స్కాటిష్ నేషనల్ పార్టీ (SNP) రాజకీయ నాయకుడు , పార్లమెంట్ సభ్యుడు మార్టిన్ డే కేరళకు చెందిన నిధిన్ చంద్‌ను అక్కడ ప్రఖ్యాత గాంచిన గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఎర్నాకులం జిల్లాలోని పిరవంకు చెందిన నిధిన్ చిరకాల కోరిక ఇన్నేళ్లకు నెరవేరిందట. ఈ వివాహ వేడుక మంగళవారం నాడు గురువాయూర్ దేవాలయ ప్రాంగణంలోని ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను మార్టిన్ డే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేసుకోవడంతో నెట్టింట వైరల్‌గా మారింది. పదేళ్లకు పైగా నిరీక్షించక తప్పలేదు..నిజానికి ఈ జంట 2016లోనే యూకేలో వివాహం చేసుకున్నారు. కానీ నిధిన్ చాలా కాలంగా గురువాయుర్‌లో తన వివాహతంతుని పూర్తి చేయాలని కోరుకున్నారు. 2018 కేరళ వరదలు, కోవిడ్ 19 మహమ్మారి వంటి కారణాల వల్ల ఈ జంట వివాహ వేడుక చాలా ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు తమ వివాహం రిజిస్టర్ అయిన తొమ్మిదేళ్ల తర్వాత, తన నాలుగవ పర్యటనలో ఆ దంపతులు గురువాయురు ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇది తన భాగస్వామి చిరకాల కోరిక అని చెబుతున్నారు స్కాటిష్ ఎంపీ మార్టిన్ డే.ఎవరీ మార్టిన్ డే..55 ఏళ్ల మార్టిన్ డే, స్కాటిష్ నేషనల్ పార్టీకి చెందిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. ఆయన లిన్లిత్గో ప్రాంతానికి స్థానిక, జాతీయ స్థాయిలలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1999లో వెస్ట్ లోథియన్ కౌన్సిల్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2015లో లిన్లిత్గో ఈస్ట్ ఫాల్కిర్క్ నియోజకవర్గం నుంచి ఎంపీగా యూకే హౌస్ ఆఫ్ కామన్స్లోకి ప్రవేశించారు. ఆయన 2024 వరకు ఎంపీగా పనిచేశారు. ఆరోగ్యం, సామాజిక సంరక్షణ వంటి రంగాలతో సహా SNP ఫ్రంట్‌బెంచ్ బాధ్యతలను నిర్వహించారు.2026 స్కాటిష్ పార్లమెంట్ ఎన్నికలలో, డే తిరిగి ఎన్నికై పదవిలోకి వచ్చి, ఫాల్కిర్క్ ఈస్ట్ అండ్ లిన్లిత్గో నియోజకవర్గం నుంచి MSPగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం స్కాటిష్ పార్లమెంట్ క్లైమేట్ యాక్షన్ కమిటీ అండ్ ఎకానమీ, టూరిజం అండ్ ఎనర్జీ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. కాగా, ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ముందు,బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. అలాగే వెస్ట్ లోథియన్‌లోని స్థానిక ప్రభుత్వంలో పాలుపంచుకున్నారు.ఎవరీ నిధిన్ చందన్..ఎర్నాకుళంలోని పిరవం ప్రాంతానికి చెందిన నిధిన్ చంద్, ఉన్నత విద్య కోసం నవంబర్ 2008లో యూకేకి వెళ్లారు. ఆమె యూకేలో ఐటీ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె తండ్రి కే.ఎన్. చంద్రన్ ఒక రిటైర్డ్ వెటర్నరీ అధికారి, తల్లి రాజమ్మ పంపాకుడ మాజీ గ్రామ పంచాయతీ సభ్యురాలు.అలా పరిచయమైంది..యూకేలో ఆమె పీహెచ్డీ చేస్తున్న సమయంలో, కొత్త వలస నిబంధనల వల్ల ఆమె వీసాతో సహా వేలాది విద్యార్థి వీసాలు రద్దు చేయబడ్డాయి. నిధిన్ అక్కడినుంచి వెళ్ళిపోకుండా, పార్లమెంటులో లాబీయింగ్ చేసి, కమిటీల ముందు భారతీయ విద్యార్థులకు ప్రాతినిధ్యం వహించారు. అక్కడే ఆమె లిన్లిత్గో అండ్ ఈస్ట్ ఫాల్కిర్క్ ఎంపీ అయిన మార్టిన్ డేను కలిశారు.మే నెలలో అతను ప్రపోజ్ చేసిన తర్వాత, 2016లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. తనకు 12 ఏళ్ల కొడుకు ఉన్నాడని, తాను విడాకులు తీసుకున్న మహిళనని నిధిన్ చెప్పినప్పుడు, మార్టిన్ చాలా విశాల హృదయంతో తన జీవితంలోకి ఆహ్వానించి, తన పేరెంట్స్ మార్గరెట్, రాన్ డేలకు ఆమెను పరిచయం చేశారు. ఆమె వీసా, ఉద్యోగ పరిస్థితి అనిశ్చితంగా ఉన్నప్పటికీ, వాళ్లు ఆమెను ఆప్యాయంగా తమ కుటుంబంలోకి ఆహ్వానించారు. తర్వాత మార్టిన్, నిధిన్, ఆమె కుమారుడు వేద్దిక్తో కలిసి యూకే వెళ్ళాడు.అలాగే ఆమె కుమారుడు వేద్దిక్, ఎడిన్‌బర్గ్‌లోని కంప్యూటర్షేర్లో సీనియర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడు. నిధిన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తూ, స్కాటిష్ నేషనల్ పార్టీ ప్రచారాలలో కూడా చురుకుగా పాల్గొంటుంది. కాగా, మార్టిన్ డే 1999 నుంచి ప్రజా సేవలో నిమగ్నమై ఉన్నారు. అంతేగాదు తొమ్మిదేళ్లలో మూడు పర్యాయాలు యూకే పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు. ఆయన స్కాటిష్ పార్లమెంట్లో భారతదేశం తరపున అఖిల పక్ష పార్లమెంటరీ గ్రూపుకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by jith (@jith__uday) (చదవండి: లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేలు..!) -
రాజకుటుంబానికి దూరమై.. ఆరేళ్ల తర్వాత యువరాజు రాక!
బ్రిటన్ రాజకుటుంబంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. ఆరేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిపోయిన ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ మళ్లీ బ్రిటన్‌కు తిరిగి రానున్నారు. పిల్లల చదువు కోసం ససెక్స్ దంపతులు బ్రిటన్‌లో ఎక్కువ కాలం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇది కేవలం కుటుంబ అవసరాల కోసమా? లేదంటే రాజకుటుంబంతో సంబంధాల పునరుద్ధరణకు అడుగులా? అనే చర్చ ఇప్పుడు మొదలైంది.ప్రిన్స్ హ్యారీ, మేఘన్ తమ పిల్లలు ప్రిన్స్ ఆర్చీ (7), ప్రిన్సెస్ లిలిబెట్ (5)తో కలిసి ఈ నెలలోనే బ్రిటన్‌కు రానున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌లో పిల్లలు బ్రిటన్‌లోని పాఠశాలలో చేరే అవకాశం ఉందని సమాచారం. దీంతో ససెక్స్ కుటుంబం అమెరికాలోని కాలిఫోర్నియా జీవితం నుంచి కొంతకాలం పాటు బ్రిటన్ కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే హ్యారీ–మేఘన్ రాజకుటుంబానికి చెందిన ‘వర్కింగ్ రాయల్స్’గా మాత్రం తిరిగి వ్యవహరించబోరని తెలుస్తోంది. కేవలం స్వతంత్ర సభ్యులుగానే కొనసాగుతారని.. రాజభవనంలో కాకుండా ప్రత్యేక నివాసంలో ఉండే అవకాశం ఉందని బ్రిటన్ టాబ్లాయిడ్లు కథనాలు ఇస్తున్నాయి..అసలు ఆరేళ్ల క్రితం ఏం జరిగింది?హ్యారీ–మేఘన్ దంపతులు 2020 జనవరిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకుటుంబంలో సీనియర్ సభ్యులుగా తమ అధికారిక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అదే ఏడాది మార్చిలో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అనంతరం వారు అమెరికాకు వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని మాంటెసిటోలో స్థిరపడిన ఈ దంపతులు అక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభించారు. సుమారు 14.7 మిలియన్ డాలర్ల విలువైన భవనంలో నివసిస్తూ.. మీడియా ప్రాజెక్టులు, వ్యాపార ఒప్పందాలతో తమ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కొనసాగించారు.సంచలన ఆరోపణలు?హ్యారీ–మేఘన్ నిర్ణయం వెనుక రాజకుటుంబంలో ఎదురైన ఒత్తిళ్లు, మీడియా వ్యవహారాలు ప్రధాన కారణాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా మేఘన్ రాజకుటుంబంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పలుమార్లు బహిరంగంగా మాట్లాడారు. 2021లో ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రాజభవనంలో తనకు ఎదురైన ‘చేదు’ అనుభవాల్ని వివరిస్తూ సంచలన ప్రకటనలు చేశారు. హ్యారీ కూడా తన తండ్రి కింగ్ చార్లెస్, అన్న ప్రిన్స్ విలియమ్‌తో తన సంబంధాల్లో వచ్చిన విభేదాలను వెల్లడించారు. 2023లో విడుదలైన తన ఆత్మకథ ‘స్పేర్’లో విలియమ్‌తో విభేదాలను ప్రస్తావించడం మరింత సంచలనంగా మారింది.మధ్యలో బ్రిటన్‌కు వచ్చినా.. అమెరికాకు వెళ్లిన తర్వాత హ్యారీ పలుమార్లు బ్రిటన్‌కు వచ్చారు. ముఖ్యంగా తన తండ్రి కింగ్ చార్లెస్ పట్టాభిషేకం సందర్భంగా 2023లో లండన్‌కు వచ్చారు. అలాగే రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల సమయంలో 2022లో కూడా కుటుంబంతో కలిసి బ్రిటన్‌లో ఉన్నారు. ఇటీవల కూడా హ్యారీ–మేఘన్ పిల్లలతో కలిసి బ్రిటన్ను సందర్శించారు. ఈ సందర్భంగా కింగ్ చార్లెస్‌కు ఆర్చీ, లిలిబెట్లను కలిసే అవకాశం లభించింది.ఇకపై ఏం జరగొచ్చు?తాజా నిర్ణయం రాజకుటుంబంలో పూర్తిస్థాయి పునరాగమనంగా భావించడం లేదు. హ్యారీ–మేఘన్ ఇకపై కూడా ‘నాన్ వర్కింగ్ రాయల్స్’గానే కొనసాగనున్నారు. రాజకుటుంబ అధికారిక కార్యక్రమాల్లో వారికి మళ్లీ కీలక పాత్ర ఉండకపోవచ్చని సమాచారం.మరోవైపు హ్యారీకి సంబంధించిన భద్రతా వివాదం ఇంకా పూర్తిగా ముగియలేదు. రాజకుటుంబ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత బ్రిటన్‌లో ఆయనకు కల్పించే భద్రతపై వివాదం చెలరేగింది. దీనిపై కోర్టులో పోరాడిన హ్యారీకి అనుకూల ఫలితం రాలేదు. అయితే తండ్రి కింగ్ చార్లెస్‌తో సంబంధాలు కొంత మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కానీ అన్న ప్రిన్స్ విలియమ్‌తో ఉన్న దూరం మాత్రం ఇంకా కొనసాగుతోంది. -
మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..
కొన్ని అరుదైన వ్యాధులు శాపంగా మారతాయి. వైవాహిక జీవితాన్ని ఇబ్బందుల్లో పెట్టి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార్చేస్తాయి. అలాంటి వాటిని కూడా ఆధునిక వైద్యం సరికొత్త ఆశను అందించి ఊపిరిపోస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి సమస్యనే ఎదుర్కొంటున్న మహిళకు అక్క ఉదారత, ఆధునిక వైద్య ఆమె జీవితంలో నవ్వులు విరబూసేలా చేశాయి. అసలేం జరిగిందంటే..యూకేకు చెందిన 36 ఏళ్ల లారెన్ ఫౌలర్ అనే మహిళ 20 ఏళ్లుగా మాతృత్వం కోసం ఎదురుచూస్తోంది. ఎందుకంటే ఆమెకు 'మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్' అనే అరుదైన జన్యుపరమైన వ్యాధి కారణంగా గర్భశయమే లేకుండా పుట్టింది. ఆ కారణంగా ఆమెకు పీరియడ్స్ లాంటివి ఉండవు. అందువల్ల సహజపద్ధతిలో పిల్లల్లను కనే సామర్థ్యం ఉండదామెకు. నిజానికి ఆ అరుదైన జన్యుపరమైన వ్యాధిలో గర్భాశయం అభివృద్ధి చెందదు కానీ ఆరోగ్యకరమైన అండాశయాలు ఉంటాయి. అలాగే అందరి అమ్మాయిల్లా..మిగతా అవయవాలన్నీ అభివృద్ధి చెందుతాయి తప్ప రుతక్రమం అనేది ఉండదు. అనేపథ్యంలోనే లారెన్‌కు గర్భం దాల్చే అవకాశం లేకుండా పోయింది. అలాగే ఆమెకు టైప్1 డయాబెటిస్ పేషెంట్ కూడా. దాంతో ఆమె 40 ఏళ్ల అక్క కెల్లీ తన సోదరి లారెన్‌కి గర్భశయాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చింది. ఎందుకంటే అప్పటికే ఆమెకు ముగ్గురుపిల్లలకు కూడా ఉండటంతో సోదరి కోసం ఈ త్యాగం చేసేందుకు ముందుకొచ్చిందామె. ఇక లారెన్ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పోస్ట్‌లో గర్భశయ మార్పిడకి సంబంధించిన శస్త్ర చికిత్స గురించి కూడా ఇలా రాసుకొచ్చింది లారెన్. ఇది తన జీవితంలో ఎదుర్కోబోయే అతిపెద్ద అత్యంత కఠినమైన కోలుకునే ప్రక్రియగా పేర్కొంది. దీనికోసం శారీరకంగా మానసికంగా భావోద్వేగపరంగా సిద్ధంగా ఉండాలనే ముందే నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ శస్త్ర చికిత్స ఎలం క్లిష్టమైనదో అందరూ ముందుగానే హెచ్చరించారని, వాళ్లు అన్నట్లుగానే ఇది తనకు చాలా ఛాలెంజ్‌లు విసిరిందని చెప్పుకొచ్చింది. తన ప్రతి భావోద్వేగాన్ని, తన శరీరంలోని ప్రతి అణువు బలాన్ని గట్టిగానే పరీక్షించిందని ఆవేదనగా రాసుకొచ్చింది పోస్ట్‌లో. నిజంగానే ఇది తనను పరీక్షించి, ప్రతి కణాన్ని హరించేసి, తనలో ఎంత బలం ఉందో పరీక్ష పెట్టిందని అంటోంది. అయితే తాను 20 ఏళ్లుగా మాతృత్వం కోస పడుతున్న తపన ముందు ఈ బాధ ఎంత అని వెనక్కి తగ్గకుండా ముందుక సాగానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తల్లిబిడ్డ ఇద్దరు వైద్య పర్యవేక్షణలో ఉన్నారని, అక్టోబర్‌లో సిజేరియన్‌చేసి బిడ్డను బయటకు తీయాలని వైద్యులు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ పోస్ట్‌ని ముగించింది. ఇక ఆమె సోదరి కూడా తన పిల్లలు కూడా తన చెల్లెలు కనబోయే బిడ్డ కోసం ఆత్రుతుగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. ఒకే గర్భం నుంచి పుట్టిన పిల్లలు కాబట్టి వీరందరి మధ్య విడదీయరాని బంధమే ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొంది ఆమె అక్క కెల్లీ. Source: పీపుల్స్ డాట్ కామ్ ఆంగ్ల వెబ్సైట్ ఆధారంగా ఇచ్చిన కథనం ఇది. (చదవండి: ఆ బుడ్డోడు పాటపాడిన తీరుకి..పర్యాటక ప్రేమికులంతా..!) -
2వ ప్రపంచ యుద్ధం తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో
భారత సంతతికి చెందిన 28 ఏళ్ల ఫ్లైట్ లెఫ్టినెంట్ అర్ష్‌దీప్ సింగ్ డాంగ్ (Arshdeep Singh Dang), బ్రిటన్ చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAF)లో ఫైటర్ పైలట్‌గా పట్టా పొందిన తొలి సిక్కు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక సిక్కు యోధుడు ఫైటర్ స్క్వాడ్రన్ నుండి 'వింగ్స్' (Wings) సాధించడం ఇదే తొలిసారి అని RAF తెలిపింది.నార్త్ వేల్స్‌లోని 'RAF వ్యాలీ'లో శుక్రవారం (ఆగస్టు 14న) జరిగిన వేడుకలో అర్ష్‌దీప్ సింగ్ పట్టభద్రుడయ్యారు. తన తండ్రిని పైలట్‌గా చూడాలనేది తాతగారైన సర్దార్ సంతోఖ్ సింగ్ డాంగ్ కల అని, అయితే ఆయన చిన్నతనంలోనే మరణించడంతో ఆ అవకాశం రాలేదని అర్ష్‌దీప్ తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాతగారి కలను తాను నిజం చేసినట్లు అర్ష్‌దీప్ వెల్లడించారు.రక్షణ రంగంలో ఫ్రంట్‌లైన్ ఫైటర్ విమానాలను నడిపేందుకు ఆయన మరో ఏడాది పాటు కఠినమైన శిక్షణ తీసుకోనున్నారు.ఇదీ చదవండి: 14 మిలియన్ల ఫాలోవర్లు : కానీ యష్ ఫాలో అయ్యేది ఆమె ఒక్కర్నే!1998లో చండీగఢ్‌లో జన్మించిన అర్ష్‌దీప్, తన ఆరేళ్ల వయసులో కుటుంబంతో కలిసి యూకే (UK) వెళ్లారు. ప్రస్తుతం వారి కుటుంబం ఇంగ్లాండ్‌లోని సౌత్ ఆల్లో నివసిస్తోంది. ఆయన తండ్రి జగ్దీప్ సింగ్ డాంగ్ (లుధియానా), తల్లి గగన్‌దీప్ కౌర్ (అమృత్సర్). బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో గణితం మరియు తత్వశాస్త్రం (Mathematics & Philosophy) అభ్యసించిన ఆయన, 2022లో ఆఫీసర్ ట్రైనింగ్ పూర్తి చేశారు. 2025లో ఫాస్ట్ జెట్ శిక్షణ ప్రారంభించి, అక్టోబర్ 2025లో టెక్సాస్‌లో సోలో ఫ్లైట్ పూర్తి చేశారు. జులై 2026లో 'వింగ్స్ టెస్ట్'లో ఉత్తీర్ణులయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ పైలట్ ఇంద్రలాల్ రాయ్, హర్దిత్ సింగ్ మాలిక్, స్క్వాడ్రన్ లీడర్ మోహిందర్ సింగ్ పూజ్జీ సహా, బ్రిటిష్ సైనిక విమానయానంలో సేవలందించిన భారతీయ సంతతికి చెందినఈ ఘనత సాధించి భారతీయుల సరసన అర్ష్‌దీప్ చేరారు.ఇదీ చదవండి: 24 గంటల్లో 1.6 లక్షల ఫాలోవర్స్ : సీజేపీ తరహాలో డీజేపీ సంచలనం -
ఇజ్రాయెల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశాను. బ్రిటన్ను ఎద్దేవా చేస్తూ ఆ దేశాన్ని ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రిటన్’ అని అభివర్ణించారు. అంతేకాదు అణు ఆయుధాలు కలిగిన మొట్టమొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ బహుశా బ్రిటనే కావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో నెతన్యాహు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహు వ్యాఖ్యలపై బ్రిటన్ ఖండించింది. ఇంటర్వ్యూలో భాగంగా నెతన్యాహు మాట్లాడుతూ, గతంలో బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ మనవడు జర్నలిస్టుగా ఇజ్రాయెల్‌కు అనుకూలంగా వార్తలు రాశారని గుర్తుచేశారు. కానీ నేటి బ్రిటన్‌లో అటువంటి అనుకూల వాతావరణం ఎక్కడా కనబడట్లేదని, ప్రస్తుతం దాన్ని ‘ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రిటన్’ అని అనవచ్చని వ్యాఖ్యానించారు. యూరప్ అంతా అలాగే ఉందా అని హోస్ట్ ప్రశ్నించగా, నెతన్యాహు మరింతగా స్పందిస్తూ అణు ఆయుధాలు కలిగిన మొట్టమొదటి ఇస్లామిక్ దేశం బ్రిటనే కావొచ్చని, తాము మాత్రం ఇరాన్ అలా మారకుండా చూసుకుంటున్నామని పేర్కొన్నారు.బ్రిటన్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలపై బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నెతన్యాహు చేసిన ఈ వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని బ్రిటన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లినట్లు వెలడించింది. గాజా యుద్ధం, విదేశీ విధానాల నేపథ్యంలో బ్రిటన్‌కు, ఇజ్రాయెల్‌కు మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఉద్రిక్తంగా మారిన తరుణంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. -
బ్రిటన్ లో అణు వినాశనం? మంటల్లో 'సైజ్ వెల్ -B'!
-
తొలి అంధ, చెవిటి వైద్యురాలు.. చికిత్స ఎలా చేస్తారంటే?
రోగిగా ఉన్నప్పుడు డాక్టర్ చూపిన దయ..ఆ వృత్తిని చేపట్టాలనే ఆకాంక్షకు తెరతీసింది. పోనీ చదివేసి డాక్టర్ అవుదామంటే..తనకున్న శారీరక పరిస్థితులు..నువ్వా అంటూ వెక్కిరించాయి. కానీ అలాంటి అభిప్రాయాలకు తలవంచనంది. తనలాంటి వాళ్లు కూడా బేషుగ్గా వైద్యం అందించగలరు అని చూపాలనుకుంది. పోరాడుతూనే చదివింది. చివరికి యావత్తు ప్రపంచమే విస్తుపోయేలా తొలి అంధ చెవిటి డాక్టర్‌గా నిలిచి..యువతకు స్ఫూర్తిగా మారింది.ఆ అజేయమైన ధైర్యశాలే అలెగ్జాండర్ ఆడమ్స్. ఆమె పుట్టకతో చెవిటి, అంధ దివ్యాంగురాలు. అలాగని తనను తాను ఏమి ప్రత్యేక వ్యక్తిగా భావించేది కాదు. అందరి పిల్లల్లానే హాయిగా ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేందుకే ప్రయత్నించేది. టీనేజ్ వయసులో ఉండగా..సరిగ్గా కరోనా మహమ్మారి టైంలో తీవ్ర అనారోగ్యానికి గురై దాదాపు 17 నెలల పాటు ఆస్పత్రిలోనే గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆమె మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్ (MCAS) అనే రోగనిరోధక రుగ్మత బారిన పడినట్లు నిర్ధారణ అయింది. దాని ఫలితంగా ఆమె నిరంతరం ఆక్సిజన్‌ను ఉపయోగించాల్సిందే. ఇన్ని ఆరోగ్య సవాళ్ల అంటే ఎవ్వరైన కుంగిపోతారు. కానీ ఆడమ్స్ అలాంటి ఇలాంటి అమ్మాయి కాదు. అత్యంత ధైర్యంతో ఆ సవాళ్లన్నింటిని ఎదిరించి తన జీవితాన్ని అందంగా మార్చుకోవాలనుకునే ఆత్మవిశ్వాసం గల అమ్మాయి. ఆస్పత్రిలో రోగిగా మంచానికే పరిమితమైన క్షణాల్లోనే డాక్టర్ ఎంతో ప్రేమగా మీరు బాగానే ఉన్నారా? అని అడిగిన మూడు పదాలు ఆమెను డాక్టర్ అవ్వాలనే ఆశయానికి ఊపిరిపోశాయి. పోనీ వైద్య విద్య అభ్యసించడం అడమ్స్ ఉన్న శారీరక పరిస్థితికి అంత సులభమా అంటే కానేకాదు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. పైగా చుట్టూ ఉన్నవాళ్లంతా తన వల్ల కాదని అంటున్నా..చెప్పడానికి వాళ్లెవరరు అన్న మొండి పట్టుదలతో డాక్టర్ విద్యనే అభ్యసించిందేకు రెడీ అయ్యింది. కానీ అక్కడ కళాశాలలో దారుణమైన వివక్షను ఎదుర్కొంది. అంతా ఆమెనా డాక్టర్ అంటూ పెదవి విరిచేవారు. దానికి ఆడమ్స్ తన వైకల్యమేమి డాక్టర్ వృత్తికి అడ్డంకి కాదని, ప్రజల అభిప్రాయాలే అడ్డంకి అని ధైర్యంగా చెప్పేది. అయితే ఆమె డాక్టర్‌గా అర్హత సాధించడానికి కేవలం కొన్ని నెలల ముందే వైద్య వృత్తి నుంచి తప్పుకోమని వైద్య శాఖ నుంచి గట్టి ఆదేశాలు వచ్చాయి. దాంతో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే లండన్‌లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో క్రియేటివ్ రైటింగ్‌లో మాస్టర్స్ కోర్సుకు సంబంధించిన ఒక ప్రకటన ఆమెను ఆకర్షించింది. వెంటనే ఒక పక్క మెడికల్ స్కూల్లో తిరిగి చేరాలనే పోరాటం చేస్తూనే..రచనలో మాస్టర్ డిగ్రీని పూర్తి చేసింది. అలా రచనల్లో తనకున్న స్కిల్‌ని గుర్తించింది. అంతేగాదు పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి తిరిగి తన 11 ఏళ్ల మెడికల్ డిగ్రీని కూడా దిగ్విజయంగా పూర్తి చేసింది. అలాగే 'ఇన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ ఆల్' అనే పేరుతో యూకే తొలి బధిర అంధ వైద్యురాలి కథ అంటూ తన స్టోరీని రాసింది. మరి ఆమె ఎలా వైద్యం చేస్తుందంటే.. ప్రతి వైద్య ప్రక్రియకు వినికిడి, దృష్టితో పనిలేదని అంటుంది. ఆమె రోగుల గుండె, ఊపిరితిత్తుల ఉనికిని వినడానికి వినికిడి పరికరాలకు నేరుగా అనుసంధానించే బ్లూటూత్-ఎనేబుల్డ్ స్టెతస్కోప్‌ను ఉపయోగిస్తుంది. పరిమిత దృష్టి ఉన్నప్పటికి ఐవీ వంటివి ఎలా పెడతారని అడిగితే..అదంతా స్పర్శ అనుభూతికి చెందిందని అంటుంది. నిజానికి అనుభవజ్ఞులైన వైద్యులు స్పర్శపై ఎక్కువగా ఆధారపడతారు కాబట్టి, వైద్య విద్యార్థులను ఈ నైపుణ్యాన్ని నేర్చుకునేటప్పుడు కళ్ళు మూసుకోమని తరచుగా ప్రోత్సహిస్తారని ఆమె చెబుతుంది. దీని వల్ల ఒ కరకంగా తన వైకల్యం బలహీనత కాదని, రోగులతో మరింత లోతుగా అనుసంధానం కావడానికి అదొక అడ్వాంటేజ్‌గా మారిందని సగర్వంగా చెబుతోంది ఆడమ్స్.పని చేస్తున్నప్పుడు సురక్షితంగా సంభాషించడానికి సహాయపడే వైబ్రేటింగ్ పేజర్లు, రేడియో ఎయిడ్స్ వంటి సాంకేతికతను ఉపయోగిస్తుంది. అంతేగాదు తన ఇన్స్టాగ్రామ్ పేజిలో తనపై ఉండే సందేహాలను తొలగించేలా వివరణ అందించడమే కాకుండా వృద్ధుల సంరక్షణ రంగంలోకి వెళ్లాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఆమె కథ వైకల్యం అనేది సామర్థ్యాన్ని నిర్వచించలేదని, కఠిన శ్రమతో ఏ కలనైనా సాకారం చేసుకోవచ్చని నిరూపించడమే కాకుండా భావితరాలకు ఆదర్శంగా నిలిచింది.(చదవండి: తాత గారు వేళకు మందులు వేసుకోవాలని..! టీనేజ్ యువకుడి అద్భుత ఆవిష్కరణ..) -
ఓవర్‌టైమ్ చేస్తున్నారా?.. యూకే కంపెనీలు ఏమంటాయో తెలుసా?
ఒకప్పుడు చాలామంది ఉద్యోగమే జీవితం అని బ్రతికేవారు. కానీ నేడు కాలం మారింది. ఉద్యోగులు వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. అయితే.. ఈ విధానం ప్రతి దేశంలోనూ ఒకే విధంగా ఉంటుందనుకోవడం పొరపాటు. ముఖ్యంగా భారత్, యూకే వంటి దేశాల మధ్య ఈ విషయంలో చాలా తేడా కనిపిస్తుంది.ఇండియాలో వర్క్ లైఫ్భారతదేశంలో చాలామంది ఉద్యోగులు ఆఫీస్ టైమ్ ముగిసిన తరువాత కూడా.. రాత్రి వరకు పని చేస్తుంటారు. సెలవు రోజుల్లో కూడా ఆఫీస్ వర్క్స్ చేసేవాళ్లు ఇండియాలో కోకొల్లలు. అలాంటి వారిని అంకితభావం ఉన్న ఉద్యోగులుగా, కంపెనీ కోసం కష్టపడేవారిగా భావిస్తారు. మరోవైపు.. సమయానికి పని ముగించి ఇంటికి వెళ్లేవారిని కొన్ని సంస్థలు నిబద్ధత లేని వారిగా చూస్తాయని చెబుతారు.యూకేలో ఇలా..అయితే.. యూకే వంటి దేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఆఫీస్ వర్క్ పూరవ్వగానే లేదా ఆఫీస్ టైమ్ ముగిశాక పనిచేయడానికి ఆసక్తి చూపించరు. కంపెనీలు కూడా ఎక్కువసేపు పనిచేయాలని ఒత్తిడి చేయవు. ఉద్యోగులు తమ కుటుంబానికి, ఆరోగ్యానికి, వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయించాలని సంస్థలు ప్రోత్సహిస్తాయి. వర్క్ టైమ్ ముగిశాక ఈమెయిల్స్ లేదా మెసేజ్‌లకు వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదని భావిస్తారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుభవంఈ విషయాన్ని ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓమ్ తన అనుభవం ద్వారా వివరించాడు. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకసారి అతను రాత్రి 7 గంటల తర్వాత కూడా తన తన సహోద్యోగి పంపిన కామెంట్లకు సమాధానం ఇచ్చాడు. ఆఫీసు సమయం దాటిన తరువాత పనిచేయడాన్ని అలవాటుగా చేసుకోవద్దని, వృత్తిపరమైన.. వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను పాటించాలని సహోద్యోగి సలహా ఇచ్చినట్లు చెప్పాడు.I work with a senior developer from England.Because of the time difference, whenever he reviewed my PR and left comments, I'd reply immediately.Even if it was 9 or 10 PM in India.One day he noticed and asked me, .."Wait.. are you working beyond your work hours?"I said,…— Om (@Om_Codes_) July 30, 2026నెటిజన్ల స్పందనఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది తమ అనుభవాలను పంచుకున్నారు. కొందరు విదేశీ కంపెనీలు ఉద్యోగుల వ్యక్తిగత సమయాన్ని గౌరవిస్తాయని ప్రశంసించగా, మరికొందరు ప్రతి కంపెనీ లేదా ప్రతి దేశాన్ని ఒకేలా చూడకూడదని అభిప్రాయపడ్డారు.కష్టపడి పని చేయడం ఎంత అవసరమో, అదే విధంగా ఆరోగ్యం, కుటుంబం, వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యమైనవని ఈ సంఘటన చెబుతోంది. పని కోసం జీవితాన్ని పూర్తిగా త్యాగం చేయడం కంటే.. పని - వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించడం ఉద్యోగిలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, పనిలో మెరుగైన ఫలితాలను తీసుకువస్తుంది. అందుకే ప్రతి ఉద్యోగి పని పట్ల బాధ్యతతో పాటు తన వ్యక్తిగత జీవితానికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. -
శ్రీ బాలాజీ దేవాలయంలో ఘనంగా అన్నప్రసాద కార్యక్రమం
యూకేలోని గ్లౌసెస్టర్షైర్ ప్రాంతంలో తాత్కాలిక శ్రీ బాలాజీ ఆలయం ఏర్పాటు తోపాటు ఘనంగా అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది ఆధ్యాత్మిక శక్తి, ఐక్యతలకు నిదర్శంనగా నిలిచింది ఈ వేడుక. విదేశీగడ్డపై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు భక్తులంతా వాలంటీర్‌గా ముందుకు వచ్చి.. సనాతన ధర్మ స్ఫూర్తిని చాటడం విశేషం. ఈ వేడుకలో పురోహిత విధులను అరవింద్, లక్ష్మి, సహస్ర నిర్వహించగా, ఆలయ కార్యక్రమాల్ని దిగ్విజయంగా జరిగేలా శ్రీనిరెడ్డి, మాధురి కుటుంబం, అలాగే శ్రీలక్ష్మీ, శ్రీని అర్గిల్ల, శిల్ప కుటుంబం పర్యవేక్షించింది. నరేష్, సురేష్ బండారులు విగ్రహాలను సమకూర్చగా, మహిళలు, చిన్నారులు స్వామి అలకంరణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు శ్రీలక్ష్మీ, రాజేష్, నానీ, సోను కుటుంబ సభ్యులు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమం జయప్రదం అయ్యేలా వాలంటీర్లు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అవిశ్రాంతంగా సేవలందించారు. ఇది గ్లౌసెస్టర్ హిందూ సమాజపు బలాన్ని, సనాతన ధర్మ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. (చదవండి: న్యూయార్క్‌లో వైభవంగా ఆషాఢమాస బోనాలు) -
అతనింకా బ్రిటన్‌లోనే ఎందుకు? భారత్‌కు పంపరా?
ప్రముఖ గుజరాత్ వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ భారీ కుంభకోణం కేసు నిందితుడు నీరవ్ మోదీ వ్యవహారం మరోసారి భారత్–బ్రిటన్ సంబంధాల్లో చర్చకు వచ్చింది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించడంలో జరుగుతున్న జాప్యంపై బ్రిటన్ మాజీ హోంమంత్రి ప్రీతి పటేల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఇప్పటికీ బ్రిటన్‌లో ఉండటంపై తాను ‘‘ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురయ్యాను’’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి. బ్రిటన్‌కు చెందిన ‘ది డైలీ టెలిగ్రాఫ్’ నిర్వహించిన ‘ది డైమండ్ కింగ్’ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ప్రీతి పటేల్.. నీరవ్ మోదీ అప్పగింత ఆలస్యంపై స్పందించారు. బ్రిటన్ న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రక్రియలు పూర్తయిన తర్వాత కూడా అతను ఇంకా అక్కడే ఉండటం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ‘‘అతను భారత్‌లో చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కొని, అక్కడే జైలు శిక్ష అనుభవించాలి. అప్పగింత ఒప్పందాల ఉద్దేశం కూడా అదే’’ అని ప్రీతి పటేల్ పేర్కొన్నారు. నీరవ్ మోదీ కేసులో జరుగుతున్న జాప్యం బ్రిటన్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని.. ఈ వ్యవహారం కారణంగా భారత్ ప్రభుత్వం బ్రిటన్‌తో సహకరించే విషయంలో నిరుత్సాహానికి గురై ఉండొచ్చని ఆమె పేర్కొన్నారు.2021లోనే ఆమోదం.. అయినా ఆలస్యంనీరవ్ మోదీ అప్పగింత వ్యవహారం ఎన్నో ఏళ్లుగా న్యాయపరమైన చిక్కుల్లో కొనసాగుతోంది. భారత్ అభ్యర్థన మేరకు బ్రిటన్ కోర్టులు ఈ కేసును విచారించాయి. బ్రిటన్ కోర్టు నీరవ్ మోదీపై విచారణ కొనసాగించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని (prima facie case) గుర్తించిన తర్వాత.. అప్పటి హోంమంత్రి ప్రీతి పటేల్ 2021లో అతడి అప్పగింత ఉత్తర్వులపై సంతకం చేశారు. అయితే మానవ హక్కుల అంశాలు, న్యాయపరమైన అప్పీళ్లు, ఇతర చట్టపరమైన ప్రయత్నాల కారణంగా ప్రక్రియ ఆలస్యమైంది.భారత్–బ్రిటన్ వలస చర్చలపైనా ప్రభావంనీరవ్ మోదీ వ్యవహారం కేవలం ఒక న్యాయపరమైన కేసుగా మాత్రమే మిగలలేదని ప్రీతి పటేల్ వ్యాఖ్యానించారు. ఇది భారత్–బ్రిటన్ మధ్య వలసల అంశంపై జరుగుతున్న చర్చలపైనా ప్రభావం చూపిందని తెలిపారు. 2019 నుంచి 2022 వరకు బ్రిటన్ హోంమంత్రిగా ఉన్న సమయంలో.. బ్రిటన్‌లో అక్రమంగా ఉంటున్న భారతీయులు, తిరిగి పంపించాల్సిన శరణార్థుల విషయంలో భారత్ నుంచి సహకారం పొందడం కష్టంగా మారిందని ఆమె చెప్పారు. నీరవ్ మోదీ వంటి కీలక కేసుల్లో పురోగతి కనిపించకపోవడం భారత్‌కు అసంతృప్తిని కలిగించిందని, ఆ అంశం చర్చల్లో ప్రభావం చూపిందని ఆమె అభిప్రాయపడ్డారు.అసలు నీరవ్ మోదీ కేసు ఏమిటి?నీరవ్ మోదీ పేరు 2018లో వెలుగులోకి వచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. పీఎన్బీలో సుమారు రూ.13 వేల కోట్లకు పైగా విలువైన అక్రమ లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ వ్యవహారంలో నీరవ్ మోదీపై ప్రధానంగా మూడు కేసులు ఉన్నాయి.సీబీఐ కేసు: పీఎన్బీకి జరిగిన మోసానికి సంబంధించి.ఈడీ కేసు: మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి.మూడో కేసు: సాక్ష్యాలు, సాక్షులను ప్రభావితం చేశారన్న ఆరోపణలపై. కుంభకోణం బయటపడిన తర్వాత నీరవ్ మోదీ భారత్ విడిచి వెళ్లిపోయారు.2019లో లండన్‌లో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.అప్పగింతకు చివరి అడ్డంకులు తొలగినట్టేనా?నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్‌లోని జైలులో ఉన్నారు. భారత్‌కు అప్పగించకుండా ఉండేందుకు ఆయన పలు న్యాయపరమైన మార్గాలను ప్రయత్నించారు. మానవ హక్కుల అంశాలను ప్రస్తావిస్తూ చేసిన అప్పీళ్లను బ్రిటన్ కోర్టులు పరిశీలించాయి. చివరకు ఆయనకు అనుకూలంగా నిర్ణయం రాలేదు. దీంతో అప్పగింత ప్రక్రియ చివరి దశకు చేరుకుందని భావిస్తున్నారు. అయితే నీరవ్ మోదీ భారత్‌కు ఎప్పుడు తీసుకురాబడతారన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం ఓ బ్యాంకింగ్ కుంభకోణం కేసుగా కాకుండా.. భారత్–బ్రిటన్ సంబంధాల్లోనూ ప్రాధాన్యం సంతరించుకున్న అంశంగా మారింది. ప్రీతి పటేల్ తాజా వ్యాఖ్యలతో మరోసారి ఈ కేసు అంతర్జాతీయ చర్చల్లోకి వచ్చింది. -
UK వీసాలు, ఉద్యోగాలు... నందూస్ కు మించిన పెద్ద స్కాం...? బయటపడ నిజాలు
-
యూకే ప్రధానిగా ఆండీ బర్న్‌హమ్
లండన్: యూకే లేబర్ పార్టీ నేతగా ఇటీవల ఎన్నికైన ఆండీ బర్న్‌హమ్(56) సోమవారం ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు, ఉదయం కీర్ స్టార్మర్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే కింగ్ చార్లెస్–3 లేబర్ పార్టీ నేతగా ఉన్న బర్న్‌హమ్‌కు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహా్వనం పంపారు. ఆ మేరకు బర్న్‌హమ్ వెళ్లి బకింగ్హమ్ ప్యాలెస్‌లో కింగ్ చార్లెస్‌ను కలుసుకున్నారు. అనంతరం భార్య మేరీ– ఫ్రాన్స్ వాన్ హీల్, కొందరు పార్టీ నేతలతో కలిసి 10 డౌనింగ్ స్ట్రీట్‌లో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మొట్టమొదటి ప్రసంగంలో.. బ్రిటన్ను రాజకీయంగా, ఆర్థికంగా కొత్తపుంతలు తొక్కించే సరికొత్త సాధనంగా తన ప్రభుత్వం ఉంటుందని ప్రకటించారు. రాజకీయాలను ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత ప్రాధాన్యత ఇచ్చేలా మారుస్తానని చెప్పారు. -
ఏపీలో వీసా స్కామ్.. రోడ్డున పడ్డ 700మంది బాధితులు
సాక్షి,కృష్ణ: ఇటీవల నందూస్ వరల్డ్ వీసా స్కామ్ మరువక ముందే తాజాగా మరో వీసా స్కామ్ వెలుగులోకి వచ్చింది. యూకేలో ఉద్యోగాలు, స్పాన్సర్షిప్ వీసాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి కోట్లాది రూపాయలు వసూలు చేసిన ‘ఫ్లైయింగ్ బోర్డర్స్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ’మోసం తాజాగా విజయవాడలో బయటపడింది. సుమారు 700 మంది బాధితుల నుండి ఈ సంస్థ భారీగా డబ్బులు వసూలు చేసి ముంచేసిందని బాధితులు లబోదిబోమంటున్నారు.ఓ యూట్యూబ్ ఛానల్లో వచ్చిన ప్రకటనలు, ప్రమోషనల్ వీడియోలను నమ్మి తాము హైదరాబాద్ బేగంపేట, విజయవాడ పరిసరాల్లో ఉన్న ఫ్లైయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీని సంప్రదించామని బాధితులు తెలిపారు. ఈ సంస్థ నిర్వాహకులు సౌజన్య, ఆమె భర్త శ్రీనివాస్ తమను నమ్మించారని పేర్కొన్నారు.యూకేలో స్కిల్డ్ వర్క్ వీసాపై ఉద్యోగం ఇప్పిస్తామని, కుటుంబ సభ్యులను కూడా డిపెండెంట్లుగా తీసుకెళ్లొచ్చని నమ్మబలికారు. అక్కడ ఉద్యోగం, వసతితో పాటు పోస్ట్ ల్యాండింగ్ సపోర్ట్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం ప్రక్రియకు రూ.12 లక్షలు ఖర్చవుతుందని, ముందుగా రూ.6 లక్షలు, యూకే వెళ్లిన తర్వాత మిగిలిన రూ.6 లక్షలు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. వీరి మాటలు నమ్మి చాలామంది అప్పులు చేసి రూ.3 లక్షల నుండి రూ.12 లక్షల వరకూ చెల్లించారు. రిక్రూట్మెంట్ లైసెన్స్ లేకుండానే వీరు ఈ కన్సల్టెన్సీని నడుపుతున్నట్లు బాధితులు గుర్తించారు.డబ్బులు కట్టించుకున్న తర్వాతే వీరు అగ్రిమెంట్లు చూపించారని, అందులో ఉద్యోగ హామీ గురించి స్పష్టంగా లేదని బాధితులు వాపోయారు. మౌఖికంగా మాత్రం 100శాతం జాబ్ వస్తుందని నమ్మించారు. తీరా డబ్బులు కట్టాక వీసాలు రాకపోవడంతో నిలదీస్తే బాధితుల ఫోన్ నెంబర్లను బ్లాక్ చేశారు. లక్ష రూపాయలు మాత్రమే తిరిగి ఇస్తామని తేల్చి చెప్పారు.న్యాయం కోసం హైదరాబాద్ బేగంపేటలోని కార్యాలయానికి వెళ్లి వివరణ కోరగా.. నిర్వాహకులు బాధితులపైనే ఉల్టా న్యూసెన్స్ కేసులు పెట్టించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా బాధితులపై సివిల్ సూట్లు దాఖలు చేసి, డబ్బులు అడిగితే రాజకీయ నాయకుల పేర్లు చెప్తూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఆరోపించారు.తమను నిలువునా ముంచిన ఫ్లైయింగ్ బోర్డర్స్ సంస్థ యజమాని సౌజన్య, ఆమె భర్త శ్రీనివాస్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయాలని, వారి బ్యాంక్ ఖాతాలను తక్షణమే సీజ్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమడబ్బును తమకు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. -
అర్ధరాత్రి సోషల్ మీడియా బంద్!
