
ప్రపంచంలోని చాలా దేశాల్లో భారతీయులు స్థిరపడి ఉన్నారు. ఇందులో యూకే కూడా ఒకటి. ఈ దేశంలో బ్యాంకింగ్, స్టీల్, రియల్ ఎస్టేట్, రిటైల్ రంగాల్లో విజయవంతమైన కెరీర్‌లను నిర్మించుకున్న భారత సంతతికి చెందిన బిలియనీర్లు ఉన్నారు. వీరి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
గోపి హిందూజా & కుటుంబం
యూకేలో అత్యంత సంపన్నులైన భారతీయ సంతతికి చెందిన బిలియనీర్లలో.. గోపి హిందూజా, అతని కుటుంబం ఒకటి. వీరి నికర విలువ 35.3 బిలియన్ పౌండ్స్ (రూ. 33.68 లక్షల కోట్లు). హిందూజా గ్రూప్.. బ్యాంకింగ్, మీడియా, ఇంధన రంగాలలో దూసుకెళ్తోంది. సంపాదన మాత్రమే కాకుండా.. దాతృత్వ కార్యక్రమాలను చేస్తున్నారు.
డేవిడ్ & సైమన్ రూబెన్
భారతీయ మూలాలున్న డేవిడ్ & సైమన్ రూబెన్.. యూకేలోని రియల్ ఎస్టేట్ రంగంలో ప్రసిద్ధి చెందారు. వీరు తెలివైన ప్రణాళికలతో.. ఎప్పటికప్పుడు వీరి వ్యాపారాలను విస్తరించుకుంటూ వేకుతున్నారు. వీరి నికర విలువ 26.9 బిలియన్ పౌండ్స్ (సుమారు రూ. 3.19 లక్షల కోట్లు).
లక్ష్మీ మిట్టల్ & కుటుంబం
లక్ష్మీ మిట్టల్ గురించి తెలియని భారతీయులు చాలా తక్కువమంది ఉంటారు. ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు కంపెనీ అయిన ఆర్సెలర్ మిట్టల్ ఛైర్మన్. ఉక్కు & రియల్ ఎస్టేట్ రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈయన కుటుంబం నెట్‌వర్త్ 15.4 బిలియన్ పౌండ్స్.
అనిల్ అగర్వాల్
వేదాంత రిసోర్సెస్ వ్యవస్థాపకుడిగా పేరుపొందిన.. అనిల్ అగర్వాల్ మైనింగ్, మెటల్స్ ద్వారా బాగా సంపాదించారు. వీరు అనేక దాతృత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. వేదాంత ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం,పర్యావరణం రంగాల్లో సేవలు అందిస్తున్నారు. వీరి నికర విలువ 7.5 బిలియన్ పౌండ్స్.
ప్రకాష్ లోహియా
ఇండోరమా కార్పొరేషన్ వ్యవస్థాపకుడైన ప్రకాష్ లోహియా.. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌లో మొదలైన దేశాల్లో అతిపెద్ద పాలిస్టర్ & సంబంధిత ఉత్పత్తుల ఉత్పత్తిదారులలో ఒకరుగా ఉన్నారు. వీరి నికర విలువ 6.02 బిలియన్ పౌండ్స్. లోహియాకు పాలిస్టర్, ప్యాకేజింగ్, పేట్రోకెమికల్స్, టెక్స్‌టైల్స్ వంటి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి.
మోసిన్ & జుబెర్ ఇస్సా
లాంక్షైర్‌లోని ఒకే పెట్రోల్ బంక్ నుంచి ప్రపంచ రిటైల్ సామ్రాజ్యంగా మారిన మొహ్సిన్ మరియు జుబెర్ ఇస్సా యూకేలోని ధనవంతుల జాబితాలో ఒకరు. ఈజీ గ్రూప్ సహ వ్యవస్థాపకులులైన వీరు.. సూపర్ మార్కెట్ దిగ్గజం అస్డా యజమానులు కూడా. వీరి నికర విలువ 6 బిలియన్ పౌండ్స్ (సుమారు రూ. 710 కోట్ల కంటే ఎక్కువ).
నవీన్ & వర్ష ఇంజనీర్
నవీన్ & వర్ష ఇంజనీర్ యూకే వ్యర్థ పదార్థాల నిర్వహణ రంగంలో ప్రముఖ భారతీయ సంతతికి చెందిన వ్యవస్థాపకులు. వీరి నికర విలువ 3.45 బిలియన్ పౌండ్స్. వ్యాపారవేత్తలుగా మాత్రమే కాకుండా.. పర్యావరణ, పారిశ్రామిక సేవలలో మార్గదర్శకులుగా కూడా వారికి గుర్తింపు లభించింది.
ఇదీ చదవండి: ఊహకందని చరిత్ర: గూగుల్‌కు ఆ పేరు వచ్చిందిలా..
ది అరోరా బ్రదర్స్
సైమన్, బాబీ, రాబిన్ అరోరాల మొత్తం నికర విలువ 2.1 బిలియన్ పౌండ్స్. వీరి వ్యాపార ప్రయాణం 2004లో ప్రారంభమైంది. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదిగి వ్యాపార ప్రపంచంలో ఎదగడమే కాకుండా.. యూకేలోని అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో కూడా ఒకరుగా నిలిచారు.
లార్డ్ స్వరాజ్ పాల్
లార్డ్ స్వరాజ్ పాల్ యూకేలో ఉన్న ఒక గ్లోబల్ స్టీల్ & ఇంజనీరింగ్ కంపెనీ అయిన కాపారో గ్రూప్ వ్యవస్థాపకులు. ఈయన యూకేలో మాత్రమే కాకుండా.. ఇండియా, అమెరికా వంటి దేశాల్లో కూడా వ్యాపార కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్ ప్రకారం.. 2025 లో ఈయన నికర విలువ 1.025 బిలియన్ పౌండ్స్ అని అంచనా.