పిల్లలు, టీనేజర్లపై సోషల్ మీడియా ప్రభావంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న వేళ.. బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. టీనేజర్లు అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు సోషల్ మీడియా వినియోగించకుండా డిఫాల్ట్ పరిమితులు విధించాలని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సోషల్ మీడియా యాప్‌లను వినియోగించకుండా నిరోధించేలా కొత్త నిబంధనలు తీసుకురానుంది.ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం.. యువతలో పెరుగుతున్న రాత్రివేళల ఫోన్ వినియోగంపై ఆందోళనలే. ఆలస్యంగా నిద్రపోవడం, ఏకాగ్రత తగ్గడం, చదువుపై ప్రభావం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు అధిక స్క్రీన్ టైమ్ కారణమవుతోందని తల్లిదండ్రులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారులను ఎక్కువసేపు యాప్‌లలోనే ఉంచేలా రూపొందించిన విధానాలపై విమర్శలు ఉన్నాయి.ఇందులో భాగంగా.. వినియోగదారులను నిరంతరం ఆకర్షించే కొన్ని ఫీచర్లపై కూడా బ్రిటన్ దృష్టి పెట్టింది. వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్‌గా ప్లే అయ్యే విధానం వంటి ‘ఎంగేజ్మెంట్ ఫీచర్లను’ డిఫాల్ట్‌గా నిలిపివేయనున్నారు. అయితే వినియోగదారులు కోరుకుంటే కొన్ని సెట్టింగులను మార్చుకునే అవకాశం ఉండనుంది.పూర్తి నిషేధం కాదు.. నియంత్రణే లక్ష్యంఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు పిల్లలకు పూర్తిస్థాయి నిషేధం విధించే మార్గాన్ని కాకుండా.. బ్రిటన్ దశలవారీ నియంత్రణ విధానాన్ని ఎంచుకుంది. ఇప్పటికే చిన్నారుల సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనల దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు 16, 17 ఏళ్ల యువతపైనా రాత్రివేళ పరిమితులను తీసుకురావడం ద్వారా మధ్యస్థ మార్గాన్ని అనుసరిస్తోంది.స్క్రోలింగ్‌కు బ్రేక్.. నిద్రకు ప్రాధాన్యంబ్రిటన్ కొత్త నిబంధనల ప్రకారం.. సోషల్ మీడియా యాప్‌లలో అంతులేని స్క్రోలింగ్‌కు కారణమయ్యే ఫీచర్లను డిఫాల్ట్‌గా నిలిపివేయనున్నారు. ముఖ్యంగా ఒక వీడియో తర్వాత మరో వీడియో ఆటోమేటిక్‌గా ప్లే అయ్యే విధానాన్ని నియంత్రించనున్నారు. దీంతో టీనేజర్లు రాత్రివేళల్లో ఎక్కువ సమయం ఫోన్లకు అతుక్కుపోకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. "యువతకు అవసరమైన నిద్ర లభించేందుకు, చదువుపై దృష్టి పెట్టేందుకు, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి" అని బ్రిటన్ టెక్నాలజీ మంత్రి లిజ్ కెండల్ తెలిపారు.ఆస్ట్రేలియా అనుభవాలతో బ్రిటన్ జాగ్రత్తలుపిల్లల సోషల్ మీడియా వినియోగంపై కఠిన చర్యలు తీసుకున్న తొలి దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు కలిగి ఉండకుండా నిషేధం విధించే చట్టాన్ని అక్కడ తీసుకొచ్చారు. అయితే ఆ నిబంధనలను తప్పించుకునేందుకు కొందరు టీనేజర్లు కొత్త మార్గాలను అన్వేషించడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. వయసు ధ్రువీకరణ వ్యవస్థలను దాటేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు కూడా అమలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో కేవలం పూర్తిస్థాయి నిషేధం కంటే.. వినియోగ అలవాట్లను నియంత్రించడం, ముఖ్యంగా రాత్రివేళల స్క్రీన్ టైమ్‌ను తగ్గించడం మరింత ప్రభావవంతంగా ఉంటుందని బ్రిటన్ భావిస్తోంది.మానసిక ఆరోగ్యంపై ఆందోళనలుసోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించడం వల్ల యువతలో నిద్రలేమి, ఏకాగ్రత లోపం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు పెరుగుతున్నాయని తల్లిదండ్రులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని అధ్యయనాల్లో రాత్రివేళ సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించడం వల్ల నిద్ర, దృష్టి కేంద్రీకరణ, మానసిక ఆరోగ్యంలో మెరుగుదల కనిపించినట్లు తేలింది.2027 నుంచి అమలు?బ్రిటన్ ప్రతిపాదించిన సోషల్ మీడియా నియంత్రణ(పూర్తిస్థాయి) నిబంధనలను ఈ ఏడాది చివరి నాటికి పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నారు. 2027 వసంతకాలం నుంచి వీటిని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల అమలును కఠినంగా పర్యవేక్షిస్తామని కూడా స్పష్టం చేసింది.ప్రపంచవ్యాప్తంగా పిల్లల సోషల్ మీడియా వినియోగంపై చర్చ జరుగుతున్న వేళ.. ఆస్ట్రేలియా పూర్తిస్థాయి నిషేధం వైపు వెళ్తుంటే.. బ్రిటన్ మాత్రం నియంత్రణల మార్గాన్ని ఎంచుకుంది. రాబోయే రోజుల్లో యువతను సోషల్ మీడియా ప్రభావం నుంచి రక్షించేందుకు మరిన్ని దేశాలు ఎలాంటి విధానాలు అవలంబిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. -
మంచు దేశాన్ని అతలాకుతలం చేస్తున్న ఎండలు
లండన్: అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు యూకేను అతలాకుతలం చేస్తున్నాయి. ఆ ప్రాంతంలో విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతలు. వేడిగాలుల కారణంగా వేల వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ఈ కారణంగా మరణించిన వారి సంఖ్య2,700 కు చేరుకుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశ చరిత్రలోనే గడిచిన జూన్ నెలలో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపిందిబ్రిటన్ని గత మూడు నెలలుగా అధిక స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు అక్కడి ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. సాధారణంగా చల్లటి వాతావరణం ఉండే ఆ ప్రాంతంలో.. 35 డిగ్రీలకు పైగా ఎండ నమోదు కావడంతో అక్కడి ప్రజలు భరించలేకపోతున్నారు.మే,జూన్ నెలల్లో రికార్డు స్థాయిలో అక్కడ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన మే నెలలోనే లండన్‌లోని క్యూ గార్డెన్స్‌లో అత్యధికంగా 35.1జూన్ 26న లింగ్వుడ్లో ఏకంగా 37.7 డిగ్రీల ఉష్ణోగ్రత ఇది బ్రిటన్ చరిత్రలోనే అధికం నమోదైంది.దీంతో గత జూన్ నెలలో అక్కడి వాతావరణ శాఖ చరిత్రలోనే మొదటిసారిగా వరుసగా మూడు రోజుల పాటు అత్యంత తీవ్రమైన వేడికి సంకేతంగా 'రెడ్ ఎక్స్ట్రీమ్ హీట్ వార్నింగ్' జారీచేసింది.దీంతో అనారోగ్య సమస్యలతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. సాధారణంగా బ్రిటన్ చల్లటి వాతావరణం ఉంటుంది. దీంతో అక్కడి ఇళ్లు, ఆసుపత్రులు చల్లటి వాతావరణానికి అనుకూలంగా నిర్మించబడ్డాయి. కనుక ఈ ఎండవేడిమికి తట్టుకునే సదుపాయాలు అక్కడ లేవు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రాత్రి వేళల్లో సైతం ఉష్ణోగ్రతలు 20డిగ్రీలకు తగ్గకపోవడంతో తీవ్రఅవస్థలకు గురవుతున్నారు. -
యూకే అంబాసిడర్‌తో పూనమ్ కౌర్ సందడి (ఫోటోలు)
-
ఆడియో వార్: నందూస్ వరల్డ్ నందన VS నందూస్ వరల్డ్ బాధితులు
-
మళ్ళీ కలుద్దాం... మీరు ఎప్పుడూ కలవరు.. ఇది గ్యారంటీ కారణం ఇదే
-
నందు మాయం.. ఇక దొరకరు... కనిపించరు..! ఎక్కడికి వెళ్లారంటే
-
కొత్త డ్రామానా..? సంచలన వీడియో రిలీజ్ చేసిన 'నందుస్ వరల్డ్' నందన
-
కేసు ఏమైంది? లండన్ లో నందూస్ కపుల్ ఎంజాయ్..!
-
కోట్లు కొట్టేసి UKలో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు
-
నందు లగ్జరీ లైఫ్ వెనుక డార్క్ సీక్రెట్! ఎవరికీ తెలియని నిజాలు ఇవే
-
ఆ మహిళ బ్రెయిన్లో 38 పరాన్న జీవులు..!కానీ సర్జరీ చేయకుండానే..
ఒక విదేశీ మహిళ విపరీతమైన తలనొప్పితో బాధపడింది. ఆమె సాధారణ తలనొప్పి అనుకుంది కానీ..అది చూస్తుండగానే బుర్ర బద్దలైపోయేంతట విపరీతమైన నొప్పి..మూర్చ, మతిస్థిమతం వంటివి అటాక అయ్యి..కుప్పకూలిపోయింది. అప్పటిదాక బాగానే ఉన్న ఆమెకు ఆకస్మికంగా ఇలా ఎందుకు జరిగిందని విచారిస్తే..అసలు విషయం బయటపడింది. అలాగే వైద్య పరీక్షల్లో ఆమె బ్రెయిన్ స్కానింగ్ రిపోర్టు చూసి వైద్యులకే నోట మాటరాలేదు. అయితే ఇలాంటి సమస్య ఆ దేశంలో అత్యంత అరుదు కావడంతో ఎలా వచ్చింది అని విచారిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడటమే గాక..ఆమె ఈ సమస్య నుంచి బయటపడటానికి పడరాని నరకం అనుభవించింది. ఇంతకీ ఎవారా ఆ మహిళంటే..యూకేకు చెందిన లోరీ డెన్మాన్ అనే మహిళ విపరీతమైన తలనొప్పితో బాధపడుతూ..మూర్చ వంటి సమస్యలు ఎదుర్కొంది. రాను రాను సమస్య మరింత దిగజారిపోయింది. ఒకరోజు ఉన్నట్లుండి కుప్పకోలిపోయింది. ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి హుటాహుటినా తీసుకెళ్లగా వైద్యపరీక్షల్లో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆమె బ్రెయిన్ స్కానింగ్ రిపోర్టు చూసి వైద్యులే కంగుతిన్నారు. చివరికి తనకు ఈ సమస్య ఎలా వచ్చిందో తెలిసి విస్తుపోవడమే కాదు..రోజురోజుకి ఆమె మరింత దిగజారి ప్రాణాంతకంగా మారింది. అసలు ఇలా ఎందుకు జరిగిందని విచారించగా తాను భారత్ పర్యటకు వెళ్లానని..ఆ టూర్‌కి వెళ్లి ఇప్పటికీ మూడేళ్లు అవతుందని పేర్కొంది. అయితే ఆ తర్వాత ఒక రోజు మలవిసర్జనలో టేప్వామ్ని చూసి విస్తుపోయానని చెప్పింది. ఆ తర్వాత నుంచి పరిస్థతి నార్మల్‌గా ఉండటంతో లైట్ తీసుకున్నానని చెప్పింది. అప్పటి నుంచి తనలో ఈ బద్దెపురుగులు ఉన్నాయా అని వైద్యలును ప్రశ్నించింది లోరి. అయితే వైద్యులు పలు టెస్ట్‌లు చేసి శరరీంలో ఎక్కడ ఈ సమస్య లేదని, కేవలం బ్రెయిన్లోనే ఏకంగా 38 టేప్‌వార్మ్‌లు ఉన్నాయని అన్నారు. దీన్ని వైద్య పరిభాషలో ‘న్యూరోసిస్టిసెర్కోసిస్’ అని పిలుస్తారని అన్నారు. యూకేలో ఈ సమస్య చాలా అరుదని, ఈ వ్యాధి ప్రబలంగా ఉన్న ప్రాంతాల నుంచి వలస వచ్చినవాళ్లే ఈ సమస్య బారిన పడతారని అనడంతో కంగుతింది లోరీ.న్యూరోసిస్టిసెర్కోసిస్ అంటే..ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఇది పంది టేప్‌వార్మ్ వల్ల కేంద్ర నాడీ వ్యవస్థకు సోకే ఒక పరాన్నజీవి సంక్రమణ. సరిగ్గా ఉడకని ఆహారం, ముఖ్యంగా పంది మాంసం తినడం వల్ల మనుషులు ఈ వ్యాధి బారిన పడతారని అన్నారు. అలాగే టేప్‌వార్మ్ గుడ్లతో కలుషితమైన నీటి ద్వారా కూడా ఇది సంభవిస్తుందని తెలిపారు వైద్యులుఈ వ్యాధిని గుర్తించిన తర్వాత లోరీకి పరాన్న జీవి నిరోధక మందులు, స్టెరాయిడ్లు ఇచ్చారు. అవి మొదట్లో బాగానే పనిచేశాయి. కానీ రాను రాను దుష్ప్రభావాలు చూపించడం మొదలుపెట్టింది. గందరగోళానికి గురవ్వడం, శరీరంలో తిమ్మిర్లు, జలదరింపు, బ్రాంతి వంటి మానసిక రుగ్మతలు బారినడపడింది. రోజురోజుకి పరిస్థితి మరింత దిజగారిపోయింది. చూడటానికి ఒక చిన్నపిల్ల మాదరి ప్రవర్తించడం మొదలుపెట్టింది. అలా ఆమె కోలుకుని యథాస్థితికి రావడానికి చాలా సమయమే పట్టింది. ప్రస్తుతం 42 ఏళ్లు ఉన్న ఆమె జీవితాంతం మూర్చ వ్యాధి మందులు వాడుతూనే ఉండాల్సి రావడం బాధకరం. అంతేగాదు ఆమెకు సర్జరీ చేయకుండానే ఆ పరాన్నజీవులను మట్టుబెట్టారు. అవి మెడిసిన్ ప్రభావంతో బ్రెయిన్లోనే గట్టిపడిపోతాయని చెప్పారు వైద్యులు. ఇప్పుడు ఆమె పూర్తి స్థాయిలో కోలుకోవడమే కాదు.. ఆ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పిస్తోంది. పైగా తనలా ఎవ్వరూ ఏ సమస్య వచ్చినా తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తోందామె.(చదవండి: లక్షల జీతం వదులుకుని వెయిటర్‌గా..! ఎందుకంటే..) -
లండన్‌లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
లండన్/కామారెడ్డి: ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరైన మరుసటి రోజే అతను శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.మృతుడు కామారెడ్డి జిల్లా తలమడ్ల గ్రామానికి చెందిన షాపుసాని శ్రీనాథ్ రెడ్డి (25)గా గుర్తించారు. లీసెస్టర్‌లో ఎమ్మెస్ చదువుతున్న శ్రీనాథ్, ఈనెల 22 రాత్రి స్నేహితుడి బర్త్‌డే పార్టీకి వెళ్లిన తర్వాత, మరుసటి రోజు తన గదిలో శవమై కనిపించాడు. ఈ హఠాన్మరణంతో తలమడ్ల గ్రామంలో తీవ్ర విషాదం నెలకొనగా, మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా, ఘటనపై దర్యాప్తు జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
నందు అత్తామామల అరెస్ట్ ఎలా దొరికారంటే.. ఇండియాకు మధుకర్..?
-
రూ.1.49 కోట్ల విలువైన రేంజ్ రోవర్ గోవిందా.. ఎవర్రా మీరంతా?
యూకేలోని ఉత్తర యార్క్‌షైర్‌లోని స్కార్బరో బీచ్‌లో ఇసుకలో ఇరుక్కుపోయిన ఒక వ్యాన్‌ను కాపాడేందుకు ఓ రేంజ్ రోవర్ యజమాని ప్రయత్నించాడు. అయితే, ఆ ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. సుమారు $1,58,000 (దాదాపు రూ.1.49 కోట్లు) విలువైన రేంజ్ రోవర్ కూడా ఇసుకలో ఇరుక్కుపోయింది. సముద్ర అలలు పెరిగాయి. రేంజ్రోవర్తో పాటు వ్యాన్ కూడా మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంత విలువైన రేంజ్ రోవర్‌ను సముద్రం వద్ద అటువంటి పనులకు వాడినందుకు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.తీరప్రాంతంలో ఇరుక్కుపోయిన ట్రాన్సిట్ వ్యాన్‌ను బయటకు లాగేందుకు రేంజ్ రోవర్ వాహనం ప్రయత్నిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. మొదట వ్యాన్ చక్రాలను ప్లాస్టిక్ పారతో తవ్వి బయటకు తీయడానికి కొందరు ప్రయత్నించారు. రేంజ్ రోవర్ అక్కడికి చేరుకోగానే పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. కానీ ఆ ప్రయత్నం తిరగబడింది. ఇసుకపై నడిచే ప్రత్యేక విధానం ఉన్నప్పటికీ ఆ విలాసవంతమైన ఎస్యూవీ కూడా ఇరుక్కుపోయింది. సాయంత్రానికి సముద్ర అలలు పెరగడంతో రెండు వాహనాలు నీటిలో మునిగిపోయాయి. వాటిలో పైకప్పులు, ఒక యాంటెన్నా మాత్రమే నీటిమీద కనిపించాయి. స్థానికులు ఇచ్చిన సలహాలను యజమానులు పట్టించుకోకుండా, స్వయంగా వాహనాలను బయటకు తీయడానికి ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.ప్రత్యక్ష సాక్షి చెప్పిందేమిటంటే?ప్రత్యక్ష సాక్షి సామీ హెల్వెల్ మాట్లాడుతూ.. “కొంతమంది స్థానికులు అక్కడికి వెళ్లి, జెట్ స్కీల సాయంతో ఇసుక నుంచి బయటకు తీయాలని సూచించారు. కానీ వారితో వారు మర్యాదగా మాట్లాడలేదు. తమకు ఏం చేయాలో తెలుసన్న అహంభావం కనపడింది. మొదట జెట్ స్కీలను వ్యాన్‌కు కట్టారు. అది లాగడానికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. అది పూర్తిగా అవివేకం. నా మామ కోసం నేను ఆ వీడియో తీశాను. వారు వాహనాలను బయటకు తీయడానికి చేసిన ప్రయత్నాలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చూసి ఆయనకు నవ్వు వస్తుందని అనుకున్నాను” అని చెప్పారు. తర్వాత అధికారులు అలలు తగ్గిన తర్వాత వాటిని బయటకు తీశారు. View this post on Instagram A post shared by North Yorkshire Weather Updates (@northyorkshireweatherupdates) -
25 వేల ఈకలు, నాలుగు లక్షల పూసలు..ఏకంగా రూ. 1,155 గంటల ఎంబ్రాయిడరీ!
అంబానీ ఇంట పెళ్లి సందడి వేడుకలో నీతా అంబానీ నుంచి కోడళ్లు వరకు అందరూ అత్యంత విలాసవంతమైన దుస్తులు, ముఖ్యంగా కళాఖండాలకు నిలువెత్తు నిదర్శనమైన డిజైనర్‌వేర్‌లలో తళుక్కుమన్నారు. అంతేగాదు కళ్లు చెదిరిపోయే ధర పలికే ఆభరణాలతో మెరిసిపోయారు. ఇప్పుడు వాటన్నింటిని తలదన్నేలా ఈ పెళ్లికూతురు దుస్తులను ధరించింది ఈ ప్రముఖ గాయని. కళాఖండమే ఆమె దుస్తులుగా మారిందా అన్నంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ వధువు దుస్తులు ఎంత ప్రత్యేకం అంటే..ప్రతిదీ ఓ కళాఖండం..ఓ అద్భుతం.బ్రిటన్ గాయని దువాలిపా నటుడు క్యాలమ్ టర్నర్‌ని జూన్ 20న సిసిలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసుకున్నారు. ఈ దంపతులు మొదట లండన్‌లో దగ్గరి బంధువుల సమక్షంలో ఒక్కటవ్వగా..ఆ తర్వాత గ్రామీణ నేపథ్యంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. అక్కడ ఆమె అద్భుతమైన పెళ్లి దుస్తులతో ఫోటోలకు పోజులిచ్చారామె. ఈ దుస్తులను రూపొందించడానికి కళాకారులకు ఏకంగా నాలుగు వేల గంటలపైనే పట్టిందని గాయని దువాలిపా ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది. ఆ దుస్తుల ప్రత్యేకతను వివరిస్తూ..అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకునింది. దానికి "మిస్టర్ & మిసెస్" అని క్యాప్షన్ పెట్టి మరీ పోస్ట్ చేసింది.ఆమె దుస్తుల స్పెషాల్టీ..ఫ్రెంచ్ లేబుల్ చానెల్ రూపొందించిన ఈ పెళ్లి దుస్తులు వివరాల గురించి అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇలా పేర్కొంది. ఈ హాట్ కౌచర్ దుస్తులు పారిస్‌లోని హస్తకళా కేంద్రంలో రూపుదిద్దుకున్నాయని తెలిపింది. వాటిపై ప్రత్యేకమైన డిజైన్ కోసం మైసన్స్ డి'ఆర్ట్ అటెలియర్ మాంటెక్స్, లెమరీ , లెసేజ్ వంటి ఫ్యాషన్ స్టూడియోల క్లిష్టమైన అలంకరణలు ఉన్నాయి. అందుకోసం తెల్లటి శాటిన్ వంపులను షానెల్ బ్రాండ్‌కి చెందిన మస్సారో హస్తకళల బృందం ప్రత్యేకంగా తయారు చేసింది. ఇక ఈ ఫ్రెంచ్ లేబుల్ గౌను, ముసుగుని డిజైన్ చేసిన విధానం గురించి కూడా సవివరంగా తెలిపింది. ఈ హాట్ కౌచర్ దుస్తులను అటెలియర్ మాంటెక్స్ ఫ్యాషన్ స్టూడియో నాలుగు లక్షల పైగా పూసలతో పూర్తిగా చేతితో ఎంబ్రాయిడరీ చేయగా, లెసాజ్ ఏకంగా 1,155 గంటల సూదితో ట్రోంప్ లొయిల్ ఆభరణాలను అమర్చింది. అంతేగాదు లెమరీ ఫ్యాషన్ స్టూడియో ఏకంగా 25 వేల ఈకలతో సులన్నితమైన అలంకరణ చేసింది. పెళ్లి కూతురు ధరించే ముసుగు, ఆరు మీటర్లలో ట్యూట్ ముసుగు పక్షులు, పువ్వులు కవితాత్మక చిత్రాన్ని ఆవిష్కరించింది. దీన్ని పూసలు, ఈకలతో ఎండ్రాయిడరీ చేశారు. ఈ హాట్ కౌచర్ ముసుగు డిజైన్ కోసం ఏకంగా మూడుగంటలకు పైగా చేతిపని అవసరమైందట. సింపుల్‌గా చెప్పాలంటే ఈ వస్త్రధారణ ఓ కళఖండం, పైగా రాబోయే ఏళ్లలో నవ వధువులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇక నటుడు క్యాలమ్ టర్నర్ కస్టమ్ లూయిస్ విట్టన్ సూట్లో ఆకర్షణీయంగా కనిపించాడు. ఈ ఇటాలియన్ వివాహానికి జో అల్విన్, డొనాటెల్లా వెర్సాచే, గ్రేస్ గమ్మర్, ఒలివియా డీన్, మార్క్ రాన్సన్తో పాటు మరికొందరు హాజరైనట్లు సమాచారం. View this post on Instagram A post shared by CHANEL (@chanelofficial) (చదవండి: ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! ఆ ఐదు జపనీస్ ఫుడ్ రూల్స్..) -
Viral Video: ఇరికించిన బాధితులను బెదిరిస్తున్న నందుస్ కపుల్..
-
రష్యా ఆయిల్ ట్యాంకర్ సీజ్.. భారత పౌరుడు అరెస్ట్
లండన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ అంతర్జాతీయంగా సంచలనం కలిగించే పరిణామం చోటుచేసుకుంది. ఆంక్షలను ఉల్లంఘించి రష్యా ముడి చమురును రవాణా చేస్తోందనే అనుమానంతో, బ్రిటన్ సైనిక బలగాలు ఇంగ్లీష్ ఛానల్లో ఒక రష్యన్ చమురు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నాయి. బ్రిటన్ చరిత్రలోనే రష్యాకు చెందిన ‘షాడో ఫ్లీట్’ (రహస్య నౌకాదళం) నెట్‌వర్క్‌పై జరిగిన మొట్టమొదటి భారీ దాడి ఇది. ఈ ఆపరేషన్ అనంతరం బ్రిటన్ జాతీయ నేర విభాగం (ఎన్సీఏ) అధికారులు ఆంక్షల ఉల్లంఘన ఆరోపణలపై ఒక భారతీయ పౌరుడిని అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.మిడ్నైట్ రైడ్.. బ్రిటన్ ప్రధాని హెచ్చరికఆదివారం (జూన్ 15) రాత్రి ఇంగ్లీష్ ఛానల్ గుండా వెళ్తున్న ‘స్మిర్టోస్’ అనే ట్యాంకర్‌ను బ్రిటీష్ దళాలు చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించడానికి రష్యాకు అందుతున్న నిధుల వనరులను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై బ్రిటన్ ప్రధానమంత్రి కైర్ స్టార్మర్ స్పందిస్తూ.. ఇది రష్యాకు గట్టి ఎదురుదెబ్బ అని అభివర్ణించారు. పుతిన్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ లాభపడుతున్న వారు ఎవరూ ఇకపై తప్పించుకోలేరని, వారిని దాక్కోనివ్వబోమని సోషల్ మీడియా వేదికగా ఆయన హెచ్చరించారు.7 లక్షల బ్యారెళ్ల చమురు.. దొరికిన కీలక ఆధారాలుమెరైన్ ట్రాఫిక్ వెబ్సైట్ సమాచారం ప్రకారం, హాంగ్ కాంగ్ ఆధారిత ‘జావో యావో షిప్పింగ్ లిమిటెడ్’ సంస్థకు చెందిన ఈ ట్యాంకర్, కామెరూన్ జెండాతో ప్రయాణిస్తోంది. జూన్ 5న రష్యాలోని ఉస్త్-లుగా పోర్ట్ నుండి బయలుదేరిన ఈ నౌకలో దాదాపు 7 లక్షల బ్యారెళ్ల రష్యన్ ముడి చమురు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ నౌకను డోర్సెట్ తీరంలో నిలిపి ఉంచారు. ఇందులో ఉన్న 24 మంది జార్జియా, భారతీయ సిబ్బంది ప్రస్తుతం నౌకలోనే ఉన్నట్లు ఎన్సీఏ తెలిపింది. బ్రిటన్ తీసుకున్న ఈ సాహసోపేత చర్యను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభినందించగా, రష్యా మాత్రం దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.షాడో ఫ్లీట్ అంటే ఏమిటి? అంతర్జాతీయ ఆంక్షల నుండి తప్పించుకుని రష్యా చమురును ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడానికి వాడుతున్న వందలాది రహస్య నౌకల నెట్‌వర్క్‌ను ‘షాడో ఫ్లీట్’ అని పిలుస్తారు. యుద్ధ నిధుల కోసం రష్యా ప్రధానంగా ఈ చమురు విక్రయాలపైనే ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ సహా పాశ్చాత్య దేశాలు ఈ నౌకలపై నిషేధం విధించాయి. ప్రస్తుత ట్యాంకర్ సీజ్ వల్ల రష్యా చమురు ఎగుమతులు పూర్తిగా ఆగిపోకపోయినప్పటికీ, రష్యాకు రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయని, అలాగే పర్యవేక్షణ నుంచి తప్పించుకోవడానికి నౌకలు సుదీర్ఘ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: నాలుగు ఏఐ మోడల్స్ ఫెయిల్.. 10/10 స్కోర్ చేసిన మానవ మేథ! -
నందూస్ వరల్డ్ కంపెనీలన్నీ మూసేసి..! నెక్స్ట్ జరగబోయేది ఇదే
-
కొత్త రూల్స్.. పిల్లల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు!
డిజిటల్ యుగంలో.. సోషల్ మీడియా పిల్లల జీవితాల్లో కీలక భాగంగా మారింది. అయితే, దీని వల్ల కలిగే మానసిక, సామాజిక ప్రభావాలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కీర్ స్టార్మర్ (Keir Starmer) నేతృత్వంలోని యూకే ప్రభుత్వం 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా సైట్లను నిషేధిస్తానని, గేమింగ్, లైవ్‌స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై పరిమితులు విధిస్తానని నిర్ణయించింది. పిల్లల సంక్షేమాన్ని కాపాడటానికి కఠిన చర్యలు అవసరమని ప్రధాని స్పష్టం చేశారు.బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల సంవత్సరాలలో టెక్నాలజీ కంపెనీలపై కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. వయస్సు నిర్ధారణ వ్యవస్థలు, అల్గారిథమ్‌లలో మార్పులు, అనుచిత చిత్రాలను పంచుకోకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కంపెనీలను ఆదేశించింది. అయితే.. ఇప్పుడు కేవలం నియంత్రణలతో సరిపోదని భావించిన ప్రభుత్వం, పూర్తి నిషేధం వైపు అడుగులు వేస్తోంది.బ్రిటన్ ప్రభుత్వం ఆస్ట్రేలియాను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే.. గత ఏడాది ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా (టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్) వినియోగాన్ని నిషేధించిన తొలి దేశంగా నిలిచింది.పిల్లలకు సోషల్ మీడియా నిషేధం గురించి నిర్ణయం తీసుకోవడానికి ముందు, బ్రిటన్ ప్రభుత్వం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువతతో విస్తృతంగా సంప్రదింపులు జరిపింది. సోషల్ మీడియాపై నిషేధంతో పాటు.. రాత్రి సమయాల్లో వినియోగ పరిమితులు, యాప్‌లకు సమయ పరిమితులు, పిల్లలను ఎక్కువసేపు ఆకర్షించే డిజైన్ ఫీచర్లపై ఆంక్షలు వంటి అంశాలను పరిశీలించింది.ఈ సంప్రదింపుల్లో లక్షకు పైగా స్పందనలు వచ్చాయి. అందులో 83 శాతం మంది తల్లిదండ్రులు సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలు.. ప్రయోజనాల కంటే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అలాగే 90 శాతం మంది సోషల్ మీడియా వాడేందుకు కనీస వయస్సు 16 సంవత్సరాలు ఉండాలని మద్దతు తెలిపారు.అయితే.. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు, పరిశోధకులు కేవలం నిషేధం విధించడం ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం కాదని అంటున్నారు. పిల్లలకు డిజిటల్ అవగాహన, బాధ్యతాయుతమైన వినియోగంపై విద్య అందించడం కూడా అంతే ముఖ్యమని వారు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు మరిన్ని దేశాలు తీసుకునే అవకాశం కూడా ఉంది.ఇదీ చదవండి: క్యాష్ ఈజ్ ట్రాష్.. పెట్టుబడిదారులకు కియోసాకి హెచ్చరిక! -
వేరే దేశానికి జంప్.! లాయర్ చెప్పిన షాకింగ్ నిజాలు
-
నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. మోసం వెనుక అసలు కారణం..?
-
నందూస్ వరల్డ్ స్కామ్.. ఎక్కడికి పారిపోయినా UK గవర్నమెంట్ వాళ్ళని వదిలిపెట్టదు..
-
నందూస్ స్కాం మిస్టరీ..! బయటపడుతున్న కీలక సీక్రెట్స్
-
Missing Couple: పారిపోయారా? లొంగిపోయారా?
-
ఏ క్షణమైనా అరెస్ట్ పరారీలో నందుస్ ఫ్యామిలీ
-
నందూస్ వరల్డ్‌పై భారీ ఆరోపణలు, తవ్వే కొద్దీ బయటకొస్తున్న మోసాలు
-
భర్తది ఏం లేదు... మాస్టర్మెండ్ నందునే?
-
బిగ్ ట్విస్ట్! పరారీలో నందుస్ ఫ్యామిలీ!
-
ఆఫీసులన్నీ క్లోజ్, నందుస్ భార్యాభర్తలు ఎక్కడ?
-
మరింత ఉచ్చులో బిగుసుకు పోయిన నందూస్ వరల్డ్ దంపతులు
-
అమ్మ.. రమనందనా.. తప్పించుకుందాం అనుకున్నావా?
-
నందు కేసులో కొత్త ట్విస్ట్.. రాజీనామాపై అనేక అనుమానాలు..!
-
నందుస్ వరల్డ్ చీకటి రహస్యాలు
-
నందు ఎంత రాక్షసి అంటే..?కడుపుతో ఉన్న అమ్మాయి పని చేయడానికి వస్తే
-
నందూస్ వరల్డ్ కపుల్స్ పాస్ పోర్ట్ రద్దు..!
-
ఏ క్షణమైనా నందు కపుల్ అరెస్ట్... బయటపడ్డ కొత్త సాక్ష్యాలు..
-
నేరం రుజువైతే.. సోషల్ మీడియా సెలబ్రిటీ జంట జైలుకే..
-
నందుస్ వరల్ మధుకర్ కి UKలో 10 ఏళ్ల జైలు శిక్ష
-
నందూస్ వరల్డ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.. యూకేలో జైలు శిక్ష ఎన్నేళ్లంటే?
లండన్: యూకే వీసా కేసులో నందూస్ వరల్డ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీసా కేసులో బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. ఈక్రమంలో యూకే సొలిసిటర్ శ్రీనివాస్ సంచలన విషయాలు బయటపెట్టారు. నేరం రుజువైతే రమానందన, మధుకర్‌కు యూకేలో పదేళ్లు జైలు శిక్ష పడుతుంది. జైలు శిక్ష తర్వాత పాస్‌పోర్టు రద్దు చేసి ఇండియాకు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
భారత్‌ని విడిచి వెళ్తున్న ప్రతిసారి గుండె పగిలిపోతోంది ..!
మన మాతృగడ్డని ఎందరో విదేశీయలు ప్రశంసించారు. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకు ఫిదా అయ్యి ఇక్క్కడే స్థిరనివాసం ఏర్పరుచుకున్న వాళ్లు కోకొల్లలు. అలాంటి ఈ భారత్ నేలను విడిచి వెళ్లడం అంటేనే కన్నీళ్లు వచ్చేస్తాయంటున్నాడు ఒక విదేశీయుడు. అందుకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో యూకే ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ డేవ్ ఫ్లూకు ప్రతి పర్యటలనో భారత్‌ని విడిచి వెళ్లడమే అత్యంత కష్టంగా ఉంటుందని చెబుతుండటం కనిపిస్తుంది. మంబై నుంచి బయలుదేరే ముందు రికార్డ్ చేసిన వీడియో అది. ఈ దేశంతో ఏర్పరచుకున్న అనుబంధం అలాంటిదని, ఇక్కడి స్నేహితులకు వీడ్కోలు చెప్పడం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆ వీడియోలో ముంబైలోని సాకినాకా వీధుల్లో నడుస్తూ.. భారతదేశాన్ని విడిచి వెళ్లే సమయం వచ్చినప్పుడల్లా తాను అనుభవించే భావాలను ఫ్లూ గుర్తుచేసుకున్నారు. ఏళ్లుగా తాను గాఢంగా అనుబంధం పెంచుకున్న దేశాన్నివిడిచి వెళ్లడం అనే ఆలోచన తలుపుకు రాగానే..గుండ పగిలిపోతుందన్నారు. అలాగే భారతదేశంపై తనకున్న అభిమానం గురించి కూడా ప్రస్తవించారు. తాను మరే దేశాన్ని ప్రేమించనంతగా ఈ దేశాన్ని ప్రేమిస్తున్నానని, ప్రతిసారి దీన్ని విడిచి వెళ్లడం అంటే మానసికంగా చాలా కష్టపడాల్సి వస్తుందన్నారు. జీవితం అంటే ముందుకు సాగడం అని తెలిసినప్పటికీ..ఈ వీడ్కోలు వద్దకు వచ్చేటప్పటకీ హృదయం ద్రవించిపోతోందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. చివరగా మళ్లీ తిరిగి ఇక్కడకు వస్తానని చెబుతూ.."జై హింద్" అంటూ తన పోస్ట్‌ని ముగించారు. ఈ వీడియోకి ప్రసారి వెళ్లడం తన గుండెని పిండేస్తుందంటూ క్యాప్షన్ ఇచ్చి మరీ షేర్ చేశారు. నెటిజన్లు అతడి పోస్ట్‌కి ఫిదా అవ్వుతూ బ్రో త్వరగా తిరిగి రండి, ఇది తాత్కాలికి వీడ్కోలే అని భరోసా ఇస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. View this post on Instagram A post shared by Dave Flew (@flewy86) (చదవండి: సినిమా సీన్‌ని తలపించేలా.. ఆర్మీ పైలట్ లవ్ ప్రపోజ్!) -
నందూస్ అక్రమాలపై జైపాల్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
-
నందూస్ కపుల్స్ మౌనం..స్క్రీన్ షాట్ బయటపెట్టిన UK జైపాల్ రెడ్డి..
-
ఇప్పుడు మాకు చావే దిక్కు వాళ్ల వల్ల UKలో అడుక్కు తింటూ బతికాం
-
23 ఏళ్ల పోరాటం.. రూ.85 కోట్లు.. అసలేంటి ఈ కథ?
యూకేలో భారతీయ సంతతి మహిళ 23 ఏళ్ల విడాకుల పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. యూకేలోనే అత్యంత అరుదైన.. సుదీర్ఘమైన విడాకుల పోరాటంలో భారత సంతతికి చెందిన వర్షా గోహిల్ ఏకంగా 6.6 మిలియన్ పౌండ్ల(సుమారు రూ. 85 కోట్లు) పరిహారాన్ని సాధించారు. ఈ కేసు 2002లో ప్రారంభమైంది. తన భర్త భద్రేష్ గోహిల్ వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని.. అతని ప్రవర్తన సరిగ్గా లేదని వర్షా గోహిల్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఆనాటికి ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అప్పట్లో వీరిద్దరి మధ్య ఆర్థిక సెటిల్మెంట్ చాలా సాదాసీదాగా ముగిసినట్లు కనిపించింది. వర్షా దాదాపు 2,70,000 పౌండ్లు (సుమారు రూ. 3.5 కోట్లు) నగదుతో పాటు కుటుంబానికి చెందిన ప్యుజో (Peugeot) కారును తీసుకోవడానికి అంగీకరించారు. కానీ, తన భర్త తన ఆస్తులన్నింటినీ నిజాయితీగా వెల్లడించలేదని ఆమె పేర్కొంది.నైజీరియా మాజీ గవర్నర్ జేమ్స్ ఇబోరి అనుచరులతో ముడిపడి ఉన్న భారీ మనీలాండరింగ్ (అక్రమ ద్రవ్య చలామణి) కేసులో భద్రేష్ గోహిల్ ప్రధాన నిందితుడిగా అధికారులు విచారణ చేపట్టారు. దీంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆఫ్‌షోర్ కంపెనీలు, క్లయింట్ ఖాతాల ద్వారా భద్రేష్ మిలియన్ల కొద్దీ పౌండ్లను అక్రమంగా బదిలీ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. సుదీర్ఘ విచారణ అనంతరం మనీలాండరింగ్, ఫోర్జరీ, మోసపూరిత కుట్రకు పాల్పడినట్లు రుజువు కావడంతో 2011లో భద్రేష్ గోహిల్ 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.విచారణలో మొదటి విడాకుల కేసు సమయంలో బయటపడని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వివిధ దేశాల్లో విస్తరించి ఉన్న నెట్వర్క్ కంపెనీల ద్వారా భద్రేష్ దాదాపు 28 మిలియన్ పౌండ్లను దాచాడనే కారణంగా అధికారులు ఆ ఆస్తులను ఫ్రీజ్ చేశారు. ఈ కొత్త ఆధారాలు వర్షా గోహిల్‌కు తన పాత విడాకుల సెటిల్మెంట్ను తిరిగి సవాలు చేయడానికి కొండంత బలాన్ని ఇచ్చాయి.ఈ కేసు చివరకు యూకే కోర్టుకు చేరింది. భర్తకు చెందిన జప్తు చేసిన ఆస్తుల నుంచి తనకు మరింత భరణాన్ని ఇవ్వలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. జప్తు చేసిన మొత్తం యావత్తూ అక్రమార్జన కాదని.. అందులో కష్టపడి సంపాదించిన మొత్తం కూడా ఉందని ఆమె కోర్టుకు తెలిపారు. దీంతో వర్షా గోహిల్ వాదనతో అంగీకరించిన కోర్టు.. జప్తు చేసిన మొత్తంలో 66 లక్షల పౌండ్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఇకపై ఎలాంటి అప్పీళ్లకు అవకాశం లేదని కోర్టు స్పష్టం చేయడంతో ఈ 23 ఏళ్ల సుదీర్ఘ సమరానికి ఎట్టకేలకు తెరపడింది. -
నందూస్ వరల్డ్ వీసా స్కామ్‌లో బిగ్ ట్విస్ట్?!
సాక్షి,హైదరాబాద్: ప్రముఖ తెలుగు యూట్యూబర్స్ ‘నందూస్ వరల్డ్’(Nandu's World) దంపతులైన మధుకర్ జాగర్లమూడి, రమా నందన వీసా స్కామ్‌లో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాధితులు, ఒకరో ఇద్దరు కాదని వందల్లో ఉండొచ్చనే వాదనలు తెరపైకి వచ్చాయి. నందూస్ వరల్డ్ వీసా స్కామ్‌లో ఒక్కొక్కరుగా పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. తాజాగా, ఇద్దరు దంపతులు డెస్టినీ వీసా కన్సల్టెన్సీ పేరుతో వీసాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్(సీవోఎస్) ఇప్పిస్తామని తమ వద్దనుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫ్యామిలీవ్లాగ్స్‌తో ఫేమస్ యూట్యూబ్‌లో ఫ్యామిలీవ్లాగ్స్‌తో ఫేమస్ అయ్యారు. లక్షల మంది అభిమానుల్ని సంపాదించారు. విదేశాల్లో సెటిలై సక్సెస్ స్టోరీగా నిలిచారు. ఇప్పుడా కపుల్స్ చుట్టూ కోట్ల రూపాయల వీసా స్కామ్ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. యూకే వీసా ఇప్పిస్తాం అంటూ లక్షలు వసూలు చేశారా?. బాధితుల డబ్బు తీసుకుని బ్లాక్ చేశారా?. వైరల్ అవుతున్న వీడియోలు,కేసులు,కౌంటర్ ఆరోపణల మధ్య నందూస్ వరల్డ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది. అసలు ఈ వివాదం వెనుక కథేంటీ?.సోషల్ మీడియాలో నందు వరల్డ్‌తో ఫేమస్‌యిన రమానందన, జాగర్లముడి మధుకర్ దంపతులు ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. యూట్యూబ్‌లో కుటుంబ కథలు, ఫన్నీ వీడియోలు, విదేశీ జీవన శైలిని చూపిస్తూ లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ జంట ఇప్పుడు యూకే వీసా మోసం ఆరోపణల్ని ఎదుర్కొంటోంది.👉ఇదీ చదవండి : నందూస్ వరల్డ్ దంపతులపై కేసుస్కామ్ విలువ రూ.10 కోట్ల నుంచి 20 కోట్లు? బాధితుల ప్రకారం.. యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు, సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్(సీవోఎస్) ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో వ్యక్తి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.25లక్షల వరకు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. బాధితుల సంఖ్య 50 నుంచి 100 వరకు ఉండొచ్చని, మొత్తం లావాదేవీలు 10 నుంచి 20 కోట్ల వరకు ఉండొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అత్యంత కీలకంగా వీరి యూట్యూబ్‌ను చూసి చాలా మంది వారిని నమ్మినట్లు బాధితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల్లా నమ్మి లక్షలు ఇచ్చామని, కానీ తర్వాత తమకు అనుమానాలు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లడానికి కారణం ఎన్టీఆర్జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన క్రాంతి కుమార్ ఫిర్యాదు. యూకే వీసా రెన్యువల్ కోసం రూ.15లక్షలు చెల్లించానని, కానీ వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానాలు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద మధుకర్, నందనతో పాటు మధుకర్ తండ్రి పేరు కూడా నిందితులు జాబితాలో చేర్చారు. బ్యాంక్ లావాదేవీలు, వాట్సాప్ చాట్, ఫోన్ కాల్స్ రికార్డింగ్స్ ఇలా డాక్యుమెంట్లను బాధితులు పోలీసులకు అందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.కుక్క మొరుగుతుంటే పక్కన కూర్చొని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు వివాదాన్ని మరింత పెంచాయి. డబ్బులు తిరిగి అడిగిన బాధితులతో మధుకర్ పొగరుగా మాట్లాడినట్లు కొన్ని సందర్భాలలో బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘కుక్క మొరుగుతుంటే పక్కన కూర్చొని సమాధానం ఇస్తామా?’ అన్న వ్యాఖ్యలు వైరల్ కావడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ ఆరోపణల్ని నందన పూర్తిగా ఖండిస్తున్నారు. తమపై వ్యక్తిగత కక్షతో ప్రచారం జరుగుతుందన్నారు. యూకే నుంచి ఇండియాకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు కావాలనే తమపై నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని ఆరోపించారు. తమకు ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవని,యూకేలో చట్టబద్ధంగా నమోదైన సంస్థలే ఉన్నాయని నందన చెబుతున్నారు. వైరల్ అవుతున్న ఆడియోలు పూర్తిగా ఎడిట్ చేసినవేనని, అసలు సంభాషణలు వక్రీకరించారని ఆమె ఆరోపించారు. వీసా ప్రక్రియలో ఆలస్యం జరగడం సహజమని, ఎవరిని మోసం చేసే ఉద్దేశం తమకు లేదని వివరణిచ్చారు.మరోవైపు నందన తరుఫు న్యాయవాదులు సైతం కంపెనీలు యూకేలో చట్టబద్ధంగా నమోదయ్యాయని, వీసా మంజూరు చేయడం పూర్తిగా యూకే ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని వాదిస్తున్నారు. కానీ బాధితులు మాత్రం తాము డబ్బులు ఇచ్చినట్లుగా రసీదులు, ఆడియోలు, బ్యాంకు ట్రాన్సాక్షన్‌ని సాక్షాలుగా ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు అసలు నిజం ఏంటన్నది దర్యాప్తు తేలాల్సి ఉంది.బాధితుల కన్నీళ్లు.. నందన దంపతుల కుట్ర ఆరోపణలుఒకప్పుడు యూట్యూబ్‌లో సక్సెస్ సింబల్‌గా కనిపించిన ఈ జంట.. ఇప్పుడ కోట్లాది రూపాయల వీసా స్కామ్ కేంద్రంగా మారింది. ఓ వైపు బాధితుల కన్నీళ్లు.. మరోవైపు నందన దంపతుల కుట్ర ఆరోపణలతో సోషల్ మీడియా నిండిపోయింది. వైరల్ ఆడియోలు, కేసులు దర్యాప్తు ఇప్పుడు ఈ కేసును మరింత వైరల్ చేశాయి. సోషల్ మీడియా స్టార్డమ్ నుంచి క్రిమినల్ కంప్లయింట్ల వరకు వచ్చిన ఈ వ్యవహారంలో చివరకు నిజం ఎవరివైపు ఉందో తేలాల్సి ఉంది. అప్పటి వరకు నందూస్ వరల్డ్ వ్యవహారం సోషల్ మీడియా నుంచి పోలీస్ స్టేషన్ వరకు హాట్టాపిగ్గా కొనసాగేలా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఇద్దరు దంపతుల్ని హైదరాబాద్ పోలీసుల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తన అమ్మ,భార్య బంగారంతో పాటు కారును అమ్మి యూకే వీసా కోసం ప్రయత్నం చేశామని, ఇందుకోసం మధుకర్‌కు ప్రస్తుత యూకే కరెన్సీ విలువ ప్రకారం రూ.18లక్షలు చెల్లించినట్లు బాధిత దంపతులు మీడియా ఎదుట వాపోయారు. స్పాన్సర్ షిప్ వీసాతో యూకేకి వెళ్లిన తాము పడరాన్ని పడినట్లు తెలిపారు. తమను నమ్మించి పదే పదే ఫేక్ స్పాన్సర్ షిప్ విధించడంతో యూకే ప్రభుత్వం తమను పదేళ్ల పాటు బ్యాన్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.యూట్యూబ్‌లో తమకు వస్తున్న ఫేమ్‌ను తట్టుకోలేక పలువురు విష ప్రచారం చేస్తున్నారని నందన వీడియోపై బాధిత దంపతులు స్పందించారు. నందన భర్త మధుకర్‌కు డబ్బులు పంపిన సస్కక్రీన్ షార్ట్స్, మనీ ట్రాన్సాక్షన్ ఉన్నాయని తెలిపారు. తమ న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని చెప్పినా పట్టించుకోలేదని మీడియా ఎదుట వారి బాధను వెలిబుచ్చారు. -
ఇరుక్కున్న యూట్యూబ్ దంపతులు..!
-
Viral Video: మేం ఏ తప్పు చెయ్యలేదు.. కావాలనే ఆ ముగ్గురు చేస్తున్నారు
-
ప్రముఖ తెలుగు యూట్యూబర్ నందు కుటుంబంపై కేసు
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలో ప్రముఖ యూట్యూబర్, మన శంకర వరప్రసాద్ నటి రమా నందన అలియాస్ నందు కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట యూకే వీసా రిన్యూవల్‌లో మోసం చేశారంటూ వెస్ట్ ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూకేలో వీసా గడువు ముగియడంతో, భారత్‌లోని బ్రాంచ్ ద్వారా వీసా ప్రాసెస్ చేస్తామని నందు కుటుంబ సభ్యులు నమ్మించడంతో, యూట్యూబ్‌లో ఉన్న ఫేమ్ కారణంగా వారి మాటలను విశ్వసించి రూ.15 లక్షలు చెల్లించాడు. అయితే, నెలలు గడిచినా వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గ్రహించి ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించాడు.కేసు నమోదు బాధితుడి ఫిర్యాదు మేరకు డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమా నందన, గుంటూరులో నివసించే మధుకర్ తండ్రిపై క్రైమ్ నంబర్ 515/2025 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతోందని ఇబ్రహీంపట్నం ఎస్ఐ బీ. రాజు తెలిపారు.నందూస్ వరల్డ్ యూట్యూబ్ ప్రయాణం నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తూ లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించిన నందన, తన భర్త మధుకర్, పిల్లలతో కలిసి సరదా వీడియోలు చేస్తూ జనాన్ని ఎంటర్టైన్ చేసేవారు. ఒకానొక దశలో తినడానికి తిండిలేక పస్తులున్నామని, మగ గొంతు కారణంగా పలు అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ వీడియోలు చేస్తూ వచ్చారు. ఆ వీడియోలు ప్రేక్షకాదరణ పొందాయి. యూట్యూబ్ ఆదాయంతో పాటు సినీమా అవకాశాలు కూడా దక్కాయి. నందన తన తొలి సినిమా మన శంకర వర ప్రసాద్లో హీరోయిన్ నయనతార స్నేహితురాలు పాత్రలో కనిపించారు. ఒక్క సన్నివేశమే అయినా ఆమెకు గుర్తింపు వచ్చింది. తరువాత పలు సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లు సమాచారం.ఆరోపణల్ని ఖండించిన నందన తనపై వస్తున్న ఆరోపణలను నందన ఖండించారు. ప్రజల్లో, సోషల్ మీడియాలో తమకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేక పలువురు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె వీడియో విడుదల చేశారు. యూకే నుంచి భారత్‌కు వచ్చిన కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. తమకు సంబంధించిన ఏ విషయమైనా తామే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తామని చెప్పారు. -
వీసా పేరుతో కోట్లలో వసూళ్లు.. నందుస్ వరల్డ్ స్కాం వెనుక షాకింగ్ నిజాలు
-
చైనాకు చెక్.. AUKUS కూటమి భారీ వ్యూహం!
ప్రపంచ భద్రతా సమీకరణాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా సవాళ్లకు ఎదుర్కొనేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి అత్యాధునిక అండర్‌వాటర్ డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి శ్రీకారం చుట్టాయి. AUKUS రక్షణ కూటమి కింద చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సముద్ర గర్భంలో పనిచేసే మానవరహిత అత్యాధునిక అండర్‌వాటర్ డ్రోన్లను రూపొందించనున్నారు. ఇందులో భాగంగా తొలి దశ సామర్థ్యాలను 2027 నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రకటించారు.సింగపూర్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక షాంగ్రి-లా డైలాగ్ సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. AUKUS “పిల్లర్-2” కింద ప్రకటించిన తొలి ప్రధాన ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. కాగా, ఈ అండర్‌వాటర్ డ్రోన్లు కేవలం నిఘా కోసమే కాకుండా.. శత్రు జలాంతర్గాములను గుర్తించడం, సముద్ర గర్భంలోని మైన్లను నిర్వీర్యం చేయడం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సముద్ర యుద్ధ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. అవసరమైతే లక్ష్యాలపై దాడులు చేయగల సామర్థ్యాన్ని కూడా వీటికి కల్పించనున్నారు.2021లో ఏర్పడిన AUKUS కూటమి రెండు ప్రధాన భాగాలుగా పనిచేస్తోంది. “పిల్లర్-1” కింద ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే జలాంతర్గాముల సాంకేతికత అందిస్తుండగా, “పిల్లర్-2” కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్సోనిక్ ఆయుధాలు, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ టెక్నాలజీ, అండర్‌సీ వార్ఫేర్ వంటి అత్యాధునిక రక్షణ సాంకేతికతలను సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు.⚡️ US, UK and Australia ANNOUNCE UNDERWATER DRONES projectDeveloped under their military alliance known as AUKUS, technology is expected to be ready by next year pic.twitter.com/yW4pmf3RKc— RT (@RT_com) May 30, 2026ప్రస్తుతం ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో దాదాపు 95 శాతం సముద్ర గర్భంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే జరుగుతోంది. అలాగే అనేక దేశాల గ్యాస్, ఇంధన సరఫరా వ్యవస్థలు కూడా సముద్ర అడుగునే ఉన్నాయి. ఇటీవల బాల్టిక్ సముద్రం, తైవాన్ సముద్ర జలసంధి ప్రాంతాల్లో అండర్‌సీ కేబుళ్లు దెబ్బతిన్న ఘటనలు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో కీలక మౌలిక వసతుల రక్షణ కోసం అండర్‌వాటర్ డ్రోన్లను ఉపయోగించాలని AUKUS దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సముద్ర గర్భం ఇప్పుడు కొత్త యుద్ధ రంగంగా మారుతోందని, అక్కడి ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ టెక్నాలజీ కీలకమని వారు పేర్కొన్నారు.అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ ద్వారా డ్రోన్లలో ఉపయోగించే సెన్సర్లు, నావిగేషన్ వ్యవస్థలు, AI ఆధారిత నిర్ణయ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు వంటి కీలక టెక్నాలజీలను కూడా మూడు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. జీపీఎస్ అందుబాటులో లేని సముద్ర గర్భంలో కూడా స్వతంత్రంగా ప్రయాణించే సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ మొత్తం వ్యూహం వెనుక ప్రధాన కారణం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న నౌకాదళ శక్తి. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ పరిసర ప్రాంతాల్లో బీజింగ్ దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని మిత్రదేశాలు సముద్ర ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ఈ ప్రాజెక్ట్‌ను వేగవంతం చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం ఈ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, ఇది ప్రాంతీయ ఆయుధ పోటీని మరింత పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. -
బ్రిటన్‌లో ప్రవాస భారతీయల రికార్డు.. మేయర్లుగా తల్లీ తనయులు
లండన్: బ్రిటన్‌లో భారతీయ మూలాలున్న తల్లీ, తనయుడు మేయర్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్నారు. భారతీయ కుటుంబానికి చెందిన తల్లీకుమారులు ఇద్దరూ బ్రిటన్‌లో ఒకేసారి మేయర్లుగా ఎన్నిక కావడం విశేషం. వీరి కుటుంబం హర్యానాకు చెందినది.వివరాల ప్రకారం.. హర్యానాలోని రోహ్తక్ నుంచి పర్వీన్ రాణి కుటుంబం 2013లో బ్రిటన్‌కు వలస వెళ్లింది. పర్వీన్ రాణి కుమారుడు తుషార్ కుమార్ (23) లండన్‌లోని కింగ్స్ కళాశాలలో చదువుతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరులో పీజీ పూర్తి చేసుకోనున్నారు. అయితే, పర్వీన్ రాణి, తుషార్ కుమార్ ఎన్నికల్లో పోటీ చేశారు.ఈ క్రమంలో ఎల్స్ట్రీ అండ్ బోరమ్వుడ్ పట్టణ కౌన్సిల్‌కు తుషార్ మేయరుగా ఎన్నికయ్యారు. వారం రోజుల తర్వాత తుషార్ తల్లి పర్వీన్ రాణి హర్ట్స్‌మేర్ బరా కౌన్సిలుకు భారతీయ మూలాలున్న తొలి మేయరుగా ఎన్నికయ్యారు. ఇలా భారతీయ కుటుంబానికి చెందిన తల్లీకుమారులు ఇద్దరూ బ్రిటన్‌లో ఒకేసారి మేయర్లుగా ఎన్నిక కావడం విశేషం. ఇక, బ్రిటన్‌లో భారతీయ మూలాలున్న అతి తక్కువ వయసు గల మేయర్‌గా తుషార్ చరిత్ర సృష్టించారు. Historic moment in UK politics! For the first time an Indian origin mother and son have become Mayors in Britain. 23 years old Tushar Kumar created history by becoming the youngest Mayor of borehamwood town council, while his mother Praveen Rani was elected mayor of Hertsmere… pic.twitter.com/Z2de5J8z7x— Neeraj Ranjan (@NeerajRanjan84) May 25, 2026 -
లండన్ డ్రగ్స్ కేసు: భారత సంతతి వ్యక్తికి 10 ఏళ్ల శిక్ష!
లండన్‌లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తున్న ఒక అంతర్జాతీయ ముఠా గుట్టును మెట్రోపాలిటన్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలోని ఐదుగురు సభ్యులకు కలిపి లండన్‌లోని కింగ్స్టన్ క్రౌన్ కోర్టు మొత్తం 84 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. శిక్ష పడిన వారిలో బర్మింగ్‌హామ్‌కు చెందిన భారత సంతతి వ్యక్తి జగ్జీత్ సింగ్ (30) కూడా ఉన్నాడు. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ సరఫరా చేయడంలో జగ్జీత్ కీలక పాత్ర పోషించాడు. ఈ కేసులో జగ్జీత్ సింగ్‌కు 10 సంవత్సరాల 6 నెలల శిక్ష పడింది. జగ్జీత్ గత అక్టోబర్‌లోనే తన నేరాన్ని అంగీకరించాడు. ఇక మిగిలిన నలుగురు నిందితులకు వారి నేర తీవ్రతను బట్టి 14 నుండి 26 ఏళ్ల వరకు జైలు శిక్షలు పడ్డాయి. కాగా 300 కిలోల కొకైన్, 60 కిలోల హెరాయిన్ సీజన్ చేసినట్లు యూకే మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో విలువ సుమారు 8 మిలియన్ పౌండ్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 84 కోట్లు. వీరు ఐరోపా దేశాల నుండి బ్రిటన్‌కు డ్రగ్స్ తెచ్చి సరఫరా చేసేవారు. ఈ ముఠా డ్రగ్స్ రవాణా కోసం అత్యంత అధునాతనమైన సాంకేతికతను ఉపయోగించినట్లు ఈ కేసు దర్యాప్తు అధికారి ఒక తెలిపారు. -
మేయర్ పీఠంపై ఇండియన్.. ఎవరీ తుషార్ కుమార్?
లండన్: తూర్పు ఇంగ్లాండ్‌లో 23 ఏళ్ల తుషార్ కుమార్ మేయర్ ఎన్నికల్లో గెలిచి యునైటెడ్ కింగ్డమ్ (UK) చరిత్రలోనే మేయర్ పీఠాన్ని అధిరోహించి అత్యంత పిన్నవయస్కుడైన భారతీయునిగా చరిత్ర సృష్టించారు. కింగ్స్ కాలేజ్ లండన్ నుండి పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన తుషార్ కుమార్, గత వారం జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్' (Elstree and Borehamwood) టౌన్ కౌన్సిల్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు.రాజకీయ ప్రస్థానంలేబర్ పార్టీకి చెందిన ఈ కౌన్సిలర్ 2023లో 'ఎల్ స్ట్రీ అండ్ బోర్హామ్వుడ్' టౌన్ కౌన్సిల్లో చేరారు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన డిప్యూటీ మేయర్‌గా కూడా సేవలందించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తుషార్ కుమార్ మాట్లాడుతూ.. "23 ఏళ్ల వయసులో, యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ సంతతి మేయర్‌గా అధికారికంగా బాధ్యతలు చేపట్టడం నాకొక అద్భుతమైన గౌరవం" అని ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచిన స్థానిక ప్రజలకు, కౌన్సిలర్లకు, కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.మాజీ మేయర్ డాన్ ఓజారోవ్ అందించిన మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు తెలిపిన తుషార్.. కొత్త డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన కౌన్సిలర్ లిండా స్మిత్‌కు స్వాగతం పలికారు.లక్ష్యాలు లండన్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడే కౌన్సిలర్‌గా ఎన్నికైన తుషార్, నిజమైన మార్పు అనేది స్థానిక సంఘాల స్థాయి నుంచే మొదలవుతుందని, యువతను ప్రజా సేవ వైపు, సామాజిక జీవితం వైపు ప్రేరేపించడమే తన ప్రధాన లక్ష్యమని తుషార్ పేర్కొన్నారు. తన మేయర్ పదవీ కాలంలో స్థానికంగా ఉన్న పేద ప్రజలకు సహాయం చేసే 'WD6 ఫుడ్ సపోర్ట్' (WD6 Food Support) అనే స్వచ్ఛంద సంస్థకు ప్రధాన చారిటీగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టుతెలిపారు. తుషార్ కుమార్ తనలో ఆత్మవిశ్వాసాన్ని, పబ్లిక్ స్పీకింగ్ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి కింగ్స్ కాలేజ్ లండన్‌లోని 'సివిక్ లీడర్షిప్ అకాడమీ' ఎంతగానో సహాయపడిందని చెప్పారు. అలాగే విద్యార్థిగా ఉన్నప్పుడు 'యూనివర్శిటీ ఆఫీసర్స్ ట్రైనింగ్ కార్ప్స్' లో కూడా ఆయన అనుభవాన్ని గడించారు. గతంలో ఆయన బ్రిటన్ ప్రభుత్వ 'డిపార్ట్మెంట్ ఫర్ వర్క్ అండ్ పెన్షన్స్' (DWP) లో పాలసీ అడ్వైజర్‌గా, అలాగే ఒక జాతీయ LGBTQ చారిటీ సంస్థలో రీసెర్చ్ అనలిస్ట్‌గా పనిచేశారు. 'బుక్‌మార్క్ రీడింగ్ చారిటీ' ద్వారా అక్షరాస్యత కార్యక్రమాలకు కూడా ఆయన మద్దతు అందించారు. -
నమ్మలేని నిజం.. దేశాన్ని కాపాడిన బంగారం!
బంగారం అనేది భారతదేశంలో కేవలం విలువైన లోహం మాత్రమే కాదు,.. అది కుటుంబ గౌరవానికి ప్రతీక, భద్రతకు సంకేతం, కష్టకాలంలో ఆదుకునే నమ్మకమైన ఆస్తిగా పరిగణిస్తారు. అలాంటి బంగారాన్ని.. ప్రభుత్వం రహస్యంగా దేశం దాటించింది అంటే?.. ఎవరైనా నమ్ముతారా?, కానీ 1991లో ఇదే జరిగింది. ఇంతకీ మన దేశం బంగారాన్ని ఎందుకు తరలించాల్సి వచ్చింది?, ఎంత బంగారం పంపింది? అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.1991లో దేశం దివాలా తీసే ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారాన్ని బ్రిటన్‌కు తరలించింది. సుమారు 46,910 కేజీల బంగారాన్ని రహస్యంగా తరలించి.. బదులుగా 405 మిలియన్ డాలర్ల అత్యవసర రుణం సమీకరించింది. భారత ఆర్థిక చరిత్రలో అత్యంత కీలక మలుపుగా నిలిచిన ఈ సంఘటన, తరువాత దేశంలో ఆర్థిక సంస్కరణలకు మార్గం సుగమం చేసింది.రుణాలు ఇవ్వడానికి నిరాకరించిన విదేశీ బ్యాంకులు!1980ల చివరి దశ నుంచి 1990ల ప్రారంభం వరకు భారతదేశం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు స్వదేశానికి పంపే డబ్బు కూడా గణనీయంగా తగ్గిపోయింది.ఫలితంగా భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు వేగంగా క్షీణించి, 1991 మే నాటికి కేవలం ఒక వారం రోజుల దిగుమతులకు సరిపడే డాలర్లు మాత్రమే మిగిలాయి. ఈ పరిస్థితిని గమనించిన అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు భారత క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించేశాయి. దీంతో విదేశీ బ్యాంకులు భారత్‌కు కొత్త రుణాలు ఇవ్వడానికి నిరాకరించాయి. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభ అంచుకు చేరుకుంది.సాహసోపేతమైన నిర్ణయం!దేశం ఆర్ధిక సంక్షోభంలో చిక్కున్న సమయంలో.. అప్పటి తాత్కాలిక ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రభుత్వం, ఆర్బీఐ గవర్నర్ ఎస్. వెంకటరమణన్ నాయకత్వంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. దేశ ప్రతిష్ట కంటే ముందు ఆర్థికంగా దివాలా తీయకుండా ఉండటం అవసరమని భావించిన ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారు నిల్వలను తాకట్టు పెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను రెండు దశల్లో అమలు చేశారు.మొదటి దశలో.. 1991 మే నెలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 20 టన్నుల స్వాధీనం చేసిన బంగారాన్ని స్విట్జర్లాండ్‌లోని ఒక బ్యాంకులో తాకట్టు పెట్టి సుమారు 215 మిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్యాన్ని సమీకరించారు. అయినప్పటికీ పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో.. రెండో దశలో 1991 జూలైలో ఆర్బీఐ తన సొంత నిల్వల నుంచి 46.91 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు రహస్యంగా తరలించి అత్యవసర రుణాన్ని పొందింది.రహస్యంగా తరలింపు!1991 జూలై 4న బంగారం రవాణా విమానం ముంబైలోని శాంతాక్రూజ్ విమానాశ్రయం నుంచి రహస్యంగా బయలుదేరింది. ఆర్బీఐ భద్రగారాల నుంచి ప్రత్యేక భద్రత మధ్య భారీ ట్రక్కులలో బంగారాన్ని విమానాశ్రయానికి తరలించారు. ఈ ఆపరేషన్‌ను అత్యంత గోప్యంగా నిర్వహించేందుకు కస్టమ్స్ నిబంధనల్లో కూడా ప్రత్యేక మినహాయింపులు పొందారు.సాయుధ భద్రతా బలగాల పర్యవేక్షణలో బంగారాన్ని కార్గో విమానాల్లో ఎక్కించి విదేశాలకు పంపించారు. అయితే ఈ రహస్య ఆపరేషన్ ఎక్కువకాలం దాచిపెట్టలేకపోయారు. 1991 జూలై 8న ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో జర్నలిస్ట్ శంకర్ అయ్యర్ ఈ వార్తను ప్రధాన శీర్షికగా ప్రచురించడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేగింది. భారతదేశం తన బంగారాన్ని విదేశాలకు పంపాల్సిన పరిస్థితి వచ్చిందన్న విషయం ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆ నిర్ణయం.. ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ!ఆ సమయంలో దేశాన్ని ఆర్థిక పతనం నుంచి కాపాడిన ఈ కఠిన నిర్ణయం, తరువాత భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు పునాది వేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన పి.వి. నరసింహారావు ప్రభుత్వం, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేస్తూ చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణలను అమలు చేసింది. విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇవ్వడం, మార్కెట్ ఆధారిత విధానాలను ప్రవేశపెట్టడం వంటి చర్యలతో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ లభించింది.బంగారాన్ని విదేశాలకు పంపాల్సి రావడం అప్పట్లో చాలామందికి అవమానంగా అనిపించినప్పటికీ, ఆ నిర్ణయం తీసుకోకపోతే భారత్ అంతర్జాతీయ అప్పులు చెల్లించలేని పరిస్థితికి చేరుకునేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆ రోజున చేపట్టిన ఆ రహస్య గోల్డ్ ఆపరేషన్నే.. నేటి భారత ఆర్థిక పురోగతికి కీలక మలుపు అని చెబుతున్నారు.మోదీ పిలుపు1991లో గల్ఫ్ యుద్ధం కారణంగా భారతదేశం తీవ్రమైన విదేశీ మారకద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లే, ప్రస్తుతం 2026లో మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు మళ్లీ చమురు ధరలను పెంచుతూ భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెంచుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ సుమారు 72 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకోవడం విదేశీ మారకద్రవ్యంపై మరింత భారం మోపుతోంది.ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రజలను ఉద్దేశించి అనవసరంగా బంగారం కొనుగోలు చేయవద్దని, ఇంధన వినియోగంలో పొదుపు పాటించాలని పిలుపునిచ్చారు. కాబట్టి దేశ పౌరులు కూడా.. 1991 నాటి సంఘటన గుర్తు చేసుకుంటూ, నేటి తరం ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరిస్తేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: డబ్బును ఎలా కాపాడుకోవాలి?: కియోసాకి సలహా -
డిగ్రీ కోసం రూ.కోటి.. 500 ఉద్యోగాలకు అప్లై చేసినా జాబ్ రాలేదు!
బ్రిటన్‌లో యువ ఉద్యోగార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు ఎలా ఉంటాయనే విషయాన్ని 21 ఏళ్ల గ్రాడ్యుయేట్ ఖాలెద్ షరీఫ్ వెల్లడించారు. లండన్ శివార్లలోని కింగ్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి డిజిటల్ మీడియా టెక్నాలజీలో డిస్టింక్షన్‌తో పట్టభద్రుడైనప్పటికీ, అతనికి ఉద్యోగం దొరకలేదు.ఖాలెద్ షరీఫ్ సుమారు 500 ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఒక్కటి కూడా సాధించలేకపోవడం అతని నిరాశను పెంచింది. 100,000 పౌండ్లకు (రూ. కోటి కంటే ఎక్కువ) పైగా ఖర్చు పెట్టి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా అవకాశాలు లభించకపోవడం.. వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందనే భావన కలిగించింది.ఈజిప్టులో జన్మించి, ఖతార్‌లో పెరిగి, 18 ఏళ్ల వయసులో లండన్‌కు వెళ్లిన షరీఫ్, బ్రిటిష్ రాజధాని తనకు వృత్తిపరంగా అవకాశాలను కల్పిస్తుందని ఆశించాడు. కానీ అతని ఆశలు ఫలించలేదు. కోవిడ్19 ప్రభావం, కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి కూడా ఉద్యోగ అవకాశాల తగ్గుదలకు కారణమని అతను అభిప్రాయపడ్డాడు.కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తూ కొత్త ఉద్యోగులను నియమించడాన్ని తగ్గిస్తున్నాయి. అయినప్పటికీ, సాధారణ ఉద్యోగం చేసుకోవడం కంటే తన చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని అతను కోరుకుంటున్నాడు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఖాలెద్ వెనుకడుగు వేయలేదు. ఫ్రీలాన్స్ వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తూ తన సృజనాత్మకతను కొనసాగిస్తున్నాడు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''అంతే కాకుండా.. ''జోక్'' అనే దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించి, తన ఆసక్తులను వ్యాపారంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతని అనుభవం ప్రకారం.. యూనివర్సిటీలో నేర్చుకున్నదానికంటే.. స్వయంగా నేర్చుకున్న నైపుణ్యాలే వృత్తిలో ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. -
2009 తర్వాత పుట్టిన వారికి.. బ్రిటన్ షాక్!
లండన్: బ్రిటన్ (యూకే) ప్రభుత్వం అత్యంత సాహసోపేతమైన, సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ తరాలను ‘పొగాకు రహితంగా’మార్చే చారిత్రక బిల్లుకు యూకే పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. జనవరి 1, 2009 తర్వాత జన్మించిన ఎవరైనా సరే.. తమ జీవితకాలంలో ఇకపై చట్టబద్ధంగా సిగరెట్ కొనుగోలు చేయడానికి వీల్లేకుండా ఈ కఠినమైన చట్టాన్ని అధికారికంగా తీసుకొచ్చింది.కఠినంగా కొత్త చట్టం‘టొబాకో అండ్ వేప్స్ బిల్లు’ పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.. ప్రస్తుతం 17 ఏళ్ల వయసులో ఉన్న యువతను, ఆ తర్వాత పుట్టిన వారిని ధూమపానానికి శాశ్వతంగా దూరం చేయడమే. ఈ నిర్ణయం దేశ ఆరోగ్య రంగంలో ఒక సువర్ణాధ్యాయం అని ఆరోగ్య మంత్రి వెస్ స్ట్రీటింగ్ అభివర్ణించారు. భవిష్యత్ తరాలను ప్రాణాంతక వ్యసనాల నుంచి రక్షించడానికి, దేశంలో మొట్టమొదటి పొగరహిత తరాన్ని సృష్టించడానికి ఈ చట్టం ఒక కవచంలా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.వేపింగ్పైనా ఉక్కుపాదంకేవలం సిగరెట్ల పైనే కాకుండా, ఈ-సిగరెట్లు (వేపింగ్) పట్ల కూడా బ్రిటన్ సర్కార్ కఠిన ఆంక్షలు విధించింది. కొత్త చట్టం అమలులోకి రాగానే పాఠశాలలు, ఆస్పత్రుల వెలుపల, చిన్నపిల్లల పార్కుల్లో ధూమపానాన్ని పూర్తిగా నిషేధించనున్నారు. అలాగే పిల్లలను ఆకర్షించే రంగురంగుల డిజైన్లు, ఫ్లేవర్లతో కూడిన వేపింగ్ ఉత్పత్తుల ప్యాకేజింగ్, అమ్మకాలను కట్టడి చేయనున్నారు. యువతను ఆకర్షించే డిస్పోజబుల్ వేప్స్ అమ్మకాలను గత ఏడాది జూన్‌లోనే నిషేధించిన ప్రభుత్వం, ఇప్పుడు పబ్లిక్ ప్రదేశాల్లో కూడా వాటిపై ఆంక్షలు కఠినతరం చేసింది.ఏటా 75 వేల మరణాలుఇంగ్లండ్లో ఏటా దాదాపు 75,000 మంది కేవలం ధూమపానం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని, మొత్తం మరణాల్లో ఇది పావు శాతం అని జాతీయ ఆరోగ్య సేవ (ఎన్హెచ్ఎస్) గణాంకాలు చెబుతున్నాయి. దీనిని అరికట్టేందుకే ప్రభుత్వం ఈ అడుగు వేసింది. కాగా, 2022లో న్యూజిలాండ్, గత ఏడాది నవంబర్‌లో మాల్దీవులు సైతం ఇలాంటి తరహా చట్టాలనే తీసుకొచ్చాయి. యువతలో సిగరెట్ అలవాటును సమూలంగా నిర్మూలించే దిశగా యూకే పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
లండన్ వ్లాగర్ మదిని దోచిన వంటకం..! అత్యంత ఆరోగ్యకరం కూడా..
లండన్‌కు చెందిన ఫుడ్ వ్లాగర్ బెంగళూరులో ఉండగా మన వంటకాలు నేర్చుకోవడమే గాక తయారు చేసి చూపించి ఔరా..! అనిపించుకున్నాడు. పైగా మన వంటకాల రుచులను మెచ్చకుంటూ వాటి గుణగణాల గురించి చెప్పేస్తున్నాడు కడా. మరి ఎవరా వ్లాగర్?, అతడి మనసుని దోచిన వంటకం ఏంటి?..అంటే..యూకేకు చెందని వ్లాగర్ జూలియస్ ఫ్లీడర్ బెంగళూరులో వంటకం నేర్చుకున్న తర్వాత ఇంట్లో వంటకాన్ని తయారు చేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆవికి మీద వండే ఆ వంటకం వివిధ పప్పుల మిశ్రమాలను కలపడం, నానబెట్టడం దగ్గర నుంచి రుబ్బి పులిబయెట్టడం వరకు వివిద ప్రక్రియలను పంచుకున్నారు. కొన్ని ఆహారాలు మన మనసుని తాకుతాయి. వాటి రుచి నాలుకపై అలా నిలిచిపోతుంది. మెత్తగా దూదిలా ఉండే ఆ బ్రేక్‌ఫాస్ట్ ఎప్పటికీ విసుగు చెందని ఆహారం. వేడి వేడి సాంబార్ లేదా చట్నీతో తింటే అబ్బా ప్రాణం లేచవచ్చినట్లుగా అనిపిస్తుంది, సంతృప్తిగా అనిపిస్తుంది.జూలియస్ ఫీడ్లర్ బియ్యం, మిన పప్పుల పిండిని పులియబెట్టడంతో తన వంట ప్రక్రియను ప్రారంభించారు. సరైన మెత్తదనం కోసం ఈ రెండు పదార్థాలను విడివిడిగా కొన్ని గంటల పాటు నానబెట్టాలని ఆయన సూచించారు. ఆ తర్వాత, నానబెట్టిన నీటిలో కొంత భాగాన్ని బియ్యంతో కలిపి గరుకైన పిండిలా రుబ్బుకోవాలి, అదే సమయంలో మినప పప్పును నీటిలో తేలేంత మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం, అతను ఆ పిండిని కలిపి చేతితో కలపడం ద్వారా పులియబెట్టే ప్రక్రియను ప్రారంభించారు.ఆ వంట నిపుణుడు పిండి పరిమాణం పెరిగి, బుడగలు వచ్చినట్లు పులిసేంత వరకు ఉంచి, చివరగా చిటికెడు ఉప్పు చల్లారు. ఇడ్లీలకు సరైన అండాకారపు ఆకారం రావడానికి, సాంప్రదాయక ఇడ్లీ మేకర్లో వేసి, మరుగుతున్న నీటిపై ఆవిరి మీద ఉడికించి, అవి చక్కగా ఉబ్బేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేశారు. ఇడ్లీ వద్దనుకుంటే మీడియం మంటపై పెనం పెట్టుకుని ఊతప్పంలా కూడా వేసుకోవచ్చని చెప్పారు. .పులియబెట్టడం వల్ల కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమై, ఆరోగ్యకరమైన అమైనో ఆమ్లాలు పెరుగుతాయి. ఆ వీడియో చివరలో, ఆ ఇన్ఫ్లుయెన్సర్ వేడి వేడి ఇడ్లీలను సాంప్రదాయ అరటి ఆకులో అమర్చి, వాటితో పాటు చల్లని కొబ్బరి చట్నీతో జతచేశారు. వాటిని చూస్తే కచ్చితంగా నోరూరుతుంది. మన లండన్ వ్లాగర జూలియస్ మాత్రం ఆ అల్పాహారానికి అద్భుతం అని కితాబిచ్చాడు. View this post on Instagram A post shared by Julius Fiedler (@hermann) (చదవండి: దివ్యాంగుడైన తండ్రిని భుజాలపై మోస్తూ..! కన్నీళ్లు తెప్పించే దృశ్యం) -
హార్మూజ్ టెన్షన్.. 40 దేశాలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి..
పారిస్: పశ్చిమాసియాలో యుద్ధం, హార్మూజ్ జలసంధి దిగ్బంధం కొనసాగుతుండడంతో ప్రపంచ దేశాలకు సమస్యలు ఎదురవుతున్నాయి. హార్మూజ్ జలసంధిలో స్వేచ్ఛగా నౌకాయానం చేసుకునే పరిస్థితులు తీసుకురావడానికి ఏకంగా 40 దేశాలు ఏకం కావడానికి ఓ వీడియో కాన్ఫరెన్స్ జరగనుంది.హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణే లక్ష్యంగా 40కి పైగా దేశాలను ఒకే చోటుకు తీసుకురావడానికి యూకే, ఫ్రాన్స్ సంకల్పించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ ఈ వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం (ఏప్రిల్ 17న) జరుగుతుందని తెలిపారు. యుద్ధంలో పాల్గొనని దేశాలు దీనికి హాజరవుతాయని పేర్కొన్నారు. ప్రపంచానికి కీలకమైన హార్మూజ్ జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణే లక్ష్యంగా తీసుకునే చర్యలకు సహకరిస్తాయని ఆయన చెప్పారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఇటీవల మాట్లాడుతూ.. ఘర్షణ ముగిసిన తరువాత హార్మూజ్ జలసంధి ద్వారా సురక్షిత రవాణా జరిగేలా చేసేందుకు సమన్వయంగా పాటించాల్సిన ప్రణాళికపై చర్చించేందుకు 40కి పైగా దేశాలతో సమావేశం జరుపుతామని తెలిపారు.“హార్మూజ్ జలసంధి మూసివేత తీవ్ర ప్రభావం చూపుతోంది. ఖర్చుల ఒత్తిడిని తగ్గించడానికి గ్లోబల్ షిప్పింగ్ తిరిగి ప్రారంభం కావడం కీలకం. నావిగేషన్ స్వేచ్ఛ పునరుద్ధరణ లక్ష్యంతో 40 కంటే ఎక్కువ దేశాలతో యూకే సంప్రదింపులు జరుపుతోంది. ఈ వారం యూకే, ఫ్రాన్స్ కలిసి అంతర్జాతీయ షిప్పింగ్ రక్షణకు సమన్వయ, స్వతంత్ర, బహుళజాతీయ ప్రణాళికపై సమావేశం నిర్వహిస్తాయి” అని కీర్ స్టార్మర్ ఎక్స్‌లో తెలిపారు.మంగళవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ మాట్లాడుతూ... యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు చర్చలను పునఃప్రారంభించాలి, అపోహలను తొలగించాలి, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చూడాలని కోరారు. అన్ని పక్షాలు కాల్పుల విరమణను గౌరవించాలని చెప్పారు.“హార్మూజ్ జలసంధిని వీలైనంత త్వరగా మళ్లీ తెరవడం చాలా ముఖ్యం. ఎటువంటి నియంత్రణలు, టోల్లు ఉండకూడదు. ప్రధాన భాగస్వాముల మద్దతుతో చర్చలు త్వరగా పునఃప్రారంభం కావాలి” అని ఎమ్మాన్యుయేల్ అన్నారు.కాగా, పాకిస్థాన్‌లో ఇటీవల 21 గంటల పాటు జరిగిన చర్చల తర్వాత కూడా అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదరలేదన్న విషయం తెలిసిందే. ఫ్రాన్స్-యూకే ప్రతిపాదన ఇస్లామాబాద్ చర్చల అడ్డంకిని ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కావడంతో పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం కనిపిస్తోంది.పాక్‌లో మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం (ఏప్రిల్ 14) ప్రకటించారు. రెండు రోజుల్లో చర్చలు జరగనున్నాయని, ఇవి కూడా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగానే ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. -
గొప్ప డాక్టర్ని అవ్వాలనుకున్నా..కానీ ఆ ఒక్క రీజన్..!
విదేశాల్లో ఉద్యోగం అనేది చాలామంది యువత డ్రీమ్. మా అబ్బాయి ఫారెన్‌లో ఫలానా ఉద్యోగం చేసుకుంటున్నాడు అని తల్లిదండ్రులు కూడా తమ బంధువులకు, మిత్రులకు గర్వంగా చెప్పుకుంటుంటారు. కానీ వాస్తవ జీతంలో అదేమంత సౌఖ్యంగా ఉండదు పైగా అక్కడ నుంచి ఎలా బయటపడాలి, తిరిగి సొంతగూటికి వచ్చేస్తే పరిస్థితి ఏంటి అన్న భయం ఓ రేంజ్లో వెంటాడతాయి. చాలామంది అక్కడ కొత్త లైఫ్‌స్టైల్‌కి అడ్జెస్ట్ కాలేక మరోపక్క తమవాళ్లను వదిలేసి వచ్చేశామన్న బెంగ కుదురుగా ఒక చోట నిలవనివ్వక..తిరిగి సొంత గడ్డకి పయనమయ్యేలా చేస్తాయి. ఇక్కడ కూడా ఈ ఫిజియోథెరపిస్టూ అలానే భారత్‌కి గోడకు కొట్టి బంతిలా తిరిగొచ్చేశాడు. తాను ఎందుకలో వచ్చేశాడో చెబుతుంటే..అమ్మో విదేశాలకా అని అనిపిస్తుంది. అసలేం జరిగిందంటే. ఫిజియోథెరపిస్ట్ మానవ్ షా తానెలా విదేశీ ఉద్యోగం అనే డ్రీమ్‌ని మధ్యలో వదిలేసి భారత్‌కి వచ్చాశాడో సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించాడు. ఆ పోస్ట్‌లో మానవ్ షా..తన మంచి ఉద్యోగంతో చక్కటి లైఫ్‌ని లీడ్ చేస్తున్న టైంలోనే ఇంటికి తిరిగి వచ్చేశానని చెప్పుకొచ్చాడు. ఏకంగా ఏడాదికి రూ. 40 లక్షల జీతంతో మంచి లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నట్లు చెప్పాడు. అంతేగాదు, మంచి ఆర్థిక భద్రతతో లైఫ్ బిందాస్‌గా ఉందని చెప్పుకొచ్చాడు. కానీ అవేమి అతడి ఒంటరితనాన్ని దూరం చేయలేకపోయాయని అంటున్నాడు. తాను నేషనల్ హెల్త్ సర్వీస్‌లో పనిచేస్తుండేవాడినని తెలిపాడు. అయితే అక్కడ ఉదయం 9 టు 5 ఉద్యోగ సంస్కృతికి బంధీ అయిపోతున్న ఫీలింగ్ వచ్చేదట. వ్యక్తిగత ఎదుగుదల ఏం లేకుండా..స్వేచ్ఛలేని జీవితాన్ని గడుపుతున్నట్లుగా ఉండేదట. సింపుల్‌గా చెప్పాలంటే అదొక జైలులా అనిపించేదట. పోనీ అక్కడ నుంచి వచ్చేద్దామంటే..అప్పటికే చక్కగా సెటిల్ అయిన లైఫ్, స్నేహితులు, ఆ సౌకర్యాలను వదిలేయాలంటే విపరీతమైన భయం, అనుమానాలు, సందేహాలతో చాలా రోజుల పాటు సతమతమయ్యానని చెప్పుకొచ్చాడు. తాను తన ఇంటికి దూరంగా ఉండటంతో విపరీతమైన ఒంటరితనంతో బాధపడేవాడినని, కొన్ని గొప్ప క్షణాలను కోల్పోతున్న ఫీలింగ్ వచ్చేదని అన్నాడు. వాటన్నింటిని ఏ జీతం భర్తీ చేయలేదని తెలుసుకుని తక్షణమే తన సొంత గూటికి వచ్చేశానని అన్నాడు. అలాగే ఇక్కడ విదేశంలో సంపాదించినంత కాకపోయినా..తన వాళ్లతో హాయిగా గడపగలనన్నా ఆ ఆలోచనే సంతోషంలో ముంచెత్తుందని చెబుతున్నాడు. అలాగే తక్కువ జీతమే అయినా..చక్కగా పొదుపు చేయగలను, నాణ్యమైన ఆరోగ్యాన్ని అందివ్వగలనని అన్నాడు. అన్నింటికంటే సంతృప్తిగా, మనశ్శాంతిగా బతకుతానని చెబుతున్నాడు. నెటిజన్లు కూడా అతడి నిర్ణయానికి మద్దతిస్తూ..వెస్ట్రన్ డ్రీమ్ లేదా విదేశీ ఉద్యోగం అనే కల దూరపు కొండలు నునుపు అన్నట్లు ఉంటుందే తప్ప..ఎన్నో ఆనందాల క్షణాలను కోల్పోతాం. ఏకాకిగా ఓ యంత్రంలా బతుకుతున్నట్లుగా జీవితంపై విరక్తి వచ్చేస్తుందంటూ పోస్టులు పెట్టారు. కొందరు తాము కూడా అలానే విదేశం నుంచి సొంత గూటికి వచ్చేసినట్లు చెప్పడం విశేషం. View this post on Instagram A post shared by Manav Shah (@physiomanav) (చదవండి: సామాజిక బాధ్యత అంటే ఇదే..! రెప్పపాటులో ఆ పాప..) -
4 రోజులే పని.. నచ్చినప్పుడే చేయొచ్చు..
కార్పొరేట్ ప్రపంచంలో 'హస్టిల్ కల్చర్' (నిరంతరం కష్టపడటం) పేరుతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వేళ, యూకేకి చెందిన ఒక పారిశ్రామికవేత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పని గంటల సంఖ్య కంటే, ఇచ్చే 'ఫలితాల'కే (Results-Only) ప్రాధాన్యతనిస్తూ తన సంస్థలో సరికొత్త పని వాతావరణాన్ని సృష్టించారు.ఒక్క మెసేజ్‌తో మొదలైన చర్చ'స్పైసీ మార్గరిటా' అనే ఎస్ఈఓ (SEO) కన్సల్టెన్సీ వ్యవస్థాపకుడు బెన్ గూడీ, ఇటీవల తన లింక్డ్ఇన్ పోస్ట్‌లో ఒక ఆసక్తికరమైన సంభాషణను పంచుకున్నారు. తన బృందంలోని ఒక సభ్యుడు, "ఈ రోజు నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఈ పనిని వారాంతంలో పూర్తి చేయనా?" అని అడగడానికి ఇబ్బంది పడటం చూసి బెన్ ఆశ్చర్యపోయారు."నా సంస్థలో ఎవరినైనా అనుమతి అడగాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినప్పుడు, నచ్చిన చోట పని చేసుకోవచ్చు. పని పూర్తవుతుందా లేదా అన్నదే ముఖ్యం" అని బెన్ స్పష్టం చేశారు.బర్న్ అవుట్ నేర్పిన పాఠంతానూ గతంలో సాధారణ ఉద్యోగిగా ఉన్నప్పుడు తీవ్రమైన 'బర్న్ అవుట్' (మానసిక, శారీరక అలసట) అనుభవించానని బెన్ గుర్తు చేసుకున్నారు. కేవలం పై అధికారులను మెప్పించడానికి, ఆఫీసులో ఎక్కువ గంటలు గడపడానికి ప్రయత్నించి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన సొంత కంపెనీలో అలాంటి పరిస్థితులు ఉండకూడదని నిర్ణయించుకున్నారు.బెన్ గూడీ కంపెనీలో ప్రత్యేకతలువారానికి 4 రోజుల పని: రీఛార్జ్ అవ్వడానికి తగినంత సమయం.వర్క్ ఫ్రమ్ ఎనీవేర్: ప్రపంచంలో ఎక్కడి నుండైనా పని చేసే వెసులుబాటు.నిర్ణీత గంటలు లేవు: ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు కూర్చోవాలనే నిబంధన లేదు.అనవసర సమావేశాలకు స్వస్తి: సమయాన్ని వృధా చేసే మీటింగ్స్‌ను దాటవేసే స్వేచ్ఛ.సోషల్ మీడియాలో ప్రశంసల జల్లుబెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. "చాలా ఆఫీసుల్లో డెస్క్ దగ్గర ఎన్ని గంటలు కూర్చున్నారనే లెక్కిస్తారు కానీ, ఎంత పని చేశారనేది చూడరు. మీ ఆలోచన చాలా బాగుంది" అని ఒకరు వ్యాఖ్యానించగా.. "అనుమతి అడగడానికి ఉద్యోగులు భయపడుతున్నారంటే, అది పాత కార్పొరేట్ వ్యవస్థలు వారికి నేర్పిన భయం. దాన్ని పోగొట్టడానికి సమయం పడుతుంది" అని మరొకరు అభిప్రాయపడ్డారు.బెన్ గూడీ నేపథ్యంలండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ గ్రాడ్యుయేట్ అయిన బెన్ గూడీ, వివిధ రంగాల్లో అనుభవం గడించిన తర్వాత 2024లో 'స్పైసీ మార్గరిటా'ను స్థాపించారు. ప్రస్తుతం ఆయన తన సంస్థలో స్ట్రాటజీ లీడ్‌గా ఉంటూనే, ఉద్యోగుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు. -
ఆంటీ అనకూడదు
లండన్: తనను ఆంటీ అని పిలవడం సుతరామూ ఇష్టంలేదని ఎన్నోసార్లు చెప్పినా పదేపదే అదే పదంతో పిలిచి ఇబ్బంది పెట్టిందంటూ ఘనామూలాలున్న నర్సుపై పెట్టిన పరువునష్టం దావాలో భారతీయమూలా లున్న మహిళ బ్రిటన్ కోర్టులో విజయం సాధించింది. ‘‘61 ఏళ్ల ఇల్డా ఎస్టీవ్స్ మనో భావాలు దెబ్బతిన్నాయి. పరువునష్టం కింద 1,425.15 బ్రిటన్ పౌండ్ల(దాదాపు రూ.1,76,700)ను ఆమెకు వెస్ట్ లండన్ నేషనల్ హెల్త్ సర్వీస్ విభాగం తక్షణం చెల్లించాలి’’ అని యాజమాన్యాలు, ఉద్యోగుల మధ్య కేసులను విచారించే వాట్ఫోర్డ్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ న్యాయమూర్తి జార్జ్ ఎలియోట్ తీర్పు చెప్పారు. ఈ కేసు వాదోపవాదనలు గత ఏడాది పూర్తికాగా గత నెలలో వివరణాత్మక తీర్పును వెలువర్చిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. స్వదేశంలో వయోధికులను గౌరవసూచకంగా ఆంటీ అని పిలవడం ఆనవాయితీగా వస్తోందని ఘనా దేశస్తురాలైన ఛార్లెస్ ఒపోంగ్ అనే మహిళా నర్సు చేసిన వాదనలను ముగ్గురు సభ్యుల ధర్మాసనం తోసిపుచ్చింది. ‘‘ఇల్డా ఎస్టీవ్స్ వయసు 61 ఏళ్లు. అయినాసరే ఆమెకు ఆంటీ అని పిలవడం ఇష్టంలేదు. ఆ విషయం ఆమె నీకు చాలా సార్లు చెప్పింది. పేరుతోనే పిలవాలని సూచించింది. అయినా నువ్వు పదేపదే పనిగట్టుకుని ఆంటీ అని పిలిచావు. తన డ్యూటీ సమయం అయిపోయాక నీకు బాధ్యతలు అప్పగించేటప్పుడు, కారిడార్లలో అదేపనిగా ఆంటీ ఆంటీ అని పిలిచావు. అది ఇల్డాకు ఏమాత్రం నచ్చలేదు. నీ మాటలు ఆమెను గాయపరిచాయి. పనివాతావరణాన్ని నువ్వు కాస్తంత పాడుచేశావు’’ అని ధర్మాసనం ఛార్లెస్ ఒపోంగ్ను మందలించింది. ఈమె ప్రవర్తనకు ఎన్హెచ్ఎస్దే పరోక్ష బాధ్యత. అందుకే ఈ పరువునష్టం చెల్లింపును ఎన్హెచ్ఎస్ చెల్లించాల్సిందే’’ అని కోర్టు చెప్పింది. అయితే జాత్యహంకారం, ఉద్దేశపూర్వకంగా వేతనంలో కోత వంటి ఆరోపణలను మాత్రం కోర్టు కొట్టేసింది. -
భారీగా తగ్గనున్న ల్యాండ్ రోవర్ ధరలు!
ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) తరువాత.. దేశంలో తమ కార్ల ధరలను తగ్గించే తొలి తయారీదారులలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఒకటిగా నిలుస్తోంది. ఒప్పందం ప్రకారం.. మొదటి సంవత్సరంలో యూకే నుంచి దిగుమతి అయ్యే పూర్తిస్థాయి యూనిట్లపై దిగుమతి సుంకాలను 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గించడంతో.. భారతదేశంలోని రేంజ్ రోవర్ SV మోడళ్ల ధరలు తగ్గుతాయి.ప్రస్తుతం రూ. 2.75 కోట్లుగా ఉన్న రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీ ఎడిషన్ ధర.. ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తరువాత రూ. 40 లక్షల తగ్గింపుతో రూ. 2.35 కోట్లకు చేరవచ్చు. రూ. 4.25 కోట్ల ధర కలిగిన రేంజ్ రోవర్ 4.4-లీటర్ పెట్రోల్ ఎస్వి ధర సుమారు రూ. 3.19 కోట్లకు తగ్గవచ్చు.కేవలం యూకే నుంచి దిగుమతి చేసుకున్న ఎస్వీ మోడళ్లు ధరలు మాత్రమే తగ్గుతాయి. ఎందుకంటే రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్, వెలార్, డిస్కవరీ స్పోర్ట్ వంటి జనాదరణ పొందిన వేరియంట్లు పూణేలో స్థానికంగా అసెంబుల్ అవుతున్నాయి. దీనివల్ల వాటిపై ఇప్పటికే తక్కువ సుంకాలు ఉంటాయి. కాబట్టి వీటి ధరలు తగ్గే అవకాశం లేదు. -
ట్రంప్‌నకు మరోసారి బ్రిటన్ ప్రధాని షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరోసారి బ్రిటన్ ప్రధాని స్టార్మర్ షాక్ ఇచ్చారు. ఎంత ఒత్తిడి చేసినా యుద్ధంలో పాల్గొనే ప్రసక్తేలేదని తేల్చిపారేశారు. తమకు బ్రిటన్ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్న స్టార్మర్.. పశ్చిమాసియా యుద్ధంతో మాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో బ్రిటన్ పూర్తిగా పక్కకు తప్పుకోవడం లేదని కూడా ఆయన సంకేతాలిస్తూ.. హర్మూజ్ సంక్షోభాన్ని నివారించడానికి కావాలంటే మధ్యవర్తిత్వం వహిస్తామని బ్రిటన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే లక్ష్యంతో విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్ నేతృత్వంలో 35 దేశాలతో సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇజ్రాయెల్-అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకుంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ రవాణా మార్గానికి ఆటంకం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయని స్టార్మర్ అన్నారు.‘‘నేను ప్రజలతో నిజాయితీగా ఉండాలి, ఇది అంత సులభం కాదని చెబుతూ.. యుద్ధం కారణంగా బ్రిటన్ ప్రజల దైనందిన జీవితంపై పడే ప్రభావాన్ని ఆయన అంగీకరించారు. ఈ సంక్షోభ సమయంలో యూరోపియన్ మిత్రదేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం కేవలం దౌత్యం మాత్రమే కాదని.. అది బ్రిటన్ జాతీయ ప్రయోజనాలకు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు, ఇరాన్‌పై యుద్ధంలో తమతో కలిసి రావడం లేదంటూ నాటో భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ‘మీకు కావాల్సిన చమురును మీరే సమకూర్చుకోండి’ అంటూ సోషల్ మీడియా పోస్టులో వాటిపై ఆక్రోశం వెళ్లగక్కారు. ‘‘మీకోసం మీరు ఎలా పోరాడాలో నేర్చుకోండి. అమెరికా మీకిక ఏ మాత్రమూ సాయం చేయబోదు. మీరూ మాకు సాయానికి రాలేదు కదా! చమురు కావాలంటే మీకు రెండే మార్గాలున్నాయి...మా దగ్గర పుష్కలంగా ఉన్న నిల్వల నుంచి కొనుక్కోవడం. లేదంటే సాహసం చేసి హార్మూజ్ వద్ద ఇరుక్కున్న మీ చమురు నౌకలను విడిపించుకోవడం’’ అంటూ బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు సలహా ఇచ్చారు! ముఖ్యంగా అమెరికా యుద్ధ విమానాలను తన గగనతలం గుండా వెళ్లేందుకు ఫ్రాన్స్ అనుమతించలేదంటూ మండిపడ్డారు. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. -
అమెరికాకు బలం తోడైంది?..ఇరాన్‌పై దాడికి సిద్ధమైన మరో దేశం!
టెహ్రాన్: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్‌కు బలం తోడైంది. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్‌ను కట్టడి చేసేందుకు ఇతర దేశాలు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపుకు యూకే కదిలి వచ్చింది. ప్రమాదకరమైన ఆయుధ సంపత్తితో యూకే యుద్ధనౌక హర్మూజ్ జలసంధిలో వాలిపోయింది. ఈ క్రమంలో న్యూక్లియర్ పవర్డ్ బ్రిటిష్ సబ్‌మెరైన్ ‘హెచ్ఎంఎస్ ఆన్సన్’హర్మూజ్ జలసంధి వద్దకు చేరుకున్నట్లు సమాచారం. ఇది ఉత్తర అరేబియన్ సముద్రంలో మోహరించినట్లు తెలుస్తోంది. ఇందులో తోమహాక్ క్షిపణులు, భారీ టోర్పిడోలు, శక్తివంతమైన ఆయుధ సంపత్తి ఉంది. ఇరాన్‌పై సైనిక చర్యలను తీవ్రతరం చేస్తామని అమెరికా హెచ్చరిస్తున్న తరుణంలో యూకే సబ్ మెరైన్ హర్మూజ్ జలసంధిలో మోహరించడం విశేషం. తాజా పరిణామంతో ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న అమెరికా-ఇజ్రాయెల్‌కు మరింత బలం చేకూరినట్లువుతుంది. ఈ నౌక మార్చి 6న ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం నుండి బయల్దేరిన యూకే సబ్‌మెరైన హర్మూజ్ జలసంధికి సమీపంలో ఉత్తర అరేబియా సముద్రంలో ఒక వ్యూహాత్మక స్థానంలో ఉండదనుందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అధునాతన ఆయుధాలతో కూడిన హెచ్ఎంఎస్ ఆన్సన్ నౌకలో 1,600 కిలోమీటర్ల పరిధి గల ‘టోమాహాక్ బ్లాక్ ఐవీ భూతల దాడి క్షిపణులు’, స్పియర్ఫిష్ హెవీవెయిట్ టార్పెడోలు’ అమర్చబడి ఉన్నాయి. హర్మూజ్ జలసంధి వద్ద పహారా కాస్తున్న ఇరాన్ యుద్ధనౌకలు దాడికి తెగబడితే.. వాటిని అరికట్టేందుకు ఇరాన్ మోహరించిన క్షిపణి స్థావరాలపై శక్తివంతమైన దాడులు చేసేందుకు వీలు కలగనున్నాయి. సీఎన్ఎన్ ప్రకారం.. హర్మూజ్ జలసంధిలోని నౌకలపై జరిగే దాడులతో సంబంధం ఉన్న ఇరాన్ క్షిపణి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి ఈ యూకే సబ్‌మెరైన్ ఉపయోగపడనుంది. ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా-ఇజ్రాయెల్‌కు మిత్రదేశాలు బలం చేకూరుస్తున్నాయి. యూకే, ఫ్రాన్స్, జర్మనీతో పాటు మరో ఆరు దేశాలు హర్మూజ్ జలసంధిలో భద్రత కోసం ముందుకు వచ్చాయి. -
ఇరాన్ దూకుడు.. యూఎస్-యూకే సైనిక స్థావరంపై దాడి
టెహ్రాన్: ఇరాన్ యుద్ధం కొత్త వ్యూహాలతో యూ టర్న్ తీసుకుంటోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ దూకుడు పెంచింది. తాజాగా ఇరాన్.. హిందూ మహాసముద్రంపైకి రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే,ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారనే విషయం తెలియాల్సి ఉంది.వివరాల మేరకు.. ఇరాన్ హిందూ మహా సముద్రంలోని యూఎస్-యూకే సైనిక స్థావరం డిగో గార్సియా టార్గెట్ చేసింది. ఇందులో భాగంగా రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను తాకలేదని తెలుస్తోంది. అయితే, ఒకటి మాత్రం మార్గ మధ్యలోనే విఫలమైందని, మరొకదాన్ని తమ దేశం అడ్డుకుందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ క్షిపణులను ఎప్పుడు ప్రయోగించారన్న దానిపై స్పష్టత లేదు. ఈ దాడులపై ఇరాన్ కూడా స్పందించకపోవడం గమనార్హం.ఇదిలా ఉండగా.. ఇరాన్‌తో యుద్ధం ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే, కాల్పుల విరమణకు మాత్రం తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు. అలాగే, క్షిపణి సామర్థ్యాలను, వైమానిక, నావికా వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆ దేశం మరోసారి అణ్వాయుధాలను తయారుచేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.. తాము తగినవిధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇక, అమెరికా దాని మిత్ర దేశాలకు భద్రత కల్పించిందని ట్రంప్ అన్నారు. ‘ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ సహా పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. -
బ్రిటన్‌లో 'మెనింజైటిస్' వ్యాప్తి.. ఇద్దరు మృతి, హై అలర్ట్
లండన్: బ్రిటన్‌లోని కాంటర్బరీ ప్రాంతంలో (కెంట్ రాష్ట్రం) మెనింజైటిస్ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. ఈ వ్యాధి సోకడంతో ఓ పాఠశాల విద్యార్థి సహా ఇద్దరు మరణించినట్లు కెంట్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. వ్యాధి లక్షణాలు ఉన్న మరో 11 మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు పేర్కొంది. వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున కెంట్‌లో హై అలర్ట్ జారీ చేశారు. యూకే ఆరోగ్య భద్రతా సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం.. మెనింజైటిస్ సోకిన వారిలో 'సెప్టిసీమియా' లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి.మెనింజైటిస్ లక్షణాలుమెనింజైటిస్ అనేది మెదడు మరియు వెన్నుపామును కప్పి ఉంచే పొరల వాపు. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్చు. అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, మెడను తిప్పడంలో ఇబ్బంది, కాంతిని చూడటంలో ఇబ్బంది, శరీరంపై ఎర్రటి మచ్చలు మరియు వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.సెప్టిసీమియా లక్షణాలుశరీరంపై మచ్చలు కనిపిస్తే, వాటిని ఒక గాజుతో నొక్కి చూడాలి. గాజులో నుంచి చూసినప్పుడు ఆ మచ్చలు మాయం కాకపోతే, అది సెప్టిసీమియాకు సంకేతం కావచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే అత్యవసర చికిత్స తీసుకోవాలి.యాంటీబయాటిక్స్ కోసం క్యూమెనింజైటిస్ వ్యాప్తి నేపథ్యంలో కెంట్ విశ్వవిద్యాలయంలో వందలాది మంది విద్యార్థులు నివారణ యాంటీబయాటిక్స్ కోసం క్యూ కడుతున్నారు. విద్యార్థులలో వ్యాధి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున, ఆరోగ్య శాఖ అధికారులు క్యాంపస్‌లను సందర్శించి నివారణ చర్యలు చేపడుతున్నారు.ఇలా వ్యాప్తి చెందుతుందిమెనింజైటిస్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారికి అది వ్యాపిస్తుంది. బాక్టీరియా వల్ల కలిగే మెనింజైటిస్ గాలి ద్వారా లేదా స్పర్శ ద్వారా వ్యాపిస్తుంది. మెనింజైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లాలి. -
నీలం రంగులోకి మారిపోయిన మనిషి.. ఏం జరిగిందో తెలిస్తే షాక్..!
లండన్: ఇటీవల యూకేలోని డెర్బిషైర్ ప్రాంతంలో ఓ వ్యక్తి రాత్రి పడుకొని, పొద్దునే లేచే సరికి నీలం రంగులోకి మారిపోయాడు. అచ్చం అవతార్ సినిమాలో పాత్రధారుల్లాగా. ఇంతకీ ఏం జరిగిందా అని డాక్టర్లు ఆరా తీయగా, షాకింగ్ విషయం బయటపడింది.అసలేం జరిగిందంటే..?42 ఏళ్ల టామీ లించ్ ఉదయం నిద్రలేచినప్పుడు, తన శరీరం నీలం రంగులోకి మారిపోవడాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. వెంటనే బర్టన్-ఆన్-ట్రెంట్‌లోని క్వీన్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళాడు. నిమిషాల వ్యవధిలోనే, ఆక్సిజన్ మాస్క్ ధరించి ఉన్న టామీని పరీక్షించడానికి సుమారు 10 మంది వైద్యులు అక్కడికి చేరుకున్నారు.అత్యవసర చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగా, ఓ డాక్టర్ రక్తం తీయడానికి టామీ చేతిని ఆల్కహాల్ వైప్‌తో తుడిచారు. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. ఆ ప్రాంతంలోని నీలం రంగు మాయమైంది. అప్పుడే వైద్యులు ఆ సంఘటన వెనుక ఉన్న రహస్యాన్ని కనిపెట్టారు.విషయం తెలిసి నవ్వుకున్నారు..!ఇటీవల టామీకి ఓ స్నేహితుడు నీలం రంగు పరుపు, దుప్పట్లను ఇచ్చాడు. వాటిపై రెండు రాత్రులు పడుకున్న తర్వాత టామీ శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఇలా జరగడానికి ఆ పరుపు, దుప్పట్లకు ఉన్న రంగు శరీరానికి అంటుకోవడమే అని తెలిసి టామీ సహా వైద్యులంతా పక్కున నవ్వుకున్నారు. తొలుత భయపెట్టి, ఆతర్వాత నవ్వించిన ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరలైంది. -
నీటిలో అంతిమ సంస్కారాలు.. స్కాట్లాండ్ అనుమతి
సాధారణంగా అంత్యక్రియలు అనగానే మనకు ఖననం చేయడం, దహన సంస్కారాలు నిర్వహించడం మాత్రమే గుర్తుకొస్తాయి. అంత్యక్రియలు అనేవి మతపరమైన, సామాజిక, కుటుంబపరమైన విలువలతో కూడి ఉంటాయి. మనిషి చనిపోయిన తర్వాత కూడా అతడి మృతదేహాన్ని ఎంతో గౌరవంగా సాగనంపాలని భావిస్తాం. ఇప్పటివరకైతే ఖననం, దహన సంస్కారాలు వంటివాటినే పాటిస్తున్నాం. యుగయుగాలుగా ఉన్న ఈ సంప్రదాయాలకు ప్రత్యామ్నాయంగా మరికొన్ని పద్ధతులు వస్తున్నాయని మీకు తెలుసా? నీటి ద్వారా అంతిమ సంస్కారాలు (వాటర్ క్రిమేషన్) నిర్వహించుకునే పద్ధతి కూడా ఉంది. తాజాగా, వాటర్ క్రిమేషన్‌కు స్కాట్లాండ్ చట్టబద్ధ అనుమతి ఇచ్చింది. యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో ఇటువంటి అనుమతి ఇచ్చిన తొలి దేశంగా స్కాట్లాండ్ నిలిచింది. దీని ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చని, నీటిలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తే తక్కువ ఉద్గారాలు విడుదల అవుతాయని స్కాట్లాండ్ భావిస్తోంది. ఈ నిర్ణయం స్కాట్లాండ్లోని అంత్యక్రియల చట్టాల్లో 100 సంవత్సరాలకు పైగా కాలంలో జరిగిన అతిపెద్ద సంస్కరణ. ఈ పద్ధతిలో ఎలా చేస్తారు?వాటర్ క్రిమేషన్ కోసం స్కాట్లాండ్ పార్లమెంట్ ఆల్కలైన్ హైడ్రోలిసిస్ అనే విధానానికి ఆమోదముద్ర వేసింది. ఈ విధానాన్ని సాధారణంగా వాటర్ క్రిమేషన్ లేదా ఆక్వమేషన్ అని పిలుస్తారు. ఆల్కలైన్ హైడ్రోలిసిస్ అంటే నీరు, ఆల్కలైన్ రసాయనాల సాయంతో శరీర కణజాలాన్ని వేగంగా సహజ విచ్ఛిన్నం చేసే శాస్త్రీయ ప్రక్రియ.ఈ విధానంలో ఒత్తిడి తట్టుకునే స్టెయిన్లెస్ స్టీల్ ఛాంబర్లో మృతదేహాన్ని ఉంచుతారు. ఆ ఛాంబర్లో 95 శాతం నీరు, 5 శాతం ఆల్కలైన్ రసాయనాల ద్రావణం నింపుతారు. ద్రావణాన్ని సుమారు 150 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తారు. 3 నుంచి 4 గంటల సమయంలో మృదు కణజాలం పూర్తిగా విచ్ఛిన్నం అవుతుంది. చివరగా ఎముక ముక్కలు మాత్రమే మిగులుతాయి. వాటిని ఎండబెట్టి సాంప్రదాయ దహనంలో వచ్చే బూడిదలా తెల్లటి పొడిగా తయారు చేస్తారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రక్రియలో నేరుగా ఉద్గారాలు విడుదల కావు. సాధారణ దహనం కంటే చాలా తక్కువ శక్తి వినియోగం జరుగుతుంది. కార్బన్ ఫుట్‌ప్రింట్ చాలా తక్కువగా ఉంటుంది. కార్బన్ ఫుట్‌ప్రింట్ అంటే ఒక చర్య వల్ల వాతావరణంలో విడుదలయ్యే మొత్తం గ్రీన్హౌస్ గ్యాసెస్ పరిమాణం.ప్రజల ఇష్టానికి ప్రాధాన్యంఆరోగ్య మంత్రి జెన్నీ మింటో తెలిపిన వివరాల ప్రకారం.. అంతిమ సంస్కారాలు వంటి నిర్ణయాలు చాలా వ్యక్తిగతమైనవి. సంస్కృతి, పర్యావరణ అవగాహన, కుటుంబ విలువలు వంటి అంశాలు వాటిపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడు వాటర్ క్రిమేషన్ను కూడా తీసుకురావడంతో మృతుల కుటుంబాలకు కొత్త ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. 2023లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో 84 శాతం మంది ఈ విధానం ప్రవేశపెట్టడానికి సమర్థించారు.ఈ సేవలు ఎప్పటి నుంచి షురూ? చట్టబద్ధ అనుమతి వచ్చినప్పటికీ వాటర్ క్రిమేషన్ సేవలు వెంటనే ప్రారంభం కావు. ఈ కేంద్రాలు ప్రారంభం కావాలంటే మరిన్ని అనుమతులు అవసరం. అధికారుల అంచనా ప్రకారం.. మొదటి వాటర్ క్రిమేషన్ కేంద్రం 9 నెలల్లో ప్రారంభం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణవాటర్ క్రిమేషన్ ఇప్పటికే కెనడా, ఐర్లాండ్, యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాల్లో అమలులో ఉంది. వాటర్ క్రిమేషన్ ద్వారా పర్యావరణ ప్రయోజనాలు ఉండడంతో అనేక కుటుంబాలు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నాయి. పర్యావరణ సంస్థలు స్కాట్లాండ్ నిర్ణయాన్ని ప్రశంసించాయి. భవిష్యత్తులో ఇంగ్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి చట్టాలు రావచ్చు. -
ఇంట్లో అగ్నిప్రమాదం.. లండన్‌లో ఆంధ్రప్రదేశ్ యువకుడు మృతి
లండన్: ఇంగ్లాండ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గంటి అభిషేక్ (26) ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన అభిషేక్, ఉన్నత విద్య కోసం 2023లో లండన్‌కి వెళ్లాడు. ఎంబీఏ పూర్తి చేసి అక్కడే ఒక సంస్థలో ఉద్యోగం పొందాడు.ఈ క్రమంలో దక్షిణ లండన్‌లోని క్రోయ్డన్ ప్రాంతంలో ఆయన నివసిస్తున్న ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఇంట్లో ఉన్న మరో ఇద్దరు బయటకు తప్పించుకోగలిగారు. అయితే, అభిషేక్ మాత్రం బయటకు రాలేకపోయాడు. కమ్ముకున్న పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.ఈ అగ్నిప్రమాదంలో రెండు అంతస్తుల భవనం తీవ్రంగా దెబ్బతింది. కిటికీలు, గోడలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం నుంచి బయటపడిన వారిలో ఒకరు ప్రస్తుతం లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. భిషేక్ మృతి వార్త స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని కలిగించింది. పెద్దాపురం ప్రాంతంలో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో ప్రతిభావంతుడైన అభిషేక్, ఎంబీఏ పూర్తి చేసి మంచి కెరీర్ అవకాశాలు పొందాలని కలలు కనేవాడు. కానీ ఈ అగ్నిప్రమాదం ఆ కలలను మధ్యలోనే చిదిమేసింది. -
1917 నాటి అప్పు తిరిగి ఇవ్వాల్సిందే
సీహోర్(ఎంపీ): వారసత్వంగా తమకు దక్కాల్సిన ఆస్తులు, భవనాలు, వజ్రాభరణాలపై వారసులు న్యాయస్థానాల మెట్లెక్కడం మనం చూస్తూనే ఉంటాం. సబార్డినేట్ కోర్టుల మొదలు సుప్రీంకోర్టు దాకా ఇలాంటి కేసులు కోకొల్లలు. అవన్నీ వ్యక్తుల మధ్య నెలకొన్న సివిల్ తగాదాలు. వీటికి పూర్తి భిన్నంగా ఏకంగా ఆనాటి బ్రిటిష్ పాలకులపై మధ్యప్రదేశ్ వ్యాపారి ఒకరు 35,000 రూపాయల పాత బాకీ కట్టాలని ఇప్పుడు న్యాయపోరాటానికి సంసిద్ధమవుతున్నారు. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో భారత్‌లోని సంపన్నుల నుంచి నాటి బ్రిటన్ ప్రభుత్వం కొంత మేర నగదు మొత్తాలను రుణాలరూపంలో సమీకరించింది. వాటిని తిరిగి చెల్లించేలోపే మనకు స్వాతంత్య్రంఇచ్చేసి వెళ్లిపోయింది. దీంతో తన తాతకు రావాల్సిన రూ.35వేలు అలాగే ఉండిపోయాయని, బ్రిటన్ ఇప్పటికైనా బాకీ తీర్చాల్సిందేనని సేఠ్ జుమ్మా లాల్ రూథియా మనవడు వివేక్ డిమాండ్చేస్తున్నారు. అసలేం జరిగింది? 1914లో మొదలైన మొదటి ప్రపంచయుద్ధకాలంలో నిధుల కటకట నుంచి గట్టెక్కేందుకు బ్రిటన్ ప్రభుత్వం నాటి మధ్యప్రదేశ్ ప్రాంతంలోని సంపన్నుల నుంచీ రుణాలను తీసుకుంది. అప్పట్లో సీహోర్, భోపాల్ సంస్థానాల్లో సంపన్నులుగా ఖ్యాతి పొందిన రూథియాలు సైతం బ్రిటన్ పాలకులకు రుణాలు ఇచ్చారు. సేఠ్ జుమాలాల్ నుంచి భోపాల్ రాజకీయ ప్రతినిధిగా డబ్ల్యూ ఎస్ డేవిస్ రూ.35 వేలు పుచ్చుకున్నారు. ఆ మేరకు రసీదు రాసి సంతకంచేసి ఇచ్చారు. 1917 జూన్ నాలుగోతేదీన ఈ అప్పు ఇచ్చినట్లు రసీదులో ఉంది. అప్పు ఇచ్చాక రెండు దశాబ్దాల తర్వాత 109 ఏళ్ల వయసులో 1937లో సేఠ్ చనిపోయారు. అప్పు పత్రం మాత్రం భద్రంగా ఉంది. ఇటీవలికాలంలో తమ ఇంట్లో పాత వస్తువులను దులుపుతుండగా ఈ అరుదైన పత్రం ఆయన మనవడు, ప్రస్తుతం భోపాల్‌లో పెద్ద వ్యాపారి వివేక్(65) కంటబడింది. దీంతో ఎలాగైనా తన తాత ఇచ్చిన రుణాన్ని యూకే సర్కార్ నుంచి ముక్కుపిండి వసూలుచేస్తానని ఆయన శపథంచేశారు. ఈ మేరకు తన వద్ద ఉన్న అన్ని అనుబంధ డాక్యుమెంట్లనూ ఆయన మీడియా ముందుపెట్టారు. ‘‘ఇండియా వార్ లోన్ కోసం సేఠ్ నుంచి రూ.35వేలు ముట్టాయి. రుణమిచ్చి ఆయన ప్రభుత్వం, రాజ్యం పట్ల తన విధేయతను ప్రకటించుకున్నారు’’అని అప్పుపత్రంలో రాసి ఉంది. ‘‘వలసరాజ్యపాలనాకాలంలో నాటి పాలకులు తీసుకున్న రుణాలను ఏ విధంగా రాబట్టాలో మా లాయర్లతో చర్చిస్తున్నా. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వానికి నోటీస్‌లు పంపిస్తా. అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూసినా సార్వ¿ౌమదేశానికి పాత రుణాలను తీర్చే బాధ్యత ఉంటుంది. ఆ లెక్కన మా తాత డబ్బు మాకు తిరిగి ఇవ్వాల్సిందే. అప్పు ఇచ్చి వందేళ్లు దాటింది. అసలుకు చక్రవడ్డీ లేదా కనీసం సాధారణ వడ్డీగా ఐదు శాతం లెక్కేసుకున్నా ఇప్పడా రుణం కోట్ల రూపాయల్లో ఉంటుంది. నాటి బంగారం రేట్లతో పోల్చుకున్నా సరే ఇప్పుడా మొత్తం 3,000 రెట్లు పెరిగి రూ.10 కోట్లుదాకా రావాల్సిందే’’అని వివేక్ అన్నారు. అయితే వివేక్ వాదన అంతర్జాతీయ చట్టాల్లో ఏ మేరకు చెల్లుబాటు అవుతుందనే సందేహాన్ని న్యాయనిపుణులు వెలిబుచ్చారు. ‘‘నాటి రాజరికం ఇప్పుడు లేదు. పాలకులూ మారిపోయారు. వలసరాజ్యంగా తీసుకున్న ప్రైవేట్ వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పును ఇప్పుడు ఏ నిబంధనల ప్రకారం బ్రిటన్ సర్కార్ చెల్లిస్తుంది? స్వాతంత్య్రం ఇచ్చాక పోతూపోతూ పాత ఒడంబడికలు, ఒప్పందాలు, హామీలతో మాకు సంబంధం లేదు అని బ్రిటిషర్లు చేతులు దులుపుకునే ఉండి ఉంటారు. ఈ లెక్కన నాటి అప్పు నేడు రాబట్టడం కష్టం’’అని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఒకవేళ అప్పు రాకపోయినా శతాబ్దకాలంనాటి పురాతన పత్రంగాఅయినాఇది ఘన చరిత్రను చాటుతూ శాశ్వతంగా నిలిచి ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ పత్రం చరిత్రగా ఉండిపోతుందా లేదంటే అప్పు రాబట్టి కొత్త చరిత్ర లిఖిస్తుందా అనేది వివేక్ కొనసాగించే తదుపరి పోరుపై ఆధారపడి ఉంటుంది. -
బిడ్డలు పుట్టే అవకాశం లేదన్నారు..!కానీ ఆ మహిళ ..
వైద్యశాస్త్రం రోజు రోజుకి పురోగమిస్తు బాధిత రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా సంతానం విషయంలో ఇటీవల కాలంలో ఎన్ని జంటలు ఇబ్బందులు పడుతున్నారో తెలిసిందే. ఐవీఎఫ్, సరోగసీ ద్వారా కొంత ఉపశమనం లభించినప్పటికీ..కొందరు పుట్టుకతో గర్భాశయం లేని అమ్మాయిలకు మాత్రం సంతానం ఓ కలగానే మిగిలిపోతోంది. రూపం, ఆరోగ్యం.. పరంగా బాగుండి ఆ విషయంలో మాత్రం జీవితాంతం వారికో లోపం, శాపంగా ఉండిపోతోంది. ఇప్పుడు ఆ సమస్యకు చక్కటి ఉపశమనం అందించారు వైద్యులు. వైద్యశాస్త్రంలోనే సరికొత్త అద్భుతం చోటు చేసుకునేలా కొంగొత్త వైద్య ఆవిష్కరణలకు నాంది పలికి రోగుల్లో కొత్త ఆశలను నింపుతున్నారు. అందుకు ఈ జంట ఉదంతమే ఓ ఉదాహరణ. అసలేం జరిగిందంటే..యూకేకి చెందిన 30 ఏళ్ల గ్రేస్ బెల్ పుట్టుకతోనే గర్భం లేదామెకు. గర్భం లేదు కాబట్టి పీరియడ్స్ ఉండవు గానీ సాధారణ అండశయాలు ఉంటాయి. ఈ పరిస్థితిని ఎంఆర్‌కేహెచ్ సిండ్రోమ్‌గా పేర్కొంటారు. యూకేలో ప్రతి 5 వేల మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. బెల్కి పిల్లలు పుట్టాలంటే గర్భమార్పిడి లేదా సరోగసీ ఒక్కటే మార్గం. దాంతో బెల్ భర్త స్టీవ్ పావెల్ ఇద్దరూ గర్భశయాన్ని దానం చేసే దాత కోసం ఎదురు చూస్తుండేవారు. గర్భం దొరికిందని, మార్పిడికి సిద్ధంగా ఉండమని ఆస్పత్రి నుంచి వచ్చిన కాల్ వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. నమ్మశక్యం కానీ నిజంలా అనిపించింది ఆ జంటకు. అలా బెల్కి జూన్ 2024లో ఆక్స్‌ఫర్డ్‌లోని చర్చిల్ హాస్పిటల్లో దాదాపు 10 గంటలు శ్రమించి గర్భశయ మార్పిడి ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆ తర్వాత కొన్ని నెలలకు ఐవీఎఫ్‌ని ఆశ్రయించి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నారు. ఆ విధంగా ఈ జంటకు 2025లో ఓ అద్భుత వరంలా 7 పౌండ్ల బరువుతో హ్యోగో అనే బిడ్డ జన్మించాడు. ప్రస్తుతం ఆ చిన్నారికి పదివారాల వయసు. ఆ దంపతులు ఇద్దరు తమకు సంతానభాగ్యాన్ని అందించిన ఆ మహిళకు, ఆమె కుటుంబానికి ఎంతో రుణపడి ఉంటామంటూ భావోద్వేగంగా చెప్పారు. మా బిడ్డను చూసిన ప్రతిసారి వాళ్లే మాకు గుర్తొస్తారంని అన్నారు. అయితే ఆ జంట మరో బిడ్డను కనాలనుకునేంత వరకు మార్పిడి చేసిన గర్భాశయాన్ని ఉంచి, ఆ తర్వాత తొలిగిస్తారట. ఎందుకంటే ఆ అవయవంపై శరీర రోగ నిరోధక వ్యవస్థ దాడి చేయకుండా నిరోధించడానికి, అలాగే ఆమె జీవతాంత మందులు తీసకోకుండా నివారించేందుకు ఇది తప్పదని చెబుతున్నారు వైద్యులు. కాగా, ఇలాంటి ఘటనే 2025 ప్రారంభంలో యూకేలో మొదటి సజీవ గర్భదానం ద్వారా అమీ అనే శిశువు జన్మించింది. ఈకేసులో అక్క గర్భాన్ని పొందింది సదరు మహిళ. ఆమెకు అప్పటికే ఇద్దరు పిల్లలు ఉండటంతో చెలెల్లికి తన గర్భాన్ని దానం చేసింది. వైద్యశాస్త్రంలో ఈ పురోగతి..పుట్టుకతో గర్భంలేని యువతుల పాలిట వరంగా మారుతుంది. పైగా అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగేందుకు నాంది పలకడమే గాక..మరణం తర్వాత ఇతరుల జీవితాల్లో వెలుగులు పంచేలా బతకడం ఈ దానం వల్లే సాధ్యమని తెలుసుకుంటారని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. (చదవండి: అద్దంలో కనిపించని అసలు రూపం) -
పెంపుడు కుక్క నాకింది, 24 గంటల్లోనే కోమాలోకి
కుక్క కరిస్తే ప్రమాదం. సరియైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం కానీ, కుక్క నాకినా కూడా ప్రమాదకరమే. కుక్క నాకడం వల్ల సెప్సిస్ సోకి నాలుగు అవయవాలను కోల్పోయిందో మహిళ. దిగ్భ్రాంతికరమైన ఈ షాకింగ్ మరియు ప్రాణాంతక పరిస్థితి గురించి తెలుసుకోవలసిన విషయాలు.పెంపుడు కుక్కను ఎంతగానో ప్రేమించే ఒక మహిళ కేవలం 24 గంటల్లోనే మృత్యువు అంచులదాకా వెళ్లిపోయింది. చివరికి కాళ్లు చేతులను పోగొట్టుకుంది. 2025 జూలైలో, యూకేకు చెందిన 52 ఏళ్ల మంజిత్ సంఘా పెంపుడు కుక్కను ముద్దు చేస్తూ శనివారం కాసేపు ఆడుకుంది. ఈ సయయంలోఆమె చేతికున్న గాయాన్ని నాకింది. ఆదివారం మధ్యాహ్నం పని నుండి ఇంటికి వచ్చినప్పుడు ఆమెకు ఒంట్లో నలతగా అనిపించింది. మరుసటి రోజు ఉదయానికి ఆమె స్పృహ కోల్పోయింది. ఆమె చేతులు , కాళ్లు మంచులా చల్లగా మారిపోయాయి, పెదవులు నీలం రంగులోకి మారాయి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. దీంతో ఆమెను వోల్వర్‌హాంప్టన్‌లోని న్యూ క్రాస్ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్చారు.32 వారాల పాటు మంజిత్ సంఘా ఆసుపత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఆరుసార్లు గుండెపోటు వచ్చింది. పలు శస్త్రచికిత్సల తర్వాత ప్రాణాలతో బయటపడి చివరికి ఇంటికి చేరింది. కానీ ఒక చిన్న గీత లేదా గాయంపై నాకడం వల్ల సెప్సిస్ బారిన పడి, రెండు చేతులు, రెండు కాళ్లను తొలగించాల్సి వచ్చింది (Quadruple Amputation). వీటితో పాటు ఆమె ప్లీహాన్ని (Spleen) కూడా తొలగించాల్సి వచ్చింది. 24 గంటల్లోపే ఇంత దారుణం జరుగుతుందని అస్సలు అనుకోలేదని వాపోయారు. ఆదివారం పనికి వెళ్లింది, సోమవారం రాత్రికి కోమాలోకి వెళ్లిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఆమెకున్న చిన్న గాయాన్ని నాకడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ ప్రారంభమై ఉండవచ్చని వైద్యులు తెలిపారు. కాప్నోసైటోఫాగా కానిమోర్సస్ (Capnocytophaga canimorsus) అనే బ్యాక్టీరియా కుక్కలలో ఉంటుంది. ఇది వాటికి హాని చేయదు. కానీ, మనుషుల్లో ఇది సెప్సిస్ వంటి తీవ్రమైన అనారోగ్యానికి లేదా మరణానికి దారితీస్తుంది. ఇది లాలాజలం ద్వారా రక్తప్రవాహంలోకి చేరింది. సెప్సిస్ అంటే ఏమిటి?సెప్సిస్ అనేది ఒక ఇన్ఫెక్షన్కు శరీరం ప్రతిస్పందించే ప్రాణాంతక స్థితి. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన కణజాలాలను,అవయవాలను నాశనం చేస్తుంది. దీని ఫలితంగా శరీరం అంతటా వాపు (Inflammation) వస్తుంది.తీవ్రమైన సందర్భాల్లో, సెప్సిస్ సెప్టిక్ షాక్‌గా మారుతుంది, ఇది రక్తపోటును ఒక్కసారిగా పడిపోతుంది. తద్వారా కణజాల నష్టం, బహుళ అవయవాల వైఫల్యం , మరణానికి దారితీస్తుంది. దీన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయడం చాలా ముఖ్యం.సెప్సిస్ -ఆరోగ్య సమస్యలు (Complications)రక్తపోటు గణనీయంగా పడిపోయి, సెప్టిక్ షాక్ కారణంగా అవయవాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఆక్సిజన్ అందక కణజాలం దెబ్బతింటుంది.ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోయి, ఆక్సిజన్ తీసుకోవడం కష్టమవుతుంది.అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS)కు దారితీస్తుంది. రోగులకు వెంటిలేటర్ అవసరం పడుతుంది.డిసమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోగ్యులేషన్ (DIC) అంటే శరీరం అంతటా అసాధారణంగా రక్తం గడ్డకట్టడం జరుగుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ ఆగి అవయవాలు దెబ్బతినడమే కాకుండా, రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. మూత్రపిండాలు ఫెయిల్ అవుతాయి. దీనివల్ల డయాలసిస్ అవసరం కావచ్చు. సెప్సిస్ నుండి కోలుకున్న తర్వాత కూడా చాలా మంది అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం, కండరాల బలహీనత మరియు మానసిక మార్పులతో బాధపడతారు.ఇదీ చదవండి: బంగారాలూ..మీరే నా సర్వస్వం : నటుడి భావోద్వేగ సందేశం -
ఇరాన్‌పై దాడులకు ప్లాన్.. ట్రంప్‌కు షాకిచ్చిన యూకే
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. అణు ఒప్పందం అంశంపై ఇరాన్- అమెరికా మధ్య తీవ్ర ఉదిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌ను హెచ్చరించారు. రాబోయే 10 రోజుల్లో అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇరాన్ తన అణు మొండితనాన్ని వీడకపోతే, తాము సైనిక చర్య వేయక తప్పదని ఆయన పరోక్షంగా యుద్ధ సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఇరాన్‌పై దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇందులో భాగంగా.. ఇరాన్‌పై ముందస్తు దాడుల కోసం అమెరికా దాడుల కోసం యూకే ఎయిర్‌బేస్‌ను సాయం కోరింది. అయితే, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వం.. అమెరికా అభ్యర్థనను తిరస్కరించింది. RAF Fairford (స్విండన్ దగ్గర), డియాగో గార్షియా ఎయిర్‌బేస్‌ను ఉపయోగించి ఇరాన్‌పై ముందస్తు దాడులు చేయడానికి బ్రిటన్ అనుమతి ఇవ్వలేదు. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అవుతుందని కారణం చూపిస్తూ నిరాకరించింది. కాగా, డియాగో గార్షియా చాగోస్ దీవులను మారిషస్‌కు అప్పగించే యూకే ప్రణాళికతో ఈ వివాదం ముడిపడింది. డియాగో గార్షియా బేస్‌ను 99 ఏళ్ల లీజ్‌పై తిరిగి పొందే ఒప్పందం (£35 బిలియన్ విలువ) చర్చలో ఉంది. ఈ బేస్ అమెరికాకు ఇండో–పసిఫిక్, మధ్యప్రాచ్య కార్యకలాపాలకు కీలకంగా ఉండటం గమనార్హం. డియేగో గార్షియా చాగోస్ దీవుల్లో అతి పెద్దది. ప్రస్తుతం యూఎస్-యూకే సంయుక్త సైనిక స్థావరం కావడం విశేషం. చట్టపరమైన ఆందోళనలు..ఇదిలా ఉండగా.. 2001 తర్వాత యూకే విధానంలో పలు మార్పులు జరిగాయి. ఒక మిత్రదేశం చేసే చట్టవిరుద్ధ దాడికి సహకరిస్తే బ్రిటన్ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే ముందస్తు దాడులకు మద్దతు ఇవ్వడంలో బ్రిటన్ జాగ్రత్తగా ఉంది. ఇంతకుముందు కూడా యూకే, అమెరికా ఇరాన్‌పై చేసిన దాడుల్లో నేరుగా పాల్గొనలేదు. కేవలం రక్షణ చర్యల్లో మాత్రమే సహకరించింది.ట్రంప్ స్పందన..మరోవైపు.. యూకే ప్రధాని స్టార్మర్ ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించి తీవ్ర విమర్శలు గుప్పించారు. చాగోస్ దీవులపై నియంత్రణను వదులుకోవద్దని హెచ్చరించారు. అలాగే, అత్యంత అస్థిరమైన, ప్రమాదకరమైన పాలన ద్వారా జరిగే దాడిని నిర్మూలించడానికి అమెరికాకు డియెగో గార్షియా, RAF ఎయిర్‌బేస్ అవసరం కావొచ్చు అంటూ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా హెచ్చరించారు. అయితే, డియాగో గార్షియా.. అమెరికా దీర్ఘదూర ఆపరేషన్లకు అత్యంత కీలకమైన బేస్‌గా ఉంది.ఇరాన్‌తో అమెరికా ప్రతిపాదనలు ఇవే..అణు ఒప్పందంలో భాగంగా ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ ముందు ప్రధానంగా మూడు ప్రతిపాదలను పెట్టంది. ఇరాన్ తన యురేనియం శుద్ధిని పూర్తిగా ఆపివేయాలని, ఇరాన్ అభివృద్ధి చేస్తున్న బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను వదులుకోవాలని, పశ్చిమ ఆసియాలో తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని ఇరాన్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. మరోవైపు.. ట్రంప్ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో సైనిక మోహరింపును కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న 'యూఎస్ఎస్ అబ్రహం లింకన్' యుద్ధ నౌకకు తోడుగా, అత్యాధునిక 'యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్' యుద్ధ విమాన వాహక నౌక జిబ్రాల్టర్ జలసంధి మీదుగా పశ్చిమ ఆసియాకు చేరుకుంటోంది. అదనంగా 50కి పైగా అత్యాధునిక ఫైటర్ జెట్లు, డజన్ల కొద్దీ ఇంధన ట్యాంకర్లను అమెరికా సిద్ధం చేసింది. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై ఏ క్షణమైనా దాడులు చేసేలా ఇప్పటికే వైమానిక దళానికి ఆదేశాలు అందాయి. -
ఎప్స్టీన్ ఫైల్స్ : మాజీ ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్
దశాబ్దాల పాటు సెక్స్ ట్రాఫికింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) కేసులో మరోకీలక పరిణామం చోటు చేసుకుంది. తాజా రిపోర్టుల ప్రకారం, ఈ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వ పదవిలో ఉండి దుష్ప్రవర్తనకు (misconduct in public office) పాల్పడ్డారనే అనుమానంతో, బ్రిటన్ రాజుగ కింగ్ చార్లెస్-3 సోదరుడు మాజీ ప్రిన్స్ ఆండ్రూ మౌంట్‌బాటన్-విండ్సర్ (Andrew Mountbatten)ను సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. ఈ మేరకు థేమ్స్ వ్యాలీ పోలీసులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నార్ఫోక్కు చెందిన 60 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బ్రిటన్ చట్టం ప్రకారం నిందితుడి పేరును వారు అధికారికంగా వెల్లడించలేదు.సమగ్రమైన పరిశీలన తర్వాతే ఆయనను అరెస్టు చేసినట్లు, ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు థేమ్స్ వ్యాలీ పోలీసులు తెలిపారని బీబీసీ నివేదించింది. 2010లో జెఫ్రీ ఎప్స్టీన్కు ఆండ్రూ వాణిజ్య నివేదికలను పంపారన్న ఆరోపణలపై కూడా తాము విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తిస్థాయి పరిశీలన తర్వాత, ప్రభుత్వ పదవిలో దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్నఆరోపణపై దర్యాప్తు ప్రారంభించామనీ, తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ నేరంపై విచారణ జరుపుతున్నప్పుడు, దర్యాప్తు సమగ్రతను, నిష్పాక్షికతను కాపాడటం చాలా ముఖ్యమని పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు లైంగిక నేరస్థుడు ఎప్స్టీన్కు ఆండ్రూ రహస్య సమాచారం ఇచ్చాడనే నివేదికలపై విచారణకు కింగ్ చార్లెస్ III సహకరిస్తారని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలిపింది. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుఅంతకుముందు రోజు ఉదయం, సాండ్రింగ్‌హామ్ ఎస్టేట్‌లోని వుడ్ ఫామ్ వద్దకు గుర్తు తెలియని ఆరు పోలీసు కార్లు , సుమారు ఎనిమిది మంది సాదా దుస్తులలో ఉన్న పోలీసు అధికారులు చేరుకోవడం కనిపించిందని పలు కథనాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు మాజీ యువరాజు ఈరోజు 66 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి -
రాహుల్ చెప్పేవన్నీ అసత్యాలు
గాంధీనగర్: అమెరికా, యూకే, ఈయూతో వాణిజ్య ఒప్పందాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తీవ్రంగా ఖండించారు. రాహుల్ రైతులను తప్పుదోవ పట్టించడంతో పాటు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఆయనకు చేతనైతే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. చర్చా వేదికను ఆయనే నిర్ణయించుకోవచ్చన్నారు. మన రైతులు, డెయిరీ ఉత్ప త్తులకు కేంద్రం పూర్తి రక్షణ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ‘‘వాణిజ్య ఒప్పందాలు మన రైతులకు హాని చేస్తాయన్న కాంగ్రెస్ ఆరోపణలు హాస్యాస్పదం. ప్రజలను తప్పుదోవపట్టించడంలో ఆ పార్టీ నేతలు సిద్ధహస్తులు. నిజానికి యూపీఏ హయాంలో కుదుర్చుకున్న పలు ఒప్పందాలు మన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. వాటిలోని ప్రమాదకరమైన అంశాలను మోదీ ప్రభుత్వం రాగానే తొలగించింది’’ అని అమిత్ షా చెప్పారు. -
నిత్యం అబద్ధాలేనా?
కారైకల్: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాం«దీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిత్యం అబద్ధాలు చెప్పడం అనే కొత్త సంప్రదాయాన్ని రాహుల్ ప్రారంభించాడని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. గొంతు చించుకొని గట్టిగా అబద్ధం చెప్పడం, దాన్ని పునరావృతం చేయడం, అబద్ధాన్ని నిజంగా నమ్మించాలని చూడడం రాహుల్ విధానంగా మారిపోయిందని విమర్శించారు. రాహుల్ అబద్ధాల ఫ్యాక్టరీ వెనకున్న అసలు బాగోతాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. యూకే, ఈయూ, అమెరికాలతో కుదుర్చున్న వాణిజ్య ఒప్పందాలతో మన రైతులకు, మత్స్యకారులకు, పాడి పరిశ్రమకు లాభమే తప్ప ఎలాంటి నష్టం ఉండదన్నారు. అయినప్పటికీ రాహుల్ తప్పుడు ప్రచారంతో వారిని భయోత్పాతానికి గురి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం తప్పనిసరిగా కాపాడుందన్నారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాల గురించి క్షుణ్నంగా తెలుసుకొని మాట్లాడాలని రాహుల్ గాం«దీకి హితవు పలికారు. శనివారం పుదుచ్చేరిలోని కారైకల్‌లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తేల్చిచెప్పారు. మన ప్రయోజనాలు 100 శాతం కాపాడుకొనేలా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని వివరించారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని అమిత్ షా ఉద్ఘాటించారు. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు చేసిన ఘనత మోదీ నిర్ణయాత్మక నాయకత్వానిదేనని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్‌తో ముష్కర మూకలకు గట్టిగా బుద్ధి చెప్పామని అన్నారు. పుదుచ్చేరి అభివృద్ధి జరగాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
యూకే PR పరిమితి పెంపు.. భారతీయుల ఆందోళన
యుకే ప్రభుత్వం శాశ్వత నివాసం కోసం దరఖాస్తు పరిమితిని పెంచడంపై అక్కటి పార్లమెంటులో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇది అమలైతే అక్కడ వివిధ పనులు నిర్వహిస్తున్న వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.అక్రమ వలసలను నియంత్రించడంలో భాగంగా యూకే ప్రభుత్వం కీలక సంస్కరణలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్రిటన్‌లో పనిచేస్తున్న విదేశీయులు శాశ్వత పౌరసత్వం దరఖాస్తు చేసుకోవడం కోసం ఐదేళ్ల కాల పరిమితిని పదేళ్లకు పెంచేలని అక్కడి ప్రభుత్వం భావిస్తుంది.స్కిల్ట్ వర్కర్స్, హెల్త్ అండ్ కేర్ వీసాలపై వారు అక్కడి ఐఎల్ఆర్ (శాశ్వత నివాసం) అప్లై చేసుకోవాలంటే ప్రస్తుతం ప్రస్తుతం ఐదేళ్ల వరకూ ఉంది. అయితే దానిని పదేళ్లకు పెంచాలనే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. దీంతో ఆదేశంలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై అక్కడి పార్లమెంటులో ఇది వరకే చర్చలు జరిగాయి. అయితే మీడియం స్కిల్స్ ఉద్యోగాలకు వీసా పరిమితి పెంచడం వల్ల ILRకు అర్హతపొందే వ్యక్తుల సంఖ్య తగ్గుతుందని ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ అక్రమంగా యూకేలో ILRకోసం ప్రయత్నిస్తే వారి వీసా రద్దు చేయడంతో పాటు దేశ బహిష్కరణ చేస్తామని అక్కడి అధికారులు హెచ్చరించారు -
ఎప్స్టీన్ ఫైల్స్ : ఫొటో దెబ్బకి ఎంపీ రాజీనామా
లండన్: ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ఫైళ్లు అమెరికాలో మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంకీ ఎప్స్టీన్ పేజీలను విడుదల చేశారు. వాటిల్లో మాజీ యూకే రాయబారి ప్రస్తుత అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు పీటర్ బెంజమిన్ మాండెల్సన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందిఎప్స్టిన్ ఫైల్స్‌లో పీటర్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. పీటర్ లోదస్తులతో ఉండగా.. ఆయనతో ఓ మహిళా సన్నిహితంగా ఉంది. ఆ ఫొటోలపై దుమారం చెలరేగడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ ఫొటో గురించి అడగ్గా.. 'తెలియదు గుర్తులేదు మర్చిపోయా'. దాట వేశారు. ప్రస్తుతం,ఈ అంశంపై యూకే రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోందిఇక ఎప్స్టీన్ ఫైల్స్‌లో 2003-04 మధ్య కాలంలో ఎప్స్టీన్కు పీటర్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఎప్స్టీన్ నుంచి పీటర్‌కు సుమారు 75వేల డాలర్లు అందగా.. 25వేల డాలర్లకు సంబంధించి లావాదేవీల వివరాలు ఉండటం గమనార్హం. పీటర్‌తో అస్పష్టంగా ఉన్న మహిళ గురించి వివరాలు గురించి ఆయన్ని మీడియా ఆరా తీసింది. ఫోటోలు ఎప్పుడు, ఎక్కడ తీశారో తెలియదు. ఆ ప్రదేశాన్ని, స్త్రీని తాను గుర్తించ లేకపోతున్నానని, ఏ సందర్భంలో ఆ ఫొటోను దిగాల్సి వచ్చిందో గుర్తించ లేకపోతున్నారని చెప్పుకొచ్చారు. -
పిల్లలకు సోషల్ మీడియా వద్దు!
లండన్: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ బ్రిటన్‌లోని అధికార లేబర్ పార్టీకి చెందిన 61 మంది ఎంపీలు ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధాని సర్ కీర్ స్టామర్‌ను ఉద్దేశించి రాసిన ఈ లేఖలో, పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతపై సోషల్ మీడియా ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.డెన్మార్క్, ఫ్రాన్స్, నార్వే, న్యూజిలాండ్, గ్రీస్ వంటి దేశాలు ఇప్పటికే ఇలాంటి చట్టాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయని ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. బ్రిటన్ కూడా ఈ దిశగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.ఈ అంశంపై ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కన్జర్వేటివ్ పార్టీతో పాటు లిబరల్ డెమోక్రాట్లు కూడా తమ మద్దతు ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీ నేత కెమి బాడ్నోచ్ ఇటీవల పార్లమెంట్లో మాట్లాడుతూ, తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే 16 ఏళ్లలోపు పిల్లలందరికీ సోషల్ మీడియాపై నిషేధం విధిస్తామని ప్రకటించారు.ఈ పరిణామాలతో అధికార లేబర్ ఎంపీల డిమాండ్‌కు ప్రతిపక్షాల నుంచి కూడా మద్దతు లభిస్తున్న పరిస్థితి ఏర్పడింది. దీనిపై స్పందించిన ప్రధాని కీర్ స్టామర్, ప్రభుత్వం ఈ అంశాన్ని ఓపెన్ మైండ్‌తో పరిశీలిస్తోందని, అన్ని అవకాశాలను సమగ్రంగా అధ్యయనం చేస్తామని తెలిపారు. -
UK: వలసదారుల్లో వణుకు.. డాక్యుమెంట్లు చెక్ చేస్తున్న హోం ఆఫీస్
లండన్: బ్రిటన్‌లో ఉద్యోగాలు పొందేందుకు నకిలీ పాస్‌పోర్టులు, వీసా పత్రాలు, స్పాన్సర్షిప్ సర్టిఫికెట్లు ఉపయోగించినందుకు వేలాది మందిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. ఇటీవల నిర్వహించిన వరుస ఇమ్మిగ్రేషన్ దాడుల్లో భారీగా నకిలీ పత్రాలు స్వాధీనం చేసుకున్న హోం ఆఫీస్, దేశ చరిత్రలోనే అతిపెద్ద డాక్యుమెంట్ చెక్‌ను ప్రారంభించింది.యూకేలో ఉద్యోగాలు పొందేందుకు మోసగాళ్లు ప్రధానంగా మూడు మార్గాల్లో నకిలీ పత్రాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ (CoS) మోసంస్పాన్సర్షిప్ లైసెన్స్ లేని కంపెనీల పేరుతో నకిలీ ‘సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్’లు (CoS) జారీ చేస్తూ కొన్ని గుంపులు భారీ మొత్తాల్లో డబ్బులు వసూలు చేస్తున్నాయి.షేర్ కోడ్ మోసంప్రత్యేకంగా కేర్ సెక్టార్లో షేర్ కోడ్ కుంభకోణాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. షేర్ కోడ్ అనేది ఒక వ్యక్తికి యూకేలో పని చేసే అర్హత ఉందో లేదో నిర్ధారించే ఆన్లైన్ విధానం. ఇతరుల వివరాలను ఉపయోగించడం లేదా సాంకేతికంగా మార్చడం ద్వారా నకిలీ షేర్ కోడ్లను సృష్టించే ధోరణి పెరుగుతోంది.బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ (BRP) మోసందొంగిలించబడిన లేదా గడువు ముగిసిన BRP కార్డులలో ఫోటోలు, వ్యక్తిగత సమాచారాన్ని మార్చి కొత్త పత్రాలు తయారు చేయడం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు.అలాగే, హెల్త్ అండ్ కేర్ వీసాలను దుర్వినియోగం చేస్తూ వేలాది మంది దేశంలోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ఏజెన్సీలు ఒక వ్యక్తికి జారీ చేసిన స్పాన్సర్షిప్ పత్రాలతో ఒకరికి మించి ఉద్యోగులను నియమిస్తున్నాయని కూడా ఫిర్యాదులు అందాయి. ఇలాంటి నకిలీ పత్రాలు అందించి అభ్యర్థులను మోసం చేసిన సంస్థల స్పాన్సర్ లైసెన్సులను రద్దు చేసే ప్రక్రియను హోం ఆఫీస్ ప్రారంభించింది.చట్టవిరుద్ధంగా ఉద్యోగులను నియమించే సంస్థలపై బ్రిటన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మొదటిసారి పట్టుబడిన సంస్థలకు ఒక్కో అక్రమ కార్మికుడికి 45,000 పౌండ్లు (సుమారు రూ.48 లక్షలు) వరకు జరిమానా విధించవచ్చు. రెండోసారి నేరం రుజువైతే ఈ మొత్తం 60,000 పౌండ్లు వరకు పెరుగుతుంది. కార్మికులు నకిలీ పత్రాలు సమర్పించినట్లు తేలితే, వారిని వెంటనే అదుపులోకి తీసుకుని బహిష్కరణ చర్యలు ప్రారంభిస్తారు.హోం ఆఫీస్ ప్రవేశపెట్టిన కొత్త డిజిటల్ వ్యవస్థలతో నకిలీ పత్రాలను గుర్తించడం మరింత సులభమవుతుందని అధికారులు చెబుతున్నారు. 2029 నాటికి డిజిటల్ ఐడీలను తప్పనిసరి చేయడం ద్వారా ఇలాంటి మోసాలను పూర్తిగా నిర్మూలించాలని బ్రిటన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
గ్రీన్లాండ్ టారిఫ్‌లు పూర్తిగా తప్పు
లండన్: గ్రీన్లాండ్ స్వాధీన ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామనే కారణంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమపై టారిఫ్‌లను ప్రకటించడాన్ని యూరప్ దేశాల నేతలు ఖండించారు. ట్రంప్ ప్రభుత్వ వైఖరిని డెన్మార్క్, యూకే, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ తప్పుబట్టారు. ‘గ్రీన్లాండ్ విషయంలో మా వైఖరి సుస్పష్టం. ఆ ప్రాంతం డెన్మార్క్ సామ్రాజ్యంలోనిదే. దాని భవిష్యత్తును నిర్ణయించాల్సింది డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రజలు మాత్రమే’ అని వారు పేర్కొన్నారు. ‘టారిఫ్ హెచ్చరికలు అట్లాంటిక్ దేశాల మధ్య ఉన్న సంబంధాలను దెబ్బతీస్తాయి. ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసే ప్రమాదముంది. యూరప్, అమెరికా మధ్య ఉండాల్సిన సహకారంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నాం’ అని వారు పేర్కొన్నారు. ఆర్కిటిక్ ప్రాంత రక్షణ మొత్తం నాటో కూటమికి కీలకమైన అంశం. ఆర్కిటిక్‌లోని వివిధ ప్రాంతాలకు రష్యా నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవడానికి మిత్రదేశాలన్నీ కలిసి మరిన్ని చర్యలు చేపట్టాలి. నాటో మిత్రదేశాల సమష్టి భద్రత కోసం కృషి చేస్తున్న మిత్రపక్షాలపైనే టారిఫ్‌లు విధించడం పూర్తిగా తప్పు. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వంతో నేరుగా చర్చిస్తాం’ అని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ట్రంప్ బెదిరింపులకు తాము లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ స్పష్టం చేయగా యూరప్ మిత్ర దేశాలను ట్రంప్ బ్లాక్ మెయిల్ చేయడం సరికాదని స్వీడన్ ప్రధాని క్రిస్టెర్సన్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఉమ్మడి స్పందన కోసం నార్వే, స్వీడన్, యూకేలతో తీవ్రంగా చర్చిస్తున్నామన్నారు. ఈ విషయంలో సంయమనంతో వ్యవహరించాలని, వాణిజ్య ఉద్రిక్తతలను మరింత ముదిరేలా వ్యవహరించరాదని నార్వే ప్రధాని జొనాస్ పేర్కొన్నారు. ఇది ఎవరికీ మంచిదికాదన్నారు. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా ప్రయత్నాలకు అడ్డు చెబుతున్న డెన్మార్క్, యూకే, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ ఉత్పత్తులపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 10 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తామని ట్రంప్ తాజాగా ప్రకటించారు. గ్రీన్‌లాండ్‌పై ఈ దేశాలు తమతో ఒక అంగీకారానికి రాని పక్షంలో జూన్ నుంచి టారిఫ్‌లను 25 శాతానికి పెంచుతామని ఆయన హెచ్చరించడం తెల్సిందే. -
కెంట్ అయ్యప్ప ఆలయంలో వైభవంగా ‘మకరవిళక్కు మహోత్సవం’
కెంట్: ఇంగ్లండ్‌లోని కెంట్ అయ్యప్ప ఆలయంలో నిన్న (జనవరి 14, బుధవారం) మకరవిళక్కు మహోత్సవం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ఆలయం తెరవడంతో ఉత్సవం ప్రారంభమైంది. ఆ తర్వాత ఉదయం 7:10 గంటలకు నిర్మాల్య దర్శనం. ఉదయం 7:30 గంటలకు ఉష పూజ, ఉదయం 8 గంటలకు గణపతి హోమం, ఉదయం 9 గంటలకు ఉచ్చ పూజ నిర్వహించారు.సాయంత్రం 5.30 గంటల నుంచి విశేష అభిషేకం, పూజ, దీపారాధన, సహస్రనామార్చనలు నిర్వహించారు. రాత్రి ఉత్సవాల్లో రాత్రి 9 గంటలకు అథజా పూజ, 9.30 గంటలకు పడిపూజ, 9.45 గంటలకు హరివరాసనం నిర్వహించారు. అభిజిత్, తాజూరు మన హరినారాయణన్ నంబితీశ్వరర్ పూజలు నిర్వహించారు. వెల్లిఒత్తిల్లం అద్రిత్ వాసుదేవ్ కూడా పూజలు నిర్వహించారు. విశ్వజిత్ త్రిక్కాకర సోపాన సంగీతం, తత్త్వమసి బృందం, భజనలు, రమ్య అరుణ్ కృష్ణన్ భరతనాట్యం ప్రదర్శించారు. -
బ్లోఅవుట్ అంటే.. అతిపెద్ద ప్రమాదం ఎక్కడంటే?
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. మలికిపురం మండలం ఇరుసుమండలో మోరి-5 ఓఎన్జీసీ బావిలో డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా గ్యాస్ లీక్ కావడంతో భారీ శబ్దంతో అగ్నికీలలు విరుచుకుపడ్డాయి. గ్యాస్ లీక్ కారణంగా ఘటనా స్థలంలో మంటలు ఇంకా చెలరేగుతున్నాయి. మంటలపై అగ్నిమాపక యంత్రాలతో నీటిని విరజిమ్మే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. బ్లోఅవుట్ను పూర్తిగా నియంత్రించేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బ్లోఅవుట్ అంటే ఏంటి?.. అతిపెద్ద బ్లోఅవుట్ ప్రమాదాలు ఎక్కడ జరిగాయి?.. బ్లోఅవుట్ అంటే ఏంటి?.బ్లోఅవుట్ అనే పదానికి వాడుకని బట్టి వేర్వేరే అర్థాలు ఉన్నాయి. ముఖ్యంగా బ్లోఅవుట్ అంటే పేలుడు అనే అర్థం వస్తుంది. గ్యాస్ లీక్ బ్లోఅవుట్: బ్లోఅవుట్ అగ్ని ప్రమాదం (Blowout Fire Accident) అనేది ఆయిల్ & గ్యాస్ పరిశ్రమలో అత్యంత ప్రమాదకర సంఘటనల్లో ఒకటి. ఇది వెల్‌లోని ప్రెషర్ నియంత్రణ తప్పిపోవడం వల్ల చమురు లేదా గ్యాస్ ఒక్కసారిగా బయటకు రావడం, ఆ తర్వాత అది మంటలు అంటుకోవడం ద్వారా జరుగుతుంది.టైర్ బ్లోఅవుట్: వాహనం టైర్ అకస్మాత్తుగా పగిలిపోవడం లేదా గాలి ఒక్కసారిగా బయటకు రావడం. ఇది అధిక వేగం, అధిక ఉష్ణోగ్రత, లేదా టైర్లో లోపం వల్ల జరుగుతుంది. ప్రమాదకర పరిస్థితి, వాహనం నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది.బ్లోఅవుట్‌కు కారణాలు.. ప్రెషర్ నియంత్రణ లోపం: డ్రిల్లింగ్ సమయంలో వెల్‌లోని ప్రెషర్‌ను సరైన విధంగా నియంత్రించకపోవడంBlowout Preventer (BOP) విఫలం: వెల్‌ను మూసివేయడానికి ఉపయోగించే పరికరం పనిచేయకపోవడం.సిమెంటింగ్ లోపాలు: వెల్‌లో గ్యాస్/ఆయిల్ లీక్ కాకుండా సిమెంట్ బారియర్ బలహీనంగా ఉండడం.మానవ తప్పిదాలు: ఆపరేటర్లు సరైన పద్ధతిలో పరీక్షలు చేయకపోవడం లేదా అత్యవసర పరిస్థితిని గుర్తించకపోవడం.బ్లోఅవుట్ ప్రభావం ఎలా.. మంటలు: వెల్‌హెడ్ వద్ద చమురు/గ్యాస్ మంటలు అంటుకోవడం.మరణాలు/గాయాలు: కార్మికులు ప్రాణాలు కోల్పోవడం లేదా తీవ్ర గాయాలు పొందడం.పర్యావరణ నష్టం: చమురు లీక్ వల్ల సముద్ర జీవులు, తీరప్రాంతాలు ప్రభావితం అవుతాయి.ఆర్థిక నష్టం: కంపెనీలకు బిలియన్ల డాలర్ల నష్టం, శుభ్రపరిచే ఖర్చులు.అతిపెద్ద బ్లోఅవుట్ ప్రమాదాలు..పైపర్ ఆల్ఫా ప్రమాదం: పైపర్ ఆల్ఫా (Piper Alpha.. UK) ఘటన ప్రపంచంలోనే అతిపెద్ద బ్లోఅవుట్ ఘటన. ఇది చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఆఫ్‌షోర్ ఆయిల్ & గ్యాస్ ప్రమాదం. ఈ ఘటన యూకేలోని ఉత్తర సముద్రంలో 1988 జూలై 6న జరిగింది. ఈ ప్రమాదంలో గ్యాస్ లీక్, మంటల కారణంగా 167 మంది కార్మికులు మృతి చెందారు. 61 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. భారీ మొత్తంలో ఆర్థిక నష్టం జరిగింది. ఈ ప్రమాదం సందర్భంగా వరుసగా పేలుళ్లు జరిగి, రెండు గంటల్లోనే మొత్తం నిర్మాణం కూలిపోయింది. సముద్రంలో భారీగా చమురు, గ్యాస్ లీక్ అయ్యి మంటలు వ్యాపించాయి.డీప్ వాటర్ హారిజాన్ ప్రమాదం: డీప్ వాటర్ హారిజాన్ ప్రమాదం అమెరికాలోని గల్ప్ ఆప్ మెక్సికో ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. ఈ ఘటన 20 ఏప్రిల్ 2010న చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 4.9 మిలియన్ బ్యారెల్స్ చమురు సముద్రంలోకి లీక్ అయింది. అనంతరం మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా పర్యావరణం, సముద్ర జీవులు మరణించాయి. తీరప్రాంత ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన నష్టం జరిగింది.దేశాన్ని వణికించిన పాశర్లపూడి బ్లోఅవుట్..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడి కుదురు మండలం పాశర్లపూడిలో 1995 జనవరి 8వ తేదీన బ్లోఅవుట్ ఘటన చోటుచేసుకుంది. ఆనాడు ఓఎన్జీసీ వాళ్ళ చమురు అన్వేషణలో భాగంగా డ్రిల్లింగ్ జరుగుతున్న సమయంలో 19వ సెక్టార్లో జరిగిన చిన్న పొరపాటు భారీ ప్రమాదానికి దారి తీసింది. భారీగా మంటలు చెలరేగాయి. ఆ మంటల తాకిడికి కొబ్బరి చెట్లు అంటుకొని క్షణాల్లో అగ్నికి ఆహుతి అయిపోయాయి. బ్లోఅవుట్ కారణంగా చుట్టుపక్కల జనం ఇళ్లు వదిలి పారిపోయారు. ఊళ్లకు ఊళ్లు తరలించాల్సి వచ్చింది. రాత్రి పూట కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళను కూడా ఆ అగ్ని కీలలు కనబడుతూ భయపెట్టేవి. ఓఎన్జీసీ నిపుణులు ఈ బ్లోఅవుట్ ఆర్పటానికి శతవిధాలా ప్రయత్నించి చేతులెత్తేశారు. ఇక లాభం లేదని విదేశాల నుంచి నిపుణులను రప్పించారు. అలా 65 రోజుల తరువాత గాని బ్లోఅవుట్ను పూర్తిగా ఆర్పలేకపోయారు. అంటే మార్చి 15కు గాని పరిస్థితి అదుపులోకి రాలేదు.నివారణ చర్యలు.. Blowout Preventer పరికరాలను తరచుగా పరీక్షించడం.వెల్ డిజైన్, సిమెంటింగ్ ప్రమాణాలను కఠినంగా పాటించడం.అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికలు సిద్ధంగా ఉంచడం.సిబ్బందికి ప్రత్యేక శిక్షణ, మాక్ డ్రిల్స్ నిర్వహించడం. -
‘నేను నీ బానిసనా?’.. మేనేజర్‌కి బుద్ది చెప్పిన ఉద్యోగి!
లండన్: యూకేలో కెంటకీ ఫ్రైడ్ చికెన్ (KFC) రెస్టారెంట్లో మేనజర్‌గా పనిచేస్తున్న శ్రీలంక మేనేజర్‌కి.. భారతీయ ఉద్యోగి గట్టిషాకిచ్చాడు. నువ్వు నా బానిసవి అంటూ చేసిన అవమానకర వ్యాఖ్యలపై సదరు మేనేజర్ని ఆధారాలతో సహా కోర్టుకీడ్చాడు. కోర్టు సైతం మేనేజర్ని చివాట్లు పెట్టింది. భారత కరెన్సీలో రూ.81లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.అంతర్జాతీయ కథనాల ఆధారంగా.. తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ 2023లో లండన్‌లోని వెస్ట్ విక్హామ్ కేఎఫ్‌సీ అవుట్‌లెట్‌లో ఉద్యోగం ప్రారంభించారు. కొద్ది నెలల్లోనే అతని మేనేజర్, శ్రీలంకకు చెందిన కజన్ థైవెంటిరం అతనిపై బానిస,భారతీయులు మోసగాళ్లు అంటూ అవమానించారు. దీంతో జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన కజన్‌పై రవిచంద్రన్ ఎంప్లాయిమెంట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాడు. అంతేకాదు.. లీవ్ అడిగితే ఇవ్వకపోవడం, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినట్లు పలు ఆధారాల్ని ట్రైబ్యునల్‌కు అందించాడు. ఈ కేసును పరిశీలించిన ఎంప్లాయ్మెంట్ ట్రైబ్యునల్ రవిచంద్రన్‌కు అండగా నిలిచింది. మేనేజర్ ప్రవర్తనను జాతి వివక్షగా గుర్తించింది. కోర్టు తీర్పు ప్రకారం.. అతనికి 67వేల యూరోలు (సుమారు రూ.81 లక్షలు) పరిహారం చెల్లించాలని ఆదేశించింది.ట్రైబ్యునల్ జడ్జి పాల్ అబ్బాట్ తీర్పులో ‘ఈ కేసులో జాతి వివక్ష స్పష్టంగా ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని’ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు యూకేలోని ఉద్యోగ రంగంలో జాతి వివక్షకు వ్యతిరేకంగా బలమైన సందేశాన్ని పంపిందని న్యాయవర్గాలు పేర్కొన్నాయి. -
యూఎస్, యూకే కస్టమర్లే టార్గెట్ : రూ. 14 కోట్లకు ముంచేశారు
బెంగళూరు పోలీసులు ఒక అంతర్జాతీయ సైబర్ క్రైమ్ సిండికేట్‌ను ఛేదించారు. మైక్రోసాఫ్ట్ టెక్నికల్ సపోర్ట్ సిబ్బందిగా నటిస్తూ వైట్‌ఫీల్డ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న నటిస్తూ వందలాది విదేశీయులను మోసం చేస్తున్నారనే ఆరోపణలతో 21 మంది అనుమానితులను అరెస్టు చేశారు.టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం 21 మంది సిబ్బందిని స్థానిక కోర్టు ముందు హాజరుపరిచి పోలీసు కస్టడీకి తరలించారు. సైబర్ కమాండ్ స్పెషల్ సెల్ మరియు వైట్‌ఫీల్డ్ సైబర్ క్రైమ్ విభాగం నుండి వచ్చిన అధికారులు నవంబర్ 14 - 15 తేదీలలో మస్క్ కమ్యూనికేషన్స్‌పై దాడి చేశారు. డెల్టా భవనం, సిగ్మా సాఫ్ట్ టెక్ పార్క్‌లోని ఆరవ అంతస్తులోని సంస్థ కార్యాలయంలో రెండు రోజుల పాటు జరిగిన ఆపరేషన్‌లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, మొబైల్ ఫోన్లు , ఇతర పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు కింగ్పిన్లు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. అమెరికా, యూకేలలో 2022 నుండి ఈ దందా కొనసాగిస్తున్నారని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.ఆగస్టు నుండి ఈ ముఠా అమెరికా, యూకేలలో కనీసం 150 మంది బాధితులను లక్ష్యంగా చేసుకుని, ఒక్కొక్కరిని బిట్‌కాయిన్ ATMలలో దాదాపు పదివేల డాలర్లు (సుమారు రూ. 13.5 కోట్లు) డిపాజిట్ చేయమని బలవంతం చేసినట్టు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. బాధిత కస్టమర్ల బ్యాంక్ వివరాలను సేకరించే ప్రక్రియలో ఉన్నామని ఒక సీనియర్ IPS అధికారి తెలిపారు. నిందితులు మైక్రోసాఫ్ట్ గ్లోబల్ టెక్నికల్ సపోర్ట్ సిబ్బంది అని చెప్పి 'ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC) ఉల్లంఘనలను' ఉల్లంఘించారంటూ బాధితులను భయపెట్టారు. ఈ నెపంతో, వారు నకిలీ భద్రతా పరిష్కారాలు , సమ్మతి విధానాల కోసం పెద్ద మొత్తాలను వసూలు చేశారు. ఇదీ చదవండి: ఫస్ట్ నైటే చెప్పేశాడు...కొత్త పెళ్ళి కూతురి విడాకులుమస్క్ కమ్యూనికేషన్స్ ఆగస్టులో నెలకు రూ.5 లక్షలకు 4,500 చదరపు అడుగుల కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికా వినియోగదారులను లక్ష్యంగా ని హానికరమైన ఫేస్బుక్ ప్రకటనలిచ్చారు.ఇవి ఇతర చట్టబద్ధమైన భద్రతా హెచ్చరికలు లేదా సేవా లింక్‌లాగానే ఉంటాయి. కనిపించకుండా ఎంబెడెడ్ కోడ్ ఉంటుంది. ఒక వినియోగదారు ప్రకటనపై క్లిక్ చేయగానే మైక్రోసాఫ్ట్ గ్లోబల్ టెక్నికల్ సపోర్ట్ నుండి వచ్చినట్లు మెసేజ్ పాప్ అప్ అవుతుంది. నకిలీ హెల్ప్‌లైన్ నంబర్‌కూడా డిస్ప్లే అవుతుందని దర్యాప్తు అధికారులు వివరించారు.బాధితులు ఆ నంబర్‌కు కాల్ చేసినప్పుడు, వారి కంప్యూటర్ హ్యాక్ చేసి, IP చిరునామా,బ్యాంకింగ్ డేటా చోరీ చేస్తారని పేర్కొన్నారు. ఆ తర్వాత వారు బిట్‌కాయిన్ ATMల ద్వారా బాధితులను భారీ మొత్తాలు చెల్లించమని బలవంతం చేశారు.ఇదీ చదవండి: మహిళలూ వంటింటి ఆయుధాలతో సిద్ధంకండి : మమత సంచలన వ్యాఖ్యలుమస్క్ కమ్యూనికేషన్స్ 83 మంది ఉద్యోగలున్నారు. వారిలో 21 మంది సాంకేతిక సిబ్బంది ఈ స్కామ్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. వారికి నెలకు రూ. 15,000 నుండి రూ. 25,000 వరకు జీతాలు చెల్లించారు. ఇదిలా ఉండగా, అహ్మదాబాద్‌కు చెందిన రవి చౌహాన్ అనే వ్యక్తి సుమారు 85 మంది సిబ్బందిని నియమించగా, అతన్ని గత నెలలో అరెస్టు చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య 22కి చేరింది. -
యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా తెలంగాణ వాసి..!
బ్రిటన్‌లో మన తెలంగాణ (Telangana) వాసికి అరుదైన గౌరవం దక్కింది. తాజాగా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ (House of Lords)కు సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిధిలోని శనిగరం (Shanigaram) గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు (Uday Nagaraju) నామినేట్ అయ్యారు. హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు సభ్యులను ప్రధాన మంత్రి సలహా మేరకు కింగ్ ఆఫ్ ఇంగ్లండ్ నామినేట్ చేస్తారు. ఇందుకు రాజకీయ పార్టీలు, స్వతంత్ర కమిటీ, ప్రజల నుంచి కూడా నామినేషన్లు వస్తాయి. ప్రధానంగా నైపుణ్యం, అనుభవం, దేశానికి సేవ ఆధారంగా హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎంపిక చేస్తారు. ఈ పదవికి భారతీయ సంతతికి చెందిన వారిని కూడా నామినేట్ చేస్తారు. బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అనేది బ్రిటిష్ పార్లమెంట్ ఎగువ సభ. ఇది చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం, ముఖ్యమైన అంశాలపై చర్చించడం వంటి ప్రధాన విధులను నిర్వర్తిస్తుంది. కాగా, గతంలో నాగరాజు బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ (North Bedfordshire) నుంచి లేబర్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ నాగరాజు జన్మించారు. శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు హనుమంత రావు నిర్మలాదేవి దంపతుల కుమారుడు. చిన్నప్పటి నుంచి కష్టపడేతత్వం కలిగిన ఉదయ్ అంచెలంచాలుగా ఎదిగారు. ఆయన విద్యాభ్యాసం అంతా వరంగల్, హైదరాబాద్‌నే పూర్తయింది. ఆ తర్వాత బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్ లో పాలనా శాస్త్రంలో పీజీ చేశారు.ప్రపంచ సమాజం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పభ్రావం ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్-ట్యాంక్ ని నెలకొల్పారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్ కు మంచిపట్టు ఉంది.(చదవండి: శంకరనేత్రాలయ ఆధ్వర్యంలో అట్లాంటాలో భూరినిధుల సేకరణ) -
వణికిస్తున్న సూపర్‌ఫ్లూ.. రికార్డు స్థాయి కేసులు
లండన్: యూరప్‌ను ‘సూపర్‌ఫ్లూ’ వణికిస్తోంది. దీనిని హెచ్3ఎన్2 అని పిలుస్తారు. ఇది ఇన్ఫ్లుఎంజా జాతిలో భారీగా మార్పు చెందిన వేరియంట్. ‘సూపర్‌ఫ్లూ’ ఆకస్మిక పెరుగుదలతో ఆస్పత్రులన్నీ బాధితులతో నిండిపోతున్నాయి. ఇన్ఫ్లుఎంజా ఏ (H3N2)కు చెందిన ‘కే-స్ట్రెయిన్’ ఇప్పుడు యూకేలో దాదాపు 90శాతం ఫ్లూ కేసులకు కారణంగా నిలుస్తోంది. ఇది ఫ్రాన్స్, స్పెయిన్, ఇతర దేశాలకు కూడా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఆరోగ్య నిపుణులు దీనిని అత్యంత తీవ్రమైన ఫ్లూ వేవ్ అని హెచ్చరిస్తున్నారు. గత శీతాకాలంతో పోలిస్తే ఈసారి ఫ్లూ కేసులు మూడు రెట్లు పెరిగాయి.ఈ సంక్షోభం యూకే ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆస్పత్రులలో పడకలు, సిబ్బంది కొరత ఏర్పడింది. పలు పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది అధికంగా గైర్హాజరవుతున్నారు. కొన్ని చోట్ల ఫ్లూ వ్యాప్తిని నిరోధించేందుకు, సామూహిక సమావేశాలను నిషేధించారు. ఫ్రాన్స్‌లోని ఆస్పత్రులలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. స్పెయిన్‌లో ఫేస్ మాస్క్‌లు, ఫ్లూ మందులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. పలు ఫార్మసీలు ఈ డిమాండ్‌ను తట్టుకోలేక అవస్థలు పడుతున్నాయి.ఈ సూపర్‌ఫ్లూ కారణంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఆస్పత్రులలో చేరుతున్నారు. ప్రజారోగ్య అధికారులు ఈ వ్యాప్తి కొద్దిరోజుల్లో గరిష్ట స్థాయికి చేరుకోనున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే శీతాకాల నెలల్లో మరిన్ని కేసులు నమోదువుతాయంటూ అంచనాలు వేస్తున్నారు. COVID-19 మహమ్మారి ముగిసిన కొన్నేళ్ల తర్వాత ఎదురైన ఈ సంక్షోభం యూరప్‌లో కల్లోలం సృష్టిస్తోంది. వివిధ ప్రభుత్వాలు పెరుగుతున్న కేసులను నియంత్రించేందుకు మరిన్ని వైద్య సదుపాయాలను సమకూరుస్తున్నాయి.ఇది కూడా చదవండి: బిడ్డ పుడితే... ఏడాదిన్నర సెలవు! -
పాక్, బంగ్లాదేశ్ విద్యార్థులకు యూకే యూనివర్సిటీల షాక్
-
యూకేలో ప్రోస్టేట్ కాన్సర్పై అవగాహన
బిబిసి (బెర్క్‌షైర్ బాయ్స్ కమ్యూనిటీ) ఆధ్వర్యంలో ఇటీవల బ్రిట్‌వెల్ లైబ్రరీలో మువెంబర్ డేని ఘనంగా నిర్వహించారు. యూకె నలుమూలనుండి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రోస్టేట్ కాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రము ద్వారా మగవాళ్ళ లో తరచుగా వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ పైన అవగాహన కల్పించి , దాన్ని ఎలా నిర్ములించుకోవాలో సూచనలు చేసి ,చారిటీ ప్రోగ్రాం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రోగ్రాంతో ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన వంద మందికి పైగా పురుషులు హాజరైనారు. .ఈ ఈవెంట్లో భాగంగా మేము ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన ఛారిటీ మొత్తానికి 809 GBP(85 K INR)** పౌండ్స్ కు పైగా సేకరించారు.. నవంబరు నెల ప్రోస్టేట్ క్యాన్సర్‌కు అంకితం చేయబడినందున తాము ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన నడకను కూడా ప్రారంభించామని నిర్వాహకుతు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి ,చారిటీ ద్వారా వచ్చిన ఆర్ధిక సహాయంతో ప్రోస్టేట్ కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న వారికి , రెండు తెలుగు రాష్ట్రాలలో, యుకెలో ఆర్ధికంగా ఆదుకుంటున్నామనీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి మంచి ఆలోచనతో ప్రోగ్రామ్స్ నిర్వహించడం తెలుగు వారందరికీ గర్వకారణమని పలువురు ప్రశంసించారు. ఈ ఈవెంట్ విజయానికి సహకరించిన సభ్యులు బి.బి.సి కోర్ టీం ఉన్నారు. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన స్పాన్సర్స్ అందరికి వినమ్ర పూర్వక అభినందనలు అని కమిటీ సభ్యులు తెలిపారు. -
షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో మహిళకు వేధింపులు : చైనా రియాక్షన్ ఇదే
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన మహిళను చైనా అధికారులు షాంఘై విమానాశ్రయంలో 18 గంటల పాటు అక్రమంగా నిర్బంధించిన ఘటనలో చైనా స్పందించింది. షాంఘై విమానాశ్రయంలో భారతీయ మహిళను వేధించారనే ఆరోపణలను చైనా ఖండించింది. థాంగ్డోక్కు ఎదురైన అనుభవంపై స్పందన కోరగా, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఆ మహిళ ఆరోపించినట్లుగా ఎటువంటి తప్పనిసరి చర్యలు, నిర్బంధం లేదా వేధింపులకు లేవని పేర్కొన్నారు.లండన్ నుంచి జపాన్‌కు ప్రయాణిస్తున్నకి షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో భారతీయ మహిళలను అడ్డుకున్న దుమారం రేగిన ఒక రోజు తరువాత డ్రాగన్ కంట్రీ దీనిపై వివరణ ఇచ్చింది. నవంబర్ 21న లండన్ నుండి జపాన్‌కు ప్రయాణిస్తున్న యూకేకి చెందిన భారతీయ పౌరురాలు పెమా వాంగ్జోమ్ థాంగ్‌డాక్, పాస్‌పోర్ట్‌లో జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని పేర్కొనడంపై ఎయిర్పోర్ట్ ఇమ్మిగ్రేషన్ సిబ్బంది తనను ఆపారని తెలిపింది. చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు తీసుకున్న చర్యలు చట్టాలు , నిబంధనల ప్రకారం ఉన్నాయని పేర్కొంటూ ఈ సందర్భంగా వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. కాగా అరుణాచల్ చైనా భూభాగం అంటూ షాంఘైలో విమానంలో దిగిన థాంగ్లో పాస్‌పోర్ట్‌ను చూసిన చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తించిన వెంటనే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం, కనుక ఇండియన్ పాస్‌పోర్ట్ చెల్లదని వాదించి అవమానించి వేధింపులకు గురిచేశారు. తదుపరి విమానం ఎక్కకుండా, కనీసం ఆహారం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆమె కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె థాంగ్డోక్ తన స్నేహితుడి ద్వారా షాంఘైలోని భారతీయ కాన్సులేట్‌కు సమాచారం అందించింది. భారతీయ అధికారుల జోక్యం తర్వాత ఆమెను రాత్రి ఆలస్యంగా విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. -
యూకే వీడిన లక్ష్మీ మిట్టల్: కారణం ఇదే..
మూడు దశాబ్దాలు బ్రిటన్‌లో ఉంటూ.. అత్యంత ధనవంతులైన బిలియనీర్ల జాబితాలో ఒకరుగా నిలిచిన ఉక్కు వ్యాపారి లక్ష్మీ ఎన్ మిట్టల్ ఆ దేశానికి వీడ్కోలు పలికారు. 30ఏళ్లు యూకేలో ఉన్న ఈయన ఇప్పుడు ఆ దేశాన్ని ఎందుకు వీడారు?, దీనికి కారణం ఏమిటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.2025 'సండే టైమ్స్ రిచ్ లిస్ట్' ప్రకారం ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ వర్క్స్ ఫౌండర్ 15.4 బిలియన్ పౌండ్ల ఆస్తిని కలిగి ఉన్నారని అంచనా. దీంతో లక్ష్మీ మిట్టల్ యూకేలో ఎనిమిదవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అయితే ఇప్పుడు ఈయన దేశాన్ని వీడటానికి ప్రధాన కారణం.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు నిర్ణయాలే అని తెలుస్తోంది.ప్రస్తుతం లక్ష్మీ మిట్టల్ స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్నారు. తరువాత తాను భవిష్యత్తును దుబాయ్‌లో గడిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు ఇప్పటికే దుబాయ్‌లో ఒక భవనం ఉంది. అంతే కాకండా ఈయనకు ఐరోపా, అమెరికాలలో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. లండన్‌లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ గార్డెన్స్ ప్రాంతంలో ఒక విలాసవంతమైన భవనం కూడా ఉంది.లక్ష్మీ ఎన్ మిట్టల్1950 జూన్ 15న రాజస్థాన్‌లో పుట్టిన లక్ష్మీ నారాయణ్ మిట్టల్.. స్టీల్ ఇండస్ట్రీలో తిరుగులేని వ్యక్తిగా ఎదిగారు. స్టీల్ ఉత్పత్తిలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. సుమారు 24 బిలియన్ యూరోల విలువైన ఈ కంపెనీలు లక్ష్మీ ,మిట్టల్ కుటుంబం వాటా 40 శాతం వరకు ఉంది. 2021లో లక్ష్మి మిట్టల్ సీఈఓగ బాధ్యతలు వదులుకున్న తరువాత.. ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.భారతదేశంలో పుట్టిన లక్ష్మీ మిట్టల్ 1995లో తన కుటుంబంతో పాటు లండన్‌లో స్థిరపడ్డారు. 30 ఏళ్లుగా అక్కడే ఉన్న వీరు.. అక్కడి ప్రభుత్వం తీసుకున్న వారసత్వ పన్ను రద్దు కారణంగా.. స్విట్జర్లాండ్‌కు మకాం మార్చారు. ఈయన నెట్‌వర్త్ 22 బిలియన్ డాలర్లు.ఇదీ చదవండి: అంబానీ స్కూల్లో ఫీజులు అన్ని లక్షలా? -
నాస్కామ్ యూకే ఫోరమ్ షురూ
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమల అసోసియేషన్ నాస్కామ్ యూకే ఫోరమ్‌ను ఆవిష్కరించింది. తద్వారా రెండు యునైటెడ్ కింగ్డమ్(యూకే), భారత్ మధ్య ద్వైపాక్షిక టెక్నాలజీ, వాణిజ్య భాగస్వామ్యాలు మరింత విస్తరించనున్నట్లు పేర్కొంది. దేశీ టెక్నాలజీ పరిశ్రమకు యూకే రెండో పెద్ద మార్కెట్‌కాగా.. వార్షిక ఆదాయం 90 బిలియన్ డాలర్లను మించుతోంది. ఈ నేపథ్యంలో నాస్కామ్ యూకే ఫోరమ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. భారత్, యూకే మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 56 బిలియన్ డాలర్లుకాగా.. సరీ్వసుల వాణిజ్యం 33 బిలియన్ డాలర్లుగా అంచనా. 2030కల్లా రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపునకు పెంచుకోవాలనేది స్వేచ్చా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) లక్ష్యంకాగా.. డిజిటల్, టెక్నాలజీ ఆధారిత వృద్ధి కీలకంగా నిలవనుంది. సాంకేతిక భద్రతా కార్యాచరణ(టీఎస్ఐ)లో భాగంగా రెండు దేశాల మధ్య ఏఐ సాంకేతిక సహకారం మరింత ముందుకు సాగడంలో నాస్కామ్ యూకే ఫోరమ్ ప్రధాన పాత్ర పోషించనుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఏఐ వినియోగం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూకే సిటిజన్ సరీ్వసులను పెంచుకోవడంలో ఉపయోగపడనున్నట్లు నాస్కామ్ పేర్కొంది. ఏఐకు సిద్ధపడటం, మానవవనరుల నైపుణ్య పెంపు, డిజిటల్‌వైపు ఎస్ఎంఈల ప్రయాణం(ట్రాన్స్ఫార్మేషన్)సహా బాధ్యతాయుత ఏఐ వినియోగం, ఇన్నోవేషన్ విధానాలను పంచుకోవడం ద్వారా రెండు దేశాలు లబ్ది పొందనున్నట్లు అభిప్రాయపడింది. -
ఎట్టకేలకు పెదవి విప్పిన పెద్దోడు
ప్రపంచ దేశాల నుంచి ఎంతో గౌరవమర్యాదలు అందుకునే బ్రిటన్ రాజ కుటుంబం.. నిగూఢ విబేధాలకూ కేంద్రంగా కూడా ఉంది. మరీ ముఖ్యంగా డయానా పిల్లలు ప్రిన్స్ విలియమ్, హ్యారీలు దూరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తరుణంలో హ్యారీ గురించి విలియమ్ చేసిన ఒక్క వ్యాఖ్య.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. యాపిల్ టీవీ షో(The Reluctant Traveller) లో భాగంగా యూజీన్ లెవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విలియమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘‘హ్యారీ -నేను చిన్నతనంలో ఎదుర్కొన్న పాత పద్ధతులు మళ్లీ రాకూడదని ఆశిస్తున్నా. అలాంటి పరిస్థితులు తిరిగి రాకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా’’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండడంతో ఏదైనా అద్భుతం జరగబోతోందా? అనే చర్చ జోరందుకుంది. విలియం, హ్యారీలు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-డయానా సంతానం. తల్లి డయానా ప్రమాదంలో మరణించాక గ్లోబల్ మీడియా దృష్టి ఇద్దరిపై ఉంటూ వచ్చింది. అయితే.. 2016 నుంచి ఈ అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలయ్యాయి. నటి మేఘన్ మార్కెల్‌ను 2018లో ప్రిన్స్ హ్యారీ వివాహం చేసుకున్నాక అవి మరింత ముదిరాయి. ఈ క్రమంలో 2020లో హ్యారీ రాజ కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకుని భార్యతో అమెరికాకు వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2021లో ఓఫ్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ కుటుంబంపై హ్యారీ-మేఘన్‌లు చేసిన ఆరోపణలు ఆ గ్యాప్‌ను మరింత పెంచాయి. అప్పటి నుంచి ఆ అన్నదమ్ముల మధ్య మాటల్లేవ్!. ఈలోపు.. వీళ్లను కలిపేందుకు ప్రయత్నాలు చాలానే జరిగాయి. హ్యారీ అన్నతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నా విలియమ్ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదనే ప్రచారం ఒకటి ఉంది. ఈలోపు కొన్ని వార్తా సంస్థలు.. హ్యారీ ఒక్కడిగా వస్తేనే తాను మాట్లాడతానంటూ విలియమ్ షరతు పెట్టినట్లు కథనాలు ఇచ్చాయి. 2022 సెప్టెంబర్‌లో వీళ్ల నాన్నమ్మ క్వీన్ ఎలిజబెత్ మరణించిన సమయంలోనూ ఈ ఇద్దరు కలుసుకుంటారనే ప్రచారం జరిగింది. ఆ మధ్య తండ్రిని కింగ్ చార్లెస్-IIIని చూడడానికి వచ్చిన సమయంలోనూ అన్నతో హ్యారీ భేటీ అవుతాడనే ప్రచారమూ జరిగింది. చివరిసారిగా ఈ ఇద్దరూ 2024 ఆగస్టులో మామ లార్డ్ రాబర్ట్ ఫెలోస్ స్మరణ సభలో పక్కపక్కనే కనిపించినా మాట్లాడుకోలేదు.దీంతో.. విలియమ్ తాజా వ్యాఖ్యలతో అన్నదమ్ములు ఒక్కటవుతారా? అనే చర్చ నడుస్తోంది. అయితే.. అది కేవలం వ్యక్తిగత వ్యాఖ్య కాదని.. రాజ కుటుంబంలో తరం మార్పునకు సంకేతంగా భావించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్నతనంలో ఆ అన్నదమ్ములు ఎదుర్కొన్న మీడియా ఒత్తిళ్లు, కుటుంబ వ్యవస్థల లోపాల గురించే విలియమ్ మాట్లాడి ఉంటారని, తన పిల్లల కోసం, భవిష్యత్ రాజ కుటుంబం కోసం మంచి వాతావరణం కల్పించేందుకు ప్రయత్నిస్తానని చెప్పి ఉంటారని విశ్లేషిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ వ్యాఖ్యలు కచ్చితంగా హ్యారీ, మేఘన్‌లకు సర్ప్రైజేనని అంటున్నారు. View this post on Instagram A post shared by The Mirror (@dailymirror) -
బాలల సాహిత్యానికీ బుకర్
లండన్: ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన సాహితీ పురస్కారాల్లో ఒకటైన బుకర్ ప్రైజ్‌ను అందించే బుకర్ ప్రైజ్ చారిటీ శుక్రవారం మరో విశేషమైన ప్రకటన చేసింది. బాలల సాహిత్యానికి బుకర్ పురస్కారాన్ని అందజేయనున్నట్లు తెలిపింది. ‘ఈ సాహిత్యం 8– 12 ఏళ్ల వయస్సున్న పిల్లల కోసం రాసిన లేదా ఆంగ్లంలోకి అనువదించిన అత్యుత్తమ సమకాలీన కాల్పనిక సాహిత్యమై ఉండాలి. యూకే లేదా ఐర్లాండ్‌లో ప్రచురించినదై ఉండాలి’అని బుకర్ ప్రైజ్ చారిటీ తెలిపింది. ప్రముఖులతోపాటు పిల్లలే జడ్జీలుగా వ్యవహరిస్తూ విజేతను ఎంపిక చేస్తారని పేర్కొంది. ఎంపికైన రచయితకు చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్‌గా 50వేల పౌండ్లు, అంటే సుమారు రూ.58 లక్షలను అందజేస్తామని తెలిపింది. -
యూకే అడుగెట్టిన ఇండియన్ కంపెనీ: ఏకంగా 51 దేశాల్లో..
ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటైన హీరో మోటోకార్ప్ (Hero MotoCorp).. మోటోజీబీ భాగస్వామ్యంతో యునైటెడ్ కింగ్డమ్(UK)లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానా హంక్ 440 మోడల్ శ్రేణిని ప్రవేశపెట్టింది.హంక్ 440 బైక్ ట్విలైట్ బ్లూ, ఫాంటమ్ బ్లాక్, టైటానియం గ్రే అనే మూడు రంగులలో లభిస్తుంది. దీనిని కంపెనీ హార్లే డేవిడ్సన్ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇందులో 440 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 6000 rpm వద్ద 27 Bhp పవర్, 4000 rpm వద్ద 36 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర 3,499 పౌండ్లు (సుమారు రూ. 4.08 లక్షలు).హీరో మోటోకార్ప్ ఇటలీ, స్పెయిన్లలో తన ఉనికిని విస్తరించిన తరువాత యూకేలో హంక్ 440 బైకుతో అడుగుపెట్టింది. న్యూఢిల్లీకి చెందిన ఈ కంపెనీ ఇప్పుడు ఆసియా, ఆఫ్రికా, యూరప్, లాటిన్ అమెరికాలోని 51 దేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ, 125 మిలియన్లకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. -
లండన్-ముంబై ఫ్లైట్.. కాక్‌పిట్‌లో ప్రత్యక్షమైన ప్రధాని
బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్(Keir Starmer In India) భారత్‌కు చేరుకున్నారు. ముంబైలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ఈ పర్యటనకు బయల్దేరిన సమయంలో విమానం కాక్‌పిట్‌లో ప్రత్యక్షమై.. కాసేపు ఆయన సందడి చేశారు. ‘‘నేను మీ ప్రధానిని..’’ అంటూ ఇంటర్‌కామ్ ద్వారా ప్రయాణికులను ఉత్సాహంగా పలకరించారాయన. లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టులో బయల్దేరే ముందు.. ‘‘కాక్‌పిట్ ఉంది మీ ప్రధాని. మీ అందరిని ఈ ప్రయాణంలో కలవడం నిజంగా అద్భుతంగా ఉంది. ఇది బ్రిటన్ నుంచి భారత్‌కు పంపిన అతిపెద్ద వాణిజ్య మిషన్. కొత్త ఫ్రీ ట్రేడ్ ఒప్పందంలో ఉన్న అన్ని అవకాశాలను అన్వేషించేందుక ప్రయత్నిస్తాం. మీతో కలిసి ప్రయాణిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విమానం దిగాక మరిన్ని అప్డేట్స్ అందిస్తా’’ అంటూ నవ్వుతూ ఆయన అన్నారు. ఈ వీడియోను స్వయంగా ఆయనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు(UK PM In Cockpit Video). View this post on Instagram A post shared by Keir Starmer (@keirstarmer)ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రెండ్రోజులపాటు భారత్‌లో పర్యటించనున్నారు. విజన్ 2035-Vision 2035 పేరిట ఇరు దేశాల భారత్–యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించనున్నారు. తన పర్యటనలో స్టార్మర్.. 125 మందికి పైగా వ్యాపార నాయకులు, సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యంపై రెండు దేశాల నడుమ పూర్తిస్థాయిలో చర్చలు జరిగే అవకాశముంది. ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. అయితే ఈ రెండు దేశాల మధ్య జూలైలోనే కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని యూకే పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. ఇదే జరిగితే 90 శాతం వరకు వస్తువులపై టారిఫ్‌లు రద్దవుతాయి. స్టార్మర్ వెంట వ్యాపారవేత్తలు, యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులతో కూడిన 100 మందితో కూడిన బృందం రానుంది. దాదాపు 9 ఏళ్ల అనంతరం ప్రధాని ప్రతినిధి బృందంలో భారత్‌కు వస్తున్నందుకు ఎంతో ఆసక్తితో ఉన్నామని ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ)యూకే చైర్మన్ లార్డ్ కరణ్ బిలిమోరియా పేర్కొన్నారు. కాగా, రెండు దేశాల నడుమ ప్రస్తుతం 44.1 బిలియన్ పౌండ్ల మేర వాణిజ్యం జరుగుతోంది. జూలైలో కుదిరిన వాణిజ్య ఒప్పందం ఫలితంగా 2030 కల్లా ఇది రెట్టింపవుతుందని అంచనాలున్నాయి. ఇదీ చదవండి: నాలుగు రోజులుగా ట్రాఫిక్‌లోనే నరకం -
రెడింగ్‌లో భవ్యంగా బతుకమ్మ జాతర
బర్క్‌షైర్ (యూకే): యునైటెడ్ కింగ్డమ్ రెడింగ్లోని రెడింగ్ జాతర టీమ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు కుటుంబాల సమాగమంగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమానికి వెయ్యికి పైగా మంది హాజరై, తెలంగాణ సంస్కృతిని ఘనంగా చాటారు. పారంపర్య బతుకమ్మ పాటలతో మహిళలు బతుకమ్మలు ఆడగా, యువతులు, పిల్లలు ఉత్సాహంగా డాండియా ఆడుతూ ఆనందాన్ని పంచుకున్నారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన దుర్గాపూజతో వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్నారులు కట్టిపడేసేలా భరతనాట్యం ప్రదర్శించగా, తెలుగు వంటకాలతో సాంప్రదాయ విందు అందించారు. వేడుకల అనంతరం బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేయడంతో కార్యక్రమం ముగిసింది. ఈ భవ్య కార్యక్రమాన్ని గత 11 ఏళ్లుగా నిరంతరంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు విశ్వేశ్వర్ మంథని, రంజిత్ నడిపల్లి, ప్రసాద్ అవధానుల, రమేశ్ జంగిలి, రఘు, చందు, రామ్‌రెడ్డి, రామ్‌ప్రసాద్, నాగార్జున మాట్లాడుతూ – “తెలంగాణ సంప్రదాయాలను తదుపరి తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం కొనసాగిస్తాం” అని తెలిపారు. -
చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ ఆర్చ్‌బిషప్‌గా ములాలీ
లండన్: చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా మహిళా ఆర్చ్‌బిషప్ నియమితులయ్యారు. ఆర్చ్‌బిషప్ ఆఫ్ కాంటర్‌బరీగా డేమ్ సారా ములాలీ(63)ని కింగ్ ఛార్లెస్–3 నియమించారని శుక్రవారం యూకే ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. దీంతో, చర్చ్ 500 ఏళ్ల చర్రితలో నాయకత్వ స్థాయికి ఎదిగిన మహిళా మతపెద్దగా ములాలీ చరిత్ర సృష్టించినట్లయింది. ప్రపంచ వ్యాప్తంగా 165 దేశాల్లో ఉన్న 8.5 కోట్ల మంది ఆంగ్లికన్లకు ములాలీ ఆధ్యాత్మిక నాయకత్వం వహించనున్నారు. జాతీయ ఆరోగ్య సేవల(ఎన్హెచ్ఎస్) విభాగంలో చీఫ్ నర్స్‌గా పనిచేసిన సారా ములాలీ 2006లో బోధకురాలిగా బాధ్యతలు చేపట్టారు. 2018లో మొట్టమొదటి మహిళా బిషప్ ఆఫ్ లండన్‌గా, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌లో అత్యంత మూడో సీనియర్ మతపెద్దగా ఎదిగారు. గతేడాది నవంబర్ 12వ తేదీన రెవరెండ్ జస్టిన్ వెల్బీ రాజీనామా చేశారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌తో సంబంధమున్న ఓ న్యాయ వాది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడి నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయం తెలిసీ సంబంధిత అధికారులకు సమాచారమివ్వలేదని విమర్శలు రావడంతో ఆయన బాధ్యతల నుంచి వైదొలిగారు. అప్పట్నుంచీ ఆర్చ్‌బిషప్ ఆఫ్ కాంటర్బరీ పదవి ఖాళీగా ఉంది. 106వ ఆర్చ్‌బిషప్ ఆఫ్ కాంటర్‌బరీగా మొట్టమొదటి మహిళగా సారా ములాలీ నియమితులవడాన్ని యూకే ప్రధాని స్టార్మర్ స్వాగతించారు. అయితే, 2026 జనవరిలో లండన్‌లోని సెయింట్ పౌల్స్ కేథడ్రల్‌లో జరిగే కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆర్చ్‌బిషప్ ఆఫ్ కాంటర్‌బరీగా ప్రకటించే వరకు ఆమెను ఆర్చ్బిషఫ్ ఆఫ్ కాంటర్బరీ–డిజిగ్నేట్‌గా వ్యవహరిస్తారు. అనంతరం మార్చిలో కాంటర్బరీ కేథడ్రల్‌లో జరిగే కార్యక్రమంలో అధికారికంగా ఆమెను ఆసీనురాలిని చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లికన్ కమ్యూనియన్ అంతటా లక్షలాది మంది ప్రజలతో విశ్వాస ప్రయా ణాన్ని పంచుకోవడానికి ఎదురు చూస్తున్నట్లు సారా ములాలీ తెలిపారు. ‘ఇది చాలా పెద్ద బాధ్యత అని నాకు తెలుసు. కానీ, దేవుడు ఎప్పటిలాగే నా బాధ్యతను తీసుకుంటాడనే నమ్మకంతోనే కొత్త బాధ్యతల్లోకి అడుగు పెడుతున్నాను’అని ఆమె వినమ్రంగా చెప్పారు. అంతకుముందు, నర్స్‌గా పనిచేసిన ములాలీ 2001లో కేవలం 37 ఏళ్లకే యూకే ప్రభుత్వ చీఫ్ నర్సింగ్ అధికారిగా బాధ్యతలు చేపట్టి, చరిత్ర సృష్టించారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్, గ్లోబల్ ఆంగ్లికన్ కమ్యూనియన్, కాంటర్బరీ డయోసెస్ల ప్రతినిధులతో కూడిన కాంటర్బరీ కోసం క్రౌన్ నామినేషన్స్ కమిషన్ (సీఎన్సీ) సారా ములాలీని ఈ పదవికి ఎంపిక చేసింది. -
కత్తి ఇవ్వలేదని.. డైరెక్టర్ని ఉద్యోగం నుంచి ఊడబీకిన ట్రంప్!
వాషింగ్టన్:అమెరికాలోని ప్రసిద్ధ ఐజెన్‌హవర్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ డైరెక్టర్ జాన్ హెన్రీను ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా పదవి నుంచి తొలగించింది. ఈ నిర్ణయానికి కారణం..బ్రిటన్ రాజు చార్లెస్‌కు ఓ విలువైన చారిత్రక కత్తిని బహుమతిగా ఇవ్వాలన్న ట్రంప్ ఆదేశాలను ఆయన తిరస్కరించడం. ఈ ఘటన అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.1945 నాటి రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన ఆ కత్తిని జాతీయ వారసత్వంగా భావించాల్సినదిగా జాన్ హెన్రీ అభిప్రాయపడ్డారు. ‘ఇది ప్రజల ఆస్తి. చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన వస్తువు. దీన్ని బహుమతిగా ఇవ్వడం సరైనది కాదు’అంటూ ఆయన ట్రంప్ విజ్ఞప్తిని తిరస్కరించారు.అయితే, ట్రంప్ పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు ఈ కత్తిని అమెరికా-బ్రిటన్ మధ్య స్నేహ బంధానికి ప్రతీకగా ఇవ్వాల్సిన బహుమతిగా పేర్కొన్నారు. కత్తి ఇవ్వండి, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని జాన్ హెన్రీకి హెచ్చరికలు జారీ చేశారు. ఉన్నతాదికారులు ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. మ్యూజియంలో ఉన్న కత్తిని ట్రంప్‌కు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ట్రంప్ ఆదేశాల మేరకు ఆయన్ను పదవి నుంచి తొలగించారు. ఈ చర్యపై చరిత్రకారులు, మ్యూజియం నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చారిత్రక సంపదను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణిస్తున్నారు. ఈ వివాదంపై ఇప్పటివరకు ట్రంప్ లేదా బ్రిటన్ రాజు చార్లెస్ స్పందించలేదు. -
గ్లాస్గో మదర్ ఎర్త్ హిందూ టెంపుల్లో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
గ్లాస్గో (స్కాట్లాండ్): నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మదర్ ఎర్త్ హిందూ టెంపుల్లో బతుకమ్మ వేడుకలను శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టెంపుల్ అధ్యక్షుడు డా. పునీత్ బెడి,,ఉపాధ్యక్షురాలు డా. మమత వుసికాలా ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.గత మూడు సంవత్సరాలుగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్న ఈ దేవాలయం, ఈ ఏడాది బతుకమ్మ పండుగను ప్రత్యేకంగా జరిపింది. డా. మమత వుసికాలా, వినీల బత్తులా, వారి స్నేహితులు, దేవాలయ కమిటీ సభ్యుల సమన్వయంతో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించారు.మహిళలు అందరూ రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను తయారు చేసి, సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో గానం చేస్తూ, నృత్యాలు, కోలాటం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా టెంపుల్లో భక్తి శ్రద్ధలతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పండుగలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా గడిపారు. అనంతరం సమీప సరస్సులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పండుగ అనంతరం భోజన విందు కూడా ఏర్పాటు చేయగా, అందరూ మంచి ఆహారం ఆస్వాదిస్తూ, ఉత్సాహంగా ఉత్సవాన్ని ముగించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందాన్ని ప్రకటించారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
యూకేలోని భారతీయ సంపన్నులు.. వీరే!
ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు స్థిరపడి ఉన్నారు. ఇందులో యూకే కూడా ఒకటి. ఈ దేశంలో బ్యాంకింగ్, స్టీల్, రియల్ ఎస్టేట్, రిటైల్ రంగాల్లో విజయవంతమైన కెరీర్లను నిర్మించుకున్న భారత సంతతికి చెందిన బిలియనీర్లు ఉన్నారు. వీరి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.గోపి హిందూజా & కుటుంబంయూకేలో అత్యంత సంపన్నులైన భారతీయ సంతతికి చెందిన బిలియనీర్లలో.. గోపి హిందూజా, అతని కుటుంబం ఒకటి. వీరి నికర విలువ 35.3 బిలియన్ పౌండ్స్ (రూ. 33.68 లక్షల కోట్లు). హిందూజా గ్రూప్.. బ్యాంకింగ్, మీడియా, ఇంధన రంగాలలో దూసుకెళ్తోంది. సంపాదన మాత్రమే కాకుండా.. దాతృత్వ కార్యక్రమాలను చేస్తున్నారు.డేవిడ్ & సైమన్ రూబెన్భారతీయ మూలాలున్న డేవిడ్ & సైమన్ రూబెన్.. యూకేలోని రియల్ ఎస్టేట్ రంగంలో ప్రసిద్ధి చెందారు. వీరు తెలివైన ప్రణాళికలతో.. ఎప్పటికప్పుడు వీరి వ్యాపారాలను విస్తరించుకుంటూ వేకుతున్నారు. వీరి నికర విలువ 26.9 బిలియన్ పౌండ్స్ (సుమారు రూ. 3.19 లక్షల కోట్లు).లక్ష్మీ మిట్టల్ & కుటుంబంలక్ష్మీ మిట్టల్ గురించి తెలియని భారతీయులు చాలా తక్కువమంది ఉంటారు. ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు కంపెనీ అయిన ఆర్సెలర్ మిట్టల్ ఛైర్మన్. ఉక్కు & రియల్ ఎస్టేట్ రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన కుటుంబం నెట్‌వర్త్ 15.4 బిలియన్ పౌండ్స్.అనిల్ అగర్వాల్వేదాంత రిసోర్సెస్ వ్యవస్థాపకుడిగా పేరుపొందిన.. అనిల్ అగర్వాల్ మైనింగ్, మెటల్స్ ద్వారా బాగా సంపాదించారు. వీరు అనేక దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. వేదాంత ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం,పర్యావరణం రంగాల్లో సేవలు అందిస్తున్నారు. వీరి నికర విలువ 7.5 బిలియన్ పౌండ్స్.ప్రకాష్ లోహియాఇండోరమా కార్పొరేషన్ వ్యవస్థాపకుడైన ప్రకాష్ లోహియా.. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లో మొదలైన దేశాల్లో అతిపెద్ద పాలిస్టర్ & సంబంధిత ఉత్పత్తుల ఉత్పత్తిదారులలో ఒకరుగా ఉన్నారు. వీరి నికర విలువ 6.02 బిలియన్ పౌండ్స్. లోహియాకు పాలిస్టర్, ప్యాకేజింగ్, పేట్రోకెమికల్స్, టెక్స్టైల్స్ వంటి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి.మోసిన్ & జుబెర్ ఇస్సాలాంక్షైర్లోని ఒకే పెట్రోల్ బంక్ నుంచి ప్రపంచ రిటైల్ సామ్రాజ్యంగా మారిన మొహ్సిన్ మరియు జుబెర్ ఇస్సా యూకేలోని ధనవంతుల జాబితాలో ఒకరు. ఈజీ గ్రూప్ సహ వ్యవస్థాపకులులైన వీరు.. సూపర్ మార్కెట్ దిగ్గజం అస్డా యజమానులు కూడా. వీరి నికర విలువ 6 బిలియన్ పౌండ్స్ (సుమారు రూ. 710 కోట్ల కంటే ఎక్కువ).నవీన్ & వర్ష ఇంజనీర్నవీన్ & వర్ష ఇంజనీర్ యూకే వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో ప్రముఖ భారతీయ సంతతికి చెందిన వ్యవస్థాపకులు. వీరి నికర విలువ 3.45 బిలియన్ పౌండ్స్. వ్యాపారవేత్తలుగా మాత్రమే కాకుండా.. పర్యావరణ, పారిశ్రామిక సేవలలో మార్గదర్శకులుగా కూడా వారికి గుర్తింపు లభించింది.ఇదీ చదవండి: ఊహకందని చరిత్ర: గూగుల్‌కు ఆ పేరు వచ్చిందిలా..ది అరోరా బ్రదర్స్సైమన్, బాబీ, రాబిన్ అరోరాల మొత్తం నికర విలువ 2.1 బిలియన్ పౌండ్స్. వీరి వ్యాపార ప్రయాణం 2004లో ప్రారంభమైంది. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి వ్యాపార ప్రపంచంలో ఎదగడమే కాకుండా.. యూకేలోని అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో కూడా ఒకరుగా నిలిచారు.లార్డ్ స్వరాజ్ పాల్లార్డ్ స్వరాజ్ పాల్ యూకేలో ఉన్న ఒక గ్లోబల్ స్టీల్ & ఇంజనీరింగ్ కంపెనీ అయిన కాపారో గ్రూప్ వ్యవస్థాపకులు. ఈయన యూకేలో మాత్రమే కాకుండా.. ఇండియా, అమెరికా వంటి దేశాల్లో కూడా వ్యాపార కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం.. 2025 లో ఈయన నికర విలువ 1.025 బిలియన్ పౌండ్స్ అని అంచనా. -
21 ఏళ్లకే న్యాయవాది అయ్యింది
భలే భలే. ఈమె చిన్న వయసులో న్యాయవాది అయ్యింది. అదీ మన దేశంలో కాదు. ఇంగ్లాండ్‌లో. ఇంకా గొప్ప కదూ. న్యాయవాది కావాలంటే ఎన్నో విషయాలపై అవగాహన ఉండాలి. చట్టాలు, న్యాయ సూక్ష్మాలు తెలిసి ఉండాలి. బారెడు పుస్తకాలు చదివి ఉండాలి. నిత్యం సమాజంలో ఏం జరుగుతుందో గమనిస్తుండాలి. ఇవన్నీ చేస్తేనే న్యాయవాదిగా నిలదొక్కుకుంటారు. పాతికేళ్లు దాటితే తప్ప చాలామంది న్యాయవ్యాద వృత్తిని చేపట్టరు. అలాంటిది 18 ఏళ్లకే లా డిగ్రీ పొంది, 21 ఏళ్లకు న్యాయవాదిగా కేసులు వాదిస్తూ పేరు తెచ్చుకుంటోంది ఓ యువతి. తనే కృషాంగి మేష్రామ్ (Krishangi Meshram). భారత సంతతికి చెందిన తను ఇంగ్లాండ్‌లో అతి పిన్న వయస్కురాలైన సొలిసిటర్గా చరిత్ర సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌లోని మాయాపూర్‌కు చెందిన కృషాంగి మెష్రామ్‌కు చిన్ననాటి నుంచి న్యాయశాస్త్రంపై ఆసక్తి ఎక్కువ. న్యాయవాదుల్లా తాను కోర్టులో వాదనలు వినిపించాలని, బాధితులకు న్యాయం అందించాలని భావించింది. వారి కుటుంబం ఇంగ్లండ్‌లో స్థిరపడింది. 15 సంవత్సరాల వయస్సులో స్థానికంగా లా కాలేజీలో చేరాలని భావించినా, ఇంటికి దూరంగా ఉండటానికి ఆమె ఇష్టపడలేదు. ఆ సమయంలో మిల్టన్ కీన్స్‌లోని ఓపెన్ యూనివర్సిటీలో లా చదివేందుకు అవకాశం ఉందని తెలుసుకొని, అందులో చేరాలని నిర్ణయం తీసుకుంది. ఇంట్లోనే తల్లిదండ్రులు, చెల్లెలితో కలిసి ఉంటూ మూడేళ్లపాటు కష్టపడి లా పూర్తి చేసింది. న్యాయవాదిగా పేరు తెచ్చుకునేందుకు కావాల్సిన నైపుణ్యాలను ఆ సమయంలోనే అప΄ోసన పట్టింది. 18 ఏళ్ల వయస్సులో బ్యాచిలర్ ఆఫ్ లాస్ (ఆనర్స్) డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సింగపూర్‌లో ఓ ఉద్యోగంలో చేరింది. మూడేళ్లు అక్కడ పని చేసి, తగిన అనుభవాన్ని గడిచింది. తిరిగి ఇంగ్లండ్ చేరుకున్న ఆమె అతి పిన్న వయస్కురాలైన సొలిసిటర్గా మారింది. ప్రైవేట్ క్లయింట్లకు న్యాయవాదిగా మారి సేవలందిస్తానని వివరిస్తోంది. -
అమెరికా పెంచితే మేం రద్దు చేస్తాం..!
కొత్త హెచ్-1బి వీసాల (H-1B Visa) ఫీజును అమెరికా లక్ష డాలర్లకు పెంచిన వేళ మరో ప్రముఖ దేశం యూకే.. కీలక ప్రతిపాదనల గురించి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, డిజిటల్ నిపుణులకు వీసా ఫీజులను రద్దు చేసే ప్రతిపాదనలపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ యోచిస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలోని టాప్ ఐదు విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న లేదా ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న వ్యక్తులకు వీసా ఖర్చులను పూర్తిగా మాఫీ చేసే ఎంపికలను స్టార్మర్‌కు చెందిన "గ్లోబల్ టాలెంట్ టాస్క్ ఫోర్స్" చర్చిస్తోంది.యూకే (UK)గ్లోబల్ టాలెంట్ వీసా కోసం ఒక్కొక్కరికి 766 పౌండ్లు ఖర్చు అవుతుంది. నిపుణుల జీవిత భాగస్వాములు, పిల్లలకు కూడా ఇదే రుసుము వర్తిస్తుంది. దీంతో పాటు దరఖాస్తుదారులు 1,035 పౌండ్లు వార్షిక హెల్త్‌కేర్ సర్ ఛార్జ్‌ను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.2020లో ప్రవేశపెట్టిన ఈ వీసా విధానం.. సైన్స్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, మెడిసిన్, డిజిటల్ టెక్నాలజీ, ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగాల్లో గుర్తింపు పొందినవారికి యూకేలో ఉండే అవకాశం కల్పిస్తుంది.అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకున్న వీసా ఫీజు నిర్ణయంతో బ్రిటన్‌లో సంస్కరణల కోసం ఒత్తిడులు ఊపందుకున్నట్లు చర్చల్లో పాల్గొన్న అధికారులు తెలిపినట్లుగా నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: అమెరికాలో భారతీయ టెకీలు సంపాదిస్తున్నదెంత? -
‘లక్ష డాలర్ల’ అమెరికా కన్నా లక్షణమైన దేశాలు
అమెరికా తన వర్క్ వీసా విధానంలో విప్లవాత్మక మార్పును ప్రకటించింది. సెప్టెంబర్ 21 నుండి కంపెనీలు ప్రతి హెచ్-1బి వీసా హోల్డర్‌కు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు లక్ష డాలర్లు (రూ.88 లక్షలుపైగా) చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. మరి అమెరికా లాంటి వర్కింగ్‌కు అనువైన మరో ఐదు దేశాల్లో వర్కింగ్ వీసాల రిజిస్ట్రీషన్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. -
వార్ ఆపుతానని వంచించాడు
లండన్: ఉక్రెయిన్‌పై దురాక్రమణ జెండా ఎత్తి భీకరయుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్చల వేళ సమరానికి స్వస్తి పలుకుతానని చెప్పి తనను నమ్మించి మోసంచేశాడని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్రిటన్‌లో రెండ్రోజుల పర్యటనలో రాజు ఛార్లెస్ కుటుంబం, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్లతో వరుస భేటీలతో బిజీగా గడిపిన ట్రంప్ మరోవైపు ‘ఎక్స్’లో పుతిన్‌పై విమర్శలుచేశారు. ‘‘పుతిన్ ఎంతో మందిని చంపేస్తున్నారు. అంత కంటే ఎక్కువ మందిని దూరంచేసుకుంటున్నారు. మోసం చేసి నన్ను కూడా ఆయన దూరం చేసుకుంటున్నారు. చర్చల వేళ యుద్ధం ఆపేస్తానని చెప్పి పుతిన్ నన్ను దారుణంగా మోసంచేశారు. ఎంతో మనస్తాపానికి గురయ్యా’’అని ట్రంప్ అన్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో అలాస్కా భేటీలో ట్రంప్, పుతిన్ అత్యంత ఆర్భాటంగా కలిసినా ఎలాంటి సంయుక్త ప్రకటన విడుదలచేయకపోవడంతో ప్రపంచదేశాలు ఉసూరుమన్న విషయం తెల్సిందే. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు భారత్‌పై టారిఫ్‌ల భారం మోపడాన్ని ట్రంప్ సమరి్థంచుకున్నారు. ‘‘సులభమైన పద్ధతిలో చెప్పాలంటే ఒకవేళ ముడిచమురు ధరలు భారీగా తగ్గిపోతే చమురును అమ్ముకుంటున్న రష్యాకు లాభాలు అడుగంటిపోతాయి. ఆయుధాలకు డబ్బుల్లేక చివరకు యుద్ధాన్ని ఆపుతుంది. చమురు ధర అంతర్జాతీయంగా దిగివస్తోంది. మరింతగా దిగవచ్చేలా నేను చేస్తా’’ అని అన్నారు. బ్రిటన్ ప్రధాని స్టార్మర్తో భేటీ తర్వాత మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ఆపుతారన్న మీడియా ప్రశ్నకు ట్రంప్ సమాధానం దాటవేసి పాత కయ్యాలకు రాజీ కుదిర్చానని చెప్పారు. ‘‘ పరిష్కారం కనుగొనడం అసాధ్యం అనుకునే 7 సంక్షోభాలకు ముగింపు పలికా. ఇకమీదటా మరో శుభవార్త వినగలమనే అనుకుంటున్నా. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగా అమెరికాపై పడట్లేదు. ఉక్రెయిన్ యుద్ధం అంతానికి ఒక అవరోధం అడ్డుపడుతోంది’’ అని అన్నారు. స్టార్మర్తో చర్చలు బకింగ్షైర్లో చెకర్స్‌లోని 16వ శతాబ్దినాటి పురాతన భవంతిలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్తో చర్చలు జరిపాక మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ఇంగ్లిష్ ఛానల్, సరిహద్దు గుండా అక్రమ చొరబాట్లపై స్టార్మర్‌కు మీరేం సలహా ఇస్తారని ట్రంప్‌ను మీడియా ప్రశ్నించింది. ‘‘అమెరికాలోకి అయితే చట్టవ్యతిరేకంగా లక్షలాది మంది చొరబడుతున్నారు. ఇలాంటి అక్రమవలసదారులు ఎన్నో దేశాలను నాశనంచేశారు. అలా చూస్తూ ఊరుకోలేను. వాళ్లను బహిష్కరించి పంపేయడం తప్ప మరో మార్గంలేదు. స్టార్మర్కూ అదే చెప్పా. సైన్యాన్ని సరిహద్దులకు రప్పించి అక్రమ వలసలను కట్టడిచేయండి. సైన్యాన్ని ఎలా సద్వినియోగం చేస్తున్నామనేదే ముఖ్యం’’అని అన్నారు. మోదీ, భారత్‌తో నాకెంతో సాన్నిహిత్యం బుధవారం మోదీ బర్త్‌డే వేళ ఫోన్‌చేసి శుభాకాంక్షలు చెప్పిన ట్రంప్ మరుసటి రోజు సైతం పొగిడారు. ‘‘భారత ప్రధాని మోదీ, ఇండియాతో నాకెంతో సాన్నిహిత్యం ఉంది. హ్యాపీబర్త్‌డే చెప్పేందుకు నిన్ననే ఫోన్‌చేసి మాట్లాడా. మా మధ్య సత్సంబంధాలున్నాయి. అయినాసరే భారత్‌పై అధిక టారిఫ్ మోపాల్సి వచి్చంది’’అని అన్నారు. బ్రిటన్‌తో టెక్ డీల్ ట్రంప్ పర్యటన వేళ బ్రిటన్‌తో అమెరికా సాంకేతిక ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సాంకేతికత శ్రేయస్సు ఒప్పదం అని పేరు పెట్టారు. కృత్రిమమేథ, క్వాంటమ్ కంప్యూటింగ్, అణువిద్యుత్ రంగాల్లో సహకారంతోపాటు బ్రిటన్‌లో సాంకేతికరంగాల్లో బడా అమెరికన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఒప్పందం బాటలు వేయనుంది. మైక్రోసాఫ్ట్ ఏకంగా 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతానని ప్రకటించింది. మరో రెండేళ్లలో ఏఐ పరిశోధన, మౌలిక సదుపాయాల రంగాల్లో 5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తానని గూగుల్ తెలిపింది. అఫ్గానిస్తాన్ స్థావరాన్ని తిరిగి సాధిస్తాం ‘‘అఫ్గానిస్తాన్‌లోని బాగ్రామ్ వైమానికస్థావరాన్ని తిరిగి చేజిక్కించుకుంటాం. అది జరిగితే నిజంగా ఇది సంచలన వార్తే అవుతుంది. దానిని కైవసం చేసుకోవాలన్న ఉద్దేశం వెనుక పెద్ద కారణం ఉంది. అక్కడి నుంచి కేవలం గంట సేపు విమానంలో ప్రయాణిస్తే చైనా అణ్వాయుధాల తయారీ కేంద్రాన్ని చేరుకోవచ్చు’’అని ట్రంప్ అన్నారు. 1950దశకంలో సోవి యట్ రష్యా ఈ స్థావరాన్ని తొలిసారిగా ఏర్పాటు చేసింది. 1980లలో అది ప్రధానస్థావరంగా వెలుగొందింది. 2001లో తాలిబన్ ప్రభుత్వాన్ని అమెరికా కూలదోసి ఆ స్థావరాన్ని తమ వశంచేసుకుంది. చిన్నబేస్ను దశలవారీగా ఏకంగా 77 చదరపు కిలోమీటర్ల స్థాయికి పెంచింది. ఇటీవల అఫ్గాన్ నుంచి అమెరికా సేనలు పూర్తిగా ని్రష్కమించడం తెల్సిందే. -
దేశం పరువు నిలబెట్టుకున్నారు
మన దేశంలో కాఫీ హోటల్ బయట పెట్టిన బైక్‌లు మాయమవడం మామూలే. కాని యు.కె.లో కూడా ఇలా జరిగితే వెర్రి ముఖం వేయక తప్పదు. అది కూడా ఆ బైకే ఆధారంగా ప్రపంచ యాత్ర చేస్తున్నవాడికి. అదే జరిగింది. ముంబైకి చెందిన 33 ఏళ్ల యోగేష్ అలెకరి తన కెటిఎం బైక్ మీద దేశాలు తిరుగుతూ వీడియోలు చేస్తుంటాడు. ఇతడు మొన్నటి మే నెలలో తన తాజా యాత్ర మొదలెట్టి 17 దేశాల మీదుగా సెప్టెంబర్ మొదటి వారానికి యు.కె. చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆఫ్రికా చేరుకుంటే యాత్ర ముగుస్తుంది. అయితే యు.కె.లోని నాటింగ్‌హామ్‌లో ఒక కేఫ్‌లో కాఫీ తాగి బయటకి వచ్చేసరికి బైక్ కొట్టేశారు. దాంతో యాత్ర ఆగిపోవడమే కాదు అన్ని వస్తువులూ పోయాయి. దేశం కాని దేశంలో బైక్ కొనడం కూడా ఖరీదైన వ్యవహారమే. హతాశుడైన యోగేష్ తన ఇన్‌స్టాలో జరిగింది మొరపెట్టుకోవడంతో అతణ్ణి ఫాలో అవుతున్నవారంతా సాయానికి ముందుకొచ్చారు. తాము బైక్ కొనిస్తామన్నారు. అయితే నాటింగ్‌హామ్‌లోని ఒక సెకండ్‌హాండ్ బైక్ స్టోర్ ఓనరు స్పందించాడు. ‘మా దేశం మర్యాద మేం పోగొట్టుకోము. అతనికి అలాంటి బైకే మరింత మంచి కండిషన్లో ఉన్నది ఇస్తాము’ అని ప్రకటించి మరీ మంచి బైక్ ఇచ్చాడు. దాంతో యోగేష్ ముఖాన నవ్వు వచ్చింది. అతని యాత్ర మళ్లీ మొదలైంది. దేశం పరువును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. మన దేశంలో విదేశీ టూరిస్ట్‌లు కనిపిస్తే వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకపోవడం పౌరుల ధర్మం. -
పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు!
పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుని ఇండియాకు వచ్చిన భారతసంతతికి చెందిన US పౌరురాలు అనూహ్యంగా కన్నుమూసిన ఘటన కలకలం సృష్టించింది. జూలైలో జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళ మిస్సింగ్ కేసు నమోదైన తరువాత షాకింగ్ విషయాలను పోలీసులు ప్రకటించారు.పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పంజాబ్‌లోని లుధియానా జిల్లాలో అమెరికన్ పౌరురాలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోఇండియాకు వచ్చింది. లూధియానాకు చెందిన ఇంగ్లాండ్‌కు చెందిన నాన్-రెసిడెన్షియల్ ఇండియన్ (NRI) చరణ్‌జిత్ సింగ్ గ్రెవాల్ (75)ను వివాహం చేసుకోవాలని భావించింది. అతని ఆహ్వానం మేరకు రూపిందర్ కౌర్ పాంధేర్ (71) భారతదేశానికి వచ్చారు. అయితే సియాటిల్ నుండి ఇండియాకు వచ్చిన కొద్దిసేపటికే ఏళ్ల మహిళ హత్యకు గురైంది. అయితే ఫోన్లకు స్పందించకపోవడం, ఫోన్ స్విచ్ఆఫ్ కావడంతో అనుమానం వచ్చిన పాంధేర్ సోదరి కమల్ కౌర్ ఖైరా తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో జూలై 28న న్యూఢిల్లీలోని అమెరికిఆ రాయబార కార్యాలయానికి సంప్రదించారు. ఎంబసీ ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు చేరవేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గ్రెవాల్ ఆమెను కిరాయి హంతకులతో హత్య చేయించాడని తేల్చారు. ఆర్థికపరమైన కారణాల వల్లే ఈ హత్య జరిగిందని అధికారులు తెలిపారు. అంతేకాదు గ్రేవాల్‌తో పెళ్లికి ముందు అతనికి పెద్దమొత్తంలో డబ్బును బదిలీ చేసినట్టు కూడా గుర్తించారు. రూపిందర్ అమెరికా పౌరురాలు. యూకేలో నివసిస్తున్న ఎన్ఆర్ఐ చార్జిత్ సింగ్ గ్రెవాల్‌తో పెళ్లికోసం ఇండియాకు వచ్చింది. అయితే ఆమెను తుదముట్టించాలని పథకం వేసుకున్న గ్రెవాల్ కాంట్రాక్ట్ కిల్లర్ సుఖ్జీత్ సింగ్ సోనూతో రూ. 50 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ఆమెను కిరాతంగా హత్య చేయించాడు. అయితే ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లే సమయంలోనే ఆమెను ఎవరో కిడ్నాప్ చేశాడని సోనూ దెహ్లోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ అతని వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని అంగీకరించాడు. తన నివాసంలోని స్టోర్‌రూమ్‌లో రూపిందర్ శరీరాన్ని కాల్చి, బూడిద చేసి లెహ్రా గ్రామంలోని కాలవలో పారవేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. ఈ మేరకు సంఘటనా స్థలంలో మృతరాలి ఎముకలను స్వాధీనం చేసుకొన్నారు. ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) హర్జిందర్ సింగ్ గిల్ , స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) సుఖ్జిందర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు ఈ కేసును విచారణ సాగుతోంది. పరారీలో ఉన్నగ్రెవాల్‌తో పాటు, అతడి సోదరుడిపై కేసు నమోదు చేశారు. సోను వెల్లడించిన దాని ఆధారంగా బాధితురాలి అస్థిపంజర అవశేషాలు, ఇతర ఆధారాలను కనుగొనే ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు పోలీసులు ఈ ఘటన ఇటు భారత్‌తోపాటు, అటు అమెరికా, యూకే ఎన్ఆర్ఐ వర్గాల్లో ఆందోళన రేపుతోంది. -
యూకే డిప్యూటీ ప్రధాని రాజీనామా
లండన్: యూకే ఉప ప్రధానమంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎంజెలా రేనెర్ పదవి నుంచి వైదొలిగారు. ఇటీవల కొనుగోలు చేసిన ఇంటికి తక్కువ పన్ను చెల్లించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. స్పెషలిస్ట్ ట్యాక్స్ సలహా తీసుకోకుండానే తక్కువ స్టాంప్ డ్యూటీని చెల్లించడం ద్వారా నైతిక ఉల్లంఘనకు పాల్పడినట్లు ప్రచారం జరిగింది. అధికార లేబర్ పార్టీలో పలుకుబడి కలిగిన నేతగా పేరున్న ఎంజెల్ తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రివర్గ స్వతంత్ర కమిటీతో విచారణ చేయించారు. ఈ కమిటీ దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలింది. దీంతో, పదవికి రాజీనామా చేసినట్లు శుక్రవారం ఎంజెలా వెల్లడించారు. రాజీనామా చేయాలని ఎంజెలా తీసుకున్న నిర్ణయం సరైందేనని ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. సీనియర్ మంత్రిని కోల్పోవడం బాధ కలిగిస్తోందన్నారు. -
వెయిట్ లాస్ సర్జరీ కోసం యూకే నుంచి భారత్‌కు వచ్చిన మహిళ
హైదరాబాద్: ఎక్కడో లండన్‌లో ఉంటూ బ్లాక్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేసుకుంటున్న ఓ బ్రిటిష్ మహిళ.. బరువు తగ్గాలన్న ఉద్దేశంతో భారతీయ డాక్టర్‌ను వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చి ఇక్కడ బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. 102 కిలోల నుంచి శస్త్రచికిత్స అనంతరం 70 కిలోలకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను గచ్చిబౌలి కిమ్స్ ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. ఆస్పత్రి మెటబాలిక్, బేరియాట్రిక్ సర్జరీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ కేశవరెడ్డి మన్నూర్ తెలిపారు.“అలెగ్జాండ్రియా ఫాక్స్ అనే 59 ఏళ్ల మహిళ భర్త జేన్ ఫాక్స్‌కు 2023లో లండన్‌లో ఉండగా బేరియాట్రిక్ శస్త్రచికిత్స చేశాను. ఆయన 64 కిలోల బరువు తగ్గారు. ఫలితంగా కీళ్ల నొప్పులు తగ్గిపోయాయి, మధుమేహం, రక్తపోటు కూడా అదుపులోకి వచ్చాయి. ఆ ఫలితంతో ఆయన చాలా సంతోషించారు. దాంతో 102 కిలోల బరువు ఉన్న అలెగ్జాండ్రియా తాను కూడా బరువు తగ్గాలని నిర్ణయించుకుని, అందుకు భారతీయ వైద్యుడైన డాక్టర్ కేశవరెడ్డి దగ్గరకే వెళ్లాలని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చారు. ఆమెకు ఊబకాయంతో పాటు అధిక రక్తపోటు, కిడ్నీ వైఫల్యం, థైరాయిడ్ లాంటి సమస్యలున్నాయి. దాంతో తన భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చేశారు.ఆమెకు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనే శస్త్రచికిత్స చేశాం. ముందుగా మత్తుమందుకు సంబంధించిన పరీక్షలు చేశాం. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో శస్త్రచికిత్స చేసి, ఉదరభాగంలో 2/3 వంతు తొలగించాం. దాంతో కడుపు చిన్నగా అయిపోయింది. దీనివల్ల ఆమె మధుమేహం, రక్తపోటు అదుపులోకి వచ్చాయి. దాంతోపాటు కిడ్నీ వైఫల్యం కూడా తగ్గింది. ఆమెకు చాలా సానుకూల దృక్పథం ఉండడంతో 24 గంటల్లోనే కోలుకున్నారు. దాంతో శస్త్రచికిత్స అయిన మర్నాడే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశాం. రెండురోజుల్లోనే తన హోటల్ గదిలో ఆమె అటూ ఇటూ హాయిగా తిరిగేస్తున్నారు. త్వరగా కోలుకుని తన పనులు తాను చేసుకుంటున్నందుకు ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. మూడు రోజుల్లో తిరిగి ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.అలెగ్జాండ్రియా ఇంగ్లండ్‌లో బ్లాక్ టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తుంటారు. అది అక్కడ చాలా గౌరవప్రదమైన, కష్టమైన వృత్తి. దానికి ముందుగా మూడేళ్ల శిక్షణ తీసుకోవాలి. లండన్ నగరంలోని ప్రతి వీధి బాగా తెలిసి ఉండాలి. ఈ టాక్సీలను అక్కడ చాలా గౌరవనీయంగా చూస్తారు. ఇంత గౌరవప్రదమైన పని చేసేటప్పుడు తనకు ఆరోగ్య సమస్యలు ఉండకూడదని భావించడం వల్లే అలెగ్జాండ్రియా ఇక్కడివరకు వచ్చి శస్త్రచికిత్స చేయించుకున్నారు.స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది చాలా సులభమైన శస్త్రచికిత్స. ఇందులో సరికొత్త పరిశోధనలు కూడా చేసి ఉదరభాగం మళ్లీ వ్యాకోచించకుండా ఉండేలా చేస్తున్నాం. దీనివల్ల దీర్ఘకాలం పాటు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ శస్త్రచికిత్స తర్వాత మధుమేహం, రక్తపోటు, నిద్రలేమి లాంటి చాలా సమస్యలు తగ్గిపోతాయి. జీవన ప్రమాణం కూడా మరో పదేళ్లు పెరుగుతుంది. ఇది చాలా సురక్షితమైన శస్త్రచికిత్స. బరువు తగ్గడానికి మందులు వాడడం కంటే ఇది చేయించుకోవడం చాలా మంచిది” అని డాక్టర్ కేశవరెడ్డి వివరించారు. -
యూకేలో ఇద్దరు సిక్కు వృద్ధులపై దాడి.. బలవంతంగా తలపాగా తొలగించి..
వోల్వర్‌హాంప్టన్: యూకేలోని వోల్వర్‌హాంప్టన్‌లో ఇద్దరు వృద్ధులైన సిక్కు పురుషులపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది ఆ వీడియోలో బాధితుల్లో ఒకరు తలపాగా లేకుండా నేలపై పడివున్నట్లు కనిపిస్తోంది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం వోల్వర్‌హాంప్టన్ రైల్వే స్టేషన్ వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆగస్టు 15న జరిగిన ఈ ఘటనను జాతివిద్వేష చర్యగా చెబుతున్నారు. ఈ వీడియోలో ఆ సిక్కు వృద్ధులపై దాడి జరిగినట్లు కూడా కనిపిస్తోంది. ఈ ఘటనను వీడియో తీస్తున్న మహిళ.. ఇద్దరు వ్యక్తులపై తెల్లజాతి వారు దాడి చేస్తున్నారని అని అరవడాన్ని గమనించవచ్చు. అలాగే దాడి చేస్తున్న వారితో మీరు ఏమి చేస్తున్నారు? అని ఆమె అడగటం కూడా వినిపిస్తుంది.బాధితులను పోలీసులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఈ దాడిపై భారత్‌లోని సిక్కు నేతలు, యూకేకి చెందిన సిక్కు హక్కుల సంస్థ సిక్కు సమాఖ్య తీవ్రంగా ఖండించింది. ఇది జాత్యహంకార దాడిగా అభివర్ణించింది. శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ఈ ఘటనపై స్పందిస్తూ, ఒక సిక్కు వ్యక్తి తలపాగాను బలవంతంగా తొలగించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులు, యూకే హోం ఆఫీస్ ఈ ఘటనపై వెంటనే స్పందించాలని కోరారు. బ్రిటిష్ ప్రభుత్వంతో ఈ సమస్యపై చర్చించాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. I strongly condemn the horrific attack on two elderly Sikh men in Wolverhampton, UK, during the course of which one Sikh’s turban was removed forcibly. ▪️This racist hate crime targets the Sikh community, which always seeks Sarbat Da Bhala (the well-being of all). ▪️Known for… pic.twitter.com/5G0DJbZbBs— Sukhbir Singh Badal (@officeofssbadal) August 18, 2025 -
ఎవరీ కృషాంగి మేష్రామ్? అతి పిన్నవయస్కురాలైన సొలిసిటర్గా..
భారత సంతతి అమ్మాయి అసాధారణమైన ఘనతను సాధించింది. అతి చిన్న వయసులోనే ఇంగ్లాండ్, వేల్స్‌లలో సొలిసిటర్ అయ్యారు. అతి చన్ని వయసులోనే ఈ ఘనతను సాధించి..అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరంటే..ఆ అమ్మాయే పశ్చిమ బెంగాల్‌కి చెందిన కృషాంగి మేష్రామ్. కేవలం 21 ఏళ్ల వసులోనే సొలిసిటర్ అయ్యింది. 15 ఏళ్లకే మిల్టన్ కీన్స్ ది ఓపెన్ యూనివర్శిటీలో తన లా చదువును ప్రారంభించి.. న్యాయశాస్త్రంలో ఫస్ట్‌క్లాస్ ఆనర్స్ డిగ్రీని పొందింది. అయితే కృషాంగి మాత్రం 15 ఏళ్లకే ఓపెన్ యూనివర్సిటీలో చదివే అవకాశం లభించడం వల్లే ఈ ఘనత సాధించగలిగానని ఆనందంగా చెప్పుకొచ్చింది. తనకు న్యాయశాస్త్ర పట్ల ఉన్న ప్రగాఢమైన అభిరుచే ఈ విజయానికి కారణమని అంటోందామె. ఓపెన్‌యూనివర్సిటీ ద్వారా లాగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మరీ ఈ విజయాన్ని అందుకుందామె. ఎవరీ కృషాంగి మేష్రామ్ అంటే..పశ్చిమ బెంగాల్లో జన్మించి కృషాంగీ ఇస్కాన్ మాయాపూర్ కమ్యూనిటీలో పెరిగింది. 15 ఏళ్ల వయసుకే మాయాపూర్‌లోని ఒక అంతర్జాతీయ పాఠశాలలో మాధ్యమిక విద్యను పూర్తి చేసింది. తర్వాత ఒపెన్ యూనివర్సిటీ(ఓయూ)లో మూడేళ్లలో డిగ్రీ పూర్తి చేసి న్యాయ పట్టా పొందింది. అలా 18 ఏళ్లకే న్యాయశాస్త్రంలో ఫస్ట్‌క్లాస్ ఆనర్స్ డిగ్రీతో పట్టభద్రురాలైందామె. 2022లో ఒక అంతర్జాతీయ న్యాయసంస్థలో ప్రాక్టీసు కూడా ప్రారంభించింది. అలాగే ఆమె హార్వర్డ్ ఆన్లైన్లో గ్లోబల్ ప్రోగ్రామ్‌లు కూడా చేసింది. పైగా సింగపూర్‌లో వృత్తిపరమైన అనుభవాన్ని సంపాదించింది. ప్రస్తుతం యూకే, యూఏఈలలో చట్టపరమైన అవకాశాలను అన్వేషిస్తోంది. ఇక కృషాంగికి చట్టపరంగా ఫిన్‌టెక్, బ్లాక్‌చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీలునామాలు, ప్రొబేట్ వంటి ప్రైవేట్ క్లయింట్ తదితర సేవలపై ఆసక్తి ఎక్కువ. (చదవండి: Gaurav Kheterpal: భారతీయ కుటుంబ వ్యవస్థ చనిపోయిందా?) -
వైరల్ ఫొటో.. ప్రధాని మోదీ వెనుకనున్న అదాసో కపేసా ఎవరంటే..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల యూకేలో పర్యటించారు. ఈ సందర్భంగా నలుపురంగు సూట్ ధరించిన ఒక మహిళా అధికారి ప్రధాని మోదీకి రక్షణగా నిలిచిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. ఈ నేపధ్యంలో ఆమె ఎవరనే చర్చ ఇంటర్నెట్లో మొదలయ్యింది. ఆమె ఎవరో, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు.వైరల్ ఫొటోలో ప్రధాని మోదీ వెనుక రక్షణగావున్న ఆ మహిళా అధికారి పేరు అదాసో కపేసా. ప్రధాని రక్షణ బాధ్యతలు వహించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)లో పనిచేస్తున్న మొట్టమొదటి మహిళ ఆమె. అదాసో కపేసా మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలోని కైబి గ్రామానికి చెందిన మహిళ. స్థానిక పాఠశాలలో చదువు పూర్తి చేసిన అనంతరం ఆమె సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ)లో చేరారు. ఉత్తరాఖండ్‌లోని పిథోరగఢ్‌లోని 55వ బెటాలియన్‌లో విశిష్ట సేవలందించారు. ఆమె తన పనితీరుతో సీనియర్ అధికారుల నుండి అభినందనలు అందుకున్నారు. ఎంతో కఠినమైన కమాండో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ఆమె ఎస్పీజీకి ఎంపికయ్యారు.ఎస్పీజీ అనేది దేశంలోని అత్యంత ఉన్నత భద్రతా విభాగం. ఇది ప్రధాని, అతని కుటుంబ సభ్యులకు గట్టి భద్రత కల్పిస్తుంది. ఎస్పీజీలో ఎంపిక కావాలంటే ఆయుధ శిక్షణ, యుద్ధ కళలు, బాంబు నిర్వీర్యం తదితర అంశాలలో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో పలు శారీరక, మానసిక పరీక్షలను ఎదుర్కోవలసి ఉంటుంది. అదాసో కపేసా 2020లో ఎస్పీజీ కమాండో శిక్షణను పూర్తి చేసి, 2024లో ప్రధాని ప్రధాన భద్రతా బృందంలో చేరారు. ఇంతటి అత్యున్నత బాధ్యతలు చేపట్టిన అదాసో కపేసా మహిళలకు స్ఫూర్తినందిస్తున్నారు.1984లో నాటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సొంత అంగరక్షకులే హత్య చేసిన దరిమిలా 1985లో ఎస్పీజీ ఏర్పాటయ్యింది. ప్రధాని రక్షణ బాధ్యత ఎస్పీజీ అధికారులపై ఉంటుంది. ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సశస్త్ర సీమా బల్ తదితర సాయుధ విభాగాల నుండి ఎస్పీజీ సిబ్బందిని నియమిస్తారు. భారతదేశ భద్రతా వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరిగిందనడానికి అదాసో కపేసా ఒక ఉదాహరణగా నిలిచారు. -
ఎవరిని ఉద్ధరించడానికి ఈ ఒప్పందం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గందరగోళం సృష్టించాయి. ట్రంప్ రోజుకో మాదిరిగా మార్చివేస్తున్న ఈ సుంకాలు ఎంతోకాలం మనలేవు. అయితే, వీటిని భౌగోళిక రాజకీయ ఆయు ధాలుగా ప్రయోగిస్తున్న తీరు మాత్రం రానున్న సంవత్సరాల్లో అంతర్జాతీయ వాణిజ్య రూపురేఖలను మార్చేస్తుంది.ఇతర దేశాలు తమ వస్తువుల మీద అధిక సుంకాలు విధిస్తు న్నాయని అదేపనిగా చెబుతూ అమెరికా ప్రపంచ ప్రజల దృష్టి మళ్లిస్తోంది. నిజానికి సుంకాల ముసుగులో అగ్రరాజ్యం అల్పా దాయ దేశాల అభివృద్ధిని బలిచేస్తూ, తమ కంపెనీలకు ప్రపంచ మార్కెట్లలో పెద్ద పీట వేయించడమే ఎజెండాగా పెట్టుకుంది. టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టకుండా చైనాను నిలువరించాలన్న వ్యూహాత్మక లక్ష్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. పేటెంట్లు, కాపీరైట్లు, పారిశ్రామిక డిజైన్లతో కూడిన మే«ధాసంపత్తి వర్ధమాన దేశాలకు అందకుండా నిరోధించడం అమెరికా ధ్యేయం. ఇండోనేషియాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇందుకు ఒక ఉదాహరణ.ఇండోనేషియాకు జరిగినట్టే...అమెరికా పారిశ్రామిక, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై ఇండో నేషియా 99 శాతం సుంకాలను ఎత్తివేసింది. ఇక ఆ దేశ ఎగు మతులపై అమెరికా 19 శాతం సుంకం విధిస్తుంది. ఈ ఒప్పంద ఫలితంగా ఇండోనేషియా రైతులు ప్రభుత్వ భారీ సబ్సిడీల ఫలితంగా చౌకగా లభించే అమెరికా వ్యవసాయోత్పత్తులతో పోటీ పడాల్సి ఉంటుంది. అమెరికా సంస్థలు అత్యధిక ప్రయోజనాలు పొందుతాయి. యూఎస్ తయారీ వస్తువులపై పరిమాణపరంగా ఎలాంటి నిబంధనలూ ఉండవు. అమెరికా వెహికల్ సేఫ్టీ నిబంధ నలను, ఉద్గార ప్రమాణాలను ఇండోనేషియా యథాతథంగా ఆమో దించింది. వైద్య పరికరాలు, ఔషధాల విషయంలోనూ అమెరికా ఎఫ్‌డీఏ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) అనుమతులను అంగీకరిస్తుంది. యూఎస్ ఆహార, వ్యవసాయ ఉత్పత్తులకు స్థానిక లైసెన్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. మరింత సమస్యాత్మకంగా మేధాసంపత్తి నిబంధనలు ఉన్నాయి. సాంప్రదాయిక విజ్ఞానం, జన్యు వనరులు, నిర్బంధ లైసెన్సులు వంటి అంశాల్లో ఇప్పటికే ఉన్న అన్ని వివాదాలనూ పరిష్కరించుకోవాలని ఈ ఒప్పందం ఒత్తిడి చేస్తోంది. దీంతో, అమెరికా కంపెనీలు ఎలాంటి సమ్మతి పొందాల్సిన, పరిహారం చెల్లించాల్సిన అవసరం లేకుండానే అక్కడి సాంప్రదాయిక విజ్ఞా నాన్ని కొల్లగొడతాయి.ఇండియాకు ఏం లాభం?ఇలాంటి ఎజెండాతో ముందుకు పోతున్న దేశం అమెరికా ఒక్కటే కాదు. యూకేతో ఇటీవలే ఇండియా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఇండోనేషియా ఒప్పందం కంటే ఎక్కువగా ప్రశ్నలు రేకెత్తిస్తోంది. చెప్పాలంటే ఈ ఒప్పందానికి వాణిజ్యపరంగా ఎలాంటి ప్రాధాన్యతా లేదు. కారణం, ఈ రెండు దేశాలు ప్రపంచ వ్యాప్తంగా చేసే ఎగుమతుల విలువలో వీటి ద్వైపాక్షిక వాణిజ్యం 2.5 శాతం కంటే కూడా తక్కువే. యూకే–ఇండియా తాజా ఒప్పందం పర్యవసానంగా, 92 శాతం యూకే ఎగుమతులకు ఇండియా పూర్తిగానో పాక్షికంగానో సుంకాల మినహాయింపు ఇచ్చింది. అలాగే యూకేకు ఇండియా చేసే 99 శాతం ఎగుమతులు ‘ట్యాక్స్ ఫ్రీ’గా ఉంటాయి. వాటిపై ఆ దేశం ఎలాంటి సుంకాలూ విధించదు. అయితే, యూఎస్–ఇండోనేషియా ఒప్పందంలో వలే ఈ ఒప్పందంలోనూ మేధాసంపత్తి నిబంధనలు కీలకమైనవి. ఇవి పశ్చిమ దేశాల పేటెంట్ దారులకు అనుకూల రీతిలో ఉన్నాయి. ఔషధాల విషయంలో భారత పౌరులు, దేశీయ ఉత్పత్తి సంస్థల కంటే యూకే ‘బిగ్ ఫార్మా’ ప్రయోజనాలకే ప్రాధాన్యం లభించింది. ఉదాహరణకు, నిర్బంధ లైసెన్సులకు బదులు ‘స్వచ్ఛంద లైసెన్సు’లను ఈ ఒప్పందం ప్రోత్సహిస్తోంది. భవిష్యత్తులో ధరల తగ్గింపు అవకాశాలను ఈ నిబంధన నీరుగార్చుతుంది. పేటెంటు ప్రమాణాల సమన్వయీకరణ క్లాజుకూ ఇండియా అంగీకారం తెలిపింది. దీంతో ప్రస్తుత ఔషధాలకు చిన్నా చితకా మార్పులు చేసి వాటి పేటెంట్ హక్కులు పొడిగించుకునే దొడ్డిదారికి ద్వారాలు పూర్తిగా తెరచినట్లయింది.ఇండియాలో పేటెంటెడ్ డ్రగ్ వాడకం వివరాలు వెల్లడించాల్సిన గడువును ఏడాది నుంచి మూడేళ్లకు పొడిగించే నిబంధన వినాశ కరమైంది. గిరాకీకి తగినంత సరఫరా లేదని (అన్ మెట్ డిమాండ్) నిరూపించడం ఆ ఔషధం ఉత్పత్తి చేయదలచిన కొత్త దరఖాస్తు దారుకు కష్టతరంగా మారుతుంది. ఇవి ఫార్మా పరిశ్రమ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయి. అంతే కాకుండా, అందుబాటు ధర లకు మందులు లభ్యం కాని పరిస్థితి ఉత్పన్నమవుతుంది.బలహీన పడిన ఒక మాజీ వలసవాద దేశానికి, అదీ ప్రధాన వాణిజ్య భాగస్వామి కూడా కానటువంటి దేశానికి ఇండియా ఇలా రాయితీలు ఇవ్వడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ), యూఎస్‌లతో జరుపుతున్న వాణిజ్య చర్చల మీదా ఈ ఒప్పందం వల్ల మరింత ఆందోళనకరమైన ప్రభావం పడుతుంది. ప్రొ‘‘ జయతీ ఘోష్వ్యాసకర్త యూనివర్సిటీ ఆఫ్ మసాచూసెట్స్లో ఎకనామిక్స్ ప్రొఫెసర్ -
ఆ గుండె17 నిమిషాల పాటు ఆగింది!
విక్టోరియా అనే ఓ మహిళ గుండె స్పందనలు ఆగాయి. కార్డియాక్ అరెస్ట్‌తో ఆ గుండె ఆగగానే ఆమె దాదాపుగా చని΄ోయిందనే అనుకున్నారందరూ! ఏకంగా 17 నిమిషాల పాటు ఆగిందామె గుండె. అయితే... అత్యంత అప్రమత్తతతో అత్యవసరంగా స్పందించిన కొందరు పారామెడిక్స్ కృషితో గుండె స్పందనలు మళ్లీ మొదలయ్యాయి. తీరా చూస్తే ఆమె గుండె అలా ఆగడానికి కారణం... ఆమెకున్నో అరుదైన జన్యుపరమైన వ్యాధి. మల్టిపుల్ హార్ట్ ఫెయిల్యూర్‌గా పిలిచే విక్టోరియా వ్యాధి వివరాలివి. యూకేలోని గ్లౌసెస్టర్ నగరానికి చెందిన విక్టోరియా థామస్ అనే మహిళ ఓ ఫిట్నెస్ ఫ్రీక్. ముప్పై ఐదేళ్ల ఆమె తన ఆరోగ్యం కోసం నిత్యం వ్యాయామాలు చేస్తూ ఉండేది. ఎప్పటిలాగే ఆరోజునా ఆమె జిమ్‌లో వ్యాయామాలు చేస్తోంది. తన ఇంటెన్సివ్ వర్కవుట్ సెషన్లో భాగంగా అప్పుడే ఆమె తన వెయిట్ లిఫ్టింగ్ సెట్స్ పూర్తి చేసుకుంది. ఇంతలో ఆమెలోని శక్తినంతా తలలోంచి బయటకు తోడిపోసిన అనుభూతి! విక్టోరియా తన చేతిలోని వెయిట్స్ రాడ్‌ను ఇలా పక్కకు పెట్టిందో లేదో... ఒక పక్కకు అలా ఒరిగిపోయింది. పక్కనున్నవాళ్లు హుటాహుటిన పారామెడిక్స్‌ను తీసుకొచ్చారు. వాళ్లు ఆమె ఛాతీని నొక్కుతూ సీపీఆర్ (కార్డియో పల్మునరీ రీససియేషన్) మొదలుపెట్టారు. కానీ గుండె స్పందనలు ఎంతకీ మొదలు కాలేదు.మరణానుభవానుభూతితో ఓ నిశ్శబ్ద శూన్యత... సెకన్లు నిమిషాల్లోకి గడిచి΄ోతున్నాయి. నిమిషాలు పదీ, పదిహేను నిమిషాల వ్యవధి దాటి పావుగంటల్లోకి దొర్లిపోతున్నాయి. కానీ సీపీఆర్‌తో ఎంతగా ప్రయత్నిస్తున్నా విక్టోరియా కోలుకోవడం లేదు. అలా 17 నిమిషాల ప్రయత్నం తర్వాత ఆమె గుండె అకస్మాత్తుగా స్పందనలనందుకుంది. ఈలోపు ఆమెకు అంతటా శూన్యం. భయంకరమైన నిశ్శబ్దం. ఎటు చూసినా... చూడకున్నా అంతా చిమ్మచికటి. ఆమెలోని తన స్మృతి హేతు జ్ఞానాలన్నీ విస్మృతిలోకి వెళ్లాయి. ఇలా ఆమె ఆ 17 నిమిషాల పాటూ ‘నియర్ డెత్’ భయంకరానుభవాన్ని చవిచూసింది. ప్రాణాలు దక్కవనే అనుకున్నారు. కానీ 17 నిమిషాల తర్వాత ఆమె గుండె స్పందనలు మొదలయ్యాయి.మూడు రోజుల పాటు కోమాలోనే...ఎట్టకేలకు గుండె స్పందనలు మొదలైనా ఇంకా ఆమె కోమాలోనే ఉంది. దాంతో విక్టోరియాను ‘బ్రిస్టల్ రాయల్ ఇన్ఫర్మరీ’ అనే ఓ పెద్ద వైద్యశాలకు తరలించారు. అక్కడామె మూడు రోజుల పాటు కోమాలోనే ఉండిపోయింది. తర్వాత మెల్లగా కోలుకుని కోమాలోంచి బయటకొచ్చింది.గర్భం దాల్చడంతో మొదలైన సవాళ్లు... ఇదిలా ఉండగా 2021లో విక్టోరియా గర్భం దాల్చింది. అప్పుడు చేసిన పరీక్షల క్రమంలో తెలిసిందేమిటంటే... ఆమెకు మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అనే వ్యాధి ఉందని! ‘డేనన్ డిసీజ్’ అని పిలిచే ఆ అరుదైన జన్యుపరమైన ఆ వ్యాధి కారణంగా ఇతర కండరాలతో పాటు గుండె కండరాలూ తీవ్రంగా ప్రభావితమవుతాయి. అవి క్రమంగా బలహీనపడిపోవడంతో (కార్డియోమయోపతి కారణంగా) గుండె మాటిమాటికీ ఆగిపోతుంటుంది. ఆ గుండె ఆగకుండా స్పందించేందుకూ... ఒకవేళ ఆగినా మళ్లీ స్పందనలు మొదలయ్యేందుకు డీ–ఫిబ్రిలేటర్ అనే పరికరాన్ని అమర్చారు. అది చేసే పనేమిటంటే గుండె ఆగినప్పుడుల్లా ఓ ఎలక్ట్రిక్ షాక్ పంపి, గుండెను మళ్లీ కొట్టుకునేలా చేస్తుంది. చిత్రమేమిటంటే... జన్యుపరమైన వ్యాధి అయినప్పటికీ... వాళ్ల కుటుంబంలో అందుకుముందెవరికీ ఆ వ్యాధి లేదు. అది కనిపించిన మొట్టమొదటి బాధితురాలు విక్టోరియానే!!అసలే గుండె వీక్... ఆ పైన ప్రెగ్నెన్సీ!!మొదటే గుండె చాలా బలహీనం. కానీ ఆలోపు ప్రెగ్నెన్సీ రావడంతో గుండె పంపింగ్ సరిగా జరగక మాటిమాటికీ విక్టోరియా గుండె ఆగి΄ోవడాలు జరిగేవి. ఇలా తరచూ జరిగే కార్డియాక్ అరెస్టుల నేపథ్యంలోనే నెలల నిండకముందే సిజేరియన్తో బిడ్డను బయటకు తీయాల్సి వచ్చింది. బిడ్డ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ పండంటి మగబిడ్డ! అదృష్టం... పరీక్షలు చేసి చూస్తే తల్లికి ఉన్న ఆ జన్యుపరమైన జబ్బు బిడ్డకు లేదు!! డాక్టర్లు 2022లో విక్టోరియాకు గుండె పరీక్షలు చేయించినప్పుడు తెలిసిందేమిటంటే... ఆమె గుండె పనితీరు కేవలం 11 శాతమేనని!! అంటే హార్ట్ ఫెయిల్యూర్ తాలూకు చివరి దశ అది. ఇకపై ఆమె బతకబోయేది కొద్ది నెలల మాత్రమేనని తేలింది. అదృష్టాలు ఒక్కోసారి ‘ఫలించి’నప్పుడు గుండెకాయ కూడా చెట్టుకాయలా దొరుకుతుంది. అలా ఆమెకు గుండె మార్పిడి చికిత్స కోసం తగిన గుండె దొరకడంతో... ఏప్రిల్ 2023 లో ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స చేశారు. దాంతో విక్టోరియా మృత్యుముఖం నుంచి మరోసారి బయటపడింది. ‘కొత్త హార్ట్’తో తల్లి... తన ‘స్వీట్ హార్ట్’ అయిన ఆ బిడ్డ... ఇలా ఇప్పుడా తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమం.– యాసీన్ (చదవండి: ఏం ప్రేమ రా నీది'..! ఏకంగా 43 సార్లు..) -
127 ఏళ్ల తర్వాత భారత్‌కు బుద్ధుని అవశేషాలు
న్యూఢిల్లీ: బ్రిటిష్ హయాంలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలను 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి తీసుకొచ్చారు. ఈ వివరాలు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన సామాజికమాధ్యమ ఖాతా ‘ఎక్స్’లో పంచుకున్నారు. శతాబ్దం తర్వాత బుద్ధుని అవశేషాలు భారత్‌కు తిరిగి రావడం నిజంగా దేశ సాంస్కృతిక వారసత్వానికి సంతోషకరమైన రోజు అని ప్రధాని మోదీ అభివర్ణించారు. 1898 సంవత్సరంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిప్రాహ్వా ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు ముమ్మరంగా జరిగాయి. ఆ తవ్వకాల్లో బుద్ధుని పవిత్ర అవశేషాలు బయల్పడ్డాయి. అయితే నాటి బ్రిటన్‌పాలకులు భారత్ నుంచి ఈ అవశేషాలను యూకేకు తరలించారు. ‘‘ గౌతమ బుద్ధుని పవిత్ర అవశేషాలు ఏకంగా 127 సంవత్సరాల అనంతరం మళ్లీ స్వదేశమైన భారత్‌కు తీసుకురావడం దేశ ప్రజలందరికీ ఎంతో గర్వకా రణం. బుద్ధుడు, ఆయన బోధనలతో భారత దేశానికి ఉన్న అనుబంధాన్ని ఈ పవిత్ర అవశేషా లు మరోసారి చాటిచెబుతున్నాయి’’ అని ‘ఎక్స్’ లో ప్రధాని మోదీ పోస్ట్‌పెట్టారు. ‘‘ మహా ద్భుతమైన ఘన వారసత్వం, సంస్కృతిని పరిరక్షించడంలో మన నిబద్ధతను ఈ అవశేషాలు చాటుతున్నాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఈ అవశేషాలు ఈ ఏడాది ప్రారంభంలో ఓ అంతర్జాతీయ సంస్థ చేపట్టిన వేలంపాటలో తొలి సారిగా ప్రత్యక్షమయ్యాయి. దీంతో వీటిని ఎలా గైనా తిరిగి భారత్‌కు రప్పించేందుకు మా ప్రభు త్వం నడుం బిగించింది. ఈ మేరకు కృషిచేసిన వా రందరికీ నా అభినందనలు’’ అని మోదీ అన్నారు.నాటి పేటికలో బంగారు రత్నాభరణాలు piprahwa. com వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం నేపాల్ సరిహద్దులోని పిప్రాహ్వా బౌద్దమతానికి సంబంధించిన పురాతన స్తూపం ఉంది. అక్కడ నాటి బ్రిటన్ పాలకులు తవ్వకాలు జరిపారు. దాంతో అక్కడ భూగర్భంలో పెద్ద రాతిపెట్టెలో కొన్ని అవశేషాలు బయల్పపడ్డాయి. ఇందులో బుద్ధునికి సంబంధించినవిగా భావిస్తున్న అస్థి అవశేషాలు, సున్నపురాయి పేటిక, బంగారు ఆభరణాలు, రత్నాల వంటివి ఉన్నాయి. బుద్ధుని నిర్యాణం తర్వాత బుద్దుని అవశేషాలను ఆనాటి రాజ్యాల రాజులకు పంపిణీ చేసేందుకు అవశేషాలను కొన్ని భాగాలుగా విభజించారు. అందులో కొంతభాగాన్ని నేడు థాయ్లాండ్గా పిలుస్తున్న సియామ్ ప్రాంతంలోని రాజుకు అందజేశారు. ఆనాడు తవ్వకాల్లో బయల్పడిన సున్నపురాయి మృతపేటిక ప్రస్తుతం కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. ప్రస్తుతం ఈ పిప్రాహ్వా గ్రామం ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఉంది. ఇది బుద్ధుడు జన్మించిన లుంబినీ వనానికి కేవలం 9 మైళ్ల దూరంలో ఉంది. -
ఎవరీ లండన్ చాయ్‌వాలా.. ఏంటి ప్రత్యేకత?
ఇండియన్ కల్చర్‌లో టీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇంటికి గెస్టులు ఎవరు వచ్చినా ముందుగా టీయిచ్చి మాటలు కలుపుతాం. మిత్రులు, సావాసగాళ్లతో చాయ్‌లు తాగుతూ చేసే చర్చలకు అంతే ఉండదు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాయ్ పే చర్చ చాలా ఫేమస్ అయింది. తనను తాను చాయ్‌వాలాగా ఆయన ఎన్నోసార్లు చెప్పుకున్నారు. పీఎం మోదీకి చాయ్ అందించి వైరల్ అయ్యాడో యువ చాయ్‌వాలా. అది కుడా లండన్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసంలో. ఇద్దరు ప్రధానులకు చాయ్ పోసిన కుర్రాడి పేరు అఖిల్ పటేల్.భారత్, బ్రిటన్ దేశాల మధ్య గురువారం చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. ఈ సందర్భంగా లండన్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం అయిన చెకర్స్‌లో కీలక భేటీ జరిగింది. యూకే పీఎం కీర్ స్టార్మర్, ప్రధాని మోదీ కీలకాంశాలపై చర్చలు సాగించారు. పచ్చికలో ఏర్పాటు చేసిన ఒక టీ స్టాల్లో తాజాగా తయారు చేసిన భారతీయ మసాలా చాయ్‌ను ఇరువురు అగ్రనేతలు ఆస్వాదించారు. తర్వాత ఈ ఫొటోలను మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "చెకర్స్‌లో ప్రధానమంత్రి కీర్ స్టార్మర్తో 'చాయ్ పే చర్చా'... భారత్-యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని రాశారు. View this post on Instagram A post shared by Amala Chai | Masala Chai (@amala_chai)మోదీ షేర్ చేసిన ఫొటోలో.. సాంప్రదాయ భారతీయ కుర్తాలో ఒక యువకుడు.. ఇద్దరు ప్రధానులకు చాయ్ సర్వ్ చేస్తునట్టు కనబడింది. ముఖ్యంగా టీస్టాల్ బ్యానర్‌పై రాసివున్న క్యాప్షన్ అందరినీ ఆకర్షించింది. "తాజాగా తయారుచేసిన మసాలా చాయ్. భారతదేశం నుంచి వచ్చించి, లండన్‌లో తయారైంది అని రాసుంది. ఇరువురు అగ్రనేతలకు చాయ్ అందించిన ఆ యువకుడి పేరు అఖిల్ పటేల్. అమలా చాయ్ పేరుతో యూకేలో ఆయన బిజినెస్ చేస్తున్నారు.‘Chai Pe Charcha’ with PM Keir Starmer at Chequers...brewing stronger India-UK ties! @Keir_Starmer pic.twitter.com/sY1OZFa6gL— Narendra Modi (@narendramodi) July 24, 2025 ఒక చాయ్‌వాలాకు మరో చాయ్‌వాలా..భారత్, బ్రిటన్ ప్రధానులకు చాయ్ అందించి అపరూప క్షణాలకు సంబంధించిన వీడియోను అఖిల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమలా చాయ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో రీల్‌ను షేర్ చేశారు. కీర్ స్టార్మర్తో కలిసి మోదీ.. టీస్టాల్ వద్దకు రావడం.. మీరు ఇండియా రుచులను ఆస్వాదిస్తారు అంటూ స్టార్మర్తో మోదీ చెప్పడం వంటివి వీడియోలో ఉన్నాయి. "ఇందులో ఏలకులు, జాజికాయ, నల్ల మిరియాలు ఉన్నాయి" అని కప్పుల్లో టీ పోస్తూ పటేల్ చెప్పాడు. ప్రధాని మోదీకి టీ గ్లాస్ అందిస్తూ.. ఒక చాయ్‌వాలాకు మరో చాయ్‌వాలా (Chaiwala) టీ అందిస్తున్నాడు అనగానే.. మోదీ గట్టిగా నవ్వేశారు. కీర్ స్టార్మర్ చాయ్ తాగుతూ చాలా బాగుందని కితాబిచ్చారు. ఎవరీ అఖిల్ పటేల్?భారత మూలాలు కలిగిన అఖిల్ పటేల్.. 2019లో తన అమ్మమ్మ ప్రేరణతో అమలా చాయ్‌ను ప్రారంభించాడు. అతడి అమ్మమ్మ 50 ఏళ్ల క్రితం లండన్‌కు వలసవచ్చి స్థిరపడ్డారు. పటేల్ లింక్డ్ఇన్ బయో ప్రకారం.. అతడు లండన్‌లోని హాంప్స్టెడ్లోని యూనివర్సిటీ కాలేజ్ స్కూల్లో చదువుకున్నాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ (LSE) నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (BSc), మేనేజ్మెంట్ చేశాడు. గ్రాడ్యుయేషన్ వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు పూర్తి చేశాడు.చదవండి: మీరు ఎలా చనిపోవాలనుకుంటున్నారు?చిన్నతనంలో తన అమ్మమ్మ పెట్టే మసాలా చాయ్ అంటే అఖిల్‌కు చాలా ఇష్టం. అయితే బయట తాగే చాయ్‌లలో ఇలాంటి రుచి లేదని గమనించాడు. తన అమ్మమ్మ ఫార్ములాతో బ్రిక్ లేన్ ప్రాంతంలో అమల చాయ్ పేరుతో టీస్టాల్ ప్రారంభించాడు. అస్సాం, కేరళ రైతుల నుంచి నేరుగా తేయాకులు, సుగంధ ద్రవ్యాలు తెప్పించుకుని వాటితోనే మాసాలా చాయ్ తయారు చేస్తాడు. అందుకే అమల చాయ్‌కు తక్కువ కాలంలోనే బాగా పేరొచ్చింది. తాజాగా ఇద్దరు ప్రధాన మంత్రులకు మసాలా చాయ్ అందించి ప్రపంచం దృష్టిలో పడ్డాడు అఖిల్ పటేల్. -
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆమోదం.. యూకే పర్యటనలో ప్రధాని మోదీ సంతకం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన లండన్ పర్యటనలో జూలై 24న సంతకం చేయనున్న భారత్- యూకేల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంగా ఇది నిలవనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత్-యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే 6న ప్రకటించాయి.ప్రధాని మోదీ చేపట్టే యునైటెడ్ కింగ్డమ్, మాల్దీవుల నాలుగు రోజుల పర్యటన బుధవారం(జూలై 23)ప్రారంభంకానుంది. ఈ పర్యటనలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ప్రధానమంత్రి వెంట ఉండనున్నారు. కాగా 2030 నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి శ్రమతో కూడిన ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని, బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందం ప్రతిపాదించింది.భారత్-యూకేల ఈ ఒప్పందంలో వస్తువులు, సేవలు, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కులు తదితర అంశాల ప్రస్తావన ఉంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సంతకం చేయనున్నారు. అనంతరం దీనిని అమలు చేసేందుకు బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. మరోవైపు సామాజిక భద్రతా ఒప్పందంపై రెండు దేశాలు చర్చలు జరిపాయి. కాగా ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (బిట్)పై చర్చలు కొనసాగుతున్నాయి. 2024-25లో యూకేకి భారతదేశ ఎగుమతులు 12.6 శాతం పెరిగాయి. దిగుమతులు 2.3 శాతం మేరకు పెరిగాయి. భారత్-యూకేల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022-23లో20.36 యూఎస్ బిలియన్ డాలర్ల నుండి 2023-24లో 21.34 యూఎస్ బిలియన్ డాలర్లకు పెరిగింది. -
చమురు ఆదాయ వనరులే లక్ష్యంగా రష్యాపై ఈయూ, యూకే ఆంక్షలు
బ్రస్సెల్స్: ఉక్రెయిన్‌పై దురాక్రమణ సాగిస్తున్న రష్యాపై యూరోపియన్ యూనియన్, యూకేలు మరింత కఠిన ఆంక్షలను ప్రకటించాయి. రష్యా ఇంధన రంగం, పాతబడిన ట్యాంకర్ నౌకలతో దొంగచాటుగా ముడిచమురు రవాణా, సైనిక నిఘా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. యుద్ధాన్ని ఆపేసే వరకు రష్యాపై ఇలాంటి ఒత్తిడులు కొనసాగుతూనే ఉంటాయని ఈయూ విదేశాంగ విధానం చీఫ్ కాయ కలాస్ చెప్పారు. తాజా ఆంక్షలు అత్యంత కఠినమైనవన్నారు. ఇందులో భాగంగా ముడిచమురు ధరను మార్కెట్ ధర కంటే తక్కువగా 60 నుంచి 45 డాలర్ల వరకు తగ్గిస్తున్నట్లు ఈయూ తెలిపింది. 27 దేశాలతో కూడిన ఈయూ చమురు బారెల్ ధరను 48 డాలర్లుగా నిర్ణయించింది. అమెరికా సహా జీ7 గ్రూప్ దేశాలు సైతం ఈ విషయంలో తమతో కలిసి వస్తాయని ఈయూ ఆశిస్తోంది. అయితే, తాజా ఆంక్షలపై అమెరికా స్పందించకపోవడం గమనార్హం. ఆయిల్ విక్రయాల ద్వారా పెద్దమొత్తంలో ఆర్జిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చే మొత్తాన్ని ఉక్రెయిన్‌తో యుద్ధానికి వాడుతున్నట్లు ఈయూ ఆగ్రహంతో ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే ఈయూయేతర దేశాలపైనా నిషేధం విధించింది. రష్యా, జర్మనీల మధ్య ఉన్న నార్డ్ స్ట్రీమ్ పైపులైన్ల ద్వారా రష్యా చమురు సరఫరా చేయకుండా నిషేధం విధించింది. అంతేకాదు, రష్యాలోని బ్యాంకులు ఎలాంటి నిధులు సేకరించకుండా, ఆర్థిక కార్యక లాపాలను నిర్వహించకుండా ఆంక్షలు ప్రకటించింది ఈయూ. ఇందులో చైనాకు చెందిన రెండు బ్యాంకులున్నాయి. దీంతోపాటు, రష్యా మిలటరీ ఇంటెలిజెన్స్ విభాగం జీఆర్యూ లక్ష్యంగా యూకే మరిన్ని ఆంక్షలను విధించింది. ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌లోని ఓ థియేటర్లో 2022లో తలదాచుకున్న వారిపై బాంబు దాడికి కుట్ర పన్నడంతోపాటు, రష్యా ఏజెంట్ కుటుంబాన్ని నెర్వ్ ఏజెంట్‌తో చంపేందుకు యత్నించినందుకు జీఆర్‌యూకు చెందిన 18 మంది అధికారులపై ఆంక్షలు అమలవుతాయని తెలిపింది.భారత్‌లోని రాస్‌నెఫ్ట్ రిఫైనరీపై ప్రభావంఈయూ విధించిన ఆంక్షల ప్రభావం భారత్ లోని రష్యా ఇంధన సంస్థ రాస్‌నెఫ్ట్ నడిపే రిఫైనరీపైనా పడనుంది. ఈ విషయాన్ని ఈయూ విదేశాంగ విధానం చీఫ్ కాయ కలాస్ తెలిపారు. బ్యారెల్ ధరను 60 డాలర్లకు తగ్గించడంతో రాస్‌నెఫ్ట్ సంస్థ భారత్‌లో క్రూడాయిల్‌ను ఈ ధరకే అమ్మాల్సి ఉంటుందన్నారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేసే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా నుంచి ఏకంగా 40 శాతం అందుతోంది. ఈయూ ఆంక్షలతో అంతిమంగా భారత్ లాభపడనుంది. గుజరాత్‌లోని వడినా ర్లో ఉన్న నయారా ఎనర్జీ లిమిటెడ్‌లో రాస్నెప్ట్కు 49.13% వాటా ఉంది. ఇక్కడి రిఫైనరీలో ఏడాదికి 20 మిలియన్ టన్నుల చమురు శుద్ధి అవుతుంది. తాజా ఆంక్షలతో నయారా కంపెనీ యూరప్ దేశాలకు పెట్రో ఉత్పత్తులను విక్రయించడం కుదరదు.


